
తమిళనాడు,టీ.నగర్: యువతితో హెడ్‌కానిస్టేబుల్ రాసలీల సాగిస్తుండగా గమనించిన ప్రజలు అతన్ని ఇంట్లోనే నిర్బంధించారు. సదరు యువతి, హెడ్‌కానిస్టేబుల్‌ను ప్రజలు దూషించడం, యువతి కాళ్లావేళ్లా పడి ప్రాథేయపడుతున్న వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా వ్యాపిస్తోంది. తిరునెల్వేలి జిల్లా పావూర్ సత్రంలో హెడ్‌కానిస్టేబుల్‌గా నటరాజన్ (35) పని చేస్తున్నారు. ఇతని సొంత గ్రామం వీకే.పురం సమీపాన గల ఠానా. ఇతనికి వివాహమై పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు గ్రామంలో ఉండగా నటరాజన్ కిలప్పావూరు సమీపం రాజేశ్వరి నగర్‌లో గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.
ఇలా ఉండగా స్థలం తగాదాకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతితో నటరాజన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ యువతికి వివాహమైంది. నటరాజన్ సదరు యువతిని రహస్యంగా కలుసుకునేవాడు. ఈ వ్యవహారం ఇరుగుపొరుగు వారికి తెలిసింది. గురువారం రాత్రి ఇరువురు ఇంట్లో రాసలీల సాగిస్తుండగా ఇరుగుపొరుగు గమనించి తలుపులు మూసి తాళం వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధనలక్ష్మి అక్కడికి చేరుకుని హెడ్‌కానిస్టేబుల్‌ను విడిపించారు. ఆ సమయంలో ప్రజలు వారిని దూషించడం, యువతి ప్రాధేయపడుతున్న దృశ్యాలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment