అప్పు భయంతో ఆత్మహత్య
కణేకల్లు : గనిగెరకు చెందిన బోయ దాసరి తిమ్మప్ప (32) అప్పు భయంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ యువరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎర్రక్క, వెంకటేశులు దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు తిమ్మప్ప. అంతా కలిసి ఉన్న సమయంలో పంటల సాగు కోసం రూ.3 లక్షలు అప్పు చేశారు. అయితే ఏడాది క్రితం దాసరి తిమ్మప్ప భార్య లక్ష్మి, కొడుకు వంశీ(4)ని తీసుకొని ఇంటి నుంచి బయటికొచ్చి వేరు కాపురం పెట్టాడు. అయితే ఉమ్మడి కుటుంబంలో చేసిన అప్పుల్లో తన వాటా అప్పు కూడా చెల్లించాల్సి వస్తోందని భయపడిన తిమ్మప్ప శుక్రవారం ఉదయం తాను కౌలుకు చేస్తున్న భూమిలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.