దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 24,198 వద్దకు చేరింది. సెన్సెక్స్ 502 పాయింట్లు దిగజారి 80,182 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ఇదీ చదవండి: వింటేజ్ కారు ధర రూ.3,675!
భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగియడానికి కారణాలను నిపుణులు విశ్లేషించారు.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ: వడ్డీరేట్ల తగ్గింపుపై దిశానిర్దేశం చేసే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు రాత్రి దీనికి సంబంధించి వివరాలు వెల్లడికానున్నాయి. రేపు మన మార్కెట్లో దీని ప్రభావం ఉండనుంది.
చైనా ఆర్థిక మందగమనం: చైనా తాజా గణాంకాలు ఊహించిన దానికంటే బలహీనమైన ఆర్థిక పనితీరును చూపించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌ను ప్రభావితం చేసింది. భారతదేశ మెటల్, ఆటో స్టాక్‌లను ప్రభావితం చేసింది.
యూఎస్ డాలర్ బలపడటం: బలమైన డాలర్ భారతీయ ఈక్విటీల వైపు విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. డాలర్ డినామినేషన్ చెల్లించే రుణాలు కంపెనీలకు భారంగా మారుతాయి.
వాణిజ్య లోటు పెరుగుదల: నవంబర్‌లో వాణిజ్య లోటు గణనీయంగా పెరగడంతో రూపాయిపై ఒత్తిడి అధికమైంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment