స‌చిన్, యువీ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భార‌త్‌ | Gurkeerat Singh, Sachin Tendulkar ensure IND beat ENG by 9 wickets | Sakshi
Sakshi News home page

IML 2025: స‌చిన్, యువీ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భార‌త్‌

Published Wed, Feb 26 2025 8:10 AM | Last Updated on Wed, Feb 26 2025 11:08 AM

Gurkeerat Singh, Sachin Tendulkar ensure IND beat ENG by 9 wickets

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌ టీ20 టోర్నీలో ఇండియా మాస్టర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ మాస్టర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది.

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో డారెన్ మాడీ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. టి అంబ్రోస్‌(23), స్కోఫీల్డ్‌(18), ట్రిమ్‌లెట్‌(16) రాణించారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మెర్గాన్‌తో సహా మిగితా ప్లేయర్లందరూ విఫలమయ్యారు.

భారత బౌలర్లలో ధవన్‌ కులకర్ణి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కులకర్ణి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అభిమన్యు మిథున్‌, నేగి తలా రెండు వికెట్లు సాధించారు.

గుర్‌క్రీత్‌, సచిన్‌ విధ్వంసం​..
అనంతరం 133 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 11.4 ఓవర్లలోనే ఊదిపడేసింది.భారత బ్యాటర్లలో గుర్‌క్రీత్‌ సింగ్‌ మానన్‌(35 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 63 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే భారత కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

సచిన్ క్రీజులో ఉన్నంత సేపు తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అభిమానులను అలరించాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లిటిల్‌ మాస్టర్‌.. 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా ఆఖరిలో వచ్చిన యువరాజ్‌ సింగ్‌ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాడు.

యువీ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్కోఫీల్డ్‌ ఒక్కడే ఓ వికెట్‌ సాధించాడు. మిగితా బౌలర్లందరూ చేతులేత్తాశారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 1న సౌతాఫ్రికాతో తలపడనుంది.
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement