మీరు చదివిన శీర్షిక నిజమే. కానీ అది 2024లో కాదండోయ్.. 1936లో సంగతి. అప్పట్లో చేవ్రొలెట్ కంపెనీ ఇచ్చిన వార్తాపత్రిక ప్రకటనను ఇటీవల కార్‌బ్లాగ్ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది. అందులోని వివరాల ప్రకారం చేవ్రొలెట్ కంపెనీ 1936 సంవత్సరంలో 5 సీటింగ్ కెపాసిటీ ఉన్న వింటేజ్ కారును రూ.3,675కే ఆఫర్ చేస్తున్నట్లు ఉంది. అలెన్ బెర్రీ అండ్ కో.లిమిటెడ్ అనే ఏజెన్సీ కలకత్తా, ఢిల్లీ, లఖ్‌నవూ, దిబ్రూఘర్ ప్రాంతాల్లో దీన్ని ఆ రేటుకు అందిస్తున్నట్లు పేర్కొంది. 1936లో రూ.3,675 విలువ 2024లో రూ.3,67,50,000గా ఉందని అంచనా.
మరో ప్రకటనలో ఓపెన్‌టాప్ చేవ్రొలెట్ మోడల్ కార్ ధర రూ.2,700 అన్నట్లు ప్రకటనలో ఉంది. దీన్ని లఖ్‌నవూలోని ఎడుల్జీ అండ్ కో మోటార్ ఇంజినీర్స్ అండ్ కోచ్ బిల్డర్స్ కంపెనీ అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 5 సీటర్ బడ్జెట్ కార్లు రూ.లక్షల్లో ఉన్నాయి. ఏళ్లు గడుస్తుంటే డబ్బు విలువ పడిపోయి లక్షలకు విలువ లేకుండా పోతుంది. దాంతో అన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
ఈ రెండు ప్రకటనలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేనూ ధనవంతుడినే కానీ, వేరే శతాబ్దంలో ఉన్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘ఆ రోజుల్లో అది చాలా ఖరీదు’అని రిప్లై ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment