Crypto Currency
-
క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్?
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫారమ్.. భారతదేశంలో తన వెబ్3, బ్లాక్‌చెయిన్ అరంగేట్రం కోసం పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగమైన 'పాలిగాన్ ల్యాబ్స్'తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ 'జియో కాయిన్' (Jio Coin) తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.జియో కాయిన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలామంది జియో కాయిన్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్‌లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని బిటిన్నింగ్ సీఈఓ 'కాశిఫ్ రాజా' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.క్రిప్టో కరెన్సీ మీద ముకేశ్ అంబానీ చాలా సంవత్సరాలకు ముందే కన్నేశారని. ఈ రంగంలోకి అడుగుపెట్టాలని, ఓ స్పెషల్ కరెన్సీ తీసుకురావాలని భావించగా సమాచారం. ఇందులో భాగంగానే జియో కాయిన్ తీసుకు వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దీనికోసమే పాలిగాన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?జియో కాయిన్ రావడం నిజమైతే.. క్రిప్టో కరెన్సీ(Crypto Currency)కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 500 మిలియన్ల మంది క్రిప్టో కరెన్సీ వినియోగదారులు ఉన్నారు. అయితే జియోకు 470 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో కాయిన్ అందుబాటులో వస్తే.. వీరందరి ద్రుష్టి దీనిపైన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.🇮🇳Big Breaking News:- Jiocoin Launched On Polygon.Reliance Jio, the world's largest mobile operator, has just surprised the crypto world by officially launching Jiocoins!What are Jiocoins?Jiocoins are digital tokens issued on Polygon.Jiocoins is a mechanism to reward… pic.twitter.com/MNRb5HGa08— Kashif Raza (@simplykashif) January 16, 2025 -
2024లో 120 శాతం: 2025లో బిట్‌కాయిన్ వృద్ధి ఎలా ఉంటుందంటే?
ఒకప్పుడు క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ (Bitcoin) విలువ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ 'బిట్‌కాయిన్' అనే స్థాయికి చేరిపోయింది. 2024లో ఇది ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదు చేసింది.యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు.. వరుస ర్యాలీని అనుసరించి పెట్టుబడిదారులు లాభాలను పొందడం ప్రారంభించడంతో, డిసెంబర్లో బిట్‌కాయిన్ 3.2 శాతం పడిపోయింది. అయితే ఈ ఏడాది దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.83 లక్షల కంటే ఎక్కువ. ఇది బంగారం & గ్లోబల్ ఈక్విటీలను సైతం అధిగమించింది. 2025 జనవరి 20 వరకు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు.. బిట్‌కాయిన్ విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంది.2025లో బిట్కాయిన్డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. బిట్‌కాయిన్ విలువ మరింత పెరుగుతుందని క్రిప్టో ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్స్ కూడా బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్ మరింత బలపడే అవకాశం ఉందని QCP క్యాపిటల్స్ వెల్లడించింది.2024లో కంటే ఈ ఏడాది బిట్‌కాయిన్ విలువ గణనీయంగా పెరుగుతుందని.. బినాన్స్ రీజనల్ మార్కెట్స్ హెడ్ 'విశాల్ సచీంద్రన్' అన్నారు. అధికారులతో బలమైన సహకారాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా.. వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బ్లాక్‌చెయిన్ యుటిలిటీని పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో భారతదేశం యొక్క పాత్ర పట్ల ఆయన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: హార్డ్ డ్రైవ్‌లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాటక్రిప్టో రంగం కీలకమైన దశలోకి ప్రవేశిస్తోందని.. మెరుగైన వృద్ధిని ఆశించవచ్చని కాయిన్ డీసీఎక్స్ కో ఫౌండర్ 'సుమిత్ గుప్తా' వెల్లడించారు. బిట్‌కాయిన్ షేర్ కూడా 10-15 శాతం పెరుగుతుందని అన్నారు. క్రిప్టో & వెబ్3 కంపెనీల IPOల ద్వారా నడిచే సంస్థాగత పెట్టుబడి గురించి గుప్తా ఆశాజనకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2025 కీలకమైన సంవత్సరంగా ఉంటుందని వివరించారు.జెబ్ పే సీఈఓ 'రాహుల్ పగిడిపాటి', పీఐ42 కో ఫౌండర్ అండ్ సీఈఓ 'అవినాష్ శేఖర్', సీఐఎఫ్డీఏక్యూ ఛైర్మన్ & ఫౌండర్ 'హిమాన్షు మరడియా', డెల్టా ఎక్స్ఛేంజ్ కో ఫౌండర్ అండ్ సీఈఓ 'పంకజ్ బాలని' వంటి వారు కూడా బిట్‌కాయిన్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. -
ట్రంప్ మాట.. అమాంతం ఎగిసిన బిట్ కాయిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక యూఎస్ డాలర్ దూసుకెళ్తోంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ మంగళవారం నాలుగు నెలల గరిష్ట స్థాయికి దగ్గరగా బలపడింది. మరోవైపు రానున్న ట్రంప్ పాలనలో ప్రయోజనం ఉంటుందన్న భావనతో ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు దృష్టి సారించడంతో బిట్ కాయిన్ విలువ మంగళవారం అమాంతం పెరిగి సరికొత్త ఆల్‌టైమ్ హైకి చేరింది.యూరో విలువ రాత్రికి రాత్రే దాదాపు ఏడు నెలల పతనానికి చేరుకుంది. అలాగే చైనీస్ యువాన్ కూడా మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరోతో సహా ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చే యూఎస్ డాలర్ ఇండెక్స్.. జూలై 3 తర్వాత మొదటిసారి సోమవారం నాడు 105.70కి చేరగా ఇప్పుడు (0037 GMT) 0.07% పెరిగి 105.49కి చేరుకుంది.ఇదీ చదవండి: కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్కాబోయే అధ్యక్షుడు ట్రంప్ క్రిప్టోకరెన్సీకి అత్యధిక ప్రాధన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ మంగళవారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 89,637 డాలర్లు (రూ. 7.44 లక్షలు)కి చేరుకుంది. తాను గెలిచాక అమెరికాను " క్రిప్టో రాజధాని"గా మారుస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఏడాది ముగిసేలోపు బిట్‌కాయిన్ లక్ష డాలర్ల మార్కును తాకుతుందని క్యాపిటల్ డాట్ కామ్ (Capital.com) సీనియర్ ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు కైల్ రోడ్డా అంటున్నారు. -
చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్‌మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్‌లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్‌ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
క్రిప్టో కరెన్సీ ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’కు షాక్
న్యూఢిల్లీ: అక్రమ నగదు చలామణి నిరోధక (పీఎంఎల్ఏ) చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రముఖ అంతర్జాతీయ క్రిప్టో ఎక్సే్ఛంజ్ ‘బినాన్స్’పై జరిమానా పడింది. కేంద్ర ఆరి్థక శాఖ పరిధిలో పనిచేసే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐఈ) రూ.18.82 కోట్ల జరిమానా చెల్లించాలంటూ బినాన్స్‌ను ఆదేశించింది. వర్చువల్ డిజిటల్ అస్సెట్ (ఆన్లైన్లో డిజిటల్ ఆస్తులను అందించే) ప్రొవైడర్‌గా బినాన్స్, పీఎంఎల్ఏ కింద తగిన సమాచారాన్ని నివేదించడంలో వైఫల్యం చెందినట్టు ఎఫ్ఐయూ తన ఆదేశాల్లో పేర్కొంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ సరీ్వస్ ప్రొవైడర్లు ఎఫ్ఐయూ కింద రిపోరి్టంగ్ ఎంటిటీగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. అన్ని లావాదేవీలను రికార్డు చేయడంతోపాటు, ఆయా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఐయూకి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఆరి్థక నేరాలను నియంత్రించేందుకు ఎఫ్ఐయూ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నిజానికి పీఎంఎల్ఏ కింద బినాన్స్ నమోదు చేసుకోకుండానే భారత్‌లో తన సేవలు అందించింది. దీంతో బినాన్స్ యూఆర్ఎల్లపై కేంద్ర సర్కారు నిషేధం విధించడంతోపాటు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో రిపోరి్టంగ్ ఎంటిటీగా ఎఫ్ఐయూ కింద బినాన్స్ నమోదు చేసుకుంది. బినాన్స్తోపాటు మరో ఎనిమిది క్రిప్టో సంస్థలకూ కేంద్రం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. -
అనంత్ అంబానీపై క్రిప్టో ముఠా ఫేక్ న్యూస్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు, రిలయన్స్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అనంత్ అంబానీపై క్రిప్టోముఠా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తోంది. క్రిప్టో కరెన్సీతో అధిక లాభాలు వస్తాయని అనంత్ అంబానీ అంగీకరించినట్లు అమాయకులను మోసగిస్తూ ఆయన పేరును వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా, ఆయనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు వేసినట్లుగా బీబీసీ పేరుతో క్లిక్‌బైట్ హెడ్డింగ్లతో క్రిప్టో ముఠా రూపొందించిన తప్పుడు కథనాలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ తన సహాయకుడు "1X ఆల్రెక్స్ ప్లాట్‌ఫారమ్"ని ఉపయోగించి డబ్బు సంపాదించాడని చెప్పినట్లుగా ఓ కథనం పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో కూడా అంబానీ ప్లాట్ఫామ్లో నమోదు చేయించారని, అతను వెంటనే లాభం పొందాడని పేర్కొంది. ఇవన్నీ తప్పుడు కథనాలే అని ఆయా వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. నెటిజన్లను తప్పుదోవ పట్టించి క్రిప్టో కరెన్సీ ద్వారా మోసగించేందుకే క్రిప్టో ముఠాలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. -
క్రిప్టో కింగ్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష: కారణం ఇదే..
బ్లాక్ చెయిన్ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీల గురించి చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. ప్రభుత్వం, బ్యాంకుల జోక్యం లేకుండా జరుగుతాయి. దీని విలువ.. డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటుంది. క్రిప్టో కరెన్సీల ద్వారా కుబేరులు కూడా ఒక్కోసారి భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందులో దివాళా దీసిన బిలియనీర్లలో ఒకరు FTX ఫౌండర్, సీఈఓ, అమెరికా యువ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ 'శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్'. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు శామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌కు మార్చి 29న (గురువారం) 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. FTX కస్టమర్లు డబ్బును పోగొట్టుకోలేదని బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ చేసిన వాదనను తిరస్కరించిన తర్వాత ఈ శిక్షను విధించారు. అమెరికా చరిత్రలోనే ఆర్థిక మోసాలలో ఒకటిగా FTX అని, బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అది తప్పు అని తెలిసినప్పటికీ.. మోసాలకు పాల్పడ్డాడని న్యాయవాది పేర్కొన్నారు. ఎఫ్‌టీఎక్స్ కస్టమర్లు బాధపడ్డారని 20 నిమిషాల విచారణ తరువాత బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తరువాత సహోద్యోగులకు క్షమాపణలు చెప్పాడు. FTX కస్టమర్లు 8 బిలియన్ డాలర్లు, ఈక్విటీ పెట్టుబడిదారులు 1.7 బిలియన్ డాలర్లను కోల్పోయారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రుణదాతలు కూడా 1.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. దీంతో ఇతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎవరీ శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ అమెరికాకు చెందిన శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్ పూర్తి పేరు 'శామ్యూల్ బెంజమిన్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్'. ఈయన 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ (డిగ్రీ) పూర్తి చేశారు. ఆ తర్వాత క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్ల పాటు ట్రేడర్‌గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్‌టీఎక్స్‌ను ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలోనే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీగా అవతరించింది. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. -
Sam Bankman-Fried : క్రిప్టో కింగ్‌కి 40 నుంచి 50 ఏళ్ల జైలు శిక్ష?
సాక్షి, వాషింగ్టన్ : ప్రపంచంలోనే అపరకుబేరుడు, క్రిప్టో కింగ్, ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ 40 నుంచి 50 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించనున్నారా? తప్పు చేశానని ఒప్పుకుంటూనే తానెవరిని మోసం చేయలేదన్న శామ్ బ్యాంక్మాన్ ఫ్రైడ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తరుపున వాదించే ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని ఎందుకు కోరుతున్నారు. క్రిప్టో మొగల్ శామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌కు 40 నుంచి 50 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించాలనిప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. సుదీర్ఘంగా ఎందుకు జైలు శిక్ష విధించాలో చెబుతూ.. కస్టమర్లను 8 బిలియన్ల భారీ మోసానికి పాల్పడ్డారంటూ అందుకు తగ్గ ఆధారాల్ని కోర్టుకు అందజేశారు. గత ఏడాది నవంబర్‌లో ఎఫ్‌టీఎక్స్‌లో జరిగిన మోసాలపై అమెరికా న్యాయ స్థానం ఫ్రైడ్‌ను దోషిగా పరిగణలోకి తీసుకుంది. కుట్ర, మనీ ల్యాండరింగ్, మోసంతో పాటు మొత్తం ఏడు రకాల కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 28 నుంచి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ప్రైడ్కు అనారోగ్య సమస్యలు అయితే, ఫ్రైడ్ న్యాయవాదులు 98 పేజీల మెమోలో ప్రైడ్ ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఐదు నుండి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరారు. మెమోలో తన క్లైయింట్ (ప్రైడ్) నాడీ సంబంధిత అనారోగ్య బాధపడుతున్నారని, వాటిని అధిగమించలేకపోతున్నారని పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తారా? దీనిపై ప్రభుత్వం తరుపు ప్రాసిక్యూటర్లు ప్రైడ్ కుటుంబం గురించి, వారి తల్లిదండ్రుల గురించి ఆరా తీశారు. నిందితుడి తల్లిదండ్రులిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సీ ప్రొఫెసర్లు. ఫ్రైడ్ సైతం ఎంఐటి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.కానీ అత్యాశ, మదుపర్లు పెట్టిన పెట్టుబడులతో జూదం ఆడినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? మార్చి 28 నుంచి ఫ్రైడ్ జైలు శిక్షను అనుభవిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్‌ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బిట్‌కాయిన్ సరికొత్త రికార్డ్‌లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్‌కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్‌తో బిట్‌కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్‌కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్‌ను దాటి రికార్డ్‌లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్‌టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్‌కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
రూ.83 వేల కోట్ల మోసం : జైలు శిక్ష పడుతుందని.. ప్రియురాల్ని ఇరికించాడు!
మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ కోర్టు విచారణ సందర్భంగా తనని తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ కుప్పకూలిపోవడంతో నా వల్ల చాలా మంది బాధపడ్డారు. అయితే, తానెవరినీ మోసం చేయలేదని, కస్టమర్ల నుంచి బిలియన్ డాలర్ల మొత్తాన్ని దోచుకోలేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 83వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) మోసానికి గాను ఏళ్ల తరబడి జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశ్యంతో చేసిన నేరాన్ని తన ప్రియురాలు కరోలిన్ ఎల్లిసన్పై నెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా 134 ఎఫ్‌టీఎక్స్ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు, 10 లక్షల మందికి పైగా క్రిప్టో మదుపరులు నష్టం’ వంటి కారణాలతో అమెరికా దర్యాప్తు సంస్థలు ఫ్రైడ్పై సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ (టెలికమ్యూనికేషన్, టెక్నాలజీని వినియోగించి చేసే మోసం), మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందుకు డజనకుపైగా కేసులు నమోదు చేశాయి. వీటిపై న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్‌ను విచారిస్తుంది. ప్రియురాల్ని ఇరికించి తాజాగా,ఫెడరల్ కోర్టు నిర్వహించిన విచారణకు ఫ్రైడ్, అతని తరుపు వాదించే లాయర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రైడ్‌ను విచారిస్తున్న న్యాయమూర్తులతో రిస్క్-మేనేజ్మెంట్ టీమ్‌ను నియమించుకోవడం వంటి తప్పులు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదే సమయంలో తాను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటే జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో తన ప్రియురాలు, 2017లో ఫ్రైడ్ స్థాపించిన ట్రేడింగ్ కంపెనీ అలమెడా రీసెర్చ్ సీఈవో కరోలిన్ ఎల్లిసన్‌ను ఇరికించారు. ఆరు గంటల వాంగ్మూలంలో ‘మేం మార్కెట్లో అత్యుత్తమ ప్రొడక్ట్‌ను తయారు చేయగలమని భావించాము. కానీ ఊహించిన దానికి విరుద్ధంగా మారింది. దీంతో కస్టమర్లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. కంపెనీ దివాలా తీసింది’అని బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో తన ఆరు గంటల వాంగ్మూలంలో చెప్పాడు. నేరం రుజువైతే దశాబ్ధాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే తనపై నమోదైన డజనకు పైగా కేసుల్లో తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశాడు. 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ ఫండ్లను అలమెడా రీసెర్చ్‌కు తరలించారని, ఎన్నికల ప్రచారం కోసం అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులకు 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. డిఫెన్స్ లాయర్ మార్క్ కోహెన్ ప్రశ్నలకు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ స్పందిస్తూ.. స్పాన్సర్‌షిప్‌లు, రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించే నిధులు ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ల నుండి రాలేదని, కంపెనీ ఆదాయం,ఈక్విటీ పెట్టుబడిదారుల నుండి పొందిన కమీషన్ల నుంచి వచ్చినట్లు తాను నమ్ముతున్నానని అన్నాడు. రాజకీయ విరాళాలు ఇచ్చేందుకు తనకున్న ఆలమేడ నుంచి అప్పు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం ప్రియురాలే చేసింది 2022 జూన్‌లో క్రిప్టో మార్కెట్ క్రాష్ అయ్యింది. దీంతో పెట్టుబడి దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అల్మెడ బ్యాలెన్స్ షీట్లను తప్పుగా మార్చమని చెప్పినట్లు ఫ్రైడ్ వివరించాడు. ఆ బ్యాలెన్స్ షీట్లను చూసే అవసరలేదని భావించానని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సుదీర్ఘ విచారణలో ఫ్రైడ్ నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం విచారణను కోర్టు వాయిదా వేసింది. ఎవరీ బ్యాంక్మన్-ఫ్రైడ్ క్రిప్టో ఎక్స్ఛేంజీ ఎఫ్‌టీఎక్స్‌ను 2019లో బ్యాంక్మన్-ఫ్రైడ్ స్థాపించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఇది విస్తరించింది. 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ డిగ్రీని ఆయన పూర్తి చేశారు. అనంతరం క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్ల పాటు ట్రేడర్‌గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్‌టీఎక్స్‌ను ఏర్పాటు చేశారు. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. ఆయన సంపదలో అధిక మొత్తాన్ని స్వచ్ఛంద సేవకు ఇస్తానని హామీ ఇచ్చారు. -
క్రిప్టో కరెన్సీపై జీ20 రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీకి సంబంధించి సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను వేగంగా, సమన్వయంతో అమలు చేయాలని జీ20 దేశాల ఆర్థికమంత్రులు పిలుపునిచ్చారు. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు ఆమోదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం గురించి ఇక్కడ సమావేశం ఎటువంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం. చమురుపైన పశి్చమాసియా ఉద్రిక్తతల ప్రభావం... కాగా, ఈ సమావేశాల సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంక్షోభం వల్ల ఇంధనం (ధరల పెరుగుదల) గురించి ఆందోళనలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఇవి చాలా దేశాలు కలిగి ఉన్న ఆందోళనలు. భారత్ తరహాలోనే ఇతర దేశాలు కూడా ఈ అంశంపై ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ఆందోళనలు ఆహార భద్రత అంశాలను, సరఫరాల చైన్‌ను ప్రభావితం చేస్తాయి’’ అని అన్నారు. జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేíÙయా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం వాటాను, వాణిజ్యంలో 75 శాతం వాటాను, ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొరాకో ఆర్థిక రాజధాని మరకే‹Ùలో జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో జరిగిన నాలుగవ, చివరి జీ20 ఆర్థిక మంత్రులు– సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కూడా చిత్రంలో ఉన్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ ఆమె వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైమాసిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. -
G20 Summit: క్రిప్టో సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం
న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచార వ్యవస్థ క్రిప్టో అసెట్ రిపోరి్టంగ్ ఫ్రేమ్‌వర్క్ (సీఏఆర్ఎఫ్) ఏర్పాటును వేగంగా అమలు చేయాలని జీ–20 సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. ఆర్థికేతర ఆస్తులపై సమాచార మార్పిడిని 2027 నాటికి ప్రారంభించాలని నిర్ణయించాయి. 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా న్యాయ, స్థిర, ఆధునిక అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ పట్ల సహకారాన్ని కొనసాగించాలనే నిబద్ధతను అభివృద్ధి చెందుతున్న, చెందిన 20 దేశాల నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పెద్ద కంపెనీల కోసం పన్ను నియమాలను మార్చడానికి, బహుళజాతి సంస్థల పన్ను ప్రణాళికను పరిమితం చేయడానికి మరింత శాశ్వత, సమర్థవంత ప్రణాళికను కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) చర్చిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు పన్నులు చెల్లించే అంశాలను మార్చడం, ప్రపంచవ్యాప్తంగా కనీస పన్నును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను రెండు మూల స్తంభాలుగా పేర్కొంటూ కసరత్తు చేస్తున్నారు. రెండు స్తంభాల పరిష్కారంలో జీ–20 దేశాలు గణనీయమైన పురోగతిని సాధించాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఓఈసీడీ సహకారంతో పన్ను, ఆర్థిక నేర పరిశోధన కోసం దక్షిణాసియా అకాడమీ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్‌తో.. తొలుత భరత్‌ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్ తైవాన్‌లో ఉండే స్వాంగ్ లిన్‌కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్‌కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ సహకారం కావాలి
న్యూఢిల్లీ: క్రిప్టో అసెట్స్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కలిసి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. వాటిని నియంత్రించాలన్నా లేక నిషేధించాలన్నా అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా సహకారం అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. వాటిపై పన్నుల విధింపు, ప్రమాణాల మీద పలు దేశాలు, సంస్థలు అధ్యయనం చేస్తున్నందున అన్నీ సమిష్టిగా కలిసి రావడమనేది ఎప్పటికి జరుగుతుందని నిర్దిష్టంగా చెప్పలేమని లోక్‌సభకు మంత్రి తెలియజేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణభారం రూ. 58.6 లక్షల కోట్లుగా (స్థూల దేశీయోత్పత్తిలో 52.2 శాతం) ఉండగా 2023 మార్చి 31 నాటికి ఇది రూ. 155.6 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 57.1 (శాతం) చేరిందని చౌదరి తెలిపారు. -
క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు
Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్‌ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు తప్పిపోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను పోలీసులు కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్‌కేస్‌లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్‌కేస్‌ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా సూట్‌కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది. చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడి పని అని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు. కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆర్జించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మిలియన్ ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి కనిపించకుండా పోయాడు. -
ప్రపంచ ఆర్థిక నేరాలను నిరోధించాలి
గాందీనగర్: ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్, క్రిప్టో కరెన్సీలతో సహా వివిధ అసెట్ క్లాస్‌ల గురించి సమాచారాన్ని పంచుకోవడం, ఆయా సవాళ్లను నిరోధించడం కోసం గ్లోబల్ ఆర్కిటెక్చర్‌ను మరింత బలోపేతం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా చట్ట అమలు సామర్థ్యం పెరగాలని ఉద్ఘాటించారు. పన్ను ఎగవేతలు, అవినీతి, అక్రమ ధనార్జన నిరోధంపై ఇక్కడ జరిగిన జీ20 అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. జీ20 ప్రెసిడెన్సీ కింద, ఓఈసీడీ సహకారంతో దక్షిణాసియా ప్రాంతంలో పన్ను, ఆర్థిక నేర పరిశోధనలో సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారతదేశం ముందుందని సీతారామన్ అన్నారు. కీలక భేటీలు.. ఇండోనేíÙయా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాని ఇంద్రావతి, కెనడా డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్లతో కూడా ఆమె ఈ సందర్భంగా సమావేశమై, ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. 3వ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆసియాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)ప్రెసిడెంట్ జిన్ లిక్వెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశం నిర్వహించారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల భేటీలో పాల్గొనడానికిగాను అమెరికా ఆర్థికమంత్రి జానెత్ యెల్లెన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా తదితరులు కూడా గాంధీనగర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురూ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫెసిలిటీని సందర్శించారు. పట్టణ మౌలిక రంగంపై పెట్టుబడులు కాగా, జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌పై జరిగిన మరో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక రంగం అభివృద్ధికి ప్రైవేటు పె ట్టుబడులను ఆకర్షించడం అవసరమని పేర్కొన్నా రు. అభివృద్ధి చెందుతున్న పలుదేశాల్లో కఠిన ద్రవ్య విధానాలు అవలంభిస్తున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి కీలక సవాలుగా మారిందని కూడా అన్నారు. -
భవిష్యత్తు కరెన్సీ క్రిప్టో.. డిజిటల్ ఆస్తిగా పరిగణన
న్యూఢిల్లీ: భారతీయుల్లో 37 శాతం మంది క్రిప్టో కరెన్సీలను భవిష్యత్తు కరెన్సీగా భావిస్తున్నారు. భవిష్యత్తు డిజిటల్ ఆస్తిగా 31 శాతం మంది పరిగణిస్తున్నారు. ఈ విషయాలు యూగోవ్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. వెబ్ఈ, క్రిప్టో ఎకోసిస్టమ్‌పై ప్రజల్లో అవగాహన తెలుసుకునేందుకు భారత్ సహా 15 దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మే 18 మధ్య దీన్ని నిర్వహించారు. మన దేశం నుంచి 1013 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో భాగం కావడంగా క్రిప్టోలను మన దేశీయులు పరిగణిస్తున్నారు. సర్వే ఫలితాలు క్రిప్టోపై విస్తృతమైన అవగాహనతో పాటు క్రిప్టో ఆధారిత భవిష్యత్తును తెలియజేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. ♦ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 92 శాతం మంది క్రిప్టో పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పారు. ♦ 37 శాతం మంది భవిష్యత్తు డబ్బుగా క్రిప్టోని పేర్కొంటే, భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా 31 శాతం మంది తెలిపారు. ♦ మరీ ముఖ్యంగా 17 శాతం మంది క్రిప్టోని స్పెక్యులేటివ్ సాధనంగా చెప్పగా, ఏకంగా 20 శాతం మంది అయితే స్కామ్‌లుగా చెప్పడం గమనార్హం. ♦ ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఇప్పటికే క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారు. ♦ వచ్చే 12 నెలల్లో క్రిప్టోల్లో పెట్టుబడులు పెడతామని 57 శాతం మంది తెలిపారు. ♦ క్రిప్టోలను పర్యావరణ అనుకూల టెక్నాలజీగా 57% మంది పేర్కొన్నారు. ♦ ఉత్తరాది, మధ్య, తూర్పు భారత్, ఈశాన్య రా ష్ట్రాల్లో అత్యధికంగా 94% మంది క్రిప్టో కరెన్సీ ల పట్ల ఆసక్తితో ఉంటే, పశ్చిమభారత్లో 92%, దక్షిణాది రాష్ట్రాల్లో 89% ఆసక్తి వ్యక్తమైంది. ♦ డేటా గోప్యత ముఖ్యమని 62% మంది చెప్పగా, ఇంటర్నెట్లో తమ గుర్తింపుపై తమకు మరింత నియంత్రణ అవసరమని 53% మంది తెలిపారు. ♦ క్రిప్టో మార్కెట్లో ఉన్న తీవ్ర ఆటుపోట్లు, స్కాముల భయం ఈ పరిశ్రమలో ప్రవేశానికి పెద్ద అడ్డంకులుగా ఈ సర్వే పేర్కొంది. అలాగే, క్రిప్టో ఎకోసిస్టమ్ సంక్లిష్టంగా ఉండడాన్ని కూడా అవరోధంగా పేర్కొంది. ♦ 53% మంది మెటావర్స్, 41% మంది వెబ్3, 42% మంది ఎన్ఎఫ్టీ గురించి అవగాహన ఉన్నట్టు ఉన్నారు. క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి సంబంధం లేదు రతన్ టాటా స్పష్టీకరణ ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటా తనకు క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి అనుబంధం ఏ రూపంలోనూ లేదని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల్లో రతన్ టాటాకు పెట్టుబడులు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను బలంగా ఖండించారు. ‘‘నెటిజన్లూ ఇలాంటి ప్రచారానికి దూరంగా ఉండండి. క్రిప్టో కరెన్సీతో నాకు ఏ రూపంలోనూ అనుబంధం లేదు. క్రిప్టో కరెన్సీతో నాకు అనుబంధం ఉందంటూ ఏదయినా ప్రకటన కానీ లేదా ఆర్టికల్‌ను కానీ చూస్తే అది వాస్తవం కాదు. కేవలం నెటిజన్లను మోసపుచ్చేందుకే’’ అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. 2021లో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఇదే విధంగా క్రిప్టో కరెన్సీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
‘దయ చేసి నమ్మకండి.. అవన్నీ అవాస్తవాలే’!
రతన్ టాటా..పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లోని దిగ్గజ పారిశ్రామికవేత్త. గొప్ప మానవతావాది..దాతృత్వం కలిగిన వ్యక్తి. టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నా.. టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా, ఆన్లైన్లో తన పేరుతో జరుగుతున్న మోసాలపట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని రతన్ టాటా కోరారు. ‘దయచేసి అప్రమత్తంగా ఉండండి. నేను ఏ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టలేదు. ఏ క్రిప్టోకరెన్సీ సంస్థలతో సంబంధం లేదు’ అని అన్నారు. క్రిప్టోకరెన్సీ కంపెనీలతో తనకు సంబంధం ఉందని ఏవైనా కథనాలు లేదా ప్రకటనలను మీరు చూసినట్లయితే, అవి పూర్తిగా అవాస్తవమని, పౌరులను మోసం చేయడానికి ఉద్దేశించినవి అని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. క్రిప్టో మోసాలకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. I request netizens to please stay aware. I have no associations with cryptocurrency of any form. pic.twitter.com/LpVIHVrOjy — Ratan N. Tata (@RNTata2000) June 27, 2023 చదవండి👉 రూ.5.3 కోట్ల ఫ్లాట్ కేవలం రూ.11లక్షలే.. ఎలా సాధ్యం? -
క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ మూసివేత
న్యూఢిల్లీ: అస్సెల్ మద్దతు కలిగిన క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ ‘పిల్లో’ తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. నియంత్రణల పరంగా అనిశ్చితి, కఠిన వ్యాపార పరిస్థితులను ఇందుకు కారణాలుగా పేర్కొంది. సిరీస్ ఏ రౌండ్లో 18 మిలియన్ డాలర్లు (రూ.147 కోట్లు) సమీకరించిన ఎనిమిది నెలలకే ఈ సంస్థ చేతులెత్తేయడం గమనార్హం. ‘పిల్లో యాప్ ద్వారా ఇక మీదట సేవలు అందించకూడదనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తున్నందుకు విచారిస్తున్నాం’’అని సంస్థ తన యూజర్లకు సమాచారం ఇచ్చింది. యూజర్ల నిధులపై వడ్డీ రాబడి ఇక్కడి నుంచి ఉండదని, రివార్డుల విభాగాన్ని యాక్సెస్ చేసుకోలేరని తెలిపింది. జూలై 31 వరకు క్రిప్టో విత్‌డ్రాయల్, జూలై 7 వరకు బ్యాంక్ విత్‌డ్రాయల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. -
సైబర్ వలలో మహిళలు!
సాక్షి, సిటీబ్యూరో: ‘వేసవి సెలవులు వచ్చాయి..మా పిల్లలకు యోగా నేర్పించాలని అనుకుంటున్నాం’ అంటూ గచ్చిబౌలికి చెందిన ఓ యోగా శిక్షకురాలికి ఫోన్ వచ్చింది. సరే అని ఆమె సమయం, ఫీజు తదితర వివరాలు తెలిపింది. అడ్వాన్స్ చెల్లిస్తామని శిక్షకురాలి బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ కార్డు వివరాలను సైబర్ నేరస్తులు తీసుకున్నారు. ఫోన్ పే ద్వారా తాము పంపిన లింక్‌కు రూ.10 చెల్లించండి, మీ ఖాతా అని నిర్ధారించుకున్న తర్వాత అడ్వాన్స్ పంపిస్తామని కేటుగాళ్లు సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె నగదు బదిలీ చేయగానే క్షణాల్లో ఆమె ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోయింది. లింక్‌లు పంపించి బురిడీ.. ఇంట్లోనూ ఉంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదించుకోండి’ అంటూ సైబర్ నేరస్తులు వల విసురుతున్నారు. నిజమేనని నమ్మి గృహిణులు చేతిలోని సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునూ పోగొట్టుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగం, వివాహం, ఆన్లైన్ ట్రేడింగ్ వంటి సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. నగరంలో జీవన వ్యయం పెరిగింది. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తే తప్ప గడవని పరిస్థితి. తమ చదువు, విజ్ఞానానికి అనుగుణంగా గృహిణులు టైలరింగ్, బ్యూటీషియన్, బేకింగ్ వంటి ఉపాధి అంశాలను ఎంచుకోవటం సాధారణం. ఆన్లైన్ లావాదేవీలు పెరిగాక ఈ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ట్యూషన్లు, సంగీతం, యోగా, నృత్యం, డిజిటల్ ప్రకటనలు, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలు ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఈ వెసులుబాటును సైబర్ నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లతో.. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు రూపొందించి గృహిణులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు సంపాదన కోసం మేమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆశ చూపిస్తున్నారు. మాయగాళ్ల వలకు చిక్కి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని మోసగాళ్ల ప్రకటనను నమ్మిన ఓ యువతి ఒంటి మీద బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టడం ఇందుకు ఉదాహరణ. కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆన్లైన్ ద్వారా వచ్చే సందేశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రకటనలు తేలిగ్గా నమ్మకూడదు. వాటిలో ఎంత వరకు నిజమో నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
క్రిప్టో కింగ్ కిడ్నాప్ డ్రామా.. ప్రజలను నిండా ముంచి ప్రైవేట్ జెట్ కొనేసాడు!
విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి ఎంతకైనా తెలిగిస్తాడు, ఎంతమందినైనా మోసగిస్తాడు. గతంలో ఇలాంటి సంఘటనలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల అలాంటి మరో సంఘటన కెనడాలో తెరపైకి వచ్చింది. క్రిప్టో కింగ్ 'ఐడెన్ ప్లెటర్స్కై' (Aiden Pleterski) కెనడాలో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున మోసం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కారణంగానే ప్రస్తుతం ఇతనిపైన టోరంటోలో కేసు కూడా నడుస్తోంది. అధికారులు ఇతని వద్ద నుంచి మిలియన్ డాలర్లను తిరిగి వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. లగ్జరీ లైఫ్‌కి అలవాటుపడిన ఐడెన్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసాడని కెనడాలోని బ్యాంక్రప్టసీ ట్రస్ట్ నివేదించింది. వారి వద్ద నుంచి సుమారు 40 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 330 కోట్లు కంటే ఎక్కువ) వసూలు చేసి కేవలం 2 శాతం మాత్రమే, అంటే రూ. 6 కోట్లు మాత్రమే పెట్టుబడులకు పెట్టాడని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? ఐడెన్ ప్లెటర్‌స్కైని గత ఏడాది డిసెంబర్లో దక్షిణ ఒంటారియోకు చెందిన దుండగులు కిడ్నాప్ చేసారని, అక్కడే మూడు రోజులు బందించి మూడు మిలియన్ డాలర్లు (సుమారు 24 కోట్లు) ఇవ్వాలని చిత్ర హింసలు పెట్టినట్లు అతని తండ్రి చెప్పాడు. లగ్జరీ లైఫ్ అనుభవించే ఐడెన్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా.. ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మోసపోయిన ఇన్వెస్టర్ల డబ్బుని తిరిగి చెల్లిస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే...
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీల్లాంటి వర్చువల్ అసెట్స్ నియంత్రణపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్ నిరోధక చట్టాలను వర్తింపచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో దేశీ క్రిప్టో ఎక్సే్చంజీలు ఇకపై అనుమానాస్పద లావాదేవీలేవైనా గుర్తిస్తే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా (ఎఫ్ఐయూ–ఐఎన్డీ)కి తెలియ జేయాల్సి ఉంటుంది. ఎంతో కొంత విలువ కలిగి, క్రిప్టో పద్ధతుల్లో జనరేట్ చేసిన కోడ్ లేదా నంబరు లేదా టోకెన్లను వర్చువల్ డిజిటల్ అసెట్లుగా పరిగణిస్తారు. (ఇదీ చదవండి: ఫోరెన్సిక్ ఆడిటర్లకు గడువు పెంపు) -
‘కింగ్ ఆఫ్ క్రిప్టో’ శామ్ బ్యాంక్ మన్ ఫ్రీడ్‌కు భారీ షాక్!
మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్ మన్ ఫ్రీడ్‌కు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఫ్రీడ్ అభ్యర్ధనని తిరస్కరిస్తూ ఆయనపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాలా తీసిన ఘటనలో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ అభ్యర్ధనను కోర్టు కొట్టిపారేసింది. ఫ్లిప్ ఫోన్ లేదంటే స్మార్ట్ ఫోన్ వినియోగించేందుకు ఫ్రీడ్‌కు అనుమతి ఇవ్వబోమని అమెరికా న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎఫ్‌టీఎక్స్ పతనం తర్వాత ఫ్రీడ్పై పలు దేశాల్లో ఆర్థిక నేరాల కింద అభియోగాలు నమోదయ్యాయి. అ అభియోగాలతో అమెరికా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు విచారణ కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్లో 250 మిలియన్ డాలర్ల బాండ్ పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.కోర్టు సైతం ఫ్రీడ్‌ను విడుదల చేస్తూ కఠిన ఆంక్షలు విధించింది. దివాలా కేసులో నిజానిజాలు తేలే వరకు న్యాయ స్థానం చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ బెయిల్‌పై విడుదలైన అనంతరం కాల్ఫిపోర్నియాలో తన కుటుంబసభ్యులతో గడుపుతున్న ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ కోర్టు నిబంధనల్ని లైట్ తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో యూఎస్ ఎఫ్‌టీఎక్స్ జనరల్ కౌన్సిల్ రైన్ మిల్లర్‌కు ఎన్క్రిప్టెడ్ మెసేజ్, ఫిబ్రవరి నెలలో థర్డ్ పార్టీ పీఎన్‌ను నెట్‌వర్క్‌ను రెండు సార్లు వినియోగించారు. తాజాగా కోర్టు విధించిన నిబంధనల్ని సడలించాలని ఫ్రీడ్ తన తరుపు లాయర్లతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఫ్రీడ్ సాక్షుల్ని ప్రభావితం చేసేలా గతంలో పలు మార్లు ఇంటర్నెట్ను వినియోగించడం, ఎన్ క్రిప్టెడ్ మెసేజ్‌లను పంపించారని ప్రతివాదులు కోర్టులో వాదించారు. అందుకు తగ్గ ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. అనంతరం ఇరుపక్షాల వాదనల విన్న న్యాయవాది లూయిస్ ఏ.కప్లాన్ ఫ్రీడ్ అభ్యర్ధనల్ని తిరస్కరించారు. -
G20 ministerial meeting: క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ విధానం అవసరం
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలను కట్టడి చేసేందుకు అంతర్జాతీయ విధానం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే అంతర్జాతీయ రుణ సమస్యలను ఎదుర్కొనేందుకు, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. జీ20 మంత్రుల సమావేశానికి ముందు అమెరికా, జపాన్, స్పెయిన్ తదితర దేశాల ఆర్థిక మంత్రులతో ఆమె ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో పలు అంశాలు చర్చించారు. శుక్రవారం నుంచి 2 రోజుల పాటు జరిగే జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నేతలు భారత్ వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ యెలెన్, జపాన్ ఫైనాన్స్ మినిస్టర్ షునిచి సుజుకీ తదితరులతో సీతారామన్ భేటీ అయ్యారు. సార్వభౌమ రుణాల పునర్వ్యవస్థీకరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుండటంపై యెలెన్ అభినందించినట్లు అమెరికా ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఇదీ చదవండి: Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్! నిజమేనా?)