Flash
-
ఢాం... ఢాం... ఒకసారి వెనక్కి వెళదాం
పండగకు ముందే ‘ఢాం... ఢాం’లు మొదలయ్యాయి. ఎప్పుడూ శబ్దాలు వినడమేనా, ఈసారి వాటి చరిత్ర కొంచెం తెలుసుకుందాం. లాంగ్ లాంగ్ ఎగో.... అనగా క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో చైనాలో టపాసులు లేవు. అయిననూ ‘ఢాం... ఢాం’లు మాత్రం ఉండేవి. వెదురు గొట్టాలను మంటల్లోకి విసిరేవారు. వెదురు లోపల కణువుల మధ్య ఉన్న ఎయిర్ పాకెట్లు వేడెక్కి పేలి పోవడంతో పెద్ద శబ్దాలు వచ్చేవి.పదవ శతాబ్దానికి చెందిన ఒక చైనీస్ ఆల్కెమిస్ట్ ద్వారా కొత్త పటాసులు రంగంలోకి వచ్చాయి. పొటాసియం నైట్రేట్, సల్ఫర్, బొగ్గును కలిసి వెదురు గొట్టాల్లో పోసి ‘ఢాం’ అనిపించేవారు. ఆయన తయారు చేసిన మిశ్రమం ఆ తరువాత కాలంలో ‘గన్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. ఇది మానవ నిర్మిత మొదటి బాణసంచా అంటారు. ఈ ప్రమాదకరమైన, ప్రకాశవంతమైన ఆవిష్కరణలు సిల్క్ రూట్ గుండా ఐరోపా వరకు వెళ్లాయి. ఆ తరువాత కాలంలో వాటి తయారీకి సంబంధించిన సాంకేతికత పెరగడంతో విందులు, వినోదాలు, పండగలలో బాణసంచా పేల్చడం మామూలైపోయింది. -
బాల.. భళా..! వరల్డ్ రికార్డు సాధించిన హన్విద్..
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు భాస్కరరాజు మనవడు (నాలుగు నెలల బాలుడు) హన్విద్కృష్ణ వరల్డ్ రికార్డు సాధించాడు. 347 ఫ్లాష్ కార్డ్స్‌ను గుర్తించడంలో నోబుల్ వరల్డ్ రికార్డు సాధించినట్టు భాస్కరరాజు సోమవారం తెలిపాడు. బాలుడు ఫ్లాష్ కార్డ్స్ గుర్తించిన వీడియోను ఆన్లైన్లో నోబుల్ సంస్థకు పంపించగా, అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.ఇవి చదవండి: కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం -
Afghan: ఆకస్మిక వరదలు.. 33 మంది మృతి!
అఫ్గానిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. రాజధాని కాబూల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనాన్ సాక్ దేశంలో సంభవించిన వరదలకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. వరదల కారణంగా దేశంలో 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని అబ్దుల్లా జనాన్ తెలిపారు. వర్షాల కారణంగా 200 పశువులు మృతిచెందాయని, 800 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నాయన్నారు. 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ,పశ్చిమ ఫరా, హెరాత్, సదరన్ జాబుల్, కాందహార్లకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అఫ్గానిస్తాన్‌లోని 34 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత ఫిబ్రవరిలో తూర్పు అఫ్గానిస్తాన్‌లో భారీ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. మార్చిలో కురిసిన వర్షాలకు 60 మంది మృత్యువాత పడ్డారు. అఫ్గానిస్తాన్‌లోని వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి గత ఏడాది హెచ్చరించింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమని పేర్కొంది. -
ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్‌మీకూ వచ్చిందా?
Emergency Alert -Severe: స్మార్ట్ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ మరోసారి మొబైల్ వినియోగదారులను గందరగోళంలో పడేసింది. గతంలో మాదిరిగి దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లకు ప్లాష్ మెసేజ్‌ఒకటి వచ్చింది. ఫ్లాష్ మెసేజ్‌తోపాటు పాటు బిగ్గరగా బీప్ సౌండ్ కూడా వచ్చింది. అయితే ఈ అత్యవసర సందేశానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా ఇండియాలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మళ్లీ పరీక్షించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(సెప్టెంబరు 21) బీప్ సౌండ్‌తోపాటు మెసేజ్‌లు వచ్చాయి. అలాగే ఆందోళన వద్దు అన్న మెసేజ్‌లు కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వచ్చాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ సెండ్ చేసిన టెస్టింగ్ మెసేజ్ ఇది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగానే ఈ మెసేజ్ పంపినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలో పరీక్షిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో మెసేజ్ వచ్చింది. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) మొబైల్ ఆపరేటర్లు , సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం , ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటామని టెలి కమ్యూ నికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.భూకంపాలు, సునామీ, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల కోసం మరింత సన్నద్ధంగా ఉండటానికి ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. కాగా జూలై 20,ఆగస్టు 17న కూడా ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్‌లు వచ్చాయి. -
ఆదిపురుష్ ఫస్ట్ డే రికార్డ్ కష్టమేనా
-
కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...
చాలామంది పలు రకాల ఆవిష్కరణలు సృష్టిస్తారు. అవన్నీ కూడా తాము ఎదర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆవిష్కరణలే. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి విస్తుపోయేలా కళ్లు చెదిరే ఒక సరికొత్త ఆవిష్కరణ సృష్టించాడు. వివరాల్లోకెళ్తే....యూఎస్‌కి చెందిన బ్రియాన్ స్టాన్లీ అనే ఇంజనీర్ క్యాన్సర్ కారణంగా కన్నుని పోగొట్టుకున్నాడు. దీంతో అతను కృత్రిమ కన్నుని రూపొందించాడు. ఐతే అది మాములు కన్ను కాదు ఏకంగా లైట్లా వెలిగే కన్నుని తయారు చేశాడు. తానే స్వంతంగా ప్రోథెస్టిక్ కన్నుని రూపొందించాడు. తన కనుపాప ఫ్లాష్ లైట్లా వెలిగేలా రూపొందించాడు. ఈ కన్నుని టైటానియం సైబర్గ్ కన్నుగా పిలుస్తారు. ఇది ఒక హెడ్‌ల్యాంప్ లాగా పనిచేస్తుంది. అదేనండి బొగ్గుగనుల్లో ఉండేవాళ్లు పెట్టుకునే క్యాప్ల్యాంప్లా ఉంటుందన్నమాట. చీకటిలో సులభంగా చదవడానికి ఉపకరిస్తుందని, పైగా ఈ లైట్ వేడిగా ఉండదని చెబుతున్నాడు స్టాన్లీ. అంతేగాదు ఈ ఫ్లాష్ లైట్ కన్ను బ్యాటరీ 20 గంటలు వరకు పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు బ్రియాన్ తన ప్రోథిస్టిక్ కన్నుని ఎలా రూపొందించాడో వివరిస్తూ...వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ మేరకు నెటిజన్లు వావ్ వాట్ ఏ ఆవిష్కరణ, సైన్స్‌తో ఏదైన సాధించవచ్చు అంటూ స్టాన్లీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Brian Stanley (@bsmachinist) (చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్) -
చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!
Last Recall Of Memories That we Have Experienced In Life: ఇంతవరకు శాస్త్రవేత్త పలు ఆవిష్కరణలతో వైజ్ఞానిక శాస్త్రాన్ని కొత్తపుంతలు తొక్కించారు. వైద్యా శాస్త్రానికి సాంకేతికతను జోడించి సాధ్యం కావు అనుకునే వాటన్నింటిని సాధ్యం చేయడమే కాక. సామాన్య మానవుడికి సైతం గొప్ప ఆధునికతతో కూడాని వైద్యం అందేలా చేశారు. ఇన్ని పరిశోధనలు చేసినప్పటికీ శాస్త్రవేత్తల బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క విషయం మరణం. మరణించే ముందు మనలో ఏం జరుగుతుంది ఆ తర్వాత ఎక్కడి వెళ్తారు అనే అంతుబట్టని చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరికాయంటున్నారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకెళ్తే...చనిపోవడానికి ముందు మన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలను చివరిగా గుర్తుచేసుకుంటుందని డాక్టర్ జెమ్మార్ చెబుతున్నారు. ఈ మేరకు చనిపోతున్నప్పుడు మెదడు ఆలోచనలను రికార్డు చేయడంతో శాస్తవేత్తలకు మానవ మెదడును మరింత అర్థం చేసుకునే దిశగా అడుగులు వేయగలిగామని చెప్పారు. ఈ రికార్డింగ్ ప్రమాదవశాత్తు జరిగిందని తెలిపారు. ఈ మేరకు న్యూరో సైంటిస్టులు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 87 ఏళ్ల రోగి మెదడు తరంగాలపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఆ రోగి గుండె పోటుకు గురై చనిపోతుతన్నప్పుడు అతని మెదడు ఊహించని విధమైన సంకేతాలను అందించింది. మనిషి చివరి సమయంలో రికార్డింగ్ మెమరీ రిట్రీవల్ ఊహించని మెదడు కార్యకలాపాలను వెల్లడించిందన్నారు. అవి తన జీవితపు తాలుకా జ్ఞాపకాలైన అయి ఉండవచ్చని చెప్పారు. రోగి మెదడు ఆలోచనలు గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత 30 సెకన్ల పాటు కొనసాగిందని తెలిపారు. అంతేకాదు గుండె పనిచేయడం ఆగిపోయే ముందు నాడీ డోలనాల్లో మార్పులను చూశామన్నారు. జ్ఞాపకశక్తి పునరుద్ధరణలో ప్రమేయం ఉన్న డోలనాలను ఉత్పత్తి చేయడం ద్వారా, మెదడు మనం చనిపోయే ముందు ముఖ్యమైన జీవిత సంఘటనల చివరి రీకాల్‌ను ప్లే చేస్తుందని ఇది మరణానికి సమీపంలో నివేదించబడిన అనుభవాల మాదిరిగానే ఉంటుందని డాక్టర్ జెమ్మార్ వెల్లడించారు. ఈ పరిశోధనలు ఖచ్చితంగా జీవితం ఎప్పుడు ముగుస్తుంది, అవయవ దానం చేసే సమయానికి ఏం జరుగుతుంది తదుపరి ప్రశ్నలకు సంబంధించిన అవగాహనను సవాలు చేస్తాయంటున్నారు వైద్యులు. (చదవండి: న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని ఇంజెక్ట్ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి) -
హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం.. చీకటిలో యువతిని చూస్తూ..
బెంగళూరు: కర్ణాటకలోని యలహంక పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గత ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. వివరాలు.. కర్ణాటకలోని యలహంక ప్రాంతంలో ఒక 26 ఏళ్ల యువతి అర్దరాత్రి వీధికుక్కలకు ఆహరం వేయడానికి బయటకు వచ్చింది. అక్కడ అంతా చీకటిగా ఉంది. అప్పుడు ఆమెకు కాస్త దూరంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి చీకట్లో నిలబడి యువతిని చూస్తూ అసభ్యకరరీతిలో ప్రవర్తించాడు. అంతటిలో ఆగకుండా.. అతని సెల్‌ఫోన్ టార్చ్‌లైట్‌ను ఆన్‌చేసి యువతి దుస్తులపై పడేలా చేశాడు. దీన్ని చూసిన యువతి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే గట్టిగా అరించింది. దీంతో భయపడిపోయిన చంద్రశేఖర్.. తాను పోలీసు కానిస్టేబుల్ అని, అమృతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తానని తెలిపాడు. అతని విపరీత చర్యను ఒక బాటసారి కూడా వీడియో తీశాడు. ఈ క్రమంలో భయపడిపోయిన కానిస్టేబుల్ ఆ వీడియో తొలగించాలని కోరాడు. ఇది బయటకు వస్తే తన ఉద్యోగం పోతుందని ప్రాధేయ పడ్డాడు. కాగా, ఘటన జరిగిన రెండు రోజులకు బాటసారి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది వైరల్‌గా మారింది. దీంతో గమనించిన అధికారులు హెడ్ కానిస్టేబుల్‌ను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో కలకలంగా మారింది. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
డిసౌజాకోసం సర్ ప్రైజ్ ఫ్లాష్ మాబ్!
ముంబైః ఉత్తమ నృత్య దర్శకుడు, ఫిల్మ్ మేకర్ రెమో డిసౌజా కు ఫ్లాష్ మాబ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. యాక్టర్ ఫైసల్ ఖాన్, డ్యాన్సర్స్ కున్వర్ అమర్, సిద్ధేష్ పాయ్ లతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో.. 'డ్యాన్స్ ప్లస్' సీజన్ టు సెట్ లో ఆర్టిస్టులకు సైతం ప్రత్యేక అనుభూతిని పంచారు. డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షో.. సీజన్ టు సెట్ కు వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాను సహ నృత్యకారులు ఫ్లాష్ మాబ్ ప్రదర్శనతో సర్ ప్రైజ్ చేశారు. మెంటర్స్ శక్తి మోహన్, పునిత్ జె పాఠక్, ధర్మేష్ యలండే కూడా ఫ్లాష్ మాబ్ లో చేరి ఉత్సాహంగా నృత్యం చేశారు. అంతేకాదు పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్స్ తోపాటు, ఆర్టిస్టులు, హోస్ట్.. రాఘవ్ జూయల్ సైతం ఫ్లాష్ మాబ్ లో పాల్గొని రెమో పాపులర్ సాంగ్స్.. 'బడ్తమీజ్ దిల్', 'దిల్లీవాలీ గర్ట్ ఫ్రెండ్' కు హుషారెత్తించేట్టు స్టెప్పులేస్తూ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. డ్యాన్స్ ప్లస్ నిర్వాహకులు నన్ను పిలిచి రెమో గారి ఫ్లాష్ మాబ్ గురించి చర్చించారని, ఆమాట అనడమే అదృష్టంగా భావించిన తాను వెంటనే సరేనని చెప్పేశానని డ్యాన్సర్ అమర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది డ్యాన్సర్లను, కొరియోగ్రాఫర్లను తయారు చేసిన రెమో డిసౌజా కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని, అందుకే ఆయనకోసం ఫ్లాష్ మాబ్ అంటే మరోమాట లేకుండా ఒప్పేసుకున్నానని అమర్ ఓ ప్రకటనలో చెప్పారు. స్పెషల్ పెర్ఫామెన్స్ గురించీ ఏమీ తెలియకపోయినా.. గొప్ప నృత్యకారుడైన రెమో, సూపర్ జడ్జి.. డ్యాన్స్ ప్లస్ సీజన్ 2 లో ఉండటం కంటెస్టెంట్లకు అదే గొప్ప వరం అంటూ అమర్ అభివర్ణించారు. అయితే తనకోసం డ్యాన్సర్లు ప్రత్యేకంగా ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఎంతో ఆనందాన్నిస్తుందంటూ ఈ సందర్భంలో రెమో తెలిపారు. విద్యార్థులంతా తనకు కేవలం స్టూడెంట్స్ గా మాత్రమే కాదని, వారంతా తన పిల్లల్లాంటివారని, తన జీవితంలో ఓ భాగమని రెమో అన్నారు. తనవల్లే ఇక్కడవరకూ వచ్చామని విద్యార్థులు చెప్పినా.... వారివల్లే నేనిక్కడున్నానని నేనంటాను అంటూ చెప్పడం.. ఆయన నిరాడంబరతను వ్యక్తం చేస్తోంది. -
ఉగ్రరూపం దాలుస్తున్న పెన్‌గంగా