
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025లో ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు తమ దూకుడును కొనసాగిస్తోంది. వడోదరగా వేదికగా సౌతాఫ్రికా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 260 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్ మరోసారి సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికా బౌలర్లను వాట్సన్ ఊచకోత కోశాడు. వాట్సన్ కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో వాట్సన్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
అంతకుముందు వెస్టిండీస్, భారత్‌పై వాట్సన్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో షేన్‌తో పాటు కల్లమ్ ఫెర్గూసన్(43 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), బెన్ డంక్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటీస్ బౌలర్లలో పీటర్సన్ ఓ వికెట్ పడగొట్టాడు.
నిప్పులు చెరిగిన ఆసీస్ బౌలర్లు..
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 17 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌటైంది. కంగారుల బౌలర్ల దాటికి ప్రోటీస్ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కుప్పకూలింది. హషీమ్ ఆమ్లా(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచర్డ్ లివి(22), పీటర్సన్ పర్వాలేదన్పించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో బెన్ లాఫ్లీన్ మూడు వికెట్లు పడగొట్టగా.. దొహర్టీ, మెక్‌గైన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కౌల్టర్ నైల్, నాథన్ రియర్డన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక శనివారం జరగనున్న మ్యాచ్‌లో వెస్టిండీస్, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే?