Radhika Merchant
-
క్రిస్మస్ వేడుకల్లో ఓరీ - స్పెషల్ అట్రాక్షన్‌గా రాధికా మర్చెంట్ (ఫోటోలు)
-
ఆర్ట్స్ కేఫ్ ప్రివ్యూ ఈవెంట్లో మెరిసిన 'రాధిక మర్చంట్' (ఫొటోలు)
-
World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్ శారీ లుక్స్
-
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్‌లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్‌లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.2024లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు వినేష్ ఫోగట్నితీష్ కుమార్చిరాగ్ పాశ్వాన్హార్దిక్ పాండ్యాపవన్ కళ్యాణ్శశాంక్ సింగ్పూనమ్ పాండేరాధికా మర్చంట్అభిషేక్ శర్మలక్ష్య సేన్ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు. -
అనంత్-రాధిక హల్దీ.. వెలుగులోకి మరో వీడియో! వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి ఎంతలా అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అంబానీలు ధరించే కాస్ట్యూమ్స్, నగలు, తదితరాలు చాలా హాట్‌టాపిక్‌గా నిలిచాయి కూడా. అయితే ఆ వేడుకకు సంబంధించి ఓ వీడియోని మాత్రం అందరూ మిస్ అయ్యాం. సరదసరదాగా సాగే హల్దీ వేడుకకు సంబంధిచిన మరో వీడియో తాజగానెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంబానీలకు సన్నిహితుడైన అకా ఓర్హాన్ అవత్రమణి షేర్ చేసిన ఈ లేటెస్ట్ వీడియోలో అంబానీలంతా ఖుషీగా గడిపినట్లు కనిపించింది. అతిధులంతా పసుపునీళ్లు ఒకరిపై ఒకరూ వేసుకుంటూ సందడి చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ పసుపు నీళ్లు పడకుండా తప్పించుకోవడంలో విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వేడుకకు హోస్ట్‌గా ఉన్న నీతా అంబానీ సైతం అంరిలానే హల్దీ దాడిని ఎదుర్కోవడం ఫన్నీగా ఉంటుంది. ఇక అనంత్ అంబానీ బావమరిది ఆనంద్ పిరమల్ ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు, పూలతో దాడి చేయడం, మరోపక్క అతిథులంతా నవ్వుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ హల్దీ ఫంక్షన్ ముంబైలోని అంబానీ కుటుంబానికి చెందిన ఆంటిలియాలో జరిగింది. ఈ వేడుకలో జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ తదితర తారలు పాల్గొన్నారు. అంతేగాదు ఈ లెటెస్ట్ ఓర్రీ వీడియోలో ధోల్ బీట్లు, డ్యాన్స్‌లతో ఇతర అతిథులు ఎంత సరదాగా గడిపారో కూడా కనిపిస్తోంది. కాగా, అనంత్ రాధిక మర్చంట్ల వివాహం ఈ ఏడాది జూలై 12న అత్యంత లగ్జరియస్‌గా జరిగింది. (చదవండి: అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటీ..? ఎదురయ్యే దుష్ర్పభావాలు..) -
ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్అంబానీ చిన్న కోడలు రాధిక మర్చెంట్ 2024 ఏడాదికిగాను గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్‌లో నిలిచారు. ముఖేశ్అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులైలో రాధిక మర్చెంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరై సందడి చేశారు. దాంతో అంబానీ కోడలు గురించి చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలిసింది.2024లో రాధిక మర్చెంట్తోపాటు మరికొందరు ట్రెండింగ్‌లో నిలిచారు.1. వినేష్ ఫొగాట్: భారతదేశపు రెజ్లింగ్ స్టార్రెజ్లర్ వినేష్ ఫొగాట్ 2024లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో 100 గ్రాముల అధిక బరువుండి దానికి అర్హత సాధించలేకపోయారు.2. నితీష్ కుమార్: బిహార్ రాజకీయ వ్యూహకర్తబిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు, పొత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.3. చిరాగ్ పాశ్వాన్: రాజకీయ నాయకుడుదివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మోడీ 3.0 కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.4. హార్దిక్ పాండ్యా: క్రికెటర్క్రికెట్లో ఆల్ రౌండర్‌గా పేరున్న హార్దిక్ పాండ్యా మోడల్ నటాసా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.5. పవన్ కళ్యాణ్: రాజకీయ నాయకుడుప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.6. శశాంక్ సింగ్: కొత్త క్రికెట్ స్టార్శశాంక్ సింగ్ ఐపీఎల్ క్రికెట్లో తన అద్భుతమైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు.7. పూనమ్ పాండే: మోడల్, నటిగర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి చెందినట్లు ఆమె అనుచరులు తెలిపారు. తర్వాత అది ఫేక్ అని, తాను బతికే ఉన్నానని చెప్పింది.8. రాధిక మర్చెంట్: అంబానీ కోడలుజులైలో అనంత్ అంబానీతో గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో రాధికా మర్చంట్ పేరు వైరల్‌గా మారింది.9. అభిషేక్ శర్మ: క్రికెటర్క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.10. లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు2024 పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్య సేన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. -
‘మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024’ జాబితాలో యువజంట (ఫొటోలు)
-
అనంత్-రాధిక అంబానీ ‘ప్రేమమందిరం’ దుబాయ్ లగ్జరీ విల్లా, ఫోటోలు
-
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్‌కు దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్‌లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్‌లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్‌కేర్‌కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
రాధికా మర్చంట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ప్యారిస్ ఒలింపిక్స్ : లవ్‌బర్డ్స్ సందడి, వీడియో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్నకుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. గతనెలలో(జూలై 12)న వివాహ బంధంతో ఒక్కటైన లవ్‌బర్డ్స్ వివాహ వేడుకలతరువాత విశ్వక్రీడా సంరంభం ఒలింపిక్స్ గ్యాలరీలో జంటగా మెరిసారు. అనంత్-రాధిక ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ఆసియా కుబేరుడుముఖేష్ అంబానీ, ఈషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరామిల్ పాల్గొంటున్నవీడియో కూడా సందడిగామారింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ అయిన నీతా ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న ప్రాంగణంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తొలి ఇండియా హౌజ్ లాంచ్ చేశారు. భారతీయ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్‌కు చెందిన వస్తువులు, ఇతక కళాఖండాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయి. అలాగే భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్‌ను నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించి, వారితో సెల్పీలు దిగి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
నాలుక అబద్ధం చెప్పదు..
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్‌ను విజిట్ చేసేవాళ్లు.స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్‌కి గవాస్కర్, సచిన్‌ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్‌కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్‌ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.టూర్లో ‘టేస్ట్’ చూస్తాను..ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్‌ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్. -
అది ఫేక్ న్యూస్.. అంబానీ బుక్ చేసుకోలేదు
జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహం ముంబైలో ఎంతో వైభవంగా జరిగింది. అంబానీ ఇంట జరిగిన ఈ వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర దేశాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్ళికి సుమారు ఐదు వేలకోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.అనంత్, రాధికల వివాహానంతరం లండన్‌కు వెళ్లనున్నట్లు పలు మీడియా సంస్థలు ఇటీవల నివేదించాయి. అయితే వారు అక్కడ ఉండటానికి ప్రముఖ 7 స్టార్ లగ్జరీ హోటల్ & గోల్ఫింగ్ ఎస్టేట్ స్టోక్ పార్క్‌ను రెండు నెలలకు బుక్ చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని స్టోక్ పార్క్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సాధారణంగా మేము ప్రైవేట్ విషయాలపై స్పందించము. కానీ ఇటీవల వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని మీడియాలలో వస్తున్న పుకార్లలో నైజం లేదని స్టోక్ పార్క్ వెల్లడించింది. మొత్తానికి అంబానీ లండన్‌లో స్టోక్ పార్క్ బుక్ చేయలేదని స్పష్టమైపోయింది. View this post on Instagram A post shared by Stoke Park (@stokepark) -
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్‌కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్‌లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్‌లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్‌లుగా అందించారట. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్‌ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
అనంత్ అంబానీ - రాధిక వెడ్డింగ్ : అందమైన ఫోటోలు
-
అందాల శ్రీమతికి అందమైన లెహెంగా (ఫోటోలు)
-
అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్‌పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్‌కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్‌వర్క్‌కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్‌కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. పెయింటింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్‌గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్‌ది. -
అనంత్-రాధిక పెళ్లిపై నటుడి సెటైర్స్.. బంధాలు నిలబడట్లేదంటూ..
అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్‌గా చేస్తామంటున్నాయి మధ్యతరగతి కుటుంబాలు. వివాహం కోసం స్థోమతకు మించి మరీ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి వేడుకలు అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని ఆరాటపడుతున్నారు. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే దిగ్గజ పారిశ్రామికవేత్త, వేలకోట్ల సంపన్నుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లంటే ఇంకెలా ఉండాలి? దేశమంతా మార్మోగిపోదు!సెలబ్రేషన్స్ చేసినన్ని రోజులు కలిసుండట్లేదుఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. జూలై 12న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే వీరు లండన్‌కు వెళ్లి అక్కడ కూడా పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారట! ఈ వేడుకలపై పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ సోషల్ మీడియాలో సెటైర్స్ వేశాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు ఎన్నాళ్లు జరుపుకుంటున్నారో.. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.నీకేంటి సమస్య?ఇది చూసిన జనాలు నటుడిని తిట్టిపోస్తున్నారు. 'వాళ్లు సంతోషంగానే ఉన్నారు.. మధ్యలో నీకేంటి సమస్య?', 'వాళ్లను చూసి కుళ్లుకుంటున్నావ్ కదూ..', 'అనంత్-రాధిక చిన్ననాటి స్నేహితులు.. వారి ప్రేమలో నిజాయితీ ఉంది. వారి బంధం తెగిపోయేంత బలహీనమైంది కాదు', 'నీ డబ్బుతో సెలబ్రేట్ చేసుకోవడం లేదుగా.. మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావ్..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా? -
కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!
అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో జూలై 12న అత్యంత ఘనంగా, విలాసవంతంగా జరిగింది. ఈ వివాహం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది.పెళ్లికి విపరీతంగా ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. జాతీయ వార్తాసంస్థ ఆజ్‌తక్ ప్రకారం, పెళ్లి తర్వాత అంబానీ నెట్‌వర్త్ రూ.25,000 కోట్లు (3 బిలియన్ డాలర్లు) పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్‌వర్త్ 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి ఎగిసింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అంబానీ నెట్‌వర్త్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1% పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65% పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90% రాబడిని అందుకున్నారు. -
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : సింగర్ శ్రేయా మునుపెన్నడూ చూడని లుక్స్
-
నీతా అంబానీ ప్రసంగం: తండ్రీ కూతుళ్ల భావోద్వేగం
బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహవేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రతీ వేడుకను ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు, దేశ విదేశాలనుంచి వచ్చిన అతిథులెవ్వరికీ ఏలోటూ లేకుండా చాలా శ్రద్ధ వహించి, శభాష్ అనిపించుకున్నారు నీతా అంబానీ. పెళ్లిలో అత్యంత కీలకమైందీ, ప్రతీ గుండెను ఆర్ద్రం చేసే సన్నివేశంలో కూడా నీతా తన పెద్దరికాన్ని చాటుకున్నారు. రాధిక కన్యాదానం సమయంలో నీతా ఉద్వేగ ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది.Nita Ambani explains the broader significance of Kanyadaan as a union where two families come together, one gaining a son and the other a daughter. Speaking just before the Kanyadaan ceremony during Anant and Radhika's wedding, Mrs. Ambani underscores the importance of daughters… pic.twitter.com/URjchATLTf— Filmfare (@filmfare) July 16, 2024కొత్తకోడలు రాధిక మర్చంట్‌ను తన కోడలిగా ఆనందంతో కుటుంబంలోకి స్వాగతించడమే కాకుండా, రాధిక తల్లిదండ్రులు వీరేన్ మర్చంట్ , శైలా మర్చంట్లకు ఆమె భరోసా ఇచ్చిన తీరు విశేషంగా నిలిచింది. ‘‘కూతుర్ని ఇవ్వడం అంత తేలిక కాదు. తమ గుండెల్లో దాచుకుని పెంచుకున్న కూతుర్ని మెట్టింటికి పంపడం, ఆ భారాన్ని భరించడం కష్టం. నేనూ ఒక కూతురిని, ఒక కూతురికి తల్లిని , అత్తగారిని. రాధికను మా కూతురిలా చూసుకుంటాం. ఆడపిల్లలే పెద్ద వరం. మన ఆడపిల్లలు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు. మీరు మీ కుమార్తెను మాకు ఇవ్వడం కాదు, మరో కొడుకును, కొత్త కుటుంబాన్ని పొందారంటూ వారికి ధైర్యం చెప్పారు. అలాగే మీకు అనంత్ ఏంతో, మాకు రాధిక కూడా అంతే’’ అంటూ రాధిక పేరెంట్స్‌ను ఊరడించారు. ఈ సందర్భంగా హిందూ వివాహ ఆచారాల్లో కన్యాదానం అంటే ఏమిటో, అమ్మాయిని లక్ష్మితో సమానంగా భావిస్తారంటూ కుమార్తె ప్రాముఖ్యత ఏంటో ప్రపంచ అతిథుల ముందు నీతా అంబానీ వివరించారు. దీంతో నూతన వధువు రాధిక, ఆమె తల్లితండ్రులతోపాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. నీతా అంబానీ వాగ్దానం‘‘ముఖేష్, నేను మా కుమార్తెగా, అనంత్ సహచరిగా, ఇషా, ఆనంద్,, శ్లోక, ఆకాష్ మాదిరిగానే రాధికను కూడా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాం, రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాం. పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేదాలకు మంచి అత్త, పిన్ని దొరికింది. నా ప్రియమైన రాధికను హృదయపూర్వకంగా మా ఇంట్లో అతి పిన్న వయస్కురాలిగా శ్రీమతి రాధిక అనంత్ అంబానీగా స్వాగతిస్తున్నాం’’ అంటూ చోటీ బహూను అందరి కరతాళ ధ్వనుల మధ్య అంబానీ కుటుంబంలోకి ఆమెను ఆహ్వానించారు. జామ్ నగర్లో అనంత్ అంబానీ-రాధికకు ఘనంగా ఆహ్వానం పలుకుతున్న వీడియో నెట్టింట్ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) కాగా జూలై 12న అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసి రాధికా మర్చంట్‌తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు వివాహ వేడుకలన్నీ అట్టహాసంగా జరిగాయి. అనంతరం అనంత్, రాధిక దంపతులకు శుభప్రదమైన ఆశీర్వాద కార్యక్రమం మంగళ్ ఉత్సవ్ లేదా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు, దేశ విదేశాలకు చెందిన క్రీడా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. -
అనంత్-రాధిక రిసెప్షన్ : అంబానీ మనవడి రియాక్షన్, వైరల్ వీడియో
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ చిన్న కుమారుడు రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిసాయి. పెళ్లి తరువాత శుభ్ ఆశీర్వాద్ , మంగళ్ ఉత్సవ్‌లను నిర్వహించారు గత కొన్ని రోజులుగా గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏదో ఒక ముచ్చట సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా అనంత్-రాధిక వెడ్డింగ్ రిసెప్షన్లో అంబానీ వారసుడు పృథ్వీ ఆకాశ్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకాకుమారుడు పృథ్వీ అంబానీ సందడి ప్రత్యేకంగా నిలుస్తోంది. అనంత్, రాధిక పెళ్లి తరువాత అంబానీ ఫ్యామిలీ అంతా ఫోటోకు ఫోజులిస్తుండగా అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చిన పృథ్వీ రాధిక కాళ్ల దగ్గర జారి పడి పోయాడు. కానీ వెంటనే లేచి సర్దుకున్నాడు. దీంతో తల్లి శ్లోకా కంగారుపడుతూ ముందుకొచ్చింది. ఇంతలో నానమ్మ అతడికి మైక్ అందివ్వగా జై శ్రీకృష్ణ అంటూ ముద్దుగా చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.Wow what a landing...Chalo koi to nikla humhre jesa inki family me 😂😃😃 pic.twitter.com/pRMBdKaC1Z— Piku (@RisingPiku) July 15, 2024 -
ఏంటి బాబోయ్ ఈ అందం..చూపులతోనే కట్టిపడేస్తున్న తమన్నా (ఫొటోలు)
-
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో తెలుగు వీణ సందడి
పరాంకుశం వీణాశ్రీవాణి... ఆమె పేరులోనే సరిగమల శ్రుతి వినిపిస్తోంది. అమలాపురంలో ఓ చిన్న అగ్రహారం అమ్మాయి శ్రుతి చేసిన వీణ ఇప్పుడు అంబానీ ఇంటి వేడుకలో సరిగమలతో అలరించింది. ఆ ఆనంద క్షణాలను ఆమె సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు. ‘‘మాది అమలాపురం జిల్లా ఇందుపల్లి అగ్రహారం. బండారులంకలోని పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చు కున్నాను. ఈ రోజు ఇన్ని ప్రశంస లందుకుంటున్నానంటే ఆమె నేర్పిన సంగీత జ్ఞానమే కారణం. అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు వీణావాదన చేయడానికి ఆహ్వానం రావడంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా పేరు వాళ్లకు తెలిసే అవకాశమే లేదు. నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వల్లనే నా కళను వారు గుర్తించడానికి కారణం అనుకుంటున్నాను. నీతా అంబానీ గారు చె΄్పారు అంటూ వాళ్ల మేనేజరో ఎవరో కాంటాక్ట్ చేశారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం నుంచి వేడుకలో ఏ ΄ాటలు కావాలో కూడా ఆమే ఎంపిక చేశారు. నేనిచ్చిన జాబితా నుంచి ఆమె ఎంపిక చేసిన పది ΄ాటలను వీణ మీద వినిపించాను. నా చెలి రోజావే, ఉరికే చిలకా... వంటి పలు భాషల్లోకి అనువాదమై ఉన్న ΄ాటలనే ఎంచుకున్నాను. ఇదంతా పదిహేను రోజులపాటు నడిచింది. రెండు కళ్లు చాలవు!ఆడిటోరియానికి వెళ్లే దారిలో ఒక వరుస అత్తరులు, ఇత్తడి బిందెలతో గుజరాత్ సంప్రదాయ నమూనా అలంకరణ ఉంది. ఆ తర్వాత ధొలారి ధని థీమ్, ఫారెస్ట్ థీమ్, కలంకారీ థీమ్ ఓ వరుస ఉన్నాయి. శంకర్ మహదేవన్, శ్రేయాఘోషాల్, శివమణి వంటి సంగీతకారులు, గాయకుల ప్రోగ్రామ్‌లను టీవీ లైవ్ లో చూశాను. వందమంది రాజమౌళిలు, వంద మంది సంజయ్ లీలా భన్సాలీలు కలిసి సెట్టింగు వేయించారా అనిపించింది. చూడడానికి రెండు కళ్లు చాలవు. తలను 360 డిగ్రీల్లో తిప్పి చూడాల్సిందే. బారాత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైమ్‌లో రాత్రి ఏడు నుంచి ఏడు ముప్పావు వరకు నా కచేరీ సాగింది. రాధిక మర్చంట్ కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి. వాళ్లు కదలకుండా కూర్చుని, ఓ పాటను మళ్లీ అడిగి మరీ చక్కగా ఆస్వాదించడం, కళల పట్ల వారికున్న గౌరవం నాకు సంతృప్తినిచ్చింది. నాలుగు వేల అడుగులు పన్నెండవ తేదీ ఉదయం ముంబయికి వెళ్లాం. హోటల్లో రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా జియో కన్వెన్షన్ సెంటర్‌కెళ్లాం. ఆ సెంటర్ ఎంట్రన్స్ నుంచి నా ప్రదర్శన ఉన్న ఆడిటోరియంలో వేదిక వద్దకు చేరడానికి నాలుగు వేల అడుగులు పడ్డాయి. ఫోన్లో చెక్ చేసుకున్నాను కూడా. నిర్వహకులు వెంట ఉండి తీసుకెళ్లకపోతే నా వేదిక ఏదో తెలుసుకోవడంతోనే రోజు పూర్తయ్యేదేమో. నీతా అంబానీ స్వయంగా కళాకారిణి కావడంతో ఈ వేడుకలో కళాప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనుకున్నాను. భోజనాల దగ్గర కూడా ఆర్టిస్టుల కోసమే ఒక పెద్ద హాలును కేటాయించారు. వేల రకాల వంటలు వడ్డించారని విన్నాను. కానీ నేను సలాడ్లు, కాఫీ మాత్రమే తీసుకున్నాను. పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకున్నారంటే డెకరేషన్లో ఉన్న పూలను కూడా పరిశీలించి థీమ్‌కి అనుగుణంగా మార్పించారు. కొన్ని రోజులపాటు ఆమె మధ్యాహ్నం మూడు నుంచి తెల్లవారి ఆరుగంటల వరకు పని చేశారట. అయినా సరే ఆమె ముఖంలో అలసట కనిపించలేదు. గొప్ప ఆర్గనైజర్ ఆమె. వీణావాణి ఇచ్చిన వరం జనసందోహంలో నేను ఎక్కువ సేపు ఇమడలేను. నా కచేరీ పూర్తి కాగానే నన్ను బయటకు తీసుకెళ్లమని నిర్వహకులను అడిగాను. గేటు వరకు తీసుకొచ్చి వెహికల్ ఎక్కించేశారు. పదమూడవ తేదీ ఉదయం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌కి వచ్చేసి హమ్మయ్య అనుకున్నాను. నాకిప్పుడు తలుచుకున్నా సరే అంతా కలలా అనిపిస్తోంది. ఆంధ్రుల ఆడపడుచుని, తెలంగాణ కోడలిని. నాకు తెలిసినంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలో కళను ప్రదర్శించిన ఏకైక వ్యక్తిని నేనే... అనుకున్నప్పుడు గర్వంగా అనిపిస్తోంది. సరస్వతీ మాత వీణతోపాటు నాకిచ్చిన వరం ఈ అవకాశం అనుకుంటున్నాను’’ అని రెండు చేతులూ జోడించారు వీణాశ్రీవాణి తన వీణను మురిపెంగా చూసుకుంటూ.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి