కామాక్షమ్మ.. కరెంటు బిల్లు
సాక్షి, కణేకల్లు: కూలి పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నిరుపేద మహిళకు కరెంట్ బిల్లు షాకిచ్చింది. ప్రతి నెలా రూ.100 బిల్లు వస్తుండగా.. ఈ నెల ఏకంగా రూ.1,49,034 రావడంతో ఆమె నోటి నుంచి మాట రాలేదు. కణేకల్లులోని మోడల్ స్కూల్ పక్కనే నివాసముంటున్న కురుబ కామాక్షమ్మ పరిస్థితి ఇది. ఇంత బిల్లు తానెప్పుడు చెల్లించాలో అర్థం కాక లబోదిబోమంటూ, తనకు న్యాయం చేయాలని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఏఈఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య కారణంగా చోటు చేసుకున్న ఈ తప్పిదాన్ని సరిచేసి, వినియోగించిన యూనిట్ల మేరకే బిల్లు వసూలు చేస్తామని భరోసానిచ్చారు. చదవండి: (కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment