Vintage Car
-
వింటేజ్ క్రేజ్ : ఆమె ‘పద్మిని’ జాతి స్త్రీ... ఇంట్రస్టింగ్ స్టోరీ!
నీకు ఇష్టమైన కారు ఏదో చెప్పు? అంటే క్రెటా అనో ఆడి అనో మెర్సిడెస్ అనో, బిఎండబ్ల్యూ అనో...ఇంకా మరికొన్ని అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్ల పేర్లు చెప్పేవాళ్లనే మనం చూసి ఉంటాం కాబట్టి అదేమీ విశేషం కాదు. కానీ నీ కలల కారు గురించి చెప్పు అంటే ప్రీమియర్ పద్మిని అని ఎవరైనా చెబితే... కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు స్పృహ తప్పినా ఆశ్చర్యం లేదు. అవును మరి ప్రీమియర్ పద్మిని అనే కార్ ఒకటి ఉండేదని, ఉందని కూడా చాలా మందికి తెలియని నవ నాగరిక ప్రపంచంలో... ఆ పురాతన కార్ కోసం అన్వేషించి పట్టుకుని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని దానికి జవసత్వాలను సమకూర్చి.. తన పుట్టిన రోజున తనకు దక్కిన అపురూప బహుమతిగా మురిసిపోతూ ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే ఉందో... అందుకే ఆ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలకు నోచుకుంటోంది.సొగసైన, హై–టెక్ కార్లు రోడ్లపై ఆధిపత్యం చెలాయించే కార్పొరేట్ ప్రపంచంలో, ఒక బెంగళూరు ఐటీ ఉద్యోగిని క్లాసిక్ కార్ ప్రీమియర్ పద్మినికి సరికొత్త యజమానిగా మారారు. భారతదేశంలో ఒకప్పుడు హుందాతనానికి అధునాతనతకు చిహ్నంగా కొంత కాలం పాటు హల్చల్ చేసిన ఈ కారు, గడిచిన విలాసవంతమైన యుగానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పొచ్చు. అంతేకాదు రచన మహదిమనే అనే యువతి చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.ఆమె ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తాను కొనుగోలు చేసిన పాతకాలపు కారును, ఇంటికి తెచ్చుకున్న ఆనందాన్ని తన అనుభవాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane) ఆమె తన ప్రియమైన ప్రీమియర్ పద్మిని మహదిమనే తన చిన్ననాటి కలను జీవం పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత తన కలల కారును ఎలా కనిపెట్టిందో ఆమె దీనిలో తెలియజేసింది. నెలల తరబడి ఖచ్చితమైన చేయించిన మరమ్మతులు అందమైన పౌడర్ బ్లూ పెయింట్ జాబ్ తరువాత, పాతకాలపు కారు ఎలా దాని పూర్వ వైభవానికి పూర్వపు అందానికి చేరుకుందో వివరించింది.‘నాకు నేను పించింగ్ వేస్తున్నాను. నా పుట్టినరోజు కోసం నేను ఈ కారు కొన్నాను ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుండి ఈ కారు గురించి కలలు కన్నాను‘ అని ఎమ్మెల్యే మహదిమనే వీడియోలో తెలిపారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఈ కార్‌తో ముడిపడి ఉండడం తో ఈ కార్ తనకొక భావోద్వేగ అనుబంధం అంటూ ఆ యువతి పొందుతున్న ఉద్వేగాన్ని ఇప్పుడు నెటిజనులు సైతం ఆస్వాదిస్తున్నారు.‘‘గత ‘సంవత్సరాన్ని అత్యద్భుతంగా ముగించడం అంటే ఇదే ఇది ఇంతకంటే మెరుగ్గా ఏదైనా ఉండగలదా? నా డ్రీమ్ కారులో ఓపికగా పనిచేసి, దానిని ఈ అందానికి మార్చినందుకు కార్ రిపేర్ చేసిన బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పింది.అత్యాధునిక ఖరీదైన కార్లు లేదా మరేదైనా సరే కొనుగోలు చేయడం అంటే మనం సాధించిన, అందుకున్న విజయ ఫలాలను నలుగురికీ ప్రదర్శించడమే కావచ్చు కానీ పాతవి, మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ అనుభూతులను తిరిగి మన దరికి చేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విజయమే అని చెప్పాలి. అలాంటి విజయాలను అందిస్తుంది కాబట్టే... వింటేజ్ ఇప్పటికీ కొందరికి క్రేజ్. -
వింటేజ్ కారు ధర రూ.3,675!
మీరు చదివిన శీర్షిక నిజమే. కానీ అది 2024లో కాదండోయ్.. 1936లో సంగతి. అప్పట్లో చేవ్రొలెట్ కంపెనీ ఇచ్చిన వార్తాపత్రిక ప్రకటనను ఇటీవల కార్‌బ్లాగ్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది. అందులోని వివరాల ప్రకారం చేవ్రొలెట్ కంపెనీ 1936 సంవత్సరంలో 5 సీటింగ్ కెపాసిటీ ఉన్న వింటేజ్ కారును రూ.3,675కే ఆఫర్ చేస్తున్నట్లు ఉంది. అలెన్ బెర్రీ అండ్ కో.లిమిటెడ్ అనే ఏజెన్సీ కలకత్తా, ఢిల్లీ, లఖ్‌నవూ, దిబ్రూఘర్ ప్రాంతాల్లో దీన్ని ఆ రేటుకు అందిస్తున్నట్లు పేర్కొంది. 1936లో రూ.3,675 విలువ 2024లో రూ.3,67,50,000గా ఉందని అంచనా.మరో ప్రకటనలో ఓపెన్‌టాప్ చేవ్రొలెట్ మోడల్ కార్ ధర రూ.2,700 అన్నట్లు ప్రకటనలో ఉంది. దీన్ని లఖ్‌నవూలోని ఎడుల్జీ అండ్ కో మోటార్ ఇంజినీర్స్ అండ్ కోచ్ బిల్డర్స్ కంపెనీ అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 5 సీటర్ బడ్జెట్ కార్లు రూ.లక్షల్లో ఉన్నాయి. ఏళ్లు గడుస్తుంటే డబ్బు విలువ పడిపోయి లక్షలకు విలువ లేకుండా పోతుంది. దాంతో అన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. View this post on Instagram A post shared by Car Blog India (@carblogindia)ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..ఈ రెండు ప్రకటనలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేనూ ధనవంతుడినే కానీ, వేరే శతాబ్దంలో ఉన్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘ఆ రోజుల్లో అది చాలా ఖరీదు’అని రిప్లై ఇచ్చారు. -
దస్తన్ ఆటో వరల్డ్ కార్స్ మ్యూజియం - పాతకాలపు కార్ల అడ్డా
-
దస్తన్ ఆటో వరల్డ్ కార్ల మ్యూజియం
రోల్స్‌రాయిస్, జాగ్వార్, బెంట్లీ, లాగోండా, క్యాడిలాక్, ఆస్టిన్, మెర్సిడెస్, ఆంబుమ్స్, హెచ్‌జె ముల్లినర్, అర్థర్ ముల్లినర్, విండోవర్స్, పార్క్ వార్డ్... ఈ కార్లన్నింటినీ ఒకే చోట చూడాలంటే దస్తన్ ఆటోవరల్డ్ వింటేజ్ మ్యూజియానికి వెళ్లాలి. మన హైదరాబాద్‌లో నిజాం నవాబు సేకరించిన కార్లను చౌమొహల్లా ΄్యాలెస్లో చూడవచ్చు. ఈ కలెక్షన్‌కు పదింతలు పెద్ద కలెక్షన్ అహ్మదాబాద్‌లోని ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలో ఉంది. రెండువేల రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియంలో మూడు వందలకు పైగా మోటారు వాహనాలుంటాయి. గాంధీ సినిమాలో ఉపయోగించిన మేబాష్ కారును కూడా చూడవచ్చు. అలాగే 1923 రోల్స్ 20 మోడల్ కూడా ఉంది. అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్‌రోడ్, కత్వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్‌లో నమోదైంది. ప్రియమైన ప్రయాణం!ఈ మ్యూజియంలో ఉన్న బైక్‌లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్లాల్ భోగిలాల్. రకరకాల కార్ల మీద ఆయనకున్న మోజు ఇలా మ్యూజియం రూపంలో కొలువుతీరింది. ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి వంద రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు. వింటేజ్ కారులో ప్రయాణించాలనే సరదా కలిగితే అదీ సాధ్యమే. అయితే అత్యంత ప్రియమైన ప్రయాణమనే చెప్పాలి. ట్రిప్‌కి వెయ్యి రూపాయల వుతుంది. బరువైన బాడీ, పాత మోటర్లు కావడంతో నాలుగు లీటర్ల పెట్రోలు పోస్తే కిలోమీటరు ప్రయాణిస్తాయి. టూరిస్టులను మ్యూజియం బయటకు రెండు–మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకువస్తారు. కారు ఎక్కేటప్పుడు ఒకరు వచ్చి డోర్ తీస్తారు, కూర్చోగానే డోర్ వేసేసి సెల్యూట్ చేస్తారు. తల΄ాగా చుట్టుకున్న డ్రైవర్ మన ఫోన్ తీసుకుని ఒక ఫొటో తీసిచ్చి ఆ తర్వాత కారు నడుపుతాడు. గంట కొట్టే కారుమ్యూజియం ఉద్యోగులు మేబాష్ కారును చూపిస్తూ ‘ఇది మేబాష్ తొలి కారు. ఈ కారును డిజైన్ చేసిన వ్యక్తి మనుమడు జర్మనీ నుంచి వచ్చి చెందిన 6 సిలిండర్ మేబాష్ కారును తనకు అమ్మవలసిందిగా కోరాడని, తన ఆటో ట్రెజరీ నుంచి అంత విలువైన కారును వదులుకోవడానికి ప్రాణ్‌లాల్ మనసు అంగీకరించలేదని చెబుతారు. ఈ మ్యూజియం అంతటినీ తిరిగి చూడాలంటే ఐదారు గంటలు పడుతుంది. సుడిగాలి పర్యటనలా చుట్టిరావాలన్నా కూడా మూడు గంటల సమయం పడుతుంది. గంట కొడుతూ ప్రయాణించే కారు చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇంజన్ మోడల్, చాసిటీ వంటి వివరాలు యువతను కట్టిపడేస్తాయి. ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అవగతమవుతుంది. దస్తన్ ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వంద రూపాయలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ టీ ఇస్తారు. అహ్మదాబాద్ వెళ్లినప్పుడు గాంధీ ఆశ్రమం, సయ్యద్ సిద్ధిఖీ జాలీలతోపాటు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వింటేజ్ కారు, పూలచీరలో విష్ణు ప్రియ అదిరే లుక్స్ (ఫోటోలు)
-
అనంత్ అంబానీ -రాధిక సంగీత్ : వారసులతో ముఖేష్, నీతా మురిపెం!
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు మరింత జోరందుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్కెంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి సంగీత్ వేడుకును ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కుటుంబం ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి.ఈ వేడుకలో ముఖేష్, నీతా అంబానీ దంపతులు మనవళ్లు, మనవరాళ్లతో వింటేజ్ ఓపెన్-టాప్ కారులో షికారు చేయడం హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్బంగా ముఖేష్‌ను చూసి నీతా అంబానీ ముద్దు, ముద్దుగా మురిసిన దృశ్యం వైరలవుతోంది. 1968 నాటి బాలీవుడ్ బ్రహ్మచారి మూవీలోని "చక్కే మే చక్క" అనే క్లాసిక్ ట్యూన్‌కి, అంబానీ కారు నడుపుతూ కన్పించారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద తమ గ్రాండ్ పేరెంట్స్‌తో ఉత్సాహంగా కనిపించిన వీడియోను సంగీత్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రణబీర్ కపూర్ అలియా భట్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్,దీపికా పదుకొణె, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, తదితర బాలీవుడ్ ప్రముఖుల ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడించారు. ఇంకా క్రికెటర్లు ధోనీ, హార్దిక్ పాండ్య ప్రత్యేకంగా నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌తో కలిసి కాబోయే వరుడు అనంత్ అంబానీ డ్యాన్స్ చేశారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ‘దీవాంగీ.. దీవాంగీ’ పాటకు అంబానీ కుటుంబం అంతా ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఎప్పటిలాగానే నీతా అంబానీ సంప్రదాయ భరతనాట్యంతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.కాగా మూడు రోజుల పాటు జులై 12-14 తేదీల్లో ముంబైలోని జియో సెంటర్ వేదికగాఅనంత్-రాధిక వివాహం అంగరంగవైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ : పీపుల్స్ ప్లాజా వద్ద వింటేజ్ కార్ల ర్యాలీ (ఫొటోలు)
-
Hyderabad : ఓల్డ్ ఈజ్ గోల్డ్.. వింటేజ్ కార్ల షో అదుర్స్ (ఫొటోలు)
-
నెక్స్ట్ లెవల్ ప్లానింగ్: వింటేజ్ బైక్‌పై ప్రభాస్!
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అందుకే పాతకాలపు (వింటేజ్) వస్తువులకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కోసమే కథానుసారం సినిమాల్లో పాతకాలపు వస్తువులు, వాహనాలను చూపిస్తుంటారు. ఇప్పుడు ప్రభాస్ ఓ వింటేజ్ బైక్‌లో రయ్ రయ్‌మంటూ వెళ్లడాన్ని చూసే చాన్స్ ప్రేక్షకులకు దక్కనుందని తెలిసింది. యాక్షన్ సీక్వెన్సెస్‌లో ప్రభాస్ మార్క్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే యాక్షన్ పరంగా ‘సలార్’లో ద్విచక్రవాహనంపై విలన్లను వెంటాడే సీన్స్‌లో ప్రభాస్‌ను నెక్ట్స్ లెవల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారట ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ వింటేజ్ బైక్‌ను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారట. అలాగే ఓ వింటేజ్ కారును కూడా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించనున్నారని సమాచారం. -
వారసత్వం ఉట్టిపడింది!
వింటేజ్ కార్ అండ్ మోటార్ బైక్‌ల షో సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్కన్ హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం లుంబినీ పార్క్‌లో ఈప్రదర్శన నిర్వహించారు. 1952వ సంవత్సరం మోడల్ మొదలుకొని షెవర్లే, ఆస్టిన్, ఫోర్డ్ కంపెనీల కార్లతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్, రాజ్‌దూత్, వెస్పా స్కూటర్లు షోలో ఉంచారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ట్రాఫిక్‌అదనపు కమిషనర్ జితేందర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వింటేజ్ కార్లను, బైక్‌లను పరిశీలించారు. షో ముగిశాక ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. – ఖైరతాబాద్