సాక్షి,ముంబై: మండు వేసవిలో చల్లటి కబురు. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధర శుక్రవారం మరింత తగ్గి మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర 62 వేల దిగువనే కొనసాగుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో 10 గ్రాములు రూ.60,000 దిగువన ట్రేడవుతోంది. (అమెజాన్ దిమ్మతిరిగే పెట్టుబడులు: ఏడాదికి లక్షల ఉద్యోగాలు)
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్లకు రూ 300 తగ్గి రూ.55800గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60870గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు 1,964.4 డాలర్లుగా ఉంది.
అటు వెండి ధరకూడా స్వల్పంగా 200 తగ్గి కిలో వెండి 74300గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ 78 వేలుగా ఉంది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 61,020, 22 క్యారెట్ (10 గ్రాములు) రూ. 55,950. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 61,360 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 56,250. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉంది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు)
స్వల్పకాలిక ప్రాతిపదికన బంగారంపై సెంటిమెంట్ ఒక వారం వ్యవధిలో బుల్లిష్ నుండి బేరిష్‌కు మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధర తగ్గడానికి రెండు అంశాలు కారణమని భావించారు. జూన్ 1 నాటికి తమ రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా డిఫాల్ట్ అవుతుందనే ఆందోళన నెలకొంది. అయితే చర్చలు అర్థవంతంగా ఉన్నాయని అధ్యక్షుడు బిడెన్ హామీ ఇచ్చినప్పటికీ డెట్ సీలింగ్ చర్చలు ఫెడ్ రేట్లను ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించనున్నవడ్డీరేట్ల ఆధారంగా పసిడి ధరల కదలికలు ఉండనున్నాయి. (Adani-Hindenburg Row: హిండెన్‌బర్గ్ ఆరోపణలు: అదానీకి భారీ ఊరట)
Comments
Please login to add a commentAdd a comment