
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్‌లో రాయపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.
యువీ కేవలం 30 బంతుల్లో 1 ఫోర్లు 7 సిక్స్‌లతో 59 పరుగులు చేయగా.. సచిన్ 30 బంతుల్లో 7 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. వీరిద్దరితో పాటు బిన్నీ(36), యూసుఫ్ పఠాన్(23), ఇర్ఫాన్ పఠాన్(19) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో దోహర్టీ, క్రిస్టియన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. స్టీవ్ ఓకేఫీ, కౌల్టర్ నైల్ తలా వికెట్ సాధించారు.
తుది జట్లు
భారత్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), అంబటి రాయుడు (వికెట్ కీపర్), గురుకీరత్ సింగ్ మాన్, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, షాబాజ్ నదీమ్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్
ఆస్ట్రేలియా: షాన్ మార్ష్, డేనియల్ క్రిస్టియన్, బెన్ డంక్ (వికెట్ కీపర్), నాథన్ రియర్డన్, బెన్ కటింగ్, షేన్ వాట్సన్ (కెప్టెన్), స్టీవ్ ఓకీఫ్, నాథన్ కౌల్టర్-నైల్, జేవియర్ డోహెర్టీ, బ్రైస్ మెక్‌గెయిన్, బెన్ హిల్ఫెన్‌హాస్
THE YUVRAJ SINGH SIXES. 😍💥pic.twitter.com/oMVx3FCnpi
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2025
Comments
Please login to add a commentAdd a comment