![Received An Emergency Alert Your Phone Today here is the reason - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/15/EmergencyAlert_Severe.jpg.webp?itok=MYFXz0FE)
Emergency Alert -Severe: స్మార్ట్ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ మరోసారి మొబైల్ వినియోగదారులను గందరగోళంలో పడేసింది. గతంలో మాదిరిగి దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లకు ప్లాష్ మెసేజ్‌ఒకటి వచ్చింది. ఫ్లాష్ మెసేజ్‌తోపాటు పాటు బిగ్గరగా బీప్ సౌండ్ కూడా వచ్చింది. అయితే ఈ అత్యవసర సందేశానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా ఇండియాలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మళ్లీ పరీక్షించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(సెప్టెంబరు 21) బీప్ సౌండ్‌తోపాటు మెసేజ్‌లు వచ్చాయి. అలాగే ఆందోళన వద్దు అన్న మెసేజ్‌లు కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వచ్చాయి.
భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ సెండ్ చేసిన టెస్టింగ్ మెసేజ్ ఇది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగానే ఈ మెసేజ్ పంపినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలో పరీక్షిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మెసేజ్ వచ్చింది. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?)
మొబైల్ ఆపరేటర్లు , సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం , ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటామని టెలి కమ్యూ నికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.భూకంపాలు, సునామీ, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల కోసం మరింత సన్నద్ధంగా ఉండటానికి ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. కాగా జూలై 20,ఆగస్టు 17న కూడా ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్‌లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment