వచ్చే ఏడాది ప్రారంభం నాటికి దేశంలో అధికారిక డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెస్తామంటూ కేంద్ర అధికారిక వర్గాలు సైతం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తన బడ్జెట్ ప్రసంగంలో డిజిటల్ కరెన్సీపై ఓ స్పష్టత నిచ్చారు. త్వరలో దేశంలో డిజిటల్ రూపాయిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ తరహాలో ఈ డిజిటల్ కరెన్సీ పనిచేస్తుండగా.. సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం హామీ ఇవ్వడంపై మరింత ఆసక్తి నెలకొంది.
కానీ ఇదే డిజిటల్ కరెన్సీ వ్యవహారంలో ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది.ఆర్‌బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు.
హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు.
Comments
Please login to add a commentAdd a comment