head constable
-
వివాహేతర సంబంధం.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
సేలం: వివాహేతర సంబంధం వ్యవహారంతో సేలంలో హెడ్ కానిస్టేబుల్ సోమవారం సస్పెండ్‌కు గురయ్యాడు. సేలం ప్రభుత్వ వైద్యశాల ఔట్ పోస్ట్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా గోవిందరాజన్ (38) పనిచేస్తున్నాడు. ఇతని భార్య సంగీత (22). వీరి పిల్లలు దర్శిణి (4), రోహిత్ (8). గోవిందరాజన్ కుటుంబంతో ఇక్కడ ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. కాగా గోవిందరాజన్, సంగీతల మధ్య కుటుంబ గొడవ ఉన్నాయి. ఈ స్థితిలో గత ఏడాది అక్టోబర్ 18వ తేదీ ఇద్దరు పిల్లలు మృతదేహాలుగా పడి ఉండగా, పక్కన సంగీత ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో గోవిందరాజ్‌కు, మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు, ఆ విష యం భార్య సంగీతకు తెలియడంతో గొవడలు జరుగుతూ వచ్చినట్టు తెలిసింది. ఆ కారణంగా జీవితంపై విరక్తి చెందిన సంగీత పిల్లలకు విషం కలిపిన నీటిని తాగించి, తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈ ఘటనపై సోమవారం సేలం నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అభినబు గోవిందరాజ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మొన్న టెక్కీ అతుల్.. ఇప్పుడు పోలీస్ తిప్పణ్ణ
కృష్ణరాజపురం: నా భార్య, ఆమె కుటుంబీకుల వేధింపులను భరించలేను. అన్ని విధాలా వేధించి నరకం చూపుతున్నారు. నాకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ న్యాయం చేయాలని వేడుకుంటూ అతుల్ సుభాష్ అనే టెక్కీ బెంగళూరులో ఉరివేసుకోవడం దేశమంతటా చర్చనీయాంశమైంది. కుటుంబ హింస చట్టాలను సవరించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. నీవు చచ్చినా ఫరవాలేదని దూషణలు అంతలోనే ఐటీ నగరిలో మరో హృదయ విదారక దుర్ఘటన జరిగింది. భార్య, మామ వేధింపులను భరించలేక ఓ హెడ్‌కానిస్టేబుల్ ఇక జీవితం చాలనుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బైయప్పనహళ్లి రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు.. విజయపుర జిల్లా సిందగి తాలూకా హందిగనూరు గ్రామానికి చెందిన తిప్పణ్ణ (35) బెంగళూరు సిటీ పోలీసు విభాగం పరిధిలో హుళిమావులో సివిల్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతని భార్య, మామ వేధిస్తున్నట్లు తెలిసింది. తరచూ అతన్ని కించపరుస్తూ సతాయించేవారు. ఈ నెల 12న కూడా భార్య, మామ ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు. నీవు చచ్చినా ఫరవాలేదు, నా కూతురు హాయిగా జీవిస్తుంది అని మామ నిందించాడు. ఈ పరిణామాలతో జీవితంపై విరక్తి చెందిన తిప్పణ్ణ డెత్‌నోట్ రాసి, రైలు కింద పడ్డాడు. డ్యూటీ నుంచి నేరుగా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. తండ్రి ఫిర్యాదు తన కుమారుని మృతిపై న్యాయం చేయాలని శుక్రవారం అర్ధరాత్రి మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బైయప్పనహళ్లి రైల్వే పోలీసు స్టేషన్లో ఆత్మహత్యకు ప్రేరేపణ తదితర సెక్షన్ల కింద భార్య, మామపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మర ణోత్తర పరీక్ష కోసం సీవీ రామన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన -
పెంపుడు కుక్కపిల్లలు మృతి..
అన్నానగర్: కాంచీపురంలో పెంపుడు కుక్క పిల్లలు మురుగు కాలువలో పడి మృతి చెందడంతో భర్తతో ఏర్పడిన గొడవతో మహిళా హెడ్‌కానిస్టేబుల్ శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాంచీపురం తిరువీధి పల్లంకి చెందిన దిగేశ్వరన్. ఇతని భార్య గిరిజ(42). ఈమె చెంగల్పట్టు ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో హెడ్ కానిస్టేబుల్. దిగేశ్వరన్ మధురవాయల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు లేకపోవడంతో కుక్కను పెంచుకున్నారు. పెంపుడు కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. వీటిలో రెండు సమీపంలోని కాలువలో పడి మృతిచెందాయి. ఈ విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గిరిజ శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కన్నబిడ్డలను కడతేర్చి తల్లి ఆత్మహత్య
సేలం: కన్నబిడ్డలను కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడిన భార్యను చూసిన భర్త ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సేలంలో గురువారం రాత్రి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సేలం కొండలాంపట్టి సమీపంలో పోలీసుస్టేషన్ సమీపంలో పోలీసు క్వార్టర్స్ ఉంది. ఇందులో నివాసం ఉంటున్న గోవిందరాజ్ (38) సేలం జీహెచ్ పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య సంగీత (34), కుమారుడు రోహిత్ (7), దర్శికశ్రీ (5) కుమార్తె ఉన్నారు. పిల్లలు అదే ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి, ఎల్కేజీ చదువుతున్నారు. ఎప్పటిలాగే గోవిందరాజ్ గురువారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో రోహిత్, దర్శికశ్రీ నేలపై మృతదేహాలుగాను, సంగీత ఉరి వేసుకుని మృతదేహంగా వేలాడుతూ కనిపించింది. దిగ్భ్రాంతి చెందిన గోవిందరాజ్ బోరున విలపిస్తూ తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతని అరుపులు విన్న పొరుగింటి వారు అక్కడికి చేరుకుని తొలుత గోవిందరాజ్‌ను రక్షించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ వేల్మురుగన్, కొండలాంపట్టి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తర్వాత సంగీత, రోహిత్, దర్శికశ్రీ మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తొలుత పిల్లలకు విషం కలిపి ఇచ్చి హత్య చేసిన సంగీత తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. అలాగే గోవిందరాజ్, సంగీత అప్పుడప్పుడు గొడవ పడుతున్నట్టు గాను, అలాగే గురువారం ఉదయం కూడా గొడవ జరిగిందని, రాత్రి వచ్చి చూడగా భార్య, పిల్లలు మృతదేహాలుగా కనిపించారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని, గోవిందరాజ్‌ను పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. -
ఎస్.ఐ యామ్ ఆన్ డ్యూటీ
ఎంతోమంది కలలను తమ భుజాలపై మోశారు.. ఎందరో ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచారు. సమాజ భద్రతకు తామున్నామంటూ ప్రతినబూనారు. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందానికి కారణమయ్యారు. జీవిత భాగస్వాములు సగర్వంగా తలలు ఎత్తుకునేలా చేశారు. సొంతవారి కళ్లల్లో ఆనందబాష్పాలయ్యారు. చిట్టి పాపాయిల సంతోషానికి అవధుల్లేకుండా చేశారు. పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి చేసుకుని ఎస్సైలుగా నియమితులైన ఎందరో విజయగాథలు బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమయ్యాయి. వారిలో కొందరిని ’సాక్షి’ పలకరించింది..32 ఏళ్ల వయసులో...ఒడిలో పాపాయికి చనుబాలు మాన్పించి.. 32ఏళ్ల వయసులో గ్రౌండ్ బాటపట్టారు. అనుక్షణం తనను తాను నిరూపించుకోవాలని వందకు రెండొందల రెట్లు కష్టపడ్డారు. మైదానంలో శివంగిలా దూకారు. మెదడుకు పదును పెట్టారు. పోలీసు శిక్షణలో భాగంగా ఇండోర్, ఔట్‌డోర్ విభాగాల్లో ఔరా అనిపించి టాపర్‌గా నిలిచి పాసింగ్ ఔట్ పరేడ్ కమాండెంట్‌గా నిలిచారు భాగ్యశ్రీ పల్లి. భద్రాచలంలోని సార΄ాక గ్రామానికి చెందిన భాగ్యశ్రీ చాలా పేదరికం నుంచి వచ్చారు. తండ్రి నాగేశ్వరరావు ఇప్పటికీ పెళ్లిళ్లకు వంటలు చేస్తుంటారు. తల్లి దుర్గ. భర్త పవన్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మి చదువుపై శ్రద్ధ పెట్టారు. గతంలో గ్రూప్–4 ఉద్యోగం చేస్తూ సమాజానికి నేరుగా ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఎస్సై కోసం సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డారు. భర్త ప్రోద్బలంతో ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు. శిక్షణలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని, ఫీల్డ్‌లో ఎంతో కష్టపడతానని పేర్కొన్నారు.ఇద్దరు పిల్లల తల్లిగా..ఇంట్లో ఏడు నెలల చిన్నారి.. మరో పాపకు రెండున్నర సంవత్సరాలు.. వారి ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆ తల్లి వారిని అమ్మమ్మ వద్ద వద్ద వదిలి తన కలలను నెరవేర్చుకునేందుకు అడుగు బయటపెట్టింది. ఆమే మణిమాల. సివిల్ సర్వీసెస్ సాధించాలనేది తన కోరిక. కానీ ఇంతలో ఎస్సై నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఆ జాబ్ కొట్టాలనే ఆకాంక్షతో బయల్దేరారు. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుని, హౌరా అనిపించుకుంటున్నారు. ఈవెంట్స్ కోసం కష్టనష్టాలకోర్చి నిరూపించుకున్నారు. నాన్న పేరు నాగళ్ల శ్రీనివాసరావు. అంబర్‌పేటలోని సీపీఎల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త డి.వెంకటనాగేశ్వరరావు కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తమ్ముడు అశోక్ ఇటీవల ఏఈఈగా ఎంపికయ్యాడు. అక్కా తమ్ముళ్లు కలిసే చదువుకునేవారు. శిక్షణ పూర్తి చేసుకుని పీవోపీలో పాల్గొని తల్లిదండ్రులు, భర్త కళ్లల్లో ఆనందం చూశారు. తండ్రి శ్రీనివాసరావు, స్నేహితురాలు సృజన తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక మహిళగా ఆర్థిక స్వావలంబన ఉండటం చాలా ముఖ్యమని, తన విధి నిర్వహణలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కృషి చేస్తానని వివరించారామె.27 సార్లు ప్రయత్నించి..! నవీ¯Œ కుమార్ మానుపూరి.. సూర్యాపేట జిల్లా తాళ్లసింగారం గ్రామం. తల్లిదండ్రులు సంగయ్య, ఉపేంద్ర. తండ్రి చేనేత కార్మికుడు. ముగ్గురు కుమారుల్లో రెండో వ్యక్తి నవీన్ . చిన్నప్పటి నుంచి యూనిఫాం వేసుకొని ఆఫీసర్ హోదాలో గౌరవం పోందాలనేది అతడి కోరిక. ఆర్మీలో చేరేందుకు పట్టుదలతో ఎంతో కృషి చేశాడు. కమాండెంట్ అధికారి హోదా కోసం 27 సార్లు విఫలప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి రిజెక్ట్ అవుతుండేవాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. చివరకు ఎస్సైగా ఎంపికై.. బుధవారం జరిగిన ΄ాసింగ్ పరేడ్‌లో పాల్గొన్నాడు. పీవోపీ సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు చూసినప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేనిదంటూ సంతోషం వ్యక్తం చేశాడు. – వివేకానంద తంగెళ్లపల్లి, సాక్షి, హైదరాబాద్ -
నెత్తురోడుతున్నా.. బెదరకుండా..
సాక్షి, హైదరాబాద్: ఛాతి, మెడ, కడుపు, చేతుల మీద విచక్షణారహితంగా కత్తిపోట్లు.. రక్తం ఏరులై పారుతున్నా ఏమాత్రం బెదరకుండా కరుడుగట్టిన అంతర్రాష్ట్ర చెయిన్ స్నాచర్ ఇషాన్ నిరంజన్ నీలంనల్లి ఆటకట్టించారు హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య. అతని ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర హోం శాఖ అత్యున్నత శౌర్య పతకం రాష్ట్రపతి గ్యాలంటరీ పురస్కారానికి ఎంపిక చేసింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యాదయ్య ఈ అవార్డును అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఈ పతకానికి ఎంపికైన ఏకైక పోలీసు యాదయ్యే కావడం విశేషం. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్ సీసీఎస్‌లో యాదయ్య హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. యాదయ్య అవార్డుకు ఎంపికవడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్వగ్రామమైన చేవెళ్లలోని మీర్జాగూడలో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.నాడు ఏం జరిగిందంటే..2022 జూలై 25న చెయిన్ స్నాచింగ్, అక్రమ ఆయుధాల సరఫరాదారులైన ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్నాచింగ్‌లకు తెగబడ్డారు. కూకట్పల్లి, గచ్చిబౌలి, ఆర్సీపురం, మియాపూర్‌లలో వరుస చెయిన్ స్నాచింగ్‌లతో హడలెత్తించారు. దీంతో స్నాచర్లను పట్టుకునేందుకు వెంటనే అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్నాచర్ల కోసం కమిషనరేట్ పరిధిలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు. స్నాచింగ్ సమయంలో నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనం, వారు ధరించిన దుస్తులను గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుల జాడ కోసం వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్నాచర్లు మియాపూర్‌లో మరో స్నాచింగ్ చేసి, బైక్ మీద వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో మాదాపూర్ సీసీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న యాదయ్య, దేబేష్లు బైక్ మీద ఆర్సీపురం నుంచి మియాపూర్ వైపు వస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇరువురు స్నాచర్లను పట్టుకునేందుకు బయలుదేరారు.రక్తం కారుతున్నా...నిందితులు అశోక్‌నగర్ హెచ్ఐజీ గేట్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు మళ్లారు. దీంతో కాలనీలోనే స్నాచర్లను పట్టుకోవాలని నిర్ణయించుకున్న యాదయ్య బైక్‌ను హెచ్ఐజీ గేట్ లోపలికి మళ్లించారు. కాలనీలో నుంచి బైక్ మీద ఎదురుగా వస్తున్న నిందితులు ఇషాన్, రాహుల్ వీరిని దాటి వెళ్లేందుకు యత్నించారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న కానిస్టేబుల్ దేబేష్ స్నాచర్ రాహుల్‌ను, బైక్ నడుపుతూనే యాదయ్య మరో స్నాచర్ ఇషాన్‌ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇషాన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్య ఛాతి, మెడ, చేతులు, కడుపు, శరీరం వెనక భాగంలో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావమవుతున్నా యాదయ్య ఏమాత్రం బెదరకుండా ఇషాన్‌ను అదిమి పట్టుకున్నాడు. ఇంతలో సమీపంలో ఉన్న మరో కానిస్టేబుల్ రవి ఘటనా స్థలానికి రావడంతో ఇరువురు స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. యాదయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఏడు కత్తిపోట్లతో ప్రాణాప్రాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన యాదయ్య 18 రోజులపాటు చావుతో పోరాడాడు. ఆఖరికి శరీరం లోపల, బయట మూడు సర్జరీలు, వందకు పైగా కుట్లు పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రెండు నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. గతంలో లాగా శరీరం సహకరించకపోవడంతో అధికారులు యాదయ్యను ఆఫీసు విధులకు పరిమితం చేశారు.సహచరుల సహకారంతోనే..తోటి కానిస్టేబుళ్లు దేబేష్, రవి సహకారంతోనే స్నాచర్లను పట్టుకోగలిగాం. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుగా మా విధి. పై అధికారుల ప్రోత్సాహంతో వారిని ఆదర్శంగా తీసుకొని విధులు నిర్వర్తిస్తాను. –చదువు యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ -
కోడలిపై దాడి ఘటనలో హెడ్ కానిస్టేబుల్‌పై కేసు
బోనకల్: గుండె కుడివైపు ఉందనే కారణంతో మహిళను ఆమె భర్త వేధించగా, ప్రశ్నించినందుకు ఆమైపె దాడి చేసిన మామ, హెడ్‌కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్లు, అత్త అన్నపూర్ణపై కేసు నమోదు చేసినట్లు బోనకల్ ఎస్ఐ మధుబాబు తెలిపారు. బోనకల్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు భాస్కరాచారికి ఖమ్మంకు చెందిన భవానీతో 2018లో వివాహం జరిగింది. అయితే, భవానీకి గుండె కుడివైపు ఉందనే కారణంతో భర్త, అత్తామామలు వేధిస్తున్నారు. ఈనేపథ్యాన భవానీ బోనకల్లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లగా ఈనెల 14న వెళ్లగా మాటామాట పెరగడంతో ఆమైపె అత్తామామలు దాడి చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు తెలిపారు. -
హైబీపీతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు మృతి
కల్వకుర్తి టౌన్: విధి నిర్వాహణలో పోలీస్‌స్టేషన్ వాచ్ ఇన్చార్జి కుప్పకూలి పడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం కల్వకుర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ వివరాల ప్రకారం.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలల క్రితం డ్యూటీలో చేరిన శ్రీనివాస్ (51) వాచ్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో విధుల్లో ఉన్న ఆయనకు బీపీ తగ్గడంతో కిందపడిపోయాడు. వెంటనే అతన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అయినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీనివాస్ స్వస్థలం నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయనకు భార్య, కూతురు ఉంది. పోలీసుల నివాళి డ్యూటీలో శ్రీనివాస్ చాలా నిబద్ధతో పనిచేసే వాడని కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శ్రీనివాస్ చిత్రపటానికి సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిసిపూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబాన్ని డిపార్టుమెంట్ తరుపున ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ ఆంజనేయులు, ఎస్ఐలు రమేష్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కూతురు అదృశ్యంపై ఫిర్యాదు... తల్లిపై కానిస్టేబుల్ అకృత్యం!
సాక్షి ప్రతినిధి, కడప: కాపాడాల్సిన రక్షకభటుడే కాటేయజూశాడు. అండగా వచ్చాడనుకుంటే అవకాశం తీసుకోవాలనుకున్నాడు. పుట్టెడు వేదనలో ఉన్న బాధితురాలిపై లైంగికదాడికి విఫలయత్నం చేశాడు. చాలారోజులు ఎవ్వరికీ చెప్పుకోలేక ఆవేదనను అణచిపెట్టుకుంది. తనలా మరో మహిళ ఇలాంటి ఇబ్బందులు పడకూడదని నిర్ణయించుకుంది. హెడ్‌కానిస్టేబుల్ నిర్వాకాన్ని బహిర్గతం చేసింది. సోషల్ మీడియా కేంద్రంగా ఇప్పుడా వీడియో హల్చల్ చేస్తోంది. ఆమె ఆరోపించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడు భద్రావతి కాలనీకి చెందిన పేరూరు దుర్గమ్మ మైనర్ కుమార్తె సెప్టెంబర్ నెల 23న గ్రామానికి చెందిన మరో అబ్బాయితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయమై స్థానిక పోలీస్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి బాలికను వెతికేందుకు హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్, మహిళా పోలీసు రేవతిలను దుర్గమ్మతో పాటు అక్టోబర్ 6వ తేదీన హైదారాబాదుకు పంపించారు. అక్కడ ఓలాడ్జిలో హెడ్ కానిస్టేబుల్ దుర్గమ్మతో దుర్మార్గంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. ఎంత వారించినా చెయిపట్టుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించి బూతులు మాట్లాడాడు. ఇందుకు మహిళా పోలీసుల కూడా సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక ఫోన్ చేయడంతో అందరూ వెనుతిరిగి వచ్చారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ దుర్గమ్మ వీడియో తీసింది. అందులో కొద్ది రోజుల తర్వాత తన కుమార్తె మళ్లీ అదే అబ్బాయితో వెళ్లింద, తమకు న్యాయం చేయలేదని కూడా పేర్కొంది. ఈ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ విషయంపై ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా రెండు నెలల క్రితం జరిగిన ఘటనను ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా అమెతో మాట్లాడించారని, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోతే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారు, ఇంత జరిగితే స్థానికంగా లేదా ఉన్నతాధికారులకు గానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయ సందేహం వ్యక్తం చేశారు. హెచ్‌సీ భాస్కర్ సస్పెన్షన్ ఓబులవారి పల్లి హెడ్ కానిస్టేబుల్ అయిన డి.భాస్కర్ పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడిని అన్నమయ్య జిల్లా ఎస్పీ బి.రామకృష్ణ శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు. అతడిని తక్షణమే విధుల నుండి తొలగించినట్లు రాజంపేటీ డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. -
నాలుగు నెలల్లో 4 కొలువులు.. అయినా సివిల్స్ లక్ష్యంగా..
మంచి ప్యాకేజీతో వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదనుకున్నాడు. ప్రభుత్వ రంగంలో ప్రజాసేవతో వీలున్న కొలువు కావాలనుకున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ధిక్కరించాడు. లక్ష్య సాధనకు పరాక్రమించాడు. ఏ దశలోనూ నిరాశను దరి చేరనీయరాదనుకున్నాడు. ఆత్మవిశ్వాసమే మార్గమని విశ్వసించాడు. ఫలితంగా ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు గ్రూప్–1 ద్వారా డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చుక్కల సూర్యకుమార్. అయినప్పటికీ అంతిమ లక్ష్యం.. సివిల్స్‌పై గురి వీడలేదు. నిరంతర పరిశ్రమకు చిరునామాగా నిలిచే సూర్యకుమార్‌ను ఒకసారి పలకరిస్తే.. రాజమహేంద్రవరం: మాది మధ్య తరగతి కుటుంబం. సొంత ఊరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ. నాన్న వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు గోవిందరాజు, అక్క స్వాతి ఉన్నారు. తమ్ముడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నాడు. నాకు టెన్తులో మంచి మార్కులొచ్చాయి. స్టేట్‌లో ఆరో ర్యాంకు వచ్చింది. ఆ మార్కులు ఆధారంగా 2008లో నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ నా చదువుకు గట్టి పునాది పడింది. ఇంటర్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ టెన్‌లో ఒకడిగా నిలిచాను. 2014లో బీటెక్ అయ్యాక ఇన్ఫోసిస్ ఉద్యోగానికి క్యాంపస్‌లో సెలక్టయ్యాను. అప్పట్లోనే నాకు వార్షిక జీతం రూ.35 లక్షలు. అందులో కొనసాగి ఉంటే ఇప్పుడు రూ.కోటిన్నరకు చేరేవాడిని. త్రుటిలో చేజారిన అవకాశాలు ఎక్కువ జీతం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు సంతృప్తి కలిగించలేదు. అందులో సంతోషంతో ఇమడలేకపోయాను. రెండేళ్లు పని చేశాను. కానీ పబ్లిక్ సర్వీసుతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయాన్ని నాన్నతో చెప్పాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఇది ఇబ్బందికరమైనా నాన్న నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగుకు జాయినయ్యాను. 2017–20 మధ్య నాలుగుసార్లు రాశాను. ఇంటర్వ్యూ దశకు చేరుకోలేకపోయాను. ఇదే సమయంలో ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల్లో తుది జాబితాలో మిస్సయ్యాను. 2020 గ్రూప్–2లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అవకాశం పోయింది. అదే ఏడాది గ్రూప్–1 మెయిన్‌కు అర్హత సాధించినా ఇంటర్వ్యూ పోయింది. ఎస్సెస్సీ సీజీల్, నాబార్డు, ఆర్బీఐ.. ఇలా నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో విజయం దూరమయ్యేది. ఈ దశలో మానసిక దృఢత్వం కోల్పోతానేమోనని సంశయించాను. అయినా పట్టుదలతో కష్టపడేవాడిని. నిరాశ చెందేవాడిని కాదు. అంతిమ లక్ష్యం సివిల్స్ 2023– ఈ ఏడాది నా జీవితంపై చాలా మంచి ప్రభావం చూపించింది. వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించేలా చేసింది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దేవదాయ శాఖలో ఈఓ పోస్టుకు ఎంపికయ్యాను. కాగ్ అకౌంటెంటుగా సెలక్టయ్యాను. సరదాగా రాసిన గ్రూప్–4 ఉద్యోగమూ వచ్చింది. గ్రూప్–1లో విజేతగా నిలిచాను. జైల్స్ డీఎస్పీగా ఎంపికయ్యాను. ప్రస్తుతానికి దేవదాయ శాఖలో ఈఓ శిక్షణ పొందుతున్నా.. వచ్చే జనవరిలో డీఎస్పీ ట్రైనింగ్ ఆర్డర్ రాగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డీఎస్పీ అయినా నా జీవిత లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలన్నదే. ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది. పేరు : చుక్కల సూర్యకుమార్ తండ్రి : వెంకటరమణ,హెడ్ కానిస్టేబుల్ తల్లి : లక్ష్మి, గృహిణి చదువు : బీటెక్ (ట్రిపుల్ ఐటీ, నూజివీడు) ఎంపిక : గ్రూప్–1లో డీఎస్పీ (జైళ్లు)ప్రస్తుతం ఉంటున్నది : వేమగిరి (తూర్పు గోదావరి) లక్ష్యం నిర్ణయించుకుని శ్రమించాలి జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో మన సామర్థ్యానికి అనుగుణంగా ముందుగానే లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఏదైనా సాధించాలంటే కష్టం తప్ప మరో మార్గం ఉండదని తెలుసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనా ఏ సమయంలోనూ ఆత్మ విశ్వాసాన్ని దూరం చేసుకోకూడదు. నేనైతే ఈ పరీక్షల ప్రిపరేషనులో అన్ని సరదాలు, షికారులు వదులుకున్నాను. ఫెయిల్యూర్స్ వస్తున్నా నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం. – చుక్కల సూర్యకుమార్ -
బరితెగించిన పాక్ రేంజర్స్
జమ్మూ/అరి్నయా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో భారత్–పాక్ సరిహద్దు వెంట గురువారం ఈ ఘటన జరిగింది. సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఉన్న 50ఏళ్ల లాల్ఫామ్ కీమాపై కాల్పులు జరపడంతో రక్తమోడుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ‘ పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా బీఎస్ఎఫ్ బలగాలు కాల్పుల మోత మోగించాయి. సమీపంలోని జెర్దా గ్రామంపైనా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
భద్రాచలంలో విషాదం.. నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం కేటీఆర్ పర్యటనకు బందోబస్తు వచ్చిన కొత్తగూడెం వన్ టౌన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి ప్రమాదవశాత్తు అన్నదాన సత్రం దగ్గర ఉన్న నాలాలో పడి మృతి చెందింది. గోదావరి కరకట్ట స్లూయిస్ల వద్ద కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. మరోవైపు భద్రాచలంలో భారీ వర్షం నేపథ్యంలో హెలిక్యాప్టర్ ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో కేటీఆర్ పర్యటన రద్దయ్యింది. చదవండి: మర్రిగూడ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.2 కోట్ల నగదు గుర్తింపు -
కర్నూలు: తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. లోకాయుక్తా కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న సత్యనారాయణ.. గన్‌తో పేల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: నా భర్తను తగలబెట్టారు: రవీందర్ భార్య -
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
హొసపేటె: గుండెపోటుతో పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విజయనగర జిల్లా కమలాపుర పోలీసు స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఉన్న రాఘవేంద్ర(46) రాత్రి ఇంటిలో భోజనం చేసి నిద్రపోతుండగా అర్ధరాత్రి ఉన్నఫళంగా ఛాతీలో నొప్పి వచ్చింది. అతనిని నగర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాఘవేంద్ర 2005 బ్యాచ్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్. గత 18 ఏళ్లుగా పోలీసు శాఖలో విధులు నిర్వహించారు. ఇటీవలే బళ్లారి లోకాయుక్త కార్యాలయం నుంచి రాఘవేంద్ర పదోన్నతిపై కమలాపుర పోలీసు స్టేషన్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా బదిలీ అయ్యారు. కాగా విజయనగర జిల్లా ఎస్పీ శ్రీ హరిబాబు, డీఎస్పీ మంజునాథ్ తళ్వార్, హంపీ సీఐ కే.శివరాజ్ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
గన్ మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్ అయి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా గరిడెపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ (పీసీ–1769) శ్రీకాంత్ (29) హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఖబూతర్‌ఖానా ఔట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. 2018 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి నైట్ డ్యూటీలో ఉండి..ఔట్ పోస్టులో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న గన్ మిస్‌ఫైర్ కావడంతో గొంతుకు గాయమైంది. దీంతో శ్రీకాంత్‌ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఉన్నతాధికారులు ఉస్మానియాకు చేరుకొని వివరాలను సేకరించారు. మూడు నెలల క్రితం కోదాడ ప్రాంతానికి చెందిన యువతితో శ్రీకాంత్‌కు వివాహం నిశ్చయమైందని, వచ్చే ఏడాది వేసవిలో వివాహం జరగాల్సి ఉందని, అంతలోనే ఇలా జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు విలపించారు. -
హెడ్ కానిస్టేబుల్‌కు రివార్డు
కొరుక్కుపేట: శంకరాపురం సమీపంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను పరిష్కరించిన హెడ్ కానిస్టేబుల్ పళనిముత్తుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కళ్లకురిచ్చి జిల్లా, శంకరాపురం సమీపంలోని రౌతనల్లూర్ గ్రామం వద్ద మారియమ్మన్ ఆలయానికి కందులు పోసే విషయంలో పంచాయతీ కౌన్సిల్ చైర్మన్ భర్త కదిరవన్‌న, అదే గ్రామానికి చెందిన మాయవన్ మధ్య వాగ్వాదం జరిగింది. కదిరవన్ దాడిలో మాయవన్ తీవ్రంగా గాయపడడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. బందోబస్తులో ఉన్న వడపొన్‌న్‌పరప్పి హెడ్ కానిస్టేబుల్ పళనిముత్తు ఇరువర్గాలను అదుపు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆయనకు రివార్డు అందించి అభినందించారు. -
హెడ్ కానిస్టేబుల్‌పై టీడీపీ నేతల జులుం!
కణేకల్లు: ‘వాళ్లు ఎవరనుకొంటున్నావ్.. టీడీపీ లీడర్లు.. మా వాళ్లు మమ్మల్ని పలుకరించేందుకు వస్తే అడ్డుకొంటావా..? గంట టైమ్ ఇస్తే మా ప్రతాపమేంటో చూపిస్తాం...’ అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఉన్నం మారుతిచౌదరి, మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు కణేకల్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములుపై జులుం ప్రదర్శించారు. మంత్రి ఉషశ్రీచరణ్ భానుకోట వద్ద సుజలాన్ కంపెనీ భుములను ఆక్రమించారని ఇటీవల దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు ఉన్నం మారుతి చౌదరి శనివారం జిల్లా టీడీపీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లాలని యత్నించారు. టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. అక్కడికి ఎవరూ వెళ్లకూడదని నోటీసుల ద్వారా సూచించి పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉన్నం, గోళ్ల వెంకటేశులు తమ వాహనాల్లో భానుకోటకు బయలుదేరడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో కణేకల్లు టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని పోలీసు స్టేషన్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా హెచ్‌సీ శ్రీరాములు వారిని అడ్డుకుని అందరూ కాకుండా ఒక్కొక్కరుగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వారంతా ఒకే సారి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపల ఉన్న ఉన్నం, వెంకటేశు బయటికొచ్చి పోలీసులపై నానా యాగీ చేశారు. ఏఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బందిపైనా దౌర్జన్యానికి దిగారు. చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’ -
Hyderabad: కూతురితో అసభ్య ప్రవర్తన..హెడ్ కానిస్టేబుల్‌పై కేసు
సాక్షి, బంజారాహిల్స్: వరుసకు కూతురయ్యే బ్యూటీషియన్‌పై అసభ్యంగా ప్రవర్తించిన ఏపీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ఏపీకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డి(41) యూసుఫ్ గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఓ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూతురు(17) బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఏడాది క్రితం తనకు పెళ్లి కాలేదని నమ్మించి బాధితురాలి తల్లిని రెండో వివాహం చేసుకొని ఆమె ఇంటిని తన పేరుతో రాయించుకున్నాడు. ఆమె కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: పగటిపూట అగ్గి రాజుకుంటే బుగ్గే!! -
ఇలాంటి పోలీస్ ఒక్కడున్నా చాలు! సొంత డబ్బులతో..
సాక్షి,పార్వతీపురంటౌన్(శ్రీకాకుళం): ఆయన ఓ హెడ్ కానిస్టేబుల్. ఏ స్టేషన్లో పనిచేసినా ఆయనకో ప్రత్యేక గుర్తింపు. జీతం డబ్బులతో పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం చేస్తారు. స్టేషన్‌కు వచ్చే పేద ఫిర్యాదుదారులకు కడుపునిండా భోజనం పెట్టి మానవత్వాన్ని చాటుకుంటారు. సమస్యను ఫిర్యాదు రూపంలో నమోదు చేస్తారు. పేదవృద్ధులకు అండగా నిలుస్తున్నారు. సేవలతో అందరికీ సుపరిచితుడై, సేవక భటుడిగా పేరు పొందారు. ఆయనే.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొమిరి కృష్ణమూర్తి. ఆయన దాతృత్వాన్ని ఓ సారి పరికిస్తే... కృష్ణమూర్తిది వీరఘట్టం మండలం కొట్టుగుమడ గ్రామం. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలన్నది ఆయన కోరిక. పోలీస్ ఎంట్రన్స్ పరీక్షలో ప్రతిభ కనబరచడంతో 1993వ సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పేద వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులకు తన వంతుగా ఆర్థికసాయం చేస్తున్నారు. ఆయన పేరుకే పోలీస్.. కానీ మృధుస్వభావి, మానవతావాది. సమస్యలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆపై వారి సమస్యలను సానుకూలంగా తెలుసుకొని రైటర్‌గా తనపనిని పూర్తిచేస్తారు. సమయానికి అనుగుణంగా వారికి భోజనం పెడతారు. తన సేవలను గుర్తించిన అప్పటి ఎస్పీ పాలరాజు ఆయనను వృద్ధమిత్ర, కోఆర్డినేటర్‌గా నియమించారు. మేము నాయీ బ్రాహ్మణులం. మా తండ్రి వ్యవసాయంతో పాటు కులవృత్తిచేసేవారు. ఆ రోజుల్లో వచ్చిన నెలసరి ఆదాయంలో ఇంటి అవసరాలకు పోను మిగిలిన మొత్తాన్ని పేదలకు దానంచేసేవారు. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తనకు తోచిన సహాయాన్ని చేసేవారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నెలజీతంలో కొంతమొత్తాన్ని పేదలకు వెచ్చిస్తున్నాను. అబ్దుల్ కలాం రచించిన పుస్తకాలను, ఆయన జీవిత చరిత్రను చదివాను. ఆయనే నాకు స్ఫూర్తి. ఉద్యోగవిరమణ పొందిన తరువాత వచ్చిన మొత్తంతో పేద పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల నిర్మిస్తాను. పేదలకు సహాయం చేయడంలో ఉన్న సంతృప్తిని లెక్కించలేను. – కృష్ణమూర్తి, హెడ్‌కానిస్టేబుల్, పార్వతీపురం టౌన్ స్టేషన్ మానవసేవే మాధవ సేవగా... ఆయన తన నెలవారీ జీతంలో సుమారు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు సేవలకు వెచ్చిస్తున్నారు. పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, నిఘంటువులు, దేశ నేతల జీవితగాథల పుస్తకాలు, పెన్నులు కొనుగోలు చేసి అందజేస్తున్నారు. పేద వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతినెలా నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు సమకూర్చుతున్నారు. కొంత ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆయన సేవా నిరతిపై అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వృద్ధమిత్ర కో ఆర్డినేటర్‌గా అందిస్తున్న సేవలను ఆర్యవైశ్య ధర్మశాలలో పార్వతీపురం గత ఆర్డీఓ సుదర్శన్ దొర, సీఐ సంజీవరావు, వయో వృద్ధుల సంక్షేమ ప్రతినిధి జె.సీతారాములు ఘనంగా సత్కరించారు. 2010 నుంచి 2021వరకు ఏటా ఆయనను పలువురు పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి. -
స్టేట్ లెవెల్ బాక్సింగ్ ప్లేయర్, పోలీసు ఉద్యోగం.. కానీ ఏం జరిగిందో ఏమో..
ఎచ్చెర్ల క్యాంపస్: ఆయన ఒకప్పుడు స్టేట్ లెవెల్ బాక్సింగ్ ప్లేయర్. స్పోర్ట్స్ కోటాలోనే పోలీసు ఉద్యోగం. కుమారుడు కూడా పోలీసే. కొడుకు కూతురికి వివాహాలు అయిపోయాయి. బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు. బయట నుంచి చూసే వారికి ఏ సమస్యలు లేని జీవితం ఆయనది. కానీ ఏం జరిగిందో గానీ ఒక్కసారిగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఎందరివో సమస్యలు చూసిన హెడ్ కానిస్టేబుల్ ఏ కష్టం గురించి మదనపడ్డారో గానీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ మర్రిపాడు సుబ్బారావు (50) సోమ వారం ఎచ్చెర్ల పోలీస్క్వార్టర్స్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో పోలీసు వర్గాలు విస్మయానికి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సుబ్బారావు సోమవారం ఉదయం 5.45 సమయానికి ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా ప్లంబర్ విధుల్లో భాగంగా పోలీస్ క్వార్టర్సులో వాటర్ స్కీమ్ ద్వారా నీరు విడిచిపెట్టారు. అనంతరం రోల్ కాల్‌కు వెళ్లారు. దాని తర్వాత ఉదయం ఏడు గంటల సమయంలో పోలీస్ క్వార్టర్సులో 8వ లైన్లో శిథిల క్వార్టర్లోకి వెళ్లి తాడుతో శ్లాబ్ హుక్కు ఊరి పోసుకున్నారు. డ్యూటీ నుంచి బయటకు వెళ్లిన సుబ్బారావు ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి సిబ్బంది అనుమానంతో పరిశీలించగా ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానిక సిబ్బంది ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులకు విషయం తెలుపగా.. వారు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. ఎస్పీ జీఆర్ రాధిక, ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు మృతదేహాన్ని తరలించారు. మానసిక ఆందోళనే కారణమా..? సుబ్బారావుకు ఆర్థిక సమస్యలేవీ లేవు. అ యితే ఇటీవల కుటుంబ కలహాలు సమస్యగా మారినట్టు సమాచారం. భార్య వీరమ్మకు అనారోగ్యం చేసి మంచానికే పరిమితం కావడం, మద్యం అలవాటు వంటివి ఆయనలో మానసిక ఆందోళనకు దారి తీశాయి. ఇవే ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించాయని సహచరులు భావిస్తున్నారు. ఈయన రాష్ట్రస్థాయి బాక్సింగ్ క్రీడాకారుడు. క్రీడా కోటాలో 1992లో ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. మెళియాపుట్టి మండలం బండపల్లి సొంత ప్రాంతం కాగా, తోటపాలేం పంచాయతీ తవిటయ్య నగర్లో నివాసం ఉంటున్నారు. కుమారుడు రాజారావు సైతం ప్రస్తు తం ఎస్టీటీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అల్లుడు కూడా ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Tamil Nadu: విద్యార్థుల గ్రూపు వివాదాలు.. ఏకంగా కత్తులతో.. -
ఫొటోలు తీశాడని హెడ్ కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాలని చెప్పిన హెడ్ కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు దాడి చేసిన సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఎస్సీ వీధికి చెందిన బోస్ రాంబాబు, బోస్ కుమార్‌లు పూటుగా మద్యం తాగి ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించగా.. అటుగా వెళ్తున్న కాశీబుగ్గ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. అక్కడి పరిస్థితిని అధికారులకు తెలియజేసేందుకు ఫొటోలు తీస్తుండగా యువకులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మిగిలిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని నియంత్రించారు. గురువారం ఇద్దరినీ అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. -
మహిళపై కన్నేసిన హెడ్ కానిస్టేబుల్.. కంప్లైట్ ఇచ్చేందుకు వస్తే లోబర్చుకొని
సాక్షి, మైసూరు(కర్ణాటక):నంజనగూడు తాలూకా హుల్లహళ్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే సి.కృష్ణపై కేసు నమోదైంది. వివరాలు.. నిందితుడు టి.నరిసిపుర తాలూకా బన్నూరు పీఎస్‌లో పనిచేసే సమయంలో ఒక మహిళ భర్తతో గొడవలతో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. కృష్ణ ఆమెను లోబర్చుకుని మైసూరు నగరంలో కాపురం పెట్టాడు. ఆమె పేరుతో రూ.5 లక్షల రుణం తీసుకున్నాడు. కొంతకాలం తరువాత తనని పెళ్లి చేసుకోవాలని ఆమె కృష్ణని కోరగా పెళ్లి చేసుకోనని, తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించాడు. ఇటీవల కృష్ణ, అతని కుమారుడు కిరణ్ కలిసి ఆమెను కొట్టారు. దీంతో బాధితురాలు హుల్లహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు. పెళ్లయి ఏడాది.. ఆత్మహత్య హోసూరు: డెంకణీకోట తాలూకా తళి జయంతి కాలనీకి చెందిన తిరుమలప్ప భార్య భూమిక (19). వీరికి గత ఏడాది క్రితం పెళ్లి జరిగింది. భూమిక గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. ఆరోగ్యం బాగుపడక పోవడంతో విరక్తి చెందిన ఆమె గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చదవండి: భర్త కర్కశత్వం..భార్య విడాకుల నోటీసులో సంతకం చేయలేదని.. -
హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం.. చీకటిలో యువతిని చూస్తూ..
బెంగళూరు: కర్ణాటకలోని యలహంక పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గత ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. వివరాలు.. కర్ణాటకలోని యలహంక ప్రాంతంలో ఒక 26 ఏళ్ల యువతి అర్దరాత్రి వీధికుక్కలకు ఆహరం వేయడానికి బయటకు వచ్చింది. అక్కడ అంతా చీకటిగా ఉంది. అప్పుడు ఆమెకు కాస్త దూరంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి చీకట్లో నిలబడి యువతిని చూస్తూ అసభ్యకరరీతిలో ప్రవర్తించాడు. అంతటిలో ఆగకుండా.. అతని సెల్‌ఫోన్ టార్చ్‌లైట్‌ను ఆన్‌చేసి యువతి దుస్తులపై పడేలా చేశాడు. దీన్ని చూసిన యువతి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే గట్టిగా అరించింది. దీంతో భయపడిపోయిన చంద్రశేఖర్.. తాను పోలీసు కానిస్టేబుల్ అని, అమృతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తానని తెలిపాడు. అతని విపరీత చర్యను ఒక బాటసారి కూడా వీడియో తీశాడు. ఈ క్రమంలో భయపడిపోయిన కానిస్టేబుల్ ఆ వీడియో తొలగించాలని కోరాడు. ఇది బయటకు వస్తే తన ఉద్యోగం పోతుందని ప్రాధేయ పడ్డాడు. కాగా, ఘటన జరిగిన రెండు రోజులకు బాటసారి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది వైరల్‌గా మారింది. దీంతో గమనించిన అధికారులు హెడ్ కానిస్టేబుల్‌ను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో కలకలంగా మారింది. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
నిత్యపెళ్లికొడుకు లీలలు; నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోలీస్ శాఖలో నిత్య పెళ్లికొడుకు ఆరాచకాలు బట్టబయలయ్యాయి. సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అప్పలరాజు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఇప్పటికి నలుగురు మహిళలను పెళ్లిచేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకొని అయిదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. వీరిలో పద్మ అనే మహిళకు నాలుగు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. తాజాగా మరో మహిళ కానిస్టేబుల్‌తో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన పద్మ నిత్య పెళ్లిళ్ల నిర్వాకంపై కానిస్టేబుల్ అప్పలరాజును నిలదీసింది. కానిస్టేబుల్ అప్పలరాజుపై దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులతోపాటు మహిళ చేతన స్వచ్చంధ సంస్థ కూడా స్పందించింది. సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు బండారం బయటపెట్టి, మోసపోయిన మహిళాలకు అండగా ఉంటామని మహిళ చేతన చైర్పర్సన్ కత్తి పద్మ తెలిపారు. కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. -
రైలు డ్రైవర్‌కు గుండెపోటు.. తప్పిన పెను ప్రమాదం
తాడేపల్లి రూరల్: విధుల్లో ఉన్న డ్రైవర్‌కు గుండెపోటు రావడం, అదే సమయంలో సిగ్నల్ పడడం, సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పడమే కాకుండా డ్రైవర్ ప్రాణాలు సైతం నిలిచాయి. శుక్రవారం కృష్ణాకెనాల్ జంక్షన్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..గుంటూరు నుంచి విజయవాడ వెళుతున్న గూడ్స్ రైలు కృష్ణా కెనాల్ జంక్షన్లో 5వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీద సిగ్నల్ కోసం వేచి ఉంది. ఆ రైలు నడుపుతున్న డ్రైవర్ జె.హరికుమార్కు గుండెనొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. మరో డ్రైవర్ గూడ్స్‌రైలు కిందకు దిగి చెక్ చేసుకుంటూ ఆ విషయాన్ని గమనించలేదు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ డి.రాజు ఈ విషయాన్ని గమనించి వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా డ్రైవర్‌ను రైలులో నుంచి దించి రెస్ట్రూమ్కు తీసుకెళ్లారు. 108 రాకపోవడంతో ఆటోలో వెంటనే అతడిని తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించారు. అతడికి గుండెపోటు వచ్చిందని, మరో 30 నిమిషాలు ఆలస్యమైతే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవీ చదవండి: గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. -
రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు
ముప్పాళ్ళ: జిల్లాలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడైన శశికృష్ణను పట్టుకోవటంలో హెడ్ కానిస్టేబుల్ చాకచక్యం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. హత్యానంతరం పరారైన నిందితుడు నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సమీపంలో ఉన్నట్టుగా ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ముప్పాళ్ల, నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముప్పాళ్లలో స్టేషన్ విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ మహ్మద్‌రఫీ తన స్వగ్రామం కూడా పక్కనే ఉన్న పమిడిపాడు కావటంతో హుటాహుటిన నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరారు. చదవండి: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ ములకలూరు పొలాల్లో ఉన్నట్లుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించే క్రమంలో నిందితుడు తనవద్ద నున్న కత్తితో చేతిపైన, గొంతుపైన గాయపరుచుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. హెడ్‌కానిస్టేబుల్ రఫీని కూడా కత్తితో బెదిరించాడు. అయినా రఫీ వెనుకడుగు వేయకుండా చాకచక్యంగా తోటి సిబ్బంది సాయంతో నిందితుడిని వెనుకవైపుగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రఫీని ఇన్చార్జ్ డీఐజీ రాజశేఖర్, రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ, అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, అదనపు ఎస్పీ రిశాంత్‌రెడ్డితో పాటు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, రూరల్ సీఐ నరసింహారావు ఫోన్లో అభినందించారు. ఇది మా స్టేషన్‌కే గర్వకారణమని ఎస్సై ఎమ్.పట్టాభిరామయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఇవీ చదవండి: హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. -
భార్యకు అడ్డంగా దొరికిన ‘హెడ్డు’ .. ఏంచేశాడంటే..
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): మరో మహిళతో కలిసి ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్‌ను భార్య పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పాల్వంచలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..కొత్తగూడెం 6వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ గడ్డం రాజేష్ పాల్వంచ బొల్లేరుగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు పదేళ్ల క్రితం స్వప్నతో వివాహం జరగగా, ఆరేళ్ల పాప ఉంది. అనంతరం వీరి నడుమ విబేధాలు తలెత్తడంతో కేసులు కోర్టు పరిధిలో నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా రాజేష్ వేరే మహిళతో ఉంటున్నాడనే సమాచారంతో గురువారం స్వప్న మహిళా సంఘం నాయకులతో కలిసి బొల్లేరుగూడెంలోని ఇంటికి చేరుకోగా..ఇద్దరూ కలిసి ఉండగా పట్టుకుంది. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ..గతంలో తనను చిత్రహింసలు పెట్టగా అధికారులు సస్పెండ్ చేశారని తెలిపింది. అయినా ఇప్పుడు మరో మహిళతో ఉన్నాడని తెలుసుకుని వచ్చానని చెప్పింది. ఈమేరకు స్వప్న ఫిర్యాదుతో రాజేష్‌తో పాటు ఆయనతో కలిసి ఉన్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జె.ప్రవీణ్ తెలిపారు. -
దొంగోడి అవతారమెత్తిన మహిళా హెడ్ కానిస్టేబుల్..!
ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బండి కాగితాలు ఏది లేకున్నా.. ఫైన్ కట్టు లేదా బండిని సీజ్ చేస్తామంటారు పోలీసులు. తర్వాత సీన్ సీజ్ చేసిన బండికి రక్షణ.. గాల్లో దీపం పెట్టి.. దేవుడా నీవే దిక్కు అన్న చందంగా తయారవుతుందనేది తెలిసిన సంగతే. ముంబై: మహారాష్ట్రలోని వసాయి పోలీస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్‌గా పని చేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్ సీజ్ చేసిన వాహనాలను అమ్ముకుంటూ పట్టుపడింది. దీనికి సంబంధించి వసాయి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించారు. వివరాల్లోకి వెళితే.. మహిళా హెడ్ కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్ వసాయి పోలీస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్‌గా పని చేస్తోంది. అయితే వివిధ కారణాలపై సీజ్ చేసిన వాహనాలను, వస్తువులను, నగదుకు సంబంధించి వివరాలు నమోదు చేసుకోవడం ఆమె బాధ్యత. కానీ ఓ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా వాహనాలను, వస్తువులను భేరానికి పెట్టి విక్రయిస్తోంది. ఈ విషయంపై పలు ఆరోపణలు రావడంతో పోలీసులు రెక్కీ నిర్వహించి, స్క్రాప్ డీలర్ ముస్తాక్‌కు విక్రయించే సమయంలో గైక్వాడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు రూ. 26 లక్షల విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. స్క్రాప్ డీలర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలపై మార్చి 12న హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. ఆమెపై వసాయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ కార్పే తెలిపారు. -
కేబీఆర్ పార్క్ వద్ద విషాదం.. మార్నింగ్ వాక్కు వచ్చి
సాక్షి, హైదరాబాద్: కేబీఆర్ పార్క్ వద్ద విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్కు వచ్చిన ఓ కానిస్టేబుల్ హఠాత్తుగా మరణించాడు. ఆ వివరాలు.. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్‌కోసం పార్క్‌కుకి వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడున్నవారు 108కి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపే అతడు మరణించాడు. సూర్యనారాయణ సీఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్‌ను విజయ్ కుమార్‌గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. -
రైతు భూమిపై ధర్మవరం హెడ్‌కానిస్టేబుల్ కన్ను.. కాదనడంతో
ధర్మవరం టౌన్(అనంతపురం): పొలం అమ్మి అప్పులు తీర్చుకోవాలనుకున్న రైతు కుటుంబం పట్ల ఓ హెడ్ కానిస్టేబుల్ కర్కశంగా వ్యవహరించాడు. ఆ పొలం తనకే అమ్మాలంటూ జులుం చేశాడు. కాదన్న పాపానికి తండ్రీకొడుకులను నిర్బంధించి హింసించాడు. వేధింపులు తాళలేక చివరకు రైతు కుటుంబం ‘సాక్షి’ ఎదుట గోడు వెళ్లబోసుకుంది. ధర్మవరం మండలం వెంకటతిమ్మాపురానికి చెందిన రైతు రవీంద్రరెడ్డికి దర్శినమల గ్రామ పరిధిలో 10 ఎకరాల పొలం ఉంది. గతంలో తీవ్ర వర్షాభావంతో బోరుబావి ఎండిపోయి, చీనీ చెట్ల సాగులో తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తనకున్న పొలంలో 3.58 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఎకరాకు రూ.3.58 లక్షలు బేరం కుదిరి వేరొకరికి పొలం విక్రయించాడు. హెడ్‌కానిస్టేబుల్ కన్ను రైతు అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ పూజారి పుల్లప్ప... ఆ పొలాన్ని ఎకరా రూ.2 లక్షలతో తనకే అమ్మాలని రైతుపై ఒత్తిడి తీసుకెళ్లాడు. తనకు కాకుండా ఇతరులకు పొలం అమ్మితే కేసులు బనాయిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇందుకు రైతు రవీంద్రరెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రవీంద్రరెడ్డి, అతని కుమారుడు మారుతీరెడ్డిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని చావబాదాడు. చివరకు బయటకు విడుదల చేసేందుకు రూ.30వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో తమ వద్ద ఉన్న రూ.5వేలను అప్పటికప్పుడు ఫోన్‌పే ద్వారా కానిస్టేబుల్ ఖాతాకు మార్చి, మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తామంటూ తండ్రీకొడుకులు బయటకు వచ్చారు. కానిస్టేబుల్ బారి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ బాధిత రైతులు వాపోయారు. కాగా, రైతు ఆరోపణలు అవాస్తమంటూ హెడ్ కానిస్టేబుల్ పుల్లప్ప కొట్టిపాడేశారు. అయితే ఘటనకు సంబంధించి బాధిత రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామంటూ డీఎస్పీ రమాకాంత్ స్పష్టం చేశారు. -
పేరెంట్స్‌కు కరోనా.. ఒంటరైన చిన్నారి..ఒక్క ఫోన్ కాల్‌తో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేసులు రోజురోజుకి అధికమవుతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వైరస్ బారినపడి దేశ రాజధానిలో ఇప్పటివరకు 19 వేల మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. ఈక్రమంలోనే మాతృ దినోత్సవం రోజున ఢిల్లీలో ఓ హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. జీటీబీ నగర్‌లోని రేడియో కాలనీలో నివసిస్తున్న భార్యభర్తలకు కోవిడ్ సోకగా, వారి ఆరునెలల బేబీకి నెగెటివ్ వచ్చింది. అయితే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో లాక్డౌన్ అమలులో ఉండటంతో వారి బంధులు బేబీ సంరక్షణ కోసం రావడానికి వీలుకాలేదు. తమ బిడ్డను చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే సమయంలో మీరట్‌కి చెందిన వీరి బంధువు ఒకరు ఈ విషయాన్ని షాహదారా డీసీపీ కార్యాలయంలో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ రాఖీ దృష్టికి ఫోన్ ద్వారా తీసుకొచ్చారు. ఆ భార్యాభర్తలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సత్వరమే స్పందించిన రాఖీ.. సీనియర్ పోలీస్ అధికారులకు సమాచారం అందించి జీటీబీ నగర్‌కు చేరుకుంది. జాగ్రత్తగా ఆ బేబీని ఉత్తరప్రదేశ్‌లోని మోడీ నగర్లో నివసిస్తున్న అమ్మమ్మకు అప్పగించింది. ఇక హెడ్ కానిస్టేబుల్ రాఖీ సాయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. తల్లి మనసు మరో మహిళకే తెలుస్తుందని కామెంట్లు చేస్తున్నారు. -
బాప్రే.. రేవ్ పార్టీలో మహిళా పోలీసు
యశవంతపుర: చట్టాన్ని కాపాడాల్సినవారే అతిక్రమించారు. కర్ణాటకలో హాసన్ జిల్లాలో జరిగిన రేవ్ పార్టీలో కొందరు పోలీసులు కూడా మజా చేసినట్లు సమాచారం. ఇటీవల ఆలూరు తాలూకాలో ఒక రిసార్టులో పెద్దఎత్తున రేవ్ పార్టీ జరిగింది. ఇది తెలిసి పోలీసులు దాడి చేసి 130 మందిని అదుపులోకి తీసుకుని పదుల సంఖ్యలో కార్లను సీజ్ చేశారు. ఇందులో శ్రీలత అనే మహిళా పోలీసు కూడా ఉన్నారు. ఆమె మంగళూరు జిల్లాలో క్రైం విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రేవ్ పార్టీలో పాల్గొనడానికి సెలవు పెట్టి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలతను సస్పెండ్ చేసినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. మరికొందరు పోలీసులపై వేటు పడే అవకాశముంది. ‘తన కుమారుడితో కలిసి ఆమె రేవ్ పార్టీకి వెళ్లారు. పోలీసులు సోదాలు జరిపినప్పుడు ఆమె తన అధికారాలను దుర్వినియోగం చేశారు. నగర క్రైం విభాగంలో పనిచేస్తున్నానని కూడా స్వయంగా చెప్పార’ని మీడియాకు కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. కాగా, కరోనా భయంతో రాష్ట్రం అల్లాడుతుంటే కొంతమంది బాధ్యతారహితంగా జల్సాలు చేయడం పట్ల జనం మండిపడుతున్నారు. ఈనెల 10న ఆలూరు తాలూకా పరిధిలోని రిసార్ట్‌లో ఈ రేవ్ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారికిలో బెంగళూరు, మంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మద్యం, నిషేధిత మత్తు పదారార్థాలతో పాటు 50 టూవీలర్లు, 20 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వాహనాలపై అత్యవసర సర్వీసుల సిక్టర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా యువకులను రేవ్ పార్టీకి ఆహ్వానించారని, లోకేషన్‌ను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారని వెల్లడించారు. రిస్టార్ యజమాని గగన్‌ను అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించామని, ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఇక్కడ చదవండి: కరోనా ఉగ్రరూపం; లాక్డౌన్ ఉండదన్నా సొంతూళ్లకు.. విజృంభిస్తున్న కరోనా: కర్ణాటకలో నిమిషానికి 10 కొత్త కేసులు -
హెడ్‌కానిస్టేబుల్ కూతురుకు అరుదైన గౌరవం
సాక్షి, రాయదుర్గం: కొండాపూర్‌లోని టీఎస్ఎస్పీ 8వ బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ లింగంగారి జనార్దన్ కూతురు లింగంగారి త్రిషకు అరుదైన గౌరవం లభించింది. దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న 17 రాష్ట్రాల ఎన్సీసీ కాడెట్స్ నుంచి బ్యానర్ ఆఫ్ ఆలిండియా బెస్ట్ డైరెక్టర్‌గా ఎంపికైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్‌కు దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ఆర్డీ బ్యానర్, బెస్ట్ పీఎం ర్యాలీ ట్రోఫీని డీడీజీ ఎయిర్ కమెడోర్ కృష్ణణ్, సీనియర్ వింగ్ ఆర్మీ సీనియర్ అండర్ ఆఫీసర్ లింగంగారి త్రిష అందుకున్నారు. ఆమె ఎన్సీసీ బెటాలియన్ 7(టి) బాలిక విభాగం సెయింట్ మార్టిన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలు ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. అద్భుత ప్రతిభ చాటిన విద్యార్థి మియాపూర్‌లోని సెయింట్ మార్టిన్స్ కళాశాల చైర్మన్ జైకిషన్, ఉపాధ్యాయులు అభినందించారు. అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ స్థాయిలో ట్రోఫీని ప్రధాని చేతులమీదుగా పొందడం గర్వంగా ఉందన్నారు. -
నంద్యాల సీఐ, కానిస్టేబుల్ల బెయిల్ రద్దు
సాక్షి, కర్నూలు జిల్లా: అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్ల బెయిల్‌ను నంద్యాల కోర్టు రద్దు చేసింది. అబ్దుల్ సలాం కేసులో ప్రభుత్వం తరపున ఏపీ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్న నంద్యాల కోర్టు.. ఆయన మాటలకు ఏకీభవించింది. దాని ప్రకారం సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ల బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీసీ సెక్షన్ 306ను అమలు పరుస్తూ బెయిల్ రద్దు చేసినట్లు కోర్టు వెల్లడించింది. డిసెంబర్ 2 వ తేదీ లోగా నంద్యాల జిల్లా కోర్టులో హాజరు కావాలని సీఐ సోమశేఖర్ రెడ్డిని, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లని నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి మొక సువర్ణ రాజు ఆదేశించారు. ( సెల్ఫీ వీడియో: అందుకే చనిపోతున్నాం.. ) అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన గూడ్స్ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. దీంతో బెటాలియన్స్ ఐజీ శంకబ్రతబాగ్జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ హఫీజ్‌ను విచారణాధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసందే. ఈ కేసులో కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను అరెస్ట్ చేశారు. -
మూడు నెలల్లో 76 మంది పిల్లల్ని....
సాక్షి, న్యూఢిల్లీ: తెలిసీ తెలియక, క్షణికావేశంతోను, కుటుంబ సభ్యులు వేధింపులు తట్టుకోలేక చాలామంది పిల్లలు ఇంటినుంచి పారిపోతూ ఉంటారు. అలా తప్పిపోయిన చిన్నారులను, బాలలను తిరిగి తమ ఇంటికి చేర్చిన ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో అటు ఉద్యోగరీత్యా ప్రోత్సాహకాలతోపాటు, విధి నిర్వహణలో ఒక మహిళగా తల్లి మనసు చాటుకున్నారంటూ నెటిజనుల ప్రశంసలుకూడా అందుకున్నారు. తప్పిపోయిన చిన్నారులను, కాపాడినందుకు ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకున్నారు. 12 నెలల్లో 76 మంది పిల్లలను కనిపెట్టినందుకుగాను సీమా ధాకా ఔట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ అందుకున్నారు. వారిలో 56 మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. దీంతో అసాధారణ్ కార్యా పురస్కర్ అవార్డుకు సీమాను ఎంపిక చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న 50లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలను (వీరిలో కనీసం 8 సంవత్సరాల లోపు చిన్నారులండాలి)12 నెలలో వ్యవధిలో రక్షించే ఏ కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్‌కు ప్రోత్సాహక పథకం కింద అవుట్-టర్న్ ప్రమోషన్ ఇవ్వనున్నట్టు పోలీసు విభాగం ఆగస్టు 7న ప్రకటించింది. దీంతో రికార్డుస్థాయిలో పిల్లలను కాపాడి ఈ పురస్కారాన్ని అందుకోనున్న మొదటి పోలీసుగా సీమా నిలిచారు. దీంతో పాటు ఇతర అదనపు ప్రోత్సాహకాలను మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాస్తవ ప్రకటించారు. కేవలం 3 నెలల్లో 56 మంది పిల్లలను కాపాడిన సీమాకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. కేవలం ఢిల్లీనుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ పిల్లలను రక్షించామని సీమా చెప్పారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, పానిపట్, బిహార్ నుంచి తదితరులను కాపాడినట్టు తెలిపారు. 2018లో ఒక మహిళ తన ఏడేళ్ల కుమారుడి తప్పిపోయిన ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆ మహిళ తన చిరునామాను, మొబైల్ నంబర్‌ను మార్చేశారు. దీంతో ఆమెను గుర్తించడం చాలా కష్ట మైందన్నారు. చివరకు 2020 అక్టోబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని తల్లి వద్దకు చేర్చినట్టువెల్లడించారు. అలాగే సవతి తండ్రి హింస, వేధింపులను తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయిన ఒక బాలుడు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా లేడంటూ తన అనుభవాలను పంచుకున్నారు సీమా. కాగా సీమా జూలై 3, 2006 న ఢిల్లీలోపోలీసు ఉద్యోగంలో చేరారు. ఆమె 2014 లో పదోన్నతి పొంది హెడ్ కానిస్టేబుల్ అయ్యారు. 2012 వరకు అక్కడే పనిచేసిన ఆమెను 2012 లో బయటి జిల్లాకు, అక్కడి నుంచి రోహిణికి, తరువాత బయటి-ఉత్తర ప్రాంతానికి బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు -
గన్ మిస్‌ఫైర్ : హెడ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, కర్నూలు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గన్ మిస్‌ఫైర్ అయి విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఉదయం కర్నూలు సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ సీఐజీ గార్డు సాల్మన్ రాజు విధుల్లో ఉండగా గన్ మిస్‌ఫైర్ అయింది. పెద్ద శబ్ధం రావటంతో సహోద్యోగులు వెళ్లి చూడగా సాల్మన్ రాజు ఒంటినిండా రక్తంతో నేలపై కూర్చుని కనిపించారు. అతడి శరీరంలోకి బుల్లెట్ దిగిందని గుర్తించిన వారు ఆసుపత్రికి తరలించే లోపే అక్కడికక్కడే మరణించారు. అయితే గన్ మిస్‌ఫైర్ అయ్యిందా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న వివరాలు తెలియరావాల్సి ఉంది. -
ఎస్పీపై హెడ్ కానిస్టేబుల్ ఫైర్
సాక్షి, ఒంగోలు: ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ప్రకాశం పోలీసు శాఖలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో రైటర్‌గా పనిచేస్తూ తాజాగా కొమరోలు పోలీసుస్టేషన్‌కు బదిలీ అయిన సుబ్బారావు స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. సుబ్బారావు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, పబ్లిక్‌తో దురుసుగా వ్యవహరించారంటూ ఏకంగా 38 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారించి చర్యలు తీసుకుంటే సంతోషిస్తాంగానీ ఆరోపణలపై ఎటువంటి విచారణ జరపకుండానే ఏకంగా తమను దొంగలుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఎస్పీని హెడ్ కానిస్టేబుల్ సూటిగా ప్రశ్నించారు. తాము విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. కనీసం హెచ్చరిక కూడా చేయకుండానే ఏకంగా బదిలీ వేటు వేయడం అంటే పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా ఉందన్నారు. ఇటీవలే తన భార్య చనిపోయిందని, తాను రెండో వివాహం చేసుకున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో బదిలీ చేయడం సమంజనం కాదన్నారు. మానసికంగా బాధపడే ఒక అధికారి ఎస్పీకి ఇచ్చే సలహాలతో నేడు జిల్లాలోని పోలీసు సిబ్బంది మొత్తం బాధపడుతున్నారని హెడ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో తన గురించి కథనాలు రావాలన్న ఎస్పీ కోరికకు సిబ్బంది బలవుతున్నారన్నారు. ఇలాగే కొనసాగి రామాంజనేయులులా తామూ ఆత్మహత్య చేసుకోవాలా..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీడియాతో మాట్లాడడం తప్పో.. ఒప్పో తనకు తెలియదని, ఒక వేళ ఏదైనా చర్య తీసుకున్నా అది తన వరకే పరిమితమై మిగిలిన వారు సంతోషంగా ఉంటే అదే చాలన్నారు. ఒంగోలు టూటౌన్ సీఐ విజ్ఞప్తి హెడ్ కానిస్టేబుల్ ఒకరు మీడియాతో మాట్లాడుతున్నారని తెలియగానే టూటౌన్ సీఐ ఎం.రాజేష్ హుటాహుటిన కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. సుబ్బారావుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌కు రావాలని కోరారు. అరెస్టు చేస్తానంటే చెప్పండి వస్తా..అంటూ ఆయన సీఐని కోరారు. ఇదే సమయంలో ట్రాఫిక్ డీఎస్పీ నుంచి కూడా పిలుపు రావడంతో సుబ్బారావు డీఎస్పీ వద్దకు వెళ్లి తనకు ఎస్పీ అంటే గౌరవం ఉందని, అయితే అవినీతిపరులంటూ ముద్రవేసి బదిలీ చేయడం మాత్రమే తమను ఆవేదనకు గురిచేసిందంటూ వివరించారు. సుబ్బారావును సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఒంగోలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో రైటర్‌గా పనిచేస్తూ ప్రజలతో అనుచిత ప్రవర్తనతో పాటు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్ వి.సుబ్బారావు సర్వీస్ రిజిస్టర్‌ను పరిశీలించామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రెండు క్రిమినల్ కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడని, అతని అనుచిత ప్రవర్తన, విధుల పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా ఇప్పటికే మూడు సార్లు సస్పెండ్ అయ్యారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం సుబ్బారావును సస్పెండ్ చేసి ఆయనపై ఎంక్వయిరీ వేశామని, విచారణలో వచ్చే నివేదిక ఆధారంగా శాఖాపరమైస చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజారక్షణ కోసం ప్రకాశం పోలీస్ నిరంతరం పనిచేస్తోందని, ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా విధులు నిర్వహిస్తోందంటూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. -
రౌడీ అటాక్.. హెడ్ కానిస్టేబుల్ హత్య
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో రౌడీని పట్టుకునే క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఆ రౌడీ నాటుబాంబుల్ని విసరడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సాత్తాన్‌కులం లాకప్‌లో తండ్రి జయరాజ్, తనయుడు ఫిలిప్స్‌లో మరణంతో తూత్తుకుడి జిల్లా పోలీసులు తలెత్తలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ కేసు సీఐ విచారణలో ఉంది. ఈసమయంలో తూత్తుకుడి పోలీసులు తలెత్తుకునే రీతిలో, పోలీసులపై సానుభూతి పెరిగే ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రౌడీని పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్‌కానిస్టేబుల్ హత్యకు గురి కావడాన్ని తూత్తుకుడి వాసులు తీవ్రంగా పరిగణించారు. నాటుబాంబు దాడి.. తూత్తుకుడి జిల్లా వెలనాడుకు చెందిన దురైముత్తుపై శ్రీవైకుంఠం, మెరప్పనాడు పోలీసు స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయి. ఇటీవల జరిగిన జంటహత్య కేసులోనూ దురైముత్తు నిందితుడు కావడంతో అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగానే వేటసాగిస్తూ వచ్చారు. ఎస్ఐ మురుగపెరుమాల్కు అందిన సమాచారంతో వెలనాడు అటవీ గ్రామంలో దురైముత్తు కోసం వేట మొదలెట్టారు. పోలీసుల్ని చూసిన దురైముత్తు, అతడి అనుచరులు ఉడాయించారు. ఈ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ సుబ్రమణ్యన్ సాహసం ప్రదర్శించాడు. అతడ్ని పట్టుకునేందుకు సినీ తరహాలో దూసుకెళ్లాడు. వెంటాడి మరీ పట్టుకునే సమయానికి దురైముత్తు ఎదురుదాడి చేశాడు. తన వద్ద ఉన్న నాటుబాంబును సుబ్రమణ్యన్‌పై వేయడంతో అది పేలింది. తీవ్రంగా హెడ్ కానిస్టేబుల్ గాయపడడంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. తీవ్రంగా పరిగణన.. తీవ్రంగా గాయపడ్డ సుబ్రమణ్యన్‌ను ఆస్పత్రికి తరలించగా మరణించాడు. దీంతో ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ జయకుమార్ రంగంలోకి దిగారు. దురైముత్తును పట్టుకునేందుకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన గురించి ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐకు అందిన సమాచారంతో హెడ్‌కానిస్టేబుల్ సుబ్రమణ్యన్ నేతృత్వంలో నలుగురు పోలీసులు రౌడీ ముఠాను పట్టుకునేందుకు వెళ్లారని, ఈ క్రమంలో నాటుబాంబుతో ఆ రౌడీ దాడిచేసి తప్పించుకున్నాడని, కేసును తీవ్రంగా పరిగణించామన్నారు. ఆ రౌడీని పట్టుకుని తీరుతామని, కేసు విచారణలో ఉన్నట్టు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి స్పందిస్తూ, ఓ రౌడీని పట్టుకునే క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ బలయ్యారని, ఘటన గురించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఎస్పీ జయకుమార్, కలెక్టర్ సందీప్ నండూరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హెడ్‌కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన శ్రీవైకుంఠం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి సీఎం ఎడపాడి రూ.50 లక్షలు ప్రకటిస్తూ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. -
సమయస్ఫూర్తితో రక్షించాడు
ఆలమూరు (కొత్తపేట): పదహారో నంబర్ జాతీయ రహదారిలోని ఆలమూరు గౌతమీ గోదావరి వృద్ధ వంతెనపై నుంచి ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిన యర్రా రమేష్‌ను ఆలమూరు పోలీసుస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జి.ప్రభాకర్ రక్షించారు. స్థానికుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలంలోని అంగరకు చెందిన రమేష్ రావులపాలెం నుంచి తిరుగు జొన్నాడ వైపు బైక్‌పై వస్తున్నాడు. అంతలోనే బైక్ వృద్ధ వంతెనపై ఉండగా రమేష్ మాత్రం గోదావరిలో పడిపోయి రక్షించండి అంటూ హాహాకారాలు చేస్తున్నాడు. అదే సమయంలో కొత్త వంతెనపై రావులపాలెం వైపు వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ గమనించి రమేష్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. ఆ దారిన వెళుతున్న లారీని ఆపి అందులో ఉన్న తాడును తీసుకుని ప్రయణికుల సాయంతో గోదావరిలో కొట్టుకుపోతున్న రమేష్‌కు అందించారు. దీంతో ఆ యువకుడు ఆ తాడు సాయంతో అతి కష్టంపై పైకి చేరుకున్నాడు. రక్షించిన హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్‌తో పాటు ప్రయాణికులకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్.శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన హెడ్ కానిస్టేబుల్‌ను అభినందించాడు. మెరుగైన చికిత్స కోసం రమేష్‌ను రావులపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. గోదావరిలో ఎలా పడిపోయాడో.. అంగరకు చెందిన రమేష్ గౌతమీ గోదావరిలో ఎలా పడిపోయాడనే విషయంపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. వృద్ధ గౌతమీ వంతెన మధ్యలో బైక్‌ను ఆపి గోదావరి అందాలను తన సెల్ఫోన్లో బంధించేందుకు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిపోయాడని కొందరు చెబుతున్నారు. వృద్ధ వంతెన మధ్యలోకి వచ్చే సరికి బైక్‌లో ఉన్న ఇంధనం అయిపోతే తెచ్చుకునేందుకు వాహనం కోసం ఎదురు చూస్తూ రెయిలింగ్‌పై కూర్చొని ప్రమాదవశాత్తూ పడిపోయారని మరి కొంతమంది వాదనగా ఉంది. బైక్ గోతిలో పడడంతో రమేష్ అదుపు తప్పి ప్రమాదవశాత్తూ గోదావరిలో పడిపోయాడని ఆలమూరు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా గోదావరిలో పడిపోయిన వ్యక్తి ప్రాణాలతో బయటపడడంతో కుటుంబసభ్యులు, స్థానికుల్లో ఆనందాన్ని నింపింది. -
మాకే అడ్డొస్తారా ఎంత ధైర్యం ?
సాక్షి, దుబ్బాక : ఓ గొడవలో పోలీసుల జోక్యం వ్యక్తి మృతికి కారణమైంది. విచారణ నిమిత్తం వచ్చిన తమకే అడ్డు వస్తారా అని హెడ్‌కానిస్టేబుల్ బూటు కాలితో తన్నడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోలు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గజ్వేల్‌లోని ఓ సామిల్లో పనిచేసే రాయపోలు మండల కేంద్రానికి చెందిన తుప్పతి యాదగిరి గురువారం రాత్రి యథావిధిగా పనికి వెళ్లాడు. కాగా, వారి ఇంటిపక్కన ఉన్న కృష్ణ అర్ధరాత్రి దాటిన తర్వాత యాదగిరి ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన యాదగిరి భార్య అతన్ని కోపగించుకుని పంపించేసింది. అయితే తనపై అఘాయిత్యం చేసేందుకు రాత్రి కృష్ణ వచ్చాడని శుక్రవారం ఉదయం ఆమె బావ గౌరయ్య (45)కు తెలిపింది. దీంతో తన తమ్ముడి భార్య పట్ల కృష్ణ ప్రవర్తనపై కోపగించుకున్న గౌరయ్య, తమ్ముడు యాదగిరికి ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు. ఇద్దరూ కలసి కృష్ణ ఇంటికి వెళ్లగా అతను ఇంట్లోనే తలుపులు వేసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే స్థానిక హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, హోంగార్డు సంతోష్‌లు అతని ఇంటికి వెళ్లి కృష్ణను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన యాదగిరి, గౌరయ్యలు పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు. హెడ్‌కానిస్టేబుల్ యాదగిరి తమకు అడ్డుగా వస్తారా.. అంటూ ఆగ్రహంతో బూటుకాలితో గౌరయ్య పొట్టపై పలుమార్లుతన్నాడు. కిందపడిపోయిన గౌరయ్యను స్థానికులు ప్రాథమికారోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు గౌరయ్య మృతిచెందాడని ధ్రువీకరించారు. పోలీస్‌స్టేషన్ ఎదుట స్థానికుల ఆందోళన గౌరయ్య మృతికి పోలీసు కానిస్టేబుల్ యాదగిరే కారణమంటూ మృతదేహంతో స్థానికులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. గ్రామస్తులు గంటకు పైగా ధర్నా చేయడంతో గజ్వేల్–రామాయంపేట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. గజ్వేల్, హుస్నాబాద్ ఏసీపీలు నారాయణ, మహేందర్‌లతో పాటు పలువురు సీఐలు, దాదాపు 10 పోలీసుస్టేషన్లకు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఓ దశలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఏసీపీలు గ్రామపెద్దలతో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
నిర్మల్ జిల్లా: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తుపాకీ మిస్‌ఫైర్
-
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తప్పిన ప్రమాదం
సాక్షి, నిర్మల్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్‌గౌడ్ అనే వ్యక్తి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆదివారం కార్యాలయంలో తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో పొరపాటున ట్రిగ్గర్ తగిలి మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ శంకర్‌గౌడ్ చాతి భాగం నుంచి బయటకు దూసుకెళ్లింది. గాయపడిన శంకర్ గౌడ్‌ను నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
తుపాకీ మిస్‌ఫైర్
-
రతన్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. కోటి రూపాయలతోపాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. అల్లర్లలో మృతి చెందిన రతన్ లాల్‌ను అమరవీరుడిగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో సోమవారం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ఈ దాడిలో ప్రాణాలు విడిచారు. బుల్లెట్ గాయం వల్లే ఆయన చనిపోయాడని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది.(ముస్లిం కుటుంబాన్ని కాపాడిన బీజేపీ కౌన్సిలర్) ఈ నేపథ్యంలో రతన్లాల్ను అమర వీరుడిగా ప్రకటించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరవీరుడి ఆత్మకు శాంతిని చేకూరాలని కోరుతూ రతన్‌లాల్ భార్యకు లేఖ రాశారు. ‘రతన్‌లాల్ ధైర్యశాలి, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ధీరోదాత్తుడు. దేశ సేవలో తన ప్రాణాలనే అర్పించిన వీర సైనికుడు’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. (సీఏఏ రగడ : హెడ్ కానిస్టేబుల్ మృతి) (ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ) -
ఠాణాలో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఓ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన పంతం లచ్చాగౌడ్ (57) మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో మూడేళ్లుగా హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం 10 గంటలకు సెక్షన్ ఇన్చార్జిగా విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డ్యూటీ లేకున్నప్పటికీ స్టేషన్‌కు వచ్చి సహచరులతో కొద్దిసేపు మాట్లాడారు. 2.30 గంటల ప్రాంతంలో స్టేషన్ వెనుక భాగంలో ఉన్న బ్యారక్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎస్పీ శ్వేత ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. లచ్చాగౌడ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పని ఒత్తిడా..?, లేక వ్యక్తిగత సమస్యలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, లచ్చాగౌడ్ 1990లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ పోలీస్‌స్టేషన్‌లో చాలాకాలం పనిచేశాడు. ఆ తర్వాత దాదాపు 21 సంవత్సరాలు రైల్వేశాఖలో విధులు నిర్వహించాడు. కొంతకాలం నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసి 2017 ఫిబ్రవరి నుంచి మాచారెడ్డి పీఎస్‌లో పనిచేస్తున్నాడు. 2015లో హెడ్‌కానిస్టేబుల్ ప్రమోషన్ పొందాడు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల ఆందోళన అందరితో కలివిడిగా ఉంటూ అప్యాయంగా పలకరించే లచ్చగౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. పోలీస్టేషన్‌కు తరలివెళ్లి లచ్చాగౌడ్ మృతదేహాన్ని చూడనివ్వాలని పట్టుబడ్డారు. పోలీసులు అంగీకరించక పోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ స్థానికులను సముదాయించి మృతదేహాన్ని కామారెడ్డికి తరలించారు. -
ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ మృతి
ప్రకాశం,చీరాల రూరల్: అనారోగ్యానికి గురై మనస్థాపం చెందిన హెడ్ కానిస్టేబుల్ తన ఇంట్లోనే లుంగీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం వేటపాలెం మండలంలోని కొత్తపేటలో చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్సై కొక్కిలిగడ్డ విజయ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు వేటపాలెం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే కొండె మాధవరావు (48) తన కుటుంబ సభ్యులతో కలసి కొత్తపేటలోని అద్దె గృహంలో నివాసముంటున్నారు. మాధవరావు కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నప్పటికీ వ్యాధుల తీవ్రత తగ్గకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. తన అనారోగ్యం గురించి తోటి సిబ్బంకి నిత్యం చెబుతూ బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో తన లుంగీతో ప్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బజారుకు వెళ్లి తిరిగి వచ్చిన మృతుడి భార్య నాగారపమ్మ జరిగిన సంఘటనను చూసి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఉరికి వేలాడుతున్న మాధవరావును కిందికి దించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిక్షించిన వైద్యులు మాధవరావు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్సై విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి భార్య వద్ద వివరాలను సేకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త మృతి చెందడంతో భార్య నాగారపమ్మ బీటెక్, ఇంటర్మీడియట్ చదివే అతని ఇద్దరు కుమారులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకింక దిక్కెవ్వరంటూ వారు చేసిన రోధనలు మిన్నంటాయి. -
పదోన్నతుల్లో ఇష్టారాజ్యం
సాక్షి, అమరావతి బ్యూరో : ఏలూరు రేంజ్ పరిధిలో ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్లగా పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియార్టీతో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా పదోన్నతులు కల్పించారు. 1983 బ్యాచ్‌కు 2017లో ప్రమోషన్లు రాగా.. 1990 బ్యాచ్‌కు చెందిన వారికి మాత్రం 2014లోనే పదోన్నతులు రావడం విశేషం. కాగా రేంజ్ పరిధిలో 1983, 84 బ్యాచ్‌లకు చెందిన 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు మాత్రం నేటికీ పదోన్నతికి నోచుకోకపోవడం విడ్డూరం. మొత్తం మీద రేంజ్ పరిధిలో 134 మంది అర్హులుఉన్నప్పటికీ వీరు పదోన్నతులకు దూరంగా ఉండిపోవడం గమనార్హం. సీనియార్టీకి మంగళం.. సాధారణంగా ఏ ఉద్యోగికి పదోన్నతి ఇవ్వాలన్నా ముందుగా అతని సీనియార్టీ పరిగణనలోకి తీసుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిన విషయం. కొన్ని పదోన్నతులు ఉద్యోగి అసాధారణ ప్రతిభను ఆధారంగా చేసుకుని కూడా ఇవ్వడం చూశాం. కానీ ఏలూరు రేంజ్ పోలీసు కార్యాలయంలో మాత్రం ఈ రెండింటికి భిన్నంగా నోషనల్ సీనియార్టీ ప్రాతిపదికన ఏఆర్ పోలీసులకు పదోన్నతులు కల్పిస్తూ జూనియర్లను సీనియర్లుగా జాబితాలో చోటు కల్పించారు. తద్వారా అసలైన సీనియర్లకు పదోన్నతి లభించకుండాపోయింది. చక్రం తిప్పిన ఉద్యోగి.. ఏలూరు డీఐజీ రేంజ్ పరిధిలోకి రాజమండ్రి అర్బన్, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, విజయవాడ కమిషనరేట్లు వస్తాయి. వీటి పరిధిల్లో దాదాపు మూడు వేలకుపైగా ఏఆర్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 750 మంది వరకు ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో వివిధ బ్యాచ్‌లకు చెందిన 134 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలు పదోన్నతులు లభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సీనియార్టీ జాబితాను రూపొందించడంలో రేంజ్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి ఒకరు చక్రం తిప్పడంతో చాలా మంది జూనియర్లు ఏఎస్ఐలుగా పదోన్నతులు పొందినట్లు తెలుస్తోంది. 2012, 2013 బ్యాచ్‌కు చెందిన వారు కూడా ఏఎస్ఐలు పదోన్నతులు పొందారంటే రేంజ్ పరిధిలో అక్రమాలు ఏమేరకు జరుగుతున్నాయో స్పష్టమవుతోంది. పదోన్నతులకు 1983 బ్యాచ్ దూరం.. విజయవాడ కమిషనరేట్ పరిధితోపాటు ఏలూరు రేంజ్లో పనిచేస్తున్న 1983 బ్యాచ్‌కు చెందిన సుమారు 20 మందికిపైగా హెడ్‌కానిస్టేబుళ్లు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రేంజ్ పరిధిలో పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితాను రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేంజ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పలువురు హెడ్‌కానిస్టేబుళ్లతో మామూళ్లు తీసుకుని సీనియార్టీ జాబితాను రూపొందించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే 1983 బ్యాచ్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుళ్ల పేర్లకు బదులుగా 1990 బ్యాచ్, ఆ తర్వాత బ్యాచ్ హెడ్‌కానిస్టేబుళ్ల పేర్లను నోషనల్ సీనియార్టీ సాకు చూపి ప్రమోషన్ల జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇదే విషయంపై కమిషనరేట్ పనిచేస్తున్న ఏఆర్ సిబ్బంది గురువారం రాత్రి డీసీపీ కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఏలూరు డీఐజీకి వినతి ప్రతి నెలా మూడో శుక్రవారం పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కోసం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో శుక్రవారం విజయవాడ కమిషనరేట్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుళ్లు ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సీనియార్టీ జాబితా రూపకల్పనలో జరుగుతున్న అన్యాయంపై వివరించగా.. అందుకు ఆయన స్పందిస్తూ రేంజ్ పరిధిలో ఎంతమందికి ఇలా అన్యాయం జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి డీఐజీ హామీ ఇచ్చారు. -
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై మూకదాడి..!
జైపూర్ : రాజస్థాన్‌లోమరో మూక హత్య జరిగింది. విధుల్లో ఉన్న ఓ పోలీస్ హెడ్‌కానిస్టేబుల్‌పై కొందరు దాడిచేసి చంపేశారు. రాజ్‌సమంద్ జిల్లాలోని ఓ భూవివాదంలో విచారణ జరుపుతున్న హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ ఘనీ (48)పై కొందరు శనివారం మూకుమ్మడి దాడిచేశారు. తీవ్రగాయాలతో ఘనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భూ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. మూకహత్యలతో రాజస్తాన్‌లో కలకలం రేగుతున్న సంగతి తెలిసిందే. పశువులను దొంగిలించాడనే కారణంగా గతేడాది రక్బార్‌ఖాన్ (28) అనే వ్యక్తిపై మూకదాడి జరిగింది. తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు విడిచాడు. ఇక 2017లోనూ పెహ్లుఖాన్ అనే మరో వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టిచంపారు. మాంసం కోసం పశువులను తరలిస్తున్నాడనే అనుమానంతో అతనిపై దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. -
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే పేకాట శిబిరం
సాక్షి, కృష్ణలంక (విజయవాడ తూర్పు) : జూదాన్ని అరికట్టాల్సిన ఓ పోలీసు అధికారే తన ఇంట్లోనే పేకాట శిబిరం నిర్వహిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవానీపురం పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ శివప్రసాద్ కృష్ణలంక రాణిగారితోట సిద్దెం కృష్ణారెడ్డి రోడ్డులో నివాసముంటున్నాడు. ఇతను కొంతకాలంగా తన ఇంట్లోనే పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. చుట్టుపక్కల వారు అందించిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఎస్సై అర్జున్, కృష్ణలంక పీఎస్ ఎస్సై సత్యనారాయణ సిబ్బందితో దాడిచేసి పేకాడుతున్న నిర్వాహకుడితో పాటు సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మధిర శ్రీనివాసరావు, రిటైర్ట్ కానిస్టేబుల్ సాయివరప్రసాద్, లంకా రాజశేఖర్, ఏడుకొండలు, వల్లూరు రామారావు, వీర వెంకట సుబ్రమణ్యంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.29,100తో పాటు సెల్ఫోన్లను సీజ్ చేసి అరెస్టు చేశారు. -
సాక్షి సబ్ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్ పిడిగుద్దులు
కరీంనగర్‌క్రైం: సాక్షి దినపత్రికలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు సబ్ ఎడిటర్లను రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పద్మారావు, అతడి కుమారుడు దిలీప్ అకారణంగా అడ్డగించి జులుం ప్రదర్శించారు. ‘ఇది మా ఏరియా.. ఎవరూ రాకుడదు.. నేను పోలీసు..’ అంటూ దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటన కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కరీంనగర్ వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెవుల రాములు, తన్నీరు వెంకటేశ్ తిమ్మాపూర్‌లోని సాక్షి యూనిట్ కార్యాలయంలో సబ్ ఎడిటర్లుగా పని చేస్తూ కరీంనగర్ కోతిరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి కోతిరాంపూర్‌లో ఆఫీసు బస్సు దిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో అతిగా మద్యం సేవించి ఉన్న హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు కుమారుడు దిలీప్, మరో ఇద్దరు బంధువులు ఇంటి బయట ఉన్నారు. రాములు, వెంకటేశ్‌లను అడ్డగించి ‘ఇది మా ఏరియా మీరు ఎవరు.. ఎందుకు వచ్చారు.. అంటూ దబాయించారు. సాక్షి దినపత్రికలో సబ్ ఎడిటర్లుగా పని చేస్తున్నామని, ఆఫీసు నుంచి వస్తున్నామని చెప్పారు. అయినా వినిపించుకోకుండా గుర్తింపు కార్డులు చూపించాలంటూ బెదిరించారు. వెంకటేశ్ గుర్తింపుకార్డు చూపించగా... గుర్తింపుకార్డులు మీకెందుకు చూపించాలని రాములు ప్రశ్నించడంతో దిలీప్ అకారణంగా దూషిస్తూ ‘మా నాన్న పోలీసు’ అంటూ కాలర్ పట్టుకుని దాడి చేశాడు. ఇక్కడ విద్యుత్ స్తంభానికి కట్టేస్తామంటూ కొట్టుకుంటూ అక్కడికి తీసుకుని వెళ్లారు. అదే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు ‘నేను పోలీసును రా ఎవరినైనా తంతా..’ అంటూ నోటికి వచ్చినట్లు దూషించి పిడిగుద్దులు కురిపించాడు. రాములు ప్రాధేయపడినా పట్టించుకోకుండా రాళ్లతో దాడిచేసేందుకు యత్నించారు. రాములు వారి నుంచి తప్పించుకుని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు, అతడి కుమారుడు దిలీప్, మరో ఇద్దరు బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావు తెలిపారు. కాగా, తమపై దాడి జరుగుతున్న విషయాన్ని డయల్ 100కు సమాచారం అందించినా పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ సరిగా స్పందించలేదని బాధితులు తెలిపారు. పైగా హెడ్‌కానిస్టేబుల్ పద్మారావుకు మద్దతుగా మాట్లాడుతూ నీవు ఎందుకు వెళ్లావని నన్నే దబాయించాడని రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలి.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సాక్షి సబ్ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు, అతని కుమారుడు దిలీప్, బంధువులు అకారణంగా దాడి చేయడాన్ని టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. వెంటనే నిందితులపై చర్య తీసుకోవాలని, పద్మారావును విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుని, జర్నలిస్ట్‌కు రక్షణ కల్పించాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంఘం బాధ్యులు వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావును కలిసి విజ్ఞప్తి చేశారు. సీఐని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానపట్ల మారుతి, కోశాధికారి తాండ్ర శరత్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సాక్షి కరీంనగర్ బ్యూరో ఇన్చార్జి ఆంజనేయులు ఉన్నారు. -
సిటీ బస్సులో కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భద్రతా విధులు నిర్వర్తించే ఓ హెడ్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయాడు. సిటీ బస్సులో ఫుట్‌బోర్డుపై ప్రయాణించడమే కాకుండా లోపలకు జరగాలంటూ కోరిన సహచర ప్రయాణికుడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అనాలోచితంగా తన సర్వీస్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. విచక్షణ కోల్పోయి... ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ నాయుడు (59) ఆ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో (ఏపీ ఐఎస్‌డబ్ల్యూ) విధులు నిర్విర్తిస్తున్నాడు. ఏపీకి చెందిన ప్రముఖులకు, రాజకీయ/కీలక కార్యాలయాలకు ఈ విభాగం భద్రత కల్పిస్తుంటుంది. ఏడాదిగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలసి కూకట్‌పల్లిలో ఉంటున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్... తన జీతం డబ్బు డ్రా చేసుకోవడానికి 10.30 గంటలకు పంజాగుట్టలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి విధులకు వెళ్లేందుకు పంజాగుట్ట హిమాలయ బుక్‌హౌస్ వద్ద ఉన్న బస్టాప్‌లో కంటోన్మెంట్ డిపోకు చెందిన 47సీ (సికింద్రాబాద్ నుంచి మణికొండ) రూట్ నంబర్ బస్సు ఎక్కారు. అయితే ఆయన బస్సు ఫుట్‌బోర్డుపైనే నిలబడి ఉండటంతో మరో స్టాప్ వద్ద ఓ చానల్ కెమెరామెన్ బస్సు ఎక్కుతూ శ్రీనివాస్‌ను లోపలకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో శ్రీనివాస్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి తన నడుముకు ఉన్న .9 ఎంఎం సర్వీస్ పిస్టల్ తీసి పైకి గురిపెట్టి బెదిరింపు ధోరణిలో ట్రిగ్గర్ నొక్కారు. అప్పటికే ఆ ఆయుధం కాగ్ (తూటా పేలేందుకు సిద్ధమై ఉండటం) అయి ఉండటంతో ట్రిగ్గర్ నొక్కగానే పెద్ద శబ్దం చేస్తూ టాప్‌లో నుంచి దూసుకుపోయింది. అయితే బస్సు టైరు పేలిందేమోనని డ్రైవర్ బస్సును పక్కకు ఆపగా శ్రీనివాస్ వెంటనే బస్సు దిగి పంజాగుట్ట చౌరస్తా వైపు పరిగెత్తారు. బస్సులో వచ్చిన శబ్దంపై సహచర ప్రయాణికుల్ని ఆరా తీయగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారని, బస్సు టాప్‌లోంచి తూటా దూసుకుపోయిందని వారు చూపించారు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తులు వేసుకొని పోలీస్‌లా ఉన్నారని తెలిపారు. దీంతో డ్రైవర్, కండక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మణికొండ వరకు వెళ్లి ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేర్చి తిరిగి డిపోకు చేరుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. బస్సు పైకప్పులోకి దూసుకెళ్లిన బుల్లెట్, బస్సు దిగి పరిగెడుతున్న శ్రీనివాస్ సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు... ఈ ఘటనపై దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు కండక్టర్, డ్రైవర్‌తోపాటు సదరు చానల్ కెమెరామెన్‌ను కూడా విచారించారు. కాల్పులు జరిపింది పోలీసు విభాగానికి చెందిన వ్యక్తిగా అనుమానించారు. హిందూ శ్మసాన వాటిక వద్ద బస్సు దిగిన ఆ వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చినట్లు తేలడంతో ఆ మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో రికార్డు అయిన అనుమానితుడి ఫీడ్ నుంచి ఫొటోలు సంగ్రహించారు. వాటి ఆధారంగా అతడిని ఏపీ ఐఎస్‌డబ్ల్యూకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ నుంచి సర్వీస్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఈలోగా ఇలా కేసులో చిక్కుకోవడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఆరా తీసిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్ జనాల మధ్య శ్రీనివాస్ కాల్పులు జరపడం చట్టారీత్యా తీవ్ర నేరంగా అభివర్ణించారు. నిందితుడిపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
వీరు సీపీని ఆశ్రయించారు...అతడు మేనేజ్ చేశాడు...
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్ ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సూరం ఇంద్రారెడ్డి కొంతమంది పోలీసుల అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు. పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 88,89,94 ప్లాట్ నంబర్ 929లోని 300 గజాల స్థలంలోని కొంత భూమిని అక్రమించి ప్రహరీ నిర్మించడమే కాకుండా తిరిగి వారిపైనే ట్రెస్పాస్ కింద నార్సింగ్ ఠాణాలో కేసు నమోదు చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అంతకుముందే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదేశాల ప్రకారం నార్సింగ్ ఠాణా పోలీసులు హెడ్‌కానిస్టేబుల్ సూరం ఇంద్రారెడ్డిపై భూకబ్జా కేసు నమోదుచేసి రెండు రోజులు గడవకముందే తిరిగి వారిపైనే అదే ట్రెస్పాస్ కింద కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. వీరు సీపీని ఆశ్రయించారు...అతడు మేనేజ్ చేశాడు... అమీర్‌పేటలో నివాసముంటున్న అచ్యుతవల్లి పుప్పలగూడలో సర్వే నంబర్ 88,89,94 ప్లాట్ నంబర్ 929లోని 300 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ నుంచి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే ఈ పనులు ప్రారంభిద్దామని ఆ ప్లాట్‌కు వెళ్లేసరికి కొలతలు చేయగా అచ్యుతవల్లిలోని కొంత భూమిని పక్కనే ప్లాట్ యజమాని సూరం ఇంద్రారెడ్డి ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని తేలింది. అయితే పుప్పాలగూడ కేపీఆర్ కాలనీ ప్లాట్ నంబర్ 54, 55లో ఉంటున్న హెడ్‌కానిస్టేబుల్ ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లి అచ్యుతవల్లి బంధువులు మాట్లాడితే ఆ అక్రమం వాస్తవమేనని, అయితే పాత యజమానికి తాను రూ.రెండు లక్షల అదనంగా అప్పగించనట్టు, ఆ డబ్బులిస్తేనే ప్రహరీ తీసేస్తానంటూ సమాధానం చెప్పడంతో అచ్యుతవల్లి కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. వెంటనే నార్సింగ్ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళితే ఇదీ సివిల్ మ్యాటర్ అంటూ పిటిషన్ ఐడీ 140319/00665 ఇచ్చి పక్కనబెట్టారు. దీంతో బాధితులు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను కలిసి వివరించడంతో ఇది అక్రమ కబ్జా కిందకే వస్తుందంటూ నార్సింగ్ ఠాణా ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్చి 28న ఐపీసీ 447, 427 సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసుల కేసు నమోదు చేశారు. ఆ ప్లాట్ వద్దకు వెళ్లి సంబంధిత ఎస్ఐ చుట్టుపక్కల వారితో మాట్లాడి ఆ ప్లాట్ కొలతలు తీసుకుని సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన సూరం ఇంద్రారెడ్డి తనకున్న పరిచయాలను ఉపయోగించి అదే పోలీసు స్టేషన్లో అచ్యుతవల్లి భర్త లక్ష్మీనారాయణపైనే ట్రెస్పాస్ కింద తప్పుడు కేసు నమోదు చేయించారు. లక్ష్మీనారాయణ తన ప్లాట్‌లో మట్టిపోసుకుంటే తమ ప్లాట్‌లోకి వచ్చి చేరి బోరు మూతపడిందని సూరం ఇంద్రారెడ్డి ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. కనీసం లక్ష్మీనారాయణను పిలిపించి మాట్లాడకుండానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంలో ఉద్దేశమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలాఉండగా ఇంద్రారెడ్డి పనిచేసే మియాపూర్ ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలోనూఅతని అవినీతి తీవ్రస్థాయిలో ఉందని, లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ ప్లాట్ ఆది నుంచీ వివాదాస్పదమే.. ఇంకో విషయం ఏమిటంటే కొంత భూమి కబ్జా చేసి గోడకట్టిన ఇంద్రారెడ్డి ప్లాట్‌లో ఉన్న ఓ పరిశ్రమలో కొన్ని నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంతో ఏకంగా పక్కనే ఉన్న బాబానివాస్ అపార్ట్మెంట్లోకి మంటలు చొరబడ్డాయి. దీంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. కొంతకాలం పాటు ఖాళీగానే ఉంచిన ఈ ప్లాట్‌లో ఇప్పుడూ వెల్డింగ్ షాప్ కోసం ఏర్పాట్లు చేస్తుండటంతో ఆ అపార్ట్మెంట్ వాసులు వద్దని వారిస్తున్నా స్థానిక పోలీసుల అండతో ముందుకెళుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. రెసిడెన్సీ ప్రాంతంలో మళ్లీ వెల్డింగ్ పరిశ్రమ నెలకొల్పుతుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. -
హెడ్‌కానిస్టేబుల్ వీడియో కలకలం..
అనంతపురం సెంట్రల్: ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ వీడియో పోలీసుశాఖలో కలకలం రేపుతోంది. బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఓ వీడియో తీసుకొని సామాజిక మాద్యమాల్లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో పోలీసుశాఖలో వైరల్‌గా మారింది. వీడియోలో బాధితుడు తెలిపిన వివరాలివి.‘‘ నా పేరు యోగానంద. 1990లో ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో చేరాను. హాస్టల్లో ఉంటూ కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించా. మా నాన్న చిన్నప్పుడే చనిపోతే అమ్మ కట్టెలు కొట్టి నన్ను చదివించింది. ఏపీఎస్పీ బెటాలియన్‌లో అవినీతి అంతా అధికారులే చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించిందుకు అనేక పనిష్మెంట్లు అనుభవించా. ప్రస్తుతం ఏపీఎస్పీ 14 బెటాలియన్‌లో ఉంటున్నాను. నా పని నేను సక్రమంగా చేసుకుంటూ వెళుతున్నా. నాలుగు నెలల క్రితం అప్పటి ఏపీఎస్పీ కమాండెంట్ జగదీష్‌కుమార్ విజయవాడ శిక్షణకు పంపించారు. అక్కడ శిక్షణలో గుండెనొప్పి(చెస్ట్‌పెయిన్), తల తిరగడం లాంటి లక్షణాలు కనిపించాయి. దీన్ని గమనించిన కమాండెంట్ జగదీష్‌కుమార్ నీవు చాలా లావున్నావు. తగ్గకపోతే సర్వీస్ నుంచి రిమూవ్ కాని పనిష్మెంట్కానీ చేస్తాను అని హెచ్చరించారు. రోజుకు ఒకటిన్నర గంట వాకింగ్ చేయమని ఆదేశించాడు. అందులో భాగంగా రోజూ వాకింగ్ చేస్తున్నా. ఒక రోజు అసిస్టెంట్ కమాండెంట్ ప్రభుకుమార్ చూసి వాకింగ్ కాదు నువ్వు పరిగెత్తాలని ఆదేశించాడు. తనకు ఆరోగ్యం బాగలేదు. పరిగెత్తితే చనిపోతా అని వివరించాను. చనిపోతే చనిపో.. ఎవరి కోసం అని అన్నాడు. సిక్లో వెళ్లినా జీతం రాదని మొరపెట్టుకున్నాను. అయితే తనతో ఆరŠుగ్యమెంట్ చేశానని గ్రౌండ్‌లోని అందరితో సంతకాలు చేయించి తనను సర్వీసు నుంచి రిమూవ్ చేయించారు. ఈ విషయాన్ని కమాండెంట్ దృష్టికి, రాయలసీమ డీఐజీ దృష్టికి తీసుకుపోయాను. నాలుగు నెలలవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. కాళ్లు పట్టుకొని వేడుకున్నా నేను చేసింది ఒక వేళ తప్పే అయితే హెడ్‌కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ రివర్షన్ చేయండి. కాని నా కడుపు కొట్టకండి. నాపై ఐదుగురు ప్రాణాలు ఆధారపడ్డాయి. ఆడపిల్లలు చదువు, పెద్ద కూతురు వివాహం కూడా ఆగిపోతుందని మొరపెట్టుకున్నారు. అయినా నాలుగు నెలలవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా బయటబయటే తిరుగుతున్నా. తనకు న్యాయం చేయకపోతే భార్య పిల్లలతో కలిసి తనకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ వీడియోలో బోరున విలపించారు. తనకు ఉద్యోగం లేకపోతే కుటుంబాన్ని పోషించలేనని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం పోలీసుశాఖలో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. గత కమాండెంట్ జగదీష్ కుమార్ హయాంలో ఇలాంటి మంది బాధితులెందరోఉన్నారని బెటాలియన్ సిబ్బంది వాపోతున్నారు. -
ఆర్పీఫ్ హెడ్ కానిస్టేబుల్ కాత్తితో వీరంగం
-
పోలీసులైతే ఏం చేస్తార్రా..?
పెనుమూరు: సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు పోలీసులంటే లెక్కలేకుండా పోయింది. ఓ తెలుగు తమ్ముడి తండ్రి, హెడ్‌కానిస్టేబుల్‌పై బహిరంగంగా కర్రతో దాడి చేసి గాయపరిచాడు. పోలీసులైతే ఏం పీకుతార్రా అంటూ వీరంగం చేశాడు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయి వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని పెద్దకలికిరి పంచాయతీ కొత్తూరుకు చెందిన యుగంధర్‌నాయుడు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి చంద్రశేఖర్‌నాయుడికి గ్రామానికి చెందిన హిమాచల్‌నాయుడు కుటుంబానికి చాలా కాలంగా గ్రామంలో స్థల వివాదం ఉంది. ఇది కోర్టుకు చేరింది. ఆ స్థలంలో ఎవరూ ప్రవేశించరాదని ఇటీవల కోర్డు స్టే ఇచ్చింది. అయితే చంద్రశేఖర్‌నాయుడు (75) కోర్టు స్టే ఉత్తర్వులను బేఖాతరు చేసి జేసీబీ సాయంతో ఈ నెల 19వతేదీన ఆ స్థలం చదును చేసేందుకు పూనుకున్నాడు. విషయం తెలుసుకున్న హిమాచల్‌నాయుడు పెనుమూరు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఎస్ఐ వంశీధర్ హెడ్‌కానిస్టేబుల్ రమేష్‌రెడ్డిని కొత్తూరుకు వెళ్లమని పురమాయించారు. దీంతో ఆయన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌తో కలిసి బైక్‌లో అక్కడికి చేరుకున్నారు. పనులను అడ్డుకుని జేసీబీని రమేష్‌రెడ్డి అక్కడ నుంచి పంపించేశారు. దీంతో చంద్రశేఖర్‌నాయుడు శివాలెత్తాడు. ‘నీవెవడ్రా జేసీబీని పంపించేయడానికి’ అంటూ రమేష్‌రెడ్డిని దుర్భాషలాడుతూ అతడిపై కర్రతో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమైంది. ప్రశ్నించిన రమేష్‌రెడ్డిని బండబూతులు తిట్టాడు. జరిగిన ఘటనను ఎస్ఐకు ఫోన్లో రమేష్‌రెడ్డి వివరిస్తున్నంతసేపూ ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నాడు. గాయపడ్డ హెడ్‌కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేయాలని ఎస్ఐను కోరారు. అయితే ఎస్ఐ కేసు వద్దని చెప్పినట్లు సమాచారం. -
గుంటూరులో హెడ్ కానిస్టేబుల్ ఓవరాక్షన్
-
కోట్లకు పడగెత్తిన హెడ్
ప్రొద్దుటూరు క్రైం : ఆ హెడ్‌కానిస్టేబుల్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. ప్రొద్దుటూరులో హెడ్ కానిస్టేబుల్ చిన్న వీరయ్య ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరుతోపాటు కడప, బెంగళూరులోని అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ దాడులు జరిగాయి. ప్రొద్దుటూరులోని త్యాగరాజనగర్‌లో నివాసం ఉంటున్న చిన్న వీరయ్య బి.మఠం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతను ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నాడని సమాచారం రావడంతో జిల్లా ఏసీబీ డీఎస్పీ నాగరాజు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ప్రొద్దుటూరులోని త్యాగరాజనగర్, లైట్‌పాలెం, శ్రీనివాసనగర్, జేమ్స్‌కొట్టాలలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిన్న వీరయ్య 1993లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పని చేశాడు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2013లో హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొంది బి.మఠం స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. బ్యాంకుల్లో రుణం తీసుకున్నా.. ఇళ్ల నిర్మాణం కోసం 10 బ్యాంకుల్లో రుణం తీసుకున్నానని హెడ్ కానిస్టేబుల్ చిన్న వీరయ్య ఏసీబీ అధికారులకు తెలిపాడు. తనంటే గిట్టని వాళ్లు కావాలనే ఫిర్యాదు చేశారన్నాడు. తనకు అక్రమాస్తులు లేవని ఉన్న ఆస్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. రూ 7 కోట్ల మేర ఆస్తులు .. ఏసీబీ దాడుల్లో రూ.7కోట్ల మేర హెడ్‌కానిస్టేబుల్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో 6 సెంట్లలో ఇళ్లు, మోడంపల్లెలోని జేమ్స్‌పేటలో 5 సెంట్లలో ఇటీవలే నిర్మించిన విలాసవంతమైన భవంతి, చాపాడు మండలంలో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, త్యాగరాజనగర్‌లో అరసెంటులో ఇల్లు, అనుమతి లేకుండా నిర్వహించే సంగీత పరికరాల దుకాణం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదు, బంగారం, స్థిరాస్తుల విలువ సుమారు రూ.7కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయని ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ చిన్న వీరయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సోదాల్లో సీఐలు రామచంద్ర, ఖాదర్‌బాషా సిబ్బంది పాల్గొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ ఇంటిలో ఏసీబీ సోదాలు జరగడంతో పట్టణంలోని పోలీసులు ఒక్క సారిగా ఉలికిపాటుకు గురయ్యారు. అతను పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
హెడ్‌కానిస్టేబుల్ రాసలీలలు
తమిళనాడు,టీ.నగర్: యువతితో హెడ్‌కానిస్టేబుల్ రాసలీల సాగిస్తుండగా గమనించిన ప్రజలు అతన్ని ఇంట్లోనే నిర్బంధించారు. సదరు యువతి, హెడ్‌కానిస్టేబుల్‌ను ప్రజలు దూషించడం, యువతి కాళ్లావేళ్లా పడి ప్రాథేయపడుతున్న వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా వ్యాపిస్తోంది. తిరునెల్వేలి జిల్లా పావూర్ సత్రంలో హెడ్‌కానిస్టేబుల్‌గా నటరాజన్ (35) పని చేస్తున్నారు. ఇతని సొంత గ్రామం వీకే.పురం సమీపాన గల ఠానా. ఇతనికి వివాహమై పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు గ్రామంలో ఉండగా నటరాజన్ కిలప్పావూరు సమీపం రాజేశ్వరి నగర్లో గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఇలా ఉండగా స్థలం తగాదాకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతితో నటరాజన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ యువతికి వివాహమైంది. నటరాజన్ సదరు యువతిని రహస్యంగా కలుసుకునేవాడు. ఈ వ్యవహారం ఇరుగుపొరుగు వారికి తెలిసింది. గురువారం రాత్రి ఇరువురు ఇంట్లో రాసలీల సాగిస్తుండగా ఇరుగుపొరుగు గమనించి తలుపులు మూసి తాళం వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి అక్కడికి చేరుకుని హెడ్‌కానిస్టేబుల్‌ను విడిపించారు. ఆ సమయంలో ప్రజలు వారిని దూషించడం, యువతి ప్రాధేయపడుతున్న దృశ్యాలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి. -
అర్హత లేకున్నా పదోన్నతి కల్పించారు
గుంటూరు : ఎలాంటి శిక్షణ లేకుండా అర్హత లేని ఏడుగురు ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా అడ్డదారిలో పదోన్నతి కల్పించారంటూ పలువురు ఏఆర్ కానిస్టేబుళ్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్ సీహెచ్ మోషేబాబు మాట్లాడుతూ గత ఏడాది జనవరిలో తిరుపతిలోని 70 మంది పదోన్నతి కోసం శిక్షణ పూర్తి చేసుకుని రాగా వారిలో 13 మందికి పదోన్నతి జాబితా ప్రకారం హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించారని చెప్పారు. అయితే ఆ సమయంలో తమకు పదోన్నతి అవసరం లేదని చెప్పి ఏడుగురు కానిస్టేబుళ్లు తాము సివిల్ విభాగానికి వెళతామని చెప్పడంతో వారిని సివిల్ విభాగానికి బదిలీ చేయడంతో వారు కొద్ది రోజులకే తిరిగి మళ్లీ ఏఆర్‌లో రిపోర్టు చేశారని తెలిపారు. జీవో నంబరు 84 ప్రకారం పోలీస్ శాఖలోని విభాగాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లేవని 2012లో ప్రభుత్వం జీవో జారీ చేసిందని స్పష్టం చేశారు. వీటన్నింటినీ పక్కన పెట్టి ఎస్పీ కార్యాలయ గుమస్తా నాగరాజు ప్రస్తుతం మోటారు వెహికల్ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్ల జాబితాను రూపొందించి ఎస్పీని సైతం మభ్యపెట్టి నిబంధనలు పక్కన పెట్టి వారికి పదోన్నతులు కల్పించారని ఆరోపిస్తున్నారు. జనరల్ సీనియార్టీలో వున్న వారిని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించిన నాగరాజుపై రూరల్ ఎస్పీతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ కేవీవీ గోపాలరావుకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయమై రాష్ట్ర డీజీపీ మాలకొండయ్యకు గురువారం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటికైనా జరిగిన పొరపాటును సరిచేసి వారి పదోన్నతులు రద్దు చేసి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరుతున్నామని వెల్లడించారు. లేకుంటే సీనియార్టీ జాబితాలో ఉన్న కానిస్టేబుళ్లు ట్రిబ్యునల్‌ను అశ్రయించి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధపడనున్నట్టు వివరించారు. -
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
ఆదిలాబాద్: గుడిహత్నూర్ పోలీసుస్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పాలకొండ శ్రీనివాస్ (49) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు రూ.20 వేలు ఎస్పీ అందించారు. ఎస్పీ వెంట పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పోలీసు టెలీకాన్ఫరెన్స్ నిర్వహణ అధికారి సింగజ్‌వార్ సంజీవ్‌కుమార్ ఉన్నారు. -
రక్షించండి.. కాపాడండి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘రక్షించండి.. కాపాడండి.. అంటూ మంగళవారం అర్ధరాత్రి చెన్నై మందవల్లిలోని ఓ ప్రాంతం మార్మోగిపోయింది. ముగ్గురు దుండగుల చేతిలో తీవ్రమైన కత్తిపోట్లకు గురై ఆ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యారు. కాపాడండీ అని ఎవరైనా కేకలు వేస్తే సహజంగా పోలీసులు వచ్చి రక్షిస్తారు. అయితే కానీ సాక్షాత్తు పోలీసు హెడ్‌కానిస్టేబులే ప్రాణభయంతో పరుగులు పెడుతూ కాపాడండి అంటూ ఆర్త నాదాలు చేసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో నేరాల అదుపునకు పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ వాహనాల తనిఖీలు, రాత్రివేళల్లో గస్తీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పూందమల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే అన్బళగన్(45) కొందరు కానిస్టేబుళ్లు, స్థానిక యువకులను తోడుగా పెట్టుకుని మంగళవారం రాత్రి తన మోటార్ సైకిల్‌పై తిరుగుతూ గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎవరికి వారు బృందాలుగా విడిపోయిగస్తీ జరుపుతున్నారు. రాత్రి 12.30 గంటల సమయంలో హెడ్‌కానిస్టేబుల్ అన్బగళన్ ఒంటరిగా నిలుచుని వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొద్ది దూరంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురు వ్యక్తులను గమనించి పిలిచాడు. అయితే సదరు వ్యక్తులు అన్బళగన్ వద్దకు రాకపోగా హేళనగా వ్యవహరించారు. దీంతో అతనే వారి వద్దకు వెళ్లి పిలిస్తే రారా అని గదమాయించాడు. సదరు వ్యక్తులు అన్బగళన్నే బెదిరించి తమ వాహనాలపై బయలుదేరబోయారు. అన్బగళన్ వారిని అడ్డగించి తన సెల్‌ఫోన్ కెమెరాలో ఫోటోలు తీయడం ప్రారంభించాడు. ఆ సెల్‌ఫోన్‌లోని ఒక ప్రత్యేక యాప్‌లోకి ముగ్గురి ఫోటోలు అప్లోడ్ చేసినట్లయితే వారంతా పాత నేరస్తులా కాదా అనే విషయం వెంటనే తెలిసిపోతుంది. మూడో వ్యక్తికి ఫోటో తీస్తుండగా మిగిలిన ఇద్దరు వ్యక్తులు అన్బగళన్ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కుని ‘మమ్మల్నే దారికాచి ఫోటోలు తీస్తావా’ అంటూ ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అయినా ఏమాత్రం వెరవని అన్బళగన్ తమాయించుకుని ముగ్గురుని పట్టుకునే యత్నం చేయగా వారిలో ఇద్దరు బైక్‌లో పారిపోగా ఒకడు మాత్రం రహస్యంగా తన వద్ద దాచుకున్న పొడవాటి పట్టా కత్తితో పొడిచాడు. ఈలోగా బైక్‌లో పారిపోయిన వారు సైతం వెనక్కు తిరిగి వచ్చి అన్బగళన్పై దాడిచేయడం ప్రారంభించడంతో ‘కాపాడండీ.. కాపాడండీ’ అంటూ కేకలు పెడుతూ అన్బగళన్ రోడ్డుపై పరుగులు తీసాడు. దుండగులు సైతం ఆయన వెంటపడి తీవ్రంగా దాడులు చేశారు. అదే సమయంలో ఏదో వాహనం అవైపు రావడంతో దుండగులు ముగ్గురు తమ వాహనాల్లో పారిపోయారు. ఈలోగా గస్తీ విధుల్లో ఉన్న మిగతా కానిస్టేబుళ్లు అక్కడి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ అన్బళగన్‌ను స్టాన్లీ ఆస్పుత్రిలో చేర్చారు. దుండగులు అన్బగళన్ సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లడంతో దాని సిగ్నల్స్ ఆధారంగా సతీష్‌కుమార్ (31), పన్నీర్‌సెల్వం (24), రంజిత్ (22) అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారిపై హత్యాయత్నం, దారి దోపిడి సెక్షన్లపై కేసులు పెట్టారు. దుండగులు ముగ్గురూ దోపిడీలు, దొంగతనాలు, హత్యకేసుల్లో నిందితులని విచారణలో తేలింది. -
హెడ్‌కానిస్టేబుల్ పరిస్థితి విషమం
హైదరాబాద్ : ఉన్నతాధికారుల వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన హెడ్‌కానిస్టేబుల్ కొరిపెల్లి దామోదర్‌రెడ్డి(57) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 48 గంటలు దాటితేగాని ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్‌రావు తెలిపారు. దామోదర్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, కుటుంబ తగాదా విషయంలో దామోదర్‌రెడ్డిని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి తోటి ఉద్యోగుల ఎదుట దూషించి దాడికి పాల్పడ్డ ఎస్ఐ లవకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు జ్యోతి, విక్రంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14న విధి నిర్వహణలో ఉన్న దామోదర్‌రెడ్డిపై దాడి చేసిన ఎస్ఐపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందించలేదని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. ఎస్ఐ తీరుతో మనస్తాపం చెందిన దామోదర్‌రెడ్డి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. ఆత్మహత్యకు యత్నించినప్పుడు తన జేబులో ఉన్న సూసైడ్ నోటును మాయం చేశారని ఆరోపించారు. -
హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట క్రైం: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఓ హెడ్‌కానిస్టేబుల్ అందరూ చూస్తుండగానే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ప్రకారం.. పట్టణానికి చెందిన దామోదర్‌రెడ్డి స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు విక్రమ్‌రెడ్డి భార్య సంధ్య కొంతకాలంగా తనను అత్తింటి వారు వేధిస్తున్నారని సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో దామోదర్‌రెడ్డి, అతని భార్య, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 14న స్టేషన్‌కు పిలిచారు. ఈ సందర్భంగా ఎస్ఐ వారిపై చేయి చేసుకున్నట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఇదిలా ఉండగానే దామోదర్‌రెడ్డి శుక్రవా రం మధ్యాహ్నం పురుగు మందు తాగడంతో తోటి సిబ్బంది వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అంతకుముందు ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ జాదవ్ ఆస్పత్రిలో దామోదర్‌రెడ్డిని పరామర్శించారు. కాగా, దామోదర్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సమయంలో జేబులోని సూసైడ్‌నోట్‌ను మాయం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
రోజూ నరకమే..
రాంగోపాల్‌పేట్: ఆయన ఓ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్...పెళ్లై 13 ఏళ్లు అవుతోంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ప్రతి రోజు భార్యను తీవ్రంగా కొడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన సంఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం సంజయ్ కుమార్ అనే వ్యక్తి గోపాలపురం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ గాస్మండి ఆదయ్యనగర్‌లో ఉంటున్నాడు. 2003లో అతడికి సరితతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, ఒక బాబు. గత కొన్నేళ్లుగా సంజయ్ తరచూ భార్యపై చేయి చేసుకుంటున్నాడు. ప్రతి రోజు మధ్యం సేవించి ఇంటికి రావడమే కాకుండా విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారు. అతడికి రాము, శ్రీకాంత్ అనే అతని స్నేహితులు మద్దతు పలుకుతున్నట్లు తెలిపింది. మూడు రోజుల క్రితం కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సరిత మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా... భార్య ఫిర్యాదు మేరకు సంజయ్ కుమార్‌ను మార్కెట్ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఇన్స్పెక్టర్ మట్టయ్య వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తనకు భార్య వద్దని ఏ కేసు పెట్టుకున్నా సరే విడాకులు తీసుంటానని మొండికేశాడు. భార్య సరిత మాత్రం తనను మళ్లీ కొట్టకుండా బాగా చూసుకుంటానంటే సరేనని చెప్పినా అతను మాత్రం కేసు పెట్టుకోమని చెప్పడం గమనార్హం. -
ఏసీబీకి చిక్కిన రైల్వే హెడ్ కానిస్టేబుల్
సాక్షి, ఎర్రగుంట్ల: లంచం తీసుకుంటూ ఓ రైల్వే పోలీసు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్లో దేవానందం అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఓ కేసు విషయమై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
హెడ్ కానిస్టేబుల్ కాల్పులు: ముగ్గురు మృతి
పూనె: ఇండియా రిజర్వ్ మెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఇతడికి స్టేట్ రిజర్వు పోలీసు ఫోర్సు క్యాంప్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడికి 80 కి.మీ. దూరంలోని డౌన్ టౌన్లో ఈ హెడ్ కానిస్టేబుల్ మంగళవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన అనంతరం అతను ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి లోపల తాళం వేసుకున్నాడని, అతడిని బయటకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పోలీసు అధికారి చెప్పారు. మృతులలో ఒకరు ఈ హెడ్ కానిస్టేబుల్‌కు బంధువని తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
ముగ్గురు భార్యల కానిస్టేబుల్ రాసలీలలు
సాక్షి, మేడ్చల్ : ముగ్గురు భార్యలతో ఓ కానిస్టేబుల్ రాసలీలలు రచ్చకెక్కాయి. ఒక భార్యకు తెలియకుండా మరో భార్యను.. వీరిద్దరికి తెలియకుండా ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక మూడు చోట్ల కాపురాలు పెట్టేశాడు. మూడో భార్యతో ఉండగా.. మొదటి భార్య రెడ్ హ్యాండెడ్‌గా తన కుమారుడితో కలిసి హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రను పట్టుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడలో ఆదివారం చోటు చేసుకుంది. మూడో మహిళను మొదటి భార్య చితకబాదింది. తండ్రికి, తనయుడికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాజేంద్ర రాసలీలలపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా మొదటి భార్య విలేకరులతో మాట్లాడుతూ... ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నాడని, దీనివల్ల తమ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోతోందని, పిల్లల భవిష్యత్ నాశనమవుతుండడంతో వేరేదారి లేక ఆయన బండారం బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. రాజేంద్ర వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. -
మూడో భార్యతో ఉండగా హెడ్‌కానిస్టేబుల్‌కు బడితపూజ
-
విధినిర్వహణలో గుండెపోటుతో..
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతిచెందడం స్థానికులను కలచివేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతే పోలీస్‌స్టేషన్‌లో రాజు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో తోటి పోలీసులు చికిత్స నిమిత్తం రాజును ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే హెడ్ కానిస్టేబుల్ మృతిచెందినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి
గుంటూరు(పట్నంబజారు) : గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్ ఇస్తూ రూరల్ ఎస్పీ సి.హెచ్.వెంకటప్పలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. యడ్లపాడులో పని చేస్తున్న షేక్ మొహమ్మద్ అక్బర్ ఆలీని సత్తెనపల్లి పట్టణానికి, నరసరావుపేట రూరల్‌లో ఎం.ఆంథోనిని నరసరావుపేట –2 స్టేషన్‌కు, రూరల్ సీసీఎస్‌లో ఉన్న ప్రభాకరరావును సీసీఎస్‌కు, అమరావతిలో ఉన్న కె.మోహన్‌రావును చిలకలూరిపేట టౌన్‌కు, డీఎస్‌బీలో ఉన్న డీవై కోటేశ్వరరావును యడ్లపాడుకు, నిజాంపట్నంలో ఉన్న డి.శ్రీనివాసరావును తెనాలి –2 టౌన్‌కు, యడ్లపాడులో ఉన్న శివయ్యను తెనాలి –2టౌన్‌కు, తెనాలి–1 టౌన్లో ఉన్న నాగమల్లేశ్వరరావును తెనాలి –2టౌన్‌కు నియమించారు. కారంపూడిలో ఉన్న ఏ.ఎల్.వీ.ఎస్.ప్రసాదరావును నరసరావుపేట రూరల్‌కు, కొల్లూరులో ఉన్న ఓ.సామ్రాజ్యం కొల్లూరుకు, దుగ్గిరాలలో ఉన్న షేక్ కరిముల్లాను వేమూరుకు, నాదెండ్లలో ఉన్న టి.వెంకటేశ్వరరెడ్డిని పొన్నూరు టౌన్‌కు, మాచర్ల టౌన్లో ఉన్న సయ్యద్ రవూఫ్‌ను మాచర్ల రూరల్‌కు, పిడుగురాళ్లలో ఉన్న షేక్. సుభానిని సత్తెనపల్లి రూరల్‌కు, పిడుగురాళ్లలో ఉన్న ఎ.వెంకటేశ్వరరావును క్రోసూరుకు, పిడుగురాళ్లలో ఉన్న కె.శ్యామ్‌సన్‌ను దాచేపల్లికి, రెంటచింతలలో ఉన్న సి.హెచ్.వెంకటేశ్వరరావును బెల్లంకొండకు, అర్బన్ పరిధిలోని కె.శ్రీనివాసరావుకు అమరా వతి, ఎస్.కరీముల్లాకు పొన్నూరు టౌన్, కె.మహేశ్వరరావుకు టి.చుం డూరు, సీసీఎస్ గుంటూరు రూరల్‌లో ఉన్న వై.శ్రీనివాసరావును తెనాలి –1టౌన్‌కు నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పలువురు ఎస్సైలకు బదిలీలు గుంటూరు రేంజ్ పరిధిలోని పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏఎస్సైల నుంచి ఎస్సైలుగా పదోన్నతి పొందిన జె.సురేష్‌బాబు గుంటూరు రూరల్‌లో ఉండగా అర్బన్‌కు, షేక్ మస్తాన్‌వలి అర్బన్‌కు, నెల్లూరులో ఉన్న ఎం.సంపూర్ణ, పి.వెంకటసుబ్బారావు, కె.వెంకటాద్రినాయుడు, టి.మధుసూదనరావులను గుంటూరుకు బదిలీ చేశారు. జిల్లాల వారీగా నెల్లూరుకు చెందిన డి.దుర్గాప్రసాద్‌ను ప్రకాశం జిల్లాకు, గుంటూరు అర్బన్‌లో ఉన్న వై.వీనయ్య నెల్లూరు జిల్లాకు, అర్బన్‌లో ఉన్న ఎన్.శ్రీనివాసరెడ్డిని గుంటూరు రూరల్ జిల్లాకు, గుంటూరు రూరల్ జిల్లాలో ఉన్న ఆర్.సుబ్రహ్మణ్యంను నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. వీరితోపాటుగా మరో 19 మంది ఎస్సైలకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రక్షణ కల్పించాల్సిన వారే ఇలా చెస్తే..
జమ్ముకశ్మీర్ : ఏదైనా సమస్య వస్తే, దొంగతనం జరిగితే వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే దొంగ అవతారమెత్తాడు. ఓ నిస్సహాయ వ్యక్తి వద్ద నుంచి సొమ్ములు కొట్టేసిన ఘటన జమ్ముకశ్మీర్‌లో వెలుగు చూసింది. రోడ్లపైన అడుక్కునే బిచ్చగాడి వద్ద నుంచి ఓ హెడ్ కానిస్టేబుల్ డబ్బులు కొట్టేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసు అధికారులు నిందితుడిని విధుల నుంచి తొలగించి అరెస్టు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మునవ్వర్ హుస్సేన్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన గతంలో కూడా ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
కూతురిపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం
మధుర: పెళ్లయి ఇద్దరు పిల్లలున్న కుమార్తెపై ఓ హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రిటైర్మెంట్ మరో రెండు రోజులుందనగా పోలీస్ ఔట్‌పోస్ట్‌లోనే ఈ దారుణానికి పాల్పడటంతో అతడిని అధికారులు అరెస్ట్ చేయటంతోపాటు సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మంత్ పోలీస్ ఔట్ పోస్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిజేంద్ర అనే వ్యక్తి యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై ఉన్న మంత్ పోలీస్ ఔట్‌పోస్ట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన బిజేంద్ర భార్య పక్కనే ఫిరోజాబాద్‌లో ఉన్న పుట్టింట్లో ఉంటోంది. ఆమెను వైద్యునికి చూపించేందుకు బిజేంద్ర కుమార్తె డాక్టర్ అపాయింట్ కోసం సోమవారం ఆగ్రా వెళ్లింది. అక్కడి నుంచి తిరిగివస్తూ తండ్రి పనిచేస్తున్న మంత్ పోలీస్ ఔట్‌పోస్ట్ వద్దకు చేరుకుంది. తండ్రి అడగటంతో అక్కడే ఆగిపోయింది. రాత్రి సమయంలో ఆమెపై బిజేంద్ర లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు రోదిస్తూ భర్తకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. అక్కడికి చేరుకుని ప్రశ్నించిన ఆమె భర్తపై కూడా బిజేంద్ర దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 30వ తేదీన బిజేంద్ర రిటైర్ కావాల్సి ఉన్న బిజేంద్రను పోలీసు అధికారులు వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించటంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
కానిస్టేబుల్ హత్యకేసులో అధికార ఒత్తిళ్లు
-
తుపాకితో కాల్చుకొని.. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కోరాపుత్(ఒడిశా): విధి నిర్వాహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుత్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కోబ్రా 202 బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శంకర్ ప్రసాద్ తన ఎస్ ఎల్ ఆర్ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ మృతి పై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు దాపరించిన కారణాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
కర్నూలు: గోనెగండ్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీలకంఠప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదే మండలం గంజిహల్లి గ్రామంలో జరిగిన ఉరుసు బందోబస్తు విధులు ముగించుకుని శనివారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో అదుపుతప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలకు ఎదురుగా ఉన్న ఎస్జీఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకే రవికృష్ణ హాస్పిటల్‌కు చేరుకుని నీలకంఠప్ప ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. రాత్రి 7 గంటల సమయంలో కోలుకోలేక ఆయన మృతిచెందారు. డీఎస్పీలు రమణమూర్తి, కొల్లి శ్రీనివాసరావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. నీలకంఠప్ప మృతి వార్త తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 1983లో ఈయన పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఈయనకు భార్యతో పాటు ముగ్గురు సంతానం. సర్వీసు మొత్తం ఆదోని సబ్ డివిజన్‌లోనే విధులు నిర్వహించారు. -
విషాదాన్ని నింపిన రిజర్వాయర్ ఘటన
-
గుట్టురట్టుచేసిన సీసీటీవీ
-
గుట్టురట్టుచేసిన సీసీటీవీ
న్యూఢిల్లీ: దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్న సామెత విన్నాం కానీ.. దొంగలు ..పోలీసులు చేతులు కలిపిన వైనంఎపుడూ కనలేదు. తాజాగా దేశరాధాని ఢిల్లీలో ఇలాంటి ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ లో మహిళా దొంగలతో చేతులు కలిపిన పోలీసాయన యవ్వారాన్ని అక్కడి సీసీటీవీ బట్టబయలు చేసింది. సీసీటీవీ రికార్డైన దృశ్యాల ప్రకారం గోల్డ్ ఆభరణం కొట్టేసిన మహిళా దొంగ నుంచి తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ దాన్ని గుట్టు చప్పుడు కాకుండా తన జేబులో వేసుకుని చల్లగా జారుకున్నాడు. మరోవైపు బాధిత మహిళ భర్తతో కలిపి తీసుకున్న సెల్ఫీ ఆధారంగా ఆరుగురు సభ్యుల మహిళా దొంగల గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం అమెరికాకు అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారై జంట ఈ గ్యాంగ్ బారిన పడి దోపిడీకి గురైంది. వారు మెట్రోలో గుర్గావ్ కు వెళుతుండగా వారి నగలను కొందరు మహిళా దొంగలు చాకచక్యంగా దొంగిలించారు. దీంతో తమ నగలు సహా ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు వారు తీసుకున్న సెల్పీ పోలీసులకు చూపినప్పుడు అందులో ఈ మహిళా దొంగలు కనిపించారు. బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆరుగురు సభ్యులతో కూడిన గ్యాంగును పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ నుంచి రూ.22 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఆ పోలీసును గుర్తించి సస్పెండ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయలో దర్యాప్తు చేపట్టామన్నారు. -
ఇద్దరు పోలీసుల సస్పెండ్
ఎన్పీకుంట : స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామకృష్ణ, కానిస్టేబుల్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సీఐ రవికుమార్ మంగళవారం తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలుసార్లు వారిపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు. -
నిర్మాతతో విభేదాలపై జయసుధ క్లారిటీ!
సీనియర్ నటి జయసుధ ప్రస్తుతం ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తున్న ‘హెడ్ కానిస్టేబుల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొద్దిరోజుల కిందట నిర్మాతకు, జయసుధకు మధ్య అపార్థాల వల్ల విభేదాలు వచ్చాయి. దీంతో ఒకరోజు షూటింగ్ వాయిదా పడింది. చిత్ర వర్గాల ప్రకారం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నిర్ణీత సమయంలోగా జయసుధకు దుస్తులు అందించలేకపోయింది. దీంతో ఆమె కొంతవేచి చూసి.. ఆలస్యంగా షూటింగ్‌కు వచ్చింది. విషయం తెలియని నిర్మాత ఆగ్రహానికి లోనయ్యాడు. జయసుధ వ్యక్తిగత సిబ్బందిపై కేకలు వేశాడు. నిర్మాత కోపానికి గురైన విషయం తెలియడంతో జయసుధ ఆయనకు వివరణ ఇచ్చింది. ఇందులో తన తప్పేం లేదని తెలిపింది. గత 30 ఏళ్లుగా జయసుధ తన కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేసుకుంటున్నది. ఇందుకోసం ఒకరోజు ముందుగానే దర్శకుడితో సంబంధిత సీన్లోవేసుకోవాల్సిన దుస్తుల కోసం ఆమె చర్చిస్తుంది. దీనిపై జయసుధ మీడియాతో స్పందిస్తూ ‘ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న అపార్థం వల్ల ఇది జరిగింది. దర్శకుడు నాకు ఫోన్ చేశాడు. ఎలాంటి జాప్యం లేకుండా డిసెంబర్ 3 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది’ అని తెలిపారు. ఆర్ నారాయణమూర్తి కోసమే ఈ సినిమాను జయసుధ ఒప్పుకొన్నట్టు సన్నిహత వర్గాలు తెలిపాయి. -
రోడ్డుప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి
సిద్దిపేట్ (మెదక్) : మెదక్ జిల్లా సిద్దిపేట్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామచంద్రారెడ్డి(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం 4.20 గంటల సమయంలో సిద్దిపేట్ శివారులోని రాజీవ్ రహదారిపై బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని డీసీఎం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. సిద్దిపేట్ డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా పనిచేసిన ఆయన ఇటీవలే రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్బీ విభాగంలో జాయినయ్యారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ సహా పలువురు అధికారులు సంఘటనస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
హెడ్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి
కర్నూలు: తిరుపతిలోని కళ్యాణ్‌డ్యామ్ పోలీస్ శిక్షణ కేంద్రంలో హెడ్‌కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్న 56 మంది కానిస్టేబుళ్లు బుధవారం కర్నూలుకు చేరుకున్నారు. సాయంత్రం ఎస్పీ ఆకె రవికృష్ణను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో 25 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి ఐదున్నరేళ్ల క్రితం వీరు సివిల్ విభాగంలోకి కన్వర్షన్ అయ్యారు. వీరికి మే 23 నుంచి ఈ నెల 17వ తేదీ వరకు తిరుపతి కళ్యాణ్ డ్యామ్‌లో హెడ్ కానిస్టేబుల్ శిక్షణనిచ్చారు. మారుతున్న చట్టాలు, నూతన ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం వీరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్నందున్న త్వరలో వీరికి స్టేషన్లను కేటాయించనున్నారు. ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, ఆర్ఐలు రంగముని, జార్జీలతో కలిసి వీరంతా ఎస్పీని కలిశారు. -
హెడ్ కానిస్టేబుల్ పాట దుమ్మురేపుతోంది!
పంజాబీ జానపద గీతం 'కాలాచష్మా' ఇప్పుడు దేశమంతటా దుమ్మురేపుతోంది. నిజానికి ఈ పాట 1990లోనే వచ్చింది. కానీ, తాజాగా వచ్చిన 'బార్ బార్ దేఖో' సినిమాలో ఆ పాటను వాడుకోవడంతో దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ పాట రాసిందో ఎవరో తెలుసా.. ఓ హెడ్ కానిస్టేబుల్. పంజాబ్ పోలీసుశాఖలో పనిచేస్తున్న అమ్రిక్ సింగ్ షెరా (43) ఈ పాటను రచించారు. ఆ విషయం తెలిసి షాక్ తిన్నాను! పంజాబ్‌లోని కపుర్తలా పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న షెరా తన పాట దేశమంతటా మార్మోగుతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఈ పాట సినిమాలో తీసుకున్నారనే విషయం చివరివరకు తనకు తెలియదని చెప్పారు. 'రెండు నెలల కిందట నా స్నేహితులు ఫోన్‌చేసి నీ 'కాలాచష్మా' పాట చానెళ్లలో వస్తున్నదని చెప్పారు. నాకు ఆనందంతోపాటు షాక్ కలిగింది. నాకు తెలియకుండా ఇదంతా జరిగింది' అని షెరా తెలిపారు. ఓ సిమెంట్ సంస్థ ప్రారంభోత్సవంలో ప్లే చేస్తామంటూ ముంబైకి చెందిన ఓ కంపెనీ తన పాట హక్కులను తీసుకున్నదని, అందుకు కేవలం రూ. 11వేలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. సినిమాలో వాడుకుంటున్న విషయాన్ని తనకు చెప్పలేదన్నారు. ఇలా వాడుకోవడంపై ఎవరిపట్ల తనకు కోపం లేదని చెప్పారు. 'ఈ సినిమా ఆడియో వేడుకకుగానీ, ఇతర వేడుకలకుగానీ ఎవరూ నన్ను ముంబైకి పిలువలేదు. ఈ వేడుకలకు వెళ్లాలని నేను అనుకున్నాను. పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పాట రాశాడని అందరికీ తెలియజేయాలనుకున్నా' అని షెరా ఆవేదన వ్యక్తం చేశారు. జలంధర్ సమీపంలోని తల్వాండీ గ్రామానికి చెందిన షెరా 15 ఏళ్ల వయస్సులో తొమ్మిదో తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ పాట రాశారు. తన పాటలను రికార్డు చేయాల్సిందిగా అప్పట్లో చాలామంది గాయకులను కలిశానని, కానీ ఎవరూ సహకరించలేదని షెరా గుర్తుచేసుకున్నారు. చాలాకాలం తర్వాత ఇంగ్లండ్‌లోని ఓ వేడుకలో గాయకుడు అమర్ అర్షి 'కాలాచష్మా' పాట పాడటంతో అది సూపర్ హిట్ అయిందని, దీంతో ఓ కంపెనీ ఈ పాటను రికార్డుచేసి మొదట ఇంగ్లండ్‌లో విడుదల చేసిందని, ఆ తర్వాత పంజాబ్‌లోనూ ఈ పాట మార్మోగిందని చెప్పారు. -
గుంత మాటున మృత్యువు
ఓర్వకల్లు/జూపాడుబంగ్లా: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి శనివారం రాత్రి 18వ జాతీయ రహదారి ఓ పోలీసు ఉద్యోగిని బలితీసుకుంది. మిత్రునితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రహదారిపై గుంతలో పడి జూపాడుబంగ్లా హెడ్ కానిస్టేబుల్ మరణించాడు. ఓర్వకల్లు మండలం ఎన్.కొంతలపాడుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు టీచర్ నాగయ్యకు జయప్రకాష్, దేవానందం (44), సువర్ణ (35), వసుంధర సంతానం. గ్రామంలోనే అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న పెద్ద కుమార్తె సువర్ణ నెల క్రితం గుండెపోటుతో మరణించింది. ప్రస్తుతం చిన్నకుమారుడు దేవానందం రోడ్డు ప్రమాదంలో మత్యువాతపడడంతో ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. దేవానందం 1992వ బ్యాచ్‌లో 610 జీఓ కింద హైదరాబాద్‌లో పోలీసు ఉద్యోగం సాధించాడు. కర్నూలు, తుగ్గలి, బనగానపల్లె పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఏడాది క్రితం హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది బనగానపల్లె నుంచి ఈ మధ్యకాంలోనే జూపాడుబంగ్లా స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. ఓర్వకల్లులో కాపురం ఉంటూ రోజూ విధులకు వెళ్లివచ్చేవారు. ఈ క్రమంలో పెద్ద కూతురు నందిని డిప్లమో ఇన్ అగ్రికల్చర్ కౌన్సెలింగ్ నిమిత్తం మూడు రోజుల క్రితం సెలవుపై వచ్చాడు. శనివారం సాయంత్రం అతనికి సుపరిచితుడైన వ్యక్తిని కలిసేందుకు బైక్‌పై చెన్నంచెట్టిపల్లెకు వెళ్లాడు. సాయంత్రం 6.30 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి ఓర్వకల్లుకు బయలుదేరిన దేవానందం కాల్వబుగ్గ–హుసేనాపురం మధ్య బుగ్గరామేశ్వర పాఠశాల సమీపంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వంతెన నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడ్డాడు. తల, ముఖానికి తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు రాత్రి 12 గంటల సమయంలో ఓర్వకల్లు పోలీసులకు సమాచారం వచ్చింది. కర్నూలు సీఐ నాగరాజుయాదవ్, ఎస్ఐ చంద్రబాబునాయుడు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆదివారం ఉదయం నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, బ్రాహ్మణకొట్కూరు, మిడుతూరు, ఉల్లిందకొండ ఎస్ఐలు రాజ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు ఘటనా స్థలానికి వెళ్లి అన్ని కోణాల్లో విచారించారు. చివరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న కేఎంసీ కంపెనీ ప్రతినిధి రాజశేఖర్‌ను ప్రమాదాలకు బాధ్యున్ని చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. మతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతునికి భార్య సలోమితోపాటు నందిని, అలేఖ్య, నవీన్ సంతానం. -
రోడ్డుప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి
ఓర్వకల్ (కర్నూలు) : ద్విచక్రవాహనం పై నుంచి పడి ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాలువబుగ్గ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవానందం హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బైక్ పై వెళ్తుండగా.. గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మునుస్వామి కుటుంబానికి రూ.కోటి సాయం
హెడ్‌కానిస్టేబుల్ కుటుంబానికి సాయం కుమార్తెకు విద్యా పరంగా అండ అసెంబ్లీలో అమ్మ ప్రకటన పోలీసుల హర్షం చెన్నై: దుండగుల దాడిలో మరణించిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ మునుస్వామి కుటుంబానికి రూ.కోటి సాయాన్ని సీఎం జె.జయలలిత ప్రకటించారు. ఆయన కుమార్తె రక్షణ ఉన్నత విద్యా ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో వీర మరణం పొందే పోలీసుల కుటుంబాల్ని ఆదుకునే విధంగా సాయం పెంపు దిశగా చట్ట సవరణకు ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో గత వారం దోపిడీ దొంగల్ని పట్టుకునే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ మునుస్వామి హతమయ్యారు. దుండగుల దాడిలో మరణించిన ఆయన కుటుంబానికి రూ.ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని సీఎం జె.జయలలిత ప్రకటించారు. దుండుగుల్ని త్వరితగతిన పట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో సోమవారం అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు సీఎం జె.జయలలిత చేసిన ప్రకటన పోలీసు వర్గాల్లో ఆనందాన్ని నింపింది. విధి నిర్వహణలో వీరోచితంగా పోరాడి అమరులయ్యే పోలీసుల కుటుంబాల్ని ఆదుకునేందుకు తగ్గ చట్ట సవరణలకు ఆదేశాలు ఇచ్చారు. అమ్మ నిర్ణయంతో పోలీసు వర్గాల్లో, వారి కుటుంబీకుల్లో హర్షం వ్యక్తం అవుతోన్నది. రూ. కోటి: ఉదయం అసెంబ్లీ సమావేశం కాగానే, సీఎం జె.జయలలిత ప్రత్యేక ప్రకటన చేశారు. కృష్ణగిరి జిల్లా హోసూరులో దుండగుల్ని పట్టుకునే క్రమంలో హత్యకు గురైన హెడ్‌కానిస్టేబుల్ మునుస్వామి కుటుంబాన్ని ఓదార్చే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.ఐదు లక్షలు ప్రకటించామని, ఇది ఆ కుటుంబానికి చాలదంటూ, రూ.కోటి ప్రకటించారు. ఈ మొత్తం ఆ కుటుంబానికి అందిస్తామని ఆమె చేసిన ప్రకటనతో సభలో అన్నాడీఎంకే వర్గాల కరతాళ ధ్వనులు మార్మోగాయి. అలాగే, విధి నిర్వహణలో దుండగుల్ని పట్టుకునే క్రమంలో గానీయండి, విధి నిర్వహణ సమయంలో ఎదురయ్యే ప్రమాదం రూపంలో గానీయండి వీరోచితంగా శ్రమించి, అమరులయ్యే పోలీసుల కుటుంబాన్ని ఆదుకునేందుకు తగ్గ చర్యలు చేపట్టామని వివరించారు. ఆ మేరకు ప్రస్తుతం వారికి ఇస్తున్న ఆర్థిక సాయం పెంపునకు చట్ట సవరణలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇందుకు తగ్గ చర్యలను ప్రధాన కార్యదర్శి తీసుకోనున్నారని పేర్కొంటూ, హోసూరు ఘటనలో మరణించిన మునుస్వామి కుమార్తె రక్షణ ఉన్నత విద్యా భారం ప్రభుత్వం భరిస్తుందని, అందుకు తగ్గ అన్ని ఖర్చుల్ని తామే అందిస్తామని స్పష్టం చేశారు. కాగా, విధి నిర్వహణలో మరణించి హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రప్రథమంగా పరిగణించవచ్చు. అలాగే ఆర్థిక సాయం పెంపునకు ఆదేశాలు జారీ కావడంతో పోలీసు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
కోర్టు కానిస్టేబుళ్లా.. మజాకా..!
కోదాడ : ఒకరి బలహీనతను మరొకరు చట్టబద్ధ ఆదాయంగా మార్చుకుంటున్నారు. చూడడానికి చిన్నదిగా ఉన్నా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో రోజు వేల రూపాయలను ఈ అక్రమార్కులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. తాము చేసిందే తప్పు కాబట్టి బాధితులు కూడా తమకు తెలిసి జరుగుతున్న ఈ దోపిడీపై నోరు విప్పడం లేదు. ఇక వీరు అడిగినంత ఇవ్వక పోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు వద్ద పడిగాపులు కాయాల్సిందే. దీంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చి అక్కడి నుంచి బయటపడుతుంటారు. ఇక వీరు ఇపుడు మరింత రెచ్చిపోయి కోర్టుకు వచ్చే కేసులను తమకు అనుకూలమైన న్యాయవాదులకు అమ్ముకుంటూ మరింత సొమ్ము చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కోర్టు బయట జరుగుతుండడంతో ఎవ్వరు వీరిపై చర్యలు తీసుకోక పోవడంతో సంవత్సరాల తరబడి అదే పోస్టులో కదలకుండా పనిచేస్తున్నారు. హెడ్‌కానిస్టేబుల్ స్థాయి ఉన్న వారికే ఈ కోర్టు కానిస్టేబుల్ పనులు అప్పగించాలని గత ఎస్పీ చెప్పినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. దీంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. పిటీ కేసులే పెట్టుబడి... చిన్న నేరాలు చేసి పోలీసులకి చిక్కిన వారిపై పోలీసులు పిటీ కేసు పెట్టి కోర్టులో హాజరుపరుస్తారు. నిందితులందరినీ కోర్టు కానిస్టేబుల్ ద్వారా కోర్టుకి పంపుతారు. న్యాయమూర్తి వీరికి వంద నుంచి రెండు వందల వరకు జరిమానా వేస్తారు. వీరందరి చేత కానిస్టేబుల్ కోర్టు దగ్గరుండిజరిమానాను అక్కడే కట్టిస్తారు. ఖర్చుల పేరుతో ఇక్కడే తమకు వేసే జరిమానాకు రెట్టింపు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆటోడ్రైవర్లు, పేకాట ఆడుతూ, మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు దొరికినవారే వీరికి ఆదాయ వ నరుగా మారిపోయారు. ఇలా జి ల్లా వ్యాప్తంగా ప్రతిస్టేషన్ నుంచి రోజుకు కోర్టుకు వచ్చే 10 నుంచి 20 కేసుల్లో వీరు రూ.6వేల వరకు వసూలు చేసుకుంటున్నారు. ఆదాయ వనరుగా మారిన ఈ కొలువులో చేరిన వారు సంవత్సరాల తరబడి అదే పోస్టులో కొనసాగుతున్నారు. స్టేషన్ మారిన పోస్టును మాత్రం వదులుకోవడం లేదని తోటి కానిస్టేబుళ్లే అంటున్నారు. రాటుదేలారు.. నిందితులకు వేసే కోర్టు జరిమానాతో సరిపుచ్చుకోకుండా ఈ కానిస్టేబుళ్లు కొం దరు కేసులు అమ్ముకునే వ్యాపారం మొ దలు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా యాక్సిడెంట్లు అయినప్పుడు ప్రమాదం చేసిన వారు బయటి ప్రాంతాలకు చెందిన వారై ఉంటారు. వారికి స్థానిక కోర్టుల్లో న్యాయవాదులు గురించి అంతగా తెలియదు. దీంతో వీరు మధ్యవర్తుల అవతారం ఎత్తుతున్నారు. పలాన న్యాయవాది అయితే నీకు తోందరగా బెయిల్ వస్తుందని, కేసు గెలుస్తారని చెప్పి తమకు అనుకూలమైన వారికి కేసులను అప్పగిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా వారి నుంచి భారీగా కమీషన్లు దండుకుంటున్నట్లు సమాచారం. ఇంకా కొన్ని కేసుల్లో జూనియర్ న్యాయవాదులకు కేసులు అప్పగించి బాధితుల వద్ద భారీగా వసూలు చేసి జూనియర్ న్యావాదులకు కొద్దోగొప్పో ఇచ్చి మిగతాది వీరు జేబులో వేసుకుంటున్నారని కొందరు సీనియర్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అసలు ఎవరీ కోర్టు కానిస్టేబుళ్లు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక కోర్టు కానిస్టేబుల్ ఉంటారు. ప్రతిస్టేషన్లో ఒక కానిస్టేబుల్‌కు కోర్టు పనులను మాత్రమే అప్పగిస్తారు. అందుకే అతన్ని కోర్టు కానిస్టేబుల్ అని పిలుస్తారు. స్టేషన్లో నమోదయ్యే కేసులకు సంబంధించిన వివరాలను కోర్టులో అప్పగించడం, వాయిదాలకు హాజరుకావడం, చార్జీషీట్లను అప్పగించడం, పిటీ కేసుల్లో నిందితులను కోర్టుకు తీసుకెళ్లడం, జరిమానాలను కట్టించడం వీరి విధి. పై ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఈ పోస్టు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. స్టేషన్ అధికారికి ఇష్టమైన వారు ఈ పోస్టులో సాధారణంగా కొనసాగుతారు. కొత్తవారు రాకుండా పాత వారు అడ్డుకుంటారు. కోర్టు వ్యవహారాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పాతవారినే కొనసాగించడంతో అవినీతి పెరిగి పోతుందని తరచూ వీరిని మార్చి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే ఈ దందాకు తెరపడుతుందని పలువురు న్యాయవాదులు, తోటి కానిస్టేబుళ్లే అంటున్నారు. ఆస్తులు విడిపిస్తామని రూ.లక్షల్లో వసూలు ఇటీవల కొందరు వ్యక్తులు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోదాడ ప్రాంతంలో పలువురి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. తరువాత నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వారి ఆస్తులను పోలీసులు అటాచ్ చేశారు. బీనామీ పేర్లతో ఉన్న ఆస్తులను తాను విడుదల చేయిస్తానని కోదాడ సర్కిల్ పరిధిలో ఉన్న ఓ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ ఈ కేసులో ప్రధాన నిందితుడి వద్దకు వెళ్లి రూ.లక్షన్నర వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయం బయట పడడంతో సదరు కోర్టు కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లినట్లు సమాచారం. -
ఇదే అదును.. లూటీకి పదును!
♦ ఇసుకను లూఠీ చేస్తున్న పచ్చనేతలు ♦ ప్రొక్లైయిన్లతో తోడేయడం...లారీలతో తరలించడం ♦ ఆదినిమ్మాయపల్లెలో రేటు ఫిక్స్ చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ ♦ కొండాపురంలో 8లారీలు సీజ్...మరో 15లారీలను విడిపించిన టీడీపీ నేత అధికారం అండ ఉంది..అవకాశం వచ్చింది.. ఇంకేముంది వీలైనంత దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు పచ్చనేతలు. పోలీసుల మద్దతుతో ఓ చోట.. సొంత మందితో మరోచోట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక క్వారీలు రద్దు చేయడంతో పచ్చ నేతలు చెలరేగిపోతున్నారు. ఆదినిమ్మాయపల్లె వద్ద ముగ్గురు నేతలు ముచ్చటగా మూడుచోట్ల టోల్గేట్ విధించి బలవంతంగా లాక్కుంటున్నారు. ఇందుకు ఏకంగా ఓ హెడ్‌కానిస్టేబుల్ వత్తాసు పలుకుతున్నాడు. సాక్షి ప్రతినిధి, కడప: ఇసుక క్వారీలు రద్దు చేయడం అధికారపార్టీ నేతలకు కలిసొచ్చింది. జిల్లాలో పలు క్వారీల నుంచి ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చుని అధికారికంగా ఉత్తర్వులు వెలుబడ్డాయి. అందులో ఆదినిమ్మాయపల్లె ఇసుక క్వారీ కూడా ఉంది. అక్కడ టీడీపీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మూడు చోట్ల ముగ్గురు నాయకులు టోల్‌ఫ్లాజా నిర్వహిస్తున్నారు. మూడు చోట్ల ముడుపులు చెల్లించడం సబబేనని వల్లూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్ వత్తాసుగా నిలుస్తుండడం విశేషం. పొలాలకు వ్యక్తిగత అవసరాలకు తీసుకెళ్లుతున్నా.. అనధికారికంగా నిర్వహిస్తున్నా.. టోల్‌ఫ్లాజాలో సొమ్ము చెల్లించకపోతే సదరు హెడ్‌కానిస్టేబుల్ దాడులు చేయడం.. కేసు నమోదు చేస్తామని బెదిరిస్తూ అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఆదినిమ్మాయపల్లె క్వారీ నుంచి జేసీబీ ద్వారా రాత్రిపూట యధేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నట్లు సమచారం. క్వారీని అనధికారికంగా పచ్చనేతలు నడుపుతున్నారు. వీరిలో ఓ మాజీ ఎమ్మెల్యే మేనల్లుడు, మరోటీడీపీ నేత సమీప బంధువు ఉన్నట్లు తెలుస్తోంది. వారితోపాటుగా తమకు సైతం చెల్లించాల్సిందేనని స్థానిక టీడీపీ నేతలు ఓ జట్టుగా ఏర్పడ్డట్లు తెలుస్తోంది. పెన్నానదీ లూటీ.. జల్లా సరిహద్దులు కొండాపురం నుంచి ప్రొద్దుటూరు వరకూ పెన్నానదీని పచ్చ నేతలు యథేచ్ఛగా లూఠీ చేస్తున్నారు. కొండాపురం మండలంలో గ్రామస్థాయి నాయకులు పోటీపడి ఇసుకను కొల్లగొట్టుతున్నారు. నిత్యం నంద్యాల, బెంగుళూరుకు ఇసుక తరలివెళుతోంది. లారీలను తనిఖీ లేకుండా పట్టలు కట్టుకొని ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు అండదండలతో యధేచ్చగా అక్రమవ్యవహారం సాగుతోంది. ఈక్రమంలో సోమవారం సాయంత్రం విజిలెన్సు అధికారులకు కొండాపు రం క్వారీలో 8లారీలు పట్టుబడ్డట్లు సమాచారం. మరో 15లారీలను స్థానిక టీడీపీ నేత అక్కడి నుంచి తరలించి నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వాహనాల్లో ఆన్ గవర్నమెం ట్ డ్యూటీ అని ఉన్న టిప్పర్ కూడా ఉన్నట్లు సమాచారం. హనుమాన్‌గుత్తి టు ఆర్టీపీపీ.... ఓ ఎంపీ సోదరుడి నేతృత్వంలో హనుమాన్‌గుత్తి నుంచి ఆర్టీపీపీకి ప్రతిరోజు 30ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పోట్లదుర్తికి చెందిన వ్యక్తులు పెన్నానదిలో తిష్టవేసి ఆ ట్రాక్టర్లు మినహా మరే ట్రాక్టర్ నదిలో దిగేందుకు వీలులేదని ఆంక్షలు విధించినట్లు సమచారం. ఆర్టీపీపీ కట్టడాలకు మొత్తం తామే ఇసుకను సరఫరా చేస్తామని, మరెక్కడా కొనుగోలు చేయరాదంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇసుకక్వారీలు రద్దు కావడం పచ్చ నేతలకు వరంగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్
విశాఖపట్నం: లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెందుర్తిలోని ర్యాట్టిక్ షాపు నిర్వాహకుల నుంచి స్థానిక హెడ్ కానిస్టేబుల్ అప్పలస్వామి దొర రూ. 18 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో షాపు నిర్వహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం అప్పలస్వామి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ క్యాంపస్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. క్రిష్ణపల్లి మధు (47) అనే హెడ్ కానిస్టేబుల్ క్యాంపస్‌లోని పార్క్‌లో పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఇది గుర్తించిన తోటి కానిస్టేబుళ్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. భార్యతో విభేదాల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధు భార్య ఖమ్మం జిల్లాలో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. -
తుపాకీ పేలి ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో తుపాకీ పేలి గుళ్లు తలలోంచి దూసుకుపోవడంతో ఓ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరుకు చెందిన ఖాజా మోహినుద్దీన్(47) 1999లో పోలీస్ విభాగంలో చేరాడు. ఇతనికి భార్య రహెనాబేగం, ఒక కూతురు ఉంది. కొండాపూర్ కొత్తగూడలో ఉంటున్నారు. అంబర్‌పేట పోలీసు ట్రైనింగ్ సెంటర్లోని సైబరాబాద్ ఏఆర్ కేంద్రంలో ఆదివారం గార్డుగా విధులు నిర్వహించేందుకు వచ్చాడు. ఇతనితో పాటు కానిస్టేబుల్ నాగరాజు, రమేశ్, అలీముద్దీన్, నాగభూషణం విధుల్లో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఖాజా మోహినుద్దీన్ పడుకున్న వైపు నుంచి తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. దీంతో తోటి సిబ్బంది ఏం జరిగిందని గదిలో పరిశీలించగా ఖాజా రక్తం మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఖాజా అక్కడికక్కడే మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏఆర్ ఎస్ఐ అఫ్జల్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్‌పేట ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి ఘటనను ఆత్మహత్యగానే అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ సంఘటన స్థలిని సందర్శించారు. తుపాకీ పేలిన తీరు, తదితర వివరాలు తోటి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామని అందులో మృతిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. -
తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
-
బాంబు పెట్టి.. కానిస్టేబుల్‌ను చంపిన హెడ్
మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో ఘోరం జరిగింది. మోటార్ సైకిల్లో బాంబు పెట్టి.. సహ కానిస్టేబుల్‌ను చంపేశాడో హెడ్ కానిస్టేబుల్. ఓ లేడీ కానిస్టేబుల్ గురించిన వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నితేష్ పాటిల్ (28) అనే కానిస్టేబుల్ శివర్ధన్ పోలీసు స్టేషన్లో పనిచేస్తాడు. అతడికి ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందన్న కోపంతో ప్రహ్లాద్ పాటిల్ (45) అనే హెడ్ కానిస్టేబుల్ ఇతడి బైకులో బాంబు పెట్టాడు. నితేష్ తన బైకు స్టార్ట్ చేసేందుకు కిక్ కొట్టగానే బాంబు పేలి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కుట్రకు కారణం వివాహేతర సంబంధం వల్ల ఏర్పడిన వ్యక్తిగత ద్వేషమేనని తెలుస్తోందని, నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని రాయగఢ్ ఎస్పీ మహ్మద్ సువేజ్ హక్ తెలిపారు. రాయగఢ్ రీజియన్‌లోని ఓ పోలీసు స్టేషన్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌తో సంబంధం విషయమై ప్రహ్లాద్, నితేష్‌ల మధ్య చాలాసార్లు గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. నితేష్‌కు అప్పటికే పెళ్లయింది, రెండున్నర నెలల పాప కూడా ఉంది. ప్రహ్లాద్‌కు కూడా పెళ్లయింది. ఇద్దరి మధ్య ఒక లేడీ కానిస్టేబుల్ విషయంలోనే గొడవ జరిగినట్లు చెబుతున్నారు. -
బాధితురాలితో వివాహేతర సంబంధం
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్ చాంద్రాయణగుట్ట : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు నగర పోలీస్ కమిషనర్ ప్రయత్నిస్తుంటే... ఛత్రినాకలో ఓ హెడ్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన బాధితురాలితో వివాహేతర సంబంధంపెట్టుకొని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో మధుసూదన్‌రెడ్డి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. సాయిబాబానగర్‌కు చెందిన మహిళ (33) తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు స్టేషన్‌కు వచ్చేది. ఈ సమయంలోనే బాధిత మహిళతో చనువు పెంచుకున్న హెడ్ కానిస్టేబుల్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లేవాడు. విషయం తెలుసుకున్న భర్త ఆదివారం రాత్రి తన భార్యతో హెడ్‌కానిస్టేబుల్ గదిలో ఉండగా బయటి నుంచి తలుపుపెట్టి.. బస్తీవాసులను పిలిచాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి హెడ్ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను ఛత్రినాక నుంచి కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అన్నం తిన్న ఇంటికే కన్నం వేశాడు
మహబూబ్‌నగర్ : దొంగల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఇంట్లోనే దొంగలు పడి రూ. 25 తులాల బంగరు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు... కాలనీకి చెందిన వెంకట్రాములు మహిళా పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పరిచయస్థుడు రోడ్డు మీద కనిపించడంతో.. అతన్ని ఇంటకి పిలిచి భోజనం పెట్టించాడు. అనంతరం అత్యవసర పనిమీద వెంకట్రాములు భార్యతో కలసి బయటకు వెళ్లడంతో.. ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న 25 తులాల బంగారంతో ఉడాయించాడు. ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హెడ్ కానిస్టేబుల్‌పై ఏసీబీ కేసు?
వ్యభిచారం కేసులో లంచం డిమాండ్ పరారీలో నిందితుడు గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై ఏసీబీ కేసు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. వ్యభిచార కేంద్రంపై దాడి చేసి అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తిని వదిలేసి డబ్బు డిమాండ్ చేయడంతో కేసు నమోదైనట్లు తెలిసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో నిందితులను రాత్రి సమయంలో కస్టడీలో పెట్టుకోవద్దని గత వారం సైబరాబాద్ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గచ్చిబౌలి ఠాణా పరిధిలో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందిందని క్రైం విభాగంలో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో దాడి చేసి నిందితులను కస్టడీలో పెట్టుకోలేమని, పగటిపూట దాడి చేయాలని ఇన్స్పెక్టర్ సూచించాడు. ఇన్స్పెక్టర్ సూచనలను బేఖాతర్ చేస్తూ అదే రోజు రాత్రి ఎస్ఐ, మరో కానిస్టేబుల్‌ను తీసుకొని వ్యభిచార కేంద్రంపై దాడిచేశారు. అక్కడ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బేరం కుదుర్చుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు తీసుకురాకుండా అతడి కారు తమ వద్ద ఉంచుకొని నిందితుడిని వదిలివేశారు. ఈ సెటిల్మెంట్లో సదరు హెడ్ కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసుల తీరు తనను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నారని భావించిన ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. మరుసటి రోజే అతను హెడ్‌కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి సిటీకి వస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని చెప్పాడు. తాను డ్యూటీలో బిజీగా ఉన్నానని, రావడం కుదరదని చెప్పి సదరు హెడ్ కానిస్టేబుల్ పీఎస్ పక్కన్నే ఉన్న పాన్ షాపులో డబ్బు ఇస్తే కలెక్ట్ చేసుకుంటానని అన్నాడు. అతను చెప్పిన విధంగా కారు యజమాని పాన్ షాపులో డబ్బు ఇవ్వగా.. కొద్దిసేపటికి హెడ్‌కానిస్టేబుల్ డబ్బు కలెక్ట్ చేసుకునేందుకు వేరే వ్యక్తిని పంపాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను హెడ్ కానిస్టేబుల్ కాదని తేలింది. దీంతో ఏసీబీ అధికారులు పాన్ షాపు నిర్వాహకుడితో పాటు, డబ్బు కోసం వచ్చిన వ్యక్తిని మరింత లోతుగా విచారించారు. విషయం బయటకు పొక్కడంతో సదరు హెడ్ కానిస్టేబుల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు అతని ఇంటికి వెళ్లి గాలించినా ఆచూకీ తెలియరాలేదు. గత నాలుగు రోజులుగా ఆ హెడ్ కానిస్టేబుల్ పోలీస్‌స్టేషన్‌కు రాకపోవడంతో ఏసీబీ అధికారులు అతడి ఇంటిపైన, బంధువుల ఇళ్లపైన నిఘా పెట్టారు. అంతేకాకుండా అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా, ఆ హెడ్‌కానిస్టేబుల్ పట్టుబడితే ఎవరి పేర్లు చెప్తాడోనని గచ్చిబౌలి పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఓ వ్యభిచార కేంద్రంపై దాడి చేయగా నిర్వాహకుడి వద్ద ఓ ఎస్ఐ భారీ మొత్తంలో డబ్బు దండుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. -
పోలీసుల అదుపులో పోలీసులు..
-
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
భద్రాచలం(ఖమ్మం): ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి పుష్కర విధులు నిర్వహిస్తూ శనివారం సాయంత్రం గుండెపోటుకు గురైన హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(45) ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలకేంద్రం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అగ్ని ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని ఆర్కె పురం పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ లింగం గౌడ్(40) సజీవ దహనమయ్యాడు. దాదాపు ఏడు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మంటల్లో చిక్కుకుని చనిపోయాడని, అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రమాదం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ఖాకీ వనంలో.. కళాపుష్పం
కవిగా, రచయితగా, నటుడిగా రాణిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, ఆడ పిల్లల అమ్మకాలు, వివిధ నేరాలపై ప్రదర్శనలు పలు అంశాల్లో అవార్డుల కైవసం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఉత్తమ ఆర్టిస్ట్ అవార్డునందుకున్న దుర్గారెడ్డి చందంపేట : ఆయన చేస్తున్నది పోలీస్ ఉద్యోగం. నిత్యం ఏదో ఒక కేసులో బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా రంగ స్థల ప్రదర్శనలపై దృష్టి సారిస్తున్నారు. లాఠీలతోనో, తూటాలతోనే ప్రజలను మార్చలేమని భావించి కళారూపాల ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చని నమ్మారు. అందుకే సుమారు 300 ప్రదర్శనలు ఇచ్చి అధికారుల, రాజకీయ నాయకుల మెప్పు పొందారు. ఆయనే చందంపేట పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ మిర్యాల దుర్గారెడ్డి. దుర్గారెడ్డిది తిప్పర్తి మండలంలోని ఇందుగుల గ్రామం. ఆయన తల్లిదంద్రులు మిర్యాల వెంకట్‌రెడ్డి, లలిత. ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన దుర్గారెడ్డి చిన్ననాటి నుంచి ఆటల్లో మేటి. అలాగే హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే కవితలు, పాటలు రాయడం ఆరంభించారు. తనతల్లిదండ్రులనుంచి పుణికిపుచ్చుకున్న కళానైపుణ్యంతో అన్ని రంగాలలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. దుర్గారెడ్డి 1989లో పోలీస్‌శాఖలో చేరారు. నల్లగొండ పోలీస్‌శాఖలో స్థాపించిన ‘జాగృతి’ కళాబృందానికి ఇన్చార్జ్గా పని చేసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పచ్చదనం- పరిశుభ్రత, నిరక్షరాస్యత, ధూమపానం, గుట్కా నమలడం, మూఢనమ్మకాలు, నక్సలిజం, వరకట్న నిషేధం, ఇలా ఎన్నో దురాచారాల పట్ల అనేక రూపకాలు, పాటలు రూపొందించి తద్వారా జన చైతన్యానికి తన వంతు బాధ్యత వహించారు. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినాయాన్ని రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. పోలీస్‌శాఖలో డీఐజీ ద్వారకా తిరుమలారావు, విశ్రాంత డీజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, అప్పటి నల్లగొండ ఎస్పీలు శివధర్‌రెడ్డి, సజ్జన్నార్, బాలసుబ్రహ్మణ్యంలు దుర్గారెడ్డి రచనలను అభినందించి ప్రోత్సహించారు. తన రచనలకు స్పందించిన స్నేహ ఆర్ట్స్ దేవరకొండ వారు 1992లో అక్కడి గ్రంథాలయంలో సన్మానించా రు. 1994లో నల్లగొండ పట్టణంలో జరిగిన కవి సమ్మేళనంలో మహిళల సమస్యలపై చదివిన తన కవితకు ప్రశంసలు అందుకున్నారు. 2001లో సూర్యాపేటలో, 2003లో సాహితీమేఖల ఆధ్వర్యంలో ఘన సత్కారాలు పొందారు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం చేసిన సేవలను పాటల రూపంలో అందించి ప్రశంసలను అందుకున్నారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో దుర్గారెడ్డి పాటలకు అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రశంసించారు. అవార్డులు 2007లో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో జరిగిన కార్యక్రమంలో యమధర్మనాటికలో ఎస్ఐ పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. చింతల స్వచ్ఛంద సంస్థ తెలంగాణ ఉత్తమ రంగ స్థల నటుడు అవార్డుకు దుర్గారెడ్డిని ఎంపిక చేసి ప్రముఖ సినీగేయరచయిత సుద్దాల అశోక్‌తేజ చేతుల మీదుగా ఘనంగా సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ చేతుల మీదుగా ఉత్తమ వ్యాసరచన పోటీలో పోలీసులకు, ప్రజల మధ్య సత్సంబంధాలపై వ్యాసం రాసి ఉత్తమ అవార్డును అందుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2న చందంపేట ఎంపీడీఓ కె. నర్సింహులు, తహసీల్దార్ కత్తుల ఏలేశం చేతుల మీదుగా ఉత్తమ ఆర్టిస్ట్‌గా అవార్డుతో పాటు 10వేల రూపాయల నగదును బహుమతిని అందుకున్నారు. వైఎస్సార్‌పై పాటల పుస్తకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాసిన పాటలతో ఓ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని గత నెల 11న తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి వచ్చిన దివంగత నేత వైఎస్సార్ తనయ షర్మిలకు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డిని షర్మిల అభినందించారు. త్వరలోనే ఆడపిల్లల అమ్మకాలపై, తెలంగాణకు హరితహారంపై పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన సాక్షికి తెలిపారు. ఇలా పోలీస్‌శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే కళారంగంలో రాణిస్తున్న దుర్గారెడ్డి పలువురికి ఆదర్శప్రాయంగాా నిలుస్తున్నారు. -
హెడ్ కానిస్టేబుల్‌కు ‘అమెరికా’డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో కమ్యూనికేషన్స్ విభాగం హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కొలుకూరి శ్రీధర్‌కు అమెరికాలోని హోన్స్టన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. దూర విద్యా విధానంలో ‘పోలీస్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ సిస్టం ఇన్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఏపీ’ అనే అంశంపై చేసిన పరిశోధనకుగానూ ఈ పురస్కారం అందుకున్నారు. పట్టాను బెంగళూరులోని వర్శిటీ భారత ప్రధాన కార్యాలయం సోమవారం శ్రీధర్‌కు అందజేసింది. హైదరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన శ్రీధర్ 1996లో పోలీసు కమ్యూనికేషన్స్‌లో కానిస్టేబుల్‌గా చేరారు. పీహెచ్డీ చేయడంలో భాగంగా 2012లో వర్శిటీకి అప్లై చేసుకున్న శ్రీధర్ దాదాపు మూడు వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి పరిశోధన పత్రాలను రూపొందించారు. యూనివర్శిటీ డెరైక్టర్ కోడూరి వెంకటేష్ సారథ్యంలో రూపొందించారు. శ్రీధర్ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. డాక్టరేట్‌ను తన తల్లికి అంకితమిస్తున్నానని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
వర్ని: బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ సంఘటన నిజాబాబాద్ జిల్లా వర్ని చౌరస్తా వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ బైక్ పై పని నిమిత్తం బయటకు వెళ్లగా, వర్నీ చౌరస్తా వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
ఇటుకతో దాడిచేసిన హెడ్‌కానిస్టేబుల్‌కు బెయిలు
సాక్షి, న్యూఢిల్లీ: మహిళపై ఇటుక విసిరి వార్తల్లోకి ఎక్కిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ చంద్రకు బెయిలు లభించింది. లంచం ఇవ్వనందుకు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ తనను ఇటుకతో కొట్డాడని ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలపై సతీష్ చంద్ర.. మహిళను లంచం అడిగినట్లుగా సరైన ఆధారాలు లభించనందున రూ.10 వేల పూచికత్తుపై బెయిలు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి రెండు పరస్పర విరుద్ధమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయని న్యాయమూర్తి నరోత్తమ్ కౌశల్ చెప్పారు. రెడ్లైడ్ ఉల్లంఘించినందుకు తనను ఆపిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రూ. 200 లంచం అడిగాడని, లంచం ఇవ్వకపోవడంతో తనపై ఇటుకతో దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. ఇందుకు సంబంధించి లభించిన వీడియో సాక్ష్యం ఆధారంగా ఢిల్లీ పోలీసులు హెడ్ కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి అరెస్టు చే శారు. న్యాయస్థానం అతన్ని 14 రోజుల న్యాయ నిర్బంధానికి పంపింది. కానీ ఆ తరువాత మరో ఆడియో క్లిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆడియో క్లిప్‌లో మహిళ హెడ్ కానిస్టేబుల్‌ను దూషించడం, చలాన్ చెల్లించడానికి నిరాకరించడం వంటివి రికార్డయ్యాయి. -
ఏసీబీ వలలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్
అనంతపురం : లంచం తీసుకుంటూ అనంతపురం జిల్లా తనకల్లు పోలీస్‌స్టేషన్ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ ఏసీబీ కి దొరికారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలివీ...కదిరికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తికి చెందిన ఇసుక ట్రాక్టర్‌ను ఈనెల 4వ తేదీన రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. దానిని విడిపించుకునేందుకు తహశీల్దారు నుంచి అనుమతి పొందారు. అయితే, పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఆ ట్రాక్టర్‌ను తీసుకెళ్లాలంటే రూ.6 వేలు ఇవ్వాలని ఎస్సై రమేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో శ్రీరాములు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌కు డబ్బు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం అడిగిన ఎస్సై రమేష్‌రెడ్డితోపాటు హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. (తనకల్లు) -
కూతుర్ని కామాంధుడికి అప్పగించిన తల్లి!
డబ్బుకోసం దారుణం.. బాలికపై హెడ్ కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం కామాంధుడితోపాటు, తల్లిపై కేసు.. అరెస్టు, రిమాండ్ సంగారెడ్డి చైల్డ్ హెల్ప్‌లైన్‌కు బాలిక తరలింపు శివ్వంపేట: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే.. కూతుర్ని ఏమార్చి, ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా శివ్వంపేట ఎస్ఐ రాజేష్‌నాయక్ కథనం మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన పద్మ భర్తను వదిలేసి శివ్వంపేట బీక్యా తండాకు చెందిన టీక్యాను వివాహం చేసుకుంది. అంతకుముందే ఈమెకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక శివ్వంపేటలోని కస్తుర్బా గిరిజన బాలికల హాస్టల్లో 9వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా.. రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హరినాయక్ అలియాస్ హరిసింగ్ (46) జిన్నారం మండలం బహదూర్‌పల్లి వద్ద ఓ పరిశ్రమను నడుపుతుండగా.. పద్మ అందులో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు, హెడ్‌కానిస్టేబుల్ హరి సింగ్‌కు మధ్య పరిచయం బాగా పెరిగింది. పద్మ కుమార్తె సంక్రాంతి సెలవుల్లో తల్లి వద్దకు వెళ్లగా.. ఆ బాలికపై హరినాయక్ కన్ను పడింది. అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలనే ఉద్దేశంతో తల్లికి డబ్బు ఎర చూపాడు. దీంతో ఆమె తన కుమార్తెను హరినాయక్‌కు అప్పగించింది. ఇలా ప్రతినెలా పద్మ కస్తూర్బా పాఠశాలకు వచ్చి ఆరోగ్యం బాగా లేదని, ఇంట్లో శుభకార్యం ఉందని సాకులు చెబుతూ, కుమార్తెను బలవంతంగా వెంట తీసుకెళ్లి హరినాయక్‌కు అప్పజెప్పేది. దీంతో అతడు పలుమార్లు ఆ బాలికపై అత్యాచారం జరిపాడు. దీంతో ఆ విద్యార్థిని ఈనెల 24న చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబరుకు ఫోన్‌చేసి తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి వివరించింది. దీంతో వారు రంగంలోకిదిగి ఈ నెల 25న పాఠశాలకు వచ్చి విద్యార్థిని నుంచి వివరాలు సేకరించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి రెండేళ్లుగా సిక్లీవులో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ హరినాయక్, బాలిక తల్లి పద్మపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఆ బాలికను హరినాయక్ వద్దకు తీసుకెళ్లేందుకు మధ్యవర్తిగా ఉన్న మరోవ్యక్తి నెహ్రూ కోసం గాలింపు చేపట్టామని, ప్రస్తుతం ఆ బాలిక సంగారెడ్డి చైల్డ్‌హెల్ప్‌లైన్ సిబ్బంది వద్ద ఉందని ఎస్ఐ చెప్పారు. -
హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్
చింతూరు: ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌ను కానిస్టేబుల్ కాల్చిచంపాడు. సుకుమా జిల్లా ధర్మపెంటలోని ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ క్యాంపులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అయోధ్యప్రసాద్ దేశ్‌ముఖ్, కానిస్టేబుల్ సమీర్ కృష్ణతీర్థల మధ్య ఓ ఘటనకు సంబంధించి వివాదం మొదలై కొట్లాడుకునే వరకూ వెళ్లింది. సమీర్ ఆగ్రహంతో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చడంతోప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చిట్టీల పేరుతో హెడ్‌కానిస్టేబుల్ చీటింగ్
హైదరాబాద్ సిటీ (సరూర్‌నగర్): చిట్టీల పేరుతో ఓ హెడ్ కానిస్టేబుల్ జనం నెత్తిన టోపీ పెట్టిన సంఘటన సరూర్‌నగర్‌లోని గ్రీన్పార్కుకాలనీలో సోమవారం వెలుగు చూసింది. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్ పనిచేస్తున్న వెంకటేశ్వర్లు సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్కు కాలనీలో అరుణ చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నాడు. కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. అతడ్ని నమ్మి కోట్ల రూపాయలు చిట్టీలు వేసి మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యం చేశారు. ఇదేమి అన్యాయమని నిలదీసిన బాధితులపై ఎస్ఐ ప్రభాకర్ సర్వీసు రివాల్వర్‌తో బెదిరించాడు. ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో చిన్నారి మృతదేహం
-
మద్యం మత్తులో ‘హెడ్’ వీరంగం!
పుల్కల్ : ఓ హెడ్ కానిస్టేబుల్ పూటుగా తాగి నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించాడు. దీంతో 45 నిమిషాల పాటు రాకపోకలను స్తంభింపజేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పుల్కల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లయ్య రాత్రి విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఫుల్‌గా మందుకొట్టాడు. పుల్కల్ బస్‌స్టాండ్ వద్ద మంతూర్ నైట్ హాల్ట్ బస్సు రాత్రి 10.15 నిమిషాలకు వచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ కిరాణం షాపులో పెరుగు తీసుకునేందుకు బస్సును ఆపాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మరో కారు పార్కు చేసి ఉంది. ఈ క్రమంలో కారులో వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ రోడ్డుపై వాహనాన్ని ఆపి ఎలా వెళ్లాలి అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై బూతు పురాణం మొదలు పెట్టాడు. ఇంతలోనే మరో వాహనం వచ్చింది. ఆ వాహనడ్రైవర్ పక్క నుంచి వెళ్లేందుకు యత్నించగా.. స్థలం లేకపోవడంతో అక్కడే నిలిచిపోయాడు. అంతే.. హెడ్‌కు కోపం వచ్చింది. అప్పటి వరకు బస్సు డ్రైవర్‌పై కస్సుమన్న అతను మరో వాహన డ్రైవర్‌నూ వదలలేదు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించాలని చెప్పడంతో.. అయితే తన వద్ద వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని, ఎందుకు స్టేషన్‌కు రావాలని వాదించడంతో.. అంత వరకు నోరును పారేసుకున్న హెడ్‌కానిస్టేబుల్.. చేతికి పని చెప్పేంత పని చేశాడు. ఇంతలో అక్కడున్న వారు ఎస్పీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆమె వెంటనే స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి పుల్కల్ బస్టాండ్‌లో ఏం జరుగుతుందో తనకు పది నిమిషాల్లో తెలపాలని ఆదేశించించారు. దీంతో స్టేషన్ నుంచి సిబ్బంది బస్టాండ్ వద్దకు చేరుకుని హెడ్‌కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లారు. ఈ తతంగం పూర్తి అయ్యేందుకు సుమారు రాత్రి 11 గంటలైంది. బాధ్యత గత పోలీసులే ఇలా తాగి రోడ్డుపై వాహనాన్ని నిలిపివేయడంతో మంతూర్, సింగూర్, పెద్దారెడ్డిపేట గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయణికులు రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ విషయమై ఎస్ఐ లోకేష్‌ను వివరణ కోరగా.. హెడ్ కానిస్టేబుల్ నుంచి వివరణ తీసుకుని నివేదిక పంపాలని ఎస్పీ సూచించినట్లు ఆయన వివరించారు. ఎస్పీ సూచన మేరకు తగిన చర్యలుంటాయన్నారు. -
పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
రూ.లక్షకు రెండు లక్షలు అమాయకులకు కుచ్చుటోపీ వీరి నుంచి రూ.30 లక్షల నగదు, పోలీస్ డ్రస్సులు, కత్తులు స్వాధీనం గ్యాంగ్‌లో కోలారుకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కోట్లు సంపాదించిన తిరుపతి వాసి పలమనేరు : లక్ష రూపాయల కరెన్సీ ఇస్తే రెండు లక్షలొస్తాయని అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకున్నారు పలువురు అమాయకులు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు ఓ ముఠాగా తయారై దొంగలుగా, నకిలీ పోలీసులుగా దాడులకు పాల్పడి లక్షలాది రూపాయలు కొట్టేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు 2014 డిసెంబర్ ఆఖరు నాటికి 2005 సంవత్సరం లోపు ముద్రించిన నోట్లను బ్యాంకుల్లో మార్పు చేసుకోవాలనే నిబంధనను వీరు ఇలా క్యాష్ చేసుకున్నారు. గంగవరం సర్కిల్ పోలీసులు 11 మంది నిందితులను అరెస్ట్ చేసి, రూ.30 లక్షలు రికవరీ చేశారు. సిద్దగంగప్ప మఠంలో కోట్లున్నాయంటూ నమ్మబలికారు.. కర్ణాటకలోని సిద్దగంగప్ప మఠంలో 2005కు ముందు ముద్రించిన కరెన్సీ కోట్లాది రూపాయలు ఉందని, దీన్నంతా బ్యాంకుల్లో మార్చుకోవడం ఇబ్బందిగా ఉందని ఈ గ్యాంగ్ అమాయకులను బుట్టలో వేసుకుంది. వీరి మాటలు నమ్మి బెంగళూరుకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి రూ.25 లక్షలు, కౌశిక్‌రెడ్డి రూ.6 లక్షలు పొగొట్టుకున్నారు. దొంగలు, పోలీసులు వీరే.. ఒకటికి రెండింతల నగదొస్తుందని ఆశపడి హర్షవర్ధన్‌రెడ్డి రూ.25 లక్షలతో బంగారుపాళ్యం సమీపంలోకి ఆ ముఠా చెప్పిన చోటుకు వెళ్లాడు. వీరు చీకట్లో మాట్లాడుతుండగానే పోలీసుల జీపులో ఇదే ముఠాకు చెందిన నకిలీ పోలీసులు దాడులకు పాల్పడి నగదును లాక్కెళ్లారు. పెద్దపంజాణి వద్ద కౌశిక్‌రెడ్డి రూ.6 లక్షల నగదును సైతం ఇదేవిధంగా దోచుకె ళ్లారు. కోలారుకు చెందిన హెడ్‌కానిస్టేబులే కీలకం.. ప్రస్తుతం కోలారు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పాపన్న ఈ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన వ్యక్తి. నకిలీ పోలీసులకు పోలీస్ యూనిఫాం, టోపీలు, సంకెళ్లు తదితరాలను అందించి అదే గ్యాంగ్‌లో పోలీస్ స్టైల్లో ఈ మోసాలకు పాల్పడ్డాడు. గతంలో నంగిలి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నప్పటి నుంచి ఇతనికి ఈ బ్యాచ్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఎర్రచందనం స్మగ్లర్లతోనూ ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్ర పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడంతో విధుల నుంచి తొలగించినట్లు స్థానిక డీఎస్పీ హరినాథరెడ్డి తెలిపారు. ముఠా సభ్యుల వివరాలు.. ఈడిగట్టు చంద్ర అలియాస్ రాజా: ముఠా నాయకుడు నక్కలవాండ్ల పల్లె గ్రామం, గుర్రంకొండ మండలం. మదనపల్లెలో ఉంటూ దాదాపు పది గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకున్నాడు. అన్ని రకాల మోసాల్లోనూ సిద్ధహస్తుడు. కందూరి రమణారెడ్డి: ఇతని సొంతూరు కేవీ పల్లె సమీపంలోని నల్లకమ్మరెడ్డిగారిపల్లె. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ చాకచక్యంగా మాట్లాడి అందరినీ బురిడి కొట్టిస్తుంటాడు. నాలుగైదు భాషల్లో ప్రావీణ్యం ఉంది. నరసింహులు: సొంతూరు గుర్రంకొండ సమీపంలోని గంగిరెడ్డిగారిపల్లె. ప్రస్తుతం తిరుపతిలోని కొర్లగుంటలో ఉంటూ బొరుగులు అమ్ముకుంటూ ఉంటాడు. అమాయకులను టార్గెట్ చేసి లక్షకు రెండు లక్షలంటూ నమ్మించి ఉచ్చులోకి దింపుతాడు. లంకిపల్లె గుర్రప్పనాయుడు: సొంతూరు సోమల సమీపంలోని నెల్లిమంద. తిరుపతి మునిరెడ్డినగర్‌లో కాపురముంటున్నాడు. అక్కడ పెద్ద మనిషిగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడిన డబ్బుతో కోటికి పైగా అధిక వడ్డీలతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మల్లి మొగ్గల ఉమాపతి: తుమ్మలగుంట వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కాపురం. గుర్రప్పనాయుడుకు బావమరిది. గ్యాంగ్‌లో సహాయకుడు. సుబ్రమణి: కర్ణాటకలోని బంగారుపేట తాలూకా సుందరపాళ్యం సొంతూరు. కర్ణాటక గ్యాంగ్‌కు నాయకుడు. నకిలీ పోలీస్ వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరిస్తాడు. నంజప్పన్: ఇతనిది కోలారు సమీపంలోని నందంహళ్లి. నకిలీ ఎస్ఐగా గ్యాంగ్‌లో ఉంటాడు. సురేష్: ఇతనిది సిద్లగట్ట సమీపంలోని అండిగవాడ. నకిలీ పోలీస్ కానిస్టేబుల్. నారాయణస్వామి : హొస్కోట సమీపంలోని కారెళ్లకు చెందిన ఇతను గ్యాంగ్‌లో నకిలీ పోలీస్. గోలా వీరప్పనాయుడు: కలకడ సమీపంలోని ఎనుగొండపాళ్యంకు చెందిన ఇతను మెయిన్ గ్యాంగ్ నాయకుడు. పాపన్న: నిజమైన హెడ్ కానిస్టేబుల్. ప్రస్తుతం కోలార్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఇతని సొంతూరు శ్రీనివాసపురం సమీపంలోని వక్కలేరి. -
డీఎస్పీ ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు: వీఆర్‌కు పంపడంపై మనస్తాపం చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలోని చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లలితమ్మ పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నూలులో పోలీస్ కానిస్టేబుళ్లను మూకుమ్మడిగా అధికారులు వీఆర్‌కు పంపడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
పోలీస్ క్వార్టర్స్‌లో చోరీ
తిరువళ్లూరు, న్యూస్‌లైన్ : తిరువళ్లూరులోని పోలీస్ క్వార్టర్స్‌లో గురువారం రాత్రి చోరీ జరిగింది. తిరువళ్లూరులోని సేలై రోడ్డులో పోలీస్ క్వార్టర్స్ ఉంది. ఈ క్వార్టర్స్‌లో రిజర్వ్ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జయశీలన్ నివాసం ఉంటున్నా డు. ఇతను కుటుంబంతో కలిసి గురువారం ఉదయం పళ్లిపట్టులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి పలు వస్తువులు, బంగారు నగలను చోరీ చేసుకెళ్లారు. ఇంటి తలుపులు పగులగొట్టిన విషయాన్ని పక్కింటి వారు జయశీలన్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వేలిముద్రల నిఫుణులను రప్పించి వేలి ముద్రలను సేకరించారు. కాగా బంగారు నగ లు చోరీ జరిగినా పోలీసులు విషయం బయటకు చెప్పలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేసులు వద్దు..మామూళ్లే ముద్దు
ఆయన అర్బన్ పరిధిలోని ఓ సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి. ఉన్నతాధికారులను తన వినయవిధేయతలతో బురిడీ కొట్టించే సదరు అధికారి వసూళ్లలో రారాజు. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కట్టడి చేయాల్సిన సదరు సారు టార్గెట్లు విధించి, వేధించి మరీ మామూళ్లు రాబడుతున్నారు. బార్, వైన్సషాపుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని హుకుం జారీచేస్తున్నారు. మామూళ్లు వసూలు చేయలేమని చేతులెత్తేసిన వారిని శాఖాపరంగా ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మాట వినని వ్యాపారులను తన ఇంటికి పిలిపించుకుని మరీ దారికి తెస్తున్నారు. సివిల్ సెటిల్మెంట్లలో తలదూర్చడం నిత్యకృత్యంగా మారిన డీఎస్పీ అక్రమాలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం... దరు సబ్‌డివిజనల్ అధికారి మొదటగా బార్, వైన్స్ షాపులపై దృష్టి సారిం చారు. డివిజన్ పరిధిలో వీటి నుంచి ప్రతీ నెలా రూ. 1.20 లక్షలు మామూళ్ల రూపంలో ఆయా షాపుల నుంచి వసూలు చేస్తున్నారు. మద్యం ముడుపుల కేసులో కొందరు పోలీస్ అధికారులపై ఏసీబీ విచారణ కొనసాగుతున్నా సదరు అధికారి మాత్రం పాత పద్ధతిలోనే డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం షాపులు సరిగ్గా నడవక యజమానులు డబ్బులు ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా ఓ స్టేషన్ నుంచి రావాల్సిన మామూళ్లు ఆగిపోయూరుు. దీంతో సదరు అధికారి అక్కడి ఎస్హెచ్ఓపై చిర్రుబుర్రులాడినట్లు తెలిసింది. అలాగే ఇసుక దందా ఎక్కువగా నడిచే ఒక్కో పోలీస్‌స్టేషన్ నుంచి నెలకు రూ.60 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఐడీ పార్టీ కానిస్టేబుళ్లతో దందా.. తన వద్ద ఉన్న ఐడీ పార్టీ కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్తోనేదందా మొత్తం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక ట్రాక్టర్ల వ్యవహారం, బార్లు, గ్రానైట్లు అన్నింటి వద్ద ఈ కానిస్టేబుళ్లే వ్యవహారం చక్కబెడుతున్నారు. ఈ ఇద్దరే సదరు అధికారి పరిధిలోని స్టేషన్లలో సివిల్ తగాదాల్లో తలదూర్చుతూ సార్‌కు కనకవర్షం కురిపిస్తున్నారు. భూవివాదాల్లో ఒకవర్గం పక్షాన వకల్తా పుచ్చుకుని సెటిల్మెంట్కో రేట్ నిర్ణయించి వివాదాలను తమదైన శైలిలో పరిష్కరిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక రోడ్డు ప్రమాద కేసులు, వాహనాలకు సంబంధించిన సెటిల్మెంట్లు, ఇతర కీలక కేసుల్లోనూ వీరు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా నటిస్తూ ఇరుపక్షాల నుంచి డబ్బులు గుంజుతున్నారు. గ్రానైట్లారీలు.. క్రషర్లు.. కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ నగరం మీదు గా నిత్యం గ్రానైట్ లారీలు రాత్రి వేళల్లో వెళ్తుం టాయి. వీటిలో ఎక్కువగా సార్‌కు టచ్ లో ఉన్న గ్రానైట్ కంపెనీలకు సంబంధించినవే. ఈ డివి జన్ పరిధిలో ఎవరైనా కిందిస్థారుు ఉద్యోగి గ్రానైట్ లారీని పట్టుకున్నా.. వారిపైకేసు పె ట్టినా డీఎస్పీ ఆగ్రహానికి గురికావాల్సిందే. ఎం దుకంటే ప్రతీనెలా రూ.60 వేల వరకు సదరు కంపెనీ యజమానుల నుంచి సార్‌కు డబ్బులు ముడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే సబ్‌డివిజన్ చివ ర్లో ఉండే స్టేషన్ పరిధిలో మూడు క్రషర్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతీ నెల రూ.20 వేల చొప్పున ముడుతున్నట్లు సమాచారం. వీరిలో ఓ క్రషర్ యజమాని ఓ నెల మామూళ్లు ఇవ్వకపోవడంతో చేసేదిలేక స్థానిక పోలీస్ అధికారే తన జేబులో నుంచి బాస్‌కు ఇచ్చినట్లు సమాచారం. ఈ స్టేషన్ పరిధిలోని వైన్స నుంచి కూడా రూ.20 వేలు సబ్‌డివిజనల్ అధికారికి చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నారుు. సివిల్‌లో తగాదాలంటే ఇంట్రెస్ట్.. సదరు అధికారికి సివిల్ తగాదాలంటే మక్కువ ఎక్కువ. ఎందుకంటే పెద్దమొత్తంలో డబ్బులు ఒక్కసారిగా వస్తాయి కాబట్టి. నగర శివారు సమీపంలో ఓ భూవివాదంలో తలదూర్చిన సదరు డీఎస్పీ పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని స్టేషన్లో బంధించాడు. ఇందుకు రూ.2 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే సివిల్ తగాదాలో తీసుకెళ్లిన సదరు వ్యక్తిని విడుదల చేయాలని ఒక రాజకీయ నాయకుడు ఉన్నతాధికారులను కూడా సంప్రదించారు. అయినా డీఎస్పీ ససేమిరా అన్నాడు. ఎంతకూ వదిలిపెట్టకపోవడంతో రాత్రి 9.30 గంటల ప్రాంతం లో డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన సదరు నాయకుడు డీఎస్పీ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా పోలీసులు తీసుకొచ్చిన వ్యక్తిని తన వెంట తీసుకువెళ్లారు. ఇదంతా జరుగుతున్నా సదరు డీఎస్పీ ప్రేక్షకపాత్ర వహించాడు తప్పా ఏమి అనలేకపోయాడు. ఎక్కువగా మాట్లాడితే తన బండారం బయటపడుతుందని భయపడి డీఎస్పీ హోదాలో ఉన్నా ఆయన వెనుకంజ వేయడం అప్పట్లో చర్చనీయూంశంగా మారింది. ఇదే సబ్‌డివిజన్ పరిధిలో హైవే మీద ఉన్న ఒక పాఠశాల యూజమాన్యంలో పార్ట్నర్స్ మధ్య ఇటీవల గొడవలు వచ్చాయి. ఇరువర్గాలు ఒకరికి తెలియకుండా మరొకరు సదరు అధికారిని సంప్రదించారు. ఇంకేముంది ఒక వర్గం నుంచి రూ.2 లక్షలు, మరో వ ర్గం నుంచి రూ.3 లక్షలు వసూలు చేశాడు. ప్రస్తుతం ఈ పంచాయితీ కొనసాగుతోంది. ప్రొబేషనరీలకు అభయహస్తం.. సదరు అధికారి పరిధిలోని పోలీస్స్టేషన్లలో అం దరూ ప్రొబేషనరీ ఎస్సైలే విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన వీరికి అమ్యామ్యాల వసూళ్లపై అవగాహన తక్కువే. అలాం టివారికి విధుల్లో చేరిన కొద్దిరోజులకే అందరినీ తన చాంబర్‌కు పిలిపించుకుని నెలవారీ టార్గె ట్లు విధించారు. అప్పాలో కఠోర శిక్షణ పూర్తి చే సుకున్న ప్రొబేషనరీలకు సదరు అధికారి అవి నీతి పాఠాలు చెబుతున్నారు. వారికి ఆదాయ వ నరుల గుట్టు విప్పి వివరిస్తున్నారు. ‘మీకు నే నున్నా.. ఏమై నా నేను చూసుకుంటా.’ అని భ రోసా ఇచ్చారు. ప్రొబేషనరీ పిరియడ్‌లో తమ కు ఏమైనా రిమార్క్ వస్తే సర్వీస్‌లో ఇబ్బంది ఉంటుందని కొందరు ఎస్సైలు ఆందోళనకు గు రవుతున్నప్పటికీ బాస్ చెప్పినట్లు వినకుంటే ఇ బ్బందులు వస్తాయని మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది. రచ్చకెక్కుతున్న విబేధాలు.. డీఎస్పీ మామూళ్ల మత్తుతో అధికారులలో అభిప్రాయ బేధాలు తలెత్తుతున్నాయి. మామూళ్ల కోసం కిందిస్థాయి ఉద్యోగులను వేధించడం, వారిని పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ అనేకమార్లు అధికారుల మధ్య గొడవలు జరిగాయి. ఉన్నతాధికారి అని చూడకుండా కిందిస్థాయి ఉద్యోగులు పలుమార్లు ఆయనను నిలదీసిన సంఘటనలు అనేకం ఉన్నారుు. సారుకు కేసులంటే చిరాకు.. పోలీసులకు తమ బాధను చెప్పుకోవడానికి వ చ్చే బాధితులంటే సారుకు యమచిరాకు. బాధితులు వందలాదిగా వస్తున్నా కేసులు మాత్రం నమోదు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరకట్న వేధింపుల కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడమంటే సుతార మూ ఆయనకు ఇష్టముండదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన సారుకు కేసులు వద్దు.. బాధితులు వద్దు. కేవలం డబ్బులు ఇచ్చేవారు మాత్రమే కావాలి. ఇలాంటి అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని పలువురు బాధితులు కోరుతున్నారు. -
ఓబుళేసుకు ‘అనంత’ నివాళి
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్, ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన వజ్రకరూరు మండలం, కొనకొండ్ల గ్రామానికి చెందిన, అనంతపురం నివాసి సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ ముంతా ఓబుళేసు(48)కు ‘అనంత’ ఘన నివాళులర్పించింది. ఆదివారం ఆయన భౌతికకాయాన్ని అధికారులు స్థానిక అశోక్‌నగర్‌లోని మూడో క్రాస్‌లో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. డీఐజీ స్థాయి అధికారి శ్రీవాత్సవ సారథ్యంలో ప్రత్యేక భద్రత నడుమ ఛత్తీస్‌ఘడ్ నుంచి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో సీఆర్ఫీఎఫ్ అధికారులు ‘అనంత’కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అక్కడి చేరుకున్న బంధువులు, ఆత్మీయులు కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్సీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే బీ.గురునాథరెడ్డి, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్, అదనపు ఎస్పీ రాంప్రసాద్‌రావు, నగర డీఎస్పీ నాగరాజు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, పలువురు సీఐలు ఓబుళేసు భౌతిక కాయాన్ని సందర్శించారు. మృతదేహంపై పుష్ప గుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ‘ఓబుళేసు అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. మావోయిస్టులు పేల్చిన క్లైమోర్మైన్ ఘటనలో ఓబుళేసు మృతి చెందారని కలెక్టర్, ఎస్పీ చెప్పారు. ఛత్తీస్‌ఘడ్‌లోని కామనూర్ నుంచి దర్గాకు వెళుతుండగా గుర్తించిన మావోలు దాడికి తెగబడ్డారన్నారు. ప్రజల మాన, ప్రాణ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన ఓబుళేసు అమరుడన్నారు. తెలుగు తల్లి రుణం తీర్చుకున్న ముద్దుబిడ్డ అని అభివర్ణించారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. స్థానిక క్రైస్తవ శ్మశాన వాటికలో ఓబుళేసు భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పుర ప్రముఖులు, జిల్లా అధికారులు, బంధువులు, ఆత్మీయులు అంత్యక్రియలకు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. భర్త మృతిని జీర్ణించుకోలేని నాగమణి, తన కుమార్తె శిరోమణిని గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా రోదించిన తీరు కదిలించింది. ప్రజా సేవకుడిని పొట్టన పెట్టుకున్నారు: ప్రజా సేవకుడిని మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్ అన్నారు.సంఘం సభ్యులతో కలసి ఓబుళేసు భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఓబుళేసు 1991లో సీఆర్ఫీఎఫ్ 80వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి, హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారన్నారు. విధుల్లో అంకితభావంతో మెలుగుతూ ఉన్నతాధికారుల వద్ద మంచి గుర్తింపు పొందారన్నారు. -
జిల్లా పోలీసులకు ఉత్తమ పురస్కారాలు
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులకు రాష్ట్రవ్యాప్తంగా అవార్డులు ప్రకటించారు. ఈసారి జిల్లా నుంచి ముఖ్యమంత్రి శౌర్యపతకం, మహోన్నత సేవాపతకంలో స్థానం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా నలుగురికి ముఖ్యమంత్రి శౌర్యపతకం ప్రకటించగా అందులో జిల్లా కేంద్రంలో త్రీటౌన్ సీఐగా పనిచేస్తున్న తోటిచర్ల స్వామి ఎంపికయ్యారు. మహోన్నత సేవాపతకం ముగ్గురికి ప్రకటించగా సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మందికి పోలీస్ కఠిన సేవా పతకం ప్రకటించగా జిల్లాకు చెందిన ఆర్ హెడ్‌కానిస్టేబుల్ దిగంబర్, కరీంనగర్ సీసీఎస్ ఎస్సై అబ్దుల్ రవూఫ్‌కు చోటుదక్కింది. 160 మందికి పోలీస్సేవా పతకం ప్రకటించగా జిల్లాకు చెందిన సీసీఎస్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి, కరీంనగర్ రూరల్ ఏఎస్సై యూసుఫ్ జానీపాషా, గంభీరావుపేట పీఎస్ హెడ్‌కానిస్టేబుల్ (హెచ్‌సీ 79) 17వ బెటాలియన్‌కు చెందిన ఏపీఎస్పీ ఆర్ఐ సీతారాంనాయక్, ఆర్ఎస్సై బి.నాగయ్య, హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకర్, రమేశ్, కరీంనగర్ పీటీసీ నుంచి ఆర్ఎస్సై శంకర్, హెడ్‌కానిస్టేబుల్ అక్రం అలీ(హెచ్‌సీ 1104), ధర్మయ్య(హెచ్‌సీ 1295), లాల్ సింగ్(మెట్పల్లి పీఎస్) ఎంపికయ్యారు. సిరిసిల్ల డీఎస్పీ నర్సయ్యకు మహోన్నత సేవా పతకం సిరిసిల్ల రూరల్, న్యూస్‌లైన్: సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. శాంతిభద్రత పరిరక్షణలో తనదైన శైలితో ముందుకెళ్తూ నేరాల సంఖ్య తగ్గించడంలో డీఎస్పీ నర్సయ్య విజయవంతమయ్యారు. ఆయన తీసుకున్న చర్యలను గుర్తించిన ప్రభుత్వం ఈ మహోన్నత సేవా పతకాన్ని పతకాన్ని ప్రకటించింది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును నర్సయ్యకు ప్రదానం చేయనున్నారు. 1992లో సేవాపతకం, 2005లో ఉత్తమ సేవాపతకం, 2014లో మహోన్నత సేవా పతకం అందుకున్నారు. డీఎస్పీ నర్సయ్యకు ఈ అవార్డు రావడంపై సబ్ డివిజన్ సీఐలు నాగేంద్రచారి, రంగయ్య, శ్రీనివాస్, ఎస్సైలు హర్షం ప్రకటించారు. ఆయనకు అభినందనలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి
నకరికల్లు, న్యూస్‌లైన్: మండలంలోని చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందారు. కుంకలగుంట గ్రామానికి చెందిన పద్మా కోటేశ్వరరావు (50) గుంటూరులో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులను కలిసేందుకు స్వగ్రామం వచ్చారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఉదయం తన బావమరిది తాడువాయి శ్రీనివాసరావుతో కలిసి ద్విచక్రవాహనంపై గుంటూరు బయలుదేరారు. మార్గమధ్యంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి గేదె ఒక్కసారిగా అడ్డురావడంతో ద్విచక్ర వాహనం దానిని ఢీకొట్టడంతో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్ఐ కె.ప్రభాకర్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని 108లో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. కోటేశ్వరరావు మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. కోటేశ్వరరావు మృతి సమాచారం తెలుసుకున్న ఏఆర్ సిబ్బంది, బంధువులు వైద్యశాలకు తరలివచ్చారు. మృతుడి భార్య లక్ష్మీదేవి, ముగ్గురు కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కోటేశ్వరరావు మృతదేహానికి స్వగ్రామం కుంకలగుంటలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ కె.ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ దుర్మరణం
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన విఠల్ (48) హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన విధులు నిర్వహించడానికి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంది సమీపంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నది. దీంతో విఠల్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డీఎస్పీ వెంకటేశ్, రూరల్ సీఐ రఘు, ఎస్ఐ రాజశేఖర్, ఇంద్రకరణ్ ఎస్ఐ లాలూనాయక్లు అక్కడికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విఠల్‌కు భార్య భూదేవి, కూతుళ్లు శ్రవంతి, శ్రావణి, సాయిభవాని, కొడుకు సాయి కార్తీక్ ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. విఠల్ భార్య భూదేవి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసుల సంతాపం హెడ్‌కానిస్టేబుల్ విఠల్ మృతి పట్ల ఇంద్రకరణ్ ఎస్ఐ లాలూనాయక్తోపాటు సిబ్బంది ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో విఠల్ అంకితభావంతో పనిచేసేవారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. -
84మందికి ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి
గుంటూరు, న్యూస్‌లైన్: గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలోని 84మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్కుమార్గురువారం ఉత్తర్వులు జారీచేశారు. హెడ్‌కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన వారికి వెంటనే ఆయా పోలీసుస్టేషన్లలో రిపోర్టుచేయాలని ఆదేశించారు. పదోన్నతి పొందిన వారిలో డి.జయరావు, ఎస్.పరిశుద్ధరావు, వి.ఎన్.రాజేశ్వరి, వి.కవితాకుమారి, ఎం.శ్యామ్‌ప్రసాద్, టి.ప్రభాకరరావు, జె.సురేష్‌బాబు, ఆర్.సత్యనారాయణ, పి.ఆనందకుమార్, కె.గోపాలరావు, వి.నాగేశ్వరరావు, ఎస్.కె.ఎం.డి.ఆలి, కె.రాఘవేంద్రరావు, కె.ధర్మరాజు, ఎస్.కె.నజీర్అహ్మద్, అబ్దుల్ అలిం, పి.బాబూరావు, జి.వెంకటేశ్వర్లు, జి.ఆర్.మోహన్‌రావు, కె.బాబు, పి.సాంబశివరావు, ఆర్.షంషూద్దీన్, ఎ.గోపికృష్ణ, పి.వెంకటేశ్వర్లు, కె.ఆర్.దుర్గారావు, టి.రోశయ్య, కె.వి.రమేష్‌బాబు, సీహెచ్వెంకటేశ్వర్లు, ఎ.కృష్ణ, ఎస్.కె.సిలార్‌సాహెబ్, పి.పోలరాజు, ఐ.సాంబశివరావు, ఎస్.కె.అబ్దుల్ మసీద్, కె.సత్యనారాయణ, ఎం.డి.అలివలిషరీఫ్, ఎన్.సాంబశివరావు, పి.వనమాలికలు, ఎస్.కె.మస్తాన్‌వలి, హరికృష్ణారావు, ఎం.ఎస్.ఎన్.రాజు, ఎన్.చంద్రరావు, వై.వి.సుబ్బయ్య, ఐ.ఫ్రాన్సిస్, టి.వి.వెంటేశ్వరరావు, బి.నరసింహారావు, మహమ్మద్ సుభాని, టి.భాగ్యలక్ష్మి, కె.ధనలక్ష్మి, ఎస్.కుర్షిద్బేగం, పి.వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.నాయక్, బి.సాంబశివరావు, ఎం.జోజి, కె.కృష్ణారావు, ఎస్.కె.ఎం.డి.ఫింబర్, పి.సాంబశివరావు, జి.సత్యనారాయణ, బి.రామకోటేశ్వరరావు, వి.రవీంద్రబాబు, వై.ఎస్.శర్మ, ఎస్.కె.సుభాని, ఎస్.డి.ఇస్మాయిల్, బి.బాబూరావు, బి.ఏసురత్నారావు, కె.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు, కె.సాంబశివరావు, సీహెచ్‌శ్రీనివాసరావు, కె.రాంబాబు, జి.వెంకటాద్రి, ఎ.సాంబశివరావు, జి.కృష్ణారావు, ఎస్.కె.నాగూర్‌షరీఫ్, కె.ఎస్.ప్రసాదరావు, కె.శ్రీహరి, ఎన్.సీతయ్య, టి.పెదబాబు, టి.వెంకటేశ్వరరావు, ఎం.ఆర్.మోహన్‌రావు, డి.ఎన్.మల్లేశ్వరరావు, పి.వెంకటేశ్వర్లు, ఎం.నర్సారెడ్డి, కె.ఎస్.నాగేశ్వరరావు, టి.సుబ్బారావు ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన తులసి చైతన్య
ఐర్లాండ్:రాష్ట్ర పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తులసి చైతన్య చరిత్ర సృష్టించారు. ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్లో జరు గుతున్న ప్రపంచ పోలీసు క్రీడల్లో చైతన్య మూడు బంగారు, మూడు రజత పతకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. భారతదేశ చరిత్రలో ఓ అంతర్జాతీయ వేదికపై జరిగిన క్రీడల్లో ఒక క్రీడాకారుడు ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్ర క్రీడల విభాగ అద నపు డిజి రాజీవ్ త్రివేదీ శిష్యుడైన చైతన్య ఏడాది క్రితమే ఈత పోటీల్లో వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్న చైతన్య ఇటీవల జరిగిన జాతీయ పోలీసు క్రీడోత్సవాలలో పతకాలు సాధించి సత్తాచాటారు. దీంతో ప్రపంచ పోలీసు క్రీడలకు అతను ఎంపికయ్యారు. పలు విభాగాల్లో పోటీ పడ్డ చైతన్య మొదట 4×50 మీటర్ల బటర్ ఫ్లై పోటీల్లో బంగారు పతకాన్ని సాధించగా అనంతరం 4×50 మీటర్ల మిడ్లే రిలేలోనూ సత్తా చాటి మరో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు. దీని తరువాత వంద మీటర్ల ఫ్రీ స్టైల్లోనూ స్వర్ణ పతకం అందుకున్నారు. దీని తరువాత 50 మీ టర్ల ఫ్రీ స్టైల్, వంద మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో మూడు రజత పతకాలు సాధించి రికార్డు సాధించారు. అమెరికా, కెనడా, ఆ స్ట్రేలియాతో పాటు పలు యూరప్ దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ ఈత పోటీల్లో తొలి ప్రయత్నంలోనే చైతన్య ఆరు పతకాలు సాధించడంపట్ల రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి, క్రీడల విభాగ అదనపు డిజి రాజీవ్ త్రివేదీ సంతోషం వ్యక్తం చేశారు.