
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారవేత్తకు చెందిన క్రిప్టోకరెన్సీ అకౌంట్ హ్యాక్ అయ్యింది. క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెట్టిన పెట్టుబడులను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. వ్యాపారవేత్తకు తెలియకుండా భారీ మొత్తంలో నిధులు స్వాహా అవ్వడంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త లోక్‌జిత్ సాయినాథ్ కొంతకాలంగా క్రిప్టోకరెన్సీ చేస్తున్నాడు. దీనిలో అధిక లాభాలను చూశాడు కూడా. అతనికి సంబంధించి ఇప్పటి వరకు అకౌంట్‌లో రూ. 2.2 కోట్లు ఉన్నాయి. ఐదు రోజులుగా క్రిప్టో కరెన్సీ అకౌంట్‌ను లోక్‌జిత్ సాయినాథ్ ఓపెన్ చేయలేదు. శుక్రవారం క్రిప్టోకరెన్సీకి చెందిన షేర్‌ను చూసుకునేందుకు, వ్యాపార లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నించగా..అందులోని రూ. 2.02 కోట్ల కరెన్సీ మాయమైంది. సైబర్ నేరగాళ్లు లోక్‌జిత్ సాయినాథ్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ లాగిన్ ఐడీని మార్చేశారు. పాస్‌వర్డ్‌ను సైతం చేంజ్ చేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.
చదవండి: బోరబండలో దారుణం.. మహిళను బెదిరించి.. ఇద్దరు యువకుల అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment