alert
-
ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
-
కేరళలో మళ్లీ మంకీపాక్స్ కలకలం
తిరువనంతపురం:మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలో మళ్లీ నమోదయ్యాయి. తాజాగా రెండు కేసులు వెలుగుచూడడం ఇక్కడ కలకలం రేపింది. యూఏఈ నుంచి ఇటీవలే కేరళ వచ్చిన ఇద్దరికి మంకీ పాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.వయనాడ్‌కు చెందిన వ్యక్తికి తొలుత మంకీపాక్స్ నిర్ధారణ కాగా తాజాగా కన్నూర్ జిల్లా వాసికి వైరస్ సోకినట్లు తేలింది.దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.ఇదిలాఉంటే కేరళలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
భూమివైపు దూసుకొస్తున్న ఐదు భారీ గ్రహశకలాలు
అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్ష పరిశోధనలు సాగిస్తుంటుంది. ఈ నేపధ్యంలో ఖగోళంలో జరిగే దృగ్విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంటుంది.తాజాగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఐదు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. ఈ ఖగోళ శకలాలు 2024, డిసెంబరు 11న భూమిని దాటుతాయని తెలిపింది. వీటివలన భూమికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని నాసా తెలిపింది. నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై అధ్యయనం చేసేందుకు ఇది సదవకాశంగా భావిస్తున్నారు. ఆ గ్రహశకలాల వివరాలను శాస్త్రవేత్తలు తెలియజేశారు.గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3గ్రహశకలం 2018 ఎక్స్‌యూ 3.. ఈ సమూహంలో అతిపెద్దది. దాదాపు 811 అడుగుల ఎత్తు కలిగిన ఇది విమానం సైజును పోలి ఉంటుంది. ఇది 4 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటనుంది. శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం నిర్మాణాన్ని, కదలికలను అధ్యయనం చేయనున్నారు.గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11గ్రహశకలం 2024 ఎక్స్జెడ్ 11.. ఎక్స్‌యూ 3 కంటే కొంచెం చిన్నది. 71 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది భూమికి 2.112 మిలియన్ మైళ్లు దూరం నుంచి దాటనుంది.గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11గ్రహశకలం 2024 ఎక్స్ఎల్ 11 ఈ సమూహంలో అతి చిన్నది. కేవలం 20 అడుగుల పరిమాణంతో, 7,35,000 మైళ్ల దూరం నుంచి భూమిని దాటుతుంది. దీని పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, దీని పరిశోధనలో అనేక విషయాలు వెల్లడికానున్నాయి.గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1గ్రహశకలం 2024 ఎక్స్‌కే 1 పరిమాణంలో ఒక బస్సును పోలి ఉంటుంది. 31 అడుగుల పరిమాణంతో, ఇది భూమికి 1.16 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14గ్రహశకలం 2024 డబ్ల్యూబీ 14 వెడల్పు 86 అడుగులు. ఇది 4.3 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమిని సురక్షితంగా దాటుతుంది. నాసా తన ప్రయోగశాల నుండి ఈ గ్రహశకలాలను పర్యవేక్షిస్తోంది. శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక.. -
అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్.. 17 దేశాల్లో మార్బర్గ్ వైరస్ ఆనవాళ్లు
కిగాలీ : విదేశాలకు రాకపోకలు నిర్వహించే ప్రయాణికులకు ముఖ్యగమనిక. తూర్పు ఆఫ్రికా దేశం రువాండాలో మార్బర్గ్ వైరస్‌లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి 15 మంది మరణించారు. వందల మందికి సోకింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో )..ఈ వైరస్ కూడా ఇతర వైరస్‌లా ప్రపంచమంతా విస్తరించకముందే నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 17 దేశాల్లోని ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయనే అంచనాలతో డబ్ల్యూహెచ్‌వో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఆయా దేశాల్ని అప్రమత్తం చేసింది. మార్బర్గ్ వైరస్ అంటేమార్బర్గ్ వైరస్ అంటే ఎబోలా కుటుంబానికి చెందిన ఒక రకమైన హెమరేజిక్ ఫీవర్ వైరస్‌నే. అడవుల్లో తిరిగే రౌసెట్టూస్ అనే గబ్బిలాలలో ఈ వైరస్ ఎక్కువగా ఆవాసం ఉంటుంది. ఈ వైరస్ మనుషుల్లో కనిపించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో ఈ వైరస్ పలు మార్లు వ్యాపించింది. తాజాగా, మరోసారి ఈ వైరస్ ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. It's 21 days with no active cases on the 42-day countdown to declaration of end of #Marburg outbreak. @WHO & partners continue to support ongoing 🇷🇼 govt efforts in the Marburg response, with focus on surveillance, IPC, recovered pt (survivor) program & continuity of services. pic.twitter.com/4aaziYd01p— WHO Rwanda (@WHORwanda) November 30, 2024 -
వాయు'గండం'.. ఆరు రోజులపాటు వానలే వానలు
-
ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల అలర్ట్ లిస్ట్‌లో మరో 13 కంపెనీలను జోడించింది. తద్వారా అలర్ట్ లిస్ట్‌లో చేరిన కంపెనీల సంఖ్య 88కి చేరుకుంది.రేంజర్ క్యాపిటల్, టీడీఎఫ్ఎక్స్, ఐనెఫెక్స్, యార్కర్ఎఫ్ఎక్స్, గ్రోలైన్, థింక్ మార్కెట్స్, స్మార్ట్ ప్రాప్ ట్రేడర్, ఫండెడ్నెక్ట్స్, వెల్ట్రేడ్, ఫ్రెష్ఫారెక్స్, ఎఫ్ఎక్స్ రోడ్, డీబీజీ మార్కెట్స్, ప్లస్వన్ట్రేడ్ వీటిలో ఉన్నాయి. అలర్ట్ లిస్ట్ సమగ్రమైనది కాదని, జాబితాలో లేనంత మాత్రాన ఆ కంపెనీని అధీకృతమని భావించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానాఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్–1999 (ఫెమా) ప్రకారం ఫారెక్స్‌లో డీల్ చేయడానికి అధికారం లేని లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు–2018 ప్రకారం ఫారెక్స్ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ (ఈటీపీ) ఆపరేట్ చేయడానికి అధికారం లేని కంపెనీల పేర్లను అలర్ట్ లిస్ట్‌లో చేరుస్తారు. -
దూసుకొస్తున్న దానా తుపాన్
-
సోల్‌మేట్స్‌తో సోషల్‌గా...మనసుకు మేలే..!
సోషల్ మీడియా చేసే చెరుపు గురించి చర్చ ఉన్నప్పటికీదానిని సరిగా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.స్నేహాలు, సమూహాలు మనకంటూ కొందరున్నారన్న భరోసా ఇస్తేసలహాలు సూచనలు కూడా ఇక్కడి నుంచి అందడం వల్లఆందోళన దూరం అవుతుందంటున్నారు.సోషల్ మీడియాను మెరుగ్గా ఎలా అర్థం చేసుకొని ఉపయోగించాలి?సోషల్ మీడియా అంటే అదొక అవాస్తవిక ప్రపంచం, అక్కడున్న వారికి ఇబ్బందులు తప్పవు, మహిళల మీద ట్రోలింగ్ ఉంటుంది అనే అభి్ర΄ాయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంది. సోషల్ మీడియాను సరిగ్గా వాడితే మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషన్, నిరాశ వంటివాటితో ఇబ్బంది పడేవారికి సోషల్ మీడియా ధైర్యాన్ని, మద్దతును, అర్థం చేసుకునే స్నేహితులను అందిస్తుందని అంటున్నారు.ఆత్మీయ బంధాలను అల్లుకోవచ్చుసోషల్ మీడియాలోని స్నేహాలన్నీ వ్యర్థమని, అక్కడ పరిచయమైన వారిలో నిజాయితీ ఉండదనే అ΄ోహ చాలామందిలో ఉంది. కానీ మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారిలోని నిజాయితీని గుర్తించొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. అనేక ్ర΄ాంతాల్లో నివసిస్తున్న వారు, అనేక సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు సోషల్‌మీడియాలో తారసపడుతుంటారు. అందులో మన భావాలకు, అభి్ర΄ాయాలకు తగ్గవారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారితో స్నేహం చేయడం ద్వారా మనలోని ఒంటరితనం దూరమవుతుంది. సోషల్‌మీడియాలో పరిచయమై ఆ తర్వాత అత్యంత ఆత్మీయ మిత్రులుగా మారినవారు బోలెడంత మంది ఉన్నారు. ఇవి మనసుకు బలం ఇస్తాయి.అభిరుచులకు తగ్గ స్నేహాలు మన చుట్టూ ఉన్నవారు మన అభిరుచులకు తగ్గట్టే ఉంటారని అనుకోలేం. కానీ సోషల్‌మీడియాలో ఒకే అభిరుచి, ఇష్టాయిష్టాలు కలిగిన వారు ఒకచోట చేరే అవకాశం ఉంటుంది. పుస్తక ప్రియులైతే ఒకచోట, చిత్రలేఖనం ఇష్టమైనవారంతా ఒకచోట, సినిమాలపై ఆసక్తి ఉంటే ఒక గ్రూప్, ప్రయాణాలు ఇష్టపడేవారు మరో గ్రూప్.. ఇలా మన ఇష్టాలకు తగ్గట్టు మెలిగే వారు కనిపిస్తారు. ఆ అంశాల గురించి చర్చిస్తారు. వారి అనుభవాలు వినొచ్చు. మన అభి్ర΄ాయాలు పంచుకోవచ్చు.. ఈ గ్రూపులు మన అవగాహన పరిమితిని విస్తృతం చేస్తాయి. తద్వారా మనసును విశాలం చేస్తాయి.అభిప్రాయాలు సరి చేసుకోవచ్చుసోషల్ మీడియా భిన్నాభిప్రాయాలు వినిపించే వేదిక. మన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలే కాక, ఎక్కడో ఉన్నవారి అభిప్రాయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, సంయమనం చాలా ముఖ్యం. మన మాటే చెల్లాలి, మనం చెప్పిందే వినాలి అనే ఆధిపత్య ధోరణి ఉండకూడదు. కొన్ని అభిప్రాయాలు మన మీద లైట్ వేస్తాయి. మన మూస అభిప్రాయాలను మారుస్తాయి. నెగెటివ్ అభిప్రాయాలను దూరం చేసుకునేందుకు సాయం చేస్తాయి. ఇదంతా ఎందుకు అనంటే ఖాళీగా ఉండే మైండ్‌ను అర్థవంతమైన వ్యాపకంలో పెట్టడానికే. దీనివల్ల డిప్రెషన్ దూరమవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజాలు కావనేది గుర్తించాలి. అలాంటి ఫేక్ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేసేవారిని దూరంగా ఉంచాలి.నూతన అంశాలపై ఆసక్తి గాజులు ఎలా తయారు చేస్తారో తెలుసా? అద్దం ఎలా తయారవుతుంది? ఇంట్లో ఖాళీ డబ్బాలతో ఏదైనా అలంకరణ వస్తువులు చేయొచ్చా? చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి? ఇలా మనకు తెలియని అంశాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేరుగా పరిశీలించొచ్చు. ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు. నూతన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి సోషల్ మీడియా ఉపయోగకారి. తద్వారా మనమూ కంటెంట్ క్రియేటర్లుగా మారొచ్చు. ఇదంతా మనసును ఉత్సాహ పరిచే అంశమే.నిపుణుల సలహాలకు వేదికవేసవిలో ఏ ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లొచ్చు? బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి? ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఏ రంగులు మేలు? ఇలా అనేక ప్రశ్నలు మనకుంటాయి. కానీ సమాధానాలు ఇచ్చేందుకు అన్నిసార్లూ నిపుణులు మనకు అందుబాటులో ఉండరు. ఆ లోటును సోషల్‌మీడియా తీరుస్తుంది. ఇక్కడ అనేకమంది నిపుణులు అందుబాటులో ఉంటారు. కొందరు నిపుణులు కాకపోయినా, తమ అనుభవంతో మన సందేహాలను నివృత్తి చేయగలరు. దీనివల్ల మనకు శ్రమ తగ్గుతుంది. అయితే ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో సోషల్‌మీడియా సలహాలు పాటించకపోవడం మేలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ జాగ్రత్త పాటించడం తప్పనిసరి.సృజనాత్మకతకు వేదిక ఒక చక్కని కవిత రాశారా? పదిమందితో పంచుకోవాలని ఉందా? ఒక చిత్రం గీశారా? దాన్ని అందరికీ చూపించాలని ఉందా? సోషల్ మీడియా మన సృజనాత్మకతకు చక్కటి వేదిక. ఎంతోమంది అక్కడ పాపులర్ అయ్యారు, అవుతున్నారు. వారికంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఉన్నచోటే ఆగి΄ోకుండా సృజనకు వేదిక అందించి, సృజనకారుల్లో ఉత్సాహం నింపడం సోషల్ మీడియాలో సాధ్యం. మానసిక ఉల్లాసానికి సృజనాత్మక ప్రదర్శనలు చాలా మేలు చేస్తాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి!సోషల్ మీడియాలో సంయమనం టించాలి. వ్యక్తిగతంగా దూషించడం, టార్గెట్ చేయడం, వేధించడం వంటివి చేయకూడదు.సోషల్ మీడియాను పరిమితంగానే వాడాలి. దానికి అడిక్ట్ అయి΄ోకూడదు.పూర్తి వ్యక్తిగత వివరాలు, ఇబ్బందికరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోకూడదు.సోషల్ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏవైనా వేధింపులు, మోసం, ట్రోలింగ్ వంటివి ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలి. వెంటనే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయాలి. -
నేడు నాలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తేలికపాటి చలి మొదలైంది. అక్టోబర్ చివరి వారంలో చలి తీవ్రత పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బెంగళూరులో భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు.దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో నేడు (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన డోనా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడన ప్రాంతం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా డోనా తుపాను ఏర్పడింది. దీని ప్రభావంతో వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కన్నడ, ఉడిపి, బెలగావి, ధార్వాడ్, హవేరి, గడగ్, శివమొగ్గ, దావణగెరె, బళ్లారి, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్, కోలార్‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఇది కూడా చదవండి: 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను -
తస్మాత్ జాగ్రత్త!
ముంబై: అక్రమ లావాదేవీలపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)సహా తన నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలూ ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించింది. ఈ సమస్య అరికట్టడానికి సంబంధిత అంతర్గత, బాహ్య వనరుల నుండి పొందిన సమాచారాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ‘మనీ లాండరింగ్/టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇంటర్నల్ రిస్క్ అసెస్మెంట్ గైడెన్స్’ను జారీ చేసింది. అక్రమ ధనార్జన, తీవ్రవాదులకు ఫైనాన్షింగ్ వంటి అంశాలు వ్యవస్థలపై త్రీవ ప్రభావం చూపుతాయని, బ్యాంక్ సాధరణ ఖాతాదారులకు, దేశాలకు, భౌగోళిక ప్రాంతాలకు, ఉత్పత్తులకు, సేవలకు, లావాదేవీలకు అలాగే డెలివరీ చానెళ్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగజేస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర నిఘా, కాలానుగుణమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు మారుతున్న వ్యాపార పరిస్థితులు, బ్యాంకులు– తదితర నియంత్రిత సంస్థలు అందించే బ్యాంకింగ్, ఇతర ఆరి్థక ఉత్పత్తులలో పెరుగుతున్న సంక్లిష్టత స్థాయిలు, పోటీ పరిస్థితుల నేపథ్యంలో మనీలాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్ వంటి సవాళ్లు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికత వినియోగం, చెల్లింపుల విధానాల్లో కొత్త పద్ధతులు వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొంది. -
‘పెన్షన్ ఆగిపోతుంది’.. బురిడీకొట్టిస్తున్న కొత్త స్కామ్!
పెన్షనర్లను మోసగాళ్లు కొత్త స్కామ్‌తో బురిడీకొట్టిస్తున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO) అధికారులమని చెప్పుకుంటూ పెన్షనర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మోసగాళ్లు ఫేక్ వాట్సాప్ సందేశాలు పంపి తప్పుడు ఫారమ్‌లను నింపమని కోరుతున్నారు. పాటించకపోతే వారి పెన్షన్ చెల్లింపులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.వార్తా నివేదికల ప్రకారం.. బ్యాంకు ఖాతా వివరాలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా మోసగాళ్లు ఈ స్కామ్ చేస్తున్నారు. ఈ సమాచారంతో వారు పెన్షనర్ల వివరాలను దొంగిలించి ఆర్థిక మోసానికి పాల్పడవచ్చు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.సీపీఏఓ పేరుతో ఏదైనా సందేశం వస్తే దాని ప్రామాణికతను పరిశీలించుకోవాలి. అధికారిక ఏజెన్సీలు వాట్సాప్ లేదా ఇతర అనధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యక్తిగత వివరాలను అడగవు. మీ పీపీఓ నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. అనుమానం వస్తే సీపీఏఓ లేదా బ్యాంక్ వారిని అధికారిక సంప్రదింపు వివరాలను ఉపయోగించి సంప్రదించండి. -
ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరానికి ఉగ్రదాడుల ముప్పు పొంచివున్నదంటూ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. పండుగల సీజన్లో ముంబై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడే ఛాన్స్ ఉందనే ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌తో నగరం అప్రమత్తమైంది.నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. మతపరమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే పలుచోట్ల పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ముంబై నగర డీసీసీ భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలను ఎవరైనా గుర్తిస్తే, ముందుజాగ్రత్త చర్యగా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రద్దీగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇది పండుగల సీజన్లో భద్రత కోసం చేస్తున్న కసరత్తు అని పోలీసు అధికారులు తెలిపారు.ఇటీవలే ముంబైలో 10 రోజుల గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు దుర్గాపూజ, దసరా, దీపావళికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పండుగల సమయంలో మార్కెట్లో రద్దీ అధికంగా ఉంటుంది. దేవాలయాలలో పూజలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: పాక్‌కు ఘాటుగా బదులిచ్చిన భారత్ -
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్‌గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
తెలంగాణకు రెండురోజులు వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలపడింది.సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది.దీని ప్రభావంతో మంగళ,బుధ వారాల్లో తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే చాన్సుందని వాతావరణ కేంద్రం తెలిపింది.గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ ,రంగారెడ్డి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి,మహబూబ్‌నగర్,నాగర్‌కర్నూల్,వనపర్తి,నారాయణపేట,జోగులాంబ గద్వాలకు భారీ వర్షసూచన ఉంది.దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం -
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం, దక్షిణ కోస్తా మయన్మార్‌లోని ఉపరితల ఆవర్తనం తూర్పు, పశ్చిమ ద్రోణితో కలిసిపోయి.. సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని.. దీని ప్రభావంతో రాగల 24గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.ఈ క్రమంలో మంగళవారం నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.SEVERE STORMS WARNING ⚠️ As peak convergence is expected, today will be WIDESPREAD powerful storms, lightining in RED marked districts next 24hrs. Multiple storms are expected ⚠️HYD - Multiple spells of powerful storms (2-3 strong ones) expected next 24hrs ⚠️⚡ pic.twitter.com/ySeub3wSdC— Telangana Weatherman (@balaji25_t) September 23, 2024 మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. -
ఆ మహిళల కోసం అలర్ట్ వ్యవస్థ: సుప్రీం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆచూకీ లేకుండా పోయిన మహిళల కోసం కేంద్రీకృత విధానంలో పని చేసే అలర్ట్ వ్యవస్థను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మైనర్ బాలికల అపహరణ ఉదంతంలో గతంలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను సూచించడం తెలిసిందే. వాటిలో పలు లోపాలున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నిత్యా రామకృష్ణన్ కోర్టుకు నివేదించారు. ‘‘బాలిక/మహిళ కనిపించకుండా పోవడంపై ఫిర్యాదులో ఆలస్యం వల్ల న్యాయం దక్కడమూ ఆలస్యమవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ అనే కుగ్రామంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్వనం. నర్సుగా చేస్తున్న ఓ 11 ఏళ్ల పాప తల్లి ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. పాప ఉదయం పక్కింటివాళ్లకు చెప్పింది. వాళ్లు పొరుగింటి వాళ్లకు చెప్పారు. కానీ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ఎనిమిది రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికింది. విషయం అందరికీ తెల్సి ఆందోళనలు మొదలయ్యాక గానీ ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితి కూడా ఇదే’’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పందించింది. ఈ అంశంలో నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించింది. -
దేశంలోని పలు రాష్ట్రాలకు భారీవర్ష సూచన
న్యూఢిల్లీ: దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(గురువారం) కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పూర్వాంచల్, పశ్చిమ యూపీలో భారీ వర్షాలకు కురవనున్నాయనే హెచ్చరికలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణశాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. కిన్నౌర్, సిర్మౌర్, సోలన్, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని రోజులు వర్షం కొనసాగుతుందిరాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. జైపూర్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు వాయువ్య దిశలో కదులుతుందనే అంచనాలున్నాయి.ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు బీహార్‌లో రుతుపవనాలు మరోసారి చురుగ్గా ఉంటాయని అంచనా. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడి, అది వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది బెంగాల్ తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి బీహార్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: నల్లమలలో పక్షుల కిలకిల -
గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం అర్బన్/ఏటూరునాగారం: గోదావరి నదికి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 7:32 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరింది. దీంతో ఆర్డీ ఓ దామోదర్‌రావు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం అంతకంతకూ పెరు గుతూ సాయంత్రం 5:15 గంటలకు 48 అడుగులు దాటి ప్రవహించడంతో రెండో ప్ర మాద హెచ్చరిక కూడా జారీ చేశారు. వరద పెరుగుతున్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ సూచించారు.అధికారులు అప్రమత్తంగా ఉండి, ముంపు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రం నాటికి 15.80 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాలైన రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామంలోని ఓడవాడ, 1, 2, 10 వార్డుల్లోని ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో నది ప్రవహిస్తోంది. 15.83 మీటర్లకు చేరితే.. రెండు ప్రమాద హెచ్చరిక, 17.33 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి కరకట్ట వద్ద పోలీసులు, రెవెన్యూ, కేంద్ర జలవనరుల శాఖ, ఇరిగేషన్ అధికారులు పహారా కాస్తున్నారు. సాగర్ 26 గేట్లూ ఎత్తివేతనాగార్జునసాగర్/ దోమలపెంట: నాగార్జునసాగర్ జలాశయానికి వరద పెరిగింది. దీంతో మంగళవారం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2,50,257 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆరుగేట్లు కూడా... కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు పైకెత్తి 1,64,592 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
ఉత్తరాంధ్రకు డేంజర్ బెల్స్.. రెడ్ అలర్ట్ జారీ
-
రాజమహేంద్రవరం: రాత్రిపూట బయట తిరగొద్దు!
తూర్పుగోదావరి, సాక్షి: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లు అమర్చారు. రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు రికార్డయినట్లు అధికారులు తెలిపారు. జనసంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని డీఎఫ్‌వో భరణి చెప్పారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని, అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బంధిస్తామని తెలిపారు. శివారు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ,. స్వరూప్ నగర్, రూప్ నగర్, పద్మావతి నగర్, ఫాతిమా నగర్, తారకరామ నగర్, దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఆరుబయట కూర్చోవద్దని, పిల్లల్ని బయటకి పంపవద్దని సూచించారు.చిరుత గురించి సమాచారం తెలిస్తే.. 18004255909 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని చెప్పారు. జాతీయ రహదారి వద్ద దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలోనూ నిక్షిప్తమయ్యాయి. -
ఏపీకి తప్పిన గండం..
-
24 గంటల్లో భారీ వర్షాలు..
-
ఢిల్లీకి వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఎల్లో అలెర్ట్ జారీ
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ తరుణంలో సోమవారం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల కారణంగా భారీ వర్ష పాతం నమోదు అయ్యే అవకాశం ఉందని భావించిన వాతావరణ శాఖ ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో గురువారం వరకు తేలికపాటి వర్షం, మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలిపింది.ఢిల్లీలో ఆదివారం ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 5.30వరకు వర్షం పడలేదు. దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో రుతుపవనాల ద్రోణి కదిలి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలపై మళ్లుతుందని వాతావరణ శాఖ అధికారుల అంచనా. -
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు
-
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు