Digital currency
-
విదేశీ చెల్లింపులకు డిజిటల్ కరెన్సీ!: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: విదేశీ చెల్లింపులకు వీలుగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపరచడంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పూర్థిస్థాయి దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ పైలట్ ప్రాజెక్స్గా దీనిని ప్రారంభించిందని, అమలుకుగాను తొమ్మిది బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలను ఎంచుకుందని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువలతో జారీ అవుతుందన్నారు. బ్యాంకుల వంటి ఫైనాన్షియల్ మీడియేటర్ల ద్వారా పంపిణీ జరుగుతుందని అన్నారు. భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా వినియోగదారులు ఈ–రూపాయితో లావాదేవీలు చేయగలుగుతారని కూడా వెల్లడించారు. ‘‘విదేశీ చెల్లింపులలో డిజిటల్ కరెన్సీ సహాయపడుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఇది మరింత పారదర్శకత, లభ్యత సౌలభ్యతలను సమకూర్చుతుంది’’ అని హిందూ కళాశాల 125 సంవత్సరాలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో సీతారామన్ అన్నారు. ఇది తక్కువ ఖర్చుతో చెల్లింపులను వేగవంతం చేయడంలో సహాయపడుతుందని, దేశీయంగా, అంతర్జాతీయంగా జరిగే చెల్లింపుల విషయాల్లో వ్యయాలను తగ్గిస్తుందని వివరించారు. తయారీ, వ్యవసాయంపై దృష్టి.. భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా మార్చడానికి ప్రాధాన్యతా రంగాల గురించి అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, తయారీ వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘‘వ్యవసాయం దాని ప్రాధాన్యతను పటిష్టం చేసుకుంది. కొన్ని విధానాలు, ఆధునికీకరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి తగిన కృషి చేస్తున్నాము’’ అని మంత్రి అన్నారు. తయారీలో, పునరుత్పాదక శక్తి, సెమీ కండక్టర్, మెషిన్ లెర్నింగ్, ఎర్త్ సైన్సెస్, స్పేస్‌తో సహా 13 పురోగతి బాటలో ఉన్న రంగాలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె చెప్పారు. సామాజిక పథకాల అమల్లో పురోగతి పేదలకు కనీస అవసరాలు అందించడానికి రూపొందించిన సామాజిక రంగ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం సంతృప్తికరమైన స్థాయికి చేరుకుంటోందని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశం ఆర్థికంగా ’ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధి) సాధించే సమయం ఆసన్నమైందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఈ శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని వివరించారు. ఎటువంటి పురోగతి లేకుండా స్వాతంత్య్ర భారత్ 60 సంవత్సరాలు గడిపిందన్న ఆమె, ‘‘మేము వికసిత భారత్‌కు భౌతిక పునాదిని వేశాము. అందరికీ ప్రాథమిక అవసరాలను అందించడం ద్వారా ప్రజలను శక్తివంతం చేశాము’’ అన్ని అన్నారు. డీబీటీతో పారదర్శకత బోగస్, అవాంఛనీయ లబ్ధిదారులను తొలగించడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లను ఆదా చేయగలిగిందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. డీబీటీ ద్వారా ప్రభుత్వ నిధుల బదిలీలో పారదర్శకతను మెరుగుపరచడమే కాకుండా సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరిచిందని ఆమె అన్నారు. ప్రజలకు సామాజిక కార్యక్రమాలను అందించడంలో ప్రభుత్వానికి ఎటువంటి పక్షపాతం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రధాని భారతదేశాన్ని యువత, మహిళలు, రైతులు పేదలు అనే నాలుగు గ్రూపులుగా వర్గీకరించడారని, మతాలు, కులాలతో సంబంధం లేకుండా ఈ సమూహాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు మినహా వ్యవసాయానికి సంబంధించినంతవరకు భారతదేశం దాదాపు స్వయం సమృద్ధి సాధించిందని ఆమె అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు సమస్యలను ఎదుర్కొంటున్నందున ఆహారాన్ని వృథా చేయవద్దని ఆమె ఈ సందర్భంగా సూచించారు. రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టతో నాగరికత విలువల పునరుద్ధరణ జనవరి 22న రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట వేడుకను ’నాగరికత గుర్తు’గా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నాగరికత విలువల పునరుద్ధరణకు సాక్ష్యంగా నిలిచిన ప్రస్తుత తరానికి ఈ వేడుకలు అదృష్ట తరుణమని ఆమె అన్నారు. నైపుణ్యాల అభివృద్ధితో పాటు నాగరికత– జాతీయత రెండింటికీ సంబంధించి విలువల పటిష్టతపై దృష్టి పెట్టాలని ఆమె విద్యార్థులను కోరారు. దేశం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోందని విద్యార్థులకు గుర్తు చేస్తూ, ఓటు వేయడం పౌరుల హక్కు మాత్రమే కాదని, అది వారి కర్తవ్యం కూడా అని అన్నారు. మొదటి సారి ఓటరుగా ఉన్న వారిపై ఎక్కువ బాధ్యత ఉందని ఆమె అన్నారు. సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతున్న ప్రతికూలతలను చూసి విద్యార్థులు తప్పుదారి పట్టవద్దని ఆమె కోరారు. ఎకానమీపై తప్పుడు ప్రచారం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థికమంత్రి పేర్కొంటూ, కంపెనీలు, స్టాక్ మార్కెట్ చాలా బాగా పని చేస్తున్నాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగా లేదని, తీవ్ర ఒడిదుడుకులతో పయనిస్తోందన్న కథనాలు అవాస్తమమని అన్నారు. అలాంటి ప్రచారం చేస్తున్న వారు ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని చెబుతున్నారో చెప్పాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. అయితే సమాధానం చెప్పడానికి వారు అందుబాటులో ఉండరని విమర్శించారు. తోచింది చెప్పిడం కొందరి పనిగా మారిందని అన్నారు. -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు
ముంబై: అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించినట్లు వివరించింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రబి శంకర్ ఇటీవలే వెల్లడించారు. -
రోజుకు 10 లక్షల డిజిటల్ రూపీ లావాదేవీలు
ముంబై: ఈ ఏడాది చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు. ప్రస్తుతం రోజువారీగా 5,000–10,000 ఈ–రూపీ లావాదేవీలు నమోదవుతున్నట్టు చెప్పారు. యూపీఐ వ్యవస్థతో సీబీడీసీ అనుసంధానతను ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ ఎంపీసీలో భాగంగా ప్రకటించగా, ఈ నెలాఖరుకు ఇది కార్యరూపం దాలుస్తుందని రవిశంకర్ తెలిపారు. కాకపోతే సీబీడీసీ ఎకోసిస్టమ్ కిందకు మరిన్ని బ్యాంక్‌లు చేరాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది నవంబర్‌లో హోల్‌సేల్ లావాదేవీలకు సీబీడీసీని ప్రయోగాత్మకంగా ఆర్బీఐ ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రిటైల్ లావాదేవీలకు సైతం దీన్ని విస్తరించింది. తొలుత ఎనిమిది బ్యాంక్‌లను అనుమతించగా, ప్రస్తుతం 13 బ్యాంక్‌లకు సీబీడీసీ విస్తరించింది. ప్రస్తుతం 13 లక్షల మంది యూజర్లు సీబీడీసీని వినియోగిస్తున్నారని, ఇందులో 3 లక్షల మంది వర్తకులు ఉన్నట్టు రవిశంకర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రోజుకు 10 లక్షల లావాదేవీల లక్ష్యం కష్టమైనది కాదన్నారు. యూపీఐపై రోజుకు 31 కోట్ల లావాదేవీలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టామని, ఏప్రిల్ నాటికి లక్షగా ఉన్న యూజర్ల సంఖ్య అనంతరం రెండు నెలల్లోనే 13 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఇక మీదట రోజువారీ లావాదేవీల పెంపు లక్ష్యంగా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. -
నా రిపోర్టుతోనే డిజిటల్ కరెన్సీ
సాక్షి, హైదరాబాద్: ‘‘ఐటీ విషయంలో నీకు బాగా అనుభవం ఉంది. డిజిటల్ కరెన్సీ మీద రిపోర్టు ఇవ్వు అని ప్రధాని మోదీ అడిగితే రిపోర్టు ఇచ్చాను. నేనిచ్చి న రిపోర్టు ఆధారంగానే డిజిటల్ కరెన్సీని తెచ్చారు. ఈరోజు కూరగాయల దుకాణం నుంచి ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ఉంది. అలాగే 500, వెయ్యి, రెండు వేల నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీని డెవలప్ చేద్దామని చెప్పాను. అది వస్తే దేశ ఆదాయం పెరుగుతుంది..’’అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ 41వ వ్యవస్థాపక దినం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగానే తన గురించి చెప్పుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో పెద్దనోట్లను రద్దు చేసి, డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేయాలని, అప్పుడే అవినీతి పోతుందని చెప్పారు. నా వల్లే సెల్ఫోన్లు వచ్చాయి: గతంలో తాను ఇచ్చి న రిపోర్టు ఆధారంగానే వాజ్‌పేయి టెలికం రంగంలో సంస్కరణలు తెచ్చారని, సెల్ఫోన్లు వచ్చాయని అన్నారు. ఇటీవల ఓ సమావేశంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు విజన్–2027 రిపోర్టు తయారు చేయాలని.. దానితో ప్రపంచంలో భారత్ నంబర్ వన్ అవుతుందని చెప్పానని వివరించారు. అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ టీడీపీ అని, జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరాని తనం లేకుండా చేశానని అన్నారు. మొదటి నేషనల్ హైవే తెలుగుదేశం హయాంలోనే వచ్చిందన్నారు. 1995లో తాను సీఎం అయిన తర్వాతే రంగారెడ్డి జిల్లాలో, రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకే పార్టీ పెట్టారన్నారు. త్వరలో రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు సినీ రంగానికి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ సభలో పార్టీ తెలంగాణ, ఏపీల అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, అచ్చెన్నాయుడు, నందమూరి రామకృష్ణ, పార్టీ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ఈ - రూపీ అంటే ఏమిటి? దాని వల్ల లాభాలేంటి? అది ఎలా పనిచేస్తుంది?
రఘురామ్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది. రైలు వెళ్లిపోతుందన్న హడావుడితో కంగారుగా వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో రైలు ఎక్కేశాడు. పండుగ రోజులు కావడంతో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. అయినా కానీ ఏదో విధంగా తోసుకుంటూ రైలెక్కి కూర్చున్నాడు. జేబులో చేయి పెట్టి చూడగా, పర్స్ కనిపించలేదు. ఒక్కసారిగా ముఖం మాడిపోయింది. పర్స్‌లో కార్డులతోపాటు డ్రా చేసిన రూ.5,000 నగదు కూడా ఉంది. ఒకవేళ నోట్ల రూపంలో కాకుండా, మొబైల్ వ్యాలెట్‌లో ఈ కరెన్సీ ఉంటే..? ఇలా జరిగేది కాదు కదా..! భౌతిక కరెన్సీకి ప్రత్యామ్నాయంగా వచ్చిందే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపీ). దీనిపై కొందరిలో అస్పష్టత నెలకొంది. దీని పనితీరు, చెల్లింపులు చేయడం ఎలా, ఇది ఉంటే యూపీఐ అవసరం లేదా? ఇలా ఎన్నెన్నో సందేహాలు. వీటికి స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నమే ఈ కథనం. ఈ–రూపీ అంటే.. కరెన్సీ నోటుకు డిజిటల్ రూపమే ఇది. అందుకే సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా దీనికి పేరు. ముద్రించిన కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఎప్పటికప్పడు అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలోకి విడుదల చేస్తుంటుంది. అచ్చం అదే మాదిరి ఇక మీదట డిజిటల్ కరెన్సీని సైతం విడుదల చేయనుంది. లిక్విడిటీ చర్యల్లో భాగంగా భౌతిక, డిజిటల్ రూపీ మధ్య సమన్వయం ఉంటుంది. కరెన్సీ ఏ రూపంలో ఉన్నా ఆర్బీఐ బ్యాలన్స్ షీట్లో ఈ మేరకు లయబిలిటీని చూపిస్తారు. ఈ డిజిటల్ కరెన్సీ మొబైల్ ఫోన్ వ్యాలెట్లలోనే ఉంటుంది. కరెన్సీ నోట్ మాదిరే దీనికి సైతం చట్టబద్ధ హోదా ఉంటుంది. డిజిటల్ కరెన్సీని కోరుకున్నంత కాలం ఈ–రూపీల్లో రూపంలో ఉంచుకోవచ్చు. భౌతిక కరెన్సీకి వర్తించే అన్ని రకాల నిబంధనలు డిజిటల్ కరెన్సీకి సైతం అమలవుతాయి. కేవలం రూపంలోనే వ్యత్యాసం. కనుక దీన్ని పౌరులు అందరూ భవిష్యత్తులో కరెన్సీ మాదిరిగా మార్పిడి చేసుకోవచ్చు. వినియోగం ఎలా..? బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ ఉంటే, అందులో నుంచి కోరుకున్న మేర డిజిటల్ రూపాయిలుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అవసరం. ప్రస్తుతానికి ఈ–రూపీ రిటైల్ (వ్యక్తులు) ప్రాజెక్ట్‌ను ఆర్బీఐ ప్రయోగాత్మకంగా అమలు చేసి, చూస్తోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్ బ్యాంకులు డిజిటల్ రూపీ వ్యాలెట్లను అందిస్తున్నాయి. ఐవోఎస్ ఆధారిత యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయలేదు. ఈ బ్యాంక్‌లకు సంబంధించిన కస్టమర్లు, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్టు అయితే, వారి ఫోన్‌కు ఎస్ఎంఎస్, ఈ మెయిల్ రూపంలో లింక్ వస్తుంది. ఆసక్తి ఉన్న వారు లింక్‌ను తెరిచి ఈ–రూపీ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాంక్‌లో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నంబర్‌ను వినియోగించాలి. ఎలా పనిచేస్తుంది..? ఈ–రూపీ వ్యాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారు, తమ బ్యాంకు ఖాతా నుంచి నగదును వ్యాలెట్‌కు బదిలీ చేసుకోవాలి. ఏ డినామినేషన్లో ఎన్ని కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కస్టమర్‌కే ఉంటుంది. అంటే రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయిలు, రూ.10, 20, 50, 100, 200, 500 డినామినేషన్లలో కస్టమర్ తన ఇష్టం మేరకు వ్యాలెట్‌లో లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు బ్యాంక్ ఖాతా నుంచి రూ.5,000 బదిలీ చేసుకున్నారని అనుకుందాం. అప్పుడు రూ.500 డినామినేషన్లో 5 ఈ–రూపీలు, రూ.200 డినామినేషన్లో 5 ఈ–రూపీలు, రూ.100 డినామినేషన్లో 10 ఈ–రూపీలు, రూ.50 డినామినేషన్లో 8 ఈ–రూపీలు, మిగిలిన రూ.100 విలువకు రూ.20, 10, 5, 1 ఇలా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా అనేమీ కాదు. కస్టమర్ కావాలనుకుంటే రూ.50 డినామినేషన్లో 100 ఈ–రూపీలను కూడా తీసుకోవచ్చు. లేదంటే రూపాయి డినామినేషన్లో 5,000 ఈ–రూపీలను తీసుకోవచ్చు. భౌతిక కరెన్సీ మాదిరే ఇవి పనిచేస్తాయి. మన పర్స్‌లో నోట్లు ఉన్న మాదిరే, వ్యాలెట్‌లో ఈ–రూపీలు ఉంటాయి. భౌతికంగా వినియోగంలో ఉన్న అన్ని రకాల డినామినేషన్‌కు సమానమైన ఈ–రూపీలు వ్యాలెట్‌లో అందుబాటులో ఉంటాయి. వెంటనే బదిలీ.. వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి మధ్య ఈ–రూపీ చెల్లింపులు చేసుకోవచ్చు. వ్యక్తుల మధ్య సీబీడీసీలను బదిలీ చేసుకోవాలంటే, అవతలి వ్యక్తికి సైతం ఈ–రూపీ వ్యాలెట్ ఉండడం తప్పనిసరి. అదే వర్తకులకు ఈ–రూపీలను చెల్లించాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ విధానంలో చేయవచ్చు. ఇది అచ్చం యూపీఐ చెల్లింపుల మాదిరే పనిచేస్తుంది. ప్రస్తుతం యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేంత సులభంగానే.. ఈ–రూపీ చెల్లింపులు కూడా ఉంటాయి. యూపీఐ మాదిరే అప్పటికప్పుడే ఈ–రూపీ బదిలీ అవుతుంది. క్షణాల్లోనే అవతలి వ్యక్తి వ్యాలెట్‌కు మీరు పంపిన ఈ–రూపీ చేరిపోతుంది. కొద్ది మందికే.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లో కొద్ది మంది వినియోగానికే (క్లోజ్డ్ యూజర్ గ్రూప్) రిటైల్ సీబీడీసీ (ఈ–రూపీ)ని పరిమితం చేశారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించిన తర్వాతే పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ–రూపీ లావాదేవీలు పూర్తయ్యే బాధ్యతను ఆర్బీఐతో కలసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) చూస్తోంది. లావాదేవీలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఏర్పడితే ఎన్పీసీఐ పరిష్కరిస్తుంది. మొబైల్ బ్యాంకింగ్‌ను తరచూ వినియోగించే కస్టమర్లు, డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్న వారి నుంచి కొందరిని ప్రయోగాత్మక పరీక్షల కోసం బ్యాంక్‌లు ఎంపిక చేసుకున్నాయి. అలా ఎంపిక చేసిన వారి ఫోన్లకు ఈ రూపీ వ్యాలెట్ లింక్‌ను పంపిస్తాయి. ఒకవేళ బ్యాంక్ నుంచి ఎటువంటి సందేశం కానీ, యూఆర్ఎల్ లింక్ కానీ రాని వారు, ఈ రూపీ వ్యాలెట్ పట్ల ఆసక్తిగా ఉంటే, బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించొచ్చు. అభ్యర్థనను ఆమోదించే లేదా తిరస్కరించే విచక్షణ వారిపై ఉంటుంది. అనుకూలతలు/ప్రతికూలతలు కరెన్సీ నోట్లు అయితే నకిలీలను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్ కరెన్సీకి ఆ బెడద ఉండదు. మొబైల్ ఫోన్ పోయినా దుర్వినియోగం బెడద ఉండదు. బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి, వ్యాలెట్‌లోని నగదును బదిలీ చేసుకోవచ్చు. యూపీఐ అన్నది బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. కనుక యూపీఐ యాప్ ఉన్న ఫోన్ పోతే దుర్వినియోగం ప్రమాదం ఎక్కువ. ఈ–రూపీ వ్యాలెట్‌తో ఆ రిస్క్ ఉండదు. ప్రతి లావాదేవీ టోకెనైజ్డ్ విధానంలో, యూనిక్‌గా, భద్రంగా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీలో సమస్యలు ఉంటే టోకెన్ జారీ కాదు. లావాదేవీ తక్షణమే జరిగిపోతుంది కనుక ఫెయిల్యూర్ అవకాశాలు తక్కువ. సీబీడీసీ వినియోగం పెరిగే కొద్దీ ఆర్బీఐకి భారీగానే వ్యయాలు ఆదా అవుతాయి. ఎందుకంటే కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చేసే ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు, బ్యాంకు లు, ఆర్థిక సంస్థలకు భౌతిక కరె న్సీ నిర్వహణ వ్యయా లు తగ్గుతాయి. వాటి మధ్య అంతర్గత చెల్లింపుల వ్యయాలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ మరింత డిజిటల్‌గా మారుతుంది. దీని వల్ల అధికారిక ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు పెరుగుతాయి. దేశాల మధ్య చెల్లింపులకు అనువుగా ఉంటుంది. అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని వ్యాప్తి, వినియోగం, సౌకర్యం, సమస్యలపై మరింత స్పష్టత వస్తుంది. వడ్డీ రాదు.. యూపీఐ విధానానికి, ఈ రూపీకి మధ్య వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. యూపీఐ అన్నది మన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును వేరొక వ్యక్తి బ్యాంకు ఖాతాకు యూపీఐ ద్వారా బదిలీ చేయడం. కానీ, ఈ–రూపీ అలా కాదు. ఒక వ్యక్తి వ్యాలెట్ నుంచి మరో వ్యక్తి ఈ–రూపీ వ్యాలెట్‌కు బదిలీ చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రోజువారీ బ్యాలన్స్‌పై ఎంతో కొంత వడ్డీ ముడుతుంది. కానీ, వ్యాలెట్‌లో ఉన్న ఈ–రూపీలపై వడ్డీ రాబడి ఉండదు. ఎందుకంటే ఇది బ్యాంక్ బ్యాలన్స్ కిందకు రాదు. భౌతిక కరెన్సీ మన పర్స్‌లో ఉన్న మాదిరే అని గుర్తించాలి. ఈ–రూపీ వ్యాలెట్‌లో ఉన్న బ్యాలన్స్‌ను తిరిగి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. అప్పటి నుంచి వడ్డీ ఆదాయం వస్తుంది. యూపీఐ వర్సెస్ ఈ–రూపీ ఈ–రూపీ రాకతో యూపీఐ విషయంలో కొందరిలో సందేహాలున్నాయి. కానీ, ఈ రెండు వేర్వేరు సాధనాలు. దేశంలో 26 కోట్ల యూపీఐ యూజర్లు ఉన్నారు. అక్టోబర్ నెలకు 730 కోట్ల యూపీఐ లావాదేవీలు (రూ.12.11 లక్షల కోట్లు విలువైన) నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన టెక్నాలజీకి డిజిటల్ రూపీ పూర్తి భిన్నమైనది. యూపీఐ లావాదేవీల నిర్వహణలో బ్యాంక్‌ల పాత్ర ఉంటుంది. డిజిటల్ రూపీ లావాదేవీల్లో బ్యాంక్‌ల పాత్ర ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య కరెన్సీ మార్పిడిలో మరొకరి పాత్ర ఎలా అయితే ఉండదో.. డిజిటల్ రూపీలోనూ అంతేనని అర్థం చేసుకోవాలి. యూపీఐ లావాదేవీలను ట్రాక్ చేయగలరు. కానీ, ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పార్టీల మధ్య ప్రైవేటుగా కొనసాగే సీబీడీసీ లావాదేవీలను వేరెవరూ ట్రాక్ చేయలేరు. గోప్యంగా ఉంటాయి. చెల్లింపుల పరంగా యూపీఐ సౌకర్యం? ఎవరైనా కానీ వినియోగంలో సౌకర్యాన్నే చూస్తారు. సీబీడీసీతో పోలిస్తే యూపీఐ చెల్లింపులే సౌకర్యం. ఎలా అంటే, ఉదాహరణకు రూ.47 విలువ చేసే వాటిని కొనుగోలు చేశారు. అప్పుడు చెల్లింపులు చేయాలి. యూపీఐ ద్వారా అయితే కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ ఇస్తే చాలు రూ.47 చెల్లింపు పూర్తవుతుంది. మరి ఈ–రూపీ అలా కాదు. రూ.47ను ఏ డినామినేషన్లో చెల్లించాలన్నది నిర్ణయించాలి. రూ.20 డినామినేషన్ రెండు, లేదా రూ.10 డినామినేషన్ నాలుగు.. ఆ తర్వాత రూ.5 డినామినేషన్ ఒకటి, రూ.2 డినామినేషనన్ ఎంపిక చేసుకుని బదిలీ చేయాలి. లేదంటే రూపాయి డినామినేషన్లో 47 ఈ–రూపీలను సెలక్ట్ చేసుకోవాలి. వ్యాలెట్‌లో అన్ని డినామినేషన్లలో ఈ–రూపీ ఉంటేనే చెల్లింపులు సాధ్యపడతాయి. అలా కాకుండా వ్యాలెట్‌లో కేవలం రూ.10, 20, 50 డినామినేషన్‌లోనే ఈ–రూపీలు ఉంటే రూ.47 చెల్లింపు సాధ్యపడదు. ఆటోమేటిగ్గా చెల్లింపునకు తగినట్టు డినామినేషన్ స్ప్లిట్ అయ్యి, బదిలీ అయ్యే విధానాన్ని అభివృద్ధి చేస్తే ఈ సమస్య తొలగిపోతుంది. అప్పుడు యూపీఐకి ప్రత్యా మ్నాయం కాగలదు. అయినా కానీ రిటైల్ చెల్లింపులకు యూపీఐ ఎక్కువ అనుకూలం. యూపీఐ ముందుగా వచ్చి, దేశంలోని అన్ని ప్రాంతాలకూ చేరిపోయింది. దీనికి టెక్నాలజీ పెద్దగా తెలియక్కర్లేదు. బ్యాంకు ఖాతాకు వెళ్లి లోడ్ చేసుకోవక్కర్లేదు. అందుకే ఇకపైనా చెల్లింపుల్లో యూపీఐ హవా కొనసాగుతుందని విశ్లేషకుల అంచనా. బ్యాంకుల మధ్య, సంస్థల మధ్య చెల్లింపుల సెటిల్మెంట్కు, విదేశాలతో రూపాయి వాణిజ్యానికి సీబీడీసీ అనుకూలిస్తుందని చెబుతున్నారు. ఎక్కడ వినియోగం? ఈ–రూపీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, యూపీఐ మాదిరే దీన్ని కూడా దేశంలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం క్లోజ్ హెల్డ్ గ్రూపు పరిధిలోని వ్యక్తులు, వర్తకుల మధ్య లావాదేవీలకే పరిమితంగా ఉంది. ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకుని, అవసరమైన చోట చెల్లింపులు చేస్తుంటాం. అదే మాదిరి ఈ–రూపీని వ్యాలెట్లలోకి లోడ్ చేసుకుని కావాల్సిన చోట చెల్లింపులు/బదిలీ చేసుకోవచ్చు. రెండు రకాలు.. సీబీడీసీ రెండు రకాలుగా వర్గీకరణ చేశారు. రిటైల్, హోల్‌సేల్. రిటైల్ సీబీడీసీని వ్యక్తులు, ప్రైవేటు రంగం, వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. హోల్‌సేల్ సీబీడీసీ కేవలం బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల మధ్య వినియోగానికే ప్రస్తుతం పరిమితం చేశారు. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య లావాదేవీలకు ఉద్దేశించినది రిటైల్ సీబీడీసీ. హోల్‌సేల్ సీబీడీసీ అన్నది రెండు బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య లావాదేవీల సెటిల్మెంట్కు ఉద్దేశించినది. అదనపు సాధనం సీబీడీసీ అనేది ప్రస్తుతమున్న మరే సాధనానికి బదులుగా తీసుకొచ్చింది కాదు. అదనపు చెల్లింపు సాధనంగా, కరెన్సీకి డిజిటల్ రూపంగా తీసుకొచ్చినది మాత్రమే. వినియోగంలో సౌకర్యం, వ్యయాలు తగ్గింపు, భద్రత, రక్షణ ఎన్నో అంశాలు డిజిటల్ రూపీతో ఇమిడి ఉన్నాయి. చదవండి👉 నట్టేట ముంచిన ఉద్యోగి, రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి! -
డిజిటల్ రూపీ ప్రారంభం చరిత్రాత్మక మైలురాయి
న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి ప్రారంభం ఒక చరిత్రాత్మక మైలురాయి అని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. దీనివల్ల కరెన్సీ వ్యవస్థ సామర్థ్య మరింత పెరుగుతుందని, ఆర్థిక సేవలు భారీగా విస్తరిస్తాయని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ట్రాకర్ ప్రకారం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 95 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించే తుది దశలో ఉండగా, 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా ప్రారంభించాయని పేర్కొన్నారు. పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసే విధానంలో వినూత్నతను తీసుకువస్తుంది. అంతర్జాతీయ స్థాయి చెల్లింపుల్లో సైతం పూర్తి సులభతరమైన వెసులుబాటును కల్పిస్తుంది. ► సీబీడీసీ వినియోగదారుల ఆర్థిక పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, హానికరమైన సామాజిక– ఆర్థిక పరిణామాలను నివారిస్తుంది. ప్రజలకు అవసరమైన తగిన సేవలు అందించడంలో దోహదపడుతుంది. ► ఆర్బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.. సీబీడీసీ–డబ్ల్యూ, అలాగే సీబీడీసీ–ఆర్‌లను భారత వ్యవస్థలో పైలట్ ప్రాతిపదికన ఆవిష్కరించింది. సీబీడీసీ–డబ్ల్యూ టోకు లావాదేవీలను సీబీడీసీ–ఆర్ రిటైల్ లావాదేవీలను సూచిస్తాయి. ► డిజిటల్ కరెన్సీ– యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరిస్తూ, భౌతిక కరెన్సీ తరహాలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ నిర్వహణాలో ఉంటుంది. ఇక యూపీఐ చెల్లింపు సాధనం తద్వారా జరిగే లావాదేవీ సంబంధిత బ్యాంకు బాధ్యతకు సంబంధించినది అని చెప్పారు. -
పాపాయి... డిజిటల్ రూపాయి!
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో నవ శకానికి నాంది పలికింది. మొన్న గురువారం నుంచి వ్యక్తుల మధ్య ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీ వినియోగాన్ని ప్రారంభించింది. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లలోని నిర్ణీత వర్తకులు, కస్టమర్ల బృందాలకు ఈ డిజిటల్ కరెన్సీని అందు బాటులో ఉంచింది. వారు తమ మధ్య లావాదేవీలకు సాధారణ కరెన్సీ లాగే ఈ డిజిటల్ రూపీని వినియోగిస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్‌తో లోటుపాట్లను గమనించి, మరింత మెరుగ్గా డిజిటల్ రూపీని విస్తృతస్థాయిలో అందరికీ అందుబాటులోకి తేవాలన్నది ప్రణాళిక. ఇలా సొంత ‘కేంద్ర బ్యాంక్ డిజి టల్ కరెన్సీ’ (సీబీడీసీ)తో నడుస్తున్న మరో 15 దేశాల సరసన భారత్ చేరుతోంది. సీబీడీసీతో కష్ట నష్టాల్ని ఆర్బీఐ కొద్దికాలంగా పరిశీలిస్తోంది. ఓ వ్యూహంతో, దశలవారీ ఆచరణ కోసం చూస్తోంది. సీబీడీసీ, లేదా డిజిటల్ రూపీ... డబ్బుకు ఎలక్ట్రానిక్ రూపమే! మరోమాటలో కేంద్ర బ్యాంక్ (మన దగ్గర రిజర్వ్ బ్యాంక్) జారీ చేసిన కరెన్సీనోట్లకు డిజిటల్ రూపం. చేతికి ఇచ్చిపుచ్చుకోని లావాదేవీలకు ఈ ఎలక్ట్రానిక్ డబ్బును వాడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే డిజిటల్ కరెన్సీని తెస్తుందని ఈ ఏడాది బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అందరూ వాడేందుకు అందు బాటులో ఉండే ‘రిటైల్ సీబీడీసీ’, నిర్ణీత ఆర్థిక సంస్థలే వాడేందుకు ఉద్దేశించిన ‘టోకు సీబీడీసీ’– ఇలా సీబీడీసీ రెండు రకాలు. కేంద్ర బ్యాంక్ అండదండలతో నడిచే ఈ డిజిటల్ రూపీని నవంబర్ 1 నుంచి టోకు వ్యాపారంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బాండ్ల సెకండరీ మార్కెట్ ట్రేడింగ్‌కు దాన్ని వాడారు. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి చిల్లర వర్తక విభాగంలోకీ విస్తరించారు. ఈ రిటైల్ ప్రయోగం తొలిదశకు 4 బ్యాంక్‌లను గుర్తించారు. అవి కోరినట్టు రూ. 1.7 కోట్ల విలువైన డిజిటల్ కరెన్సీని జారీ చేశారు. బ్యాంక్‌ల నుంచి డిమాండ్ పెరిగేకొద్దీ, మరింత డిజిటల్ రూపీని ఆర్బీఐ సృష్టిస్తుంది. వీధిలో వ్యాపారుల నుంచి ఆహార యాప్‌ల వరకు 50 వేల మంది వర్తకుల్నీ, కస్టమర్లనీ దీనిలో భాగం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో మరిన్ని బ్యాంకులకూ, హైదరాబాద్ లాంటిచోట్లకూ విస్తరించనున్నారు. నిజానికి, డిజిటల్ రూపీ వ్యాలెట్... జేబులో పర్సు లాంటిదే. కాకపోతే యాప్‌తో డిజిటల్ రూపంలో, స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు జరపాలి. మరి, ఇప్పటికే గూగుల్‌పే లాంటి డిజిటల్ వ్యాలెట్లతో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్’ (యూపీఐ)లో చెల్లింపులు చేస్తున్నాం కదా? అక్కడ మొబైల్లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలతో చెల్లింపులు జరపాలి గనక తెర వెనుక బ్యాంక్‌ల లాంటి మధ్యవర్తులకు బోలెడంత పని! ఇక్కడ మధ్యవర్తుల్లేని డిజిటల్ రూపీలో పర్సులోని నోట్లలా నేరుగా నగదు బదలీ అవుతుంది. అయితే బిట్‌కాయిన్, ఈథెరియం లాంటి క్రిప్టోకరెన్సీలకు ఇది పూర్తి భిన్నం. 2008లో ఒక ఊహగా మొదలై, 2015లో తెరపైకొచ్చిన బిట్‌కాయిన్ సైతం పారదర్శకంగా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా, అజ్ఞాతంగా సాగే డిజిటల్ కరెన్సీ కావాలనే భావన ముందుకు తెచ్చింది. కరోనా వేళ వందలాది క్రిప్టోకరెన్సీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తీరా 2022కు వచ్చేసరికి అనుమానాస్పద లావాదేవీలతో ఆ కల చెదిరింది. క్రిప్టోలు కుప్పకూలి, ఇప్పటికి దాదాపు 1200 కోట్ల డాలర్ల మేర మదుపర్ల సొమ్ము ఆవిరై, కథ మారిపోయింది. ఒక్క మాటలో బ్లాక్‌చెయిన్ సాంకేతికతతో నడిచే వికేంద్రీకృత డిజిటల్ ఆస్తి – క్రిప్టో. దాని వికేంద్రీకృత స్వభావం, అలాగే బ్యాంకులు – ఆర్థిక సంస్థల లాంటి మధ్యవర్తులే లేని దాని నిర్వహణ వివాదాస్పదం. అందుకు భిన్నంగా సీబీడీసీ... సాక్షాత్తూ ఆర్బీఐ డిజిటల్ రూపంలో ఇచ్చే అధికారిక కరెన్సీ. దీనికి ప్రభుత్వపు అండ ఉంటుంది గనక విలువ మారదు. ఫోన్లో డిజిటల్ రూపీ ఉంటే చేతిలో కరెన్సీ నోట్లున్నట్టే! ఆర్బీఐ ఇలా ‘సీబీడీసీ’ని తేవడం ప్రశంసనీయమైన చర్యే. డిజిటల్ రూపీతో లావాదేవీల ఖర్చు తగ్గుతుంది. అధీకృత నెట్‌వర్క్‌ల పరిధిలో లావాదేవీలన్నీ ప్రభుత్వం ఇట్టే తెలుసుకోగలుగుతుంది. ప్రతిదీ చట్టాలకు లోబడి సాగుతుంది. దేశంలోకి డబ్బు ఎలా వస్తోంది, ఎలా పోతోందన్న దానిపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకూ, మెరుగైన బడ్జెట్‌కూ వెసులు బాటు లభిస్తుంది. భౌతిక కరెన్సీ నోట్లలా చిరిగిపోవడం, కాలిపోవడం, చేజారడం లాంటివేవీ ఉండవు గనక ఈ డిజిటల్ కరెన్సీ ఆయుఃప్రమాణం అనంతం. ఈ దెబ్బతో నగదు స్వరూప స్వభా వాలు, విధులు సమూలంగా మారిపోతాయి. అన్నివర్గాలనూ ఆర్థికంగా కలుపుకొనిపోవడానికీ, చెల్లింపుల ప్రపంచంలో సామర్థ్యం తేవడానికీ సీబీడీసీ ప్రోద్బలమిస్తుంది. ఇప్పటికే ఉన్న రిజర్వ్ బ్యాంక్ ‘ఆర్టీజీఎస్’ విధానం, ఈ కొత్త సీబీడీసీ కలసి లావాదేవీల్లో పారదర్శకత, భద్రత తెస్తాయి. కాలగతిలో డబ్బు తన రూపం మార్చుకొంటూ వచ్చింది. ఆర్థిక సంక్షోభాలతో పాటు అనేక వ్యవస్థాగత జాగ్రత్తలూ వచ్చాయి. ఆధునిక సాంకేతికతతో నూతన సహస్రాబ్దిలో ధనలక్ష్మి అనేక రూపాలు ధరించింది. కరెన్సీ నోట్లలా ముద్రించాల్సిన పని లేని డిజిటల్ రూపీతో మున్ముందు మరిన్ని మార్పులు చూడనున్నాం. ప్రపంచవ్యాప్త అంగీకారంతో ప్రవాసీయులూ వినియోగించే వీలుంది గనక సరిహద్దులు చెరిగిపోనున్నాయి. యూపీఐ లాగా లావాదేవీలకు బ్యాంక్ ఖాతాతో పనిలేకపోవడం మరో సౌకర్యం. నవీన భారతావనిలో యూపీఐ చెల్లింపుల విజయగాథ ఆధునిక విధానాల పట్ల మనకు పెరుగుతున్న ఆసక్తికి తార్కాణం. ఇవాళ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలో మనదే అగ్రస్థానం. అందుకే, సరైన సమయంలో పుట్టిన పాపాయి... మన డిజిటల్ రూపాయి! -
డిజిటల్ కరెన్సీ: సీబీడీసీపై ఆర్బీఐ కీలక ప్రకటన
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. డిజిటల్ రుపీ వెర్షన్ డిసెంబర్ 1 న లాంచ్ చేస్తున్నట్టు మంగళవారం(నవంబర్ 29) ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ సీబీడీసీపైలట్ ప్రాజెక్ట్‌ను నవంబర్ 1న ప్రారంభించిన సంగతి తెలిసిందే. (ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?) క్లోజ్డ్ యూజర్ గ్రూప్ వినియోగదారులు భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా ఇ-రూపాయితో లావాదేవీలు చేసుకోవచ్చని, మొబైల్ ఫోన్లు లేదా పరికరాలలో నిల్వ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. దీంతో రీటైల్ సెగ్మెంట్లో సాధారణ వ్యాపారులకు, కస్టమర్లకు డిజిటల్ రుపీ అందుబాటులోకి రానుంది. (నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్) కొన్ని ముఖ్యాంశాలు ♦రిటైల్ డిజిటల్ ప్రస్తుతం చలామణిలోఉన్న 2 వేలు, 500, 200 రూపాయలు తదితర కరెన్సీ నోట్లు, నాణేలలాగానే అదే డినామినేషన్లలో అందుబాటులో ఉంటుంది. ♦వ్యక్తి నుండి వ్యక్తికి ( పీటూపీ) లావాదేవీలు అలాగే వ్యక్తి నుండి వ్యాపారి (పీటూ మర్చంట్) లావాదేవీలు చేసుకోవచ్చు. ♦అన్ని క్యూఆర్ కోడ్లను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు ♦భౌతిక నగదు విషయంలో మాదిరిగానే రిటైల్ డిజిటల్ రూపాయిలో సెటిల్మెంట్ ట్రస్ట్, సేఫ్టీ హామీ ఇస్తుంది. ♦ వాలెట్లలో నిల్వ ఉంచిన డిజిటల్ కరెన్సీకి ఎటువంటి వడ్డీ రాదు ♦ అయితే రిటైల్ డిజిటల్ రూపాయిని వడ్డీని సంపాదించే బ్యాంకుల్లో డిపాజిట్లుగా మార్చుకోవచ్చు . ♦తొలిదశగా దేశంలోని నాలుగు నగరాల్లో ఎస్బీఐ, సీఐసీ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ ద్వారా తొలి దశలో లావాదేవీలను ప్రారంభించనుంది. ♦ రెండో దశలో మరిన్ని నగరాల్లో బీవోబీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ తదుపరి దశలో పైలట్‌లో చేరనున్నాయి. ♦ ప్రారంభంలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ అనే నాలుగు నగరాల్లో డిజిల్ రూపాయి లావాదేవీలు ప్రారంభం. క్రమంగా అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా సిమ్లాలకు అమల్లోకి వస్తుంది. క్రమంగా మరిన్ని బ్యాంకులు, నగరాలు ఈ జాబితాలో చేరతాయి. కాగా నవంబర్ 1 నుంచే ఆర్బీఐ హోల్‌సేల్ ఇ-రూపాయిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది, ఎనిమిది బ్యాంకులు ఇ-రూపాయిని ఉపయోగించి ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీలు జరుపు తున్నాయి. దీని ఆధారంగా ఇ-రూపాయి ఇతర ఫీచర్లు ,అప్లికేషన్లను తర్వాత టెస్ట్ చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ అమలుపై సమీక్ష తరువాత మరిన్ని బ్యాంకులు, వినియోగదారులు పరిధిని క్రమంగా విస్తరిస్తామని గతంలో ఆర్బీఐను ప్రకటించింది. ఇదీ చదవండి : షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? -
క్రిప్టోలపై అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ ఎలెన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన రిస్కులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయి నియంత్రణ ప్రమాణాలు అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి జేనెట్ ఎలెన్ అభిప్రాయపడ్డారు. క్రిప్టోల ద్వారా అక్రమ మార్గంలో నిధుల మళ్లింపును అడ్డుకోవడంలో అమెరికా చెప్పుకోతగ్గ పురోగతి సాధించగలిగిందని ఆమె చెప్పారు. భారత్, అమెరికాలో వ్యాపార అవకాశాలపై ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజాలు, ఆర్థికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎలెన్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, సంక్షోభంలో చిక్కుకున్న క్రిప్టో ఎక్సే్చంజీ ఎఫ్‌టీఎక్స్ తాజాగా దివాలా తీసింది. ఇందుకు సంబంధించి ఎఫ్టీఎక్స్తో పాటు దాని అనుబంధ హెడ్జ్ ఫండ్ అలమెడా రీసెర్చ్, డజన్ల కొద్దీ ఇతర సంస్థలు డెలావేర్ కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన ఎఫ్‌టీఎక్స్ .. నిధుల గోల్మాల్ సంక్షోభంతో కుప్పకూలింది. -
డిజిటల్ రూపీ వల్ల లాభాలేంటి?
-
RBI CBDC: డిజిటల్ రూపీ ట్రయల్స్ షురూ
ముంబై: దేశీయంగా తొలిసారి డిజిటల్ రూపాయి (సీబీడీసీ) ప్రాజెక్టు నేడు (మంగళవారం) ప్రారంభం కానుంది. బ్యాంకుల స్థాయిలో నిర్వహించే హోల్‌సేల్ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడుతోంది. నెల రోజుల వ్యవధిలో సాధారణ కస్టమర్లు, వ్యాపారస్తుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ రూపీ – రిటైల్ సెగ్మెంట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనుంది. ‘డిజిటల్ రూపీ (హోల్‌సేల్ విభాగం) తొలి పైలట్ ప్రాజెక్టు నవంబర్ 1న ప్రారంభమవుతుంది‘ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన 9 బ్యాంకులు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి. సీమాంతర చెల్లింపులకు కూడా పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సీబీడీసీతో ప్రయోజనాలు..: ప్రస్తుతం పేపర్ రూపంలో ఉన్న కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రించి, వ్యవస్థలోకి జారీ చేస్తుంది. ఇలా పేపర్ రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో అధికారికంగా జారీ చేసే కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా (సీబీడీసీ) వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం, గూగుల్‌పే వంటి యాప్స్ ద్వారా డిజిటల్ రూపంలో చెల్లించగలుగుతున్నప్పటికీ, ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు, వాటిలో భౌతికమైన నోట్ల నిల్వలు తప్పనిసరిగా అవసరమవుతోంది. లావాదేవీల సెటిల్మెంట్ రెండు బ్యాంకుల మధ్య, ఆర్బీఐ దగ్గర జరగాల్సి ఉంటోంది. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తి సెటిల్మెంట్లో అంతరాయాలు ఏర్పడటంతో పాటు ఈ విధానం కొంత ఖర్చుతో కూడినది. సీబీడీసీ విధానంలో థర్డ్ పార్టీ బ్యాంకు ఖాతాల ప్రస్తావన, అవసరం లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో లావాదేవీల సెటిల్మెంట్ పూర్తయిపోతుంది. దీనితో సమయం, వ్యయాలూ ఆదా అవుతాయి. అలాగే ప్రత్యేకంగా పేపర్ కరెన్సీని ముద్రించాల్సిన వ్యయాల భారమూ ఆర్బీఐకి కొంత తగ్గుతుంది. డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలోని నగదు చోరీ భయాలు ఉండవని పరిశీలకుల విశ్లేషణ. అంతే గాకుండా ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బీఐ ద్వారా లబ్ధిదారులకు చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా. సీబీడీసీ అనేది పేపర్ రూపంలోని కరెన్సీ నోట్లకు బదులు కాకుండా చెల్లింపు విధానాలకు మరో ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా.. 2022–23లో డిజిటల్ రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం ప్రకటించినప్పటి నుండి సీబీడీసీ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అటు అంతర్జాతీయంగా పలు దేశాలు సీబీడీసీల జారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి. దాదాపు 90 పైగా సెంట్రల్ బ్యాంకులు వీటిని అధ్యయనం చేస్తున్నాయి. బహమాస్, నైజీరియా, డొమినికా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే సీబీడీసీలను ప్రవేశపెట్టాయి. -
డిజిటల్ కరెన్సీ: ఆర్బీఐ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ రూపాయికి సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిజిటల్ రూపాయిని లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. పరిమిత వినియోగం నిమిత్తం పైలట్ ప్రాతిపదికన ఈ-రూపాయిని త్వరలో ప్రారంభించనున్నామని శుక్రవారం విడుదల చేసిన కాన్సెప్ట్ పేపర్లో ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు కనిష్టంగా లేదా అంతరాయం కలగని విధంగా ఈ-రూపాయి వినియోగాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను ఇ-రూపాయి తుది డిజైన్‌లో పొందుపరుస్తామని ఆర్బీఐ కాన్సెప్ట్ పేపర్ జారీ సందర్భంగా ప్రకటించింది. ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలతో ఎలాంటి రిస్క్ లేకుండా, రిస్క్ ఫ్రీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ మనీని పౌరులకు అందించడం తన బాధ్యత అని వ్యాఖ్యానించింది. అలాగే ఇ-రూపాయి నిర్దిష్ట లక్షణాలు,ప్రయోజనాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటామని ఆర్బీఐ పేర్కొంది కాగా ఆర్బీఐ కొంతకాలంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సాధకబాధకాలను పరిశీలిస్తోంది. దశల వారీగా డిజిటల్ కరెన్సీని అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తెలిపిన సంగతి విదితమే. Issuance of Concept Note on Central Bank Digital Currencyhttps://t.co/JmEkN7rPyA — ReserveBankOfIndia (@RBI) October 7, 2022 -
భారత్‌లో రూపాయికి సమానమైన డిజిటల్ కరెన్సీ, ఎప్పుడు విడుదలంటే!
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ ఏడాదే ‘పైలెట్ బేసిస్’తో ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీల మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి సమయం, వ్యయం రెండూ తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2022–23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయికి సమానమైన డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుందని చెప్పారు. ‘‘జీ–20, అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలతో ఇప్పుడు ఎదుర్కొంటున్న చెల్లింపుల సమస్యను పరిష్కరించడానికి సీబీడీసీ అంతర్జాతీయీకరణ చాలా కీలకమని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఇండియా ఐడియాస్ సమ్మిట్‌లో టీ రబీ శంకర్ అన్నారు. -
దశలవారీగా డిజిటల్ కరెన్సీ అమలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (సీబీడీసీ) హోల్‌సేల్, రిటైల్ విభాగాలకు దశలవారీగా అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సీబీడీసీని ప్రవేశపెడుతున్నట్లు 2022-23 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక బిల్లు 2022 ఆమోదంతో ఆర్బీఐ చట్టం-1934లోని సంబంధిత సెక్షన్‌కు అవసరమైన సవరణలు చేసినట్టు ఆర్బీఐ ఫిన్‌టెక్ ఈడీ అజయ్ కుమార్ చౌదరి ఫిక్కీ సదస్సులో బుధవారం తెలిపారు. బిల్లు ఆమోదం పొందడంతో పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించి, డిజిటల్ కరెన్సీని జారీ చేసేందుకు ఆర్బీఐకి వీలు కల్పించిందని ఆయన చెప్పారు. డిజిటల్/వర్చువల్ కరెన్సీ అయిన సీబీడీసీ 2023 ప్రారంభంలో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు లేదా క్రిప్టోకరెన్సీలతో ఇది పోల్చదగినది కాదు. ఈ ఏడాది 323 బ్యాంక్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని అజయ్ వెల్లడించారు. నెలవారీ లావాదేవీలు 590 కోట్లకు చేరుకున్నాయని, వీటి విలువ రూ.10,40,000 కోట్లు అని వివరించారు. -
డిజిటల్ కరెన్సీపై ఆచితూచి నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రిస్కీ సాధనాలైన క్రిప్టోకరెన్సీలను కట్టడి చేసే విధంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకూ అధికారికంగా ఎక్కడా డిజిటల్ కరెన్సీ వినియోగంలో లేనందున దాని ప్రభావాలను ముందుగా అంచనా వేయగలిగే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర సెంట్రల్ బ్యాంకులు కూడా దీని విషయంలో క్రమానుగతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీబీడీసీలతో ఒనగూరే ప్రయోజనాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల డిమాండ్‌పై, తత్ఫలితంగా రుణ వితరణ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని శంకర్ అభిప్రాయపడ్డారు. -
జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం తన పేరు మీద కరెన్సీ!
మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన పేరు మీదుగా డిజిటల్ కరెన్సీ తెచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మెటాలో అంతర్గత పనులు వేగంగా జరుగుతున్నాయంటూ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగం పుంజుకుంటోంది. ఇదే సమయంలో గేమింగ్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. మెటావర్స్ కనుక విస్త్రృత స్థాయిలో అందుబాటులోకి వస్తే గేమింగ్ ప్రపంచం రూపు రేఖలే మారిపోతాయని నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేయాలని మెటా నిర్ణయించినట్టు సమాచారం. మెటా అభివృద్ధి చేస్తున్న డిజిటల్ కరెన్సీ ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ కరెన్సీని జుక్బక్స్గా పిలుస్తున్నట్టు సమాచారం. ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే ముందుగా గేమింగ్ ఇండస్ట్రీలో లావాదేవీలకు ఉపయోగించాలని మెటా యోచిస్తోంది. పిల్లలో ఎంతో పాపులరైన రోబ్లోక్స్ గేమ్‌లో రోబక్స్ అనే డిజిటల్ కరెన్సీ ఇప్పటికే చలామనీలో ఉంది. జుక్బక్స్ కూడా ముందుగా గేమింగ్‌లో ప్రయోగించి, అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ కామర్స్‌లో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. గతంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీ తెచ్చేందుకు మెటా ప్రయత్నించింది. ముందుగా లిబ్రా పేరుతో తెస్తారని ప్రచారం జరిగినా చివరకు డైమ్గా పేరు ఖరారు అయ్యింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు క్రిప్టో లావాదేవీలపై నిషేధం లేదా కఠినమైన ఆంక్షలు విధించడంతో క్రిప్టో కరెన్సీ ఆలోచన నుంచి మెటా యూ టర్న్ తీసుకుంది. దాని స్థానంలో జుక్బక్స్ పేరుతో డిజిటల్ కరెన్సీ ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కించింది. చదవండి: మీ బట్టలు మీరే ఉతుక్కోండి,ఎవరూ ఉతకరు..ఉద్యోగులకు జుకర్ నోటీసులు! -
దేశంలో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టే ఆలోచన లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచనలు ఏమి లేవని ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి నేడు రాజ్యసభకు తెలియజేశారు. భారతదేశంలో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీలపై ఎలాంటి నియంత్రణ లేదని ఆయన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. "ఆర్బీఐ ఎలాంటి క్రిప్టోకరెన్సీని జారీ చేయదు. ఆర్బీఐ చట్టం, 1994 ప్రకారం.. సంప్రదాయ పేపర్ కరెన్సీని మాత్రమే జారీ చేస్తుంది. సంప్రదాయ పేపర్ కరెన్సీకి డిజిటల్ రూపం ఇచ్చి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)గా తీసుకొని రానున్నట్లు" ఆయన అన్నారు. ఆర్బీఐ ప్రస్తుతం సీబీడీసీని ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆయన మరో సమాధానంలో తెలిపారు. సీబీడీసీని ప్రవేశపెట్టడం వల్ల నగదుపై ఆధారపడటం తగ్గుతుంది, దీంతో ఆ కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చు కూడా మిగిలే అవకాశం ఉన్నట్లు పంకజ్ చౌదరి అన్నారు. నోట్ల ముద్రణ కొంతకాలం తగ్గిందని, 2019-20 కాలంలో రూ.4,378 కోట్ల విలువైన నోట్లు ముద్రిస్తే, ఇది 2020-21లో రూ.4,012 కోట్లకు తగ్గిందని ఆయన తెలిపారు. ఇంకా, ఆర్థిక, భౌగోళిక రాజకీయ సంఘటనల వల్ల స్వల్పకాలం స్టాక్ మార్కెట్లు అనిశ్చితికి లోనైనా కొలుకుంటాయని ఆయన అన్నారు. (చదవండి: ఇక దేశీయ రోడ్ల మీద చక్కర్లు కొట్టనున్న హైడ్రోజన్ కార్లు..!) -
ఆర్బీఐ డిజిటల్ కరెన్సీతో లావాదేవీలు వేగవంతం: డెలాయిట్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)తో లావాదేవీలు వేగవంతం అవడమే కాకుండా, వ్యయాలు ఆదా అవుతాయని డెలాయిట్ సంస్థ తెలిపింది. డిజిటల్ రూపీపై ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీని 2022–23 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చే ప్రణాళికల్లో ఆర్బీఐ ఉండడం తెలిసిందే. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు సీబీడీసీ వినూత్నమైన, పోటీతో కూడిన చెల్లింపుల వ్యవస్థ కాగలదని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఎక్కువ శాతం సెక్యూరిటీల క్లియరింగ్, సెటిల్మెంట్ ప్రక్రియకు ఎన్నో రోజులు తీసుకుంటోందని, డిజిటల్ రూపీని ప్రవేశపెడితే సామర్థ్యాలు పెరగడంతోపాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గుతాయని అంచనా వేసింది. అదే సమయలో భద్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ‘‘ఇతర డిజిటల్ సాధనాలతో పోలిస్తే సీబీడీసీలకు సావరీన్ ఆప్షన్ ఉండడం అదనపు ఆకర్షణ. అదే ఇతర డిజిటల్ సాధనాలు అంత విశ్వసనీయమైనవి కావు. స్టోర్ ఆఫ్ వ్యాల్యూ సైతం ఎక్కువ అస్థిరతలతో ఉంటుంది’’ అని ఈ నివేదిక వివరించింది. భవిష్యత్తులో నగదు వినియోగం తగ్గినప్పడు విలువ బదిలీకి ప్రత్యామ్నాయం అవుతుందని, మరిం త విస్తృతంగా వినియోగించే పేమెంట్ సైకిల్‌గా మారొచ్చని తెలిపింది. -
దేశంలో డిజిటల్ కరెన్సీ, ఆర్బీఐకి అంత తొందరలేదు!!
వచ్చే ఏడాది ప్రారంభం నాటికి దేశంలో అధికారిక డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెస్తామంటూ కేంద్ర అధికారిక వర్గాలు సైతం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తన బడ్జెట్ ప్రసంగంలో డిజిటల్ కరెన్సీపై ఓ స్పష్టత నిచ్చారు. త్వరలో దేశంలో డిజిటల్ రూపాయిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ తరహాలో ఈ డిజిటల్ కరెన్సీ పనిచేస్తుండగా.. సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం హామీ ఇవ్వడంపై మరింత ఆసక్తి నెలకొంది. కానీ ఇదే డిజిటల్ కరెన్సీ వ్యవహారంలో ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది.ఆర్బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు. హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు. -
వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
-
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈ రూపీ ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు
ముంబై: డిజిటల్ రూపీని ఎన్నిసార్లైనా వాడుకునే వెలసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు డిజిట్ రూపీపై ప్రస్తుతం ఉన్న రూ.10 వేల పరిమితిని లక్ష రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అదే విధంగా రిపోరేటు, రివర్స్‌రిపో రేటులో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. ఆర్బీఐ 14వ బోర్డు సమావేశానికి సంబంధించి అనేక కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ఆర్బీఐ కీలక నిర్ణయాలు - 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.8 శాతంగా ఉంటుంది - రిపోరేటు, రివర్స్‌రిపో రేటులో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం రిపోరేటు 4 శాతం ఉండగా రివర్స్‌రిపో రేటు 3.3 శాతంగా ఉంది. ఈ ఏడాది కూడా ఇవే కొనసాగనున్నాయి. - నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంటాయి. పప్పులు, వంట నూనె ధరల్లో ఉత్పత్తి పెరిగినందున ధరల పెరుగుదలకు కళ్లెం పడ్దట్టే. గత నవంబరు నుంచి పెట్రోలు ధరలు పెంచకపోవడం వల్ల ధరల పెరుగుదలకు కొంత బ్రేక్ పడింది. - ఓమిక్రాన్ ప్రభావం క్యూ 3, క్యూ 4పై పెద్దగా లేదు - కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది - 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం అవుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవోల్బణం 5.7 శాతంగా ఉంది. ధరల పెరుగుదల అదుపులోకి వస్తుండటంతో ద్రవ్యోల్బణం తగ్గుతోంది - కమర్షియల్ బ్యాంకుల పనితీరు మెరుగుపడుతోంది - అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రతికూలతు ఉన్నా రూపాయి విలువ స్థిరంగానే ఉంది. వంటనూనెల దిగుమతి, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కొంత తగ్గాయి. - ఎమర్జెన్సీ హెల్త్ సర్వీస్, కాంటాక్టింగ్ ఇంటెన్సివ్ సర్వీస్‌ల కోసం గత జూన్‌లో మొత్తం రూ.65 వేల కోట్ల రుణాలు కేటాయించాల్సిందిగా బ్యాంకులను ఆదేశించాం. కరోనా భయాలు పూర్తిగా తొలగనందున ఈ పథకాన్ని 2022 జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. నిధుల లభ్యత పెరగడం వల్ల వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింతగా మెరుగవుతాయి. - వీఆర్ఆర్ (వాలంటరీ రిటెన్షన్ రూట్) స్కీమ్‌కి మంచి స్పందన ఉంది. ఈ స్కీమ్ పరిమితిని ఒక కోటి రూపాయల నుంచి రూ. 2.5 కోట్లకు పెంచుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది - ప్రీపెయిడ్ డిజిటల్ వోచర్లుగా ఉన్న ఈ రూపీ పరిమితిని పెంచారు. డిజిటల్ రూపీని 2021 ఆగస్టులో ప్రారంభించారు. ఇది సింగిల్ యూజ్ క్యాష్‌లెస్ వోచర్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం డిజిటిల్ రూపీపై రూ.10,000 వరకే పరిమితి ఉంది. దీన్ని లక్ష వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ వోచర్‌ని ఒకేసారి వాడాలనే నిబంధన ఉండగా.. ఇప్పుడు డిజిటల్ వోచర్లో అమౌంట్ అయిపోయే వరకు ఎన్ని సార్లైనా వాడుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రూపీ వోచర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి. యూపీఐ పేమెంట్స్‌లో వీటిని వాడుకోవచ్చు. - ఎంఎస్ఎఫ్ (4.25 శాతం), బ్యాంక్ రేట్ (4.25 శాతం) ఎటువంటి మార్పు లేదు. - లతామంగేష్కర్ జీనా హై తమన్నా అనే పాటను గుర్తు చేస్తూ కరోనా కష్టాల్లో కూడా దేశం ధైర్యంగా ముందుకు సాగుతోందంటూ శక్తికాంతదాస ప్రసంగం ముగించారు. 14వ సమావేశం 2022 ఫిబ్రవరి 10న పద్నాలుగవ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2022–23 వార్షిక బడ్జెట్ ముఖ్యాంశాలపై చర్చించారు. ద్రవ్యలోటు, మూలధన ప్రణాళికలు, ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లతో కూడిన ఆర్బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తోంది -
భారత్ డిజిటల్ రూపాయి
-
దేశంలో డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడే..!
న్యూఢిల్లీ: మన దేశ అధికారిక డిజిటల్ కరెన్సీ 2023 ఆరంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ మాదిరిగానే ఇది పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. అయితే, దీనికి ప్రభుత్వ హామీ ఉండటం చేత సౌకర్యంగా ఉంటుందని ఒక ఉన్నత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం తన బడ్జెట్ ప్రసంగంలో త్వరలో కేంద్ర బ్యాంకు మద్దతుగల 'డిజిటల్ రూపాయి'ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ జారీ చేయనున్న ఈ డిజిటల్ కరెన్సీని యూనిట్లలో లెక్కించవచ్చని, ప్రతి ఫియట్ కరెన్సీకి ప్రత్యేకమైన సంఖ్య ఉన్నట్లే ఈ డిజిటల్ కరెన్సీకి ప్రత్యేక నెంబర్ ఉండనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీకి ఇది భిన్నంగా ఉండదు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ కరెన్సీని ప్రస్తుతం ఉన్న సాదారణ కరెన్సీకి డిజిటల్ రూపంగా భావించవచ్చు తెలిపాయి. ఇది ప్రభుత్వ భరోసా గల ఒక ఎలక్ట్రానిక్ వాలెట్ అవుతుంది అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డిజిటల్ రూపాయి సిద్ధంగా ఉంటుందని ఆర్బీఐ సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ అభివృద్ధి చేస్తున్న డిజిటల్ రూపాయి బ్లాక్ చైన్, ప్రైవేట్ కంపెనీలు మొబైల్ వాలెట్ ప్రస్తుత వ్యవస్థ వలె కాకుండా అన్ని లావాదేవీలను గుర్తించగలదు. (చదవండి: అదిరిపోయిన ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా అదుర్స్!) -
క్రిప్టో కరెన్సీ అంటే అంత క్రేజ్ ఎందుకు?
డిజిటల్ ఇండియా..డిజిటల్ ఎకానమీ...డిజిటల్ రుపీ. అంతా డిజిటల్. డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ఆర్బీఐ త్వరలోనే దేశీ డిజిటల్ కరెన్సీని లాంచ్ భారత్‌లో చేయనుంది. ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్న అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? క్రిప్టో కరెన్సికి ఎందుకంత క్రేజ్? ఇక భవిష్యత్తు అంతా క్రిప్టోకరెన్సీలదేనా? క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ రూపంలోనే కనిపించే కరెన్సీ. అంటే క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇప్పుడున్న కరెన్సీలాగే చాలా దేశాల్లో వీటిని లావా దేవీలకు అనుమతి ఇస్తున్నారు. . బిట్కాయిన్లను మొట్టమొదటిసారి ఒక కరెన్సీగా వాణిజ్య లావాదేవీల కోసం ఉపయోగించింది 2010 మే 22వ తేదీన. ఫ్లోరిడాకు చెందిన లాస్జ్లో హాన్యే అనే ప్రోగ్రామర్.. 10,000 బిట్కాయిన్లు చెల్లించి రెండు పిజ్జాలు కొన్నాడు. అప్పుడు ఆ పది వేల బిట్కాయిన్ల విలువ సుమారు 47 డాలర్లు మాత్రమే. 2011 ఏప్రిల్‌లో 1 డాలరుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ అదే ఏడాది జూన్ నాటికి 32 డాలర్లకు పెరిగింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులొచ్చినా 2012 ఆగస్టు నాటికి 13.20 డాలర్లకు పెరిగింది. అయితే బిట్ కాయిన్‌కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో బిట్‌కాయిన్‌తో పోటీగా డిజిటల్ కరెన్సీల తయారీ మొదలైంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత 10,000 డాలర్లకు ఎగిసిన బిట్‌కాయిన్ 2019లో 7,000 డాలర్లకు పడిపోయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సంక్షోభం, డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో 2020లో బిట్‌కాయిన్ మళ్లీ దూసుకుపోయింది. 2021లో 70వేల డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను ఊరించడం మొదలు పెట్టింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి బిట్‌కాయిన్ 16శాతం పతనమై దాదాపు సగానికి పడిపోయింది. 2022 ఫిబ్రవరి 1 తరువాత 39వేల డాలర్ల దిగువకు చేరింది. ఇంత ఒడిదుకుల మధ్య ఉన్నా .. ఆదరణ మాత్రం పెరుగుతూనే ఉంది. (Happy Birthday Shekhar Kammula: శేఖర్ కమ్ముల గెలుచుకున్నది ఎన్ని ‘నంది’ అవార్డులో తెలుసా?) తాజాగా కేంద్రం కూడా డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయనుంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి బ్లాక్‌చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారిత డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దీన్ని జారీ చేస్తుంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీ ఏ రూపంలో జరిగినా దానిపై 30 శాతం పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. అంటే భారత్‌లో ఇకపై క్రిప్టో కరెన్సీ కొనుగోళ్లు, అమ్మకాలు, బహుమతి రూపంలో బదిలీ.. ఇలా లావాదేవీ ఏ రూపంలో ఉన్నా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దేశంలో క్రిప్టో ట్రేడింగ్‌కు అనుమతి ఉంటుందనేసంకేతాలందించారు. భౌతికంగా పేపర్ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో రూపొందించడం వల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో కూడా దీనికి చోటు కల్పిస్తారు కాబట్టి చట్టబద్ధత ఉంటుంది. అనుకున్నట్టుగా ఇండియా డిజిటల్ రుపీని లాంచ్‌చేస్తే అది ప్రపంచ రికార్డు కానుంది. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఈ తరహా 'ఈ-క్రోనా' వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా, 2014 నుంచి చైనా పీపుల్స్ బ్యాంకు కూడా డిజిటల్కరెన్సీ వినియోగంపై కసరత్తు చేస్తోంది. గత రెండేళ్లుగా ప్రధాన నగరాల్లో డిజిటల్ యువాన్‌ను ట్రయల్ చేస్తోంది. ముఖ్యంగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే అథ్లెట్లు, అధికారులు, జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న మూడు చెల్లింపు పద్ధతుల్లో ఇదొకటి. అయితే సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మదుపు చేస్తున్నారు. అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. మార్కెట్‌ను ఎలా నియంత్రించాలనుకుంటోంది లాంటి విషయాలపై భారత ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ తయారుచేస్తుందో చూడాలి. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య దాదాపు రెండు కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు 2030 నాటికి ప్రపంచ కరెన్సీ చలామణిలో నాలుగో వంతు క్రిప్టోకరెన్సీలు ఉంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. క్రిప్టోకరెన్సీ యూజర్ల వివరాల గోప్యత, నియంత్రణ,భద్రత లాంటి అంశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ కరెన్సీలతో పోలిస్తే క్రిప్టో కరెన్సీలే బెటర్అని టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, అల్ గోర్, రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు ఇప్పటికే చెప్పారు. మనీలాండరింగ్, టెర్రరిస్టు కార్యకలాపాలు, డార్క్‌నెట్ నేరాలు పెరిగిపోతాయని, ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ముప్పేనని వారెన్ బఫెట్, పాల్ క్రుగ్మన్, రిచర్డ్ షిల్లర్ వంటి ఆర్థికవేత్తలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
క్రిప్టోకి ఎప్పటికీ నో ఎంట్రీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ డిజిటల్ కరెన్సీల చట్టబద్ధతపై స్పష్టతనిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలు ఎన్నటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు కాబోవని ఆయన స్పష్టం చేశారు. ‘క్రిప్టో ఎప్పటికీ లీగల్ టెండర్ కాబోదు. లీగల్ టెండర్ అంటే చట్టం ప్రకారం రుణాల సెటిల్మెంట్ కోసం ఆమోదయోగ్యమైనదని అర్థం. క్రిప్టో అసెట్ల విషయంలో భారత్ అలా చేయబోదు. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ రూపీకి మాత్రమే లీగల్ టెండర్ హోదా ఉంటుంది‘ అని సోమనాథన్ పేర్కొన్నారు. బంగారం, వజ్రాలలాగే విలువైనవే అయినప్పటికీ వాటిలాగే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు అధికారిక గుర్తింపు ఉండదని తెలిపారు. 2022–23 బడ్జెట్లో వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద వచ్చే లాభాలపై 30 శాతం పన్నులు, నిర్దిష్ట పరిమాణానికి మించిన లావాదేవీలపై 1 శాతం ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) విధించేలా ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. క్రిప్టో ఆదాయాలను వెల్లడించేందుకు ఆదాయ పన్ను రిటర్నుల్లో ప్రత్యేక కాలమ్ కూడా ఉండనుంది. గత శీతాకాల పార్లమెంటు సెషన్లో క్రిప్టో నియంత్రణ బిల్లును అంశాన్ని లిస్టు చేసినప్పటికీ .. తాజా బడ్జెట్ సెషన్ జాబితాలో దాన్ని చేర్చకపోవడంపై స్పందిస్తూ.. ‘దీన్ని చట్టం చేయడానికి ముందు నియంత్రణ స్వభావం ఎలా ఉండాలి, నియంత్రణ ఉండాలా లేక పన్ను మాత్రమే విధించాలా వంటి అంశాలపై మరింత విస్తృతంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది‘ అని ఆయన తెలిపారు. గ్లోబల్‌గా ఏకాభిప్రాయం కావాలి.. క్రిప్టోకరెన్సీలను నియంత్రించేందుకు దేశీయంగా తీసుకునే చర్యలు సరిపోవు కాబట్టి, ప్రపంచ దేశాల ఏకాభిప్రాయానికే భారత్ మొగ్గుచూపుతోందని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేఠ్ చెప్పారు. ఇలాంటి సాధనాలు ఏ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి రాకుండా ఆన్లైన్లో ట్రేడవుతుండటమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రించాలా లేదా నిషేధించాలా .. క్రిప్టో కరెన్సీల విషయంలో పాటించాల్సిన విధానాలపై కసరత్తు జరుగుతోంది. ఇవి ఎప్పటికీ తేలతాయన్నది ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుత బడ్జెట్ సెషన్లో అయితే జరగకపోవచ్చని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. క్రిప్టోలను నియంత్రించడంపై చర్చలు జీ20 సదస్సులో ప్రారంభం కావచ్చని సేఠ్ పేర్కొన్నారు. మరోవైపు, సీమాంతర లావాదేవీలు కూడా జరుగుతాయి కాబట్టి క్రిప్టోకరెన్సీల నియంత్రణపై అంతర్జాతీయంగా కూడా ఏకాభిప్రాయం అవసరమవుతుందని సోమనాథన్ చెప్పారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన చేశాక దానిపై అభిప్రాయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటోంది. వాటి ఆధారంగా ఏం చేయాలి, ఎలా చేయాలన్న దానిపై తుది నిర్ణయానికి వస్తుంది. అయితే, అప్పటివరకూ పన్నులపై స్పష్టత ఇవ్వకుండా కూర్చోవడం కుదరదు. ఎందుకంటే, క్రిప్టో కరెన్సీల లావాదేవీల పరిమాణం భారీగా పెరిగిపోతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. -
డిజిటల్ ఆదాయ స్వప్నం
నిజాలెంత నిష్ఠూరంగా ఉన్నా, కనీసం కలలైనా కమ్మగా ఉండాలంటారు. నిరుద్యోగం పెరిగి, మధ్య, దిగువ మధ్యతరగతి నడ్డి విరిగిన కరోనా కష్టకాలంలో... తాజా కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపిన భవిష్యత్ డిజిటల్ చిత్రం రకరకాల రంగులీనుతోంది. కాగితంతో పని లేకుండా డిజిటల్ ఉపకరణం సాయంతో ప్రసంగాన్ని చదువుతూ డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థికం.. అన్ని రంగాలనూ డిజిటల్ బాట పట్టించే ప్రతిపాదనలు చేశారు. కొత్తగా వర్చ్యువల్ డిజిటల్ కరెన్సీ తెస్తామంటూ ‘డిజిటల్ భారతావని’ని అరచేతిలో చూపారు. క్రిప్టో మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో వర్చ్యువల్ డిజిటల్ ఆస్తుల (వీడీఏల) లావాదేవీలపై 30 శాతం పన్ను ప్రతిపాదించారు. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చర్చంతా వీడీఏలతో జనం గడించే ఆదాయంపై 30 శాతం పన్ను వేయడం మీదే! కొన్నేళ్ళుగా దేశంలో క్రిప్టో పరిశ్రమ ప్రాచుర్యానికి ఈ ప్రతిపాదన ఓ తార్కాణం. ఇటీవల వీడీఏలపై వాణిజ్యం భారీయెత్తున సాగుతుండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఒక వీడీఏను బదలాయించి నందుకు చెల్లింపులు కూడా అలాంటి మరో వీడీఏ రూపంలోనే సాగేలా మార్కెట్ ఆవిర్భవించడాన్ని గమనించింది. వెరసి, ఈ డిజిటల్ ఆస్తుల వ్యవహారం పన్ను రాబడికి వనరు అని గ్రహించింది. అందుకే, బడ్జెట్లో వీడీఏల లావాదేవీలపై 30 శాతం మేర పన్ను వేసింది. అలాంటి అమ్మకాలు ఒక నియమిత పరిమితి దాటితే, 1 శాతం మేర టీడీఎస్ (మూలం దగ్గరే పన్ను మినహాయింపు) కూడా విధించింది. ఇలా క్రిప్టో కరెన్సీలు, నాన్ ఫంజిబుల్ టోకెన్ల (ఎన్ఎఫ్టీ) వ్యాపారంలో లాభాలు రానున్న ఏప్రిల్ 1 నుంచి దేశంలోకెల్లా అత్యధిక పన్ను శ్లాబ్‌లోకి వస్తున్నాయి. డిజిటల్ కరెన్సీలకు ఆమోదముద్ర కోరుతున్నవారికి ఇది తీపి, చేదు అనుభూతుల సమ్మిశ్రమం. క్రిప్టో లాంటి డిజిటల్ ఆస్తులకు అధికారికంగా గుర్తింపు ఉన్నదీ, లేనిదీ తేల్చకుండానే ప్రభుత్వం పన్ను విధింపునకు దిగడం గమ్మల్తైన విషయమే. 2018లో రిజర్వ్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ను నిషేధించడం, ఆ తర్వాత రెండేళ్ళకు సుప్రీమ్ కోర్ట్ ఆ నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. అది జరిగీ మరో రెండేళ్ళవుతున్నా కేంద్రం ఈ క్రిప్టోలపై ఒక కచ్చితమైన విధాన నిర్ణయానికి రాలేకపోవడం విడ్డూరం. లాటరీ, జూదం, ఇతర గేమింగ్ల లాంటి స్పెక్యులేషన్ కార్యకలాపాలతో సమానంగా 30 శాతం భారీ పన్ను క్రిప్టో వ్యాపారాన్ని నిరుత్సాహపరచడానికేనని కొందరి అభిప్రాయం. అది కొంత నిజమే. లాభాలకు పన్ను కట్టినా, డిజిటల్ ఆస్తుల బదలాయింపులో నష్టాలు ఎదురైతే మాత్రం ఇతర ఆదాయంతో దాన్ని సమం చేస్తూ లెక్కలు చూపడానికి లేదన్న నిబంధన అందుకు నిదర్శనం. అయితే, అసలంటూ పన్ను విధింపు ద్వారా పరోక్షంగా డిజిటల్ ఆస్తుల్ని గుర్తిస్తున్నట్టు సర్కారు సంకేతాలిచ్చిందని ఇంకొందరు నిపుణుల మాట. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మన దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించాలని ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ తాజా చర్యలు అందులో భాగమే. మోదీ సర్కార్ 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తగ్గట్లే ఇప్పుడు కొత్త డిజిటల్ కరెన్సీ ప్రతిపాదన తెచ్చింది. పొరుగున ఉన్న చైనా డిజిటల్ యువాన్ తేవడంపై మల్లగుల్లాలు పడు తుండగానే, రిజర్వ్ బ్యాంక్ సారథ్యంలో డిజిటల్ రూపీ తేనున్నట్టు మనం ప్రకటించడం పెద్ద విషయమే. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, మైనింగ్లను నిషేధించిన చైనా ఈ నెలలో శీతకాలపు ఒలింపిక్స్ నాటికి డిజిటల్ యువాన్ తేవాలని ప్రయత్నిస్తోంది. బ్రిటన్ కూడా డిజిటల్ కరెన్సీ తేవాలనుకుం టోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోట డిజిటల్ రూపీ మాట క్రిప్టో కరెన్సీ వ్యాపారులకు హర్షమే. నిజానికి, మన దేశంలో దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్టర్లున్నారని అంచనా. వారి మొత్తం క్రిప్టో ఆస్తుల విలువ రూ. 40 వేల కోట్లని లెక్క. కరోనా దెబ్బతో ఖజానాకు ఆదాయం తగ్గుతున్నవేళ, జనం ఎగబడుతున్న క్రిప్టో పరిశ్రమ కొత్త పన్ను రాబడి కోసం ప్రభుత్వానికి పాడి ఆవులా కనిపించింది. అందుకే, బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టింది. మొదటి నుంచీ క్రిప్టో పరిశ్రమ పట్ల సదభిప్రాయం లేని సర్కారు తెలివిగా బడ్జెట్లో క్రిప్టో కరెన్సీ అనే పదం వాడలేదు. డిజిటల్ ఆస్తులు అనే ప్రస్తావిస్తూ వచ్చింది. ఇంతకీ, క్రిప్టో తదితర ఆస్తుల్ని అధికారికంగా ఏ మేరకు గుర్తిస్తున్నదీ, వాటి చట్టబద్ధత ఎంత అన్నదీ ప్రభుత్వమే వివరించాలి. తీవ్రవాద సంస్థల చేతిలో క్రిప్టో కరెన్సీ దుర్వినియోగమయ్యే ప్రమాదానికి నివారణ చర్యలనూ ఆలోచించాలి. రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ కరెన్సీల మార్కెట్లో ప్రధాన వాటా కోసం డిజిటల్ రూపీ ఆలోచన బాగుంది. కానీ, ఇవాళ్టికీ దేశంలో సగానికి సగం మందికి డిజిటల్ నగదు లావాదేవీలు తెలియని చోట, కొత్తగా తెచ్చే అధికారిక డిజిటల్ రూపీ ప్రయోజనాలను పరిచయం చేసే బాధ్యత చేపట్టాలి. ఇక, క్రిప్టోతో ఈ డిజిటల్ రూపీ ఏ మేరకు పోటీపడుతుందన్నది మరో ప్రశ్న. రెండూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ మీద ఆధారపడినా, క్రిప్టోలో లాగా ఇక్కడ ఇన్వెస్టర్ల వివరాలు అజ్ఞాతంగా ఉండడం కుదరదు. ఒక్కమాటలో పరిశ్రమలో అగ్రభాగంలో నిలవడానికి డిజిటల్ రూపీ ఇంకా చాలా దూరమే ప్రయాణించాలి. క్రిప్టో ట్రేడింగ్‌పై పూర్తి నిషేధానికీ, ఇటు నియంత్రణలకూ మధ్యేమార్గంలో ప్రభుత్వం రెండు వ్యవస్థలూ సామరస్యంగా కొనసాగే చర్య చేపడుతుందేమో వేచి చూడాలి. అది ఎంత త్వరగా స్పష్టతనిస్తే అమాయక ఇన్వెస్టర్లకు అంత మేలు! -
సాక్షి కార్టూన్(03-02-2022)
-
క్రిప్టోకు చట్టబద్ధత వచ్చినట్లు కాదు
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను రిటర్ను ఫారంలలో ప్రత్యేకంగా ఉంటుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. క్రిప్టో ఆదాయాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ‘ఈ కరెన్సీలకు సంబంధించిన ట్యాక్సేషన్‌పై స్పష్టత తెచ్చేందుకే ఫైనాన్స్ బిల్లులో వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై పన్నుల నిబంధన చేర్చారు. ఈ నిబంధనల్లో వీటి చట్టబద్ధత గురించి ఏమీ లేదు. క్రిప్టోకరెన్సీల నియంత్రణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయి‘ అని బజాజ్ తెలిపారు. ‘క్రిప్టో అసెట్స్ ఆదాయంపై పన్ను విధించే విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. అందుకే గరిష్టంగా 30 శాతం రేటు పరిధిలోకి దాన్ని చేర్చాం. టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తింపచేస్తున్నాం. ఇకపై ఈ లావాదేవీలన్నింటినీ ట్రాక్ చేస్తాం‘ అని ఆయన వివరించారు. క్రిప్టోల చట్టబద్ధత గురించి ప్రస్తావించకుండా.. గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ లావాదేవీల తరహాలోనే ఈ కరెన్సీల ద్వారా వచ్చే లాభాలపైనా 30% పన్ను (సెస్సు, సర్‌చార్జీలు అదనం) విధించాలని బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి పన్ను, జులై 1 నుంచి టీడీఎస్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కూడా క్రిప్టో లాభాలపై పన్ను వర్తిస్తుందని, 2022 ఏప్రిల్ 1కి ముందు చేసిన క్రిప్టో లావాదేవీలను ఐటీఆర్‌లోని ఏదో ఒక హెడ్ కింద చూపితే అసెస్మెంట్ అధికారి దానిపై తగు నిర్ణయం తీసుకుంటారని బజాజ్ తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్లకు టెక్నాలజీ తప్ప ఎటువంటి ఆర్థిక విలువ ఉండదు కాబట్టి డిడక్షన్లకు తావు ఉండదని ఆయన చెప్పారు. పన్నుతో మార్కెట్ పరిస్థితి తెలుస్తుంది: సీబీడీటీ చీఫ్ మహాపాత్ర క్రిప్టో కరెన్సీలపై పన్నుల వడ్డనతో దేశీయంగా ఈ మార్కెట్ ’లోతు’ ఎంత ఉందో తెలుస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర చెప్పారు. అలాగే ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల స్వభావం మొదలైన వివరాల గురించి కూడా వెల్లడవుతుందని పేర్కొన్నారు. అయితే పన్ను విధించడమనేది.. ఈ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే డిజిటల్ వ్యాపారం ద్వారా లాభాలు ప్రకటించిన పక్షంలో.. దానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడ నుంచి తెచ్చారన్నది కూడా వెల్లడించాల్సి ఉంటుందని మహాపాత్ర తెలిపారు. ఒకవేళ పెట్టుబడి సరైనదే అయితే లాభాలపై పన్ను వర్తిస్తుందని చెప్పారు. అలా కాకుండా లెక్కల్లో చూపని డబ్బును లేదా బినామీగా ఇన్వెస్ట్ చేసినట్లు తేలితే దానికి అనుగుణంగా ఇతర చర్యలు ఉంటాయన్నారు. ట్యాక్సేషన్ వల్ల ఇవన్నీ బైటపడతాయని మహాపాత్ర చెప్పారు. అనధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి చూస్తే దేశీయంగా క్రిప్టో లావాదేవీల పరిమాణం ఏటా రూ. 30,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకూ ఉంటోంది. -
భారత్‌లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ వచ్చేసింది
India First Cryptocurrency Index IC15: భారత్ మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ సూచీ అధికారికంగా లాంఛ్ అయ్యింది. ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ సూపర్ యాప్‌గా గుర్తింపు పొందిన క్రిప్టోవైర్ ఈ కరెన్సీ సూచీని తీసుకొచ్చింది. ఇంతకీ దీని పేరేంటో తెలుసా?.. ఐసీ15 (IC15). క్రిప్టోమార్కెట్‌ను.. దాని తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వివరించడమే ఈ సూచీ చేసే పని. ఈ సూచీ డ్యూటీ ఏంటంటే.. బాగా ట్రేడింగ్‌లో, లీడింగ్ ఎక్స్ఛేంజ్లో ఉన్న క్రిప్టోకరెన్సీల పనితీరును పర్యవేక్షించడం.. ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ద్వారా తెలియజేడం. ట్రిక్కర్ప్లాంట్ లిమిటెడ్‌లో స్పెషల్ బిజినెస్ యూనిట్‌గా ఉన్న క్రిప్టోవైర్.. క్రిప్టో లెక్కల వివరాల్ని పక్కాగా తెలియజేస్తుంటుంది. తద్వారా క్రిప్టో ఇన్వెస్టర్లకు మాత్రమే కాదు.. ఆసక్తి ఉన్నవాళ్లకు, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లకు సైతం క్రిప్టో మార్కెట్ తీరుతెన్నులు ఎప్పటికప్పుడు అర్థమవుతుంటాయి. పనిలో పనిగా ఈ ఇండెక్స్(సూచీ).. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ ఇకోస్టిస్టమ్ మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుంటుంది కూడా. డొమైన్ ఎక్స్పర్ట్స్, విద్యావేత్తలు, మేధావులతో కూడిన గవర్నెన్స్ కమిటీ(IGC) ఐసీ15లో ఉంటుంది. ఏదైనా ఒక క్రిప్టోకరెన్సీకి ఇండెక్స్‌లో చోటు దక్కాలంటే.. రివ్యూ ప్రకారం ట్రేడింగ్ రోజుల్లో కనీసం 90 శాతం అయినా ట్రేడ్ అయ్యి తీరాలి. గడిచిన నెలలో మార్కెట్ క్యాపిటలైజేషన్ సర్క్యులేటింగ్ పరంగా టాప్ 50లో ఉండాలి. IC15 ఇండెక్స్‌లో లిస్టింగ్‌కు అర్హత పొందేందుకు మాత్రం.. ట్రేడింగ్ విలువ పరంగా అది టాప్ 100 అత్యంత లిక్విడ్ క్రిప్టోకరెన్సీలలో ఒకటిగా ఉండాలి. -
క్రిప్టోకరెన్సీ.. కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ
RBI On Cryptocurrency Control And Digital Currency: క్రిప్టోకరెన్సీ నియంత్రణ చట్టం విషయంలో కేంద్రం ఆచితూచీ వ్యవహరించాలని నిర్ణయించుకుంది. క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని ఓవైపు చెబుతూనే.. వాటిని ఆస్తులుగా పరిగణించే దిశగా చట్టంలో మార్పులు చేసినట్లు సంకేతాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో తన స్టాండర్డ్‌ను ప్రకటించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఈ మేరకు డిసెంబర్ 17న లక్నో(ఉత్తర ప్రదేశ్)లో జరగబోయే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది ఆర్బీఐ. ఆర్బీఐ తరపు నుంచి డిజిటల్ కరెన్సీని(క్రిప్టో పేరుతో కాకుండా) జారీ చేయడం? దాని రూపు రేఖలు.. ఎలా ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయానికి రానుంది. ఇక ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?.. ఒకవేళ ప్రైవేట్ క్రిప్టో నియంత్రణ బాధ్యతల్ని ముందుగా అనుకున్నట్లు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి కేంద్రం అప్పగిస్తే.. ఆ నిర్ణయాన్ని స్వాగతించాలా? లేదంటే వ్యతిరేకించాలా? అనే విషయాలపై బోర్డులో చర్చించనుంది ఆర్బీఐ. క్లిక్ చేయండి: క్రిప్టోతో పెట్టుకోవడం ఆర్బీఐకి మంచిది కాదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం (13 డిసెంబర్, 2021)న ఆర్థిక మంత్రిత్వ శాఖ.. క్రిప్టోకరెన్సీ కోసం బిల్లు, నియంత్రణ మీద బిల్లు తుది రూపానికి వచ్చిందని, కేబినెట్ అంగీకారం ఒక్కటే మిగిలిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ వేగం పెంచింది. నిజానికి 17వ తేదీన జరగబోయే ఆర్బీఐ బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ కీలకాంశం ప్రస్తావనే లేదు!. కానీ, ఇలా ఎజెండాలో లేని కీలకాంశాలపై చర్చించడం బోర్డుకు కొత్తేం కాదని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చదవండి: క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయో తెలుసా? -
బిట్‌కాయిన్ గాలి తీసేసిన బిలియనీర్ కింగ్
క్రిప్టోమార్కెట్లో అతిపెద్ద డిజిటల్ కరెన్సీగా బిట్‌కాయిన్‌కి పేరుంది. అలాంటిది బిట్‌కాయిన్ కంటే.. ఎక్కడో క్రిప్టోకరెన్సీ జాబితాలో అట్టడుగున ఉండే మీమ్ కాయిన్ డోజ్‌కాయిన్‌కు ప్రయారిటీ ఇవ్వాలంటున్నాడు ఎలన్ మస్క్. బిలియనీర్ ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ వారి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ఘనత దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో టైమ్ ఇంటర్వ్యూలో క్రిప్టోకరెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎలన్ మస్క్. క్రిప్టో కరెన్సీని ప్రచారం చేసే ఎలన్ మస్క్.. బిట్‌కాయిన్ వరెస్ట్ అని, దీంతో పోలిస్తే డోజ్కాయిన్ చాలా బెస్ట్ అని చెప్తున్నాడు. అందుకు కారణాలేంటో కూడా వివరించాడాయన. రోజూవారీ ట్రాన్జాక్షన్స్ పరంగా చూసుకుంటే.. డోజ్‌కాయిన్‌ను బెటర్ క్రిప్టోకరెన్సీగా అభివర్ణించాడు. ‘బిట్‌కాయిన్ ట్రాన్జాక్షన్ వాల్యూ తక్కువ. ట్రాన్జాక్షన్కు అయ్యే ఖర్చు ఎక్కువ. ఒకానొక స్థాయిలో దాచుకోవడానికి ఇది పర్వాలేదనిపించొచ్చు. కానీ, ప్రాథమికంగా ట్రాన్జాక్షన్ కరెన్సీకి బిట్‌కాయిన్ ప్రత్యామ్నాయం కాదు’ అని పేర్కొన్నాడు ఎలన్ మస్క్. డోజ్‌కాయిన్‌ను హైలెట్ చేయడం జోక్‌గా మీకు అనిపించొచ్చు. కానీ, ట్రాన్జాక్షన్స్ పరంగా చూసుకుంటే ఇదే బెస్ట్. బిట్‌కాయిన్ ఒకరోజులో చేసే ట్రాన్జాక్షన్స్ కంటే డోజ్కాయిన్ చేసే ట్రాన్జాక్షన్స్ ఎక్కువ. పైగా డోజ్కాయిన్ అనేది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. బిట్కాయిన్లలాగా నిల్వ గురించి కాకుండా.. జనాల చేత ఖర్చు చేయిస్తుంది. అలా ఇది ఎకామనీకి మంచిదే కదా అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఎలన్ మస్క్. ఇదిలా ఉంటే క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ విలువ నష్టాల్లోనే నడుస్తోంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో పాటు భారత్‌లో క్రిప్టో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నేపథ్యంలో బిట్‌కాయిన్ విలువ పడిపోతూ ట్రేడ్ అవుతోంది. Watch: TIME's 2021 Person of the Year @elonmusk discusses cryptocurrency #TIMEPOY https://t.co/FfwEGxW7LX pic.twitter.com/5BXAZky0LS — TIME (@TIME) December 13, 2021 చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..! -
చైనా మూర్ఖపు నిర్ణయంతో..
China Crackdown Crypto Trading: అంతర్జాతీయ మార్కెట్లో రారాజుగా మారాలన్న చైనా ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. స్వీయ అపరాధాలతో పతనం వైపుగా అడుగులు వేస్తోంది. మరోవైపు చైనా కుబేరులు సైతం నష్టాల్ని చవిచూస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుండడం చైనాకు మింగుడు పడడం లేదు. ఈ తరుణంలో డ్రాగన్ కంట్రీ చేసిన తాజా ప్రకటన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ట్రేడింగ్‌లో క్రిప్టో కరెన్సీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఈ కరెన్సీని నిషేధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది చైనా. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదని వాదిస్తున్న చైనా.. వీలైనంత త్వరలో తమ దేశంలో నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. మరోవైపు క్రిప్టో కరెన్సీ సంబంధిత లావాదేవీలన్నీ చట్టవ్యతిరేకమైనవని చైనా కేంద్రీయ బ్యాంకు స్పష్టం చేసింది. పడిపోయిన టోకెన్ ధరలు డిజిటల్ కరెన్సీని నిషేధించాలని డ్రాగన్ కంట్రీ ప్రకటన.. డిజిటల్ ట్రేడ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. వర్చువల్ కరెన్సీ విలువల్లో విపరీత మార్పులు తెచ్చింది. క్రిప్టోకరెన్సీల విలువ(బిట్ కాయిన్, ఎథెరియమ్)లు ఒక్కసారిగా పడిపోయింది. బిట్‌కాయిన్ విలువ ఐదు శాతం పడిపోయి 42,232 డాలర్లకు చేరింది. ఇక రెండో అతిపెద్ద టోకెన్‌గా పేరున్న ఎథెరియమ్ విలువ 6.3 శాతం డ్రాప్ అయ్యి 2,888కు చేరింది. సోలానా 6.9శాతం తగ్గిపోయి 134 డాలర్లకు చేరింది. ఇక లైట్‌కాయిన్ విలువ 5.9 శాతం తగ్గి 149 డాలర్లకు చేరుకుంది. కార్డానో విలువ 2.4 శాతం పడిపోయి.. 2.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది. చైనా అభ్యంతరాలు క్రిప్టో కరెన్సీ లావాదేవీల మనుగడ దేశీయ మార్కెట్‌కు నష్టమని చైనా అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే క్రిప్టో సంబంధిత లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. విదేశీ సంస్థలు అందించే క్రిప్టో సేవలు అక్రమమైనవేనని పేర్కొంది. అదే సమయంలో దేశంలో బిట్‌కాయిన్ సహా క్రిప్టో కరెన్సీ మొత్తాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి చైనా సెంట్రల్ బ్యాంక్ సలహా ఇచ్చింది. ► డిజిటల్ ట్రేడింగ్‌లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. ► ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్ల ప్రోత్సాహంతో.. జనాలు సైతం ఈ-కరెన్సీపై నమ్మకం పెంచుకుంటున్నారు. ► ప్రపంచంలో చాలా దేశాలు క్రిప్టోకరెన్సీ లావాదేవీల్ని అనుమతిస్తున్నాయి. ► చైనా అతిపెద్ద క్రిప్టోకరెన్సీకి మార్కెట్ కూడా. ► అయినప్పటికీ చైనా మాత్రం క్రిప్టో కరెన్సీని అంగీకరించడం లేదు ► ఆర్థిక వ్యవస్థకు ఒరిగేదీ ఏమి లేదని, పైగా వర్చువల్ కరెన్సీ వల్ల కార్బన్ ఉద్గారాలు ఉధృతంగా ఉత్పత్తి అవుతాయని సొల్లు కారణాలు చెబుతోంది. ► మే నెలలో చైనా స్టేట్ కౌన్సిల్ ఏకంగా బిట్‌కాయిన్ మైనింగ్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ► నిషేధ నిర్ణయం గనుక అమలు అయితే.. భారీగా నష్టపోయేది ముందుగా చైనానే! చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీ! సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు ఇదీ చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...! -
క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై అనేక మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీపై అనేక దేశాలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా దేశ పౌరులు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాయి. ఎల్ సాల్వాడార్, పరాగ్వే వంటి దేశాలు బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలను చట్టబద్దత కల్పిస్తామని పేర్కొన్నాయి. ఈ నిర్ణయంలో పలు క్రిప్టోకరెన్సీలు కొత్త రికార్డులను నమోదు చేస్తూ గణనీయంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఆరు వేలకుపైగా క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్, ఈథిరియం, డాగ్‌కాయిన్ వంటివి ఎక్కువ ఆదరణను పొందాయి. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు... తాజాగా క్రిప్టోకరెన్సీలకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు సరికొత్త వ్యూహంతో ముందుకువస్తున్నాయి. క్రిప్టోకరెన్సీకి బదులుగా సొంత డిజిటల్ కరెన్సీలను అందుబాటులోకి తీసుకురానుంది. పశ్చిమ ఆఫ్రికాలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన నైజీరియా, ఘనా దేశాల సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ కరెన్సీను త్వరలోనే ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది క్రిప్టో దత్తతలో నైజీరియా ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. నైజీరియా, ఘనా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు విదేశీ కరెన్సీల డిజిటల్ వెర్షన్లను రూపొందించడానికి విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో భాగస్వామ్యమయ్యాయి. డిజిటల్ కరెన్సీపై పనిచేస్తోన్న దేశాల వరుసలో నైజీరియా, ఘనా కూడా చేరాయి. త్వరలోనే ట్రయల్స్...! పలు విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో నైజీరియా, ఘనా దేశాలు డిజిటల్ కరెన్సీ ఏర్పాటులో కీలక అడుగువేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో నైజీరియా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గి ఉంది. వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి ‘ఈనైరా’ అనే డిజిటల్ కరెన్సీ ప్రారంభించనుంది. మరోవైపు ఈ నెల నుంచి ‘ఈసేడీ’ డిజిటల్ కరెన్సీలను ట్రయల్ చేయనున్నట్లు సమాచారం. పడిపోతున్న కరెన్సీ విలువ...! గత కొన్ని రోజుల నుంచి నైజీరియా క్రిప్టో కరెన్సీ వాడకంలో బూమ్ కన్పించినా... అక్కడి బ్యాంకులు క్రిప్టోపై బ్యాన్ విధించాయి. నైజీరియన్ పౌరులు ఎక్కువగా క్రిప్టోలో లావాదేవీలను జరుపడంతో నైజీరియన్ కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో క్రిప్టోకరెన్సీలకు పోటీగా డిజిటల్ కరెన్సీలను తీసుకురావాలని నైజీరియా నిర్ణయించుకుంది. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! -
ఆ ‘కోపధారి మనిషి’.. జాక్‌పాట్ కొట్టేశాడు
Chand Nawab Karachi Se: కోపధారి మనిషి.. ఈ వీడియో గురించి బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే చాలాకాలం క్రితమే ఈ తరహా యాటిట్యూడ్‌తో పాకిస్తాన్‌లోనూ ఓ రిప్టోరర్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ‘చాంద్ నవాబ్.. కరాచీ సే..’ అంటూ వార్తల కవరేజ్‌కి విఫలయత్నం చేసిన పాక్ జర్నలిస్ట్ గుర్తున్నాడు కదా!. ఆ జర్నలిస్ట్ సాబ్.. ఇప్పుడు జాక్‌పాట్ కొట్టేశాడు. ఈ వైరల్ వీడియోను నాన్ ఫంగిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) కింద వేలం వేయబోతున్నారు. జర్నలిస్ట్ చాంద్ నవాబ్.. పాక్‌లోనే కాదు ఇండియాలో.. ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యారు. సల్మాన్ ఖాన్ భజరంగీ భాయీజాన్(2015)లో ఈయన క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఓ స్ఫూఫ్ వీడియో కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని నవాజుద్దీన్ సిద్ధిఖీ అద్భుతంగా పోషించాడు కూడా. సుమారు 12 ఏళ్ల క్రితం వైరల్ అయిన ఆ వీడియోను.. ఇప్పుడు ఎన్ఎఫ్టీ నుంచి ఫౌండేషన్ యాప్ ద్వారా వేలం వేయబోతున్నారు. ఇంతకీ ప్రారంభ బిడ్ ఎంతో తెలుసా? ఒత్తిడిలోనే అలా చేశా డిజిటల్ ఆక్షన్ ప్లాట్‌ఫామ్ మీద స్వయంగా చాంద్ నవాబ్.. ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. ‘‘నేను చాంద్ నవాబ్‌ని. వృత్తిరీత్యా జర్నలిస్ట్/రిపోర్టర్ని. 2008లో నా వీడియో ఒకటి యూట్యూబ్ ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. పండుగ పూట రైల్వే స్టేషన్లో కవరేజ్ చేస్తుండగా.. ప్రయాణికులు అడ్డురావడంతో నాకు విసుగొచ్చింది. జర్నలిజంలో ఉన్న ఒత్తిడి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ ఫ్రస్టేషన్లోనే అలా ప్రవర్తించా. అయితే ఆ వీడియో నన్ను మీకు పరిచయం చేసింది. నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నా క్యారెక్టర్ స్ఫూర్తితోనే కబీర్‌ఖాన్ డైరెక్షన్లో వచ్చిన భజరంగీ భాయీజాన్ సినిమాలో నవాజుద్దీన్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ ద్వారా నన్ను మరోసారి వైరల్ చేశారు. నాపై అభిమానం చూపిన వాళ్లందరికీ థ్యాంక్స్’ అంటూ పేర్కొన్నాడు కరాచీకి చెందిన చాంద్ నవాబ్. ఇక ఈ వీడియోను ప్రారంభ బిడ్ ధర అక్షరాల 46 లక్షల రూపాయలు(63వేల డాలర్లు)గా నిర్ణయించింది ఎన్ఎఫ్టీ ఫౌండేషన్. మరి ఇది ఎంతకు అమ్ముడు పోతుందో, చాంద్ నవాబ్కు ఎంత లాభం తెచ్చిపెడుతుందో చూడాలి మరి. ఎన్ఎఫ్టీ అంటే బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. క్లిక్ చేయండి: ఎన్ఎఫ్టీ.. తొలి హీరో ఎవరో తెలుసా? -
విజేత: కల చెదిరినా కాసుల వర్షం కురిసింది
Bitpanda CEO Eric Demuth Success Story: ‘ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది’.. ఇదే జరిగింది ఎరిక్ డెమ్యూత్(34) లైఫ్‌లో. వృథా ఖర్చులకు వెనుకాడే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తన కలను సైతం వదిలేసుకుని.. మరో దారిలోకి దిగాడు. విజయమో.. ఓటమో ఏదో ఒకటి తేల్చుకుని కెరీర్లో పోరాడాలనుకున్నాడు. అతని ప్రయత్నానికి అదృష్టం తోడైంది. ఒకప్పుడు జేబులో పాకెట్ మనీకి మూడు డాలర్లు పెట్టుకుని తిరిగిన కుర్రాడు.. ఇప్పుడు మిలియన్ల సంపదతో యూరప్‌ను శాసించే క్రిప్టో ట్రేడర్‌గా ఎదిగాడు మరి. బిట్‌పాండా.. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఓ సంచలనం. యూరప్‌లో క్రిప్టో కరెన్సీని ప్రధానంగా ప్రచారం చేసింది ఇదే. ఆస్ట్రియా-వియన్నా నియోబ్రోకర్గా ఉన్న ఈ కంపెనీ.. కామన్ పీపుల్‌కు క్రిప్టోకరెన్సీని చేరువచేసింది. డిజిటల్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్, బిట్‌కాయిన్‌ను హ్యాండిల్ చేయడం, డిజిటల్ ఆస్తుల కొనుగోలు-అమ్మకం, గోల్డ్ దాచుకోవడం, సేవింగ్స్.. ఇలా క్రిప్టో బిజినెస్ తీరుతెన్నులను సాధారణ పౌరులకు సైతం అర్థం అయ్యేలా చేసింది బిట్‌పాండా. ఈ ప్రత్యేకత వల్లే ఏడేళ్లు తిరగకుండానే యూరప్‌లో బిట్‌పాండా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం బిట్‌పాండా విలువ సుమారు 4.1 బిలియన్ డాలర్లపైనే ఉండగా.. అందులో డెమ్యూత్ వాటా దాదాపు 820 మిలియన్ల డాలర్లు. కష్టజీవి వియన్నాకి చెందిన ఎరిక్ డెమ్యూత్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నప్పటి నుంచే పొదుపరిగా ఉండే ఈ కుర్రాడు ఏనాడూ పైసా విదిల్చేవాడు కాదు. పైగా తన చిన్నతనంలో పేరెంట్స్ చేసే వృథా ఖర్చులపై నిలదీసేవాడు. అలాంటి ఎరిక్‌కు షిప్‌కు కెప్టెన్ కావాలని కల ఉండేది. అందుకే చెప్పాపెట్టకుండా 23 ఏళ్ల వయసులో కంటెయినర్ షిప్స్ మీద కూలీ పనికి వెళ్లాడు. చైనా, జపాన్.. నైరుతి ఆసియా ప్రాంతాల్లో పని చేశాడు. షిప్ కెప్టెన్ కావాలన్నది అతని కల. ఆ కల కోసం అలా ఎన్నాళ్లైనా కష్టం భరించాలనుకున్నాడు. ఒక్కపూట తిండి.. చాలిచాలని జీతంతో గడిపాడు. కానీ, రెండున్నరేళ్లు గడిచాక అతని వల్ల కాలేదు. మెకానిక్‌గా, యాంకర్లు వేసే కూలీగా సంచార జీవనం గడపడం అతనికి బోర్‌గా అనిపించింది. అందుకే ఆ ఉద్యోగం వదిలేశాడు. వియన్నాకు తిరిగి వచ్చేశాడు. ఈసారి ఫైనాన్స్ చదవులోకి దిగాడు. పౌల్ క్లాన్స్చెక్తో డెమ్యూత్ కాళ్లు అరిగేలా తిరిగి, ఒప్పించి.. ఫైనాన్స్ కోర్స్ పూర్తి చేశాక.. డిజిటల్ బిజినెస్ ఎక్స్పర్ట్ పౌల్ క్లాన్స్చెక్ను కలిశాడు డెమ్యూత్. వీళ్లిద్దరూ మరో ఫైనాన్స్ ఎక్స్పర్ట్ క్రిస్టియన్ ట్రమ్మర్తో కలిసి క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. పీటర్ థెయిల్ ‘వాలర్’ వెంచర్స్ సాయం కోసం ప్రయత్నించారు. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. అయినా టైం వేస్ట్ చేయకుండా వాలర్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. వాళ్ల ప్రయత్నం థెయిల్ను ఆకట్టుకుంది. కొంతమేర పెట్టుబడులకు ముందుకొచ్చాడు. వారం తిరగకముందే 263 మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో బిట్‌పాండా కంపెనీ మొదలైంది. ఇందులో డెమ్యూత్ ఖర్చు పెట్టకుండా దాచుకున్న సొమ్మంతా కూడా ఉంది. ఫలితం ఎలా ఉన్నా సరే.. ఇదొక బిజినెస్ పాఠం కావాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే.. ఏడేళ్లకు యూరప్ క్రిప్టో కరెన్సీతో డిజిటల్ మార్కెట్‌ను శాసిస్తోంది ఆపరేటింగ్ ట్రేడ్ ప్లాట్‌ఫామ్ బిట్‌పాండా. మనిషి జీవితంలో అన్ని అనుకున్నట్లు జరుగుతాయన్న గ్యారెంటీ ఉందా?. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా మిగతా వాళ్లలాగే నాకు సరదాగా ఉండాలని ఉండేది. కానీ, వృథా ఖర్చులతో ఏం ఉపయోగం ఉండదని అర్థం చేసుకున్నా. నా లక్క్ష్యం ఒకటి ఉండేది. అది తప్పినా మరోదారిని ఎంచుకుని విజయం కోసం ప్రయత్నిస్తున్నా.(తనది పూర్తి విజయంగా ఒప్పుకోవట్లేదు డెమ్యూత్). నాలాగే చాలామందికి ఏదో సాధించాలనే తాపత్రయం ఉంటుంది. అందరికీ కల నెరవేర్చుకునేందుకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. లేదంటే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అలాంటప్పుడే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నవాళ్లం అవుతాం. - ఎరిక్ డెమ్యూత్ చదవండి: బిజినెస్ పాఠాలు నేర్పిన చిరంజీవి సినిమా తెలుసా? -
ఆటగాళ్లపై కాసులవర్షం కురిపిస్తున్న ఫ్యాన్ టోకెన్లు!
లియోనెల్ మెస్సీ.. ఫుట్‌బాల్‌తోనే కాదు.. క్రేజీ ఒప్పందాల ద్వారా కూడా సంచలనాలు సృష్టిస్తున్నాడు. సుదీర్ఘకాలం కొనసాగిన స్పెయిన్ బార్సిలోనా క్లబ్‌ను వీడి.. ఫ్రాన్స్ పారిస్ సెయింట్ జెర్మయిన్ క్లబ్‌తో రెండేళ్ల ఒప్పందం.. అదీ సుమారు 610 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఈ రెమ్యునరేషన్లో ఫ్రెంచ్ క్లబ్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ‘ఫ్యాన్ టోకెన్స్’ ప్రస్తావన రావడం చాలామందిని గందరగోళానికి గురి చేసింది. మెస్సీతో డీల్ గురించి చెబుతూ ‘ఫ్యాన్ టోకెన్స్’ ప్రాముఖ్యత సంతరించుకోబోతోందని పీఎస్జీ క్లబ్ కామెంట్లు చేసింది. ఇంతకీ ఈ ఫ్యాన్ టోకెన్స్ అంటే ఏమిటి? మెస్సీతో కుదుర్చుకున్న మల్టీ మిలియన్ పీఎస్జీ ప్యాకేజీలో క్రిప్టోకరెన్సీ పాత్ర ఏంటో చర్చిద్దాం. సాకర్ ఆటగాళ్లకు అవి ఎలా లాభాలు ఇస్తున్నాయో చూద్దాం. ఫ్యాన్ టోకెన్స్ ఎన్ఎఫ్టీలో ఒక రకం. నాన్ ఫంగిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) అంటే ఒక్క మాటలో డిజిటల్ ఆస్తులు అని అర్థం. బిట్ కాయిన్, డిజిటల్ కరెన్సీల మాదిరిగానే.. ఫ్యాన్ టోకెన్స్ కూడా రాత్రికి రాత్రే విలువ మారే అవకాశాలు ఉంటాయి. అయితే అదృష్టాన్ని తెచ్చిపెట్టొచ్చు.. లేదంటే తీవ్ర నష్టాల్ని మిగల్చవచ్చు. ఫ్యాన్ టోకెన్స్‌ను క్రియేట్ చేసేది సోసియోస్ అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచే ఫుట్‌బాల్ క్లబ్‌లు తమకు కావాల్సిన రీతిలో ఫ్యాన్ టోకెన్స్లను డిజైన్ చేయించుకుంటాయి. ఈ టోకెన్లను ఫుట్‌బాల్ ఫ్యాన్స్ క్లబ్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. తద్వారా ఈ టోకెన్లకు సంబంధించిన కంటెంట్‌ను ఉపయోగించుకోవడం, లేదంటే అగుమెంటెడ్ రియాలిటీ గేమ్స్‌ను ఆడడం చేయొచ్చు. అంతేకాదు ఈ ఫ్యాన్ టోకెన్స్ కలిగి ఉన్నవాళ్లు.. సదరు ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహించే ఓటింగ్లలో పాల్గొనవచ్చు. ఉదాహరణకు.. కిట్ డిజైన్లు, గోల్ మ్యూజిక్, ప్రీ సీజన్ టూర్లకు ముందు వేదికలను ఖరారు చేయడం లాంటి చిన్న చిన్న నిర్ణయాల్లో ఓట్లు కీలకంగా వ్యవహరించొచ్చన్నమాట. ఎన్ని ఎక్కువ ఫ్యాన్ టోకెన్లు కలిగి ఉంటే.. అన్ని ఓట్లు వేసే హక్కు దక్కుతుంది ఆవ్యక్తికి. అలాంటి టోకెన్లను ఒప్పందాల్లో భాగంగా ఆటగాళ్లకు ధారాదత్తం చేస్తున్నాయి క్లబ్‌లు. మెస్సీకి లాభమేనా? మెస్సీకి ఎన్ని పీఎస్జీ ఎఫ్‌సీ ఎన్ని ఫ్యాన్ టోకెన్లు ఇచ్చిందనేది క్లారిటీ లేదు. వాటి విలువ గురించి కూడా క్లబ్ బహిరంగంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. సుమారు 29-35 మిలియన్ డాలర్ల(దాదాపు 200 కోట్ల రూపాయలకు పైనే)విలువ ఉండొచ్చని ఓ ప్రముఖ మీడియా హౌజ్‌తో పీఎస్జీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ లెక్క చూసుకుంటే మెస్సీ ఒప్పందం సొమ్ము అనుకున్న దానికంటే ఎక్కువే అవుతుంది. ఇక మెస్సీకి క్రిప్టోకరెన్సీతో అనుబంధం కొత్తేం కాదు. 2017లో సిరిన్ ల్యాబ్స్ అనే కంపెనీ ద్వారా, కోపా అమెరికా ఎన్ఎఫ్టీతో మిలియన్ల డాలర్లు వెనకేసుకున్నాడు. ఇక మెస్సీవర్స్ అనే తన కలెక్షన్లతో నాలుగు డిజిటల్ ఆర్ట్ వర్క్స్(ఫ్యాన్స్ కొనుగులు చేసుకోవచ్చు) ద్వారా కూడా సంపాదించుకుంటున్నాడు. చెస్ థీమ్, గ్రీక్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ థీమ్‌ల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. మరొక డిజిటల్ ఆర్ట్ వర్క్ ఏంటన్నది ఆగస్టు 20న రివీల్ చేయనున్నారు. హాట్ న్యూస్: ఇక బరిలో దిగుతానో? లేదో? ఎంత లాభమంటే.. మెస్సీ పీఎస్జీలో చేరాడన్న వార్త తర్వాత క్లబ్ క్రిప్టో కాయిన్(ఫ్యాన్ టోకెన్) విలువ అమాంతం పెరిగింది. జూన్‌లో పీఎస్జీ ఫ్యాన్ ఒక టోకెన్ విలువ 11.93 డాలర్లు ఉండగా.. గురువారం సాయంత్రం నాటికి ఆ విలువ 43.91 డాలర్లుకు చేరుకుంది. ఇక ట్రేడ్ విలువ మొత్తం సుమారు 1.2 బిలియన్ డాలర్లకు(సుమారు 9 వేల కోట్ల రూపాయలు) చేరిందని, మెస్సీ క్రేజ్‌తో డిజిటల్ రెవెన్యూలో మున్ముందు మరిన్ని అద్భుతాలను ఆశిస్తున్నామని పీఎస్జీ ప్రతినిధి మార్క్ ఆర్మ్స్రా్టంగ్ వెల్లడించారు. మరికొన్ని టీంలు ఫ్యాన్ టోకెన్ల వల్ల సాలీనా 200 మిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ అవుతోందని సోషియోస్ చెబుతోంది. అర్సెనెల్, అస్టోన్ విల్లా, ఎవర్టోన్, లీడ్స్, మాంచెస్టర్ సిటీ, బార్సెలోనా, ఏసీ మిలన్, ఇంటర్ మిలన్, జువెంటస్, పీఎస్జీ, పోర్చుగ్రీస్ నేషనల్ టీం.. ఇలా కొన్ని జట్లు ఫ్యాన్ టోకెన్ల ఒప్పందాలను ఆటగాళ్లతో కొనసాగిస్తున్నాయి. కిందటి ఏడాది జూన్‌లో బార్సిలోనా ఫస్ట్ బ్యాచ్ ఫ్యాన్ టోకెన్ ప్రారంభించగానే.. రెండు గంటల్లోనే అవన్నీ అమ్ముడుపోయి. దీంతో మిలియన్నర డాలర్ల ఆదాయాన్ని వచ్చింది క్లబ్‌కి. కొత్తేం కాదు 2018లో టర్కీష్ క్లబ్ హరునుస్టాస్పోర్ బిట్‌కాయిన్ ఒప్పందం ద్వారా ఓ ఆటగాడితో ఒప్పందం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఒమర్ ఫారూఖ్ అనే ప్లేయర్‌కి 0.0524 బిట్‌కాయిన్‌తో పాటు 2,500 టర్కీష్ లీరాలు ఒప్పందంలో భాగంగా చెల్లించింది. ఆపై స్పెయిన్ ఆటగాడు డేవిడ్ బారోల్ను కేవలం క్రిప్టో కరెన్సీ ఉపయోగించి ఒప్పందం చేసుకోవడం విశేషం. అయితే తమ ఆటగాళ్ల కోసం పూర్తిస్థాయిలో క్రిప్టో కరెన్సీని మూడేళ్ల క్రితమే ఉపయోగించినట్లు గిబ్రాల్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రకటించుకోవడం విశేషం. - సాక్షి, వెబ్‌డెస్క్ -
Cryptocurrency: మేం ఎవరి డేటా కలెక్ట్ చేయడం లేదు
మనదేశంలో డిజిటల్ కరెన్సీని దశలవారీగా అమలు చేసే అంశంపై ఆర్బీఐ కసరత్తులు చేస్తోంది.ఇప్పటికే హోల్‌సేల్,రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో దేశంలో క్రిప్టో కరెన్సీపై తలెత్తున్న అనుమానాలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెక్ పెట్టారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్ మోడీ మాట్లాడుతూ..దేశంలో క్రిప్టో మార్కెట్,వినియోగదారులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు కేంద్రం డేటా కలెక్ట్ చేస్తుందా? అన్న ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ స్పందించారు.మనదేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగం గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు, ఎవరి డేటా కలెక్ట్ చేయడం లేదు.ఎవరైనా క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే నార్కోటిక్ డ్రగ్ ట్రాఫికింగ్,మనీ ల్యాండరింగ్ విభాగం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇక ఇన్వెస్టర్లు ఎవరైనా విదేశాల నుంచి క్రిప్టోను భారత్‌కు తీసుకువస్తే వారి నుంచి ఈక్వలైజేషన్ లెవీని కట్టించుకోమని స్పష్టం చేశారు.ఈక్వలైజేషన్ లెవీ (ట్యాక్స్) కేవలం ఈకామర్స్ సంస్థలకు వర్తిస్తుందని, ఇన్వెస్టర్లు వర్తించదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈక్వలైజేషన్ లెవి( ట్యాక్స్) అంటే? ఉదాహరణకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌కి ఇండియాలో సబ్ స్క్రిప్షన్ మీద 10 కోట్లు లాభాలు వచ్చాయంటే..అందుకు నెట్ ఫ్లిక్స్ కేంద్రానికి రూ.20లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే ముందే ఈక్వలైజేషన్ లెవి నిబంధనలు మేరకు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఒప్పుకోకపోతే నెట్ ఫ్లిక్స్ సర్వీస్‌లను మనదేశంలో కొనసాగించే అవకాశం లేదు. ఇదే అంశం క్రిప్టోకరెన్సీకి వర్తిస్తుంది. చదవండి : అలర్ట్: యోనో యాప్ వినియోగిస్తున్నారా?! ఇది మీకోసమే -
బిట్ కాయిన్స్‌ను తలదన్నేలా, ఇండియాలో డిజిటల్ కరెన్సీ
న్యూఢిల్లీ: త్వరలోనే డిజిటల్ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్బీఐ పనిచేస్తోందని.. హోల్‌సేల్, రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ్చన్నారు. ఒక వర్చువల్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీబీడీసీ ఫలించే దశలో ఉందంటూ.. ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ప్రారంభించినట్టు చెప్పారు. సౌర్వభౌమ మద్దతు లేని పలు వర్చువల్ కరెన్సీల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు సీబీడీసీ అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అత్యున్నతస్థాయి అంతర్గత మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. విధానాలు, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసిన తర్వాత సీబీడీసీని డిజిటల్ రూపీగా ప్రవేశపెట్టే విషయమై సిఫారసులు, సూచనలను ఈ కమిటీ తెలియజేయనుంది. -
డిజిటల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చేలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్స్‌కు రిజర్వ్ బ్యాంక్ సూచనలు జారీ చేసింది. ఈ తరహా కరెన్సీ లావాదేవీలు జరిపే కస్టమర్లకు సర్వీసులు అందించరాదంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌పై వివరణనిచ్చింది. ఈ సర్క్యులర్‌ను 2020లో సుప్రీంకోర్టు తోసి పుచ్చినందున అప్పట్నుంచి ఇది అమల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో వర్చువల్ కరెన్సీ లావాదేవీలు నిర్వహించే వారికి సర్వీసులను అందించకుండా ఉండటానికి ఈ సర్క్యులర్‌ను అడ్డుగా చూపరాదని స్పష్టం చేసింది. అయితే, కస్టమర్ల ఖాతాల వివరాల వెల్లడి (కేవైసీ), యాంటీ మనీ లాండరింగ్ తదితర చట్టాల నిబంధనలను పాటించాలని బ్యాంకులు మొదలైన వాటికి ఆర్బీఐ సూచించింది. చదవండి: విమానయానం, ఆక్సిజన్ ప్లాంట్లకూ రుణ హామీ.. -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్
క్రిప్టోకరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ విలువ రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. తాజాగా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో 62 వేల డాలర్ల మార్క్‌ను దాటి 63,825.56 డాలర్ల రికార్డు ధర పలికింది. మార్చి నెలలో 61వేల డాలర్లను క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన బిట్ కాయిన్ ఇప్పుడు ఆ రికార్డును తుడిపేసింది. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతుంటే, ఆంతే స్థాయిలో బిట్ కాయిన్ విలువ కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతుండటంతో దాని విలువ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీలో బిట్ కాయిన్ చాలా ప్రధానమైనది కాబట్టి దాని విలువ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. కాయిన్ బేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా 70 నుంచి 100 బిలియన్ల డాలర్లు ఉంటుందని ఒక అంచనా. ఇక, 2018లో కుదేలైపోయిన బిట్ కాయిన్ గతేడాది కరోనా మహమ్మారి నుంచి విశ్వరూపం ప్రదర్శిస్తుంది. 2020 అక్టోబర్‌లో 12 వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ గత నెలలో 60 వేల డాలర్ల మార్కు దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత రేటు ప్రకారం మన కరెన్సీలో బిట్ కాయిన్ ధర దాదాపు 50 లక్షలకు చేరిపోయింది. టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌మస్క్ పెట్టుబడులు పెట్టడంతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సంస్థలు కూడా తమ వినియోగదారుల్ని బిట్ కాయిన్‌తో లావాదేవీలకు అనుమతించడం బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగిపోవడానికి తక్షణ కారణాలుగా కనిపిస్తున్నాయి. చదవండి: డాలర్, బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా? -
క్రిప్టోకరెన్సీలో చెల్లింపులకు అనుమతించిన వీసా
క్రిప్టోకరెన్సీలకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎలక్ట్రానిక్ చెల్లింపుల సంస్థ వీసా కీలక నిర్ణయం తీసుకుంది. ఇథీరియమ్ నెట్వర్క్ ద్వారా డిజిటల్ కరెన్సీ యూఎస్డీ కాయిన్లో చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. విసా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ డిజిటల్ కరెన్సీని సాధారణ నగదు రూపంలో మార్చే అవసరం తప్పనుంది. వీసా కంటే ముందే ఇతర ప్రముఖ సంస్థలైన బీఎన్వై మెలన్, బ్లాక్‌రాక్, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు డిజిటల్ కరెన్సీ చెల్లింపులను అనుమతించాయి. వీసా సంస్థ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ గత వారం.. వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను బిట్‌కాయిన్‌తో కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇది వాణిజ్యంలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి ఒక కీలక ముందడుగు అని చెప్పుకోవాలి. ఇప్పటవరకూ వీసా ద్వారా క్రిప్టోకరెన్సీల్లో చెల్లింపులు చేయాలనుకుంటే వీటిని ముందుగా సాధారణ నగదులోకి మార్చాల్సిన అవసరం ఉండేంది. అయితే..ఈథీరియమ్ టెక్నాలజీ ఆధారంగా చెల్లింపులు చేసేందుకు వీసా అనుమతించడంతో ఈ నగదు మార్పిడి అవసరం తప్పిపోయింది. డిజిటల్ కరెన్సీ డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యూ షెఫీల్డ్ అన్నారు. చదవండి: సింగిల్ ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణం! -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(భారత్)లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్బిఐ ఆందోళన చెందుతోంది అని అన్నారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించి, ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీల ద్వారా మోసానికి పాల్పడుతున్నారని తెలిసిన తర్వాత 2018లో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్బీఐ వాటిని నిషేధించింది. కానీ, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమయ్యింది. ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్ యువాన్‌తో పాటు డిజిటల్ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్ చేరనున్నట్లు తెలిపారు. దీనికి కావాల్సిన సాంకేతికపై పనిచేతున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్ ఇటీవలి ట్వీట్లలో బిట్ కాయిన్ ధరలు "అధికంగా కనిపిస్తున్నాయి" అని చెప్పారు. దీనితో ఒక్కసారిగా టెస్లా షేర్ ధరలు విపరీతంగా పడిపోయాయి. ఒక్కరోజులో ఎలోన్ మస్క్ 15.2 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..! ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ -
లక్ష కోట్లకు చేరిన బిట్‌కాయిన్ మార్కెట్
కరోనా కారణంగా వ్యాపారాలు డీలా పడి, ఉద్యోగాలు పోయి ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. దీనితో కొనుగోలు శక్తిని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు భారీ ఉద్దీపన పథకాల ప్రకటిస్తున్నాయి. ఉద్దీపనల వల్ల కరెన్సీ విలువ పడిపోవడం వల్ల బ్యాంకింగ్ రంగం సుస్థిరతపై అనుమానాలు రేకెత్తడం మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో బిట్‌కాయిన్ ధర మాత్రం రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. చాలా మంది పెట్టుబడి దారులు బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోని అతి సంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ బిట్‌కాయిన్ మార్కెట్ లో 150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈ కారణాల వల్ల బిట్‌కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా లక్ష కోట్లకు చేరుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక కాయిన్ ధర 56,620 డాలర్లను క్రాస్ చేసింది. దీంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీని అమోదించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ విలువ భారీగా పెరిగింది. రెండు నెలలుగా బిట్‌కాయిన్ విలువ రోజురోజుకి పెరుగుతోంది. గత వారంలోనే 18శాతం లాభపడింది. అలాగే ఈ ఏడాదిలో 92శాతం పైకి చేరుకుంది. శనివారం క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ట్రేడింగ్ విలువ లక్ష కోట్లు లేదా రూ.72.73 లక్షల కోట్లు దాటింది. 18.6 మిలియన్ డాలర్ల బిట్ కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీని లేదా క్రిప్టో కరెన్సీని 2009 జనవరిలో తీసుకువచ్చారు. చదవండి: బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్
డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్ రికార్డు పరుగు కొనసాగుతోంది. తాజాగా 50,000 డాలర్ల (దాదాపు రూ.36.5 లక్షలు) మైలురాయిని తొలిసారిగా అధిగమించింది. మంగళవారం ట్రేడింగ్‌లో ఒక దశలో 50,515 డాలర్ల స్థాయిని కూడా తాకింది. గడిచిన మూడు నెలల్లోనే బిట్‌కాయిన్ రేటు 200 శాతం పైగా పెరగడం గమనార్హం. ఏడాది క్రితం దీని విలువ 10.000 డాలర్ల స్థాయిలో ఉండేది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కంపెనీలు ఈ డిజిటల్ కరెన్స్ వైపు మొగ్గుచూపుతుండటంతో బిట్‌కాయిన్ భారీగా ర్యాలీ చేస్తోంది. ఎలక్టిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఇటీవలే 1.5 బిలియన్ డాలర్ల విలువ చేసే కరెన్సీ కొనుగోలు చేస్తున్నట్లు, కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్‌తో కూడా చెల్లింపులు స్వీకరించనున్నట్లు ప్రకటించడంతో దీనికి మరింత ఊతం లభించింది. అమెరికాలోని వర్జీనియాకు చెందిన బ్లూ రిడ్జ్ బ్యాంక్ తమ ఏటీఎంలు, శాఖల్లో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయొచ్చంటూ ప్రకటించింది. ఆ తర్వాత బీఎన్వై మెలాన్ అనే బ్యాంకు కూడా తమ క్షయింట్లకు అందించే సర్వీసుల్లో డిజిటల్ కరెన్సీలను కూడా చేర్చనున్నట్లు పేర్కొంది.(చదవండి: బిట్ కాయిన్‌కు కెనడా గ్రీన్ సిగ్నల్) -
బిట్ కాయిన్‌కు కెనడా గ్రీన్ సిగ్నల్
డిజిటల్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ పై అనేక ప్రపంచ దేశాలు, సెంట్రల్ బ్యాంకుల ఆంక్షల విధించిన కరోనా మహమ్మారి కాలంలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. రూ.35 లక్షలు దాటిన బిట్ కాయిన్ ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం అన్ని దేశాల ఆమోదం నిదానంగా పొందుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సేవల సంస్థలైన జేపీ మోర్గాన్, వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ మద్దతునూ కూడా పొందింది. తాజాగా బంగారం మాదిరే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు కెనడాకు చెందిన ప్రధాన సెక్యూరిటీ రెగ్యులేటర్ ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కెనడాలో బంగారం మాదిరే బిట్ కాయిన్ కొనుగోలు చేయవచ్చు. ఈటీఎఫ్ ప్రపంచంలోనే బౌతికంగా బిట్ కాయిన్‌తో పెట్టుబడి పెట్టడానికి, ఇన్వెస్టర్లు తేలిగ్గా పొందడానికి ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ వెసులుబాటు కల్పిస్తున్నది. బిట్‌కాయిన్ శుక్రవారం రికార్డు స్థాయిలో $ 48,975కు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 63శాతం పెరిగింది. 2020 మార్చి నుండి సుమారు 1,130 శాతం పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిపెట్టినట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. -
బిట్‌కాయిన్‌లో టెస్లా పెట్టుబడి
సిల్వర్‌స్ప్రింగ్(యూఎస్): ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా.. డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. అంతేకాకుండా త్వరలో ఈ డిజిటల్ కరెన్సీని చెల్లింపులకూ అనుమతించే ప్రణాళికల్లో ఉంది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం ఉదయం బిట్‌కాయిన్ విలువ 15 శాతం జంప్‌చేసింది. 43,000 డాలర్లను తాకింది. ఒక దశలో 43,863 డాలర్ల వద్ద రికార్డ్ గరిష్టాన్ని చేరింది. హైఎండ్ వాహనాల కొనుగోలుకి బిట్‌కాయిన్‌లో చెల్లింపులను అనుమతించే ఆలోచనలో ఉన్నట్లు టెస్లా తాజాగా పేర్కొంది. డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులపై ఆటో దిగ్గజం టెస్లా.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజీకి వివరాలు దాఖలు చేసింది. ఇతర ప్రత్యామ్నాయ రిజర్వ్ అసెట్స్ పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. -
బిట్‌కాయిన్ బ్యాన్? సొంత క్రిప్టో కరెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బిట్‌కాయన్‌పై నిషేధం విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. తాజా పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్రం సిద్దం చేసింది. తద్వారా బిట్ కాయిన్, ఈథర్, రిపెల్ లాంటి ప్రైవేటు డిజిటల్ కరెన్సీలపై వేటు వేయనుంది. అంతేకాదు సొంత క్రిప్టో కరెన్సీని లాంచ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. అలాగే రూపాయి డిజిటల్ వెర్షన్‌ను జారీ చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని జనవరి 25 న జారీ చేసిన బుక్‌లెట్‌లో ఆర్బీఐ తెలిపింది. ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, నష్టాల భయాలను కూడా హైలైట్ చేసింది. అలాదే దీనిపై అనేక అనుమానాలున్నాయని కూడా వ్యాఖ్యానించింది. ప్రతిపాదిత బిల్లు క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021 ప్రకారం ఇండియాలో బిట్‌కాయిన్, ఇథెర్, రిపుల్ సహా ఇతర ప్రైవేటు డిజిటల్ కరెన్సీల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి కేంద్రం 2019లోనే దేశంలో క్రిప్టోకరెన్సీనిబ్యాన్ చేసే బిల్లు తయారు చేసింది గానీ పార్లమెంటులో పెట్టలేదు. అలాగే 2018 లో క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ విధించిన బ్యాన్‌ను సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేసింది. (ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ) సాధ్యం కాదంటున్న నిపుణులు క్రిప్టో పరిశ్రమ నిపుణులు ఈ వార్తలపై స్పందిస్తూ క్రిప్టోకరెన్సీలు 'పబ్లిక్' కనుక ఇవి నిషేధం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి, తమ వాదనలు వినిపిస్తా మంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా, బిట్‌కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోకరెన్సీలను పబ్లిక్ క్రిప్టోకరెన్సీలుగా పరిగణిస్తారు, ఎవరైనా లావాదేవీలను జరుపుకోవ్చని చెబుతున్నారు. భారతదేశంలో 7 మిలియన్లకు పైగా క్రిప్టో హోల్డర్లు ఉన్నారు. 100కోట్ల బిలియన్ డార్లకుపైగా క్రిప్టో ఆస్తులు భారతీయుల సొంతం. ప్రభుత్వం ఈ సంపద మొత్తాన్ని రాత్రికి రాత్రి నిషేధిస్తుందని తాను భావించడం లేదని క్రిప్టోకరెన్సీ మార్పిడి ఎక్సేంజ్ వజీర్ఎక్స్ సీఈఓ నిశ్చల్ శెట్టి అన్నారు. ఆర్బీఐ అధికారిక సమాచారంలో, బిట్‌కాయిన్ ప్రైవేట్‌గా, మిగిలిన వాటిని పబ్లిక్ బ్లాక్చైన్లుగా వర్గీకరించారని, ఇది తప్పని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వర్గీకరణపై స్పష్టమైన సమాచారం లేదని కాయిన్‌డీసీఎక్స్ సీఈఓ సుమిత్ గుప్తా ట్వీట్ చేశారు.(ఆర్థిక సర్వే : 11 శాతంగా జీడీపీ వృద్ధి) కాగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం 20 బిల్లుల జాబితాను సిద్ధం చేసింది. సీసీఐ సవరణ బిల్లు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021, మైనింగ్ మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి -
డిజిటల్ కరెన్సీవైపు జపాన్ చూపు
టోక్యో: ప్రపంచ దేశాలలో అత్యధికంగా పేపర్ కరెన్సీని ఇష్టపడే జపాన్‌లో డిజిటల్ కరెన్సీకి తెర తీయనున్నారు. ప్రభుత్వం ఇందుకు తాజాగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 2021లో ప్రయోగాత్మకంగా డిజిటల్ యెన్ జారీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. కామన్, ప్రయివేట్ డిజిటల్ కరెన్సీ జారీకి 30కుపైగా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. డిజిటల్ యెన్ జారీకి ప్రణాళికలు వేస్తున్నట్లు ఇటీవల జపనీస్ కేంద్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) ప్రకటించిన నేపథ్యంలో పలు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీస్‌లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకునే ఆలోచనలో జపనీస్ ప్రభుత్వం ఉన్నట్లు ఫారెక్స్ విశ్లేషకులు తెలియజేశారు. నగదుకే ప్రాధాన్యం జపాన్‌లో పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నప్పటికీ నగదు లావాదేవీలకే అధిక ప్రాధాన్యమని బీవోజే ఎగ్జిక్యూటివ్ హీరోమీ యమవోకా చెప్పారు. నగదు చెల్లింపులను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అధిగమించలేవని వ్యాఖ్యానించారు. అయితే వివిధ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఒకే తరహా లావాదేవీలకు వీలు కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలియజేశారు. ప్రయోగాత్మక దిశలో డిజిటల్ కరెన్సీ జారీకి ప్రయివేట్ బ్యాంకులకు అవకాశమున్నదని, ఇందుకు ఇతర సంస్థలకూ అవకాశం కల్పించే వీలున్నదని వివరించారు. ప్రపంచంలోనే అత్యల్పంగా జపాన్‌లో నగదు రహిత చెల్లింపుల వాటా 20 శాతంగా నమోదవుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్‌లో ఇవి 45 శాతంకాగా.. చైనాలో మరింత అధికంగా 70 శాతానికి చేరినట్లు వివరించారు. కారణాలివీ.. చైనాతో పోలిస్తే జపాన్‌లో విభిన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఒకదానితో మరొకటి పోటీ పడుతుండటంవల్ల నగదురహిత చెల్లింపులు తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లోని మూడు అతిపెద్ద బ్యాంకులు మిత్సుబిషి, మిజుహో ఫైనాన్షియల్, సుమితోమో మిత్సుయి తమ సొంత డిజిటల్ పేమెంట్ విధానాలను అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. కామన్ ప్లాట్‌ఫామ్ ద్వారా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఉత్పాదకతను పెంచుకోవాలని చూస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో జపాన్‌లోని మూడు అతిపెద్ద బ్యాంకులతోపాటు.. టెలికమ్యూనికేషన్ కంపెనీలు, యుటిలిటీస్, రిటైలర్లతో కూడిన 30 సంస్థలతో గ్రూప్‌ను ఏర్పాటు చేస్తోంది. వెరసి కామన్ సెటిల్మెంట్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించడం డిజిటల్ కరెన్సీ జారీకి సన్నాహాలు చేస్తోంది. -
‘క్రెడిట్’కు ఇంటర్నేషనల్ కాటు
సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ కరెన్సీలో భాగమైన క్రెడిట్‌కార్డుల క్లోనింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఒకప్పుడు స్థానిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండగా... ఇటీవల కాలంలో అంతర్జాతీయ లావాదేవీలు పెరిగి పోయాయి. ‘చార్జ్ బ్యాక్’ సదుపాయం నేపథ్యంలో ఈ క్రైమ్ వల్ల ఆర్థిక నష్టం లేకపోయినా.. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. డెబిట్‌కార్డులు క్లోనింగ్ బారిన పడవని, క్రెడిట్ కార్డులకు మాత్రం తప్పట్లేదని వివరిస్తున్నారు. ‘ప్రైవేట్’ డేటా లీక్... దాదాపు ప్రతి బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తూ ఉంటుంది. ఖాతాలో ఉన్న మొత్తాన్ని వినియోగించుకోవడానికి డెబిట్, అప్పుగా వినియోగించుకుని ఆపై చెల్లించడానికి క్రెడిట్‌కార్డులు ఉపకరిస్తాయి. డెబిట్‌కార్డుల తయారీ, నిర్వహణ, జారీ మొత్తం బ్యాంకు ఆదీనంలోనే జరుగుతుంది. అయితే క్రెడిట్‌కార్డులకు సంబంధించింది మాత్రం ఆయా బ్యాంకులు ఔట్సోర్సింగ్ లేదా ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఇక్కడే సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తున్న డేటా అంతర్జాతీలం ద్వారా అమ్ముడైపోతోంది. ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉండటంతో పాటు అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం ఉండటంతోనే ఈ డేటాకు డిమాండ్ పెరిగింది. అయితే ఇది నేరుగా కాకుండా ఆన్లైన్ అధోజగత్తుగా పిలిచే డార్క్ నెట్ నుంచి క్రయవిక్రయాలు సాగుతున్నాయి. దానికి అంతా ప్రత్యేకం... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచి్చ, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా క్రెడిట్‌కార్డుల డేటా వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. దీనిని టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్‌స్టల్ అవుతుంది. ఇలా డీప్ వెబ్‌లోని వెబ్సైట్లలో ఉన్న డేటాను బిట్‌కాయిన్స్ ద్వారా చెల్లించి సొంతం చేసుకునే ముఠాలు అనేకం ఉన్నాయి. కంప్యూటర్లతో అనుసంధానించి... ఇలా తమ చేతికి వస్తున్న డేటాను సైబర్ నేరగాళ్ళు తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆపై ప్రత్యేకమైన కార్డ్ రైటర్స్‌ను ఈ కంప్యూటర్లకు అనుసంధానిస్తున్నారు. ఆన్లైన్ ద్వారానే వీళ్ళు యాగ్నెటిక్ స్ట్రిప్, చిప్‌లతో కూడిన ఖాళీ కార్డులు ఖరీదు చేస్తున్నారు. వీటిని రైటర్స్‌లో పెట్టడం ద్వారా అప్పటికే డార్క్ వెబ్ నుంచి ఖరీదు చేసిన డేటాను ఖాళీ కార్డుల్లోకి పంపిస్తున్నారు. అంటే వినియోగదారుడి క్రెడిట్‌కార్డు అతడి వద్దే ఉన్నా... నకలు దుండగుడి వద్ద తయారైపోతోంది. దీన్నే సాంకేతిక పరిభాషలో క్లోనింగ్ అంటారు. ఇలా భారతీయులకు చెందిన క్రెడిట్‌కార్డుల్ని పోలిన వాటికి క్లోన్డ్ వెర్షన్స్ విదేశీయులు తయారు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఈ కార్డులను వినియోగించి స్వయంగా షాపింగ్ చేసేవాళ్ళు కొందరైతే... కమీషన్ పద్దతిలో ఇతరుల షాపింగ్స్‌కు డబ్బులు కట్టేవాళ్ళు మరికొందరు ఉంటున్నారు. ఇక్కడ మాదిరిగా విదేశాల్లో క్రెడిట్‌కార్డ్ వినియోగిస్తూ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకపోవడం వీరికి కలిసి వస్తోంది. ఆ షాపింగ్‌కు సంబంధించిన సందేశం, బిల్లులు మాత్రం ఇక్కడి అసలు వినియోగదారులకి వస్తున్నాయి. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే క్రెడిట్, డెబిట్ కార్డుల ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు నెలకు 15 నుంచి 20 వరకు వస్తున్నాయి. బ్యాంకుల వారికి లేఖలు రాయడం ద్వారా చార్జ్‌బ్యాక్ విధానంలో ఆ డబ్బును కార్డు వినియోగదారుడి ఖాతాలోకి తిరిగి పంపించేలా చేస్తున్నాం. అయితే డేటాను దుర్వినియోగం చేస్తున్న ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ ఇంటర్నేషనల్ క్లోనింగ్ బారినడపకుండా ఉండాలంటే మీ కార్డుల్లో ఇంటర్నేషనల్ లావాదేవీలు చేసే అంశాన్ని డిసేబుల్ చేసుకోండి. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్ ఠాణా -
నగదు రాజు అయితే.. డిజిటల్ దైవం
ముంబై: నగదు రాజు అయితే డిజిటల్ కరెన్సీ దైవంగా ఆర్బీఐ పేర్కొంటోంది. డీమోనిటైజేషన్ తర్వాత వ్యవస్థలో రూ.3.5 లక్షల కోట్ల మేర నగదు వినియోగం తగ్గిందన్న ఆర్బీఐ, డిజిటల్ చెల్లింపులను గొప్ప అనుభవంగా మార్చడమే తన ప్రయత్నమని తెలిపింది. వ్యవస్థలో నగదు చెల్లింపులకు సంబంధించి కచ్చితమైన కొలమానాలు లేవని, డిజిటల్ చెల్లింపుల ప్రగతిని మాత్రం కచ్చితంగా లెక్కించొచ్చని పేర్కొంది. గత ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు సంఖ్యా పరంగా వార్షికంగా 61 శాతం, విలువ పరంగా వార్షికంగా 19 శాతం చొప్పున వృద్ది చెందినట్టు తెలిపింది. ఇప్పటికీ నగదు ఆధిపత్యం కొనసాగుతోంది. చెల్లింపులకు బదులు నిల్వ చేసుకునే ఆర్థిక సాధనంగా చూస్తున్నారు’’ అని ఆర్బీఐ తెలిపింది. వ్యవస్థలో నోట్ల చలామణి 2014 అక్టోబర్ నుంచి 2016 అక్టోబర్ మధ్య 14 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది. ఇదే వృద్ధి రేటు ప్రకారం 2019 అక్టోబర్ నాటికి చలామణిలో ఉన్న నోట్లు రూ.26,04,953 కోట్లు అని తెలిపింది. డిజిటైజేషన్, నగదు వినియోగం తగ్గడం వల్ల చలామణిలో ఉన్న నోట్లు రూ.3.5 లక్షల కోట్ల మేర తగ్గిపోయినట్టు వెల్లడించింది. ‘‘డీమోనిటైజేషన్, జీడీపీ చురుకైన వృద్ధి రేటు ఫలితంగా చలామణిలో ఉన్న నగదు 2016–17 నాటికి జీడీపీలో 8.7 శాతానికి తగ్గింది. ఇది తదుపరి 2017–18 నాటికి 10.7 శాతానికి, 2018–19 నాటికి 11.2 శాతానికి పెరిగింది. అయినప్పటికీ డీమోనిటైజేషన్‌కు పూర్వం 2015–16 నాటికి ఉన్న 12.1 శాతం కంటే తక్కువ నగదే చలామణిలో ఉంది’’ అని ఆర్బీఐ తెలిపింది. -
పాస్వర్డ్ చెప్పకుండా మృతి.. 1,000 కోట్లు మటాష్!
ఒక వ్యక్తి మరణం లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టేసింది. ఏకంగా 19 కోట్ల కెనడా డాలర్ల (రూ.1,030 కోట్లు) సొమ్ము ఫ్రీజ్ అయిపోయింది. ఈ డబ్బును ఎలా వెనక్కి తీసుకురావాలో తెలియక టెక్ దిగ్గజాలు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే క్రిప్టో కరెన్సీ అంటే తెలుసు కదా. కేవలం ఆన్లైన్లో మాత్రమే చెల్లుబాటు అయ్యే డిజిటల్ కరెన్సీ. దీనిలో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని ఈ మధ్య కాలంలో చాలామంది దానివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు ఆహ్వానించే ఒక కంపెనీయే కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్. సంస్థ ప్రస్తుత సీఈవో అయిన కెనడాకు చెందిన గెరాల్డ్ కాటన్ 5 ఏళ్ల కిందట నోవా స్కాటియాలో దీనిని స్థాపించారు. దీంతో ఈ కంపెనీలో ఎందరో ఇన్వెస్టర్లు తమ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో డిపాజిట్లు చేశారు. భారత్‌లోనే మరణం.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు చిక్కల్లా గతేడాది డిసెంబర్లో మొదలైంది. గత డిసెంబర్లో ఏదో పనుల నిమిత్తం కాటన్ భారత్‌కు వచ్చారు. 30 ఏళ్ల వయసున్న ఆయనకి అప్పటికే జీర్ణకోశ వ్యాధి బాగా ముదిరిపోయింది. మన దేశంలో పర్యటిస్తుండగానే ఆకస్మికంగా కాటన్ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా క్వాడ్రిగాసీఎక్స్‌లో పెట్టుబడి పెట్టినవారిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ వాలెట్ పాస్వర్డ్లు, రికవరీ కీలు కాటన్‌కు తప్ప మరెవరికీ తెలీదు. ఆయన వాటిని ఎక్కడా రాసి పెట్టి కూడా ఉంచలేదు. దీంతో కోట్లాది డాలర్లను ఎలా రికవరీ చేసుకోవాలో తెలియక ఇన్వెస్టర్లంతా లబోదిబోమంటున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను కనుక్కోవడానికి సాంకేతిక నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు మాత్రం శూన్యం. అతి భద్రతే కొంప ముంచింది డిజిటల్ కరెన్సీ అంటే అన్నీ ఆన్లైన్ లావాదేవీలే కాబట్టి గెరాల్డ్ కాటన్ భద్రత విషయంలో చాలా అప్రమత్తంగా ఉండేవారు. తాను వాడే ల్యాప్‌టాప్‌లు, ఈ మెయిల్, మొబైల్ ఫోన్లు, మెసేజింగ్ వ్యవస్థలన్నింటినీ ఎన్‌క్రిప్ట్ చేసేశారు. దీంతో ఆ పాస్‌వర్డ్‌లను కనుక్కోవడంలో ఐటీ దిగ్గజాలు కూడా చేతులెత్తేశారు. డిజిటల్ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా, ఎవరూ వాటిని హ్యాక్ చేయకుండా కాటన్ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయితే ఇంతటి పకడ్బందీ భద్రతా చర్యల కారణంగా తాము ఆ సొమ్మును రికవరీ చేసే పరిస్థితుల్లో లేమంటూ ఆయన భార్య జెన్నిఫర్ రాబర్ట్సన్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు మాత్రం చేసేదేమీలేక న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నారు. అయితే కొందరు ఇన్వెస్టర్లేమో ఈ కంపెనీ కుట్ర పన్ని తమను మోసం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో క్వాడ్రిగాసీఎక్స్ డిపాజిట్లు ఆన్లైన్లో చేతులు మారుతున్నాయని, పాస్వర్డ్లు తెలీకుండా అదెలా జరుగుతోందంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక వ్యక్తి మరణంతో రూ.1,000 కోట్లకు పైగా సొమ్ముకి అతీగతీ లేకపోవడం విస్మయం కలిగించే విషయమే. -
ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ప్రొగ్రామ్..
బెంగళూరు : ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపించే దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. మరో సరికొత్త ప్రొగ్రామ్‌కు శ్రీకారం చుట్టబోతుంది. ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’పేరుతో కస్టమర్ లోయల్టీ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ప్రొగ్రామ్‌ను స్వాతంత్య్ర దినోత్సవం నుంచే ప్రారంభిస్తోంది. ఈ ప్రొగ్రామ్ కింద కస్టమర్ లోయల్టీ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేయనుంది. ఈ పాయింట్లను ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌పై సేల్ ఆఫర్లు నిర్వహించే సమయంలో ఉచిత డెలివరీకి, ముందస్తు షాపింగ్‌కు, ముందస్తుగా ప్రొడక్ట్‌లు పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. దీంతో అమెజాన్ ప్రైమ్ ప్రొగ్రామ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతుంది. అయితే ‘ఫ్లిప్‌కార్ట్ ప్లస్’ఎలాంటి ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు. ప్రతి ఆర్డర్‌పై కూడా ‘ప్లస్ కాయిన్ల’ పేరుతో కస్టమర్లకు డిజిటల్ కరెన్సీని కూడా ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. వీటిని తన సొంత ప్లాట్‌ఫామ్‌పై లేదా హాట్‌స్టార్, బుక్‌మైషో, జోమాటో, మేక్‌మై-ట్రిప్, కేఫ్ కాఫీ డే లాంటి పార్టనర్ ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇలా లోయల్టీ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేయడం ఇది రెండో సారి. తొలిసారి 2014లో ‘ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్’ పేరుతో ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేసింది. ఈ ప్రొగ్రామ్‌కు ఓ తుది రూపం ఇచ్చేందుకు ఇటీవల కాలంలో కంపెనీ కస్టమర్ రీసెర్చ్ చేపట్టిందని ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మార్కెటింగ్, యాడ్స్ హెడ్ సౌమ్యాన్ బిస్వాస్ చెప్పారు. ఈ రీసెర్చ్, డేటా అనాలసిస్ ప్రకారమే ఈ ప్రొగ్రామ్‌ను అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే ప్రొగ్రామ్ అని బిస్వాస్ అన్నారు. తమ 100 మిలియన్ కస్టమర్లలో ఎవరైనా ఈ కాయిన్లను పొందవచ్చని, ప్రయోజనాలను, రివార్డులను అన్‌బ్లాక్ చేసుకోవడం ప్రారంభించుకోవచ్చని తెలిపారు. అయితే లోయల్టీ పాయింట్లను ఎలా పొందాలి? ప్లస్ కాయిన్ల విలువ ఎంత ఉంటుంది? అనే వివరాలను ఫ్లిప్‌కార్ట్ బహిర్గతం చేయలేదు. గత నెలలోనే ఫ్లిప్‌కార్ట్ ఈ లోయల్టీ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. దీనికోసం వచ్చే మూడేళ్లలో 173 మిలియన్ డాలర్లను కూడా వెచ్చించబోతుంది. కాగ, రిటైల్ స్పేస్‌లో లోయల్టీ ప్రొగ్రామ్‌లు మంచి పేరును సంపాదించుకుంటున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రొగ్రామ్‌ను కస్టమర్లకు ఆఫర్ చేయడంలో ఫ్లిప్‌కార్ట్ కాస్త ఆలస్యం చేసిందని టెక్నోపాక్ చైర్మన్ అరవింద్ సింఘల్ చెప్పారు. -
మళ్లీ వెయ్యి డాలర్ల పైకి బిట్ కాయిన్
మూడేళ్లలో తొలిసారి న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ శుభారంభం చేసింది. కాయిన్ మారకం విలువ ఏకంగా 1,000 డాలర్ల పైకి ఎగిసింది. మూడేళ్ల తర్వాత బిట్ కాయిన్ మారకం విలువ వెయ్యి డాలర్ల పైకి ఎగియడం ఇదే తొలిసారి. యూరప్‌కి చెందిన బిట్‌స్టాంప్ ఎక్సే్చంజీలో బిట్ కాయిన్ ఒక దశలో 1,022 డాలర్ల స్థాయికి కూడా పెరిగింది. 2013 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. మొత్తం మీద 2016లో మిగతా కరెన్సీలన్నింటినీ తోసిరాజని బిట్ కాయిన్ విలువ 125 శాతం ఎగిసింది. చైనా కరెన్సీ యువాన్ బలహీనంగా ఉండటం సైతం దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనా. గణాంకాల ప్రకారం ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ట్రేడింగ్ అత్యధికంగా చైనాలోనే జరుగుతోంది. 2013లో బిట్ కాయిన్ విలువ ఆల్ టైం రికార్డు 1,163 డాలర్ల స్థాయిని తాకింది. అయితే, ఆ తర్వాత జపాన్‌కి చెందిన మౌంట్ గోక్స్ ఎక్సే్చంజీలో హ్యాకింగ్ దెబ్బతో 400 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. ఈ రెండేళ్లుగా బిట్ కాయిన్ విలువ కొంత మేర స్థిరంగా కొనసాగుతోంది. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు తదితర పరిణామాలు.. ఇతరత్రా మిగతా దేశాల్లోనూ నగదు చెలామణీపైనా, పెట్టుబడులపైనా నియంత్రణలు పెరుగుతున్న నేపథ్యంలో అధిక రిస్కు ఉన్నప్పటికీ.. మెరుగైన ప్రత్యామ్నాయ కరెన్సీగా బిట్ కాయిన్ ఆకర్షిస్తోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
1000 డాలర్ల మార్కును చేధించిన ఆ కరెన్సీ
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అధికార నియంత్రణ సంస్థలేని కరెన్సీగా ప్రాముఖ్యంలోకి వచ్చిన బిట్ కాయిన్ ధర సోమవారం భారీగా ఎగిసింది. మూడేళ్లకు పైగా గరిష్టస్థాయిలో వెయ్యి డాలర్ల మార్కును చేధించింది. 2013 నవంబర్ నుంచి ఇదే అత్యధిక గరిష్ట స్థాయని కాయిన్ డెస్క్ డేటా రిపోర్టు చేసింది. దీన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా 16 బిలియన్ డాలర్లకు పైగా ఎగిసినట్టు పేర్కొంది. యువాన్ విలువను డీవాల్యుయేషన్ చేయడం, భౌగోళిక అంశాలు, అసెట్ క్లాస్‌పై పెట్టుబడిదారులు ఎక్కువగా శ్రద్ధ చూపించడం వంటివి బిట్ కాయిన్ విలువను గత కొద్దీ నెలలుగా పైకి పెరగడానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. చైనాలో ఎక్కువగా బిట్‌కాయిన్‌లోనే ట్రేడింగ్ జరుపుతున్నారని తెలిసింది. యువాన్‌ను డీవాల్యుయేషన్ చేయడం మూలధనం నియంత్రణపై ఆందోళనలు రేకెత్తించిందని, దీంతో డిజిటల్ కరెన్సీపై పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఎంతో సురక్షిత సాధనంగా దీనికి బాగా గుర్తింపు లభిస్తోంది. కేవలం కంప్యూటర్‌తోనే లావాదేవీలను చకాచకీగా ముగించేయొచ్చు. ఇటీవల కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించడం కూడా దేశీయంగా పెట్టుబడిదారులను ఈ కరెన్సీపై ఎక్కువగా దృష్టిసారించేలా చేసింది. -
డిజిటల్ లావాదేవీల్లో ఆధార్ కీలకం
- డిజిటల్ పయనానికి పన్ను రాయితీలు ఉండాలి - డిజిటల్ లావాదేవీల అమలు కమిటీ చైర్మన్ చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీ అమలు దిశగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు రాయితీలు ఇవ్వడంతో పాటు పన్ను రాయితీలు కూడా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిజిటల్ లావాదేవీల అమలు కమిటీ చైర్మన్ చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డిజిటల్ ఎకానమీకి వెళ్లాలంటే ఉత్తమ పద్ధతులు, ఇబ్బందులపై చర్చించాం. అంతర్జాతీయంగా అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులు అధ్యయనం చేస్తున్నాం. ఆధార్ ఆధారంగా చెల్లింపు చేసే పద్ధతి సులువైనది. వ్యాపారికి స్మార్ట్‌ఫోన్ ఉండి, దానికి బయోమెట్రిక్ పరికరం బిగిస్తే సరిపోతోంది. దీనికి రెండువేలు ఖర్చవుతుంది. ఏపీ రూ.1000 రాయితీ ఇస్తోంది. వినియోగదారుడికి ఎలాంటి ఖర్చు ఉండదు. త్వరలోనే దీన్ని ప్రారంభించాలి. రాష్ట్రంలో ఇప్పటికే పైలెట్‌గా 400 షాపుల్లో ప్రారంభించాం. చౌకధరల దుకాణాల్లో ఇప్పటికే నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నాం. నాలుగు మార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు. యూఎస్ఎస్డీ ద్వారా సాధారణ ఫోన్ నుంచి కూడా లావాదేవీలు జరపొచ్చు. యూపీఐ ద్వారా కూడా సులువుగా ఉంటుంది. 600 మిలియన్ సెల్ఫోన్లున్నాయి. వీటిద్వారా యూపీఐ విధానంలో సులువుగా లావాదేవీలు జరపొచ్చు. ఎన్పీసీఐ 33 బ్యాంకులను యూపీఐ కిందికి తెచ్చింది. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. స్వైపింగ్ ద్వారా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేయవచ్చు. ఇండియాకు సైబర్ సెక్యూరిటీలో ఉన్న సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు..’ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌లో జరిగిన కమిటీ సమావేశంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సీఈవో అమితాబ్‌కాంత్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే వారంలో నివేదిక ‘నగదు రహిత లావాదేవీల అమలు విధానంపై సిఫారసులతో కూడిన మధ్యం తర నివేదికను జనవరి మొదటి వారంలో ప్రధానికి ఇవ్వబోతున్నాం. హార్డ్‌వేర్, ఈపాస్ మిషన్లు లేకపోవడం వంటి సమస్య లున్నాయి. రానున్న 3 నెలల్లో 10 లక్షల ఈ పాస్ మిషన్లు దిగుమతి చేసుకోవాలని, దేశీయంగా 10 లక్షల మిషన్లు సేకరించాలని నిర్ణయించాం. స్మార్ట్ఫోన్ల ధరలు దిగి రావాలి. ప్రభుత్వం వీటికి రాయితీ ఇవ్వాలి. వీటన్నింటి వినియోగం ఖర్చుతో కూడినదై ఉండరాదు. బ్యాండ్‌విడ్త్ విస్తరించాలి. డేటా వేగం పెరగాలి. బ్యాంకర్ చార్జీలు, కమ్యూనికేషన్ చార్జీలు అతి తక్కువలో ఉండాలి. పన్ను తగ్గించాలి. పన్ను రాయితీ ఉంటేనే డిజిటల్ కరెన్సీకి పెద్ద ఎత్తున వెళతారు’ అని చంద్రబాబు చెప్పారు. నోట్ల రద్దుపై తన వైఖరి ఎప్పుడూ మారలేదని, నగదు రహిత లావాదేవీలతో విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
క్యాష్ లెస్..ఎలా సాధ్యం ?
-
డిజిటల్ కరెన్సీదే భవిష్యత్తు: జైట్లీ
నగదు వాడకాన్ని తగ్గించాలనుకుంటున్నట్టు వెల్లడి న్యూఢిల్లీ: నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్ చెల్లింపులవైపు అడుగు వేయాలని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం రాజ్యసభలో నోట్ల రద్దుపై ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... ప్రభుత్వం నగదు వాడకాన్ని తగ్గించి... దీనికి ప్రత్నామ్నాయంగా డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని పెంచాలని అనుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. 80కోట్ల డెబిట్ కార్డుల్లో 40 కోట్ల కార్డులను ఏటీఎం కేంద్రాలలో చురుగ్గా ఉపయోగిస్తున్నారని వివరించారు. ఎలక్ట్రానిక్ వ్యాలెట్లు, ఆన్లైన్ నగదు బదిలీలు భవిష్యత్తు తరం టెక్నాలజీలని... వీటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కూడా కోరినట్టు జైట్లీ తెలిపారు. నగదు రహిత వ్యవస్థపై ప్రచారం, అవగాహన కోసం ఓ నిధి కూడా అమల్లో ఉందన్నారు. నగదు రహిత సమాజం అంటే తక్కువ నగదు కలిగి ఉండడం, చెల్లింపుల్లో పారదర్శకత, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టడంగా మంత్రి పేర్కొన్నారు. -
డిజిటల్ కరెన్సీ మోజులో మోదీ
రెండో మాట ఎదగకముందే ‘జాంబవంతుడి అంగలతో ముందుకు దూకాలనే ఆశతో ఉన్న కరెన్సీ పునాదులకు ఎసరు పెట్టుకోకూడదు. చెలామణీలోని కరెన్సీ విలువ నిలకడగా లేదు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్టుగా కొత్తగా తలపెట్టిన ప్రయోగంతో నగదు (క్యాష్) లావాదేవీలను డిజిటల్ (ఎలక్ట్రానిక్) మాధ్యమం ద్వారా బట్వాడా చేయటం మంచిదని మోదీ భావించారు. దేశ లావాదేవీలను టెక్నాలజీ మాధ్యమంలో నిర్వహించాలని ఆ వైపుగా పదే పదే సూచించడంలోని అర్థం అదేనని గ్రహించాలి. ‘ఎన్నికల్లో ధారాళంగా ప్రవహించే కరెన్సీ నోట్లను అదుపు చేసే ప్రయత్నం వేరు విషయం. ఒకవేళ ఇది పాకిస్తాన్‌పై మెరుపుదాడే అయితే మన ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతిస్తారనుకుందాం. కానీ ఇది నల్లధనంపైన మెరు పుదాడి పేరిట దేశప్రజల పైననే ప్రభుత్వం తలపెట్టిన ప్రత్యక్ష దాడి. అందుకే దేశ ప్రజా బాహుళ్యం మనసులు గాయపడ్డాయి. నల్లధనంపైన ఉద్యమ రూపంలో దాడిని బాబా రామ్‌దేవ్ ద్వారా నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించి ఉండాల్సింది. కానీ తన న్యాయబద్ధమైన సంపాదన, ఆదాయం చెల్లుబాటు కావని ప్రభుత్వం ఆకస్మికంగా ప్రకటించడం ద్వారా సామాన్యుడి విశ్వాసం దెబ్బతినిపోయింది. అతనిలో తిరిగి విశ్వాసాన్ని పాదు కొల్పడం కష్టం.’ – ది హిందూ, బిజినెస్ లైన్ (పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయాన్ని పార్టీ అధికారికంగా సమర్థించినందుకు నిరసనగా ఒక బీజేపీ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్య, 10–11–16) ప్రధాని నరేంద్ర మోదీలో ఇంతకు ముందు వరకు కనిపించిన గాంభీర్యం అకస్మాత్తుగా ఈ నెల 13న జరిగిన గోవా బహిరంగ సభలో డుల్లిపోవడానికీ, ఆగ్రహ ప్రకటనగా మారడానికీ కారణం ఏమిటో ఎవరూ చెప్పక్కరలేదు. అందులోని మర్మాన్ని పాలక పక్షానికే చెందిన సీనియర్ నేత నోటి నుంచి వెలువడిన నిశిత విమర్శ ద్వారానే గ్రహించవచ్చు. వచ్చే రెండుమూడు మాసాలలోనే నాలుగైదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లను దృష్టిలో పెట్టుకుని అక్కడ బీజేపీని అధికార పీఠం మీద అధిష్టింపచేయడానికి ఒక చిట్కాగానే మోదీ రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు ప్రయోగాన్ని ముందుకు తెచ్చారన్న భావం ప్రజా నీకంలో మొదలైంది. విదేశాలకు చేరిన అపార నల్లధన రాశులను వెలికి తీస్తామని 2014 ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారు. అయితే అధి కారంలోకి వచ్చిన తరువాత మాత్రం మౌనం దాల్చారు. ప్రజలూ, ప్రతి పక్షాల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తట్టుకోలేక చివరికి జస్టిస్ ఎంబీ షా (రిటైర్డ్) ఆధ్వర్యంలో కమిషన్‌ను నియమించారు. ఈ తతంగంతో కూడా నల్లధనం వెలికిరాలేదు. ఇన్నేళ్లుగా స్విస్ బ్యాంకులలో పోగుపడి ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధన రాశులలో ఒక్క శాతం కూడా వెనక్కి రాలేదు. వికీలీక్స్, పనామా పేపర్స్ పరిశోధక సంస్థలు వెల్లడించిన నల్లధన రాశులు కూడా దేశానికి తిరిగొచ్చిన ఉదాహరణలు లేవు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు మాటామంతీ లేకుండా గడిపేసింది. అంటే యూపీఏ పాలన తరహాలోనే ఎన్డీఏ హయాంలోను దొంగనోట్లు, నల్లధనం నిరాఘాటంగా చెలామణీ అవుతూ దేశ ఆర్థిక వ్యవస్థనూ, సామాన్య జనాన్నీ కల్లోల పరుస్తూనే ఉన్నాయి. నోట్లు ముమ్మరం కావడం ద్వారా ద్రవ్యోల్బణం పెరిగి, రూపాయి విలువ దిగజారడం కూడా ప్రజలకు చిరకాలంగా అనుభవంలో ఉన్న విష యమే. నిజానికి ఇది సామాన్యుడు గ్రహించలేని రాజకీయ, ఆర్థిక పరమార్థం. విశ్వసనీయత మీద దెబ్బ ఈ పరిణామాన్నీ, దాని ప్రభావాన్నీ అర్థం చేసుకున్న ఇద్దరు–భారత ప్రభుత్వ ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి అరవింద్ మయారామ్, ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త కౌశిక్ బసు చేసిన హెచ్చరికలను ఈ సందర్భంలో గమనించాలి. ‘రూ. 500, రూ. 1,000 నోట్లను అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం చెలామణీ నుంచి రద్దు చేసింది. దీనివల్ల రూపాయి విలువ విశ్వసనీయతను నాశనం చేసి, దీర్ఘకాలంలో పసిడి నిల్వలను భారీ స్థాయిలో దిగుమతి చేసుకోవడానికి దారితీస్తుం’దని మయారామ్ హెచ్చరించారు. కౌశిక్ బసు అయితే, ‘పెద్ద నోట్లను రద్దు చేయడం ఆరోగ్యకర ఆర్థిక విధానం కాదనీ, ఈ రద్దు వల్ల ప్రయోజనం కంటే, ఉభయ భ్రష్టత్వానికి దగ్గర దారి చూపుతుందనీ’ వ్యాఖ్యానించారు. అసలు రూపాయికి ఉన్న విశ్వసనీయతకు ఏదీ పునాది? కరెన్సీ ఒక కాగితం ముక్క. రూ. 1,000 నోటు తయారు కావ డానికి అయ్యే ఖర్చు రూ. 5. కానీ దానికి రూ. 1,000 విలువ వచ్చిందంటే దాని మీద రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం చేస్తారు. అంటే ఆర్బీఐ గవర్నర్ ఆ విలువకు హామీ పడుతున్నారని అర్థం. ఇంకా చెప్పాలంటే కరెన్సీ అంటే దేశ సర్వసత్తాక సార్వభౌమాధికారానికి చిహ్నం. కాబట్టి, అలాంటి నోటుకు ఉన్న ప్రతిపత్తిని ప్రశ్నించడం అంటే, దాని విశ్వసనీయతను ప్రశ్నిం చడమే. కనుక పాలకులు చెదరగొట్టిన కరెన్సీ విశ్వసనీయతను తిరిగి పొంద డానికి ప్రజలకు మళ్లీ చాలాకాలం పడుతుందని నిపుణులైన ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఒకసారి ప్రజల విశ్వాసం సడలిపోతే మొత్తం ఆర్థిక వ్యవ స్థపైనే దాని ప్రభావం ఉంటుంది. ‘ఒకవేళ కొత్త నోటు చెలామణిలో పెట్టినా, మళ్లీ వచ్చే ఏడాది పాత నోట్లు చెలామణిలోంచి తప్పించరని నమ్మక మేమిటని ప్రజలు ప్రశ్నిస్తారు’ అని కూడా నిపుణులు అంటున్నారు. కనుకనే మోదీ (బీజేపీ) తొందరపాటు విధానాలపై పెద్ద స్థాయిలో విసుగూ వ్యాకుల పాటు వ్యక్తం కావడానికి కారణం. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు ‘దొంగలుపడ్డ ఆర్నెల్లకు’ మేల్కొన్న చందంగా రెండున్నర సంవత్సరాల పాలన తర్వాత ‘ వాళ్లు నన్ను బతకనివ్వరు, అయినా భయపడను’ అని మోదీ కొత్తగా ‘జబ్బ’ ఎందుకు చరుచుకోవలసి వస్తోందో తెలియదు. పైగా ఇండో–పాక్ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వద్ద ఉడి, పంజాబ్‌లోని పఠాన్ కోట వద్ద ఉభయదేశాల మధ్య ‘మెరుపు దాడుల’వెను వెంటనే దేశీయ కరెన్సీ నోట్లపైన, నల్లధనంపైన ‘శస్త్ర చికిత్స’ జరగడం యాదృచ్ఛిక ఘటనలు కావు. 1946 నుంచి మాత్రమే కాదు, 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఏర్పడిన జనతా సర్కార్ పాలనలోను, (అందులో నేటి బీజేపీ భాగస్వామి) 1978లో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ సర్కార్ ఏలుబడి దాకా పాలక వర్గాల ఎన్నికల స్వార్థ ప్రయోజనాల ఫలితంగా భారీ కరెన్సీ నోట్లకు ‘సర్జరీ’లు జరుగుతూనే వచ్చాయి. కాని ఇప్పటి మాదిరిగా (మోదీ పాలనలో)ఏనాడూ సామాన్య ప్రజల నిత్య జీవితావసరాలకు, నిత్య బ్యాంకింగ్ లావాదేవీలకు విఘాతం కలగలేదు. జనతా సంకీర్ణ ప్రభుత్వం అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష సాధింపులో భాగంగా భారీ నోట్ల సర్జరీకి పూనుకున్నప్పుడు నాటి ఆర్బీఐ గవర్నర్ ఐజీ పటేల్ భారీ నోట్ల చెలామణిని వ్యతిరేకించారు. ఇటీవల కాలంలో మోదీ ప్రభుత్వానికీ, రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా రాజీ నామా చేసిన రాజన్‌కూ పడక, తమ మాటకు బద్ధులై ఉండే విశ్వాస పాత్రులైన వ్యక్తుల్ని ప్రధాన కార్యదర్శులుగా, ముఖ్య కార్యదర్శులుగా నియమించుకున్నట్లే బీజేపీ పాలకులు ఆర్బీఐ బ్యూరోక్రాట్లను నియమిం చారు. వికీలీక్స్, పనామా పేపర్స్ వెల్లడించినట్టు, విదేశాల్లో దాచుకున్న కోట్లాది రూపాయల ధనంతో పాటు స్విస్ ఖాతాలకెక్కిన నల్లధనపు గుప్త సామ్రాజ్య రాజకీయుల (బీజేపీ సహా) పేర్లు కూడా వెల్లడి కావడంతో ప్రజలకు మన ప్రజాస్వామ్యం ‘డొల్లతనం’ బాహాటంగానే వెల్లడైంది. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతదేశపు 2,000 మంది కుబేరుల నల్లధనం 1.3 ట్రిలియన్ డాలర్లు – అంటే రూ. 358,679,863,300,000. గుజరాత్ నుంచి గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, యూపీ, బిహార్‌ల దాకా విస్తరిల్లిన బడా కార్పొరేట్లు, అంబానీ, ఆదానీలు.. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న బడా ప్రజా ప్రతినిధులు, వారి బినామీల దాకా వారిలో ఉన్నారు. స్విస్ బ్యాంకు లెక్కల ప్రకారం భారతదేశపు బినామీ/కుబేర వర్గాల నల్లధనం మరొక మాటలో చెప్పాలంటే 24 లక్షల కోట్లు. భారతదేశపు దారిద్య్రం పూర్తిగా తొలగాలన్నా లేదా మోదీ ఆశిస్తున్నట్టు ఇతరుల కళ్లు కుట్టేంతగా వర్ధమాన దశ నుంచి ప్రవర్ధమాన దిశగా పరిపూర్ణ ‘అభివృద్ధి’ భారతదేశపు పునర్ని ర్మాణం పరిపూర్ణ దశకు చేరాలన్నా – ఈ మొత్తం ఎక్కాదక్కా ఇంకా మిలిగి పోయే ఉంటుంది. డిజిటల్ కరెన్సీయే లక్ష్యమా? కాగా, ఎదగకముందే ‘జాంబవంతుడి అంగలతో ముందుకు దూకే పేరుతో ఉన్న కరెన్సీ పునాదులకు ఎసరు పెట్టుకోకూడదు. చెలామణీలోని కరెన్సీ విలువ నిలకడగా లేదు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్టుగా కొత్తగా తలపెట్టిన ప్రయోగంతో నగదు (క్యాష్) లావాదేవీలను డిజిటల్ (ఎలక్ట్రానిక్) మాధ్యమం ద్వారా బట్వాడా చేయటం మంచిదని మోదీ భావించారు. దేశ లావాదేవీలను టెక్నాలజీ మాధ్యమంలో నిర్వహించాలని ఆ వైపుగా పదే పదే సూచించడంలోని అర్థం అదేనని గ్రహించాలి. కానీ ఎలక్ట్రానిక్ మాధ్యమాన్ని నగదు బదిలీలకు వినియోగించడం ద్వారా ఎన్ని కుంభకోణాలకు ఆహ్వానం పలకవచ్చో అమెరికా, యూరప్ దేశాల్లో నేరాలు రుజువు చేశాయని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త డేవిడ్ క్రోటన్ వెల్లడిం చాడు(‘వెన్ కార్పొరేట్స్ రూల్ ది వరల్డ్’). ‘లాభంలేనిదే వ్యాపారి వరదన పోడన్న’ట్టుగా ఈ టెక్నాలజీ విశ్వరూపం ‘మైక్రోసాఫ్ట్’ దిగ్గజం బిల్‌గేట్స్ వంటి వారి అడ్డూ అదుపూ లేని కలలు నెరవేర్చుకోడానికి ఉద్దేశించినదే తప్ప, లాభాల వేటలో సాధారణ వాస్తవ పరిస్థితులకు ఆ కలలు పనికిరావని డిజి టల్ టెక్నాలజీ– సమాచార యుగపు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డిజిటల్ (ఎలక్ట్రానిక్) టెక్నాలజీ చౌకగానే లభ్యం కావచ్చు. కానీ టెక్నాలజీని పెంచుకోవాలన్నా, విస్తరించాలన్నా తగినన్ని ఆదాయ వనరులను పెంచుకో వాలన్నా అవకాశాలు తక్కువనీ, ముఖ్యంగా భారీ రుణాలు తీసుకుంటూ, ఖరీదైన కరెన్సీ అందుబాటులోలేని వర్ధమాన దేశాలకు ద్రవ్య వనరులు పెంచుకునే అవకాశాలు లేనిచోట్ల టెక్నాలజీ విస్తరణ మరీ కష్టం కావచ్చుననీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుకనే, టెక్నాలజీ ద్వారా సమాచారం బట్వాడా చేసే పద్ధతులు వచ్చిన తరువాత దేశాల ఆర్థిక వ్యవస్థలకు పునాది అయిన మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా కునారిల్లిపోయాయని నిపు ణుల భావన. అందువల్ల ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కరెన్సీ లావాదేవీలు జరపడానికి ఉత్సాహపడుతున్న మోదీ ఒక్కసారి వెనుదిరిగి ఆలోచించు కోవటం శ్రేయస్కరం కాదా?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చీకటి రాజ్యం
ఇంటర్నెట్ మాఫియా విజృంభణ డ్రగ్స్ విక్రయానికి {పత్యేక సర్వర్లు, బ్రౌజర్లు డిజిటల్ కరెన్సీలోనే నగదు చెల్లింపులు ‘ఎల్ఎస్డీ గ్యాంగ్’ విచారణలో వెలుగులోకి సిటీబ్యూరో: బాహ్య ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అథోజగత్తు ఉంది. మనకు తెలిసిన అండర్ వరల్డ్‌లో మాఫియా డాన్లు రాజ్యమేలితే... ఇంటర్నెట్లోని అండర్ గ్రౌండ్ వెబ్‌లో డ్రగ్స్ వ్యాపారం సాగుతుంటుంది. దీనికి సంబంధించిన నగదు లావాదేవీలు బిట్ కాయిన్స్‌గా పిలిచే డిజిటల్ కరెన్సీలోనే సాగుతుంటాయి. హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన నాగ్‌పూర్ ద్వయం విచారణలో ఈ కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్డర్ పేరిట వల సింథటిక్ డ్రగ్‌గా పిలిచే... బొమ్మల రూపంలో ఉండే ఎల్ఎస్డీ (లినర్జిక్ యాసిడ్ డై థైలామెడ్) మాదక ద్రవ్యం చేతులు మారుతోందనే సమాచారంతో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ నెల 8న కింగ్‌కోఠి ప్రాంతంలో దాడి చేశారు. దీంతో ముస్తఫా మొయినుద్దీన్, జునైద్ రజా సిద్దిఖీ, మహ్మద్ మంజిల్ ముఖరం పాషా చిక్కారు. వీరికి ఎల్ఎస్డీని సరఫరా చేస్తున్నది నాగపూర్‌కు చెందిన అన్నదమ్ములు మయాంక్ కుమార్ సాహు, పీయూష్ కుమార్ సాహుగా గుర్తించారు. దీంతో ఆర్డర్ పేరుతో వలపన్నిన టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం లిబర్టీ ప్రాంతానికి రప్పించి అరెస్టు చేసింది. వీరికి మాదక ద్రవ్యాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే కోణంలో విచారించగా... ఆసక్తికరమైన ఆన్లైన్ అండర్ వరల్డ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ‘నెట్టింట్లో’ మరో ప్రపంచం... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం... వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ-కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చి... అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో ‘తమ విని యోగదారులు’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠాలు ఇంటర్నెట్లో అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. టెయిల్స్ ఆపరేషన్ సిస్టంతో... ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. అందులోని వెబ్సైట్లను చూడటం... యాక్సెస్ చేయడం కుదరదు. ఈ అథోజగత్తులో అడుగు పెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం ఇన్స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకున్న మయాంక్, పీయూష్‌లు వాటి ద్వారానే ‘న్యూక్లియస్ మార్కెట్ ప్లేస్’ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించారు. డ్రగ్స్ విక్రయంలో పేరున్న ఆ సైట్ ద్వారానే ఆర్డర్ ఇచ్చి, ఎల్ఎస్డీని నాగ్‌పూర్‌లో డెలివరీ చేయిం చుకున్నారు. కొరియర్ ద్వారా వచ్చే ఈ ‘మాల్’ను అందుకోవడానికి తప్పుడు చిరునామాలు ఇచ్చిన ఈ ద్వయం... నేరుగా కొరియర్ ఆఫీసులకు వె ళ్లి డెలివరీ తీసుకుంటూ తమ ఉనికి బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు డీప్ వెబ్‌లోని వెబ్సైట్లలో ఆర్డర్ ఓ ఎత్తయితే... చెల్లింపులు మరోఎత్తు. ఈ లావాదేవీలు ఆన్లైన్లోనే బిట్‌కాయిన్స్‌గా పిలిచే డిజిటల్ కరెన్సీ రూపంలో సాగుతాయి. దీనికీ కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాటిలోకి లాగిన్ కావడం ద్వారా ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించి బిట్ కాయిన్స్‌ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటారు. ‘డీప్ వెబ్’లో కొనుగోలు చేసిన ‘మాల్’కు చెల్లింపులన్నీ ఈ బిట్ కాయిన్స్ రూపంలోనే చేస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా విక్రయిస్తున్న, ఖరీదు చేస్తున్న వ్యక్తుల వివరాలు వేరొకరికే కాదు... ఒకరికొకరికీ తెలిసే అవకాశం ఉండదు. మయాంక్, పీయూష్‌లు ఈ రకంగానే ఎల్ఎస్డీని ఖరీదు చేసి నగరంలోని వారికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే సాధారణ వెబ్సైట్లతో పాటు సోషల్ మీడి యా పని చేయడానికి వాటిని ఇంటర్నెట్లో ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆరా తీయాల్సి వచ్చినప్పుడు పోలీసు, నిఘా వర్గాలు ఈ సర్వర్ అడ్రస్ ఏమిటి? అది ఎక్కడ ఉంది? నిర్వహిస్తున్నది ఎవరు? తదితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘డీప్ వెబ్’ సర్వర్లు, చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే అసాంఘిక శక్తులకు కలిసి వస్తోంది. ఈ తరహా కేసులు గతంలో బెం గళూరులో వెలుగులోకి వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో బయట పడడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. నాగ్‌పూర్ ద్వయం మాత్రం తమకు ఎల్ఎస్డీ డ్రగ్ చైనా, దుబాయ్‌ల నుంచి వచ్చినట్లు వెల్లడించారని... ఇది కూడా నిర్థారించడం కష్టమని ఓ అధికారి తెలిపారు. -
వివరం : బిట్‌కాయిన్ కథ కంచికేనా ?!
బిట్‌కాయిన్ ఒక పాల పొంగా! లేక భవిష్యత్ అవసరమా!! బిట్‌కాయిన్ పురిట్లోనే సంధికొట్టేసిందా! లేక ఎదుగుతున్న క్రమంలో ఇవన్నీ బాలారిష్టాలేనా!! బిట్‌కాయిన్ కంచికి చేరిపోతోందా! లేక కడలి కెరటంలా పడినా లేస్తుందా!! ఇవన్నీ ఈ డిజిటల్ కరెన్సీ చుట్టూ ముసురుకుంటున్న సందేహాలు. ఎందుకంటే బిట్‌కాయిన్‌ను మిగతా కరెన్సీల నుంచి వేరు చేసే అంశాల్లో ప్రధానమైనవి రెండు. వాటిలో మొదటిది ఆన్లైన్ భద్రత కాగా... రెండవది పూర్తి డిజిటల్ రూపంలో ఉండటం. కానీ ఇటీవలే హ్యాకర్ల దాడితో ఓ బిట్ కాయిన్ ఎక్స్ఛేంజీ మూతపడింది. దాంతో ఆన్లైన్ భద్రత ప్రశ్నార్థకమయ్యింది. దీనికి తోడు హాంకాంగ్‌లో వస్తురూపంలో బిట్కాయిన్లను విక్రయించే స్టోర్ కూడా మొదలయంది. అంటే ఇది పూర్తి ఆన్లైన్ కరెన్సీ కాదు! మరెందుకు బిట్‌కాయిన్??? ఆగండాగండి!! అసలు ఎందుకీ బిట్ కాయిన్ అని ప్రశ్నించేవారికన్నా... అసలు ఏంటీ బిట్ కాయిన్ అని ప్రశ్నించేవారే ఎక్కువ!! సింపుల్‌గా ఇదో ఆన్లైన్ కరెన్సీ! డిజిటల్ కరెన్సీ... అని సమాధానాలిస్తే వారికి అర్థం కాదు. ఎందుకంటే మనకు రూపాయి ఉన్నట్టే ప్రతి దేశానికీ ఓ కరెన్సీ ఉంది. పెపైచ్చు ఆ కరెన్సీలను నియంత్రించడానికి మన రిజర్వు బ్యాంకు మాదిరి ఆయా దేశాల్లో సెంట్రల్ బ్యాంకులున్నాయి. ఇక అంతర్జాతీయంగా దాదాపు అందరూ ఆమోదించే అమెరికన్ డాలర్ ఎటూ ఉంది. ఒకవేళ ఆన్లైన్లో కొనాలంటే వీసా, మాస్టర్ కార్డులు ఉండనే ఉన్నాయి. మరి ఈ బిట్ కాయిన్ ఎందుకు? ఏంటీ బిట్‌కాయిన్? ఎలా పుట్టింది? దీన్ని మేనేజ్ చేసేదెవరు? తయారు చేసేదెవరు? దీన్ని మనం సంపాదించటమెలా? అసలిప్పుడు దీని విలువెంత? దీంతో ఏది పడితే అది కొనుక్కోవచ్చా? అందరూ వీటిని అంగీకరిస్తారా? బిట్ కాయిన్లు మన దగ్గరుంటే మార్చుకోవచ్చా? అమ్మో!! ఇన్ని సందేహాలా!! ఇవే కాదు. ఈ సందేహాల చిట్టా అంతు లేకుండా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే... ఇది డబ్బు బాబూ... డబ్బు!!ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఎవరికి వాళ్లు తమకి కావాల్సిన సొమ్మును, ఎప్పుడంటే అప్పుడు, భారీ చార్జీలు లేకుండా డిజిటల్ రూపంలో పంపించుకోగలిగితే!! ఈ ఊహ నుంచి పుట్టిందే బిట్‌కాయిన్ వ్యవస్థ. ఇది ఏ దేశానికీ చెందదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. దీని సృష్టికర్త ఎవరికీ తెలీదు. కానీ సతోషి నకమోటో అనే జపానీస్ మారుపేరుతో బిట్కాయిన్ల గురించి 2008లో ఒక కథనం ప్రచురితమైంది. తర్వాత ఏడాదికి... అంటే 2009 జనవరి 3న ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఒక భారీ నెట్‌వర్క్‌గా ఏర్పడిన కంప్యూటర్ల ద్వారా (బ్లాక్‌చెయిన్) సంక్లిష్టమైన గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్లను సృష్టిస్తారు. ఈ నెట్‌వర్క్‌లో ఉండే కంప్యూటర్లు కూడా అత్యంత శక్తిమంతమైనవి. పెపైచ్చు ప్రతి కంప్యూటర్ ద్వారా సృష్టించగలిగే బిట్కాయిన్ల సంఖ్య చాలా పరిమితం. అత్యంత సంక్ల్లిష్టమైన ఈ ప్రక్రియ పేరు మైనింగ్. ఎప్పటికైనా సరే... మొత్తం బిట్కాయిన్ల సంఖ్య 2.1 కోట్లకు మించకుండా ఈ విధానాన్ని రూపొందించారు. 2009 నుంచి ఇప్పటి దాకా 1.24 కోట్ల బిట్కాయిన్ల మైనింగ్ జరిగింది. లావాదేవీలు జరిగేదెలా? ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బిట్కాయిన్లు వాడొచ్చు. బిట్కాయిన్లతో ఏది కొన్నా... ఆ లావాదేవీ తక్షణం డిజిటల్ రూపంలో ‘లాగ్’ అవుతుంది. ఈ ‘లాగ్’లో ఎప్పుడు కొన్నారు? లావాదేవీ జరిగాక ఎవరి దగ్గర ఎన్ని కాయిన్లున్నాయి? వంటివన్నీ అప్డేట్ అయిపోతాయి. బిట్‌కాయిన్‌కు సంబంధించిన ప్రతి ఒక్క లావాదేవీ ఈ లాగ్‌లో అప్డేట్ అవుతుంటుంది. ఈ వ్యవస్థే బ్లాక్ చెయిన్. ఈ చెయిన్‌లో మొదటి నుంచి అప్పటిదాకా జరిగిన ప్రతి లావాదేవీ నమోదవుతుంది. బ్లాక్‌చెయిన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ... లావాదేవీలు పొల్లుపోకుండా జరిగాయో లేదో చూసే వారే మైనర్స్. ఒకరకంగా చెప్పాలంటే లావాదేవీలకు ఆమోదముద్ర వేసేవారన్న మాట. ఇలా చేసినందుకు వీరికి వ్యాపారుల నుంచి కొంత ఫీజు ముడుతుంది. వెయ్యి డాలర్లనూ తాకింది!! ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ మారకం విలువ 640 అమెరికన్ డాలర్లు. ఇటీవల ఈ విలువ 1100 డాలర్లను తాకింది కూడా!! ఎందుకంటే బంగారం మాదిరిగా బిట్‌కాయిన్లూ అరుదైనవే. వీటిని సూపర్ కంప్యూటర్ల ద్వారా... అది కూడా పరిమితంగానే సృష్టించగలరు. అందుకే బిట్కాయిన్ల ట్రేడింగ్‌లో స్పెక్యులేషన్ పెరిగింది. పెపైచ్చు వర్డ్‌ప్రెస్, ఓవర్‌స్టాక్.కామ్, రెడ్డిట్, ఓకే క్యుపిడ్, వర్జిన్ గెలాక్టిక్, బైదు లాంటి సంస్థలన్నీ ఆన్లైన్ షాపింగ్‌కు బిట్కాయిన్లను అనుమతిస్తున్నాయి. అందుకే వీటిని కావాలనుకునేవారు పెరిగారు. దీంతో బిట్కాయిన్ల మారకం రేటు రయ్యిమని పెరిగింది. ఇంతలో కొన్ని దేశాలు దీని వాడకంపై పరిమితులు విధిస్తామని చెప్పటం, మారకం ఎక్స్ఛేంజీలపై హ్యాకర్లు దాడులు చెయ్యటంతో విలువ కొంత పడింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న బిట్కాయిన్ల మార్కెట్ విలువ సుమారు 8.4 బిలియన్ డాలర్లుంటుంది. బిట్‌కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీలు 70కి పైగా ఉండగా... వీటి మొత్తం విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లుంటుందని అంచనా. దీన్లో సింహభాగం బిట్‌కాయిన్లదే కనక దీనికంత ప్రాధాన్యం. బిట్ కాయిన్ కావాలా..? ప్రస్తుతం బిట్కాయిన్లు కొనాలంటే ఆన్లైన్ ఎక్స్చేంజీలను ఆశ్రయించాల్సిందే. దీనికోసం ఆయా ఎక్స్ఛేంజీల్లో ఒక ఖాతా క్రియేట్ చేసుకుని, దాన్ని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఈ ఖాతాయే మనం కొనే బిట్కాయిన్లను దాచిపెట్టుకునే వాలెట్. మన అకౌంటు వెరిఫికేషన్ పూర్తయ్యాక... సరిపడే మొత్తాన్ని ఎక్స్చేంజీకి బదలాయిస్తే మన వాలెట్‌లోకి బిట్కాయిన్లు వచ్చి చేరతాయి. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు సుమారు పది రోజులు పైగా పడుతోందని, ఈలోగా బిట్‌కాయిన్ మారకం విలువ భారీగా మారిపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. బిట్కాయిన్లను నియంత్రించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థేమీ లేదు. యూజర్ల బ్లాక్‌చెయినే దీని వ్యవస్థ. ప్రతి యూజరుకు ఆన్లైన్లో ఇలా 1ఒఅట6్జ్డఉ3అఒ9టో3్చఊజ్జీ1ఆఝఖీఛిఞ ఊఎజూ86జిఅ వంటి కోడ్‌తో నిర్దిష్టమైన అడ్రెస్ ఉంటుంది. వారి లావాదేవీలన్నీ ఇలాంటి అడ్రెస్‌తోనే జరుగుతాయి. ఒక లావాదేవీ జరిగినపుడు... ఒక అడ్రస్ నుంచి బిట్కాయిన్లు మరో అడ్రస్‌కు బదిలీ అవుతాయి. కేవలం అడ్రస్ తప్ప... ఈ లావాదేవీ చేసినవారి వ్యక్తిగత వివరాలేవీ బయటకు రావు. అందుకే బిట్కాయిన్ల ద్వారా ఆన్లైన్లో పెద్ద ఎత్తున అక్రమాయుధాలు, మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇలా వివరాలు తెలియకపోవటమన్నది దీనికి ప్లస్సే కాదు... మైనస్ కూడా. ఏంటట దీని గొప్ప!! మామూలు కరెన్సీతోనే అన్నీ చేయగలుగుతున్నపుడు బిట్ కాయిన్ల అవసరమేంటి? సహజంగా ప్రతి ఒక్కరికీ కలిగే సందేహమే ఇది. నిజానికి పేరుకు కాయిన్ అయినా ఆన్లైన్లో ఇది బైనరీ అంకెల కోడ్లా కనిపిస్తుంది. పెపైచ్చు బిట్‌కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తి ఎవ్వరూ ఉండరు. నేరుగా మన వాలె ట్లోంచి డబ్బు వ్యాపారి వాలెట్‌లోకి వెళుతుంది. మన వివరాలు బయటకు రావు. వీటికితోడు వేరొకచోటికి తీసుకెళ్లటం, దాచుకోవటం వంటి అంశాల్లో కష్టం ఉండదు. వీటన్నిటితో పాటు... బిట్‌కాయిన్ లావాదేవీలపై ఛార్జీలుండవు. కొన్ని సందర్భాల్లో ఉన్నా... నామమాత్రమే. అన్నిటికన్నా ముఖ్యం... బిట్కాయిన్లలో జరిగే ప్రతి లావాదేవీ యూజర్లందరికీ తెలుస్తుంది. అంతా పారదర్శకమన్న మాట. మరి మన ఇండియాలోనో...? ఇంకా మన దగ్గర బిట్కాయిన్ల వాడకం పెద్దగా లేదు. ఐఎన్‌ఆర్‌బీటీసీ, ైబె సెల్బిట్కో.ఇన్, ఆర్బిట్కో.ఇన్ లాంటి ఎక్స్చేంజీలున్నా... ఇటీవల ఆర్బీఐ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు అహ్మదాబాద్‌లోని బెసైల్బిట్.కో.ఇన్ నిర్వహించే ట్రేడర్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దాడులు నిర్వహించింది. ఈ వెబ్సైట్ ద్వారా సుమారు 400 మంది కోట్ల విలువ చేసే వెయ్యికి పైగా లావాదేవీలు చేశారని తేలింది. ఈ పరిణామాలతో దేశీయంగా పలు ఎక్స్చేంజీలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశాయి. సెక్యూరిటీ లేకుంటే ఎలా...? ఇది అన్నిటికన్నా ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఈ నెల 2న కెనడాలోని అల్బెర్టాలో ఉన్న ఫ్లెక్స్కాయిన్ బ్యాంక్‌పై హ్యాకర్లు దాడిచేశారు. దాని హాట్ వాలెట్లోని దాదాపు 7లక్షల డాలర్ల విలువచేసే బిట్కాయిన్లను దోచేశారు. దీంతో ఆ బ్యాంకు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపేసింది. అంతకు నాలుగురోజుల కిందటే... జపాన్‌కు చెందిన మౌంట్ గాక్స్ ఎక్స్ఛేంజీ... తన వాలెట్ నుంచి హ్యాకర్లు ఏకంగా 480 మిలియన్ డాలర్ల విలువ చేసే బిట్కాయిన్లను దోచేశారని పేర్కొంటూ బిట్‌కాయిన్ అభిమానుల కలలు చెదరగొట్టింది. అందుకని తమకు దివాలా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. బిట్కాయిన్ల విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఆన్లైన్ భద్రతే. యూజర్లంతా కలిసి లావాదేవీల్ని పర్యవేక్షిస్తూ ఉంటారని, ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఎన్ని బిట్‌కాయిన్లున్నాయో అప్డేట్ అవుతుంటుందని చెప్పే వ్యవస్థ... హ్యాకర్లను గుర్తించకపోతే ఇక నమ్మేదెలా? ఎవరు నమ్ముతారు ఇలాంటి కరెన్సీని...? - మంథా రమణమూర్తి ఏటీఎంలూ ఉన్నాయి... బిట్కాయిన్లు తీసుకోవాలంటే ఎక్స్చేంజీలకు ప్రత్యామ్నాయంగా మరో మార్గం కూడా ఉంది. ఆన్లైన్ ఫోరంలలో బిట్కాయిన్లను అమ్మదల్చుకున్నవారు తారసపడితే వారిని స్వయంగా కలిసి, నగదు అందజేసి, స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా బిట్కాయిన్లను మన డిజిటల్ వాలెట్లలోకి బదిలీ చేసుకోవచ్చు. ఇలాంటి లావాదేవీలు, ఎక్స్చేంజీలు వంటి బాదరబందీ లేకుండా... కెనడా వంటి దేశాల్లో రోబోకాయిన్ కియోస్క్‌ల పేరిట ఏకంగా బిట్కాయిన్ల ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏటీఎంలలో నగదును ఇన్సర్ట్ చేసి, స్మార్ట్‌ఫోన్‌తో నిర్దిష్ట కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు! తత్సమానమైన బిట్కాయిన్లు మన వాలెట్‌లోకి వచ్చి చేరతాయి. ఈ ఏటీఎంలలో మన దగ్గరుండే బిట్కాయిన్లను నగదుగా కూడా మార్చుకోవచ్చు.