అధిక బిల్లు రావడంపై పరిశీలన
పాత మీటరు సీజ్.. అనకాపల్లిలోని ల్యాబ్‌కు తరలింపు
కొత్తగా మరో విద్యుత్ మీటరు ఏర్పాటు
సాక్షి, పాడేరు: ‘పెంకుటింటికి భారీగా బిల్లు’ శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనంతో విద్యుత్ అధికారులు పాత పాడేరు గ్రామానికి శనివారం ఉదయాన్నే పరుగులు పెట్టారు. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటిలోని మీటరుతో పాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి గత నెల, ఈ నెల వచి్చన విద్యుత్ బిల్లులను పరిశీలించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత మీటరును సీజ్ చేసి.. అనకాపల్లిలోని ట్రాన్స్‌కో ల్యాబ్‌కు పంపించారు. ఆ వెంటనే కొత్తగా మరో మీటరును అమర్చారు. ఈ విషయంపై పాడేరు ఏఈఈ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. గత నెలలో మైనస్ రూ.1,496 బిల్లు వచ్చి.. ఈనెలలో ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు రావడంపై సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పారు.
పాత విద్యుత్ మీటరును అనకాపల్లిలోని ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. అక్కడి పరిశీలన అనంతరం విద్యుత్ బిల్లు తగ్గింపు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment