kanekallu
-
హెడ్ కానిస్టేబుల్‌పై టీడీపీ నేతల జులుం!
కణేకల్లు: ‘వాళ్లు ఎవరనుకొంటున్నావ్.. టీడీపీ లీడర్లు.. మా వాళ్లు మమ్మల్ని పలుకరించేందుకు వస్తే అడ్డుకొంటావా..? గంట టైమ్ ఇస్తే మా ప్రతాపమేంటో చూపిస్తాం...’ అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతిచౌదరి, మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు కణేకల్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములుపై జులుం ప్రదర్శించారు. మంత్రి ఉషశ్రీచరణ్ భానుకోట వద్ద సుజలాన్ కంపెనీ భుములను ఆక్రమించారని ఇటీవల దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి శనివారం జిల్లా టీడీపీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లాలని యత్నించారు. టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. అక్కడికి ఎవరూ వెళ్లకూడదని నోటీసుల ద్వారా సూచించి పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉన్నం, గోళ్ల వెంకటేశులు తమ వాహనాల్లో భానుకోటకు బయలుదేరడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో కణేకల్లు టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని పోలీసు స్టేషన్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా హెచ్‌సీ శ్రీరాములు వారిని అడ్డుకుని అందరూ కాకుండా ఒక్కొక్కరుగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వారంతా ఒకే సారి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల ఉన్న ఉన్నం, వెంకటేశు బయటికొచ్చి పోలీసులపై నానా యాగీ చేశారు. ఏఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బందిపైనా దౌర్జన్యానికి దిగారు. చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’ -
పుస్తకాలు బస్టాప్‌లో.. స్రవంతి హెచ్చెల్సీలో దూకి..
సాక్షి, కణేకల్లు (అనంతపురం): కాలేజీకని వెళ్లి కనిపించకుండాపోయిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితుడి ఆత్మహత్యతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ దిలీప్ కుమార్ కథనం మేరకు... గెనిగెర గ్రామానికి చెందిన స్రవంతి (17) కణేకల్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. తన స్నేహితుడు ఇటీవల పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి స్రవంతి పూర్తి డిప్రెషన్లో ఉంది. స్నేహితుడు లేని జీవితం శూన్యంగా అనిపించింది. శుక్రవారం కాలేజీకని సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై కణేకల్లు–బళ్లారి రోడ్డు వద్దనున్న బస్టాప్ వరకు వెళ్లింది. అయితే అక్కడి నుంచి కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పుస్తకాలు బస్టాప్ వద్దనున్న ఆలయం ముందు కనిపించడంతో ఆమె కోసం గాలించారు. అయితే ఎక్కడా కనిపించలేదు. స్రవంతి శుక్రవారం రోజే హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం సాయంత్రం యర్రగుంట వద్ద మృతదేహం బయటపడింది. తల్లిదండ్రులు తమ కూతురేనని గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి) -
రికార్డులకెక్కిన ‘షర్మస్’ క్రికెట్ స్టేడియం
సాక్షి, అనంతపురం: తక్కువ ఖర్చుతో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించవచ్చని నిరూపించాడు కణేకల్లు కుర్రాడు. తన ప్రతిభకు పదను పెట్టి ‘ఎస్’ ఆకారంలో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించి ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని శ్రీ విద్యానికేతన్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మనేగర్ షర్మస్.. గతేడాది లాక్డౌన్ సమయంలో ఇంట్లో సమయాన్ని వృథా చేయకుండా మినీ క్రికెట్ స్టేడియం ఎలా నిర్మించాలో ఆలోచించాడు. ప్రస్తుతమున్న స్టేడియాలకు భిన్నంగా ‘ఎస్’ ఆకారంలో నాలుగు ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తూ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేలా ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నమూనా రూపొందించాడు. దీని కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశాడు. అనంతరం తన డెమో గురించి వివరిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వారికి మెయిల్ పంపగా.. వారు ఇటీవల దాన్ని రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు షర్మస్కు మెడల్, సర్టిఫికెట్ పంపారు. ఈ డెమాతో షర్మస్ పలు రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా స్టేడియం నిర్మాణ పేటెంట్ హక్కును కూడా పొందాడు. మంVýæళవారం కణేకల్లులో జరిగిన కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ యార్డు చైర్పర్సన్ ఉషారాణి, శ్రీవిద్యానికేతన్ స్కూల్ కమ్ కాలేజీ కరస్పాండెంట్ రవికుమార్ అభినందించారు. స్టేడియం ప్రత్యేకతలు ఇలా.. ► క్రికెట్ రెండు వైపుల మాత్రమే(టూఎండ్స్) ఆడాలి. ► షర్మస్ స్టేడియంను 360 డిగ్రీలో నిర్మించడం వల్ల నాలుగు వైపులా ఆడొచ్చు. ► వర్షం వస్తే మ్యాచ్ ఆగినా.. వెంటనే ప్రారంభంమయ్యేలా చర్యలు. ► వర్షపు నీరు వెళ్లేందుకు కింద గ్రాస్‌కు రంధ్రాలు ఏర్పాటు చేసి డ్రైనేజీ సిస్టమ్. ► హీటింగ్ ప్యాడ్స్ ఉంచడంతో అరగంటలో గ్రౌండ్ అంతా డ్రై అయిపోతుంది. దీంతో వెంటనే ఆటనుప్రారంభించవచ్చు. ► స్టేడియంలో ఎక్కువ మంది కూర్చునేలాæ ఆడియన్స్, వీఐపీ, ఫ్లేయర్స్ కోసం కంపార్ట్మెంట్స్ ఏర్పాటు. ► లోయర్ కంపార్ట్మెంట్, మిడిల్ కంపార్ట్మెంట్, అప్పర్ కంపార్ట్మెంట్ల ఏర్పాటు. ► మిడిల్ కంపార్ట్మెంట్ ఫైబర్ గ్లాస్‌తో ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీల కోసం ఈ గ్యాలరీ రూపొందించి ఏసీ ఏర్పాటు చేసేలా ప్లాన్. ► పైభాగంలో ప్రొటెక్టివ్ వాల్ నిర్మించడం వల్ల సూర్య కిరణాలు స్టేడియంలో పడవు. దీంతో ఆటకు ఎలాంటి ఇబ్బందులుండవు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పంపిన మెడల్, సర్టిఫికెట్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు నేను రూపొందించిన స్టేడియం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. తొలుత నాకు ఎస్ ఆకారంలో మినీ స్టేడియం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. గూగుల్‌లో సెర్చ్ చేశాక ఇలాంటి స్టేడియం ఎక్కడా లేదని తెలిసింది. ఆ తర్వాతే నా మేథస్సుకు పదును పెట్టి ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నిర్మించాను. నా ప్రాజెక్ట్ వర్క్, స్టేడియం నమూనాను ఢిల్లీలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ ద్వారా పంపాను. వాస్తవానికి వారు వచ్చి విజిట్ చేయాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా వారు రాలేదు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు నేను రోటరీ చేయించి ప్రాజెక్ట్ తీరును వివరిస్తూ పంపాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు అంగీకరించారు. నాకు మెడల్, సర్టిఫికెట్‌ను కూడా పంపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారి మెయిల్లో కూడా అప్లోడ్ చేశారు. – మనేగర్ షర్మస్ -
షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..
సాక్షి, కణేకల్లు: కూలి పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నిరుపేద మహిళకు కరెంట్ బిల్లు షాకిచ్చింది. ప్రతి నెలా రూ.100 బిల్లు వస్తుండగా.. ఈ నెల ఏకంగా రూ.1,49,034 రావడంతో ఆమె నోటి నుంచి మాట రాలేదు. కణేకల్లులోని మోడల్ స్కూల్ పక్కనే నివాసముంటున్న కురుబ కామాక్షమ్మ పరిస్థితి ఇది. ఇంత బిల్లు తానెప్పుడు చెల్లించాలో అర్థం కాక లబోదిబోమంటూ, తనకు న్యాయం చేయాలని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఏఈఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య కారణంగా చోటు చేసుకున్న ఈ తప్పిదాన్ని సరిచేసి, వినియోగించిన యూనిట్ల మేరకే బిల్లు వసూలు చేస్తామని భరోసానిచ్చారు. చదవండి: (కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి!) -
మనసు చలించింది...
సాక్షి, కణేకల్లు: నిరాశ్రయులైన స్థానిక ఓ వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితిని ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న హైదరాబాదీలు స్పందించారు. అక్కడి నుంచి వచ్చి శాశ్వత షెడ్ ఏర్పాటు చేయించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కణేకల్లులో అంజినమ్మ, రామాంజినేయులు వృద్ధ దంపతులు. ఎవరి తోడు లేక మెయిన్‌రోడ్డులోని ఓ పూరిగుడిసెలో నివాసముంటున్నారు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ వారు పడుతున్న వేదనను స్థానిక యువకుడు వినోద్ (సప్తగిరి చిన్న) ఫేస్బుక్లో హలో యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని హలో యాప్ ద్వారా చూసిన ఫీడ్ ది హంగర్ ఫర్ కేఎస్కే ఆర్గనైజేషన్ సభ్యులు కావ్య, శ్రీకాంత్, కృష్ణ చలించిపోయారు. వినోద్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి, మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కణేకల్లుకు చేరుకున్న వారు పూరిగుడిసెను తొలగించి, పటిష్టమైన రేకుల షెడ్ వేసి, వృద్ధ దంపతులను అందులో చేర్చారు. ఇందు కోసం దాదాపు రూ. 30 వేలు ఖర్చు పెట్టారు. వీరి ఔదార్యాన్ని చూసిన స్థానిక యువకులు బాషా, సంతోష్, రమేష్, జావీద్, జాకీర్, పాషా అందులో సభ్యులుగా చేరి, షెడ్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. పాత గుడిసెను తొలగిస్తున్న కేఎస్కే టీమ్ ఎవరు వీరు.. హైదరాబాద్‌లోని రివ్లోన్ కాస్మోటిక్ కంపెనీలో సౌత్ ట్రైనర్‌గా కావ్య, సేల్స్ మేనేజర్‌గా కృష్ణ పనిచేస్తున్నా్నరు. శ్రీకాంత్ ఇంకా చదువుకుంటున్నారు. వీరు ముగ్గురు స్నేహితులు. తమ సంపాదనలో కొంత మేర నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద స్వయంగా వంటలు చేసి నిరుపేదల ఆకలి దప్పికలు తీరుస్తుంటారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తుంటారు. నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులు -
అమాయకురాలిపై యువకుల పైశాచికత్వం
సాక్షి, అనంతపురం : మతిస్థిమితం లేని ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రోజుల తరబడి ఈ పైశాచికత్వం కొనసాగడంతో గర్భం దాల్చింది. విషయం బయటకు పొక్కడం.. నిందితులు టీడీపీ సానుభూతిపరులు కావడంతో గ్రామ పెద్దలు సర్దుబాటు చేశారు. చివరకు ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. కణేకల్లు మండలం పెనకలపాడు గ్రామ ఎస్సీ కాలనీలో ఉంటున్న ఓ మహిళకు మతిస్థిమితం లేదు. కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిపించగా మతిస్థిమితం లేని మహిళ కావడంతో వదిలేసి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి గ్రామంలోని ఓ టీడీపీ నాయకుని ఇంట్లో పాచి పని చేస్తూ జీవిస్తోంది. ఈమెపై కన్నేసిన ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు ఆమెపై నెలల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెలుసుకోలేని అమాయకురాలు అమాయకురాలు కావడంతో ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఆమెలో మార్పును గమనించిన స్థానిక మహిళలు ఆరా తీయగా అసలు విషయం బయటికొచ్చింది. ముగ్గురు యువకులు ఈ పైశాచికత్వానికి పాల్పడినట్లు తెలియడంతో పెద్ద మనుషులు రంగంలోకి దిగారు. బాధిత మహిళకు కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. సమీప బంధువులు ఉన్నా డబ్బు ఎర వేశారు. అబార్షన్ చేయించి చేతులు దులుపుకోవాలని చూడగా.. అప్పటికే ఐదు నెలల గర్భం కావడంతో అలాగే వదిలేశారు. కాన్పు అయ్యాక ఆలోచిద్దామని అప్పటికి తొక్కిపెట్టారు. నవమాసాలు పూర్తయ్యాక హైరిస్కు కేసుగా తేలడంతో స్థానికులు కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిలా పాపం తలా పిడికెడు నిందితులను కాపాడటంలో పెద్ద మనుషులే కాదు ప్రభుత్వ సిబ్బంది కూడా చేతులు కలిపారు. గ్రామంలో మతిస్థిమితం లేని మహిళ గర్భం దాల్చగా.. ఏడు నెలల నుంచి స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే గ్రామంలో అంగన్వాడీ సిబ్బంది, వైద్య ఆరోగ్యసిబ్బందికి తెలిసినా బయటకు చెప్పలేదని తెలుసుస్తోంది. ఆ గ్రామంలో టీడీపీ నాయకుల హవా కొనసాగుతుండటంతో బయటకు పొక్కకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. నాలుగురోజుల క్రితం అభాగ్యురాలికి నొప్పులు రావడంతో స్థానికులు కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పసికందు పరిస్థితి, బాలింత పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు జిల్లా మంగళవారం సర్వజనాసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఎస్‌ఎన్‌సీయూలో, తల్లి బాలింతల వార్డులో చికిత్స పొందుతున్నారు. -
సాక్స్‌లో మొబైల్ ఫోన్ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..
సాక్షి, అనంతపురం : కణేకల్లు మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోనుతో వచ్చి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్ధిని డీబార్ చేయడంతో పాటు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. రాయదుర్గానికి చెందిన బి.నౌషాద్కు సచివాలయ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రం కణేకల్లు మోడల్ స్కూల్ పడింది. సెప్టెంబరు ఒకటో తేదీన ఉదయం సాక్స్‌లో సెల్‌ఫోన్ దాచుకుని పరీక్ష కేంద్రంలోకి వచ్చాడు. అయితే సిబ్బంది తనిఖీల్లో సెల్‌ఫోన్‌ను గుర్తించలేకపోయారు. పరీక్ష ముగియడానికి అరగంట ముందు మొబైల్ బయటకు తీసి గూగూల్లో సెర్చ్ చేసి ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాశాడు. చివరకు ఇన్విజిలేటర్ గుర్తించాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ పోలీస్ విచారణకు ఆదేశించడంతో నౌషాద్ తాను మొబైల్ తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ సత్యనారాయణ అభ్యర్థిని డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేశారు. సరైన పర్యవేక్షణ చేయనందుకు సంబంధిత ఇన్విజిలేటర్లు, హాల్ సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్, సెక్యూరిటీ స్టాఫ్‌పైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. -
బలవంతంగా స్కూల్‌కి.. బస్సులోంచి దూకేశాడు
సాక్షి, కణేకల్లు: తల్లి బలవంతంతో స్కూలుకు పయనమైన విద్యార్థి బస్సు కదిలి కొంత దూరం వెళ్లాక కిందకు దూకేశాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కణేకల్లు మండలం ఎన్.హనుమాపురం గ్రామానికి చెందిన కురుబ సరోజమ్మ, రాజన్న దంపతుల కుమారుడు కురుబ లాలుమోహన్ ఉరవకొండలోని మహేశ్వరీ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల రాకపోకల కోసం బస్సును ఏర్పాటు చేసింది. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఎన్.హనుమాపురానికి బస్సు వచ్చి విద్యార్థులను ఎక్కించుకొని స్కూల్‌కు వెళ్తోంది. అయితే శుక్రవారం కురుబ లాలుమోహన్ స్కూల్‌కెళ్లనని మొండికేశాడు. తల్లి బతిమాలి.. బస్టాప్ వరకెళ్లి కొడుకును బస్సు ఎక్కించింది. బస్సు ఊరు దాటి వేగంగా వెళ్తున్న సమయంలో లాలుమోహన్ బస్సు డోర్ తీసేసి ఒక్కసారిగా కిందకు దూకాడు. ఇది గమనించని డ్రైవర్ ముందుకెళ్లాడు. తోటి విద్యార్థులు గమనించి డ్రైవర్‌కు విషయం తెలపడంతో వెంటనే బస్సును వెనక్కు తీసుకెళ్లాడు. బస్సులోంచి విద్యార్థి కిందకు దూకిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. లాలుమోహన్ చెవిలోంచి రక్తం కారుతండటంతో పాటు తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించారు. స్కూల్ యాజమాన్యంపై మండిపాటు బస్సులో నుంచి విద్యార్థి కిందకు దూకి ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో సదరు స్కూల్ యాజమాన్యంపై ప్రజలు మండిపడుతున్నారు. బస్సులో క్లీనర్ లేదా అటెండర్ ఎవరైనా ఉండి ఉంటే విద్యార్థి డోర్ తీసుకుని దూకేవాడు కాదని అన్నారు. అయితే ఒక క్లీనర్ / అటెండర్‌ను పెట్టడంలో స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసే యాజమాన్యం పిల్లలకు సరైన భద్రత కల్పించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి జరిగిన ఘటనపై విచారణ నిర్వహించి బాధ్యులైన మహేశ్వరీ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వైద్య ఖర్చులు స్కూలు యాజమాన్యమే భరించాలి స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమ కుమారుని వైద్యానికయ్యే ఖర్చును వారే భరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కురుబ సరోజమ్మ, రాజన్నతోపాటు వైఎస్సార్సీపీ నాయకు లు, ఎన్.హనుమాపురం మాజీ సర్పంచు పైనేటి తిమ్మప్పచౌదరి డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా బాధిత విద్యార్థి బంధువులు శుక్రవారం మహేశ్వరీ స్కూల్ వద్దకెళ్లి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుకు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని సహాయకునిగా ఎందుకు పెట్టలేదని వారిని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ప్రాణం మీదకు వచ్చిందని మండిపడ్డారు. -
అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..
సాక్షి, కణేకల్లు(అనంతపురం) : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వివాహితపై టీడీపీ నాయకుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటన కణేకల్లు మండలం మాల్యంలో బుధవారం జరిగింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్యంలో ఓ వివాహిత తన భర్తతో కలిసి పుట్టింట్లో నివాసముంటోంది. తల్లి మూడు రోజుల క్రితం బళ్లారిలోని బంధువుల ఇంటికెళ్లింది. భర్త బుధవారం ఉదయం తన పనికోసం బయటికెళ్లాడు. వివాహిత మాత్రమే ఒంటరిగా ఉంది. సరిగ్గా ఉదయం 9.30 గంటల సమయంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనుచరుడు, టీడీపీ నాయకుడు శరబన్నగౌడ్ ఆ ఇంట్లోకి దూరాడు. ‘ఏమ్మా.. కొత్త ఇల్లు బాగానే కట్టావ్.. ప్రారంభానికి కూడా పిలవలేదే!’ అంటూ మాట కలిపాడు. వయస్సులో పెద్దాయన కావడంతో ఆమె మర్యాదగా మాట్లాడింది. సరే ఇల్లైనా చూడనివ్వు అంటూ ఇంకాస్త లోనికి వచ్చాడు. అమ్మ ఎక్కడ..? కన్పించడం లేదే అని ప్రశ్నించడంతో ‘అమ్మ ఊరికెళ్లిందని’ ఆమె సమాధానం చెప్పింది. నీ ఫోన్ నంబర్ ఇస్తే అప్పుడప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పడంతో తన వద్ద ఎలాంటి ఫోనూ లేదని తెలిపి గదిలోకి వెళ్లబోయింది. ఇంతలో ఒక్కసారిగా శరబన్నగౌడ్ వివాహితపై లైంగికదాడికి ప్రయత్నించాడు. తనను వదిలేయాలని ప్రాధేయపడని వినకపోవడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
30 పడకలు.. ఒక్కరే వైద్యుడు
ప్రచార ఆర్భాటానికి అలవాటు పడిన గత టీడీపీ సర్కార్...ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. నిరుపేదల జీవితాలతో చెలగాటమాడింది. రూ.కోట్లు ఖర్చు చేశామంటూ గొప్పలు చెప్పినా...నిరుపేదలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించలేకపోయింది. కణేకల్లులోని ప్రభుత్వ ఆస్పత్రే ఇందుకు ఉదాహరణ. జిల్లా వైద్యాధికారి పరిధిలో ఉన్న ఈ ఆస్పత్రిని వైద్య విధానపరిషత్‌లో విలీనం చేస్తూ సామాజిక ఆరోగ్యకేంద్రంగా స్థాయి పెంచిన అప్పటి ప్రభుత్వం.... సౌకర్యాలను మాత్రం పెంచలేదు. సాధారణ ఆస్పత్రిలో ఉండాల్సిన సౌకర్యాలు సైతం సీహెచ్‌సీలో లేవు. దీంతో ఈప్రాంత నిరుపేదలంతా వైద్యం అందక అల్లాడిపోతున్నారు.– కణేకల్లు కణేకల్లుకు చెందిన రేష్మాకు నెలలు నిండటంతో కాన్పు కోసం కుటుంబీకులు కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో డాక్టర్ సెలవులో ఉండటంతో స్టాఫ్ నర్స్‌లు బళ్లారి లేదా కళ్యాణదుర్గం వెళ్లమని సూచించారు. వెంటనే ఆమె భర్త కారును అద్దెకు మాట్లాడుకొని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బళ్లారిలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ప్రసవం చేశారు. కణేకల్లు నుంచి బళ్లారికి వెళ్లేందుకు గంటన్నర సమయం... కారు వెతుక్కోవడానికి గంట సమయం పట్టింది. ఈ సమయంలో వారు పడిన వేదన మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి సంఘటనలు కణేకల్లు ప్రాంతంలో నిత్యకృత్యం. పేరుకు 30 పడకల ఆస్పత్రి ఉన్నా...ఇక్కడ వైద్యులు ఉండరు. దాదాపు లక్ష మంది జనాభా కోసం కట్టించిన ఈ ఆస్పత్రిలో గైనిక్ వైద్యులూ అందుబాటులో లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కణేకల్లు ప్రభుత్వాస్పత్రి చూస్తే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తలపిస్తుంది. కానీ లోనికి తొంగిచూస్తే అన్నీ సమస్యలే కనిపిస్తాయి. ఈ ఆస్పత్రిలో కనీసం పీహెచ్సీ వైద్యసేవలు కూడా అందడం లేదు. వాస్తవానికి ఇక్కడ ఒక సివిల్ సర్జన్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్, ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు...మొత్తం డాక్టర్లు ఏడుగురు ఉండాలి. ఇక్కడ మాత్రం ఒకే ఒక్క డాక్టర్ మాత్రమే సేవలందిస్తున్నారు. ఆయన కూడా ఈ నెల 30 ఉద్యోగ విరమణ చేయనున్నారు. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నా... ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కాంట్రాక్ట్ పద్ధతిపైనైనా వైద్యులను నియమించాలని కోరుతున్నారు. డాక్టర్ సెలవు పెడితే అంతే.. ప్రస్తుతం కణేకల్లు ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా డాక్టర్ నాగభూషణం మాత్రమే సేవలందిస్తున్నారు. గత నెలలో ఆయన ఆరోగ్యం బాగలేక మెడికల్‌లీవ్ పెడితే ఉన్నతాధికారులు చివాట్లు పెట్టి డ్యూటీకెళ్లమన్నారు. అత్యవసర సమయాల్లో తప్పనిసరిగా లీవ్ పెడితే... ఆ రోజుల్లో నర్సులే రోగులకు వైద్యసేవలందించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మూలకుపడిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం శిశువు ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉపయోగపడుతుంది. ప్రతి గర్భిణి కాన్పు అయ్యే వరకూ ఐదారు సార్లు తప్పని సరిగా స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. కణేకల్లు ప్రాంతంలో ఈ స్కానింగ్ యంత్రం ఎక్కడా లేదు. దీంతో గర్భిణులంతా బళ్లారి, అనంతపురం నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ చేయిస్తే రూ.500 నుంచి రూ.600 వరకు ఫీజు తీసుకుంటారు. దీంతో ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం కణేకల్లు ఆస్పత్రికి తీసుకువచ్చింది. కానీ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్, గైనకాలజిస్టులు ఎవరూ లేకపోవడంతో అత్యంత ఖరీదైన ఈ యంత్రం మూలకుపడింది. మంత్రి హామీకే దిక్కులేదు రూ.2.25 కోట్లతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని 2017 డిసెంబర్ 5న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆసుపత్రిలో డాక్టర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తామని హామీచ్చారు. ఆ తర్వాత ఆయన ఆ మాటే మరచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 29 గ్రామాలకు ఇదే దిక్కు కణేకల్లు ప్రభుత్వాసుపత్రిలో 30 పడకలున్నాయి. కణేకల్లు మండలంలోని 29 గ్రామాల ప్రజలతోపాటు బొమ్మనహళ్ మండలంలోని దర్గాహొన్నూరు, గోవిందవాడ, సింగేపల్లి, గోనేహళ్ తదితర గ్రామాల నిరుపేద ప్రజలు ఎన్నో ఆశలతో చికిత్స కోసం కణేకల్లు సీహెచ్‌సీ వస్తే నిరాశే మిగులుతోంది. పూర్తిస్థాయిలో డాక్టర్లు లేక పోవడంతో నిరుపేదలు వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
పచ్చరంగు పూసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్
సాక్షి, కణేకల్లు: ఆదిగానిపల్లికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తిప్పేస్వామి పచ్చరంగు పూసుకున్నాడు. టీడీపీ నాయకులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు ఏకంగా ఊళ్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అసలే కూలీలు అత్యధికంగా ఉన్న గ్రామం ఆదిగానిపల్లి. ‘ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే మీకు ఉపాధి పని కల్పిస్తా.. లేకపోతే పని ఉండదు మీ ఇష్టం. ఆలోచించండి... ఉపాధి లేకపోతే ఊరు వదిలి బతుక్కునేందుకు బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుంది’ అంటూ కూలీలను హెచ్చరిస్తున్నాడు. గ్రామంలో టీడీపీ తరఫున జరిగే ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తూ కూలీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా టీడీపీకి ఓటేస్తేనే మీ పింఛన్ వస్తాది.. లేకపోతే పింఛన్ కూడా పోతుంది అంటూ పింఛన్‌దారులనూ బెదిరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడ్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆడ శిశువు మృతదేహం లభ్యం
కణేకల్లు: కణేకల్లు–ఎర్రగుంట మార్గమధ్యంలోని కల్వర్టు వద్ద ఆదివారం ఓ ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. అటువైపు బైక్‌పై వెళ్తున్న కొందరికి కల్వర్టు వద్ద కుక్కలుండటం గమనించారు. దగ్గరకెళ్లి కుక్కలను తరిమేయగా వారికి మృతశిశువు కనిపించింది. వెంటనే పైన పేర్కొన్న గ్రామాల వారికి విషయం తెలిపారు. వారొచ్చి మృత శిశువును చూసి కంటతడి పెట్టారు. బతికుండగా పడేసి వెళ్లారో, లేక చనిపోయాక ఖననం చేయకుండా వదిలేసి వెళ్లారో అంతుబట్టడం లేదు. పసికందును అలా పడేయటానికి వారికి మనసెలా వచ్చిందోనంటూ శాపనార్థాలు పెట్టారు. -
అప్పు భయంతో ఆత్మహత్య
కణేకల్లు : గనిగెరకు చెందిన బోయ దాసరి తిమ్మప్ప (32) అప్పు భయంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ యువరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎర్రక్క, వెంకటేశులు దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు తిమ్మప్ప. అంతా కలిసి ఉన్న సమయంలో పంటల సాగు కోసం రూ.3 లక్షలు అప్పు చేశారు. అయితే ఏడాది క్రితం దాసరి తిమ్మప్ప భార్య లక్ష్మి, కొడుకు వంశీ(4)ని తీసుకొని ఇంటి నుంచి బయటికొచ్చి వేరు కాపురం పెట్టాడు. అయితే ఉమ్మడి కుటుంబంలో చేసిన అప్పుల్లో తన వాటా అప్పు కూడా చెల్లించాల్సి వస్తోందని భయపడిన తిమ్మప్ప శుక్రవారం ఉదయం తాను కౌలుకు చేస్తున్న భూమిలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.