
రానున్న నెలల్లో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నరే స్వయంగా తెలిపారు. ఇప్పటికే పెరిగిపోయిన పలు ధరలపై ఆహార ధరల షాక్‌ల ప్రభావం రెండో రౌండ్‌లోనూ ఉంటే ఆర్బీఐ కీలక రేట్లను పెంచాల్సి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హింట్ ఇచ్చారు.
ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముఖ్యాంశాలపై ఆయన మాట్లాడుతూ.. "విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచే ప్రమాదాలపై ఆహార ధరల షాక్‌ల రెండో రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆగస్టు 8 నుంచి 10 మధ్య జరిగిన ఎంపీసీ సమావేశంలో ఈ సంవత్సరం మూడవసారి కూడా రేట్లను యథాతథంగా ఉంచేందకు ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసింది" అన్నారు.
అయితే పాలసీ రేటు యథాతథ కొనసాగింపుపై ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. కూరగాయల ధరల స్వల్పకాలిక స్వభావాన్ని బట్టి, ప్రధాన ద్రవ్యోల్బణంపై ధరల మొదటి రౌండ్ ప్రభావాన్ని బట్టి ద్రవ్య విధానం ఉంటుందన్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితంగా కొనసాగుతోందని, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉందని చెప్పారు. వీటన్నింటి మధ్య, భారతదేశం స్థిరంగా నిలుస్తూ ప్రపంచంలో కొత్త గ్రోత్ ఇంజిన్‌గా ఎదుగుతోందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ప్రస్తుత అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఇతర కమిటీ సభ్యులు కూడా అంగీకరించారు. ఈ ఆహార ధరల పరిణామాల వల్ల గృహాల ద్రవ్యోల్బణ భావనలు ప్రభావితమైనట్లు తమ సర్వేలు సూచిస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత..
Comments
Please login to add a commentAdd a comment