Central Bank
-
ఫెడ్ వడ్డీ కోత పసిడికి బూస్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. నాలుగేళ్ల తదుపరి బుధవారం 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. అయితే చౌకగా లభించనున్న ఫైనాన్సింగ్ భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెద్దగా కలసిరాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విదేశీ నిధులు బంగారం ధరలకు దన్నునిచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. మిశ్రమ అంచనాలు సుమారు 14 నెలలపాటు రెండు దశాబ్దాల గరిష్టం వద్ద కొనసాగిన ఫెడ్ ఫండ్స్ రేట్లు దిగివస్తున్నాయి. తాజాగా రేట్ల తగ్గింపు టర్న్ తీసుకున్న ఫెడ్ ఈ ఏడాది చివరి(డిసెంబర్)కల్లా మరో 0.5 శాతం కోత పెట్టనున్నట్లు అంచనా. అయితే ఫెడ్ రేట్ల తగ్గింపుతో ఈక్విటీలపై రాబడి క్షీణించనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు బలపడే వీలున్నట్లు పేర్కొన్నారు. కామా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సమీపకాలంలో పసిడి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరవచ్చని తెలియజేశారు. యూఎస్ రేట్ల కోత బంగారంలో పెట్టుబడులకు దారిచూపుతుందని అభిప్రాయపడ్డారు. రేట్ల కోతకు దారి... ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు బిజ్2క్రెడిట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా పేర్కొన్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు అంచనా వేశారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేశారు. వెరసి ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న విషయం విదితమే.అయితే ప్రపంచ దేశాల వడ్డీ రేట్ల ప్రభావం భారత్‌పై ఉండదని ఇండియాబాండ్స్.కామ్ సహవ్యవస్థాపకుడు విశాల్ గోయెంకా పేర్కొన్నారు. రిస్క్ ఆస్తులలో భారీ ర్యాలీ, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణ ప్రభావాల కారణంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపునకు చాన్స్ తక్కువేనని తెలియజేశారు. అంచనాలకు మించి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎడిల్వీజ్ ఎంఎఫ్ ఈక్విటీస్ సీఐవో త్రిదీప్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.భారత్‌పై ప్రభావం అంతంతే..మార్కెట్‌వర్గాలు ఇప్పటికే చాలా మటుకు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను పరిగణనలోకి తీసుకున్నందున దీని ప్రభావం భారత్‌పై పెద్దగా ఉందు. దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, మొత్తం మీద రేట్ల తగ్గింపనేది వర్ధమాన మార్కెట్లకు మాత్రం సానుకూలమే. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
50 శాతం వడ్డీ ఉన్న దేశం (ఫొటోలు)
-
రేటు తగ్గించి.. వృద్ధికి ఊతమివాల్సిన సమయం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యం 4 శాతానికి చేరుకోవడంతో ఇక సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానం.. వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ స్పష్టం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికన్నా (4 శాతం) అరశాతమే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ ఎంపీసీ వెలువరిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇక పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏదీ లేదన్నారు. ‘‘తట్టుకోలేని అధిక ద్రవ్యోల్బణం సమస్య ముగుస్తోంది. రాబోయే కొద్ది త్రైమాసికాలలో మనం ద్రవ్యోల్బణం మరింత తగ్గుదలను చూస్తాము. ద్రవ్యోల్బణం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం లక్ష్యాన్ని చేరుకుంటుంది’’ అని ఆయన అన్నారు. దీర్ఘకాలం వడ్డీరేటు అధికస్థాయిలో ఉండడం ఆర్ధికవృద్ధికి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలోనూ ఇదే మాట... ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. కాగా, వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు ఆషిమా గోయల్‌తో పాటు జయంత్ వర్మ కూడా వీరిలో ఉండడం గమనార్హం. రెపో రేటును తగ్గించి వృద్ధి ఊతానికి తగిన నిర్ణయం తీసుకోవాలని జయంత్ వర్మ పాలసీ సమీక్షాలో ఓటువేశారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిస్కులను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీసీ సభ్యులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం, అహ్మదాబాద్) ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ ఒక ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. → 2023–24లో భారత్ వృద్ధి 8.2 శాతం. 2024–25లో అంతకన్నా 0.75 శాతం నుంచి 1 శాతం వరకూ వృద్ధి స్పీడ్ తగ్గవచ్చు. భారత్‌కు 8 శాతం వృద్ధి సాధన సామర్థ్యం ఉంది. అధిక వడ్డీరేటు వ్యవస్థ వృద్ధి స్పీడ్‌కు అడ్డంకు కాకూడదు. → ఆర్థిక వృద్ధి రేటును 8 శాతానికి పెంచేందుకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం డిజిటలైజేషన్, పన్ను సంస్కరణలు, అధిక మౌలిక సదుపాయాల పెట్టుబడులతో సహా అనేక విధానపరమైన చర్యలను చేపట్టింది.ద్రవ్యోల్బణ లక్ష్యం ఇదీ.. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. సగటుకన్నా ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. -
బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ డిపాజిట్లు రూ.78,213 కోట్లు
బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ డిపాజిట్ల విలువ 2024 మార్చితో గడచిన ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరింది. ఖాతాదారులు లేదా వారసుల కోసం ఒకవైపు ప్రయతి్నస్తూనే... మరోవైపు ఇలా ఎవ్వరూ క్లైమ్ చేయకుండా మిగిలిపోయిన మొత్తాలను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్‌లో (డీఈఏ) బదలాయించడం జరుగుతుంది. ఈ ఫండ్ ఇలాంటి నిధుల మొత్తం 2023 మార్చి నాటికి రూ.62,225 కోట్లు ఉంది. బ్యాంకులు 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా తమ ఖాతాలలో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ పర్యవేక్షణలోని డీఈఏకు బదలాయిస్తాయి. ⇒ భారత్ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని సమతౌల్యం చేసే సానుకూల పరిస్థితులూ ఉన్నాయి. 2022–23లో ఎకానమీ 7 శాతం పురోగమిస్తే, 2023–24లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదుకానుంది. 2024–25లో వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యే వీలుంది. తద్వారా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ తన హోదాను కొనసాగించనుంది. ⇒ ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 2024 మార్చి 31 నాటికి 11.08 శాతం వృద్ధితో రూ.70.48 లక్షల కోట్లకు చేరింది (దాదాపు 845 బిలియన్ డాలర్లు). పాకిస్తాన్ జీడీపీ 340 బిలియన్ డాలర్లకంటే ఇది 2.5 రెట్లు అధికం. ⇒ అంతర్జాతీయంగా దేశీయ కరెన్సీ రూపీని మరింత చలామణీలోకి తేవడంలో భాగంగా భారత్ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు (పీఆర్‌వోఐ) విదేశాల్లోనూ రూపీ అకౌంట్లను తెరిచేందుకు అనుమతి.⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ భారీగా పెరిగి రూ.27,031 కోట్లకు చేరింది. పరిమాణంలో ఈ విలువ 44.34 టన్నులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2022–23లో ఈ విలువ, పరిమాణం వరుసగా రూ.6,551 కోట్లు, 12.26 టన్నులుగా ఉంది. 2015లో ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 67 విడతల్లో విక్రయాలు జరిగాయి. రూ.72,274 కోట్లు సమకూరగా, పరిమాణంలో 146.96 టన్నులకు ఈ విలువ ప్రాతినిధ్యం వహిస్తోంది. ⇒ బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా 13,564 నుంచి 36,075కు ఎగసింది. అయితే మోసాలకు సంబంధించిన విలువ మాత్రం 46.7 శాతం పడిపోయి రూ.13,930కోట్లకి చేరింది. -
ఎస్బీఐపై దక్షిణాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ చర్యలు
దక్షిణాఫ్రికాలోని ఎస్బీఐ శాఖపై ఆ దేశ కేంద్ర బ్యాంక్ ప్రుడెన్షియల్ అథారిటీ చర్యలు చేపట్టింది. తమ దేశ మనీలాండరింగ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించినందుకు ఎస్బీఐపై పరిపాలనాపరమైన ఆంక్షలు, జరిమానా విధించింది.సౌత్ ఆఫ్రికా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టంలోని కొన్ని నిబంధనలను పాటించనందుకు గానూ తమపై 10 మిలియన్ ర్యాండ్ (రూ.4.5 కోట్లు) జరిమానా విధించినట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన ఒక ప్రకటనలో ఎస్బీఐ తెలిపింది.దక్షిణాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ తమపై విధించిన జరిమానాలో 5.5 మిలియన్ ర్యాండ్లు (రూ.2.5 కోట్లు) వెంటనే చెల్లించాల్సి ఉండగా మరో 4.5 మిలియన్ ర్యాండ్లు (రూ.2 కోట్లు) 36 నెలల్లో చెల్లించేందుకు వీలుందని ఎఎస్ఐ తెలిపింది. వీటిలో 5.5 మిలియన్ ర్యాండ్ల జరిమానాను ఎస్బీఐ చెల్లించింది. 4.5 మిలియన్ ర్యాండ్ల మొత్తాన్ని నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని బ్యాంక్ పేర్కొంది. -
ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం
Israel-Hamas war: ఇజ్రాయెల్, గాజా మధ్య నెలకొన్న యుద్ధం, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో గరిష్టంగా 30 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీని విక్రయించే ప్రణాళికలను (సోమవారం, అక్టోబర్ 9) ప్రకటించింది. దీంతో ఆ దేశ కరెన్సీ షెకెల్ భారీ నష్టాలనుంచి కోలుకుంది. గాజాలో పాలస్తీనా తీవ్రవాదులతో ఇజ్రాయెల్ పోరు నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. SWAP మెకానిజమ్ ద్వారా లిక్విడిటీని అందించేలా కృషి చేయనుంది. అలాగే మారకపు రేటులో అస్థిరత, మార్కెట్ల సాఫీగా కార్యకలాపాలకు అవసరమైన ద్రవ్యతను నిర్ధారించడానికి రాబోయే కాలంలో మార్కెట్లో జోక్యం చేసుకుంటామని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) కరెన్సీ కష్టాలు ప్రకటనకు ముందు, షెకెల్ 2 శాతానికి పైగా క్షీణించింది. డాలర్ మారకంలో 3.92 వద్ద 7-1/2 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న షెకెల్ 2023లో యునైటెడ్ స్టేట్స్ కరెన్సీకి వ్యతిరేకంగా 10 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ క్షీణతకు ప్రధానంగా ప్రభుత్వ న్యాయపరమైన సమగ్ర ప్రణాళిక కారణంగా చెబుతున్నారు. ఇది విదేశీ పెట్టుబడులను గణనీయంగా పరిమితం చేసిందని రాయిటర్స్ తెలిపింది. (హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్) వ్యూహాత్మక ఎత్తుగడలు ముఖ్యంగా దేశంలోని టెక్ రంగానికి విదేశీ ప్రవాహాల పెరుగుదల మధ్య.200 బిలియన్ డాలర్లకు మించిన ఫారెక్స్ నిల్వలు పేరుకుపోవడంతో, ఇజ్రాయెల్ 2008 నుండి ఫారెక్స్ కొనుగోళ్ల ద్వారా గణనీయమైన మొత్తాన్ని సంపాదించింది. ఎగుమతిదారులను రక్షించేలా ఈ ప్రణాలికలని బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ గవర్నర్ అమీర్ యారోన్ రాయిటర్స్‌కు తెలియజేసారు. కాగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడి, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వరుస వైమానిక దాడులు అక్కడి ప్రజులకు అతలాకుతలం చేస్తున్నాయి. 3వ రోజుకి ఈ భీకర పోరులో ఇప్పటికే ఇరువైపులా వేలాది మంది పౌరులు, ఉగ్రవాదులు చనిపోయిన సంగతి తెలిసిందే. -
రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన
రష్యా సెంట్రల్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ కరెన్సీ రూబుల్ కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను భారీగా పెంచేసింది. 12 శాతం లేదా 350 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపును మంగళవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దేశం కరెన్సీ విలువ దిగజారిపోవడం, ద్రవ్యోల్బణంపై పోరులో భాగంగా అత్యవసర చర్యకు ఉపక్రమించింది. తద్వారా రూబుల్‌ను బలోపేతం చేయాలని భావిస్తోంది. యుద్ధం , ఆంక్షలు పరిష్కారం కానంతవరకు గతంలో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను ఏకంగా 12 శాతానికి పెంచుతున్నట్లు రష్యా సెంట్రల్ బ్యాంక్ మంగళవారం వెల్లడించింది.రష్యన్ కరెన్సీ సోమవారం డాలర్‌తో పోలిస్తే రూబుల్ 102 మార్కు వద్ద 16 నెలల కనిష్టానికి చేరడంతో ఈ కఠిన చర్యలకుది గింది. సంవత్సరం ప్రారంభం నుండి దాని విలువలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కోల్పోయింది .దాదాపు 17 నెలల్లో కనిష్ట స్థాయిని తాకింది. గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం 7.6 శాతానికి చేరుకుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని, ఇది రూబుల్ పతనం ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేస్తూ, గత నెలలో 1 శాతం మేర వడ్డీరేటును పెంచింది. వడ్డీ రేట్లపై దాని తదుపరి సమావేశం సెప్టెంబర్ 15న జరగనుంది.ఒక్కసారిగా కీలక వడ్డీ రేట్లను 350 బేసిస్ పాయింట్లు పెంచటంపై ప్రపంచ ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. లండన్‌లోని బ్లూబే అసెట్ మేనేజ్మెంట్లో సీనియర్ ఎమర్జింగ్ మార్కెట్ల సావరిన్ స్ట్రాటజీ తిమోతీ యాష్ స్పందన: యుద్ధం కొనసాగుతున్నంత కాలం రష్యా, రష్యా ఆర్థిక వ్యవస్థ, రూబుల్‌కు మరింత దిగజారుతుంది. హైకింగ్ పాలసీ రేట్లు దేనినీ పరిష్కరించని వ్యాఖ్యానించారు. రూబుల్ తరుగుదల వేగాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు కానీ ప్రధాన సమస్య అయిన యుద్ధం , ఆంక్షలు పరిష్కరించుకోవాలన్నారు. లండన్‌లోని ఈక్విటీ క్యాపిటల్‌లో చీఫ మాక్రో ఎకనామిస్ట్ స్టువర్ట్ కోల్ ఏమన్నారంటే..రూబుల్ విలువ పతనానికి ఇది అత్యవసర ప్రతిస్పందన.కరెన్సీ పతనం ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉంది.ఇది ఉక్రెయిన్ దాడి ఖర్చుల గురించి రష్యన్ ప్రజలకు పంపే సంకేతమన్నారు. యుద్ధం కారణంగా సైనిక వ్యయం పెరిగిపోవడం, రష్యా వాణిజ్య సమతుల్యతపై పాశ్చాత్య ఆంక్షల ప్రభావం, ద్రవ్యోల్బణం లాంటి కారణాలతో రష్యా కేంద్ర బ్యాంకు రేటు పెంపు నిర్ణయం తాత్కాలిక పరిష్కారమే. రూబుల్ పతనం, ఇంధన ధరలు, ఎగుమతి ఆదాయాలు క్షీణించడంతో పాటు వస్తువుల దిగుమతులు వేగంగా పుంజుకోవడం వల్ల కరెంట్ ఖాతా మిగులు బాగా తగ్గిపోయిందని ఆర్థిక వేత్తలంటున్నారు. అంతేకాదు తాజా రేట్ల పెంపు ఇండియా చెల్లింపులను కూడా ప్రభావితం చేయవచ్చని అంచనా. ఈ ప్రభావం ఆసియా స్టాక్‌మార్కెట్లతోపాటు, భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపి నష్టాలకు దారితీయెుచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత, రూబుల్ డాలర్‌తో పోలిస్తే 130కి పడిపోయింది, అయితే సెంట్రల్ బ్యాంక్ దాని కీలక వడ్డీ రేటును 20శాతం వరకు పెంచి మూలధన నియంత్రణలను అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత నెలరోజుల్లో రేట్లను తగ్గించి కరెన్సీ విలువను స్థిరీకరించే ప్రయత్నాలు చేసింది. -
సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు
ముంబై: అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించినట్లు వివరించింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రబి శంకర్ ఇటీవలే వెల్లడించారు. -
ఫెడ్ 0.25 శాతం వడ్డీ పెంపు
న్యూయార్క్: అంచనాలకు అనుగుణంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4.75–5 శాతానికి చేరింది. నిజానికి కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణ అదుపునకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఫెడ్.. వడ్డీ రేట్లను వేగంగా పెంచుతూ వస్తోంది. దీంతో 2022 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి1 వరకూ దశలవారీగా 4.5 శాతం వడ్డీ రేటును పెంచింది. వెరసి 2022 ఫిబ్రవరిలో 0–0.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేటు తాజాగా 5 శాతానికి ఎగసింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అంచనాలను మించి వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. b v అయితే కొద్ది రోజులుగా అమెరికా, యూరప్ బ్యాంకింగ్ రంగాలలో సంక్షోభ పరిస్థితులు తలెత్తడంతో ఫెడ్ పాలసీ సమీక్షకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్‌లో సిల్వర్‌గేట్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ ఇప్పటికే విఫలంకాగా.. ప్రస్తుతం ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు సంక్షోభంలో ఉంది. మరోవైపు క్రెడిట్ స్వీస్ దివాలా స్థితికి చేరడంతో యూరప్ బ్యాంకింగ్ రంగంలోనూ ప్రకంపనలు పుడుతున్నాయి. స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు వేగానికి బ్రేక్ పడనున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. -
క్రెడిట్ సూసీకి ‘స్విస్ బ్యాంక్’ భరోసా
న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రెడిట్ సూసీకి స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు అండగా నిల్చింది. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకుపై ఇన్వెస్టర్లు, డిపాజిటర్లలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు, దానిపై నమ్మకాన్ని కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 54 బిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందించేందుకు అంగీకరించింది. క్రెడిట్ సూసీ గురువారం ఈ విషయం వెల్లడించింది. దీంతో బ్యాంకు షేరు ఒక దశలో ఏకంగా 33% ఎగిసి 2.17 స్విస్ ఫ్రాంకులకు (1 స్విస్ ఫ్రాంకు సుమారు రూ. 89) పెరిగింది. అటు యూరప్ బ్యాంకింగ్ షేర్లు కూడా ఒక మోస్తరుగా పెరిగాయి. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఇన్వెస్టరు నిరాకరించారన్న వార్తలతో క్రెడిట్ సూసీ షేరు బుధవారం 30% కుప్పకూలిన సంగతి తెలిసిందే. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటం, క్రెడిట్ సూసీ ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు కమ్ముకోవడం తదితర పరిణామాలతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం ముంచుకొస్తోందన్న ఆందోళన నెలకొంది. అయితే, ఈ భయాలను తొలగించేందుకు, అంతర్జాతీయంగా కీలక బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న క్రెడిట్ సూసీని నిలబెట్టేందుకు స్విస్ నేషనల్ బ్యాంక్ రంగంలోకి దిగింది. మూలధనం, లిక్విడిటీపరమైన నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ సూసీ ఉంటే బ్యాంక్‌కు అవసరమైన తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. -
భారత్-యూఏఈ ఆర్థిక బంధం మరింత పటిష్టం!
ముంబై: భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)ల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఈ దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యునైటెడ్ అరబ్ ఎమిరైట్స (యూఏఈ) సెంట్రల్ బ్యాంక్ బుధవారం ఒక పరస్పర అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (సీబీడీసీ) పరస్పర నిర్వహణా (ఇంటర్‌ఆపరేబిలిటీ) విధానాలను అన్వేషిణ సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించ డానికి ఈ ఒప్పందం దోహపడనుంది. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు) ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి రెండు సెంట్రల్ బ్యాంకుల మధ్య పరస్పర సహకారం పెరగనుంది. సీబీడీసీకి సంబంధించి పురోగమించే సహకారం-రెమిటెన్సులు,వాణిజ్యం వివిధ విభాగాల్లో రెండు దేశాల ప్రజలు, సంబంధిత వర్గాల సౌలభ్యతను ఈ ఒప్పందం మరింత మెరుగు పరుస్తుందని అంచనా. ఆర్థికరంగంలో వ్యయ నియంత్రణకు, సామర్థ్యం పెంపుకు దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రతిష్టాత్మక యూపీఐ వ్యవస్థ అందుబాటులో ఉన్న దేశాల్లో యూఏఈ కూడా ఉండడం గమనార్హం. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు ఉన్నాయి. -
ఆస్ట్రేలియా కరెన్సీపై బ్రిటిష్ రాజరికం కనుమరుగు
కాన్బెర్రా: ఆస్ట్రేలియా మరో బ్రిటిష్ వలసపాలన తాలూకు గుర్తును చెరిపేసుకుంటోంది. అక్కడి 5 ఆస్ట్రేలియా డాలర్ల కరెన్సీ నోటుపై ఇన్నాళ్లూ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ముఖచిత్రాన్ని ముద్రించారు. రాణి ఎలిజబెత్ అస్తమయం తర్వాత రాజుగా పగ్గాలు చేపట్టిన కింగ్ ఛార్లెస్ ముఖచిత్రాన్ని 5 డాలర్ల కరెన్సీ నోటుపై ముద్రించాలని భావించట్లేదని ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్ తాజాగా ప్రకటించింది. అయితే, ఛార్లెస్ ఫొటో ఉండే కొత్త నాణేలను మాత్రం ఈ ఏడాది చివరిలోపు చలామణిలోకి తీసుకురానున్నారు. ఇన్నాళ్లూ ఒక్క 5 డాలర్ల నోటుపైనే బ్రిటిష్ రాజరిక ఆనవాళ్లు ఉండేవి. ఎలిజబెత్ ఫొటో తొలగింపుతో నోట్లపై నామరూపాలు పోయినట్లే. ఈ మార్పుపై ప్రభుత్వంతో చర్చించాకే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ రాజరికమే అత్యున్నత పరిపాలన హోదాలో ఉంది. కానీ మారిన వర్తమాన రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఆ రాజరికం కేవలం అలంకారప్రాయంగా తయారైంది. ‘కొత్త నోటుకు ఒకవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్, మరో వైపు ఆస్ట్రేలియా తొలితరం స్థానికుల లేదా దేశ అద్భుత ప్రకృతి అందాల ఫొటోను పొందుపరుస్తాం’ అని ఆర్థిక మంత్రి జిమ్ చామర్స్ అన్నారు. కరెన్సీపై రాజరికాన్ని వదలుకోవడంపై అక్కడి రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గణతంత్రదేశంగా ఆవిర్భవించే ప్రయత్నం చేస్తోందని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు. -
డిజిటల్ రూపీ ప్రారంభం చరిత్రాత్మక మైలురాయి
న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి ప్రారంభం ఒక చరిత్రాత్మక మైలురాయి అని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. దీనివల్ల కరెన్సీ వ్యవస్థ సామర్థ్య మరింత పెరుగుతుందని, ఆర్థిక సేవలు భారీగా విస్తరిస్తాయని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ట్రాకర్ ప్రకారం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 95 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించే తుది దశలో ఉండగా, 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా ప్రారంభించాయని పేర్కొన్నారు. పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసే విధానంలో వినూత్నతను తీసుకువస్తుంది. అంతర్జాతీయ స్థాయి చెల్లింపుల్లో సైతం పూర్తి సులభతరమైన వెసులుబాటును కల్పిస్తుంది. ► సీబీడీసీ వినియోగదారుల ఆర్థిక పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, హానికరమైన సామాజిక– ఆర్థిక పరిణామాలను నివారిస్తుంది. ప్రజలకు అవసరమైన తగిన సేవలు అందించడంలో దోహదపడుతుంది. ► ఆర్బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.. సీబీడీసీ–డబ్ల్యూ, అలాగే సీబీడీసీ–ఆర్‌లను భారత వ్యవస్థలో పైలట్ ప్రాతిపదికన ఆవిష్కరించింది. సీబీడీసీ–డబ్ల్యూ టోకు లావాదేవీలను సీబీడీసీ–ఆర్ రిటైల్ లావాదేవీలను సూచిస్తాయి. ► డిజిటల్ కరెన్సీ– యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరిస్తూ, భౌతిక కరెన్సీ తరహాలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ నిర్వహణాలో ఉంటుంది. ఇక యూపీఐ చెల్లింపు సాధనం తద్వారా జరిగే లావాదేవీ సంబంధిత బ్యాంకు బాధ్యతకు సంబంధించినది అని చెప్పారు. -
ఆరోసారి ఫెడ్ వడ్డీ పెంపు
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్ల పెంపును చేపట్టింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ఎజెండాగా వరుసగా ఆరోసారి ఫండ్స్ రేట్లను పెంచింది. తాజాగా 0.75 పెంపును ప్రకటించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి చేరాయి. దీంతో వరుసగా నాలుగోసారి 0.75 శాతం చొప్పున రేట్లను పెంచినట్లయ్యింది. ఈ ఏడాది(2022) ఇప్పటివరకూ ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను 3.75 శాతం హెచ్చించింది. ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలోలేని విధంగా 8 శాతాన్ని అధిగమించడంతో ఫెడ్ ధరల కట్టడికి అత్యంత కీలకమైన వడ్డీ రేట్ల పెంపు మార్గాన్ని ఎంచుకుంది. తాజాగా సెప్టెంబర్‌లోనూ వినియోగ ధరల ఇండెక్స్ 8.2 శాతాన్ని తాకింది. -
ఫెడ్ భారీ ‘వడ్డిం‘పు
న్యూయార్క్: ధరల అదుపే లక్ష్యంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3–3.25 శాతానికి ఎగశాయి. వెరసి వరుసగా మూడోసారి రేట్లను పెంచింది. గత నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణ కట్టడికే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ప్రాధాన్యత ఇచ్చినట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కాగా.. కరోనా మహమ్మారి కాలంలో 9 ట్రిలియన్ డాలర్లకు చేరిన బ్యాలెన్స్‌షీట్‌ను తగ్గించేందుకు ఫెడ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు జూన్ నుంచి నెలకు 95 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను రోలాఫ్ చేయడం ద్వారా లిక్విడిటీలో కోత పెడుతోంది. ఈ నేపథ్యంలో డాలరు ఇండెక్స్ 110ను అధిగమించగా.. ట్రెజరీ ఈల్డ్స్ 3.56 శాతాన్ని తాకాయి. అయితే 2022 జనవరి–మార్చిలో 1.6 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ ఏప్రిల్–జూన్‌లోనూ 0.6 శాతం నీరసించింది. దీంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఆర్బీఐ ‘నిఘా నేత్రం’ నుంచి బయటపడ్డ సెంట్రల్ బ్యాంక్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏఎఫ్) నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయటపడింది. పలు ప్రమాణాలు మెరుగుపడటం, మూలధన నిర్వహణకు సంబంధించి నిబంధనలు పటిష్టంగా పాటిస్తామన్న లిఖితపూర్వక హామీ నేపథ్యంలో పీసీఏఎఫ్ జాబితా నుంచి బ్యాంకును తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు -
ఎకానమీ పురోగతే ఆర్బీఐ చర్యల లక్ష్యం
ముంబై: రేట్ల పెంపు ద్వారా కఠిన విధానంవైపు మొగ్గుచూపి, వృద్ధి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెనుకడుగు వేసిందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి తీసుకునే చర్యలు ఎకానమీ పురోగతికి ప్రతికూలం అని భావించడం తగదని ఆయన స్పష్టం చేశారు. ఎకానమీ పురోగతి– ద్రవ్యోల్బణం కట్టడి సమతౌల్యతకు ప్రభుత్వంతో కలిసి సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా మే, జూన్ నెలల్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 0.4 శాతం, 0.5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరింది. అయితే దీనిపై పలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యం ఇటీవల ఒక వ్యాసంలో ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఆర్బీఐ ఆలస్యంగా వ్యవహరించిందని, చివరకు పాలసీలో మార్పుచేసి వృద్ధి విషయంలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్బీఐపై వస్తున్న విమర్శలను పరోక్షంగా ప్రస్తావించారు. మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాం... అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ వ్యవహరించిందని అన్నారు. విధానం మార్పునకు తగిన కాల వ్యవధిని అనుసరించిందని స్పష్టం చేశారు. ‘‘మహమ్మారి సమయంలో అధిక ద్రవ్యోల్బణాన్ని సహించడం చాలా అవసరం. అప్పటి క్లిష్ట సమయంలో రేట్ల పెంపు ఎంతమాత్రం సమంజసం కాదు. ఆ విధానం పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉంటాయి. మేము ఇప్పటికీ మేము అప్పటి మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము’’ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, లోన్ రికవరీ ఏజెంట్ల విపరీత చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన ఈ సందర్భగా హెచ్చరించారు. ఫైనాన్షియల్ రంగంలోకి గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ (మెటా) వంటి బడా సంస్థల ప్రవేశం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయని కూడా కార్యక్రమంలో గవర్నర్ పేర్కొన్నారు. -
ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్‌లో ఎన్నారైకి కీలక పదవి
లండన్: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో (ఎంపీసీ) ఎక్స్‌టర్నర్ సభ్యురాలుగా ప్రముఖ విద్యావేత్త, భారతీయ సంతతి మహిళ డాక్టర్ స్వాతి ధింగ్రా నియమితులయ్యారు.ఈ కీలక బాధ్యతల్లో భారతీయ సంతతి మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అప్లైడ్ మైక్రోఎకనామిక్స్‌లో స్పెషలైజేషన్ ఉన్న ధింగ్రా ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఈ)లో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో స్వాతి ధింగ్రా విద్యను అభ్యసించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మాస్టర్స్ పట్టా పొందారు. యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్–మాడిసన్ నుండి ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. బ్రిటన్ ట్రేడ్ మోడలింగ్ రివ్యూ ఎక్స్పర్ట్ ప్యానెల్లో సభ్యురాలిగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 9న ఆమె ఎంపీసీలో చేరి, మూడేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహి స్తారు. 2016 ఆగస్టు నుంచి ఎంపీసీ సభ్యునిగా పనిచేస్తున్న మైఖేల్ సాండ్రూస్ స్థానంలో ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎంపీసీలో గవర్నర్‌తోపాటు, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. బ్యాంకులో ఒక సీనియర్ ఆధికారితోపాటు, నలుగురు బయటి స్వ తంత్రులు సభ్యులుగా ఉంటారు. వీరిని బ్రిటన్ ఆర్థికమంత్రి నియమిస్తారు. చదవండి: Elon Musk - Twitter Deal: ట్విటర్‌కి బ్రేకప్ చెప్పిన ఈలాన్ మస్క్? -
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. భారీగా వడ్డీరేట్ల పెంపు
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్న శ్రీలంక ప్రభుత్వం ఉన్న కొద్ది పాటి ఆర్థిక నిల్వలను కాపాడుకునే పనిలో పడింది. అందులో భాగంగా వడ్డీరేట్లను భారీగా పెంచుతూ శ్రీలంక సెంట్రల్ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఉన్నపళంగా వడ్డీరేట్లను దాదాపు రెట్టింపు చేసింది. గత ఆర్నెళ్లుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. తిండి గింజలతో మొదలైన సమస్య పవర్, పెట్రోల్ కొరతల వరకు పాకింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో బ్యాంకుల్లో నిల్వ ఉన్న కొద్ది పాటీ మొత్తాలు అడుగంటి పోతున్నాయి. మరోవైపు డాలరుతో శ్రీలంక రూపాయి మారకం విలువ నెల రోజుల వ్యవధిలో 32 శాతం క్షీణించింది. దీంతో ఆర్థిక వ్యవస్థకు కొద్దిగా అయినా బూస్ట్ ఇచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను రెట్టింపు చేసింది. దీని ప్రకారం స్టాండింగ్ లెండింగ్ రేటు 14.5 శాతానికి చేరుకోగా స్టాండింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 13.5 శాతానికి చేరుకుంది. శ్రీలంకలో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. 2022 మార్చిలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం 18.7 శాతానికి చేరుకుంది. విదేశాల నుంచి నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకునేందుకు ఆ దేశం దగ్గర డాలర్ల నిల్వలు లేని పరిస్థితి నెలకొంది. The Central Bank of Sri Lanka Significantly Tightens its Monetary Policy Stance to Stabilise the Economy SDFR - 13.50% SLFR - 14.50% For more details - https://t.co/WuCePp1dIA#SriLanka #CBSL #MonetaryPolicy pic.twitter.com/HquLxaaxL6 — CBSL (@CBSL) April 8, 2022 చదవండి: సంక్షోభంతో బెంబేలెత్తిన ఇన్వెస్టర్లు.. ఆకస్మాత్తుగా కొలంబో మార్కెట్ క్లోజ్ -
డిజిటల్ కరెన్సీపై ఆచితూచి నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రిస్కీ సాధనాలైన క్రిప్టోకరెన్సీలను కట్టడి చేసే విధంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటివరకూ అధికారికంగా ఎక్కడా డిజిటల్ కరెన్సీ వినియోగంలో లేనందున దాని ప్రభావాలను ముందుగా అంచనా వేయగలిగే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర సెంట్రల్ బ్యాంకులు కూడా దీని విషయంలో క్రమానుగతంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీబీడీసీలతో ఒనగూరే ప్రయోజనాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల డిమాండ్‌పై, తత్ఫలితంగా రుణ వితరణ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని శంకర్ అభిప్రాయపడ్డారు. -
ఆర్బీఐ డిజిటల్ కరెన్సీతో లావాదేవీలు వేగవంతం: డెలాయిట్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)తో లావాదేవీలు వేగవంతం అవడమే కాకుండా, వ్యయాలు ఆదా అవుతాయని డెలాయిట్ సంస్థ తెలిపింది. డిజిటల్ రూపీపై ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీని 2022–23 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చే ప్రణాళికల్లో ఆర్బీఐ ఉండడం తెలిసిందే. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు సీబీడీసీ వినూత్నమైన, పోటీతో కూడిన చెల్లింపుల వ్యవస్థ కాగలదని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఎక్కువ శాతం సెక్యూరిటీల క్లియరింగ్, సెటిల్మెంట్ ప్రక్రియకు ఎన్నో రోజులు తీసుకుంటోందని, డిజిటల్ రూపీని ప్రవేశపెడితే సామర్థ్యాలు పెరగడంతోపాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గుతాయని అంచనా వేసింది. అదే సమయలో భద్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ‘‘ఇతర డిజిటల్ సాధనాలతో పోలిస్తే సీబీడీసీలకు సావరీన్ ఆప్షన్ ఉండడం అదనపు ఆకర్షణ. అదే ఇతర డిజిటల్ సాధనాలు అంత విశ్వసనీయమైనవి కావు. స్టోర్ ఆఫ్ వ్యాల్యూ సైతం ఎక్కువ అస్థిరతలతో ఉంటుంది’’ అని ఈ నివేదిక వివరించింది. భవిష్యత్తులో నగదు వినియోగం తగ్గినప్పడు విలువ బదిలీకి ప్రత్యామ్నాయం అవుతుందని, మరిం త విస్తృతంగా వినియోగించే పేమెంట్ సైకిల్‌గా మారొచ్చని తెలిపింది. -
పురోగతి బాటలో ఎకానమీ
ముంబై: ఆర్థికమంత్రి ఈ నెల ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్, సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాలు భారత్ ఎకానమీ విస్తృత స్థాయి పురోగతికి బాటలు వేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి బులిటన్లో ప్రచురితమైన ఆర్టికల్ విశ్లేషించింది. మూడవ వేవ్‌ను సవాళ్లను అధిగమించిన భారత్‌లో ఆర్థిక రికవరీ ఇప్పటికే పటిష్టం అవుతోందని వివరించింది. అంతర్జాతీయంగా ఆర్థిక అంశాలుసహా వివిధ ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ ఎకానమీ పురోగమిస్తోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ థామ్‌తో ప్రచురితమైన ఆర్టికల్ పేర్కొంది. ఆర్టికల్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడుల పునరుద్ధరణ వల్ల 2022–23లో ప్రైవేట్ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇది ఉపాధి కల్పన, డిమాండ్‌ను బలోపేతం వంటి అంశాలకూ దోహదపడుతుంది. ► మల్టీ–మోడల్ కనెక్టివిటీ, రవాణా రంగం పురోగతి ద్వారా విస్తృత స్థాయి వృద్ధిని భారత్ సాధించగలుతుంది. ఈ లక్ష్య సాధనలో గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్రణాళిక కీలకమైనది. మౌలిక సదుపాయాల పురోగతిలో ఇది కీలకమైనది. ► ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్ నుంచి భారత్ బయట పడిన నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలలో పునరుద్ధరణ వేగంగా ఉంది. ► డిమాండ్, ఆశావాదం ప్రాతిపదికన తయారీ, సేవల రంగాల రెండూ విస్తరిస్తున్నాయి. వినియోగదారు, వ్యాపార విశ్వాసాన్ని మెరుగుపడ్డం కూడా కలిసివస్తోంది. వ్యాపారాలు తిరిగి సాధారణ స్థితికి వస్తుండడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని విశ్వసిస్తున్నాం. ► ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం సమస్యతో సతమతమవుతోంది. క్రూడ్‌సహా కమోడిటీల ధరలు పెరగడం, సరఫరాల్లో సమస్యలు దీనికి ప్రధాన కారణం. ► ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంకా తీవ్ర అనిశ్చితిలోనే కొనసాగుతున్నాయి. పలు అంశాలు ఇంకా సవాళ్లవైపే పయనిస్తున్నాయి. ► భారత్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వం నుంచి అధిక వ్యయాల ప్రణాళికలు, వ్యాపారాలను సులభతరం చేయడానికి చర్యలు సానుకూల అంశాలు. ఆయా అంశాలే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వరుసలో భారత్‌ను మొదట నిలబెడుతున్నాయి. ► ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమావేశాల్లో ద్రవ్యోల్బణం–వృద్ధి లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా పదవ త్రైమాసిక బేటీలోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని అభిప్రాయపడింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. ► పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఆర్థికశాఖ నెలవారీ నివేదిక స్పష్టీకరణ న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ (2022–23 ఆర్థిక సంవత్సరం)లో ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్ర దేశాలతో పోల్చితే వేగంగా పురోగమించనుందని ఆర్థికశాఖ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. కోవిడ్–19 అనంతర ప్రపంచం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలన్న ప్రణాళికతోనే ప్రస్తుత సంవత్సరం కూడా ముగియవచ్చని నివేదిక విశ్లేషించింది. భారత్‌కు సంబంధించినంతవరకూ తయారీ, నిర్మాణ రంగాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని పేర్కొంది. పీఎల్ఐ, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాల పెంపు దేశీయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేస్తాయని నివేదిక విశ్లేషించింది. నివేదికలోని కొన్ని కీలకాంశాలను పరిశీలిస్తే... ► నికర విత్తన విస్తీర్ణం, పంటల వైవిధ్యీకరణలో స్థిరమైన పురోగతిని వ్యవసాయ రంగం సాధిస్తోంది. ఇది దేశ ఆహార నిల్వల పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో రైతులకు కనీస మద్దతు ధరలు, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఆదాయ బదిలీల వంటి అంశాలు ఈ రంగానికి లాభిస్తాయి. ► వేగవంతమైన వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్‌ను తొలి స్థానంలో నిలిపిన విషయం గమనార్హం. జనవరి మొదట్లో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీగా 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. గత ఏడాది అక్టోబర్‌లో 9.5 శాతం అంచనాలను తాజాగా 9 శాతానికి కుదించింది. అయినా ఈ స్థాయి వృద్ధి కూడా ప్రపంచ దేశాల్లో అత్యధికమని పేర్కొంది. ► దేశంలో మూడవ వేవ్ సవాళ్లు తలెత్తినప్పటికీ, మొత్తం ఆర్థిక కార్యకలాపాలు వీటిని తట్టుకుని నిలబడ్డాయి. విద్యుత్ వినియోగం, తయారీకి సంబంధించి పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, ఎగుమతులు, ఈ–వే బిల్లులు వంటి వంటి అనేక హై ఫ్రీక్వెన్సీ సూచికలు బలమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. వృద్ధి రికవరీ పటిష్టతను ఇది ప్రతిబింబిస్తోంది. ► కోవిడ్ 19 వైరస్ వల్ల కలిగిన అనిశ్చితి, ఆందోళన ప్రజల మనస్సుల నుండి తొలగిపోయిన తర్వాత, వినియోగం పుంజుకుంటుంది. డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సంబంధించి ఉత్పత్తిని పెంచడానికి ప్రైవేటు పెట్టుబడులకు విస్తృత స్థాయి అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలను మినహాయిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు 2022–23లో పలు సానుకూల అంశాలు ఉన్నాయి. -
నిధులపై తాలిబన్ల ఆశలు ఆవిరి
వాషింగ్టన్: అమెరికాలో స్తంభించిన అఫ్గాన్ కేంద్ర బ్యాంకు నిధులను తమకు అప్పగించాలన్న తాలిబన్ల ఆశలపై అమెరికా నీళ్లుజల్లింది. దాదాపు 700 కోట్ల డాలర్ల ఈ నిధులను అఫ్గాన్‌లో మానవీయ సాయానికి, 2001 బాధితులకు పరిహారానికి వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో త్వరలో అధ్యక్షుడు బ్యాంకులకు ఆదేశాలిస్తారని, దీంతో యూఎస్ ఫైనాన్స్ సంస్థలు ఈ నిధులను విడుదల చేస్తాయని సంబంధిత అధికారులు చెప్పారు. వీటిలో 350 కోట్ల డాలర్లను అఫ్గాన్‌లో సహాయానికి కేటాయిస్తారని, 350 కోట్ల డాలర్లను అమెరికా వద్దే ఉంచుకొని ఉగ్రవాద దాడుల బాధితులకు అందిస్తారని చెప్పారు. గతంలో అమెరికా సహా పలు దేశాలు అఫ్గాన్‌కు సాయం కోసం కోట్లాది డాలర్ల నిధులను అందించాయి. వీటిని అఫ్గాన్ కేంద్రబ్యాంకు అమెరికా బ్యాంకుల్లో దాచింది. తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్నప్పటినుంచి ఈ నిధులు తమకు అప్పగించాలని కోరుతున్నారు. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ నిధులను అమెరికా స్తంభింపజేసింది. అమెరికాలో ఉన్న 700 కోట్ల డాలర్లు కాకుండా మరో 200 కోట్ల డాలర్ల అఫ్గాన్ నిధులు జర్మనీ, యూఏఈ, స్విట్జర్లాండ్, ఖతార్‌లో ఉన్నాయి. అమెరికా తాజా నిర్ణయాన్ని తాలిబన్లు వ్యతిరేకిస్తారని అంచనా. వీరి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
దేశంలో డిజిటల్ కరెన్సీ, ఆర్బీఐకి అంత తొందరలేదు!!
వచ్చే ఏడాది ప్రారంభం నాటికి దేశంలో అధికారిక డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెస్తామంటూ కేంద్ర అధికారిక వర్గాలు సైతం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తన బడ్జెట్ ప్రసంగంలో డిజిటల్ కరెన్సీపై ఓ స్పష్టత నిచ్చారు. త్వరలో దేశంలో డిజిటల్ రూపాయిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ తరహాలో ఈ డిజిటల్ కరెన్సీ పనిచేస్తుండగా.. సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం హామీ ఇవ్వడంపై మరింత ఆసక్తి నెలకొంది. కానీ ఇదే డిజిటల్ కరెన్సీ వ్యవహారంలో ఆర్బీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది.ఆర్బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు. హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు. -
భారత్ డిజిటల్ రూపాయి
-
బిట్ కాయిన్స్‌ను తలదన్నేలా, ఇండియాలో డిజిటల్ కరెన్సీ
న్యూఢిల్లీ: త్వరలోనే డిజిటల్ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్బీఐ పనిచేస్తోందని.. హోల్‌సేల్, రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ్చన్నారు. ఒక వర్చువల్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీబీడీసీ ఫలించే దశలో ఉందంటూ.. ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ప్రారంభించినట్టు చెప్పారు. సౌర్వభౌమ మద్దతు లేని పలు వర్చువల్ కరెన్సీల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు సీబీడీసీ అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అత్యున్నతస్థాయి అంతర్గత మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. విధానాలు, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసిన తర్వాత సీబీడీసీని డిజిటల్ రూపీగా ప్రవేశపెట్టే విషయమై సిఫారసులు, సూచనలను ఈ కమిటీ తెలియజేయనుంది. -
భారతీయుల ‘స్విస్’ సంపద మూడింతలు
న్యూఢిల్లీ/జూరిచ్: భారతీయలు, భారత కంపెనీల సంపద స్విస్ బ్యాంకుల్లో 2020 చివరికి వార్షికంగా మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు (దాదాపు రూ.20,700 కోట్లు) చేరింది. 2019 ముగిసే నాటికి ఈ విలువ 899 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ.6,625 కోట్లు). రెండు సంవత్సరాల దిగువముఖం తరువాత 2020లో తిరిగి ఇండియన్ క్లైంట్స్ నిధులు ఏకంగా 13 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. బాండ్లు, తత్సంబంధ ఇన్స్ట్రుమెంట్లలో (పథకాలు) ఉంచిన సంపద భారీగా పెరగడం దీనికి కారణం. కాగా, కస్టమర్ డిపాజిట్లు మాత్రం 2020లో పడిపోయాయి. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రాంచీలు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా భారతీయులు, భారత్ కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన నిధుల గణాంకాలను స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు. 2011, 2013, 2017సహా కొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో ఈ పరిమాణాలు డౌన్ ట్రెండ్‌లోనే నడిచాయి. ► 2020లో కస్టమర్ అకౌంట్ డిపాజిట్లు 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.4,000 కోట్లు). 2019లో ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్స్. ► గణాంకాల ప్రకారం, 2020 చివరినాటికి స్విట్జర్లాండ్‌లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి. నల్లధనంపై లేని సమాచారం స్విట్జర్లాండ్‌లో భారతీయులు ఉంచినట్లు పేర్కొంటున్న తీవ్ర చర్చనీయాంశం ‘నల్లధనం’ గురించి గణాంకాల్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. పైగా భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉంచిన నిధులను ‘నల్లధనం’గా పరిగణించబోమని ఆ దేశం తరచూ పేర్కొంటోంది. పన్ను ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్‌కు మద్దుతు, సహకారం ఇస్తామని కూడా స్పష్టం చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య 2018 నుంచీ ఒక అవగాహనా ఒప్పందం కూడా అమల్లో ఉంది. ఈ మేరకు తమ దేశంలో భారతీయుల అకౌంట్ల సమాచారాన్ని 2019 సెప్టెంబర్‌లో మొట్టమొదటిసారి అందజేసింది. ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో దాదాపు 2 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌లకు చేరాయి. ఇందులో 600 బిలియన్ డాలర్లు ఫారన్ కస్టమర్ డిపాజిట్లు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌తో బ్రిటన్ ముందు నిలిచింది. ఇందుకు సంబంధించి 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 100 బిలియన్ ఫ్రాంక్స్ పైన నిలిచిన దేశాలు ఈ రెండే కావడం గమనార్హం. -
నిధుల సేకరణకు బ్యాంకులు బలి
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్, నిధుల సేకరణ పేరుతో మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. పెట్టుబడుల ఉపసంహారణకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే బాధ్యతలను బాధ్యతలను నీతి ఆయోగ్‌కి అప్పగించింది. ఈ ప్రక్రియలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. వేగవంతమైన ప్రక్రియ పెట్టుబడుల ఉపసంహారణకు అత్యున్నత స్థాయి కమిటీ (సీజీఎస్) నీతి అయోగ్ నియమించింది. ఇందులో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ, కార్పొరేట్ వ్యవహారాలు, లీగల్ వ్యవహారాలు తదితర విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్, సీజీఎస్లు ప్రైవేటీకరణకు సూచించిన లిస్టులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఉన్నాయి. ఇందులో సెంట్రల్ బ్యాంకు, ఐవోబీలలో పెట్టుబడులు ఉపసంహరణకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్ ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ప్రైవేటీకరించేందుకు నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు చేపడతారు. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా పీఎస్‌బీల ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు జరుపుతోంది. వ్యతిరేకిస్తున్న యూనియన్లు బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో.. మార్చిలో రెండు రోజుల పాటు సమ్మెకు దిగాయి. పెద్ద నోట్ల రద్దు, జన ధన యోజన, ముద్ర యోజన వంటి ప్రభుత్వ స్కీముల విజయవంతంలో ప్రభుత్వ బ్యాంకులు ఎంతో కీలకపాత్ర పోషించాయని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి. డిజిన్వెస్ట్మెంట్లో భాగం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా సుమారు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 2.10 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువ. బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటు ఎల్ఐసీ సారథ్యంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకు నుంచి కూడా కేంద్రం తప్పుకోనుంది. బ్యాంకులో వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ గత నెలలో సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీకి 94% వాటా ఉంది. ప్రస్తుతం ప్రమోటరయిన ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంకులో 49.21 శాతం వాటా ఉంది. చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులకు వీఆర్ఎస్.. -
ఐసీఐసీఐలో చైనా భారీ పెట్టుబడులు
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో చైనా బ్యాన్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో దేశీయ ప్రైవేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులో చైనా భారీ పెట్టుబడులు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (సెంట్రల్ బ్యాంకు) ఐసీఐసీఐ బ్యాంకులో ఏకంగా 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లో పెట్టుబడులతో భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన తరువాత చైనా సెంట్రల్ బ్యాంక్ తాజాగా ఐసీఐసీఐ బ్యాంకును ఎంచుకుంది. కాగా ఐసీఐసీఐ బ్యాంకులో సింగపూర్, మోర్గాన్ ఇన్వెస్ట్ మెంట్ సొసైటీ జనరల్ లాంటి ఇతర సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి ప్రస్తుతం, ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నప్పటికీ భారతదేశంలో చైనా పెట్టుబడులకు ఎటువంటి అడ్డంకులు, ఆంక్షలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. సరిహద్దులో చైనా దుశ్యర్య తరువాత చైనాకు చెందిన టిక్‌టాక్, షేర్ఇట్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే చైనా పెట్టుబడులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. -
రాయపాటికి షాకిచ్చిన సెంట్రల్ బ్యాంక్
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు రంగం సిద్ధం చేస్తున్నాయి. సుమారు రూ. 452.41 కోట్లు ట్రాన్స్ట్రాయ్ బకాయి పడటంతో ఆస్తులను వేలం వేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ పత్రికల్లో వేలం నోటీసులను జారీ చేసింది. రుణం కోసం తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. బిడ్స్ దాఖలుకు ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించింది. (‘ట్రాన్స్ట్రాయ్’ కేసులో.. తవ్వుతున్న సీబీఐ) ఇక 2017 జనవరి 9 నాటికి సెంట్రల్ బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం 452.41 కోట్లు కాగా, వీటికి హామీదారులుగా ట్రాన్స్ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్, రాయపాటితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 51లో 640 చదరపు గజాల స్ధలాన్ని వేలం వేస్తున్నారు. మరోవైపు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కెనరా బ్యాంక్‌కు సంబంధించి సుమారు రూ. 300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు నమోదైంది. ఈ బకాయిలు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకులకు ట్రాన్స్ట్రాయ్ రూ. 3,694 కోట్ల మేర బకాయి పడింది. (వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం) -
మరోసారి చిక్కుల్లో మాజీ ఎంపీ రాయపాటి
-
138 ఏళ్లకు జపాన్ బ్యాంక్‌కు మహిళా డైరెక్టర్
టోక్యో: సుమారు 138 ఏళ్ల తర్వాత జపాన్ సెంట్రల్ బ్యాంక్ తొలిసారి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమించింది. కరోనా కారణంగా జపాన్‌లో అర్థిక వ్యవస్థ దిగజారడంతో తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను ఆరుగురితో కూడిన అధికార బృందం బాధ్యత చేపట్టింది. ఈ అధికారుల బృందంలో టోకికో షిమిజు(55) ఒకరు. ఇకనుంచి రోజువారి బ్యాంక్ కార్యకలాపాలను చూసే బాధ్యత ఈ ఆరుగురు సభ్యులదే. ఈ క్రమంలో టోకికోను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడం జరిగింది. కాగా టోకికో 1987 నుంచి బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో బ్యాంకు ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగాక ఫైనాన్షియల్ మార్కెట్స్, విదేశీ మారక కార్యకలాపాలను కూడా ఆమె చూసుకునేవారు. అనంతరం 2016 నుంచి 2018 మధ్య లండన్ ప్రధాన ప్రతినిధిగా ఐరోపాకు జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. కాగా జపాన్ సెంట్రల్ బ్యాంక్‌లో మహిళ ఉద్యోగులు 47శాతం ఉండగా.. సీనియర్ మేనేజిరియల్ పోస్టులలో కేవలం 13శాతం, న్యాయ వ్యవహారాలు, చెల్లింపు వ్యవస్థలు, బ్యాంక్ నోట్లతో వ్యవహరించే నిపుణుల స్థానాల్లో కేవలం 20శాతం మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. కాగా 1998లో ప్రారంభించిన సెంట్రల్ బ్యాంకు పాలసీ బోర్డులో ద్రవ్వ విధానాన్ని రూపొందించే బోర్డు పాలసీలో అత్యున్నత స్థాయి నిర్ణయాలకు తీసుకునే బాధ్యతలో మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ బోర్డులో ఉన్న తొమ్మిది మంది సభ్యులలో ఒకరు మాత్రమే మహిళ సభ్యురాలు ఉంటారు. ఇక గత దశాబ్ధాల నుంచి అక్కడి పురుషులకు సమానంగా మహిళలు ఉన్నత చదువులను అభ్యసిస్తూ కీలక రంగాల్లో పదవులు పొందుతున్నారు. దీంతో దశాబ్దాలుగా జపాన్‌లో కొనసాగుతున్న పురుషుల ఆధిపత్యానికి సవాలుగా మహిళలుగా నిలవడం ప్రారంభమైంది. జపాన్ జనాభాలో మహిళలు 51 శాతం ఉండగా.. 2018 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక ఫోరం తాజా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 153 దేశాలలో జపాన్ 121వ స్థానంలో ఉంది. -
నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7
ముంబై: నేషనల్ ఎల్రక్టానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్/ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్లో పేర్కొంది. డిసెంబర్ 16న (డిసెంబర్ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి నెఫ్ట్ సెటిల్మెంట్ జరుగుతుంది. లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా బ్యాంకులు ఆర్బీఐ వద్ద తమ కరెంటు ఖాతాల్లో తగినంత నిధుల లభ్యత ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకోవాలని కేంద్ర బ్యాంకు కోరింది. రెండు గంటల్లోపు లావాదేవీ మొత్తం స్వీకర్త ఖాతాలో జమ చేయడం లేదా పంపిన వ్యక్తిన ఖాతాకు వెనక్కి జమ చేయడం ఇక ముందూ కొనసాగనుంది. నెఫ్ట్ లావాదేవీల ప్రోత్సాహానికి గాను వీటిపై చార్జీలను ఆర్బీఐ లోగడే ఎత్తివేసింది. నెఫ్ట్ లావాదేవీలను గంటకోసారి ఒక బ్యాంచ్ కింద క్లియర్ చేస్తుండడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు.. మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాసెస్ చేస్తున్నారు. -
ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొరడా ఝుళిపించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ఇరాన్ సెంట్రల్ బ్యాంకుపై శుక్రవారం సరికొత్త ఆంక్షలను విధించారు. ‘మేం ఇరాన్ నేషనల్ బ్యాంకుపై సరికొత్త ఆంక్షలు విధించాం. ఓ దేశంపై విధించిన ఆంక్షల్లో ఇదే అత్యధికం. ఈ ఆంక్షల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది’ అంటూ ట్రంప్ ఓవల్ ఆఫీసు వద్ద మీడియాతో అన్నారు. దీనితో పాటు ఇరాన్ సార్వభౌమ సంక్షేమ నిధిపై కూడా ఆంక్షలు విధించారు. ఈ బోర్డులో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహని కూడా ట్రస్టీగా ఉన్నారు. సౌదీ ఆరేబియా చమురు కర్మాగారాలపై ఇటీవల డ్రోన్ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులు ఇరానే చేసిందంటూ అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఆంక్షలను మరింత పెంచుతామని కూడా హెచ్చిరించారు. బలగాల పోరుకు తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని కూడా ట్రంప్ హెచ్చరించారు. అయితే శాంతియుత మార్గమే తమ ప్రాధాన్యమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గురువారం తెలిపారు. అయితే అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఈ దాడులు తాము చేయలేదని తెలిపింది. -
ఆర్బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మిగులు నిల్వల బదలాయింపు జరగాలన్న ధోరణిని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను ఇది ప్రస్ఫుటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ నేతృత్వంలోని బిమల్‌జలాన్ కమిటీ కేంద్రానికి తన నివేదికను ఇవ్వడానికి కసరత్తు చేస్తున్న తరుణంలోనే దువ్వూరి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతార ని పేరున్న దువ్వూరి సీఎఫ్ఏ సొసైటీ ఇండియా ఇక్కడ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ బాండ్ల జారీ ద్వారా సమీకరించుకోవాలన్న 2019–2020 బడ్జెట్ ప్రకటన బాగానే ఉంది. అయితే ఇది ఒకసారికైతే పర్వాలేదు. పదేపదే ఇదే ప్రయోగం అయితే కష్టమవుతుంది. ► సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై దాడికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే, అది సరికాదు. ఇది ప్రభుత్వ తీవ్ర ఇబ్బందికర నైరాశ్య ధోరణిని ప్రతిబింబిస్తుంది. ► ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకులతో ఆర్బీఐని పోల్చిచూడటం సరికాదు. వాటితో పోల్చితే ఆర్బీఐ పనివిధానం, ఇబ్బందులను ఎదుర్కొనే ధోరణి వేరు. అందువల్ల ‘మిగులు నిధుల బదలాయింపుల విషయంలో’ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలనే భారత్‌లోనూ అనుసరించాలనుకోవడం సరికాదు. ► అటు ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్స్‌తో ఇటు సెంట్రల్బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్‌ను కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు. ఇందుకు తగినట్లు నిర్ణయం తీసుకుంటారు. ట ఆర్బీఐ బాధ్యతలు విస్తృతంగా ఉంటాయి. ఎన్నికలు, గెలుపు వంటి కొన్ని అంశాలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఆర్బీఐ విషయంలో ఇలాంటివి ఏవీ ఉండవు. కనుక ఆర్బీఐకి ఎప్పుడూ స్వయంప్రతిపత్తి కీలకాంశం. ► ప్రస్తుతం ఆర్బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. ఆర్బీఐ సాయంతో ప్రభుత్వ విత్తలోటు ఆందోళనలు ఉపశమిస్తాయని అంచనా. నిధుల బదిలీ అంశమై బిమల్ జలాన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్‌లో 14 శాతం రిజర్వుల రూపంలో ఉంటాయి. ఆర్బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. ఈ రిజర్వుల పరిమితిని తగ్గించగా వచ్చే మిగులు నిధులను ప్రభుత్వం వాడుకోవాలని యోచిస్తోంది. గత గవర్నర్ల హయాంలో ఈ అంశమై ఆర్బీఐ, కేంద్రప్రభుత్వాలకు మధ్య కొంత మేర ఘర్షణాపూరిత వాతావరణం ఏర్పడింది. గతంలో ఈ అంశంపై చర్చించేందుకు 1997లో సుబ్రమణ్యం కమిటీ, 2004లో ఉషా థోరట్ కమిటీ, 2013లో మాలేగామ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఆర్బీఐ 12–18% వరకు రిజర్వులుంచుకొని మిగిలినవి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించాయి. -
టర్కీ సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌పై వేటు
అంకారా : టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ కేంద్ర బ్యాంకు గవర్నరు మురాత్ సెటింకాయను అనూహ్యంగా పదవినుంచి తప్పించారు. ఆయన స్థానంలో డిప్యూటీ గవర్నర్ మురత్ ఉయిసాల్ ను నియమించారు. ఈ మేరకు శనివారం అధికారిక గెజిట్‌ను ఉటంకిస్లూ బ్లూం బర్గ్ నివేదించింది. ప్రభుత్వానికి, కేంద్ర బ్యాంకు గవర్నకు మధ్య నెలకొన్నవివాదం జూన్ 12 నాటిపాలసీ రివ్యూ తరువాత మరింత ముదిరింది. కీలక వడ్డీరేట్ల యథాతథం నిర్ణయం చివరికి గవర్నర్ ఉద్వాసనకు దారితీసిందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం అక్కడి మార్కెట్లను భారీగా ప్రభావితం చేసింది. దేశంలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే కిందికి దిగజారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టర్కీ ప్రస్తుత వాస్తవ రేటు 8.3 శాతానికి చేరుకున్న కొద్ది రోజుల తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్ విశ్వసనీయతను అణగదొక్కడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని లండన్ కు చెందిన వ్యూహకర్త పియోటర్ మాటిస్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం డబుల్ డిప్ మాంద్య ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటిసారిగా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. సెంట్రల్ బ్యాంకు తదుపరి విధాన నిర్ణయం జూలై 25 న జరగాల్సి ఉంది. మురాత్ నాలుగేళ్ల పదవీకాలం 2020లో ముగియనుంది. టర్కీ ఆర్థిక వ్యవస్థ ఇటీవల తిరిగి మాంద్యంలోకి జారుకుంది. దశాబ్దకాలం తర్వాత మరోసారి మాంద్యంలోకి పడిపోవడం సర్వత్రా ఆందోళ రేపింది. దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధితోపాటు ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ అధ్యక్షుడు రెసెప్ తెయిప్ ఎర్డోగాన్ ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయని ఆర్థిక వేత్తలు అంచనావేశారు. గత ఏడాదిలో డాలర్ మారకంలో టర్కీ కరెన్సీ లిరా 30 శాతం మేర క్షీణించింది. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతులు మరింత భారమైన సంగతి తెలిసిందే. -
‘ఆ నోట్లు నేపాల్‌లో చెల్లవు’
-
‘ఆ నోట్లు నేపాల్‌లో చెల్లవు’
ఖట్మండు : రూ వందకు పైబడిన భారత కరెన్సీ నోట్ల వాడకాన్ని నేపాల్ కేంద్ర బ్యాంక్ నిషేధించింది. రూ 2000, రూ 500, రూ 200 నోట్ల వాడకం చెల్లదని బ్యాంక్ పేర్కొంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ జారీ చేసిన ఉత్తర్వులు భారత పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రూ 100కు మించిన భారత నోట్లతో కూడిన లావాదేవీలు, వాటిని కలిగిఉండటం, ట్రేడింగ్ చేయడం నిషేధిస్తూ నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అక్కడి ట్రావెల్ సంస్ధలు, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలకు సర్క్యులర్ జారీ చేసిందని ఖట్మండు పోస్ట్ పేర్కొంది. భారత్ మినమా మరే ప్రాంతానికి ఈ నోట్లను నేపాల్ పౌరులు తీసుకువెళ్లరాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల నుంచి భారత కరెన్సీని నేపాల్‌కు తీసుకురావడం నిషిద్ధమని తమ పౌరులకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. భారత్‌కు చెందిన రూ 100 అంతకు లోపు ఉన్న నోట్లను ట్రేడింగ్, మార్పిడికి అనుమతిస్తామని బ్యాంక్ తెలిపింది. కాగా నేపాల్ కేంద్ర బ్యాంక్ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ పర్యాటక రంగానికి ఇది తీవ్ర విఘాతమని ట్రావెల్ వ్యాపారులు, వాణిజ్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
ట్రంప్‌ను పట్టించుకోని ఫెడ్
వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్... మరోమారు వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో ఈ ఏడాది ఫెడ్ నాలుగు దఫాలు వడ్డీరేట్లను పెంచినట్లయింది. ఒకపక్క రేట్లపెంపుపై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఫెడ్ రేట్ల పెంపునకు సిద్ధపడడం గమనార్హం. ఈ ఏడాది అమెరికా ఎకానమీ బాగా బలపడిందని, దాదాపు అంచనాలకు తగినట్లే వృద్ధి నమోదు చేస్తోందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక వడ్డీరేట్లను మరో పావు శాతం పెంచుతున్నామన్నారు. తాజా పెంపుదలతో ఫెడ్ రేటు 2.25–2.5%కి చేరింది. ఇదేమీ అసాధారణమైన పెంపు కాదని తెలిపారు. ప్రభావం చూపని ట్రంప్ ట్వీట్ ఫెడ్ సమావేశానికి ముందు రేట్లను పెంచొద్దని, మరో తప్పు చేయొద్దని ఫెడ్‌ను ఉద్దేశించి ట్రంప్ ట్వీట్ చేశారు. రేట్ల పెంపుపై నిర్ణయానికి ముందు ఫెడ్ సభ్యులు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఎడిటోరియల్ చదవాలని కూడా ట్వీట్లో సూచించారు. రేట్లను పెంచి మార్కెట్లో లిక్విడిటీ కొరతను తీసుకురావద్దని కోరారు. ఇంత చెప్పినా ఫెడ్ మాత్రం రేట్లను పెంచేందుకే సిద్ధమైంది. కాకపోతే దీనిపై ట్రంప్ ఇప్పటిదాకా స్పందించలేదు. మరోవైపు బ్యాంకు నిర్ణయాలపై ట్రంప్ అభిప్రాయాలు ఎలాంటి ప్రభావం చూపవని ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది రెండు సార్లకే పరిమితం ‘‘2019లో మరో 3 మార్లు రేట్లు పెంచేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులుంటాయని ఫెడ్ సభ్యుల్లో ఎక్కువమంది గతంలో అభిప్రాయపడ్డారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే సంవత్సరం మరో 2 దఫాలు రేట్లు పెంచితే సరిపోవచ్చు. అయితే మా నిర్ణయాలను ముందుగానే నిర్ధారించలేం. అప్పటికి అందే ఆర్థిక గణాంకాలే విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను సైతం పరిశీలిస్తూ ఉంటాం’’ అని పావెల్ వివరించారు. -
పసిడికి పాలసీ నిర్ణయాలే దిక్సూచి!
రెండు వారాలుగా ‘సీసా’ (పైకి, కిందికి) ఆట ఆడుతున్న డాలర్–బంగారం సమీప భవిష్యత్తును ఈ వారం సెంట్రల్ బ్యాంకుల పాలసీ నిర్ణయాలు తేల్చనున్నాయి. జూన్ 13న ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అమెరికా ఫెడ్ రేటు (ప్రస్తుతం 1.50–1.75 శాతం శ్రేణి) మరో పావుశాతం పెంపు నిర్ణయం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పెంపునకు డాలర్ ఇండెక్స్ ఎలా స్పందిస్తుందన్నది ఇక్కడ ముఖ్యాంశం. జూన్ 8వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ ధర 10 డాలర్లు బలపడి తిరిగి 1,303 డాలర్లపైకి లేస్తే, డాలర్ ఇండెక్స్ 61 సెంట్లు బలహీనపడి 93.55 వద్ద ముగిసింది. ఇక జూన్ 14న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) పరపతి విధాన నిర్ణయమూ డాలర్–పసిడి కదలికలను ప్రభావితం చేసే అంశమే. 12న జరగనున్న అమెరికా–ఉత్తరకొరియా అగ్రస్థాయి చర్చలు దీర్ఘకాలంలో పసిడిపై ప్రభావం చూపే అంశమే. దేశంలోనూ పెరుగుదల: దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర వారం వారీగా రూ.669 లాభపడి, రూ. 31,215 వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత వారంలో రూ.190 చొప్పున లాభపడి రూ.31,160, రూ.31,010 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.835 లాభపడి రూ.40,225 వద్దకు చేరింది. -
పసిడికి పాలసీ నిర్ణయాలే దిక్సూచి!
రెండు వారాలుగా ‘సీసా’ (పైకి, కిందికి) ఆట ఆడుతున్న డాలర్–బంగారం సమీప భవిష్యత్తును ఈ వారం సెంట్రల్ బ్యాంకుల పాలసీ నిర్ణయాలు తేల్చనున్నాయి. జూన్ 13న ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అమెరికా ఫెడ్ రేటు (ప్రస్తుతం 1.50–1.75 శాతం శ్రేణి) మరో పావుశాతం పెంపు నిర్ణయం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పెంపునకు డాలర్ ఇండెక్స్ ఎలా స్పందిస్తుందన్నది ఇక్కడ ముఖ్యాంశం. జూన్ 8వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ ధర 10 డాలర్లు బలపడి తిరిగి 1,303 డాలర్లపైకి లేస్తే, డాలర్ ఇండెక్స్ 61 సెంట్లు బలహీనపడి 93.55 వద్ద ముగిసింది. ఇక జూన్ 14న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) పరపతి విధాన నిర్ణయమూ డాలర్–పసిడి కదలికలను ప్రభావితం చేసే అంశమే. 12న జరగనున్న అమెరికా–ఉత్తరకొరియా అగ్రస్థాయి చర్చలు దీర్ఘకాలంలో పసిడిపై ప్రభావం చూపే అంశమే. దేశంలోనూ పెరుగుదల: దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర వారం వారీగా రూ.669 లాభపడి, రూ. 31,215 వద్ద ముగిసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో 99.9, 99.5 స్వచ్ఛత వారంలో రూ.190 చొప్పున లాభపడి రూ.31,160, రూ.31,010 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.835 లాభపడి రూ.40,225 వద్దకు చేరింది. -
ఏకంగా ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు
జైపూర్ : రాజస్థాన్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎంతలా అంటే.. ఏటీఎంలో క్యాష్ కాదు.. ఏకంగా ఏటీఎం మెషీన్నే ఎత్తుకుపోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ బుండిలోని సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. డబ్బును తీసుకెళ్లడం కాదు.. ఏటీఏం మెషీన్‌ను ఎత్తుకెళ్లాలన్న ప్లాన్ వారిని చూస్తే అర్థమవుతోంది. చాలా శ్రమించి ఏటీఎం మెషీన్‌ను గట్టిగా అటూఇటూ కదిపారు. ఆపై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ఎంచక్కా ఏటీఎం మెషీన్‌ను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిపోయారు. ఏటీఎంలోని సీసీ టీవీ కెమెరాల్లో ఈ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా ఏటీఎం మెషీన్ ఎత్తుకెళ్లారు -
ఇంకా లెక్కిస్తున్నాం
► రద్దయిన నోట్లపై ఆర్బీఐ చీఫ్ ఉర్జిత్ పటేల్ ► పార్లమెంటరీ కమిటీ ముందు రెండోసారి హాజరు న్యూఢిల్లీ: రద్దయిన రూ. 500, రూ. 1,000 నోట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెల్లడించారు. రద్దు తర్వాత ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ఆ నోట్లను ఇంకా లెక్కిస్తున్నామని, అందువల్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి ఎంత డబ్బు వచ్చిందో కచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు. ‘ఆర్బీఐ ప్రత్యేక బృందం రోజుకు 24 గంటలూ ఆ నోట్లను లెక్కిస్తోంది. వారికి శనివారంతోపాటు చాలా సెలవులను తగ్గించాం. ఆదివారం మాత్రమే సెలవు లభిస్తోంది’ అని ఆయన బుధవారం ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్బీఐకి ప్రస్తుతం 15,000 మంది సిబ్బంది ఉన్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రద్దయిన నోట్లను లెక్కించడానికి కొత్త కౌంటింగ్ యంత్రాల కోసం టెండర్లు జారీచేసినట్లు ఉర్జిత్ పార్లమెంటరీ కమిటీకి చెప్పారు. ఆయన ఈ కమిటీ ముందు హాజరు కావడం ఇది రెండోసారి. మూడు గంటలు కొనసాగిన ఈ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్. ముంద్రా కూడా పాల్గొన్నారు. రద్దయిన నోట్లలో ఎంత మొత్తం తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని ఉర్జిత్‌ను నరేశ్ అగర్వాల్(సమాజ్‌వాదీ), సౌగతా రాయ్(తృణమూల్ కాంగ్రెస్) ప్రశ్నించారు. రద్దు కాకముందు దేశంలో మొత్తం రూ. 17.7 లక్షల కోట్ల డబ్బు చలా మణిలో ఉండేదని, ప్రస్తుతం రూ. 15.4 లక్షల కోట్లు ఉందని ఉర్జిత్ తెలిపారు. రద్దు తర్వాత తిరిగి చలామణిలోకి వచ్చిన డబ్బు పై ఆర్బీఐ చీఫ్ కచ్చితమైన సమాధానం చెప్పకపోవడంతో కమిటీలోని పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడగని మన్మోహన్ జనవరి నాటి కమిటీ సమావేశంలో ఉర్జిత్‌ను కఠిన ప్రశ్నలను అడిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజా సమావేశంలో ఆయనను ఎలాంటి ప్రశ్నలూ అడగలేదు. ఆర్బీఐ గవర్నర్‌ను కొందరు సభ్యులు ప్రశ్నలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయగా, కమిటీ చైర్మన్ వీరప్ప మొయిలీతోపాటు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఈ అంశంపై ఉర్జిత్‌ను మళ్లీ కమిటీ ముందుకు పిలవబోమని స్పష్టం చేశారు. -
పసిడికి అమెరికా ‘వృద్ధి’ కళ్లెం!
♦ ఒకే వారంలో 38 డాలర్లు పతనం ♦ ఐదు వారాల నుంచీ ఇదే ధోరణి... ♦ అమెరికా సానుకూల ♦ జాబ్ డేటా తాజా డౌన్‌కు నేపథ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరందుకుంటోందని, అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 1% – 1.25%) పెంపు పరంపర కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో, ఇన్వెస్టర్లు బంగారం నుంచి భారీగా తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) 7వ తేదీతో ముగిసిన వారంలో భారీగా 38 డాలర్లు పడిపోయి కీలక మద్దతు అయిన 1,242 డాలర్ల నుంచి రెండవ మద్దతు స్థాయి 1,211 డాలర్లకు పడిపోయింది. అమెరికా వృద్ధి అంచనాల నేపథ్యంలో సమీప కాలంలో దిగువ స్థాయివైపు పయనానికే అవకాశం ఉందన్నది అంచనా. ఐదు వారాల నుంచీ పసిడి ధర పడిపోతూ వచ్చింది. ఐదు సార్లు వెనక్కు తిరిగిన 1,242 డాలర్ల మద్దతునూ తాజాగా పసిడి కోల్పోవడంతో పసిడి పతనం కొనసాగుతుందన్నది విశ్లేషణ. మార్చి 15 తరువాత ఈ స్థాయికి పసిడి రావడం ఇదే తొలిసారి. అంచనాలకు మించి అమెరికా జూన్ ఉపాధి కల్పనా గణాంకాలు (2,22,000) వెలువడ్డం తాజా పతనం నేపథ్యం. గడచిన వారంలో డాలర్ ఇండెక్స్ కూడా వారం వారీగా బలపడి 96 స్థాయిల పైన (ముగింపు 0.40 అధికంగా 95.78) తిరగడం గమనార్హం. దేశంలోనూ రూ.655 పతనం... మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు జూలై 7వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ధోరణిని కొనసాగించింది. ధర రూ. 655 పడిపోయి, రూ.27,784కు చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.535 తగ్గి, రూ.28,235కి చేరింది. మరోవైపు వెండి కేజీ ధర భారీగా రూ.2,170 పడిపోయి రూ.36,910కి చేరింది. -
రోజుకో హైడ్రామా
సాక్షి, నల్లగొండ :జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వ్యవహారంలో రోజుకో హైడ్రామా నడుస్తోంది. 90 రోజులుగా నాటకీయ మలుపులు తిరుగుతున్న సెంట్రల్ బ్యాంకు పరిణామాలు రోజులు గడిచే కొద్దీ రసవత్తరంగా మారుతున్నాయి. సహకార శాఖ అధికారులు ఒకలా వ్యవహరిస్తుంటే.. హైకోర్టు ఉత్తర్వులు మరోలా ఉన్నాయి. చైర్మన్ వ్యవహారశైలి ఓ విధంగా ఉంటే.. రెబల్ డైరెక్టర్లు మరోలా వ్యవహరిస్తూ గందరగోళానికి తెర లేపుతున్నారు. ఈ నేపథ్యంలో నాటకీయంగా పాండురంగారావే చైర్మన్ అంటూ సహకార రిజిస్ట్రార్ ఉత్తర్వులు ఇవ్వడం, అసలు కాపుగల్లు సొసైటీని రద్దు చేయడంపై స్టే ఇస్తూ సహకార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం, తన అధ్యక్షతనే గురువారం డీసీసీబీ పాలకమండలి సమావేశం జరుగుతుందని పాండురంగారావు ప్రకటించడం వంటి అంశాలు సెంట్రల్ బ్యాంకు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. అప్పటి నుంచీ.. వాస్తవానికి కాపుగల్లు సహకార సొసైటీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన అనంతరం ఆ సొసైటీని రద్దు చేస్తూ గతేడాది జనవరి 8న సూర్యాపేట జిల్లా సహకార అధికారి లక్ష్మినారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. కాపుగల్లు సొసైటీ పాలకమండలిని రద్దు చేయడంతో ఆ సొసైటీ చైర్మన్‌గా ఉన్న పాండురంగారావు తన పదవిని కోల్పోయి, తదనుగుణంగా డీసీసీబీ చైర్మన్‌గా కూడా అనర్హులవుతారని చట్టం చెబుతోంది. అయితే, డీసీఓ తీసుకున్న నిర్ణయంపై పాండురంగారావు హైకోర్టును ఆశ్రయించడంతో సహకార ట్రిబ్యునల్‌కి వెళ్లాలని సూచిస్తూ హైకోర్టు ఆయనకు రెండు వారాల గడువిచ్చింది. ఈ మేరకు సహకార ట్రిబ్యునల్‌ను జనవరి 5న పాండురంగారావు ఆశ్రయించడంతో సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ జనవరి 11న కొందరు హైకోర్టుకెళ్లారు. మళ్లీ హైకోర్టు నాలుగు వారాల పాటు ట్రిబ్యునల్ స్టేపై సస్పెన్షన్ విధించింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట డీసీఓ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చినట్టయింది. అయితే హైకోర్టు నాలుగు వారాలకే ఇచ్చిన ఉత్తర్వుల గడువు అయిపోవడంతో కాపుగల్లు సొసైటీ చైర్మన్‌గా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పాండురంగారావు సూర్యాపేట డీసీఓను ఫిబ్రవరి 11న కోరారు. అయితే దీనిపై న్యాయ అభిప్రాయం కోసం సూర్యాపేట డీసీఓ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదికి అదే రోజు లేఖ రాయగా, ఆయన 16న సమాధానమిచ్చారు. సదరు హైకోర్టు న్యాయవాది డీసీఓ రాసిన లేఖకు బదులిస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసినప్పటికీ, స్టేను ఎత్తివేసేంతవరకు అమల్లోనే ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇందుకు 2016లో జస్టిస్ సురేశ్కుమార్కైత్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఉటంకించారు. పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సొసైటీని రద్దు చేస్తూ సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మళ్లీ బెంచ్ మీదకు.. అయితే సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తూ సహకార ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన కేసు ఈనెల 2 న మళ్లీ బెంచ్ మీదకు వచ్చింది. ఈలోపే పాండురంగారావు వ్యూహాత్మకంగా వ్యవహరించి కాపుగల్లు సొసైటీ చైర్మన్‌గా ప్రత్యేకాధికారి నుంచి బాధ్యతలను మార్చి 1న లిఖితపూర్వకంగా తీసుకుని మినిట్స్ బుక్‌లో రాశారు. ఈనెల 2న హైకోర్టు ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు, దానిపై హైకోర్టులో సవాల్ చేసిన ఉదంతం ఇలా ఉండగా, బ్యాంకు డైరెక్టర్లు 10 మంది గత నెల 22న హైకోర్టును మళ్లీ ఆశ్రయించారు. డీసీసీబీ చైర్మన్ విషయంలో ఎన్నికలు నిర్వహించాలని బ్యాంకు వర్గాలు ఎన్నిసార్లు లేఖలు రాసినా సహకార రిజిస్ట్రార్ స్పందించడం లేదని, ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోర్టు మెట్లెక్కారు. దీంతో హైకోర్టు డీసీసీబీలో నెలకొన్న సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని అదే రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సహకార శాఖతో పాటు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుండగా సహకార చట్టాలు డీసీసీబీ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు తమను అనుమతించబోవని, దీనిపై నిర్ణయం మీరే తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ సహకార రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 1వ తేదీన కాపుగల్లు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నందున డీసీసీబీ చైర్మన్‌గా ఉంటారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని సహకార రిజిస్ట్రార్ ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న పాండురంగారావు వెంటనే 7న డీసీసీబీలో సమావేశం నిర్వహించారు. అధికారులతో సమీక్షించి 9 న పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ 8న రెబల్ డైరెక్టర్లు ఈనెల 2న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను మీడియాకు అందజేశారు. దీంతో పాటు నేడు జరగనున్న పాలకమండలి సమావేశానికి పాండురంగారావు హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విధంగా మూడు నెలలుగా సెంట్రల్ బ్యాంకు చేయాల్సిన కార్యకలాపాలు నిర్వీర్యమయ్యాయి. ఒకరిపై ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కోర్టులు, ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతూ సెంట్రల్ బ్యాంకు ను వివాదాలకు కేంద్ర బిందువుగా చేయడం గమనార్హం. మరీ, గురువారం జరగనున్న పాలకమండలి సమావేశం అసలు జరుగుతుందా.. లేదా ? ఎలా జరుగుతుంది. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సహకార శాఖ ఏ విధంగా పరిగణిస్తుంది.. చైర్మన్ ఏం చేస్తారు? డైరెక్టర్లు ఏ విధంగా వ్యవహరిస్తారు? సమావేశానికి సరిపడా కోరం ఉంటుందా? రెబల్స్ సమావేశానికి వస్తారా.. రారా.. వస్తే ఏం చేస్తారు? అనేది ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. -
సెంట్రల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీని కొంటున్న బీఓబీ
ముంబై: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య ఒక సబ్సిడరీ చేతులు మారనుంది. సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీ సెంట్ బ్యాంక్ హోం ఫైనాన్స్ (సీబీహెచ్ఎఫ్ఎల్)ను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీహెచ్ఎఫ్ఎల్లో సెంట్రల్ బ్యాంక్‌కు 64 శాతం వాటా వుంది. మిగిలిన వాటా హడ్కో, యూటీఐ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ల వద్ద వుంది. చర్చలు తుదిదశలో వున్నాయని, సెంట్రల్ బ్యాంక్ తన వాటానంతటినీ విక్రయించడానికి అంగీకరించిందని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే సీబీహెచ్ఎఫ్ఎల్లో ఇతర షేర్‌హోల్డర్ల వాటాల్ని కొనుగోలు చేసేందుకు ఆయా సంస్థల్ని బ్యాంక్ ఆఫ్ బరోడా సంప్రదించిందీ, లేనిదీ తెలియరాలేదు. -
జపాన్ను తాకిన ట్రంప్ టోర్నడో
టోక్యో: డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయంగా మారిపోతున్న పరిణామాలపై జపాన్ స్పందిస్తోంది. కీలక రాష్ట్రాల్లో విజయంతో వైట్ హౌస్ కు చేరువవుతున్న ట్రంప్ టోర్నడో జపాన్ ప్రభుతాన్ని ఆందోళనలో పడవేసింది. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ జపాన్ బుధవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానున్నాయి. మార్కెట్లలో నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు (0600 GMT) సమావేశం కానున్న బీఓజే ప్రతినిధి చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫినాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీ సమావేశం కానున్నట్టు తెలిపారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు డెమాక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. దాదాపు ట్రంప్ గెలుపు ఖాయమనే అంచనాలతో హిల్లరీ అభిమానులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. నరాలు తెగే ఈ ఉత్కంఠకు తెరపడాలంటే తుదిఫలితాలు రావాల్సిందే. -
ఫెడ్ సమావేశం ముందు అమ్మకాలు
సెన్సెక్స్‌కు 53 పాయింట్ల నష్టం ముంబై: కీలకమైన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమీక్షకు మందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించారు. ఫలితంగా ఐటీ, టెక్ కౌంటర్లలో అమ్మకాలు చోటు చేసుకోవడంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 53.60 పాయింట్టు నష్టపోయి 27,876.61 పాయింట్ల వద్ధ స్థిరపడింది. నిఫ్టీ మాత్రం అర పాయింటు లాభంతో 8,626.25 వద్ద ముగిసింది. అక్టోబర్‌లో తయారీ రంగం మెరుగైన పనితీరుకు తోడు ట్రేడర్లు పండుగ మూడ్ నేపథ్యంలో మార్కెట్లు రోజులో ఎక్కువ సమయం పాటు స్వల్ప పరిధికిలోబడి సానుకూలంగా ట్రేడయ్యాయి. ఫెడ్ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుండడంతో ఆఖరి గంటలో అమ్మకాలు రావడంతో సెన్సెక్స్‌కు నష్టాలు ఎదురయ్యాయి. వాహన విక్రయాల జోరుతో ఆయా కంపెనీల స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయి. చైనా పీపీఐ (ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్) గత కొన్నేళ్లలోనే గరిష్ట స్థాయిలో నమోదు కావడంతో మెటల్ స్టాక్స్‌కు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు రెండో త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండడం మార్కెట్‌పై ప్రభావం చూపిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అమెరికా ఎఫ్ఓఎంసీ సమావేశం, అమెరికా ఎన్నికలు పూర్తయ్యే వరకు మార్కెట్లలో ఈ స్థిరీకరణ కొనసాగుతుందన్నారు. -
సెంట్రల్ బ్యాంకుల స్వేచ్ఛను మీరే కాపాడాలి : రాజన్
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యాంకుల స్వాతంత్ర్యాన్ని కచ్చితంగా ప్రభుత్వాలే పరిరక్షించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు సాధించడానికి ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవాలన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు పెంపు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు ఎలాంటి సాక్ష్యాలు లేని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయని రాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. బ్రెగ్జిట్ పరిణామ క్రమంలో బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్ ఎదుర్కొన్న దాడులు, పెరిఫీరియల్ ఆర్థికవ్యవస్థను స్థిరీకరించే సమయంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఇంటరెస్ట్-రేట్ గైడ్ లైన్స్ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు ఎదుర్కొన్న అటాక్స్‌ను ఆయన గుర్తుచేశారు. ఆయా సెంట్రల్ బ్యాంకులు తమ భూభాగ పరిధిలోనే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాయని ముంబైలోని ప్రెస్ స్టేట్మెంట్లో రాజన్ వ్యాఖ్యానించారు. సాక్ష్యాలు లేని ఇలాంటి నిందారోపణలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు దృష్టిసారించాలని, సెంట్రల్ బ్యాంకుల స్వేచ్ఛను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలను వృద్ధి బాటలో నడిపించడానికి సెంట్రల్ బ్యాంకులు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటాయని.. సెంట్రల్ బ్యాంకులపై ఎలాంటి ఆధారాలు లేని విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. కాగ, భారత సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌గా రాజన్ రెండోసారి కొనసాగింపుపై, బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యం స్వామి నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పదవీ కాలం ఈ సెప్టెంబర్‌లో ముగియనున్న నేపథ్యంలో ఈ కామెంట్లు చేయడం గమనార్హం. -
ద్రవ్యోల్బణం పెరిగినా రేటు కోత: బీఓఎఫ్ఏ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 9వ తేదీన జరిపే ద్రవ్య, పరపతి సమీక్ష సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు-రెపోను పావుశాతం తగ్గించే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 6.2 (మేలో 21 నెలల గరిష్ట స్థాయి 5.8 శాతం) శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన బ్యాంక్... అయినప్పటికీ రేటు కోత ఉంటుందని పేర్కొంది. తగిన వర్షపాతం నమోదు అవకాశాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటుందని ఒక పరిశోధనా పత్రంలో విశ్లేషించింది. -
సెంట్రల్ బ్యాంక్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,396 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.666 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.28,376 కోట్ల నుంచి రూ.27,932 కోట్లకు తగ్గిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మూలధనాన్ని రూ.3,000 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనను బ్యాంక్ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 1.3% లాభపడి రూ.82 వద్ద ముగిసింది. -
ఈ ఏడాది రూ. 500 కోట్ల రుణాల పంపిణీ
► ఎరువుల వ్యాపారానికి బ్యాంకు గ్యారంటీ ► రూ.25 లక్షలకు పెంపు ► గ్రాము బంగారంపై ఇక రూ.1800 రుణం ► డీసీసీబీ బోర్డు సమావేశంలో నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది జిల్లా సహకార కేంద్రబ్యాంకు ద్వారా అన్ని పథకాల కింద రూ.500 కోట్ల వరకు రుణాలు పంపిణీ చేయనున్నట్లుగా చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బుధవారం కేడీసీసీబీ చైర్మన్ ఆధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ఆయన విలేకరులకు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ నెల మొదటి వారం నుంచి రుణాల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ మొదలు కానుండటంతో సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎరువుల వ్యాపారానికి గత ఏడాది వరకు బ్యాంకు గ్యారంటీ రూ.15 లక్షలకు ఇస్తుండగా ఈ ఏడాది దీనిని రూ. 25 లక్షలకు పెంచుతూ తీర్మనం చేసినట్లు తెలిపారు. రైతులను అన్ని విధాలా అదుకునేందుకు కేడీసీసీబీ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. గ్రాము బంగారంపై ఇప్పటి వరకు రూ.1500 రుణం ఇస్తున్నామని దీనిని రూ.1800 పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లా సహకారకేంద్రబ్యాంకులో రూ. 50 లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు 9.50 శాతం ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. మిగిలిన డిపాజిట్లపై 9.25 శాతం వడ్డీ రేటు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చి ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించనున్నామన్నారు. డీసీసీబీ ైవైస్ చైర్మన్ పదవీ ఖాళీగా ఉన్న విషయాన్ని జిల్లా సహకార అధికారి దృష్టికి తీసుకెల్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో సీఈవో రామాంజనేయులు, బ్యాంకు డెరైక్టర్లు ఆప్కాబ్ డీజీఎం విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
హ్యాకింగ్‌తో 673 కోట్ల చోరీ
బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా ఢాకా: అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ ఖాతా నుంచి సుమారు 10.1 కోట్ల డాలర్ల (రూ.673 కోట్లు) సొమ్ము గల్లంతైన ఉదంతంపై బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అతీవుర్ రహ్మాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి షేక్ హసీనాను కలసి రహ్మాన్ తన రాజీనామా లేఖను అందజేశారని ప్రధాని కార్యాలయ ప్రతినిధి ఇషానుల్ కరీం మీడియాకు తెలిపారు.అమెరికా బ్యాంకు ఖాతాలో ఉన్న బంగ్లా ప్రభుత్వ నిధులను గుర్తుతెలియని హ్యాకర్లు కొల్లగొట్టడం సంచలనం సృష్టించింది. కొన్ని వారాల కిందట వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బంగ్లా ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఏడేళ్లపాటు ఈ పదవిలో ఉన్న రహ్మాన్ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, దేశ హితం కోసం తాను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలి పారు. నిధుల దొంగిలింపు వ్యవహారం మిలిటెంట్ల దాడిలా ఉంద న్నారు. హ్యాకర్లు 10.1 కోట్ల డాలర్లను కొల్లగొట్టారని, 8.1 కోట్ల డాలర్లు ఫిలిప్పీన్స్‌కు, మిగతా డబ్బులు శ్రీలంకకు తరలించారని బ్యాంకు ప్రతినిధి తెలిపారు. శ్రీలంకకు చేరిన సొమ్ములోంచి కొంత రికవరీ చేశామని, ఫిలిప్పీన్స్‌కు చేరిన సొమ్ము క్యాసినోల వ్యాపారంలోకి మళ్లించి నట్లు తెలిసిందన్నారు. హ్యాకర్లు బంగ్లా ప్రభు త్వ రహస్య సమాచారాన్ని దొంగిలించి ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగానే నిధుల బదిలీకి అభ్యర్థనలు పంపారని, అయితే శ్రీలంకలోని ఒక సంస్థకు బదిలీకి సంబంధించి స్పెల్లింగ్ తప్పుగా ఇవ్వడంతో పునఃపరిశీలన చేయగా వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. -
బ్యాంకు నుంచి 540 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు
బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్న అతిపెద్ద రాబరీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ రాజీనామా చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీ బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్నది. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ ద్వారా బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు నుంచి రూ. 540 కోట్లు (40 మిలియన్ డాలర్లు) కొల్లగొట్టడం దుమారం రేపుతున్నది. ఈ వ్యవహారంలో సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అతివుర్ రహ్మాన్ తన పదవికి రాజీనామా చేసినట్టు బంగ్లాదేశ్ ఆర్థికమంత్రి మంగళవారం వెల్లడించారు. తన సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకొన్నట్టు చెప్పారు. మానవ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ రాబరీగా ఈ దొంగతనం నిలిచిపోయింది. దీంతో బంగ్లాదేశ్ వద్ద ఉన్న 27 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యానికి భద్రత ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ దోపిడీ వ్యవహారం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ అమెరికా ఖాతాలో బిలియన్ డాలర్ల (రూ. 6,740 కోట్ల)ను దోచుకోవడానికి హ్యాకర్లు ప్రయత్నించారని, అయితే డబ్బు ట్రాన్స్ఫర్ విజ్ఞప్తికి చివరినిమిషంలో రెడ్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఈ దోపిడీని చాలావరకు నిరోధించామని బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు చెప్తోంది. అమెరికా రిజర్వు బ్యాంకు అయిన న్యూయార్క్ ఫెడ్‌లోని బంగ్లా ఖాతా నుంచి డబ్బు ఉపసంహరణకు హ్యాకర్లు 35 విజ్ఞప్తులు పంపడమే కాకుండా, బ్యాంకుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్‌ను వాడుకొని డబ్బు యావత్తును ఊడ్చిపారేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో అమెరికా రిజర్వు బ్యాంకు సిస్టం సరిగ్గా పనిచేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, అది మాత్రం ఆరోపణలను తోసిపుచ్చుతోంది. హ్యాకర్ల నుంచి భారీగా సొమ్ము రికవరీ చేశామని, నేరగాళ్ల నుంచి దోపిడీకి గురైన మిగతా డబ్బు కూడా రాబట్టేందుకు ఫిలిపీన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. -
బ్యాంక్ షేర్ల భారీ ర్యాలీ
ఆర్బీఐ మూలధన నిబంధనల సరళీకరణ ప్రభావం ♦ 24,000 పాయింట్ల పైకి సెన్సెక్స్ ♦ 464 పాయింట్ల లాభంతో ♦ 24,243 వద్ద ముగింపు బడ్జెట్ జోరు వరుసగా రెండో రోజూ కొనసాగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. మూలధన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సరళీకరించడంతో బ్యాంక్ షేర్లు దూసుకుపోయాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి బలపడడం కూడా తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 24,000 పాయింట్లు, ఎన్ఎన్సీ నిఫ్టీ 7,350 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 464 పాయింట్లు (1.95 శాతం)లాభపడి 24,243 పాయింట్ల వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు (2.03 శాతం)లాభపడి 7,369 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది దాదాపు నెల గరిష్ట స్థాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల లాభం ... ఇంట్రాడేలో సెన్సెక్స్ 500 పాయింట్ల లాభ పడింది.గత రెండు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 1,240 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు ఈ స్థాయిలో లాభపడడం ఏడేళ్లలో దాదాపు ఇదే మొదటిసారి. బడ్జెట్‌పై మార్కెట్‌కు గురి కుదిరిందని, అధ్వాన పరిస్థితులు ముగిసిపోయినట్లు మార్కెట్ భావిస్తోందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఈసీబీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ల దన్నుతో ఈ నెలలో మార్కెట్ లాభాల బాట పడుతుందని వివరించారు. బ్యాంకులు మంచి స్థితిలో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి భరోసా ఇవ్వడం, నిర్దేశించుకున్న స్థాయిల్లోనే ద్రవ్యలోటును సాధించగలమన్న ప్రభుత్వ అంకితభావం, ఈ నెలలో ఎప్పుడైనా ఆర్బీఐ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు పెరిగి ఏడు వారాల గరిష్ట స్థాయికి చేరడం, గత కొన్ని రోజులుగా విక్రయాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు జరపడం ., సానుకూల ప్రభావం చూపించాయి. ఎస్బీఐ 12 శాతం అప్.. బాసెల్ త్రి నిబంధనలను మన బ్యాంక్‌లు అందుకునేలా మూలధన నిబంధనల్లో ఆర్బీఐ వెసులుబాటునివ్వడంతో బ్యాంక్ షేర్లు లాభాల ర్యాలీని జరిపాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ 12 శాతం లాభపడి రూ.181 వద్ద ముగిసింది. 2009, మే తర్వాత ఎస్బీఐ ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. కాగాఅమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలను మించడంతో మంగళవారం అమెరికా స్టాక్ సూచీలు భారీగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగాయి. ఈ ప్రభావం కూడా భారత్ స్టాక్ మార్కెట్‌పై పడింది. -
మార్కెట్ కు బడ్జెట్ బూస్ట్..
♦ బడ్జెట్ తరువాతి రోజు అతిపెద్ద ర్యాలీ... ఇదే ♦ సెన్సెక్స్ 777 పాయింట్లు జూమ్.. 23,779 వద్ద ముగింపు ♦ ఒకే రోజు ఇంతలా లాభపడటం ఏడేళ్లలో ఇదే తొలిసారి... ♦ 235 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ; 7,222 వద్ద క్లోజ్ ♦ వడ్డీరేట్ల కోతపై పెరిగిన ఆశలు; చైనా పాలసీ ఉద్దీపన ప్రభావం కూడా ♦ ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు... ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టించాయి. ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికి కట్టుబడతామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం దీనికి ప్రధాన కారణం. మరోపక్క... చైనా సెంట్రల్ బ్యాంక్ పాలసీ సడలింపుతో ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. ఈ పరిణామాల ప్రభావంతో సెన్సెక్స్ 777 పాయింట్లు దూసుకెళ్లింది. భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో బడ్జెట్ తర్వాత ఇంత భారీ ర్యాలీ ఇదే తొలిసారి. అంతేకాదు, గడిచిన ఏడేళ్లలో ఒక్కరోజులో సెన్సెక్స్ ఇంతలా లాభపడటం కూడా ఇదే మొదటిసారి. మొత్తంమీద మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2.5 లక్షల కోట్లు దూసుకెళ్లి... మన మార్కెట్లలో ‘మంగళ’వారం ఆనందాన్ని నింపింది. ముంబై: బడ్జెట్ రోజు తీవ్ర ఊగిసలాటకు గురైన మన మార్కెట్లలో మళ్లీ బుల్ ఉరకలేసింది. మంగళవారం ట్రేడింగ్ ఆరంభం నుంచే లాభాలతో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్... ఆ తర్వాత మరింత జోరందుకుంది. ఎఫ్ఎంసీజీ, వాహన, రియల్టీ షేర్ల దూకుడుతో ఒకానొక దశలో సెన్సెక్స్ క్రితం ముగింపు 23,002 పాయింట్లతో పోలిస్తే 819 పాయింట్లు ఎగిసి 23,821 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 777 పాయింట్లు లాభంతో(3. 38%) 23,779 వద్ద స్థిరపడింది. 2009 మే18న ఒకే రోజు సెన్సెక్స్ 2,111 పాయింట్లు పెరగగా... మళ్లీ ఒక్కరోజులో అతిపెద్ద లాభం ఇదే కావడం విశేషం. నిఫ్టీ కూడా 235 పాయింట్లు దూసుకెళ్లి(3.37%) 7,222 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కూడా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల తీవ్రంగా పతనమైన కొన్ని షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్ కూడా తాజా ర్యాలీకి దన్నుగా నిలిచిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జోష్ నింపిన ‘ద్రవ్యలోటు’... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును (జీడీపీతో పోలిస్తే) 3.9 శాతానికి పరిమితం చేస్తూనే... వచ్చే ఏడాది 3.5 శాతం లక్ష్యానికి కట్టుబడి ఉంటామన్న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రకటన మార్కెట్లలో ప్రధానంగా జోష్ నింపింది. బడ్జెట్ చాలా సమతూకంతో ఉందని.. ప్రభుత్వం మార్కెట్ల నుంచి రుణ సమీకరణను తగ్గించుకోనుండటంతో ఆర్బీఐకి వడ్డీరేట్ల తగ్గింపునకు ఆస్కారం లభించనుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు మోదీ సర్కారు పెద్దపీట వేయడం ఇన్వెస్టర్లలో రేట్ల కోతపై ఆశలు పెంచిందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, బడ్జెట్ సానుకూలతతో ప్రస్తుత ఏడాది ఆర్బీఐ అర శాతం పాలసీ వడ్డీరేటు(రెపో రేటు) అర శాతం మేర తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజి దిగ్గజం యూబీఎస్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. మరోపక్క, ఇన్ఫ్రా రంగానికి అధిక నిధుల ప్రభావంతో స్టీల్ రంగ షేర్లు పుంజుకున్నాయి. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ బీఎస్ఈ సెన్సెక్స్ 30 షేర్ల జాబితాలో 27 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ♦ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ అత్యధికంగా 10 శాతం మేర ఎగబాకి రూ. 325 వద్ద ముగిసింది. ఇక అధికంగా లాభపడిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్(7.75%), మారుతీ సుజుకీ(7.8%), హీరో మోటోకార్ప్(6.7%), అదానీ పోర్ట్స్(5.3%), గెయిల్(5%), టాటా మోటార్స్(5%), యాక్సిస్ బ్యాంక్(4.4%), టీసీఎస్(4.3%), ఎల్అండ్టీ(4.12%), ఇన్ఫోసిస్(3.76%), ఎంఅండ్ఎం(3.22%), టాటా స్టీల్(3.13%), విప్రో(2.9%) వంటివి ఉన్నాయి. ♦ అత్యధికంగా ఎఫ్ఎంసీజీ సూచీ 4.9 శాతం దూసుకెళ్లింది. ఆ తర్వాత కన్సూమర్ డ్యూరబుల్స్ సూచీ 4.37 శాతం, రియల్టీ 4.21 శాతం, ఆటోమొబైల్స్ ఇండెక్స్ 4.19% చొప్పున ఎగబాకాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3.23 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 3.04 శాతం లాభపడ్డాయి. ♦ మంగళవారం ప్రాథమిక గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.2,913 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) రూ.835 కోట్ల నికర విక్రయాలు జరిపారు. ఇన్వెస్టర్ల సంపద రయ్.. స్టాక్ మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద కూడా పరుగులు తీసింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) మంగళవారం రూ.2.5 లక్షల కోట్ల మేర ఎగబాకింది. రూ.88.34 లక్షల కోట్లకు చేరింది. చైనా ‘పాలసీ’ జోష్.. మందగమనంలోకి జారిపోతున్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే చర్యల్లో భాగంగా చైనా సెంట్రల్ బ్యాంక్ తాజాగా పాలసీ ఉద్దీపన చర్యలను ప్రకటించింది. రిజర్వ్ రిక్వయిర్మెంట్ రేషియో (ఆర్ఆర్ఆర్ - బ్యాంకులు తమ డిపాజిట్లలో సెంట్రల్ బ్యాంక్ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల పరిమాణం)ను మరో అర శాతం తగ్గించి.. 17 శాతానికి చేర్చింది. వ్యవస్థలోకి మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ ఉద్దీపనతో షాంఘై ఇండెక్స్ 1.7 శాతం పెరిగింది. ఆసియాలో ఇతర ప్రధాన సూచీలు కూడా లాభాల్లో నిలిచాయి. యూరప్ సూచీలు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అటు అమెరికా మార్కెట్లు సైతం 1 శాతంపైగా లాభాలతో ట్రేడవుతున్నాయి. 3 వారాల గరిష్టానికి రూపాయి 57 పైసలు అప్, 67.85 వద్ద క్లోజింగ్ ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు కోలుకుని బ్యాంకులు, ఎగుమతిదార్లు తాజాగా డాలర్లను విక్రయించడంతో మంగళవారం రూపాయి మారకం విలువ భారీగా పెరిగింది. డాలర్‌తో పోలిస్తే 57 పైసలు బలపడి మూడు వారాల గరిష్టమైన 67.85 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఒక్క రోజులో ఇంత అత్యధికంగా రూపాయి లాభపడటం ఇదే ప్రథమం. విదేశీ మార్కెట్లలో డాలర్ బలహీనంగా ఉండటం కూడా దేశీ కరెన్సీ బలపడటానికి దోహదపడింది. -
రుణ ఎగవేతదార్లపై... 'సుప్రీం కొరడా '
బ్యాంకుల్లో మొండిబకాయిలు పెరిగిపోవడంపై కన్నెర్ర రూ.500 కోట్లకు మించి బకాయిపడ్డ డిఫాల్టర్ల జాబితా ఇవ్వాల్సిందిగా ఆర్బీఐకి ఆదేశం ♦ పునర్వ్యవస్థీకరించిన రుణాల లిస్టు కూడా.. ♦ సీల్డు కవర్లో సమర్పించేందుకు 6 వారాల గడువు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిల సమస్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కన్నెర్రజేసింది. బడా రుణ ఎగవేతదారులపై కొరడా ఝళిపించేందుకు రంగంలోకి దిగింది. రూ. 500 కోట్లకు మించి రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన కంపెనీల జాబితాను తమముందు ఉంచాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతోపాటు కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ(సీడీఆర్) స్కీమ్‌లో రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకున్న కంపెనీల జాబితాను సైతం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆరు వారాల్లోగా వీటిని సీల్డు కవర్లో సమర్పించాలని పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. బెంచ్‌లో జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఆర్ బానుమతి ఉన్నారు. అదేవిధంగా సరైన రికవరీ యంత్రాంగం, తగిన మార్గదర్శకాలు లేకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ), ఆర్థిక సంస్థలు ఇంత భారీ స్థాయిలో రుణాలను ఎలా ఇచ్చాయో కూడా తెలియజేయాల్సిందిగా ఆర్బీఐకి సుప్రీం ధర్మాసనం సూచించింది. 2005 నాటి ‘పిల్’ ఎఫెక్ట్... సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) 2005లో దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తాజా విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆర్బీఐని కూడా ఒక ప్రతివాది(పార్టీ) కింద చేర్చింది. ప్రధానంగా కొన్ని కంపెనీలకు ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) ఇష్టానుసారంగా అర్హతలేని రుణ గ్రహీతలకు రుణాలిచ్చిందని పేర్కొంటూ ఈ పిల్ దాఖలైంది. కాగా, సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా సీపీఐఎల్ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్... ఒక్క 2015 సంవత్సరంలోనే రూ.40,000 కోట్ల విలువైన కార్పొరేట్ రుణాలను బ్యాంకులు మాఫీ చేసినట్లు తెలిపారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం... ఈ మొండిబకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక మహమ్మారిలా పట్టిపీడిస్తున్నాయని వ్యాఖ్యానించింది. డిఫాల్టర్ల నుంచి బకాయిల రికవరీకి బ్యాంకులు ఎలాంటి నిర్ధిష్టమైన చర్యలూ తీసుకోలేకపోవడం పట్ల బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది కూడా. ‘వ్యాపార సామ్రాజ్యాలను ఏలుతున్నవారు సైతం రుణాలను తిరిగిచెల్లించకుండా అతిపెద్ద డిఫాల్టర్లుగా మారుతున్నారు. దీనికి సంబంధించిన జాబితా మీ దగ్గర ఉందా’ అంటూ ఆర్బీఐ తరఫు లాయర్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు. ఈ మొండిబకాయిలకు ప్రధాన కారణం గత యూపీఏ ప్రభుత్వమేనంటూ వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌పై కూడా సుప్రీం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘తిరిగి వసూలు కావని తెలిసి కూడా కొంతమందికి బ్యాంకులు రుణాలిస్తాయి. చివరకు వాటిని మొండి బకాయిలుగా ప్రకటిస్తాయి’ అంటూ సుప్రీం ధర్మాసనం మండిపడింది. బ్యాంకుల్లో భారీగా మొండిబకాయిలు ఎగబాకుతుండటం... వాటిని రికవరీ చేసుకునే విషయంలో బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయంటూ ఇటీవలే ఒక జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని సుప్రీం కోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. 2013-15 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు రూ.1.14 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయంటూ ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రశాంత్ భూషణ్ ఈ సందర్భంగా సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఆ అధికారులకు ప్రభుత్వం కొమ్ముకాసింది: భూషణ్ అనర్హులకు రుణాలివ్వడం వల్లే హడ్కోకు భారీగా మొండిబకాయిలు పేరుకుపోయాయనేది 2005లో దాఖలు చేసిన పిల్లో భూషణ్ ప్రధాన ఆరోపణ. అయితే, దీనిపై సుప్రీం కోర్టు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)ని దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించిందని కూడా ఆయన తాజా విచారణలో పేర్కొన్నారు. కావాలనే రుణాలను ఎగవేసిన(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) వారికే హడ్కో రుణాలిచ్చిందన్న విషయాన్ని సీవీసీ తన నివేదికలో తేల్చిందని... అంతేకాకుండా దీనిపై శాఖాపరమైన చర్యలు చేపట్టడంతో పాటు సీబీఐ దర్యాప్తునకు కూడా సిఫార్సు చేసిన విషయాన్ని భూషణ్ ప్రస్తావించారు. అయితే, అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ అవకతవకలతో సంబంధం ఉన్న అధికారులకు కొమ్ముకాయడంతో పాటు ఈ కేసుల నుంచి తప్పించిందని ఆయన ఆరోపించారు. -
నేడు రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్ష
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్ష జరపనుంది. అయితే ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో... మంగళవారం సమీక్ష సందర్భంగా ఆర్బీఐ తాజా రెపో రేటు నిర్ణయం ఏదీ తీసుకోబోదని పలు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 6.75 శాతంగా ఉంది. గత క్యాలెండర్ ఇయర్లో రెపో రేటును ఆర్బీఐ 1.25 శాతం తగ్గించింది. రానున్న బడ్జెట్లో ద్రవ్యలోటు అంచనాలను పరిశీలించిన తర్వాతే రేటు కోతపై ఒక నిర్ణయం ఉంటుందని యస్‌బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ రాణా కపూర్ పేర్కొన్నారు. ఇక రేపటి సమీక్ష సందర్భంగా రేటు కోత ఉండదని సిటీగ్రూప్, హెచ్ఎస్బీసీ వంటి ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. బడ్జెట్లోని అంశాలను పరిశీలించిన తర్వాత మార్చి, ఏప్రిల్‌లో ఈ రేటు పావుశాతం తగ్గే వీలుందని సిటీ గ్రూప్ అంచనా, అయితే ఫిబ్రవరి 2న పావు శాతం రేటు కోత ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) అభిప్రాయపడుతోంది. -
ఫెడ్ మీటింగ్‌పై ఫోకస్...
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై ఇన్వెస్టర్ల దృష్టి - దేశంలో రుతుపవనాల గమనం కూడా మార్కెట్‌కు కీలకం న్యూఢిల్లీ: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్కెట్స్ కమిటీ సమావేశం ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నదన్న సంకేతాల్ని ఇటీవల అక్కడ వెలువడుతున్న గణాంకాలు ధ్రువపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మంగళ, బుధవారాల్లో జరిగే ఫెడ్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి వెలువడే క్లూలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం తర్వాత మళ్లీ సెప్టెంబర్ వరకూ ఫెడ్ కమిటీ సమావేశం వుండదు. ఇక దేశీయంగా రుతుపవనాల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రీతి మార్కెట్‌కు కీలకమని విశ్లేషకులు చెప్పారు. ఈ ఏడాది వర్షపాతం సగటుకంటే తక్కువగా వుంటుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు. గత శుక్రవారం మార్కెట్ ముగిశాక వెలువడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు సానుకూలంగా వున్నందున, ఈ సోమవారం తొలుత మార్కెట్ పాజిటివ్‌గా ట్రేడ్‌కావొచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నందున, ట్రేడింగ్ తొలిదశలో ఆర్జించిన లాభాల్ని మార్కెట్ నిలబెట్టుకోవడం కష్టమని అగర్వాల్ వివరించారు. జూన్ 16-17న జరిగే ఫెడ్ సమావేశం తర్వాత వడ్డీరేట్లపై అనిశ్చితి తొలగిపోతుందని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. గతవారం మార్కెట్.. వర్షాభావ భయాలతో ఇన్వెస్టర్లు జరిపిన విక్రయాల కారణంగా గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 343 పాయింట్లు క్షీణించి 26,425 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడువారాల్లో సెన్సెక్స్ 1,520 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 7,983 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాల్లో ఈ సూచి 476 పాయింట్లు తగ్గింది. ఎఫ్ఐఐల విక్రయాలు 4,700 కోట్లు న్యూఢిల్లీ: జూన్ నెల తొలి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ. 4,700 కోట్లు వెనక్కు తీసుకున్నారు. దేశీయ కార్పొరేట్ లాభాలు మందగిస్తున్నాయన్న ఆందోళన, ఆసియాలో చైనా, జపాన్ తదితర దేశాల ఈక్విటీల రాబడులు మెరుగ్గా వుండటంతో ఇక్కడ విదేశీ ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. జూన్ 1-12 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీ మార్కెట్లో రూ. 1,310 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 3,431 కోట్ల నికర విక్రయాలు జరిగాయి. -
సెంట్రల్ బ్యాంక్ వ్యాపార లక్ష్యం 5 లక్షల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల కోట్ల వ్యాపారాన్ని , రూ. 1,000 కోట్ల నికర లాభాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014-15లో రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపారం వచ్చే మార్చి నాటికి రూ. 5.07 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.కె.దివాకర్ తెలిపారు. -
సెంట్రల్ బ్యాంకులో చోరీ
కంచనపల్లి (రఘునాథపల్లి) : బ్యాంకులో డ్రా చేసిన డబ్బులు సినీ ఫక్కీలో చోరీ చేశారు. ఈ సంఘటన కంచనపల్లి సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గోవర్దనగిరికి చెందిన సంపతి మాధవరెడ్డి తన కూతురు అనిత పెళ్లి మే 1న కుదుర్చుకున్నాడు. పెళ్లి కోసం తండ్రి ధర్మారెడ్డి, తన పేరుపై పాలసీల పట్టాలపై రుణంకోసం జనగామ ఎల్ఐసీ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి, కొడుకులు కంచనపల్లి సెంట్రల్ బ్యాంకులో ఖాతాలు ఉండటంతో ఈ ఖాతా నంబర్లు అందించారు. రుణానికి సంబంధిం చిన డబ్బులు బ్యాంకులో జమ కాగా.. డ్రా చేసేందు కు తండ్రి ధర్మారెడ్డి, భార్య పద్మ, తల్లి లక్ష్మితో కలిసి సెంట్రల్ బ్యాంకుకు వెళ్లాడు. ధర్మారెడ్డి పేరున రూ44,750, మాధవరెడ్డి పేర రూ80,470 మొత్తం రూ1,25, 220 డ్రా చేసి కవర్లో ఉంచి తండ్రికి అప్పజెప్పాడు. భార్య పద్మ ఖాతాలో కొన్ని డబ్బులు ఉం డగా.. మాధవరెడ్డి విత్ డ్రా చేస్తుండగా ధర్మారెడ్డి బల్ల పై డబ్బుల కవర్ పెట్టి ఏమరు పాటుగా ఉన్న సమయంలో గుర్తు తెలియని 14 ఏళ్ల బాలుడు కవర్‌ను తీసుకొని పారిపోయాడు. తండ్రి వద్దకు కొడుకువచ్చి డబ్బులు ఏవనిఅడుగగా.. బిత్తర చూపులు చూస్తూ దొంగలించినట్లు గుర్తిం చిలబోదిబోమని మొత్తుకున్నారు.దీంతో తాము డ్రా చేసిన డబ్బులు అపహరిం చారని బ్యాంకు మేనేజర్ మనోజ్‌కు వివరించగా.. తాము ఏం చేసిది లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ రూరల్ సీఐ వాసాల సతీష్, ఎస్సై సత్యనారాయణ బ్యాంకు వద్దకు చేరుకొని సీసీ కెమెరాల పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. బయట ఇద్దరు దుండగులు 14 ఏళ్ల బాలుడితో చర్చించి బ్యాంకులోకి పంపి డబ్బులు అపహరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. అపహరించిన డబ్బులతో బాలుడు బయటకు వెళ్లాక దుండగులను కలిసినట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. బ్యాంకు ముందు కొద్ది దూరంలో ఉన్న ఓ వాహనంలో పారిపోవడం సీసీ కెమెరాలో దృశ్యాలు బంధించి ఉన్నారుు. అయితే దుండగుల ముఖాలు సీసీ కెమెరాల్లో గుర్తించకపోవడం సాధ్యం కాకపోవడంతో సీసీ దృశ్యాలను పోలీసులు తమ వె ంట తీసుకెళ్లారు. భద్రతలో నిర్లక్ష్యం బ్యాంకు అధికారులు ఎలాంటి సెక్యూరిటీని నియమించకపోవడంతో దుండగులకు బ్యాంకు లో చోరీ సులభమైంది.చోరీలో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్లు సీసీ కెమెరాలోని దృశ్యాలను బట్టి తెలుస్తోంది. వారిని ఎలాగైనా పట్టుకుంటామని ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. -
అవినీతిపరులపై చర్యలేవి?
ఏలూరు (టూటౌన్) : జిల్లా సహకార కేంద్రబ్యాంకు చాగల్లు బ్రాంచిలో నకిలీ బంగారం కుదువ పెట్టి రూ. 2 కోట్ల 35 లక్షల 62 వేలకు బ్యాంకును మోసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసి ఆరునెలలు అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయటం లేదని జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) ఆరోపించారు. ఆయన సోమవారం వివరాలు అందచేశారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న 27 మంది వ్యక్తులతో పాటు బ్రాంచిలో అప్రయిజర్‌గా పనిచేసిన గొర్తి శ్రీనివాసరావు, బ్రాంచి మేనేజర్లు వాడ్రేవు సుబ్బారావు, కూచిపూడి సత్యనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్ హరిత, క్యాషియర్ గద్దే రామారావు తదితరులపై, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మానుకొండ కృష్ణారావు 2014 సెప్టెంబర్ 24వ తేదీన చాగల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఆ మరుసటి రోజునే కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకూ వారిని అరెస్ట్ చేయలేదన్నారు. దీనిపై గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన ఎన్.రఘురామిరెడ్డితో పాటు ప్రస్తుత ఎస్పీ బాస్కర్‌భూషణ్‌ను స్వయంగా కలిసి చెప్పినప్పటికి ప్రయోజనం లేదన్నారు. కొవ్వూరు డీఎస్పీకి ప్రతి రోజూ ఫోన్ చేస్తున్నానన్నారు. అయినప్పటికి వారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదని ముత్యాలరత్నం ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోకపోవటంతో బ్రాంచికి రికవరీ రావటం లేదన్నారు. విచారణ అధికారిగా నిడదవోలు సీఐ ఈ కేసులో రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అరెస్ట్‌లు చేయటం పెద్ద విషయం కాదు. ప్రభుత్వ సొమ్మును రా బట్టాలన్నదే మా ఉద్దేశం. ఈ కేసును నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ విచారిస్తున్నా రు. నాకు ఈ రోజే ఫోన్ చేసి అడిగారు. రోజు ఫోన్ చేయటం అనేది అబద్దం. - నర్రా వెంకటేశ్వరరావు, డీఎస్పీ, కొవ్వూరు. ఒరిజనల్ రికార్డు ఇవ్వమని అడిగాం చాగల్లు బ్రాంచి కేసుకు సంబంధించి ఒరిజనల్ రికార్డు ఇవ్వమని అడిగాం. విచారణకు ఒక లైజనింగ్ అధికారిని కేటాయించమని చెప్పాం. వారు స్పందించలేదు. ఈ కేసులో రూ.16 లక్షల రికవరీ జరిగింది. ఈ నెల 28వ తేదీకి మరికొంత రికవరీ వచ్చే అవకాశం ఉంది. డీసీసీబీ అధికారులు సహకరిస్తే వారంలో కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం. - ఎం.బాలకృష్ణ, సీఐ, నిడదవోలు. -
బుల్లిష్‌గానే మార్కెట్!
* వచ్చే ఆర్బీఐ పాలసీపై ఆశలు * ఈసీబీ సమావేశంవైపు చూపు * కార్పొరేట్ ఫలితాల ప్రభావం కూడా న్యూఢిల్లీ: ఈ వారం కూడా భారత్ స్టాక్ మార్కెట్ బుల్లిష్‌గానే వుండవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. రిజర్వుబ్యాంక్ అనూహ్యంగా రెపో రేటును తగ్గించడంతో గతవారం ఈక్విటీలు ర్యాలీ సాగించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి తొలివారంలో ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష వున్నందున, ఆ సమావేశంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మరిన్ని చర్యల్ని కేంద్ర బ్యాంక్ తీసుకోవొచ్చన్న అంచనాలతో రానున్న ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు. అలాగే ఇటీవలి రేటు తగ్గింపు ప్రభావంతో వచ్చే కొద్దిరోజుల్లో వడ్డీ రేట్ల ప్రభావిత షేర్లు మరింత పెరుగుతాయని బ్రోకర్లు భావిస్తున్నారు. అయితే ఈ వారం వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నది అంచనా. హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కెయిర్న్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్తాన్ జింక్ తదితర కార్పొరేట్లు ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ కారణంగా స్వల్పకాలంలో నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని, కానీ మొత్తంమీద అప్‌ట్రెండ్ మాత్రం కొనసాగుతుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 663 పాయింట్ల పెరుగుదలతో 28,122 పాయింట్ల వద్ద ముగిసింది. 2014, అక్టోబర్ 31 తర్వాత ఒకేవారంలో ఇంత భారీ పెరుగుదల ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా ఈ వారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చు. ఈసీబీ ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు గత కొద్దికాలంగా మార్కెట్లో కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐల నికర పెట్టుబడులు రూ. 244 కోట్లు... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 244 కోట్లు మాత్రమే నికరంగా పెట్టుబడి చేశారు. అయితే రుణ మార్కెట్లో మాత్రం వీరు జనవరి 1-16 తేదీల మధ్య భారీగా రూ. 11,300 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు. ద్రవ్యోల్బణం బాగా క్షీణించడంతో పాటు వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా ఎఫ్ఐఐలు రుణ పత్రాల్లో భారీ పెట్టుబడులు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీ ఫండ్స్‌లో పెరుగుతున్న ఖాతాలు... స్టాక్ మార్కెట్ ర్యాలీ ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-2015) ఏప్రిల్- డిసెంబర్ మధ్య తొమ్మిదినెలల కాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 12 లక్షల కొత్త ఖాతాలను ఆకర్షించాయి. దేశంలోని మొత్తం 45 మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద ఈక్విటీ ఫోలియో ఖాతాల సంఖ్య గత నెలాఖరునాటికి 3,03,92,991కు పెరిగింది. 2014 మార్చి చివరినాటికి ఈ సంఖ్య 2,91,80,922. నాలుగేళ్ల తర్వాత 2014 ఏప్రిల్ నెలలో తొలిసారిగా ఖాతాల సంఖ్య పెరిగింది. అంతకుముందు 2009 మార్చి నుంచి ప్రతినెలా ఖాతాలు మూతపడుతూ వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రూ. 50,000 కోట్ల నికర పెట్టుబడుల్ని ఆకర్షించింది. -
ఫలించని వ్యూహం..
ఇబ్రహీంపట్నం: దొంగల చోరీ వ్యూహం ఫలించలేదు. పోలీసులు రావడంతో పరారయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇబ్రహీంపట్నంలోని సహకార కేంద్ర బ్యాంకులోకి చొరబడ్డారు. బీట్ కానిస్టేబుళ్లు అక్కడి రావడంతో పరారయ్యారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓ ఇన్నోవా వాహనంతో పాటు చోరీకి ఉపయోగించేందుకు దొంగలు తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం క్లూస్ టీం, జాగిలాలలో వివరాలు సేకరించారు. సీఐ మహ్మద్‌గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్ కానిస్టేబుళ్లు రామకృష్ట, భీమాగ్నిలు బీట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో వారు పట్టణంలోని సహకార బ్యాంక్ పరిసరాల్లో ఉన్నారు. బ్యాంక్ దగ్గర ఓ వ్యక్తి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అతడిని ప్రశ్నించారు. అంతలోనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా బ్యాంక్ భవనం వెనక గ్యాస్ సిలిండర్లు కనిపించాయి. అక్కడే ఉన్న ఓ ఇన్నోవా(ఏపీ16బీఆర్2473)ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దగ్గరికి వెళ్లి చూడగా కిటికీ ఊచలు తొలగించి ఉన్నాయి. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ, సీఐ మహమ్మద్‌గౌస్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆదివారం ఉదయం క్లూస్ టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. బ్యాంకులో ఎలాంటి చోరీ జరగలేదని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేనేజర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. కాగా బ్యాంక్‌లో కొంతకాలంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఈవిషయమై తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బ్యాంక్‌కు సెక్యూరిటీగార్డు కూడా లేడు. ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో చోరీ సులభమని దొంగలు భావించి ఉంటారని పోలీసులు తెలిపారు. చోరీ యత్నంలో దాదాపు ముగ్గురునలుగురు దుండగులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే మూఠానా..? ఘట్కేసర్: మండలంలోని జోడిమెట్లలో దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీకి పాల్పడిన ముఠా, ఇబ్రహీంపట్నం సహకార కేంద్ర బ్యాంకులో చోరీకి యత్నించింది ఒకే ముఠా అయి ఉండొచ్చని ఘట్కేసర్ పోలీసులు అనుమానిస్తున్నారు. గతనెల 9న దక్కన్ గ్రామీణ బ్యాంకులో దుండగులు కిటి కీ ఊచలు హైడ్రాలిక్ జాకీ సహాయంతో వంచి లోపలికి చొరబడి రూ. 35 లక్షల నగదు, 9 తులాల బంగారం అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. రెండు ఘటనల్లో దుండగులు కిటికీలను వంచడం, ఒకేవిధమైన సామగ్రి ఉపయోగించారు. ఈనేపథ్యంలో రెండు ఘటనలకు పాల్పడిందే ఒకే ముఠా కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఘట్కేసర్ సీఐ రవీందర్ ఆదివారం తెలిపారు. నెల రోజుల్లో రెండు ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగింది. కాగా పూర్తిగా నిర్ధారణకు రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఇబ్రహీంపట్నంలో పోలీసులు రావడంతో దొంగలు తమ ఇన్నోవా వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. దీంతో ఆధారాలు కొంతమేర దొరికే అవకాశం ఉందని చెప్పారు. త్వరలో దుండగులను పట్టుకొని కటకటాల వెనక్కి పంపుతామని సీఐ చెప్పారు. కొంతే రికవరీ.. ఐదేళ్ల క్రితం యాచారం పీఏసీఎస్‌లో నాలుగున్నర కిలోల బంగారం, నగదు చోరీ రెండున్నర కిలోల బంగారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్న పోలీసులు యాచారం: మండల కేంద్రంలోని పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లో 2009 జరిగిన చోరీ ఘటనలో పోలీసులు పూర్తిస్థాయిలో సొత్తు రికవరీ చేశారు. దొంగలు అప్పట్లో నాలుగున్నర కిలోల బంగారం, రూ. లక్ష నగదు అపహరించారు. ఏడాది తర్వాత దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు వారి నుంచి కేవలం రెండున్నర కిలోల బంగారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారులు ఆందోళన చేయడంతో అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు సంస్థకు చెందిన రూ. 50 లక్షల నగదును బాధితులకు పంపిణీ చేశారు. కాగా ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో సొత్తు స్వాధీనం చేసుకుంటే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. -
ఆప్కాబ్ విభజన షురూ
ఏప్రిల్ 2 నుంచి రెండు రాప్ట్రాలకు సహకార బ్యాంకులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంకు (ఆప్కాబ్) విభజనకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండోతేదీ నుంచి రెండు రాష్ట్రాల సహకార బ్యాంకులు పనిచేయటం ప్రారంభిస్తాయి. బ్యాంకు పాలకవర్గం సమావేశం గురువారం చైర్మన్ కె. వీరారెడ్డి అధ్యక్షతన అబిడ్స్‌లోని ఆప్కాబ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో బ్యాంకు విభజన చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం అబిడ్స్ నుంచి పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం నారాయణగూడలోని బ్యాంకు అతిథిగృహం, భవనాల సముదాయం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో ఆప్కాబ్‌కు స్థిరాస్థులు ఉన్న నేపథ్యంలో ఏపీలో ఏర్పాటయ్యే బ్యాంకు నూతన భవనం ఏర్పాటు చేసుకోవటంతోపాటు సౌకర్యాల కల్పనకు రూ. 50 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆప్కాబ్‌లో రూ. 1,650 కోట్ల మూల ధనం ఉంది. దాన్ని జనాభా ప్రాతిపాదికన ఆప్కాబ్‌కు రూ. 965 కోట్లు, తెలంగాణ రాష్ర్ట సహకార బ్యాంకుకు రూ. 685 కోట్లు కేటాయించనున్నారు. బ్యాంకుకు రూ. 75.42 కోట్ల ఆస్తులుండగా, తెలంగాణ బ్యాంకుకు రూ. 25.78 కోట్లు, ఆంధ్రాకు రూ. 49.63 కోట్ల ఆస్తులను కేటాయించారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా చైర్మన్లు విడిపోయిన తర్వాత ఈ బ్యాంకులకు చైర్మన్లు ఎవరవుతారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం ఆప్కాబ్ చైర్మన్‌గా ఉన్న కె. వీరారెడ్డి సహకార బ్యాంకు చైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుకు సంబంధించి ప్రస్తుతం ఆప్కాబ్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రత్నం ఇన్ ఛార్జి చైర్మన్ హోదాలో లేదంటే సీఎం రాజకీయంగా నిర్ణయం తీసుకున్న పక్షంలో చైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. -
రైతు నెత్తిన మరో పిడుగు
రుణాలపై వడ్డీ రేటు పెంపు ఆప్కాబ్ నిర్వాకం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో రైతాంగం నూజివీడు : ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయకుండా కాలం గడుపుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్న రైతుల నెత్తిన రాష్ట్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గడువు మీరిన రుణాలపై 2శాతం వడ్డీరేటును పెంచుతూ డీసీసీబీతో పాటు జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లకు ఆప్కాబ్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులను ఎంతో గోప్యంగా పంపడం గమనార్హం. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా వడ్డీ రేటును పెంచి ప్రభుత్వం తన సవతి ప్రేమను చూపించింది. పీఏసీఎస్‌లో తీసుకున్న రుణాలను ఏడాదిలోగా చెల్లించకపోతే, గడువు తీరిన తరువాత నుంచి 11శాతం వడ్డీరేటును విధిస్తుండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం అది కాస్తా 13శాతానికి పెంచారు. దీంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారు కానుంది. నాబార్డు పెంచిందని సాకు... రిజర్వుబ్యాంకు నుంచి నాబార్డుకు, నాబార్డు నుంచి ఆప్కాబ్‌కు, ఆప్కాబ్ నుంచి డీసీసీబీలకు నిధులు సమకూరుతాయి. అయితే నాబార్డు వడ్డీరేటు పెంచిందని చెప్పి ఆప్కాబ్ కూడా డీసీసీబీలకు ఇచ్చే నిధులపై వడ్డీరేటును పెంచింది. దీంతో డీసీసీబీలు కూడా సొసైటీల్లో రుణాలు తీసుకున్న రైతుల నెత్తిన పెరిగిన వడ్డీరేటును మోపింది. వడ్డీరేటు తగ్గించిన వైఎస్... 2004లో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి పీఏసీఎస్‌లలో తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై 12శాతం ఉండే వడ్డీరేటును తొలుత 11శాతానికి, క్రమేణా 7శాతానికి తగ్గించుకుంటూ వచ్చారు. అలాగే దీర్ఘకాలిక రుణాలకు ఉన్న 18శాతం వడ్డీరేటును తగ్గించారు. అంతేగాకుండా కేంద్రప్రభత్వం ఇచ్చే రాయితీని కూడా రైతులకు వర్తింపచేసి కేవలం పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన రైతు బాంధవుడు వైఎస్. 2004లో కేంద్రప్రభుత్వం నియమించిన వైధ్యనాథన్ కమిటీ సహకార సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పిస్తే, ఆ నివేదికలో ఉన్న సిఫార్సులను అమలు చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కుతుంది. అంతేగాకుండా నష్టాల్లో ఉన్న పీఏసీఎస్లన్నింటికి ఆర్థికపరిపుష్టి కల్పించారని రైతులే చెబుతున్నారు. రుణాలు మాఫీ చేసినా భారమే... ప్రభుత్వం రుణమాఫీని వర్తింపచేసినప్పటికీ రైతులకు రుణభారం నుంచి విముక్తి లభించే పరిస్థితులు కనిపించడం లేదు. డిసెంబర్ 31వరకు ఉన్న రుణాలు, బకాయిలను మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో జనవరి నుంచి రుణమాఫీ చేసేవరకు అయ్యే వడ్డీని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిందే. దీనికి తోడు గడువు దీరిపోయిన రుణాలకు సంబంధించి సెప్టెంబర్ నుంచి 2శాతం వడ్డీరేటు అదనంగా తోడవ్వనుంది. దీంతో రుణాలను మాఫీ చేసినా రైతులకు రుణమాఫీ భారం తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వడ్డీరేటు 2శాతం పెరిగింది : కేడీసీసీబీ సీఈవో తోట వీరబాబు గడువు దీరిన రుణాలపై వడ్డీరేటును 11శాతం నుంచి 13 శాతానికి పెంచిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ పెంపు సెప్టెంబరు ఒకటోతేదీ నుంచే అమలులోకి వచ్చింది. గడువు తీరకముందు వరకు 7శాతం, గడువుతీరిన తరువాత 13శాతం చొప్పున వడ్డీని లెక్కగట్టడం జరుగుతుంది. -
‘సహకార’ పీఠాలు వైఎస్సార్ సీపీవే
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఆదివారం జరిగిన ఎన్నికలలో రెండు పాలకవర్గాల పగ్గాలూ వైఎస్సార్ సీపీకే చిక్కాయి. డీసీసీబీ చైర్మన్‌గా లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆనందరంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా బోయ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా నార్పల జయరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీలోని 21 డెరైక్టర్ స్థానాల్లో 14 స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. రెండు స్థానాలు టీడీపీ మద్దతుదారులకు దక్కాయి. రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు లేక నాలుగు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానం ఖాళీ పడ్డాయి. వీటిని కోఆప్షన్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఎన్నికల అధికారి ఎం.నాగరాజు సమక్షంలో డెరైక్టర్లు సమావేశమయ్యారు. అభ్యర్థులు ఆలస్యంగా సమావేశానికి రావడంతో ప్రస్తుతానికి రెండు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానాన్ని మాత్రమే భర్తీ చేశారు. మారాల పీఏసీఎస్ నుంచి పెద్ద నరసమ్మ (ఎస్సీ), బుక్కచెర్ల పీఏసీఎస్ నుంచి హెచ్.ముత్యాలప్ప (ఎస్సీ), పి.యాలేరు పీఏసీఎస్ నుంచి కేశవనాయక్ (ఎస్టీ)లను కో ఆప్షన్ పద్ధతిలో ఎన్నుకున్నారు. మిగతా ఇద్దరు డెరైక్టర్లను ఎన్నుకునే బాధ్యతను పాలకవర్గానికి అప్పగించారు. ప్రస్తుతం ఎన్నికైన 19 మంది డెరైక్టర్లలో 17 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులే కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక లాంఛనంగా ముగిసింది. కో ఆప్షన్ సమావేశం ముగిసిన తరువాత ఉదయం 9 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. చైర్మన్ స్థానానికి గొల్లోళ్లచెరువు పీఏసీఎస్ అధ్యక్షుడు లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ స్థానానికి మడకశిర పీఏసీఎస్ అధ్యక్షుడు ఆనంద రంగారెడ్డి మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక డీసీఎంఎస్‌లో పది డెరైక్టర్ స్థానాలుండగా... నామినేషన్ల ఉపసంహరణ సమయానికి నాలుగు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మూడు వైఎస్సార్సీపీ మద్దతుదారులు, ఒకటి స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మరో నాలుగు స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించారు. నాలుగింటినీ వైఎస్సార్సీపీ మద్దతుదారులే చేజిక్కించుకున్నారు. అభ్యర్థులు లేక ఖాళీ పడిన రెండు స్థానాలను ఆదివారం ఎన్నికల అధికారి ఇ.అరుణకుమారి నేతృత్వంలో కో ఆప్షన్ పద్ధతిలో భర్తీ చేశారు. ఇవి కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. సోమందేపల్లి పీఏసీఎస్ నుంచి టి.రత్నమ్మ (ఎస్సీ), గోరంట్ల పీఏసీఎస్ నుంచి పాలే చందేనాయక్ (ఎస్టీ) కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. మొత్తం పది డెరైక్టర్ స్థానాల్లో వైఎస్సార్సీపీ తొమ్మిది కైవసం చేసుకోవడంతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులనే బలపర్చడంతో డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనంగా ముగిసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాలగుండ్ల శంకరనారాయణ, కాపు రామచంద్రారెడ్డి, నాయకులు బి.ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ సీఈఓ ఆర్సీ శ్రీనివాస్, జీఎం కె.విజయచంద్రారెడ్డి, డీఎల్సీవో ఫణిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్ సంతకంతో త్వరలో రూ.10 కొత్త నోటు
ముంబై: ఆర్ బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సంతకంతో త్వరలో రూ.10 కొత్త నోటు విడుదల కానుంది. మహాత్మాగాంధీ సిరీస్-2005లో ఈ నోటు విడుదల కానున్నట్లు సెంట్రల్ బ్యాంక్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నంబరింగ్ ప్యానల్స్‌లో ‘ఏ’ అక్షరం ఉంటుంది. 2014, రూపాయి సింబల్ వంటివి కూడా కొత్త నోటుపై ముద్రితమవుతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.10 నోట్ల తరహాలోనే దీని డిజైనింగ్ కూడా ఉంటుంది. కాగా కొత్త నోటు విడుదలైన తరువాత కూడా ప్రస్తుత రూ.10 నోట్లన్నీ కూడా మార్కెట్లో చెల్లుబాటులో ఉంటాయని ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. -
పంటలకు రుణపరిమితి పెంపు
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : వివిధ పంటల సాగులో పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ 2014-15 సంవత్సరానికి సంబంధించి రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో డీసీసీబీ అధ్యక్షురాలు చెరుకులపాడు కె.శ్రీదేవి అధ్యక్షతన గురువారం జిల్లా సాంకేతిక కమిటీ సమావేశమై పంట రుణాల పరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పెంపుపై చర్చించింది. పలు పంటలకు పంట రుణాల పరిమితిని పెంచుతూ సాంకేతిక కమిటీ నిర్ణయం తీసుకుంది. సమావేశం వివరాలను డీసీసీబీ అధ్యక్షురాలు వివరించారు. వరి, పత్తి తదితర అన్ని పంటల్లో పెట్టుబడి వ్యయం పెరిగినందున 2014 ఖరీఫ్, 2014-15 రబీ సీజన్లలో పంట రుణాల పరిమితిని పెంచినట్లు తెలిపారు. ఇందుకు సాంకేతిక కమిటీలోని బ్యాంకర్ల ఆమోదం తెలిపారని వివరించారు. వరికి ఈ ఏడాది రూ.24 వేల ప్రకారం పంట రుణాలు ఇవ్వగా, వచ్చే ఖరీఫ్‌లో 26 వేలు ఇచ్చే విధంగా నిర్ణయించినట్లు తెలిపారు. పత్తిలో పంట రుణ పరిమితిని రూ.25 వేల నుంచి రూ.27 వేలకు పెంచినట్లు చెప్పారు. పత్తి విత్తనోత్పత్తికి ఈ ఏడాది రుణ పరిమితి రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఉందని, దీనిని రూ.65 వేల నుంచి రూ.70 వేలకు పెంచినట్లు వివరించారు. వేరుశెనగకు 15 వేల నుంచి 16 వేలకు, మిరపకు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు రుణ పరిమితిని పెంచినట్లు వివరించారు. పసుపు సాగుకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఉన్న పంట రుణాల పరిమితిని రూ.40 వేల నుంచి రూ.45 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు ప్రకారం పంట రుణాలు ఇస్తుండగా, దీనిని రూ.14 వేల నుంచి రూ.16 వేలకు పెంచినట్లు వివరించారు. ఉల్లి సాగు రూ.10 వేల నుంచి రూ.12 వేలు రుణ పరిమితి ఉండగా దీనిని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. పెంచిన రుణ పరిమితి వచ్చే ఖరీఫ్ నుంచి అమలు అవుతుందని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ బి.వి.సుబ్బారెడ్డి, ఎల్డీఎం అండవార్, నాబార్డు డీజీఎం కళ్యాణ సుందరం, వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా సహాయ ప్యాకేజీలు యథాతథం
న్యూయార్క్: మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే అమెరికాలో సహాయ ప్యాకేజీలను యథాతథంగా కొనసాగించాలని అక్కడి సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. రెండు రోజుల పాటు జరిగిన పాలసీ సమీక్ష అనంతరం యూఎస్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) ప్యాకేజీల్లో ప్రస్తుతానికి ఎలాంటి కోత ఉండదని ప్రకటించింది. దీంతో నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలుకు(స్టిమ్యులస్) ఆటంకం తొలగినట్టే. ప్రధానంగా అమెరికాలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రికవరీ ఆశించినదానికంటే తక్కువ మోతాదులో ఉండటం, భవిష్యత్తులో కూడా పుంజుకునే అవకాశాలు సన్నగిల్లడమే దీనికి కారణం. ఇటీవలే 16 రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాల మూసివేత(షట్‌డౌన్) కూడా వృద్ధి రికవరీకి ప్రతికూలాంశంగా నిలవడంతో ఫెడ్ ప్రస్తుతానికి స్టిమ్యులస్కు కోతపెట్టకుండా వదిలేసింది. ప్రైవేటు రంగంలో ఉద్యోగ నియామకాలు కూడా మళ్లీ తగ్గుతుండటం, ద్రవ్యోల్బణం కనిష్టస్థాయిలోనే ఉండటం(ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 1.2 శాతమే-ఫెడ్ లక్ష్యం 2%) కూడా స్టిమ్యులస్ ఉపసంహరణపై వెనక్కితగ్గడానికి ప్రధాన కారకాలు. నిరుద్యోగ రేటు అధిక స్థాయిలోనే కొనసాగుతుండటం(ప్రస్తుతం 6.5 శాతంపైన ఉంది) అత్యంత ఆందోళనకరమైన అంశమని ఫెడ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ, కాబోయే చీఫ్, ప్రస్తుత వైస్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ అభిప్రాయపడినట్లు సెంట్రల్ బ్యాంక్ వర్గాల సమాచారం. మరోపక్క, పాలసీ వడ్డీరేట్లను ప్రస్తుత స్థాయిలోనే(పావు శాతంగా ఉంది) కొనసాగించడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని కూడా ఫెడ్ తేల్చి చెప్పింది. ‘తాజా గణాంకాల ప్రకారం ప్రజల వినియోగ వ్యయం, వ్యాపార పెట్టుబడులు కాస్త పుంజుకున్నాయి. అయితే, హౌసింగ్ రంగంలో గత కొద్ది నెలలుగా రికవరీ తగ్గుముఖం పట్టింది’ అని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) పేర్కొంది. ఫెడ్ తాజా నిర్ణయం ప్రపంచ మార్కెట్లకు సానుకూలాంశమే. ప్యాకేజీల కోతతో భారత్‌వంటి వర్ధమాన స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తిరోగమించొచ్చన్న భయాలకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.