అనంత్‌ అంబానీ -రాధిక సంగీత్‌ : వారసులతో ముఖేష్‌, నీతా మురిపెం! | Anant-Radhika Sangeet: Mukesh and Nita Ambani's Heartwarming Video With Grandkids Goes Viral | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ -రాధిక సంగీత్‌ : వారసులతో ముఖేష్‌, నీతా మురిపెం!

Published Sat, Jul 6 2024 11:03 AM | Last Updated on Sat, Jul 6 2024 6:04 PM

Anant-Radhika Sangeet: Mukesh and Nita Ambani's Heartwarming Video With Grandkids Goes Viral

వింటేజ్‌ ఓపెన్-టాప్ కారులో అంబానీ దంపతుల షికారు 

సంగీత్‌లో స్టెప్పులేసిన అంబానీ ఫ్యామిలీ

రిలయన్స్‌ వారసుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలు మరింత జోరందుకున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష​ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్కెంట్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి సంగీత్‌ వేడుకును ఘనంగా  జరిగింది.  ఈ వేడుకలో అంబానీ కుటుంబం  ఆనందోత్సాహాలు  అంబరాన్నంటాయి.

ఈ వేడుకలో ముఖేష్‌, నీతా అంబానీ దంపతులు మనవళ్లు, మనవరాళ్లతో వింటేజ్‌ ఓపెన్-టాప్ కారులో షికారు చేయడం హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్బంగా ముఖేష్‌ను చూసి నీతా అంబానీ ముద్దు, ముద్దుగా మురిసిన దృశ్యం వైరలవుతోంది.  1968 నాటి బాలీవుడ్‌ బ్రహ్మచారి మూవీలోని "చక్కే మే చక్క" అనే క్లాసిక్ ట్యూన్‌కి,  అంబానీ కారు నడుపుతూ కన్పించారు.

పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద  తమ గ్రాండ్‌ పేరెంట్స్‌తో ఉత్సాహంగా కనిపించిన వీడియోను సంగీత్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రణబీర్‌ కపూర్‌ అలియా భట్‌, సల్మాన్‌ ఖాన్‌, విక్కీ కౌశల్‌, రణ్‌వీర్‌ సింగ్‌,దీపికా పదుకొణె, కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా, తదితర బాలీవుడ్‌ ప్రముఖుల ఈ వేడుకలకు మరింత  ఉత్సాహాన్ని జోడించారు. ఇంకా  క్రికెటర్లు ధోనీ, హార్దిక్‌ పాండ్య  ప్రత్యేకంగా నిలిచారు.  బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌తో కలిసి కాబోయే వరుడు అనంత్‌ అంబానీ డ్యాన్స్‌ చేశారు. 

బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ‘దీవాంగీ.. దీవాంగీ’ పాటకు  అంబానీ కుటుంబం అంతా ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఎప్పటిలాగానే  నీతా అంబానీ సంప్రదాయ భరతనాట్యంతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.

కాగా  మూడు రోజుల పాటు  జులై 12-14 తేదీల్లో ముంబైలోని జియో సెంటర్‌ వేదికగాఅనంత్‌-రాధిక వివాహం అంగరంగవైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement