న్యూయార్క్: ధరల అదుపే లక్ష్యంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3–3.25 శాతానికి ఎగశాయి. వెరసి వరుసగా మూడోసారి రేట్లను పెంచింది. గత నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణ కట్టడికే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ప్రాధాన్యత ఇచ్చినట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు.
కాగా.. కరోనా మహమ్మారి కాలంలో 9 ట్రిలియన్ డాలర్లకు చేరిన బ్యాలెన్స్‌షీట్‌ను తగ్గించేందుకు ఫెడ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు జూన్ నుంచి నెలకు 95 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను రోలాఫ్ చేయడం ద్వారా లిక్విడిటీలో కోత పెడుతోంది. ఈ నేపథ్యంలో డాలరు ఇండెక్స్ 110ను అధిగమించగా.. ట్రెజరీ ఈల్డ్స్ 3.56 శాతాన్ని తాకాయి. అయితే 2022 జనవరి–మార్చిలో 1.6 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ ఏప్రిల్–జూన్‌లోనూ 0.6 శాతం నీరసించింది. దీంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment