
ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌లో ఇండియా మాస్టర్స్ జోరుకు ఆస్ట్రేలియా కళ్లెం వేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం వడోదర వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ షేన్ వాట్సన్, స్టార్ బ్యాటర్ బెన్ డంక్ విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు.
భారత బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీల వర్షంతో వడోదర స్టేడియం తడిసిముద్దయింది. వీరిద్దరి అపడం ఎవరూ తరం కాలేదు. ఈ దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ రెండో వికెట్‌కు 236 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. డంక్ 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 132 పరుగులు చేయగా.. వాట్సన్ 52 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో పవన్ నేగి ఒక్కడే ఓ వికెట్ పడగొట్టారు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.
సచిన్ హాఫ్ సెంచరీ వృథా..
అనంతరం 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సచిన్ టెండూల్కర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మాస్టర్ బ్లాస్టర్ క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు.
సచిన్ కేవలం 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆతర్వాత యూసఫ్ పఠాన్ 25 పరుగులు చేయగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జేవియర్ డోహెర్టీ 5 వికెట్లు పడగొట్టగా.. క్రిస్టియన్, లాఫ్లీన్, నాథన్ రియర్డన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 8న రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్‌తో తలపడనుంది.
చదవండి: మ్యాచ్ సమయంలో నిద్రపోయిన పాకిస్తాన్ స్టార్ బ్యాటర్
𝐓𝐡𝐚𝐭’𝐬 𝐡𝐨𝐰 𝐲𝐨𝐮 𝐝𝐨 𝐢𝐭! 😎
𝙎𝙖𝙘𝙝𝙞𝙣 𝙩𝙞𝙣𝙜𝙡𝙞𝙣𝙜 𝙨𝙥𝙞𝙣𝙚𝙨 𝙬𝙞𝙩𝙝 𝙩𝙝𝙖𝙩 𝙨𝙞𝙜𝙣𝙖𝙩𝙪𝙧𝙚 𝙨𝙩𝙧𝙖𝙞𝙜𝙝𝙩 𝙨𝙞𝙭! 🚀✨#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/A11weJAGox— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 5, 2025
Comments
Please login to add a commentAdd a comment