current bill
-
ఓ నెల విద్యుత్ బిల్లు.. రూ.30,758
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు సీఎం అయ్యాక కరెంట్ బిల్లుల మోతకు ఇదో నిదర్శనం. కర్నూలులోని అజీముద్దీన్నగర్కు చెందిన ఉస్మాన్ బాషా ఇంటికి మూడు నెలలుగా వస్తున్న విద్యుత్ బిల్లులను పరిశీలిస్తే నివ్వెరపోవాల్సిందే. ఆయన ఇంటికి అక్టోబర్ మాసం వినియోగానికి సంబంధించి రూ.3,380, నవంబర్‌కు సంబంధించి రూ.7,723, డిసెంబర్‌కు సంబంధించి ఏకంగా 30,758 బిల్లు రావడంతో బెంబెలెత్తిపోతున్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. -
అనకాపల్లి: జిమ్ కు కోటి రూపాయల కరెంటు బిల్లు
-
పెంకుటింటికి విద్యుత్ అధికారుల పరుగులు
సాక్షి, పాడేరు: ‘పెంకుటింటికి భారీగా బిల్లు’ శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనంతో విద్యుత్ అధికారులు పాత పాడేరు గ్రామానికి శనివారం ఉదయాన్నే పరుగులు పెట్టారు. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటిలోని మీటరుతో పాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి గత నెల, ఈ నెల వచి్చన విద్యుత్ బిల్లులను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత మీటరును సీజ్ చేసి.. అనకాపల్లిలోని ట్రాన్స్‌కో ల్యాబ్‌కు పంపించారు. ఆ వెంటనే కొత్తగా మరో మీటరును అమర్చారు. ఈ విషయంపై పాడేరు ఏఈఈ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. గత నెలలో మైనస్ రూ.1,496 బిల్లు వచ్చి.. ఈనెలలో ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు రావడంపై సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పారు. పాత విద్యుత్ మీటరును అనకాపల్లిలోని ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. అక్కడి పరిశీలన అనంతరం విద్యుత్ బిల్లు తగ్గింపు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. -
పట్టపగలే చుక్కలు లెక్కపెట్టించిన చంద్రబాబు
-
పెంకుటింటికి భారీగా బిల్లు
సాక్షి, పాడేరు: అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్ రూ.1,496 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్ విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్ బిల్లు వస్తోంది. కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్ వినియోగం చూపి రూ.1,496 మైనస్ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు. -
బిల్లులు భగభగ! ఇదేం బాదుడు బాబూ!
ఎవరిదీ అపరాధం?శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో నివసించే గృహిణి విజయ ఇంటికి ఈసారి రూ.4,950 కరెంట్ బిల్లు రావడంతో ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. జనరల్ కేటగిరీకి చెందిన ఆమె ఇంటికి గతంలో బిల్లు ఎప్పుడూ రూ.150 నుంచి రూ.250 దాటలేదు. 3 నెలలుగా బిల్లు ఇవ్వకుండా డిసెంబర్లో షాక్ కొట్టేలా బిల్లు ఇచ్చారు. దీనిపై ఆమె పలుమార్లు విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లినా ఫలితం శూన్యం. దీంతో గత్యంతరం లేక అపరాధ రుసుముతో సహా రూ.5 వేలు బిల్లు చెల్లించినట్లు బాధితురాలు తెలిపారు.ఇంతలో ఎంత భారం!పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడెంలో నివసించే వెలిశెట్టి అచ్చుత గణేష్ వ్యవసాయదారుడు. ఆయన ఇంటికి సెపె్టంబర్లో 139 యూనిట్లు విద్యుత్ వినియోగించగా రూ.684.53 బిల్లు వచ్చింది. ఇప్పుడు శీతాకాలం కావడంతో వాడకం తగ్గింది. నవంబర్‌లో కేవలం 115 యూనిట్లు మాత్రమే వాడినా బిల్లు మాత్రం రూ.756.97 వచ్చింది. 24 యూనిట్లు తక్కువ వాడినప్పటికీ బిల్లు రూ.72.44 పెరిగింది. పైగా ఇందులో గణేష్ వినియోగించిన విద్యుత్‌కు చెల్లించాల్సిన చార్జీ రూ.464.97 మాత్రమే. అంటే కూటమి ప్రభుత్వం ఆయనపై అదనంగా రూ.292 భారం వేసింది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందక.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులతో సతమతవుతున్న తమపై ఇలా అదనపు భారం మోపడం అన్యాయమని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బోణం గణేష్, ‘సాక్షి’ ప్రతినిధి: రాష్ట్రంలో చలితోపాటు కరెంట్ బిల్లులు పొగలు కక్కుతున్నాయి! ప్రతి నెలా పెరిగిపోతున్న విద్యుత్తు చార్జీల బాదుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో బిల్లులు భారీగా పెరిగాయి. శీతకాలంలో వాడకం తగ్గినా బిల్లులు మాత్రం పైపైకి వెళుతూనే ఉన్నాయి. గతంలో నెలకు రూ.రెండు మూడొందలు దాటని వారికి సైతం రూ.వేలల్లో బిల్లులు రావడంతో తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. రైతన్నలు, మహిళలు ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. విద్యుత్తు శాఖ సిబ్బంది అపరాధ రుసుముతో సహా బిల్లులు వసూలు చేస్తున్నారు. రూ.6,000 కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడుకే బిల్లులు ఇంత భారీగా పెరిగితే ఇక జనవరి నుంచి అదనంగా మరో రూ.9 వేల కోట్లకుపైగా భారం పడనుండటంతో ఏ స్థాయిలో బిల్లులు జారీ అవుతాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మొత్తంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల పిడుగును టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు కనీవినీ ఎరుగని రీతిలో హై ఓల్టేజీ షాకులిస్తున్నారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. సబ్సిడీలు లేవ్.. చార్జీల బాదుడేగతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు చార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రూ.47,800.92 కోట్లను అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే చార్జీల భారాన్ని మోపుతోంది.ఇదేం బాదుడు బాబూ! విద్యుత్ చార్జీలు పెంచి మధ్య తరగతి ప్రజలపై ఈ ప్రభుత్వం పెను భారం మోపుతోంది. అకో్టబర్ నెలలో 140 యూనిట్లు వాడితే రూ.694 బిల్లు వచ్చింది. నవంబర్‌లో 114 యూనిట్లే వాడినా రూ.741 బిల్లు వచ్చింది. ఇదేం బాదుడు బాబూ! తక్కువ వినియోగించినా అదనంగా మాపై భారం మోపడం సరికాదు. – సుబ్బ రత్తమ్మ, మార్కాపురం, ప్రకాశం జిల్లా ⇒ విశాఖలోని ఆరిలోవలో ఓ ఇంటికి నవంబర్‌లో 150 యూనిట్లకు రూ.705.69 బిల్లు వచ్చింది. డిసెంబర్ 10న తీసిన రీడింగ్‌లో 131 యూనిట్లకు రూ.816.79 బిల్లు జారీ అయింది. ⇒ కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన మహమ్మద్ రఫీ వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన దుకాణానికి 55 యూనిట్లు విద్యుత్ వినియోగించినందుకు నవంబర్‌లో రూ.599 బిల్లు వచ్చింది. ఈ నెల 58 యూనిట్లు వాడగా రూ.794 బిల్లు జారీ చేశారు. కేవలం మూడు యూనిట్లు అదనంగా వాడినందుకు రూ.195 ఎక్కువగా బిల్లు వచ్చింది.ఇలా బాదేస్తున్నారు..విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి. గత నెల కంటే ఈ నెల వినియోగం తక్కువగా ఉన్నా బిల్లు తగ్గలేదు. అదనపు చార్జీలంటూ వేశారు. వ్యవసాయం చేసుకుని బతికేవాళ్లం. ఇంతంత బిల్లులు మేమెలా కట్టగలం? కరెంటు చార్జీలు పెంచబోమని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడేమో ఇలా బాదేస్తున్నారు. – చిగురుపాటి మహేష్, కొమ్ముగూడెం.మా డబ్బులతో సంపద సృష్టి! శీతాకాలం కావడంతో ఇంట్లో ఫ్యాను కూడా సరిగ్గా వాడటం లేదు. పగలంతా పొలాల్లోనే పనులు చేసుకుంటూ ఉంటాం. సాయంత్రానికి ఇంటికొస్తాం. విద్యుత్ వాడకం బాగా తక్కువ. బిల్లులు మాత్రం బాగా పెరిగిపోయాయి. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెబితే నిజమనుకున్నాం. కానీ ఇలా మాపై భారం వేసి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పెంచుతారనుకోలేదు. – సూర్పని గోపీకృష్ణ, రైతు, కొమ్ముగూడెం.ఫెర్రో అల్లాయిస్పై పెను భారం ఫెర్రో అల్లాయిస్ కంపెనీల్లో విద్యుత్ చాలా కీలక అంశం. ఇప్పటికే పరిశ్రమ తీవ్ర కష్టాల్లో ఉంది. ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపు మరింత కుంగదీస్తోంది. దీంతో చాలా ఫెర్రో అల్లాయిస్ కంపెనీలు క్యాపిటివ్ పవర్ వైపు మళ్లుతున్నాయి. మేం రాష్ట్రం నుంచి ఒక్క యూనిట్ కూడా కొనుగోలు చేయడం లేదు. పూర్తిగా సొంత విద్యుత్ యూనిట్ నుంచే సమకూర్చుకుంటున్నాం. కానీ గ్రిడ్ సపోర్ట్ చార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. వీటిని తగ్గించాలని సుప్రీం కోర్టు దాకా వెళ్లి పోరాడుతున్నాం. – నీరజ్ శర్దా, డీఎండీ, శర్దా మెటల్స్ అండ్ అల్లాయిస్ మన రాష్ట్రంలో అధికం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉండటం పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రతికూలంగా ఉంది. విద్యుత్ చార్జీలను రేషనలైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పొట్లూరి భాస్కరరావు, ప్రెసిడెంట్, ఏపీ చాంబర్స్⇒ కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సత్యనారాయణ శెట్టి ఇంటికి నవంబర్‌లో 98 యూనిట్లకు రూ.482 బిల్లు వచ్చింది. డిసెంబర్లో 92 యూనిట్లకు రూ.574 బిల్లు జారీ అయింది.⇒ కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం ప్రాంతానికి చెందిన బల్లెకల్ నరసయ్య ఇంటికి నవంబర్‌లో రూ.189 బిల్లు రాగా ఈ నెల కరెంట్ బిల్లు రూ.335 వచ్చింది. వీరు కేవలం రాత్రి పూట మాత్రమే విద్యుత్ వాడతారు. అయినా సరే రూ.146 అదనపు భారం పడింది.తగ్గించమని కోరాం విద్యుత్ చార్జీల పెంపు ఎంఎస్ఎంఈలకు భారంగా మారింది. పెంచిన చార్జీలను తగ్గించాలని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. – వి.మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాప్సియా భారంగా కొత్త కనెక్షన్లు ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ నెలకొల్పి కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం చాలా భారంగా ఉంది. కనెక్షన్ తీసుకోవాలంటే కనీసం రూ.ఐదారు లక్షలకు పైనే ఖర్చు అవుతోంది. ఈ భారాన్ని సబ్సిడీ రూపంలో భరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈ రంగానికి చార్జీల పెంపు మరింత భారంగా మారింది. – మామిడి సుదర్శన్, అధ్యక్షుడు, దళిత్ ఇండ్రస్టియల్ అసోసియేషన్. -
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై కరెంట్ చార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై కొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది. ఈ మేరకు డిస్కంలు ఇంటింటికి పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు పంపిణీ చేస్తున్నాయి. దీంతో ప్రజలపైవిద్యుత్ చార్జీల భారం మోపి 6,072 కోట్లు వసూలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు చూసి వినియోగదారులు గొల్లు మంటున్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు రోజు వారి వేతన జీవులు, రైతులు, చిరు వ్యాపారులు పాలిట శాపంగా మారాయి. అద్దె గృహాల్లో చాలీచాలని జీతాలతో కుటుంబాలు నడిపే వారిపై విద్యుత్ చార్జీల పెను భారంగా తయారయ్యాయి. విద్యుత్ చార్జీల భారంతో చిన్న, మధ్య తరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు 5 నెలల్లోనే 15,500 కోట్ల విద్యుత్ భారం మోపి వసూళ్లు చేస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి ఈ విద్యుత్ చార్జీలు మరింత పెరగనున్నాయి. ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు పూనుకుంది.ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే.వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు.2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది. -
ఎస్సీ, ఎస్టీలకు ‘షాక్’ ఉచిత విద్యుత్ కట్
నెల రోజులుగా చీకట్లోనే.. 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదని, పాత బకాయిలు రూ.22 వేలు చెల్లించాలంటూ కనెక్షన్ తొలగించారు. నెల రోజులకుపైగా చీకట్లోనే మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకీ దుస్థితి దాపురించింది. – కొల్లి విమల, రెడ్డిగణపవరంఅన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో నివసించే రోజువారీ కూలీ బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి రూ.35 వేలు కరెంట్ బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చే ఐదారొందలు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని మధు వాపోతున్నాడు.ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరంకి చెందిన గిరిజనులు కాక వెంకమ్మ, మారెయ్యలకు ఏ నెలలోనూ 200 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు రాలేదు. రూ.40 వేలు పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్ నెలాఖరున అధికారులు వారి కరెంట్ కనెక్షన్ తొలగించారు. అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించి నాలుగు రోజులపాటు తిరిగితే ఎట్టకేలకు కనెక్షన్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్తు సిబ్బంది మరో రూ.22 వేలు బకాయిలున్నాయని, అవి కూడా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్‌పై కూటమి సర్కారు మోసంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన, దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. పుట్లగట్లగూడెం, మైసన్నగూడెం, రెడ్డిగణపవరం, పాలకుంట, వీరభద్రపురం లాంటి గిరిజన గూడేలు, దళితపేటలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు నిరసనకు దిగారు. పలువురికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు బిల్లులు జారీ అయ్యాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ పేదలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ఎస్సీ కాలనీలో గత నెలాఖరున విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు రెండు రోజులపాటు అంధకారంలో మగ్గిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవ చూపడంతో దళితవాడలో విద్యుత్తు వెలుగులు వచ్చాయి. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన జగన్ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు. మీటర్ల తొలగింపు... దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్‌ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్లు లోపు వినియోగించుకున్న వారికి సైతం రూ.వేలల్లో పాత బకాయిలు ఉన్నారని బిల్లులు జారీ అవుతున్నాయి. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఒత్తిడి చేస్తున్నారు.. కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో తనిఖీ చేసి కట్టాల్సిందేనని దురుసుగా మాట్లాడారు. మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – డోలా కాశమ్మ, రాఘవరాజపురం దళితవాడ, అన్నమయ్య జిల్లా గత ఐదేళ్లు అడగలేదు.. గత ఐదేళ్ల పాటు మాకు ఉచిత విద్యుత్తు అందింది. ఎప్పుడూ బిల్లు కట్టమని అడగలేదు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ బిల్లు కట్టాలంటూ విద్యుత్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. – కన్నేపల్లి కుమారి, గాందీగ్రామం, చోడవరం, అనకాపల్లి జిల్లా బకాయిలు కడితేనే కనెక్షన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఉచిత విద్యుత్ అందించింది. గతంలో వినియోగించుకున్న ఉచిత విద్యుత్‌ను కూడా ఇప్పుడు బకాయిలుగా చూపిస్తూ బిల్లులు కట్టమంటున్నారు. అక్టోబర్ నెలాఖరున విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రూ.15 వేల బకాయిలు కడితేనే కనెక్షన్ ఇస్తామంటూ మీటర్ తీసుకెళ్లిపోయారు. – బల్లే రమాదేవి, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం. అంధకారంలో అవస్థలు.. పాత బకాయిల పేరుతో కరెంట్ కనెక్షన్లు తొలగించడం దారుణం. బుట్టాయగూడెం, మైసన్నగూడెం, రెడ్డి గణపవరం, వీరభద్రపురం లాంటి ఆరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల ఇళ్లలో కరెంట్ కనెక్షన్లు తొలగించారు. ఒక్కొక్కరు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నారు. డబ్బులు కట్టలేక నెల రోజులకు పైగా చీకట్లో అవస్థ పడుతున్నారు. దీనిపై డీఈ, విజయవాడలోని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఆలకించే నాథుడే లేడు. – అందుగుల ఫ్రాన్సిస్, బుట్టాయగూడెం మండల దళిత నేత స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు నెలకు 200 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్ అందించింది. కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా పాత బకాయిలు చెల్లించాలంటూ దళితులు, గిరిజనులను బెదిరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ను కట్ చేసింది. దీనిపై విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు వినతిపత్రం అందించాం. ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
‘ఉచితాలు అమెరికా దాకా వెళ్లాయి’.. ట్రంప్ పోస్టుపై కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉచిత పథకాల ప్రకటన అమెరికా వరకు వెళ్లాయంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రావాల్ పేర్కొన్నారు. ఈమేరకు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ చేసిన పోస్టును కేజ్రావాల్ రీట్వీట్ చేశారు. ‘అధ్యక్షుడిగా ఎన్నికైతే కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లా’ అని తెలిపారు.కాగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం.. ప్రజలకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఉచితాల పేరుతో ఆప్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడుతోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ ఉచితాలు ప్రకటిస్తున్నారని విమర్శిస్తోంది. అయితే, పేదల సంక్షేమం కోసమే తాను వాటిని అమలు చేస్తున్నానంటూ కేజ్రీవాల్ సమర్థించుకోవడమూ తెలిసిందే.తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 12 నెలల్లో ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తా. మన విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ చర్యల వల్ల అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారుఅంతేగాక ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకివాల్ విసిరారు. నవంబర్‌లో జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు ఆప్ సిద్ధంగా ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే రెట్టింపు అవినీతి, రెట్టింపు దోపిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగమని విమర్శించారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే తమ సర్కారు ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు, నీళ్లు, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు, ఆరోగ్యం, విద్య అదృశ్యమైపోతాయని అన్నారు. -
వామ్మో.. రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు..
బిజినేపల్లి: గ్రామజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఓ వైపు వినియోగదారులకు జీరో బిల్లు ఇస్తుంటే.. మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ సాధారణ వ్యక్తికి విద్యుత్ సిబ్బంది రూ.కోట్లలో బిల్లు ఇచ్చి షాకిచ్చారు. సాధారణంగా ఓ వినియోగదారునికి కరెంట్ బిల్లు నెలకు రూ.500 వరకు వస్తుంది. ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్ వంటి వస్తువులు వాడితే.. రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వస్తుంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కు చెందిన వేమారెడ్డికి ప్రతీ నెల రూ.వందల్లో బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్ మీటర్ స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాల్సిందిగా బిల్లు ఇచ్చి వెళ్లారు.ఆలస్యంగా ఆ బిల్లు చూసుకున్న వేమారెడ్డికి ఒక్కసారి షాక్ కొట్టిన ట్లు అయింది. తమకు సాధా రణంగా రూ.వందల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో రావడం ఏమిటని ఆందోళన చెందుతూ ఆయన విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించారు. దీనిపై ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా జీరో బిల్లు చేసే సమయంలో అలా వచ్చిందని.. తిరిగి రీఎంట్రీ చేయడం ద్వారా మళ్లీ సాధారణంగా వచ్చి0దని తెలిపారు. -
ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!
సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. మండుటెండలో ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్‌ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఆయన పేర్కొన్నారు. -
సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
పటాన్చెరు: సైబర్ వలలో పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్‌విలాస్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ డిసెంబర్ 18వ తేదీన వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్‌లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్పూర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్లు లింక్ క్లిక్ చేసి.. అదే విధంగా అమీన్పూర్ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీన విద్యుత్ బిల్ కట్టలేదని ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్ లింక్‌ను క్లిక్ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పర్సనల్ లోన్ ఇప్పిస్తానని.. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్‌గూడా సిద్ధార్థ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్‌లోన్ ఇస్తామంటూ ఫోన్‌కాల్ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో స్కూటీ కొందామని.. హత్నూర( సంగారెడ్డి): ఆల్‌లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్ నవీన్ మంగళవారం ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్‌కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్ అమ్మకందారుడి ఫోన్ పే నంబర్‌కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్‌లో -
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా !
-
కరెంట్ బిల్లుల పెంపును వ్యతిరేకించింది కేసీఆరే: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: రైతులకు 3 గంటల కరెంట్ చాలు అనుకుంటూ కుడితిలో పడ్డ ఎలుక మాదిరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొని ప్రజాగ్రహానికి గురవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ లేక జనం ఇబ్బందులు పడ్డారని గుర్తుచేసిన హరీష్ రావు.. ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అందరికి తెలుసని అన్నారు. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంత కంటే పెద్ద జోక్ ఉండదు. నాటి సీఎం చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్‌యే. ఉద్యమం పుట్టిందే విద్యుత్‌లో నుంచి అయితే.. కాల్పులకు కేసీఆర్ కారణం అనడం సరికాదు. విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. 2000 ఆగష్టు 28న బషీర్ బాగ్‌లో కాల్పులు జరిగితే కేసీఆర్ రైతు హృదయంతో స్పందించారు. అధికార పార్టీలో కొనసాగుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరారు. అదే రోజు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి చంద్రబాబుకు లేఖ రాశారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే తెలంగాణ జెండా ఎత్తి పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. నాడు చంద్రబాబు రైతులను కాల్చి చంపితే.. కడుపు రగిలి మా రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి, బిల్లులు తగ్గించాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని లేఖలో పేర్కొన్నారు. కరెంట్ కోసం పోరాడింది కేసీఆర్ కాదా. ఆయన మీద అభాండాలు వేస్తున్నారు( ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవులను కేసీఆర్ గడ్డిపోచల్లా మాదిరిగా కేసీఆర్ వదిలేశారు. మీరేమో పదవుల కోసం చొక్కాలను మార్చినట్టు పార్టీలను మారుతున్నారు. కానీ కేసీఆర్ ప్రజల కోసం పదవులను వదులుకున్నారు. ఇవాళ కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు. కరెంట్ వస్తలేదని అంటున్నారు కదా.. డైరెక్ట్ వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుంటే, కరెంట్ స్వీచ్ బోర్డులో వేలు పెడ్తే తెలుస్తుంది’ అని హరీష్ రావు చురకలంటించారు. -
ఓ చిన్న రేకుల షెడ్‌కి..ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు
ఓ చిన్న రేకుల షెడ్‌కి అది కూడా రెండు ఎల్ఈడీ బల్బులకు ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటు చోసుకుంది. కర్ణాకలోని దారిద్య రేఖకు దిగువునన ఉన్న ప్రజలకు విద్యుత్్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం భాగ్యజ్యోతి పథకం కింద మహిళలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ అందిచింది. ఆ పథకం కిందే కరెంట్ పొందింది 90 ఏళ్ల వృద్ధురాలు. ఐతే ఆమెకు ఉన్న చిన్న రేకుల షెడ్డులాంటి ఇంటిలో రెండు ఎల్ఈడీ బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. వాటికి నెలకు మహా అయితే రూ. 70 లేదా రూ. 80ల కరెంట్ బిల్లు వస్తుంది. కానీ ఆమెకు మే నెలలో మాములుగా రాలేదు కరెంట్ బిల్లు. దాన్ని చూసి ఆ వద్ధురాలికి కళ్లు తిరిగినంత పనయ్యింది. వందో వెయ్యో కాదు ఏకంగా రూ. 1,03,315 బిల్లు వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ విషయం తెలుసుక్నున విద్యుత్ శాఖ అధికారులు ఆ వృద్ధురాలి ఇంటికి చేరకుని విచారించారు. మీటర్లో లోపం ఉందని, రీడింగ్ తీసిన వ్యక్తి కూడా తప్పుగా చూసినట్లు తేలింది. అంతేగాదు అధికారులు ఆమెను ఆ బిల్లును చెల్లించవద్దని, తాము దీన్ని సరిచేస్తామని ఆ వృద్ధురాలికి హామీ ఇచ్చారు. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
గుండె గు‘బిల్లు’!.. ఖాళీగా ఉన్న ఇంటికి రూ. 7,97,576 కరెంట్ బిల్లు
సాక్షి, ఉప్పల్: ప్రతి నెల రూ. 200 నుంచి రూ. 300 వరకు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా రూ. 7,97,576 రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. ఇదేమని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే డీడీ కట్టి మీటర్‌ను చెక్ చేయించుకోవాలని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని గద్దించారు. ఈ సంఘటన ఉప్పల్ ఏఈ పరిధిలో హైకోర్డు కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఉప్పల్ హైకోర్టు కాలనీకి చెందిన పాశం శ్రీదేవి పేరిట రెండు మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఖాళీ పోర్షన్‌కు ఉన్న విద్యుత్ మీటరుకు ప్రతి నెల రూ. 300లోపు మిని మం బిల్లు వచ్చేది. అయితే మే నెలకు సంబంధించి జూన్‌లో వచ్చిన బిల్లు ఆన్లైన్లో చెక్ చేయగా ఏకంగా రూ. 7,97,576లు రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం చెబుతూనే మీటరు టెస్టింగ్‌కు డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందిగా లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. దీంతో చేసేది లేక రూ. 150 డీడీ కట్టి మౌలాలిలో మీటర్ చెక్ చేయించారు. మీటరు డిఫెక్ట్ ఉన్నట్లు రిపోర్టులో రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వివరణ కోసం మాట్లాడేందుకు యత్నించగా ఉప్పల్ సర్కిల్ ఏడీఈ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చదవండి: పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్ -
హంపీ వర్సిటీ కరెంట్ బిల్లు రూ. 85 లక్షలు
హొసపేటె: కర్ణాటక రాష్ట్ర ప్రతిష్టిత కన్నడ విశ్వవిద్యాలయానికి ఈసారి రూ.85 లక్షలు వరకు విద్యుత్ బిల్లు రావడంతో వీసీ డాక్టర్.డీవీ.పరమశివమూర్తి కంగుతిన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వర్సిటీ ఇంత పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించడం అసాధ్యమని, బిల్లు మాఫీ చేయాలని కోరుతూ వీసీ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
కాంగ్రెస్ చెప్పింది కరెంట్ బిల్లులు కట్టం.. విద్యుత్ శాఖ అధికారిపై దాడి
కర్ణాటకలో కరెంట్ బిల్లు పంచాయితీ చినికి చినికి గాలివానలా తయారైంది. ‘మేం కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’ అంటూ పలు గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. కరెంటు బిల్లులు కట్టాలన్న అధికారులకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ పెద్దలు చెప్పారు కాబట్టి విద్యుత్ బిల్లులు కట్టేది లేదని చిత్రదుర్గ జిల్లా జాలికట్టెలో ఇటీవల గ్రామస్తులు మొండికేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో గ్రామంలో మీటర్ రీడింగ్ కోసం వచ్చిన విద్యుత్ అధికారిపై ఓ వ్యక్తి రెచ్చిపోయి ప్రవర్తించాడు. అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుండా చెప్పుతో దాడి చేశాడు. దీన్నంతటిని మరొకరు వీడియో తీయగా.. అతనిపై సైతం ఆవేశంతో అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Electricity officials are attacked by local residents in Karnataka when they came for meter reading. Residents says that they won’t pay from electricity now onwards as per Congress Guarantee pic.twitter.com/T0sVUjD2Ux — Rishi Bagree (@rishibagree) May 24, 2023 కాగా, అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. జూన్ 1 నుంచి ఎవరూ కరెంటు బిల్లు చెల్లించరాదని కేపీసీసీ అద్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రకటించారు. మరోవైపు తమకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని.. ఆదేశాలు వస్తే మీకు ఉచితంగా కరెంటు ఇస్తాం, అప్పటివరకు బిల్లులుకట్టాలని విద్యుత్ అధికారులు తెలిపారు. దీనికి ఒప్పుకోని గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఫ్రీ అని చెప్పారు. కాబట్టి మేం బిల్లులు చెల్లించేది లేదు. దీనిపై మీరు ప్రభుత్వానికి చెప్పండి అని కరాఖండిగా చెబుతున్నారు. చదవండి: రోడ్డుపై కనికట్టు..బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా! వీడియోలతో -
కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి!
సాక్షి, బెంగళూరు: ‘‘మే కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’’ అని కర్ణాటకలో ఓ గ్రామస్థులు తెగేసి చెప్పారు. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బకాయిలతో సహా కరెంటు బిల్లులన్నీ కట్టాలన్న బిల్లు కలెక్టర్ గోపిని గ్రామస్థులు ఎదురు తిరిగారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది గనక గ్రామస్తులు తమ కరెంటు బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. ఎన్నికల బిల్లులను ఆ పార్టీ నుంచే వసూలు చేసుకోవాలని స్పష్టం చేశారు. దాంతో చేసేది లేక ఆయన వెనుదిరిగాడు. కాగా అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. Villagers in Chitradurga refuse to pay electricity bill. Exhort others also not to pay! They tell the bill collector that Congress had promised them free electricity, as soon as they came to power… Go take it from them (Congress), they say… If Congress doesn’t give a CM soon,… pic.twitter.com/FNgGtwdPHM — Amit Malviya (@amitmalviya) May 15, 2023 -
‘కొత్తపల్లె’ కరెంటు బిల్లు.. రూ. 11.41 కోట్లు!
మాచారెడ్డి: ఇటీవల పంచాయతీల పునర్విభజనలో కొత్త పంచాయతీగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లె పంచాయతి భవనానికి రూ. కోట్లలో వచ్చిన కరెంటు బిల్లును చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. పంచాయతీ వాటర్ వర్క్స్‌కు సంబంధించిన సర్వీస్ నంబర్ 3801–02321పై ఈనెల 3న ట్రాన్స్‌కో బిల్లింగ్ సిబ్బంది మీటర్ రీడింగ్ నమోదు చేశారు. జనవరి 2 నుంచి ఫిబ్రవరి 3 వరకు 1,88,15,257 యూనిట్లు వాడినట్టు పేర్కొన్నారు. దీనికి ఏకంగా రూ. 11,41,63,672 బిల్లు విధించారు. ఏసీడీ డ్యూ కింద మరో రూ.8,716 వడ్డించారు. ఈనెల 17 లోపు బిల్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. గతనెల విద్యుత్ బిల్లు రూ.3,257 వచ్చిందని సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సాంకేతిక సమస్యతో బిల్లు ఇలా వచ్చిందని చెప్పారు. -
‘విద్యుత్’ను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తు అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: పేదలకు, వృత్తిదారులకు, రైతు సంక్షేమానికి విఘాతంగా మారిన విద్యుత్ సవరణ బిల్లు–2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈ జేఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను అంబాని, అదానీలకు కట్టబెట్టడం దారుణమని విమర్శించింది. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అంతకు ముందు మింట్ కాంపౌండ్ నుంచి ఎన్టీఆర్మార్గ్ మీదుగా ఇంజనీర్లు ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జాతీయ చైర్మన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ స్టాడింగ్ కమిటీ ఆమోదం లేకుండా విద్యుత్ సవరణ బిల్లును దొడ్డిదారిలో పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకునేందు కు పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి ఉందని, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపాలని సూచించారు. విద్యుత్‌ప్రైవేటీకరణతో భవిష్యత్తులో పేదల జీవితాల్లో చీకట్లు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వినోద్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందని కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబు, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రతినిధులు సాగర్, మోహన్‌శర్మ, జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
22 రోజులకు రూ.1,17,694 కరెంట్ బిల్లు.. యాజమాని షాక్
సాక్షి, రంగారెడ్డి: కరెంటు బిల్లు చూసిన ఓ ఇంటి యజమాని గుండె గు‘బిల్లు’మంది. ఏకంగా లక్ష రూపాయల బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాద్‌నగర్ మున్సిపల్ పరిధి చటాన్‌పల్లిలో రమాదేవి ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ గత నెల కాలిపోయింది. దీంతో ఆశాఖ సిబ్బంది కొత్త మీటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో కాలిపోయిన మీటర్‌కు సంబంధించిన బిల్లును బుధవారం యజమానికి ఇచ్చివెళ్లారు. ఇందులో ఆగస్టు 16నుంచి ఈనెల 7వ తేదీ వరకు 22 రోజులకు గానూ 10,510 యూనిట్ల విద్యుత్ వాడినట్లు, ఇందుకు రూ.1,17,694 చెల్లించాలని బిల్లులో నమోదైంది. ప్రతి నెల రూ.వందల్లో వచ్చే బిల్లు ఒకేసారి లక్ష రూపాయలు దాటడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రూరల్ ఏఈ రాకేశ్‌ను అడగగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, సరిచేస్తామమన్నారు. -
ఆ మరుక్షణమే విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి ప్రయత్నిస్తే.. ఆ మరుక్షణమే ఎక్కడికక్కడ విధుల బహిష్కరణ (స్టాప్ ది వర్క్) చేపడతామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు విద్యుత్ ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో కేంద్రం తీసుకొస్తున్న ఈ సవరణలతో ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల మనుగడ ప్రమాదంలో పడనుందని, తమ ఉద్యోగాలకు ముప్పువాటిల్లుతుందని.. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఇటీవల కేంద్ర విద్యుత్‌మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా గురువారం ఇక్కడ సమావేశమై.. బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. సీఎండీకి వినతిపత్రం.. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ నిర్ణయాల మేరకు రాష్ట్రంలో సైతం ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు తెలిపారు. ‘విద్యుత్ రంగాన్ని రక్షించండి–దేశాన్ని కాపాడండి’ పేరుతో ఈ నెల 10 నుంచి ఆందోళనలు ప్రారంభిస్తామన్నారు. విద్యుత్ సంస్థల కార్యాలయాలు, ప్లాంట్ల ఎదుట నిరసనలు చేపడతామన్నారు. సెప్టెంబర్‌లో దేశం నలుమూలల నుంచి విద్యుత్ విప్లవయాత్ర(బిజ్లీ క్రాంతి యాత్ర)ను ప్రారంభించి డిసెంబర్ తొలివారం నాటికి ఢిల్లీకి చేరుకుంటామని చెప్పారు. తర్వాత ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు జేఏసీనేతలు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర విద్యుత్ మంత్రి వీకే సింగ్‌కు సైతం లేఖ పంపించారు. -
తమిళనాడులో ఇకపై ఏటా పవర్ షాక్!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ దారులకు ఇకపై ఏటా వడ్డన తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇకపై ప్రతి జూలై నెలలో 6శాతం మేరకు విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ఓ నివేదిక విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు మంగళవారం బోర్డు అందజేశాయి. రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2014లో ఒకసారి విద్యుత్ చార్జీలను పెంచారు. ఆ తర్వాత కొత్తగా ఎలాంటి చార్జీలు విధించలేదు. ఫలితంగా కాల క్రమేనా విద్యుత్ బోర్డుకు కష్టాలు పెరిగాయి. అప్పులు అమాంతంగా పెరిగాయి. అయినా, గత పాలకులు విద్యుత్ చార్జీల పెంపుపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి ఈ అప్పులు మరింత భారంగా మారాయి. దీంతో చార్జీల వడ్డనకు విద్యుత్ బోర్డు కసరత్తు చేస్తోంది. కొత్త చార్జీలను అమల్లోకి తీసుకొచ్చే ముందుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లేవిధంగా గత నెల విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ పెంపు ప్రకటన చేశారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటాలు సైతం సాగుతున్నాయి. దీంతో ప్రజా అభిప్రాయాన్ని సేకరించే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ బోర్డు వినియోగదారుల నెత్తి మరోబాంబును పేలి్చంది. పెంపునకు ప్రణాళిక.. ప్రస్తుతం ఉన్న అప్పులు, మున్ముందు ఎదురయ్యే నష్టాలు, కష్టాలను పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ బోర్డు ముందస్తు ప్రణాళిక సిద్ధ్దం చేసింది. భారం మరింత బరువెక్కకుండా ఏటా చార్జీల వడ్డనకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇందుకు తగ్గ నివేదికను రూపొందించి, ఆమోదం కోసం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు పంపించింది. తొలివిడతగా.. ఏటా 6 శాతం పెరుగుదలతో నాలుగేళ్లపాటు దీన్ని కొనసాగించాలని అందులో సిఫార్సు చేసింది. చదవండి: శ్రావణమాసం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు -
Telangana Electricity Bill: ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్ కట్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లు చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఎడాపెడా విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఎడాపెడా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారు. వ్యక్తిగత, వృత్తిపర జీవితాల్లో బిజీగా ఉండడం, ఇంకా సమయముంది కదా.. తర్వాత చెల్లిద్దామనుకుని మరిచిపోవడం వంటి కారణాలతో చాలామంది వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోతున్నారు. ఇంతకుముందు నెల, రెండు నెలలు ఆలస్యమైతే క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఇతర సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి బిల్లు కట్టమని గుర్తు చేసేవారు. గత రెండు మూడు నెలలుగా ఒక్కరోజు ఆలస్యమైనా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బిల్లు చెల్లిస్తాం.. గంటసేపు ఆగమని కోరినా ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈఆర్సీ మార్గదర్శకాల వక్రీకరణ గడువులోగా బిల్లు చెల్లింపులో విఫలమైతే ఏడు రోజుల గడువుతో నోటీసు జారీ చేసి, ఆ తర్వాత కూడా చెల్లించకపోతేనే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఈఆర్సీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘విద్యుత్ బిల్లుల చెల్లింపు, గడువులోగా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపునకు మార్గదర్శకాలు’ పేరుతో ఈఆర్సీ 2002 అక్టోబర్ 16న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కనెక్షన్ తొలగింపునకు ముందు వినియోగదారులకు ఏడు రోజుల సమయం ఇవ్వడమే నోటీసు ఉద్దేశం. ఒకవేళ బిల్లు చెల్లించినా సాంకేతిక/సిబ్బంది తప్పిదాలతో చెల్లించలేదని రికార్డుల్లో నమోదైతే సంజాయిషీ ఇచ్చుకోవడానికి వినియోగదారులకు తగిన సమయం లభిస్తుంది. అత్యవసర సేవల కింద వచ్చే విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి నోటీసు ఇవ్వకుండా కనెక్షన్ తొలగించడం సరైంది కాదని ఈ నిబంధనలను ఈఆర్సీ పెట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మాత్రం ఈ మార్గదర్శకాలను వక్రీకరించి వినియోగదారులకు ‘బిల్ కమ్ నోటీసు’పేరుతో ప్రతి నెలా జారీ చేసే బిల్లులోనే ముందస్తుగా నోటీసును సైతం పొందుపరుస్తున్నాయి. బిల్లులోనే నోటీసు ఉందన్న విషయం సాధారణ వినియోగదారులకు అర్థం కాదు. కేవలం ఈఆర్సీ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్టు చూపడానికే డిస్కంలు ‘బిల్ కమ్ నోటీసు’పద్ధతిని అవలంబిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లు బకాయిలు, డిస్కనెక్షన్, రీకనెక్షన్ చార్జీలను చెల్లించిన తర్వాత పట్టణాల్లో 4 గంటల్లోగా, గ్రామాల్లో 12 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే, బిల్లు కట్టిన తర్వాత సకాలంలో సరఫరాను పునరుద్ధరించడం లేదని అంటున్నారు. అయితే, కనెక్షన్ తొలగించడంపై తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఓ అధికారి తెలిపారు. స్థానికంగా కొందరు సిబ్బందికి, వినియోగదారులతో ఏదైనా ఘర్షణ వాతావరణం ఎదురైతే తొందరపాటుతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిల్లుల వసూళ్ల కోసం తీవ్ర ఒత్తిడి భారీగా విద్యుత్ చార్జీలను పెంచినా డిస్కంలు నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగు నెలలుగా విద్యుత్ ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారు. 100శాతం కనెక్షన్లకు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేయాలని, 100శాతం బిల్లులు వసూలు చేయాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్షేత్రస్థాయిలో డీఈలకు లక్ష్యాలను నిర్దేశించాయి. ప్రతి నెలా 100శాతం బిల్లులు జారీచేసినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే జీతాలు చెల్లిస్తామని లింకు పెట్టాయి. దీంతో ఒత్తిడి పెరగడంతో వసూళ్లను పెంచేందుకు ఎడాపెడా కనెక్షన్లను తొలగిస్తున్నారని విమర్శలున్నాయి. బిల్లు వసూళ్ల కోసం ఇళ్లకు వస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహార తీరు అవమానకరంగా ఉంటోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.