cheated
-
ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం... నష్టానికే పంట అమ్ముకుంటున్న రైతులు
-
పెండ్లి చేసుకుని పారిపోయిన ప్రియుడు
-
టీడీపీ సభ్యత్వం పేరుతో మోసం.. మహిళా అకౌంట్ నుండి లక్ష ట్రాన్సఫర్
-
ఐఏఎస్ అని చెప్పి పెళ్లి..
-
50 పెళ్లిళ్ల సంధ్య
-
రైతు రుణమాఫీ పేరుతో మోసం...
-
మేకులు కొడితే దోషం పోతుందంట..! బురిడీ బాబా బాగోతం బట్టబయలు
సాక్షి, కృష్ణాజిల్లా: నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. 35 లక్షలతో కొన్న స్థలం అమ్ముడవ్వకపోవడంతో మౌలాల అనే దొంగ బాబాను రజనీకి ఓ భక్తురాలు పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలంటూ మౌలాల సూచించాడు. రెండున్నర లక్షలు తీసుకుని పూజలు చేసి నాలుగు మేకులు పాతి పెట్టిన మౌలాల.. నమ్మకం కుదిరేందుకు 100 గంజాలు అమ్ముడుపోయేలా చేశాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని భయపెట్టడం మొదలుపెట్టాడు. మోసపోయామని గుర్తించిన బాధితురాలు రజనీ.. ఇనకుదురు పోలీసులను ఆశ్రయించింది. చదవండి: నారాయణ కాలేజీలో మహిళా వార్డెన్ ఆత్మహత్య -
చిక్కడపల్లి టు చైనా!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి రూ.28 లక్షలు మోసపోయిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ కేసు తీగలాగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దుబాయ్ మీదుగా చైనాలో ఉన్న డొంక కదిపారు. ఈ కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన నలుగురు హైదరాబాదీయులు సైబర్ నేరాల్లో కొత్త కోణాన్ని బయటపెట్టారు. ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడిన కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులకు రివార్డులు అందించారు. చిక్కడపల్లి వాసి శివకుమార్ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్‌లో రూ.28 లక్షలు కోల్పోయి మార్చిలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ బాధితుడి నగదు ఆరు బ్యాంకు ఖాతాల్లోకి, వాటి నుంచి మరో 48 అకౌంట్లలోకి వెళ్లినట్లు గుర్తించారు. వీటి విషయం జాతీయ స్థాయిలోని సైబర్ కో–ఆర్డినేషన్ సెంటర్‌కు అందించగా...వాటిలో దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి మరో రూ.584 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సమాధానం వచ్చింది. ఆ బ్యాంకు ఖాతాల్లో రాధిక మర్చంట్స్ పేరుతో ఉన్న షెల్ కంపెనీది కూడా ఉంది. ఈ అకౌంట్‌తో లింకై ఉన్న సెల్ నెంబర్ నగరానికి చెందిన మునావర్ వాడుతున్నట్లు తెలియడంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనతో పాటు నగర వాసులైన ఆరుల్ దాస్, సమీర్ ఖాన్, ఎస్.సుమేర్లను వికాస్, మనీష్, రాజేష్‌లు లక్నో పిలింపించారని బయటపెట్టాడు. వీరి ముంబై హవాలా నెట్‌వర్క్‌లో భాగమైన నయీమ్... సమీర్‌కు బంధువు కావడంతో పరిచయాలు ఏర్పడ్డాయి. మూడు నెలలు లక్నోలో ఉన్న నలుగురు నగర వాసులూ నకిలీ గుర్తింపు కార్డులతో 33 షెల్ కంపెనీలు, 65 బ్యాంకు ఖాతాలు తెరిచి వారికి అప్పగించి వచ్చారని తేలింది. వీళ్ళకు ఒక్కో ఖాతాకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టిందని బయటపెట్టారు. వీరందించిన ఖాతాల్లో మరో రూ.128 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా మొత్తం రూ.713 కోట్లు ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్‌లో దేశం దాటేశాయని అధికారులు తేల్చారు. నగరం, ముంబైల్లో ఉన్న వారిని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులకు అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాష్, కుమార్ వ్యవహారాలు తెలిశాయి. కీలకమైన ప్రకాష్ అనునిత్యం దుబాయ్, చైనాలకు వెళ్లి వస్తున్నాడని గుర్తించారు. జూన్ 30న చైనా నుంచి వచ్చిన ఇతగాడు తన నెట్‌వర్క్‌లోని ఓ వ్యక్తితో వాట్సాప్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇతడి నెంబర్ తెలుసుకున్న అధికారులు వాట్సాప్ యాక్టివేట్ అయిన నెట్వర్క్ గుర్తించారు. దీనికి లింకైన నెంబర్ లోకేషన్ ఆధారంగా ప్రకాష్ ముంబైలో ఉన్నట్లు పసిగట్టారు. హాలిడే కోసం అక్కడకు వెళ్ళిన ఇతడితో పాటు కుమార్‌ను పట్టుకుని సిటీకి తీసుకువచ్చారు. వీరి నుంచి భారీగా ల్యాప్టాప్స్, ఫోన్లు, షెల్ కంపెనీల లెటర్ హెడ్స్ కూడా స్వాదీనం చేసుకున్నారు. కాగా ఇలాంటి నేరగాళ్లు, నేరాలపై రిజర్వుబ్యాంకు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం ఇస్తామని సీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో యువకుడు సాయి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. యువతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్ డే రోజున చనిపోతున్నానని సూసైడ్‌కు ముందు వీడియోలో తెలిపాడు. యువతి, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సెల్ఫీ వీడియో కలకలం సృష్టించడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా.. -
టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..
నరసరావుపేట టౌన్(పల్నాడు జిల్లా): పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి దళిత యువతిని దగా చేసిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్ బండారం బట్టబయలైంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేటలోని చంద్రబాబు కాలనీకి చెందిన ఓ దళిత యువతి ఆర్కెస్ట్రాలో పాటలు పాడేది. ఆమెకు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెంకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్‌తో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. తనకు వివాహం కాలేదని నమ్మబలికిన నవీన్ ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో తక్కువ కులం దానివని దూషిస్తూ ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కేసు పెడతానని చెప్పగా.. 2019 అక్టోబర్ 24న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బరంపేటలో కాపురం పెట్టాడు. 2020 మార్చిలో ఆమెకు బాబు జన్మించాడు. కాగా, నవీన్‌కు అప్పటికే మరో యువతితో వివాహమైన విషయం బాధితురాలికి తెలిసింది. ఈ విషయంపై నిలదీయడంతో దళిత యువతిని మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి రాకుండా ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. వేరే నంబర్‌ను వినియోగిస్తున్నాడని తెలిసి ఫోన్ చేయగా ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి బలవంతంగా ఇంటినుంచి బయటకు నెట్టాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరేంద్రబాబు బుధవారం తెలిపారు. నవీన్‌పై పేకాట, బెట్టింగ్ కేసులు నవీన్‌పై గతంలో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహణ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికి టీడీపీ ముఖ్యనేతలు అతడికి రాష్ట్ర పదవి కట్టబెట్టి, పదవిలోనే కొనసాగిస్తున్నారు. దళిత యువతిని మోసం చేసి రోడ్డు పాల్జేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుణ్ణి అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని పలువురు దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ -
బ్యూటీషియన్‌కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి..
చిత్తూరు అర్బన్: ‘రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతి వారం రూ.10 వేలు పట్టుకెళ్లండి. మూడేళ్ల తర్వాత మీరు పెట్టిన రూ.లక్ష పెట్టుబడిని వెనక్కు ఇచ్చేస్తాం. మీరు పెట్టిన రూ.లక్షకు బాండు ఇదిగో’ అంటూ ఓ బ్యూటీషియన్‌ను మోసం చేసి ఏకంగా రూ.45 లక్షలు కాజేసిన ఉదంతమిది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. చిత్తూరు నగరంలోని చేపల మార్కెట్ వీధికి చెందిన అనురాధ కొంగారెడ్డిపల్లెలోని బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నారు. బజారులో ఉన్న ఏవోజీ అనే కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు ఇస్తున్నారంటూ తన బంధువు చెప్పడంతో అనూరాధ అక్కడకు వెళ్లింది. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని.. మూడేళ్ల తరువాత పెట్టుబడి రూ.లక్షను సైతం ఇచ్చేస్తామని ఏవోజీ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే, కంపెనీ నిబంధనల ప్రకారం తొలి మూడు నెలల వరకు వడ్డీ రాదని, నాలుగో నెల నుంచి మొత్తం చెల్లిస్తామని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం వస్తుందని ఆశపడ్డ అనూరాధ తనతో పాటు తన సమీప బంధువుల నుంచి అప్పు తీసుకుని, ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఏవోజీ కంపెనీ ప్రతినిధులకు ఏకంగా రూ.45 లక్షలు చెల్లించారు. చదవండి: జ్యోతిష్యుడితో వివాహేతర సంబంధం .. రెండు ఇళ్లు, డబ్బులు అడగడంతో మూడు నెలలు దాటడంతో వడ్డీ తీసుకుందామని కంపెనీకి వెళ్లిన అనూరాధ బోర్డు తిప్పేసినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ కంపెనీలో మరికొందరు కూడా పెద్దఎత్తున నగదు జమ చేసినట్లు తెలుస్తోంది. రూ.కోట్లలో డిపాజిట్లు చేసిన వాళ్లకు అసలు విషయం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. -
నిత్య పెళ్లికొడుకు.. సెకండ్ మ్యారేజ్ మహిళలే టార్గెట్.. షాకింగ్ నిజాలు
సాక్షి, గుంటూరు: మహిళలను మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని గుంటూరు దిశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెకండ్ మ్యారేజ్ మహిళలే అతని టార్గెట్.. షాదీ డాట్ కామ్ ద్వారా తాను ఆర్మీ కమాండర్ అంటూ పరిచయం చేసుకుంటూ సుదర్శన్‌రావు అనే వ్యక్తి మహిళలను పెళ్లి పేరుతో మోసగిస్తున్నాడు. సుదర్శన్రావుపై గుంటూరు దిశ పోలీస్ స్టేషన్లో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయపడ్డాయి. సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి షాదీ డాట్ కాంలో అప్లై చేసుకున్న వారిని సుదర్శన్‌రావు టార్గెట్ చేశాడు. 30 మంది మహిళలను మోసం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: పంజాగుట్టలో స్పా ముసుగులో వ్యభిచారం.. 20 మంది అరెస్టు -
ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి
సాక్షి, కర్ణాటక: తనపై ఎస్ఐ లైంగిక దాడి చేసినట్లు కాలేజీ విద్యార్థిని బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో వైర్లెస్ విభాగంలో ఎస్ఐగా పని చేస్తున్న లాల్సాబ్ తనను ప్రేమ, పెళ్లి పేరుతో మభ్యపెట్టి దైహికంగా వాడుకొని మోసం చేశాడని విద్యార్థిని ఫిర్యాదు చేయగా లాల్సాబ్పై కేసు నమోదు చేశారు. ఈ నెల 10న మరో యువతిని అతడు పెళ్లాడినట్లు బాధితురాలు తెలిపింది. ఫేస్బుక్ ద్వారా 2020 జూన్‌లో పరిచయం అయిన లాల్సాబ్ ప్రేమ పేరుతో వంచించాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. చదవండి: రెండేళ్ల క్రితం పెళ్లి.. భర్తతో ఇష్టం లేక.. ప్రియుడిని మర్చిపోలేక.. -
హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం
-
పరిశోధకుడు కాదు.. కామాంధుడు.. ప్రేమ పేరుతో లోబర్చుకుని..
తుమకూరు(కర్ణాటక): తుమకూరు విశ్వ విద్యాలయంలోని కన్నడ విభాగంలోని పీహెచ్డీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు కామాంధుని అవతారమెత్తాడు. నిందితుడు మల్లికార్జున, 17 ఏళ్ల బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. దీంతో ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతని బండారం బయటపడింది. వివరాలు... మల్లికార్జున తుమకూరు వర్సిటీలో పీహెచ్డీ చేస్తూ నగరంలో బాడుగ ఇంటిలో ఉంటున్నాడు. ఐదుమంది ఆడపిల్లలు ఉన్న కుటుంబంలోని ఒక బాలిక ఇతని ఇంట్లో అంట్లు తోమడానికి వచ్చేది. ఆ బాలికకు ప్రేమ అని మాయమాటలు చెప్పి వాంఛలు తీర్చుకునేవాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతైంది. ఈ విషయాన్ని మూసివేయడానికి నిందితుడు అనేక ప్రయత్నాలు చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు పరారయ్యాడు. 15 రోజుల నుంచి వర్సిటీకి కూడా రావడం లేదు. పోలీసులు నిక్కచ్చిగా దర్యాప్తు చేసి నిందితున్ని శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. చదవండి: దారుణం.. టీ పెట్టలేదని భార్యను చపాతీ పీటతో కొట్టి చంపిన భర్త -
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన గుంటూరు జిల్లా యువతి
-
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను నమ్మించి.. ఫోన్లో ట్విస్ట్ ఇచ్చిన బంధువు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని నమ్మించి సాఫ్ట్వేర్ ఉద్యోగిని మోసం చేసిన వ్యక్తిపై గవర్నర్‌పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు... న్యూ గిరిపురానికి చెందిన గుడిసె వెంకటేశ్వరరావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వరుసకు అన్నయ్య అయిన మిద్దె వెంకటేష్ గవర్నర్ పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో షాపు నిర్వహిస్తున్నాడు. తాను కంప్యూటర్ స్పేర్‌పార్ట్స్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నానని, ఆ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొంత పెట్టుబడి కావాలని వెంకటేశ్వరరావును అడిగాడు. అందుకు అంగీకరించిన వెంకటేశ్వరరావు 2021 నుంచి పలు దఫాలుగా రూ.35లక్షలు వెంకటేష్‌కు ఇచ్చాడు. వెంకటేష్ స్కై సీ కంప్యూటర్స్ పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్ చేశాడు. అనంతరం వెంకటేశ్వరరావు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేసి వ్యాపారం ఎలా ఉంది? అని మిద్దె వెంకటేష్‌ను అడగగా ఇంకా వ్యాపారం ప్రారంభించలేదని సమాధానం ఇచ్చాడు. అతను గట్గిగా నిలదీయగా కొత్త కంప్యూటర్ సంస్థకు బిజినెస్ క్రెడిట్ ఇవ్వరని, అందుకే తాను బిజినెస్ స్టార్ట్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. తర్వాత వెంకటేష్ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న షాపులో వాటా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. గత నెల 27న నగరానికి వచ్చిన వెంకటేశ్వరరావు షాపునకు వెళ్లి చూడగా, అందులో రూ.35 లక్షల స్టాకు లేదని గమనించాడు. వెంకటేష్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, తాను మోసపోయానని గ్రహించిన వెంకటేష్‌ను గట్టిగా నిలదీయగా, వెంకటేష్ అతనిని అసభ్య పదజాలంతో దూషించాడు. చంపేస్తానని బెదిరించడమే కాకుండా వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అసలు విషయం తెలిస్తే షాకే.. సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. యువతి అదృశ్యం కథ -
తన భార్య గోల్డ్ తాకట్టులో ఉందని.. మాజీ సీఎస్‌ను నమ్మించి..
బంజారాహిల్స్(హైదరాబాద్): త్రిపుర రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఉసురుపాటి వెంకటేశ్వర్లును మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... మాజీ చీఫ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు జూబ్లీహిల్స్‌లోని ప్రశాషన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు నానక్‌రాంగూడలో నివాసం ఉండే కొండ రవిగౌడ్ అనే వ్యక్తి కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయం అయిన మొదటి రోజు నుంచి రవి గౌడ్ పూర్తిగా అతడిని నమ్మించాడు. అయితే తన భార్య గోల్డ్ తాకట్టులో ఉందని, దాన్ని విడిపించడం కోసం అర్జెంటుగా రూ. 21 లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. 2020 జనవరి 21న తన కుమార్తె పుట్టిన రోజు ఉందని ఫంక్షన్ అవ్వాగానే విడిపించిన బంగారాన్ని తిరిగి కుదువ బెట్టి, ఆ మొత్తాన్ని 3 నెలల్లో తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. అతని మాటలు నమ్మి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా రూ. 21 లక్షలు అతని అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి నుంచి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా కలిసి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మోసపోయానని భావించిన వెంకటేశ్వర్లు రవిగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్.. నిందితులకు బెయిలిచ్చినా.. -
ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి!
మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రస్తుతం భారత ప్రజలు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అంతా ఆన్లైన్ వైపు మళ్లారు. ఇటీవల ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మరో వైపు ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. పుడ్, దుస్తులు, వస్తువులు ఇలా ప్రతీది నెట్టింట చెల్లిస్తూ ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రజలు. వీటి కారణంగా దేశంలోని ఇ-కామర్స్ కంపెనీల వ్యాపారంలో నిరంతర వృద్ధి నమోదు అవుతోంది. ఈ క్రమంలో అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మింత్రా ( Myntra), జియో మార్ట్ (Jio Mart) కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు , డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కొన్నిసార్లు కస్టమర్లు ఈ ఆన్లైన్ షాపింగ్‌లో మోసాలకు గురవుతుంటారు. అయితే మనం నేరుగా షాపింగ్ చేసిన వాటిలో మోసాలకు పాల్పడితే ఫలానా వ్యక్తిని వెళ్లి ప్రశ్నించవచ్చు. కానీ ఆన్లైన్ అలా కుదరుదు. వీటికంటూ ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదుకు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఓ సారి చూద్దాం! ఇవే నిబంధనలు... ఈ తరహా మోసాలకు సంబంధించి భారత ప్రభుత్వ వినియోగదారుల విభాగం కొన్ని నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, అతను దీన్ని సులభంగా చేయగల హక్కు కస్టమర్‌కు ఉంది. నిబంధనల ప్రకారం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఏదైనా కస్టమర్ ఫిర్యాదుపై 48 గంటల్లోగా స్పందించాలి. కస్టమర్ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, సదరు కంపెనీ ఆ ఫిర్యాదును ఒక నెలలోపు పరిష్కరించడం కూడా తప్పనిసరి. కస్టమర్లు తమ ఫిర్యాదులను కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా, సందేశం పంపడం ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. చదవండి: అమ్మకానికి బంకర్.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు! -
భార్య మోసం చేసిందని భర్త ఆత్మహత్య
-
నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే!
ఓ టెక్కీ బ్యాంక్ నుంచి మెయిల్లో వచ్చిందని అనుకుని తన మొబైల్‌కు వచ్చిన క్యూ ఆర్‌కోడ్ ను స్కాన్ చేశాడు. వెంటనే అతని ఫోన్లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్ పిన్‌లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. కొద్దిసేపటి తరువాత అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు కూడా ఖాళీ అయింది, వ్యక్తిగత ఫోటోలను చూపి దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు. ఇటీవల టెక్నాలజీ వాడకం పెరిగే కొద్దీ నేరగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. కాలానుగుణంగా కొత్త రకం దోపిడికి వ్యూహాలు రచ్చిస్తున్నారు. మన బ్యాంక్ నుంచి మనకి తెలియకుండానే నగదు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాటిపై కాస్త అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో జాగ్రత్త.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ పేరుతో కేటుగాళ్లు కొత్త రకం దోపిడికి స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీరు ఇబ్బందుల్లో పడక తప్పదు. బ్యాంక్ నుంచి నగదు తీసుకోవడానికి ఓ వ్యక్తి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మోసపోగా మరో రెస్టారెంట్లో పెట్టిన క్యూ ఆర్‌కోడ్‌ను మార్చివేసి తమ అకౌంట్ కు నగదు జమఅయ్యేలా చేసి వంచనకు పాల్పడిన ఘటనలు ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మోసగాళ్లు పలు కేంద్రాల్లో( రెస్టారెంట్లు, షాపుల్లో, కస్టమర్లు రద్దీ ఉండే ప్రాంతాలు) యజమానులకు తెలియకుండా అక్కడి క్యూ ఆర్‌కోడ్‌ను మార్చి తమ క్యూఆర్ సంకేతాన్ని ఉంచుతున్నారు. ఇది తెలియక కస్టమర్లు తమ బిల్లులు చెల్లించడానికి క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అందులోకి డబ్బులను పంపుతున్నారు. అయితే చివరికి ఈ పైసలన్నీ మోసగాళ్ల ఖాతాల్లోకి జమఅవుతున్నాయి. మరో వైపు రెస్టారెంట్లో రోజురోజుకు ఆదాయం తగ్గుతుండటంతో దీనిపై విచారించిన యజమానులకు అసలు నిజం తెలియంతో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
పెళ్లి వేడుక.. సరిగ్గా తాళిబొట్టు కట్టే సమయానికి ట్విస్ట్..
యశవంతపుర: ఆదర్శంగా ఉండాల్సిన సైనికుడు తప్పుదోవ పట్టాడు. వితంతు మహిళను పెళ్లి చేసుకొని, మళ్లీ మరో యువతితో మూడుముళ్లకు సై అన్నాడు. మొదటి భార్య ఎంట్రీ తో సీన్ మారిపోయింది. ఈ సంఘటన హాసన్ జిల్లా భువనహళ్లిలో జరిగింది. గతంలో వితంతు మహిళను పెళ్లాడి వివరాలు... సైన్యంలో జవాన్‌గా పని చేస్తున్న కిరణ్‌కుమార్ కొంతకాలం కిందట ఒక వితంతు మహిళతో పరిచయం పెంచుకుని ఆమెను పెళ్లి చేసుకొని జీవిస్తున్నాడు. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పలేదు. ఇంతలో ఎక్కువ కట్నం వస్తుందనే ఆశతో మరో యువతితో పెళ్లిని కుదుర్చుకున్నాడు. హాసన్ భువనహళ్లిలోని కళ్యాణ మండపంలో శుక్రవారం పెళ్లి వేడుక జరుగుతోంది. సరిగ్గా తాళిబొట్టు కట్టే సమయానికి మొదటి భార్య చేరుకుంది. తనను 6 నెలల క్రితం గుట్టుగా వివాహం చేసుకున్నట్లు వధువు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఆమె ఎవరో తెలియదని, అబద్ధం చెబుతోందని పెళ్లికొడుకు మొండికేశాడు. తరువాత పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి అతన్ని విచారించగా, వితంతువును పెళ్లి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. చివరికి పెళ్లి రద్దు కాగా, పోలీసులు వరుని కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: భర్తకు భలే ఆఫరాచ్చిన భార్య.. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో దంపతులు -
పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి..
అన్నానగర్(చెన్నై): ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి, ఓ డాక్టర్ రూ.60 లక్షలు మోసం చేశాడు. అడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నైలోని వెస్ట్ మాంబళం ప్రాంతానికి చెందిన ఓ యువ పట్టభద్రురాలు ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈమెకు ఎంజీఆర్ నగర్ సమీపంలోని జాపర్ఖాన్ పేట ప్రాంతానికి చెందిన డాక్టర్ మనోజ్ చార్లెస్‌తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ స్థితిలో చార్లెస్ ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అంటూ యువతి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ యువతి వద్ద నుంచి కొంచెం కొంచెంగా ఇప్పటివరకు రూ. 60 లక్షలు తీసుకున్నాడు. తీరా చార్లెస్ ఆ యువతిని పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. ఈ విషయమై ఆమె చార్లెస్‌ను ప్రశ్నంచగా అడిగితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువతి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వైద్యుడిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అశోక్‌నగర్ ఆల్ మహిళా పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు మోసం సహా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మనోజ్ చార్లెస్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. చదవండి: రెండేళ్లుగా వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య -
ట్రాన్స్‌కో ఏఈ పాడుపని.. నీతోనే పెళ్లంటూ యువతికి మత్తు మందు ఇచ్చి..
నాంపల్లి(హైదరాబాద్): నీతోనే నా పెళ్లంటూ ఓ యువతిని ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) దయాకర్ జాదవ్ మోసగించాడు. వివాహం చేసుకుంటానంటూ కరీంనగర్‌లోని తన గదికి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గర్భధారణ పరీక్షల నిమిత్తం సోమాజిగూడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గైనకాలజిస్ట్ దగ్గర పరీక్షలు చేయించి టాబ్లెట్స్ ఇప్పించాడు. తన కోరిక తీర్చుకున్నాక “ఇకపై నీతో నా పెళ్లి జరగదంటూ ప్లేటు ఫిరాయించాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన.. బతికున్న తల్లి కూతుళ్లను మట్టితో పూడ్చి.. బాధితురాలు తెలిపిన మేరకు.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీలంక కాలనీకి దయాకర్ జాదవ్ “టీఎస్‌ట్రాన్స్‌కో’ లో అసిస్టెంట్ ఇంజినీరు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీటెక్ చదివిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భార్యాభర్తలమేనంటూ దయాకర్ సదరు యువతితో నమ్మబలికి శారీరకంగా లొంగతీసుకున్నాడు. ఈ క్రమంలోనే రూ.2 కోట్లు కట్నం ఇచ్చే మరో సంబంధం తనకు వచ్చిందంటూ బుకాయించి ఆమెను దూరం పెట్టాడు. దీంతో అమ్మాయి బంధువులు ఇందుకు కారణమేమిటో తెలుసుకునేందుకు అతడితో ఫోన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయంగా అన్ని దారులను బ్లాక్ చేసిపెట్టాడని బాధితురాలు వాపోయింది. నిందితుడు దయాకర్ జాదవ్‌తో పాటు అతడి తల్లి లక్ష్మి, సోదరి లత, సోదరుడు విలాకర్, స్నేహితుడు బీర ప్రకాష్‌లను బాధ్యులుగా ఫిర్యాదులో చేర్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను డిసెంబరు 19వ తేదీలోగా అందజేయాలంటూ జిల్లా పోలీసు శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
వస్త్ర దుకాణంలో పరిచయం... యువతిని నమ్మించి, కోరిక తీర్చుకుని..
కొవ్వూరు(తూర్పుగోదావరి): నమ్మించి, ఓ యువతిని మోసగించిన అభియోగంపై రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కొండ్రు ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాడపల్లికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, సమీపంలోని స్టూడియోలో ప్రేమ్‌కుమార్ పనిచేసేవాడు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటూనంటూ ప్రేమ్‌కుమార్ ఆమెను నమ్మించి, తన అవసరం తీర్చుకున్నాక మొహం చాటే శాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్
అమీర్‌పేట(హైదరాబాద్): ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని నకిలీ పోలీసులు బురిడీ కొట్టించారు. పశ్చిమగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన మౌళి నగరంలోని బల్కంపేట వెన్నం అపార్ట్మెంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యాప్‌లో యువతుల కోసం ఆరా తీసి బీకేగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. చదవండి: భర్త కోసం భార్య మౌన పోరాటం ఇద్దరు యువతులతో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. తాము పోలీసులమని బెదిరించి అతడి సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఫోన్ పే ద్వారా తన అకౌంట్లో నుంచి రూ.14500 బదిలీ చేసుకుని సెల్ తీసుకుని వెళ్లి పోయారు. వచ్చిన వ్యక్తులు నకిలీ పోలీసులని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. -
ఐదేళ్ల పాటు రాజధాని పేరిట టీడీపీ గ్రాఫిక్స్
-
చిట్టీల పేరుతొ చీటింగ్...
-
మస్కట్‌లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం..
ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా): ‘నేను ఏజెంట్ చేతిలో మోసపోయా. ఆరోగ్యం కూడా క్షీణించింది. నన్ను భారత్‌కు రప్పించేలా చర్యలు చేపట్టండి’ అంటూ ఎర్రావారి పాళెం మండలం బోడ వాండ్లపల్లెకి చెందిన సులోచన(38) కుటుంబ సభ్యులకు మంగళవారం మస్కట్ నుంచి సెల్ఫీ వీడియో పంపింది. తనను అనుకున్నచోట పనిలో పెట్టలేదని వాపోయింది. స్వదేశానికి తీసుకెళ్లాలని ఏజెంట్‌ను బతిమలాడినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను భారత్‌కు పిలిపించుకోవాలని కుటుంబ సభ్యులను వేడుకుంది. చదవండి: పైసా లేదు.. రూ.30 లక్షలు ఉన్నాయని గొప్పలు.. చివరికి బిగ్ ట్విస్ట్ -
దళారుల చేతిలో మోసం
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎనిమిది మంది దళారుల చేతిలో మోసపోయారు. వారి మాటలు విని ఓ కంపెనీలో వెల్డింగ్ పనులు చేసే నిమిత్తం ఒమన్ దేశానికి వెళ్లారు.. అక్కడకు వెళ్లాక అసలు అలాంటి కంపెనీయే లేదని తెలియడంతో లబోదిబోమంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం(గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్, గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు(బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు(గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం(బాలాజీపురం)లు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్‌కు వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులుంటాయని చెప్పారని, మంచి జీతాలొస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరూ రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ చెల్లించారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక, కడుపు నిండా తిండి లేక ఇబ్బందిపడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న పాస్ పోర్టు, వీసాలు నకిలీవంటూ అక్కడి పోలీసులు తీసుకెళ్లారని అక్కడ నుంచి బంధువులకు సమాచారం అందజేశారు. క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం..: మంత్రి అప్పలరాజు ఉపాధి కోసం వెళ్లి ఒమన్ దేశంలో చిక్కుకుపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. జరిగిన విషయాన్ని బాధితుల బంధువులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన శుక్రవారం పలాసలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బాధితులతో ఫోన్లో మాట్లాడారు. ఒమన్‌లో వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని, క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుంటుందని ధైర్యం చెప్పారు. ఇండియన్ ఎంబసీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. చదవండి:గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు -
పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి
సాక్షి, మంచిర్యాల: ఆర్భాటంగా పెళ్లి జరుగుతోంది. మరో రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టే సమయం.. ఇంతలో వరుడి ప్రియురాలి ప్రవేశం.. అంతే పీటలపైనే పెళ్లి ఆగిపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి భీమా గార్డెన్స్‌లో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలివి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నివాసం ఉంటున్న రమీణా గతంలో రామకృష్ణాపూర్లో ఉండేది. సింగరేణి కార్మికుడి కూతురైన ఆమె ఇక్కడ ఉంటున్న సమయంలో.. బొద్దుల రాజేష్‌తో ప్రేమలో పడింది. ఆమెకు 2012లో మరో వ్యక్తితో వివాహం కాగా ఇద్దరూ మనస్పర్థలతో కొద్దిరోజులకే విడిపోయారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజేష్ హన్మకొండలో ఫార్మసీ చేస్తున్న రమీణాతో మళ్లీ సాన్నిహిత్యం కొనసాగించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రాజేశ్ వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్న రమీణా బుధవారం ఏకంగా పెళ్లి మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోవైపు పెళ్లికూతురు బంధువులు రాజేశ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసినట్టు మందమర్రి సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. చదవండి: నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని -
అమ్మాయి ఫోటో పెట్టి.. 50 మందికి వల
యశవంతపుర: ఫేసుబుక్, ఇన్‌స్టాగ్రాంలో యువతి పేరుతో నకిలీ ఖాతా తెరిచి యువకులను మోసం చేసిన నిందితుడిని బెళగావి సీఇఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిప్పాణి తాలూకా నాయింగ్లాజ్ గ్రామానికి చెందిన మహంతేశ ముడసె దుబైలో ఉన్న బెళగావి యువతి ఫొటోను సేకరించి ఎం.స్నేహ పేరుతో ఫేసుబుక్‌లో నకిలీ ఖాతా తెరిచాడు. దాదాపు 50 మంది యువకులకు రిక్వెస్ట్ పంపి వారితో ఆడ గొంతుతో మాట్లాడుతూ స్నేహం చేశాడు. అనేక మంది అతని వలలో పడి రూ.19 లక్షలు సమరి్పంచుకున్నారు. కాగా తన ఫొటో ఫేస్బుక్లో ఉండటాన్ని గమనించిన దుబైలోని యువతి... ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు మహంతేశ్‌ను అరెస్ట్ చేశారు. -
కానుక, కారు అనేసరికి నమ్మింది.. ఆ తర్వాత పని పూర్తి కాగానే..
మైసూరు: చుట్టూ ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నా కొందరు మేలుకోవడం లేదు. ఉత్తుత్తి మెసేజ్‌లకు స్పందించి బోల్తా పడుతున్నారు. సులభంగా డబ్బులు వస్తాయని మోసగాళ్ల వలలో పడిన ఇద్దరు మహిళలు లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితులు మైసూరు రాఘవేంద్ర నగరలో ఉండే ఎం.ఆర్. రూపా (42), చాముండిపురవాసి శృతి (27). రూపా మొబైల్‌కు కేబిసీ పేరుతో మీకు బహుమానం వచ్చిందని మెసెజ్ వచ్చింది. ఆ లింక్‌ను నొక్కి వివరాలను నమోదు చేసింది. రెండు రోజుల తరువాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి సుమారు రూ.6.40 లక్షలు ఇతర ఖాతాల్లోకి బదిలీ అయ్యింది. కారు వస్తుందని శృతి మొబైల్‌కి కారు లాటరీ తగిలినట్లు మెసేజ్ వచ్చింది. ఆమె మెసేజ్లోని లింక్‌ను ఓపెన్ చేయగా వరుసగా నాలుగైదు సందేశాలు వచ్చాయి. కారు మీద జీఎస్టీ, బీమా కలిసి మొత్తం రూ.2 లక్షల 22 వేలు చెల్లించాలని చెప్పడంతో ఆమె డబ్బు పంపింది. ఆ తరువాత ఆ ఫోన్ నంబర్ స్విచ్చాఫ్ అయ్యింది. డబ్బులు పోయాయని గుర్తించిన బాధితులు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరెంటు బిల్లు కట్టాలని రూ.99 వేలు మైసూరు రామకృష్ణ నగరలో ఉండే శ్రీనివాసరావు (59) మొబైల్‌కు గడిచిన నెల విద్యుత్ బిల్లు కట్టలేదని మెసెజ్ వచ్చింది. ఆ నంబర్‌కు బాధితుడు కాల్ చేశాడు. మీ ఫోన్లో ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని వంచకులు ఆయనకు చెప్పగా అలాగే చేశాడు. తరువాత రూ.20 కట్టాలనడంతో పంపాడు. యాప్ ద్వారా ఆయన బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు రూ.99 వేలను లూటీ చేశారు. ఇతడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త... నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపిన మహిళ -
ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత ప్రియుడి అరెస్ట్.. చివర్లో ట్విస్ట్ తెలిసి షాకైన యువతి!
బనశంకరి(బెంగళూరు): సైబర్ మోసగాళ్లు యువతిని బెదిరించి నుంచి రూ.2.20 లక్షలు నొక్కేశారు. వివరాలు.. బెంగళూరు బసవనగుడికి చెందిన 29 ఏళ్ల యువతికి నీల్ యశ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. విదేశాల్లో ఉంటానని, నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. పెళ్లి గురించి మాట్లాడటానికి బెంగళూరుకు వస్తానని చెప్పాడు. రెండు రోజుల తరువాత యువతికి ఫోన్ చేసిన గుర్తుతెలియని మహిళ నీ ప్రియుడు నీల్యశ్ను ఢిల్లీ విమానాశ్రయ పోలీసులు అరెస్ట్‌చేశారని, అతన్ని విడుదల చేయడానికి కస్టమ్స్ ఫీజు రూ.2.20 లక్షలు చెల్లించాలని తెలిపింది. దీంతో యువతి ఆ మహిళ తెలిపిన అకౌంట్‌కు నగదు జమచేసింది. ఆ తరువాత మహిళ, నీల్యశ్ ఫోన్లు స్విచాఫ్ అయ్యారు. ఈ మోసంపై యువతి దక్షిణ విభాగ సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి.. -
నిత్య పెళ్లి కొడుకును అరెస్ట్ చేయాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): యువతులను మా యమాటలతో నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు, బాధితురాలు సోమవారం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ ఎదు ట ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి..గుంటూరు జిల్లా, వేటపురి గ్రామానికి చెందిన అడప శివశంకర్ బాబు నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఏడాదిగా అదే కంపెనీలో రామచంద్రాపురం పట్టణానికి చెందిన యువతి ఉద్యోగం చేస్తోంది. శివశంకర్ బాబుతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. యువతి తల్లిదండ్రుల అంగీకారంతో డిసెంబర్లో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం శివశంకర్ ఆమె బంగారం, నగదు తీసుకుని వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వచ్చింది. శివశంకర్ బాబుపై అనుమానంతో ఆమె అతడి వివరాలను ఆరా తీయగా గతంలో పలువురు యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఈనెల 13న రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న ఓ బాధితురాలు ఆదర్శ ప్రతిభ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు మాచర్ల ప్రతిభతో కలిసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాయ మాటలతో నమ్మించి రూ.లక్షల కట్నం తీసుకొని వివాహం చేసుకుని యువతుల జీవితాలను నాశనం చేస్తున్న శివశంకర్ బాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు 12 మంది యువతులను వివాహం చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. ప్రస్తుతం శివశంకర్‌బాబు గుంటూరులో ఉంటున్నాడని, కొందరు అధికారులు అతడికి సహకరిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. మహిళా మండలి అధ్యక్షురా లు మాచర్ల ప్రతిభ మాట్లాడుతూ యువతల జీవితాలతో ఆడుకుంటున్న శివ శంకర్ బాబును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళల వివరాలు సేకరించి వారిని మాయమాటలతో నమ్మించి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని తెలిపారు. దర్యాప్తు చేస్తున్నాం మోసం చేసి యువతులను పెళ్లి చేసుకొన్న శివశంకర్‌పై ఈనెల 13న ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో అతడిని అరెస్టు చేస్తాం. అతడిపై ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, తెలంగాణలో గచి్చ»ౌలి, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది. – సంజయ్ కుమార్, ఇన్స్పెక్టర్, రామచంద్రాపురం (చదవండి: వయసు 21.. కేసులు 20.. జల్సాల కోసం వాహనాల చోరీ) -
రూ.50 నోట్లు కోసం ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకుని లబోదిబోమన్నారు!
మైసూరు(బెంగళూరు): రోడ్డుపై రూ.50 నోట్లను విసిరేసిన దుండగులు ఓ వ్యక్తి దృష్టిని మళ్లించి రూ.1.5 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన మైసూరు జిల్లా టీ నరసీపురలో జరిగింది. మైసూరు నజర్బాద్ నివాసి అబ్దుల్ ఖాదర్ టీ.నరసీపురలోని ఎన్‌కేఎఫ్ పబ్లిక్ పాఠశాలలో పనులు చేస్తున్నాడు. పనుల నిమిత్తం ఇచ్చిన చెక్‌ను కెనరా బ్యాంక్‌లో వేసి డబ్బులు డ్రా చేసుకుని బైక్‌పై పాఠశాలకు బయల్దేరాడు. ఆ సమయంలో వర్షం రావడంతో బ్రిడ్జి వద్ద బైక్ నిలిపి డిక్కీ తెరిచి అందులోని జర్కీన్ వేసుకుంటున్నాడు. ఈ సమయంలో అతన్ని వెంబడిస్తూ వచ్చిన దుండగులు రోడ్డుపై రూ.50 నోట్లను విసిరేసి ఆ డబ్బు మీదేనేమో చూడండి అంటూ దృష్టి మరల్చారు. ఖాదర్ కిందకి వంగి నోట్లు తీసుకుంటుండగా దుండగులు డిక్కీలోని రూ.1.5 లక్షల నగదు దోచుకెళ్లారు. క్షణాల్లో నగదు మాయం కావడంతో కంగుతున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: Hyderabad: భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. -
ఇన్‌స్టాలో పరిచయం, ఆపై స్నేహం.. చివరికి యువతిని నమ్మించి..
బనశంకరి(బెంగళూరు): ఇన్‌స్టా గ్రామ్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలను కొట్టేశాడు. బెంగళూరు నగరంలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినికి ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో ఫ్రాంక్లిన్ జాక్సన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకోవడంతో స్నేహం పెరిగింది. జాన్సన్ లండన్‌లో ఉంటున్నానని చెప్పాడు. నీ పుట్టినరోజుకు 15 వేల పౌండ్లతో పాటు విలువైన కానుకలను పంపిస్తానని యువతిని నమ్మించాడు. రెండురోజుల తరువాత స్టివ్ లావ్సన్ అనే వ్యక్తి నుంచి అమ్మాయికి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. నేను కస్టమ్స్ అధికారినని, మీకు లండన్ నుంచి నగదు, కానుకలతో కూడిన కొరియర్ వచ్చిందని, వీటిని మీకు పంపించాలంటే ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ ట్యాక్స్ చెల్లించాలని మెసేజ్‌లో తెలిపాడు. నిజమేననుకున్న అమాయకురాలు తన బ్యాంకు అకౌంటులో ఉన్న రూ.31 వేలు నగదును అతను చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు జమచేసింది. విద్యార్థిని తన తల్లి అకౌంట్లో ఉన్న నగదును కూడా అతడి ఖాతాల్లోకి జమచేసింది. మొత్తం రూ.3.26 లక్షలు నగదు పంపినప్పటికీ ఎలాంటి కొరియర్ చేరలేదు. మరోపక్క తన ఖాతాలోని నగదు ఏమైందని అమ్మాయిని ఆమె తల్లి ప్రశ్నించింది. చివరకు ఆన్లైన్ వంచకుల వల్ల మోసపోయినట్లు గుర్తించి దక్షిణ విభాగ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకుల కోసం గాలిస్తున్నారు. బిట్‌కాయిన్ అని రూ.60 వేలు వంచన ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన శ్రేయా బన్సాల్ అనే యువతి మాటలు నమ్మిన విద్యార్థి ఒకరు రూ.60 వేలు పోగొట్టుకున్నాడు. బిట్‌కాయిన్ లావాదేవీల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు లభిస్తాయని తెలిపింది. ఆమె మాటలు నమ్మిన విద్యార్థి రూ.60 వేలు నగదును ఆమె అకౌంట్ కు జమచేశాడు. ఇంకా డబ్బు పంపాలని వంచకురాలు ఒత్తిడి చేసింది. అంతా మోసమని తెలుసుకుని బాధితుడు ఈశాన్యవిభాగ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సంపన్న వరుని కోసం రూ.36 లక్షలు బనశంకరి: పెళ్లి సంబంధాల వెబ్సైట్లో శ్రీమంతుడైన వరుని కోసం గాలించిన మహిళ రూ.36 లక్షలు పోగొట్టుకుని న్యాయంకోసం పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరు టీసీ పాళ్య నివాసి యామిని అరణి బాధితురాలు. ఆమె ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో సంపన్నుడైన పురుషుని కోసం అన్వేషించింది. ఫిబ్రవరి 27 తేదీన గుర్తుతెలియని వ్యక్తి యామినికి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. ఓ పని మీద కాలిఫోర్నియాకు వెళ్తున్నట్లు, అందుకు డబ్బు కావాలని, అక్కడికి వెళ్లగానే డబ్బు వాపస్ ఇస్తానని నమ్మించి తన బ్యాంక్ అకౌంట్ వివరాలను పంపించాడు. అతని మాటలు నమ్మిన మహిళ విడతల వారీగా రూ.36 లక్షల 88 వేలను జమచేసింది. తరువాత అతడు డబ్బు వెనక్కి ఇవ్వకపోగా, పెళ్లి చేసుకోకుండా మోసగించాడని బాధితురాలు తెలిపింది. చదవండి: వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి.. -
నవల్స్ పేరుతో నయ వంచన.. వాళ్లే టార్గెట్
సాక్షి,హిమాయత్‌నగర్: ప్రముఖ నవలలను సాఫ్ట్ కాపీల్లో తయారు చేయాలంటూ పేపర్, టీవీ, సోషల్ మీడియా ద్వారా యాడ్స్ ఇచ్చి నయా వంచనకు తెరతీశారు యూఎస్‌కు చెందిన ‘డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ’ నిర్వాహకులు. ఒక్కో పేజీకి రూ.5 చొప్పున ఇస్తామని గృహిణులను టార్గెట్ చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు. చేసిన పనికి సరైన రీతిలో లాభాలు, వేతనాలు ఇవ్వకపోవడంతో మనదేశంలో ఈ కంపెనీని నిర్వహిస్తున్న ఢిల్లీకి చెందిన అమిత్‌శర్మపై బాధితులు బుధవారం సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భుపాల్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు స్రవంతి, కిషోర్, శ్రీనివాసరావు, సునీల్‌సింగ్, వికాస్, మనోజ్, వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..కొన్ని నెలల క్రితం యూఎస్‌కు చెందిన ‘డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీ నిర్వాహకులు వర్క్‌ఫ్రం హోం పేరుతో ప్రకటనలు ఇచ్చారు. పలు ప్రముఖ నవల్స్‌ను ఇచ్చి వాటిలో ఉన్న ఒక్కో పేజీని పీడీఎఫ్‌గా మార్చి కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఒక్కో పేజీకి రూ.5 కమీషన్ ఇచ్చేందుకు బాధితులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను రూ.లక్ష డిపాజిట్ చేస్తే తమ కంపెనీ నుంచి ఒక స్కానర్ ఇస్తామన్నారు.దీంతో పలువురు మహిళలు డిపాజిట్ చేశారు. దీంతో వారికి వారు చేసిచ్చిన పనికి సంబంధించి వేతనం, లాభాలు సైతం ఓ మూడు నెలల పాటు ఇవ్వడం జరిగింది. జూన్ నెలలో టూ పాయింట్ ఓ(2.0) పేరుతో అమిత్‌శర్మ మరో స్కీంను ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.5.50 లక్షలు డిపాజిట్ చెల్లించాలని చెప్పడంతో ప్రస్తుతం వీరికింద చేస్తున్న వారు ఆసక్తి కనబరిచారు. వీరు కట్టడమే కాకుండా తమ బంధువులు, స్నేహితులను కూడా ఈ స్కీంలో చేర్పించారు. నెల గడిచినా చేసిన పనికి వేతనాలు ఇవ్వకపోవడంతో బాధితులు అమీర్‌పేట, బంజారాహిల్స్‌లోని కార్యాలయాల వద్దకు వెళ్లి నిలదీశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది తమకేమీ తెలిదనడంతో అమిత్‌శర్మకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆగ్రహించిన బాధితులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భుపాల్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు. -
యువతితో పరిచయం.. వాట్సాప్ చాటింగ్‌తో నమ్మించి..
సాక్షి, హైదరాబాద్: ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా నగర యువతికి పరిచయమై తాను లండన్‌లో ఉంటున్నానని నమ్మించి రూ.10.65 లక్షలు కాజేసిన నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్రికాకు చెందిన కాబ్రెల్ ఎడ్మాండో కొన్నేళ్ల క్రితం జాబ్ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. అక్కడి ద్వారక ప్రాంతంలో నివసిస్తూ పుణేకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఓ సెలూన్లో బార్బర్‌గా పని చేస్తున్న ఇతగాడు ప్రత్యేకించి ఆఫ్రికన్లు, నైజీరియన్లకు మాత్రమే క్షవరం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు సైబర్ నేరాలకు తెరలేపాడు. మాట్రిమోనియల్ సైట్లో నకిలీ వివరాలు, ఫొటోతో రిజిస్టర్ చేసుకున్నాడు. అదే సైట్లో రిజిస్టరై ఉన్న ఓల్డ్ బోయిన్పల్లి యువతికి లండన్‌లో ఉంటున్న కృష్ణకుమార్‌గా పరిచయమయ్యాడు. ఈమె వితంతువు కావడంతో తాను వివాహం చేసుకుంటానని అన్నాడు. కొన్నాళ్లు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నాక కలవడానికి వస్తున్నట్లు చెప్పాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులుగా కొందరి నుంచి యువతికి ఫోన్లు వచ్చాయి. కృష్ణకుమార్ అనే వ్యక్తి భారీగా పౌండ్లు తీసుకుని లండన్ నుంచి వచ్చాడని, అలా తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అదుపులోకి తీసుకున్నామని నమ్మించారు. కృష్ణకుమార్‌ను వదలాలంటే పన్నులు కట్టాలని రూ.10.65 లక్షలు కాజేసి మోసం చేశారు. బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్, ఎస్సై శాంతరావులతో కూడిన బృందం నిందితుడిని గుర్తించి ఢిల్లీలో అరెస్టు చేసింది. పీటీ వారెంట్‌పై శుక్రవారం నగరానికి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. చదవండి: బాబాయ్ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా.. -
భర్త నిర్వాకం.. ప్రియురాలితో గుట్టుగా కాపురం.. భార్యకు తెలిసి..
ఆటోనగర్(విజయవాడతూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహితను మోసం చేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్న వ్యక్తిపై పటమట పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనమలూరుకు చెందిన గంగాలక్ష్మికి ప్రసాదంపాడుకు చెందిన ఫణికుమార్‌తో 2017లో వివాహం అయింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. 2018లో వీరికి ఒక పాప పుట్టింది. మూడేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం అన్యోన్యంగానే సాగింది. చదవండి: వివాహితను ఇంటిలో నిర్బంధించి లైంగికదాడి.. రెండు రోజుల తర్వాత.. గత కొంత కాలంగా ఫణికుమార్ కాంట్రాక్ట్ పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు వెళుతున్నాడు. రెండు నెలలకు ఒక సారి ఇంటికి వస్తూ పోతూ, రాను రాను ఇంటికి రావడం మానేశాడు. దీంతో గంగాలక్ష్మి పెనమలూరులోని తన సొంత ఇంటికి వెళ్లింది. ఫణికుమార్ వేరొక అమ్మాయిని వివాహం చేసుకొని ఆయుష్ ఆసుపత్రి సమీపంలో కాపురం పెట్టినట్టు గంగాలక్ష్మికి తెలియడంతో గంగాలక్ష్మి పటమట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడికి నమ్మక ద్రోహం.. అంతటితో ఆగకుండా..
ఆటోనగర్(విజయవాడ తూర్పు): స్నేహితుడిని నమ్మించి, నయవంచన చేసి రూ.50 లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రెడిట్ కార్డులతో పాటు 10 వేర్వేరు బ్యాంకుల్లో ఈ మొత్తాన్ని తీసుకుని ముఖం చాటేశాడు. దీనికి సంబంధించి వెంకట నాగకిరణ్ అనే వ్యక్తిపై పటమట పోలీస్ స్టేషన్లో 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: పది రోజులకు ఒకసారి ప్రసాద్ ఇంటికి.. అనుమానాస్పద స్థితిలో.. పటమట ఎస్ఐ పవన్‌కుమార్, ఫిర్యాదు దారుడు తెలిపిన వివరాల మేరకు ప్రసాదంపాడుకు చెందిన వై.వీర వెంకట నాగకిరణ్, సాఫ్ట్వేర్ ఇంజినీరు వి.సాయిస్వప్న కుమార్ చిన్ననాటి నుంచి స్నేహితులు. వెంకట నాగకిరణ్ది కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వాడవల్లి గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి ప్రసాదంపాడులో ఉంటున్నాడు. సాయిస్వప్నకుమార్‌ను నమ్మించి రెండు సంవత్సరాల క్రితం పలు దఫాలుగా 15 క్రెడిట్ కార్డులను వెంకటకిరణ్ వాడుకున్నాడు. అంతటితో ఆగకుండా మరలా వేర్వేరుగా 4 బ్యాంకుల్లో పర్సనల్ లోన్ కింద రూ.15 లక్షలను సాయిస్వప్నకుమార్ వెంకటనాగకిరణ్ అకౌంట్‌కి బదిలీ చేశారు. 15 క్రెడిట్ కార్డులకు సంబంధించి సుమారు రూ.27 లక్షలను డ్రాచేసినట్టు సాయిస్వప్నకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తానికి సంబంధించి అడగ్గా, ఏడు నెలల క్రితం రూ.2.30 లక్షలు సాయిస్వప్నకుమార్కు వెంకటనాగకిరణ్ తిరిగి ఇచ్చాడు. స్నేహితుడు చేసిన మోసంపై గత నెల 25న సాయిస్వప్నకుమార్ విజయవాడ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు ఇచ్చారు. ఈనెల 20న పటమట ఎస్ఐ పవన్‌కుమార్ సాయిస్వప్నకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి వివరాలు అడిగి తెలసుకున్నారు. వెంకటనాగకిరణ్‌కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె పిల్లలు ఆ్రస్టేలియాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. దీని కోసం ఈ మొత్తాన్ని వెంకటనాగకిరణ్‌కు ఇచ్చినట్టు పోలీసులకు సాయిస్వప్నకుమార్ వివరించారు. ఈ మేరకు పటమట పోలీసులు వెంకటనాగకిరణ్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నారైకి రూ.3.11 కోట్ల టోకరా
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రవాస భారతీయుడిని రూ.3.11 కోట్లకు మోసం చేసిన ఇద్దరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ హుస్సేన్ లండన్‌లో నివసిస్తున్నారు. వ్యాపార పనుల కోసం ఏటా నాలుగైదుసార్లు సిటీకి వస్తుంటారు. 2013లో వచ్చిన సందర్భంలో రిజ్వాన్, మహ్మద్ షోయబ్ అనే వ్యక్తులు ఇక్బాల్‌ను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేలా ఇక్బాల్‌ను ఒప్పించారు. వీరి మాటలతో వివిధ దఫాల్లో ఇక్బాల్ డబ్బులిచ్చాడు. 2014 ఏప్రిల్ 3న షాద్‌నగర్ సమీపంలోని 2 ఎకరాల 4 గంటల స్థలాన్ని విక్రయిస్తామని చెప్పారు. రూ.44 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. నగదు ముట్టినప్పటికీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా దాటవేస్తూ వచ్చారు. దీంతో బాధితుడు ఆరా తీయగా సదరు స్థలానికి, రిజ్వాన్, షోయబ్‌లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. రూ.3.11 కోట్ల మేర వారు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నకిలీ ఎన్నారై.. పెళ్లి పేరుతో మోసం.. -
ఈ తల్లీకూతుళ్లు దేశముదుర్లు.. పక్కా ప్లాన్ చేసి..
సాక్షి, చెన్న: పోర్చుగల్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విదేశీ ఉద్యోగం పేరిట పలువురు నిరుద్యోగులకు ఓ తల్లి, కుమార్తె శఠగోపం పెట్టారు. చివరికి అమెరికాకు చెక్కేయడానికి సిద్ధమైన వీరిని పోలీసులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వివరాలు.. వేళచ్చేరి భారతీ నగర్‌కు చెందిన తనిష్కా(34) ఐటీ ఉద్యోగి. విదేశాల్లో ఉద్యోగం ఆశతో మిత్రుల సాయంతో కోయంబేడులోని ఓ సంస్థను ఆమె సంప్రదించారు. పెద్దసంఖ్యలో విదేశీ ఉద్యోగం కోసం యువత, నిరుద్యోగులు ఆ సంస్థ వద్ద క్యూ కట్టడంతో నమ్మకం ఏర్పడింది. దీంతో ఆ సంస్థ ద్వారా పోర్చుగల్‌కు వెళ్లేందుకు నిర్ణయించకుంది. ఇందుకోసం రూ. రూ. 25 లక్షలు ఖర్చు పెట్టింది. అదే సమయంలో కరోనా పరిస్థితులు రావడంతో ఆ సంస్థ కొన్నాళ్లు మూత పడింది. తాజాగా ఉద్యోగం కోసం వెళ్లగా, సరైన సమాధానం ఇవ్వకుండా ఆ సంస్థ నిర్వాహకులు క్లీనాక్రియేటర్ (30), ఆమె తల్లి అనితా క్రియేటర్(55) దాట వేశారు. అయితే తన లాగే పలువురు నిరుద్యోగులు ఆ సంస్థ చుట్టూ తిరుగుతుండడంతో తనిష్కాకు అనుమానం నెలకొంది. దీంతో తనిష్కా వేళచ్చేరి పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మీద దృష్టి పెట్టారు. ఈక్రమంలో ముందుగా చేసుకున్న ఏర్పాట్ల మేరకు సోమవారం అర్ధరాత్రి చెన్నై నుంచి అమెరికాకు వెళ్లేందుకు తల్లి కుమార్తెలు రెడీ అయ్యా రు. అయితే, వేళచ్చేరి పోలీసులు ఇచ్చిన సమాచారంతో నిందితులను విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద పెద్దసంఖ్యలో యువత మోస పోయి ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో విదేశీ ఉద్యోగం పేరిట కోట్లాది రూపాయల్ని దండుకుని అమెరికాకు పారి పోయేందుకు సిద్ధమైనట్టుగా నిర్ధారించారు. కాగా ఈ తల్లి కుమార్తెల బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. చదవండి: Tamil Nadu: భర్త మరుగు దొడ్డి కట్టించలేదని.. ఉరితాడుకు రమ్య! -
ప్రేమ పేరుతో మోసం.. మాయమాటలు చెప్పి లోబర్చుకుని..
తాండూరు రూరల్(వికారాబాద్ జిల్లా): ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బాలిక గర్భం దాల్చి, ప్రసవించిన సంఘటన తాండూరు మండలం జినుగుర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. చైల్డ్‌లైన్ అధికారులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(15). స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఖదీర్ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. చదవండి: స్నేహానికి ద్రోహం.. ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. గత శుక్రవారం కడుపులో నొప్పి వస్తోందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఏడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. బాలిక పడుతున్నవి పురిటి నొప్పులని (ప్రీ డెలివరీ) చెప్పారు. అదే రోజున బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. చైల్డ్‌లైన్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. విచారణ చేసిన సీడీపీఓ రేణుక సదరు బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ కరన్‌కోట్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
సబ్ ఇన్‌స్పెక్టర్‌నంటూ.. యువతులకు వాట్సప్‌లో మెసేజ్ చేసి..
సాక్షి,వరంగల్: నేను సబ్ ఇన్స్పెక్టర్ని, నా పేరు దేవేందర్.. నేను కరీంనగర్ 2వ టౌన్ ఎస్సైగా పని చేస్తున్నాను. గతంలో వివిధ జిల్లాలో పనిచేశాను. నన్ను ప్రేమించాలి అంటూ ఆరుగురు యువతులకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వేదికగా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. మరణించిన ఎస్సై శ్రీనివాస్ ఫొటోను తన ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుని యువతులను వేధింపులకు గురిచేసిన యువకున్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన యువకున్ని చూసి పోలీసులు ఒక్కసారిగా నివ్వెర పోయారు. యువతులను వేధించడంతో వారు పోలీసులను అశ్రయించడం.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగప్రవేశం చేయడంతో అతగాడి బండారం బయట పడింది. పోలీసులు నిందితున్ని అరెస్టు చేసే క్రమంలో ఇంత చేసింది వివకలాంగుడు కావడంతో అశ్చర్యపోయారు. నిందితుడు ఖానాపూర్ మండలం కొత్తిమామిడి తండాకు చెందిన జాటోతు మహేష్ (20) వికలాంగుడని టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. నిందితుడు గతంలో ఫేక్ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేసిన సంఘటనలో కౌన్సెలింగ్ చేసి హెచ్చరించి వదిలిపెట్టినా అతనిలో మార్పు రాలేదని ఆయన తెలిపారు. దీంతో సోమవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. -
అలా జరిగింది.. రూపాయితో 20 వేలు!
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): కేక్ ఆర్డర్ పేరుతో ఓ మహిళా వ్యాపారవేత్తకు గుర్తుతెలియని వ్యక్తి రూ. 20 వేలు టోకరా వేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని విష్ణు మిడోస్‌లో ఉంటున్న పూజారెడ్డి కాన్‌సీయూ స్టోర్ నిర్వహిస్తోంది. ఈ నెల 2న ఉదయం ఆమెకు ఆర్మీ అధికారి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి కేక్ ఆర్డర్ చేశాడు. ఇందుకు ఆమె అడ్వాన్స్ పేమెంట్ చేయాలని చెప్పడంతో ఒక రూపాయి క్యూఆర్ స్కాన్‌తో గూగుల్‌పే చేశాడు. దీనిని నమ్మిన ఆమె క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా వెంట వెంటనే మూడు దఫాలుగా రూ. 20 వేలు ఆమె ఖాతా నుంచి అపరిచితుడి ఖాతాలోకి బదిలీ అయ్యాయి. దీనిపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీసాలున్నా వెళ్లలేక.. -
ఫోన్ నెంబర్ ఇచ్చింది.. ఇంటికి రమ్మంది!
అందంగా ఉంది. పైగా చనువుగా మాట్లాడుతోంది. ఇంకేం.. అనుకున్న ఆ యువకుడు ఫోన్ నెంబర్ అడిగాడు. నెంబర్ ఇవ్వడమే కాదు.. రొమాంటిక్ మెసేజ్‌లతో మత్తులో ముంచెత్తిన ఆమె, ఓ రోజు అతగాడిని ఇంటికి ఆహ్వానించింది. గాల్లో తేలుతూ వెళ్లిన ఆ యువకుడికి షాక్ తగలగడమే కాదు.. పైప్రాణాలు పైనేపోయినంత పని అయ్యింది. కేరళ తిరువనంతపురం అదిమలతురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల వయసున్న బాధితుడు.. ఓ మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. ఓ అమ్మాయి అప్పుడప్పుడు అక్కడికి వస్తుండేది. ఆ పరిచయంతో నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న ఆ ఇద్దరూ వాట్సాప్‌లో ఛాటింగ్‌తో గడిపారు. ఈ క్రమంలో.. ఓరోజు అతన్ని ఇంటికి ఆహ్వానించింది ఆమె. తీరా ఆమె బెడ్రూమ్ దాకా వెళ్లిన అతనికి ఊహించని షాక్ తగిలింది. ఆమె భర్త ఆ కుర్రాడిని కట్టిపడేశాడు. అంతేకాదు.. ఆమెలా వాట్సాప్‌లో ఛాటింగ్ చేసింది కూడా ఆ భర్తే అని తెలిసి సదరు యువకుడు కంగుతిన్నాడు. విషయం అర్థమయ్యే సరికి తనని వదిలిపెట్టాలని బతిమాలాడాడు ఆ కుర్రాడు. చివరకు.. లక్ష రూపాయల డబ్బు, అతని కారు ఇస్తే వదిలేస్తామని.. ఆఫర్ ఇచ్చాడు ఆమె భర్త. అయితే తన దగ్గర పదివేల రూపాయలు ఉన్నాయని, మిగతా డబ్బు కోసం కజకుట్టమ్‌లో ఉన్న స్నేహితుల దగ్గరికి వెళ్లాలని కోరాడు ఆ కుర్రాడు. ఆ వ్యక్తి, అతని స్నేహితురాలు సోని(18), మరో వ్యక్తి.. ఆ కుర్రాడి కారులో బయలుదేరారు. తీరా విలింజమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కారు చేరుకోగానే.. సడన్ బ్రేక్ వేసి నేరుగా పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తాడు బాధితుడు. పోలీసులకు తన గోడు వెల్లబోసుకోగా.. సిబ్బంది బయటకు వచ్చేలోపు నిందితులంతా పరారయ్యారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. -
ఫోన్ చేసి మాటల్లో పెట్టి.. 5 నిమిషాల్లోనే..
హస్తినాపురం(హైదరాబాద్): విశ్రాంత ఉద్యోగికి మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకున్న అగంతకులు అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 40 వేలు స్వాహా చేశారు. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. క్రిస్టియన్ కాలనీకి చెందిన రచ్చ పట్టాభి(67) ఈనెల 4న ఊబర్ క్యాబ్ బుక్ చేశాడు. ఎంతకూ క్యాబ్ రాకపోవడంతో రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత క్యాన్సిల్ చార్జీల చెల్లించాలని మెసేజ్ రావడంతో వచ్చిన నంబర్‌కు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తాను ఊబర్ కస్టమర్ కేర్ నుంచి మెసేజ్ పంపానని చెప్పి ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. మాటల్లో పెట్టి ఎస్బీఐ కార్డు పిన్ నెంబర్ తెలుసుకున్నాడు. 5 నిమిషాల వ్యవధిలో మూడు దఫాలుగా పట్టాభి ఖాతా నుంచి మొత్తం రూ.40 వేలు డ్రా చేశారు. తర్వాత మోసపోయానని గ్రహించిన పట్టాభి శనివారం వనస్థలిపురం పోలీçసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పక్క రాష్ట్రం నుంచి యువతులను రప్పించి వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు -
కోట్లలో మోసపోయిన హీరోయిన్ రిమీ సేన్.. ఎలా అంటే ?
Actress Rimi Sen Gets Cheated Of Over Rs 4 Crore: బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్ ఏకంగా రూ. 4.14 కోట్లు మోసపోయింది. గోరేగావ్‌కు చెందిన వ్యాపారవేత్త పెట్టుబడి పేరుతో రిమీ సేన్‌ను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం వ్యాపారవేత్తగా చెప్పుకునే రౌనక్ జతిన్ వ్యాస్‌ను అంధేరిలోని జిమ్‌లో కలిసినట్లు రిమీ సేన్ తెలిపింది. తర్వాత తాము స్నేహితులమయ్యామని పేర్కొంది. మంచి రాబడులు వస్తాయని చెప్పి ఒక కొత్త వెంచర్లో పెట్టుబడి పెట్టమని తనకు ఆఫర్ చేశాడని వెల్లడించింది రిమీ. అసలు జతిన్ వ్యాస్ కొత్త కంపెనీని ప్రారంభించలేదని తెలిసి తాను మోసపోయినట్లు గ్రహించినాని చెప్పుకొచ్చింది రిమీ సేన్. జతిన్ వ్యాస్పై ఐపీసీ సెక్షన్లు 420, 409 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబైలోని ఖర్ పోలీసులు తెలిపారు. రౌనక్ జతిన్ వ్యాస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రిమీ సేన్ హిందీ, బెంగాలీ, తెలుగు చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన 'ధూమ్' సినిమాలో నటించి ప్రేక్షకాదరణ పొందింది. తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన 'అందరివాడు' చిత్రంలోనూ యాక్ట్ చేసింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, క్యూన్ కి, గోల్మాల్, బాగ్బాన్, హంగామా వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది రిమీ సేన్. -
నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. మోజు తీరాక ఇంట్లోనే ఒక్కదాన్నే వదిలేసి..
యశవంతపుర(బెంగళూరు): బీబీఎంపీ దక్షిణ విభాగం జాయింట్ కమిషనర్ వీరభద్రస్వామి పెళ్లి చేసుకొంటానని నమ్మించి మోసం చేశాడని ద్రిష్ట అనే మహిళ బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020లో పరిచయమయ్యాడని, భార్య నుంచి 11 ఏళ్లుగా దూరంగా ఉంటున్నట్లు చెప్పి తనను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడని తెలిపింది. 2022 ఫిబ్రవరి 14న హుళిమావు–బన్నేరఘట్ట మెయిన్ రోడ్డులోని చౌడేశ్వరి ఆలయంలో తామిద్దరం పెళ్లి చేసుకుని సంసారాన్ని ప్రారంభించామని ఫిర్యాదులో తెలిపింది. అకస్మాత్తుగా ఒకరోజు తనని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడని మళ్లి తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. ఇప్పుడు తానెవరో తెలియదు అని ముఖం చాటేశాడని, న్యాయం చేయాలని కోరింది. తాను ఫోన్ చేస్తే వీరభద్రస్వామి స్పందించడం లేదని పేర్కొంది. మరో ఘటనలో.. బెకును ఢీకొన్న కారు, ఒకరి మృతి మైసూరు: కారు బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన పిరియా పట్టణం తాలూకా సిగూరు గ్రామం మెయిన్ రోడ్డులో బుధవారం జరిగింది. మృతుడిని ఇదే తాలూకా వేలూరుకు చెందిన షడక్షరి స్వామి(35)గా పోలీసులు గుర్తించారు. ఈయన బైక్‌పై వెళ్తుండగా కేరళకు చెందిన కారు ఢీకొంది. ప్రమాదంలో షడక్షరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. -
యువతికి ఉద్యోగం ఆశ చూపి..
హిమాయత్‌నగర్(హైదరాబాద్): చార్టెట్ అకౌంట్ చేసిన ఓ యువతి ఉద్యోగం కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఓ పథకం ప్రకారం ఆమెకు వల వేశారు. మీ ప్రొఫైల్ బాగుంది.. మంచి కంపెనీలో సీఏగా పెట్టిస్తాము అంటూ నమ్మబలికారు. ఆ ప్రాసెస్‌లో భాగంగా యువతికి వాట్సప్ లింకు పంపారు. ఆ లింకును క్లిక్ చేసిన యువతి చేత తొలుత రూ. 100 కట్టించారు. మరుసటి రోజు రోజు రూ. 100కి రూ. 200 లాభం ఇచ్చి ఆశ చూపించారు. ఇదేదో బాగుంది కదా అని ఆశ పడ్డ యువతికి సుమారు రూ. 5 వేల వరకు ఇన్వెస్ట్ చేపించడం లాభాలు ఇవ్వడం చేశారు. ఆ తర్వాత నుంచి పలు దఫాలుగా డబ్బులు పెడుతుందే కానీ లాభాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇలా ఇప్పటి వరకు రూ. 4.53 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు శుక్రవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కె.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు. -
ఏం స్కెచ్ వేశాడు, ఫోన్ మాట్లాడుతా అని.. ఫోన్ పే చేశాడు
సాక్షి,రామగిరి(నల్లగొండ): ఫోన్ మాట్లాడుతా అని ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడి ఫోన్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు పంపించుకున్న సంఘటన మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన సోమగోని సైదులు తిప్పర్తి సెంటర్లో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం 10.30గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి తెలిసిన వాళ్లకి డబ్బులు పంపించాలని సైదులును అడిగాడు. పంపిస్తామని సైదులు చెప్పాడు. ముందుగా ఒక రూపాయి పంపమని అన్నాడు. సైదులు ఫోన్‌పే ద్వారా రూపాయి పంపిస్తున్న సమయంలో చాటుగా పాస్‌వర్డ్‌ను చూసిన సదరు వ్యక్తి డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకుంటానని సైదులు ఫోన్ అడిగాడు. ఫోన్ చేస్తున్నట్లు నటిస్తూ రెండు సార్లు రూ.20 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు తనకు పంపించుకున్నాడు. అనంతరం సైదులకు ఫోన్ ఇచ్చి వెంటనే వస్తానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. సైదులు తేరుకొని చూసేసరికి ఫోన్ నుంచి డబ్బులు పంపించుకున్నట్లు గమనించి డబ్బులు పంపిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయగా ఒకసారి ఎత్తి మాట్లాడాడు. మరల తిరిగి ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బాధితుడు తిప్పర్తి పోలీస్ స్టేషన్‌ను వెళ్లి, సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. -
గురువుగా నమ్మించి.. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఓంశక్తి గురువుగా ప్రజలతో పరిచయం పెంచుకుని ఆపై చీటీలు వేస్తూ.. అధిక వడ్డీ ఆశ చూపి వందలాది మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో చోటుచేసుకుంది. బాధితులు ఆదివారం పలమనేరు డీఎస్పీ గంగయ్యను కలసి ఈ మేరకు గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం ప్రకారం.. బాపట్లకు చెందిన గండికోట ఆంజనేయులు 20 ఏళ్ల క్రితం బంగారుపాళేనికి వచ్చి నెహ్రూ వీధిలో ఓంశక్తి భక్తునిగా సేవలు చేసేవాడు. శక్తి పేరిట ఓ ఆలయాన్ని సైతం దాతల సాయంతో నిర్మించి అక్కడ నిత్యాన్నదానం చేయడం ప్రారంభించాడు. చదవండి: అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా? ఇలా భక్తులను పెంచుకుని వారితో మాల వేయిస్తూ ఏటా మేల్‌మరుత్తూర్ ఆదిపరాశక్తి గుడికి వందల సంఖ్యలో బస్సుల్లో తీసుకెళ్లేవాడు. ఇలా ప్రజల్లో నమ్మకం పెంచుకొని ఓంశక్తి పేరుతో చీటీల వ్యాపారం మొదలుపెట్టాడు. దీంతో పాటు అధికవడ్డీ ఇస్తానంటూ పలువురి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. వారికి చెల్లని చెక్కులను అంటగట్టాడు. నాలుగు రోజుల క్రితం అతని ఇంటికి తాళం వేసి ఉండటంతో పలువురు ఆయనకు ఫోన్‌చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన సొంతూరైన బాపట్ల వెళ్లి ఆరా తీసినా ఆచూకీ దొరకలేదు. అతను ఇచ్చిన చెక్కుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పేరు రాసి మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో డబ్బులు పోగొట్టుకున్నామని భావించిన బాధితులు ఆదివారం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బంగారుపాళేనికి చెందిన లీలమ్మ నుంచి రూ.97 లక్షలు, డి.కిశోర్ నుంచి రూ.50 లక్షలు, రమేష్ నుంచి రూ.34 లక్షలు ఇలా సుమారు 200 మంది నుంచి రూ.25 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టు బాధితులు డీఎస్పీకి తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బంగారుపాళెం ఎస్ఐని డీఎస్పీ ఆదేశించారు. -
లోను కోసం వెళితే.. అసలు విషయం తెలిసి షాక్ అయ్యి..
సాక్షి,హిమాయత్‌నగర్: అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో..లోను తీసుకునేందుకు బ్యాంకు వెళ్లిన నగర వాసికి దిమ్మతిరిగే నిజం తెలిసింది. మీ పేరుపై, మీరు తెచ్చిన డాక్యుమెంట్స్‌పై ఆల్రెడీ లోను ఉంది మళ్లీ ఇంకొకటి ఎలా ఇస్తారనడంతో..నగర వాసికి తేరుకోవడానికి గంట సమయం పట్టింది. గుర్తు తెలియని వ్యక్తుల తన పేరుతో రూ. 11.70 లక్షల రుణం పొందారంటూ.. తనకు న్యాయం చేయాలని బుధవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు చాదర్ఘట్ వాసి రాము. వ్యక్తిగతంగా డబ్బు అవసరం ఉండటంతో.. రాము చాదర్‌ఘట్‌లోని ఎస్బీఐకి వెళ్లాడు. పాన్‌కార్డ్, ఇంటిపత్రాలు, తదితర డాక్యుమెంట్స్‌ను లోను సెక్షన్ వారికి ఇచ్చాడు. వారి వెరిఫికేషన్‌లో గత ఏడాది లోను తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం రాముకు లోను సెక్షన్ వాళ్లు చెప్పడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన ప్రమేయం లేకుండా అంత డబ్బు లోను ఎవరు తీసుకున్నారంటూ ప్రశ్నించాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఆ«ధారాలతో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. -
ఫేక్ మెయిల్‌తో రూ.46లక్షల లూటీ
హైదరాబాద్: నగరానికి చెందిన మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ వాళ్లకు సైబర్ నేరగాళ్లు భారీ వల వేశారు. సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్‌ను చూసిన ఇక్కడి మెడికల్ ఏజెన్సీ వాళ్లు ఏ మాత్రం ఆలోచించకుండా లక్షల రూపాయిలు అప్పగించేశారు. అసలైన కంపెనీ వాళ్లు మీ డబ్బు రాలేదనే వరకు తాము మోసపోయామని తేరుకుని సిటీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సంతోష్‌నగర్‌లోని ‘సెన్స్‌కోర్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్’ మెడికల్ ఏజెన్సీ(షాప్) వాళ్లు కాలిఫోర్నియోలోని ‘ఏజీ సైంటిఫిక్’ కంపెనీతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఏడాదిలో మూడు పర్యాయాలు ‘ఏజీ సైంటిఫిక్’ నుంచి మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఇక్కడి వాళ్లు కొనగోలు చేస్తుంటారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఏర్పడటంతో.. ‘ఏజీ సైంటిఫిక్’వారిని సంప్రదించారు. అదేవిధంగా “ఏజీ సైంటిఫిక్’ వాళ్లు బ్యాంక్ ఖాతా ప్రతి మూడు నెలలకు మారుస్తుంటారు. దీనిని గమనించిన సైబర్ నేరగాళ్లు పరకాయ ప్రవేశం చేశారు. ‘ఏజీ సైంటిఫిక్’ కంపెనీలో ‘ఐ’ అనే లెటర్ తీసేసి ఫేక్ మెయిల్ సృష్టించారు. ఫేక్ మెయిల్‌తో రూ.46లక్షలకు కొటేషన్‌ను పంపి బ్యాంక్ అకౌంట్‌ను కూడా పొందుపరిచారు. బ్యాంక్ అకౌంట్లను వాళ్లు మారుస్తుంటారు కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్లు అడిగిన రూ.46లక్షలకు ఆయా అకౌంట్లకు పంపారు. ఇదంతా గత ఏడాది సెప్టెంబర్ మాసంలో జరిగింది. తాజాగా రెండు రోజుల క్రితం కాలిఫోర్నియో కంపెనీ ‘ఏజీ సైంటిఫిక్’ వాళ్లు మీ డబ్బులు రాలేదు, డబ్బు పంపితే ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తామన్నారు. తాము సెప్టెంబర్‌లోనే పంపామని అకౌంట్ నంబర్‌ను, మెయిల్ ఐడీలను వాళ్లకు చెప్పగా..ఇవేవీ తమవి కాదని తేల్చారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఇక్కడి ఏజెన్సీ యజమాని వరప్రసాద్ సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.కోటి రుణానికి రూ.18లక్షల కమీషన్
హైదరాబాద్: ‘సార్ మీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ అసెట్స్ అన్నీ రీజనబుల్‌గా ఉన్నాయి. మీకు రూ.కోటి వరకు లోను ఇస్తామంటూ’ నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని నిండా ముంచారు సైబర్ నేరగాళ్లు. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగికి ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి లోను ఎర వేశాడు. రూ.కోటి ఇస్తానంటే ఎందుకు కాదనుకోవాలనే ఆలోచనతో ఆ ఉద్యోగి సరేనన్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఇంటి పత్రాలు జిరాక్స్ అన్నీ ఆన్లైన్ ద్వారా సేకరించారు నేరగాళ్లు. ఆ తర్వాత కోటికి పదిశాతం కమీషన్ అంటూ మాయ మాటలు చెప్పసాగారు. అలా డాక్యుమెంట్స్ పేరుతో, ఐటీ పేరుతో తదితర కారణాలు చెప్పి పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.18లక్షలు కాజేశారు. ఈ డబ్బంతా ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిందే. డబ్బు తీసుకుంటున్నారే కానీ రూ.కోటి లోను మాత్రం మంజూరు చేయడం లేదు. తాను ఎక్కడో మోసపోయానని ఆలస్యంగా తేరుకున్న ఆ ఉద్యోగి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చెప్పారు. -
ఉమెన్స్ బ్యూటీ పార్లర్.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో..
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న జయలక్ష్మి సాయినగర్ మొదటి క్రాస్‌లో ఉమెన్స్ బ్యూటీ పార్లర్ నిర్వహించేది. తన వద్దకు వచ్చే మహిళలకు మంచి మాటలు చెప్పి వారితో చిట్టీలు వేయించేది. ఇలా రూ.20 కోట్లకుపైగా వసూలు చేసింది. చిట్టీల గడువు ముగిసినప్పటికీ .. డబ్బులు మాత్రం ఇచ్చేది కాదు. బాధితులు ఒత్తిడి తేగా నేడు, రేపూ అంటూ తప్పించుకుని తిరిగింది. మూడు రోజుల కిందట ఇల్లు ఖాళీ చేసి.. సామగ్రితో వెళ్లిపోవాలని ప్లాన్ వేసింది. ఇది తెలుసుకున్న ముగ్గురు బాధితులు పంగల్‌రోడ్డు వద్ద కాపుకాసి సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. దీంతో జయలక్ష్మి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఆరా తీయగా.. చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది. వరుస కట్టిన బాధితులు జయలక్ష్మి బాధితులు ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు వరుస కట్టారు. ఇందులో రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు మోసపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. శనివారం ఒక్క రోజే 70 మంది బాధితులు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. చిట్టీ డబ్బు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. ఓ దశలో పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న జయలక్ష్మిపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆమెకు రక్షణ కలి్పంచారు. జయలక్ష్మి నగర పరిధిలో నివాసం ఉంటుండటంతో కేసును అక్కడికి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇది వరకే కేసులు కట్టాం చిట్టీల డబ్బులు చెల్లించని జయలక్ష్మిపై బాధితుల ఫిర్యాదుల మేరకు గతంలోనే వన్‌టౌన్, టూటౌన్ పీఎస్‌ల్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె చిట్టీల డబ్బులు ఎగ్గొట్టిందని బాధితులు ఇటుకలపల్లి, అనంతపురం టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. డబ్బు చెల్లింపులకు సంబంధించి జయలక్ష్మి బాండ్లు ఇచ్చినట్లు తెల్సింది. ఈ వ్యవహారం సివిల్ పరిధిలోకి వస్తుంది. బాధితులు కోర్టును ఆశ్రయించాలి. – ప్రసాదరెడ్డి, అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ -
చైనీయులతో దోస్తీ.. నకిలీ కంపెనీలు సృష్టించి!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టిస్తున్న చైనీయులతో జతకట్టారు హైదరాబాదీలు. డ్రాగన్ దేశీయులు ఇన్వెస్ట్మెంట్ పేరుతో చేస్తున్న మోసాలకు అవసరమైన నకిలీ కంపెనీలు, వసూలు చేసిన సొమ్మును ఉపసంహరించేందుకు బ్యాంక్ ఖాతాలను సృష్టించిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన అడబాల శ్రీనివాసరావు, నరాల విజయ్ కృష్ణ, కన్నారెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి, చైనా దేశస్తులు జోలీ, మైకేల్‌తో పాటు మరో 8 మంది నిందితులతో జట్టుకట్టారు. వీరు నగరంలో ఓ ఇంటి యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ), ఇతరత్రా డాక్యుమెంట్లను సృష్టించారు. ఈ నకిలీ పత్రాలను హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కు సమర్పించి 12 నకిలీ ప్రైవేట్ కంపెనీలను తెరిచారు. ఈ కంపెనీలు ఆన్లైన్లో పెట్టుబడి వ్యాపారం అని మాయమాటలు చెబుతూ అమాయక ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సొమ్ము లావాదేవీల కోసం 15 బ్యాంక్ ఖాతాలను తెరిచారు. ఈ విషయంపై హైదరాబాద్ ఆర్వోసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా.. రూ.2.42 కోట్లను వసూలు చేసి ఆ మొత్తాన్ని ఉపసంహరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీసీఎస్ బృందం శ్రీనివాస్, విజయ్ కృష్ణ, విజయ్ భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదల -
అకౌంట్ హ్యాక్.. ఖాతా తెరచి చూస్తే షాక్.. 2 కోట్ల కరెన్సీ మాయం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారవేత్తకు చెందిన క్రిప్టోకరెన్సీ అకౌంట్ హ్యాక్ అయ్యింది. క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెట్టిన పెట్టుబడులను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. వ్యాపారవేత్తకు తెలియకుండా భారీ మొత్తంలో నిధులు స్వాహా అవ్వడంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త లోక్‌జిత్ సాయినాథ్ కొంతకాలంగా క్రిప్టోకరెన్సీ చేస్తున్నాడు. దీనిలో అధిక లాభాలను చూశాడు కూడా. అతనికి సంబంధించి ఇప్పటి వరకు అకౌంట్లో రూ. 2.2 కోట్లు ఉన్నాయి. ఐదు రోజులుగా క్రిప్టో కరెన్సీ అకౌంట్‌ను లోక్‌జిత్ సాయినాథ్ ఓపెన్ చేయలేదు. శుక్రవారం క్రిప్టోకరెన్సీకి చెందిన షేర్‌ను చూసుకునేందుకు, వ్యాపార లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నించగా..అందులోని రూ. 2.02 కోట్ల కరెన్సీ మాయమైంది. సైబర్ నేరగాళ్లు లోక్‌జిత్ సాయినాథ్కు చెందిన క్రిప్టో కరెన్సీ లాగిన్ ఐడీని మార్చేశారు. పాస్‌వర్డ్‌ను సైతం చేంజ్ చేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. చదవండి: బోరబండలో దారుణం.. మహిళను బెదిరించి.. ఇద్దరు యువకుల అత్యాచారం -
భారత మాజీ క్రికెటర్‌కి షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు.. ఫోన్లో మాట్లాడుతుండగా..
ఇంటర్నెట్ వాడకం పెరగడంతో కొందరు ఈజీ మనీ కోసం ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. వీళ్లు తమ దందా సాఫీగా సాగించేందుకు కొత్త దారులు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ జాబితాలో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ సైతం సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు కాంబ్లీ కి ఫోన్ చేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించి, ఆయన కేవైసీ సమాచారాన్ని సమర్పించాలని లేదా తను బ్యాంక్ ఖాతా రద్దు అవుతుందని తెలిపారు. వాళ్ల మాటలను నమ్మిన కాంబ్లీ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు తన ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. దెబ్బకు కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ. 1.14 లక్షల డబ్బు స్వాహ అయ్యాయి. ఈ తతంగమంతా కూడా కాంబ్లీ అతనితో ఫోన్లో మాట్లాడుతుండగానే జరిగింది. చివరికి తాను మోసపోయానని గ్రహించిన కాంబ్లీ అసలు విషయం తెలుసుకుని దగ్గర్లోనే ఉన్న బాంద్రా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు.. రివర్స్ ట్రాన్సక్షన్ ద్వారా కాంబ్లీ డబ్బును తిరిగి ఆయన ఖాతాలోకి జమచేశారు. కాంబ్లీ సచిన్ టెండూల్కర్ తో కలిసి చదువుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు సెయింట్ గ్జేవియర్స్ స్కూల్ పై ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇద్దరు భారత క్రికెట్ లోకి అడుగుపెట్టారు. కానీ ఆ తరువాత కాంబ్లీ మాత్రం పలు వివాదాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. చదవండి: Virat Kohli: "కోహ్లి ఫోన్ స్విఛ్చాఫ్.. ఏమైందో నాకు తెలియదు" -
చిట్టీల పేరుతో సొమ్ములు, అధిక వడ్డీలకు అప్పులు.. తీరా అడిగేసరికి..
సాక్షి,ఏలూరు (పశ్చిమ గోదావరి): చిట్టీలు వేయగా సుమారు రూ.1.80 కోట్లకు శఠగోపం పెట్టి పరారైన నిర్వాహకులరాలు శ్రీరంగం సత్యదుర్గపై చర్యలు తీసుకుని, తమ సొమ్ము ఇప్పించాలని ఏలూరు ఎంఆర్సీ కాలనీ, తంగెళ్లమూడి ప్రాంతాలకు చెందిన బాధితులు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సత్యదుర్గ 50వ డివిజన్లో నివసిస్తూ ఆ ప్రాంత డ్వాక్రా సీఆర్పీగా పనిచేస్తుండేదని తెలిపారు. లబ్ధిదారులకు అందాల్సిన సుమారు రూ.15 లక్షలు దారి మళ్ళించి ఆవిడ తన సొంతానికి వాడుకుని మోసం చేసిందన్నారు. దీనిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుళ్లగా ఆమె మోసం చేసినట్టు ధ్రువీకరించారని తెలిపారు. దీంతో అధికారులు సీఆర్పీని నిలదీయటంతో తిరిగి చెల్లిస్తానని ఆమె ఒప్పుకుని ఈ నెల 25న కుటుంబంతో సహా పరారైనట్టు చెప్పారు. దీనికి తోడు స్థానిక పరిచయాలతో చిట్టీల పేరుతో సొమ్ములు కట్టించుకుని, అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా పరారైనట్లు బాధితులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం అంతా కలిపి సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. తనకున్న రెండు భవనాలు, 75 గజాల స్థలం అమ్మి సొమ్ము ఇచ్చేస్తానని 6 నెలలుగా నమ్మిస్తూ వచ్చి ఆమె పరారైందని లబోదిబోమంటున్నారు. చదవండి: సిటీకి కొత్త.. నమ్మి ఆటో ఎక్కితే ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి.. -
ఆ యాప్‌ను ‘ఫాలో’ అయ్యారో ఫూల్స్ అయినట్టే.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: ‘లింక్ క్లిక్ చేసి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఫాలో కండి. వాటిలో పోస్టులను లైక్ కొట్టి స్క్రీన్‌షాట్ తీసి అప్లోడ్ చేయండి. రోజుకు రూ.300 నుంచి రూ.30 వేల వరకు సంపాదించండి. ఇందుకోసం కొంత మొత్తాన్ని మీరు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన మొత్తాన్ని 20 రోజుల్లో తిరిగి పొందొచ్చు. ఆ తర్వాత రోజువారీ వచ్చే డబ్బంతా లాభమే’ అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ అందినకాడికి దండుకున్నారు. (చదవండి: దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..) ఇటీవల ‘నెట్‌ఫ్లిక్స్ ఫాలో’ అనే యాప్‌లో సభ్యులుగా చేరి రెండు తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నిండా మునిగారు. అక్టోబర్ 22 నుంచి యాప్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డబ్బు కట్టినవారు లబోదిబోమంటున్నారు. బాధితుల్లో అత్యధికులు, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులే. కొందరు పోలీసులు సైతం మోసపోయినవారిలో ఉండటం గమనార్హం. (చదవండి: AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్) ఏంటీ ఫాలో యాప్.. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆయా ఖాతాలను ఫాలో అవుతూ.. అందులో పోస్టులకు లైక్‌లు కొడితే వేతనాలు పొందొచ్చు అంటూ ఫాలో యాప్‌ను కొద్ది నెలల క్రితం సైబర్ నేరగాళ్లు తీసుకువచ్చారు. ఇందులో రెగ్యులర్ స్టాఫ్, మేనేజర్, డైరెక్టర్, జనరల్ మేనేజర్, బాస్, సీఈవో, సీఎంవో ఇలా వివిధ హోదాలను పేర్కొన్నారు. ఈ హోదాల్లో యాప్‌లో చేరడానికి రెగ్యులర్ స్టాఫ్ రూ.3 వేలు, మేనేజర్ రూ.6 వేలు, డైరెక్టర్ రూ.15 వేలు, జనరల్ మేనేజర్ రూ.45 వేలు, బాస్ రూ.90 వేలు, సీఈవో రూ.2.70 లక్షలు, సీఎంవో రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధన పెట్టారు. రోజువారీ టాస్క్‌లు ఫాలో యాప్‌లో సభ్యులకు సామాజిక మాధ్యమాల ఖాతాలను సబ్‌స్క్రైబ్ చేసి, అందులో పోస్టులకు లైక్ కొట్టే రోజువారీ టాస్క్ ఇస్తారు. హోదాను బట్టి రోజుకు 6 నుంచి 30 టాస్కులు చేయాల్సి ఉంటుంది. టాస్కులు చేసిన వెంటనే యాప్‌లో డబ్బు జమవుతాయి. టాస్కులతోపాటు తమ కింద కొత్తగా సభ్యుడిని చేర్పించినవారికి కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తూ వచ్చారు. మొదటి మూడుసార్లు రూ. వెయ్యి దాటిన వెంటనే డబ్బు బ్యాంక్ ఖాతాలోకి జమ చేసుకునేలా వీలు కల్పించారు. నాలుగోసారి నుంచి రూ.5 వేలు దాటితే నగదు బదిలీకి అవకాశమిచ్చారు. దీంతో సభ్యులుగా ఉన్నవారు ఇబ్బడిముబ్బడిగా బంధువులు, స్నేహితులను యాప్‌లో చేర్పించారు. ఫాలో యాప్‌లో సభ్యులుగా ఉన్నవారితో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన గ్రూప్‌లో ఏకంగా 40 వేల మందికి పైగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ మంది బాధితులు ఉన్నట్టు సమాచారం. రోజుకో ట్విస్ట్ ఈ నెల 14 వరకు టాస్కులు పూర్తి చేసి, నగదు బదిలీకి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బు జమవుతూ వచ్చాయి. ఆ తర్వాతి రోజు నుంచి నగదు బదిలీలు నిలిచిపోయాయి. బ్యాంకులకు వరుస సెలవులు ఉండటం వల్ల నగదు బదిలీలు నిలిచిపోయాయని యాప్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అనంతరం రోజుకో ట్విస్ట్‌తో ఈ నెల 22న యాప్‌ను నిలిపివేస్తున్నట్టు యాప్ ప్రతినిధులు ప్రకటించారు. గురువారం టెలిగ్రామ్‌లోని గ్రూప్‌ను కూడా తొలగించారు. స్వల్ప మార్పులతో కొత్త యాప్ ఫాలో యాప్ పేరుతో వేల మందిని బురిడీ కొట్టించి రూ. కోట్లలో కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ల ముఠా ఇంకో కొత్త మోసానికి తెరతీసింది. ఫాలో యాప్‌కే స్వల్ప మార్పులు చేసి పేరు మార్చి కొత్తగా ప్యూర్ హార్ట్, టూబెస్ట్ అనే యాప్‌లను తాజాగా వాడుకలోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లలో అందుబాటులో ఉండవు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అడ్మిన్లు పంపే లింక్‌ల ద్వారానే ఈ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.2 లక్షలు నష్టపోయా.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా సహ ఉద్యోగి సలహా మేరకు రూ.90 వేలు కట్టి బాస్‌గా చేరాను. నేను చెల్లించిన డబ్బు 20 రోజుల్లో వచ్చేసింది. అప్పు చేసి మరీ రూ.2.70 లక్షలు చెల్లించి సీఈవోగా రెండో అకౌంట్ తీసుకున్నాను. అకౌంట్ తీసుకున్న వారానికే యాప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రూ.2 లక్షలు నష్టపోయాను. నా స్నేహితులు కూడా రూ.లక్షల్లో నష్టపోయారు. – రవితేజ, బాధితుడు అనంతపురం జిల్లా ప్రజలు అప్రమత్తతతో ఉండాలి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, మనుషుల ఆలోచన సరళికి అనువుగా సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ తరహా గొలుసుకట్టు మోసాలు అనేకం వెలుగు చూశాయి. బాధితులు పోలీసులను సంప్రదిస్తే న్యాయం చేస్తాం. ప్రజలు అప్రమత్తతతో వ్యవహరిస్తే సైబర్ నేరాల కట్టడి సాధ్యం. – రాధిక, ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ అమ్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టి చేరాను నేను ప్రైవేట్ విద్యా సంస్థలో చిరుద్యోగిని. మా అమ్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టి రూ.90 వేలు కట్టి సభ్యుడిగా చేరా. చేరిన నాలుగు రోజులకే యాప్ నిలిచిపోయింది. రూ.80 వేలు నష్టపోయాను. – హర్ష, బాధితుడు, కృష్ణా జిల్లా -
ప్రియుడిని చొక్కా పట్టి ఈడ్చుకెళ్లిన ప్రియురాలు
రాయగడ(భువనేశ్వర్): ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అవసరం తీరాక వదిలి వెళ్లిపోయాడు. అయితే తనకు జరిగిన మోసానికి ఆమె కుంగిపోలేదు. ప్రేమించిన వాడి ఆచూకీ తెలుసుకొని, నేరుగా ఇంటికి వెళ్లి, నిలదీసింది. తనతో రమ్మని కోరగా.. అతడు ససేమిరా అనడంతో కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను అర్థించింది. రాయగడ జిల్లాలోని బిసంకటక్ సమితిలో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిసంకటక్ ఐఐసీ అధికారి సుభాష్‌చంద్ర కొరకొరా తెలిపిన వివరాల ప్రకారం... కుంకుబడి గ్రామానికి చెందిన యువకుడు సుమన్ కుసులియా ఉపాధి కోసం 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రొయ్యిల పరిశ్రమలో పనికి చేరాడు. అదే పరిశ్రమలో పనిచేస్తున్న విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన యువతి బెలసుర కుమారితో స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 3నెలల క్రితం అక్కడికి సమీపంలోని ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆటోస్టాండ్‌లో ఎదురయ్యాడు.. కలిసి కొన్నాళ్లు కాపురం చేసిన తరువాత.. కొద్ది రోజుల క్రితం సుమన్ ఎవరికీ చెప్పకుండా భీమవరం నుంచి బిసంకటక్ వచ్చేశాడు. రోజులు గడుస్తున్నా తన భర్త తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన కుమారి అతని ఆచూకీ కోసం ఆరా తీసింది. స్వగ్రామంలో ఆటో నడుపుతున్నాడని తెలుసుకొని, తన అన్నయ్య సాయంతో శుక్రవారం రాత్రి బిసంకటక్ చేరుకుంది. శనివారం ఉదయాన్నే ఆటోస్టాండ్‌లో వెతకగా.. అక్కడ ఎదురైన సుమన్‌ను నిలదీసింది. తనతో రమ్మని ప్రాధేయపడగా, అతడు అంగీకరించలేదు. తనకు కొద్ది రోజు క్రితమే వేరే అమ్మాయితో వివాహం జరిగిందని చెప్పడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. అందరూ చూస్తుండగానే అతడి షర్ట్ కాలర్ పట్టుకొని బిసంకటక్ పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీనిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయనప్పటికీ సుమన్‌ను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు. చదవండి: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. -
మాటల మాంత్రికులు.. వలలో చిక్కామో అంతే
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్): నగరంలోని వివిధ ప్రాంతంలో సైబర్‌నేరగాళ్లు ముగ్గురినుంచి 4.20 లక్షలు వారి ఖాతాల్లోంచి లాగేశారు.దీంతో బాధితులు గురువా రం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► బొల్లారానికి చెందిన పవన్ పార్ట్ టైం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి ఆన్లైన్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం వద్దు.. వ్యాపారంలో లాభాలు ఇప్పిస్తానని నమ్మించి పలు దఫాలుగా రూ. 1.60 లక్షలు తీసుకొని మోసం చేశాడు. ► ఇన్‌స్ట్రాగామ్‌లో కనిపించిన ‘మార్కెటింగ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్’ అనే యాడ్ చూసి సికింద్రాబాద్‌కు చెందిన శివాని వాట్సప్ ద్వారా సంప్రదించింది. సైబర్ నేరగాడు చెప్పినట్లు విని పలు దఫాలుగా రూ.1.20లక్షను పంపి మోసపోయింది. ► ఆసిఫ్‌నగర్‌కు చెందిన వీణవాణికి ఓ వ్యక్తి పరిచమైయ్యాడు. ‘టూ ఎఫ్‌ఏయూక్యూ’ అనే ఇన్వెస్ట్మెంట్ యాప్‌ను ఇన్స్టాల్ చేపించి రూ.1.50లక్షను పెట్టుబడి పెట్టించాడు. లాభాలు కనిపిస్తున్నా తీసుకోకపోవడానికి రాకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ► స్నేహితుడు తన ఫొటోలను అడ్డుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని మలక్‌పేటకు చెందిన బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ముగ్గురు యువకులు, మాటలతో మాయ.. ఆపై
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ మొదటి వేవ్ ప్రభావంతో అమలైన లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు యువకులు నేరబాట పట్టారు. రుణాల పేరుతో ఎర వేసి డబ్బులు స్వాహా చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడి ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి ఈ త్రయాన్ని అరెస్టు చేసి మంగళవారం నగరానికి తీసుకువచ్చారు. కాల్సెంటర్లో పని చేసి.. ► ఢిల్లీకి చెందిన విజయ్ ధావన్, కపిల్ ఠాకూర్, అభయ్ వర్మ డిగ్రీలు పూర్తి చేసి అక్కడి ఓ కాల్ సెంటర్లో టెలీ కాలర్లుగా పని చేశారు. స్నేహితులుగా మారిన ఈ ముగ్గురు గతేడాది లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. దీంతో సైబర్ నేరాలు చేయాలని నిర్ణయించుకున్న వీరు తమకు తెలిసిన టెలీ కాలింగ్ విధానాన్నే ఎంచుకుని రంగంలోకి దిగారు. బోగస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన డబ్బు కూడా లేకపోవడంతో అవివాహితుడైన విజయ్ ఇంట్లోనే సెట్ చేసింది. అక్కడ నుంచి దేశ వ్యాప్తంగా పలువురికి కాల్స్ చేస్తూ బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా చెప్పుకొన్నారు. ► సికింద్రాబాద్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి వీరి వలలో పడ్డాడు. ఇతడికి ఫోన్ చేసిన కేటుగాళ్లు తక్కువ వడ్డీకి రూ.10 లక్షల రుణం ఇస్తామంటూ ఎర వేశారు. రుణం దరఖాస్తు కోసమంటూ బాధితుడి నుంచి కొన్ని గుర్తింపు పత్రాలు వాట్సాప్ ద్వారా సేకరించారు. ఆపై రుణం మంజూరైందని చెబుతూ.. కొన్ని చార్జీలు చెల్లించాలంటూ అతడి వద్ద నుంచి డబ్బు వసూలు చేశారు. లోన్ మొత్తం బ్యాంకు ఖాతాలో పడాలంటే ముందుగా మూడు కిస్తీలు అడ్వాన్స్‌గా చెల్లించాలని మరికొంత గుంజారు. చెల్లిస్తున్న చార్జీల్లో కొన్ని రిఫండ్ వస్తాయంటూ చెప్పడంతో సికింద్రాబాద్ వాసి డబ్బు చెల్లిస్తూ పోయారు. ► ఇలా రూ.9,44,351 చెల్లించినా తన ఖాతాలో డబ్బు పడకపోవడం, మరికొంత చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు కోరడంతో బాధితుడు అనుమానించారు. ఈ ఏడాది జూన్‌లో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారుల సాంకేతిక ఆధారాలతో నిందితులు ఢిల్లీలో ఉన్న ట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ముగ్గురినీ అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.2 లక్షల నగదు, 8 సెల్ఫోన్లు, మోసాలు చేయడానికే తెరిచిన పది బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పాస్‌బుక్స్, చెక్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో వీళ్లు ఎంత మందిని మోసం చేశారో తెలుసుకోనున్నారు. -
తోడు కావాలని కాల్ చేస్తే.. పని పూర్తి చేసి ఫోన్ స్విచ్ఛాఫ్
సాక్షి,హిమాయత్‌నగర్(హైదరాబాద్): ‘మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? మీకు తోడు కావాలా? ఇదిగో ఈ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయండి స్నేహితులతో గంటల తరబడి మాట్లాడుకోండి’ అంటూ సికింద్రాబాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి ఓ మెసేజ్ వచ్చింది. కుమారులు, కుమార్తెలు అంతా దుబాయిలో ఉంటున్నారు. ఆయనను పలకరించే వారెవరూ లేకపోవడంతో తోడు కోసం ఆశపడి సైబర్ నేరగాడు చెప్పినట్లు చేశాడు. అంతే.. పలు దఫాలుగా రూ.7.8 లక్షలు లూటీ అయ్యాయి. తన డబ్బులు తిరిగి రావాలంటే మరో రూ.3 లక్షలు ఇస్తేనే రూ.7.8 లక్షలు ఇస్తామన్నారు. దీంతో ఆయన మరో రూ.3 లక్షలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తను మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రాఫిట్ వస్తుందని నమ్మించి.. మొగల్పురాకు చెందిన సయ్యద్ సోహేల్ మొయినుద్దీన్‌కు కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయమయ్యా డు. తాను ‘డబ్ల్యూపీఇన్వెస్ 66.కామ్’లో ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాన్నాడు. దీంతో మొయినుద్దీన్ కూడా ఆ యాప్‌లో తొలుత రూ.10 వేలతో రిజిస్టర్ అయ్యా డు. లాభం రూ.10వేలు కనిపించింది. దీంతో ఆ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తే రావట్లేదు. నా డబ్బులు నాకు కావాలని తన స్నేహితుడికి చెప్పడంతో అవి రావాలంటే ఇంకా వ్యాపారం చేస్తున్నట్లుగా ఆ యాప్‌లో చూపించుకోవాలన్నాడు. ఇలా పలు దఫాలుగా రూ.2.40 లక్షలను కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రెడిట్ కార్డు గిఫ్ట్ పేరుతో.. కాచిగూడకు చెందిన దేవకీనందన్కు క్రెడిట్ కార్డు నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ కార్డుపై మీకు రూ.5వేల బహుమతి వచ్చింది. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమన్నారు. ఆమె ఓటీపీ నంబర్ చెప్పడంతో ఆ కార్డులో ఉన్న రూ.లక్ష లిమిట్‌ను క్షణాల్లో స్వైప్ చేశాడు. దీంతో బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
నాకు కస్టమ్స్ అధికారులు తెలుసు, మంచి అవకాశం వదులుకోకండని..
హిమాయత్‌నగర్: నాకు తెలిసిన కస్టమ్స్ అధికారులు ఉన్నారు. వారి వద్ద పట్టుబడిన బంగారం తక్కువకు వస్తుంది. ఇది మంచి అవకాశంగా తీసుకోవాలంటూ నగర వాసి టి.మల్లికార్జున్‌రెడ్డికి టోకరా వేశాడు బెంగుళూరుకు చెందిన కిరణ్ అనే వ్యక్తి. కిరణ్, మల్లికార్జున్‌లు కొంతకాలంగా స్నేహితులు. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తించే కస్టమ్స్ అధికారులతో పరిచయాలు ఉన్నాయన్నాడు కిరణ్. దుబాయి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ బంగారం తెచ్చి ఇక్కడ పట్టుబడ్డ వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం అధికారులు బయట రేటు కంటే తక్కువకు ఇస్తారని నమ్మించాడు. పదేపదే ఫోన్లు చేసి బంగారం కొనగోలు చేయమనడంతో 15 తులాల బంగారు ఆభరణాలకు గాను మల్లికార్జున్‌రెడ్డి కిరణ్‌కు రూ.4లక్షలు పంపాడు. డబ్బు పంపినాక బంగారం ఇవ్వకపోగా.. ఫోన్లకు కూడా సరిగ్గా స్పందించకపోడంతో కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని మంగళవారం బాధితుడు మల్లికార్జున్‌రెడ్డి సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బ్యాంకులకు రూ200 కోట్లు టోకరా వేసిన నిండుతుండి అరెస్ట్
-
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
గోకవరం(తూర్పుగోదావరి): ప్రేమ పేరుతో యువతిని మోసగించిన యువకుడిపై గోకవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని గుమ్మళ్లదొడ్డికి చెందిన 17 ఏళ్ల యువతిని అదే గ్రామానికి చెందిన సూరంపూడి విజయ్‌కుమార్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి, నమ్మించి కొంతకాలం లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ముఖం చాటేశాడు. దీనిపై ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.చెన్నారావు తెలిపారు. సంఘటనపై రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా నార్త్‌జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మంగళవారం గ్రామంలో విచారణ నిర్వహించారు. -
కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్
అమలాపురం టౌన్ (తూర్పుగోదావరి): ఆ యువకుడికి ఆ రోజు రాత్రి పెళ్లి. మధ్యాహ్నం తన ఇంటి వద్ద బంధుమిత్రులకు భోజనాలు పెట్టుకున్నాడు. కొద్దిసేపటిలో వధువు ఇంటికి బంధువర్గంతో బయలుదేరనున్నాడు. ఇంతలో ఓ గిరిజన మహిళ వచ్చి అతడికి, తనకు ఆరేళ్ల కిందటే పెళ్లయిందని.. తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడితో ఆగలేదు. వరుడి ఇంటికి, ఆ వెంటనే వధువు ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. దీంతో వధువు కుటుంబీకులు సంకట స్థితిలో పడ్డారు. మొత్తం మీద పెళ్లి ఆగిపోయింది. వరుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన భోగిశెట్టి వీర వెంకట అయ్యప్పస్వామి రాజమహేంద్రవరంలో ఓ టీవీ చానల్ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతడికి అయినవిల్లి మండలం విలసకు చెందిన దగ్గర బంధువైన ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. వీరి వివాహం శుక్రవారం రాత్రి వధువు ఇంటి వద్ద జరగాల్సి ఉంది. శుక్రవారం ఉదయం అయ్యప్పస్వామి సొంతూరు చల్లపల్లిలో బంధుమిత్రులకు భోజనాలు పెట్టుకుని, వేడుక చేసుకున్నాడు. సాయంత్రం బంధువర్గంతో వధువు ఊరు విలసకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల నుంచి రెండేళ్ల బాలుడితో ఓ గిరిజన మహిళ, తన బంధువులతో కలిసి కారులో ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. ఆమె ఆరోగ్య శాఖలో ఉద్యోగి. అయ్యప్పస్వామి తన భర్తని, తమకు ఓ కుమారుడు కూడా పుట్టాడని, అతడికి ఇప్పుడు వేరే పెళ్లి జరుగుతోందని, దీనిని ఆపాలని అభ్యర్థించింది. అయితే ఇందుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆమె, బంధువులు నేరుగా చల్లపల్లి వెళ్లారు. అయ్యప్పస్వామి బంధువులకు విషయం చెప్పారు. అక్కడి నుంచి విలస వెళ్లి వధువు ఇంట్లోనూ ఇదే విషయాన్ని వివరించారు. ఈ వివాదంతో మొత్తం మీద పెళ్లి ఆగిపోయింది. ఇప్పటికే ఆ గిరిజన మహిళ అయ్యప్పస్వామిపై రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. అమలాపురంలో బహుజన మహిళా శక్తి సంస్థ జాతీయ అధ్యక్షురాలు కొంకి రాజామణిని కూడా ఆశ్రయించింది. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డిని కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టింది. ఆ గిరజన మహిళ శుక్రవారం తమ స్టేషన్‌కు వచ్చి అయ్యప్పస్వామి పెళ్లి ఆపాలని కోరిందని, అతడు ఆమె భర్తని తగిన ఆధారాలు చూపిస్తేనే చర్యలు చేపడతామని చెప్పానని ఉప్పలగుప్తం ఎస్సై వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. ఆమె వారి పెళ్లి ఆధారాలు చూపించలేదని అన్నారు. దీంతో ఆమె, ఆమెతో పాటు వచ్చిన బంధువులు చల్లపల్లిలోని అయ్యప్పస్వామి ఇంటికి వెళ్లారని చెప్పారు. ఆ గిరిజన మహిళతో గతంలో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని.. అయితే తమ ఇద్దరికీ పెళ్లి జరగలేదని.. కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వరుడు అయ్యప్పస్వామి ‘సాక్షి’కి చెప్పారు. చదవండి: ‘యాస్’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు గుంత తవ్వేందుకు ప్రయత్నం.. వెలుగులోకి షాకింగ్ నిజం -
‘ఆరేళ్ల పాటు డేటింగ్ చేశాం..సల్మాన్ మోసం చేశాడు’
కండలవీరుడు సల్మాన్‌ఖాన్ పలువురు అగ్ర హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వారిలో సల్మాన్ మొదటి గర్ల్‌ఫ్రెండ్‌గా అందరికి గుర్తొచ్చేది మాత్రం పాకిస్తాన్ నటి సోమీ అలీ. ఆమె హీరోయిన్గా కంటే సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్‌గానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 20 ఏళ్ల క్రితం తామిద్దరం ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని, ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నామని, అయితే సల్మాన్ తనను మోసం చేశారని, అందుకే సల్మాన్ నుంచి విడిపోయానని ఆరోపించింది. అప్పటినుంచి ఎవరి లైఫ్‌లో వాళ్లు మూవ్ ఆన్ అయ్యామని తెలిపింది. 'నిజానికి హీరోయిన్ అవ్వాలనే ఆశతో పరిశ్రమకు రాలేదని, కేవలం సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆశయంతోనే ఇండియాకు వచ్చాను. 'మైనే ప్యార్ కియా' సినిమా చూసి సల్మాన్‌తో ప్రేమలో పడ్డాను. దాదాపు ఆరేళ్ల పాటు ఇద్దరం డేటింగ్ చేశాం. ఆ సమయంలో సల్మాన్ ఇంటికి చాలా సార్లు వెళ్లేదాన్ని. వాళ్ల పేరెంట్స్ చాలా మంచివారు. అందిరిని సమానంగా ఎలా చూడాలో వాళ్ల దగ్గరనుంచి నేర్చుకున్నా. వాళ్లు మతం గురించి పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. ప్రతీ వ్యక్తిని సమానంగా ట్రీట్ చేసేవారు. ఎవరు ఇంటికి వెళ్లినా ఎంతో ఆప్యాయంగా చేరదీసేవాళ్లు. ముఖ్యంగా సల్మా ఆంటీ(సల్మాన్ ఖాన్ మదర్)చాలా స్వీట్. వారి నుంచి చాలా నేర్చుకున్నా. కానీ సల్మాన్ నుంచి మాత్రం నేను ఒక్క విషయం కూడా నేర్చుకోలేదు' అని చెప్పుకొచ్చింది. ముంబైలో మోడలింగ్‌లో చేస్తుండగానే సోమీకి హీరోయిన్గా అవకాశం వచ్చింది.1992లో బులండ్ అనే చిత్రంతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన ఖిలాడీ మూవీ సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన అంత్(1994), కృష్ణ అవతార్(1993)తో పాటు ‘అవో ప్యార్ కరేనా’(1994) చిత్రాల్లో నటించిన సోమీ.. సల్మాన్‌తో డేటింగ్ చేశారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట అప్పట్లో హోట్టాపిక్గా ఉండేది. అయితే సల్మాన్‌తో బ్రేకప్ తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టిన ఆమె `నో మోర్ టియర్స్` అనే ఎన్జీఓని నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ సినిమాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా, తనకు మూవీస్‌పై ఆసక్తి లేదని, మళ్లీ ఇండస్ర్టీలోకి వచ్చే ఆలోచనే లేదని తెలిపింది. గతంలో కత్రినా కైఫ్, సంగీత బిజ్లాని, ఐశ్వర్య రాయ్ వంటి టాప్ హీరోయిన్లతో సల్మాన్ ప్రేమాయణం నడిపారు. ప్రస్తుతం మోడల్ యూలియా వంతూర్‌తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్ టాక్. చదవండి : ‘హీరోయిన్ అవ్వాలని రాలేదు.. సల్మాన్ కోసమే వచ్చాను’ సల్మాన్ మొదటి జీతం: మరీ అంత తక్కువా? -
కలెక్టర్ పీఏను.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ
హస్తినాపురం: తాను కలెక్టర్ పీఏగా పనిచేస్తున్నానని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఎంతో మందిని మోసం చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం హైకోర్టు కాలనీకి చెందిన ఎల్లంకి బ్రహ్మచారికి కొత్తపేట హుడా కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యా పారి సుబ్రమణ్యంతో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో తాను కలెక్టర్ పీఏగా పనిచేస్తున్నా నని, తాను డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని సుబ్రమణ్యం మాయమాటలతో బ్రహ్మచారిని నమ్మించాడు. దీంతో ఆయనతోపాటు మరో పది మంది ఇళ్లు వస్తాయనే ఆశతో 2016లో రూ.27 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడు బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు సుబ్రమణ్యం ఉంటున్న కొత్తపేట హుడా కాంప్లెక్స్‌కు వెళ్లిచూడగా అక్కడ నుంచి వెళ్లిపోయాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ పత్రాలతో మాయ.. రూ. 7 కోట్లు కాజేసిన ముఠా
సాక్షి, సిటీబ్యూరో: వివాదంలో ఉన్న ప్రభుత్వ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, నగరానికి చెందిన ఓ బిల్డర్‌కు రూ.7 కోట్లకు విక్రయించిన కేసులో నిందితుల్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్కారుది కాగా... తమదే అంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులూ క్లెయిమ్ చేస్తున్నారు. ఓపక్క ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా జరిగిన మోసం బయటపడింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లో ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రధాన కార్యాలయం ఎదురుగా 9 ఎకరాల 17 గుంటల స్థలం ఉంది. ఇది తమదేనంటూ తిరుమల రాంచందర్ రావు, దర్పల్లి సంపత్, తిరుమల హరిలు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ ముగ్గురూ కలిసి ఆ స్థలంతో 2 ఎకరాలు విక్రయిస్తామని, మిగిలిన స్థలంలో అపార్ట్మెంట్లు నిర్మించడానికి ఇస్తామంటూ జుబ్లీహిల్స్‌కు చెందిన మిహిరా బిల్డ్‌కాన్ మేనేజింగ్ పార్టనర్ సి.సుఖేష్ రెడ్డిని కలిశారు. ఆ స్థలానికి సంబంధించి తయారు చేసిన నకిలీ పత్రాలు ఆయనకు అందించారు. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన సుఖేష్ కొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో రూ.7 కోట్లు చెల్లించి పత్రాలు రాసుకున్న సుఖేష్ 2 ఎకరాలు ఖరీదు చేసేలా, మిగిలింది అభివృద్ధి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఆర్ధిక లావాదేవీలు కమలేశ్వర్‌రావు, ఈగ మల్లేశం, సుభాష్ చౌదరీల సమక్షంలో జరిగాయి. సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైన సుఖేష్ అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో స్థలం పత్రాలపై అనుమానాలు వ్యక్తమై ఆరా తీయగా అవి నకిలీవిగా తేలింది. దీంతో ఆయన జరిగిన మోసంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి నిందితులు రాంచందర్, సంపత్, హరిలను అరెస్టు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. చదవండి: మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు.. -
జూలియెట్ ఆత్మహత్య : సోదరుడే ముంచేశాడు
సాక్షి, సిటీబ్యూరో: నమ్మిన సమీప బంధువుకే టోకరా వేసి, ఆమె ఖాతా నుంచి రూ.5 లక్షలు కాజేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమ పరిధిలో నమోదైన సైబర్ నేరంలో ఈ చర్య తీసుకున్నామని, ఆత్మహత్య కేసును నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో జూలియెట్ అనే మహిళ ఒంటరిగా ఉండేది. ఆమె దగ్గర కుటుంబీకులు లేకపోవడంతో వరుసకు సోదరుడయ్యే జోసెఫ్ చేదోడు వాదోడుగా ఉండేవాడు. తనకు డబ్బు అవసరమైనప్పుడు ఆమె జోసెఫ్‌కు తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పడంతో పాటు డెబిట్‌కార్డు ఇచ్చి పంపేది. దీనిని ఆసరాగా చేసుకున్న అతడు సొంతానికి కొంత డబ్బు డ్రా చేసుకున్నాడు. ఆమె ఫోన్లో ఉన్న సదరు బ్యాంకు యాప్ ద్వారా మరికొంత మొత్తాన్ని తన ఖాతాలోకి మళ్లించుకుని కాజేశాడు. ఇలా మొత్తం రూ.5 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి మాయమైనట్లు జనవరిగుర్తించిన జూలియెట్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా గత నెల 13న ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసును దర్యాప్తు చేసిన అధికారులు జోసెఫ్‌ను నిందితుడిగా తేల్చారు. బుధవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
‘డబ్బు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతాం’
నగరం(రేపల్లె): ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన అక్కల వీరారెడ్డి ఇంటి ఎదుట బాధితుడి కుటుంబం బైఠాయించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు కథనం మేరకు.. మండలంలోని పూడివాడ గ్రామానికి చెందిన అక్కల వీరారెడ్డి, సీబీసీఐడీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.22 లక్షలు డబ్బు తీసుకున్నాడు. అప్పటి నుంచి అదుగో రేపు మాపు అంటూ వీరారెడ్డి కాలం నెట్టుకొచ్చాడు. దీంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు చెప్పారు. డబ్బులు ఇచ్చే వరకు తిరిగి వెళ్లేది లేదని ఇంటి ఎదుట భార్యతో సహా కూర్చున్నారు. మాకు డబ్బులు ఇవ్వని పక్షంలో కుటుంబం మొత్తం పురుగు మందు తాగి ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని ఆవేదన భరితంగా చెప్పారు. అపార్టుమెంట్లో ప్లాట్ ఇప్పిస్తానని.. విజయవాడకు చెందిన తలగడదీవి రత్నకుమారి నుంచి అపార్టుమెంట్లో ప్లాట్ ఇప్పిస్తానని మార్చి 2020లో రూ.4లక్షలు తీసుకుని మోసగించాడని వాపోయారు. పేదలమైన మావద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని, డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా వీరారెడ్డి పలు చోట్ల ఛీటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నగరం మండలం ఎస్ఐ వాసును వివరణ కోరగా తమకు ఎటుంటి ఫిర్యాదు అందలేని తెలిపారు. చదవండి: ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు.. డెత్‌నోట్ రాసి.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య -
‘గణేష్ లేకపోతే నేను బతకలేను’
సాక్షి, చిత్తూరు : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పలమనేరు పెద్దపంజాని మండలానికి చెందిన శ్రావణి, గణేష్‌లు గత ఆరేళ్లు ప్రేమించుకుంటున్నారు. బెంగళూరులో కలిసి సహజీవనం చేశారు. కరోనా సమయంలో గణేష్ సొంతగ్రామానికి వెళ్లాడు. కొద్ది రోజుల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్నప్రియురాలు శ్రావణి రెండు రోజులుగా ఆందోళన దిగారు. గణేష్ తనకు కావాలని, ఆయన లేకుంటే బతకలేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు శనివారం ఆమె వీడియో సెల్ఫీ వీడియోని మీడియాకు విడుదల చేశారు ‘నేను గణేష్ ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. పెళ్లికి ముందు రోజు కూడా నాతో రెండున్నర గంటల సేపు మాట్లాడడం జరిగింది. నువ్వు లేకుండా నేను బతకలేను అనేసి నాతో చెప్పాడు. కానీ రాత్రికి రాత్రే ఏం జరిగిందో తెలియడం లేదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన అమ్మనాన్నలు ఏం చెప్పి తనని పెళ్లి ఒప్పించారో అర్థం కాలేదు. నాకు గణేష్ కావాలి. గణేష్ లేకపోతే నేను బతకలేను. చావే నాకు శరణ్యం’ అంటూ శ్రావణి కన్నీంటి పర్యంతమయ్యారు. -
అమ్మ దొంగా! చిల్లర అడిగి మరీ..
థానే : కిరాణా వ్యాపారస్తులే టార్గెట్‌గా దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నలసోపరాకు చెందిన మనీష్ అంబేకర్ గొంతు మార్చి మహిళా గొంతుతో చుట్టుపక్కల కిరాణా షాపులకు ఫోన్ చేసేవాడు. కొంత సామాగ్రిని ఆర్డర్ చేసి ఇంటికి తీసుకురావాలని దగ్గరలో ఉన్న ఓ ఇంటి అడ్రస్ చేప్పేవాడు. అలాగే సామాగ్రితో పాటు తనకు రెండు వేల రూపాయల చిల్లర కావాలని అడిగేవాడు. (చదవండి : 25 కత్తిపోట్లు, కామాంధుడు హతం!) ఎలాగో సామాగ్రి కొన్నారు కదా చిల్లర ఇద్దామని రూ.2000 లకు సరిపడా చేంజ్ ఇచ్చి డెలివరీ బాయ్‌ని పంపేవారు. ఆ డెలివరీ బాయ్ చెప్పిన అడ్రస్‌కు రాగానే మనీష్ ప్రత్యేక్షమయ్యేవాడు. మీకు ఫోన్ చేసిన మహిళ నన్ను పంపిదంటూ.. సామాగ్రి తీసుకునేవాడు. అలాగే రెండువేల చిల్లర కూడా ఇవ్వమని అడిగేవాడు. డెలివరీ బాయ్ చేంజ్ ఇవ్వగానే మహిళను అడిగి రెండు వేల రూపాయల నోటు తీసుకొస్తానని చెప్పి ఉడాయించేవాడు. అలా ఆ ఏరియాలో పలువురు కిరాణాదారులను, బంగారు షాపు , మెడికల్ షాపు యజమానులకు టొకరా పెట్టాడు. దీంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పక్కా ప్లాన్‌తో అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి లక్షా 60 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. -
రెట్టింపు పేరుతో నట్టేట ముంచి..
పిఠాపురం(తూర్పుగోదావరి): చెల్లించిన సొమ్ముకు రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ ఓ కంపెనీ ప్రజలను నమ్మించి మోసం చేసింది. ఎస్సై అబ్దుల్ నబీ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన కేశబోయిన సతీష్‌బాబు 2018లో పిఠాపురంలో సిరి ఎంటర్‌ప్రైజస్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. నెలకు రూ.500 చొప్పున 20 నెలల పాటు (రూ.పదివేలు) చెల్లిస్తే ప్రతి నెలా లక్కీడ్రా తీసి దానికి రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ నమ్మబలికాడు. దీంతో పిఠాపురం దాని పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రూ.పదివేలు చొప్పున చెల్లించారు. నెలలు గడుస్తున్నా ఏవిధమైన గిఫ్ట్‌లు ఇవ్వక పోవడంతో అనుమానం వచ్చి గురువారం రాత్రి ఆ కంపెనీకి చెందిన రిప్రజెంటేటివ్ రాహుల్‌ను పట్టుకున్నారు. తాము మోసపోయినట్టు గ్రహించి సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం ఉదయం నుంచి పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్ వద్ద బారులు తీరారు. పోలీసులు ఆ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొదుపు పేర.. మోసం!
సాక్షి, నల్లగొండ: మూడేళ్ల పాటు పొదుపు చేసుకుంటే అదనంగా డబ్బులు వస్తాయి అంటూ వృద్ధులకు మాయ మాటలు చెప్పాడు ఓ పోస్టల్ అధికారి. ఆయన మాటలు నమ్మి దాదాపు వంద మంది వృద్ధులు పెన్షన్ డబ్బులతో మరికొన్ని కలిపి ఇచ్చారు. ఇలా పదినెలలుగా కడుతూ వస్తున్నారు. సదరు పోస్టల్ అధికారి తీసుకెళ్లి జమ చేస్తున్నానని ఆ వృద్ధులను నమ్మించాడు. మూడు నెలలుగా సదరు అధికారి రాకపోవడంతో అనుమానం వచ్చి పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా మీ అకౌంట్లలో ఎటువంటి డబ్బులు జమ కాలేదు.. డబ్బులు వసూలు చేసిన పోస్టల్ అధికారిని విధులనుంచి తొలగించామని చెప్పడంతో వృద్ధులు లబోదిబోమని కన్నీటి పర్యంతమయ్యారు. తాము మోసపోయామని గ్రహించి సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ముందు గోడు వెల్లబోసుకున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కనగల్ మండలం బోయినపల్లి గ్రామంలో పోస్టల్ అధికారి ప్రసాద్ ప్రతి నెలా వివిధ రకాల సామాజిక పెన్షన్లను పంపిణీ చేసేవాడు. ఈ క్రమంలో పింఛన్ తీసుకుంటున్న వృద్ధులను మాయమాటలతో నమ్మించాడు. ‘ప్రతి నెలా పోస్టాఫీస్‌లో రూ.వెయ్యి చొప్పున మూడేళ్ల పాటు జమ చేసుకుంటే మీరు కట్టిన డబ్బులతో కలిపి అదనంగా మొత్తం రూ.50వేలు వస్తాయి.. మీరు చేతగాని వేళల్లో హాయిగాబతికేందుకు పనికి వస్తాయి’ అంటూ మాటలు చెప్పి వారి నుంచి పొదుపు కట్టించాడు. గ్రామంలో దాదాపు వంద మంది మహిళలు రూ.500 నుంచి రూ.3వేల వరకు ప్రతి నెలా పొదుపు డబ్బులు కడుతూ వస్తున్నారు. ప్రతి నెలా పెన్షన్లు అక్కడే వారికి ఇవ్వడం, ఇచ్చిన డబ్బులనే తిరిగి పొదుపు పేర పోస్టల్ అధికారి ప్రసాద్ లబ్ధిదారులనుంచి కట్టించుకున్నాడు. పోస్టాఫీసుల్లో కొందరికి అకౌంట్ బుక్‌లు తీశాడు. ఆ బుక్కుల్లోనే ప్రతి నెలా వారు కట్టిన డబ్బులకు సంబంధించి బుక్కులో ఎంత కట్టారు, ఎంత జమ అవుతుంది రాస్తూ వస్తున్నాడు. కొందరి మహిళల మొత్తం పొదుపు చేసుకున్నవి రూ.5వేల నుంచి రూ.40 వేల వరకు ఉన్నాయి. మూడు నెలలుగా రాని పోస్టల్ అధికారి మూడు మాసాలుగా వృద్ధాప్య పెన్షన్లు పంచేం దుకు ప్రసాద్ రావడం లేదు. అతనికి ఫోన్ చేసినా ఫోన్ కలవడంలేదు. కొత్త వ్యక్తులు వస్తున్నారు. దీంతో కనగల్ మండల కేంద్రంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి తమ పాస్ బుక్‌లలో ఉన్న డబ్బులు కావాలని అడిగారు. వాటిని పరిశీలించిన అధికారులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పడంతో తెల్లముఖం వేశారు. ‘ప్రతి నెలా మీరు పంపిన వ్యక్తే వచ్చి ఒక చేత్తో పెన్షన్లు ఇచ్చి మరో చేత్తో పొదుపు కట్టించుకున్నాడు... డబ్బులు లేవంటే ఎలా’ అని ప్రశ్నించారు. ‘అతన్ని ఉద్యోగంనుంచి తీసేశాం. మీరు చండూరు పోస్టాఫీస్‌కు వెళ్లి అడగండి’ అని సలహా ఇచ్చారు. దీంతో వృద్ధులు చండూరు వెళ్లి అడగగా, పరిశీలించిన అధికారులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పారు. కేవలం మీ దగ్గర ఉన్న పాస్‌బుక్కుల్లో రాశాడు కానీ అకౌంట్లలో జమ చేయలేదని తెలిపారు. దీంతో మోసపోయామని తెలుసుకుని సింగం లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్‌ను కలిసి గోడును వెల్లబోసుకున్నారు. పోస్టల్ అధికారి మోసం చేశాడని, న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. జేసీ.. వెంటనే పోస్టల్ సూపరింటెండెంట్‌ను ఫోన్లో సంప్రదించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వారు ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పూర్వాపరాలు తెలుసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఆదేశించారు. మోసం చేశాడు.. పెన్షన్ డబ్బులు ఇచ్చే వ్యక్తే కదా ఆయనే పొదుపు కట్టించుకుంటే మా డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అనుకున్నాం. నమ్మకంతో పొదుపు చేశాం. పాస్ పుస్తకాల్లో డబ్బులు కట్టించుకున్నట్లు రాశాడు. పోస్టాఫీస్ వాళ్లు డబ్బులు లేవంటున్నారు. వచ్చిన పెన్షన్ అంతా తినీ తినక పొదుపు చేసుకుంటే మోసం చేశాడు. – దేవకమ్మ, బోయినపల్లి, కనగల్ ఈడంగ ఇచ్చి ఆడంగ తీసుకున్నడు పెన్షన్ డబ్బులు ఈడంగ ఇచ్చి ఆడంగ తీసుకున్నడు. పొదుపు చేసుకుంటే మరిన్ని డబ్బులు వస్తాయన్నాడు. డబ్బులు తీసుకుందామని వెళ్తే వారు లేవంటున్నారు. మాకు న్యాయం చేయాలి. – జెట్టి వీరమ్మ, బోయినపల్లి, కనగల్ మాకు న్యాయం చేయాలి గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ డబ్బులు దాచుకుని పొదుపు చేసుకుంటే పోస్టల్ అధికారి మోసం చేశాడు. మా డబ్బులు తీసుకొని పోస్టాఫీస్‌లో కట్టలేదు. మాకు మూడు నెలల నుంచి డబ్బులు తీసుకెళ్తలేడని పోస్టాఫీస్‌కు వెళ్తే ఆయన లేడని తెలిసింది. డబ్బులు ఇవ్వమంటే కట్టలేదంటున్నారు. డబ్బులు స్వాహా చేసిన అధికారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. – సైదమ్మ, బోయినపల్లి, కనగల్ -
డబ్బులిస్తే డబుల్ ఇప్పిస్తాం..
సాక్షి, అశ్వారావుపేట: ‘మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో డబుల్ బెడ్రూం ఇల్లు కావాలా? అయితే మాకు ఒక్క రూ.2,500 చెల్లించండి. వాటితోపాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్ఐడీకార్డు జిరాక్స్‌లు కూడా ఇవ్వండి. అంతే కొద్ది రోజుల్లో మీకు ఆ పథకంలో డబుల్ బెడ్రూం వచ్చినట్లే’ అంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొందరు వ్యక్తులు ప్రజల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఈ దందా కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే జరిగిందనుకుంటే పట్టణ ప్రాంతాలకు కూడా పాకింది. కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, ములకలపల్లి మండలాలతోపాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో ఇలాంటి దందాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దందాలో ఉమ్మడి జిల్లా వాసులతోపాటు ఏపీలోని విజయవాడ, గుంటూరుకు చెందిన కొందరు వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. పీఎం ఆవాస్ యోజన పేరిట.. ఈ మాయగాళ్లు ఏకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్నే బూచీగా చూపి, కేవలం రూ.2,500 చెల్లించి, ఆధార్, రేషన్, ఓటర్ కార్డు ఇస్తే చాలు ఇరవై రోజుల్లోనే డబుల్ బెడ్రూం ఇల్లు కోసం రూ.3.50 లక్షలు మంజూరు చేయిస్తామని నమ్మబలికారు. కొద్ది మొత్తం డబ్బులకే సొంతింటి కల సాకారం చేసుకోవచ్చని గిరిజనులు, నిరక్షరాస్యులకు గాలం వేయడంతో వారు సులభంగా వీరి మాటలను నమ్మారు. సొంతింటి కల నేరవేరుతుందని ఆశతో ఈ మాయగాళ్ల వలలో పడిన బాధితులు ఒకొక్కరు రూ.2500 చొప్పున, మరికొంత మంది రూ.2000, ఇంకొందరు రూ.1,500 చొప్పున కట్టేశారు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగిన ఈ దందాలో ఒక్క అశ్వారావుపేట మండలంలోనే 26 గ్రామ పంచాయతీల్లో ఈ తరహా బాధితులు దాదాపు 900 మంది వరకు ఉన్నారు. ఇక్కడే కాకుండా ములకలపల్లి, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల్లో మరో వంద మందికిపైనే అంటే దాదాపు వెయ్యి మందికిపైనే బాధితుల సంఖ్య ఉంటుందని పేరు చెప్పేందుకు ఇష్టపడని అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ వసూళ్లు సుమారు రూ.30 లక్షల వరకు ఉండొచ్చని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా, ఇప్పుడు అధికారులు పీఎం ఆవాస్ యోజన పేరుతో సాగిన వసూళ్ల పర్వంపై విచారణ మొదలు పెట్టారు. ఏజెన్సీలోని అమాయక గిరిజనులే లక్ష్యంగా, ఈ అక్రమ వసూళ్ల దందాలో కొంతమంది ప్రజాప్రతినిధులు, కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడు ప్రధాన సూత్రధారులు కావడం విస్మయానికి గురిచేస్తోంది. ఊరూరా బాధితులే.. సొంతింటి కల, తక్కువ డబ్బులకు రెండు గదుల ఇల్లు వస్తుందనే ఆశతో నిరక్షరాస్యులు, అమాయకులైన గిరిజనులు ఈ దళారుల వలలో పడ్డారు. దీంతో అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం, తిరుమలకుంట, తిరుమలకుంటకాలనీ, తోగ్గూడెం, కొత్త మామిళ్లవారిగూడెం, ఉసిర్లగూడెం, దురదపాడు (దిబ్బగూడెం), అనంతారం, గాండ్లగూడెం, మల్లాయిగూడెం, దిబ్బగూడెం (రామన్నగూడెం), పండువారిగూడెం, తాటి నాగుల గుంపు, కావడిగుండ్ల, కొత్త కావడిగుండ్ల, కన్నాయిగూడెం, అశ్వారావుపేట గ్రామాల్లో అత్యధికంగా ఈ మాయగాళ్లను నమ్మి మోసపోయిన బాధితులు ఉన్నారు. ఈ గ్రామాల్లోనే దాదాపు 800 మంది వరకు ఉన్నారు. వారంతా దళారులకు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున చెల్లించారు. ప్రజా ప్రతినిధులు సైతం.. పీఎం ఆవాస్ యోజన పేరుతో సాగుతున్న ఈ దందా గురించి పూర్వా పరాలు, నిజానిజాలు తెలుసుకోకుండానే కొందరు సర్పంచ్‌లు సైతం ఈ మోసగాళ్లతో చేతులు కలిపి, డబ్బులు వసూలుకు పాల్పడ్డారు. ఏకంగా తమ సర్పంచ్‌లే డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇది నిజమేనని భావించిన గిరిజనులు నగదు కట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ వసూళ్ల దందాలో ఓ కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడితోపాటు మండలంలోని ముగ్గురు సర్పంచ్‌లు, ఓ ఉప సర్పంచ్‌కు తోడు ఓ గ్రామానికి చెందిన వ్యక్తి (విలేకరి ముసుగు) కూడా గిరిజనుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసనట్లు తెలిసింది. ఈ ముఠాలో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఉండటంతో గిరిజనలంతా వారిని నమ్మారు కదిలిన పోలీసులు.. ఈ దందా విషయం తెలుసుకున్న తహసీల్దార్ వి.రాఘవరెడ్డి.. వసూళ్ల పర్వంపై విచారణ చేపట్టాలని స్థానిక ఎస్ఐకి నాలుగు రోజుల కిందట లేఖ రాశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ ముఠా చేసిన వసూళ్లు, దోపిడీపై పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తున్నారు. వసూళ్లకు పాల్పడిన ముఠాలోని ఏడుగురి గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ సైతం స్పందించడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ వసూళ్ల పర్వం ఎక్కడెక్కడ జరిగింది.? దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరు.? వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి చేరాయి.? అసలు బాధితులు ఎందరు..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. మోదీ స్కీం అంటే డబ్బులు కట్టాను మోదీ స్కీం కింద రెండు గదుల ఇళ్లు ఇస్తారని చెబితే డబ్బులు కట్టాను. నా దగ్గర నుంచి ఆధార్, రేషన్, ఓటరు కార్డుల జిరాక్స్‌తోపాటు రెండు పాస్ ఫొటోలు కుడా తీసుకొని ఆన్లైన్ చేసి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. దీని కోసం రూ.2,500 కట్టాలని చెబితే గాండ్లగూడేనికి చెందిన వ్యక్తికి డబ్బులిచ్చాను. మా ఊరిలో 20 మంది దాకా ఇలానే ఇళ్ల కోసం డబ్బులు కట్టారు. ఎలాంటి రసీదులు ఇవ్వలేదు. - తాటి జయమ్మ, దిబ్బగూడెం ప్రజాప్రతినిధికి రూ.1,500 కట్టాను రెండు గదుల ఇల్లు వస్తుందని చెప్పడంతో మా ఊరి ప్రజా ప్రతినిధికి రూ.1,500 కట్టాను. డబ్బుతోపాటు రేషన్, ఆధార్, ఓటరు కార్డుల జిరాక్స్‌తోపాటు రెండు పాస్ ఫొటోలు ఇచ్చాను. ఆన్లైన్ చేసిన తర్వాత మాకు ఇల్లు వచ్చిందని చెబుతున్నారు. నాకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు. - ఉమ్మల పార్వతి, రెడ్డిగూడెం డబ్బులు కట్టి మోసపోయాం.. కేంద్ర ప్రభుత్వ స్కీంలో ఇల్లు ఇస్తామని చెప్పి, కొంత నగదు కట్టాలని చెప్పడంతో నేను కుడా మా ఊరి వాళ్లందరిలానే డబ్బులు ఇచ్చాను. మా ఊరిటో 30 మంది వరకు ఈ స్కీంలో ఇళ్ల కోసం రూ.1,500 చొప్పున ఇచ్చాం. -ఉమ్మల పద్మావతి, రెడ్డిగూడెం -
క్యాంపస్ ఉద్యోగాల పేరిట పని చేయించుకొని..
సాక్షి, ఆటోనగర్(విజయవాడ): అందరూ గ్రామీణ ప్రాంత వాసులే. సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపికయ్యారు. విద్యార్థులు ఎగిరి గంతేశారు. ఎంతో సంతోషంతో ఉద్యోగం చెరిపోయారు. ఉద్యోగం వచ్చిన సంతోషంలో సంస్థ యాజమాన్యం అడగ్గానే రూ.5 వేలు చెల్లించారు. నెలన్నరకే సంస్థ ఎత్తేశారు. ఈ ఘటన ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జవహర్ ఆటోనగర్ ఇండస్ట్రీయల్ మూడో రోడ్డులో ప్రో సాఫ్ట్ సొల్యూషన్స్ పేరుతో సంస్థను నడుపుతున్నారు. తిరువూరులోని శ్రీవాణి ఇనిస్టూట్యూట్ ఆఫ్ సైన్స్టెక్నాలజి వీరందరికి మార్చి 25న ఈ సంస్థ సభ్యులు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందులో నైపుణ్యత ఉన్నవారిని కొందరిని ఎంపిక చేసుకున్నట్లు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. ఆ తరువాత వీరందరూ ఎంపిక అయినట్లు కాల్ లేటర్లు ఇచ్చారు. దీంతో జూన్ 1 నుంచి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఈ విధంగా జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు పని చేయించుకున్నారు. గత నెల జీతం ఇవ్వమని ఆ సంస్థను అడిగితే అదిగో ఇస్తాం... ఇదిగో ఇస్తాం... అంటూ తీరా ఇప్పుడు సంస్థను మూసేస్తున్నామని చెప్పినట్లు ఇంజినీరింగ్ విద్యార్థులు వాపోతున్నారు. నెలన్నర నుంచి హాస్టల్లో.. నెలన్నర నుంచి హాస్టల్లో ఉంటూ సంస్థలో పనిచేస్తున్నారు. ఇప్పటికి హాస్టల్‌కు గాను రూ.10,000 ఖర్చు చేశారు. ఈ సంస్థలో కంప్యూటర్లు లేవు. వీరి వద్ద ఉన్న సెల్ ఫోన్‌ద్వారానే ప్రాజెక్ట్ వర్కు చేసినట్లు వాపోతున్నారు. మేము చెల్లించిన రూ.5 వేలు ఇవ్వాలని సంస్థను కోరామని, అయితే అందుకు సంస్థ నిరాకరించినట్లు బాధితులు లక్ష్మీతిరుపతమ్మ, లక్ష్మి చెప్పారు. వీరంతా జగ్గయ్యపేట, గంపలగూడెం, తిరువూరు నుంచి వచ్చిన వారే అధికం. ఈ విషయమై ఆ సంస్థ ప్రతినిధికి ‘సాక్షి’ ఫోన్ చేయగా ఆయన తల్లి లిఫ్ట్ చేసి మా అబ్బాయిపై రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని సమాధానం చెప్పారు. -
చంద్రబాబు దగాకోరు పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్
విజయనగరం మున్సిపాలిటీ : అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ సీఎం చంద్రబాబు సాగిస్తున్న దగాకోరు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. 2014 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, లేని పక్షంలో రూ.2వేల నిరుద్యోగ భృతి హమీ అమల్లో టీడీపీ నయవంచన తీరును నిరసిస్తూ యువగర్జన పేరిట వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో యువత విజయనగరం పట్టణంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి నుంచి ప్రారంభమైన ర్యాలీకి బెల్లాన చంద్రశేఖర్, నగర పార్టీ కన్వీనర్ ఆశపు వేణు, పార్టీ విజయనగరం మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్వీవీ రాజేష్, కేదారశెట్టి సీతారామ్మూర్తిలు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక రింగ్‌రోడ్ సాయిబాబా గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్, అయోధ్యామైదానంరోడ్, కోట జంక్షన్, మూడులాంతర్లు, గంటస్తంభం జంక్షన్, వైఎస్సార్ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్, ఎత్తుబ్రిడ్జి మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అక్కడ సీఎం చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ యువత నినదించారు. అనంతరం యువజన, విద్యార్ధి విభాగం నాయకులు ఎస్.బంగారునాయుడు, జి.ఈశ్వర్‌కౌషిక్, ఎంఎల్‌ఎన్‌రాజు, అల్లు చాణక్య, బోడసింగి ఈశ్వరరావు, గండ్రేటి సన్యాసిరావు, తాడ్డి సురేష్, పొట్నూరు కేశవ, కరకవలస అనిల్, బోనేల తరుణ్, తాళ్లపూడి పండు, కరణం రమేష్, తరుణ్‌లు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్‌కు అందజేశారు. యువతను మోసం చేశారు... 2014 ఎన్నికల్లో మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాలుగున్నరేళ్లపాటు యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం హమీలను విస్మరించి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో సారి యువతను మోసం చసేందుకు రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించారని బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. చంద్రబాబు మాటలను యువత నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 10 లక్షల మందికి రూపాయి చొప్పున నిరుద్యోగ భృతి ప్రకటించడం, రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల పోస్టులు భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్ఎన్ రాజు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్యలు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చినహమీల ప్రకారం రూ.2వేల నిరుద్యోగ భృతి మొత్తాన్ని నాలుగు సంవత్సరాల మూడు నెలల బకాయిలతో కలిపి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగుకి రూ.లక్షా 2వేల మొత్తాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని, ఔట్ సోర్సింగ్ నియామకాలను నిలిపివేయాలన్నారు. గ్రూప్–2ని గ్రూప్–1లో విలీనం చేయాలన్న ప్రతిపాదను విరమించుకోవాలన్నారు. వెంటనే ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగం నాయకులు జీవీ రంగారావు, జి.ఈశ్వర్‌కౌషిక్, నెలపర్తి రాజ్‌కుమార్, హర్షరాజు, అప్పుపైడి,ఆనంద్, మనోజ్, పి.కృష్ణ, జిక్కరాజు, నాని, కర్రోతు సంతోష్, కంకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు
విజయనగరం మున్సిపాలిటీ : ఎన్నికలకు ముం దు మాయమాటలు చెప్పి నిరుద్యోగ యువత ఓట్ల దక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారి ఆశలపై నీళ్లు చల్లారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తన నివాసం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తామని, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న తరువాత వారి జీవితాలతో ఆటలాడుకుంటోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరకొర నిధులతో నిరుద్యోగ యువతకు వెయ్యి రూపాయలు భృతి అంటూ ప్రకటనలు చేయడం కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. వయో పరిమి తిని 35 ఏళ్లకు పరిమితం చేయడం ద్వారా చాలా మంది నిరుద్యోగ యువతను అనర్హులుగా చేస్తున్నారన్నారు. పచ్చ చొక్కా నాయకులకే ఆ భృతిని పరిమితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. 11న నిరుద్యోగుల యువ గర్జన నిరుద్యోగులకు, యువతకు ముఖ్యమంత్రి చం ద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ఈ నెల 11న శనివారం పట్టణంలో యువగర్జన పేరిట నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటిం చారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కోట నుంచి ప్రారంభమయ్యే యువగర్జన ర్యాలీకి పెద్ద ఎత్తున నిరుద్యోగులు యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యువ జన విభాగం అధ్యక్షుడు సం ఘం రెడ్డి బంగారునాయుడు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జి.వి.రంగారావు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఎంఎల్ఎన్.రాజు, జిల్లా యువజన విభా గం ప్రధాన కార్యదర్శి బోడేసింగి ఈశ్వరరావు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చాణక్య, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి పొట్నూరు కేశవ్, కరకవలస అనిల్, పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షుడు నెలపర్తి రాజకుమార్‌లతో పాటు యువజన విద్యార్థి విభాగం నాయకులు తాడ్డి సురేష్, అవాల కుమార్, చిన్ని, రవితేజ, సప్పా ప్రసాద్,వైగేర్ ప్రసాద్, తరుణ్,తెడ్ల ప్రసాద్ , బూడి అప్పలరాజు, బాలు,రజనీ, శెట్టి సుధాకర్, రమేష్, దివాకర్, సురేష్,, గుప్త, కృష్ణ పాల్గొన్నారు. -
నమ్మించి.. నట్టేట ముంచాడు!
‘మోసపోయేవారు ఉన్నాన్నాళ్లు మోసం చేసేవారు రోజుకో చోట పుడుతూనే ఉంటారు’. ఇది ఏదో సినిమాలో డైలాగ్ అనుకునేరు.! అచ్చం ఇలాంటి సంఘటనే పిట్లం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు సుమారు 20మందికిపైగానే ఓ బంగారు నగల వ్యాపారి రూ. 50లక్షల మేర టోపేసి పారిపోయాడు. ఫలితంగా బాధితులు లబోదిబోమంటున్నారు. పిట్లం(జుక్కల్): ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వ్యాపారి పరారైన సంఘటన మరువక ముందే పిట్లం మండల కేంద్రంలో సుమారు రూ.50 లక్షలతో ఓ బంగారం వ్యాపారి పరారైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పిట్లంలోని తిమ్మానగర్ రహదారిలో ఓ బంగారం వ్యాపారి దుకాణం నడిపేవాడు. ఆ వ్యాపారి పిట్లం గ్రామానికి చెందిన వాడు కావడంతో నమ్మకంగా ఉంటూ నగలు తయారు చేసి ఇవ్వడంతో మండలంలోని మార్దండ, అంతర్గాం, తిమ్మానగర్, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలానికి చెందినవారు వినియోగదారులు చాలా మంది వచ్చేవారు. వేసవి పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగలు తయారు చేయించుకునేందుకు ఈ వ్యాపారికి ఆర్డర్ ఇచ్చి నగదు అప్పజెప్పారు. గత రెండు, మూడు నెలల నుంచి ఈ వ్యాపారి తన తండ్రికి ఆరోగ్యం సరిగ్గా లేదని, లేదంటే హైదరాబాద్ నుంచి బంగారం తెస్తున్నామని నమ్మబలికి కాలం వెల్లదీశాడు. బంగారం నగలు కూడా వినియోగదారులకు రేపు, మాపు అంటూ చెప్పడంతో అతన్ని నమ్మిన వినియోగదారులు ఊరుకుండి పోయారు. ఇక ఇదే అదనుగా భావించిన సదరు వ్యాపారి 15 రోజుల కింద రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో వినియోగదారులు అనుమానం వచ్చి అతడిని సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో ఆ వ్యాపారి పరారైనట్లు తెలుసుకున్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సుమారు 15రోజుల పాటు ఇక వస్తాడెమో అనుకున్న వినియోగదారులు ఆ వ్యాపారి రాక బుధవారం నాడు సుమారు 20 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వినియోగదారులతో పాటు పిట్లం గ్రామానికి చెందిన వ్యాపారుల నుంచి ఇతను రూ.లక్షలాదిగా వడ్డీకి తీసుకున్నట్లు సమాచారం. తాము కాయకష్టం చేసుకుని ఈ వ్యాపారి వద్ద బంగారం తయారుకు ఆర్డర్ ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ప్రామిసరీ నోటు రాసిచ్చాడు.. నేను బంగారం తయారీకి పోయి న ఫిబ్రవరిలో నగల తయారీకి రూ.1.56 లక్షల నగదు ఇచ్చా. నగలు తయారు చేసి ఇవ్వాలని అడిగితే, ఇస్తానని చెప్పాడు. కొద్ది రోజుల కింద దుకాణానికి వెళ్లి నిలదీస్తే ఇందుకు ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. తొందరగా నగదు ఇస్తానని చెప్పి ఇప్పుడెమో కనబడకుండా వెళ్లిపోయాడు. –నర్పప్ప, బాధితుడు మార్దండ. నిలువునా మోసం చేసిండు.. నేను రెండు నెలల కింద నా కుమారుడి పెండ్లి ఉండటంతో రూ.2 లక్షల 40 వేలు నగల తయారీకి ఇచ్చిన. పెండ్లి సమయానికి నగలు కావాలని అడిగితే రేపు మాపు అంటూ కాలం వెల్లదీశాడు. బంగారు నగలు మాత్రం ఇవ్వలే దు. తన తండ్రికి బాగా లేదని అనడంతో అత న్ని నమ్మినం. ఇప్పుడేమో నిలువున మోసం చే సిండు. –రొట్టె విఠవ్వ, బాధితురాలు, మార్దండ. -
ఏసీబీ అధికారులమంటూ.. దమ్కీ!
పంజాగుట్ట : ఏసీబీ అధికారులమంటూ ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కొద్దిరోజుల క్రితం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని రేణుకకు ఫోన్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులమంటూ ఆరు లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై రేణుక పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులైన మొహ్మద్ అలీం సబీర్, సయ్యద్ ఉస్మాన్ అలీ, ఫాతిమా, ఖాజా మొయినుద్దీన్, విజయ్, సయ్యద్ సమీర్‌లను అరెస్టు చేశారు. వీరి వద్దనుంచి ఓమ్ని కారు, స్టాంప్ పేపర్లు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 384,388,419,365ల కింద కేసు నమోదు చేసామని ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
ప్రియుడి కోసం ప్రియురాలి గాలింపు
గూడూరు వరంగల్ : ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడంటూ ఓ యువతి సదరు యువకుడి గ్రామానికి చేరుకొని వాకబు చేసిన సంఘటన మండలంలోని మచ్చర్ల గ్రామంలో సోమవారం జరిగింది. బాధితురాలు సంగీత కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంగీత హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీలో నర్స్‌గా పనిచేస్తుండగా ఏడాది క్రితం అదే కళాశాలలో పనిచేసిన పగిడిపాల వినోద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తామిద్దరం ప్రేమించుకున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని వినోద్ చెప్పాడని సంగీత తెలిపింది. గత మూడు నెలలుగా కనిపిం చకుండాపోయాడని పేర్కొంది. తిరిగి గత వారం రోజులుగా సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడని, నమ్మించే మాటలు చెబుతున్నాడని, చివరకు తన కు మరో అమ్మాయితో తల్లిదండ్రులు పెళ్లి కుది ర్చారని చెప్పాడని వివరించింది. దీంతో మచ్చర్లకు చేరుకుని అతడి గురించి వాకబు చేయగా మరో బాలికతో పెళ్లి నిశ్చయమైందని తెలిసినట్లు చెప్పింది. తాను వినోద్‌కు రెండో భార్యగానైనా ఉంటానని, తనను నమ్మించి మోసం చేశాడని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. విషయం తెలు సుకున్న పోలీసులు మచ్చర్ల గ్రామానికి చేరుకోగా ఆ యువకుడి తరఫు పెద్దమనుషులు ఆ యువతిని మరో చోటికి తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా బాధితురాలు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. -
కోటి రూపాయలు ఇస్తే పది కోట్లు ఇస్తా
న్యూఢిల్లీ : రూపాయి ఇచ్చి పదిరూపాయలు రావాలనుకోవడం దురాశ. ఇలాంటి ఆలోచన చేసే ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త దాదాపు కోటిన్నర రూపాయలు మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన వ్యాపారి నరేందర్‌కు కొన్ని సంవత్సరాల క్రితం వీరేంద్ర బ్రార్, అతని కొడుకు బాబా బ్రార్‌తో పరిచయం ఏర్పడింది. వీరేంద్ర తమ దగ్గర రైస్ పుల్లర్ ఉందని, దాన్ని త్వరలోనే నాసా పరీక్షించనుందని, పరీక్ష విజయవంతమైతే నాసా తమ దగ్గర ఉన్న రైస్ పుల్లర్‌ని 37,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుందని నమ్మబలికాడు. ఈ రైస్పుల్లర్ని నాసా అంతరిక్ష పరిశోధనల కోసం ఉపయోగిస్తుందని తెలిపాడు. రైస్ పుల్లర్‌ను పరీక్షించడం కోసం శాస్త్రవేత్తలను తీసుకురావాల్సి ఉంటుందని, శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించే సమయంలో ధరించే సూట్‌తో పాటు రైస్ పుల్లర్‌ను పరీక్షించడం కోసం అవసరమైన రసాయనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. పరీక్ష విజయవంతమైతే తక్షణమే తనకు వచ్చే 37 వేల కోట్ల రూపాయాల్లో 10 కోట్ల రూపాయలను నరేంద్రకు ఇస్తానని నమ్మబలికాడు. ఒకేసారి అంత పెద్ద మొత్త వస్తుందని ఆశపడ్డ నరేంద్ర, వీరేంద్రతో ఒక ఎమ్ఓయూను కూడా కుదుర్చుకున్నాడు. అనంతరం వీరేంద్రకు 87.2లక్షల రూపాయలను ఇచ్చాడు. డబ్బు చేతికి వచ్చిన వెంటనే వీరేంద్ర హపూర్ ప్రాంతంలో రైస్ పుల్లర్‌ను పరీక్షిస్తానని తెలిపాడు. కానీ ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. కారణమేంటని అడిగితే ఆ ప్రాంతం అంత సురక్షితం కాదని తెలిపాడు. ఆ రోజు నుంచి ఏదో ఒక సాకు చెప్తూ దాటవేస్తున్నాడు. అదే సమయంలో వీరేంద్ర మాటలు నమ్మి అతనికి డబ్బులు ఇచ్చిన ఇతరులు కూడా తమ డబ్బును తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. వారికి డబ్బులు ఇవ్వడం కోసం వీరేంద్ర, మరోసారి నరేంద్రను ఆశ్రయించాడు. ఇసారి తప్పకుండా రైస్‌పుల్లర్‌ను పరీక్షిస్తామని, అందుకోసం హిమాచల్‌లోని ధర్మశాలలో ఓ ప్రాంతాన్ని ఎన్నుకున్నామని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డీల్ ఫైనల్ అవుతుందని తెలిపాడు. వీరేంద్ర మాటలు నమ్మిన నరేంద్ర మరోసారి మోసపోయాడు. ఈ సారి మరో 51.1లక్షల రూపాయలను వీరేంద్రకు ఇచ్చాడు. వీరేంద్ర 20 వేల రూపాయలు ఇచ్చి ఇద్దరు నకిలీ శాస్త్రవేత్తలను తీసుకువచ్చాడు. వారు పరీక్షిస్తున్నట్లు నటించి వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన నరేంద్ర శాస్త్రవేత్తలుగా వచ్చిన వారిని పట్టుకుని నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న నరేంద్ర పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రికొడుకులను అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘రైస్ పుల్లర్ అనే ఎటువంటి వస్తువు లేదు. కానీ మోసగాళ్లు రాగి పళ్లాన్ని తీసుకుని దానికి అయస్కాంత పూత పూసి జనాలను మోసగిస్తున్నారు. కనుక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాల’ని తెలిపారు. -
మోసగాడి అరెస్టు
కరీంనగర్‌క్రైం : వాహనాలు తనఖాపెట్టి మోసాలకు పాల్పడి ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని సీసీఎస్ సీఐ కిరణ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సోమవారం పట్టుకుంది. కరీంనగర్‌లోని హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లికి చెందిన వింజమూరి కళ్యాణ్‌చక్రవర్తి(39) తన తండ్రి తిరుపతయ్య నడిపిస్తున్న తిరుపతి డ్రైవింగ్ స్కూల్ వ్యవహారాలు చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఫైనాన్స్‌ల్లో రుణాలు తీసుకునే పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ కళ్యాణ్‌చక్రవర్తి డబ్బుల కోసం పక్కదారితొక్కాడు. తన మిత్రుడు శ్రీరామోజు వెంకటేశ్వర్లుకు చెందిన కారును తరచూ అవసరాలకు వాడుకునేవాడు. వెంకటేశ్వర్లు కారుతో బ్యాంక్ లోన్ తీసుకుని ఠంఛన్‌గా వాయిదాలు చెల్లిస్తున్నాడు. ఈ చనువుతో వెంకటేశ్వర్లు కారును తనకు విక్రయించినట్లు కళ్యాణ్‌చక్రవర్తి తప్పుడు పత్రాలు సృష్టించి, బ్యాంక్ లోన్ చెల్లించినట్లు నకిలీ ఎన్వోసీ తయారు చేశారు. వీటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించి మరో ఫైనాన్స్‌లో లోను తీసుకున్నాడు. ఇలా ఒక్క వెంకటేశ్వర్లుకు చెందిన కారుపై 2016–17లో ఆరు ఫైనాన్స్‌ల్లో సుమారు రూ.20లక్షలు రుణం తీసుకున్నాడు. అంతేకాకుండా తన పేరిట ఉన్న రెండు లారీలపై నకిలీ ఎన్వోసీలు తయారు చేసి లోన్లు తీసుకున్నాడు. తల్లి వింజమూరి భాగ్యలక్ష్మి పేరిట ఉన్న రిట్జ్కారుపై లోను తీసుకుని దాన్ని తన మిత్రుడు చందనారెడ్డి పేరిట మార్చి మళ్లీ లోను తీసుకున్నాడు. ఇలా మూడేళ్లలో మారుతి స్విఫ్ట్‌డిజైర్, మారుతిరిట్జ్, రెండులారీలపై నకలీపత్రాలు తయారుచేసి రూ.70లక్షలు వరకు వివిధ ఫైనాన్స్‌ల నుంచి లోన్లు తీసుకున్నాడు. వెలుగుచూసింది ఇలా.. కళ్యాణ్ చక్రవర్తి తన మిత్రుడైన వెంకటేశ్వర్లు పేరిట ఉన్న కారుకు నకిలీపత్రాలు సృష్టించి ఆరు ఫైనాన్స్‌ల్లో లోన్లు తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో ఓ ఫైనాన్స్ కంపెనీ వారు కారు ఎక్కడ ఉందో కనుక్కొని వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. కానీ తాను ఎస్బీహెచ్లో లోను తీసుకుని.. వాయిదాలు చెల్లిస్తున్నానని చెప్పినా వినకుండా కారు లాక్కెళ్లారు. దీనిపై వెంకటేశ్వర్లు కరీంనగర్ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ తుల శ్రీనివాసరావు విచారణ చేపట్టగా పై అంశాలు వెలుగుచూశాయి. దీంతోపాటు బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఐదు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు విషయం తెలుసుకున్న కళ్యాణ్ చక్రవర్తి తన కుటుంబంతో సహ పరారై హైదరాబాద్‌లో దాక్కున్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో నిందితుడిని కోసం గాలించేందుకు సీసీఎస్ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు వారంపాటు హైదరాబాద్‌లో మకాం వేసి కళ్యాణ్ చక్రవర్తి కదలికలపై నిఘా పెట్టారు. ఆచూకీ కనిపెట్టిన పోలీసులు సోమవా రం ఉదయం అతడు దాక్కున్న ఇంటిపై దాడి చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు అతనికి సహకరించిన చందనారెడ్డిని సైతం అదు పులోకి తీసుకున్నారు. వారు పలు ఫైనాన్స్‌లను ఎలా మోసం చేశారో తెలుసుకున్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి, కస్టడీకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీపీ తెలిపారు. కళ్యాణ్ చక్రవర్తికి సహకరించిన వింజమూరి భాగ్యలక్ష్మి, షేక్ అబ్దుల్లా, నాగుల దేవేందర్, ఎండీ యూసుఫొద్దీన్ పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. కళ్యాణ్ చక్రవర్తి చేసిన మోసాల్లో చాలా వరకూ ఆర్టీఏ అధికారుల సహకారం ఉందనే ప్రచారం ఉంది. ఆర్టీఏ అధికారుల పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. అధికారులకు రివార్డులు ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ సీఐ కిరణ్, వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ ఎస్సైలు నాగరాజు, సాగర్‌ను అభినందించారు. -
చదివింది పది.. ఐటీఉద్యోగిగా బిల్డప్
రాంగోపాల్‌పేట్ : ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసి రూ. కోటి వసూలు చేసిన కేసులో నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.లక్ష నగదు, బాండ్ పేపర్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ రాధాకిషన్‌రావు, సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన గంగాధర సతీష్‌కుమార్ పదవ తరగతి వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇన్‌ట్యాక్స్ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసేందుకు పథకం పన్నిన అతను ఆదాయ పన్ను శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, జూనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్‌తో పాటు అటెండర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించేవాడు. ఉద్యోగాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.3లక్షల వరకు లంచంగా ఇవ్వాలని చెబుతూ అడ్వాన్స్‌గా రూ. లక్ష వసూలు చేసేవాడు. 2014 నుంచి ఇలా దాదాపు 80 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ. కోటి వరకు వసూలు చేశాడు. కార్యాలయానికి తీసుకుని వెళ్లి నిరుద్యోగులను నమ్మించేందుకు సతీష్‌కుమార్ వారిని బషీర్‌బాగ్‌లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి తీసుకుని వెళ్లేవాడు. తాను కార్యాలయం లోపలికి వెళ్లి కొద్ది సేపు తిరిగి వచ్చి అధికారులతో మాట్లాడి వచ్చినట్లు బిల్డప్ ఇచ్చేవాడు. త్వరలోనే మీ పని అయిపోతుందని నమ్మించేవాడు. డబ్బు తీసుకున్న తర్వాత వారికి 6 డిజిట్స్ నంబర్ ఇచ్చి మీ ఉద్యోగాలు ఖాయమని చెప్పేవాడు. ఉద్యోగం రాకపోతే ఈ నెంబర్ చెబితే డబ్బులు తిరిగివస్తాయని నమ్మించేవాడు. ఎవరైనా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే కొత్త వారిని బుట్టలో వేసుకుని వారి ద్వారా బాధితుల అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయించేవాడు. మరికొందరికి రూ.20 బాండ్లపై రాసి ఇచ్చేవాడు. బాధితుల్లో కొందరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం నిందితుడు సతీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. అతడిని తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్సై తిమ్మప్ప, సిబ్బందిని డీసీపీ అభినందించారు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నిందితుడిపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్‌నగర్, నగర కమిషనరేట్ పరిధిలోని సైఫాబాద్, చాదర్ఘట్, షాలిబండ, చత్రినాక, ఫలక్‌నుమ, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. నిరుద్యోగులు మోసపోవద్దు ఎవరైనా లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని డీసీపీ రాధాకిష్రావు సూచించారు. ఏ ఉద్యోగమైనా పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక జరుగుతుందన్నారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే తమ దృష్టికి తేవాలని సూచించారు. -
ఇద్దరు మోసగాళ్లతో ఏపీకి అన్యాయం
కదిరి : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ఎంత మోసం చేశాడో... హోదా తెచ్చే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతకన్నా ఎక్కువ మోసం చేశాడు. ఈ ఇద్దరు మోసగాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలను బంగాళాఖాతంలో కలపాలి’ అని వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ పీవీ.సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ కూడలిలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా కోసం పోరాడుతున్న జగన్ వెంటే జనం ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు హోదా జపం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలేం అమాయకులు కాదని, ఎవరు చిత్తశుద్ధిగా పోరాడుతున్నారో వారికి బాగా తెలుసని అన్నారు. హారతి పట్టిన మహిళలు ప్రత్యేకహోదా కోసం తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న సిద్ధారెడ్డిని పట్టణంలోని పలువురు మహిళలు అభినందించారు. ఆయనకు హారతి పట్టి మీ సంకల్పం నెరవేరాలని ఆశీర్వదించారు. మేము సైతం అంటూ వారు కూడా దీక్షలో కూర్చున్నారు. హోదాకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెబుతామన్నారు. -
పరారీలో బంగారం వ్యాపారి
నరసన్నపేట: నరసన్నపేటలోని బజారువీధిలో శ్రీ సంతోషిమాతా జ్యూయలర్ పేరున బంగారం షాపు నిర్వహిస్తున్న పొట్నూరు సన్యాసిరావు పరారయ్యాడు. 15 రోజులుగా షాపు తెరవక పోవడం, ఇంటికి తాళాలు వేసి ఉండటంతో ఏమైందని ఆరా తీసిన బాధితులు సన్యాసిరావుకు ఫోను చేస్తున్నా స్విచ్ ఆఫ్ అని వస్తుండంతో లబోదిబోమంటున్నారు. సన్యాసిరావు 12 ఏళ్ల క్రితం ఇలాగే పరారై రూ.50 లక్షలకు పైగా స్థానికులకు టోకరా వేశాడు. కొన్నేళ్ల కిందట తిరిగి నరసన్నపేట వచ్చి మళ్లీ బంగారం షాపు పెట్టాడు. పాత అప్పులు తీర్చకపోగా కొత్తగా షాపు నిర్వహణ, బంగారం వస్తువుల పేరిట పరిసర గ్రామాలకు చెందిన వారి నుంచి అధికంగా డబ్బు సేకరించి మరోసారి పరారయ్యాడు. ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి రూ.10 లక్షల వరకూ అప్పు చేసినట్లు సమాచారం. బంగారం వస్తువులు ఇస్తానని తోటి బంగారం షాపుల వారి నుంచి రూ.10 లక్షల వరకూ టోపీ వేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు జమ్ము, తామరాపల్లి, గోపాలపెంట, పోతయ్యవలస, మడపాం, యారబాడు గ్రామస్తుల నుంచి రూ. 5 లక్షల వరకూ తీసుకున్నట్లు సమాచారం. నమ్మి పోసపోయాం.. జమ్ముకు చెందిన వాన చిన్నమ్మి, పీస లక్ష్మి, నరసన్నపేట బజారు వీధికి చెం దిన లక్ష్మిలు మాట్లాడుతూ బంగారం వస్తువులు ఇస్తానని సన్యాసిరావు చెప్పడంతో నమ్మి మోసపోయామని వాపోయారు. ఈ విషయమై సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ సన్యాసిరావు పరారైన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వక పోవడంతో దర్యాప్తు చేయలేకపోతున్నామని చెప్పారు. -
రేవంత్ మోసం చేశాడు
తాండూరు టౌన్ : తెలుగుదేశం పార్టీని మోసం చేసి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి రాజుగౌడ్ ఆరోపించారు. పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని మంగళవారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిలాంటి పార్టీని వదిలి స్వలాభం కోసం ఆయన కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఆయన పార్టీలో లేకున్నా వచ్చే నష్టమేమీ లేదన్నారు. టీడీపీ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే ప్రసక్తేలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తాండూరు నుంచి బరిలోకి దిగుతానన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, మహారాజుల పాలనతోనూ ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరి కథ ముగించేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీగా టీడీపీకి పేరుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుమిత్‌గౌడ్, పట్టణా«ధ్యక్షుడు మహేశ్‌సింగ్ ఠాకూర్, బషీరాబాద్ మండల అధ్యక్షుడు మ«ధుసూదన్‌గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాసిత్, నాయకులు మనోహర్, రుద్రుపాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరిట మోసం..
కురుపాం: ఉద్యోగం పేరుతో ఓ గిరిజన మహిళ నుంచి లక్ష రూపాయలు స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రంజిత్‌కుమార్ తన దగ్గర డబ్బులు తీసుకుని నకిలీ ఆర్డరిచ్చి మోసం చేశాడని బాధితురాలు విలేకరులు, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వద్ద సోమవారం గోడు వెళ్ల్లబోసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మొండెంఖల్‌కు చెందిన పైల రాజేశ్వరి అనే గిరిజన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రంజిత్‌కుమార్ నమ్మబలికాడు. అయితే ఇందుకు లక్ష రూపాయలు ఖర్చుఅవుతుందని చెప్పడంతో, బాధితురాలు డబ్బును రంజిత్‌కుమార్‌కు అప్పగించింది. దీంతో రాజేశ్వరిని విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో అడెంటర్గా నియమించినట్లు ఆర్డర్ కూడా ఇచ్చేశాడు. వెంటనే రాజేశ్వరి తన కుటుంబాన్ని విజయనగరానికి మార్చేసింది. అలాగే ఆర్డర్ పట్టుకుని జెడ్పీ కార్యాలయానికి వెళ్లగా ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడే అసలు కథ... ఉద్యోగంలో చేరిన రాజేశ్వరికి అధికారులు జీతం ఇవ్వలేదు. ఇలా ఏడు నెలల పాటు ఆమె ఉచితంగానే సేవలందించింది. చివరకు నెల రోజుల కిందట రూ. 15 వేలు ఇచ్చి వెళ్లిపొమ్మన్నారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ సదరు కో ఆప్షన్ సభ్యుడు రంజిత్‌కుమార్ వద్దకు వెళ్లి సమస్య వివరించింది. ఉద్యోగం లేనప్పుడు తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలని కోరగా ఇదుగో.. అదుగో.. అని చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. వాస్తవానికి రాజేశ్వరికి ఇచ్చింది నకిలీ నియామకపత్రం. జెడ్పీలో సక్రమంగా విధులకు హాజరుకాని ఓ ఉద్యోగి స్థానంలో రాజేశ్వరిని తాత్కాలికంగా నియమించారు. ఏడు నెలలు పాటు పనిచేసిన తర్వాత అసలు ఉద్యోగి విధులకు హాజరుకావడంతో రూ. 15 వేలు ఇచ్చి రాజేశ్వరిని తప్పించారు. అటు ఉద్యోగం.. ఇటు డబ్బులు నష్టపోయిన తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. -
బాధితుడే నిందితుడు...
► చోరీ పేరుతో నాటకం ► తండ్రికి తనయుడి టోకరా హైదరాబాద్ : చేతిలో ఖరీదైన ఎస్–7 ఫోన్.. తిరగడానికి రూ. 2 లక్షల విలువైన కేటీఎం బైక్. బ్యాంకులో రూ. లక్షకు పైగా నగదు నిల్వ. తండ్రి రెండు ఫారెన్ ఎక్సైంజ్ కేంద్రాలు నిర్వహిస్తున్నాడు. అయినా సరదాలకు అలవాటు పడి స్నేహితులతో జల్సాలు చేసేందుకు తనను దొంగలు దారి కాచి కొట్టి నగదు లాక్కుపోయారంటూ కొత్త కథ అల్లి పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అత్తాపూర్ హైదర్‌గూడకు చెందిన మహ్మద్ సల్మాన్ నారాయణగూడలోని చైతన్య డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి ఆరిఫ్ గత 20 ఏళ్లుగా అపోలో ఆస్పత్రిలో అరబిక్ ట్రాన్స్‌లేటర్‌గా పని చేస్తున్నాడు. వీరికి రెండు విదేశీ కరెన్సీ ఎక్సైంజ్ కేంద్రాలు ఉన్నాయి. అపోలో ఆస్పత్రికి వివిధ దేశాల నుంచి వచ్చే వారికి ఆరిఫ్ కరెన్సీ మార్చి ఇచ్చేవాడు. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం అతను ఓమన్ దేశస్తుడికి రూ. 2 లక్షలు ఇండియన్ కరెన్సీ కావాలని పెద్ద కొడుకుకు చెప్పాడు. దీంతో అతను తన సోదరుడు సల్మాన్‌కు నగదు ఇచ్చి అపోలో ఆస్పత్రికి పంపాడు. అయితే వాటిని కొట్టేయాలని పథకం పన్నిన సల్మాన్ అందులో ఒక లక్ష తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. ఇంకో లక్షను కాజేసేందుకు తన స్నేహితులైన అనీఫ్, అమీర్‌లతో పథకం వేశాడు. తాను బైక్‌పై వెళ్తుంటే ఆస్పత్రి సమీపంలో ఆపి కొట్టి లక్ష ఎత్తుకెళ్లాలని సూచించడంతో వారు సల్మాన్‌ను కొట్టి జేబులో డబ్బులు లాక్కుని పరారయ్యారు. అనంతరం సల్మాన్ తనను కొట్టి రూ. 2లక్షలు దోచుకెళ్లారంటూ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు సల్మాన్‌ను విచారించగా అసలు విషయం చెప్పాడు. ఇదిలా ఉండగా జల్సాలకు అలవాటుపడ్డ వీరు ముగ్గురూ పాత నేరస్తులు కాగా, పీడియాక్ట్ కూడా నమోదై ఉందిది. ఓ మర్డర్ కేసులోనూ నిందితులుగా ఉన్న వీరు మరోసారి పథకం వేసి డబ్బులు చేజిక్కుంచుకునే వేసిన పథకం పారకపోగా పోలీసులకు చిక్కారు. నిందితులను విచారిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిపై ఉన్న కేసులను తిరగదోడుతున్నారు. -
న్యాయవాదులను సీఎం మోసగించారు
విధులు బహిష్కరించి నిరసన కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) : ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులనే కాకుండా ఆఖరికి న్యాయవాదులను కూడా మోసం చేస్తున్నారని జిల్లాలోని బార్ అసోసియేషన్ సంఘాలు ఆరోపించాయి. దీర్ఘకాలికంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఆయా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు రాజేష్, కార్యదర్శి గెద్దాడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి బార్ అసోసియేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ న్యాయవాదుల జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం విధులు బహిష్కరించినట్టు తెలిపారు. న్యాయవాదులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీలు ఇచ్చారని, మూడేళ్ల పాలన గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. న్యాయవాదుల డెత్ బెనిఫిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు, మెడికల్ బెనిఫిట్ రూ.40 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచేందుకు అవసరమైన గ్రాంటు ఇవ్వాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్‌ను మంజూరు చేయాలి, న్యాయవాదులందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్‌ను పెంచాలని, న్యాయవాదులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలన్నారు. సోమవారం కూడా విధులు బహిష్కరించి తమ నిరసన తెలియజేస్తామని బార్ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ దేశీ, కోశాధికారి శర్మ, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకోమంటే గోదావరిలోకి తోసేశాడు
ప్రేమించానని నమ్మించి యువతిని మోసగించిన ఓ ప్రబుద్ధుడు తూర్పు గోదావరి జిల్లా (ముమ్మిడివరం): నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు.. కడవరకు తోడుంటానని నమ్మించాడు. ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ఏకంగా పదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానంటూ ఓ యువతికి మాయమాటలు చెప్పి తీరా పెళ్లి విషయం వచ్చేసరికి ససేమిరా అన్నాడు ఓ ప్రబుద్ధుడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. పెళ్లి చేసుకుంటానని యువతిని రమ్మని చెప్పి వచ్చాక అర్ధరాత్రి గోదావరిలోకి తోసేశాడు ఓ మోసగాడు. ఈ దారుణమైన ఘటన యానాం–ఎదురల్లంక బాలయోగి వారధి వద్ద చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికిచెందిన ఓ యువతి (26), నాసిక శ్రీనివాసరావు (31) పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎంబీఏ చదివిన ఆమె ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసరావు ప్రేమిస్తున్నానని చెప్పి తరువాత మొహం చాటేస్తుండడంతో తొందరగా పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది. దీంతో శ్రీనివాసరావు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ‘ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకుందా’మని ఆమెకు చెప్పి ఆదివారం యానాం–ఎదుర్లంక బాలయోగి వారధి వద్దకు రప్పించాడు. ఆమెతో అర్ధరాత్రి వరకు అక్కడే కాలక్షేపం చేసి ఎవరూ లేని సమయంలోఆమె తలపై కొట్టి, గొంతునుమిలి గోదావరిలోకి తోసేసి శ్రీనివాసరావు పరారయ్యాడు. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు బాధితురాలిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బామ్మకు టోకరా
ఖండవల్లి (పెరవలి) : మనవడు ఇచ్చిన సొమ్ము బ్యాంకులో వేద్దామని వచ్చిన ఓ బామ్మకు సినీఫక్కీలో మస్కా కొట్టి ఓ దొంగ సొమ్ముతో ఉడాయించిన ఘటన పెరవలి మండలం ఖండవల్లి ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఖండవల్లి గ్రామానికి చెందిన తుమ్మూరి లక్ష్మమ్మ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి ఈ బామ్మ వద్దకు వచ్చి ‘నేనూ బ్యాంకులోనే పనిచేస్తున్నాను.. ఫారం రాసి ఇస్తాను..’ అని చెప్పి ఒక ఫారం రాసి ఇచ్చాడు. ఆ వృద్ధురాలు అదే నిజమని నమ్మి నగదు తీసి లెక్కిస్తుండగా ‘నేను లెక్కపెడతాను.. ముందు బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకురా’ అని చెప్పి బామ్మ వద్ద నుంచి రూ.60 వేలు తీసుకుని ఆమెను బయటకు పంపించేశాడు. ఆమె అలా వెళ్లగానే ఇచ్చిన సొమ్ముతో ఉడాయించాడు. జిరాక్స్ కాపీతో బ్యాంకు లోపలికి వచ్చిన బామ్మ ఆ గుర్తు తెలియని వ్యక్తి కనిపించకపోయే సరికి జరిగిన మోసాన్ని గ్రహించి లబోదిబోమంది. బ్యాంకులోని వారంతా విషయాన్ని గ్రహించి చుట్టుపక్కల గాలించినా దొంగ ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటానా స్థలానికి పెరవలి ఎస్సై పి.నాగరాజు చేరుకుని బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజీని పరిశీలించారు. దొంగను పట్టుకోవటానికి ప్రత్యేక టీమ్‌ను పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
ప్రేమ..పెళ్లి...మోసం
► న్యాయం కోసం భర్త ఇంటి ముందు బిడ్డతో భార్య బైఠాయింపు ► మరో మహిళను వివాహమాడిన భర్త ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకొని ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తనను మోసం చేసి మరో మహిళను వివాహం చేసుకొన్న తన భర్త నుంచి నాకు న్యాయం చేయాలని కోరుతూ ఓ భార్య భర్త ఇంటి ముందే బైఠాయించింది. గట్టిగా ప్రశ్నిస్తే నలుగురిలో నా పరువు తీయొద్దని..వేరో చోట మాట్లాడదామని రమ్మని మోసం చేస్తున్నాడంటూ తన బిడ్డ సంరక్షణ విషయంలో న్యాయం చేయాలని కోరింది. వివరాల్లోకి వెళ్తే... సాలూరు: తనను ప్రేమ వివాహం చేసుకుని, ఆడబిడ్డకు తండ్రైన ఎనిమిదేళ్ల తర్వాత మోసం చేస్తున్నాడంటూ స్థానిక కొంకివీధిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని ఓ మహిళ తన బిడ్డతో భర్త ఇంటి ముందు ఆదివారం బైఠాయించి న్యాయం చేయాలంటోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో టీచర్ ఫాతిమా ఇంటి వద్దకు చేరుకున్న బొబ్బ విజయ, తన కుమార్తె సనోబర్ సలమాతో కలసి బైఠాయించింది. దీంతో ఇరుగుపొరుగు మహిళలు ఆరా తీయగా తనకు జరిగిన అన్యాయాన్ని విజయ వివరించింది. భర్త మహమ్మద్ షీరాజ్తో కలసి వున్న ఫోటోలను, వారి బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం చూపుతూ, టీచర్‌ను వివాహమాడి, తనను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాడో చూడండంటూ వివరించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం 2007లో రామభద్రపురంలో తాను తొలి భర్తకు విడాకులిచ్చి జీవిస్తుండగా ద్విచక్ర వాహనాల కన్సల్టెంట్‌గా పని చేస్తోన్న షిరాజ్‌తో పరిచయమైంది. పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం 2008లో విశాఖలో కుమార్తె సనోబర్ సలమా జన్మించిందని తెలిపింది. రెండేళ్ల కిందట మరలా రామభద్రపురం తీసుకువచ్చి అద్దె ఇంటిలో పెట్టాడని, సాలూరులో ప్రభుత్వ టీచర్‌ను పెళ్లాడారని, వారికి ఒక మగ బిడ్డ కూడా వున్నట్టు తెలిసిందని వాపోయింది. తమ పోషణను పట్టించుకోకపోగా ఇంటి అద్దెను కూడా చెల్లించడం లేదని గొల్లుమంది. ఇదేమని ప్రశ్నిస్తే వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా, తనకు సంబంధం లేదని చెబుతున్నాడని వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందన లేకపోవడంతో అతను కాపురముంటోన్న ఇంటి వద్ద తన బిడ్డను వదిలి వెళ్లేందుకు వచ్చానని తెలిపింది. అయితే షిరాజ్ తనతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటివద్ద తన పరువు తీయొద్దని, మెయిన్‌రోడ్డుకు రావాలని కోరుతున్నాడని వాపోయింది. తన బిడ్డకు న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై షిరాజ్‌ను వివరణ కోరేందుకు విలేకరులు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఇదిలా ఉండగా విజయ బైఠాయించిన ఇంటికి సంబంధించిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను స్టేషన్‌కు పిలిపించారు. ఇదే విషయమై టౌన్ ఎస్ఐ జ్ఞానప్రసాద్ వద్ద సాక్షి ప్రస్తావించగా ఇరు వర్గాల వారిని పిలిపించామని విచారణ చేస్తున్నామని తెలిపారు. -
బాలికను మోసగించిన కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు
కొయ్యలగూడెం : బాలికను నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఏడేళ్ల కారాగార శిక్షను న్యాయమూర్తి విధించారు. ఎస్సై ఎస్.ఎస్.ఎస్.పవన్‌కుమార్ కథనం ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏలేటి దిలీప్‌కుమార్ లైంగికదాడి చేశాడు. ఈ మేరకు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రజువు కావడంతో జూనియర్ సివిల్ జడ్జి బి.సత్యానందం అతనికి ఏడేళ్ల కారాగార శిక్ష విధించారు. -
బ్యాంకు ఉద్యోగినంటూ వృద్ధురాలికి టోపీ
-
ప్రేమ పేరుతో మోసపోయి వ్యభిచార కూపంలోకి..
-
దావూద్‌కి కుచ్చుటోపీ పెట్టిన అనుచరుడు
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మోసపోయాడు. అది కూడా తన అనుచరుడి చేతిలో. దావూద్ కి నమ్మకస్తుడైన ఖలీక్ అహ్మద్ అనే అనుచరుడు భారీ మొత్తంలో డాన్ డబ్బును దోచేశాడు. దావూద్ భారత్ లో కేవలం ఆయుధాలు, వజ్రాలు, డ్రగ్స్ లను అక్రమంగా రవాణా చేయడమే కాకుండా నల్లధనానికి సంబంధించిన బిజినెస్ లు నడుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి నల్లడబ్బును పెద్ద మొత్తంలో పనామా, కెనడా, దుబాయ్, పాకిస్తాన్ లకు హవాలా ద్వారా తరలిస్తున్నాడు. కొద్ది సంవత్సరాల తర్వాత అదే డబ్బును మామూలుగా చలామణి చేయడానికి సహకరిస్తున్నాడు. ఈ ప్రక్రియలో అహ్మద్ ఢిల్లీలోని ఓ వ్యక్తి నుంచి రూ.45 కోట్ల రూపాయల నల్లధనాన్ని డాన్ తరఫున తీసుకోని హవాలా ద్వారా విదేశాలకు తరలించాల్సి వుంది. డబ్బును వ్యక్తి నుంచి తీసుకున్న అహ్మద్ సర్వీసు చార్జీ కింద దావూద్ కు రూ.5 కోట్లు పంపి, మిగిలిన రూ.40 కోట్లతో విదేశాలకు ఉడాయించాడు. భారత నిఘా సంస్థలు కొన్ని అంతర్జాతీయ నంబర్లను ట్యాప్ చేయగా ఈ వివరాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ లో దావుద్ అనుచరుడు జబీర్ మోతి అనే వ్యక్తి అహ్మద్ కు ఫోన్ చేసి డీల్ కు సంబంధించిన వివరాలు మాట్లాడినట్లు ఓ అధికారి వెల్లడించారు. దావూద్ పనులను చక్కబెట్టేందుకు అహ్మద్ తరచూ భారత్, షార్జాల మధ్య తిరుగుతుంటాడని తెలిసింది. అహ్మద్ చేసిన పనివల్ల డాన్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, దీనిపై దావూద్ చాలా సీరియస్ గా ఉన్నారని ఆ ఫోన్ కాల్ సారాంశం. అహ్మద్ ను పట్టుకోవడానికి నవంబర్ 26, 2015న దావూద్ అనుచరులు ఇద్దరు ఢిల్లీ నుంచి కెనడా వెళ్లినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అహ్మద్ ప్రస్తుతం మణిపూర్ లో తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. మోసగించిన డబ్బులో సగాన్ని అహ్మద్ పనామా బ్యాంకులో , మిగతా సగం డబ్బును విదేశాల్లో దావూద్ కు ఉన్న వ్యాపారాల్లో తన పేరు మీద పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. -
ఫోక్స్ వాగన్ చీట్ చేసిన ఈయూ దేశాలెన్నో తెలుసా?
కర్బన ఉద్గారాల స్కాంలో మోసపూరిత చర్యలకు పాల్పడిన జర్మన్ కారు తయారీదారి ఫోక్స్‌వాగన్, యూరోపియన్ యూనియన్‌లో చాలా దేశాలనే మోసం చేసిందట. 20కి పైగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో వినియోగదారులు చట్టాలను కొల్లగొట్టిందని యూరోపియన్ కమిషన్ తేల్చింది. ఈ విషయాన్ని జర్మన్ డైలీ డై వెల్ట్ రిపోర్టు చేసింది. ఈ కర్బన ఉద్గారాల స్కాంలో వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించడానికి ఫోక్స్‌వాగన్ స్వతాహాగా ముందుకు రావాల్సి ఉంటుందని యూరోపియన్ కమిషన్ ఇండస్ట్రి కమిషనర్ ఆదేశించారు. వినియోగదారులు చట్టబద్దంగా నష్టపరిహారం కిందకు వస్తారా అనేది జాతీయ కోర్టులు నిర్ధారిస్తున్నాయని వెల్లడించారు. వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఈయూ వ్యాప్తంగా ఉన్న కన్సూమర్ అసోసియేట్స్‌కు ఇప్పటికే కన్సూమర్ కమిషనర్ వెరా జౌరోవా లేఖలు రాశారు. సంబంధిత ప్రతినిధులతో ఆమె ఈ వారంలో భేటీ కానున్నట్టు కమిషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి ఫోక్స్‌వాగన్ నిరాకరించింది. కన్సూమర్ గ్రూపులతో పనిచేస్తూ యూరప్‌లోని క్లయింట్లకు ఫోక్స్‌వాగన్ నష్టపరిహారం చెల్లించేలా జౌరోవా కృషిచేస్తున్నారు. డీజిల్ కార్ల ఓనర్లకు బిలియన్ యూరోల నష్టపరిహారం చెల్లిస్తానన్న ఫోక్స్‌వాగన్, అనంతరం యూరప్‌లో కర్బన ఉద్గారాల స్కాంకు ప్రభావితమైన 8.5 మిలియన్ వెహికిల్స్‌కు మాత్రం మాట మార్చింది. విభిన్నమైన చట్టపరమైన నియమాలను అడ్డం పెట్టుకుని ఈ పరిహార చెల్లింపుల నుంచి తప్పించుకుంది. దీనిపై పోరాడుతున్న జౌరోవా యూరోపియన్ మెంబర్ స్టేట్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించామని, చాలా దేశాల్లో ఈ కంపెనీ యూరోపియన్ వినియోగదారుల చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడైనట్టు తెలిపారు. ప్రస్తుతం వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించేలా ఫోక్స్వాగన్పై చర్యలకు సిద్దమైనట్టు తెలిపారు. -
బహుమతి పేరిట టోకరా
♦ రూ.4వేలు కడితే రూ.16వేల ఫోన్ ఇస్తామంటూ ఫోన్ ♦ రేకుల బొమ్మలు రావడంతో ఖంగు తిన్న గిరిజనుడు ఉప్పరగూడెం(కురవి): ‘మీ సెల్ నంబర్‌కు బంపర్ ప్రైజ్ వచ్చింది... డ్రాలో మీరు ఈ బహుమతి గెలుచుకున్నారు’ అంటూ వచ్చిన ఫోన్‌తో ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఓ గిరిజనుడు.. ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి మాటన్నీ నమ్మేశాడు. ఇంకేం ఆయన చెప్పినట్లుగా డబ్బులు కట్టగా బహుమతి మాటేమో కానీ.. ఇనుపు రేకుతో చేసిన ప్రతిమలు ఉండడంతో మోసపోయానని గుర్తించాడు. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి. కురవి మండలంలోని ఉప్పరగూడెం శివారు తుకా తండాకు చెందిన బానోతు రమేష్ ఫోన్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్(9136160142) చేశాడు. ‘మీ నంబర్ డ్రాలో వేశాం.. బంపర్‌ప్రైజ్ వచ్చింది.. రూ.18వేల సామ్సంగ్ ఫోన్ బహుమతిగా ఇవ్వనున్నాం.. దీని కోసం రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది’ అని నమ్మబలికారు. అయితే, రూ.4వేలకు రూ.16వేల ఫోన్ ఇస్తారా అని రమేష్ ప్రశ్నిస్తే ‘డ్రాలో మీ నంబర్ వచ్చింది కాబట్టి బహుమతిగా ఇస్తున్నాం’ అని ఆగంతకుడు చెప్పాడు. దీంతో రమేష్ అంగీకరించాడు. ఈ మేరకు బుధవారం పోస్టాఫీస్‌కు రమేష్ పేరుపై ఒక పార్సిల్ వచ్చింది. పోస్ట్‌మెన్‌కు రూ.4వేలు చెల్లించి ఆ పార్సిల్ తీసుకున్న రమేష్ తెరిచి చూడగా నాలుగు ఇత్తడి రంగులో ఉన్న రేకుల బొమ్మలు కనిపించాయి. ఒకటి తాబేలు, శ్రీచక్రం, లక్ష్మీదేవి, పాదుకల బొమ్మలు ఉండడంతో ఖంగు తిన్న రమేష్ తాను మోసిపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు తనను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రమేష్ కోరారు. -
మోసపోయిన సినీ నటుడు, ఆరుగురి అరెస్టు
హైదరాబాద్: సీఐడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డు ఎస్ఐ అవతారం ఎత్తాడు. ఓ ఛానెల్లో పనిచేస్తున్న డ్రైవర్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు మహిళా రిపోర్టర్ అవతారం ఎత్తారు. అంతా కలిసి ఓ సినీ నటుడి ఇంట్లోకి ప్రవేశించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నావంటూ బెదిరించి డబ్బులు లాక్కున్నారు. అంతేకాకుండా ఇంకా డబ్బు కావాలంటూ కిడ్నాప్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణానగర్‌లో నివసించే సినీ నటుడు కాలెపు శ్రీనివాసరావు(48) నివాసంలోకి గత నెల 31వ తేదీన ఉదయం 10.30 గంటలకు అయిదుగురు యువకులు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. తమను తాము పోలీసులమని, న్యూస్ఛానెల్ ప్రతినిధులమంటూ లాఠీతో పాటు డమ్మీ పిస్టల్, ఛానెల్ లోగోతో లోనికి ప్రవేశించి శ్రీనివాసరావును వ్యభిచారగృహం నిర్వహిస్తున్నావంటూ కెమెరా ఆన్‌చేసి బెదిరించారు. ఇంటి బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు. బలవంతంగా కారులో తీసుకుని వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బును డ్రా చేయించారు. రూ. 2 లక్షలు ఇస్తే టీవీ ఛానెల్లో రాకుండా చేస్తామంటూ నగరమంతా తిప్పారు. వారి బారినుంచి తప్పించుకొని బయటపడ్డ శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారించగా.. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్ఐగా బిల్డప్ ఇచ్చాడు. ఓ టీవీ ఛానెల్ డ్రై వర్గా పని చేస్తున్న మధు కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు ఛానెల్ విలేకరినంటూ అదరగొట్టారు. ఛానెల్ యజమానే మీ జీతాలు మీరే సంపాదించుకోండి నాక్కూడా నెలకు ఒక్కొకరు రూ.25 వేలు తెచ్చివ్వండి అని చెప్పడంతో తామంతా రోడ్డు కెక్కామని నిందితులు తెలిపారు. ఛానెల్ ప్రతినిధులమంటూ చెప్పుకున్న జలీల్, జగదీష్, మధు, సంజయ్‌రెడ్డి, లక్ష్మి, దుర్గ, హోంగార్డు రాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఛానెల్ ఎండీని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
తల్లడిల్లుతున్న తల్లులు
-
ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం
-
ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం
మణుగూరు(ఖమ్మం): మనసిచ్చానన్నాడు.. కలిసి జీవితం పంచుకుందాం అని మాయ మాటలు చెప్పాడు. సహజీవనం చేసి బాబు పుట్టాక ఆచూకీ లేకుండా పోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళ ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మణుగూరు పీ వీ కాలనీలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్(26) హైదరాబాద్‌లో ఉంటూ ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పని చేస్తున్న సునీత(22)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల వారికి తెలియకుండా వీరిద్దరు నగరంలో సహజీవనం చేయడం ప్రారంభించారు. వీరికి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పటినుంచి ప్రవీణ్‌కుమార్ తీరు మారడంతో పాటు మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సునీత తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన సునీత బంధువులు ప్రవీణ్‌కుమార్ ఇంటిపై దాడి చేయడానికి వెళ్లారు. ఆ దాడి గురించి ముందే తెలిసిన ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కాగా.. ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్ ఉంటున్న చోటు కూడా తనకు తెలియకపోవడంతో పలు చోట్ల వెతికిన సునీత చివరకు విసిగిపోయి.. స్థానిక పీవీ కాలనీలోని ప్రవీణ్ ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. బుధవారం తన కుటుంబ సభ్యులతో పాటు మహిళ సంఘాల సహకారంతో ప్రవీణ్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పింది. -
ప్రియుడి ఇంటి ముందు ధర్నా
నల్లగొండ: ప్రియుడి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. దేవరకొండకు చెందిన రణబీర్రెడ్డి అనే వ్యక్తి తనను పెళ్లి పేరుతో మోసం చేసాడని ఆరోపిస్తూ ప్రియురాలు ధర్నాకు దిగింది. రణబీర్రెడ్డి ఇంటి ముందు మహిళ సంఘాలతో కలిసి ఆ యువతి ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరుతో మోసపోయిన యువతి
-
సహజీవనం పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: ఉద్యోగంతో పాటు వ్యాపారంలో వాటా ఇస్తానని మాయమాటలతో నమ్మబలికి సహజీవనం చేసి మోసానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఏడుగురిపై కోర్టు ద్వారా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు.. 25వ మెట్రోపాలిటన్ కోర్టు ద్వారా ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సీఐ నర్సింహులు వివరించారు. నిజాంపేటలో నివాసముండే సంకు రమణ(33) హబ్సిగూడలోని ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ రియల్ఎస్టేట్ కార్యాలయంలో ఏజీఎంగా పని చేస్తున్నాడు. నింబోలి అడ్డలో నివాసం ఉండే ఓ వివాహిత(27) ఫార్చూన్ బటర్ ఫ్లై సిటీ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరింది. 2014 నుంచి మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీలో మరో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మార్కెటింగ్ మేనేజర్‌ను ఆ రోజు నుంచి అక్కడే విధులు నిర్వహించాలని రమణ చెప్పాడు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రమణ కార్యాలయంలోనే ఉండేవాడు. కారులో తీసుకెళ్తూ వివాహితతో అన్యోన్యంగా మెలిగాడు. జీతంతో పాటు చేసే వ్యాపారంలో 50 శాతం వాటా ఇస్తానని, రూ. 25 లక్షలు డిపాజిట్ చేస్తానని, ఐదేళ్ల కొడుకును డిగ్రీ వరకు తానే చదివిస్తానని నమ్మబలికాడు. మహరాణిలా చూసుకుంటానని, భర్తకు విడాకులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. కార్యాలయానికి సమీపంలోనే అయ్యప్ప సొసైటీలో మరో ఫ్లాట్ అద్దెకు తీసుకొని మార్కెటింగ్ మేనేజర్‌ను అక్కడే ఉంచాడు. వీకెండ్లో ఆమె ఫ్లాట్‌లోనే రాత్రి వేళల్లో ఉంటూ సహజీవనం చేస్తూ, రిసార్ట్స్‌లలో తిప్పాడు. ఆమె గర్భం దాల్చడంతో మత్తు ఇచ్చి గర్భస్రావం అయ్యేటట్లు చేశాడు. బలవంతంగా మద్యం తాగించేవాడు. భార్య జానకీ పాటు సహ ఉద్యోగులు కిరణ్, రాజేష్, వాసు, రవి, మధు, రాములు సహజీవనం విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. జీతంతోపాటు కమిషన్ రూ.5 లక్షలు రావాల్సి ఉంది. ఈలోగా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఫ్లాట్ అద్దె గడువు ముగియడంతో యజమాని ఖాళీ చేయాలని బాధితురాలితో చెప్పాడు. దీంతో ఆమె రమణను ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. సెప్టెంబర్ 26న మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా వినాయక నిమజ్జనంలో పోలీసులు ఉండటంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. సంకు రమణతో పాటు అతనికి సహకరించిన కూకట్‌పల్లికి చెందిన కిరణ్(40), రాజేష్(32), వాసు(32), రవి(33)లతో పాటు ప్రధాన నిందితుడి భార్య జానకి అలియాస్ ధనలక్ష్మి(29), మధు(30), రాము(29)లపై కోర్టు ద్వారా ఐపీసీ 420, 313, 376, 506, రెడ్‌విత్-34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. బాధితురాలు శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు విచ్చేశారు. మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. ఆమె నుంచి సీఐ వివరాలు సేకరించి గచ్చిబౌలిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. సీఐ సునీత బాధితురాలి నుంచి మరిన్ని వివరాలను సేకరించారు. దాదాపు ఏడాదిపాటు సహజీవనం చేసి మోసగించినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. -
పుస్తెలు కట్టి పారిపోయిన ఘనుడు
-
ఆ ముసుగులో కోరికలు తీర్చుకుంటున్నాడు
-
నాకోసం కాకపోయినా...బిడ్డ కోసం అయినా..
-
బోర్డు తిప్పేసిన స్టడీ సర్కిల్
-
ప్రేమించి మోసపోయిన యువతి
-
ఆరేళ్లు ప్రేమించి...పెళ్లి మాత్రం వద్దన్నాడు
హయత్‌నగర్(రంగారెడ్డి జిల్లా): ప్రేమ పేరుతో లోబరుచుకుని, చివరికి పెళ్లికి నిరాకరించిన యువకుడిపైపోలీసులుకేసు నమోదు చేశారు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కొలిచెర్లకు చెందిన అంజయ్య కుమారుడు శ్రీనివాస్ (28), హయత్‌నగర్‌లోని శాంతినగర్‌కు చెందిన ఓ యువతి (25) నిజామాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో 2011 వరకు బీటెక్ చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్రీనివాస్ ఆ యువతితో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. గత ఆరేళ్లుగా వీరి సంబంధం కొనసాగుతోంది. తీరా పెళ్లి చేసుకొమ్మని యువతి ఒత్తిడి చేయగా శ్రీనివాస్ నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నమ్మించి మోసం చేసిన ప్రేమికుడు
-
నమ్మించి ముంచేశారు
-
రూ. 70 లక్షలకు రిటైర్డ్ అడిషనల్ డీజీ టోపీ!
హైదరాబాద్: ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని మోసగించిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారిపై బుధవారం కేసు నమోదు అయింది. వివరాలు.. ఓఎన్జీసీలో పనిచేస్తున్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఎంబీబీఎస్ సీటుకోసం రిటైర్డ్ అడిషనల్ డీజీ మదన్‌లాల్‌ను ఆశ్రయించాడు. రూ. 70 లక్షలు ఇస్తే మెడిసిన్ సీటు ఇప్పిస్తానని మదన్ లాల్ నమ్మబలికాడు. దాంతో ఉదయ్ కుమార్ అతడు అడిగిన మొత్తం రూ. 70 లక్షలను ముట్టజెప్పాడు. అయితే సీటు ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వమని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో బాధితుడు హైటెక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉదయకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 403, 406, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'మోసం చేయడం చంద్రబాబు నైజం'
- పెద్దమాదిగను అవుతానని మాదిగలను పెద్ద మోసం చేశారు - తెలంగాణలో వర్గీకరణ తీర్మానం చేసిన టీడీపీ ఏపీలో ఎందుకు చేయదు - 14న విజయవాడలో మాదిగల విశ్వరూప మహాసభ - 16 నుంచి తెలంగాణలో దండయాత్ర కార్యక్రమాలు - ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ కందుకూరు: ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు పెద్ద మాదిగ అవుతానని చెప్పి..ఇప్పుడు పెద్ద మాలలను దగ్గరకు తీసి నమ్మిన మాదిగలను నట్టేట ముంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని, మోసం చేయడమే చంద్రబాబు నైజంగా మారిపోయిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ధ్వజమెత్తారు. మోసం, దగ, ద్వంద్వ విధానాలు చంద్రబాబుకు అలవాటన్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ గెస్టుహౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్గీకరణ చేపట్టి పెద్దమాదిగ అవుతావో లేక మాదిగల ద్రోహిగా, మోసగాడిగా నిలబడతావో తేల్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో చంద్రబాబు పాదయాత్ర చేసేందుకు ఎమ్మార్పీఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. వర్గీకరణను అమలు చేసి చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర తిరగరాయిస్తానని అని ప్రగల్బాలు పలికారని వివరించారు. ఇన్ని విధాలుగా మోసం చేసిన చంద్రబాబును మాదిగలు క్షమించరన్నారు. తెలంగాణలో వర్గీకరణ తీర్మానం కోసం పట్టుబట్టిన టీడీపీ, అధికారంలో ఉన్న ఏపీలో మాత్రం వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ధ్వజమెత్తారు. టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక విధానం, ఏపీలో ఒక విధానం అనుసరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాదిగలకు శక్తిని చాటేందుకు ఈనెల 14న విజయవాడలో మాదిగల విశ్వరూప సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు చంద్రబాబునాయుడుతో సహా అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు మాదిగలపై పగబట్టారని, ఆయన పగ తీర్చుకునే క్రమంలోనే మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి టి.రాజయ్యని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని మందకృష్ణమాదిగ అన్నారు. మంత్రులపై పత్రికల్లో వార్తలు వస్తే ఆ పత్రికలపై కోర్టు కేసులు వేయాలని కేసీఆర్ చెప్తున్నారే తప్పా మంత్రులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు ఈనెల 16వ తేదీ నుంచి తెలంగాణలో దండయాత్ర కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏప్రిల్ 4వ తేదీన లక్షలాది మంది మాదిగలతో కేసీఆర్ ఇంటిపై దండయాత్ర చేపడతామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పల్లి మాణిక్యాలరావుమాదిగ, రాష్ట్ర నాయకులు సూరపోగు శ్యామ్‌మాదిగ, జిల్లా ప్రధానకార్యదర్శి వర్లదేవదాసుమాదిగ పాల్గొన్నారు. -
వికలాంగులను మోసగించిన బాబు
కడప సెవెన్‌రోడ్స్ : అధికార వ్యామోహంతో చివరకు వికలాంగులను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసగించారని కడప మేయర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా ధ్వజమెత్తారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్‌ను రూ.1500కు పెంచుతామని ప్రకటించిన బాబు, ఇప్పు డు ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించిన సీఎం చివరకు వికలాంగులను మోసగించి తమకు మానవత్వం లేదని నిరూపించుకున్నారని నిప్పులు చెరిగారు. వికలాంగుల పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఏం సాధించారని బాబు వంద రోజుల సంబ రాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. పింఛన్లకు అర్హులను ఎంపిక చేసే కమిటీల్లో సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలను నియమిస్తున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి పింఛన్లన్నీ టీడీపీ అనుయాయులకు కట్టబెట్టేందుకు మరో నాటకానికి తెర లేపారని విమర్శించారు. వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, జిల్లా నాయకులు చిన్న సుబ్బయ్య, బీఎన్ బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, వైఎస్సార్సీపీ నాయకుడు షఫీ, దళిత మహాజన ఫ్రంట్ కన్వీనర్ సంగటి మనోహర్, ఏపీ బీసీ మహాసభ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం కన్వీనర్ జేవీ రమణ, ఎన్ఆర్ఐ ట్రస్టు చైర్మన్ తోట కృష్ణ, ప్రముఖ సంఘసేవకుడు సలావుద్దీన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బీసీ గంగులు, సీపీఐ నాయకుడు ఎల్.నాగసుబ్బారెడ్డి పాలొన్నారు. -
మోసపోయాం..
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్: జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పండుగరోజు అయినప్పటికీ రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ అందుబాటులో ఉండి బాధితుల ఫిర్యాదులు పరిశీలించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21కి పైగా ఫిర్యాదులు అందాయి. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
మైనర్ బాలికను గర్బవతిని చేసిన టీడీపీ కార్యకర్త!