ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(భారత్)లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బిఐ ఆందోళన చెందుతోంది అని అన్నారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించి, ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ కరెన్సీల ద్వారా మోసానికి పాల్పడుతున్నారని తెలిసిన తర్వాత 2018లో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్‌బీఐ వాటిని నిషేధించింది. కానీ, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఆర్‌బీఐ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమయ్యింది. ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్ యువాన్‌తో పాటు డిజిటల్ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్ చేరనున్నట్లు తెలిపారు. దీనికి కావాల్సిన సాంకేతికపై పనిచేతున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్ ఇటీవలి ట్వీట్లలో బిట్ కాయిన్ ధరలు "అధికంగా కనిపిస్తున్నాయి" అని చెప్పారు. దీనితో ఒక్కసారిగా టెస్లా షేర్ ధరలు విపరీతంగా పడిపోయాయి. ఒక్కరోజులో ఎలోన్ మస్క్ 15.2 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment