Cyber crimes
-
క్రిప్టో సీజ్..'ఓ కొత్త కథ'!
సాక్షి, హైదరాబాద్: నగలు, నగదు, వస్తువులు, వాహనాల సీజింగ్.. బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, ఆస్తుల అటాచ్మెంట్.. ఇవన్నీ పోలీసులకు సుపరిచితమే. వీటిలోకి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా వచ్చి చేరింది. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దోచిన సొమ్మును దేశం దాటించేందుకు క్రిప్టో కరెన్సీని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో నేరస్తులు పట్టుబడితే వారి నుంచి ఆ క్రిప్టో కరెన్సీని పోలీసులు రికవరీ చేస్తున్నారు. అయితే, క్రిప్టో సీజింగ్ కొత్త కావడంతో పెద్ద ప్రహసనంగా మారింది.పెరుగుతున్న క్రిప్టో సీజింగ్ గెయిన్ బిట్ కాయిన్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత బుధవారం ఐదు రాష్ట్రాల్లో దాడులు చేసి రూ.23.94 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని సీజ్ చేసింది. గోల్డ్ కాస్ట్ సోలార్ స్కామ్‌లో ఢిల్లీ పోలీసులు గత ఏడాది అక్టోబర్‌లో రూ.80 లక్షల విలువైన క్రిప్టోను సీజ్ చేశారు. రూ.2.06 కోట్లతో ముడిపడిన ట్రేడింగ్ ఫ్రాడ్ కేసును ఛేదించి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరి 29న రూ.40 లక్షల విలువైన బిట్ కాయిన్లు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదే తొలి అధికారిక క్రిప్టో కరెన్సీ/బిట్ కాయిన్ సీజింగ్. సైబర్ నేరాలతో బిట్ కాయిన్స్‌కు విడదీయరాని బంధం ఉన్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం అత్యవసరంగా మారింది. క్రిప్టో రూపంలో దేశం దాటుతున్న మోసం సొమ్ము ప్రస్తుతం యాప్‌ల ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో చాలావరకు చైనీయులే సూత్రధారులుగా ఉంటున్నారు. నేపాల్, చైనా, ఇండోనేసి యా, దుబాయ్ తదితర దేశాల్లో కూర్చుని, ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నారు. ఏజెంట్ల కమీ షన్ పోగా మిగిలిన దోపిడీ సొమ్ము విదేశా ల్లోని ఆ సూత్రధారులకు చేరాల్సిందే. ఒకప్పుడు ఈ లావాదేవీలన్నీ హవాలా రూపంలో జరిగేవి. కొన్ని దేశాలకు హవాలా కష్టసాధ్యం కావడంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సూత్రధారులు క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడి పాత్రధారుల ఖాతాల్లోకి నగదు వెళ్లిన తర్వాత దాన్ని బిట్ కాయిన్ రూపంలోకి మార్చి తమ వద్దకు వచ్చేలా చేసుకుంటున్నారు. క్రిప్టో వాలెట్స్‌లో రెండు రకాలుగూగుల్ ప్లేస్టోర్స్, యాపిల్ యాప్ స్టోర్స్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి అనేక యాప్స్ ఉన్నాయి. వాలెట్స్‌గా పిలిచే వీటిని డౌన్లోడ్ చేసుకుని, బ్యాంకు ఖాతాకు అనుసంధానించుకోవడం ద్వారా క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలు చేయవచ్చు. ఈ వాలెట్స్‌లో బినాన్స్, కాయిన్ బేస్ వంటి కస్టోడియన్ వాలెట్స్‌తో పాటు సేఫ్ పాల్, ట్రస్ట్ వంటి నాన్ కస్టోడియన్ వాలెట్స్ ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖ అదీనంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) అనుమతి తీసుకుని నడిచేవి కస్టోడియన్ వాలెట్స్. అనుమతి లేకుండా నడిచేవి నాన్ కస్టోడియన్ కిందికి వస్తాయి. కస్టోడియన్ వాలెట్స్ ఆపరేట్ చేయడానికి వినియోగదారుడి నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాల నమోదు, వర్చువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇలా చేస్తే పోలీసుల దర్యాప్తులో తమ ఉనికి బయటపడుతుందనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా నాన్ కస్టోడియన్ వాలెట్స్ వాడుతున్నారు. 12 వర్డ్ పాస్ ఫేజ్ నమూనా అంకెలు, అక్షరాల సమాహారమేబిట్ కాయిన్‌గా పిలిచే క్రిప్టో కరెన్సీ 25 నుంచి 50 అంకెలు, అక్షరాలతో కూడిన వాలెట్ అడ్రస్ రూపంలో ఉంటుంది. కేవలం ఈ వాలెట్ అడ్రస్ ఆధారంగా క్రిప్టో కరెన్సీ ఏ వాలెట్లో ఉందో గుర్తించడం సాధ్యం కాదు. నిందితుల ఫోన్లో ఆ వాలెట్ ఉండి, అందులో వాలెట్ అడ్రస్ దొరికితేనే ఆ కరెన్సీ, దాని విలువ తెలుస్తుంది. వాలెట్ ఉన్న ఫోన్‌ను సీజ్ చేసినంత మాత్రాన క్రిప్టో కరెన్సీని సీజ్ చేసినట్లు కాదు. ఓ వినియోగదారుడు క్రిప్టో కరెన్సీ వాలెట్ అడ్రస్‌ను పోగొట్టుకుంటే దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి. కస్టోడియన్ వాలెట్స్‌లో క్రిప్టో కరెన్సీని కేవైసీ ద్వారా, నాన్ కస్టోడియన్ వాలెట్స్‌లో 12 పదాలతో కూడిన ‘12 వర్డ్ పాస్ ఫేజ్’, ఎంపిక చేసుకున్న ప్రశ్నలు–సమాధానాల ద్వారా రిట్రైవ్ చేసుకోవాలి. ఈ విధానంలో సదరు నాన్ కస్టోడియన్ వాలెట్ 12 పదాలను ఓ వరుస క్రమంలో చూపిస్తుంది. దాన్ని రాసుకుని, రహస్యంగా దాచుకునే వినియోగదారుడు.. అవసరమైనప్పుడు క్రిప్టో కరెన్సీ రిట్రైవ్ చేసుకోవడానికి వినియోగిస్తాడు. ఈ పాస్ ఫేజ్ ఎవరి దగ్గర ఉన్నా... దాన్ని వినియోగించి క్రిప్టో అసెట్స్‌ను రిట్రైవ్ చేసుకోవచ్చు.సైబర్ ఠాణాలకు అధికారిక వాలెట్స్ ఓ నిందితుడి వాలెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పాస్ ఫేజ్ అతడి కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల వద్దా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉంటే నిందితుడిని అరెస్టు చేయగానే వాళ్లు పాస్ ఫేజ్ వినియోగించి ఆ క్రిప్టో కరెన్సీని తమ ఫోన్లలో యాక్టివేట్ చేసుకుని, మరో దాంట్లోకి మార్చేయడం, ఎన్‌క్యాష్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా చూసేందుకు దర్యాప్తు అధికారులు అధికారికంగా కస్టోడియన్ వాలెట్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. నిందితుడి వాలెట్లోని క్రిప్టోను ఇందులోకి బదిలీ చేసుకుని న్యాయస్థానానికి సమాచారం ఇస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా సబ్ ఇన్స్పెక్టర్ వినయ్‌కుమార్ ఇలాగే రూ.40 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేశారు. ఈ కేసుతో వచి్చన అనుభవంతో ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ ఠాణాల్లో ఉన్న ప్రతి టీమ్‌కు క్రిప్టో వాలెట్స్ ఓపెన్ చేయించారు. భవిష్యత్‌లో సైబర్ నేరగాళ్ల నుంచి క్రిప్టో కరెన్సీ స్వా«దీనం చేసుకుంటే దాన్ని భద్రపరచడం కోసం వీటిని వినియోగించనున్నారు. -
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్‌లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్‌రెడ్డి పాస్‌పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్‌రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్‌పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్‌లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్‌కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్‌లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్‌కు, థాయ్‌లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్‌ను సంపాదించిన మధుకర్‌రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్‌కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
‘టాస్క్’ల పేరుతో టోపీ!
సాక్షి, హైదరాబాద్ : పార్ట్‌టైం, ఫుల్‌టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట అమాయకులకు సోషల్ మీడియా ద్వారా ఎర వేసి సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఖర్చుల పేరుతో అందినకాడికి దండుకుంటూ వచి్చన జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు ఇటీవల పంథా మార్చారు. బాధితులతో ‘టాస్్క’ల పేరిట ఆన్లైన్లో పనులు చేయించుకొని అందుకు ప్రతిఫలంగా చెల్లించాల్సిన మొత్తాన్ని కాజేస్తున్నారు. విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలే టార్గెట్...పార్ట్‌టైం, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు విద్యార్థులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తారని గ్రహించిన జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు ప్రధానంగా వారినే తమ మోసాలకు ఎంచుకుంటున్నారు. ఉద్యోగార్థుల వివరాలను జాబ్ పోర్టల్స్‌తోపాటు లక్కీ డిప్ల పేరిట ప్రజల వివరాలు సేకరించే ఏజెన్సీల నుంచి కొంటున్నారు. ఈ డేటా ఆధారంగా ఆయా ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా బల్క్ మెసేజ్‌లు పంపుతున్నారు. తమ సందేశాలకు స్పందించే వారిని మోసగించే స్కెచ్‌ను కేటుగాళ్లు పక్కాగా అమలు చేస్తున్నారు. రివ్యూలు, రేటింగ్స్ ఇస్తే డబ్బిస్తామని ఆశజూపి.. వినియోగదారుల ప్రమేయం లేకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ షాపింగ్ సంస్థలకు కమీషన్‌పై భారీ రేటింగ్స్, పాజిటివ్ రివ్యూలు ఇచ్చే ఏజెన్సీలతో జాబ్‌ఫ్రాడ్ నేరగాళ్లు లింకులు పెట్టుకుంటున్నారు. తమ సందేశాలకు స్పందించిన అమాయకులతో ఆయా షాపింగ్, రెస్టారెంట్ సంస్థల యాప్స్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. వాటికి రేటింగ్, రివ్యూలు (టాస్్కలు) ఇచ్చి ఆ స్క్రీన్ షాట్స్‌ను పంపాలని కోరుతున్నారు. అలా తొలి ‘టాస్్క’పూర్తి చేసిన బాధితులకు రూ. 240 వెంటనే వారికి బదిలీ చేస్తున్నారు. అనంతరం వారిని మరింతగా ఉచ్చులోకి లాగేందుకు వీలుగా తమ అనుచరులతో కూడిన ‘టెలిగ్రామ్’గ్రూపుల్లో చేర్చి ఇతరుల సక్సెస్ స్టోరీస్ పేరిట పోస్టింగ్స్ పెట్టిస్తున్నారు. ప్రత్యేక యాప్స్ డౌన్లోడ్ చేయించి... ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టే నేరగాళ్లు బాధితులతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన వర్చువల్ యాప్స్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు నగదు బదిలీ చేస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇబ్బందులు వస్తున్నాయని.. అందువల్ల ఆ మొత్తాన్ని ఈ యాప్స్‌లో జమ చేస్తామని నమ్మిస్తున్నారు. నిర్ణిత సమయం తర్వాత సొమ్ము డ్రా చేసుకోవచ్చని చెప్పి రకరకాల ‘టాస్్క’లు చేయించుకుంటున్నారు. కానీ ఆయా ‘టాస్్క’లకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ఏజెన్సీల నుంచి తీసేసుకుంటూ... యాప్స్‌లోని బాధితుల ఖాతాల్లో మాత్రం డబ్బు జమ అయినట్లు వర్చువల్‌గా చూపిస్తున్నారు. మొత్తం రూ. 2 లక్షలు దాటాకే డ్రా చేసుకోవడానికి వీలవుతుందని నమ్మబలకడంతోపాటు మరికొంత బోనస్ సొమ్మును కూడా బాధితులకు వర్చువల్‌గా చూపిస్తున్నారు. వెంటనే డబ్బు కావాలంటే కొంత కట్టమంటూవర్చువల్ యాప్స్‌లోని సొమ్ము రూ. 10 లక్షలు దాటాకే విత్‌డ్రాకు వీలవుతుందంటూ కొత్త కథ అల్లుతున్న కేటుగాళ్లు.. ఆ మొత్తాన్ని తక్షణమే తీసుకోవాలంటే కొంత డబ్బు డిపాజిట్ చేయాలని కోరుతున్నారు. వర్చువల్ యాప్స్‌లో భారీ మొత్తం కనిపిస్తుండటంతో నేరగాళ్లు కోరిన సొమ్మును అమాయకులు చెల్లిస్తున్నారు. అలా వందలు, వేలాది మంది బాధితుల నుంచి భారీ మొత్తం కొల్లగొట్టాక నేరగాళ్లు ఆయా సోషల్ మీడియా గ్రూపులతోపాటు వర్చువల్ యాప్స్‌ను కనుమరుగు చేస్తున్నారు.చిన్న మొత్తాలను ఇచ్చి, భారీ మొత్తాలను కాజేసే సైబర్ నేరగాళ్లను నమ్మొద్దు. జాబ్స్, టాస్్కలంటూ ప్రకటనలు ఇచ్చే వాళ్లు అందుకు నగదు చెల్లించకుండా ఎదు రు డబ్బు అడుగుతున్నారంటూ అది మోసమని గ్రహించాలి. ఇలాంటి మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ ఇ.కాళీరాజ్ నాయుడు (నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్) -
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు.. కొట్టేసిన సొమ్మును తమ వద్దకు చేర్చుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుతున్నారు. తమ చేతికి నేరం అంటుకోకుండా కమీషన్ల ఆశజూపి అమాయకులనే చివరకు బలి చేస్తున్నారు. ‘మ్యూల్’బ్యాంకు ఖాతాలతో మొత్తంగా ముంచేస్తున్నారు. ఒకటి కాదు...రెండు కాదు..దేశవ్యాప్తంగా ఐదు లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) 2024లో మొత్తం 1.14 లక్షల సైబర్ నేరాలు నమోదు చేయగా..ఈ కేసులలో ప్రతి కేసులో కనీసం ఐదు మ్యూల్ బ్యాంకు ఖాతాలు వినియోగించినట్టు తెలిపారు. aఅమాయకుల నుంచి వివిధ మోసపూరిత విధానాల్లో కొల్లగొట్టిన సొమ్మును పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సైబర్ నేరగాళ్లు వీటిని వెంటవెంటనే పలు బ్యాంకు ఖాతాల్లోకి (మ్యూల్ ఖాతాల్లోకి) బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు కొట్టేసిన సొమ్ము ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లోకి చిన్నచిన్న మొత్తాలుగా చేసి బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు వందల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దర్యాప్తు అధికారులు ఆ సొమ్మును గుర్తించడం..తిరిగి ఫ్రీజ్ చేయడం సవాల్‌గా మారుతోంది. ఇలా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన సొమ్మును చివరగా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాల్లోని ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు కొన్ని బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన తర్వాత వెంటనే వాటిని నగదు రూపంలో విత్‌డ్రా చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మధ్యవర్తుల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతున్నారు. ఇటీవలే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ తరహా ముఠాలోని 21 మందిని 2024 డిసెంబర్ 24న అరెస్టు చేశారు. బ్యాంకుల సమన్వయంతోనే కట్టడి సాధ్యం.. మ్యూల్ బ్యాంకు ఖాతాల బెడద తగ్గించడంలో బ్యాంకు అధికారులది కీలకపాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టుగా గుర్తిస్తే అలాంటి బ్యాంకు ఖాతాలకు రెడ్‌ప్లాగ్ పెట్టుకుని, వెనువెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేస్తే ఫలితం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒక బ్యాంకు ఖాతాదారుడి అకౌంట్లో అకస్మాత్తుగా లక్షల రూపాయలు జమ అవుతుండటం..అదేరీతిలో లక్షల్లో డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్టు గుర్తిస్తే అలాంటివి మ్యూల్ బ్యాంకు ఖాతాలుగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సమన్వయం లోపిస్తోంది. బ్యాంకుల సాధారణ ప్రక్రియలో భాగంగా ఇలాంటి రెడ్‌ఫ్లాగ్ ఖాతాల (అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన ఖాతాలు) వివరాలు ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు చేరవేస్తాయి. కొన్ని నెలల తర్వాత సంబంధిత పోలీసులకు ఆ సమాచారం చేరుతుంది. ఈలోగా సైబర్ నేరగాళ్లు నిధులను విదేశాలకు మళ్లించడం పూర్తి చేస్తుండటంతో ఆ సమాచారం పోలీసులకు నిరుపయోగంగా మారుతోంది. మ్యూల్ బ్యాంకు ఖాతా అంటే..? ఒకరి వివరాలతో ఉన్న బ్యాంకు ఖాతాను నేరపూరిత లావాదేవీలకు ఇతరులు వినియోగిస్తే (నిజమైన ఖాతాదారుడికి తెలిసి ఇది జరగవచ్చు.. తెలియకుండా కూడా జరగొచ్చు) ఇలాంటి బ్యాంకు ఖాతాను మ్యూల్ బ్యాంక్ అకౌంట్‌గా చెబుతారు. కొందరు నెలవారీ కమీషన్లకు ఆశపడి తమ అధికారిక ధ్రువపత్రాలు ఉపయోగించి తెరచిన బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఇలాంటి బ్యాంకు ఖాతాల్లో ఎవరి నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. అవి మళ్లీ ఎక్కడికి బదిలీ అవుతున్నాయన్న వివరాలు ఖాతాదారుడికి తెలిసే అవకాశం కూడా ఉండదు. మ్యూల్ బ్యాంకు ఖాతాలు ఇలా తెరిపిస్తారు.. సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి అమాయకులకు వల వేస్తారు. వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా ఒప్పిస్తారు. ఆ తర్వాత నిజమైన బ్యాంకు ఖాతాదారుడి నుంచి బ్యాంకు పాస్‌బుక్, డెబిట్ కార్డులు, పాస్వర్డ్లు మోసగాళ్లు తమ ఏజెంట్ల ద్వారా ఆ బ్యాంకు ఖాతాలు పూర్తిగా తమ ఆ«దీనంలోకి తీసుకుంటారు. సైబర్ మోసాల్లో కొల్లగొట్టే సొమ్మును ఈ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం..తర్వాత ఇతర ఖాతాల్లోకి మళ్లించడం వంటి లావాదేవీలు చేస్తుంటారు. ఖాతాదారులకు సూచనలు.. ఇతరులు నెలవారీ కమీషన్ ఇస్తామంటే ఆశపడి మీ బ్యాంకు ఖాతాను ఇతరులకు ఇవ్వొద్దు. మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడుతుంది. మీరు మళ్లీ కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పేరిట ఉన్న మ్యూల్ బ్యాంక్ ఖాతా నేరస్తులు అక్రమ నిధుల బదిలీకి, లేదా మనీలాండరింగ్ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉన్నందున చట్టపరంగా అసలు ఖాతాదారులకు శిక్ష తప్పదు. ప్రధానంగా మ్యూల్ బ్యాంకు ఖాతాల బాధితులు వీరే..సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగులు ఈ ఉచ్చులో చిక్కుతున్నారు. వివరాలు ఇస్తే నెలకు కొంత కమీషన్ వస్తుందని ఆశపడి నిరుద్యోగ యువత వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి మ్యూల్ ఖాతాలుగా వాడేందుకు ఇస్తున్నారు. ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని, నేరస్తులు కమీషన్లు ఆశజూపి రైతులను ఈ ఉచ్చులో దింపుతున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ప్రకారం..జిమ్ ట్రైనర్లు, టైలర్లు, ప్రైవేటు కాంట్రాక్టర్లు, హోటల్స్ నిర్వాహకులు ఇలా పలువురు మ్యూల్ ఖాతాల బాధితులే. -
TG: పెరుగుతున్న సైబర్ నేరాలు.. 1866 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 18 శాతం పెరిగాయన్నారు సీఐడీ డీజీ షికా గోయల్. దేశవ్యాప్తంగా లక్ష, తెలంగాణలో 19వేల కేసులు నమోదైనట్టు చెప్పారు. రాష్ట్రంలో సైబర్ నేరాల ద్వారా రూ.1866 కోట్లు దోచుకున్నట్టు వెల్లడించారు.తెలంగాణలో ఈ ఏడాది సైబర్ నేరాలకు సంబంధించి రిపోర్టును సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. ఈ సందర్బంగా షికా గోయల్ మాట్లాడుతూ..‘గత ఏడాదితో పోలిస్తే 18% సైబర్ నేరాలు పెరిగాయి. ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 1.14 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా 1866కోట్లను సైబర్ నేరస్థులు దోచుకున్నారు. సైబర్ నేరస్థుల నుంచి రూ.176కోట్లు రీ ఫండ్ చేశాము. పలు కేసులకు సంబంధించి 1057 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశాం. దేశ వ్యాప్తంగా లక్షకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 19వేల కేసులు ఫైల్ అయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితులు ఈ జిల్లాల నుంచే ఎక్కువగా ఉన్నారు’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైబర్ నేరగాళ్ల భారతం పడుతోంది TGCSB. మ్యూల్ ఖాతాలపై ఉక్కుపాదం మోపింది. బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో 21 మంది సైబర్ కేటుగాళ్లను పట్టుకున్నారు. అలాగే, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ఏజెంట్స్‌ను అరెస్ట్ చేశారు. వీరంతా తెలంగాణ, రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్లు జరుపుతున్నట్టు గుర్తించారు. అరెస్ట్ సందర్భంగా వీరి వద్ద నుంచి 20 మొబైల్స్, నాలుగు బ్యాంక్ పాస్ బుక్స్, ఐదు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, వీరికి దేశవ్యాప్తంగా వీరికి 714 మంది క్రిమినల్స్‌తో లింక్ ఉన్నట్టు గుర్తించారు. -
పెచ్చరిల్లుతున్న డిజిటల్, సైబర్ నేరాలు
భువనేశ్వర్: డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలతోపాటు కృత్రిమ మేధతో సామాజిక, కుటుంబ సంబంధాలకు భంగం కలిగే డీప్‌ఫేక్ కేసులు పెరుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను గరిష్ట స్థాయిలో వాడుకుంటూ పోలీస్ కానిస్టేబుళ్లపై పనిభారం తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పోలీసు సిబ్బంది, వనరుల కేటాయింపులో పోలీస్స్టేషన్లు కేంద్ర స్థానాలుగా మారాలన్నారు. ఆదివారం ప్రధాని మోదీ 59వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సులో మాట్లాడారు. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనే విషయమై సదస్సులో అన్ని కోణాల్లోనూ విస్తృత స్థాయి చర్చలు జరిగినందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను వాడుకుంటూ సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని కోరారు. అర్బన్ పోలీసింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. -
పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: డబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి ప్రజల నుంచి పాత, వినియోగంలో లేని మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి సైబర్ నేరాలకు వాడుతున్న కేటుగాళ్ల ముఠాను రామగుండం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుంచి ఏకంగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను బిహార్‌లోని కొందరికి ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. సేకరించిన పాత మొబైల్ ఫోన్లను రిపేర్ చేసి వాటిని జామ్‌తార, దియోగఢ్‌లోని సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. వారిని బిహార్‌కు చెందిన మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలామ్, మహ్మద్ ఇఫ్తికర్గా గుర్తించారు. నిందితులపై రామగుండం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ 66 డీ, బీఎన్ఎస్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు టీజీ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా చిక్కారు..బిహార్‌కు చెందిన కొందరు వ్యక్తులు పట్టణంలో తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు రామగుండం సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. వారు గోదావరిఖనిలో తనిఖీ చేయగా ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు పట్టుబడ్డాయి. గత నెల రోజులుగా రామగుండంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పాత మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి బిహార్‌లోని తమ ముఠాలకు చేరవేసినట్టు నిందితులు అంగీకరించారు. కాగా అపరిచిత వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లను విక్రయించవద్దని శిఖాగోయల్ సూచించారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు మొబైల్ ఫోన్ పాత యజమాని డివైస్ ఐడెంటీనే పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుందని, దీనివల్ల చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. -
కళ్ళు మూసి తెరిచేలోగా మీకు తెలియకుండానే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ..!
-
తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ లింకుల్ని క్లిక్ చేయొద్దు
హైదరాబాద్, సాక్షి: రుణమాఫీ సొమ్ము జమ అవుతున్న వేళ.. తెలంగాణ రైతుల్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. అనవసరమైన లింకుల్ని క్లిక్ చేయొద్దని రైతుల్ని హెచ్చరిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కీలక సూచన చేసింది. గత కొంతకాలంగా వాట్సాప్‌లో ఏపీకే(APK) లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఆర్టీవో అధికారులు, బ్యాంకుల పేరిట ఆ లింకులు వస్తున్నాయి. అవి క్లిక్ చేసి చాలామంది మోసపోతున్నారు. ఈ క్రమంలో అలాంటి లింకులు వస్తే క్లిక్ చేయొద్దని తెలంగాణ రైతుల్ని సీఎస్బీ అప్రమత్తం చేస్తోంది. ఒకవేళ పొరపాటున లింకులు క్లిక్ చేసి ఎవరైనా డబ్బులు పొగ్గొటుకుంటే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతోంది.మరోవైపు.. రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు, మెసేజ్ లు వస్తాయని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని తెలంగాణ పోలీసులు రైతులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, అలాగే.. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెపొద్దని రైతులకు అలర్ట్ జారీ చేసింది. -
మహిళల భద్రతకు ‘పచ్చ’ముప్పు
సాక్షి, అమరావతి : చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన మునుపెన్నడూలేని రీతిలో బరితెగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు పన్నాగం పన్నుతూ యావత్ మహిళల భద్రతకు పెనుముప్పుగా మారారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ రూపొందించిన ‘వుయ్ యాప్’ రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రమాదంగా పరిణమించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐటీ చట్టాలను ఉల్లంఘించి రూపొందించిన ఈ యాప్ మహిళల భద్రత పాలిట పెనుగండంగా మారింది. తీవ్ర ఆందోళన కలిగిస్తున్న టీడీపీ ‘వుయ్ యాప్’ బాగోతం కథాకమామిషు ఏమిటంటే.. వ్యక్తిగత సమాచారం అంతా ‘పచ్చ’ముఠా గుప్పెట్లోరాష్ట్రంలో ఓటర్ల వివరాలన్నింటినీ చంద్రబాబు ముఠా అక్రమంగా సేకరించింది. గతంలో అధికారంలో ఉండగా నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధించారు. ప్రస్తుతం కూడా టీడీపీ అదే రీతిలో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించింది. ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయసు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఫొటోలు.. ఇలా పూర్తి వివరాలను వుయ్ యాప్‌లో పొందుపరిచారు. వాటిలో రాష్ట్రంలోని 2.10 కోట్ల మహిళా ఓటర్ల వివరాలు వారి ఫొటోలతో సహా ఉండటం గమనార్హం. అంటే.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యవతులు, మహిళల పూర్తి వ్యక్తిగత సమాచారం అంతా టీడీపీ గుప్పెట్లోకి వచి్చందన్న మాట. ఈ సమచారాన్ని వుయ్ యాప్ ద్వారా టీడీపీ బూత్‌కమిటీలకు చేర్చింది. దీంతో ఆకతాయిలు, వీధి రౌడీలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు, ఇతర నేరచరితులకు ఈ వివరాలన్నీ అందుబాటులోకి వచ్చినట్లే. వేధింపులకు అవకాశం.. భద్రతకు ముప్పుటీడీపీ పాల్పడుతున్న ఈ అక్రమాలు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెనుముప్పుగా పరిణమించాయి. ఎందుకంటే ఆకతాయిలు మహిళల ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వేధించొచ్చు.. ఫొటోలను ఎవరైనా మార్ఫింగ్ చేసి సైబర్ నేరాలకు పాల్పడొచ్చు.. వారి బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్ చేసి ఆరి్థక నేరాలకు పాల్పడొచ్చు.. ఇలా.. ఎటువంటి నేరాలకైనా పాల్పడేందుకు ఆ యాప్ అవకాశం కలి్పస్తోంది.టీడీపీ కుట్ర కచి్చతంగా రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు భంగకరం. వ్యక్తిగత గోప్యత హక్కుకు ప్రమాదకరం. ఈ నేపథ్యంలో.. వుయ్ యాప్ పేరుతో టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంతోపాటు రాష్ట్రంలోని మహిళల భద్రతకు పెను ప్రమాదాన్ని తీసుకొచి్చందని మేధావులు, రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ)తోపాటు పోలీసు యంత్రాంగం తక్షణం స్పందించి ఈ యాప్‌ను తొలగించాలని కోరుతున్నారు. చంద్రబాబుతోపాటు వుయ్ యాప్ రూపొందించిన వారిపై కుట్ర కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విధ్వంసాలకు బాబు స్కెచ్మరోవైపు.. ఓటమి భయంతో అసలే బెంబేలెత్తుతున్న చంద్రబాబు మహిళా ఓటర్లు పేరెత్తితే రగిలిపోతున్నారు. వారంతా ముక్తకంఠంతో సీఎం జగన్‌కే మద్దతు ప్రకటిస్తుండడంతో బాబుకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో ఆయన విధ్వంసకర కుట్రకు తెరతీశారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు స్కెచ్ వేశారు. మహిళల ఓట్లు ఎలాగూ సాధించలేం కాబట్టి వారి ఓటింగ్ శాతాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించేందుకు తెగబడుతున్నారు. ఇందులో భాగంగా రాబోయే 24 గంటల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు పన్నాగం పన్నారు. రెచ్చగొట్టి దాడులకు తెగబడాలి.. పోలింగ్ బూత్‌లకు వెళ్లే మహిళలను ఆకతాయిలతో రెచ్చగొట్టి.. అసభ్య పదాలతో దూషించి.. వారు దానిపై ప్రశి్నంచగానే టీడీపీ గూండాలు ఘర్షణలకు దిగి.. దాడులకు తెగబడేలా చేయాలన్నది చంద్రబాబు బ్లూప్రింట్. ఈ కుట్రను పక్కాగా అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు, నేతలు తమ మందీమార్బలాన్ని, గూండాలను సమీకరించుకుని.. వారికి కర్రలు, కత్తులతోపాటు ఇతర ఆయుధాలను కూడా అందించి పోలింగ్‌ను భగ్నం చేసేందుకు తద్వారా మహిళల ఓటింగ్‌ను తగ్గించేందుకు సన్నద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మహిళలే లక్ష్యంగా బాబు కుట్ర..ఇక ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రంలోని ఎన్నికల ముఖచిత్రం ఏమిటన్నది చంద్రబాబుకు స్పష్టమైంది. ప్రజలంతా వైఎస్సార్‌సీపీపట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారన్నది తేలిపోవడం.. మహిళా ఓటర్లు సీఎం జగన్‌కు నీరాజనాలు పడుతున్నారని అన్ని జాతీయ సర్వేలతో సహా స్పష్టంచేస్తుండటంతో ఆయన రగిలిపోతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లుండగా.. వారిలో మహిళా ఓటర్లే 2.10 కోట్ల మంది ఉన్నారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా మొత్తం రూ.2.83 లక్షల కోట్ల మేర లబ్ధి వారికి చేకూర్చి దేశంలోనే కొత్త చరిత్రను సృష్టించడంతో సీఎం జగన్‌కు మహిళలు జేజేలు పలుకుతున్నారు. దీంతో మహిళల ఓట్లపై చంద్రబాబు దాదాపుగా ఆశలు వదిలేసుకోవడం.. టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో కూరుకుపోవడంతో మహిళా ఓటర్లే లక్ష్యంగా బాబు విధ్వంసానికి కుట్ర పన్నారు.అడ్డుకట్ట వేయాల్సింది ఈసీ, పోలీసులేఈ నేపథ్యంలో.. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ), పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ కోసం వెబ్‌కాస్టింగ్, వీడియో రికార్డింగ్ తదితర చర్యలు తీసుకుంటున్నా.. అవి పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితిని మాత్రమే పర్యవేక్షణకు ఉద్దేశించినవి.⇒కానీ, సామాన్య మహిళా ఓటర్లు తమ ఇళ్ల నుంచి పోలింగ్ బూత్‌లకు వచ్చే మార్గాల్లోనూ.. ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు తెగబడేందుకు కుట్ర పన్నుతున్న టీడీపీ గూండాలను కట్టడి చేయాలంటే ఆ చర్యలు సరిపోవు. కాబట్టి ఈసీ, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండి.. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా.. మహిళలు అత్యధికంగా ఓటింగులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి ఓటింగ్ శాతం తగ్గించడమే లక్ష్యం సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారు. పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా సాగితే మహిళల ఓటింగ్ శాతం అమాంతంగా పెరుగుతుంది. అందుకే మహిళల ఓటింగ్ శాతాన్ని తగ్గించడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జాన్యాలకు పాల్పడమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు.అందుకోసం స్థానికంగా ఉండే టీడీపీ రౌడీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలు, రౌడీ మూకలను రప్పించినట్లు సమాచారం. ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగించాలని.. తద్వారా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలన్నది చంద్రబాబు పన్నాగం. పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం.. వీలైతే పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి తీసుకొచ్చి శాంతిభద్రతలు అదుపుతప్పేలా చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇందులో భాగమే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు. అవి.. ⇒ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపైనే టీడీపీ గూండాల దాడి. ⇒ మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరిలపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి తన అనుచరులతో దాడిచేయించడం.. ⇒ ఇక కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి భార్య, తనయుడిపై టీడీపీ గూండాలు దాడి. -
‘చక్షు’కు చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: ‘‘హలో.. మీకు లక్కీ లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి.. ఈ మొత్తాన్ని పొందాలంటే మేం చెప్పే బ్యాంకు అకౌంట్ నంబర్‌కు రూ.లక్ష పంపండి.. మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది..’’ ‘మీ వాట్సప్ నంబర్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.. సర్ఫ్రైజ్ గిఫ్ట్ పొందండి..’’ ‘‘హలో.. బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను.. మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మీ క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు బ్లాక్ అయిపోతాయి. మేం అడిగే వివరాలు చెప్పండి..’’ రోజుకో కొత్త తరహా సైబర్ మోసం...సైబర్ నేరగాళ్ల ఎత్తు ఏదైనా.. మూలం మాత్రం మన ఫోన్‌కు వచ్చే కాల్స్.. లేదంటే ఎస్ఎంఎస్లు. సైబర్ నేరగాళ్లు వివిధ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇలా ఫోన్ నంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘చక్షు’అ్రస్తాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఫోన్ నంబర్ల వివరాలు ఈ వెబ్ పోర్టల్‌లో నమోదు చేస్తే.. మోసగాళ్ల పనిపడతాయి దర్యాప్తు సంస్థలు. బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నంబర్లు పంపుతారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు సదరు నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతోపాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడతారు. సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని, మోసపూరిత ఫోన్ నంబర్ల సమాచారాన్ని చక్షు పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. ఏమిటీ చక్షు పోర్టల్? చక్షు అంటే కన్ను అని అర్థం.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అందిస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు పేరిట ‘రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్’కొత్త సేవా పోర్టల్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్, ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ప్రారంభించారు. అనుమానిత మోసపూరిత కాల్లు, సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చు. చక్షు పోర్టల్ ఎలా వినియోగించాలి.. ♦ https://sancharsaathi.gov.in లింక్ ద్వారా సంచార్ సాథి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ♦ సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ మోసపూరిత కమ్యూనికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఆ కాల్ లేదా మెసేజ్ వచ్చిన సమయం, ఇతర వివరాలు నమోదు చేయాలి. ♦ ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది. ఏయే అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు ♦అనధికారిక కనెక్షన్లు, మనకు వచ్చిన మోసపూరిత నంబర్లు సదరు వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు. ♦ మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం చేయవచ్చు. ♦ అనుమానాస్పద విదేశీ నంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు. -
టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, అమరావతి: ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్లైన్ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు. అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్ తెనాలిలోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటిపట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసింది. ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ చానల్‌తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్యతని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. గీతాంజలిని బూతులు తిడుతూ టీడీపీ, జనసేన అభిమానులు పెట్టిన పోస్టులు, కామెంట్లు.. గీతాంజలి మృతదేహం వద్ద రోదిస్తున్న ఇద్దరు కుమార్తెలు పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం ఇద్దరు చిన్నారులతో ఎంతో చలాకీగా అందరితో కలిసి మెలసి ఉండే గీతాంజలిని సోషల్ మాఫియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లల గతి ఏం కావాలంటూ విలపించారు. సోషల్ మీడియా ఆమెను పొట్టనపెట్టుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ సోషల్ మీడియా కళ్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని, పేదింటి మహిళకు ఇంత సంతోషం దక్కడం వారికి ఇష్టం లేదంటూ మండిపడ్డారు. గీతాంజలికి తల్లితండ్రి దూరంగా ఉండటంతో అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కలిసి వివాహం చేశారని, గీతాంజలి సంతోషం పచ్చ సోషల్ మీడియాకు కంటగింపుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి అంతిమ సంస్కారాలు సోమవారం రాత్రి జరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష అనంతరం చినరావూరుతోటలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను భర్త బాలచంద్ర నిర్వహించారు. తల్లి భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్కడకు చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్ కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన అరాచకత్వానికి బీసీ మహిళ బలి: పద్మ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన బీసీ మహిళ గీతాంజలి సంతోషాన్ని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచక్షణ మరచిన పచ్చ మూకలు అరాచకంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్యాయంగా పలకరించేది.. మా ఇంటికి ఎదురుగా నివసించే గీతాంజలి ఎప్పుడూ సంతోషంగా, చలాకీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా మామ్మగారూ... అంటూ చాలా ఆప్యాయంగా పలకరించేది. రెండు రోజులుగా కనిపించకపోతే శివరాత్రి కావడంతో ఎటైనా వెళ్లిందేమో అనుకున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధనిపిస్తోంది. – అవ్వారు పద్మావతి, ఇస్లాంపేట, తెనాలి జీవితంలో మర్చిపోలేనంటూ.. మేం ఇస్లాంపేటలో సోడాలు విక్రయిస్తాం. గీతాంజలితో కొద్ది రోజుల పరిచయమే అయినా చాలా కలివిడిగా మాట్లాడేది. ఇటీవలే చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రం తీసుకున్నానని ఎంతో సంతోషంగా చెప్పింది. నా పేరు మీద ఇచ్చారు... జీవితంలో మర్చిపోలేనని చెప్పి మురిసిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని చెబుతుండేది. ఆమె చనిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నా. – షేక్ రేష్మా, ఇస్లాంపేట, తెనాలి -
WhatsApp Scam: వాట్సాప్ లింక్ ద్వారా రూ.1.60 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!
కర్నూలు: ట్రేడ్స్ ఎక్స్ కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్లు తన వాట్సాప్‌కు లింక్ పంపి ఫోన్లో ఉన్న డేటా సేకరించి బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.60 లక్షలు తీసుకుని మోసగించారని, చర్యలు తీసుకోవాలని ఎస్పీ కృష్ణకాంత్‌కు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రిజ్వాన్ బాషా ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు తదితరులు స్పందనలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● కన్సల్టెన్సీ పేరుతో కొంతమంది వ్యక్తులు ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని , విచారణ జరిపి డబ్బులు వాపసు ఇప్పించాల్సిందిగా కర్నూలుకు చెందిన విష్ణు కోరారు. ● ఆస్తి కోసం కుమారుడు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, రక్షణ కల్పించాల్సిందిగా హొళగుంద మండలం హెబ్బటం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప వినతి పత్రం అందించారు. ● భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి సర్వేయర్‌ను కొలతలు వేయనివ్వకుండా శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులు అడ్డుపడుతున్నారని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి ఫిర్యాదు చేశారు. ● పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తి నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి మోసం చేశాడని, తన పొలానికి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఆరు ఎకరాల జొన్న పంటను దున్ని నాశనం చేసిన నగరూరు గ్రామానికి చెందిన రంగన్న, ప్రభాకర్‌లపై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన హుసేనప్ప ఫిర్యాదు చేశారు. ● సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వైఎస్సార్ జిల్లాకు చెందిన మంజునాథ్ రెడ్డి డబ్బులు తీసుకుని నకిలీ నియామక పత్రాలు పంపి మోసం చేశాడని నాగలాపురం గ్రామానికి చెందిన ఉపేంద్ర, కర్నూలుకు చెందిన విష్ణుచరణ్లు ఫిర్యాదు చేశారు. -
సైబర్ కేసుల్లో తెలంగాణ @ 3
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో సైబర్ నేరాలను పరిశీలిస్తే ప్రతి లక్ష మందికి 261 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది మనం చెబుతున్న మాట కాదు ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్) సీఈఓ రాజేశ్‌కుమార్ ఇటీవల వెల్లడించిన 2023 వార్షిక నివేదికలో పొందుపరిచారు. ఇంకా అనేక ఆసక్తికర అంశాలూ ఆ నివేదికలో ఉన్నాయి. సైబర్ నేరాలపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతోంది. ఈ నేరాలపై 1930 టోల్‌ఫ్రీ నంబరుకు రోజుకు సరాసరిన 50వేల ఫోన్‌కాల్స్ వచ్చినట్టు ఐ4సీ నివేదిక తెలిపింది. 2023 సంవత్సరంలో ఎన్సీఆర్పీ( నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్)కి 15,56,176 ఫిర్యాదులు అందాయి. ఎన్‌సీఆర్‌పీకి సైబర్ నేరాలపై దేశవ్యాప్తంగా రోజుకు సరాసరిన 5వేల ఫిర్యాదులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2023లో అత్యధికంగా నమోదైన సైబర్ నేరాలు ♦ కేవైసీ అప్డేషన్ మోసాలు, కస్టమర్ కేర్ నంబర్ల పేరిట మోసాలు 35% ♦ సెక్స్టార్షన్ స్కామ్‌లు 24% ♦ ఆన్లైన్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ మోసాలు 22% ♦ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) మోసాలు 11% ♦ ఆండ్రాయిడ్ మొబైల్ మాల్వేర్ మోసాలు 8% సైబర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం దేశప్రజలకు సైబర్ భ ద్రత కల్పించడం మా ప్రధాన లక్ష్యం. దీని కో సమే కేంద్రం ఐ4సీ ఏ ర్పాటు చేసింది. సైబర్ నేరాల గుర్తింపు, దర్యా ప్తు, సైబర్ నేరాల కట్టడి చేయడం కేంద్ర హోంశాఖ మాకు ఇచ్చిన ప్రధాన బాధ్యతలు. ఇందుకోసం మేం ప్రత్యేక వేదికగా పనిచేస్తున్నాం. సైబర్ భద్రత అనేది ఇప్పుడు జాతీయ భద్ర తగా మారిన నేపథ్యంలో ఐ4సీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల ప్రకారం బలోపేతం చేస్తూ వెళుతున్నాం. సైబర్‌నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. – వార్షిక నివేదిక సందర్భంగా ఐ4సీ సీఈఓ రాజేశ్‌కుమార్ సైబర్‌క్రైం పోర్టల్ బ్లాక్ చేసినవి ♦ 2,95,461 ఫేక్ సిమ్ కార్డులు ♦ 46,000 ఐఈఎంఐ డివైజ్‌లు ♦ 595 మొబైల్ అప్లికేషన్స్ ♦ 2,810 ఫిషింగ్ వెబ్‌సైట్స్, యూఆర్ఎల్లు -
Cyber Crimes: రూ.1100 కోట్లు చేజారకుండా ఆపిన పోలీసులు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100 కోట్లను వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరి నిమిషంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆపగలిగారు. ఒక లక్ష జనాభాకుగాను గతేడాది అత్యధికంగా హర్యానాలో 381 సైబర్ క్రైమ్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణలో 261, ఉత్తరాఖండ్ 243, గుజరాత్ 226, గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, చండీగఢ్‌లో 432 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా సైబర్ నేరగాళ్లకు చెందిన 2,95,461 సిమ్ కార్డులను, 2810 వెబ్సైట్లు, 585 మొబైల్ యాప్‌లు,46,229 ఐఎంఈఐలను కేంద్ర హోం శాఖ బ్లాక్ చేసింది. ఇదీచదవండి.. అశోక్ గహ్లోత్ కుమారుని ఇంటిపై ఈడీ సోదాలు -
డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాల రవాణా, విక్ర య ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. మత్తుపదార్థాలు అమ్మినా, కొన్నా, వాడినా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎంతటివారున్నా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల కట్టడి, సైబర్ నేరాల అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రానున్న ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు 8.97 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల నమోదు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టేట్ పోలీస్ వార్షిక నివేదిక 2023ను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్, రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఐజీలు రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో పోలీస్‌శాఖ భవిష్యత్ కార్యాచరణ అంశాలను డీజీపీ వివరించారు. డీజీపీ పేర్కొన్న కీలక అంశాలు: ♦ మత్తుపదార్థాల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉంటాం. ఒక్క డ్రగ్స్ కేసు నమోదైనా పీడీయాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ♦ పబ్బులు, క్లబ్బులు, ఫాంహౌస్‌లు, బార్లలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా అత్యంత కఠినచర్యలు తప్పవు. ♦ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు సైతం మత్తుపదార్థాల కట్టడిలో పోలీస్‌శాఖతో కలిసి రావాలి. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్స్వాడకంపై దృష్టి పెట్టాలి. ♦ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలపై ఇప్పటివరకు 90 వేల ఫిర్యాదులు అందాయి. ♦ సైబర్‌నేరాలపై 14,271 ఎఫ్ఐఆర్ల నమోదుతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. ♦ రోడ్డు ప్రమాదాలు తగ్గిడంలో ఈ ఏడాది సఫలం అయ్యాం. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఎంతో మెరుగైంది. రాష్ట్రంలో ఇప్పుడు సరాసరి రెస్పాన్స్ టైం 7 నిమిషాలు. ♦ అతి త్వరలోనే 15,750 మంది వివిధ శాఖల్లోని కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభిస్తాం. -
యూపీఐ పేమెంట్లే మోసగాళ్ల టార్గెట్
సాక్షి, అమరావతి: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలే అత్యధికంగా ఉంటున్నాయి. డిజిటలీకరణ పెరుగుతున్న కొద్దీ అధికమవుతున్న ఆర్థిక నేరాల్లో యూపీఐ మోసాలదే అగ్రస్థానం. ‘అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్–2023’ పేరిట కాన్పూర్ ఐఐటీ, డిజిటల్ బ్యూరో కన్సల్టెన్సీ ప్రక్సీస్ సంస్థ విడుదల చేసిన నివేదిక యూపీఐ మోసాల తీవ్రతను వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 23 వేల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతుండటాన్ని సైబర్ ముఠాలు అవకాశంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేదిక చెప్పింది. ప్రస్తుతం దేశంలో 90.50 కోట్ల మందిగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు 2027నాటికి 100.14 కోట్లకు చేరతారని అంచనా వేసింది. 2019లో దేశంలో డిజిటల్ చెల్లింపులు 36 శాతం ఉండగా 2023 ఏప్రిల్ నాటికి 57 శాతానికి పెరిగాయి. 2027నాటికి డిజిటల్ చెల్లింపులు 74 శాతానికి చేరుతాయని అంచనా. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు ప్రధానంగా యూపీఐ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన అవగాహన కల్పించాలని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అప్రమత్తతే రక్షా కవచం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే రక్షా కవచం. వినియోగదారులు తగిన అవగాహన కలిగి ఉండాలని సీఐడీ ఎస్పీ (సైబర్ క్రైమ్ విభాగం) హర్షవర్ధన్ రాజు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఆయన చేసిన సూచనలు ఇవీ... ► డిజిటల్ చెల్లింపులు చేసే డివైజ్‌ల ‘పిన్’ నంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నంబర్లుగానీ ఓటీపీ నంబర్లుగానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను కొనసాగించకూడదు. పాస్‌వర్డ్‌ను నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి. ► ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ వినియోగదారుల యూపీఐ వివరాలను తెలపాలని ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోరవు. ఏదైనా ఆర్థిక సంస్థగానీ యాప్‌గానీ యూపీఐ వివరాలను కోరితే ఆ సంస్థ కచి్చతంగా మోసపూరితమైనదని గుర్తించి వెంటనే బ్లాక్ చేయాలి. ► పబ్లిక్ వైఫై, సురక్షితం కాని నెట్‌వర్క్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయకూడదు. ► మొబైల్ ఫోన్లలో ట్రాన్సాక్షన్ అలెర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంకు చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిసే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతిలేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ►సైబర్/యూపీఐ మోసానికి గురయ్యామని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించాలి. ఫిర్యాదు చేయాలి. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోర్టల్ (నంబర్ 1930)కు గానీ ఏపీ సైబర్ మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100 )కుగానీ ఫిర్యాదు చేయాలి. భద్రతపై బ్యాంకుల దృష్టి సైబర్ మోసాలు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైబర్ భద్రతపై దృష్టిసారించాయి. సైబర్ భద్రత మౌలిక వసతులను పెంచుకునేందుకు నిధులు వెచి్చస్తున్నాయి. దేశంలో 43 ఆర్థిక సంస్థలు సైబర్ భద్రత కోసం నిధుల వెచ్చింపును భారీగా పెంచగా.. 17 శాతం ఆర్థిక సంస్థలు స్వల్పంగా పెంచాయి. కాగా 35 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. 2 శాతం సంస్థలు సైబర్ భద్రత బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించగా 3 శాతం సంస్థలు బడ్జెట్‌ను భారీగా తగ్గించాయి. -
ఈ–కామర్స్, ఉద్యోగాల పేరిట అత్యధిక సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ఈ–కామర్స్‌లో విక్రయాలు, ఉద్యోగాలు.. దేశంలో సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. సైబర్ నేరాల్లో ఈ రెండే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విపరీతంగా పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్ అభిరుచి, ఉద్యోగాల కోసం యువత ప్రయత్నాలను ఆసరా చేసుకుని సైబర్ ముఠాలు భారీగా మోసాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా నగర, పట్టణవాసులను లక్ష్యంగా చేసుకునే ఈ ముఠాలు చెలరేగుతున్నాయని ప్రముఖ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘యు గవ్’ సర్వేలో వెల్లడైంది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది నవంబరులో దేశంలో 180 నగరాలు, పట్టణాల్లో ఆ సంస్థ సర్వే చేసింది. సర్వేలోని ప్రధానాంశాలు.. ♦ దేశంలో సైబర్ ఆర్థి క నేరాలు భారీగా పెరుగుతున్నాయి. 2022లో మోసాలకంటే ఈ ఏడాది (2023లో) ఇప్పటికే ఈ మోసాలు రెట్టింపయ్యాయి. కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమరి్పంచిన నివేదిక ప్రకారం 2023 నవంబర్‌నాటికే దేశంలో రూ.5,574 కోట్లు కొల్లగొట్టారు. 2022లో రూ.2,296కోట్లు కొల్లగొట్టారు. ♦ దేశంలో జరిగిన సైబర్ నేరాల్లో ఈ–కామర్స్ పేరిట జరిగినవి 35 శాతం, ఉద్యోగావకాశాల పేరిట జరిగినవి 28శాతం. ♦ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ రూపంలో సైబర్ ముఠాలు వారానికి ఓసారి అయినా ప్రయత్నిస్తున్నాయని 54 శాతం మంది చెప్పారు. రోజూ అటువంటి మోసపూరిత ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ వస్తున్నట్లు 30 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ నేరాల బారిన పడి మోసపోయామని 20 శాతం మంది చెప్పారు. స్నేహితులు, పరిచయస్తులు ఆన్లైన్ మోసాలతో నష్టపోయారని 47 శాతం మంది తెలిపారు. ♦ సైబర్ మోసగాళ్ల బాధితుల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది పురుషుల్లో 35 శాతం, అలాగే ప్రతి వంద మంది మహిళల్లో 24 శాతం వారు ఆన్లైన్ మోసానికి గురైనట్లు వెల్లడించారు. ♦ దేశంలో సైబర్ నేరాల బాధితుల్లో అత్యధికంగా 23 శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల ప్రజలు ఉన్నారు. ♦ సైబర్ మోసాల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మాత్రం సుముఖత చూపడం లేదు. 59 శాతం మంది వారు మోసపోయినప్పటికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో 48 శాతం మంది వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందారు. ♦ సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్న వారిలో 69 శాతం మంది వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించడంలేదు. 59 శాతం మంది అనుమానాస్పద ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్ బ్లాక్ చేస్తున్నారు. 57 శాతం మంది అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడంలేదు. 47 శాతం మంది తెలియని వారికి వస్తువుల కొనుగోలు ఇతరత్రా వ్యవహారాల పేరిట ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు బదిలీ చేయడంలేదు. ఈ జాగ్రత్తలతో వారు సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. -
24% పెరిగిన సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరాల నమోదు ఏటా పెరుగుతోంది. 2021తో పోలిస్తే దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నమోదు 2022లో 24.4 శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ)–2022 నివేదిక వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాల నమోదు తెలంగాణలో 40 శాతం పెరిగిందని వివరించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాల నమోదు 4.5 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఎన్సీఆర్బీ–2022 వార్షిక నివేదికను కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసింది. ఏటా జూలై లేదా ఆగస్టు వరకు ఈ నివేదిక విడుదల చేస్తుండగా ఈసారి ఎన్సీఆర్బీ నివేదిక విడుదలలో దాదాపు 5 నెలలపాటు జాప్యమైంది. 58.24 లక్షల కేసులు... ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం ఐపీసీ, స్పెషల్ లోకల్ లా (ఎస్ఎల్ఎల్) సెక్షన్ల కింద కలిపి 2021లో మొత్తం 60,96,310 కేసులు నమోదవగా 2022లో అన్ని రకాల నేరాలు కలిపి 4.5 శాతం తగ్గుదలతో 58,24,946 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష మందికి నేరాల నమోదు పరిశీలిస్తే 2021లో 445.9 నేరాలు నమోదుకాగా 2022లో ఆ సంఖ్య 422.2కు తగ్గింది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల్లో 4 శాతం, చిన్నారులపై నేరాల్లో 8.7 శాతం, వృద్ధులపై నేరాల్లో 9.3 శాతం, ఎస్సీలపై నేరాల్లో 13.1 శాతం, ఎస్టీలపై నేరాల్లో 14.3 శాతం, ఆర్థిక నేరాల్లో 11.1 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో తెలంగాణలో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ చట్టాల కింద నమోదైన అన్ని రకాల కేసుల నమోదు చూస్తే కేసుల నమోదు సంఖ్య పెరిగింది. 2021లో 1,58,809 కేసులు నమోదవగా 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,65,830 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2022లో నమోదైన కేసుల్లో 79.7 శాతం కేసులలో చార్జిషిట్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో సైబర్ క్రైం పైపైకి... తెలంగాణలో 2022లో మొత్తం 15,272 సైబర్ నేరాలు నమోదవగా 2021లో మొత్తం 10,303 కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో 40 శాతం మేర సైబర్ కేసులు నమోదు పెరిగినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 65,893 సైబర్ నేరాలు నమోదుకాగా, 2021లో 52,974 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2021తో పోలిస్తే 2022లో సైబర్ నేరాలపై కేసుల నమోదు 24.4% పెరుగుదల ఉంది. 2022లో నమోదైన సైబర్ నేరాలను పరిశీలిస్తే 64.8 శాతం (42,710 కేసులు) సైబర్ నేరాలకు కారణం మోసం చేసే ఉద్దేశమని నివేదిక తేల్చింది. ఆ తర్వాతి స్థానంలో 5.5 శాతం (3,648 కేసులు) బెదిరింపులకు సంబంధించినవి, లైంగిక దోపిడీ కారణమైన సైబర్‌నేరాలు 5.2 శాతం (3,434 కేసులు) ఉన్నట్లు వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో తెలంగాణ తర్వాత స్థానంలో కర్ణాటక (18.6 శాతం), మహారాష్ట్ర (6.6 శాతం) ఉన్నాయి. ఇతర నేరాలు ఇలా... రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది. 2021లో 20,865 కేసులు నమోదవగా 2022లో అవి 22,066కు పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 2022లో దేశవ్యాప్తంగా 2,250 కేసులు నమోదవగా 391 కేసుల నమోదుతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర (295), బిహార్ (260) నిలిచాయి. హత్య కేసుల సంఖ్య 2022లో తెలంగాణలో తగ్గింది. 2021లో 1,026 హత్య కేసులు నమోదవగా 2022లో ఆ సంఖ్య 337కు తగ్గింది. వాటిలో వివాహేతర సంబంధాల కారణంగా 116 హత్యలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
డీప్ ఫేక్ బారిన రష్మిక, కత్రినా..రక్షణ కోసం ఏం చేయాలంటే..!
టాలీవుడ్ నటి రష్మిక మందన్న, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఢీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికతో వస్తున్న విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకుని కొందరూ ఈ దురాగతాలకు పాల్పడుతున్నారు. ప్రముఖుల, సెలబ్రెటీలనే గాక సాధారణ మహిళలు సైతం బాధితులుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో 37% ఈ ఫోటో లేదా వీడియో మార్ఫింగ్ ఫేక్ కేసులే అధికంగా వస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. బాధితుల పరువు ప్రతిష్ట దిగజార్చి వారిని నానారకాలుగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న ఉదంతాలెన్నో తెర మీదకు వస్తున్నాయి. తెలిసో తెలియక ఇలా మీ ఫోటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ బారిన పడినట్లయితే వెంటనే ఏం చేయాలి? ఈ సమస్యను నుంచి సునాయాసంగా ఎలా బయటపడాలి తదితరాల గురించే ఈ కథనం!. మార్ఫింగ్ అంటే.. మీ వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు కొందరూ మార్ఫింగ్ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీలంగా లేదా అభ్యంతరకరంగా మార్చి సోషల్ మీడియాలో వదులుతుంటారు. దీంతో ఒక్కసారిగా మీ వ్యక్తిగత పరువు, గౌరవం కోల్పోయినవాళ్లుగా మిగిలిపోతాం. ఇలాంటప్పుడూ తెలియకుండానే మన మానసిక స్థితి బలహీనమవుతుంది. దీన్నే ఆసరాగా తీసుకుని మీ నుంచి లబ్ధి పొందే కుట్రకు తెగబడుతుంటారు ఆన్లైన్ నేరగాళ్లు. నిజానికి ఏ వ్యక్తి అయినా ఈ స్థితిలో మానసికంగా నిలువునా కూలబడిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని బాగున్నప్పుడే ధైర్యంగా ఉండటం వేరు. పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడూ తట్టుకుని నిలబడేవాడు నిజమైన ధైర్యవంతుడు అని గుర్తించుకోండి. ఇక్కడ మీకు కావల్సింది మానసిక స్థితిని స్ట్రాంగ్ ఉండేలా చేసుకోవడమే మీ మొట్టమొదటి తక్షణ కర్తవ్యం. ఆ తర్వాత మీ బాధని, ఆవేదనని అర్థం చేసుకునేవాళ్లు లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసి, సాయం చేస్తారనుకునేవాళ్లకు అసలు విషయాన్ని చెప్పాలి. కనీసం మీకు అలా సాయం చేసేవాళ్లు లేకపోతే సైబర్‌క్రైం, షీ టీం వంటి విమెన్ సంరక్షణ కోసం వస్తున్న పోలీసు విభాగాలను ఆశ్రయించి ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. డీప్ ఫేక్ వీడియోలు ఎలా గుర్తించొచ్చంటే.. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించొచ్చు. ఎందుకంటే మన వాళ్లు లేక మనమో దీనికి గురైతే పరిస్థితిని వివరించడానికి ఇది ఉపకరిస్తుంది. ఎప్పుడైనా ఇలా ఏఐ సాంకేతతో డీప్ ఫేక్ వీడియోలు చేసినట్లయితే..ఆ వీడియోలను నిశితంగా గమనిస్తే వాటి ఆడియో సీన్లో వ్యక్తి ముఖకవళికలను గమనించాలి. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్‌ని గమనించినా అర్థమైపోతుంది అది ఫేక్ అని. అలాగే విజువల్స్ కూడా క్లారిటీగా ఉండవు. ఇలా ఫోటోలు, వీడియోలు మార్చే సాంకేతిక తోపాటు అలాంటి వాటిని గుర్తించే టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. అలాంటి డీప్ ఫేక్ వీడియోలు లేదా ఫోటోలు గుర్తించే టూల్స్ ఏంటంటే.. సెంటినెల్ ఇంటెల్ రియల్-టైమ్ డీప్‌ఫేక్ డిటెక్టర్ WeVerify (వీ వెరీఫై) మైక్రోసాఫ్ట్ వీడియో ప్రమాణీకరణ సాధనం Phoneme-Viseme టూల్ తక్షణమే చేయాల్సిన మరోపని ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని సాయం చేసేలా కొన్ని హెల్ప్లైన్ల అందుబాటులో పెట్టారు. అలాగే ముఖ్యంగా 18 ఏళ్ల నిండని చిన్నారుల సైతం బాధితులవ్వకూడదననే ఉద్దేశ్యంతో కొన్ని ఆన్లైన్ చారిటీ సంస్థలు సాంకేతికతో కూడిన ప్రముఖ టూల్స్‌ని కూడా తీసుకొచ్చాయి. నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైయింట్ ఇవ్వడానికి భయపడే బాధితుల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ముందుగా హెల్ప్‌లైన్ నెంబర్ 1902కి కాల్ చేసి మీ ఫోటో లేదా వీడియోలు మార్ఫింగ్ అయినా వాటి గురించి పూర్తి వివరాలను తెలియజేయాలి. ఆ తర్వాత వెబసైట్ లింక్‌లో https://stopncii.org/ మీ ఒరిజన్‌ల ఫోటో తోపాటు మార్ఫింగ్‌కి గురైన ఫోటోను అప్లోడ్ చేయాలి. అంతే మీ ఫోటో ఇంటర్నెట్లో ఎక్కడ ఉన్నా వెంటనే డిలీట్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ మీ గోప్యతను కాపాడుతుంది. బాధితులకు మద్దతుగా ఉండేందుకు రూపొందించిన వెబ్సైట్ ఇది. ఇది 2000లో ప్రారంభమైంది. ఆన్లైన్లో బాధితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య వాటాదారులతో కలిసి పనిచేస్తుంది. వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడూ.. సోషల్ మీడియా ఖాతాలలో మీ డేటాను గోప్యంగా ఉంచండి మీ వ్యక్తిగత చిత్రాలను ఆన్లైన్లో పబ్లిక్‌గా ఎప్పుడూ షేర్ చేయవద్దు చిత్రాలను పంచుకునేటప్పుడు వాటర్‌మార్క్ ఉపయోగించండి మీ సోషల్ మీడియా ఖాతాల స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లతో రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. అనుకోని సంఘటన ఎదురైతే తెలియజేసేలా అందుకు సంబంధించిన సాక్ష్యం, స్క్రీన్ షాట్లను సేవ్ చేయండి. బాధితులు తీసుకోవాల్సిన చర్యలు సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదున నమోదు చేయండి cybercrime.gov.inలో మీ వివరాలు చెప్పకుండా కూడా ఆన్లైన్ ఫిర్యాదును నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే సోషల్ మీడియా ఖాతా సహాయ కేంద్రానికి నివేదించండి ఈ నేరానికి సంబంధించిన చట్టాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66,37 వంటి కేసులు పెట్టోచ్చు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసినందుకు, చీటింగ్ చేసినందుకు సెక్షన్ 354(డీ), 465, 463 వంటి కేసులు పెట్టొచ్చు బాధితులు చిన్న పిల్లలైతే చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన సెక్షన్ 14, 15 వంటి బలమైన కేసులు పెట్టొచ్చు. వీటికి జైలు శిక్ష, భారీ మొత్తంలో జరిమాన విధించడం జరుగుతుంది. (చదవండి: ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!) -
సైబర్ నిపుణులు కావాలి!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ నిపుణులను రంగంలోకి దించనుంది. ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు సైబర్ సాంకేతిక నిపుణులు కావాలంటూ కేంద్ర హోంశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు అంశాలకు సంబంధించి నిపుణులకు వారి అనుభవం ఆధారంగా నెలకు రూ.65 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనం ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నా రు. ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు https://tcil.net.in/ current &opening.php పై క్లిక్ చేసి అందు లోని వివరాలు చూడవచ్చని తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసే వీరికి కేంద్ర హోంశాఖకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. అర్హతలు, అనుభవం, వేతనం... సీనియర్ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్: ఉండాల్సిన స్కిల్స్..సైబర్ సెక్యూరిటీలో పనిచేసిన అనుభవం, సెక్యూరిటీ స్ట్రాటజీ, పాలసీ ఫార్ములేషన్, ప్లానింగ్. నెలకు వేతనం..రూ. 2,50,000 థ్రెట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్: ఉండాల్సిన స్కిల్స్..సెక్యూరింగ్ క్రిటికల్, సెన్సిటివ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెలకు వేతనం..రూ.1,60,000 డాటా ఎనలైటిక్స్ ప్రొఫెషనల్: నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్..యూపీఐ, ఐఎంపీఎస్, ఏఈపీఎస్ వంటి పేమెంట్స్ టెక్నాలజీపై అవగాహన, ఆర్బీఐ, ఇతర నిబంధనలపై అవగాహన..నెలకు వేతనం..రూ. 1,60,000. మాల్వేర్ రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్.. ఫిషింగ్ ఎటాక్స్, మాల్వేర్ ఎటాక్స్లపై పూర్తి అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్–టెలీకాం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఉండాల్సిన స్కిల్స్..4జీ, 5జీ వంటి టెలికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై, సిమ్‌బాక్స్, వీఓఐపీ వంటి అంశాల్లో అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 టెక్నికల్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. ఎంఎస్ ఎక్సెల్, ఫైనాన్స్ అంశాలపై అవగాహన ఉండాలి.. నెలకు వేతనం.. రూ.65,000 సైబర్ థ్రెట్ అనలిస్ట్: ఉండాల్సిన స్కిల్స్.. సోషల్ మీడియా అనాలసిస్, రిపోర్ట్ క్రియేషన్, క్రైం రీసెర్చ్‌లో అవగాహన..నెలకు వేతనం.. రూ.65,000 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. మోరాకో ప్రోగ్రామింగ్ ఎక్సెల్ ఆటోమైజేషన్లో అవగాహన.. నెలకు వేతనం..రూ.65,000 -
ఆ 10 జిల్లాల్లో సైబర్ దొంగలు
సాక్షి, హైదరాబాద్: అవి నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు.. అమాయకులకు గాలం వేస్తూ దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు అడ్డాలు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 80శాతానికిపైగా ఆ పది జిల్లాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు చేస్తున్నవే. ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ జిల్లాలు ఉన్నాయి. కేటుగాళ్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి త్వరగా వెళ్లేపోయే వీలున్న జిల్లాల్లో అడ్డా వేసి, సైబర్ క్రైం పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. అడపాదడపా తెలంగాణ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఎక్కువగా సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఉంటున్నారన్న అంశంపై ‘ఫ్యూచర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్)’ఇటీవల విడుదల చేసిన తమ అధ్యయన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లకు కొత్త అడ్డాలుగా మారుతున్న ప్రాంతాల వివరాలనూ పేర్కొంది. ఆ పది జిల్లాలే ఎందుకు? సైబర్ నేరగాళ్లు ఆ పది జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని కీలక పట్టణాలకు సమీపంలో ఉండటం, సైబర్ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువగా ఉండటం వంటివి సైబర్ మోసగాళ్ల ముఠాలకు కలసి వస్తున్నాయని నివేదిక తేల్చింది. ఆయా జిల్లాల్లో సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానికుల సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను వాడుకుంటూ ఈ ఉచ్చులోకి సులభంగా దింపుతున్నాయని పేర్కొంది. ఈ పది జిల్లాల్లో చాలా వరకు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనివే. స్థానికంగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తించలేకపోవడం, అవసరమైతే అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పట్టుబడటం కష్టంగా మారుతోంది. కొత్తగా సైబర్ క్రైం హాట్స్పాట్లుగా మారుతున్న ప్రాంతాలివీ.. అస్సాం (బార్పేట, ధుబ్రి, గోల్పర, మోరిగాన్, నగాన్), ఏపీ (చిత్తూర్), బిహార్ (బన్క, బెగుసరాయ్, జముయి, నలంద, పాటా్న, ససరామ్), ఢిల్లీ (అశోక్‌నగర్, ఉత్తమ్‌నగర్ వెస్ట్, న్యూఅశోక్‌నగర్, హర్కేష్ నగర్ ఓక్లా, ఆర్కే పురం, ఆజాద్పురా), గుజరాత్ (అహ్మదాబాద్, సూరత్), హరియాణా (బివాని, మనోత, హసన్‌పుర్, పల్వల్), జార్ఖండ్ (లటేహర్, ధన్‌బాద్, సంత్పాల్ పరగణా, హజారీబాగ్, కుంతి, నారాయణపూర్, రాంచీ), కర్ణాటక (బెంగళూరు), మధ్యప్రదేశ్ (గుణా), మహారాష్ట్ర (ఔరంగాబాద్, ముంబై), ఒడిశా (బాలాసోర్, ధేన్‌కనల్, జజ్‌పుర్, మయూర్భంజ్), పంజాబ్ (ఫజికా, మొహలి), రాజస్థాన్ (బిదర్కా, బర్మార్, జైపూర్), తమిళనాడు (చెన్నై, కోయంబత్తూర్), తెలంగాణ (హైదరాబాద్, మహబూబ్‌నగర్), త్రిపుర (ధలాయ్), ఉత్తరప్రదేశ్ (బులందర్‌షహర్, ఘాజియాబాద్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, సీతాపూర్, గౌతమబుద్ధ నగర్), పశ్చిమ బెంగాల్ (పుర్బ బర్దామన్, దుల్చండ్రియ, భద్రల్, దక్షిణ్ దినాజ్‌పుర్, బిర్భూమ్, బరున్పురా, కోల్‌కతా, మల్దా, బరంపూర్). ఏ రాష్ట్ర నేరగాళ్లు ఏ తరహా సైబర్ నేరాలు చేస్తున్నారు? రాజస్తాన్: సెక్స్టార్షన్ (సోషల్ ఇంజనీరింగ్ వ్యూ హాలతో ఫొటోలు, వీడియోలు, వాయిస్ మార్ఫింగ్ చేసి మోసగించడం), ఓఎల్ఎక్స్లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలు, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్. జార్ఖండ్: ఓటీపీ స్కామ్‌లు (మోసపూరిత పద్ధతుల్లో ఓటీపీలు సేకరించి మోసాలు), కేవైసీ అప్డేషన్, విద్యుత్ బిల్లుల పేరిట, కౌన్ బనేగా కరోడ్‌పతి పేరిట మోసాలు. ఢిల్లీ: ఆన్లైన్ లోన్‌యాప్‌ల పేరిట వేధింపులు, ఆన్లైన్ గిఫ్ట్ పేరిట మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, విద్యుత్ బిల్లులు, జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలు. ఉత్తరప్రదేశ్: ఫేక్ లింకులు (ఫిషింగ్), ఓటీపీ మోసాలు, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లు, డెబిట్, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలు. -
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ ఎస్పీ (సైబర్ నేరాలు) హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, నకిలీ వార్తలు, కించపరిచే వీడియోలు, వ్యాఖ్యలకు బాధ్యులు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లోనూ ఎక్కడ ఉన్నా వారి ఆటకట్టిస్తామని చెప్పారు. ఈ నేరగాళ్లను పట్టుకొనేందుకు సీఐడీ విభాగం పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ద్వారా ఇంటర్ పోల్, ఇతర దేశాలతో కలసి పనిచేస్తోందని చెప్పారు. ఆయన శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు సైబర్ భద్రత కల్పించేందుకు సీఐడీ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధమైందన్నారు. ఆన్లైన్ ద్వారా వేధింపులు, ఆర్థిక మోసాలు, జూదం/బెట్టింగులు, సైబర్ బెదిరింపులు, ఉద్యోగ మోసాలు, వైవాహిక మోసాలు, రాన్సమ్వేర్, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ రుణ మోసాలు మొదలైన అన్ని సైబర్ నేరాలను నిరోధించేందుకు సీఐడీ పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా ఫేక్ పోస్టులు, వార్తలు, ట్రోలింగ్లు, మార్ఫింగ్ వీడియోలు వంటివి పోస్టు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నిరోధించేందుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీపీపీఎస్) ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేకంగా 60 మంది సైబర్ వలంటీర్లను కూడా నియోగించామన్నారు. నకిలీ వార్తలు, దుష్ప్రచార పోస్టులను తొలగించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సైబర్ నేరాలు, దుష్ప్రచారాలపై రెండేళ్లలో ఏకంగా 23 వేల కేసులు నమోదు చేశామని, రూ.30 లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని, 3 వేల మందిని మ్యాపింగ్ చేశామని తెలిపారు. ఇటువంటి నేరాలను అరికట్టడంపై గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు విభాగం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు విశాఖపట్నంలో అక్టోబరు 7, 8 తేదీల్లో సైబర్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు హర్షవర్థన్ రాజు చెప్పారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు ♦ ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్: 1930 ♦ సైబర్ మోసాలను ఆన్లైన్లో నివేదించడానికి: cybercrime.gov.in ♦ సైబర్ నేరాలపై ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదుకు: cybercrimes& cid@ap.gov.in ♦ ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదుల కోసం సీఐడీ వెబ్సైట్: cid.appolice.gov.in ♦ ఫేస్బుక్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు: itcore&cid@ap.gov.in ♦ ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు:@apcidcyber ♦ యూట్యూబ్ చానెల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు: APCID4S4U -
స్నాప్‌చాట్ వాడుతున్నారా?తస్మాత్ జాగ్రత్తా! లేదంటే..
స్నాప్‌చాట్ అనేది ఈ రోజుల్లో టీనేజర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న మోడర్న్ మెసేజింగ్ యాప్. ఇందులో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలను స్నాప్లుగా వర్చుకుంటారు. మన ఫ్రెండ్స్ జాబితాలోని వారు వాటిని చూసిన తర్వాత అవి అదృశ్యమవుతాయి. స్నేహితులతో కనెక్ట్ అవడం, గేమ్స్, న్యూస్, వినోదం, క్విజ్లు, వినూత్న ఫొటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ వంటి వివిధ ఫీచర్లను ఇది అందిస్తుంది. ఈ ఫీచర్లు, దాని ఇంటరాక్టివ్ నేచర్, సృజనాత్మకత కారణంగా స్నాప్‌చాట్ వినియోగదారులను... ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. స్నాప్‌చాట్ అకౌంట్.. హ్యాకింగ్, సెక్సార్షన్, సైబర్ బెదిరింపు, మోసం వంటి వివిధ సైబర్ నేరాలకు అవకాశం ఇచ్చేలా ఉంది. ఇవి యూజర్ల వ్యక్తిగత సమాచారానికి తీవ్రమైన నష్టాలను కలిగిస్తాయి. స్నాప్‌చాట్ సురక్షితంగా ఉండటానికి, వినియోగదారులు పటిష్టమైన భద్రతా పద్ధతులను అమలుచేయోలి. గోప్యతా సెట్టింగ్‌ల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే, కంటెంట్‌ను షేర్ చేసేటప్పుడు, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే స్నాప్‌చాట్ సంబంధిత అధికారులకు నివేదించాలి. తరచూ జరిగే నేరాలు ఇది వర్చువల్ దండయాత్రగా చెప్పుకోవచ్చు. స్నాప్‌చాట్ అకౌంట్ హ్యాకింగ్ అనేది ప్రధానంగా ఉన్న సైబర్‌నేరం. దీనివల్ల బాధితులు వివిధ రకాల దోపిడీకి గురవుతారు. హ్యాకర్లు యూజర్ ఖాతాలకు అనధికారక యాక్సెస్‌ను పొందడానికి ఫిషింగ్, కీ లాగింగ్ లేదా బ్రూట్ ఫోర్స్ దాడులు వంటి అనేక రకాల టెక్నాలజీలను ఉయోగిస్తారు. ఒకసారి రాజీ పడితే హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. హానికరమైన సందేశాలను పంపవచ్చు. లేదా తదుపరి నేరాలకు పాల్పడేందుకు యూజర్లా నటించవచ్చు. సెక్స్టార్షన్ అనేది ఇందులో మరింత ఆందోళన కలిగించే అంశం. సైబర్ నేరగాళ్లు అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంపేలా బలవంతం చేయడం ద్వారా బాధితుల నమ్మకాన్ని దోపిడీ చేస్తారు. ఇక్కడ నుంచి తరచుగా ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే విషయాన్ని బహిరంగంగా విడుదల చేస్తామని లేదా బాధితుడి పరిచయాలకు షేర్ చేస్తామని బెదిరిస్తారు. దీంతో బాధితులు తీవ్ర ఒత్తిడితో కూడిన పరిణామాలను ఎదుర్కొంటారు. స్నాప్‌చాట్ మెసేజ్‌ల ద్వారా సైబర్ బెదిరింపుల నుంచి విముక్తి లభించదు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వేధించే, బెదిరించే లేదా ద్వేషపూరిత కంటెంట్‌ను వ్యాప్తి చేసే హానికరమైన వినియోగదారులకు ఈ ప్లాట్‌ఫారమ్ బ్రీడింగ్ గ్రౌండ్‌గా పనిచేస్తుంది. స్నాప్‌చాట్ సైబర్ బెదిరింపు తీవ్రమైన వనసిక క్షోభకు దారి తీస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. వ్యక్తుల నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడానికి స్నాప్‌చాట్ సులువుగా అనుమతిస్తుంది. దీనిని సాధారణంగా క్యాట్‌ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ మోసగాళ్లు యూజర్లను తప్పుడు సంబంధాలు లేదా స్నేహాలలోకి ఆకర్షిస్తారు. కల్పిత కథలు, దొంగిలించిన చిత్రాలతో మోసగిస్తారు. ఈ విధానాల వల్ల తీవ్ర ఒత్తిడితో అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ∙స్నాప్‌చాట్ మెసేజ్‌లు వెంటనే అదృశ్యమై, అభద్రతా భావాన్ని సృష్టించగలదు. ఈ విషయంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. స్క్రీన్షాట్లు, అనధికారిక అప్లికేషన్లు, వ్యక్తిగత కంటెంట్‌ను క్యాప్చర్ చేయగలవు. ఒకసారి లీక్ అయితే, ఆ వ్యక్తి ప్రతిష్టకు తన వ్యక్తిగత జీవితానికి కోలుకోలేని నష్టం కలిగిస్తుంది. కొన్ని భద్రతా చిట్కాలు ∙మీ కంఫర్ట్ లెవల్‌కు అనుగుణంగా ఉండే సెట్టింగ్‌లను ఎంచుకోండి. నమ్మదగిన స్నేహితులకు మాత్రమే యాక్సెస్‌ని పరిమితం చేయండి. నిజజీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులను మాత్రమే అనుమతించండి. హాని కలిగించే అపరిచితుల రిక్వెస్ట్‌ను యాడ్ చేయడం మానుకోండి. లైంగికపరమైన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని నివారించండి. ∙మీ సమాచారాన్ని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున మీ పూర్తి పేరు, చిరునావ, ఫోన్ నంబర్ లేదా ఆర్థిక వివరాలను స్నాప్‌చాట్‌లో షేర్ చేయవద్దు. స్నాప్‌చాట్ నుండి ఎవరినైనా కలవాలని నిర్ణయించుకుంటే పబ్లిక్ లొకేషన్‌ను మాత్రమే ఎంచుకోండి. ∙తెలియని షార్ట్ లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుచిత మెసేజ్‌లకు ప్రతిస్పందిస్త వ్యక్తిగత సవచారాన్ని అందించడం మానుకోండి. స్నాప్ చాట్ లేదా చట్టబద్ధమైన కంపెనీలు... యాప్ ద్వారా మీ లాగిన్ ఆధారాలను లేదా వ్యక్తిగత వివరాలను ఎన్నటికీ అడగవు. స్నాప్‌చాట్ రీసెంట్ అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. దీని ద్వారా దోపిడీ ప్రమాదాన్ని నివారించవచ్చు. స్నాప్ మ్యాప్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది మీరున్న ప్లేస్‌ను అకౌంట్లోని స్నేహితులకు చపుతుంది. అందుకుని మ్యాప్ ఫీచర్‌ను స్టాప్ చేయండి. స్పాప్‌చాట్ ద్వారా సైబర్‌నేరానికి గురైతే వెంటనే.. https://help.snapchat.com/hc/en-us/articles/7012399221652-How-to-Report-Abuse-on-Snapchat పోర్ట్ చేయాలి. అదేవిధంగా, సమస్య పరిష్కారానికిhttps://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌఫౌండేషన్ (చదవండి: ఓ నది హఠాత్తుగా నీలం, నారింజ రంగులో మారిపోయింది! ఎక్కడంటే) -
నయా సైబర్ క్రైం.. డీప్ ఫేక్!
సోషల్ మీడియాలో ఫొటోలు, ఆడియో, వీడియోలు విరివిగా పోస్ట్ చేస్తుంటారా.. అయితే జరభద్రం.. సైబర్ నేరాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన డీప్ ఫేక్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. వీడియోలో మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది... కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి... కానీ మాట్లాడేదీ మీరు కాదు. మీరు చేయని అభ్యంతరకరమైన పనులు కూడా మీరే చేసినట్లు మారుస్తారు.. ఎలాగంటే.. మీ వాయిస్, వీడియో, ఫొటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి మీరే వీడియో కాల్ చేసినట్లు సృష్టిస్తారు. లేదంటే కిడ్నాప్ అయ్యాననో, అత్యవసరమనో మీ ఫేక్ వీడియోలు సృష్టించి వాటిలో చెప్పిస్తారు. ఆ వీడియోలను కుటుంబీకులకు చూపించి అందినకాడికి దండుకుంటారు. ఈ నేరాలు ఘోరాలు చేసేందుకు అవసరమైన ఫోన్ నంబర్లు, వివరాలన్నీ తెలుసుకునేందుకు నేరగాళ్లు పెద్ద కష్టపడక్కర లేదు.. కేవలం మన సోషల్ మీడియా ఖాతాల నుంచే సంగ్రహిస్తున్నారు.. సాక్షి, హైదరాబాద్: ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ నేరమే డీప్ ఫేక్. ఈ నయా తరహా సైబర్ నేరాలు పాల్పడేందుకు నేరగాళ్ళకు అవసరమైన డేటా డార్క్ వెబ్‌తో పాటు సోషల్ మీడియాలో తేలిగ్గా లభిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, ఆడియో, వీడియోలను సంగ్రహిస్తున్న ఈ–కేటుగాళ్ళు వాటిని సేకరిస్తున్నారు. డార్క్ వెబ్ సహా ఇంటర్నెట్ నుంచి ఖరీదు చేసిన టూల్స్ వినియోగించి సింథసిస్ ప్రక్రియ చేయడుతున్నారు. ఇది కేవలం నేరగాళ్ళు మాత్రమే కాదు... సాంకేతికతపై పట్టున్న వాళ్లు కూడా చేస్తున్న వ్యవహారం కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ నయా సైబర్ క్రైం డీప్ ఫేక్‌తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు... కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళుతోంది. యువతీ యువకులతో పాటు మధ్య వయస్సుల్లో జరుగుతున్న ‘కారణం తెలియని’ సూసైడ్స్‌కి ఈ సింథసిస్ ప్రక్రియ కూడా ఓ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్లాంక్ వీడియో కాల్స్‌తో... సెక్సార్షన్ నుంచి ఎక్సార్షన్ వరకు వినియోగం... ఇటీవల కాలంలో అనేకమందికి వర్చువల్ నంబర్ల నుంచి బ్లాంక్ వీడియో కాల్స్ వస్తున్నాయి. వీటిని స్పందించి ఫోన్ ఎత్తితే.. అవతలి వారు కనిపించరు, మాట్లాడరు. ఎవరు కాల్ చేశారో తెలుసుకోవడానికి కొద్దిసేపు ఫోన్లో ప్రశ్నిస్తుంటాం. ఆ సమయంలో సైబర్ నేరగాళ్ళు రిసీవర్ వీడియో రికార్డు చేస్తారు. దీన్ని అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి వాళ్ళే ఆ వీడియోలో ఉన్నట్లు రూపొందిస్తారు. ఈ వీడియోను చూపించి బాధితుడిని భయపెట్టి వీలున్నంత దండుకుంటారు. ప్రధానంగా యువకులు, మధ్య వయసు్కలే ఈ నేరంలో టార్గెట్‌గా మారుతున్నారు. నేరగాళ్ళే కాదు అవసరార్థులూ వాడేస్తున్నారు.. ఈ సింథసిస్ ప్రక్రియను సైబర్ నేరగాళ్ళతో పాటు మరికొందరూ వాడేస్తున్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువత కూడా సింథసిస్ టెక్నిక్ వాడి అడ్డదారిలో గట్టెక్కుతోంది. బ్యాంకులు, ఇతర సంస్థలకు వీడియో అథెంటికేషన్ చేయాల్సిన వచ్చినప్పుడూ ఈ ప్రక్రియ వాడుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ఇంటర్వ్యూలను రికార్డు చేస్తూ, అభ్యర్థిని హెచ్ఆర్కు పిలిచి పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్ని మోసం చేయడానికి వీడియో సింథసిస్ వినియోగిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. భర్త గొంతును రికార్డు చేసి.. వేధిస్తున్నట్టు మార్చి... మనస్పర్ధల నేపథ్యంలో తన భర్తపై ఫిర్యాదు చేయాలని భావించిన ఓ భార్య వాయిస్ సింథసిస్ టెక్నిక్ వాడారు. తన భర్త గొంతును రికార్డు చేసి తనను దూషిస్తున్నట్లు, వేధిస్తున్నట్లు మార్చేశారు. ఆ రికార్డునే ఆధారంగా చూపించి భర్తపై ఆరోపణలు చేశారు. అయ్యో తాను అసలు అట్లా మాట్లాడలేదంటూ భర్త గోడువెళ్లబోసుకోవడంతో కౌన్సెలింగ్ చేసిన పెద్దల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోలు చూడగానేతొందరపడొద్దు.. ఈ సింథసిస్ ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లోనూ పూర్తి స్థాయిలో నిర్థారించడం సాధ్యం కావట్లేదు. కొన్ని అభ్యంతరకర అంశాలకు సంబంధించి తమ వారికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను చూసిన కుటుంబీకులు తొందర పడకూడదు. అవి ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యాయేమోనని అనుమానించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను వర్తింపజేయాలి. బాధితులుగా మారిన వారికి దన్నుగా ఉంటే ఒంటరితనం, కుంగిపోవడం జరగక ఆత్మహత్యలు వంటి వాటికి ఆస్కారం ఉండదు. – పెండ్యాల కృష్ణశాస్త్రి, సైబర్ నిపుణుడు -
నకిలీ వెబ్సైట్లు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలకు ప్రధాన వేదిక నకిలీ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లే (యాప్స్). దీంతో వాటిని కూకటివేళ్లతో సహా తొలగించి తద్వారా సైబర్ నేరాలను పెకిలించేందుకు సైబరాబాద్ పోలీసులు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సైబరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) ద్వారా నకిలీ వెబ్సైట్లు, యాప్‌లను గుర్తించి, ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. ఇప్పటివరకు సీఓఈ ద్వారా వందకు పైగా ఫేక్ సైట్లను తొలగించారు. విదేశాల నుంచి కూడా.. విదేశాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, ఉత్తరాఖండ్, కర్నాటక, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లు, కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నేరస్తులు నకిలీ యాప్‌లను అభివృద్ధి చేసి, ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నారు. అవి నకిలీవని తెలియక చాలా మంది కస్టమర్లు వాటిని డౌన్లోడ్ చేసుకొని మోసపోతున్నారు. అందుకే పక్కా ఆధారాలతో నకిలీ సైట్లు, యాప్‌లను తయారు చేసే వారిని గుర్తించి, శిక్షలు పడేలా చేస్తున్నారు. ప్రతీ స్టేషన్లో సైబర్ వారియర్లు.. ప్రస్తుతం సైబర్ పోలీసు స్టేషన్‌తో పాటు ప్రతి శాంతి భద్రతల ఠాణాలోనూ ఇద్దరు సైబర్ వారియర్లు ఉన్నారు. వీరికి ఎస్ఐ నేతృత్వం వహిస్తారు. వీరికి సైబర్ నేరాల నియంత్రణపై శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పెట్టడం కూడా సైబర్ నేరస్తులకు అవకాశంగా మారుతోంది. అవగాహనే సైబర్ నేరాలకు నియంత్రణకు ప్రధాన అస్త్రం. అందుకే కమిషనరేట్ పరిధిలో నివాసిత సంఘాలు, కంపెనీలు, పరిశ్రమలు, విద్యా సంస్థలలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలోనూ సైబర్ నేరాలపై షార్ట్ వీడియో, పోస్ట్‌లు చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. -
సింపుల్‌గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్‌లో మహారాష్ట్ర
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ నేరాలు భారత దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. చిరు ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ సైబర్ నేరగాళ్లు వదలడంలేదు. కంప్యూటర్, ఫోన్లతోనే సింపుల్‌గా పని కానిచ్చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు రూ.731.27 కోట్లు దోచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడేళ్లలో 2.13 లక్షల సైబర్ మోసాలు జరిగినట్లు తెలిపింది. ఏటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్, బ్యాంక్ సర్వర్ నుంచి కస్టమర్ల సమాచారాన్ని హ్యాకింగ్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తోందని, డిజిటల్ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు, సైబర్ మోసాల నిరోధం, కంప్యూటర్ భద్రతపై జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివిధ చర్యలను చేపట్టినట్లు తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికం గత మూడేళ్లలో మహారాష్ట్రలో అత్యధికంగా 83,974 సైబర్ మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రూ.240 కోట్లు కొట్టేసినట్లు చెప్పింది. ఆ తరువాత తమిళనాడులో 18,981 సైబర్ మోసాల్లో రూ.69.84 కోట్లు దోచుకున్నారు. హరియాణలో 18,573 కేసుల్లో రూ.66.98 కోట్లు, కర్ణాటకలో 11,916 మోపాల్‌లో రూ.60.75 కోట్లు కాజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణలో 6,900 మోసాల్లో రూ.21.76 కోట్లు కాజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,885 సైబర్ మోసాల్లో రూ.5.69 కోట్లు కాజేసినట్లు పేర్కొంది. సైబర్ మోసాల కట్టడికి తీసుకున్న చర్యలు ♦ అన్ని రకాల సైబర్ నేరాలపై ఫిర్యాదులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభం ♦ బాధితులకు సహాయం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ♦ వినియోగదారుల డేటాను గోప్యంగా ఉంచాలని బ్యాంకులకు సూచన ♦ డిజిటల్ సేవల ప్రక్రియను సురక్షితంగా ఉంచడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆదేశం ♦ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో పోస్టర్లు ♦ అన్ని లావాదేవీలకు ఆన్లైన్ హెచ్చరికలను తప్పనిసరి ♦ లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు -
అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వాతావరణం సమీపిస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పోలీస్ ఉన్నతాధికారి వారి పరిధిలోని గ్రామాల సందర్శన కొనసాగించాలని సూచించారు. నగరంలో ఏర్పా టు చేసిన డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా హాట్స్పాట్ల గుర్తింపు, పోలీసుల ప్రవర్తన తదితర అంశాలపై డీజీపీ చర్చించారు. శాంతిభద్రతల అడిషల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు సూచనలు చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి పదిమంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటానికి డీజీపీ నివాళులర్పిం చారు. -
సైబర్ నేరగాళ్ల హైటెక్ దోపిడీ
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డులేకుండా పోతోంది. కొత్త దారుల్లో బ్యాంక్ అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. బడా కంపెనీల ఈ–మెయిళ్ల, వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి సమాచారాన్ని కొట్టేస్తున్నారు. మరోవైపు ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత విషయాల కూపీ లాగుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ఫోన్ నంబర్ల సేకరించి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, అడ్రస్ డేటా చౌరంతో స్విమ్ స్వాప్ చేసి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సిమ్ పని చేయకపోవడంతో వేరే నంబర్ నుంచి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే అతడి పేరిట అదే నంబర్‌తో వేరే వ్యక్తులు కొత్త సిమ్ తీసుకున్నట్టు తేలడంతో షాకయ్యాడు. అదే సమయంలో అతని అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకు అకౌంట్ చూసుకుంటే గానీ అతనికి అసలు విషయం తెలియలేదు. సిమ్ పనిచేయకపోవడంతో ఎస్ఎంఎస్ కూడా రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజమండ్రికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్లో సిగ్నల్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫోన్ ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి.. ఆన్ చేసినా సిగ్నల్స్ రాలేదు. సమీపంలోని కస్టమర్ సెంటర్‌కు వెళ్లి విషయం చెప్పాడు. సిమ్‌కార్డు పాడైందని.. కొత్తది తీసుకోవాలన్నారు. అడ్రస్ ప్రూఫ్ తీసుకుని ఆన్లైన్లో చెక్ చేసిన సిబ్బంది అంతకు ముందే అదే నంబర్‌తో కొత్త సిమ్ యాక్టివేట్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ అకౌంట్లో రూ.20 వేలు డ్రా అయ్యాయి. ఈ రెండు ఘటనల్లో జరిగింది సిమ్ స్వాప్. సైబర్ నేరగాళ్లు నకిలీ సిమ్ తీసుకుని.. బ్యాంకు అకౌంట్లను గుల్ల చేసే కొత్త ఎత్తుగడ ఇది. ఇటీవల కాలంలో పల్లెలు, పట్టణాల్లోనూ సిమ్ స్వాప్ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు ♦ సిమ్ స్వాప్ నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌తో అతనికి తెలియకుండానే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు. ♦ నేరగాళ్లు ముందుగానే బాధిత వ్యక్తి అడ్రస్, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి వివరాలను సంపాదిస్తున్నారు. ♦ వాటి ఆధారంగా సిమ్‌కార్డు పోయిందంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుంటారు. ♦ఆ విషయం అసలు వ్యక్తికి తెలిసేలోపే ఆ ఫోన్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును అదే ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ♦ ఇందుకోసం ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత వివరాలను కూపీ లాగుతున్నారు. ♦ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. వీటిని తరచూ గమనించాలి ♦ మీ సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ వేరేచోట యాక్టివేట్ అయిందంటే అది సిమ్ స్వాప్గా గుర్తించాలి. ♦ ఏ కారణం లేకుండా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఉన్నట్టుండి నిలిచిపోతే దోపిడీకి ఆస్కారం ఏర్పడినట్టు గ్రహించాలి. ♦ తరచూ భద్రతా నోటిఫికేషన్లు, పాస్వర్డ్లు, భద్రతా ప్రశ్నలు వంటివి, మీ ప్రొఫైల్ డేటా మార్పుల గురించి హెచ్చరికలు వస్తే.. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లోకి లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని అర్థం. ♦ సైబర్ నేరస్తులు మీ సిమ్‌ను నకిలీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మీరు సందర్శించే వెబ్సైట్ల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ♦ భద్రత ప్రమాణాలు కలిగిన వెబ్సైట్ యూఆర్ఎల్లో https:// అని ఉంటుంది. యూఆర్ఎల్లో ‘ S ’ లేకుంటే అది కచ్చితంగా నకిలీ వెబ్సైట్ అని భావించాలి. వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్త సిమ్ స్వాపింగ్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన వ్యక్తిగత డేటా ఎప్పుడూ బహిరంగ పరచకూడదు. భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్సైట్లనే వినియోగించాలి. సామాజిక మాధ్యమాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు వంటి వాటిని పిన్లుగా పెట్టకపోవడం మంచిది. తరచూ మీ సిమ్ మీ పేరుపైనే ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మెసేజ్‌లు ఆగిపోవడం, సిగ్నల్ నిలిచిపోవడం, మీ అకౌంట్‌కు అవాంఛనీయ మెయిల్స్ రావడం సిమ్ స్వాప్‌కు సూచనలు. రెండంచెల ధ్రువీకరణ కోరే యాప్స్‌ను మాత్రమే వాడటం మంచింది. సిమ్ స్వామ్ జరిగినట్టు తెలిసివెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 112, 181, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 11100, నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. – అమిత్ బర్దర్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
భారత్‌లో సైబర్ భద్రత, గోప్యత బలహీనం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆవిష్కరణలు, వాటిని ఉపయోగించుకోవడంలో భారత్ ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ విడుదల చేసిన భారత డిజిటల్ ఎకనామీ నివేదిక తెలిపింది. కానీ, సైబర్ భ్రదత, గోప్యత విషయంలో భారత్ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నట్టు పేర్కొంది. ప్రత్యేకంగా సైబర్ భద్రత చట్టం లేకపోవడం వల్ల, భారతీయులు ఆయా రంగాల నిబంధనలపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. అసాధారణ స్థాయిలో డిజిటల్ పరివర్తన చూపిస్తున్న భారత్‌లో, సైబర్ భద్రత బలహీనంగా ఉన్నట్టు అభిప్రాయడింది. భారత్‌లో ఆవిష్కరణలు, డిజిటల్ సేవల సామర్థ్యాలను వినియోగించుకునే తీరుపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. ఇంటరెŠన్ట్‌ను ఉపయోగించుకుని, వృద్ధి చెందడం, ఉపాధి కల్పన, పరిపానాల మెరుగుదల అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నది విశ్లేషించింది. ‘‘జీ20లోని తోటి దేశాలతో పోలిస్తే తక్కువ మధ్యాదాయం కలిగిన దేశం భారత్. కానీ, ఆవిష్కరణల్లో మాత్రం భారత్ ఎంతో ఉన్నత స్థానంలో ఉంది. భారతీయులు త్వరితగతిన డిజిటల్ సేవలను వినియోగించుకోవడం తదుపరి వృద్ధిని వేగవంతం చేస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. సైబర్ నేరాలు, గోప్యతపై దాడి ఈ రెండు అంశాలపై భారత్ అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉందని సూచించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ద్వారా ఈ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపింది. సైబర్ దాడుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు భారత్ ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్‌లో డిజిటైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ.. సైబర్ భద్రత కవచాలు ఏర్పాటు చేసుకోవడంలో మోస్తరు పురోగతినే చూపించినట్టు స్పష్టం చేసింది. -
HYD: పబ్లిక్ వైఫై వాడాడు.. పైసలు పొగొట్టుకున్నాడు!
కుమార్.. (పేరు మార్చాం) చదువు పూర్తి చేసుకుని గ్రూప్స్ కోచింగ్ కోసం నగరానికి వచ్చాడు. కోచింగ్ కోసం ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరేందుకు ఇంట్లోవాళ్లు డబ్బులు పంపించారు. బయటకు వెళ్లిన కుమార్.. ఓ షాపింగ్ మాల్ బయట ఫ్రీ వైఫైను ఉపయోగించుకునేందుకు యత్నించాడు. ఓటీపీతో లాగిన్ అయ్యి.. మెరుపు వేగంతో వస్తున్న ఇంటర్నెట్ నుంచి ఆశ్చర్యపోయాడు. అలా నెట్‌ను వాడుకున్న కాసేపటికే.. అతని మొబైల్‌కు మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న 50 వేలు కొంచెం కొంచెంగా మాయం అయ్యాయి. భయాందోళనతో.. షాపింగ్ మాల్ వాళ్లను నిలదీశాడు. అసలు తమ మాల్‌కు ఫ్రీ వైఫై యాక్సెస్ లేదని చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్లు.. మినిమమ్ 1 జీబీకి తక్కువ కాకుండా ఇంటర్నెట్ప్యాక్లు ఉపయోగిస్తున్నారు. అయితే అవసరానికి పబ్లిక్ వైఫైలు వాడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా. నెట్‌తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ చదువుల మొదలు.. ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్నిసార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి ఈ–మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం, ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే.. మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉచిత వైఫై వాడాల్సి వస్తే.. అది అధికారికమేనా? సురక్షితమేనా? అనేది క్రాస్ చెక్ చేస్కోవాలి. అలాగే నమ్మదగిన వీపీఎన్‌ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?
వీకెండ్ వస్తుందంటేనే చాలామందిలో ఒక జోష్ వస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాం. కుటుంబంతో కలిసి పిక్నిక్లకు వెళ్లాం.. అంటూ ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటాం. వాటికి వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి మురిసిపోతుంటాం. ఇలాంటి వీకెండ్ పార్టీ జాబితా మీద నిఘా వేసే మోసగాళ్లు డిజిటల్లో పొంచి ఉన్నారు జాగ్రత్త. డిజటల్ మోసగాడి లక్ష్యం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్‌ను అనుకరిస్తూ వారి పేరిట నకిలీ అకౌంట్స్‌ను సృష్టించడం. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, నటీనటులు, కంపెనీ అధినేతలు, ప్రముఖుల అకౌంట్స్ ఉండే అవకాశాలే ఎక్కువ. నకిలీ అకౌంట్స్‌తో మోసం చేసేవారు అన్ని ఆన్లైన్ సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తారు. వీరిలో చాలా మంది ప్రమాదకారులు కానప్పటికీ, పరువు నష్టం లేదా విరాళాలు అడగడం/ రుణాలు కోరడం/ కనెక్ట్ అయిన వెంటనే డబ్బు దోపిడీ చేయడం .. వంటి వాటిపై దృష్టి సారించే వారున్నారు. ముందే ప్లాన్ డిజిటల్ మోసగాళ్లు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏ మాత్రం నమ్మదగని కంటెంట్‌ను సృష్టిస్తారు. బాధితులు లేదా ఇతర హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుండి సమాచారాన్ని దొంగిలించడానికి టెలిఫోన్ స్కామర్లు ఎన్‌సిబి, ఇతర డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లలాగా నటించే విస్తృత మోసపు పథకాలు రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా వీక్ ఎండ్ పార్టీ కల్చర్ ఉన్న ఆన్లైన్ వినియోగదారులకు ఈ విధమైన కాల్స్ చేస్తుంటారు. స్కామర్లు నకిలీ పేర్లు, ప్రసిద్ధ డ్రగ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు లేదా అసలు విభాగాలలోని పోలీసు అధికారుల పేర్లను కూడా ఉపయోగిస్తారు. ప్రధానమైన ఎంపిక వైద్యపరమైన సమస్యలు, విడాకులు, కొత్త ఉద్యోగం, పార్టీల అవగాహన, గేమింగ్, కొనుగోళ్లు చేయాలనుకునేవారు, లైఫ్ స్టైల్ అవగాహన, టెక్నాలజీ, ట్రావెల్, స్పోర్ట్స్.. వంటి టాపిక్స్ గురించి చర్చించే సామాజిక ప్రొఫైల్స్‌ను మోసగాళ్లు ఎంచుకుంటారు. మోసగాళ్ల సాధారణ లక్షణాలు ♦దాడి చేసేవారి మాటల్లో వేగం ఉంటుంది. దీనిని గమనించి బాదితులు వెంటనే అలర్ట్ అవ్వచ్చు. ♦డబ్బుకు సంబంధించి ధ్రువీకరణ పొందడానికి ఊహించని రిక్వెస్ట్‌లు పంపుతారు. ఇది ఇ–మెయిల్స్‌కు ఎక్కువ. ♦స్కామర్లు తరచుగా ‘ప్రైవేట్, గోప్యమైన, రహస్య‘ పదాలను ఉపయోగిస్తారు, ♦చాలాసార్లు స్కామర్లు మీ ఇన్ బాక్స్‌లోకి ప్రవేశించడానికి ఇ మెయిల్ స్పూఫింగ్ లేదా ఒకేలా కనిపించే ఇమెయిల్‌ను ఉపయోగిస్తారు. ఇటీవలి కొత్త దాడులు ♦మోసగాళ్లు దొంగిలించిన ఉన్నతాధికారుల ఖాతాలను ఉపయోగించి ఆన్ లైన్ లో నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. మోసగాళ్ళు వారి డిజిటల్ ప్రొఫైల్ (ఈ్క)ని ఎన్ ఫోర్స్మెంట్ అధికారి లేదా సీనియర్ బ్యూరోక్రాట్ చిత్రంతో సృష్టిస్తారు. స్కామర్ ఆ ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా బ్యూరోక్రాట్‌గా నటించి వారి బృందాలకు వాట్సప్ సందేశాలను పంపుతాడు. ♦వారు వారాంతపు పార్టీపై అవగాహన ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. మొత్తం డేటా సోషల్ మీడియా పోర్టల్‌ల నుండి సేకరిస్తారు. ♦స్కామర్ల కథనాలు కొద్దిగా మారవచ్చు కూడా. సాధారణంగా, వారు చట్టవిరుద్ధమైన డ్రగ్స్‌తో ప్యాక్ చేసిన పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మీకు చెప్తారు. ఇది బాధితుల పేరుతో కొరియర్ చేయబడింది, లేదా అక్రమ మాదకద్రవ్యాలతో చేసిన ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు, కొరియర్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా సృష్టిస్తారు. అంతేకాదు, మాదకద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కోసం బాధితుడిని అరెస్టు చేయబోతున్నారని బెదిరించడం. ♦బాధితులు వారి ఇ మెయిల్లు, వాట్సాప్ సంభాషణలకు సరిగ్గా స్పందించకపోతే, స్కామర్లు మొత్తాలను చెల్లించనందుకు అరెస్టు చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలుగా నటిస్తూ నకిలీ నోటీసులు పంపడం ద్వారా బాధితుడిని బెదిరించడం ప్రారంభిస్తారు. బాధితురాలికి బకాయిపడిన మొత్తంపై అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ♦దోపిడీలో భాగంగా, బాధితుడు తమకు చెల్లింపుగా డబ్బును బదిలీ చేయడానికి లేదా బాధితుడు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపించడానికి నకిలీ అధికారి పైన పేర్కొన్న కారణాన్ని చూపుతాడు. UPIని ఉపయోగించి డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని చెబుతారు. సోషల్ మీడియాలో మోసం జరిగితే.. Instagramలో అయితే https://help.instagram.com/ 370054663112398 YouTubeలో అయితే https://support.google.com/youtube/answer/2801947?hl=en Facebookలో అయితే https://www.facebook.com/ help/contact/169486816475808 LinkedInలో అయితే https://www.linkedin.com/ help/linkedin/answer/61664/reporting-fake-profiles?lang=en రిపోర్ట్ చేయవచ్చు సైబర్ క్రైమ్ పోర్టల్... పరిస్థితి తీవ్రతను బట్టి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయచ్చు. మోసం చేయడానికి రకరకాల వేషాలు వేయడం, పరువు తీయడం లేదా మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు గుర్తింపు ఉండటం.. వంటివి నేరంగా ఈ పోర్టల్‌లో ఉంటుంది. మోసగాళ్ల బారిన పడకుండా.. ♦మీ ఖాతాలకు ప్రత్యేక, ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలతో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి ♦(2FA) రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి. ♦లాక్/ గార్డ్ వంటివి మీ ప్రొఫైల్ ఫీచర్లకు ఉపయోగించండి. ♦సమాచార భాగస్వామ్యాన్ని నియంత్రించడానికి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం గోప్యతా సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి ♦సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు ♦అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి, https://isitphishing.org/తో లింక్‌ను ధృవీకరించండి. ♦నిజ జీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ♦ఆఫ్‌లైన్– ఆన్లైన్ అందరినీ ఒకే విధంగా పరిగణించాలి. ♦మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం GPS లొకేషన్ ఫీచర్‌కి యాక్సెస్ ఆపేయండి. ♦మీ ఆర్థిక లావాదేవీలను ఉపయోగించే సమయాల్లో రిక్వెస్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం వంటివి చేసే ముందు మీ ఇమెయిల్ హెడర్లను కూడా చెక్ చేయడం అలవాటు చేసుకోండి. -
అమెరికాలో ఉన్నా వదలట్లేదు.. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి
హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న నగర వాసులను టార్గెట్ చేస్తూ వారి నుంచి రూ.లక్షలు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వాట్సాప్ గ్రూపుల్లో చొరబడి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దానికి ఢిల్లీలో ఉన్న నేరగాళ్లకు ఇస్తున్నారు. దీంతో ఈ నేరగాళ్లు నగరానికి చెందిన కొందరు యువతులతో వారికి వాట్సాప్ కాల్స్ చేయిస్తూ రుణాలు ఎగ్గొట్టారని కేసులు నమోదు చేయిస్తామని బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. లేని పక్షంలో లోన్ ఫ్రాడర్ అంటూ ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఓ యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి... నగరం నలుమూలల నుంచి అమెరికాలోని పలు ప్రాంతాలకు వెళ్లి విద్య, ఉద్యోగం చేస్తున్న తెలుగు వారు వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తుంటారు. తెలిసిన వారి ద్వారా ఆయా గ్రూపుల్లో యాడ్ అవుతున్న కొందరు వ్యక్తులు గ్రూపులోని యువతుల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. ట్రూకాలర్ ద్వారా వారి పేరును గుర్తించి దాని ద్వారా ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ఐడీలను సేకరిస్తున్నారు. వీటితో పాటు వారి ఫొటోలు, వారి ప్రొఫైల్స్‌లో ఉన్న మరికొందరి ఫొటోలు, పేర్లను తెలుసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నారు. ఆఫీసుకు రావాలంటూ ఒత్తిడి ఈ సమాచారం ఆధారంగా ఢిల్లీ, నోయిడాలో ఉంటున్న సైబర్ నేరగాళ్లు అమ్మాయిలకు వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ప్రముఖ బ్యాంకుల పేర్లు చెబుతూ, లీగల్, రికవరీ టీం సభ్యులుగా పరిచయం చేసుకుంటున్నారు. తమ బ్యాంకులో రుణం తీసుకుని దాన్ని కట్టకుండా పారిపోయారని, ఒక్క రోజులో రుణాన్ని చెల్లించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. మీకు రూ. లక్ష పెద్ద మొత్తం కాదని, ఇవ్వకపోతే మీ ఫొటోతో సహా లోన్ఫ్రాడర్ అంటూ మీ ఫ్రెండ్స్‌కి వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ పేజీల్లో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇదే క్రమంలో స్నేహితులకు ఫోన్ చేసి రాధ (పేరుమార్చాం) రుణం తీసుకుంది, రెఫరెన్స్ కింద మీ పేరు ఇచ్చారు. ఆమె కడుతుందా..లేక మీరు చెల్లిస్తారా అంటూ వే«ధిస్తున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక కొందరు రూ. లక్షే కదా అంటూ నేరగాళ్లకు పంపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి.. అమీర్‌పేటకు చెందిన ఓ యువతి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఇటీవల ఢిల్లీ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి రుణం కట్టాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. ఆమె ఈ తతంగాన్ని మాకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. యూఎస్‌లో నివాసం ఉంటున్న మీ పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇటువంటి ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సైబర్‌క్రైం ఏసీపీ -
సైబరాసురులు దోచేస్తున్నారు..కంపెనీల పేరులో వల
‘ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఇంట్లోనే కూర్చుని నెలకు లక్షలాది రూపాయల్ని స్పందించే అవకాశం’ అంటూ విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఫోన్‌కు రెండు నెలల క్రితం మెసేజ్ వచ్చింది. ఆశతో మెసేజ్ కింద ఉన్న వెబ్‌లింక్‌ను క్లిక్ చేయగా.. ఓ ప్రముఖ కంపెనీ పేరిట వెబ్సైట్ తెరుచుకుంది. కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు పంచుతామని అందులో పేర్కొనడంతో.. ఆమె రూ.వెయ్యి పెట్టుబడి పెట్టింది. మరుసటి రోజున రూ.15 వేలు లాభం వచ్చినట్టు ఆమె పేరిట ఉన్న ఆ కంపెనీ వాలెట్లో ఆ మొత్తాన్ని జమ చేసినట్టు చూపించారు. వాలెట్లోని నగదు విత్‌డ్రా చేయాలంటే మరో రూ.5 వేలు పెట్టుబడి పెట్టాలనే మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె రూ.5 వేలను పెట్టుబడి పెట్టింది. ఇలా ప్రతి రోజూ ఆమె పేరిట ఉండే వాలెట్లోని నగదు పెరగడం.. ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే మరికొంత నగదు జమ చేయాలనే ఆంక్షల రూపంలో మెసేజ్‌లు రావడం పరిపాటిగా మారింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఆమె వాలెట్లో 1,13,42,181 రూపాయలు చేరాయి. ఈ నగదు తీసుకునే నిమిత్తం విడతల వారీగా రూ.9 లక్షలు సమర్పించాక మోసపోయానని గ్రహించిన ఆ మహిళ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోవడంతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. డబ్బులు వస్తే పిల్లల చదువుకు ఉపయోగపడతాయనే ఆశతో బంగారాన్ని అమ్మేసి మరీ సైబర్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. విజయవాడ నగరంలో ఇలాంటి మోసాలకు సంబంధించి నెలకు సగటున 10 వరకు కేసులు నమోదవుతుండటంతో సైబర్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆశ చూపి లూటీ చేస్తున్నారు అమెజాన్, ఈబే, లవ్ లైఫ్, క్రి΄్టో, స్నాప్ డీల్, ఫ్లిప్‌కార్ట్, ఓలా తదితర బడా కంపెనీల్లో స్వల్ప పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ పలువురి ఫోన్లకు మెసేజ్‌లు పంపించి సైబరాసురులు ఆకర్షిస్తున్నారు. ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చంటూ మెసేజ్‌ల ద్వారా సూచిస్తారు. నమ్మకం కుదరకపోతే రూ.లక్షలు సంపాదించిన వారి వీడియోలు చూడండి అంటూ.. వారే తయారు చేసిన కొన్ని వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా లింక్‌లను పంపుతారు. మొత్తం ఆన్లైన్ అయిపోయిందని, భవిష్యత్ వ్యాపారం పూర్తిగా ఆన్లైన్ వేదికగానే జరుగుతుందంటూ ముగ్గులోకి దించుతారు. ముందుగా రూ.100 పెట్టుబడి పెట్టి పరీక్షించుకోండంటూ బంపర్ ఆఫర్ ఇస్తారు. వారు పంపిన వెబ్‌లింక్ క్లిక్ చేయగానే వారే రూపొందించిన ఆయా కంపెనీల నకిలీ వెబ్సైట్లోకి తీసుకెళ్తారు. తరువాత ఒక యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. అక్కడ మన కోసం ఒక వాలెట్‌ను రూ΄÷ందించి పెట్టుబడులను పలు రకాలైన ఆఫర్లతో ఆకర్షిస్తారు. రూ.100 పెట్టుబడి పెట్టిన 24 గంటల్లోపే లాభం రూ.1,500లకు పైగా వచ్చిందని వాలెట్లో చూపిస్తారు. ఆ నగదు మీ బ్యాంక్ ఖాతాకు చేరాలంటే మరో రూ.500 పెట్టుబడి పెట్టాలంటూ ఆంక్షలు విధిస్తారు. ఇలా వాలెట్లో నగదు అంకెలను పెంచుకుని΄ోతూ ఆశను పెంచేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు గుంజుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి క్యాష్ ఇన్వెస్ట్మెంట్ తరహా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కేసులు నమోదు చేసి సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నాం. ఈ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలు అవసరం లేని వెబ్‌లింక్‌ల జోలికి ;పోకూడదు. – యేలేటి శ్రీరచన, ఎస్ఐ, సైబర్ క్రైం, విజయవాడ (చదవండి: భారతీయ చిన్నారులు బాగా ‘స్మార్ట్’ ) -
టెలిగ్రామ్ యాప్ వల్ల ఎన్నో ప్రయోజనాలు! కానీ.. ఇలా చేశారంటే మాత్రం!
Cyber Crime Prevention Tips In Telugu: టెలిగ్రామ్ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రాస్–ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ అప్లికేషన్. ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది మెరుగైన గోప్యత, ఎన్క్రిప్షన్ లక్షణాలతో పాటు రెండు లక్షల మంది సామర్థ్యం వరకు పెద్ద గ్రూప్ చాట్ ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. టెలిగ్రామ్ తన వినియోగదారులకు మీడియా పరిమాణాలపై పరిమితులు లేకుండా అనేక ఫీచర్లను అందిస్తుంది. ప్రయోజనాలు (ఎ) వాట్సాప్ గ్రూప్‌లలో 256 మంది సభ్యుల వరకు ఉండచ్చు. అదే, టెలిగ్రామ్ అయితే రెండు లక్షల మంది ఒక గ్రూప్‌గా ఉండవచ్చు. (బి) టెలిగ్రామ్ ప్రాథమికంగా మీరు రహస్యంగా ఎంచుకున్న సంభాషణలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఇది మీ గోప్యతను మెరుగుపరుస్తుంది. (సి) టెలిగ్రామ్ యాప్ పూర్తిగా ఉచితం. టెలిగ్రామ్‌లో బాధించే ప్రకటనలు ఉండవు (డి) మెసేజ్‌లను పంపిన వారికి, వాటిని స్వీకరించిన వారికి భద్రత ఉంటుంది. స్కామ్‌లు టెలిగ్రామ్ స్కామ్‌లు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతాయి లేదా మెసేజింగ్ అప్లికేషన్ నుండి వినియోగదారులను ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్లు, అప్లికేషన్ లలోకి లాగుతాయి. టెలిగ్రామ్‌కు విస్తృతమైన ఆమోదం, వాడుకలో సౌలభ్యం కారణంగా స్కామర్లు జొరబడతారు. చాలా సార్లు, స్కామర్లు తమను తాము చట్టబద్ధమైన ఏజెంట్లుగా లేదా వివిధ కార్పొరేషన్ల ఉద్యోగులుగా చూపించుకోవడం చూస్తుంటాం. స్కామర్లు తరచుగా బాధితులను ఆకర్షించడానికి ప్రముఖ ఛానెల్‌ల నకిలీ/నకిలీ వెర్షన్లను సృష్టిస్తారు. ఈ గ్రూప్‌లు ఒకే విధమైన పేర్లు, ప్రొఫైల్ చిత్రాలను కలిగి ఉంటాయి. అదే పిన్ చేయబడిన సందేశాలను కలిగి ఉంటాయి. దాదాపు చట్టబద్ధమైన వాటితో సరిపోలే వినియోగదారు పేర్లతో ఉంటాయి. ప్రమోషన్లు, ఉచిత బహుమతులు, ఎమ్ఎల్ఎమ్ ఆధారిత పథకాలతో కూడిన స్కామ్‌లకు ప్రజలు బలైపోతుంటారు. స్కామర్లు సమస్యను పరిష్కరించడానికి మీ ల్యాప్‌టాప్ లేదా పరికరం రిమోట్ కంట్రోల్ తీసుకోవాలని తరచూ అడుగుతారు. ఈ ప్రక్రియలో మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. ఎ) బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు నాణేలు, డబ్బు లేదా ఖాతా లాగిన్ల నుండి బాధితులను స్కామ్ చేయడానికి స్కామర్లు టెలిగ్రామ్‌లో తమను తాము క్రిప్టో నిపుణులుగా చెప్పుకుంటారు. తమను తాము నిపుణులుగా చూపిస్తూ, వారు బాధితుల క్రిప్టో పెట్టుబడులపై హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు. వారి స్కామ్‌లో భాగంగా, వారు తమ పెట్టుబడి పెరుగుతున్నట్లు చూపే బాధితుల చార్ట్‌లు, గ్రాఫ్‌లను చూపుతారు (ఈ సభ్యులలో ఎక్కువ మంది నకిలీ లేదా చెల్లించిన సోషల్ మీడియా నిపుణులు). బాధితుడు వాలెట్ లేదా డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించిన విధంగా వారి ఆదాయాలను ఉపసంహరించుకోలేరు. ఆ సమయంలో స్కామర్లు అదృశ్యమవుతారు. గ్రూప్‌లలో ఎప్పుడూ స్పందించరు. బి) బాట్లను ఉపయోగించి ఫిషింగ్ టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లో బాట్లను నిర్మించే, ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎపిఐ ఉండటం వలన, వారు రియల్ సంభాషణలలో పాల్గొంటారు. దీంతో మీరు స్కామ్‌కి గురవుతున్నారో లేదో చెప్పడం కష్టం. అంటే, ఒక నకిలీ బాట్, బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు అప్లికేషన్ల నుండి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఈ బాట్ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా లాగిన్లు, పాస్వర్డ్లు, క్యూ ఆర్ కోడ్లను కూడా వదులుకోమని వినియోగదారుని కాల్ చేస్తుంది, ఒప్పిస్తుంది. సి) టెక్ సపోర్ట్ స్కామ్‌లు ఈ స్కామ్‌లో స్కామర్లు చట్టబద్ధమైన టెక్ సపోర్ట్ ఏజెంట్లలా నటిస్తుంటారు. స్కామర్లు సమస్యను పరిష్కరించడానికి బాధితుల ల్యాప్‌టాప్ లేదా పరికరాన్ని రిమోట్ కంట్రోల్‌గా తీసుకుంటారు. ఈ ప్రక్రియలో బాధితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తారు. డి) రొమాన్స్/ సెక్స్టార్షన్ స్కామ్‌లు సోషల్ మీడియా నిషేధించిన సాన్నిహిత్యాలు, నిషేధించిన ప్రవర్తనలలో పాల్గొనడానికి అవకాశాన్ని సృష్టిస్తుంది. స్కామర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆన్లోలైన్లో వినియోగదారుతో నమ్మకాన్ని పొందేందుకు వారితో సంబంధాన్ని ప్రారంభిస్తారు. బాధితులు తమకు సున్నితమైన ఫొటోలు లేదా వీడియోలను పంపమని అడుగుతారు, ఆ పై వారు బ్లాక్మెయిల్ కోసం ఉపయోగిస్తారు. ఇతర రకాల శృంగార మోసాలు (ఎ) ప్రతిపాదనలతో దోపిడి. (బి) అందమైన స్త్రీ లేదా పురుషుడు. (సి) గే మ్యాన్ పే మేకింగ్. టెలిగ్రామ్ యాప్‌లో భద్రతా చిట్కాలు ఎ) మీ అన్ని రకాల పాస్‌వర్డ్‌లకు కనీసం 10 పెద్ద, చిన్న అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాలు, ప్రత్యేకమైనవి, ఊహించడానికి కష్టంగా ఉండేలా నిర్వహణకు ఉపయోగించడాన్ని పరిగణించండి. బి) తెలిసిన మూలాల ద్వారా పంపబడినప్పటికీ, https://www.unshorten.it లేదా https://www.checkshorturl.com ను ఉపయోగించి సంక్షిప్త URLs / Links ధృవీకరించండి సి) తెలియని పరిచయాల ద్వారా పంపబడిన అటాచ్‌మెంట్స్‌ను క్లిక్ చేయడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి ముందు https://www.isitphishing.org or https://www.urlvoid.com వెబ్‌లింక్ ద్వారా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. డి) వినియోగదారు ప్రొఫైల్‌కి వెళ్లి, మీ స్క్రీన్ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ‘యూజర్ బ్లాక్‘ ని ఎంచుకోండి. ఇ) స్కామ్ ఖాతా స్క్రీన్‌షాట్, ఏదైనా ఇతర సమాచారాన్ని టెలిగ్రామ్‌లోని@notoscam పంపండి. లేదా ప్రత్యామ్నాయంగా ఇమెయిల్:abuse@ telegram.orgకి పంపవచ్చు. చదవండి: మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి -
రూ.13 వేలు కడితే అమెరికా హెజ్1బీ వీసా..! ఇలాంటి స్కామర్లతో జర భద్రం..
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలతో మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ లింక్డ్ఇన్ యూజర్ స్కామర్లు వీసాలు ఇప్పిస్తామని రూ.లక్షలు కాజేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. అమెరికా హెచ్1బీ వీసా ఇప్పిస్తామని 160 డాలర్లు(రూ.13వేలు) కడితే దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడుతామని సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నాడు. ఓ టాప్ సోడా కంపెనీల పేరుతో ఈ ఆఫర్ లెటర్ పంపుతున్నారని చెప్పాడు. మొదట రూ.13వేలే అని చెప్పినా ఆ తర్వాత ఆశావాహుల నుంచి లక్షలు కాజేస్తున్నారని వివరించాడు. ఈ స్కామర్లు పంపే ఈ-మెయిళ్లు ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల పేరుతో కూడా ఉంటాయని సదరు వ్యక్తి వివరించాడు. మీకు నమ్మకం కల్పించేందుకు వాళ్లు డమ్మీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నాడు. ఇలాంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నిజంగా జాబ్ ఆఫర్ ఇచ్చే ఏ సంస్థ అయినా డబ్బులు వసూలు చేయదు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని లింక్డ్ఇన్ యూజర్ సూచించాడు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే!
ఓ టెక్కీ బ్యాంక్ నుంచి మెయిల్లో వచ్చిందని అనుకుని తన మొబైల్‌కు వచ్చిన క్యూ ఆర్‌కోడ్ ను స్కాన్ చేశాడు. వెంటనే అతని ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్ పిన్‌లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. కొద్దిసేపటి తరువాత అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు కూడా ఖాళీ అయింది, వ్యక్తిగత ఫోటోలను చూపి దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు. ఇటీవల టెక్నాలజీ వాడకం పెరిగే కొద్దీ నేరగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. కాలానుగుణంగా కొత్త రకం దోపిడికి వ్యూహాలు రచ్చిస్తున్నారు. మన బ్యాంక్ నుంచి మనకి తెలియకుండానే నగదు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాటిపై కాస్త అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో జాగ్రత్త.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ పేరుతో కేటుగాళ్లు కొత్త రకం దోపిడికి స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీరు ఇబ్బందుల్లో పడక తప్పదు. బ్యాంక్ నుంచి నగదు తీసుకోవడానికి ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మోసపోగా మరో రెస్టారెంట్లో పెట్టిన క్యూ ఆర్‌కోడ్‌ను మార్చివేసి తమ అకౌంట్ కు నగదు జమఅయ్యేలా చేసి వంచనకు పాల్పడిన ఘటనలు ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మోసగాళ్లు పలు కేంద్రాల్లో( రెస్టారెంట్లు, షాపుల్లో, కస్టమర్లు రద్దీ ఉండే ప్రాంతాలు) యజమానులకు తెలియకుండా అక్కడి క్యూ ఆర్‌కోడ్‌ను మార్చి తమ క్యూఆర్ సంకేతాన్ని ఉంచుతున్నారు. ఇది తెలియక కస్టమర్లు తమ బిల్లులు చెల్లించడానికి క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అందులోకి డబ్బులను పంపుతున్నారు. అయితే చివరికి ఈ పైసలన్నీ మోసగాళ్ల ఖాతాల్లోకి జమఅవుతున్నాయి. మరో వైపు రెస్టారెంట్లో రోజురోజుకు ఆదాయం తగ్గుతుండటంతో దీనిపై విచారించిన యజమానులకు అసలు నిజం తెలియంతో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది?
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనరేట్ పరిధిలోని మహిళ, సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లకు అనునిత్యం పదుల సంఖ్యలో బాధితులు వస్తుంటారు. వేధింపులు ఎదురైన, బెదిరింపులకు లోనైన వారితో పాటు ఆర్థికంగా నష్టపోయిన వాళ్లూ వీటి మెట్లు ఎక్కుతారు. అప్పుడప్పుడు ఈ ఠాణాలకు వస్తున్న కొన్ని కేసులు పోలీసులనే షాక్‌కు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరికి ఎలా న్యాయం చేయాలో, ఎవరికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల పోలీసుల వద్దకు వచ్చిన ఆ తరహాకు చెందిన కేసుల్లో కొన్ని... పతి, పత్నీ ఔర్ ఓ... భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడనో, ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనో, పెళ్లి పేరుతో ప్రేమాయణం నడిపి మోసం చేశాడనో...ఇలా అనే కేసులు పోలీసుల వద్దకు వస్తుంటాయి. అయితే బుధవారం మహిళ ఠాణాకు వచ్చిన ఓ కేసు అధికారులకే మతి పోగొట్టింది. వివాహితుడైన ఓ వ్యక్తికి ఆన్లైన్లో నగరానికే చెందిన యువతితో పరిచయమైంది. వీరి మధ్య ప్రేమ చిగురించడం అనేక కేసుల్లో వింటూనే ఉంటాం. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... ఈ ప్రేమాయణం కథ మొత్తం అతడి భార్యకూ తెలిసి ఉండటం. ఈ భార్య, ఆ ప్రియురాలు ఓ అండర్ స్టాడింగ్కు వచ్చి కలిసే అతడితో కాపురం చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. ఈ విషయం సదరు యువతి ఇంట్లో తెలియడంతో కథ అడ్డం తిరిగింది. వివాహితుడికి రెండో భార్యగా ఉంటావా? అంటూ యువతిని మందలించారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో విషయం ఠాణా వరకు వచి్చంది. ‘నా భర్త ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే.. ముగ్గురం కలిసే ఉంటాం’ అంటూ భార్య, ‘ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను’ అంటూ యువతి చెప్తుండగా... ఆమె తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. భార్య ఉండగా ఆమె సమ్మతించినా రెండో పెళ్లి చేసుకోవడం నేరమంటూ చట్టాన్ని వివరించిన పోలీసులు ముగ్గురికీ కౌన్సిలింగ్ చేశారు. ఫలితంగా పరిస్థితులు అదుపులోకి రావడంతో ఎవరి ఇళ్లకు వాళ్లు చేరారు. నిందితుడిగా మారిన మాజీ ప్రియుడు... వివాహిత అయిన మాజీ ప్రేయసి నుంచి సందేశం అందుకున్న ఆ ప్రియుడు ఎగిరి గంతేసి మరీ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఆమే తనను పెళ్లి పేరుతో వేధిస్తున్నాడంటూ అతడిపై సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అతను నగరంలో చదువుకునే సమయంలో ఈమెతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జంట ప్రయాణం పెళ్లి వరకు వెళ్లలేదు. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి కావడంతో అతడు ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాడు. వివాహమైన కొన్నాళ్లకే భర్తతో విభేదాలు రావడంతో ఆమె విడాకులు తీసుకోవాలని భావించింది. ఆ తంతు పూర్తయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామంటూ మాజీ ప్రియుడికి సందేశం ఇచ్చింది. ఇంకేముంది ఉన్న ఫళంగా నగరానికి వచ్చేశాడు. ఆమె భర్తతోనే కలిసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యాడు. పెళ్లి చేసుకుందామంటూ పదేపదే ఆమెకు సందేశాలు పెట్టాడు. విడాకులు తీసుకోకుండా అదెలా సాధ్యమంటూ దాటవేస్తూ వచ్చింది. అలాంటప్పుడు తనను ఎందుకు రమ్మన్నావంటూ అతడు గొడవకు దిగాడు. తన వేదనను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే బాధితురాలిగా మారిన ఆ యువతి తన మాజీ ప్రియుడి పైనే సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు పెట్టింది. కౌన్సిలింగ్‌తో ఈ కథ లండన్‌కు చేరింది. చదవండి: కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో యాప్... ఎంతపని చేసింది... ఓయూ ప్రాంతానికి చెందిన ఓ నిరక్షరాస్యుడు గొర్రెలు, మేకల వ్యాపారి. ఇతడికి స్థానికంగా ఉండే యువతితో పరిచయమైంది. ఇద్దరూ కొన్నాళ్లు చెట్టపట్టాలుగా తిరిగారు. నిరక్షరాస్యుడని తెలియడం..ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఆమె అతడిని దూరంగా పెట్టింది. దీంతో తనను ప్రేమిస్తున్నానంటూ మోసం చేసిందని వ్యాఖ్యానిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి ఫొటోతో సహా అతడు పోస్టు చేశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాటింగ్ యుద్ధం కూడా జరిగింది. అవాక్కైన పోలీసులు ఆవేదనకు గురైన ఆమె అతడిపై సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించింది. నిరక్షరాస్యుడైన అతడికి చాటింగ్, పోస్టులు పెట్టడం రాదని, అతడి వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించింది. కేసు నమోదు కావడంతో ఆ యువకుడిని పోలీసులు ఠాణాకు తీసుకొచ్చారు. విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన విషయాలు విని అవాక్కయ్యారు. ఏ మాత్రం ఆంగ్ల పరిజ్ఞానం లేని అతడు ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యువతి పంపిన సందేశాన్ని కాపీ చేసి అందులో పేస్ట్ చేసే వాడు. దానికి ఏం సమాధానం చెప్పాలన్నది ఆ యాప్ సూచించేది. దాన్ని మళ్లీ కాపీ చేసే అతడు యువతికి పోస్టు చేసేవాడు. కొన్నిసార్లు వాయిస్ కమాండ్స్‌ను టెక్టస్గా మార్చి పోస్టు చేసే వాడు. నిందితుడిగా మారిన అతగాడు తనను ఆ యువతి ఎలా మోసం చేసిందో కూడా వివరించాడు. ఈ విషయాలను ఆమె కూడా అంగీకరించడంతో అరెస్టు పర్వం తప్పింది. -
మొబైల్‌కు మెసేజ్.. క్రిప్టో పేరుతో లూటీ!
లక్కీ డ్రా గిఫ్టు పేరుతో ప్రజలు మొబైళ్లకు ఓటీపీ పంపించి వారి బ్యాంకు అకౌంట్లను కాజేసే సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఆశ చూపించి దోచేస్తున్నారు. దీనికి ఇన్‌స్టా గ్రాంలో చురుకుగా ఉంటున్న యువతనే టార్గెట్ చేసుకున్నారు. మెసేజ్‌లు, లింక్‌లు పంపించి పలు నకిలీ కంపెనీల బ్రోచర్లను చూపి అధిక లాభాల పేరుతో వలలో వేసుకుంటారు. క్రిప్టో కరెన్సీ మోజులో పడి మోసపోతున్న వారిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా ఉన్నారు. ఎలా వంచనకు పాల్పడతారంటే అంతర్జాతీయ స్థాయిలో క్రిప్టో కరెన్సీ పై తీవ్ర చర్చ జరుగుతోంది. కోవిడ్, ఆ తరువాత కాలంలో ఈ సైబర్ డబ్బు విలువ పెరిగింది. దీంతో వంచకులు క్రిప్టో బాట పట్టారు. యువత, టెక్కీలు చాలామంది ఇన్‌స్టా వినియోగిస్తారు. సైబర్ మోసగాళ్లు వారికి లింక్‌లు పంపుతూ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే అచిర కాలంలోనే భారీ లాభాలు వస్తాయని చెబుతారు. పెట్టుబడి పెట్టాక అకౌంట్‌ను, ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేస్తారు. దీంతో బాధితులు మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తారు. సైబర్ వంచకులు ఇతరుల ఇన్‌స్టా అకౌంట్లను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడతారు. వారు పంపించిన లింక్, యుఆర్‌పీఎల్ కొద్దిరోజుల్లోనే డీ యాక్టివేట్ అవుతాయి. వంచకులు నగదు జమచేసుకునే బ్యాంకు అకౌంట్లు కూడా నకిలీల పేరుతో ఉంటాయి. దీంతో కేసుల విచారణ కష్టంగా ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. జాగ్రత్తగా ఉండాలి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే అధికారిక కంపెనీలు ఏవి, వాటికి అనుమతులు ఉన్నాయా? ఇలా పలు విషయాలను తెలుసుకున్న తరువాతనే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను నమ్మి మదుపు చేస్తే మోసపోతారని సైబర్ నిపుణులు తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చాయని దుండగులు నకిలీ సక్సెస్ స్టోరీలను పోస్ట్ చేసి మాయకు గురిచేస్తారు. కాబట్టి క్రిప్టో విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆగ్నేయవిభాగ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సీఐ ఆర్.సంతోష్‌రామ్ తెలిపారు. లక్షల రూపాయలు పోయాయి నగరంలో పేరుపొందిన ఐటీ కంపెనీ ఉద్యోగి ఇన్ స్టా ఖాతాకు క్రిప్టోలో పెట్టుబడి పెడితే లక్షలాది రూపాయల లాభం పొందవచ్చని ఒక సక్సెస్ స్టోరీ వచ్చింది. స్నేహితులు పంపిన లింక్ కదా అని నమ్మి దశలవారీగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజులు గడిచినప్పటికీ లాభాలు రాకపోగా అకౌంట్లో ఉన్న నగదు మాయమైంది. దీనిపై బాదితుడు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చదవండి: మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్! -
కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్: డబ్బులు ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!
చక్రాయపేట మండలానికి చెందిన కరోనా బాధిత కుటుంబానికి ఫలానా వారు ఫోన్ చేస్తారని ఆశా వర్కర్ తెలియజేశారు. కొద్దిసేపటిలోనే సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసి వివరాలన్నీ తీసుకున్నారు. అయితే బా«ధిత కుటుంబీకుల ఖాతాలో సొమ్ములు లేకపోవడంతో మీ సంబంధీకులతో మాట్లాడించాలని సూచించారు. దీంతో వీరబల్లి మండలానికి చెందిన బంధువుతో మాట్లాడించగా, వారి వివరాలు కనుగొని ఖాతా నుంచి సుమారు రూ. లక్ష వరకు సులువుగా దోచేశారు. సాక్షి రాయచోటి : అవకాశం దొరికితే ఎవరినైనా బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇంతకుమునుపు ఇంగ్లీషులోనో...హిందీలోనో మాట్లాడుతూ మనుషులను ఏదో ఒక రకంగా మాయ చేసి సొమ్ము కాజేసేవారు. ఈజీగా మనీ సంపాదించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒకసారి ఈకేవైసీ, మరోసారి బ్యాంకులో సాంకేతిక సమస్య ఇలా చెబుతూ పోతే అనేక సమస్యలు వెతికి బా«ధితులను బుట్టలో వేసుకుంటున్న మాయదారి మోసగాళ్లు కొత్త తరహా మోసానికి తెర తీశారు. బాధితులు నమ్మరన్న సాకుతో ఆశా వర్కర్లతోనే ఫలానా వారు ఫోన్‌చేస్తారని చెప్పించి.. తర్వాత వీడియో కాల్ చేసి తెలుగులో మాట్లాడుతూ సొమ్ములు వేస్తున్నామని చెప్పి వివరాలు రాబట్టి అకౌంటులో ఉన్న మొత్తాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల అధికమయ్యాయి. కరోనా సొమ్ము పేరుతో టోకరా నాలుగైదు రోజులుగా అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో కలెక్టరేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ముందుగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లేదా వలంటీర్లకు ఫోన్ చేసి కరోనాతో మృతి చెందిన వారికి సంబంధించి పరిహారం (ఇన్‌స్రూెన్స్) వచ్చిందని నమ్మబలుకుతున్నారు. అయితే సైబర్ నేరస్తులు కలెక్టరేట్ పేరు చెప్పడంతో నిజంగా నమ్మి బాధిత కుటుంబాలకు పరిహారం సొమ్ము వచ్చిందని భావించి వివరాలు అందిస్తున్నారు. అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు సంబంధిత ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్లతోనే బాధితులకు ఫోన్ చేయించి ఫలానా వారు ఫోన్ చేసి వివరాలు అడుగతారని, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నేరుగా బాధితులకు ఫోన్ చేసి వివరాలు అడగడంతోపాటు వీడియో కాల్ చేసి తెలుగులో మాట్లాడుతూ మేము చెప్పిన విధంగా అప్లోడ్ చేయాలని బాధితులను పక్కదారి పట్టిస్తున్నారు. అందులోనూ మీ అకౌంటులో కొంత మొత్తం ఉంటేనే ఈ పరిహారం సొమ్ము పడుతుందని చెప్పి.. వీడియో కాల్‌లోనే ఓటీపీ అడిగి తీసుకుని సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు వైఎస్సార్ జిల్లాలో కనిపించాయి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. రోజుకో మోసం ప్రజలకు సంబంధించి ఏదో ఒక సమస్యపై సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రకంగా మోసం చేస్తున్నారు. అప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. చివరకు కరోనాతో కుటుంబీకులను కోల్పోయిన బాధితులను కూడా పరిహారం డబ్బుల ఆశ పేరుతో మోసం చేస్తున్నారు. వివరాలు, ఇతరత్రా చెప్పకపోతే సొమ్ములు రావేమోనన్న భయంతో అప్పటికప్పుడు బాధితులు వారు అడిగివన్నీ తెలియజేస్తూ దారుణంగా మోసపోతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుశాఖ కూడా సీరియస్‌గా దృష్టి సారించింది. వీడియో కాల్లో తెలుగులో మాట్లాడుతూ మోసం చేస్తున్న వైనంపై ఇప్పటికే గ్రామీణ స్థాయిలో మహిళా పోలీసులతోపాటు పోలీసుస్టేషన్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మనల్ని మనం కాపాడుకునే ఆయుధం పెట్టుకోవాలి మనం ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటికి తాళం వేస్తాం. ఒకటి, రెండుసార్లు సరిగా వేశామో, లేదో తనిఖీ చేసి బయటికి వెళతాం. అలాగే సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం) ఫోన్ పాస్‌వర్డ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తేలికైన పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్ల చేతికి తాళాలు మనమే ఇచ్చినట్లుగా భావించాలి. పుట్టిన తేదీ, పెళ్లిరోజు, పిల్లలు, భాగస్వామి పేరు లాంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినప్పుడు వెంటనే చెక్ చేయడం ద్వారా ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. పాస్వర్డ్ ఎనిమిది అంకెలకు తక్కువ లేకుండా అక్షరాలతోపాటు నంబర్లు, గుర్తులను పెట్టుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ మార్చుకుంటే మంచిది. కరోనా ఆర్థికసాయం పేరుతో కాల్స్ వస్తే నమ్మరాదు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందని నైబర్ నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. అలాంటి ఫేక్ కాల్స్ నమ్మరాదు. ఈ విధంగా కరోనా పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడి పలువురు మోసపోయినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా బారినపడి మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికసాయం అందించే యాప్‌లుగానీ, లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. బ్యాంకు ఖాతాలో కనీసం రూ. 50 వేలు ఉండాలని చెబుతూ సదరు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెబితే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి మోసగిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసినా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరాదు. -
తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1
న్యూఢిల్లీ: 2021లో తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగింది. అంతేకాదు మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం భారీగా పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లోనూ తెలంగాణ మళ్లీ టాప్‌గా నిలిచింది. ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది 2019లో 2,691 సైబర్ నేరాలు నమోదవ్వగా. .2020లో ఈసంఖ్య 5,024కు చేరింది. కాగా 2021లో సైబర్ నేరాలు 200 శాతం పెరిగి ఏకంగా 10,303కు చేరాయి. దేశ వ్యాప్తంగా 52, 430 సైబర్ నేరాల కేసులు వెలుగు చూస్తే అత్యధికంగా తెలంగాణలోనే 20 శాతం నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో 8, 829 కేసులతో ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2019లో 11, 465.. 2020లో 12.985..కేసులు నమోదయితే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి. 23, 757 ఆర్థిక నేరాల కేసులతో రాజస్థాన్ అగ్ర స్థానంలో ఉంది. వృద్ధులపై దాడుల్లో తెలంగాణ మూడు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్, ఓటీపీ, మార్ఫింగ్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్ తయారీ తెలంగాణలో అధికమని ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది. చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో -
సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్, బ్లాక్‌మెయిలింగ్.. మిమ్మల్ని మీరే ఇలా కాపాడుకోండి!
Cyber Crime Prevention Tips In Telugu: నేటి ప్రపంచంలో ఇంటర్నెట్ రోజువారీ అవసరం. తెలిసినా, తెలియకపోయినా ప్రజలు ఏ వ్యక్తితోనైనా క్షణాల్లో మాట్లాడే సౌలభ్యం వచ్చేసింది. దీంతో వేధింపులకు సంబంధించి ఆడ–మగ తేడా లేకుండా ఆన్లైన్ దుర్వినియోగం చేయడమూ పెరిగింది. అయితే, వీటిలో మహిళలు అనుభవించే హింస మాత్రం తరచూ లైంగిక లేదా స్త్రీ వ్యతిరేకపరమైన వేధింపులు ఉంటున్నాయి. మహిళలను వేధించే సమస్యల్లో గృహహింస, యాసిడ్ దాడి, ఈవ్ టీజింగ్, వరకట్నం, లైంగిక దాడులు, హ్యూమన్ ట్రాఫికింగ్, భ్రూణహత్యలు.. ఇలా ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. వీటికితోడు కోవిడ్–19 మహమ్మారి సామాజిక, ఆర్థిక ఒత్తిడిని బలపరిచింది. ఈ రకమైన హింస విస్తృతమైన లింగ ఆధారిత వివక్షకు దారి తీస్తోంది. దీంతో ఈ హింస ఉధృతితో మహిళలపై సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వీటిలో తరచూ వినిపించేవి సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్, అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే, బాధించే సందేశాలు, బ్లాక్‌మెయిలింగ్ ... వంటి నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్టాకింగ్ డిజిటల్ ప్రపంచం ఎక్కువగా మాట్లాడే వాటిలో సైబర్ స్టాకింగ్ ఒకటి. దీంట్లో మహిళలు, పిల్లలనే లక్ష్యంగా చేసుకుని వేధింపులు ఉంటాయి. ఇది ఆన్లైన్ ముప్పు అని చెప్పవచ్చు. అవతలి వ్యక్తితో మనకు ప్రత్యక్ష సంబంధం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఆఫ్‌లైన్ స్టాకింగ్ కంటే సైబర్ స్టాకింగ్ నేరాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే నేరస్థుడిని కనుక్కోవడం అంత సులభం కాదు. దీంట్లో అధికంగా టీనేజర్లు బాధితులవుతున్నారు. మహిళలపై ట్రోల్‌ల సంఖ్య పెరిగింది. కరోనా కాలం ఆన్లైన్ హింస, లైంగిక వేధింపుల గురించి ఒక కొత్త ఆందోళనలను లేవనెత్తింది. కోవిడ్ –19 తర్వాత ప్రపంచం ఆన్లైన్ వైపు వేగంగా కదులుతున్నందున, స్త్రీవాద దృక్పథం మారాల్సి ఉంది. పరువు నష్టం తమ తమ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించడానికి ప్రజలకు ఒక వేదిక ఇంటర్నెట్. దీని ద్వారా కలిగించే పరువు నష్టం మరో వ్యక్తి ప్రతిష్టకు కలిగే గాయం. ఇది ఇంటర్నెట్ సహాయంతో ఏ వ్యక్తికైనా వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించడాన్ని సూచిస్తుంది. ఇప్పటికే సైబర్ పరువు నష్టంపై అనేక కేసులు ఉన్నాయి. ఇది ఎక్కువగా ఫేస్బుక్, గూగుల్ లేదా ఏదైనా ఇతర సోషల్ నెట్వర్కింగ్ లేదా మెయిల్ వెబ్సైట్ లో ఒకరి ఐడీ హ్యాక్ చేయడం ద్వారా ఉంటుంది. అలాగే, ఒక వ్యక్తి తాలూకు పూర్తి సమాచారంతో మరో నకిలీ ఖాతాను సృష్టించడం ద్వారా కూడా జరుగుతుంది. ఫొటో మార్ఫింగ్ మార్ఫింగ్ అనేది అసలు ఫొటోలను మార్పిడి చేయడం. హ్యాకర్ మీ ఫొటోలను ఉపయోగించి, దానిని మార్ఫ్ చేసి, దుర్వినియోగం చేయడం సులభం. మార్ఫింగ్ చేయకుండా మీరు ఎవ్వరినీ ఆపలేరు. మీ ఫొటోలు పబ్లిక్‌గా ఉంటే, వ్యక్తులు వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వాటిని మార్ఫ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. తమ లైంగిక ఊహలను సంతృప్తి పరుచుకోవడానికి పోర్న్ సైట్లలో వాటిని ఉపయోగిస్తుంటారు. ఎవరైనా మీ ఫోటో తీసి వాటిని అలా ఉపయోగించినా మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇ–మెయిల్ స్పూఫింగ్ ఒకదాని నుంచి పంపించినట్టు ఇ–మెయిల్‌ను సూచిస్తుంది. కానీ అది మరొక దగ్గర నుండి పంపించినదై ఉంటుంది. ఈ సాంకేతికతను ఉపయోగించే ఇ–మెయిల్స్ తరచూ కొన్ని మెసేజ్‌లు, పంక్తులు, లోగోలను కలిగి ఉంటాయి. ఇ–మెయిల్ స్పూఫింగ్ అనేది ఫిషింగ్, స్పామ్ ప్రచారాలలో ఉపయోగించే ఒక ముఖ్యమైన వ్యూహం. అంటే లాటరీ వచ్చిందనో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. అనో వీటిని ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటప్పుడు అవి సరైన మెయిల్స్ అని గుర్తించినప్పుడే వాటిని ఓపెన్ చేయడం మంచిది. సైబర్ సేఫ్టీ పాయింట్స్ ►పాస్‌వర్డ్‌లను షేర్ చేయద్దు బ్యాంక్ ఖాతా అయితే ఎవరికి వారు తమ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకుంటారు. లేదా ఎవరికీ చెప్పకుండా ఒక చోట రాసి పెట్టుకుంటారు. అలాగే, మీ డిజిటల్ పాస్‌వర్డ్‌ను ఎంత నమ్మకమున్న స్నేహితుడు లేదా భాగస్వామితోనైనా షేర్ చేయకూడదు. దీనికి సంబంధిం చిన భయం మంచిదే. స్నేహితులు ఉద్దేశపూర్వకంగా మీకు హాని కలిగించకపోయినా, వారు అనుకోకుండా ఎవరికైనా మీ పాస్‌వర్డ్‌ను చెప్పవచ్చు. కొన్నిసార్లు మీ పాస్వర్డ్ మారకముందే సంబంధాలు మారిపోతుంటాయి. మీ విచక్షణను ఉపయోగించండి, ఆ పాస్‌వర్డ్‌లను ప్రైవేట్‌గా, సంక్లిష్టంగా ఉంచండి. ►మీ వెబ్‌క్యామ్‌ని కనెక్ట్ చేసి ఉంచద్దు మీ వెబ్ కెమెరాను ఆన్ చేసి, మీకు తెలియకుండానే మీ కదలికలను చాకచక్యంగా రికార్డ్ చేయగల అనేక యాప్‌లు ప్రస్తుతం ఉన్నాయి. ఉపయోగంలో లేనప్పుడు మీ కెమెరా లెన్స్‌ను మూసి ఉంచండి లేదా పూర్తిగా ఏదైనా కవర్‌తో కప్పి ఉంచండి. ►అవసరానికి మించి షేర్ చేయద్దు సంబంధాలలో మంచి, చెడు రెండూ ఉంటాయి. అత్యుత్తమ వ్యక్తులు కూడా ఒకోసారి మరోవైపుకు మారచ్చు. అందుకే మీరు షేర్ చేసిన మీ సన్నిహిత సందేశాలు, ఫొటోలు, సమాచారం వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆన్ లైన్ పరిచయస్తులను ఒంటరిగా కలవవద్దు ఆన్లైన్ వ్యక్తులను బయట కలిసే ముందు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తెలియజేయండి. మీరు రద్దీగా ఉండే అంటే కాఫీ షాప్ లేదా మాల్లో సదరు వ్యక్తిని కలుసుకోవడానికి నిర్ణయించుకోవడం శ్రేయస్కరం. అవసరమైనంత వరకే.. అనుమానం లేని మహిళలతో స్నేహం చేయడానికి సోషల్ మీడియా సైట్లను బ్రౌజ్ చేస్తున్న వారిలో చెడ్డవారు అనేకం ఉన్నారు. అందుకని.. మీ ఆచూకీ, జీవనశైలి గురించిన వివరాలను పోస్ట్ చేయడంలో జాగ్రత్తగా ఉండండి. స్టాకర్లు ఒక సాధారణ ఫోటోగ్రాఫ్ లేదా స్టేటస్ అప్డేట్తో మిమ్మల్ని చేరుకోవడానికి మార్గాలను కనుక్కోగలరు. మీ కెమెరాలో జియోట్యాగింగ్ని స్విచాఫ్ చేయండి. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ ఈ ప్రక్రియ కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి సిస్టమ్ అప్డేట్ చాలా ముఖ్యమైనది. ఇది భద్రతా అప్డేట్లు, ప్యాచ్‌లు తాజా బెదిరింపులను దూరంగా ఉంచుతుంది. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో పరికరాలు భద్రం భద్రతా వ్యవస్థ లేకుండా మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ కలిగి ఉండటం అనేది తలుపులు తెరిచి ఇంట్లో కూర్చున్నట్లే. ఆండ్రాయిడ్, మ్యాక్ పరికరాలకు రెండూ హానికరమైన సాఫ్ట్వేర్ దాడికి ఉపకరణాలు. ఇవి మీ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోగలవు కాబట్టి మీ అన్ని పరికరాలలో ‘నార్టన్ సెక్యూరిటీ’ వంటి భద్రతా వ్యవస్థను ఇన్స్టాల్ చేయండి. ఫైన్ ప్రింట్ ఏదైనా సేవ, రహస్యానికి సంబంధించిన సమాచారం, సేవా నిబంధనలను అర్థం చేసుకోండి. కొన్ని వెబ్సైట్లు మీ సమాచారాన్ని ఎవరికైనా ఇచ్చేయవచ్చు. లేదా అమ్మచ్చు, అద్దెకు తీసుకోవచ్చు. ఇది పెద్ద సమస్యగా మీకే తిరిగి రావచ్చు, మీరు నిబంధనలు షరతులకు అంగీకరించినందున చట్టం మిమ్మల్ని రక్షించలేకపోవచ్చు. ‘ఉచితం’ అంటూ ఏదీ లేదు ఫ్రీ గేమ్‌లు, ఆఫర్లు, డీల్‌లు మొదలైనవిగా కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. అవి వైరస్లు, స్పైవేర్, హానికరమైన సాఫ్ట్వేర్లతో చిక్కుకుపోయి ఉండవచ్చు. ఇవి మీ పరికరంలోకి ప్రవేశించి, మీ మొత్తం డేటాను పొందగలవు. వద్దనుకున్న వారు బ్లాక్ అవసరం లేని వ్యక్తులను జాబితా నుండి అన్ ఫ్రెండ్ చేయండి లేదా బ్లాక్ చేయండి. మీ స్నేహితుల జాబితాలో ఎవరు ఉండాలో మీరు ఎంచుకోవచ్చు. భద్రత విషయానికి వస్తే ఆనఖలైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ సరైన జ్ఞానం, రక్షణ మొదటి వరుసలో ఉండాలి. మీ రక్షణలో మీ ప్రవృత్తులే కీలక పాత్ర పోషిస్తాయని గ్రహించండి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: టెక్ట్స్ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్ స్కామ్.. చా(చీ)టింగ్! Cyber Crime Prevention Tips: నకిలీలలు.... ముద్ర కాని ముద్ర.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే సంగతులు! -
ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన యువతి.. మాటలు కలిపి..
మైసూరు: రాచనగరి మైసూరులో ఆన్లైన్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గిఫ్ట్ ఆశకు గురయి ఒక యువతి రూ. 6.05 లక్షలను పోగొట్టుకుంది. సరస్వతిపురం నివాసి అపూర్వ లక్ష్మణ్ అనే యువతికి డెర్మా కో అనే కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీరు లక్కీ డ్రాలో విజేతగా నిలిచారని, రూ. 5 వేలు షాపింగ్ చేస్తే భారీ కానుక వస్తుందని నమ్మబలికారు. ఇలా పలు దఫాలుగా ఆ యువతికి ఫోన్ చేసి మొత్తంగా రూ. 6,05,618ను డబ్బులను సైబర్ మోసగాళ్లు కాజేశారు. ఆ తర్వాత గిఫ్ట్ రాక, ఇచ్చిన డబ్బులు వెనక్కి రాక మోసపోయానని గ్రహించిన యువతి నగరంలోని సైబర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసింది. చదవండి: యువతికి కానుక పేరుతో రూ.6 లక్షల మోసం -
Cyber Crime: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్ మోసాలు
ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్లైన్ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో మధ్యలో సైబర్ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం పెరిగింది. ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నగదు దోచేస్తారు. విద్యావంతులు కూడా వీరి వలలో పడడం కొత్త కాదు. అలా పోయిన డబ్బు పోలీసులకు, బ్యాంకులకు ఫిర్యాదు చేస్తే 100 శాతం తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. బనశంకరి: డబ్బు వ్యవహారాలు ఆన్లైన్ అయ్యేకొద్దీ ఆర్థిక నేరాలు తీవ్రమవుతున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2021– 22 లో రూ.60,414 కోట్ల మేర సైబర్ మోసాలు చోటుచేసుకున్నాయి. సైబర్ మోసగాళ్ల వల్ల డబ్బు కోల్పోయిన 75 శాతం మంది బాధితులకు ఆ సొమ్ము తిరిగి రావడం లేదు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సైబర్ నేరాల బాధితులను మూడేళ్ల పాటు సర్వే చేయగా, వారిలో 74 శాతం మందికి ఇప్పటికీ డబ్బు వాపస్ కాలేదని తెలిసింది. సర్వేలో మొదటి ప్రశ్నగా గత మూడేళ్లలో మీరు, లేదా మీ బంధువులు, పరిచయస్తులు నగదు వంచనకు గురయ్యారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు 11,065 మంది స్పందించగా, అందులో 38 శాతం మంది తమ కుటుంబంలో కనీసం ఒకరు మోసపోయారని తెలిపారు. 54 శాతం జాగ్రత్త పడ్డామని పేర్కొన్నారు. కొంత మందికే తిరిగి దక్కింది ఎవరికైనా డబ్బు తిరిగి వచ్చిందా అని అడగ్గా, 10,995 మంది స్పందించారు, వీరిలో 10 శాతం మంది అవును, ఫిర్యాదు చేసి డబ్బు వెనక్కి తీసుకున్నాం అని తెలిపారు. 19 శాతం మంది ఏ ఫలితమూ లేదని బాధ వెళ్లగక్కారు. ఇంకా 19 శాతం మంది ఫిర్యాదు చేశామని చెప్పగా, మిగిలిన 9 శాతం మంది పోయిన డబ్బు గురించి ఆలోచించడం లేదని చెప్పారు. మొత్తం 74 శాతం మంది బాధితులకు వారి డబ్బు తిరిగి రాలేదు. కంప్యూటర్, మొబైల్లో పాస్వర్డ్స్ 33 శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్, డెబిట్ లేదా క్రెడిట్‌కార్డు పాస్వర్డ్స్, ఆధార్, పాన్‌కార్డు నంబర్లను కంప్యూటర్లో దాచుకున్నారు. 11 శాతం మంది ఈ వివరాలు అన్నింటిని మొబైల్లో భద్రపరచుకున్నట్లు చెప్పారు. దీంతో సులభంగా వంచకులు, హ్యాకర్లు చేతికి అందడంతో వంచనకు గురిఅవుతున్నారు. ఇ కామర్స్ ద్వారా అధిక మోసాలు ఇక ఎలా వంచన జరిగింది అన్న ప్రశ్నకు 9,936 మంది స్పందించగా 29 శాతం మంది బ్యాంక్ అకౌంట్ ద్వారా మోసానికి గురైనట్లు తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్, వెబ్సైట్లలో కొనుగోళ్లు (ఇ–కామర్స్) వల్ల 24 శాతం మంది వంచనకు గురయ్యారు. ఇదే అత్యధికం. 18 శాతం మంది క్రెడిట్ కార్డులతో మోసపోయారు. 12 శాతం మందిని మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు లూటీ చేశాయి. 8 శాతం మంది డెబిట్ కార్డులు, 6 శాతం మంది బీమా పేర్లతో నష్టపోయారు. సైబర్ వంచనకు గురైనవారు తక్షణం పోలీస్ సహాయవాణి 112 నంబరుకు ఫోన్ చేస్తే పోయిన డబ్బు వెనక్కి తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. -
సైబర్ నేరాలకు ఇక అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు, వ్యక్తులకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ సిద్ధమైంది. సైబర్ నేరాల పరిశోధనలో కీలకమైన సైబర్ డేటా అనలిటికల్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు సైబర్ నేరాల పరిశోధన సమర్థంగా జరిగేలా రాష్ట్ర పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అందుకోసం పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటూ దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు ఇటీవల పెరిగిపోయాయి. అనేక సైబర్ నేరాల కేసులు పోలీసు స్టేషన్లకు వస్తున్నాయి. ఈ కేసుల పరిశోధనలో సైబర్ నేరగాళ్ల డేటా కీలకం. అందుకోసం జాతీయ స్థాయిలో సైబర్ నేరస్తుల వివరాలతో కూడిన ఆధునిక డేటా అనలిటికల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో దీనిని నెలకొల్పుతారు. సైబర్ నేరాల పరిశోధనలో ఇది సహాయకారిగా ఉంటుంది. అందుకోసం వివిధ రాష్ట్రాల్లోని డాటా సెంటర్లను రాష్ట్ర పోలీసు అధికారులు పరిశీలించారు. ఈ సెంటర్ ఏర్పాటయ్యేలోగా నేరస్తుల సమాచార సేకరణకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోని సైబర్ డేటా అనలిటికల్ సెంటర్లతో రాష్ట్ర పోలీసు విభాగాన్ని అనుసంధానించారు. దీనివల్ల జాతీయస్థాయిలో సైబర్ నేరగాళ్ల సమాచారం, ప్రొఫైళ్లు, నేరాలకు పాల్పడే తీరు, కేసుల పరిశోధన రికార్డులు మొదలైనవన్నీ రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకంగా నంబర్, పాస్వర్డ్ ఇచ్చారు. వీటి ద్వారా అవసరం మేరకు నేరగాళ్ల సమాచారాన్ని పొందవచ్చు. రాష్ట్రంలో డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పూర్తిస్థాయిలో ఈ కేంద్రం నుంచే మరింత త్వరగా సమాచారం పొందవచ్చు. సైబర్ సెల్స్ పటిష్టం సైబర్ నేరాల పరిశోధనకు జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన సైబర్ సెల్స్‌ను మరింత పటిష్టం చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే బీటెక్ అర్హత ఉన్న ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లను నియమించారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బందికి కూడా సైబర్ నేరాల పరిశోధనలో పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం జిల్లాకు ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్సైలతో కూడిన రిసోర్స్ పర్సన్ల బృందాలను ఎంపిక చేశారు. వారికి ఈ నెల 31 నుంచి అనంతపురంలో ఐదు రోజులు శిక్షణ ఇస్తారు. వారు జిల్లాలోని ఇతర సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తారు. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలోని నిపుణులు, ఐటీ నిపుణులు ఈ శిక్షణ ఇస్తారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డెస్క్ ఫోరెన్సిక్, మొబైల్ ఫోరెన్సిక్, పాస్వర్డ్ రికవరీ, సీడీఆర్ అనాలసిస్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ప్రోక్సీ ఎర్రర్ ఐడెంటిటీ, ఈ–మెయిల్, సోషల్ మీడియా మొదలైన వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లాస్థాయిలోనే డిజిటల్ ఎవిడెన్స్, సోషల్ మీడియా ఐడెంటిటీ వంటి కీలక సాక్ష్యాధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు పడేలా చేసే అవకాశం ఉంటుంది. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థ: కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ డేటా అనలిటికల్ సెంటర్‌తో పోలీసు స్టేషన్లను అనుసంధానిస్తున్నాం. జిల్లాస్థాయిలో పోలీసు అధికారులకు సైబర్ నేరాల పరిశోధనలో శిక్షణ ఇస్తాం. సైబర్ నేరాల పరిశోధన వ్యవస్థను పటిష్టంగా రూపొందిస్తున్నాం. బాధితులకు అండగా నిలవడంతోపాటు నేరస్తులను గుర్తించి సకాలంలో శిక్షించేలా పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. -
ఆన్లైన్లో జూదమా?.. జర జాగ్రత్త..!
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా ఇటీవల 3,800 మందికి పైగా డబ్బు పోగొట్టుకున్నారని, రికార్డు కాని కేసులు మరిన్ని ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. స్కిల్స్ ఆధారంగా నడిచే గేమ్స్ ద్వారా ఈ గ్యాబ్లింగ్ జరుగుతుంటుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక జనాదరణ పొందిన వాటిలో ఆన్లైన్ జూదం ఒకటి. తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో 1.10 బిలియన్ల మంది అంటే జనాభాలో 79 శాతం మందికి మొబైల్ సదుపాయం ఉంటే వారిలో 42 శాతం మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. వీరిలో 92.8 శాతం మంది ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు. అవి, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, టాబ్లెట్లు, హ్యాండ్‌హెల్డ్ డివైస్, మీడియా స్ట్రీమింగ్ పరికరాలతో పాటు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ల ద్వారా జరుగుతుంటుంది. చట్టబద్ధమేనా!? పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్–1867 ఆధారంగా, భారతదేశంలో అన్నిరకాల జూదం చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్ లేదా ప్లేయర్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండూ)పై పందెం వేయడం చట్టవిరుద్ధం. చట్టబద్ధతను అర్థం చేసుకోవాలంటే.. బెట్టింగ్ జరిగే రెండు రకాల గేమ్‌ల గురించి మనం మరింత అర్థం చేసుకోవాలి. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇవి అదృష్ట ఆధారిత గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలో చట్టవిరుద్ధం. ఈ గేమ్‌ల కోసం పందెం వేయడానికి ముందస్తు జ్ఞానం లేదా అవగాహన అవసరం లేదు. నైపుణ్యం గల గేమ్స్ ఇవి ఎంపిక కంటే విశ్లేషణాత్మక నిర్ణయం తీసుకోవడం, తార్కిక ఆలోచన, సామర్థ్యం అవసరమయ్యే గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం. మిగతా ప్రాంతాల్లో ఇవి చట్టవిరుద్ధం అయినప్పటికీ మోసగాళ్లు ఆన్లైన్ వెబ్‌సైట్‌ను నిర్వహించేందుకు మోసపూరితమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఉదాహరణకు.. (ఎ) కరేబియన్ – కురాకై గేమింగ్ (బి) మెడిటరేనియన్ నుండి మాల్టా గేమింగ్ అథారిటీ (సి) యుకె గ్యాంబ్లింగ్ కమిషన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుండి లైసెన్స్‌లను పొందినవి. ఇవి ఆయా దేశాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. వీటి సమాచారం మనకు కనపడనంత చిన్నగా రాసి ఉంటుంది. సాధారణంగా ఫుటర్‌లో వీటిని లిస్ట్ చేసిన దేశాలలో మాత్రమే ప్లే చేయవచ్చని పేర్కొని ఉంటుంది. కానీ, అన్ని దేశాల్లోకి ఈ గేమ్స్ ద్వారా మోసగాళ్లు చొరబడటానికి ఆన్లైన్లో పొంచి ఉంటున్నారు. మన దేశంలో .. ప్రస్తుత ట్రెండ్లకు సరిపోయే విధంగా చట్టపరంగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ (గ్యాంబ్లింగ్ యాక్ట్)తో రావడానికి పౌరసంఘాలు, సాంకేతిక సంస్థలు, సైబర్ పోలీసులు, సైబర్ లాయర్ల నుండి మరిన్ని చర్చలు అవసరం. యాపిల్, గూగుల్‌లో గ్యాంబ్లింగ్ యాప్‌లు అనుమతించని జాబితాలో భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే మినహాయించబడ్డాయి. ఈ యాప్‌లు వెబ్సైట్ల నుండి (APK,DMZఫైల్ల ద్వారా) మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి కాదని గుర్తించాలి. గ్యాంబ్లింగ్ యాప్స్ నిర్వహణ దశ 01: ముందుగా, మీరు ఒక సూచన ద్వారా ఈ యాప్‌లో చేరుతారు. దశ 02: మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. యాప్ నిర్వాహకులు బ్రిటీష్ పేర్లతో ఉన్న మహిళలు, విదేశీ వ్యక్తుల ఫోటోలతో ఉంటాయి. ్ఖఓ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాటిని ఆపరేట్ చేస్తారు. దశ 03: పందెంలో పాల్గొనబోతున్నందుకు మీరు మీ రోజువారీ లాభంలో 40 శాతం కమీషన్‌గా చెల్లించాలని కోరుతారు. దశ 04: కమీషన్‌ను బదిలీ చేయకుండా ఉండటానికి సబార్డినేట్ అనే కొత్తవ్యక్తిని పరిచయం చేస్తారు. దశ 05: మీరు యాప్‌లో చేరిన తేదీ నుండి 5 రోజుల తర్వాత ప్రతి రిఫరల్ వ్యక్తి రూ.3000 సంపాదించినట్టు చూపుతారు. దశ 06: ఒకే రోజున 3 రెఫరల్స్ ఉన్నట్లయితే, వారు చేరిన 5 రోజుల తర్వాత ఒకరికి రూ.3000 తోపాటు అదనంగా మరో రూ.5000 ఇస్తారు. ఇది ఒక ఎక్కువ మొత్తం కోసం వేసే ఎర అని గుర్తుపెట్టుకోవాలి. దశ 07: 7–10 రోజుల తర్వాత ఫస్ట్æ విత్‌డ్రావల్ చేయవచ్చు. అయితే, పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.10,000 పందెం పూర్తయిన తర్వాతే తీసుకోవాలి.. దశ 08: ఒకసారి విత్‌డ్రాకు అర్హత పొందితే, 68 గంటల్లో నగదు మొత్తం మన బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. దశ 09: 20–30 రోజులకు ఒకసారి ఎక్కువ మొత్తం జమ అయ్యే రోజు ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్ 10,000 ఖాతాలో అన్ని సమయాల్లో ఉండేలా మనం మరింత డబ్బు చేర్చాలి. దశ 10: సాధారణంగా రోజుకు రూ. 800. ఎక్కువ వాటాలు ఉన్న రోజున, అది రూ.1500 నుండి రూ.2000 దాటుతుంది. దశ 11: మోసగాళ్లు ఎక్కువ లాభాల కోసం పెట్టుబడి పెట్టడానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తారు. ఆపై వారు ఒక రోజులో సూపర్ హై షేర్ని సృష్టిస్తారు. దీంతో ప్రజలు తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల నష్టాలను నివారించడానికి Sరు.50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. దశ 12: ప్రజలు బ్యాలెన్స్‌లను కొనసాగించగలిగినప్పటికీ, వారు కొత్తగా పెట్టుబడి పెట్టిన మొత్తం పందెంలో పాల్గొననందున వారు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. దశ 13: చాలా మంది వ్యక్తులు డబ్బును పోగొట్టుకోవడం చూసినప్పుడు, నమ్మకాన్ని పొందడానికి, నష్టాలను తిరిగి పొందేందుకు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే నష్టపరిహార ప్రణాళికను అందిస్తారు. దశ 14: అందరూ నిద్రపోతున్న చోట అర్ధరాత్రి పందెం వేస్తే, అందరూ మేల్కొనే సమయానికి మన ఖాతాలో ఏమీ మిగిలి ఉండదు. చివరి వ్యక్తి మొత్తం డబ్బును పోగొట్టుకునే వరకు పందెం కొనసాగుతుంది. దశ 15: చెల్లింపు/రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌ను క్లోజ్ చేస్తారు. విత్‌డ్రాæవిధానం రద్దయ్యి ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్‌ను క్లోజ్ చేస్తారు. చదవండి:Parenting Tips: పంచతంత్రం.. పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? అంటే.. -
ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత ప్రియుడి అరెస్ట్.. చివర్లో ట్విస్ట్ తెలిసి షాకైన యువతి!
బనశంకరి(బెంగళూరు): సైబర్ మోసగాళ్లు యువతిని బెదిరించి నుంచి రూ.2.20 లక్షలు నొక్కేశారు. వివరాలు.. బెంగళూరు బసవనగుడికి చెందిన 29 ఏళ్ల యువతికి నీల్ యశ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. విదేశాల్లో ఉంటానని, నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. పెళ్లి గురించి మాట్లాడటానికి బెంగళూరుకు వస్తానని చెప్పాడు. రెండు రోజుల తరువాత యువతికి ఫోన్ చేసిన గుర్తుతెలియని మహిళ నీ ప్రియుడు నీల్యశ్ను ఢిల్లీ విమానాశ్రయ పోలీసులు అరెస్ట్‌చేశారని, అతన్ని విడుదల చేయడానికి కస్టమ్స్ ఫీజు రూ.2.20 లక్షలు చెల్లించాలని తెలిపింది. దీంతో యువతి ఆ మహిళ తెలిపిన అకౌంట్‌కు నగదు జమచేసింది. ఆ తరువాత మహిళ, నీల్యశ్ ఫోన్లు స్విచాఫ్ అయ్యారు. ఈ మోసంపై యువతి దక్షిణ విభాగ సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి.. -
బుక్ చేయకుండానే పార్సిల్.. ఆర్డర్ కాన్సిల్ అంటూ ఖాతా ఖాళీ
పిల్లలు స్కూల్‌కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ‘నా పేరున పార్సిల్ రావడమేంటి? నేనేదీ బుక్ చేయలేదు. ఎవరు పంపించారు’ అంది ఉమాదేవి. ‘మీరు ఆన్లైన్లో బుక్ చేశారు మేడమ్. రూ.500 విలువైన పార్సిల్ తీసుకొని, మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. తనకేమీ తెలియదని చెప్పింది ఉమాదేవి. అయితే, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు కొరియర్ బాయ్. ‘సరే’ అంది ఉమాదేవి. ‘మీ మొబైల్‌కి ఆర్డర్ కాన్సిల్ ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని అడిగాడు. ఉమాదేవి తన ఫోన్‌కి వచ్చిన ఓటీపీ చెప్పింది. థాంక్యూ చెప్పి కొరియర్ బాయ్ వెళ్లిపోయాడు. ‘పిల్లలు ఫోన్ ఆడుకుంటూ ఏదైనా తెలియక క్లిక్ చేశారా..’ అనుకుంటూ లోపలికెళ్లిపోయింది. పనైపోయాక భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్లో బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.65000 డెబిట్ అయినట్టు ఉంది మెసేజ్. ఇటీవల ఆన్లైన్లో బుక్ చేయకుండానే కొరియర్ ద్వారా పార్సిల్స్ రావడం, వీటి ద్వారా ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా మోసానికి గృహిణులను టార్గెట్ చేస్తున్నట్టుగా సైబర్‌క్రైమ్ విభాగం నుంచి నివేదిక. సైబర్ క్రైమ్‌పోలీసులు కూడా ఆర్డర్ చేయకుండానే ఆన్లైన్ పార్శిల్స్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసే హెచ్చరిక.. ఆన్లైన్లో చూసినప్పుడు ఒక వస్తువు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరకు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు లేదా ఫీచర్లు నిజమని అనిపించేలా ఉంటాయి. ఆ లింక్స్‌ను ఓపెన్ చేయద్దు. ఫోన్‌కాల్ ద్వారా తక్షణ చెల్లింపు లేదా ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ద్వారా చెల్లించాలని పట్టుబడితే అనుమానించాలి. చౌకైన డీల్ ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు వోచర్ల కోసం ముందస్తుగా నగదు చెల్లించాలని వారు పట్టుబట్టవచ్చు. సోషల్ మీడియా, ఆన్లైన్లో కొన్ని లింక్స్ తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చూపుతాయి. ఇది నిజం కాదు. వారు ఓటీపీని భాగస్వామ్యం చేయమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయమని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్‌లు లేదా షార్ట్ లింక్‌లను పూరించమని మిమ్మల్ని అడగచ్చు. కొరియర్ క్యాన్సిల్ కోసం ఓటీపీ చెప్పమని అభ్యర్థించవచ్చు. జాగ్రత్త అవసరం. సురక్షిత చెల్లింపు కోసం ఇలా చేయండి.. ఆన్లైన్లో ప్యాడ్ లాక్ చిహ్నంతో ఉన్న లింకులను మాత్రమే ఓపెన్ చేయాలి. ఓటీపీ నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు నగదు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకూడదు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుందని అర్థం. ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్‌ఫో¯Œ లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు ఎనీ డెస్క్, టీమ్‌వ్యూవర్ మొదలైన వాటిని ఉపయోగించడం మానుకోవాలి. గూగుల్లోనూ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం వెతకద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ నుండి కస్టమర్ కేర్ నంబర్‌ను తీసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఆశపడ్డారో.. కొంప కొల్లేరే! కుక్కపిల్లని కూడా వదలరు
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఉన్నచోటనుంచే కడుపులో చల్ల కదలకుండా చాలా ఈజీగా చేసేస్తున్నాం. అంతేనా ఒక చిన్న క్లిక్‌తో ఇన్‌స్టంట్‌గా రుణాలు, యాప్ ద్వారా ఎక్కడినుంచి ఎక్కడికైనా క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలకసమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచే స్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్‌కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్‌గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్‌కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్‌ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్‌లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదోవిధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ 2 వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్‌కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్‌కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్‌కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్‌లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
నేపాల్‌లో దాక్కున్నా..లాక్కొచ్చారు..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు తెలివి మీరిపోయారు. ఇండియా, నేపాల్ రెండు దేశాల పౌరసత్వం పొంది అక్కడ నేరాలు చేస్తే ఇండియాలో, ఇక్కడ నేరాలు చేసి నేపాల్‌లో దాక్కుంటున్నారు. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసి అందినకాడికి దండుకుని నేపాల్‌లో తలదాచుకున్న సైబర్ నేరస్తుడిని ఇండో–నేపాల్–భూటాన్ సరిహద్దు పోలీసు బలగాలు సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సహాయంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి డిటెక్టివ్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ డాక్టర్ గజారావు భూపాల్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం, సుపాల్ జిల్లా, బిర్పూర్‌కు చెందిన అశోక్ షా, అజిత్ సింగ్, మితిలేష్ సింగ్ తదితరులు ఏడుగురు ముఠాగా ఏర్పడ్డారు. నీట్ పరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల ఫోన్ నంబర్లను సేకరించారు. తమ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తామని దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ముఠాపై హైదరాబాద్‌లో రెండు, రాచకొండ ఒక కేసు నమోదయ్యాయి. బెంగళూరు, పుణే, కోల్‌కత్తాలో ‘కెరీర్ 365’ పేరుతో నకిలీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. స్థానిక యువతకు ఉద్యోగులుగా నియమించుకున్నారు. విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని ఎస్ఎంఎస్, ఫోన్లు చేసి చెబుతారు. ఇందుకు గాను కొంత ఫీజు చెల్లించాలని కోరతారు. సందేహాలు వ్యక్తం చేసిన విద్యార్థులను బెంగళూరులో ఏర్పాటు చేసిన నకిలీ ఆఫీసుకు రమ్మంటారు. అక్కడి హంగామా, సెటప్ చూసి విద్యార్థులు నిజమేనని భ్రమిస్తారు. సొమ్ము బ్యాంక్ ఖాతాలో బదిలీ కాగానే.. నిందితుల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని తాత్కాలిక ఆఫీసు బోర్డ్ తిప్పేస్తారు. హైదరాబాద్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వై వెన్నెల నీట్ పరీక్ష రాసి, కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తుంది. ఓ రోజు ఆమెకు బెంగళూరు కిమ్స్ కళాశాలలో మెడికల్ సీటు ఇప్పిస్తామని చెప్పి ఎస్ఎంఎస్ వచ్చింది. ఇందుకు గాను కొంత ఫీజు చెల్లించాలని నిందితులు సూచించడంతో.. రూ.10.16 లక్షల సొమ్మును ఆన్లైన్లో బదిలీ చేసింది. ఆ తర్వాతి నుంచి నిందితుల ఫోన్లు íస్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు గత నెల 21న హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని, సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు.. నేపాల్‌లో దాక్కున్న నిందితుడు అశోక్ షాను అరెస్ట్ చేశారు. -
వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ చీటర్ వంశీకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా.. సోమవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ఉద్యోగాల పేరిట వంశీకృష్ణ దాదాపు రూ. 5కోట్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో 500 మంది యువతులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఆన్లైన్లో వితంతువులు, విడాకులు పొందిన మహిళలనే వంశీకృష్ణ టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవాడు. అయితే, వంశీకృష్ణ.. స్కీంల పేరుతో అటు ప్రజా ప్రతినిధులను సైతం మోసం చేశాడనే ఆరోపణలున్నాయి. -
మేకలు అమ్మి ఫోన్ కొనిస్తే! ఆ కొడుకేమో..
భర్త కాలం చేసింది చానారోజులే అయ్యింది. ఇద్దరు కొడుకులను బాగా చదివించేందుకు అహర్నిశలు కష్టపడేది ఆ తల్లి. కొడుకు సరస్వతి పుత్రుడు. అందుకే ఆన్లైన్ సదువుకు ఫోన్ కావాలని అడగ్గానే.. ఉన్న రెండు మేకలను అమ్మేసి కొడుకు చేతులో సొమ్ములు పెట్టింది ఆ తల్లి. కానీ, ఆ బిడ్డ.. ఆ తల్లి నమ్మకాన్ని మాత్రమే దెబ్బ తీయలేదు. కటకటాల పాలై జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు కూడా. బిహార్ నవాడా జిల్లా థాల్పోస్ గ్రామం ఈ మధ్య వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం.. ఆ ఊరి నుంచి సైబర్ నేరాలనుగానూ పోలీసులు అరెస్ట్ చేయడం. జిల్లావ్యాప్తంగా ఒకే తరహాలో జరిగిన స్కామ్‌లో మొత్తం 33 మందిని అరెస్ట్‌చేస్తే.. అందులో 31 మంది థాల్పోస్ గ్రామం నుంచే కావడం ఆశ్చర్యం కలిగించేదే కదా!. అందునా నేరాలకు పాల్పడింది 14 నుంచి 40 ఏళ్లలోపు వాళ్లే కావడం గమనార్హం. అందులో ఒకడే 19 ఏళ్ల గుల్షన్. అరెస్ట్ అయిన చాలామంది ఈపాటికే బెయిల్ మీద బయటకు వచ్చారు. కొందరేమో ఆర్థిక స్థితి బాగోలేక జైల్లోనే ఉండిపోయారు. మరికొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలు అలాంటి పని చేశారంటే నమ్మలేకపోతున్నారు. గుల్షన్ తండ్రి చనిపోయాక అన్నితానై చూసుకుంది ఆ తల్లి. అలాగని గుల్షన్ సుద్దమొద్దు కాదు. 2019లో పదవ తరగతి ఫస్ట్ డివిజన్లో పాసయ్యాడు. ముఖ్యమంత్రి బాలక్ బాలికా ప్రోత్సాహన్ యోజన కింద 10 వేల రూపాయల స్కాలర్షిప్ కూడా అందుకున్నాడు. స్థానికంగా ట్యూషన్స్ చెబుతూ నెలకు మూడు వేల రూపాయలు సంపాదిస్తూ.. తల్లి, తమ్ముడి పోషణలో భాగం అయ్యాడు కూడా. అలాంటోడి జీవితాన్ని సెల్‌ఫోన్ దెబ్బ తీసింది. సులువుగా డబ్బు సంపాదించాలన్నా దుర్భుది.. అతని కుటుంబం పరువు తీయడంతో పాటు వ్యక్తిగతంగా ఆ కుర్రాడిని కటకటాల పాల్జేసింది. అతనికి బెయిల్ ఇప్పించే పరిస్థితిలోనూ లేదు 42 ఏళ్ల సర్విలా దేవి. అరెస్ట్ అయిన చాలామందివి పేద కుటుంబాలే. కాస్తో కూస్తో చదువుకున్నారు. అప్పో సొప్పో చేసి స్మార్ట్ఫోన్లు కొని సైబర్‌నేరాలకు పాల్పడ్డారంతా. ఓటీపీ నేరాల దగ్గరి నుంచి, నకిలీ ఫోన్ కాల్స్, బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే దాకా.. వాళ్లు పాల్పడి నేరాలంటూ లేవు. ఉన్నంత చదువు, ఆన్లైన్ మోసాలపై పెంచుకున్న జ్ఞానం వాళ్లతో నేరాలు చేయించింది. ఊరిలో ఎవరికీ అనుమానాలు రాకుండా.. పోలాల దగ్గర, బోరు బావిల దగ్గర, ఊళ్లో చెట్ల అరుగుల మీద కూర్చుని ఈ నేరాలకు పాల్పడ్డారని థాల్పోస్ ఎస్సై బెయిడ్నాథ్ ప్రసాద్ చెప్తున్నారు. బీహార్‌లో నమోదు అయ్యే సైబర్ నేరాలు తక్కువేం కాదు. ఒక్క నవాడా జిల్లా పరిధిలో 2019-20 మధ్య 18 కేసులకుగానూ 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020-21లో ఆ సంఖ్య 14 కేసులకు 30 మందికి చేరింది. కానీ, 2022లో అదీ మార్చి వరకే 11 కేసుల్లో 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంతా. పేదరికం, కరోనాతో ఉద్యోగాలు కోల్పోవడం, వలస కూలీలకు పనులు లేకపోవడం, బడిలు బంద్ కావడంతో చాలామంది ఇటువంటి నేరాల వైపు మళ్లుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ ద్వారా వీళ్లలో మార్పు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది పోలీస్ శాఖ. -
సైబర్ వలలో టెకీలు... బాధితులంతా ఐటీ ఉద్యోగులే
సాక్షి హైదరాబాద్: నగరానికి చెందిన ఓ యువతి మాదాపూర్‌లోని ఓ బహుళ జాతి కంపెనీలో ఐటీ ఉద్యోగి. ఒకరోజు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోన్ నంబర్‌ను వాట్సాప్, టెలిగ్రాం ఇన్వెస్ట్మెంట్ గ్రూప్‌లలో యాడ్ చేశారు. ఆ గ్రూప్‌లో అడ్వైజర్ ఆదిత్య సంతోష్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని సూచించాడు. దీంతో సదరు 39 ఏళ్ల టెకీ.. నెల రోజుల వ్యవధిలో రూ.2.2 లక్షల పెట్టుబడి పెట్టింది. యాప్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ రూ.5.8 లక్షలని చూపిస్తుండటంతో ఆనందానికి గురైంది. కానీ, ఆ సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం లేదని తెలుసుకున్న టెకీ.. తాను మోసపోయానని గ్రహించింది. దీంతో గత నెలాఖరున సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని సూచించడంతో వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. 25 లేదా 35 రోజుల లాకిన్ పీరియడ్ తర్వాతే విత్‌డ్రాకు అవకాశముంటుందనే షరతును పట్టించుకోలేదు. దశల వారీగా రూ.10.2 లక్షల పెట్టుబడులు పెట్టాడు. కానీ, లాగిన్ పీరియడ్ పూర్తయ్యాక.. సంబంధిత వాట్సాప్ గ్రూప్ నుంచి సదరు టెకీని తొలగించేశారు, గ్రూప్‌నూ డిలీట్ చేసేశారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హఫీజ్‌పేటకు చెందిన 22 ఏళ్ల ఓ మహిళా ఇంజినీర్.. ఐడీబీఐ పాస్‌బుక్ అప్డేట్ చేయడం కోసం బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్‌లో వెతికింది. వెంటనే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ సౌరవ్ శర్మ నుంచి తనకు ఫోన్ వచ్చింది. పాస్‌బుక్‌ను అప్డేట్ చేయడానికి మీ సెల్ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని సూచించడంతో.. సరేనని ఇన్స్టాల్ చేయగా క్షణాల్లో ఆమె ఖాతా నుంచి రూ.1.68 లక్షలు మాయమైపోయాయి. .. ఇలా ఒకరిద్దరు కాదు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్న వారిలో ఐటీ ఉద్యోగులు, టెకీ గ్రాడ్యుయెట్లే ఎక్కువగా ఉన్నారు. అత్యాశే బాధితుల కొంప ముంచుతోంది. తక్కువ టైంలో రెట్టింపు లాభాలను పొందొచ్చనే వల విసిరి నట్టేట ముంచేస్తున్నారు సైబర్ నేరస్తులు. 80 శాతం ఐటీ బాధితులే.. కస్టమర్ కేర్, ఓఎల్ఎక్స్, ఓటీపీ, క్రెడిట్ కార్డ్, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఇలా రకరకాలుగా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. గత నెలలో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో 70 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. ఇందులో 80 శాతం బాధితులు ఐటీ నేపథ్యం ఉన్న వారే ఉండటం గమనార్హం. విద్యావంతులు సైబర్ మోసాల బారిన పడరన్నది అపోహ మాత్రమే. నిజం చెప్పాలంటే నిరుద్యోగులు, నిరక్షరాస్యుల కంటే వీరిని మోసం చేయడమే సులువేమో. మోసపూరిత స్కీమ్‌లలో పెట్టుబడులు, ఎనీ డెస్క్ వంటి రిమోట్ యాక్సెస్‌ను ఇచ్చే నకిలీ యాప్‌లను డౌన్లోడ్ చేయడం లేదా వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వంటి రహస్య వివరాలను బహిర్గతం చేయడం వంటి సైబర్ నేరాల బారిన పడటానికి ప్రధాన కారణం. అవగాహనతోనే అడ్డుకట్ట.. సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ నేరాలు 200 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వటమే సైబర్ నేరాలకు ప్రధాన కారణం. అవగాహనే సైబర్ నేరాల నివారణకు మందు. – స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ (చదవండి: కాలుతూ.. పేలుతూ..) -
అక్కడ యాక్సిడెంట్ ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే!
నేరాలు, ఘోరాలు కళ్లెదుట జరుగుతున్నా, అడ్డుకోవడం సంగతి పక్కనపెడితే.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం తరచూ చూస్తుంటాం. అయితే ఇలాంటి చేష్టలను ఉపేక్షించబోయేది లేదంటూ ప్రకటించింది మిడిల్ ఈస్ట్ కంట్రీ యూఏఈ. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడ్డ వాళ్లను, చనిపోయినవాళ్లను వీడియోగానీ, ఫొటోలుగానీ తీస్తే కఠినంగా శిక్షించే చట్టం తీసుకొచ్చింది. ఇందుకుగానూ శిక్షగా లక్షా యాభై వేల దుబాయ్ దిర్హం నుంచి ఐదు లక్షల దిర్హంల దాకా జరిమానా. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష. ఒక్కోసారి రెండూ విధించనున్నట్లు యూఏఈ సైబర్‌క్రైమ్ చట్టానికి సవరణ తీసుకొచ్చింది. జనవరి 2, 2022 నుంచే ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిందంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారులకు మాత్రం సాక్ష్యాల సేకరణలో ఇందుకు మినహాయింపు మాత్రం ఉంటుంది. డిజిటల్ యుగంలో ఇలాంటి చేష్టలను ప్రొత్సహించడం మంచిది కాదు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ఫొటోలు, వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, ఇతరులకు ఫార్వార్డ్ చేయడం.. ఏదీ మంచిది కాదనే ఈ చట్టం తీసుకొచ్చాం అని చెబుతున్నారు అక్కడి అధికారులు. ఇంతేకాదు.. అవతలి వాళ్ల అనుమతులు లేకుండా వ్యక్తుల ఫొటోలు, వీడియోలు తీయడం లాంటి చేష్టలపై కూడా కొరడా ఝుళిపించేందుకు చట్టాలన్ని కఠినం చేసింది. ఇలాంటి చేష్టలకు ఏడాది జైలు శిక్షతో పాటు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల దాకా దిర్హం జరిమానా, లేదంటే రెండూ విధిస్తారు. అలాగే డిజిటల్ స్టాకర్స్ (ఇంటర్నెట్లో వెంటాడి.. వేధించే నిందితులు)కు ఆరు నెలల జైలు శిక్ష, లక్షా యాభై వేల నుంచి ఐదు లక్షల దిర్హం దాకా జరిమానా లేదంటే రెండూ విధిస్తారు. -
జనం జేబుల్ని సులభంగా.. ఏడాదికి రూ.150 కోట్లు!
బనశంకరి: ఆన్లైన్ చెల్లింపుల వల్ల ప్రజల పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. కానీ మోసగాళ్లు కూడా జనం జేబుల్ని అంతే సులభంగా ఖాళీ చేస్తున్నారు. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే కర్ణాటకలో ఏడాదికి రూ.150 కోట్లు సైబర్ నేరగాళ్ల పాలవుతోంది. 2019 నుంచి 2022 జనవరి వరకు రూ.434 కోట్లను సైబర్ వంచకులు కాజేశారు. అంటే రోజుకు రూ.39.61 లక్షలను బాధితులు కోల్పోతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారించి స్వాధీనం చేసుకుంది రూ.55 కోట్లు మాత్రమే. సైబర్ నేరాల హబ్.. ► కన్నడనాట 2021 లో ప్రజల నుంచి రూ.157 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో కూర్చుని క్షణాల్లో ఫోన్ కాల్స్ ద్వారా, ఖాతా, ఓటీపీ వివరాలను తెలుసుకోవడం, మోసపూరిత లింక్‌ల ద్వారా బ్యాంకు అకౌంట్లు నుంచి కోట్లాది రూపాయలను లూటీ చేస్తున్నారు. దీంతో దక్షిణాదిలో కర్ణాటక అనేది సైబర్ నేరాల హాట్‌స్పాట్‌గా తయారైంది. ► రాష్ట్రంలో వివిధ సైబర్ పోలీస్స్టేషన్లలో నమోదైన 29,816 కేసుల్లో 6,673 కేసులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 60 శాతం కేసులు సాక్ష్యాధారాలు లేక నత్తనడకన సాగుతున్నాయి. ► 2021లో నమోదైన సైబర్ నేరాల సంఖ్య 7,462 కి తగ్గినప్పటికీ లూటీ చేసిన మొత్తం ఎక్కువగా ఉంది. రూ.157.94 కోట్లు సైబర్ కేటుగాళ్లు దోచేశారు. ఈ ఏడాది జనవరిలో 735 మంది మోసగించి రూ.15.11 కోట్లను కాజేశారు. మొదటి గంటలో స్పందించాలి.. సైబర్ వంచనకు గురైన ఒక గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు. ఈ గంటలోగా బాధితులు పోలీసులకు, బ్యాంకుల సహాయవాణికి కాల్ చేసి సమాచారం అందిస్తే బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మరింత నగదును కోల్పోకుండా చూస్తారు. అలాగే ఏ ఖాతాలకు నగదు వెళ్లిందో సులభంగా గుర్తించవచ్చు. -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్.. లక్ష రూపాయలు మటుమాయం!
Credit Card Fraud: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నకిలీ ఆఫర్స్ పేరుతో వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి చాలా మంది ఇప్పటికే లక్షల్లో పొగుట్టుకున్న భాదితులు ఎందరో ఉన్నారు. అయితే, ఇప్పుడు మళ్లీ అలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. వంద రూపాయల మీల్స్ ఆర్డర్ చేస్తే రెండు మీల్స్ ఫ్రీ అనే ప్రకటనను ఫేస్బుక్లో చూసి ముంబైకి చెందిన 74 ఏళ్ల వృద్దుడు మోసపోయాడు. క్రెడిట్ కార్డుతో రూ.10 చెల్లించి మిగిలిన రూ 90 పుడ్ డెలివరీ అయిన తర్వాత చెల్లించవచ్చని యాడ్‌లో పేర్కొనడంతో ఆశపడిన బాధితుడు క్రెడిట్ కార్డుపై ఏకంగా రూ లక్ష పోగొట్టుకున్నాడు. బాధితుడు ఎన్.డి నంద్ జనవరి 19న ఫేస్బుక్లో ఒక ప్రకటనను చూసి దాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత సుమారు రూ.లక్ష వరకు మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో ఇలా పేర్కొన్నాడు.. " ఫేస్బుక్లో ఒక ప్రకటనను చూసి అందులో పేర్కొన్న కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేశాను. అప్పుడు, దీపక్ అనే పేరుతో ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ.. ఫుడ్ ఆర్డర్ చేయడానికి నా క్రెడిట్ కార్డు వివరాలను అందించాలని కోరాడు. మొదట్లో రూ.10 కట్ అవుతుందని, ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత రూ.90 నగదు చెల్లిస్తే సరిపోతుందని ఆయన నాకు చెప్పారు. ఆర్డర్ బుక్ చేయడానికి ఒకసారి పాస్ వర్డ్ షేర్ చేయమని ఆ వ్యక్తి నన్ను అడిగాడు" అని పేర్కొన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. భాదితుడి లావాదేవీ నుంచి రూ.10 కట్ అయిన తర్వాత వెంటనే క్రెడిట్ కార్డు నుంచి రూ.49,760 కట్ అయినట్లు రెండు సార్లు ఎస్ఎంఎస్ వచ్చాయని తెలిపారు. అయితే, ఈ డబ్బు ఎవరి ఖాతాలో క్రెడిట్ అయ్యిందో తెలుసుకోవడానికి బ్యాంకు నుంచి వివరాలను కోరాము" అని ఖర్ పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు. సైబర్ మోసగాడిని ట్రాక్ చేయడానికి ఖర్ పోలీసులు కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు. సైబర్ నెరగాళ్ల మీద ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. (చదవండి: Air India: టాటా గూటికి ఎయిర్ ఇండియా చేరేది అప్పుడే!) -
ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..
సాంకేతికతలోనూ గోప్యత పాటించే ఉత్తర కొరియాలో హ్యాకర్లు చెలరేగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అదీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలను లెక్కలేయకుండా!. చాలా కాలంగా సొంత దేశం, వినోదరంగంపై మాత్రమే ఫోకస్ హ్యాకర్లు.. ఈ మధ్యకాలంలో ప్రపంచం మీద పడ్డారు. 2021 ఒక్క ఏడాదిలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 30 కోట్ల రూపాయల్ని) విలువైన డిజిటల్ ఆస్తుల్ని కాజేశారు. వివిధ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌పై ఏడు దాడుల ద్వారా ఈ మొత్తం కాజేసినట్లు బ్లాక్‌చెయిన్ అనాలసిస్ కంపెనీ ‘చెయినాలైసిస్’ ప్రకటించింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలను లక్క్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమ దేశంలో హ్యాకర్లు లేరని, అలాంటి వాళ్లు దొరికితే మరణశిక్ష నుంచి తప్పించుకోలేరంటూ స్వయంగా అధ్యక్షుడు కిమ్ పలు సందర్భాల్లో బయటి దేశాలు(ప్రత్యేకించి అమెరికా) చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ వస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘లజారస్ గ్రూప్’.. నార్త్ కొరియా ఇంటెలిజెన్సీ బ్యూరో వెన్నుదన్నుతోనే నడుస్తోందని అనుమానాలు ఉన్నాయి. తద్వారా వెనకాల నుంచి ప్రొత్సహిస్తూ.. కిమ్ ప్రభుత్వం ఈ తతంగం నడిపిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఈ గ్రూప్ మీద కఠిన ఆంక్షలు విధించింది. ఇక ఉ.కొరియాలో 2020-2021 మధ్య.. నాలుగు నుంచి ఏడు శాతానికి సైబర్ నేరాలు పెరగ్గా.. దొచుకున్న సొత్తు విలువ సైతం 40 రెట్లు అధికంగా ఉందని చెయినాలైసిస్ చెబుతోంది. కిందటి ఏడాది ఫిబ్రవరి నెలలో 1.3 బిలియన్ డాలర్ల డబ్బు, క్రిప్టోకరెన్సీని చోరీ చేశారని ఆరోపిస్తూ ముగ్గురు నార్త్ కొరియన్ కంప్యూటర్ ప్రోగ్రామర్లపై నేరారోపణ అభియోగాల్ని నమోదు చేసింది. చిన్న చిన్న కంపెనీల దగ్గరి నుంచి హాలీవుడ్ ప్రముఖ స్టూడియోలు లక్క్ష్యంగా ఈ సైబర్ దాడి జరిగినట్లు అమెరికా న్యాయ విభాగం సైతం నిర్ధారించుకుంది. చదవండి: భారత్‌లో మెటావర్స్ ద్వారా వెడ్డింగ్ రిసెప్షన్! -
డబ్బులు పోయాయని కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తే.. రూ.12 లక్షలు మాయం!
ముంబై: మీరు గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి కాల్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. లేకపోతే, నెరగాళ్ల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకుల్ని టార్గెట్ చేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతిలో మోసాలకు చేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎంత జాగ్రత్తగా ఉండాలని సూచించిన సైబర్ నేరాల రేటు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు తాను కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి గూగుల్‌లో కనిపించిన కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తే ఒక సీనియర్ సిటిజన్ 11 లక్షలకు పైగా మోసపోయినట్లు ముంబై పోలీసులు నిన్న(జనవరి 15) తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలో అంధేరి ప్రాంతానికి చెందిన ఒక మహిళ గత ఏడాది జూలైలో ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసింది. పిజ్జా ఆర్డర్ కోసం ఫోన్లో నుంచి డబ్బులు చెల్లించేటప్పుడు ఆమె రూ.9,999 కోల్పోయింది. అదేవిధంగా అక్టోబర్ 29న ఆన్లైన్లో డ్రై ఫ్రూట్స్ కోసం ఆర్డర్ చేస్తుండగా మళ్లీ రూ.1,496 నష్టపోయినట్లు ఆమె తెలిపారు. ఈ రెండు సందర్భాల్లో డబ్బులు పోవడంతో వాటిని తిరిగి పొందడం కోసం ఆ మహిళ గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి ఒక నెంబర్‌కు కాల్ చేసింది. ఆమెకు కాల్ చేసిన వ్యక్తి నిజమైన కంపెనీ కస్టమర్ కేర్ వ్యక్తిగా నటించాడు. ఆ నకిలీ వ్యక్తి డబ్బులు తిరిగి పొందటం కోసం మొబైల్ ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఆమె తను చెప్పిన విధంగానే చేసింది. కానీ, అది ఒక నకిలీ యాప్. ఆ యాప్‌లో నమోదు చేసిన ఖాతానెంబర్, పాస్వవర్డ్, ఓటీపీ వివరాలు అన్నీ మోసాగాళ్ల చేతకి చిక్కాయి. దీంతో రెచ్చిపోయిన మోసాగాళ్లు గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య కాలంలో ఆ మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.11.78 లక్షలు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మోసం అంత సైబర్ పోలీస్ స్టేషన్ సంప్రదించినప్పుడు ఈ మోసం వెలుగులోకి వచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 420 ఇతర నిబంధనల కింద ఆ మోసాగాళ్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: ఎలన్ మస్క్‌కి టాలీవుడ్ ప్రముఖుల రిక్వెస్ట్!) -
సైబర్ క్రిమినల్స్ కేరాఫ్ రాజస్తాన్
రాజస్తాన్ రాష్ట్రం సైబర్ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆర్థికాంశాలతో ముడిపడిన ఈ నేరాలు చేస్తూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్రీయుల్లో ఈ రాష్ట్రానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గత ఏడాది సిటీ సైబర్ కాప్స్ అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే 20 శాతం వరకు ఉన్నారు. ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 344 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 86 మంది ఉండగా.. మిగిలిన 258 మందిలో రాజస్తాన్ వాసుల సంఖ్య అత్యధికంగా 50 ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడానికి మొత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ వాసులు) దాదాపు 99 శాతం ఈ కోవకు చెందిన నేరాలు చేసిన వారై ఉంటున్నారు. వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులై ఉంటున్నారు. అడ్డంగా దోచేసే ఆర్థిక నేరగాళ్లు సైబర్ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీళ్లు ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా వస్తువులు విక్రయిస్తామని, ఖరీదు చేస్తామని ఎర వేసి బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తూ... ఆపై అందినకాడికి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. న్యూడ్ కాల్స్ చేయించి బ్లాక్ మెయిల్ చేయడమూ వీరి మోసాల్లో ఒక పంథా. ఇక ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేసే వారిలో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. న్యూఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌లతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ సైబర్ నేరగాళ్ళు ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. నైజీరియన్లూ పెద్ద సంఖ్యలో... పెద్ద మొత్తాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరితో పాటు సోయాలియా వంటి ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్‌కు వచ్చి నగరాల్లో నివసిస్తున్న ఈ నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి స్థానికులు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చి ఆయా నగరాల్లో నివసిస్తున్న వారూ మనీమ్యూల్స్‌గా మారి సహకరిస్తున్నారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్‌గా ఉన్న వారు చిక్కుతున్నా.. సూత్రధారులు మాత్రం పరారీలో ఉంటున్నారు. ఓటీపీలతో జార్ఖండ్ నేరగాళ్ల టోపీ బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి...డెబిట్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి...అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్‌తార యువత ఇప్పుడు ‘కాల్ సెంటర్లను’ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతోంది. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు. -
జీఎస్టీ పేరుతో విడతల వారీగా రూ.5.90 లక్షలు కాజేశారు
గూడూరు: పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నారని ఆశపెట్టి గిరిజన దంపతులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. రెక్కలుముక్కలు చేసుకొని ఇంటి కోసమని కూడబెట్టుకున్న సొమ్మును దోచేశారు. రూ.12.80 లక్షలు గెల్చుకున్నారని మభ్యపెట్టి.. రూ.5.90 లక్షలు కాజేశారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. గూడూరు మండలం పురిటిపాళెంకు చెందిన కమ్మంపాటి మహేష్, లక్ష్మీదేవి.. కొలనుకుదురులో రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు చెంచయ్య వరి కోత మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబమంతా కలిసి ఇల్లు నిర్మించుకునేందుకని రూ.2.50 లక్షలు పొదుపు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది వినాయక చవితికి ముందు లక్ష్మీదేవికి ఓ ఉత్తరం వచ్చింది. అందులో రూ.12.80 లక్షలు గెల్చుకున్నట్లు ఉంది. ఆ కార్డులో ఉన్న నంబర్‌కు మహేష్, లక్ష్మీదేవి ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కంపెనీ ద్వారా కూపన్లు తీస్తామని.. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మీకు రూ.12.80 లక్షలు వచ్చాయని చెíప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ అదే నంబర్‌కు ఫోన్ చేయగా.. ఆ మొత్తం మీ అకౌంట్లో జమ చేయాలంటే ఆధార్, పాన్‌కార్డు నంబర్లతో పాటు అకౌంట్ వివరాలు వాట్సాప్ చేయాలని సూచించాడు. అనంతరం ఆదాయ పన్ను కింద రూ.20 వేలు తమ అకౌంట్లో వేయాలని చెప్పాడు. దీనిపై మహేష్, లక్ష్మీ ప్రశ్నించగా.. ఆదాయ పన్ను చెల్లించకపోతే అధికారులు, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని నమ్మబలికాడు. దాంతో వారిద్దరూ ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్లో డబ్బులు వేశారు. ఈసారి జీఎస్టీ, ఇతర ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పాడు. మా వద్ద డబ్బులేదని ఆ గిరిజన దంపతులు మొత్తుకున్నా.. వినకుండా ఫోన్ పెట్టేశాడు. దీంతో వారు చేసేదిలేక తమ వద్ద ఉన్న రూ.2.50 లక్షలతో పాటు అప్పు చేసి మరో రూ.3.40 లక్షలు ఇచ్చారు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోసగాళ్లు 7585049583, 9831371553 ఈ నంబర్ల నుంచి ఫోన్ చేశారని గిరిజన దంపతులు తెలపగా.. ఇవి కోల్‌కతాకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై అసభ్యకర పోస్టులు.. అమ్మకానికి పెడుతున్నట్లు..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): తమపై బుల్లి బాయ్స్ పేరుతో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా, అమ్మకానికి పెడుతున్నట్లు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టోలిచౌకికు చెందిన ఓ మహిళ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గిట్‌హాబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సులీ డీల్స్ పేరుతో ఖాతా తెరిచి ఆ తరువాత దానిని బుల్లీ బాయ్స్‌గా పేరు మార్చారు. ఇందులో ముస్లిం మహిళలను విక్రయిస్తున్నట్లు పోస్టులు పెట్టారు. దీనిపై ట్విట్టర్లో దుమారం రేగడంతో ఢిల్లీ, ముంబాయి సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న బాధితురాలి ఫోటోను కూడా అలాగే ఆ పోస్టులో పెట్టడంతో బాధితురాలు తాజాగా సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై 509, 354డీ, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా మరో మహిళ సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. -
సైబర్ మోసాలకు గురయ్యారా? తక్షణం ఈ నంబర్‌కు కాల్ చేయ్యండి
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఇప్పటివరకు 50 సైబర్ నేరాలు జరిగాయి. ఆయా కేసులను ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.68 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ తెలిపారు. కస్టమర్ కేర్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఫిష్పింగ్ కాల్స్, ఓటీపీ మోసాలు, హనీ ట్రాప్స్, గిఫ్ట్, పెట్టుబడి మోసాలు వంటి వివిధ ఆన్లైన్ మోసాలకు సంబంధించి కేసులు కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. విచారణ సమయంలో ఒక ఖాతా నుంచి అనేక ఇతర అకౌంట్లు, వ్యాలెట్లకు నిధుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సంబంధిత బాధితుల ఖాతాల్లోకి తిరిగి రికవరీ చేపించారు. కొన్ని సందర్భాలలో బాధితులు మోసానికి గురయ్యామని తెలిసిన తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 155260కి ఫిర్యాదు చేయడంతో ఆయా బాధితుల ఖాతాను హోల్డ్‌లో ఉంచి.. నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తు బృందాలు నిరంతరం విచారణ జరిపి బాధితులకు పోగొట్టుకున్న మొత్తాలను వాపస్ చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ– మెయిల్స్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేవైసీ అప్డేట్, కస్టమర్ కేర్ సర్వీస్ అంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందించకూడదని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్ సూచించారు. సైబర్ మోసాలకు గురైన తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 155260 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ అయ్యే అవకాశముందని తెలిపారు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. -
భారత మాజీ క్రికెటర్‌కి షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు.. ఫోన్లో మాట్లాడుతుండగా..
ఇంటర్నెట్ వాడకం పెరగడంతో కొందరు ఈజీ మనీ కోసం ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. వీళ్లు తమ దందా సాఫీగా సాగించేందుకు కొత్త దారులు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ జాబితాలో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ సైతం సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు కాంబ్లీ కి ఫోన్ చేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించి, ఆయన కేవైసీ సమాచారాన్ని సమర్పించాలని లేదా తను బ్యాంక్ ఖాతా రద్దు అవుతుందని తెలిపారు. వాళ్ల మాటలను నమ్మిన కాంబ్లీ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు తన ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. దెబ్బకు కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ. 1.14 లక్షల డబ్బు స్వాహ అయ్యాయి. ఈ తతంగమంతా కూడా కాంబ్లీ అతనితో ఫోన్లో మాట్లాడుతుండగానే జరిగింది. చివరికి తాను మోసపోయానని గ్రహించిన కాంబ్లీ అసలు విషయం తెలుసుకుని దగ్గర్లోనే ఉన్న బాంద్రా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు.. రివర్స్ ట్రాన్సక్షన్ ద్వారా కాంబ్లీ డబ్బును తిరిగి ఆయన ఖాతాలోకి జమచేశారు. కాంబ్లీ సచిన్ టెండూల్కర్ తో కలిసి చదువుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు సెయింట్ గ్జేవియర్స్ స్కూల్ పై ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇద్దరు భారత క్రికెట్ లోకి అడుగుపెట్టారు. కానీ ఆ తరువాత కాంబ్లీ మాత్రం పలు వివాదాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. చదవండి: Virat Kohli: "కోహ్లి ఫోన్ స్విఛ్చాఫ్.. ఏమైందో నాకు తెలియదు" -
ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే
ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్ కార్డు, ఆధార్, రేషన్ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఆ కార్డులు చేతులు మారుతుంటాయి. అలాంటి సమయాల్లో ఆధార్ కార్డ్ నుంచి ముంపు పొంచి ఉందని గుర్తించాలి. ప్రపచం దేశాల్లో ఆర్దిక మాధ్యం పెరిగిపోయింది. అందుకే సైబర్ నేరస్తులు ఈజీ మనీ కోసం ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్ సాయంతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును కాజేస్తుంటారు. అయితే మనం కొన్ని చిట్కాలు పాటించి సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ►ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆధార్ మరియు పాన్ వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఇటువంటి వివరాలను మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు ► మీ ఆధార్, పాన్ని సేకరించడం లేదా మీకు అవసరమైన చోట ధృవీకరణ కోసం ఇచ్చి మరిచిపోతుంటాం. అలా మరిచిపోవద్దు. అలా మరిచి పోవడం వల్ల నేరస్తులు ఆ ఆధార్ కార్డ్ సాయంతో సైబర్ నేరాలకు పాల్పడొచ్చు. లేదంటే మీ డేటాను అమ్ముకోవచ్చు. ► అనుమానంగా ఉన్న వెబ్ సైట్లలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఆధార్ కార్డ్‌లను అప్లోడ్ చేయొద్దు. ► మీ సిబిల్ స్కోర్‌ను ట్రాక్ చేస్తూ ఉండండి ► ఒకవేళ మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసే సమయంలో మీకు తెలియకుండా మరెవరైనా ఆధార్ కార్డ్‌ల సాయంతో మీ డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ► ఏ సందర్భంలోనైనా మీరు వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను షేర్ చేయొద్దు. ప్రత్యేకించి ఆధార్, పాన్ లేదా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించింది అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ► ఆధార్ కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ ఏజెన్సీలు ప్రజల వ్యక్తిగత వివరాలను సెక్యూర్‌గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు మీకు సలహాలు అందిస్తుంటాయి. మీ డేటా వినియోగానికి సంబంధించిన ఏజన్సీలపై అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి. ఇలా చేయడం వల్ల ఆధార్ కార్డ్‌ను సైబర్ నేరస్తుల నుంచి జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. చదవండి: సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..! -
ఈ–కేటుగాళ్లు.. అరగంటలో రూ.కోటికి పైగా కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సంస్థను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం వ్యవహరించారు. దాని సర్వర్‌లో ఉన్న లోపాన్ని క్యాష్ చేసుకోవడానికి క్లయింట్‌గా పరిచయమయ్యారు. అదును చూసుకుని సాంకేతిక సమస్య సృష్టించి రూ.1.28 కోట్లు కాజేశారు. సోమవారం రాత్రి కేవలం అరగంట వ్యవధిలోనే ఈ–కేటుగాళ్లు తమ పని పూర్తి చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలన అనంతరం బాధిత కంపెనీ శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మోసం ఇలా... బంజారాహిల్స్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ వివిధ కంపెనీలకు పేమెంట్ గేట్‌వేలకు సంబంధించిన సాంకేతిక సేవల్ని అందిస్తోంది. ఆయా కంపెనీలకు సంబంధించిన యూపీఐ లావాదేవీలన్నీ దీని ద్వారానే జరుగుతుంటాయి. బంజారాహిల్స్ సంస్థకు దాదాపు 100 కంపెనీలు క్లయింట్స్‌గా ఉన్నాయి. ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు ఒడిస్సాకు చెందిన ఎలక్ట్రికల్ వైర్ల తయారీ కంపెనీ ముసుగులో వీరి వద్దకు వచ్చారు. తమ లావాదేవీలకు సంబంధించిన యూపీఐ సేవల్నీ అందించాలని కోరారు. దీనికి నగర సంస్థ అంగీకరించడంతో పాటు వాళ్ల ఖాతాలను తమ సర్వర్‌లో రిజిస్టర్ చేసింది. ఒక సంస్థ లేదా వ్యక్తి నుంచి మరో సంస్థ లేదా వ్యక్తికి యూపీఐ ద్వారా చెల్లింపులు జరగాలంటే ఆ మొత్తం బంజారాహిల్స్ సంస్థకు చెందిన పూల్ ఖాతా నుంచి జరుగుతుంది. ఒకరి ఖాతాలో ఉన్న డబ్బు దీని ద్వారానే మరొకరి ఖాతాలోకి వెళ్తుంది. కొన్ని రోజుల పాటు నగర సంస్థ కార్యకలాపాలను పరిశీలించిన సైబర్ నేరగాళ్లు సోమ వారం రాత్రి అసలు కథ మొదలెట్టారు. ఆ రోజు రాత్రి నగర సంస్థకు చెందిన సర్వర్‌లో సాంకేతిక సమస్య సృంష్టించారు. ఆపై లావాదేవీలు చేయడం ద్వారా తమ ఖాతా ల్లో డబ్బు లేకపోయినా పేమెంట్ గేట్‌వే సేవల్ని అందించే సంస్థ పూల్ అకౌంట్ నుంచి ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇలా కేవలం అరగంట వ్యవధిలో రూ.1.28 కోట్లను ఎనిమిది వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు. మరికొంత కొల్లగొట్టే ప్రయత్నాలు చేసినా...సర్వర్‌లో సమస్యపై అలారం రావడంతో నగర సంస్థ సత్వరం స్పందించింది. ఆ లోపాన్ని సరిచేయడంతో సైబర్ నేరగాళ్లు మరికొంత మొత్తం కాజేయలేకపోయారు. ప్రతి రోజూ నిర్వహించే ఆడిటింగ్ నేపథ్యంలో జరిగిన స్కామ్‌ను బంజారాహిల్స్ సంస్థ గుర్తించింది. దీనిపై ప్రాథమిక పరిశీలన పూర్తి చేసి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఒడిస్సాకు చెందినదిగా చెప్పిన ఎలక్ట్రికల్ కంపెనీకి చెందిన దానితో పాటు నగదు బదిలీ అయిన ఖాతాలను పరిశీలించారు. ప్రస్తుతం వాటిలో పెద్ద మొత్తం బ్యాలెన్స్ లేదని గుర్తించారు. పథకం ప్రకారం ఈ నేరం చేసిన సైబర్ నేరగాళ్లు ఖాతాల్లో పడిన డబ్బును డ్రా చేయడమో, మళ్లించడమో చేశారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలకు పాల్పడిన వారిని గుర్తించడానికి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా బ్యాంకుల నుంచీ సమాచారం సేకరిస్తున్నారు. ఒడిస్సాకు చెందినదిగా చెప్పిన కంపెనీ నేరం జరగడానికి ముందు, ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని సంస్థ సేవల్ని వినియోగించుకోకపోవడాన్ని అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. -
ఎస్బీఐ వినియోగదారులకు అలర్ట్!
SBI Warns of KYC Fraud: దేశంలో ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఎస్బీఐ తన వినియోగదారులను హెచ్చరించింది. దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలకు గురి అవుతున్న వారిలో ఎస్బీఐ ఖాతాదారులు ఉండటంతో కేవైసీ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసగాళ్లు ఎస్బీఐ కస్టమర్లకు వల వేస్తున్నారని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. "బ్యాంకు పేరుతో ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా వచ్చే కేవైసీ అప్డేట్ లింక్స్‌ని క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ఇటువంటి మోసాల గురుంచి http://cybercrime.gov.inకు నివేదించండి" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని ఎస్బీఐ చెబుతోంది. మీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి సున్నితమైన వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దని హెచ్చరిస్తోంది. ఇలాంటి ఎస్ఎంఎస్ మోసాలకు బలైపోవద్దని వినియోగదారులను హెచ్చరించింది. The reality of #KYCFraud has proliferated across the country. The target is sent a text message asking to update their KYC by clicking on a link by someone acting as a bank/company representative. Report such scams at https://t.co/3Dh42ifaDJ#StateBankOfIndia #CyberCrimeAlert pic.twitter.com/cRydhDQ39H — State Bank of India (@TheOfficialSBI) November 10, 2021 ఆన్లైన్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి ఇలా..? కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవు. తెలియని వనరుల నుంచి ఎస్ఎమ్ఎస్/ఈ-మెయిల్స్ ద్వారా వచ్చిన అటాచ్ మెంట్/లింక్స్‌పై క్లిక్ చేయవద్దు. తెలియని వ్యక్తుల నుంచి టెలిఫోన్ కాల్స్/ఈ-మెయిల్స్ ఆధారంగా ఎలాంటి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు. ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, డెబిట్ కార్డు నంబర్, పీన్, సీవీవీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ/పాస్వర్డ్, ఓటీపీ వంటి సున్నితమైన వివరాలను ఎవరితో పంచుకోవద్దు. (చదవండి: ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి) -
పక్కా ప్లాన్.. ఒక్క రోజే రూ.30 లక్షలు హాంఫట్
సాక్షి,హిమాయత్‌నగర్( హైదరాబాద్): సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా తమదైన పద్ధతిలో గుల్ల చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు విసిరే వలకు అమాయకులు మోసపోతూనే ఉన్నారు. ఇలా శనివారం ఒక్కరోజే నగరంలో పలువురు బాధితులు సుమారు రూ.30 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.7 లక్షలు.. ఎస్బీఐ ఏటీఎంల నుంచి భారీ మొత్తంలో నగదు కట్ అయినట్లు మహబూబ్‌గంజ్ బ్రాంచ్‌కు చెందిన మేనేజర్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం మిషన్ల నుంచి వేరే బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వారు వేర్వేరు ఏటీఎంలలో రూ.7 లక్షల 30 వేల 400 నగదు డ్రా చేశారు. డ్రా చేసిన వ్యక్తులకు మిషన్ నుంచి డబ్బులు రాలేదంటూ తమ బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలను చెక్ చేయగా.. ఆయా ప్రాంతాల్లో నగదు విత్‌డ్రా అయినట్లు తమకు సిస్టంలో చూపిస్తోందనారు. ఇలా రూ.7లక్షల 30వేల 400 ఎలా పోయాయో, ఎవరు తీశారో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. కేవైసీ అప్డేట్ పేరుతో.. ఎస్బీఐ కేవైసీ అప్డేట్ చేయకపోతే అకౌంట్ రద్దు అవుతుందని నమ్మించి మోసం చేశారంటూ శ్రీనగర్‌కాలనీకి చెందిన చంద్రవర్మ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపిన వ్యక్తి కాల్ చేసి మెసేజ్ ఓపెన్ చేయమన్నట్లు పేర్కొన్నారు. అది ఓపెన్ చేశాక ఓటీపీ చెప్పడంతో ఆ వెంటనే అకౌంటులోంచి రూ.6 లక్షల 41వేల 59 స్వాహా చేసినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగమంటూ.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగమంటూ తనని మోసం చేశారంటూ ప్రేమ్‌నగర్‌కు చెందిన కల్యాణి ఫిర్యాదు చేశారు. కునాల్ అనే వ్యక్తి కాల్ చేసి ఇండిగోలో ఉద్యోగముందని ఇంటర్వూ్యకు ప్రిపేర్ కావాలన్నాడు. ముందుగా రూ.2100 చెల్లించి ఇంటర్వూ్యకు రాగా.. అకౌంట్లో కనీసం రూ.25 వేలు మెయింటెన్ చేయాలన్నాడు. ఇలా ఆధార్, పాన్ తదితర డాక్యుమెంట్లు అడిగి తన నుంచి పలు దఫాలుగా రూ.2 లక్షల 36 వేల 112 కాజేసినట్లు ఫిర్యాదు చేశారామె. పార్ట్ టైం జాబ్ పేరిట.. అమెజాన్‌లో పార్ట్‌టైం జాబ్ ఉందని ఓ వ్యక్తి కాల్ చేసి మోసం చేశాడని ఎస్సార్‌నగర్‌కు చెందిన విమల్‌కుమార్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఉద్యోగం కోసమంటూ రూ.1.8 లక్షలు సైబర్ కేటుగాళ్లు తమ అకౌంట్లలో వేయించుకున్నట్లు తెలిపారు. ఓఎల్ఎక్స్లో తాను పెట్టిన సోఫా నచ్చి ఓ వ్యక్తి ఫోన్ కొంటానంటూ నమ్మించాడు. క్యూఆర్ కోడ్ పంపి రూ.1.49 లక్షలు దోచుకున్నట్లు నల్లకుంటకు చెందిన ఆశీష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. క్రిప్టో కరెన్సీలో లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.1.91 లక్షలు పెట్టుబడి పెట్టించి తనని మోసం చేశారంటూ తిలక్‌నగర్‌కు చెందిన రమేష్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆపిల్ ఫోన్ గెలుచుకున్నావంటూ.. యూసఫ్‌గూడకు చెందిన సుప్రదకు ఓ వ్యక్తి కాల్ చేసి మీరు ఆపిల్–13 ఫోన్‌ను గిఫ్ట్‌గా గెలుచుకున్నారంటూ చెప్పాడు. మీకు ఓ లింక్ పంపామని, దానిని ఫిల్ చేసి క్లెయిమ్ చేస్తే మీకు ఫోన్ పంపిస్తామన్నారు. ఫిల్ చేశాక ఓటీపీ వస్తుందని.. అది చెప్పమనడంతో సుప్రద చెప్పింది. అంతే క్షణాల వ్యవధిలో అకౌంట్లో నుంచి రూ.5 లక్షల 54 వేల 986 కట్ అయ్యాయి. రాంచీలో ఇల్లు అద్దెకు కావాలంటూ.. వెస్ట్‌మారేడ్‌పల్లిలో నివసించే రాకేష్‌కుమార్ సింగ్ ఎస్బీఐ బ్యాంకులో చీఫ్ మేనేజర్‌గా రిటైరయ్యారు. ఆయనకు ఝార్ఖండ్‌లోని రాంచిలో సొంత ఇల్లు ఉంది. నగరంలోనే నివాసం ఉంటున్న కారణంగా ఆ ఇల్లు ఖాళీగా ఉంటోంది. దీంతో ఇంటిని అద్దెకు ఇస్తామంటూ ‘మ్యాజిక్ బ్రిక్స్’లో యాడ్ ఇచ్చారు. యాడ్‌ను చూసిన ఓ వ్యక్తి ఫోన్ చేసి ఇల్లు బాగుంది తీసుకుంటానని నమ్మించాడు. ఇందుకోసం అడ్వాన్స్ చెల్లిస్తామని క్యూఆర్ కోడ్లు పంపారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో తొలుత రూ.లక్ష వరకు కట్ అయ్యాయి. ఇలా ఎందుకయ్యిందని రాకేష్‌కుమార్ ప్రశ్నించంగా.. పొరపాటయ్యిందని మరో కోడ్ పంపించారు. ఇలా పది కోడ్లు పంపి సుమారు పది అకౌంట్ల నుంచి రూ.10.8 లక్షలు స్వాహా చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. చదవండి: హత్య కేసులో అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు.. పోలీసులకే చెమటలు -
దేశవ్యాప్త సైబర్ నేరాల్లో 10% తెలంగాణవే..
హైదరాబాద్: దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో పది శాతానికిపైగా తెలంగాణలోనే ఉన్నట్లు టెలికం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జేవీ రాజారెడ్డి తెలిపారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సాధారణ ప్రజల అవగాహన కోసం శాఖాపరంగా రూపొందించిన కరపత్రాన్ని బుధవారం ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. మన జనాభాలో దాదాపు 50% మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారని, ఆన్లైన్ వ్యాపారంలో చైనా తర్వాత మనదేశం 2వ స్థానంలో ఉన్నదని వివరించారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ జనరల్(టెలికం సెక్యూరిటీ) జి.గౌరీశంకర్ మాట్లాడుతూ.. వివిధ ఆర్థిక మోసాలకు గురికాకుండా మొబైల్ సంబంధిత సెక్యూరిటీ అంశాల గురించి వివరించారు. ఓటీపీ మోసాలు, కెవైసీ మోసాలు, క్యూఆర్ కోడ్ మోసాలు, స్మార్ట్ ఫోన్ ఫిషింగ్, మొబైల్ టవర్ మోసాలు, నకిలీ కాల్ సెంటర్ మోసాలు, ఉద్యోగ మోసాలు మొదలైన మోసాల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. (చదవండి: కారు పార్కింగ్ కష్టాలకు చెక్.. హ్యుందాయ్ సరికొత్త ఆవిష్కరణ) -
'నీ అఫైర్ గురించి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు.. చూశావా?’
పావని (పేరుమార్చడమైనది) సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాత్రమే కాదు వెస్ట్రన్ డ్యాన్సర్‌గానూ మంచి పేరుంది. తనకున్న ప్రతిభను చూపుతూ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటుంది. సామాజికంగా నలుగురిలో ఉన్నతంగా ఉండాలంటే సోషల్‌మీడియా సరైన ఎంపిక అనేది పావని ఆలోచన. ఓ రోజు ‘ఎవరితోనో నీకు ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో రాసి, ఫొటోలు కూడా అప్లోడ్ చేశారు చూడు. ఇవి నీ దాకా రాలేదా?’ అని కూతురుని నిలదీసింది తల్లి. తనకేమీ తెలియదంటూ, ఎంత చెప్పినా ఇంట్లో ఎవరూ వినిపించుకోలేదు. తన మీద చెడుగా ప్రచారం చేసినవారి గురించి, స్నేహితుల ద్వారా విషయం రాబట్టింది పావని. తనపై శత్రుత్వం పెంచుకున్న సహచర ఉద్యోగులు చేసిన పని ఇదని తెలిసి, కుమిలిపోయింది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! రోజూ కొత్తగా అందరితో ‘సూపర్బ్..’ అనిపించుకోవాలని, నలుగురిలో ఫేమస్ అవ్వాలని.. ఇలా రకరకాల కారణాలతో సామాజిక మాధ్యమాల్లో ఉండేవారి సంఖ్య పెరిగింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కారణంగా ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తూ ఉండటమూ చూస్తుంటాం. అది ఇతరుల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించనంత వరకు ఏ సమస్యా లేదు. కానీ, సోషల్ మీడియా లేదా మెసేజింగ్ లేదా ఇ–మెయిల్ సహాయంతో మరొక వ్యక్తికి పరువు నష్టం కలిగించే విషయాలు విస్తృతం అవుతున్నాయి. ఆ సమాచారం ఆ వ్యక్తి జీవితాన్ని అల్లకల్లోలం చేయచ్చు. ఇది చిన్న నేరం కాదు. న్యాయాన్ని, చట్టాన్నీ అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! పరువు నష్టం చేసేది ఎవరు? ►సోషల్ మీడియా వార్తా ఛానెల్‌లు క్లిక్‌లపై డబ్బును సంపాదిస్తుంటాయి. ఎక్కువ క్లిక్‌లకు ప్రకటనలు కూడా ఎక్కువ రావడంతో నిజనిర్ధారణ లేని వార్తలను రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. ►అసంతృప్తి చెందిన ఉద్యోగి కంపెనీ ఉన్నతాధికారులకు లేదా మేనేజ్మెంట్కు అవమానకరమైన, పరువు నష్టం కలిగించే, అసభ్యకరమైన ఇ–మెయిళ్లను పంపుతుంటారు. ►మాజీ స్నేహితుడు / మాజీ జీవిత భాగస్వామి అశ్లీల సందేశాలు స్నేహితులు/ కుటుంబ సభ్యులకు లేదా పోర్న్ సైట్లకు పంపడం. ►రాజకీయ ప్రత్యర్థి తప్పుడు కథనాలతో ప్రత్యర్థి పార్టీని పరువు తీయాలనుకోవచ్చు. ►మతపరమైన శత్రుత్వంతో సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాన్ని సృష్టించవచ్చు. పరిమితులు అవసరం ►రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) కింద అందించిన భావప్రకటన, వాక్ స్వాతంత్య్రపు హక్కు పౌరులందరికీ ఉంటుంది. అయితే, అలాంటి స్వేచ్ఛ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. మరొక వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏవ్యాఖ్య అయినా, అది చట్టం పరిధిలోకి వస్తుంది. ►ఇటీవల కాలంలో నిశ్చితార్థాలు, విడాకులు, ప్రెగ్నెన్సీ విషయాలు... వ్యక్తిగతమైనవి కూడా సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. మనలో చాలామంది సోషల్ నెట్‌వర్క్‌లలో రిలేషన్షిప్ స్టేటస్‌లను ప్రకటిస్తూ, అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, తప్పులను ఒప్పుకుంటూ, లైంగిక గుర్తింపులను ప్రకటిస్తూ అధికారికంగా వెళ్తున్నారు. ►పై వ్యక్తీకరణలతో, ఆన్లైన్ పరువు నష్టం, ట్రోలింగ్, భావ ప్రకటన స్వేచ్ఛపై స్వల్ప, దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతున్నాయి. ఆన్లైన్ పరువు నష్టం మానసిక, శారీరక ఒత్తిడులకు దారితీస్తుంది. అదే విశ్వసనీయతగా మారి విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. కాబట్టి తమ వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అనే స్వీయ విచక్షణ కలిగి ఉండటం అవసరం. అలాగే అవతలివారు పెట్టిన పోస్టులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం, తప్పుడు కథనాలు అల్లడం సైబర్ నేరం కిందికి వస్తుందన్న అవగాహన అవసరం. చదవండి: ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! సోషల్ మీడియా వినియోగ చిట్కాలు ►మీ ప్రతి సోషల్ మీడియా ఖాతాకూ ప్రత్యేకమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. వాటిని తరచూ మార్చుకుంటూ ఉండాలి. ►సమాచారాన్ని పంచుకోవడాన్ని నియంత్రించడానికి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల గోప్యత, సెట్టింగ్‌లను సరిచేసుకోవాలి. ►సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు. ►తెలియని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం మానుకోవాలి. ►మీకు తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వడం శ్రేయస్కరం. ►ఆఫ్‌లైన్‌లో ఎలా హుందాగా ఉంటారో, ఆన్‌లైన్‌లోనూ అంతే హుందాతనాన్ని చూపాలి. అంటే, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు షేర్ చేసేముందు వాటి వెనక గల ఉద్దేశ్యమేంటో తెలుసుండాలి. ►సోషల్‌మీడియా కారణంగా అనుకోని సంఘటనలు ఎదురైతే ఎదుర్కోవడానికి సన్నద్ధులై ఉండాలి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా... జర భద్రం
మన ఆశనే ఆసరాగా చేసుకుని చేసే మోసాలలో ‘పే’ యాప్‌ల ద్వారా క్యాష్‌ను కొల్లగొట్టడం ఒకటి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ .. ఏ అప్లికేషన్ ద్వారా అయినా మీరు నగదు లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్త తప్పనిసరి. కుమారి (పేరు మార్చడమైనది) టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. ‘మేడమ్, మీరు ఆన్లైన్ షాపింగ్‌లో ఫోన్ కొనుగోలు చేశారు కదా! మీకు రూ.4,999 క్యాష్‌బ్యాక్ ఆఫర్ వచ్చింది. ఆ మనీ మీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే నేను చెప్పే పద్ధతులను జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలు. ఈ మొత్తం మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది’ అని చెప్పింది అవతలి వ్యక్తి. దాంతో ఫోన్ పే ద్వారా ఫోన్లో అవతలి వ్యక్తి చెబుతున్న విధంగా వివరాలను జాగ్రత్తగా పొందుపరిచింది కుమారి. ‘మీ బ్యాంక్‌లో నగదు జమ అయింది. చెక్ చేసుకోండి మేడమ్, థాంక్యూ’ అని ఫోన్ కట్ అయింది. పే యాప్‌లో చెక్ చేసుకుంది కుమారి. క్రెడిట్ అవ్వాల్సిన నగదు కాస్తా డెబిట్ అయ్యింది. తన అకౌంట్లో నుంచి నగదు తగ్గిపోయి, వేరేవాళ్ల అకౌంట్లోకి వెళ్లినట్టుగా యాప్ హిస్టరీలో ఉండటంతో షాక్ అయ్యింది కుమారి. స్మూత్‌గా కొల్లగొడతారు వేల రూపాయలే కాదు లక్షల్లోనూ డబ్బును యాప్‌ల ద్వారా కొల్లగొట్టే ఉపాయాలు పన్నుతున్నారు మోసగాళ్లు. ఫోన్ మాట్లాడుతూనే క్రెడిట్ చేస్తామని చెప్పిన నగదు మొత్తాన్ని, మన అకౌంట్ నుంచి మన చేత్తోనే డెబిట్ చేసుకుంటారు. పూర్తిగా వారి మాటలతో మనల్ని తమ ఆధీనంలోకి తీసుకుని, నిలువునా ముంచేస్తారు. బోనస్ పాయింట్లు వచ్చాయనో, లాటరీ తగిలిందనో, స్క్రాచ్ కార్డులో క్యాష్‌బ్యాక్ వచ్చిందనో, బ్యాంక్ మేనేజర్ అనో .. ఇలా ఈ కామర్స్ ఫ్రాడ్స్‌కి తెరలేపుతారు. అకౌంట్లో ఉన్న నగదును దోచేస్తారు. పద్ధతిగా మోసం మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఒక వస్తువు బుక్ చేశారనుకోండి. ఆ వస్తువు డెలివరీ అయిన అరగంటలో మీకో ఫోన్ కాల్ వస్తుంది. అంటే, రకరకాల మార్గాల ద్వారా మీ ఫోన్ నెంబర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. మీ వివరాలన్నీ తెలియజేస్తూ, వాటి పనితనం గురించి చెబుతూ తిరిగి సర్వీస్ అందించాలంటే ఫలానా ఫోన్ నెంబర్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెబుతారు. ఆ ‘కబుర్ల’ను నమ్మి ఫోన్ చేస్తే, బ్యాంకు వివరాలన్నీ రాబట్టడానికి ఎన్ని పద్ధతులు అవలంబించాలో అన్నీ అమలులో పెట్టేస్తారు. సులభమైన మార్గాలు డిజిటల్ లావాదేవీలు జీవితాన్ని సులభతరం చేశాయి. UPI ఇటీవలి కాలంలో ఎంచుకున్న సులభమైన చెల్లింపు పద్ధతుల్లో ఒకటి. మీ ఆర్థిక లావాదేవీకి అధికారం ఇవ్వడానికి మీకు కావలసిందల్లా కేవలం 4 అంకెల పిన్, మొత్తం బదిలీ ప్రక్రియ సెకన్లలో జరుగుతుంది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది. దాదాపు అన్నిUPI యాప్‌లు అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ సాంకేతికంగా సురక్షితమైనవి. అయితే ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్, మాల్వేర్,ఐఎమ్ క్లోన్..ఇతరత్రా మార్గాలను ఉపయోగించి డబ్బును దొంగిలించడానికి మోసగాళ్లు రకరకాల ప్రణాళికలు రచిస్తుంటారు. ఇ–మోసగాళ్లకు సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాలపై మంచి అవగాహన ఉండటం వల్ల మనం అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. కబుర్లతో వల మోసగాళ్లు సాధారణంగా ఇతరులను ఆకర్షించడానికి రకరకాల టార్గెట్లను ఎంచుకుంటారు. వాటిలో.. వారు తమను తాము బ్యాంక్ ప్రతినిధులుగా చెప్పుకుంటారు, కెవైసీ అప్డేట్ చేస్తున్నామని, బోనస్ పాయింట్లు వచ్చాయని, క్యాష్ బ్యాక్లను రిడీమ్ చేస్తున్నామని.. వంటి వాటిని ఫోన్ కాల్ రూపంలో మనతో మాట్లాడుతారు. స్క్రీన్ షేరింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటారు. స్కామర్లు మన ఫోన్‌కి వచ్చిన OTPని అడగచ్చు. కోడ్ చెప్పిన తర్వాత వారి ఫోన్ నుండే అనుమతిని ఓకే చేయమని కూడా అడగచ్చు. యాప్‌కు అవసరమైన అన్ని అనుమతులను పొందినప్పుడు, కాలర్ మన ఫోన్‌ని మనకే తెలియకుండా పూర్తిగా నియంత్రించడం ప్రారంభిస్తాడు. పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత స్కామర్ పాస్‌వర్డ్‌లను దొంగిలించి, UPI ఖాతాతో లావాదేవీని ప్రారంభిస్తాడు. అకౌంట్లో ఉన్న మోత్తాన్ని ఖాళీ చేస్తాడు. సురక్షిత చెల్లింపులకు http: // ప్యాడ్ లాక్ సింబల్‌తో ఉన్న URL లింక్‌లను క్లిక్ చేయడం సురక్షితం. కొనుగోలుదారు లేదా విక్రేతకు OTP/ MPIN/UPI నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ముఖ్యంగా మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా షార్ట్ లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను అస్సలు పూరించవద్దు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవద్దు. మీరు స్కాన్ చేస్తున్న సమయంలోనే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు అంటే స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ మొదలైన వాటిని స్మార్ట్‌ఫోన్ లలో ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలి.మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం గూగుల్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో వెతకవద్దు. -
సైబర్ అలర్ట్: 2020లో భారీగా పెరిగిన సైబర్ మోసాల సంఖ్య
కస్టమర్ కేర్, ఉద్యోగం, రుణాలు, వ్యాపారం, ఓఎల్ఎక్స్లో వస్తువుల విక్రయాలు, గిఫ్టులు, ఫేస్బుక్.. ఇలా పలు విధాలుగా ఆన్లైన్లో ఎరవేసి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఒక్కో పీఎస్‌లో రోజుకో ఒక సైబర్ కేసు అన్న నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. 2020లో 50,035 సైబర్ నేరాల కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2020 నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 12 శాతం అధికమని ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది. 2020లో నమోదైన మొత్తం సైబర్ నేరాల సంఖ్యలో 30,142 లేదా 60 శాతం సైబర్ మోసాలకు చెందడం ఆందోళన కలిగిస్తుంది. దీని తర్వాత 3,293 (సుమారు 7 శాతం) లైంగిక దాడులకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత దోపిడీ(2,440 కేసులు), అపఖ్యాతి(1,706 కేసులు), వ్యక్తిగత ప్రతీకారం(1,470) కేసులు నమోదవుతున్నట్లు ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది. ఈ ఐదు విభాగాల కేసులు 2020లో నమోదైన మొత్తం సైబర్ క్రైమ్ కేసులలో 78 శాతం. దేశంలో అత్యధికంగా కర్ణాటకలో సైబర్ క్రైమ్(9,680) కేసులు నమోదైతే అందులో మోసానికి పాల్పడిన కేసులే ఎక్కువ ఉన్నాయి. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్, కియా గుడ్‌న్యూస్..!) 3వ స్థానంలో తెలంగాణ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్(4,674), తెలంగాణ (4436) రాష్ట్రాలలో ఎక్కువగా సైబర్ మోసాలకు చెందిన కేసులు వస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు మోసానికి సంబంధించిన కేసులే 60శాతం ఉన్నాయి. ఇక సైబర్ లైంగిక దాడుల కేసులు మహారాష్ట్రలో(612) అత్యధికంగా నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్(560), అస్సాం (483) ఉన్నాయి. సైబర్ నేరాల కేసులలో సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించిన 3,112 ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులకు అందినట్లు హిందుస్థాన్ టైమ్స్ సెప్టెంబర్ 19న నివేదించింది. బాధితుల ఖాతాల నుంచి దాదాపు 19 కోట్ల రూపాయలు దొంగలించారు. ఈ మొత్తంలో సుమారు 10 శాతం తిరిగి ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. అందుకే, ఆన్లైన్ వినియోగిస్తున్నప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. -
అత్యాచార భారతం
ముంబైలో మరో నిర్భయ, హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి యూపీలో ఓ అబల, ఎంపీలో మరో నిస్సహాయురాలు ఎటు చూసినా మహిళల ఆక్రందనలే, వారి కన్నీటి కథలే గుండెల్ని పిండేస్తున్నాయి. కరోనా మహమ్మారి కాటేస్తున్న రోజుల్లోనూ కామాంధుల ఉన్మాదాలు ఆగలేదు. న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలు, ఘోరాలతో పాటు దేశవ్యాప్తంగా నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) బుధవారం వెల్లడించింది. భారత్‌లో నేరాలు–2020 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది మహిళలపై రోజుకి సగటున 77 అత్యాచారాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 28,046 అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహిళలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదయ్యాయి. అయితే 2019 తో పోలిస్తే కొంతవరకు నేరాల సంఖ్య తగ్గింది. 2020లో మహిళలపై నేరాలు 8.3% తగ్గాయని నివేదిక వెల్లడించింది. 2019లో మహిళలపై నేరాల సంఖ్య 4,05,326 కాగా, 2018లో 3,78,236 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి. రాజస్తాలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరగగా.. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి. 2020లో కరోనా మహమ్మారి వణికించడం, నెలల తరబడి లాక్డౌన్ అమల్లో ఉండడంతో దొంగతనాలు, దోపిడీలు, మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు వంటివి కాస్త తగ్గాయని ఎన్సీఆర్బీ అధికారిక గణంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను యదేచ్ఛగా అతిక్రమించిన కేసులు గత ఏడాది అత్యధికంగా నమోదయ్యాయని ఎన్సీఆర్బీ ‘‘భారత్‌లో నేరాలు–2020’’ అన్న తన నివేదికలో పేర్కొంది. దేశంలో 28% పెరిగిన మొత్తం నేరాల సంఖ్య మొత్తం నేరాల సంఖ్య 2019లో 51,56,158 ఉండగా, 2020లో 28% పెరిగి 66,01,285కి చేరింది. అత్యధికంగా తమిళనాడులో 2019లో 4,55,094 కేసులు నమోదుకాగా, 2020లో 13,77,681కి నేరాల సంఖ్య చేరుకున్నాయి. దేశంలో రోజుకి సగటున 80 హత్యలు జరుగుతూ ఉంటే యూపీ టాప్‌లో ఉంది. దేశం మొత్తమ్మీద గత ఏడాది 29,193 హత్యలు జరిగితే యూపీలో 3,779 హత్యలు జరిగాయి. 2019తో పోల్చి చూస్తే హత్యలు ఒక్క శాతం పెరిగాయి. హత్యల్లో యూపీ తర్వాత స్థానంలో బిహార్ (3,150), మహారాష్ట్ర (2,163), మధ్యప్రదేశ్ (2,101) ఉన్నాయి. 11.8% పెరిగిన సైబర్ నేరాలు ఆన్లైన్లో జరిగే నేరాలు, ఘోరాలు పెరిగాయి. 2019తో పోలిస్తే 11.8% పెరుగుదల కనిపించింది. మొత్తంగా 50,035 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లో 11,097 కేసులు నమోదు కాగా, కర్ణాటక (10,741), మహారాష్ట్ర (5,496), తెలంగాణ (5,024) తర్వాత స్థానాల్లో నిలిచాయి. నివేదికలో ఇతర అంశాలు ► మహిళలపై నేరాల్లో అత్యధికంగా భర్త, అత్తింటివారి క్రూరత్వానికి సంబంధించిన కేసులే ఎక్కువ. 1,11,549 కేసులు భర్త, బంధువుల క్రూరత్వానికి సంబంధించినవైతే, కిడ్నాప్ కేసులు 62,300 నమోద య్యాయి. లైంగిక దాడికి సంబంధించిన కేసులు 85,392 నమోదు కాగా, అత్యాచార యత్నం కేసులు 3,741 నమోదయ్యాయి. ఇక మహిళలపై గత ఏడాది 105 యాసిడ్ దాడులు జరిగాయి. 6,966 వరకట్నం మరణాలు సంభవించాయి. ► మధ్యప్రదేశ్ చిన్నారులకి ఏ మాత్రం రక్షణ కల్పించలేకపోతోంది. ఆ రాష్ట్రంలో పిల్లలపై 17,008 నేరాలు జరిగాయి. గిరిజన మహిళలపై అత్యాచార ఘటనల్లో కూడా 339తో మధ్యప్రదేశ్ టాప్‌లో ఉంది. ► 2019 సంవత్సరంతో పోల్చి చూస్తే ఎస్సీలపై నేరాల సంఖ్య 9.4% పెరిగితే, ఎస్టీలపై 9.3% పెరిగింది. ► పర్యావరణానికి సంబంధించిన నేరాల్లో ఈ ఏడాది 78% పెరుగుదల కనిపించింది. 2020లో దీనికి సంబంధించి 61,767 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 2019లో 34,676 కేసులు నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం (49,710 కేసులు), శబ్ద కాలుష్యం (7,318) కేసులు నమోదయ్యాయి. -
కస్టమర్ కేర్ అంటారు.. నిలువునా దోచేస్తారు..
సాక్షి, హైదరాబాద్: కరోనా, బ్యాంకుల విలీనం, వర్క్ ఫ్రం హోమ్, పార్ట్‌టైం జాబ్, కస్టమర్ కేర్, ఇన్వెస్ట్మెంట్స్ ప్రతీది సైబర్ నేరగాళ్లు మోసాలకు వేదికలుగా మలుచుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్, నిరుద్యోగులు పార్ట్ టైం జాబ్స్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కంపెనీ ప్రతినిధులుగా మెయిల్స్ పంపి మోసాలకు తెర లేపుతున్నారు. పలు బ్యాంకులు విలీనం కావటంతో ఖాతాదారులకు ఫోన్ చేసి కేవైసీ అప్డేషన్ లేదా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరుగుతుందనో మాట్లాడుతూ ఖాతా, క్రెడిట్/డెబిట్ కార్డ్, సీవీవీ నంబర్లు తీసుకుంటున్నారు. ఓటీపీ రాగానే దాని నమోదు చేస్తే సరిపోతుందని చెప్పి.. ఓటీపీ తీసుకొని ఖాతాలోని సొమ్ము స్వాహా చేస్తున్నారు. బాధితులు 30–40 ఏళ్ల వయస్కులే.. సైబర్ నేరాల్లో ప్రధానంగా కస్టమర్ కేర్, ఓఎల్ఎక్స్, జాబ్, కేవైసీ, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలు జరుగుతుంటాయి. ఎక్కువగా 30–45 ఏళ్ల వయస్సున్న వారే బాధితులవుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కే బాలకృష్ణా రెడ్డి తెలిపారు. రాజస్థాన్ నుంచి ఎక్కువగా ఓఎల్ఎక్స్ ప్రకటనల మోసాలు, జార్ఖండ్ నుంచి కస్టమర్ కేర్ మోసాలు జరుగుతున్నాయి. పెట్టుబడుల పేరిట జరిగే మోసాలకు లింక్‌లు ఎక్కువగా విదేశాళ„Š ళ ఉంటున్నాయి. ఆయా కేసుల విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నేరస్తులను పట్టుకుంటామన్నారు. గూగుల్‌లో వెతకొద్దు.. ఏదైనా కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ నంబరును తెలుసుకోవాలంటే ఆయా సంస్థ అధికారిక వెబ్సైట్లోనే సమాచారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు. గూగుల్‌లో వచ్చిన నంబరుకు కాల్ చేస్తే కస్టమర్ చార్జీ కోసం రూ.10 లను మోసగాళ్లు పంపే లింక్ ద్వారా చెల్లించమని కోరినా పలు యాప్స్ డౌన్లోడ్ చేయమని అడిగినా అది మోసమని గ్రహించాలి.. – కే.బాలకృష్ణా రెడ్డి, ఏసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ కమిషనరేట్ చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
ద్యావుడా.. వీళ్ళు వాట్సాప్‌ని వదలట్లేదుగా
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌ను సైబర్ నేరగాళ్లు వదలట్లేదు. ఓ నంబర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని దాని ఆధారంగా కాంటాక్ట్స్ లిస్ట్‌ను సంగ్రహిస్తున్నారు. అందులో ఉన్న వారికి హ్యాకింగ్ లింకు పంపి హ్యాక్ చేస్తున్నారు. వారికి సందేశాలు పంపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. నగరంలో గడిచిన మూడ్రోజుల్లో నలుగురు బాధితులుగా మారారు. రూ.4 లక్షలు కోల్పోయిన వీళ్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మూడు కేసులు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను వాడుతూ... మరో ఫోన్లోకి మారితే.. ఓటీపీని పొంది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు కొన్ని నంబర్లతో వాట్సాప్ యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ► దీనికి సంబంధించిన ఓటీపీ అసలు యజమానికి వెళ్తుంది. రకరకాల పేర్లతో సంప్రదించి బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేశానని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి వారి నుంచి తీసుకుంటున్నారు. ► ఇలా ఓటీపీని చేజిక్కించుకుని తమ ఫోన్లలో వారి నంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్ డీపీని కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్ వెరిఫికేషన్ చేస్తున్నారు. దీని వల్ల అసలు వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్ చేసుకోవాలని భావించినా.. అది సాధ్యం కాదు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నంబర్లు సైబర్ నేరగాళ్లు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ► వాట్సాప్ బ్యాకప్ డేటాను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వారి కాంటాక్ట్స్‌తో పాటు చాటింగ్స్‌ను తమ ఫోన్లోని వచ్చేలా చేస్తున్నారు. ఆపై ఆ కాంటాక్ట్స్‌లో కొందరికి అత్యవసరంగా డబ్బు కావాలంటూ సందేశాలు పంపుతూ, మరికొందరికి హ్యాకింగ్ లింకులు సెండ్ చేస్తున్నారు. ► తమ స్నేహితులు/బంధువుల నుంచే ఆ సందేశం వచ్చిందని భావిస్తున్నారు. కొందరు డబ్బు చెల్లిస్తుండగా.. మరికొందరు లింకుల్ని ఓ పెన్ చేసి తమ వాట్సాప్ కూడా హ్యాక్ అవడానికి కారకులు అవుతున్నారు. ఇలా వీరి కాంటాక్ట్స్‌లోని వారికీ సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతూ తమ పని పూర్తి చేసుకుంటున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన కుమార్‌కు అతడి స్నేహితుడి నంబర్ నుంచి సోమవారం రూ.1.5 లక్షలు కావాలని సందేశం వచ్చింది. రూ.లక్ష బదిలీ చేసిన ఆయన మిగిలిన రూ.50 వేలు సర్దుబాటు కావవట్లేదని చెప్పడానికి మామూలు కాల్ చేశారు. దీంతో అసలు విషయం తెలిసి సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ► ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని వీఎస్టీకి చెందిన ఓ అధికారి నంబర్‌ను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని నుంచి అందులో పని చేసే ఉద్యోగులకు డబ్బు కావాలంటూ మంగళవారం సందేశాలు పంపారు. అప్రమత్తమైన వాళ్లు సదరు అధికారి దృష్టికి విషయం తీసుకువెళ్లడంతో ఆయన సైబర్ కాప్స్‌ను ఆశ్రయించారు. ► పాతబస్తీకి చెందిన ఇద్దరు బాధితులకు వారి బంధువుల నంబర్ నుంచి ఇలానే సందేశాలు వచ్చాయి. నిజమైనవే అని భావించిన వాళ్లు రూ.1.5 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఆపై అసలు విషయం తెలుసుకుని బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
‘నాతో మాట్లడకపోతే నీ ఫోటోలు పోర్న్ సైట్లో పెడతాను’
మనం విన్నదంతా వాస్తవం అనలేం. మనం చూసింది నిజం కాకపోవచ్చు. మన చుట్టూ ఉన్నవారందరూ మంచి వాళ్లే అని చెప్పలేం. ప్రియ (పేరు మార్చడమైనది) విషయంలో అదే జరిగింది. స్నేహితులతో సరదాగా ఉంటుంది. చదువులో నెంబర్ వన్. అందంలో మిస్ కాలేజ్. చదివేది ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్. అమ్మానాన్నలకు గారాల కూతురు. ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రియ ఆరు నెలలుగా శూన్యం ఆవరించినట్టుగా ఉంది. చదువులో వెనకబడిపోయింది. సరైన తిండి, నిద్రకు దూరమై పేషెంట్లా తయారైంది. స్నేహితులను కూడా కలవట్లేదు. తన గది దాటి బయటకు రావడం లేదు. మానసిక సమస్యేమో అని తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామంటే రానంటుంది. తనకేమీ కాలేదని, బాగానే ఉన్నానంటోంది. ప్రియ వాళ్ల పెద్దమ్మ కూతురు రాగిణి అమెరికా నుండి వచ్చి, తిరిగి వెళ్లే ముందు పిన్నిబాబాయిలను కలవడానికని వచ్చింది. విషయం తెలిసిన రాగిణి రెండు రోజులు ప్రియ వాళ్లంట్లోనే ఉంది. ప్రియతోనే ఉంటూ మాటలు కలిపింది. అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది. నిమిషం కూడా విడవనంటూ.. యుఎస్ నుంచి అదే పనిగా ప్రియ వాట్సప్‌కి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాటికి సమాధానం ఇవ్వడంలో నిమిషం ఆలస్యమైనా కంగారు పడుతుంది ప్రియ. ‘ఆర్నెల్ల క్రితం ఫేస్బుక్లో ఫ్రెండ్ అయిన వ్యక్తి, నా గురించి అన్నీ తెలిసినట్టుగా చెబుతుంటే ఆసక్తిగా అనిపించి, చాట్ కొనసాగించాను. అక్కణ్ణుంచి మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఫోన్లు, చాటింగ్ అంతా బాగానే ఉంది. నమ్మకం కుదిరింది. ఫొటోలు కూడా షేర్ చేసుకున్నాం. ‘చాటింగ్, ఫోన్లతో చదవడమే కుదరడం లేదు మానేద్దాం’ అన్నాను. అప్పటి నుంచి నా ఫొటోలు పోర్న్సైట్లో పెట్టేస్తానని’ బెదిరిస్తున్నాడు అని ప్రియ తెలిపింది. ‘మంచి ఫ్రెండ్ అని నమ్మితే ఇలా మోసం చేశాడు. నా అకౌంట్లో అప్లోడ్ చేసిన ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడాలి. లేదంటే, మార్ఫింగ్ చేసిన ఫొటోలు అందరికీ షేర్ చేసి, నా పరువు, కుటుంబపరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. అందువల్లే కాలేజీ మొహం చూడటం లేదు. అమ్మానాన్నలకు ఈ విషయం తెలిస్తే వాళ్లు బతకరు. నాకు చనిపోవాలని ఉందం’టూ రాగిణికి చెప్పి ఇన్నాళ్లూ దిగమింగుకున్న బాధను ఏడుస్తూ చెప్పింది ప్రియ. భయపడకుండా తను చెప్పినట్టుగా వినమని సైబర్‌క్రైమ్‌కు పిర్యాదు చేసింది రాగిణి. స్నేహితురాలే అడ్డంకి.. ప్రియ అన్నింటా ముందుండటం తట్టుకోలేని స్నేహితురాలు సుజి ఇదంతా చేసిందని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అమెరికా వెళ్లొచ్చిన స్నేహితుడు అక్కడి విశేషాలు చెబుతూ వాడిన యుఎస్ సిమ్ గురించి కూడా చెప్పాడు. ఆ నెంబర్‌తో ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసిన సుజి కొత్త గేమ్ ఆడటం మొదలు పెట్టింది. కొన్నాళ్లు ఆ కొత్త నెంబర్‌తో యాక్టివేట్ అయిన అకౌంట్ నుంచి ప్రియతో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. తన స్నేహితుడి సాయంతో రోజూ కొన్ని గంటల పాటు ప్రియను మాటల్లో పెట్టించి, ఇంటి గడప దాటకుండా చేసింది. ఆ తర్వాత కొత్త బెదిరింపులకు పాల్పడింది. ప్రియతో చాటింగ్ చేస్తున్న అకౌంట్ ద్వారా నెంబర్ కనుక్కున్న నిపుణులు అమెరికా నుంచి వచ్చిన యువకుడిని అరెస్ట్ చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏదో రకంగా ఇతర దేశాల సిమ్‌లను ఉపయోగిస్తూ వంచనకు పాల్పడేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ప్రముఖ బ్రాండ్ లేదా సంస్థ అధికారిక ప్రతినిధిగా నటిస్తారు. ముందుగా URLను తనిఖీ చేయాలి. వారి అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు, ఆ పేరు లేదా నెంబర్‌తో గతంలో మరికొన్ని అకౌంట్ లు ఉన్నాయోమో చూడాలి. ఫ్రాడ్ అకౌంటైతే తక్కువ ఫాలోవర్లు, అతి తక్కువ పోస్టులు ఉంటాయి. సంక్లిష్ట పదాలతో పాస్వర్డ్ మారుస్తూ ఉండాలి. ప్రొఫైల్ లాక్ చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద లింక్‌ల పై క్లిక్ చేయకూడదు. తెలిసిన వ్యక్తులతో మాత్రమే సంభాషణ కొనసాగించాలి. ఆఫ్‌లైన్‌లో ఎలా ఉంటామో ఆన్‌లైన్‌లోనూ అదేవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ తెలిసినవారే అయ్యుంటారా?! నిధి రజ్దాన్ ఓ ప్రఖ్యాత టీవీ ఛానెల్లో జర్నలిస్ట్. ఆర్నెల్ల క్రితం తను భారీగా మోసపోయిన విధానం గురించి చెబుతూ, ఇది ఎవరికైనా ఓ పాఠంలా ఉపయోగపడితే చాలు అంది. ‘హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం బోధించడానికి, అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరడానికి 21 ఏళ్ల తర్వాత నేను పని చేస్తున్న సంస్థను వీడి వెళ్తున్నాను అని ట్విట్టర్లో ప్రకటించాను. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని నేను నిజంగా నమ్మాను. హార్వర్డ్ యూనివర్శిటీలో చేరడానికి నా బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత డేటా, ఇమెయిల్, మెడికల్ రికార్డులు, పాస్‌పోర్ట్, నా కంప్యూటర్, ఫోన్ వంటి పరికరాలు యాక్సెస్ చేయడానికి జరిగిన అధునిక ఫిషింగ్ దాడిలో ఇదంతా భాగం అని 8 నెలల తర్వాత తెలిసింది. ఆఫర్ లెటర్, అగ్రిమెంట్‌తో అధికారిక హార్వర్డ్ ఈమెయిల్ ఐడి నుంచి నాకు మెయిల్ వచ్చింది. విశ్వవిద్యాలయ లోగోతో ఉన్న లెటర్‌హెడ్, పదవులు పొందిన సీనియర్ అధికారులందరి సంతకాలు ఉన్నాయి. నేను పనిచేసే యజమానులకు సిఫారసు లేఖ కూడా పంపారు. అన్నీ పూర్తి చేసుకొని ఉద్యోగాన్ని మానేశాను. హార్వర్డ్ వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి అర్థమైంది నా డబ్బు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం చేయడానికి ఇంతా జరిగిందని. పోలీసులకు అన్ని పత్రాలతో ఫిర్యాదు చేశాను’ అంటూ వివరించారు. ఇదంతా చూస్తుంటే తెలిసిన వాళ్లే ఆమెను ఉద్యోగం నుంచి తప్పించడానికే చేశారేమో?! అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వెరిఫికేషన్ ముఖ్యం మోసపోయాక కళ్లు తెరవడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. అసూయతో సన్నిహితం గా ఉండే వారు కూడా మనల్ని మోసం చేయవచ్చు. నిత్యం మన పక్కనే ఉంటూ మనల్ని మోసం చేసేవారూ ఉంటారు. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే విచక్షణ ముఖ్యం. డబ్బు కోసం, తమ సొంత ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా వెనకాడనివారుంటారు. మన చదువుకు, వృత్తికి, అభిరుచికి తగిన లింక్స్ ఆకట్టుకునే విధంగా మెయిల్స్‌కు వస్తుంటాయి. కొత్తగా వచ్చిన మెయిల్ URL పూర్తిగా వెరిఫై చేసుకున్నాక గానీ ఆ లింక్ ఓపెన్ చేయకూడదు. మన పూర్తి డేటా ఇవ్వకూడదు. ఎక్కడైనా అనుమానం వస్తే సైబర్ నిపుణుల సాయం తీసుకోవడం మేలు చేస్తుంది. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
సైబర్ అలర్ట్: ఓటీపీ.. చెప్పకపోతేనే హ్యాపీ!
శ్రీకాకుళం: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర లేపారు. ఇప్పటివరకు రకరకాలుగా ప్రజలను మోసం చేస్తుండ గా అవి పోలీసుల దృష్టికి రావడం, వాటిపై దృష్టి సారించి దర్యాప్తులు చే స్తుండడంతో జనాలను దోచుకోవడానికి కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారాలకు ఉన్న ఆదరణను చూసి దీనిపై దృష్టి సారించి ప్రజలను మభ్య పెడుతున్నారు. వీటిపై సైబర్ అవేర్నెస్ వీక్‌లో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలా మోసగిస్తారు..? వినియోగదారులకు ఫోన్ చేసి మీకు అమెజాన్ నుంచి లేదా ఫ్లిప్‌కార్ట్ నుంచి పార్సిల్ వచ్చిందని, దాన్ని ఎక్కడ డెలివరీ చేయాలని అడుగుతారు. తాము ఎలాంటి పార్సిల్‌ను బుక్ చేయలేదని చెబితే.. దాన్ని క్యాన్సిల్ చేస్తామని, అందుకు గాను మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని చెప్పాలని కోరుతున్నారు. దీంతో వినియో గదారుడు ఎలాంటి అనుమానం పడకుండా తమకు వచ్చిన ఓటీపీని చెబుతుండడంతో అప్పటికే ఆ ఫోన్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి క్షణాల్లో డబ్బు మాయమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండి ఓటీపీలను ఏ ఒక్కరికీ చెప్పకుండా ఉంటే సైబర్ నేరగాళ్ల ఉ చ్చులో పడకుండా ఉండేందుకు వీలవుతుందని పో లీసులు సూచిస్తున్నారు. బ్యాంకులు గానీ, మరే సంస్థలు గానీ నేరుగా ఫోన్ ద్వారా ఓటీపీలు, సీవీవీలు, ఏటీఎం కార్డు నంబర్లు అడగవని వారు చెబుతున్నారు. కేవలం సైబర్ నేరగాళ్లు మాత్రమే ప్రజలను ఏమారుస్తూ నేరాలకు పాల్పడుతున్నారని, ఓసారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే తిరిగి వాటిని రాబట్టడం అంత సులభంగా అయ్యే పని కాదని అంటున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారు ఇతర రా ష్ట్రాల్లోనో, ఇతర దేశాల్లోనో ఉన్నవారు కావడంతో ఈ తరహా కేసులు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసపూరిత ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ఉచ్చులో పడకుండా ఉండాలని సైబర్ అవేర్నెస్ వీక్‌లో చెబుతున్నారు. -
బీఅలర్ట్: స్కాన్ పేరుతో స్కామ్!
శ్రీకాకుళం: నట్టింటికి నెట్ వచ్చినప్పటి నుంచి వలలో వేయడం, పడడం తేలికైపోయింది. వస్తువులు అ మ్మాలన్నా కొనాలన్నా చాలా మంది ఓఎల్ఎక్స్/క్వికర్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు దీన్ని కూడా ఒక అవకాశంగా మలచుకొని ప్రజలను మోసగిస్తున్నారు. ఎలా మోసం చేస్తారు..? ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి వెబ్సైట్లలో వస్తువులను అ మ్మదలచి పోస్ట్‌లను పెడితే, సైబర్ నేరగాళ్లు ఆర్మీ/ నేవీ లేదా పారా మిలటరీకి చెందిన ఉద్యోగులమని నమ్మించి ఆ వస్తువులను కొనడానికి అంగీకరిస్తారు. డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేస్తామని చెప్పి ఎప్పటి దో రశీదు కావాలనే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు. డబ్బులు రాలేదని గ్రహిస్తే.. ఏదో టెక్నికల్ కారణం వల్ల పేమెంట్ ఆగి ఉంటుందని, ఈసారి క్యూఆర్ కోడ్‌ను పంపిస్తున్నామని స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ పొందాలని సూచిస్తారు. అలా చేస్తే మన అకౌంట్లో డబ్బులు పడడం బదు లు మన డబ్బులే పోతాయి. పోయాక కూడా అటువైపు వ్యక్తితో మాట్లాడితే ఇదే ప్రాసెస్‌ను రెండు మూ డు సార్లు చేయాలని చెప్పి అందిన కాడికి దోచేస్తారు. డబ్బు చేతికి అందిన వెంటనే కనెక్షన్ కట్ చేసేస్తాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి నేరాలు చేసే వారు అవతలి వ్యక్తిని నమ్మించేందుకు ఆర్మీ/నేవీ/పారా మిలటరీ ఫోర్స్‌కు చెంది న ఉద్యోగులుగా ఫేక్ ఐడెంటిటీ కార్డులు లేదా పత్రా లు సృష్టించి వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి వెబ్సైట్లలో పాత వస్తువులను కొనే ముందు లేదా అమ్మే ముందు అవతలి వ్యక్తి వివరాలు నిశితంగా పరిశీలించి సంప్రదింపులు జరపాలి. ఇలాంటి లావాదేవీల విషయంలో అడ్వాన్స్ పేమెంట్స్ చేయడం గానీ లేదా అంగీకరించడం గా నీ చేయకూడదు. అలాగే లింక్స్ క్లిక్ చేయడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం అంటే మోసపోవడమే. పిన్ నంబర్‌ను డబ్బులు పంపడానికే తప్ప రిసీవ్ చేసుకోవడానికి వాడం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమ్మే వ్యక్తి/కొనే వ్యక్తి అనవసరమైన కంగా రు లేదా తొందర పెడుతుంటే మోసమని గ్రహించాలి. -
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా; విలువైన కానుకలు పంపిస్తున్నా
బనశంకరి: నిత్యజీవితంలో డిజిటల్ సాంకేతికత పాత్ర పెరిగేకొద్దీ సైబర్ మోసగాళ్ల పని సులువవుతోంది. అమాయకులను ఎంచుకుని లక్షలాది రూపాయలు దోచుకోవడం సిలికాన్ సిటీలో పరిపాటైంది. నిత్యం పదుల సంఖ్యలో సైబర్ నేరాల బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నర్సుకు రూ.2 లక్షల నష్టం మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఆగంతకుడు, యువతికి రూ.2.07 లక్షలు టోపీ వేశాడు. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 30 ఏళ్లు యువతి బెంగాలీ షాదీ డాట్‌కామ్‌లో ఖాతా తెరిచింది. ఓ వ్యక్తి పరిచయమై విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని, మీకు ఢిల్లీకి ఖరీదైన కానుకలు పంపించానని చెప్పాడు. కస్టమ్స్ ఫీజుల కింద ఆమె నుంచి రూ.2.07 లక్షలు ఆన్లైన్లో లాగేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితురాలు దక్షిణ విభాగ సైబర్‌క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేవైసీ అని రూ.27 లక్షలు స్వాహా ఓ వృద్దుడు సిమ్‌కార్డు కేవైసీ అనివచ్చిన కాల్‌ను నమ్మి రూ.27 లక్షలు పోగొట్టుకున్నాడు. బాణసవాడిలోని 80 ఏళ్ల రిటైర్డు ఉద్యోగికి ఈ నెల 4వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ మొబైల్ సిమ్‌కార్డు కేవైసీ చేసుకోవాలని, లేకపోతే బ్లాక్ అవుతుందని తెలిపాడు. నిజమేననుకున్న వృద్ధుడు అతడు అడిగిన డెబిట్‌కార్డు సమాచారం ఇవ్వగా, బ్యాంకు ఖాతాలో నుంచి రూ.27 లక్షల నగదు కాజేశాడు. బాధితుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రుణం పేరుతో రూ.5.17 లక్షలు ఓ వ్యాపారికి ఫోన్ చేసిన మోసగాడు ముద్రా రుణ విభాగం నుంచి మాట్లాడుతున్నానని నమ్మించాడు. అతన్ని నమ్మిన వ్యాపారిని రుణ మంజూరు పేరుతో దశలవారీగా రూ.5.17 లక్షలు తమ అకౌంట్లు జమచేసుకున్నారు. రుణం మంజూరు కాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నగదు రెట్టింపు అని రూ.7.30 లక్షలు కంపెనీలో పెట్టుబడి పెడితే నిర్ణీత అవధిలోగా రెట్టింపు ఇస్తామని ఆశచూపించిన వంచకులు రూ.7.30 లక్షలు కైంకర్యం చేశారు. దేవనహళ్లి కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి అల్టా ఎంపైర్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధినని ఫోన్ వచ్చింది. తమ కంపెనీలు పెట్టుబడి పెడితే త్వరలోనే రెట్టింపు చేసి ఇస్తామని తెలిపారు. నిజమేననుకుని అతడు రూ.1.80 లక్షలు, స్నేహితుల ద్వారా రూ.5.40 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. తరువాత ఫోన్ కంపెనీ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించారు. -
ఆశపడి.. చెప్పుకోలేక.. తట్టుకోలేక..
‘‘మా యాప్‌లో పెట్టుబడి పెడితే.. మీకు ప్రతి రోజు డబ్బులే డబ్బులు.. పెట్టిన పెట్టుబడికి రూ.లక్షలు వచ్చి మీ ఖాతాలో జమ అవుతాయి. కొద్ది రోజుల్లోనే మీరు లక్షాధికారులు కావచ్చు..’’ అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు. తొలుత పెట్టుబడి పెట్టిన వారికి చెప్పిన విధంగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.. వారి ద్వారా పెట్టుబడి దారుల సంఖ్య గణనీయంగా పెరగ్గానే బిచానా ఎత్తేశారు. ఇలా సైబర్ కేటుగాళ్లు రూ.వేలు కాదు.. రూ. లక్ష కాదు.. ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఆన్లైన్ మోసగాళ్ల మాయాజాలం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగార్జునసాగర్ : సైబర్ కేటుగాళ్లు రూటు మార్చా రు. ఈజీ మనీ ఆశచూపి బాధితులను నిలువునా ముంచేశారు. కొంతకాలంగా కేటుగాళ్లు నాగార్జునసాగర్, నిడమనూరు, హాలియా పట్టణాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వొరాకిల్, పూలిన్ తదితర యాప్‌లను క్రియేట్ చేశారు. ఈ యాప్‌లలో డబ్బులు పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చని ఎరవేశారు. రూ. 2లక్షలు పెట్టుబడి పెడితే.. ఆసక్తి ఉన్న తమ యాప్‌లలో రూ.2లక్షలు పెట్టుబడి పెడితే వారానికి రూ.13వేల చొప్పున నెలకు రూ.52వేలు వస్తాయని, ఈవిధంగా 52వారాల పాటు మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని నమ్మబలికారు. మొదట ఈ స్కీంలో చేరిన వారికి వారు చెప్పిన విధంగా రూ.6లక్షలు జమచేశారు.ఇదే తరహాలు పలు స్కీలు క్రియేట్ చేసి నడుపుతున్నట్లు తెలిసింది. అయితే, కేటుగాళ్లు మొదట చేరిన వారికి లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఈ స్కీంలో ఇతరులను చేర్పిస్తే మీకు కమీషన్ ఇస్తామని చెప్పారు. దీంతో తొలుత స్కీంలో పెట్టుబడి పెట్టి ఏజెంట్లుగా మారిన యువకులు, ఉద్యోగులు మిగతా వారిని మా ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా చేరొచ్చని నమ్మించారు. దీంతో నాగార్జునసాగర్, నిడమనూరు, హాలియాకు చెందిన సుమారు 600మంది బాధితులు చేరినట్టు సమాచారం. ఏజెంట్లకు గోవాలో శిక్షణ సుమారు ఆరు నెలలుగా సాగుతున్న మాయాజాలానికి కేటుగాళ్లు ఆయా ప్రాంతాల్లో పలువురు ఏజెంట్లను నియమించుకున్నారు. వీరందరికీ కొంతకాలం క్రితం గోవాలో శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అత్యధిక సంఖ్యలో పెట్టుబడిదారులను చేర్పించి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ఇస్తామని ఆశ చూపి తమ మోసాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐడీలో కనిపిస్తూ.. బదలాయించుకునేందుకు అవకాశం లేకుండా.. కేటుగాళ్లు స్కీంలో చేరిన పెట్టుబడిదారుడి పేరిట ఒక ఐడీ క్రియేట్ చేస్తారు. అందులో చెప్పినట్లు వారం, రెండు రోజుల్లో డబ్బులు(డాలర్స్) జమ అవుతున్నట్లు కనిపిస్తాయి. అయితే కేటుగాళ్లు ఇక్కడే ఒక తిరకాసు పెడతారు. ఆ డబ్బులను 20నుంచి నెల రోజుల తర్వాత బదలాయించుకోవచ్చని చెబుతారు. దీంతో యాప్‌లో కనిపిస్తున్న డబ్బులతో బాధితుడు సంతోషిస్తూ మరికొందరికి చూపించి ఈ స్కీంలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇలా వందల సంఖ్యలో చేరిన బాధితులకు యాప్‌లో డబ్బులు కనిపిస్తూ.. బదలాయించుకునే అవకాశం లేకుండా కేటుగాళ్లు రూ. కోట్లను దండుకున్నట్లు సమాచారం. చెప్పుకోలేక.. తట్టుకోలేక.. కొద్ది రోజులుగా డబ్బులు ఖాతాకు బదిలీ కాకపోవడంతో బాధితులు మోసపోయామని గుర్తించి లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఎవరీకి చెప్పుకోలేక.. తట్టుకోలేక.. అన్న చందంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇందులో కొసమెరుపు ఏమిటంటే బాధితుల్లో జెన్కో ఉద్యోగులతో పాటు ఓ ప్రజాప్రతినిధి బంధువు కూడా రూ. లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వం ఇలాంటి స్కీంలు మొదలు కాగానే వాటిని మూయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.స్కీంలకు ఏజెంట్లుగా చేరి యువతను పక్కతోవ పట్టించిన వారిపై పోలీస్ శాఖ చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ మోసగాళ్లు మల్టీపర్పస్ బిజినెస్ పేరిట మోసాలకు పాల్ప డుతున్నారు. ఏ బ్యాంకు అధికారులు కూడా మీ వ్యక్తి ఖాతాలు, ఆధార్ ఇతర వివరాలు అడగరు. ఈజీమనీ ఆశకు పోయి మోసపోవొద్దు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఆన్లైన్ మోసం విషయం తమ దృష్టికి కూడా వచ్చింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి మోసాలు తెలిసినా తమ దృష్టికి తీసుకురావాలి. – రంగనాథ్, డీఐజీ, ఎస్పీ, నల్లగొండ -
వైరస్ వల.. సాయం వంకతో భారీగా సైబర్ నేరాలు
బెంగళూరు: టెక్నికల్ సపోర్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ చింతలు తీరుస్తామంటూ చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఈ తరహా నేరాలు భారీగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వల విసురుతున్న సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే టెక్ సపోర్ట్ పేరుతో మెసాలకు పాల్పడుతున్న 2,00,00ల మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామంటూ ప్రముఖ టెక్ సర్వీసెస్ సంస్థ అవాస్ట్ పేర్కొంది. ఇలా గుర్తించిన వారందరినీ బ్లాక్ చేయడం చేసినట్టు తెలిపింది. హానికర మాల్వేర్ సైబర్ నేరగాళ్లు టెక్ సపోర్ట్ పేరుతో వల వేస్తున్నారు. సామాన్యుల కంప్యూటర్లతో యాక్సెస్ దొరకగానే ... మాల్వేర్లను చొప్పిస్తున్నారు. అనంతరం డేటాను దొంగిలిస్తున్నారు. కొన్నిసార్లు సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యేలా హానికరమైన మాల్వేర్ను సైతం పంపిస్తున్నారు. దీంతో వీరి వలలో పడినవారు తీవ్రంగా నష్టపోతున్నట్టు అసలైన టెక్సపోర్ట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. సపోర్ట్ పేరుతో.. టెక్ సపోర్ట్ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపడం ద్వారా కంప్యూటర్ యూజర్లతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌లో సమస్య ఉందని దాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచిస్తారు. తమ టెక్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను వాడితే సమస్య దూరమైపోతుందంటూ నమ్మిస్తున్నారు. ఆ వెంటనే తమ ప్రణాళికను అమల్లో పెడుతున్నారు. ఆర్థిక నేరాలు కంప్యూటర్లలో విలువైన సమాచారం చేతికి వచ్చిన తర్వాత కొందరు నేరగాళ్లు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఆన్లైన్ టెక్ సపోర్ట్ పేరుతో సంప్రదించే నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి.