Federal Reserve Bank
-
బడ్జెట్, ఫెడ్ రేట్లపైనే దృష్టి
న్యూఢిల్లీ: వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 8వసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖకు పలు రంగాలు వినతులను అందించగా.. ఆదాయపన్ను సవరణలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి కొత్త ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల నడకను పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం ట్రేడింగ్కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 1) స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడింగ్‌ను నిర్వహించనుండటంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆరు రోజులపాటు లావాదేవీలకు వేదిక కానున్నాయి. అయితే బడ్జెట్ సెంటిమెంటుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్ల ట్రెండ్‌కు దిక్సూచిగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్ల చూపు బడ్జెట్ ప్రతిపాదనలపై నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. ప్రధానంగా నిరుత్సాహకర క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల నేపథ్యంలో బడ్జెట్‌కు ప్రాధాన్యత ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వినియోగం, ఫైనాన్షియల్ రంగాలు పేలవ పనితీరు చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక విధానాలు, వివిధ రంగాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. మౌలికం, తయారీ, టెక్నాలజీలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.యూఎస్ జీడీపీయూఎస్ ఫెడ్ గురువారం(30న) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే ద్రవ్యోల్బణ పరిస్థితులు బలపడుతుండటంతో వడ్డీ రేట్ల తగ్గింపు బాటను వీడి కఠిన విధానాలవైపు దృష్టిపెట్టవలసి రావచ్చునని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ట్రంప్ విధానాలు సైతం ఫెడ్ నిర్ణయాలను ప్రభావితం చేసే వీలున్నట్లు విశ్లేషకుల అంచనా. ఇక 2024 చివరి క్వార్టర్(అక్టోబర్–డిసెంబర్)కు జీడీపీ గణాంకాలు సైతం ఇదే రోజు వెలువడనున్నాయి. క్యూ3(జులై–సెప్టెంబర్)లో యూఎస్ జీడీపీ 3.1 శాతం ఎగసింది.క్యూ3 జాబితాలో..దేశీయంగా ఈ వారం మరికొన్ని కంపెనీల అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు వెల్లడికానున్నాయి. జాబితాలో దిగ్గజాలు ఎన్టీపీసీ, ఐవోసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో, సిప్లా, ఓఎన్జీసీ, అంబుజా సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్, బయోకాన్, మారికో, గెయిల్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీ పవర్ చేరాయి. ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి దారేదీ?ఇతర కీలక అంశాలుఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేయగల ఇతర అంశాలలో డాలరు మారకం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, ముడిచమురు ధరలు సైతం ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు వెల్లడించారు. దీంతో మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. బడ్జెట్లో పెట్టుబడుల కేటాయింపులకు వీలున్న రైల్వే, డిఫెన్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలతోపాటు పీఎస్‌యూ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 964.16 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 79,218.05 వద్ద, నిఫ్టీ 236.90 పాయింట్లు లేదా 0.98 శాతం నష్టంతో 23,961.95 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, సిప్లా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.03 సమయానికి నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 23,959కు చేరింది. సెన్సెక్స్ 790 పాయింట్లు దిగజారి 79,396 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.78 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.95 శాతం నష్టపోయింది. నాస్డాక్ 3.56 శాతం దిగజారింది.యూఎస్ ఫెడ్ వడ్డీ కోతఅంచనాలకు అనుగుణంగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో తాజాగా 0.25 శాతం కోత పెట్టింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.25–4.5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేటు తగ్గింపునకే మరోసారి మొగ్గు చూపింది. ఈ క్యాలండర్ ఏడాదిలో ఇది చివరి పాలసీ సమావేశంకాగా.. జో బైడెన్ హయాంలో పావెల్ చేపట్టిన చివరి సమీక్షగా నిపుణులు పేర్కొన్నారు. కాగా.. కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన వెంటనే చేపట్టిన సెప్టెంబర్ సమావేశంలో ఎఫ్‌వోఎంసీ 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. తదుపరి తిరిగి గత(నవంబర్) సమావేశంలో మరో పావు శాతం వడ్డీ రేటును తగ్గించింది. అయితే భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అంతలా ఉండకపోవచ్చంటూ బలమైన సంకేతాలు ఇచ్చింది. దాంతో మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కీలక వడ్డీరేట్లపై త్వరలో నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 24,198 వద్దకు చేరింది. సెన్సెక్స్ 502 పాయింట్లు దిగజారి 80,182 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.ఇదీ చదవండి: వింటేజ్ కారు ధర రూ.3,675!భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగియడానికి కారణాలను నిపుణులు విశ్లేషించారు.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ: వడ్డీరేట్ల తగ్గింపుపై దిశానిర్దేశం చేసే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు రాత్రి దీనికి సంబంధించి వివరాలు వెల్లడికానున్నాయి. రేపు మన మార్కెట్లో దీని ప్రభావం ఉండనుంది.చైనా ఆర్థిక మందగమనం: చైనా తాజా గణాంకాలు ఊహించిన దానికంటే బలహీనమైన ఆర్థిక పనితీరును చూపించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌ను ప్రభావితం చేసింది. భారతదేశ మెటల్, ఆటో స్టాక్లను ప్రభావితం చేసింది.యూఎస్ డాలర్ బలపడటం: బలమైన డాలర్ భారతీయ ఈక్విటీల వైపు విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. డాలర్ డినామినేషన్ చెల్లించే రుణాలు కంపెనీలకు భారంగా మారుతాయి.వాణిజ్య లోటు పెరుగుదల: నవంబర్‌లో వాణిజ్య లోటు గణనీయంగా పెరగడంతో రూపాయిపై ఒత్తిడి అధికమైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలు
భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ రిజర్వ్‌లు) భారీగా క్షీణిస్తున్నాయి. నవంబరు 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) తగ్గి 657.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.55.31 లక్షల కోట్ల)కు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. అంతకుముందు ఇవి 6.477 బిలియన్ డాలర్లు క్షీణించి 675.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అందుకు అంతర్జాతీయంగా కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.యూఎస్ డాలర్ పెరుగుదల: అమెరికా ఎన్నికల ప్రచార సమయం వరకు స్థిరంగా కదలాడిన డాలర్, ఫలితాల తర్వాత ఊపందుకుంది. దాంతో రూపాయి విలువ పడిపోయింది. ఫలితంగా దేశీయ పారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి.పెరుగుతున్న దిగుమతులు: దేశీయ దిగుమతులు అధికమవుతున్నాయి. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లలోనే చెల్లించాలి.ఆర్బీఐ: మార్కెట్ ఒత్తిళ్ల మధ్య రూపాయికి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలను విక్రయిస్తోంది. రూపాయి మరింత పడిపోకుండా చర్యలు తీసుకుంటోంది. డాలర్-రూపీ మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి ఇది దోహదపడుతోంది.ఇదీ చదవండి: అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపువిదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు: విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్స్, బాండ్లను విక్రయించడంతో స్థానిక ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. నవంబర్‌లో ఇప్పటి వరకు దాదాపు 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు పైగా అమ్మకాలు చేపట్టారు.ఫెడరల్ రిజర్వ్ విధానాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను ఉపసంహరిస్తున్నారు. -
బుల్.. కొత్త రికార్డుల్!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గింపు, అమెరికా, ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు కలిసిరావడంతో దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్ 1,360 పాయింట్లు ఎగసి తొలిసారి 84 వేల స్థాయిపైన 84,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 25,750 ఎగువున 25,791 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఇది సరికొత్త రికార్డు ముగింపు. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,510 పాయింట్లు బలపడి 84,694 వద్ద, నిఫ్టీ 433 పాయింట్లు ఎగసి 25,849 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు, మెటల్, ఆటో, రియల్టీ రంగాలకు చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.37%, 1.16 శాతం చొప్పున పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు పెరిగి 83.55 స్థాయి వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. యూరప్ మార్కెట్ల ఒకటిన్నర శాతం నష్టపోయాయి. రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.21%, ప్రైవేటు రంగ బ్యాంక్ సూచీ 3%, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్సు 2.32% లాభపడ్డాయి. ఆటో, ఇండ్రస్టియల్, మెటల్, కన్జూమర్ సూచీలు 2% పెరిగాయి. → పసిడి రుణాల వ్యాపారంపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేయడంతో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు భారీగా లాభపడింది. బీఎస్ఈలో 7% పెరిగి రూ.531 వద్ద స్థిరపడింది.→ ఐటీడీ సిమెంటేషన్ ఇండియా షేరు 20% లాభపడి రూ.566 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ఈ కంపెనీలో అదానీ ఈ కంపెనీలో 46.64% వాటా కొనుగోలు చేయ నుందన్న వార్తలతో ఈ షేరుకుడిమాండ్ నెలకొంది. → సెన్సెక్స్ 1,330 పాయింట్లు ర్యాలీ చేయడంతో ఒక్కరోజులో రూ.6.24 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.472 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లో 30కి గానూ 26 షేర్లు లాభపడ్డాయి. నాలుగు షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే 1000కి పైగా పాయింట్లు లాభపడటం ఇది పదోసారి కావడం విశేషం. → ఐసీఐసీఐ(4%), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం 1,360 పాయింట్లలో సగ భాగం ఈ షేర్ల నుంచి వచ్చాయి. ఇంట్రాడేలో ఐసీఐసీఐ బ్యాంకు అయిదున్నర శాతం ర్యాలీ చేసి రూ.1361 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. -
ఫెడ్ వడ్డీ కోత పసిడికి బూస్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. నాలుగేళ్ల తదుపరి బుధవారం 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. అయితే చౌకగా లభించనున్న ఫైనాన్సింగ్ భారత్ వంటి వర్ధమాన దేశాలకు పెద్దగా కలసిరాకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విదేశీ నిధులు బంగారం ధరలకు దన్నునిచ్చే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. మిశ్రమ అంచనాలు సుమారు 14 నెలలపాటు రెండు దశాబ్దాల గరిష్టం వద్ద కొనసాగిన ఫెడ్ ఫండ్స్ రేట్లు దిగివస్తున్నాయి. తాజాగా రేట్ల తగ్గింపు టర్న్ తీసుకున్న ఫెడ్ ఈ ఏడాది చివరి(డిసెంబర్)కల్లా మరో 0.5 శాతం కోత పెట్టనున్నట్లు అంచనా. అయితే ఫెడ్ రేట్ల తగ్గింపుతో ఈక్విటీలపై రాబడి క్షీణించనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజీవ్ అగర్వాల్ అంచనా వేశారు. మరోవైపు బంగారం ధరలు బలపడే వీలున్నట్లు పేర్కొన్నారు. కామా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. సమీపకాలంలో పసిడి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరవచ్చని తెలియజేశారు. యూఎస్ రేట్ల కోత బంగారంలో పెట్టుబడులకు దారిచూపుతుందని అభిప్రాయపడ్డారు. రేట్ల కోతకు దారి... ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు బిజ్2క్రెడిట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా పేర్కొన్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు అంచనా వేశారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేశారు. వెరసి ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడ్డారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనున్న విషయం విదితమే.అయితే ప్రపంచ దేశాల వడ్డీ రేట్ల ప్రభావం భారత్‌పై ఉండదని ఇండియాబాండ్స్.కామ్ సహవ్యవస్థాపకుడు విశాల్ గోయెంకా పేర్కొన్నారు. రిస్క్ ఆస్తులలో భారీ ర్యాలీ, ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణ ప్రభావాల కారణంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపునకు చాన్స్ తక్కువేనని తెలియజేశారు. అంచనాలకు మించి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎడిల్వీజ్ ఎంఎఫ్ ఈక్విటీస్ సీఐవో త్రిదీప్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.భారత్‌పై ప్రభావం అంతంతే..మార్కెట్‌వర్గాలు ఇప్పటికే చాలా మటుకు ఫెడ్ వడ్డీ రేట్ల కోతను పరిగణనలోకి తీసుకున్నందున దీని ప్రభావం భారత్‌పై పెద్దగా ఉందు. దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, మొత్తం మీద రేట్ల తగ్గింపనేది వర్ధమాన మార్కెట్లకు మాత్రం సానుకూలమే. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్‌పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
23 ఏళ్ల గరిష్ఠానికి చేరిన కీలక వడ్డీరేట్లు.. తగ్గింపు ఎప్పుడంటే..
అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తన ప్రామాణిక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న 5.25-5.50 శాతం వడ్డీరేట్లు 23 ఏళ్ల గరిష్ఠ స్థాయిని చేరాయి. అయినా వీటిని తగ్గించేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వరుసగా అయిదోసారి సమావేశంలోనూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లలో మార్పు చేయలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని 2 శాతం కంటే తక్కువకు తీసుకువచ్చేలా ఫెడ్ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే వడ్డీరేట్లను మార్చడం లేదంటూ ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ పలుమార్లు తెలిపారు. ఫిబ్రవరి ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా 3.2 శాతంగా నమోదైంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు అంచనాల్లో అనిశ్చితి కొనసాగుతుండడంతో, ద్రవ్యోల్బణంపై అత్యంత అప్రమత్తతగా ఉంటున్నట్లు ఫెడ్ బుధవారం (మన కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు) పేర్కొంది. ఇదీ చదవండి: పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. స్థిరమైన వృద్ధికి అవకాశం ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం దిశగా చలిస్తోందన్న విశ్వాసం వచ్చే వరకు కీలక వడ్డీరేట్లలో మార్పు ఉండదని కమిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో రేట్ల కోత వైపునకు ఫెడ్ మొగ్గు చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో అమెరికన్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ర్యాలీ గురువారం ఇండియన్ మార్కెట్లలోనూ కొనసాగే అవకాశం ఉంది. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ బూస్ట్!
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించినట్లే యథాతథంగా ఉంచడంతో పాటు సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలు ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. దేశీయంగా వాహన విక్రయాలు రికార్డు గరిష్టానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగి 64,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు బలపడి 19,133 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆద్యంతం జోరు కనబరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 611 పాయింట్లు దూసుకెళ్లి 64,203 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు బలపడి 19,175 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లకు చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ లభించింది. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల షేర్లను అమ్మేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1380 కోట్ల షేర్లు కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నుంచి సానుకూల సంకేతాలు, జపాన్ ప్రభుత్వం 113 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రకటన, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం తదితర పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు 1–1.5 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో ఇన్వెస్టర్లు సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.1 లక్షల కోట్లు పెరిగి రూ. 313.32 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా(1%), బజాజ్ ఫైనాన్స్(0.25%) మాత్రమే నష్టపోయాయి. ► క్యూ2 నికర లాభం ఐదు రెట్లు వృద్ధి సాధించడంతో జేకే టైర్ షేరు 10% లాభపడి రూ.337 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ర్యాలీ చేసి రూ.351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► క్యూ2 ఫలితాల ప్రకటన తర్వాత హీరో మోటో కార్ప్ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. 1% నష్టపోయి రూ.3050 వద్ద స్థిరపడింది. -
వచ్చేవారం మార్కెట్లు ఎలా ఉంటాయంటే?
వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. వారంతంలో అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది.. దసరా పండగ సీజన్లో మార్కెట్ ఎలా ఉంటుందనే అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. అదే తీరు కొనసాగనుంది. దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్‌గా విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఉపసంహరించుకునే వీలుంది. గడిచిన వారంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. డాలర్ విలువ పెరుగుతుండడంతో రూపాయి మారకం పడిపోయి ధరలు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారాలు, పండగ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం ఉండదు. కేంద్రం అందిస్తున్న ప్రయోజనాల మూలంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు బలంగా ఉన్నాయి. దేశంలో యువత ఎక్కువగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో తాత్కాలికంగా కొంత ఒడుదుడుకులు నెలకున్నా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. యూఎస్ ట్రెజరీలు అనిశ్చితిలో ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ సంక్షోభానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని గమనించాలి. అమెరికా ట్రూప్లపై డ్రోన్లు దాడిచేసేందుకు ప్రయత్నించాయనే వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్‌కు మాత్రమే యుద్ధం కొనసాగితే మార్కెట్లు పెద్దగా స్పందించే స్థితిలో లేవు. కానీ వాటికి మద్ధతు ఇస్తున్న దేశాల స్పందించే విధానం వల్ల యుద్ధ భయాలు చెలరేగితే మార్కెట్లు నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో మదుపర్లు తమ సొమ్మును భద్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. యూఎస్ 10 ఏళ్లు ట్రెజరీ బాండ్లు ఏప్రిల్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన వారంలో గరిష్ఠాన్ని తాకాయి. అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఈ అన్ని కారణాల వల్ల వచ్చేవారం మార్కెట్లు కొంత ఒడుదుడుకులకు లోనవచ్చు. గతవారంలో నిఫ్టీ 19850 వద్దకు చేరి అక్కడి నుంచి ప్రతికూలంగా స్పందించింది. వారం మధ్యలో బెంచ్‌మార్క్ సూచీల్లో అమ్మాకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు రెండూ వారంలో ఒక శాతం కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
Fed Meeting: వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఫెడరల్ రిజర్వ్ గతంలోలాగా వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అభిప్రాయాలు ఉండేవి. కానీ పావెల్ తెలిపిన వివరాలతో గ్లోబల్ మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పెడరల్ రిజర్వ్ బెంచ్‌మార్క్ రుణ రేటు 22 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ఇప్పుడున్న లక్ష్యంగా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్‌లో గరిష్ట స్థాయికి చేరిన ప్రధాన ద్రవ్యోల్బణం.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గినప్పటికీ, వడ్డీరేట్లు పెంపు ప్రక్రియ దీర్ఘకాలికంగా కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం అమెరికాలో టెక్ షేర్లలో వచ్చిన అమ్మకాల వెల్లువ అక్కడి మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. యూఎస్‌లో బాండ్ల రాబడులు మరింత పెరగడం కూడా ప్రతికూలంగా మారింది. -
ద్రవ్యోల్బణ డేటా.., ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల పురోగతికి సంబంధించిన వార్తలను పరిగణలోకి తీసుకోవచ్చంటున్నారు. ఇదేవారంలో ఫెడ్‌తో సహా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు తమ ద్రవ్య విధానాలపై చేసే ప్రకటనలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వెల్లడించే ద్రవ్య విధాన వైఖరి అనుగుణంగా ఈక్విటీ మార్కెట్లు కదలాడొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 18,680 – 18,780 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు కొనసాగితే దిగువ స్థాయిలో 18,500 – 18,450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అవుట్‌లుక్‌ను(5.2% నుంచి 5.1 శాతానికి)ను ఆశించిన స్థాయిలో తగ్గించకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. ఫలితంగా మార్కెట్ గతవారం చివరి రెండు ట్రేడింగ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అయినప్పటికీ.., వారం మొత్తంగా సెన్సెక్స్ 79 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్లు చొప్పున బలపడ్డాయి. ఎఫ్ఐఐలు.., డీఐఐలు కొనుగోళ్లే.. గడచిన వారంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు).., సంస్థాగత ఇన్వెస్టర్లు ఇరువురూ కొనుగోళ్లు చేపట్టారు. జూన్ 5–9 తేదీల మధ్య ఎఫ్ఐఐలు నికరంగా రూ.979 కోట్లు, డీఐఐలు రూ. 1938 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఎఫ్ఐఐలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించే విధంగా సెబీ ఇటీవల నిబంధనలను కఠినతరం చేసింది. సులభతర వ్యాపార నిర్వహణ విషయంలో భారత్ ధృడవైఖరిపై ఇది మరోసారి చర్చకు దారీ తీసింది’’ బీడీఓ ఇండియా ఫైనాన్సియల్ సర్వీసెస్ టాక్స్ చైర్మన్ మనోజ్ పురోహిత్ తెలిపారు. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ ఏడాది మే రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఏప్రిల్ నమోదైన 4.79% కంటే తక్కువగానే మేలో 4.34శాతంగా నమోదవచ్చొని ఆర్థిక అంచనా వేస్తున్నారు. మరుసటి రోజు(జూన్ 13) డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జూన్ రెండోవారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్రెండో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. ఎఫ్ఓఎంసీ నిర్ణయాలపై దృష్టి అమెరికా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశం మంగళవారం(జూన్ 13న) మొదలై బుధవారం ముగిస్తుంది. ఈసారి కీలక వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వైపు నుంచి చూస్తే ఎఫ్ఓఎంసీ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. పాలసీ వెల్లడి సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసే వ్యాఖ్యలు ఈక్వి టీ మార్కెట్ల స్థితిగతులను మార్చగలవు. ప్రపంచ పరిణామాలు... అమెరికా మే సీపీఐ ద్రవ్యల్బణ డేటా మంగళవారం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వెల్లడి బుధవారం వెల్లడి కానున్నాయి. గురువారం అమెరికా మే రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోపియన్ జోన్ ఏప్రిల్ వాణిజ్య లోటు డేటా యూరోపియన్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య విధాన వైఖరి విడుదల అవుతుంది. చైనా మే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు, నిరుద్యోగ రేటు డేటా వెల్లడి కానుంది. మరుసటి రోజు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల డేటా, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా కన్జూమర్ సెంటిమెంట్ గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. -
భారీ ఊరట: తగ్గిన పసిడి ధర, మరింత దిగొచ్చే అవకాశం!
సాక్షి,ముంబై: మండు వేసవిలో చల్లటి కబురు. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధర శుక్రవారం మరింత తగ్గి మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర 62 వేల దిగువనే కొనసాగుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములు రూ.60,000 దిగువన ట్రేడవుతోంది. (అమెజాన్ దిమ్మతిరిగే పెట్టుబడులు: ఏడాదికి లక్షల ఉద్యోగాలు) హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్లకు రూ 300 తగ్గి రూ.55800గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60870గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 1,964.4 డాలర్లుగా ఉంది. అటు వెండి ధరకూడా స్వల్పంగా 200 తగ్గి కిలో వెండి 74300గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ 78 వేలుగా ఉంది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 61,020, 22 క్యారెట్ (10 గ్రాములు) రూ. 55,950. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 61,360 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 56,250. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉంది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) స్వల్పకాలిక ప్రాతిపదికన బంగారంపై సెంటిమెంట్ ఒక వారం వ్యవధిలో బుల్లిష్ నుండి బేరిష్కు మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధర తగ్గడానికి రెండు అంశాలు కారణమని భావించారు. జూన్ 1 నాటికి తమ రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా డిఫాల్ట్ అవుతుందనే ఆందోళన నెలకొంది. అయితే చర్చలు అర్థవంతంగా ఉన్నాయని అధ్యక్షుడు బిడెన్ హామీ ఇచ్చినప్పటికీ డెట్ సీలింగ్ చర్చలు ఫెడ్ రేట్లను ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించనున్నవడ్డీరేట్ల ఆధారంగా పసిడి ధరల కదలికలు ఉండనున్నాయి. (Adani-Hindenburg Row: హిండెన్‌బర్గ్ ఆరోపణలు: అదానీకి భారీ ఊరట) -
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట!
సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట లభించింది. ఎఫ్‌డీఐసీ నియంత్రణలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆస్తులు, డిపాజిట్లను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కొనుగోలు చేసింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా ఆర్థిక పరిస్థితి. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కోవిడ్ మరణాల నమోదుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో కుదుట పడింది. అంతలోనే బ్యాంకుల దివాలా రూపంలో అనుకోని ఉపద్రవం వచ్చిపడింది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది కాలంలో తొమ్మిది సార్లు (మార్చి 22 నాటికి ) వడ్డీ రేట్లు పెంచింది. దీంతో వడ్డీ రేట్ల పెంపుతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకులకు నష్టాలు చుట్టుముట్టడంతో ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) రంగంలోకి దిగింది. ఆ రెండు బ్యాంకులను మూసివేసి తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ తరుణంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చెందిన డిపాజిట్లు, రుణాలను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ కొనుగోలు చేసింది. తద్వారా నేటి నుంచి ఎస్వీబీ డిపాజిటర్లంతా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ ఖాతాదారులుగా మారనున్నారు. కాగా, ఎఫ్‌డీఐసీ నియంత్రణలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌కు 2023 మార్చి 10 నాటికి 167 బిలియన్ డాలర్ల ఆస్తులు, 119 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. తాజా కొనుగోలులో 72 బిలియన్ డాలర్ల ఆస్తులను 16.5 బిలియన్ డాలర్ల రాయితీతో ఫస్ట్ సిటిజిన్ బ్యాంక్ సొంతం చేసుకుంది. -
ఫెడ్ 0.25 శాతం వడ్డీ పెంపు
న్యూయార్క్: అంచనాలకు అనుగుణంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4.75–5 శాతానికి చేరింది. నిజానికి కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణ అదుపునకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఫెడ్.. వడ్డీ రేట్లను వేగంగా పెంచుతూ వస్తోంది. దీంతో 2022 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి1 వరకూ దశలవారీగా 4.5 శాతం వడ్డీ రేటును పెంచింది. వెరసి 2022 ఫిబ్రవరిలో 0–0.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేటు తాజాగా 5 శాతానికి ఎగసింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అంచనాలను మించి వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. b v అయితే కొద్ది రోజులుగా అమెరికా, యూరప్ బ్యాంకింగ్ రంగాలలో సంక్షోభ పరిస్థితులు తలెత్తడంతో ఫెడ్ పాలసీ సమీక్షకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్‌లో సిల్వర్‌గేట్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ ఇప్పటికే విఫలంకాగా.. ప్రస్తుతం ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు సంక్షోభంలో ఉంది. మరోవైపు క్రెడిట్ స్వీస్ దివాలా స్థితికి చేరడంతో యూరప్ బ్యాంకింగ్ రంగంలోనూ ప్రకంపనలు పుడుతున్నాయి. స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు వేగానికి బ్రేక్ పడనున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. -
ఆరోసారి ఫెడ్ వడ్డీ పెంపు
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్ల పెంపును చేపట్టింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ఎజెండాగా వరుసగా ఆరోసారి ఫండ్స్ రేట్లను పెంచింది. తాజాగా 0.75 పెంపును ప్రకటించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి చేరాయి. దీంతో వరుసగా నాలుగోసారి 0.75 శాతం చొప్పున రేట్లను పెంచినట్లయ్యింది. ఈ ఏడాది(2022) ఇప్పటివరకూ ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను 3.75 శాతం హెచ్చించింది. ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలోలేని విధంగా 8 శాతాన్ని అధిగమించడంతో ఫెడ్ ధరల కట్టడికి అత్యంత కీలకమైన వడ్డీ రేట్ల పెంపు మార్గాన్ని ఎంచుకుంది. తాజాగా సెప్టెంబర్‌లోనూ వినియోగ ధరల ఇండెక్స్ 8.2 శాతాన్ని తాకింది. -
ఆకాశానికి డాలర్, పాతాళానికి రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరింత పతనమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ 40 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 81.93ని తాకింది. ప్రస్తుతం 36 పైసలు కోల్పోయి 81.88 వద్ద కనొసాగుతోంది. డాలర్ బుధవారం సరికొత్త గరిష్టాలకు ఎగబాకడంతో దేశీయ కరెన్సీ కొత్త రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం, ట్రెజరీ దిగుబడులు పెరగడం వల్ల కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయిని అధిగమించింది. ద్రవ్యోల్బణ కట్టడికోసం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న వడ్డీ పెంపు నిర్ణయం డాలరుకు బలాన్నిస్తోంది. ఇదీ చదవండి : StockMarketOpening: మరింత కుదేలవుతున్న మార్కెట్లు -
ఫెడ్ భారీ ‘వడ్డిం‘పు
న్యూయార్క్: ధరల అదుపే లక్ష్యంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3–3.25 శాతానికి ఎగశాయి. వెరసి వరుసగా మూడోసారి రేట్లను పెంచింది. గత నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణ కట్టడికే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ప్రాధాన్యత ఇచ్చినట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కాగా.. కరోనా మహమ్మారి కాలంలో 9 ట్రిలియన్ డాలర్లకు చేరిన బ్యాలెన్స్‌షీట్‌ను తగ్గించేందుకు ఫెడ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు జూన్ నుంచి నెలకు 95 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను రోలాఫ్ చేయడం ద్వారా లిక్విడిటీలో కోత పెడుతోంది. ఈ నేపథ్యంలో డాలరు ఇండెక్స్ 110ను అధిగమించగా.. ట్రెజరీ ఈల్డ్స్ 3.56 శాతాన్ని తాకాయి. అయితే 2022 జనవరి–మార్చిలో 1.6 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ ఏప్రిల్–జూన్‌లోనూ 0.6 శాతం నీరసించింది. దీంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చాన్స్
ముంబై: హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం డేటా వెల్లడి (మంగళవారం) మినహా దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున.. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు ప్రపంచ పరిణామాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం వెల్లడి కానున్న ఫెడ్ రిజర్వ్ జూలై పాలసీ సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో సెన్సెక్స్ 1,075 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగిరావడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ‘‘గడిచిన రెండు నెలల్లో సూచీలు 16% ర్యాలీ చేయడంతో మార్కెట్ ఓవర్‌బాట్ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు వీలుంది. సాంకేతికంగా నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 17,850 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,350–17,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఎఫ్ఓఎంసీ మినిట్స్: ఫెడ్ జూలై పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 16న (బుధవారం) ప్రకటించనుంది. ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, మాంద్యంతో పాటు వడ్డీ రేట్లపై ఫెడ్ పాలసీ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలమని నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా మంగళవారం గతవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. అదేరోజన జూలై హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. జూన్‌తో పోలిస్తే (15.18 శాతం) ఈ జూలై డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం దిగిరావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జూలై మాసపు ప్యాసింజర్ వాహన అమ్మకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. అలాగే ఆర్బీఐ ఆగస్టు 13 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల ఐదో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఆగస్టు 1–15 తేదీల మధ్య రూ. 22,452 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది(2021) అక్టోబర్‌లో మొదలైన విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ జూన్ నాటికి రూ.2.46 లక్షల కోట్ల నిధులను భారత ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా.., ఈ జూలైలో రూ. 6295 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జూలై నెల నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవడం, ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న తగు నిర్ణయాలతో విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభించాయి’’ కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రీటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. ఈ వారంలోనూ ట్రేడింగ్ 4 రోజులే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (నేడు) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీతో పాటు కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి మంగళవారం యధావిధిగా ప్రారంభమవుతాయి. -
‘మాంద్యం’లోకి జారిన అమెరికా!
వాషింగ్టన్: అమెరికా జూన్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలేకపోగా 0.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అగ్రరాజ్య జీడీపీ క్షీణతలో ఉండడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. మార్చి త్రైమాసికంలో ఎకానమీ 1.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వరుసగా రెండు త్రైమాసికాలు ఎకానమీ క్షీణ బాటలో ఉంటే దానిని అనధికారికంగా (సాంకేతికంగా) మాంద్యంగానే పరిగణిస్తారు. తాజా పరిస్థితిని క్షీణతగా ఎంతమాత్రం భావించరాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొంటున్నారు. ఎకానమీలో పలు రంగాలు పటిష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను క్షీణతలోకి జారిందని పేర్కొనడం సరికాదన్నది వారి వాదన. తీవ్ర ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి పరిణామాల నేపథ్యంలో రుణ వ్యయాలు పెరిగిపోయి అమెరికా వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ‘మాంద్యం’ అంటే ఏమిటన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణ అదుపునకు జనవరి మొదలు ఇప్పటివరకూ వడ్డీ రేటును ఫెడ్ 2.25 శాతం పెంచింది. దీనితో ఫెడ్ ఫండ్స్ రేట్లు 2.25 –2.5 శాతానికి చేరాయి. అయితే ఇకపై రేటు పెంపులో దూకుడు ఉండకపోవచ్చని అంచనా. -
ప్చ్.. మళ్లీ వడ్డీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్!
న్యూయార్క్: అంచనాలకు అనుగుణంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ధరల కట్టడికి మరోసారి వడ్డీ రేట్ల పెంపు అస్త్రాన్ని బయటకు తీసింది. తాజాగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.75 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 2.25–2.50 శాతానికి చేరాయి. ద్రవ్యోల్బణ అదుపునకు జనవరి మొదలు జూన్ వరకూ వడ్డీ రేటును 1.5 శాతం పెంచింది. నాలుగు దశాబ్దాలలోలేని విధంగా సీపీఐ 9 శాతానికి చేరడంతో ఈ ఏడాది(2022) చివరికల్లా వడ్డీ రేటును 3.4 శాతానికి చేర్చే యోచనలో ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఉంది. ఆర్థిక మాంద్య పరిస్థితులకంటే ధరల అదుపే తమకు ప్రధానమంటూ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలరు ఇండెక్స్ 107ను దాటి కదులుతోంది. రేట్ల పెంపు అంచనాలతో ఈ నెల మొదట్లో రెండు దశాబ్దాల గరిష్టం 109.29ను తాకిన సంగతి తెలిసిందే. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఆర్థిక మాంద్య ముప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్, ఆమె ఆస్తి ఎంతంటే! -
ఫెడ్ వడ్డీ రేటు పెంపు షాక్
న్యూయార్క్: గత మూడు దశాబ్దాలలోలేని విధంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లను 0.75 శాతంమేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.5–1.75 శాతానికి చేరాయి. మంగళవారం ప్రారంభమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సమావేశాలు బుధవారం ముగిశాయి. ద్రవ్యోల్బణం ఇటీవల అదుపు తప్పడంతో ఫెడరల్ రిజర్వ్ కఠిన తర విధానాలవైపు మొగ్గు చూపుతోంది. గత నెల(మే)లో ద్రవ్యోల్బణం 8.6 శాతాన్ని తాకింది. ఇది 40ఏళ్లలోనే అత్యధికంకాగా.. మే నెలలో జరిగిన గత సమావేశం తదుపరి కూడా ఫెడ్ 0.5 శాతం ఫండ్స్ రేట్లను హెచ్చించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం తరువాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లను పెంచడం గత నెలలోనే జరిగింది. కాగా.. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణ పరిస్థితులు(స్టాగ్ఫ్లేషన్) తలెత్తనున్నట్లు విశ్లేషకులు ఇటీవల అంచనా వేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా యూఎస్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. -
పుత్తడి, వెండి: కొనుగోలుదారులకు ఊరట
సాక్షి, ముంబై: జూన్ మాసం ఆరంభంలోనే వెండి, బంగారం ధరలు వినియోగదారులకు ఊరటనిచ్చాయి. వరుసగా రెండో రోజు బుధవారం (జూన్,1) ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) పుత్తడి, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఆగస్టు 5, 2022న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ. 281 తగ్గి రూ. 50,700గా ఉంది. అదేవిధంగా, జూలై 5, 2022 నాటి వెండి ఫ్యూచర్లు రూ. 535 లేదా 0.88 శాతం క్షీణించాయి. మునుపటి ముగింపు రూ. 61,125తో పోలిస్తే ఎంసీఎక్స్‌లో కిలో రూ. 60,876 వద్ద కొనసాగుతోంది. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 47,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి దాదాపు 300 తగ్గి ప్రస్తుత ధర 51, 820గా ఉంది. అలాగే కిలో వెండి ధర 67వేల రూపాయలుగా ఉంది. మంగళవారం నాటితో పోలిస్తే 500 రూపాయలు తగ్గింది. కాగా ఫెడరల్ రిజర్వ్ మనీ పాలసీ, డాలర్ బలం గత రెండు నెలలుగా పసిడిపై ఒత్తిడి పెంచుతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 200 రోజుల యావరేజ్ కిందికి చేరాయి. ఈ మేరకు ధరలు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో నెల. 200-రోజుల మూవింగ్ యావరేజ్ కంటే తక్కువగా ఉన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందనీ, దీంతో పసిడి ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ ఎనలిస్ట్ భవిక్ పటేల్ అంచనా #Gold and #Silver Opening #Rates for 01/06/2022#IBJA pic.twitter.com/Cdwx54n6H3 — IBJA (@IBJA1919) June 1, 2022 -
మార్కెట్‌కు ఫెడ్ బూస్ట్
ముంబై: దలాల్ స్ట్రీట్ గురువారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొనుగోళ్ల అండతో ట్రేడింగ్ ఆద్యంతం ఉత్సాహాంగా ఉరకలేసింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో స్టాక్ సూచీలు నాలుగు నెలల్లో అత్యధిక లాభాల్ని ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ 23 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల కౌంటర్లకు డిమాండ్ నెలకొనడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 1030 పాయింట్లు పెరిగి 59,957 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ 297 పాయింట్లు ఎగసి 17,844 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 276 పాయింట్ల లాభంతో 17,823 వద్ద స్థిరపడింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ షేర్లు వంటి లార్జ్‌క్యాప్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,173 కోట్ల షేర్లను కొన్నారు. డాలరు మారకంలో రూపాయి విలువ 73.64 వద్ద నిలిచింది. రాకెట్లా దూసుకెళ్లిన సూచీలు... ఆసియా మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న దేశీయ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 59,358 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 17,671 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బుల్ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ వంటి కీలక రంగాల షేర్లకు డిమాండ్ లభించడంతో సూచీలు రాకెట్లా దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1030 పాయింట్లు, నిఫ్టీ 297 పాయింట్లను ఆర్జించగలిగాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీల లాభాలకు కారణాలివే... చైనా ఎవర్ గ్రాండే సంక్షోభంపై గ్రూప్ చైర్మన్ హుయి కా యువాన్ వివరణ ఇచ్చారు. ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చైనా పీపుల్స్ బ్యాంక్ 17 బిలియన్ డాలర్లను చొప్పించింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లే యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బాండ్ల కొనుగోళ్లను నవంబర్ నుంచి తగ్గిస్తామనే ఫెడ్ నిర్ణయాన్ని ఈక్విటీ మార్కెట్లు అప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితిని తొలగించి సానుకూలతలను నెలకొల్పాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇటీవల కేంద్రం పలు రంగాల్లో సంస్కరణల పర్వానికి తెరతీయడం మార్కెట్‌కు జోష్ నిచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపుతుండటం మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుంది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బీఎస్ఈలో ఐదున్నర శాతం నష్టపోయి రూ.318 వద్ద ముగిసింది. ► యూఎస్ సంస్థ బ్లింక్ను కొనుగోలు చేయడంతో ఎంఫసిస్ షేరు మూడు శాతం ర్యాలీ చేసి రూ.3,339 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.3392 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి 500 సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి ఆర్డర్లను దక్కించుకోవడంతో జేఎంబీ ఆటో షేరు 12 శాతం లాభపడి రూ.516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 17 శాతం ర్యాలీ చేసి రూ.537 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ఒక్క రోజులో రూ.3.16 లక్షల కోట్లు ప్లస్ సూచీలు నాలుగునెలల్లో అతిపెద్ద ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.3.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.261.73 లక్షల కోట్లకు చేరింది. -
డాలర్ల రాకపై రూపాయి భరోసా
ముంబై: దేశానికి మరింత భారీగా డాలర్లు వస్తా యన్న భరోసా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 40 పైసలు బలపడి 73.29కి చేరింది. గడచిన రెండు నెలల్లో (జూన్ 14 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలోపేతం కావడం ఇదే తొలిసారి. వడ్డీరేట్లు సమీపకాలంలో పెంచే అవకాశాలు లేవని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ సంకేతాలు డాలర్ బలహీనతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 73.20 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో 92.29 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ముగింపు 73.69. సోమవారం 73.46 వద్ద ప్రారంభమైంది. 73.21 గరిష్ట–73.54 కనిష్ట శ్రేణిలో కదలింది. గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి లాభపడుతూ వస్తోంది. డాలర్‌పై ఈ రోజుల్లో 95 పైసలు లాభపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
బుల్ పరుగులు..3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి
లాభాల జడివానతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. సూచీల వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.3.58 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.247 లక్షల కోట్లకు చేరింది. ముంబై: దలాల్ స్ట్రీట్ సోమవారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొంతకాలంగా పరిమిత శ్రేణిలో కదలాడుతున్న పావెల్ వ్యాఖ్యలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 833 పాయింట్లు పెరిగి 56,958 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 765 పాయింట్ల లాభంతో 56,890 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 247 పాయింట్లు ఎగసి 16,952 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 226 పాయింట్ల లాభంతో 16,931 వద్ద స్థిరపడింది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ సూచీ ఐదు కొత్త రికార్డు ముగింపులను నమోదుచేసింది. ధరల నియంత్రణకు చైనా నిల్వల విక్రయానికి సిద్ధమవడంతో మెటల్ షేర్ల ర్యాలీ కొనసాగింది. ఎన్ఎస్ఈలోని సెక్టార్ ఇండెక్స్‌ల్లోకెల్లా నిఫ్టీ మెటల్ సూచీ అత్యధికంగా రెండున్నర శాతం లాభపడింది. కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడవుతున్న ఆర్థిక, బ్యాంకింగ్ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. ఆగస్ట్‌లో వాహన విక్రయాలు ఊపందుకొని ఉండొచ్చనే అంచనాలతో ఆటో షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,208 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.689 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల దూకుడుకు కారణాలివే... అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం జాక్సన్ హోల్ సదస్సులో మాట్లాడుతూ.., వడ్డీ రేట్ల పెంపు 2023 ఏడాది నుంచి ఉండొచ్చన్నారు. బాండ్ల కొనుగోళ్ల కోత ఈ సంవత్సరాంతం ప్రారంభం అవుతుందని స్పష్టతనిచ్చారు. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికాతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల బాటపట్టా యి. అలాగే పావెల్ ప్రకటనతో యూఎస్ డాలర్ బలహీనపడడంతో, ట్రెజరీ ఈల్డ్స్ కూడా తగ్గాయి. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 1.312 శాతం నుంచి 1.305 శాతానికి దిగింది. డాలర్ ఇండెక్స్ కూడా రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 40 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఈ వారంలో వెలువడనున్న దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదుకావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి కేంద్రం చేపట్టిన సంస్కరణలతో క్యూ1లో రికార్డు స్థాయిలో 17.57 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత ఈ ఆగస్టులో ఎఫ్ఐఐ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరిన్ని విశేషాలు... భారతీ ఎయిర్టెల్ బీఎస్ఈలో నాలుగున్నర శాతం లాభపడి రూ.620 వద్ద ముగిసింది. కంపెనీ బోర్డు రూ.21వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలపడం షేరు ర్యాలీకి కారణం. పలు కార్ల రేట్లు ఈ సెప్టెంబర్ నుంచి పెంచనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించడంతో బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు మూడు శాతం పెరిగి రూ.6,797 వద్ద ముగిసింది. భారత్‌లో టెస్లా కంపెనీకి విడిభాగాలను సరఫరా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో సోనా కామ్స్టార్, సంధార్ టెక్, భారత్ ఫోర్జ్ షేర్లు తొమ్మిదిశాతం ర్యాలీ చేశాయి. -
రూపాయి.. అధరహో
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 53 పైసలు బలపడి 73.69 స్థాయికి చేరింది. గడచిన 10 వారాల్లో రూపాయి ఇంత స్థాయిలను చూడ్డం (జూన్ 16 తర్వాత) ఇదే తొలిసారి. సరళతర ఆర్థిక విధానాలనే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కొనసాగిస్తుందన్న అంచనాలు, ఈక్విటీ మార్కెట్ల బులిష్ వైఖరి వంటి అంశాలు రూపాయి భారీగా బలపడ్డానికి కారణమని నిపుణుల అంచనా. ఫారెన్ బ్యాంకుల డాలర్ అమ్మకాలు, దేశంలోకి విదేశీ నిధులు భారీగా వస్తాయన్న అంచనాలు కూడా రూపాయి బలోపేతానికి కారణం. రూపాయి గురువారం ముగింపు 74.22. దీనితో పోల్చితే శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాలతో 74.17 వద్ద ప్రారంభమైంది. వారంలో రూపాయి 70 పైసలు బలపడింది. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 73.78 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). చదవండి : వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా -
వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలను ఎదుర్కొనేందుకు గతేడాది మార్చి నుంచి దాదాపు సున్నా స్థాయి వడ్డీ రేట్లను కొనసాగిస్తున్న అమెరికా క్రమంగా వాటిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. నియామకాలు పుంజుకునే కొద్దీ చౌక వడ్డీ రేట్ల విధానాలను క్రమంగా ఉపసంహరించడం మొదలుపెట్టే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఈ ఏడాది ఆఖరు మూడు నెలల్లో క్రమంగా తగ్గించుకోనున్నట్లు బ్యాంకర్లు, ఆర్థికవేత్తల సమావేశంలో ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం తాము నిర్దేశించుకున్న 2 శాతం స్థాయికి చేరడంతో బాండ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం ద్వారా వ్యవస్థలో రుణాలు, వ్యయాలకు డిమాండ్ కల్పించేందుకు ప్రస్తుతం ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. దీన్ని నిలిపివేస్తే తనఖా రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే, బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా వడ్డీ రేట్ల పెంపు ఉండదని పావెల్ తెలిపారు. పావెల్ ప్రకటనపై అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఒక దశలో 225 పాయింట్లు పెరిగింది. -
డాలర్, బంగారానికి బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా?
బిట్ కాయిన్‌కు సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ కీలక వ్యాఖ్యలు చేసారు. సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికీ డిజిటల్ కరెన్సీ అయిన క్రిప్టోకరెన్సీ వంటి వాటి సామర్థ్యాన్ని అన్వేషిస్తోంది. ప్రజలు కూడా బిట్ కాయిన్ రిస్క్‌ను అర్థం చేసుకోవాలని సూచించారు. డాలర్ లేదా బంగారానికి బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఎప్పటికి ప్రత్యామ్నాయం కాదని అన్నారు. గత కొంత కాలంగా బిట్ కాయిన్ విలువ భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే 60వేల డాలర్లను కూడా దాటి జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం 58వేల డాలర్ల వద్ద ఉంది. కరోనా కాలంలో రాకెట్ కంటే వేగంతో దూసుకెళ్తూ పెట్టుబడిదారులను ఆకట్టుకుంటోన్న క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన అమెరికా కేంద్రం బ్యాంకు ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు డాలర్ వంటి ప్రధాన కరెన్సీకి ప్రత్యామ్నాయంగా పరిగణించలేమని అన్నారు. వాటి విలువ ఎల్లపుడు అస్థిరతతో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రధాన కరెన్సీకి ప్రభుత్వం మద్దతు ఉందని అయితే, క్రిప్టో కరెన్సీ విలువను నిర్దారించే అసెట్స్ ఏవీ లేవని గుర్తు చేశారు. ఇటీవల టెస్లా, స్క్వేర్ ఇన్వెస్ట్ వంటి దిగ్గజ కంపెనీలు బిట్ కాయిన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో జంప్ చేస్తోంది. చదవండి: రియల్టీ కింగ్ ఎంపీ లోధా -
డోజోన్స్ కొత్త రికార్డ్- ఎందుకీ స్పీడ్?
న్యూయార్క్, సాక్షి: మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త రికార్డ్ నమోదైంది. డోజోన్స్ 455 పాయింట్లు(1.55 శాతం) ఎగసి 30,046 వద్ద ముగిసింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఈ బాటలో ఎస్అండ్పీ 58 పాయింట్లు(1.6 శాతం) పురోగమించి 3,635 వద్ద నిలవగా.. నాస్డాక్ 156 పాయింట్లు(1.3 శాతం) బలపడి 12,037 వద్ద స్థిరపడింది. కాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ డోజోన్స్ 13 శాతం దూసుకెళ్లింది. ఇంతక్రితం 1987 నవంబర్‌లో మాత్రమే ఈ స్థాయి లాభాలు ఆర్జించగా.. ఎస్అండ్పీ 11 శాతం, నాస్డాక్ 10.3 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్ తదుపరి గరిష్టంగా లాభపడ్డాయి. బ్లూచిప్స్ అండ మంగళవారం డోజోన్స్‌కు బలాన్నిచ్చిన కౌంటర్లలో షెవ్రాన్ 5 శాతం, జేపీ మోర్గాన్ చేజ్ 4.6 శాతం, గోల్డ్‌మన్ శాక్స్ 3.8 శాతం చొప్పున జంప్ చేశాయి. మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చిన ఇతర కౌంటర్లలో టెస్లా ఇంక్ 6.5 శాతం దూసుకెళ్లగా.. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ 3-1 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 2.5 శాతం, ఆస్ట్రాజెనెకా 2 శాతం చొప్పున క్షీణించాయి. జోరు ఎందుకంటే? ఇటీవల ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్ కోవిడ్-19 కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లు 95 శాతం ఫలితాలనిచ్చినట్లు వెల్లడించడంతో సెంటిమెంటు బలపడింది. ఈ బాటలో బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సైతం ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు చేపట్టేందుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. రాజకీయ అనిశ్చితులకు చెక్ పడటం ఇందుకు సహకరించింది. గతంలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌కు చైర్‌పర్సన్‌గా పనిచేసిన జానెట్ యెలెన్‌ను ఆర్థిక మంత్రిగా బైడెన్ ఎంపిక చేసుకునే వీలున్నట్లు వెలువడిన వార్తలు ఈ సానుకూల అంశాలకు జత కలసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ల ఫ్రెండ్లీగా వ్యవహరించే యెలెన్ వడ్డీ రేట్లను నేలకు దించడం ద్వారా ఆర్థిక రికవరీకి పాటుపడినట్లు తెలియజేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీకి రూపకల్పన చేసే అవకాశమున్నట్లు అంచనాలు బలపడ్డాయి. వెరసి మార్కెట్లు సరికొత్త రికార్డుల బాటలో పరుగు తీస్తున్నట్లు నిపుణులు వివరించారు. -
ప్యాకేజీపై ఆశలు- వాల్ స్ట్రీట్ ప్లస్
న్యూయార్క్: ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ, జో బైడెన్‌కు ఆధిక్యంపై అంచనాల నేపథ్యంలో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. డోజోన్స్ 543 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 28,390కు చేరగా.. ఎస్అండ్పీ 67 పాయింట్లు(2 శాతం) ఎగసి 3,510 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 300 పాయింట్లు(2.6 శాతం) దూసుకెళ్లి 11,891 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా నాలుగో రోజు మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఈ వారం ఇప్పటివరకూ ఎస్అండ్పీ 7 శాతం లాభపడింది. ఫెడ్ పాలసీ తాజా పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0-0.25 శాతం మధ్య కొనసాగనున్నాయి. అయితే కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కదులుతున్నట్లు ఫెడ్ పేర్కొంది. ఆర్థిక పురోగతికి దన్నుగా మరింత స్టిములస్(సహాయక ప్యాకేజీలు) అందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. ఇందుకు వీలుగా సరళతర విధానాలతో మద్దతు ఇవ్వవలసి ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే ప్రస్తుత సమీక్షలో వీటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ప్యాకేజీ అంచనాలు ప్రెసిడెంట్ పదవి రేసులో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు కొన్ని కీలక రాష్ట్రాలలో ఆధిక్యం లభించనున్న అంచనాలు బలపడుతున్నాయి. మరోపక్క సెనేట్ లో రిపబ్లికన్లకు తిరిగి ఆధిక్యం లభించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పురోగతికి కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి కొత్త ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు, డాలరు బలపడుతున్నట్లు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ జూమ్ వచ్చే ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరగనున్న అంచనాలతో చిప్ తయారీ కంపెనీ క్వాల్ కామ్ షేరు 13 శాతం దూసుకెళ్లింది. ఇక ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే టెక్ దిగ్గజాలలో యాపిల్ 3.5 శాతం, నెట్‌ఫ్లిక్స్ 3.4 శాతం, మైక్రోసాఫ్ట్ 3.2 శాతం, అమెజాన్, ఫేస్బుక్ 2.5 శాతం మధ్య ఎగశాయి. అల్ఫాబెట్ 1 శాతం పుంజుకుంది. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ సైతం 4 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్ 3.6 శాతం, మోడర్నా ఇంక్, ఫైజర్ 2.4 శాతం చొప్పున లాభపడ్డాయి. -
నేడు నష్టాలతో మార్కెట్ల ఓపెనింగ్?!
నేడు(17న) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి 11,530 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,612 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం బలపడేటంతవరకూ మరికొంతకాలం నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పేర్కొన్న నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్లు నేడు ఆటుపోట్ల మధ్య ట్రేడ్‌కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరి సెషన్లో జోరు బుధవారం స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 259 పాయింట్లు ఎగసి 39,303 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు పుంజుకుని 11,605 వద్ద స్థిరపడింది. అయితే తొలి సెషన్లో మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,360- 39,038 పాయింట్ల మధ్య, నిఫ్టీ 11618- 11517 పాయింట్ల మధ్య ఒడిదొడుకులను చవిచూశాయి. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,542 పాయింట్ల వద్ద, తదుపరి 11,479 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,643 పాయింట్ల వద్ద, ఆపై 11,681 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,307 పాయింట్ల వద్ద, తదుపరి 22,040 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,750 పాయింట్ల వద్ద, తదుపరి 22,926 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,171 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 896 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఫెడ్ హెచ్చరికలు- మార్కెట్లు డౌన్
కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలానికి ఆర్థిక రికవరీ అనిశ్చితిలో పడినట్లు యూఎస్ ఫెడ్ స్పష్టం చేయడంతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 394 పాయింట్లు పతనమై 38,220 వద్ద ముగిసింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 11,312 వద్ద నిలిచింది. ఆర్థిక రికవరీని కోవిడ్-19 దెబ్బతీస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా హెచ్చరించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బుధవారం యూఎస్ మార్కెట్లు వెనకడుగు వేయగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా, యూరోపియన్ మార్కెట్లు 2-1 శాతం మధ్య నీరసించాయి. దీంతో దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకే కట్టుబడినట్లు నిపుణులు తెలియజేశారు. ఫలితంగా 330 పాయింట్లు తక్కువగా 38,284 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ తదుపరి 38,156 వరకూ పతనమైంది. ఇక నిఫ్టీ సైతం తొలుత 11,290 వరకూ జారింది. తదుపరి 11,361 వరకూ కోలుకుంది. మీడియా జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం క్షీణించగా.. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ 0.4 శాతం చొప్పున నష్టపోయాయి. ఇతర రంగాలలో మీడియా 3.2 శాతం ఎగసింది. మెటల్ 1 శాతం, రియల్టీ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ, విప్రో, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, టైటన్, ఇండస్ఇండ్, ఆర్ఐఎల్, అల్ట్రాటెక్, కొటక్ బ్యాంక్ 2.6-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎన్టీపీసీ 7 శాతం జంప్‌చేయగా, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ కోల్ ఇండియా, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జీ, ఐవోసీ, హిందాల్కో, హీరో మోటో 3.3-1 శాతం మధ్య బలపడ్డాయి. సన్ టీవీ అప్ డెరివేటివ్స్‌లో సన్ టీవీ, టాటా పవర్, జీఎంఆర్, ఎంజీఎల్, పీఎఫ్సీ, ఐజీఎల్, ఈక్విటాస్, టీవీఎస్ మోటార్, టొరంట్ పవర్, వోల్టాస్, జిందాల్ స్టీల్, ఉజ్జీవన్ 8.4-3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క ముత్తూట్, మదర్సన్ సుమీ, ఐసీఐసీఐ ప్రు, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పెట్రోనెట్ 5.5-2 శాతం మధ్య తిరోగమించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ 0.8 శాతం పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1167 నష్టపోగా.. 1598 లాభాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 459 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 97 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,135 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 379 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
వెండి కొండెక్కింది ఇందుకే..!
బంగారం ధర కొత్త రికార్డు స్థాయిని అందుకుంటున్న నేపథ్యంలో వెండి ధర కూడా కొండెక్కింది. కేవలం 6ట్రేడింగ్ సెషన్లోనే రూ.13560లు లాభపడింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో పాటు, కరోనా వైరస్ ప్రేరేపిత లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు ఆయా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించడం కూడా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కలిసొస్తున్న సప్లై ఆందోళనలు: సప్లై ఆందోళనలు పెరగడం వెండి ధరకు కలిసొచ్చింది. ఈ ఏడాది వెండి మైనింగ్‌లో ఉత్పత్తి 7శాతం క్షీణించే అవకాశం ఉందని సిల్వర్ ఇన్స్టిస్యూట్ అంచనా వేస్తోంది. దాదాపు 4నెలల లాక్డౌన్ తర్వాత కొన్ని దేశాల్లో కొన్ని దేశాల్లో ఆర్థిక పునరుద్ధణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ముడిపదార్థంగా వినియోగించే వెండికి డిమాండ్ పెరిగినట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఉద్దీపన చర్యలు కొనసాగవచ్చనే అశావహ అంచనాలతో పాటు డాలర్ బలహీనత నుంచి బంగారం ర్యాలీ చేస్తోంది. ఈ క్రమంలో వెండి ధరకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇదే డాలర్ బలహీనత పారిశ్రామిక లోహామైన వెండికి మరింత కూడా కలిసొస్తుంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ తన నివేదికలో తెలిపింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వెండి ఈటీఎఫ్ నిల్వలు 17379.98 టన్నల రికార్డు స్థాయికి చేరుకున్న సంగతిని బ్రోకరేజ్ సంస్థ ఈ సందర్భంగా గుర్తు చేసింది. స్థిరంగా పెరుగుతున్న వెండి ధర పట్ల అప్రమత్తత అవసరమని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ బుల్లిష్‌గానే: సిటీ గ్రూప్ వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని సిటీ గ్రూప్ ఇంక్ అభిప్రాయపడింది. ఈ జూలై 29న ఫెడ్ పాలసీ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. వడ్డీరేట్లను సున్నా స్థాయిలో ఉంచేందుకు పావెల్ మొగ్గుచూపవచ్చు. ఈ విధాన నిర్ణయంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారం ధర ఒత్తిడిలోను కానంతవరకు వెండి ర్యాలీకి ఎలాంటి ఢోకా లేదు. అలాగే ఇటీవల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పారిశ్రామిక రంగంలో వెండి అవసరం మరింత పెరిగింది. ఇదే బుల్లిష్ మూమెంటం కొనసాగితే వచ్చే ఏడాదిలోగా అంతర్జాతీయంగా 10గ్రాముల వెండి ధర 30డాలర్లను చేరుకోవచ్చని సిటీ గ్రూప్ అభిప్రాయపడింది. -
వాల్‌మార్ట్, ఏటీఅండ్‌టీకి ఫెడ్ దన్ను
కోవిడ్-19 ధాటికి కుదేలైన కార్పొరేట్ దిగ్గజాలకు ఆర్థికంగా దన్నునిచ్చే బాటలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తొలిసారిగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలును ప్రారంభించింది. దీనిలో భాగంగా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, టెలికం దిగ్గజం ఏటీఅండ్‌టీ, వారెన్ బఫెట్ కంపెనీ బెర్కషైర్ హాథవే, ఫిలిప్ మోరిస్ తదితర కంపెనీల బాండ్లను సొంతం చేసుకుంది. ఇందుకు తొలి దశలో భాగంగా 428 మిలియన్ డాలర్లను వెచ్చించింది. వీటితోపాటు 530 కోట్ల డాలర్ల విలువైన 16 కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్‌లను సైతం కొనుగోలు చేసినట్లు ఫెడ్ ఆదివారం వెల్లడించింది. వెరసి చరిత్రలో తొలిసారి ఫెడరల్ రిజర్వ్ ఇండివిడ్యుయల్ కంపెనీల బాండ్లను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ నిధులు తాజా ప్రణాళికల్లో భాగంగా ఏటీఅండ్‌టీ, యునైటెడ్ హెల్త్ గ్రూప్‌నకు చెందిన 16.4 మిలియన్ డాలర్ల విలువైన బాండ్లను విడిగా ఫెడ్ కొనుగోలు చేసింది. బాండ్ల కొనుగోలు ద్వారా నిధులు అందించే ప్రణాళికలకు అనుగుణంగా ప్రస్తుతం 790 కంపెనీలు ఎంపికైనట్లు ఫెడ్ తెలియజేసింది. తొలి దశలో భాగంగా వీటిలో 86 కంపెనీల బాండ్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల క్రెడిట్ రేటింగ్ జంక్ స్థాయికి డౌన్‌గ్రేడ్ అయిన ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ బాండ్లను సైతం సెకండరీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. పావెల్‌కు పరీక్ష కరోనా వైరస్ కారణంగా కుదేలైన కంపెనీలకు అండగా.. బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సైతం ఇండివిడ్యుయల్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలు సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఆయా కంపెనీలకు లిక్విడిటీని కల్పించే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. తద్వారా కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోకుండా సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నాయి. కాగా.. మంగళవారం(30న) ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలుపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విడిగా కార్పొరేట్ బాండ్ల కొనుగోలు అంశంపై న్యాయ నిపుణులు పావెల్‌ను ప్రశ్నించనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. -
తగ్గిన లాభాలు
ప్రపంచ మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా మంగళవారం లాభాల్లోనే ముగిసింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింత ముదరడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఉదయం లాభాలను పోగొట్టుకొని 17 పైసల నష్టంతో 76.20కు చేరడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. రోజంతా 1,069 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 376 పాయింట్ల లాభంతో 33,605 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 232 పాయింట్లు ఎగసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 9,914 పాయింట్ల వద్దకు చేరింది. అమెరికా ‘మెయిన్‌స్ట్రీట్ ప్యాకేజీ’.... కరోనా వైరస్ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారీ ఉద్దీపన ప్యాకేజీని మెయిన్ స్ట్రీట్ లెండింగ్ ప్రోగ్రామ్ పేరుతో సోమవారం ప్రకటించింది. అంతే కాకుండా 75,000 కోట్ల డాలర్ల (రూ.57 లక్షల కోట్ల)విలువైన కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేస్తామని అభయం ఇచ్చింది. దీంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఇదే జోష్‌తో మన మార్కెట్ కూడా భారీ లాభాల్లో మొదలైంది. అరగంట ఒడిదుడుకులు... సెన్సెక్స్ 625 పాయింట్లు, నిఫ్టీ 201 పాయింట్ల లాభాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 793 పాయింట్లకు, నిఫ్టీ 232 పాయింట్ల లాభాల స్థాయిలకు ఎగబాకాయి. అయితే తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయ సమీపంలో మనదేశానికి, చైనాకి మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయన్న వార్తలతో మధ్యాహ్నం తర్వాత ఆకస్మాత్తుగా సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ 276 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్ల మేర నష్టపోయాయి. ఒక అరగంట పాటు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైనసూచీలు ఆ తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లు 5 శాతం, యూరప్ మార్కెట్లు 4 శాతం లాభాల్లో ముగిశాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4 శాతం లాభంతో రూ.990 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మంగళవారం కూడా జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,648ను తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ.1,617 వద్ద ముగిసింది. ► వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అలెంబిక్ ఫార్మా, బేయర్ క్రాప్‌సైన్స్, రుచి సోయా, పీఐ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► క్యూ4లో రూ.9,894 కోట్ల మేర నష్టాలు రావడంతో టాటా మోటార్స్ షేర్ 6% నష్టంతో రూ.95 వద్ద ముగిసింది. ► రూపాయి బలహీనపడటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. రూపాయి 17 పైసలు పతనం ముంబై: భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రభావం రూపాయి విలువపై చూపింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం 17 పైసలు క్షీణించి 76.20 వద్ద ముగిసింది. ఇధి ఆరు వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. -
ఆసియా దూకుడు- యూఎస్ అప్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్ కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్లకు అండగా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలో సవరణలు చేపట్టింది. తద్వారా అర్హతగల అన్ని కార్పొరేట్ బాండ్ల కొనుగోలుకి బ్యాంకులకు వీలు చిక్కనుంది. ఇందుకు వీలుగా బ్యాంకుల వద్ద ఇప్పటికే పేరుకుపోయిన పలు కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఫెడ్ మరిన్ని నిధులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంప్చేయనుంది. ఈ వార్తలతో సోమవారం యూఎస్ మార్కెట్లు తొలుత ఏర్పడ్డ భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. చివరికి లాభాలతో నిలిచాయి. తొలుత 600 పాయింట్లు పతనమైన డోజోన్స్ చివర్లో 158 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 25,763 వద్ద నిలిచింది. ప్రస్తుతం డో ఫ్యూచర్స్ మరో 250 పాయింట్ల లాభంతో కదులుతోంది. ఇక ఎస్అండ్పీ 25 పాయింట్లు(0.85 శాతం) బలపడి 3,067 వద్ద స్థిరపడగా.. ఫ్యూచర్స్ 1.4 శాతం ఎగసింది. ఇక.. నాస్డాక్ 137 పాయింట్లు(1.45 శాతం) పుంజుకుని 9,726 వద్ద ముగిసింది. కాగా.. కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కొనుగోలుకి ఇజ్రాయెల్ ఆసక్తి చూపుతున్న వార్తలతో హెల్త్‌కేర్ దిగ్గజం మోడర్నా ఇంక్ షేరు 7.5 శాతం జంప్‌చేసింది. ఫెడ్ చర్యలు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడరల్ రిజర్వ్ సోమవారం నుంచీ బ్యాంకులకు మరో అవకాశాన్ని కల్పించింది. దీనిలో భాగంగా కరోనా వైరస్ తలెత్తకముందు మంచి పనితీరు ప్రదర్శించిన కంపెనీలకు ఆర్థికంగా అండను కల్పించనుంది. 15,000 మందివరకూ ఉద్యోగులు కలిగిన లేదా 5 బిలియన్ డాలర్ల వరక ఆదాయం కలిగిన కంపెనీలకు బ్యాంకులు తాజాగా రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించనుంది. ఉద్యోగులను కొనసాగించడం, వ్యాపార నిర్వహణకు వీలుగా కంపెనీలకు బ్యాంకులు రుణాలందించనున్నాయి. అర్హతగల కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసేందుకు వీలుగా 600 బిలియన్ డాలర్లను ఫెడ్ కేటాయించింది. జోరు తీరు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన దన్నుతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లకు జోష్వచ్చింది. దీంతో కొరియా, జపాన్, హాంకాంగ్, ఇండొనేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్ 4-2 శాతం మధ్య జంప్‌చేయగా.. చైనా 1 శాతం పుంజుకుంది. వరుసగా రెండో నెలలోనూ చైనాలో పరిశ్రమలు ఉత్పత్తిని పెంచినట్లు వెలువడిన వార్తలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
అమ్మకాల షాక్- మార్కెట్ల పతనం
కోవిడ్-19 దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం క్షీణతను చవిచూడే వీలున్నట్లు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వేసిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాకిచ్చాయి. దీంతో అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు సమయం గడిచేకొద్దీ అమ్మకాలకు ఎగబడ్డారు. వెరసి సెన్సెక్స్ 709 పాయింట్లు పతనమై 33,538 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 214 పాయింట్లు కోల్పోయి 9,902 వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ 34,000 పాయింట్లు, ఇటు నిఫ్టీ 10,000 పాయింట్ల మైలురాళ్ల దిగువన స్థిరపడ్డాయి. 2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరవచ్చని ఫెడ్ అంచనా వేసింది. అయితే అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే వడ్డీ రేట్లను నామమాత్ర(0-0.25 శాతం) స్థాయికి తగ్గించడంతో యథాతథ రేట్లను అమలు చేసేందుకు నిర్ణయించింది. కాగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 34,219- 33,480 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ 10,112- 9,885 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 2 శాతం స్థాయిలో ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ సుమారు 3-1.5 శాతం మధ్య క్షీణించాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు తెలియజేశారు. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్, జీ, ఎస్బీఐ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, మారుతీ, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, వేదాంతా 9-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఇండస్ఇండ్ 4.4 శాతం జంప్‌చేయగా.. హీరోమోటో, నెస్లే, పవర్‌గ్రిడ్ 0.7 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఐడియా వీక్ డెరివేటివ్స్‌లో ఐడియా 13 శాతం కుప్పకూలగా.. సెంచురీ టెక్స్, ఉజ్జీవన్, ఐబీ హౌసింగ్, కంకార్ 6.5-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా..పీవీఆర్, ఎంజీఎల్, ఎల్ఐసీ హౌసింగ్, ఐజీఎల్, మణప్పురం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, కమిన్స్, మైండ్‌ట్రీ, ఆర్ఈసీ 5-1 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.4-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1529 నష్టపోగా.. 1023 లాభపడ్డాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 919 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 501 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 491 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 733 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 813 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1238 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఫెడ్ ఎఫెక్ట్- మార్కెట్లు నేలచూపులతో!
నేడు (గురువారం) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించి 10,091 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జూన్ నెల ఫ్యూచర్స్ 10,142 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతూ చరిత్రాత్మక గరిష్టాలవైపు సాగుతున్న అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం బలహీనపడ్డాయి.రెండు రోజులపాటు పాలసీ సమీక్షను చేపట్టిన కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా సున్నా స్థాయిలోనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది(2020) యూఎస్ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. అంతేకాకుండా నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరవచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అభిప్రాయపడ్డారు. అయితే అవసరమైతే మరోసారి ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం యూరోపియన్, యూఎస్ మార్కెట్లు 0.6-1.2 శాతం మధ్య నష్టపోయాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో నేడు దేశీయంగా మార్కెట్లు నీరసంగా ప్రారంభంకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. తదుపరి ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాంకింగ్ కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో రోజంతా దాదాపు సానుకూలంగానే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 290 పాయింట్లు ఎగసి 34,247కు చేరగా.. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 10,116 వద్ద ముగిసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10052 పాయింట్ల వద్ద, తదుపరి 9,989 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,164 పాయింట్ల వద్ద, ఆపై 10,213 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,764 పాయింట్ల వద్ద, తదుపరి 20,428 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,344 పాయింట్ల వద్ద, తదుపరి 21,588 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 919 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 501 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 491 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 733 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 813 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1238 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. -
కరోనా : శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పతనం
వాషింగ్టన్ : ప్రపంచ ఆర్థికవ్యవస్థలపై కరోనా కల్లోలం రేపుతోంది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలు పాటిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తి అమెరికాలో ఊహించని రీతిలో విస్తరించడం మరింత ఆందళన రేపుతోంది. శరవేగంగా విస్తరిస్తున్న కేసులు, రికార్డు స్థాయి మరణాలతో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్ధికమాంద్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికాకు ఈ పరిణామం అశని పాతంలా తగిలింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ హెచ్ పావెల్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ భయంకరమైన వేగంతో పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అత్యవసర పరిస్థితుల్లో ఉంది. ఊహించని వేగంగా పతనమవుతోందని పేర్కొన్నారు. అయితే, సంక్షోభం ముగిసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అంతే వేగంగా కోలుకుంటుందని జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) ఆర్థిక మందగమనం, లాక్ డౌన్ కష్టాల నేపథ్యంలోనే చిన్న వ్యాపారాలు, పెద్ద కంపెనీలకు 2 ట్రిలియన్ డాలర్లకు పైగా సహాయం అందించడానికి ఫెడ్ ఇటీవల కొత్త ప్యాకేజీని ప్రకటించినట్టు ఫెడ్ ఛైర్మన్ చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ సమయాల్లో ఇటువంటి అత్యవసర చర్యలు తప్పవని ఫెడ్ పేర్కొంది. మరోవైపు అమెరికాలో 17 మిలియన్లకు పైగా ప్రజలు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. కాగా అమెరికాలో న్యూయార్క్ కేంద్రంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 2100 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 20 వేలకు చేరువైంది. కరోనా కారణంగా మరణించిన వాళ్ళను పబ్లిక్ పార్క్ లలో సామూహికంగా ఖననాలు చేస్తున్నారంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
మార్కెట్లకు ఫెడ్ ఊరట..!
భారీ నష్టాల పరంపరలో మంగళవారం స్టాక్ మార్కెట్‌కు ఒకింత ఊరట లభించింది. కోవిడ్–19 (కరోనా)వైరస్ కల్లోలానికి అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారీ ప్యాకేజీని ప్రకటించడం ప్రపంచ మార్కెట్లను లాభాల బాట పట్టించింది. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపట్టగలదన్న ఆశలతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు మేర పుంజుకోవడం (ఇంట్రాడేలో) సానుకూల ప్రభావం చూపించింది. అయితే ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగానే సాగింది. ఉద్దీపన ప్యాకేజీ కసరత్తు దశలోనే ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 693 పాయింట్ల లాభంతో 26,674 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 191 పాయింట్లు పెరిగి 7,801 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 2.67 శాతం, నిఫ్టీ 2.51 శాతం చొప్పున లాభపడ్డాయి. ఫెడ్ ‘అపరిమిత’ ప్యాకేజీ... కోవిడ్–19 (కరోనా)వైరస్ ధాటికి విలవిల్లాడుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ప్యాకేజీని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. ఎలాంటి పరిమితులు లేకుండా బాండ్లను, సెక్యూరిటీలను కొనుగోళ్లు చేయడం, కంపెనీలకు నేరుగా రుణాలివ్వడం తదితర చర్యలను ఫెడ్ తీసుకోనున్నది. దీంతో ఆసియా మార్కెట్లు పెరిగాయి. ఈ జోష్‌తో మన మార్కెట్ కూడా భారీ లాభాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 1,075 పాయింట్లు, నిఫ్టీ 238 పాయింట్ల లాభాలతో ఆరంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,482 పాయింట్లు, నిఫ్టీ 427 పాయింట్ల మేర లాభపడ్డాయి. మరో దశలో సెన్సెక్స్ 342 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్ల మేర నష్టపోయాయి. మొత్తం మీద సెన్సెక్స్ 1,824 పాయింట్లు, నిఫ్టీ 526 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. ఉద్దీపన చర్యలు ఇంకా కసరత్తు దశలోనే ఉన్నాయని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఆరంభ లాభాలు చివరి కంటా కొనసాగలేదు. ►ప్రజా వేగు కేసు విషయంలో ఇన్ఫోసిస్ కంపెనీకి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజెస్ కమిషన్ (ఎస్ఈసీ) క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ షేర్ 12.6% లాభంతో రూ.594 వద్ద ముగిసింది. గత ఏడేళ్లలో ఈ షేర్ ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. కాగా సెన్సెక్స్ లాభంలో ఈ షేర్ వాటా మూడో వంతు ఉండటం విశేషం. మొత్తం 693 పాయింట్ల సెన్సెక్స్ లాభం లో ఈ షేర్ వాటా 237 పాయింట్ల మేర ఉంది. ►దేశీయంగా విమాన సర్వీసులను ఈ నెల 25 వరకూ రద్దు చేయడంతో విమానయాన కంపెనీల షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 10 శాతం మేర నష్టపోయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) చివరకు 8 శాతం లాభంతో రూ.919 వద్ద ముగిసింది. ఇక స్పైస్‌జెట్ షేర్ 3 శాతం నష్టంతో రూ.32 వద్దకు చేరింది. ►స్టాక్ మార్కెట్ లాభపడినప్పటికీ, వెయ్యికి పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ సుజుకీ, టీటీకే ప్రెస్టీజ్, బాష్, వాబ్కో ఇండియా, ఎమ్ఆర్ఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ►450కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, పీఎన్బీ హౌసింగ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్వెస్ కార్ప్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ►ఐఆర్సీటీసీ షేర్ వరుసగా ఏడో రోజూ నష్టపోయింది. మంగళవారం ఈ షేర్ 5 శాతం నష్టంతో రూ.858.50 వద్దకు చేరింది. ఒడిదుడుకులు తప్పవు... కేంద్రం ఉద్దీపన చర్యలను ప్రకటించేదాకా, ఆర్బీఐ రేట్లను తగ్గించేదాకా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని నిపుణులంటున్నారు. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 500కు, మరణాల సంఖ్య 10కి చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 3.80,000కు, మరణాలు 16,500కు పెరిగాయి. ఇక ఆసియా మార్కెట్లు 1–9 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 5–8 శాతం రేంజ్లో లాభపడ్డాయి. రూ.1.82 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.82 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,82,770 కోట్లు పెరిగి రూ.103.69 లక్షల కోట్లకు పెరిగింది. -
కోవిడ్‌పై ఫెడ్ అస్త్రం!
వాషింగ్టన్: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అత్యవసరంగా కీలక రేట్లను 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) తగ్గిస్తూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత విస్తరిస్తుండడంతో, దీన్నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచేందుకు రేట్లను 1–1.25 శాతం స్థాయికి తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఫెడ్ అత్యవసరంగా రేట్ల కోతకు దిగడం మళ్లీ ఇదే మొదటిసారి. ‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉంది. అయితే, కరోనా వైరస్‌తో ఆర్థిక కార్యకలాపాలకు సమస్యలు పొంచి ఉన్నాయి. ఈ రిస్క్‌ల నేపథ్యంలో, గరిష్ట ఉపాధి కల్పనను సాధించేందుకు, ధరల స్థిరత్వ లక్ష్యం కోసం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ‘ఫెడరల్ ఫండ్స్’ రేటు లక్ష్యంతో శ్రేణిని తగ్గించాలని నిర్ణయించింది’’ అని ఫెడ్ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి మార్చి 17–18 తేదీల్లో ఫెడ్ పాలసీ సమావేశం జరగనుంది. దీనికి మరో 15 రోజుల వ్యవధి ఉంది. కానీ, కరోనా వైరస్ అంతర్జాతీయ మాంద్యానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో.. ఫెడ్ ఈలోపే అత్యవసర రేట్ల కోతకు దిగాల్సి వచ్చింది. గతేడాది రేట్ల కోత తర్వాత తొలి రేట్ల కోత ఇది. గతేడాది మూడు విడతలుగా ఫెడ్ రేట్లను తగ్గించి 1.5–1.75 స్థాయికి తీసుకొచ్చింది. 2020లో రేట్లలో ఎటువంటి మార్పులు ఉండవని గతంలో ప్రకటించిన ఫెడ్.. కరోనా కారణంగా విధానాన్ని మార్చుకుంది. కాగా, ఆరంభంలో భారీ నష్టాల్లో నడిచిన డౌజోన్స్ ఫెడ్ రేట్ల కోత ప్రకటన తర్వాత తీవ్ర ఆటుపోట్ల మధ్య ట్రేడయింది. కరోనా భయాలతో గత వారం డౌజోన్స్ 14% పడిపోవడం గమనార్హం. మాంద్యం భయాలవల్లే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008 నాటి మాంద్యం నుంచి బయటపడింది కానీ, చెప్పుకోతగ్గ స్థాయిలో రికవరీ కాలేదు. దాదాపు అన్ని సెంట్రల్ బ్యాంకులు మళ్లీ మాంద్యంలోకి జారిపోకుండా.. సర్దుబాటు ధోరణులతో రేట్ల తగ్గింపుతోపాటు అన్ని రకాల సాధనాలను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారొచ్చన్న ఆందోళన విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫెడ్ అత్యవసరంగా రేట్ల కోతను చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంగళవారం ఉదయం జీ–7 దేశాల(యూఎస్, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా) ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల చీఫ్‌లు అత్యవసరంగా సమావేశం కావడం కూడా ఇందుకే. కరోనా వైరస్‌ను నిలువరించి, ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా ద్రవ్యపరమైన చర్యలు సహా అవసరమైతే అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీ–7 దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జీ–7 నుంచి ఈ తరహా సంయుక్త ప్రకటనలు 2001 సెప్టెంబర్ 11 దాడుల ఘటన, 2008 మాంద్యం సమయాల్లోనూ వెలువడడం గమనార్హం. కరోనా వైరస్ 60కుపైగా దేశాలకు వేగంగా విస్తరించిందని, ఇది ప్రస్తుత త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిని దిగజార్చవచ్చని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) కూడా ఇప్పటికే హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2020లో 2.4% కి తగ్గొచ్చని, వైరస్ మరింతగా విస్తరిస్తే 1.5%కి పడిపోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2% దిగువకు ప్రపంచ వృద్ధి పడిపోతే దాన్ని మాంద్యంగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై వైరస్ ప్రభావం: పావెల్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం కొంత కాలం పాటు ఉంటుందన్నారు ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్. సెంట్రల్ బ్యాంకు చర్య ఆర్థిక వ్యవస్థకు తగినంత చేయూతనిస్తుందని తాను నమ్ముతున్నట్టు ఫెడ్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘‘ఆర్థిక వృద్ధి అంచనాలకు ఉన్న రిస్క్‌ను చూసే ఈ చర్య తీసుకున్నాం. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. బలమైన వృద్ధి, బలమైన లేబర్ మార్కెట్లోకి తిరిగి మళ్లీ మనం ప్రవేశిస్తామని నేను సంపూర్ణంగా భావిస్తున్నాను’’ అని పావెల్ పేర్కొన్నారు. ఇది సరిపోదు ‘‘ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గిస్తోంది కానీ మరింత తగ్గించాలి. మరీ ముఖ్యంగా ఇతర దేశాలు, పోటీదేశాల స్థాయికి రేట్లు దిగి రావాలి. మనం సహేతుక స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. మరింత రేట్ల కోత దిశగా ఫెడరల్ రిజర్వ్ అడుగులు వేయాల్సిన సమయం ఇది’’ – డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు చదవండి : వొడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్ రివోల్ట్ ఇ-బైక్స్ లాంచ్ -
మరో పావు శాతం తగ్గిన ఫెడ్ రేటు
వాషింగ్టన్: అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. రెండు రోజుల పాటు జరిగి బుధవారం ముగిసిన సమావేశంలో ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్లో ఉన్న ‘ఫెడ్ ఫండ్స్ రేటు’ను 1.5 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది రేట్లను తగ్గించడం ఫెడరల్ రిజర్వ్‌కు ఇది మూడో సారి. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్‌ల్లో పావు శాతం మేర రేట్లను ఫెడ్ తగ్గించింది. అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడంతో రేట్లను ఫెడ్ తగ్గిస్తూ వస్తోంది. ఫెడరల్ ఫండ్స్ రేట్ అంటే... బ్యాంక్‌లు పరస్పరం ఇచ్చుకునే ఓవర్‌నైట్ రుణాలపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించే రేటునే ఫెడరల్ ఫండ్స్ రేట్గా వ్యవహరిస్తారు. ఈ రేట్‌పై ఆధారపడే బ్యాంక్‌లు వినియోగదారులకు ఇచ్చే తాకట్టు, క్రెడిట్, వ్యాపార ఇలా వివిధ రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. -
అమెరికా వడ్డీరేటు పావు శాతం కోత
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించింది. దీంతో వడ్డీ రేటు శ్రేణి 2–2.25 శాతం స్థాయికి దిగి వచ్చింది. 2008 తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ద్రవ్యోల్బణం నిర్దేశించుకున్న స్థాయికంటే (2 శాతం) దిగువనే ఉండటం తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని రేట్లను తగ్గించినట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) తెలిపింది. ఆర్థిక మాంద్యం పరిస్థితులేమీ లేకుండా, ఎకానమీ పటిష్టంగా ఉన్న సమయంలో ఇలా వడ్డీ రేట్లను తగ్గించడం 1998 తర్వాత ఇదే తొలిసారి. ఎకానమీకి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను అరశాతమైనా తగ్గించాల్సి ఉంటుందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నప్పటికీ రేట్ల కోతను పావు శాతానికి పరిమితం చేయడం గమనార్హం. -
మూడో రోజూ లాభాల జోష్..
ముంబై : అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు గ్లోబల్ మార్కెట్లలో జోష్ నింపాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో పాటు బ్యాంక్, మెటల్ షేర్లలో కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 39,950 పాయింట్ల వద్ద ముగియగా, 43 పాయింట్ల లాభపడిన నిఫ్టీ 11,965 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, వేదాంత షేర్లు లాభపడ్డాయి. -
సెన్సెక్స్ తక్షణ నిరోధశ్రేణి 39,120–39,270
వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్‌ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్ భారత్‌కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్, చైనా ఇండెక్స్‌లు కూడా 5 శాతంపైగానే జంప్‌చేశాయి. అమెరికా కేంద్రబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్లపెంపునకు, బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి స్వస్తిచెప్పడం... ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి కారణం కావొచ్చు. కానీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న సంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 39,270 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 190 పాయింట్లు పెరిగి 38,862 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే తొలుత 39,120–39,270 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 39,850 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 38,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 38,580 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. నిఫ్టీ అవరోధశ్రేణి 11,730–11,760 ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,761 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయి వద్ద జరిగిన భారీ లాభాల స్వీకరణ కారణంగా 11,559 పాయింట్ల స్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 11,730–760 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. డబుల్టాప్గా పరిణమించిన ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆ సందర్బంలో వేగంగా 11,810 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే క్రమేపీ 11,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 11,610 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,560 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. -
2019 నాలుగు దిక్కులు
కొత్త ఏడాది స్టాక్ మార్కెట్ వెలుగులు విరజిమ్ముతుందా? పుత్తడి మిలమిలలుంటాయా? రూపాయి పరుగు కొనసాగుతుందా? ముడి చమురు ధరల కదలికలు ఎలా ఉంటాయ్? ఈ నాలుగు దిక్కులూ ఏం చెబుతున్నాయి?.. సాక్షి బిజినెస్ ప్రత్యేకం: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, పటిష్టమైన డాలరు తదితర అంశాలతో పసిడి ధరలు 2018లో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా రేట్లు గణనీయంగా క్షీణించి ఔన్సు (31.1 గ్రాములు) ధర 1,200 డాలర్ల దిగువకు పడిపోయింది. కాకపోతే కనిష్ట స్థాయిల నుంచి మళ్లీ 9 శాతం మేర కోలుకోవడం పసిడి పటిష్టంగానే ఉందన్న సంకేతాలిస్తోంది. ఇక 2019 విషయానికొస్తే.. వాణిజ్య యుద్ధభయాలు, రాజకీయ వివాదా లు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీని ఉపసంహరిస్తుండటం వంటివి ప్రపంచ ఎకానమీకి ప్రధాన రిస్కులు కాబోతున్నాయి. స్వల్పకాలికంగా చూస్తే చాలా దేశాల వృద్ధి రేటు క్రమంగా నెమ్మదిస్తోంది. ఇవన్నీ ఇన్వెస్టర్ల విశ్వాసం, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, వృద్ధి మొదలైన వాటిపై ప్రతికూల ప్రభా వం చూపవచ్చు. రాజకీయ–భౌగోళిక టెన్షన్లు.. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లను కుదిపేయవచ్చు. ఈక్విటీ, బాండ్, కరెన్సీ మార్కెట్లు అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకులకు లోను కావచ్చు. చాలా దేశాల్లోని ఆర్థిక, ద్రవ్య, రాజకీయ విధానాలు చూస్తుంటే.. పసిడి ధరలకు మరింత మద్దతు లభించే సూచనలే కనిపిస్తున్నాయి. స్థూల ఆర్థికాంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. బంగారం రేట్లు క్రమంగా పెరగవచ్చు. కాబట్టి పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం బంగారంలో పెట్టుబడులను పరిశీలించవచ్చు. పోర్ట్‌ఫోలియోకి ఉండే రిస్కులను తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడొచ్చు. – చిరాగ్ మెహతా, సీనియర్ ఫండ్ మేనేజర్, క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ రూపాయి జోరు.. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2018లో 9 శాతం క్షీణించింది. కొత్త ఏడాదిలో రూపాయి పరిస్థితి కొంచెం మెరుగుపడవచ్చు. క్రూడ్ ధరలు పతనమైతే... ఆ మేరకు రూపాయి పుంజుకుంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక పథకాలు వెల్లువెత్తే అవకాశాలుండటం రూపాయిపై ప్రతికూల ప్రభావంపడచ్చు. 2019లో రూపాయి 68–70 రేంజ్లో కదలాడవచ్చు. కాగా రూపాయి విలువ సోమవారం 18 పైసలు పెరిగి 69.77 వద్ద ముగిసింది. చమురు బేజారు.. ముడి చమురు ధరలు 2018లో తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఇదే స్థాయి హెచ్చుతగ్గులు ఈ ఏడాది కూడా కొనసాగవచ్చు. ధరలు పెరిగే అవకాశాలు పెద్దగా లేవు. అలాగని భారీగా తగ్గే అవకాశాలూ తక్కువే. ఎందుకంటే బ్యారెల్ ధర 50 డాలర్లకన్నా దిగువకు చేరితే ఉత్పత్తిని తగ్గిస్తామని ఒపెక్ దేశాలు ఇప్పటికే చెప్పాయి. మొత్తంగా బ్రెంట్ చమురు 55– 65 డాలర్ల రేంజ్లో ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ కళకళ.. గత ఏడాది మాదిరే కొత్త సంవత్సరంలోనూ ఒడిదుడుకులు కొనసాగుతాయి. లోక్‌సభ ఎన్నికలు కీలకం కానున్నాయి. బీజేపీకి కానీ, కాంగ్రెస్‌కి కానీ ఏదో ఒక పెద్ద పార్టీకి ఎక్కువ సంఖ్యలో లోక్‌సభ స్థానాలు వస్తే, మార్కెట్ జోరును ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ రేట్ల పాలసీలూ, ముడి చమురు ధరల కదలికలు, అమెరికా–చైనాల వాణిజ్య సంబంధాలు... ఇవన్నీ ప్రభావం చూపే వే. మొత్తం మీద సెన్సెక్స్ ఈ ఏడాది కూడా 5 శాతం మేర పెరిగే అవకాశాలున్నాయనేది నిపుణుల మాట. నిఫ్టీ ఏడాది చివరికు 11,500 పాయింట్లకు చేరవచ్చు. -
వచ్చే ఏడాదీ ఆర్థిక వృద్ధి జోరు– సీఐఐ
న్యూఢిల్లీ: పలు అంతర్జాతీయ ప్రతికూల సంఘటనలు జరిగినప్పటికీ, ఈ ఏడాది వేగవంతమైన వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపుపొందిన భారత్ 2019లో సైతం ఇదే జోరును ప్రదర్శించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనావేసింది. సర్వీసుల రంగం పటిష్టమైన పనితీరుతో పాటు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వినియోగ డిమాండ్ మెరుగుదల కారణంగా 2019లో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరుతుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. జీఎస్టీ అమలులో క్రమేపీ అడ్డంకులు తొలగడం, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెరగడం, రుణ సమీకరణ ప్రత్యేకించి సర్వీసుల రంగంలో 24 శాతానికి పెంచుకోవడం వంటి అంశాలు బలమైన ఆర్థికాభివృద్ధికి బాట వేస్తున్నాయని ఆయన వివరించారు. 2018లో పలు ప్రధాన దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలుకావడం, చమురు ధరలు పెరగడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కఠినతర ద్రవ్య విధానం వంటి ప్రతికూలాంశాల నడుమ భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధిచెందిందని సీఐఐ గుర్తుచేసింది. 2019లో జీడీపీ వృద్ధి వేగవంతంకావడానికి ఏడు కీలక విధాన చర్యల్ని సీఐఐ సూచించింది. ఇంధనం, రియల్ ఎస్టేట్, విద్యుత్, ఆల్కహాల్ విభాగాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ లభ్యతను పెంచడం, పీసీఏ పరిధిలో వున్న బ్యాంకులపై నియంత్రణలను సరళీకరించడంతో పాటు మ్యూచువల్‌ఫండ్స్‌తో సహా ఆర్థిక సంస్థలకు అత్యవసర నిధుల్ని అందుబాటులో ఉంచాలని సీఐఐ కోరింది. ల్యాండ్ రికార్డుల్ని డిజిటలైజ్ చేయడం, రాష్ట్రాల్లో ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థల్ని ఏర్పాటుచేయడం వంటివి జరగాలని సీఐఐ ఆకాంక్షించింది. -
‘హ్యాపీ’ న్యూ ఇయర్ షేర్లివి..!
మార్కెట్లు... అంటే సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఇండెక్స్‌లు మరీ అంతగా పడలేదు. లార్జ్ క్యాప్ షేర్లు కొన్ని పెరిగాయి... కొన్ని తగ్గాయి. కానీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మాత్రం ఘోరంగా పతనమయ్యాయి. మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి 9 శాతం వరకూ పతనమైతే ఈ షేర్లు మాత్రం చాలావరకూ 50– 60– 70 శాతం కూడా పతనమయ్యాయి. మ్యూచ్‌వల్ ఫండ్ పథకాలు చాలావరకూ ఈ ఏడాది నష్టాలనే ఇచ్చాయి. నిజం చెప్పాలంటే ఏ షేర్లలో పెట్టుబడి పెట్టాలి? ఏ ఫండ్స్ మంచివి? అనేది 2018లో ఇన్వెస్టర్లకు ఎంత బుర్రబద్దలుకొట్టుకున్నా అర్థం కాలేదు. ఒకేరోజు సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగితే... మరోరోజు 500 పాయింట్లకు పైగా పతనం!!. ఇలాంటి ఎగుడు దిగుళ్లెన్నో సర్వసాధారణమైపోయాయి. దీనికి అంతర్జాతీయ వాణిజ్య యుద్ధభయాలు... ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు.. దేశీయంగా ఎన్బీఎఫ్సీ సంక్షోభం వంటివన్నీ కారణమని చెప్పొచ్చు. కాకపోతే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లు సంతోషించదగ్గ అత్యంత కీలక పరిణామం ఒకటుంది. అది... మార్కెట్లు పరిణితితో వ్యవహరించటం. గతానికి భిన్నంగా.. అగ్రరా జ్యం అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందన్న నానుడికి విరుద్ధంగా, దేశీ ఇన్వెస్టర్లు ఈసారి మరీ భయపడిపోకుండా కాస్త తట్టుకుని నిలబడ్డారు. అమెరికా మార్కెట్లు ఎలా ఉన్నా... మన మార్కెట్లు మాత్రం ఇక్కడి పరిణామాలకు అనువుగా స్పందించటం మొదలుపెట్టాయి. పైపెచ్చు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో (సిప్) వస్తున్న పెట్టుబడులు మరింత పెరిగాయి తప్ప నిలిచిపోలేదు. అందుకే మన ఇండెక్స్‌లు అంతర్జాతీయ మార్కెట్ల మాదిరి మరీ ఎక్కువ పతనం కాలేదన్నది వాస్తవం. ఇక 2019లో మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. క్రూడ్ ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండుమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచుతామనే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించటం కాస్త కష్టం. కాకపోతే కంపెనీల ఆదాయాల్ని బట్టి ఆయా షేర్లు రాణిస్తాయనేది బ్రోకరేజీ సంస్థల మాట. ఆయా బ్రోకరేజీ సంస్థలు కొత్త సంవత్సరం కోసం సిఫార్సు చేస్తున్న షేర్లలో కొన్ని ‘సాక్షి’ ప్రాఫిట్ పాఠకులకు ప్రత్యేకం.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆశావహంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్... 2018లో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లను వెంటాడగా, ప్రపంచ వృద్ధి రేటుపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుతం వాణిజ్య యుద్ధ భయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రూడ్ ధరలూ తగ్గుతున్నాయి. 2019లో దేశీయంగా అంతర్గత అంశాల ప్రభావం మార్కెట్లపై గణనీయంగా ఉంటుంది. ఎన్నికల దరిమిలా కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందనేది కీలకంగా మారింది. ఒకవేళ బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎకానమీ వృద్ధి పైనా ప్రభావం పడుతుంది. 2018–20 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నిఫ్టీ 18.5 శాతం వృద్ధి నమోదు చేయొచ్చు. ఇందుకు బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగాల షేర్లు తోడ్పడవచ్చు. 2019లో ఆటోమొబైల్ రంగం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ రంగాలు ఆశావహంగా ఉంటాయని భావిస్తున్నాం. అలాగే, కన్సూ్యమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల షేర్లు కూడా సానుకూలంగా ఉండొచ్చు. మెటల్, మైనింగ్, రియల్ ఎస్టేట్, టెలికం, ఐటీ రంగాల పనితీరు తటస్థంగా ఉండవచ్చు. 2019లో బీజేపీ కూటమికి అత్యధికంగా సీట్లొచ్చే అవకాశం ఉంది. స్టాక్‌మార్కెట్‌పై దీని ప్రభావం కూడా ఉంటుంది. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్ బెస్ట్ రాష్ట్రాల ఎన్నికలు, ఆర్బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్లో స్టాక్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే. సిఫార్సులు 1. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 265 ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్ వాటాతో ఎక్సైడ్.. లీడర్ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. 2. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రస్తుత ధర రూ. 148 ఎందుకంటే..?: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్పోర్ట్ రన్‌వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా. 3. పీఐ ఇండస్ట్రీస్ ధర రూ. 857 ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్అండ్డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్ బుక్ వంటివి ఈ షేర్‌కు సానుకూలాంశాలు. యాక్సిస్ డైరెక్ట్ ఎన్నికల దాకా ఒడిదుడుకులు ప్రస్తుత ఒడిదుడుకులు సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగే అవకాశాలున్నాయి.ఫెడ్ నిర్ణయాలు, వాణిజ్యయుద్ధం, క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ నిర్ణయాలు వంటివి ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల వృద్ధితో భారీ డిమాండ్ కొనసాగిన పక్షంలో మార్కెట్లు మరింతగా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో చూడతగ్గ స్టాక్స్ కొన్ని... 1. ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,583 టార్గెట్ రూ. 1,876 రాబడి: 18 శాతం ఎందుకంటే..?: మెరుగైన మార్జిన్లు, అత్యధిక వడ్డీయేతర ఆదాయాలు, స్థిరమైన అసెట్ క్వాలిటీ వంటివి బ్యాంకుకు సానుకూలాంశాలు. 2. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 551 టార్గెట్ ధర రూ. 672 రాబడి: 22 శాతం ఎందుకంటే..?: సుమారు మూడు నుంచి అయిదేళ్ల వ్యవధికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వోల్టాస్ మెరుగ్గా ఉంది. పటిష్టమైన నెట్వర్క్, విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణి, మెరుగైన ఆర్డర్ బుక్ సానుకూలాంశాలు. 3. స్టెరిలైట్ టెక్నాలజీస్ ప్రస్తుత ధర రూ. 289 టార్గెట్ ధర రూ. 410 రాబడి: 41 శాతం ఎందుకంటే..?: ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తదితర ఉత్పత్తుల సరఫరాదారు స్థాయి నుంచి డేటా నెట్వర్క్ సొల్యూషన్స్ అందించే సంస్థగా రూపాంతరం చెందుతుండటం కంపెనీకి సానుకూలాంశం. మిలిటరీ, ఏరోస్పేస్, హెల్త్‌కేర్ వంటి విభాగాల నుంచి కూడా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటం కంపెనీకి లాభించనుంది. సంస్థకు దేశీయంగా 40 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు రూ. 6,000 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. 4. ఆర్తి ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 రాబడి 22 శాతం ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ, డిమాండ్ వృద్దితో ఆదాయాలు మెరుగుపడగలవు. కొత్త టాలీన్ వ్యాపారం వచ్చే రెండు, మూడేళ్లలో గరిష్ట స్థాయిలో రాబడులివ్వొచ్చు. 5. టేక్ సొల్యూషన్స్ ప్రస్తుత ధర రూ. 149 టార్గెట్ ధర రూ. 178 రాబడి 19 శాతం ఎందుకంటే..?: భారీ మార్కెట్ లభ్యత, టీఎస్ఎల్ విభాగంలో అపార అనుభవం, కార్యకలాపాల విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో ఆదాయాలు మెరుగుపడగలవు. 6. మారికో ప్రస్తుత ధర రూ. 378 టార్గెట్ ధర రూ. 428 రాబడి 12 శాతం ఎందుకంటే..?: కొబ్బరి ధరలు తగ్గనుండటం (గడిచిన పది నెలల్లో కేజీకి రూ. 90 పలికిన రేటు.. 30 శాతం తగ్గొచ్చని అంచనా) సంస్థకు సానుకూలం. ప్రధాన బ్రాండ్స్, అంతర్జాతీయ మార్కెట్లలో పనితీరు మెరుగ్గా ఉండటం.. ప్రయోజనకరం. 7. అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర రూ. 912 టార్గెట్ రూ. 1,106 రాబడి 21 శాతం ఎందుకంటే..?: రూమ్ ఎయిర్ కండీషనర్స్ (ఆర్ఏసీ) పరిశ్రమలోని ప్రధాన కంపెనీల్లో అంబర్ కూడా ఒకటి. ఇటీవల ఇతర కంపెనీల కొనుగోలుతో ఇన్వర్టర్ ఆర్ఏసీ విభాగాన్ని పటిష్టపర్చుకుంది. బ్రాండ్ ఓనర్లు అవుట్సోర్సింగ్ చేసే ధోరణి పెరుగుతుంటం కంపెనీకి లాభించే అంశం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సానుకూలం.. 1. ఏసీసీ ప్రస్తుత ధర రూ. 1,478 ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య వినియోగం పదేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో సిమెంటు రేట్లు మెరుగుపడ్డాయి. కొంగొత్త ప్రీమియం ఉత్పత్తులు, మెరుగైన ధర అంచనాలు, కార్యకలాపాల విస్తరణ, తక్కువ వేల్యుయేషన్‌లో లభిస్తుండటం దీనికి సానుకూలాంశాలు. 2. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 625 ఎందుకంటే..?: రెండేళ్ల పాటు 17 శాతం అసెట్ వృద్ధి సాధనకు సరిపడేంతగా మూలధన నిల్వలున్నాయి. తదుపరి వృద్ధికి అవకాశమిచ్చే సాధనాల్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేసింది. కొత్తగా మరిన్ని మొండిబాకీలు తలెత్తకుండా ఉండటంతో పాటు రుణ వ్యయాలు తగ్గుతుండటం మూలంగా ఆదాయాలు ద్వితీయార్ధంలో మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇక, టాప్ మేనేజ్మెంట్ మారడంతో స్టాక్ రీరేటింగ్ జరగొచ్చు. ప్రస్తుతం షేరు ఆకర్షణీయ వేల్యుయేషన్స్‌లో లభిస్తోంది. 3. ఐటీసీ ప్రస్తుత ధర రూ. 282 ఎందుకంటే..?: ఈ షేరు అవుట్పెర్ఫార్మ్ చేయడానికి అయిదు కారణాలు కనిపిస్తున్నాయి. 1) మూడింట రెండొంతుల మంది స్మోకర్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం, వీరు బీడీల నుంచి అప్‌గ్రేడ్ అవుతుండటం. 2) పన్నుల విధానం స్థిరంగా ఉంటుందన్న అంచనాలు 3) సానుకూలమైన బేస్ 4) అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడం 5) ఎఫ్ఎంసీజీ వ్యాపార వాటా పెరుగుతుండటం. ఈ అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా మెరుగైన రాబడులు రావొచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో మిగతా వాటితో పోలిస్తే 35 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. 4. ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 504 ఎందుకంటే..?: గోల్డ్ లోన్ సెగ్మెంట్లో దీర్ఘకాలికంగా కార్యకలాపాలు, మంచి అనుభవం ఉండటం దీనికి సానుకూలాంశం. బంగారంయేతర రుణాల వాటా పెరుగుతుండటంతో.. పోర్ట్‌ఫోలియోకు రిస్కులు తగ్గుతున్నాయి. ఇతరత్రా పథకాలను విక్రయించడానికి ప్రస్తుతం ఉన్న అసెట్స్నే ఉపయోగించుకునేందుకు వీలుండటంతో.. ఆదాయాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండొచ్చు. పసిడి రుణాల విభాగం పునర్వ్యవస్థీకరణ కారణంగా రాబోయే రోజుల్లో మొండిబాకీల స్థాయి తగ్గుతుంది. 5. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,125 ఎందుకంటే..?: కన్జూమర్, టెలికం సెగ్మెంట్ విస్తరించే కొద్దీ కంపెనీ ఆదాయాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా టెలికం విభాగం ఆర్‌జియో ఆదాయం 27 శాతం మేర, లాభాలు 77 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా. 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రిలయన్స్ జియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 41 కోట్లకు చేరొచ్చు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్ బెస్ట్ రాష్ట్రాల ఎన్నికలు, ఆర్బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్లో స్టాక్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే. సిఫార్సులు 1. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 265 ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్ వాటాతో ఎక్సైడ్.. లీడర్ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. 2. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రస్తుత ధర రూ. 148 ఎందుకంటే..?: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్పోర్ట్ రన్‌వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా. 3. పీఐ ఇండస్ట్రీస్ ధర రూ. 857 ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్అండ్డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్ బుక్ వంటివి ఈ షేర్‌కు సానుకూలాంశాలు. – సాక్షి, బిజినెస్ విభాగం గమనిక: ఇవన్నీ బ్రోకరేజి సంస్థల సిఫార్సులు మాత్రమే. రిస్కులను బేరీజు వేసుకుని ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
‘నాకు అతిపెద్ద ప్రమాదం సెంట్రల్ బ్యాంకే’
వాషింగ్టన్ : అమెరికా సెంట్రల్ బ్యాంక్‌పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. ఫెడరల్ రిజర్వే తనకు అతిపెద్ద ముప్పుగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. వడ్డీరేట్లను ఆ బ్యాంక్ వెంటవెంటనే పెంచుతుండటంపై ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు. ‘నాకు అతిపెద్ద ప్రమాదం ఫెడరల్ రిజర్వు బ్యాంక్. ఎందుకంటే వడ్డీరేట్లను ఎంతో వేగవంతంగా పెంచుతుంది’ అని ఫాక్స్ బిజినెస్ టెలివిజన్‌కు ఆయన చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఓ స్వతంత్ర సంస్థ అని, అందువల్ల తాను వారితో మాట్లాడననని చెప్పారు. కానీ ఫెడరల్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌పై నేరుగా విమర్శలు చేశారు. వడ్డీరేట్లను నెమ్మదిగా పెంచుతా అని చెప్పి, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. జెరోమ్ వ్యవహరిస్తున్న తీరుపై తాను అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. గతవారం స్టాక్స్ భారీగా పడిపోవడానికి కారణం జెరోమ్ పావెలే అని నిందించారు. ఆయన సరైన వ్యక్తి అవ్వొచ్చు లేదా తప్పు అవ్వొచ్చు కానీ ఆయన్ని అక్కడ నుంచి తొలగించనని పావెల్‌ను ఉద్దేశించి చెప్పారు. ఫెడ్ తన మానిటరీ పాలసీతో ఎల్లప్పుడు తప్పులు చేస్తూనే ఉందని విశ్వసిస్తున్నట్టు ట్రంప్ పలుమార్లు విమర్శించారు. అక్టోబర్ 11న ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పావెల్ నిర్ణయాలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఫెడ్ పాలసీ ముందు జాగ్రత్త
స్వల్పంగా తగ్గిన సూచీలు ముంబై: భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో మంగళవారం స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై..కొద్దిపాటి నష్టాలతో ముగిసాయి. ఫెడ్ రెండు రోజుల పాలసీ సమీక్షా సమావేశం మంగళవారం మొదలయ్యింది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని, మార్కెట్ అధిక విలువకు ట్రేడవుతుండటం కూడా ఇందుకు కారణమని విశ్లేషకులు చెప్పారు. బీఎస్ఈ సెన్సెక్స్ 21 పాయింట్ల తగ్గుదలతో 32,402 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5.55 పాయింట్లు క్షీణించి 10,147.55 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రపంచ సంకేతాలు సైతం బలహీనంగా వుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. తగ్గిన బ్లూచిప్ షేర్లు... : పలు బ్లూచిప్ షేర్లు లాభాల స్వీకరణ ప్రభావంతో తగ్గాయి. కోల్ ఇండియా, లార్సన్ అండ్ టుబ్రో, ఎస్బీఐ, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు 2.49 శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ 4.5 శాతం అప్...:టాటా మోటార్స్ షేర్లను రూ. 421 ధరతో ఒక బ్లాక్‌డీల్‌లో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కొనుగోలు చేసిన ప్రభావంతో ఈ షేరు 4.5 శాతం ఎగిసి రూ. 423.65 వద్ద ముగిసింది.