International Masters League
-
వయసు పెరుగుతున్నా అదే టెంపర్.. విండీస్ ఆటగాడితో కయ్యానికి కాలు దువ్విన యువరాజ్ సింగ్
వయసు పెరుగుతున్నా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌లో టెంపర్ ఏమాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఉన్న రోజుల్లో ఎలా దూకుడుగా ఉండే వాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్న టోర్నీ) ఫైనల్లో యువీ తన పాత రోజులను గుర్తు చేశాడు. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్‌పై తనదైన పంధాలో విరుచుకుపడ్డాడు. pic.twitter.com/y2iHtEPyCr— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025అసలేం జరిగిందంటే.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ ఫైనల్లో భారత మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బౌలింగ్‌లో వినయ్ కుమార్ (3-0-26-3), షాబాజ్ నదీం (4-1-12-2).. ఆతర్వాత బ్యాటింగ్‌లో అంబటి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి భారత్‌ను గెలిపించారు.అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్, భారత స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గొడవ పడ్డారు. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత మాస్టర్స్ ఛేదిస్తుండగా (14వ ఓవర్ తొలి బంతి తర్వాత).. యువీ టీనో బెస్ట్‌పై తన సహజ శైలిలో వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. బెస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువీకి తిరుగు సమాధానం చెప్పాడు. దీంతో గొడవ పెద్దదైంది. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్, క్రీజ్‌లో ఉన్న అంబటి రాయుడు, విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా సర్ది చెప్పడంతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. ఆతర్వాత ఆట సజావుగా సాగి భారత్ విజేతగా నిలిచింది. యువీ-బెస్ట్ గొడవకు ముందు రాయుడు ఆష్లే నర్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు బెస్ట్ వేసిన ఓవర్లో రాయుడు, యువీ కలిసి 12 పరుగులు పిండుకున్నారు. రాయుడు సిక్సర్ కొట్టిన అనందంలో యువీ బెస్ట్‌ను కవ్వించగా.. అతను కూడా తగ్గేదేలేదంటూ సమాధానం చెప్పాడు. యువీకి ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. ఆటగాడి ఉన్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన ఫైట్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది. మొత్తానికి మాస్టర్స్ లీగ్ ఫైనల్లో యువీ చర్యను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. దిగ్గజాల కోసం నిర్వహించిన టోర్నీలో హుందాగా ఉండాల్సింది పోయి, గొడవలు పడటమేంటని చురకలంటిస్తున్నారు. యువీనే తొలుత బెస్ట్‌ను కవ్వించాడని మ్యాచ్‌ను చూసిన వాళ్లు అంటున్నారు. ఏది ఏమైనా సప్పగా సాగుతున్న మాస్టర్స్ లీగ్.. ఫైనల్లో యువీ చర్య వల్ల రక్తి కట్టింది. ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన (ఆస్ట్రేలియా చేతిలో) భారత్.. ఫైనల్లో విండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో అద్భుత విజయాలు సాధించింది. భారత మాస్టర్స్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు పూర్వపు రోజులు గుర్తు చేశారు. లజెండ్స్ లీగ్ పోటీలు చాలా జరుగుతుండటంతో ఈ టోర్నీ ఫెయిల్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే భారత్, విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజాలు అద్భుత ప్రదర్శనలు చేసి ఈ టోర్నీని సక్సెస్ చేశారు. ఈ టోర్నీలో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం హైలైట్. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. భారత్ మరో 17 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (45), లెండిల్ సిమన్స్ (57) మాత్రమే రాణించగా.. దిగ్గజం లారా (6) నిరాశపరిచాడు. -
ఇంటర్నేషనల్ మాస్టర్స్ చాంపియన్ భారత్
రాయ్‌పూర్: ఇంటర్నేషనల్ మాస్ట్సర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత మాస్టర్స్ జట్టు ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ మాస్టర్స్‌పై విజయం సాధించింది. తొలిసారి నిర్వహించిన ఈ లీగ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. సిమ్మన్స్ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), డ్వైన్ స్మిత్ (35 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3, నదీమ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత మాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్ అంబటి తిరుపతి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో విజృంభించగా... కెపె్టన్ సచిన్ టెండూల్కర్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. యువరాజ్ సింగ్ (13 నాటౌట్), గుర్కీరత్ సింగ్ (14), స్టువర్ట్ బిన్నీ (16 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. -
ఉత్కంఠ పోరులో లంకపై గెలుపు.. భారత్‌తో ఫైనల్లో వెస్టిండీస్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025 (International Masters League)లో వెస్టిండీస్ ఫైనల్‌కు దూసుకువచ్చింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక మాస్టర్స్ (Sri Lanka Masters)ను చిత్తు చేసి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్ (West Indies Masters)- శ్రీలంక మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది.టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్షాహిద్ వీర్ నారాయణన్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్.. వెస్టిండీస్ మాస్టర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లలో డ్వేన్ స్మిత్(0) విఫలం కాగా.. విలియం పెర్కిన్స్(24) ఫర్వాలేదనిపించాడు.రామ్‌దిన్ ధనాధన్వన్డౌన్ బ్యాటర్ లెండిల్ సిమ్మన్స్(12 బంతుల్లో 17) వేగంగా ఆడగా.. కెప్టెన్ బ్రియన్ లారా దంచికొట్టాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో చాడ్విక్ వాల్టన్‌తో కలిసి దినేశ్ రామ్‌దిన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.వాల్టన్ 20 బంతుల్లో 31 పరుగులు చేసి నిష్క్రమించగా.. రామ్‌దిన్ మాత్రం 22 బంతుల్లోనే 50 రన్స్ సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్, జీవన్ మెండిస్, అసేల గుణరత్నె ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.గుణరత్నె ఒంటరిపోరాటం వృథాఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసింది. ఓపెనర్లలో ఉపుల్ తరంగ(30) రాణించగా.. కెప్టెన్ కుమార్ సంగక్కర(17), వన్‌డౌన్‌లో వచ్చిన లాహిరు తిరిమన్నె(9) పూర్తిగా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో అసేల గుణరత్నె ఒంటరిపోరాటం చేశాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 66 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇసురు ఉడానా(10 బంతుల్లో 21), దిల్రువాన్ పెరీరా(6 బంతుల్లో 11) రాణించారు. కానీ విండీస్ బౌలర్ల విజృంభణ కారణంగా శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 173 పరుగుల వద్ద నిలిచింది.ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది వెస్టిండీస్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. విండీస్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టినో బెస్ట్ (4/27) అత్యుత్తమంగా రాణించగా.. డ్వేన్ స్మిత్ రెండు, ఆష్లే నర్స్, జెరోమ్ టేలర్, లెండిల్ సిమ్మన్స్ ఒక్కో వికెట్ తీశారు.ఇండియాతో ఫైనల్‌కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో మాస్టర్స్ లీగ్‌కు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు ఇందులో భాగమయ్యాయి. నవీ ముంబై, వడోదర, రాయ్‌పూర్‌లో మ్యాచ్‌లను షెడ్యూల్ చేశారు.ఇక తొలి సెమీస్‌లో ఇండియా ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోగా.. రెండో సెమీ ఫైనల్లో విండీస్ లంకపై గెలుపొందింది. ఇండియా మాస్టర్స్- వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య ఆదివారం(మార్చి 16) నాటి ఫైనల్‌కు రాయ్‌పూర్ వేదిక. చదవండి: ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్ View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) -
IND vs AUS: యువీ మెరుపు ఇన్నింగ్స్.. చెలరేగిన షాబాజ్! ఫైనల్లో భారత్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025 (International Masters League T20) సెమీస్‌లో భారత జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. రాయ్‌పూర్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ కంగారూలపై ఏకంగా 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఆరు జట్లు ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాది మొదలైంది. టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో ఇండియా మాస్టర్స్, శ్రీలంక మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, సౌతాఫ్రికా మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్ రూపంలో ఆరుజట్లు పాల్గొంటున్నాయి.భారత్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా.. ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో గురువారం షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్లో ఇండియా- ఆసీస్ తలపడ్డాయి.సచిన్, యువీ, పఠాన్ సోదరుల మెరుపులుటాస్ గెలిచిన ఆస్ట్రేలియా మాస్టర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 220 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అంబటి రాయుడు(5) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 42 పరుగులు సాధించాడు.మిగతా వాళ్లలో యువరాజ్ సింగ్ 30 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపగా.. స్టువర్ట్ బిన్నీ (Stuart Binny) 21 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. యూసఫ్ పఠాన్ 10 బంతులు ఎదుర్కొని 23 రన్స్ చేయగా.. అతడి సోదరుడు ఇర్ఫాన్ పఠాన్(7 బంతుల్లో 19 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఇక ఇండియా మాస్టర్స్ విధించిన 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మాస్టర్స్ 126 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్, ఓపెనర్ షేన్ వాట్సన్(5) పూర్తిగా నిరాశపరచగా.. షాన్ మార్ష్, బెన్ డంక్ చెరో 21 పరుగులు చేశారు. మిగతా వాళ్లలో నాథన్ రీర్డాన్(21), బెన్ కట్టింగ్(39) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.షాబాజ్ నదీమ్‌కు నాలుగు వికెట్లుభారత బౌలర్లలో స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. కేవలం 15 పరుగులే ఇచ్చాడు. మిగతా వారిలో పేసర్లు వినయ్ కుమార్(2/10), ఇర్ఫాన్ పఠాన్(2/31) రెండేసి వికెట్లు దక్కించుకోగా.. బిన్నీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్ బౌలర్ పవన్ నేగి మూడు ఓవర్ల కోటాలో 13 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.ఇక ఇండియా మాస్టర్స్ బౌలర్ల విజృంభణ కారణంగా ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 94 పరుగులతో ఘన విజయం సాధించిన ఇండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక శుక్రవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక- వెస్టిండీస్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం టైటిల్ పోరులో ఇండియా మాస్టర్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: CT 2025: కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు! View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) -
IND Vs AUS: ఆసీస్‌తో సెమీస్.. యువరాజ్, సచిన్ విధ్వంసం! వీడియో వైరల్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్‌లో రాయపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.యువీ కేవలం 30 బంతుల్లో 1 ఫోర్లు 7 సిక్స్‌లతో 59 పరుగులు చేయగా.. సచిన్ 30 బంతుల్లో 7 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. వీరిద్దరితో పాటు బిన్నీ(36), యూసుఫ్ పఠాన్(23), ఇర్ఫాన్ పఠాన్(19) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో దోహర్టీ, క్రిస్టియన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. స్టీవ్ ఓకేఫీ, కౌల్టర్ నైల్ తలా వికెట్ సాధించారు.తుది జట్లుభారత్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), అంబటి రాయుడు (వికెట్ కీపర్), గురుకీరత్ సింగ్ మాన్, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, షాబాజ్ నదీమ్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఆస్ట్రేలియా: షాన్ మార్ష్, డేనియల్ క్రిస్టియన్, బెన్ డంక్ (వికెట్ కీపర్), నాథన్ రియర్డన్, బెన్ కటింగ్, షేన్ వాట్సన్ (కెప్టెన్), స్టీవ్ ఓకీఫ్, నాథన్ కౌల్టర్-నైల్, జేవియర్ డోహెర్టీ, బ్రైస్ మెక్‌గెయిన్, బెన్ హిల్ఫెన్హాస్ THE YUVRAJ SINGH SIXES. 😍💥pic.twitter.com/oMVx3FCnpi— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2025 -
మోర్గాన్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. ఇంగ్లండ్ ఖాతాలో మరో ఓటమి
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్‌ను (2025) ఇంగ్లండ్ మాస్టర్స్ ఒక్క విజయం కూడా లేకుండానే ముగించింది. నిన్న (మార్చి 12) ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు.ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విధ్వంసకర హాఫ్ సెంచరీ.. బౌలింగ్‌లో టిమ్ బ్రేస్నన్ ఐదు వికెట్ల ఘనత వృధా అయ్యాయి.ఇయాన్ మోర్గాన్ 64, టిమ్ ఆంబ్రోస్ 69 (నాటౌట్), ఫిల్ మస్టర్డ్ 17, డారెన్ మ్యాడీ 29, బ్రేస్నన్ 18 (నాటౌట్) పరుగులు చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్టిసన్, మెక్‌గెయిన్, స్టీవ్ ఓకీటీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. నాథన్ రియర్డాన్ (83), డేనియల్ క్రిస్టియన్ (61) విధ్వంసకర అర్ద శతకాలు బాది ఆసీస్‌ను గెలిపించారు. విజయానికి ముందు ఆసీస్ కొద్దిగా తడబడింది. 19 ఓవర్లో బ్రేస్నన్ చెలరేగిపోయి కేవలం ఐదు పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే అప్పటికే ఆసీస్ గెలుపు ఖరారైపోయింది. చివరి ఓవర్ రెండో బంతిని వైడ్‌గా వేసిన సైడ్‌బాటమ్ ఆసీస్‌కు విన్నింగ్ రన్‌ను ఇచ్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో షాన్ మార్ష్ 20, బెన్ కట్టింగ్ 12, పీటర్ నెవిల్ 28, కెప్టెన్ షేన్ వాట్సన్ 1 (నాటౌట్) పరుగు చేశారు. ఆఖర్లో పాట్టిసన్, హిల్ఫెన్హాస్ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రేస్నెన్ 5, ర్యాంకిన్, పనేసర్ తలో వికెట్ తీశారు.ఈ ఓటమితో ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ 5 మ్యాచ్‌లు ఆడగా ఐదింట ఓడింది. మరోవైపు ఆసీస్ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో సెమీఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. మొత్తం 6 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సెమీస్‌కు క్వాలిఫై కాగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. తొలి దశ మ్యాచ్‌ల అనంతరం శ్రీలంక టాప్‌లో ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (మార్చి 13) జరుగబోయే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను ఢీకొంటుంది. రేపటి రెండో సెమీస్‌లో శ్రీలంక, వెస్టిండీస్ తలపడతాయి. రెండు సెమీఫైనల్లో విజేతలు మార్చి 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
లేటు వయసులోనూ రెచ్చిపోతున్న దిగ్గజాలు.. మాస్టర్స్ లీగ్‌లో మరో సెంచరీ
క్రికెట్ దిగ్గజాలు లేటు వయసులోనూ రెచ్చిపోతున్నారు. యువ ఆటగాళ్లకు తామేమీ తీసిపోమని పరుగుల వరద పారిస్తున్నారు. దిగ్గజాల కోసం తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మాజీ క్రికెటర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరగ్గా ఏకంగా ఏడు సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఒక్కడే 3 సెంచరీలు బాదాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు బెన్ డంక్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, శ్రీలంక మాజీ బ్యాటర్ ఉపుల్ తరంగ, తాజాగా విండీస్ మాజీ ప్లేయర్ లెండిల్ సిమన్స్ తలోసారి శతక్కొట్టారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఒక్క సెంచరీ కూడా నమోదు కానప్పటికీ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు, యూసఫ్ పఠాన్, గురుకీరత్ సింగ్, సౌరభ్ తివారి తలో హాఫ్ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ పూర్వపు రోజుల గుర్తు చేశాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా మాస్టర్స్‌పై విండీస్ మాస్టర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్ లెండిల్ సిమన్స్ చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే శతకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 59 బంతుల ఎదుర్కొన్న సిమన్స్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్ చివర్లో చాడ్విక్ వాల్టన్ (12 బంతుల్లో 38 నాటౌట్; 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్, పెర్కిన్స్ తలో 5 పరుగులు చేయగా.. దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా 29, ఆష్లే నర్స్ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్రూగర్, ఎన్తిని తలో 2 వికెట్లు తీయగా.. మెక్ లారెన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. రవి రాంపాల్ 5 వికెట్లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి 44, జాక్ కల్లిస్ 45, జాక్ రుడాల్ఫ్ 39 పరుగులు చేశారు. హషిమ్ ఆమ్లా (3), అల్విరో పీటర్సన్ (7) లాంటి స్టార్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో శ్రీలంక, భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ నిష్క్రమించాయి. శ్రీలంక, భారత్ తలో 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. -
సంగక్కర విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో శ్రీలంక మాస్టర్స్ జోరు కొనసాగుతుంది. ఇంగ్లండ్ మాస్టర్స్‌తో నిన్న (మార్చి 10) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో భారత మాస్టర్స్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు నాకౌట్స్‌కు అర్హత సాధించింది. 4 మ్యాచ్‌లు ఆడినా ఒక్క విజయం కూడా సాధించని ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఇంగ్లండ్ మాస్టర్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. శ్రీలంక బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉడాన, దిల్రువన్ పెరీరా, గుణరత్నే, చతురంగ, జీవన్ మెండిస్ తలో వికెట్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (10), టిమ్ ఆంబ్రోస్ (17), డారెన్ మ్యాడీ (15), టిమ్ బ్రేస్నన్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఉడాన బంతితో సత్తా చాటడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడు క్యాచ్‌లు పట్టాడు.సంగక్కర విధ్వంసకర శతకంస్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్ కుమార సంగక్కర విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. సంగ 47 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంగక్కరకు మరో ఎండ్‌లో ఎలాంటి సహకారం లభించనప్పటికీ.. ఒంటిచేత్తో శ్రీలంకను గెలిపించాడు. లంక ఇన్నింగ్స్‌లో రొమేశ్ కలువితరణ 16, అసేల గుణరత్నే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. సంగక్కర సుడిగాలి శతకంతో చెలరేగడంతో శ్రీలంక 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది (వికెట్ కోల్పోయి). శ్రీలంక కోల్పోయిన ఏకైక వికెట్ (కలువితరణ) మాస్కరెన్హాస్కు దక్కింది.ఈ గెలుపుతో ప్రస్తుత మాస్టర్స్ లీగ్ ఎడిషన్‌లో శ్రీలంక విజయాల సంఖ్య నాలుగుకు (5 మ్యాచ్‌ల్లో) చేరింది. భారత మాస్టర్స్‌తో ఆడిన మ్యాచ్ మినహా శ్రీలంక అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో భారత మాస్టర్స్ రెండో స్థానంలో ఉంది. భారత్ సైతం ఈ టోర్నీ ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. భారత్ ఒక్క ఆస్ట్రేలియా మాస్టర్స్ చేతుల్లో మాత్రమే ఓడింది. పాయింట్ల పరంగా భారత్, శ్రీలంక సమంగా ఉన్నప్పటికీ లంక రన్‌రేట్ భారత్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక, భారత్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. ఆసీస్, విండీస్ తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండ్రెండు విజయాలు సాధించగా.. సౌతాఫ్రికా నాలుగింట ఒకే ఒక విజయం సాధించింది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కాగా, తొలిసారి జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 6 దేశాలకు చెందిన దిగ్గజ, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ టీ20-2025 టోర్నీలో ఇండియన్ మాస్టర్స్ టీమ్ మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సౌరబ్ తివారీ(37 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 60), అంబటి రాయుడు(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో మెరవగా.. ఆఖరిలో కెప్టెన్ యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు.విండీస్ బౌలర్లను యువీ ఉతికారేశాడు. కేవలం 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు. వీరితో పాటు గుర్క్రీత్ సింగ్ మానన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో బెన, కార్టర్, టేలర్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో విండీస్ ఆఖరి వరకు పోరాడింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డ్వైన్ స్మిత్(34 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 79), విలియమ్ పెర్కిన్స్(52) హాఫ్ సెంచరీలు సాధించాడు.లెండల్ సిమిన్స్( 13 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లతో 38) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. పవన్ నేగి రెండు, ఇర్ఫాన్ పఠాన్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: Champions Trophy final: 'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే' -
IML 2025: వాట్సన్ విధ్వంసకర సెంచరీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఆసీస్
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్-2025లో ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు తమ దూకుడును కొనసాగిస్తోంది. వడోదరగా వేదికగా సౌతాఫ్రికా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 260 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్ మరోసారి సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికా బౌలర్లను వాట్సన్ ఊచకోత కోశాడు. వాట్సన్ కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో వాట్సన్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.అంతకుముందు వెస్టిండీస్, భారత్‌పై వాట్సన్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో షేన్‌తో పాటు కల్లమ్ ఫెర్గూసన్(43 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), బెన్ డంక్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రోటీస్ బౌలర్లలో పీటర్సన్ ఓ వికెట్ పడగొట్టాడు.నిప్పులు చెరిగిన ఆసీస్ బౌలర్లు..అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 17 ఓవర్లలో కేవలం 123 పరుగులకే ఆలౌటైంది. కంగారుల బౌలర్ల దాటికి ప్రోటీస్ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కుప్పకూలింది. హషీమ్ ఆమ్లా(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచర్డ్ లివి(22), పీటర్సన్ పర్వాలేదన్పించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఆసీస్ బౌలర్లలో బెన్ లాఫ్లీన్ మూడు వికెట్లు పడగొట్టగా.. దొహర్టీ, మెక్గైన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కౌల్టర్ నైల్, నాథన్ రియర్డన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక శనివారం జరగనున్న మ్యాచ్‌లో వెస్టిండీస్, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
రాణించిన సంగక్కర.. విండీస్‌పై శ్రీలంక ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో శ్రీలంక మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మాస్టర్స్.. కెప్టెన్ కుమరా సంగక్కర (42 బంతుల్లో 47) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. గుణరత్నే (64) అర్ద సెంచరీతో సత్తా చాటాడు. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తిరుమన్నే (14), ఆఖర్లో చతురంగ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జయసింఘే, ప్రసన్న, లక్మల్ డకౌట్లు కాగా.. తరంగ, జీవన్ మెండిస్ తలో పరుగు చేశారు. విండీస్ బౌలర్లలో ఆష్లే నర్స్ 3 వికెట్లు పడగొట్టగా.. టీనో బెస్ట్ 2, జెరోమ్ టేలర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (49), లెండిల్ సిమన్స్ 37 (నాటౌట్) విండీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరికి ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో విండీస్ శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చాడ్విక్ వాల్టన్ డకౌట్, నర్సింగ్ డియోనరైన్ 14, జోనాథన్ కార్టర్ 17, ఆష్లే నర్స్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో దినేశ్ రామ్‌దిన్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లంక బౌలర్లలో ఇసురు ఉడాన పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. చతురంగ డిసిల్వ, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. సచిన్ నేతృత్వంలోని భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్, శ్రీలంక తలో 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించినప్పటికీ.. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ టాప్ ప్లేస్‌లో ఉంది. లంక చేతితో ఓటమితో విండీస్ మూడో స్థానానికి పడిపోయింది. విండీస్ ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించింది. ఆసీస్, ఇంగ్లండ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడి చెరో మ్యాచ్‌లో గెలిచారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, చిట్ట చివరి స్థానంలో ఉంది. -
సచిన్ హాఫ్ సెంచరీ వృథా.. భారత్‌ను చిత్తు చేసిన ఆసీస్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌లో ఇండియా మాస్టర్స్ జోరుకు ఆస్ట్రేలియా కళ్లెం వేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం వడోదర వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ షేన్ వాట్సన్, స్టార్ బ్యాటర్ బెన్ డంక్ విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు.భారత బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీల వర్షంతో వడోదర స్టేడియం తడిసిముద్దయింది. వీరిద్దరి అపడం ఎవరూ తరం కాలేదు. ఈ దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ రెండో వికెట్‌కు 236 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. డంక్ 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 132 పరుగులు చేయగా.. వాట్సన్ 52 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో పవన్ నేగి ఒక్కడే ఓ వికెట్ పడగొట్టారు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.సచిన్ హాఫ్ సెంచరీ వృథా..అనంతరం 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సచిన్ టెండూల్కర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మాస్టర్ బ్లాస్టర్ క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. సచిన్ కేవలం 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆతర్వాత యూసఫ్ పఠాన్ 25 పరుగులు చేయగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జేవియర్ డోహెర్టీ 5 వికెట్లు పడగొట్టగా.. క్రిస్టియన్, లాఫ్లీన్, నాథన్ రియర్డన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 8న రాయ్‌పూర్ వేదికగా వెస్టిండీస్‌తో తలపడనుంది.చదవండి: మ్యాచ్ సమయంలో నిద్రపోయిన పాకిస్తాన్ స్టార్ బ్యాటర్𝐓𝐡𝐚𝐭’𝐬 𝐡𝐨𝐰 𝐲𝐨𝐮 𝐝𝐨 𝐢𝐭! 😎𝙎𝙖𝙘𝙝𝙞𝙣 𝙩𝙞𝙣𝙜𝙡𝙞𝙣𝙜 𝙨𝙥𝙞𝙣𝙚𝙨 𝙬𝙞𝙩𝙝 𝙩𝙝𝙖𝙩 𝙨𝙞𝙜𝙣𝙖𝙩𝙪𝙧𝙚 𝙨𝙩𝙧𝙖𝙞𝙜𝙝𝙩 𝙨𝙞𝙭! 🚀✨#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/A11weJAGox— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 5, 2025 -
వాట్సన్, డంక్ విధ్వంసకర శతకాలు.. టీమిండియాపై ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 5) ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (52 బంతుల్లో 110 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ బెన్ డంక్ (53 బంతుల్లో 132 నాటౌట్; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో విరుచకుపడ్డారు. ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. వాట్సన్, డంక్ ప్రతి ఒక్క భారత బౌలర్‌ను ఎడాపెడా వాయించారు. వీరిద్దరి దెబ్బకు ప్రతి భారత బౌలర్ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. వినయ్ కుమార్ 4 ఓవర్లలో 73,అభిమన్యు మిథున్ 4 ఓవర్లలో 46, పవన్ నేగి 3 ఓవర్లలో 34 (ఒక వికెట్), రాహుల్ శర్మ 4 ఓవర్లలో 42, ఇర్ఫాన్ పఠాన్ 2 ఓవర్లలో 31, గుర్కీరత్ సింగ్ మాన్ ఒక ఓవర్లో 15, స్టువర్ట్ బిన్నీ 2 ఓవర్లలో 28 పరుగులు సమర్పించుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో షాన్ మార్ష్ 22 పరుగులకు ఔటయ్యాడు. వాట్సన్‌కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్లో వెస్టిండీస్ మాస్టర్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కూడా వాట్సన్ శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో కూడా వాట్సన్ 52 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు.కాగా, ఈ టోర్నీలో భారత మాస్టర్స్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. ఆసీస్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో ఉండగా.. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాదే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో 6 దేశాలకు (భారత్, శ్రీలంక. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్) చెందిన దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత్‌కు సచిన్, శ్రీలంకకు సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నారు.భారత మాస్టర్స్ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
ఆమ్లా, పీటర్సన్ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో దక్షిణాఫ్రికా మాస్టర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. సోమవారం వడోదర వేదికగా ఇంగ్లండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టి అంబ్రోస్(53) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(36), స్కోఫీల్డ్(20) రాణించారు. ఓపెనర్లు మస్టర్డ్(0), ఇయాన్ బెల్ నిరాశపరిచనప్పటికి మోర్గాన్, అంబ్రోస్ కీలక ఇన్నింగ్స్‌లతో ఇంగ్లీష్ జట్టును అదుకున్నారు. ఆఖరిలో ట్రిమ్‌లెట్( 4 బంతుల్లో 19 పరుగులు) హ్యాట్రిక్ సిక్స్‌లు బాది జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ప్రోటీస్ బౌలర్లలో ఫిలాండర్, హెన్రీ డేవిడ్స్, సబాలాల, కుర్గర్ తలా వికెట్ సాధించారు.హసీమ్ ఆమ్లా విధ్వంసం..158 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. సఫారీల కెప్టెన్ హషీమ్ ఆమ్లా అద్బతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు పీటర్సన్(56) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మీకర్ రెండు, ర్యాన్ సైడ్‌బాటమ్ ఓ వికెట్ సాధించారు. సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం పాయింట్లపట్టికలో నాలుగో స్ధానంలో ఉంది.చదవండి: అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్ -
యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్ టోర్నీలో ఇండియా మాస్టర్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం వడోదర వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 13.5 ఓవర్లలో కేవలం 85 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ శర్మ, దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటారు. రాహుల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇవ్వగా.. యువీ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు ఇచ్చాడు. వీరిద్దరితో పాటు నేగీ, బిన్నీ తలా రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రీ డేవిడ్స్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారురాయుడు ఆజేయంగా..అనంతరం 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అంబటి రాయుడు(34 బంతుల్లో 7 ఫోర్లతో 41) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు పవన్ నేగి(21 నాటౌట్) రాణించాడు. అయితే భారత కెప్టెన్ సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. సచిన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మూడు వికెట్లతో సత్తాచాటిన రాహుల్ శర్మకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 5న వడోదర వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి.. -
ఉపుల్ తరంగ విధ్వంసం.. ఆసీస్‌పై శ్రీలంక ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో శ్రీలంక మాస్టర్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వడోదర వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో శ్రీలంక రెండో స్ధానానికి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో షాన్ మార్ష్(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77), బెన్ డంక్(29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో మెరిశారు.అతడితో పాటు డానియల్ క్రిస్టియన్(34), కటింగ్(19) పరుగులతో రాణించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆసీస్ కెప్టెన్ షేన్ వాట్సన్.. శ్రీలంకపై మాత్రం కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో గుణరత్నే, ఉదనా, చతురంగ డిసిల్వా తలా వికెట్ సాధించారు.తరంగ విధ్వంసం..అనంతరం 218 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఆసీస్ బౌలర్లను తరంగా ఉతికారేశాడు. కేవలం 54 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు లహిరు తిరమానే(34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ బెన్ లాఫ్లిన్ మూడు వికెట్లు పడగొట్టగా.. డానియల్ క్రిస్టియన్ రెండు, జేవియర్ డోహెర్టీ ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ టోర్నీలో భాగంగా శనివారం వడోదర వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న సచిన్ సేన.. అదే జోరును ఇంగ్లండ్ మాస్టర్స్‌పై కొనసాగించాలని భావిస్తోంది. -
ఉత్కంఠ పోరులో.. ఇంగ్లండ్ మాస్టర్స్‌పై విండీస్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League 2025)లో వెస్టిండీస్ మాస్టర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను ఓడించిన విండీస్ జట్టు.. తాజాగా ఇంగ్లండ్‌పై గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గేల్ బృందం గట్టెక్కింది.అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ నిర్వహిస్తున్నారు. గతేడాదే మొదలుకావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 22న IML మొదలైంది. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 24న తమ తొలి మ్యాచ్‌లో భాగంగా వెస్టిండీస్ మాస్టర్స్(West Indies Masters) ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో తలపడింది. బ్రియన్ లారా(Brian Lara) కెప్టెన్సీలో ఆడిన విండీస్.. ఏడు వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించి తొలి విజయం నమోదు చేసింది. గేల్ మెరుపు ఇన్నింగ్స్‌ఇక గురువారం రాత్రి తమ రెండో మ్యాచ్ ఆడిన వెస్టిండీస్.. ఇంగ్లండ్‌ను ఢీకొట్టింది. ఈసారి నవీ ముంబై వేదికగా క్రిస్‌గేల్ సారథ్యంలో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో డ్వేన్ స్మిత్ 25 బంతుల్లో 35 పరుగులు చేయగా.. గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 39 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో నర్సింగ్ డియోనరైన్(23 బంతుల్లో 35 నాటౌట్), ఆష్లే నర్స్(13 బంతుల్లో 29) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ మాస్టర్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.ఇంగ్లండ్ మాస్టర్స్ బౌలర్లలో మాంటీ పనేసర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ షోఫీల్డ్ రెండు, క్రిస్ ట్రెమ్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాస్టర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇయాన్ బెల్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.ఈ క్రమంలో కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్(13 బంతుల్లో 22)తో కలిసి మరో ఓపెనర్ ఫిల్ మస్టర్డ్(19 బంతుల్లో 31) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు అవుటైన తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. టిమ్ ఆంబ్రోస్(3), డారెన్ మ్యాడీ(14), టిమ్ బ్రెస్నన్(5) పూర్తిగా విఫలమయ్యారు. 171 పరుగులకు పరిమితంఅయితే, క్రిస్ షోఫీల్డ్(26 బంతుల్లో 32) మాత్రం రాణించగా.. క్రిస్ ట్రెమ్లెట్(19 బంతుల్లో 27 నాటౌట్), స్టువర్ట్ మీకర్(10 బంతుల్లో 24) అతడికి సహకరించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) ఇరవై ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ మాస్టర్స్ 171 పరుగుల వద్ద నిలిచిపోయింది. దీంతో వెస్టిండీస్ మాస్టర్స్ ఎనిమిది పరుగుల తేడాతో జయభేరి మోగించింది.విండీస్ బౌలర్లలో జెరోమ్ టేలర్, రవి రాంపాల్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. డ్వేన్ స్మిత్, ఆష్లే నర్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక వెస్టిండీస్ తదుపరి మార్చి 6న శ్రీలంక మాస్టర్స్‌తో తలపడనుండగా.. ఇంగ్లండ్ మాస్టర్స్ సోమవారం సౌతాఫ్రికా మాస్టర్స్‌ను ఢీకొట్టనుంది. టాప్‌లో ఇండియా మాస్టర్స్ఇక ఈ టీ20 లీగ్‌లో సచిన్ టెండుల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు తొలుత శ్రీలంక మాస్టర్స్‌పై.. తర్వాత ఇంగ్లండ్ మాస్టర్స్‌పై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు(+2.461) పరంగా మెరుగైన స్థితిలో నిలిచిన ఇండియా మాస్టర్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక వెస్టిండీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా అతడు! -
క్రిస్ గేల్ విధ్వంసం.. లేటు వయసులోనూ తగ్గని యూనివర్సల్ బాస్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League 2025) ఇవాళ (ఫిబ్రవరి 27) వెస్టిండీస్ మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్ జట్లు తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) చెలరేగండతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గేల్‌తో పాటు మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ , నర్సింగ్ డియోనరైన్, ఆష్లే నర్స్ కూడా చెలరేగారు. గేల్ 19 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో గేల్ పాత రోజులను గుర్తు చేశాడు. లేటు వయసులోనూ విధ్వంసం సృష్టించాడు. డ్వేన్ సైతం వేగంగా పరుగులు సాధించాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. డియోనరైన్ 23 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ఆష్లే నర్స్ 13 బంతుల్లో 2 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ ఎడ్వర్డ్స్ 9, చాడ్విక్ వాల్టన్ 9, దినేశ్ రామ్‌దిన్ 8, జెరోమ్ టేలర్ ఒక్క పరుగు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాంటీ పనేసర్ 3 వికెట్లు తీయగా.. క్రిస్ స్కోఫీల్డ్ 2, క్రిస్ ట్రెమ్లెట్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాదే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో 6 దేశాలకు (భారత్, శ్రీలంక. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్) చెందిన దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత్‌కు సచిన్, శ్రీలంకకు సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నారు. భారత మాస్టర్స్ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు.ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ అత్యధిక మ్యాచ్‌లు గెలిచింది. భారత మాస్టర్స్.. శ్రీలంక, ఇంగ్లండ్ మాస్టర్స్‌పై విజయాలు సాధించారు. మరో రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా మాస్టర్స్‌పై విండీస్.. సౌతాఫ్రికా మాస్టర్స్‌పై శ్రీలంక మాస్టర్స్ విజయాలు సాధించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
సచిన్, యువీ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో ఇండియా మాస్టర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఇంగ్లండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది.ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మాడీ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టి అంబ్రోస్(23), స్కోఫీల్డ్(18), ట్రిమ్‌లెట్(16) రాణించారు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మెర్గాన్‌తో సహా మిగితా ప్లేయర్లందరూ విఫలమయ్యారు.భారత బౌలర్లలో ధవన్ కులకర్ణి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కులకర్ణి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అభిమన్యు మిథున్, నేగి తలా రెండు వికెట్లు సాధించారు.గుర్క్రీత్, సచిన్ విధ్వంసం..అనంతరం 133 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.4 ఓవర్లలోనే ఊదిపడేసింది.భారత బ్యాటర్లలో గుర్క్రీత్ సింగ్ మానన్(35 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 63 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే భారత కెప్టెన్ సచిన్ టెండూల్కర్ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.సచిన్ క్రీజులో ఉన్నంత సేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లిటిల్ మాస్టర్.. 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా ఆఖరిలో వచ్చిన యువరాజ్ సింగ్ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాడు.యువీ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్కోఫీల్డ్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లందరూ చేతులేత్తాశారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 1న సౌతాఫ్రికాతో తలపడనుంది. Inject this shot into my veins and my neurological problems will go away#SachinTendulkar pic.twitter.com/rJayaBoCbN— AT10 (@Loyalsachfan10) February 25, 2025 pic.twitter.com/rUKfoqsq8z— kuchnahi123@12345678 (@kuchnahi1269083) February 25, 2025 -
ఇంగ్లండ్‌తో సమరం.. సత్తా చాటిన భారత బౌలర్లు
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League-2025) భారత మాస్టర్స్ (Indian Masters) ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్‌తో (England Masters) తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలు, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్బాటమ్ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్‌తో తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలుచ, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్‌బాటమ్ -
షేన్ వాట్సన్ సెంచరీ వృథా.. ఆసీస్‌పై వెస్టిండీస్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025 టోర్నీలో వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు శుభారంభం చేసింది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ షేన్ వాట్సన్(Shane Watson) విధ్వంసకర శతకంతో చెలరేగాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన వాట్సన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కేశాడు. కేవలం 52 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 107 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డానియల్ క్రిస్టియన్(32), కట్టింగ్(18) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో యాష్లే నర్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. జెర్మీ టేలర్, రామ్‌పాల్ తలా రెండు వికెట్లు సాధించారు.సిమ్మన్స్ ఊచకోత..అనంతరం 217 బంతుల్లో విండీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. విండీస్ మాజీ ప్లేయర్ లెండిల్ సిమన్స్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య చేధనలో సిమన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు,8 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డ్వేన్ స్మిత్(51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. చాడ్విక్ వాల్టన్(11 బంతుల్లో 4 ఫోర్లతో23) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ హిల్ఫెన్హాస్, మెక్గైన్, క్రిస్టియన్ తలా వికెట్ సాధించాడు. కాగా మంగళవారం ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించింది.చదవండి: PAK vs IND: ఛాంపియన్స్ ట్రోఫీలో 'పాక్' చెత్త ప్రదర్శన.. అతడిపై వేటు..! -
లంకపై భారత్ మాస్టర్స్ గెలుపు
నవీముంబై: అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ (ఐఎంఎల్)లో ఉత్కంఠ రేపిన పోరులో భారత్ మాస్టర్స్ జట్టు 4 పరుగుల తేడాతో శ్రీలంక మాస్టర్స్‌పై గెలుపొందింది. 223 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన శ్రీలంక గెలిచేందుకు ఆఖరి బంతి దాకా పెద్ద పోరాటమే చేసింది. చివరి 6 బంతులకు 9 పరుగులు చేయాల్సి ఉండగా అభిమన్యు మిథున్ చక్కని బౌలింగ్‌తో లంక బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ లీగ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ మాస్టర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు సచిన్ (10), అంబటి రాయుడు (5) ఇద్దరు నిరాశపరచగా, స్టువర్ట్ బిన్నీ (68), యూసుఫ్ పఠాన్ (56 నాటౌట్), గుర్కీరత్ సింగ్ (44), యువరాజ్ (31 నాటౌట్) లంక బౌలర్లపై దంచేయడంతో 200 పైచిలుకు స్కోరు సాధించింది. లంక బౌర్లలో సురంగ లక్మాల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం శ్రీలంక మాస్టర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 218 పరుగులకు పరిమితమైంది. కుమార సంగక్కర (51), జీవన్ మెండిస్ (42) రాణించారు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా, ధవళ్ కులకర్ణి 2 వికెట్లు తీశాడు. -
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కోసం భారత్, శ్రీలంక జట్ల ప్రకటన
ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్ (2025) కోసం భారత్ (Indian Masters), శ్రీలంక (Sri Lanka Masters) జట్లను ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రకటించారు. ఈ టోర్నీలో భారత మాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) నాయకత్వం వహించనుండగా.. శ్రీలంక మాస్టర్స్‌కు కుమార సంగక్కర (Kumara Sangakkar) సారధిగా ఉంటాడు.భారత మాస్టర్స్ జట్టులో సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. శ్రీలంక మాస్టర్స్ జట్టులో సంగక్కర, కలువితరణ, ఉపుల్ తరంగ తదితర స్టార్లు పాల్గొంటున్నారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లను ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు.ఈ టోర్నీలో వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్, సౌతాఫ్రికా తరఫున మఖాయ ఎన్తిని, ఇంగ్లండ్ తరఫున మాంటి పనేసర్ లాంటి మాజీ స్టార్లు పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్‌లకు రాజ్‌కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగనున్నాయి.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజేతలు మార్చి 16న రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఈ టోర్నీలోని మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత మాస్టర్స్ జట్టు: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, రాహుల్ శర్మ, షాబాజ్ నదీమ్, నమన్ ఓఝా (వికెట్‌కీపర్), స్టువర్ట్ బిన్నీ, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, పవన్ నేగి, గురుకీరత్ మాన్, అభిమన్యు మిధున్శ్రీలంక మాస్టర్స్ జట్టు: కుమార సంగక్కర (కెప్టెన్), రొమేశ్ కలువితరణ (వికెట్‌కీపర్), అషాన్ ప్రియరంజన్, ఉపుల్ తరంగ, లహీరు తిరుమన్నే, చింతక జయసింఘే, సీక్కుగే ప్రసన్న, జీవన్ మెండిస్, ఇసురు ఉడాన, దిల్రువన్ పెరీరా, చతురంగ డిసిల్వ, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, దమ్మిక ప్రసాద్, అసేల గణరత్నే -
మళ్లీ బరిలోకి దిగనున్న క్రిస్ గేల్
విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్‌లో (2025) గేల్ విండీస్ తరఫున బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీలో గేల్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ పేసర్ మఖాయా ఎన్తిని (Makhaya Ntini), ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) బరిలోకి దిగనున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత్‌కు సచిన్ టెండూల్కర్, శ్రీలంకకు కుమార సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియన్ మాస్టర్స్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు యువరాజ్ సింగ్ ఇటీవలే తన సమ్మతిని తెలిపాడు.ఈ టోర్నీ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్‌లకు రాజ్‌కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగనున్నాయి.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజేతలు మార్చి 16న రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఈ టోర్నీలోని మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత జట్టు (అంచనా): సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శిఖర్ ధవన్, రాహుల్ శర్మ, నమన్ ఓఝా, స్టువర్ట్ బిన్నీ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారి, ప్రజ్ఞాన్ ఓఝా -
భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ టెండుల్కర్.. అభిమానులకు పండుగే!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్- International Masters League) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాదే ఆరంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులేవీ లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎమ్ఎల్ ఆరంభ, ముగింపు తేదీలను ప్రకటించారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి 22న మొదలై.. మార్చి 16న ఫైనల్‌తో పూర్తవుతుందని తెలిపారు. ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ20 లీగ్ జరుగనుంది.భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక ఈ టీ20 లీగ్‌లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం. భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.మరోవైపు.. వెస్టిండీస్ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్ లారా, శ్రీలంక టీమ్‌కు కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా బృందానికి షేన్ వాట్సన్, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికా టీమ్‌కు జాక్వెస్ కలిస్ సారథ్యం వహించనున్నారు. ఆ ముగ్గురు కీలకంకాగా ఐఎమ్ఎల్కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. లీగ్ కమిషనర్‌గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎమ్ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐఎమ్ఎల్ పాలక మండలిలో గావస్కర్‌తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఉన్నారు. కాగా గతేడాది నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్‌ను ఎట్టకేలకు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.వేదికలు అవే?ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌కు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు.. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కూడా ఆరంభం కానుండటం.. అందులోనూ సచిన్ టెండుల్కర్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగడం.. క్రికెట్ ప్రేమికులకు డబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు.చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు?