
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి(బెంగళూరు): సైబర్ మోసగాళ్లు యువతిని బెదిరించి నుంచి రూ.2.20 లక్షలు నొక్కేశారు. వివరాలు.. బెంగళూరు బసవనగుడికి చెందిన 29 ఏళ్ల యువతికి నీల్ యశ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. విదేశాల్లో ఉంటానని, నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. పెళ్లి గురించి మాట్లాడటానికి బెంగళూరుకు వస్తానని చెప్పాడు.
రెండు రోజుల తరువాత యువతికి ఫోన్ చేసిన గుర్తుతెలియని మహిళ నీ ప్రియుడు నీల్‌యశ్‌ను ఢిల్లీ విమానాశ్రయ పోలీసులు అరెస్ట్‌చేశారని, అతన్ని విడుదల చేయడానికి కస్టమ్స్ ఫీజు రూ.2.20 లక్షలు చెల్లించాలని తెలిపింది. దీంతో యువతి ఆ మహిళ తెలిపిన అకౌంట్‌కు నగదు జమచేసింది. ఆ తరువాత మహిళ, నీల్‌యశ్ ఫోన్లు స్విచాఫ్ అయ్యారు. ఈ మోసంపై యువతి దక్షిణ విభాగ సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment