కణేకల్లు: ‘వాళ్లు ఎవరనుకొంటున్నావ్.. టీడీపీ లీడర్లు.. మా వాళ్లు మమ్మల్ని పలుకరించేందుకు వస్తే అడ్డుకొంటావా..? గంట టైమ్ ఇస్తే మా ప్రతాపమేంటో చూపిస్తాం...’ అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతిచౌదరి, మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు కణేకల్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములుపై జులుం ప్రదర్శించారు. మంత్రి ఉషశ్రీచరణ్ భానుకోట వద్ద సుజలాన్ కంపెనీ భుములను ఆక్రమించారని ఇటీవల దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి శనివారం జిల్లా టీడీపీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లాలని యత్నించారు.
టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. అక్కడికి ఎవరూ వెళ్లకూడదని నోటీసుల ద్వారా సూచించి పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉన్నం, గోళ్ల వెంకటేశులు తమ వాహనాల్లో భానుకోటకు బయలుదేరడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
దీంతో కణేకల్లు టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని పోలీసు స్టేషన్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా హెచ్‌సీ శ్రీరాములు వారిని అడ్డుకుని అందరూ కాకుండా ఒక్కొక్కరుగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వారంతా ఒకే సారి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల ఉన్న ఉన్నం, వెంకటేశు బయటికొచ్చి పోలీసులపై నానా యాగీ చేశారు. ఏఎస్‌ఐ ఈశ్వరయ్య, సిబ్బందిపైనా దౌర్జన్యానికి దిగారు.
చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’
Comments
Please login to add a commentAdd a comment