ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: కర్ణాటకలోని యలహంక పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గత ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. వివరాలు.. కర్ణాటకలోని యలహంక ప్రాంతంలో ఒక 26 ఏళ్ల యువతి అర్దరాత్రి వీధికుక్కలకు ఆహరం వేయడానికి బయటకు వచ్చింది. అక్కడ అంతా చీకటిగా ఉంది. అప్పుడు ఆమెకు కాస్త దూరంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి చీకట్లో నిలబడి యువతిని చూస్తూ అసభ్యకరరీతిలో ప్రవర్తించాడు.
అంతటిలో ఆగకుండా.. అతని సెల్‌ఫోన్ టార్చ్‌లైట్‌ను ఆన్‌చేసి యువతి దుస్తులపై పడేలా చేశాడు. దీన్ని చూసిన యువతి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే గట్టిగా అరించింది. దీంతో భయపడిపోయిన చంద్రశేఖర్.. తాను పోలీసు కానిస్టేబుల్ అని, అమృతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తానని తెలిపాడు. అతని విపరీత చర్యను ఒక బాటసారి కూడా వీడియో తీశాడు. ఈ క్రమంలో భయపడిపోయిన కానిస్టేబుల్ ఆ వీడియో తొలగించాలని కోరాడు.
ఇది బయటకు వస్తే తన ఉద్యోగం పోతుందని ప్రాధేయ పడ్డాడు. కాగా, ఘటన జరిగిన రెండు రోజులకు బాటసారి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది వైరల్‌గా మారింది. దీంతో గమనించిన అధికారులు హెడ్ కానిస్టేబుల్‌ను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో కలకలంగా మారింది.
చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment