గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 964.16 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 79,218.05 వద్ద, నిఫ్టీ 236.90 పాయింట్లు లేదా 0.98 శాతం నష్టంతో 23,961.95 వద్ద నిలిచాయి.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, సిప్లా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.03 సమయానికి నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 23,959కు చేరింది. సెన్సెక్స్ 790 పాయింట్లు దిగజారి 79,396 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 107.8 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.78 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 2.95 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 3.56 శాతం దిగజారింది.
యూఎస్ ఫెడ్ వడ్డీ కోత
అంచనాలకు అనుగుణంగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో తాజాగా 0.25 శాతం కోత పెట్టింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.25–4.5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేటు తగ్గింపునకే మరోసారి మొగ్గు చూపింది. ఈ క్యాలండర్ ఏడాదిలో ఇది చివరి పాలసీ సమావేశంకాగా.. జో బైడెన్ హయాంలో పావెల్ చేపట్టిన చివరి సమీక్షగా నిపుణులు పేర్కొన్నారు. కాగా.. కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన వెంటనే చేపట్టిన సెప్టెంబర్ సమావేశంలో ఎఫ్‌వోఎంసీ 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించిన సంగతి తెలిసిందే. తదుపరి తిరిగి గత(నవంబర్) సమావేశంలో మరో పావు శాతం వడ్డీ రేటును తగ్గించింది. అయితే భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అంతలా ఉండకపోవచ్చంటూ బలమైన సంకేతాలు ఇచ్చింది. దాంతో మార్కెట్‌లు భారీగా పతనమవుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment