విడాకులు నిజమే అనేలా హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్‌ | No Natasa As Hardik Pandya Attends Anant-Radhika's Sangeet With Krunal, Ishan | Sakshi
Sakshi News home page

అంబానీ ఇంట వేడుకలకు భార్యలతో ఆ క్రికెటర్లు.. పాండ్యా మాత్రం! వీడియో

Published Sat, Jul 6 2024 11:36 AM | Last Updated on Sat, Jul 6 2024 12:10 PM

No Natasa As Hardik Pandya Attends Anant-Radhika's Sangeet With Krunal, Ishan

టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీ గెలిచిన జోష్‌లో ఉన్న భారత క్రికెటర్లు ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించారు. కుటుంబాలతో సరదాగా సమయం గడుపుతున్నారు.

ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని సహా పలువురు క్రికెటర్లు అపర కుబేరుడు ముఖేశ్‌ అంబానీ ఇంట నెలకొన్న పెళ్లి సందడిలో భాగమయ్యారు.

 

 భార్యలతో ఆ క్రికెటర్లు
నీతా- ముఖేశ్‌ అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ సంగీత్‌లో తళుక్కుమన్నారు. రోహిత్‌, ధోని, హార్దిక్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, కృనాల్‌ పాండ్యా, జహీర్‌ ఖాన్‌, ఇషాన్‌ కిషన్‌ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ధోని, సూర్య, జహీర్‌, కేఎల్‌ రాహుల్‌, కృనాల్‌ పాండ్యా తమ భార్యలతో కలిసి ఈ ఈవెంట్‌లో సందడి చేయగా.. హార్దిక్‌ పాండ్యా మాత్రం ఒంటరిగా వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

 

కాగా హార్దిక్‌- నటాషా మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీశాంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్‌ ఇలా ఒంటరిగా అంబానీ ఇంట సంగీత్‌కు హాజరుకావడం వీటికి మరింత బలాన్నిచ్చింది.

అదే సమయంలో అతడి సతీమణి నటాషా స్టాంకోవిక్‌ తమ కుమారుడు అగస్త్యతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న దృశ్యాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని.. ఇందుకు ఎ‍ల్లప్పుడూ తాను అన్నింటికి కృతజ్ఞురాలిగా ఉంటానంటూ వేదాంత ధోరణిలో క్యాప్షన్‌ జతచేసింది.

విడాకులు నిజమేనన్న వార్తలు 
ఈ నేపథ్యంలో హార్దిక్‌- నటాషా విడాకులు నిజమేనన్న వార్తలు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది.

అంబానీల యాజమాన్యంలోని ఈ జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్‌-2024లో మాత్రం అద్భుతంగా రాణించిన హార్దిక్‌.. టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో.. విమర్శలు- ప్రశంసల సమయంలో హార్దిక్‌ పాండ్యాను ఉద్దేశించి నటాషా ఒక్క పోస్ట్‌ కూడా పెట్టకపోవడం గమనార్హం. ఇప్పుడిలా హార్దిక్‌ అంబానీ ఇంట వేడుకలకు ఒక్కడే హాజరుకావడంతో విభేదాలు నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement