హైదరాబాద్, సాక్షి: రుణమాఫీ సొమ్ము జమ అవుతున్న వేళ.. తెలంగాణ రైతుల్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. అనవసరమైన లింకుల్ని క్లిక్ చేయొద్దని రైతుల్ని హెచ్చరిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కీలక సూచన చేసింది.
గత కొంతకాలంగా వాట్సాప్‌లో ఏపీకే(APK) లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఆర్టీవో అధికారులు, బ్యాంకుల పేరిట ఆ లింకులు వస్తున్నాయి. అవి క్లిక్ చేసి చాలామంది మోసపోతున్నారు.
ఈ క్రమంలో అలాంటి లింకులు వస్తే క్లిక్ చేయొద్దని తెలంగాణ రైతుల్ని సీఎస్‌బీ అప్రమత్తం చేస్తోంది. ఒకవేళ పొరపాటున లింకులు క్లిక్ చేసి ఎవరైనా డబ్బులు పొగ్గొటుకుంటే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతోంది.
మరోవైపు.. రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు, మెసేజ్ లు వస్తాయని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని తెలంగాణ పోలీసులు రైతులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, అలాగే.. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెపొద్దని రైతులకు అలర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment