
క్రిస్ గేల్- ఇయాన్ మోర్గాన్ (PC: IML)
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League 2025)లో వెస్టిండీస్ మాస్టర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను ఓడించిన విండీస్ జట్టు.. తాజాగా ఇంగ్లండ్‌పై గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గేల్ బృందం గట్టెక్కింది.
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ నిర్వహిస్తున్నారు. గతేడాదే మొదలుకావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 22న IML మొదలైంది. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
ఈ క్రమంలో.. ఫిబ్రవరి 24న తమ తొలి మ్యాచ్‌లో భాగంగా వెస్టిండీస్ మాస్టర్స్(West Indies Masters) ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో తలపడింది. బ్రియన్ లారా(Brian Lara) కెప్టెన్సీలో ఆడిన విండీస్.. ఏడు వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించి తొలి విజయం నమోదు చేసింది.
గేల్ మెరుపు ఇన్నింగ్స్
ఇక గురువారం రాత్రి తమ రెండో మ్యాచ్ ఆడిన వెస్టిండీస్.. ఇంగ్లండ్‌ను ఢీకొట్టింది. ఈసారి నవీ ముంబై వేదికగా క్రిస్‌గేల్ సారథ్యంలో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
ఓపెనర్లలో డ్వేన్ స్మిత్ 25 బంతుల్లో 35 పరుగులు చేయగా.. గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 39 పరుగులు సాధించాడు.
మిగతా వాళ్లలో నర్సింగ్ డియోనరైన్(23 బంతుల్లో 35 నాటౌట్), ఆష్లే నర్స్(13 బంతుల్లో 29) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ మాస్టర్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ మాస్టర్స్ బౌలర్లలో మాంటీ పనేసర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ షోఫీల్డ్ రెండు, క్రిస్ ట్రెమ్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాస్టర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇయాన్ బెల్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.
ఈ క్రమంలో కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్(13 బంతుల్లో 22)తో కలిసి మరో ఓపెనర్ ఫిల్ మస్టర్డ్(19 బంతుల్లో 31) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు అవుటైన తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. టిమ్ ఆంబ్రోస్(3), డారెన్ మ్యాడీ(14), టిమ్ బ్రెస్నన్(5) పూర్తిగా విఫలమయ్యారు.
171 పరుగులకు పరిమితం
అయితే, క్రిస్ షోఫీల్డ్(26 బంతుల్లో 32) మాత్రం రాణించగా.. క్రిస్ ట్రెమ్లెట్(19 బంతుల్లో 27 నాటౌట్), స్టువర్ట్ మీకర్(10 బంతుల్లో 24) అతడికి సహకరించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది.
ఇరవై ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ మాస్టర్స్ 171 పరుగుల వద్ద నిలిచిపోయింది. దీంతో వెస్టిండీస్ మాస్టర్స్ ఎనిమిది పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
విండీస్ బౌలర్లలో జెరోమ్ టేలర్, రవి రాంపాల్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. డ్వేన్ స్మిత్, ఆష్లే నర్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక వెస్టిండీస్ తదుపరి మార్చి 6న శ్రీలంక మాస్టర్స్‌తో తలపడనుండగా.. ఇంగ్లండ్ మాస్టర్స్ సోమవారం సౌతాఫ్రికా మాస్టర్స్‌ను ఢీకొట్టనుంది.
టాప్‌లో ఇండియా మాస్టర్స్
ఇక ఈ టీ20 లీగ్‌లో సచిన్ టెండుల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు తొలుత శ్రీలంక మాస్టర్స్‌పై.. తర్వాత ఇంగ్లండ్ మాస్టర్స్‌పై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు(+2.461) పరంగా మెరుగైన స్థితిలో నిలిచిన ఇండియా మాస్టర్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక వెస్టిండీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా అతడు!
Comments
Please login to add a commentAdd a comment