Navi Mumbai
-
ఉత్కంఠ పోరులో.. ఇంగ్లండ్ మాస్టర్స్‌పై విండీస్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో (International Masters League 2025)లో వెస్టిండీస్ మాస్టర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను ఓడించిన విండీస్ జట్టు.. తాజాగా ఇంగ్లండ్‌పై గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గేల్ బృందం గట్టెక్కింది.అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ నిర్వహిస్తున్నారు. గతేడాదే మొదలుకావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 22న IML మొదలైంది. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 24న తమ తొలి మ్యాచ్‌లో భాగంగా వెస్టిండీస్ మాస్టర్స్(West Indies Masters) ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో తలపడింది. బ్రియన్ లారా(Brian Lara) కెప్టెన్సీలో ఆడిన విండీస్.. ఏడు వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించి తొలి విజయం నమోదు చేసింది. గేల్ మెరుపు ఇన్నింగ్స్‌ఇక గురువారం రాత్రి తమ రెండో మ్యాచ్ ఆడిన వెస్టిండీస్.. ఇంగ్లండ్‌ను ఢీకొట్టింది. ఈసారి నవీ ముంబై వేదికగా క్రిస్‌గేల్ సారథ్యంలో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో డ్వేన్ స్మిత్ 25 బంతుల్లో 35 పరుగులు చేయగా.. గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 39 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో నర్సింగ్ డియోనరైన్(23 బంతుల్లో 35 నాటౌట్), ఆష్లే నర్స్(13 బంతుల్లో 29) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ మాస్టర్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.ఇంగ్లండ్ మాస్టర్స్ బౌలర్లలో మాంటీ పనేసర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ షోఫీల్డ్ రెండు, క్రిస్ ట్రెమ్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాస్టర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇయాన్ బెల్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.ఈ క్రమంలో కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్(13 బంతుల్లో 22)తో కలిసి మరో ఓపెనర్ ఫిల్ మస్టర్డ్(19 బంతుల్లో 31) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు అవుటైన తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. టిమ్ ఆంబ్రోస్(3), డారెన్ మ్యాడీ(14), టిమ్ బ్రెస్నన్(5) పూర్తిగా విఫలమయ్యారు. 171 పరుగులకు పరిమితంఅయితే, క్రిస్ షోఫీల్డ్(26 బంతుల్లో 32) మాత్రం రాణించగా.. క్రిస్ ట్రెమ్లెట్(19 బంతుల్లో 27 నాటౌట్), స్టువర్ట్ మీకర్(10 బంతుల్లో 24) అతడికి సహకరించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) ఇరవై ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ మాస్టర్స్ 171 పరుగుల వద్ద నిలిచిపోయింది. దీంతో వెస్టిండీస్ మాస్టర్స్ ఎనిమిది పరుగుల తేడాతో జయభేరి మోగించింది.విండీస్ బౌలర్లలో జెరోమ్ టేలర్, రవి రాంపాల్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. డ్వేన్ స్మిత్, ఆష్లే నర్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక వెస్టిండీస్ తదుపరి మార్చి 6న శ్రీలంక మాస్టర్స్‌తో తలపడనుండగా.. ఇంగ్లండ్ మాస్టర్స్ సోమవారం సౌతాఫ్రికా మాస్టర్స్‌ను ఢీకొట్టనుంది. టాప్‌లో ఇండియా మాస్టర్స్ఇక ఈ టీ20 లీగ్‌లో సచిన్ టెండుల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు తొలుత శ్రీలంక మాస్టర్స్‌పై.. తర్వాత ఇంగ్లండ్ మాస్టర్స్‌పై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు(+2.461) పరంగా మెరుగైన స్థితిలో నిలిచిన ఇండియా మాస్టర్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక వెస్టిండీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా అతడు! -
బ్రిటీష్ సింగర్ నోట ‘జై శ్రీరామ్’.. వీడియో వైరల్
బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ నోట ‘‘జై శ్రీరాం’’ అనే పదం వినిపించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తన బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్ యూ, ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్‌తో యువతను ఉర్రుతలూగించారు. ఈ క్రమంలో.. ప్రదర్శన ముగించే సమయానికి క్రిస్ మార్టిన్(Chris Martin) అక్కడున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపించిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పట్టుకున్న ఫ్లకార్డుపై జై శ్రీరాం అని ఇంగ్లీష్‌లో రాసి ఉంది. అది చూసి ఆయన ‘‘జై శ్రీరామ్’’(Jai Shreeram) అనడంతో స్టేడియం మారుమోగిపోయింది. ఆపై ఆ పదం అర్థం ఏంటని? అక్కడున్నవాళ్లను అడిగి తెలుసుకున్నారు. When Chris Martin said ‘Jai Shri Ram’ at Mumbai concert... the crowd went wild!#ChrisMartin #MumbaiConcert #ColdplayInIndia #JaiShriRam pic.twitter.com/yNeB6FcMOF— India Today NE (@IndiaTodayNE) January 19, 2025బూమ్ బూమ్ బుమ్రా పేరు కూడా.. ప్రదర్శన ఇచ్చే టైంలో ఉన్నట్లుండి మార్టిన్ నోట జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఆగండి.. ప్రదర్శన అయిపోలేదు. చివరగా జస్ప్రీత్ బుమ్రా వచ్చి పాల్గొంటాడట’’ అని మార్టిన్ మైకులో చెప్పాడు. దీంతో అభిమానులు బుమ్రా నినాదాలతో హోరెత్తిపోయారు. అయితే అలాంటిదేం అదేం జరగకపోయినా.. క్రిస్ మార్టిన్ నోట బుమ్రా పేరు రావడంతో క్రికెట్ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు.Coldplay's Mumbai concert on Saturday was unforgettable for music lovers and cricket fans. During the performance, Chris Martin surprised the audience by mentioning India's star bowler, Jasprit Bumrah.#ColdplayMumbai #Coldplay #JaspritBumrah #ChrisMartin #MusicConcert pic.twitter.com/TMz2wscdkm— Mid Day (@mid_day) January 19, 2025ఇదిలా ఉంటే.. హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్(Dakota Johnson), క్రిస్ మార్టిన్ ప్రియురాలు. ఈ ఇద్దరూ భారత్ సందర్శనకు వచ్చారు. తాజాగా.. ముంబైలోని ప్రసిద్ధ శ్రీ భూల్‌నాథ్ ఆలయాన్ని ఈ జంట దర్శించుకుంది. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు. క్రిస్ బ్లూ కుర్తాలో మెడపై రుద్రాక్ష మాలతో కనిపించాడు. Dakota Johnson telling her wishes in ear of Shri Nandi Maharaj. Amazing how foreign nationals come to India and try following our culture and traditions! #Coldplay #ChrisMartin #DakotaJohnson pic.twitter.com/0Dz19yXg5c— Priyanshi Bhargava (@PriyanshiBharg7) January 18, 2025 ఆలయంలో నంది చెవిలో మార్టిన్ తన మనసులోని కోరికను వినిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకు ముందు.. మార్టిన్, జాన్సన్‌లు ముంబైలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
మద్యంపై పోరులో మహిళల విజయం..!
ముంబై ప్రాంతంలోని హెచ్‌ఎస్‌జి కాంప్లెక్స్‌లోని బూజ్ షాప్ తెరవద్దంటూ మహిళలు అడ్డుపడి, విజయం సాధించారు. కొందరు మద్యం ప్రియులు షాపింగ్ కాంప్లెక్స్ పరిసరాలలో తాగి, చుట్టుపక్కల అమ్మాయిలు, మహిళల పట్ల చులకన వ్యాఖ్యల చేయడం వల్ల తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసేయాలని స్థానిక మహిళలు పట్టుబట్టారు. ఎంకే హెరిటేజ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పురుషులు, పిల్లలు కూడా ఆ మహిళలతో జత కలవడంతో అందరూ కలసి మానవ హారంగా ఏర్పడి మౌన నిరసనను తెలియజేశారు.ఈ నిరసన ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన వీరు కలెక్టర్ కార్యాలయానికి, ముఖ్యమంత్రికి ఇ–మెయిల్ ద్వారా తమ సందేశాన్ని పంపారు. ముఖ్యంగా మహిళల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసివేయకపోతే స్థానిక ప్రజలు శాంతిభద్రతల సమస్యలను ఎంతగా ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ 50 మందికి పైగా మహిళలు ఒక మెమోరాండంపై సంతకం చేసి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు పంపారు. ఫలితంగా సీఎం నుంచి కలెక్టర్, ఎక్సైజ్ శాఖ, సంబంధిత అన్ని శాఖలకు ఈ సమస్యపై దర్యాప్తు చేయమని రాయగడ్ డివిజన్‌కు ఆదేశాలు అందాయి. ప్రతిపాదిత దుకాణం ప్రసిద్ధ సాయిబాబా ఆలయ ప్రవేశ ద్వారం నుంచి 144 మీటర్ల దూరంలో ఉందని, ప్రముఖుల విగ్రహాలు, విద్యాసంస్థలు, సమీపంలోని రాష్ట్ర రహదారి వంటి ఇతర అడ్డంకులు లేవని ఎక్సైజ్ శాఖ బృందాలు నివేదించాయి. అయినప్పటికీ స్థానికంగా ఉన్న సమస్యను పరిగణనలోకి తీసుకొని, ఇక్కడ ఉన్న మద్యం షాప్‌ను మరో భవనంలోకి మార్చాలని నిర్ణయించారు. దీంతో మద్యంపై పోరులో మహిళల సాధించిన విజయంగా అందరిని దృష్టిని ఆకర్షించడమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది. (చదవండి: -
అతిపొడవైన సముద్రపు వంతెన.. ‘అటల్ సేతు’ను ప్రారంభించిన మోదీ
సాక్షి, ముంబై: ముంబైలోని నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్ సేతు’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని .. జాతికి అంకితం చేశారు. కాగా అటల్ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు. VIDEO | PM Modi inaugurates Mumbai Trans Harbour Link (MTHL), the longest sea bridge in the country, in Navi Mumbai. The MTHL, also known as Atal Setu named after former PM Atal Bihari Vajpayee, originates from Sewri in Mumbai and terminates at Nhava Sheva in Uran taluka in… pic.twitter.com/Z9cy8S1vAD — Press Trust of India (@PTI_News) January 12, 2024 ఇది ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. ఫ్లెమింగో పక్షుల కోసం బ్రిడ్జ్‌కు ఒకవైపు సౌండ్ బారియర్ ఏర్పాటు చేశారు. అటల్ సేతు వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబైకు చేరుకోవచ్చు. గతంలో ముంబై నుంచి నవీ ముంబైకి రెండు గంటల సమయం పట్టేది. #WATCH | Atal Setu - the Mumbai Trans Harbour Link - is India's longest bridge built on the sea and it is expected to see the movement of more than 70,000 vehicles every day pic.twitter.com/VqmPMf1CCU — ANI (@ANI) January 12, 2024 అటల్ సేతు వంతెనకు 2016 డిసెంబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కావాల్సిన వంతెన.. గడువుకు ఆరు నెలల ముందే( డిసెంబర్ 25 నాటికి) సిద్ధం చేసినట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ సంజయ్ ముఖర్జీ తెలిపారు. కాంట్రాక్టర్లు, అధికారులు, కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. -
దేశంలో తొలిసారి.. ముంబై అరుదైన ఘనత
ముంబై: దేశ వాణిజ్యం నగరం ముంబై అరుదైన ఘనతకు సిద్ధం కాబోతోంది. దేశంలో ఏదేని నగరంలో రెండు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు ఇప్పటిదాకా లేవు. కానీ, ముంబై ఆ ఘనతను దక్కించుకోనుంది. నవీ ముంబై(NIMA)లో నిర్మించబోయే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 చివరికల్లా సిద్ధం కానుంది. ముంబైలో ఇప్పటికే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(CSMIA) ఉంది. అయితే విమానాల తాకిడి అత్యధికంగా ఉండడంతోనే ఈ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఎన్ఎంఐఏను నిర్మించబోయేది అదానీ గ్రూప్. ఇందుకు చేయబోయే ఖర్చు 16 వేల కోట్ల రూపాయలు. ఈ ఎయిర్‌పోర్టు ద్వారా పదివేల ఉద్యోగాలను కల్పించనున్నారు. Design of Iconic Navi Mumbai Airport has been revealed, the design of airport is inspired by National flower Lotus. Once completed it'll become second international airport in Mumbai Metropolitan RegionArchitect - Zaha Hadid pic.twitter.com/qU9uWCE4kG— Soham (@TheSohamPuranik) June 8, 2021 ఎన్ఎంఐఏ ప్రత్యేకతలు దాదాపు మూడు వేల ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించబోతున్నారు. నవీ ముంబై ఉల్వే తాలుకాలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు నాలుగు టెర్మినల్స్, రెండు రన్వేలు 29 కిలోమీటర్ల ముంబై ఎలివేటెడ్ రోడ్.. ఈ ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానం కానుంది డిసెంబర్ 2024 కల్లా ఈ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటిదాకా దేశంలో 35 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉండగా.. 30 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు వాడుకలో ఉన్నాయి. నేవీ ముంబై ఎయిర్‌పోర్టుతో కలిసి కొత్తగా మరో 14 అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇదీ చదవండి: గాడ్సే భరతమాత ముద్దు బిడ్డ! -
నవీ ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి పూజా
ముంబై: నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి అర్చకులు భూమి పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. తిరుమల తరహలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయాని నిర్మించడానికి టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ నిర్మాణంతో నవీ ముంబాయి ఆర్థికంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నామన్నారు. ఆలయానికి సమీపంలోని తీర ప్రాంతం నుంచి నిర్మింస్తున్న అతి పెద్ద బ్రిడ్జితో కోల్హాపూర్ లక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు.. నవీ ముంబైలో నిర్మిస్తున్న ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుందన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ తరహలోనే నవీ ముంబైలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణంపూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. -
మహారాష్ట్రలో విషాదం.. ప్రాణాలు తీసిన అవార్డుల ఫంక్షన్
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రదానోత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖార్‌గఢ్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. తీవ్రమైన ఎండలో గంటల తరబడి కూర్చున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం.. నవీ ముంబయిలో ఆదివారం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించగా.. వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ వేడుక మధ్యాహ్నం 1 గంట వరకూ కొనసాగింది. మైదానం జనంతో కిక్కిరిసిపోగా.. ఈవెంట్‌ను చూసేందుకు ఆడియో, వీడియో సౌకర్యాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ, ఎండ నుంచి రక్షణ కల్పించేలా షెడ్లుగానీ, టెంట్లుగానీ వేయలేదు. ఈ క్రమంలో మండుటెండలో గంటల కొద్దీ కూర్చువడంతో సొమ్మసిల్లిపోయారు. ఇక, వీఐపీలు కూర్చునే వేదిక వరకూ మాత్రమే టెంట్లు, షెడ్లు వేశారు. దీంతో, మిగిలిన వారు వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 600 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన విషయం తెలియడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నవీ ముంబైకి చేరుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, వడదెబ్బ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ అలియాస్ అప్పాసాహెబ్ ధర్మాధికారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ తదితరులు హాజరయ్యారు. -
రెండేళ్లలో 25 డేటా సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కంట్రోల్–ఎస్ 2025 మార్చి నాటికి కేంద్రాల సంఖ్యను 25కు చేరుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఖాతాలో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 డేటా సెంటర్లు ఉన్నాయి. రెండేళ్లలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం తోడవనుంది. ప్రస్తుతం నవీ ముంబైలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ డేటా సెంటర్ పార్క్ నిర్మాణంలో ఉంది. ఇదే స్థాయిలో హైదరాబాద్ కేంద్రం నిర్మాణానికి సిద్ధంగా ఉందని కంట్రోల్–ఎస్ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చెన్నై డేటా సెంటర్ పనులు మొదలయ్యాయి. ఈ మూడు కేంద్రాల చేరికతో 600 మెగావాట్ల సామర్థ్యం సంస్థకు జతకూడనుంది. కోల్‌కతలో సైతం ఫెసిలిటీ ఏర్పాటు కానుంది. రేటెడ్–4 డేటా సెంటర్ల నిర్వహణలో కంట్రోల్–ఎస్ ఆసియాలో తొలిస్థానంలో ఉంది. -
ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాటు ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో..
ముంబై: రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రాపర్టీ డిమాండ్ బట్టి కోట్లు సంపాదిస్తారు, ఒక్కో సారి కొనేవాళ్లు లేక అదే స్థాయిలో నష్టపోతూ ఉంటారు.అయితే ఇటీవల ప్రజలు సొంత ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై ఆసక్తి చూపడంతో రియల్టర్ల పంట పండుతోంది. తాజాగా నేవీ ముంబైలోని ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో అవి ఒక్క సారిగా ప్రారంభ ధర కంటే 5 రేటు పెరిగి అందరనీ ఆశ్చరపరిచింది. బాబోయ్.. ప్లాటు ధరలకు రెక్కలు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నవీ ముంబైలోని ఓ ప్రాంతానికి సంబంధించిన 28 ప్లాట్లను బ్లాక్‌లో ఉంచింది. అయితే ఊహించని విధంగా ఆ ప్లాటు ఒక చదరపు మీటరుకు రూ. 5.54 లక్షలు వసూలు చేసింది. ఇ-వేలం ఈ ఇరవై ఎనిమిది ప్లాట్లు గాను సిడ్కో దాదాపు రూ.1,365 కోట్లను ఆర్జించనుంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించగా ప్రస్తుతం రయ్ అంటూ దూసుకుపోయి ఐదు రెట్లు ఎక్కువగా పలుకుతోంది. సెక్టార్ 20, పామ్ బీచ్ రోడ్, సన్పాద వద్ద ఉన్న సుమారు 1.3 ఎకరాల ప్లాట్ (5,526 చదరపు మీ) రూ. 306 కోట్లు బిడ్‌ను దక్కించుకుంది. ఈ బిడ్‌ను గెలుచుకున్న బిల్డర్ డీపీవీజి వెంచర్స్‌కి చెందిన యజమానులు మాట్లాడుతూ.. పామ్ బీచ్ రోడ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రధాన ప్లాట్లలో ఇది చివరిది. అందుకే ఇది రికార్డు ధర పలికిందన్నారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
ఫోన్‌పే రూ.1,661 కోట్ల పెట్టుబడి
ముంబై: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే డేటా సెంటర్ల నిర్మాణానికి రూ.1,661 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.1,246 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసింది. తాజాగా నవీ ముంబైలో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. సమాచారాన్ని విదేశాల్లో కాకుండా దేశీయంగా భద్రపరచాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో 3 డేటా సెంటర్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తున్నట్టు ఫోన్‌పే కో–ఫౌండర్ రాహుల్ చారి వెల్లడించారు. గరిష్టంగా సెకనుకు 7,000 లావాదేవీలు జరుగుతున్నాయ న్నారు. డిసెంబర్ నాటికి లావాదేవీల సంఖ్య రోజుకు 20 కోట్ల స్థాయికి చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. -
FIFA 2022: భారత్‌లో అమ్మాయిల ‘కిక్’స్టార్ట్
భువనేశ్వర్: ‘ఫిఫా’ అమ్మాయిల అండర్–17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. 16 జట్ల మధ్య ఈనెల 30 వరకు జరిగే ఈ టోర్నీని భువనేశ్వర్, గోవా, నవీ ముంబైలలో నిర్వహిస్తారు. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్‌తో మొరాకో తలపడనుండగా, మరో మ్యాచ్‌లో 2008 రన్నరప్ అమెరికాతో భారత్ ఎదుర్కోనుంది. ఈ వయో విభాగంలో జరుగుతున్న ఏడో ప్రపంచకప్ లో భారత్ ఆడటం ఇదే మొదటిసారి. ఆతిథ్య హోదాతో బెర్త్ లభించగా మిగతా జట్లు ఆరు కాన్ఫెడరేషన్ల టోర్నీలతో అర్హత సాధించాయి. ఆసియా నుంచి భారత్‌తో పాటు చైనా, జపాన్... ఆఫ్రికా కాన్ఫెడరేషన్ నుంచి మొరాకో, నైజీరియా, టాంజానియా... సెంట్రల్, ఉత్తర అమెరికా, కరీబియన్ల నుంచి కెనడా, మెక్సికో, అమెరికా, దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఓసియానియా నుంచి న్యూజిలాండ్, యూరోప్ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌కు ప్రతీ మ్యాచ్ అగ్నిపరీక్షే! అమెరికా, బ్రెజిల్, మొరాకోలతో క్లిష్టమైన పోటీలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ దశ దాటడం అసాధ్యమే! అద్భుతాలకు ఏ మాత్రం చోటులేదు. ‘బి’ గ్రూపులో జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్.. ‘సి’లో స్పెయిన్, కొలంబియా, మెక్సికో, చైనా.. ‘డి’లో జపాన్, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్ ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఈ నెల 30న ఫైనల్ జరుగుతుంది. -
ముంబై, గుజరాత్ తీరాల్లో రూ.852 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై/అహ్మదాబాద్: వేర్వేరు తీరప్రాంతాల్లో రూ.852 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. మహారాష్ట్రలోని నవీ ముంబై పొరుగున ఉండే నహావా షెవా నౌకాశ్రయంలో ఆపిల్ పండ్ల కంటైనర్‌లో యాభై కేజీల అత్యంత నాణ్యమైన కొకైన్ మాదకద్రవ్యాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇటుకల్లా ఒక్కోటి కేజీ బరువుండేలా ప్యాక్చేసిన డ్రగ్స్‌ను గ్రీన్ ఆపిల్స్ మధ్యలో అధికారులు కనుగొన్నారు. సముద్రమార్గ కంటైనర్లలో ఇంతటి భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి స్మగ్లర్లు భారత్‌కు తరలించారు. మొత్తంగా 50.23 కేజీల బరువున్న ఈ డ్రగ్స్ అంతర్జాతీయ విపణిలో ఏకంగా రూ.502 కోట్ల ధర పలుకుతాయని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. వశీలో ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బత్తాయి పండ్ల మాటున 198 కేజీల మెథ్, 9 కేజీల కొకైన్‌ను కంటైనర్‌లో తెప్పించిన దిగుమతిదారు వీటినీ తెప్పించాడు. గత వారం నమోదైన కేసులో ఇప్పటికే ఇతడిని పోలీసులు అరెస్ట్చేయడం తెల్సిందే. గుజరాత్లో మరో 50 కేజీలు పాకిస్తాన్ నుంచి వస్తూ గుజరాత్ తీరానికి దూరంగా సముద్రజలాల్లో అడ్డగించిన ఒక పడవలో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం, ఉగ్ర వ్యతిరేక దళాలు స్వాధీనంచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వేళ ఈ ఆపరేషన్ నిర్వహించారు. అల్ సకర్ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్తానీయులను అరెస్ట్‌చేసి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరభారతం, పంజాబ్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే పాకిస్తాన్ డ్రగ్ మాఫియా ఈ సరకును పంపించాడని తెలుస్తోంది. -
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022: వరుసగా ఆరోసారి తొలిస్థానంలో ‘ఇండోర్’
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుజరాత్‌లోని సూరత్ నగరం తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని నావి ముంబై మూడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో ఉంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు నిలిచాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్, సూరత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. 100లోపు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. ► ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గాని నగరం తొలి స్థానం సాధించింది. ఆ తర్వాత పటాన్(ఛత్తీస్‌గఢ్), కర్హాద్(మహారాష్ట్ర)లు ఉన్నాయి. ► లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్‌లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్కు ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత కన్నౌజ్, గర్‌ముఖ్తేశ్వర్ నగరాలు నిలిచాయి. ► మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘పోక్సో’ కేసులో సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. 17మంది మహిళలకు..
ముంబై: ఉపాధి కల్పిస్తామని ఆశజూపి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టి వారితో డబ్బులు సంపాదిస్తున్న ముఠా గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. గురు వారం ముంబై మీడియాకు పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటికి పనిమనుషులు కావాలన్న ప్రకటనలతో వివిధ రాష్ట్రాలనుంచి మహిళలను రప్పించి వారిని ముంబైలోని ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. అవసరమైన విటులకు ఈ మహిళలను హోటళ్లకు, ప్రైవేట్‌రూమ్‌లకు పంపించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4న రాజు, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులు తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారంటూ ఓ మహిళ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ)ను ఆశ్ర యించడంతో దాన్ని ఫిర్యాదుగా స్వీకరించిన ఈ బృందం రంగంలోకి దిగింది. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నెరుల్ ప్రాంతంలోని శిరవాణే గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 మంది మహిళలను ఏహెచ్‌టీయూ బృందం కాపాడింది. వీరికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (సమాజం తప్పుగా భావించింది.. మాది అన్నా చెల్లి బంధం) -
Maharashtra: శివసేనకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పార్టీకి నవీముంబైలో మరో గట్టి దెబ్బ ఎదురైంది. థానే మున్సిపల్ కార్పొరేషన్ అనంతరం నవీ ముంబై కార్పొరేషన్‌కు చెందిన 32 మంది మాజీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిసి తమ మద్దతును ప్రకటించారు. దీంతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేనకు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి కొంతకాలం ముందు శివసేన పార్టీ నవీ ముంబైలో తన బలం పెంచుకోవడానికి ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకునేందుకు మిషన్ కార్పొరేషన్ ఉద్యమాన్ని చేపట్టింది. ఏక్నాథ్ షిండే ఆ ఉద్యమానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. కానీ రాజకీయంగా పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో ఏక్నాథ్ షిండే స్వయంగా శివసేన పార్టీలో తిరుగుబాటు జరిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దాంతో శివసేన పార్టీ ఖంగుతినడమే కాకుండా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడిపోయింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనుకలిసిన వారిలో మాజీ ప్రతిపక్షనాయకుడు విజయ్ చౌగులే, శివరమ్ పాటిల్తోసహా 32 మంది ఉన్నారు. తామంతా శివసేన పార్టలోనే ఉంటూ ముఖ్యమంత్రి మార్గదర్శనంలో పనిచేస్తామని వారంతా వముక్తకంఠంతో ప్రకటించారు. చదవండి: అప్పుడు మీరంతా ఎక్కడున్నారు.. రెబల్స్‌కు థాక్రే సవాల్ శివసేన ఉపనాయకుడు వాజయ్ నాహటా కూడా తాను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. శిండే కూటమిలో మాజీ నగరసేవకుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా ఐరోలి, బేలాపూర్ జిల్లా ప్రముఖులు, ఐరోలి మాజీ కార్పొరేటర్ ఎమ్కే మాడ్వి, సాన్పాడాకు చెందిన సోమవనాత్ వాస్కర్లాంటి వాళ్లు ఉద్ధవ్ ఠాక్రే వెంటే ఉంటారని సమాచారం. -
పర్యావరణం.. పక్షికి పండగ దూరం చేయవద్దు!
ఆమె రాగానే అప్పటివరకు గోలగోలగా ఉన్న హాలు సద్దుమణిగింది. ‘అందరూ వచ్చినట్లే కదా!’ అని ఆత్మీయంగా అడిగింది సీమ. ‘ఏమిటో మేడమ్ సెలవ రోజుల్లో ఈ క్లాసు...’ అని ఆవులించాడు ఒక కాలేజి విద్యార్థి. కొన్ని నవ్వులు వినిపించాయి. ‘ఇవి చూడండి’ అంటూ ఆమె కొన్ని చిత్రాలు చూపించింది. నీలాకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్న చిత్రాలు, ఆబాలగోపాలం ఆనందంతో పతంగులు ఎగరేస్తున్న చిత్రాలు, ‘కీంచ్...కాట్’ అంటూ వేరేవాళ్ల గాలిపటాలను ఆకాశంలో కట్ చేస్తున్న చిత్రాలు, తెగిపడిన గాలిపటాల వెంట అరుపులతో పరుగులు తీస్తున్న పిల్లలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘ఈ చిత్రాలు కూడా చూడండి’ అంటూ మరికొన్ని చిత్రాలు చూపించింది. రెక్కలు తెగిన పక్షుల చిత్రాలు. మెడ తెగి నేలరాలి బాధతో కొట్టుకుంటున్న పక్షుల చిత్రాలు. కరెంటు తీగలకు, చెట్ల కొమ్మలకు అల్లుకున్న దారాల్లో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోతున్న పక్షుల చిత్రాలు... హృదయాన్ని మెలిపెట్టే చిత్రాలు ఇవి. ‘సంతోషం ముఖ్యమే కాని, మన సంతోషం పక్షుల చావుకు కారణం కావద్దు కదా!’ అన్నది సీమ. కొద్దిసేపు ఆ హాల్లో నిశ్శబ్దం. ‘గాలిపటాలు ఎగిరేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మన చేతివేళ్లు కోసుకుపోతాయి. ఆ కాస్త దానికే తల్లడిల్లిపోయి హాస్పిటల్‌కు పరుగెత్తుతాం. కాని పక్షులు మాత్రం మన గాలిపటాల వల్ల తీవ్రగాయాలపాలై చనిపోతున్నాయి. మనం హాస్పిటల్‌కు పరుగెత్తినట్లు అవి పరుగెత్తలేవు కదా!’ అని సీమ అన్నప్పుడు ఎంతటి హృదయాలైనా కరిగిపోవాల్సిందే. నవీ ముంబైకి చెందిన సీమా టాంక్ జంతు ప్రేమికురాలు. పండగరోజుల్లో గాలిపటాలు పక్షుల పాలిట మృత్యుపాశాలుగా మారకుండా ఉండడానికి ఆమె అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటుంది. మొదట్లో ఈ సదస్సుకు రావడానికి ఇష్టపడని వారు కూడా ఆ తర్వాత నిజం గ్రహించి మార్పు దిశగా పయనించడం ఆమెకు సంతోషం ఇస్తోంది. సీమ మాటలతో ప్రభావితమైనవారు ‘పక్షులకు పండగ దూరం చేయవద్దు ప్లీజ్’ ‘మన సంతోషానికి పక్షులు మూల్యం చెల్లించుకోవాలా?’ ‘ఆకాశంలో గాలిపటం ఎగరేసేముందు, అదే ఆకాశంలో ఎగురుతున్న పక్షి వైపు కూడా చూడు’... లాంటి పోస్ట్‌లు సామాజికవేదికల్లో పెడుతుంటారు. సీమలాంటి వ్యక్తులే కాదు ‘ప్లాంట్స్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’లాంటి సంస్థలు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఫేస్బుక్ వేదికగా హెల్ప్‌లైన్ నంబర్స్, రెస్క్యూ టిప్స్ షేర్ చేస్తున్నాయి. ‘సేవ్ బర్డ్స్’ అనేది యానిమల్ లవర్స్, యాక్టివిస్ట్‌ల నినాదం మాత్రమే కాదు, అది అందరి కనీస బాధ్యత అనే ఎరుక మనకు కలిగితే చాలు... పండగ సంతోషం మనతోపాటు పక్షులకూ దక్కుతుంది. -
శృంగారానికి ఒప్పుకోలేదని స్నేహితుడి తల పగలకొట్టి చంపాడు
ముంబై: ఇటీవల చెరకు రసం ఇప్పిస్తానంటూ ఒక యువకుడిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తరహా ఘటనే మరొకటి వెలుగుచూసింది. కాకపోతే ఈ సారి అందుకు ఒప్పుకోలేదని బెస్ట్‌ఫ్రెండ్ తల బద్దలు కొట్టి చంపేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ముంబై నగరంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీముంబైలోని కరావే ప్రాంతంలో బాధితుడు రూపేష్ అలియాస్ రూపసింగ్ (30) అక్టోబర్ 22న ఆగి ఉన్న బస్సు వెనుక సీటులో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అతని స్నేహితుడు మస్కే మీద అనుమానం రావడంతో పోలీసులు అతన్ని విచారించేసరికి జరిగినదంతా బయటపెట్టాడు. అక్టోబర్ 22 రాత్రి పూట తామిద్దం ఒక సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న బస్సులో కలిశామని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉండడంతో తనతో శృంగారం చేయాలన్న తన కోరికను రూప్‌సింగ్‌కు తెలపగా అందుకు రూపేష్ అంగీకరించలేదని మస్కే వెల్లడించాడు. దీంతో తనకు కోపం వచ్చి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ టైల్స్ తీసుకొని రూపేష్ తలపగలగొట్టడంతో మరణించినట్లు నిందితుడు చెప్పాడు. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! -
80 ఏళ్ల వృద్ధుడి హత్య: ‘రూ.10 వేలు ఇస్తా.. నీ భార్యను పంపు’
ముంబై: 80 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అన్ని రోజుల మంచివాడిగా కనిపించిన ఆ వృద్ధుడి వికృత ఆలోచనలు తెలిసిన తర్వాత నిందితుడు కుదురుగా ఉండలేకపోయాడు. వృద్ధుడు తన భార్య గురించే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో వృద్ధుడిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుట్టుగా మాయం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్‌తో పోలీసులకు చిక్కాడు. గత నెలలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. షమాకాంత్ తుకరామ్ నాయక్(80) అనే వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు అతడి సొంతం. ఉల్వే ప్రాంతంలో అతడికి చాలా ఆస్తులు, ప్లాట్లు, భూములు ఉన్నాయి. ఈ క్రమంలో నాయక్‌కు నవీ ముంబై ప్రాంతంలో ఉండే నిందితుడితో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆ ప్రాంతలో చిన్న దుకాణం నడుపుతూ ఉండేవాడు. (చదవండి: గోల్డ్ వడపావ్‌ను చూశారా? ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!) ఈ క్రమంలో నాయక్ ప్రతిరోజు నిందితుడి షాప్ దగ్గరకు వెళ్లి.. పలకరిస్తూ ఉండేవాడు. పెద్ద వయసు వ్యక్తి కావడం.. ప్రతి రోజు షాప్ దగ్గరకు వచ్చి పలకరిస్తుండటంతో నిందితుడు.. నాయక్‌ని మంచివాడిగా భావించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత నాయక్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. 80 ఏళ్ల వయసులో కూడా కామంతో కళ్లు మూసుకుపోయి.. నిందితుడి భార్య మీద కన్నేశాడు. (చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్ ఆవేదన) అంతటితో ఆగక ఏకంగా తన వికృత ఆలోచన గురించి ఏకంగా నిందితుడితోనే చెప్పాడు నాయక్. ఈ క్రమంలో ఆగస్టు 29న నాయక్ నిందితుడి షాప్ వద్దకు వచ్చాడు. పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత ఉన్నట్లుండి నాయక్ ‘‘నీకు పది వేలు ఇస్తాను.. నీ భార్యను నా గోడౌన్‌కు పంపు.. నాకు ఆమెతో గడపాలని ఉంది’’ అని నిందితుడిని కోరాడు. అన్ని రోజులు ఎంతో మంచివాడిగా భావించిన వ్యక్తి ఇంత నిచంగా మాట్లాడేసరికి నిందితుడు తట్టుకోలేకపోయాడు. నాయక్‌ను తోసేశాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్రంగా గాయలయ్యాయి. ఆ తర్వాత షాప్ షట్టర్ క్లోజ్ చేసి.. నాయక్‌ని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత వృద్ధుడి మృతదేహాన్ని బాత్రూమ్లో ఉంచాడు. ఆగస్టు 31 వరకు నాయక్ మృతదేహాన్ని బాత్రూంలోనే దాచాడు నిందితుడు. దుర్వాసన వచ్చి దొరికిపోతాననే భయంతో ఆగస్టు 31న నాయక్ మృతదేహాన్ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి.. బైక్ మీద తీసుకెళ్లి ఓ కాల్వలో పడేశాడు. అయితే ఈ తతంగం అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. అయితే అప్పటికే నాయక్ కుటుంబ సభ్యులు.. అతడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నిందితుడు నాయక్ కుమారుడితో కలిసి వెళ్లి.. అతడు తప్పిపోయినట్లు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: వైరల్: ఇంట్లోకి దూరిన ‘దెయ్యం నీడ’.. సీసీటీవీలో రికార్డు) అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 29న ఏం జరిగిందని ఆరా తీయగా.. నాయక్ చివరి సారిగా నిందితుడి షాప్ దగ్గరే కనిపించాడని.. ఆ తర్వాత మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడి షాప్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నాయక్‌ని చంపడానికి గల కారణలు వెల్లడించాడు. అతడిని హత్య చేసిన తర్వాత నాయక్ దుస్తులను, మొబైల్‌ని స్విచ్ఛాఫ్ చేసి పడేసినట్లు తెలిపాడు. చదవండి: కౌన్ బనేగా కరోడ్‌పతి.. చిక్కుల్లో ప్రభుత్వ ఉద్యోగి.. -
హెచ్ఐవీ దాచి పెళ్లి.. ఆపై భార్యతో..
ముంబై : తనకు వచ్చిన రోగాన్ని దాచి తనతో పాటు తన భార్య జీవితాన్ని నాశనం చేశాడు ఓ దుర్మార్గపు భర్త. తనకు హెచ్ఐవీ సోకిందన్న నిజాన్ని దాచి.. ఆమె నూరేళ్ల జీవితంతో ఆడుకున్నాడు. చివరకు నిజం తెలుసుకొని నిలదీసిన భార్యపై నిందలు మోపారు. కోడలు వల్లనే తమ కుమారుడికి ఈ పాడురోగం సోకిందంటూ అత్త, మామలు దొంగ ఏడుపులు ఏడ్చారు. తమ కుమారుడిని వెనుకేసుకొస్తూ నిజాన్ని కప్పిపుచ్చారు. చివరికి కోర్టు ఆదేశాల మేరకు అతనిపై కేసు నమోదు అయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని నవీ ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. థానే జిల్లాలోని డోంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(31) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కామోథేకు చెందిన ఓ యువతి(26)ని 2016లో వివాహం చేసుకున్నాడు. కాగా, అంతకు ముందే అతనికి హెచ్ఐవీ సోకింది. ఈ విషయం అతని కుటుంబీకులకు కూడా తెలుసు. ఈ దారుణ విషయాన్ని కప్పిపుచ్చి వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అతని ఇంటికి వచ్చిన ఓ బంధువు.. మందులు వాడుతున్నావా అని అడగడంతో అతని భార్యకు అనుమానం కలిగింది. మందులు ఎందుకు... ? ఏమైందని అని అడుగగా.. దాటవేసే ప్రయత్నం చేశారు. అత్తమామలను నిలదీయగా క్షయ వ్యాది సోకిందని, మందులు వాడితే తగ్గిపోతుందని నచ్చజెప్పారు. ఓ రోజు భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన యువతి.. డాక్టర్ల ద్వారా అతనికి హెచ్ఐవీ సోకిందని తెలుసుకుంది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి.. వారితో కలిసి మరో ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించగా.. హెచ్ఐవీ పాజిటీవ్‌గా తేలింది. ఈ విషయంపై అత్తమామలను నిలదీయగా.. తిరిగి ఆమెపైనే నిందలు వేశారు. ‘ నీ వల్లనే మా కుమారుడికి హెచ్ఐవీ సోకింది’ అంటూ తిరిగి ఆమెనే నిందించారు. దీంతో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు యువతి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యం
ముంబై : మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ 24 ఏళ్ల యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నావి ముంబై నగరంలో గత ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా నేడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నావి ముంబైలోని తలోజా ఏరియాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి గత ఆదివారం ఆడుకోవడానికై బయటకు వెళ్లింది. అక్కడే ఉన్న అశోక్ కుమార్ యాదవ్(24) అనే దినసరి కూలి ఆ చిన్నారిపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడాడ్డడు. చిన్నారి ప్రైవేట్ భాగాలలో గాయలను చూసిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదు మేరకు అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఓఎన్జీసీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, ముంబై: నవీ ముంబైలోని ఉరాన్ ఓఎన్జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం ఐదుగురు మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. చుట్టుప్రక్కల ప్రాంతాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. 50 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ‘స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పైప్ నుంచి మంటలు అంటుకున్నాయి. ఓఎన్జీసీ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగం వెంటనే స్పందించి అప్రమత్తమైంది. మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో ఆయిల్ ప్రాసెసింగ్‌పై ప్రభావం పడలేదు. గ్యాస్‌ను గుజరాత్‌లోని హజిరా ప్లాంట్‌కు తరలిస్తున్నాం. పరిస్థితిని అంచనా వేస్తున్నామ’ని ఓఎన్జీసీ ట్వీట్ చేశారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. -
‘నవీ ముంబై, థానే, పూణె పేర్లు మార్చండి’
ముంబై: మహారాష్ట్రలోని పలు నగరాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. శివసేన చాలా కాలం నుంచి జౌరంగబాద్ నగరం పేరును శంభాజీనగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ కూడా రాష్ట్రంలోని పలు నగరాల పేర్లు మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీలో ఆజ్మీ మాట్లాడుతూ.. నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనను సభ ముందు ఉంచారు. అదేవిధంగా ఈ ప్రతిపాదనల వెనుక బీజేపీకిలాగా ఎలాంటి రహస్య ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్ల మార్పు ఎవరి మత విశ్వాసాలను దెబ్బతినకుండా ఉండాలని అన్నారు. అందుకే నవీ ముంబై పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్ నగర్‌గా, థానే పేరును జిజామాతా నగర్‌గా, పూణె పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా మార్చాలని కోరారు. మరోవైపు జౌరంగబాద్ పేరు మార్పుపై శివసేన ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పేరుతో దానికి ఆ పేరు వచ్చిందని తెలిపారు. బీజేపీ నేతలు ఒకవేళ మతం పేరుతో నగరాల పేరును మార్పు చేస్తున్నట్టయితే.. వారి పార్టీలోని నాయకుల పేర్లు కూడా మార్చాలని అన్నారు. ఆ క్రమంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును ముఖేశ్ చంద్రగా, షాహనవాజ్ హుస్సేన్ పేరును శంకర్ మహాదేవన్‌గా మార్చాలని ఎద్దేవా చేశారు. కాగా, ఆజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్ర గురించి ఆజ్మీకి తెలియదని విమర్శించారు. సోదరులను చంపి, సంగీతంపై నిషేధం విధించిన క్రూరమైన పాలకుడు జౌరంగజేబు.. అటువంటి వ్యక్తిని ఆజ్మీ కీర్తిస్తున్నాడని మండిపడ్డారు. తాము జౌరంగబాద్ పేరు శంభాజీనగర్‌గా మార్చాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. -
రైల్వే స్టేషన్లో బలవంతంగా..
-
రైల్వే స్టేషన్లో బలవంతంగా ముద్దుపెట్టాడు
సాక్షి, ముంబై : మహిళలు అప్రమత్తంగా ఉంటున్నా మృగాలు రెచ్చిపోతున్నాయి. ముంబై పోలీసులు గస్తీ కాస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. తాజాగా మరో యువతి వేధింపులకు గురైంది. నవీ ముంబైలోని టర్బే రైల్వే స్టేషన్ లో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఓ యువతి వెనకాలే వెళ్లిన ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా ముద్దు పెట్టేశాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యింది. ఆ వ్యక్తి తనను స్టేషన్ బయటి నుంచే వెంబడించాడని యువతి చెబుతోంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు కాసేపటికే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు నరేష్ కే జోషి(43)గా తేలింది. కాగా, ఘటన జరిగిన సమయంలో అక్కడే కొందరు ఉన్నప్పటికీ తమకేం పట్టనట్లు ఉండటం గమనార్హం. -
ముంబైకి రెండో విమానాశ్రయం
నవీ ముంబై/ సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. అలాగే దేశంలోనే అతి పెద్ద నౌకాశ్రయమైన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ)లోని నాలుగో టర్మినల్లో మొదటి దశను మోదీ ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ప్రస్తు తం దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన (ఒకటే రన్‌వే ఉన్న వాటిలో) ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఈ కొత్త విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేనున్నారు. నవీ ముంబైలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన 1997 నుంచి ఉండగా శంకుస్థాపన చేసేందుకు 21 ఏళ్లు పట్టడం గమనార్హం. రూ.16,700 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టును జీవీకే గ్రూప్, సిడ్కో (ముంబై నగర పారిశ్రామికాభివృద్ధి సంస్థ) కలసి నిర్మించనున్నాయి. 2019 చివరి నాటికి తొలిదశ పూర్తయి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని సిడ్కో చెబుతున్నప్పటికీ, కనీసం ఐదేళ్లు పడుతుందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అనడం గమనార్హం. మొత్తం నాలుగు దశల్లో 2031 నాటికి విమానాశ్రయ నిర్మాణం పూర్తికానుంది. వృద్ధి అవకాశాలను గుర్తించనే లేదు.. విమానాశ్రయానికి శంకుస్థాపన సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో విమానయన రంగం రోజురోజుకూ వృద్ధి చెందుతున్నా, అందుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. విమానయాన రంగంలో వృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలను గత ప్రభుత్వం గుర్తించలేదనీ, తాము ఆ పని చేసి ఇందుకోసం కొత్త విధానాన్ని సైతం తీసుకొచ్చామని మోదీ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 450 విమానాలు అందుబాటులో ఉండగా, గత ఏడాది కాలంలోనే 900 కొత్త విమానాలకు కంపెనీలు ఆర్డర్లు ఇవ్వడమే ఈ రంగంలో ప్రగతికి నిదర్శనమన్నారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, జీవీకే గ్రూప్ చైర్మన్ వెంకట కృష్ణా రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే మనోహర్ భోయిర్ నిరసనకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. 50 శాతం పెరిగిన పోర్టు సామర్థ్యం జేఎన్‌పీటీలో నాలుగో టర్మినల్ మొదటి దశ ప్రారంభమవడంతో నౌకాశ్రయం సామర్థ్యం 50 శాతం పెరిగింది. ఇప్పటివరకు జేఎన్‌పీటీకి 4.8 మిలియన్ల కంటెయినర్లను నిర్వహించే సామర్థ్యం ఉండగా తాజాగా ఆ సంఖ్య 7.2 మిలియన్ కంటెయినర్లకు చేరింది. మా బడ్జెట్ ఫలితాలనూ సాధిస్తుంది.. ‘మా బడ్జెట్ కేవలం ఖర్చు పెట్టడమే కాకుండా ఫలితాలను రాబట్టడంపైనా దృష్టి పెట్టింది. మేం తీసుకొచ్చిన సంస్కరణలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి’ అని మోదీ అన్నారు. ముంబైలోని బాంద్రాలో ‘మ్యాగ్నటిక్ మహారాష్ట్ర’ ప్రపంచ పెట్టు్టబడిదారుల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర దేశంలోనే మొదటి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. -
సంచలనం.. ఒక్కడే 1045 పరుగులు బాదాడు!
ముంబై : క్రికెట్ చరిత్రలోనే సంచలన రికార్డు నమోదైంది. ముంబైలో జరిగిన ఓ లోకల్ టోర్నమెంట్లో తనీష్క్గవటే అనే14 ఏళ్ల కుర్రాడు ఏకంగా 1045 పరుగులు బాదాడు. రెండు రోజుల బ్యాటింగ్ చేసిన ఈ ముంబై ఆటగాడు 149 ఫోర్లు, 67 సిక్సులతో ఈ ఘనత సాధించాడు. నవీ ముంబై, కోపర్ఖైర్నేలోని యశ్వంతరావు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన స్థానిక టోర్నమెంట్ సెమీస్ మ్యాచ్‌లో గవటే ఈ పరుగులు చేశాడు. అయితే ఆఫ్‌సైడ్, లెగ్‌సైడ్ బౌండరీ దగ్గరగా ఉండటంతో ఇన్ని పరుగులొచ్చాయని కోచ్ మనీష్ తెలిపాడు. మరోవైపు ఈ టోర్నీకి ముంబై క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు లేదని అధికారులు స్పష్టం చేశారు. -
వేధింపులు తాళలేక.. సైంటిఫిక్ ఆఫీసర్ అదృశ్యం
ముంబై : బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (బార్క్)లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బబితా సింగ్ అనే 30 ఏళ్ల యువతి ఆచూకీ లభించడం లేదు. పని చేసే చోట వేధింపులపై తల్లిదండ్రులతో చర్చించిన కొన్ని రోజుల్లోనే ఇంట్లోనుంచి వెళ్లిన బబితా సింగ్ కనిపించకుండా పోయింది. నవీ ముంబైలోని నీరుల్లో నివాసముంటున్న అధికారిణి జనవరి 23 నుంచి కనిపించకుండా పోయిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం చివరిసారిగా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలిపారు. దీంతో బబితా సింగ్ కోసం వెతకగా ఆచూకీ లభించకపోవడంతో ఆ మరుసటి రోజు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. బార్క్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆమె తన తల్లిదండ్రులకు ఈ మెయిల్ చేసినట్టు సమాచారం. అయితే మెయిల్లో పేర్కొన్న వివరాలను పోలీసులు వెల్లడిచలేదు. మహిళ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
పాప ఏడుస్తోందని.. నేలకేసి కొట్టింది!
-
సైనికులను పరుగులు పెట్టించిన బాలిక
న్యూఢిల్లీ: భద్రతా సిబ్బందిని 12 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించింది. నవీ ముంబైలోని ఉరాన్ నౌకాశ్రయం సమీపంలో అనుమానిత వ్యక్తులను చూశానని చెప్పి హడావుడి చేయడంతో భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. కశ్మీర్ లో ఉడీ ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం అందడంతో నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్ఎజీ, మహారాష్ట్ర ఏటీఎస్ బలగాలు అణువణువుగా జల్లెడ పట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా బాలిక చేసిన ఆకతాయి పనిగా గుర్తించి ఆమెను మందలించారు. సరదా కోసమే అలా చెప్పానని బాలిక తెలిపింది. మొదటి తప్పుగా భావించి బాలికను పోలీసులు మందలించి వదిలేశారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. సున్నితమైన విషయాల్లో తప్పుదోవ పట్టించేవిధంగా వ్యవహరించడం వల్లే తలెత్తె పరిణామాలను వివరించారు. భవిష్యత్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. సున్నితమైన విషయాల్లో ఆకతాయిగా వ్యవహరించడం మంచిది కాదని భద్రతాదళ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పనుల వల్ల ఆందోళన రేగడంతో పాటు రక్షణ బలగాల వనరులు, సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు. -
ఖతర్నాక్ చోరీ.. క్యాష్ కౌంటర్ ఖాళీ
ముంబై: ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ముగ్గురు మహిళలు హోటల్ కు వచ్చారు. కాపాలదారుల కన్నుగప్పి క్యాష్ కౌంటర్ నుంచి నగదు నొక్కేసారు. అక్కడున్న వారిని బురిడీ కొట్టించినా కెమెరాకు చిక్కి పోలీసులకు దొరికిపోయారు. నవీముంబైలో గతవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలను తీసుకుని ముగ్గురు మహిళలు వచ్చారు. క్యాష్ కౌంటర్ వద్ద నిలబడి హోటల్ వారితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ నీలం రంగు దుప్పటాలను అడ్డుగా ఉంచారు. క్యాష్ కౌంటర్ కనబడకుండా కవర్ చేశారు. వారి వెనుక ఉన్న చిన్నపాప క్యాష్ కౌంటర్ నుంచి డబ్బు దొంగిలించింది. లాక్ వేసివున్నా తాళం వెతికి మరీ నగదు కాజేసింది. వారు వెళ్లిపోయిన తర్వాత దొంగతనం జరిగినట్టు గుర్తించిన నిర్వాహకులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా అందులోని దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. చిన్నపాప దొంగతనం చేయడం చూసి కంగుతిన్నారు. రూ. 20,500 చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని హోటల్ మేనేజర్ ప్రియాంక తెలిపారు. ఇదే తరహాలో నవీ ముంబైలో నాలుగు దుకాణాల్లో చోరీలు జరిగినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీని ఆధారంగా సివారి రైల్వేస్టేషన్ బయట ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకామె పరారీలో ఉంది. ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకుని జువనైల్ హోమ్ కు తరలించారు. -
300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లాడు
ముంబయి: నవీ ముంబయిలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. అచ్చం సినిమాలో చూసినట్లుగా సీసీటీవీ కెమెరాల్లో ఓ దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ కారు డ్రైవర్ అతడి కారుపై మరో వ్యక్తి వేలాడుతున్నా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా దాదాపు 300 మీటర్లు నడిపాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి అరెస్టయ్యాడు. అసలు విషయానికి వస్తే నవీ ముంబయిలో ఓ కారు డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తితో, బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డాడు. అనంతరం చేయి కూడా చేసుకున్నాడు. ఆ వెంటనే ఆ ప్రాంతం విడిచి పారిపోయేందుకు కారు డ్రైవర్ ప్రయత్నం చేస్తుండగా బస్సు డ్రైవర్ వెళ్లి ఏకంగా కారు ముందు భాగంపై దూకాడు. అయినా, అతడు కారు వేగంతో ముందుకు పోనివ్వడంతో బస్సు డ్రైవర్ కిందపడకుండా కారు వైపర్ సహాయంతో ఆగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చివరకు కారు 300 మీటర్లు దూసుకెళ్లి ఆగింది. కారు నడిపిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. బస్సు డ్రవైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. -
‘మేజిక్’ కోసం ప్రయత్నాలు
- ఎన్ఎంసీ పీఠం రేసులో ముందున్న ఎన్సీపీ - మేజిక్ ఫిగర్ 56కు మరో 4 స్థానాలు అవసరం - కాంగ్రెస్ మద్దతు లేకుండానే అధికారం చేపట్టేందుకు సిద్ధం - ఇంకా రేసులో ఉన్న బీజేపీ-సేన కూటమి సాక్షి,ముంబై: నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అధికార పీఠం దక్కించుకునేందుకు పార్టీలన్నీ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇరు కార్పొరేషన్లలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన-బీజేపీ కూటమి మేజిక్ ఫిగర్‌కు దగ్గరలో ఉన్నాయి. దీంతో స్వతంత్రులు లేదా చిన్న పార్టీల అండతో అధికారం ఏర్పాటు చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. నవీముంబైలో ఉన్న 111 వార్డుల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 56 స్థానాలు దక్కాలి. ఇందులో శివసేన నుంచి 38 మంది, మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఆరుగురు కలిపి మొత్తం 42 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. 52 మంది కార్పొరేటర్ల గెలుపు ద్వారా ఎన్సీపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ అధికారం ఏర్పాటు చేయాలంటే కాషాయ కూటమి కంటే ఎన్సీపీకే ఎక్కువ అవకాశాలున్నాయి. కాగా, తమకు ఐదుగురు కార్పొరేటర్ల మద్దతు ఉందని, కాంగ్సెస్ సాయం అవసరం లేదని ఫలితాల అనంతరం ఎన్సీపీ ప్రకటించింది. శివసేన సీట్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం బీజేపీతో పొత్తు పెట్టుకోవడమేనని విశ్లేకులు చెబుతున్నారు. బీజేపీతో కలిసి పోటీచేస్తున్నట్లు తెలియగానే శివసేనకు చెందిన 41 మంది పార్టీపై తిరుగుబాటు చేశారు. శివసేన పోటీచేస్తున్న వార్డుల్లో వీరు కూడా బరిలో నిలచి ఓట్లు చీలిపోవడానికి కారకులయ్యారు. సేన నుంచి ఇద్దరు, ఎన్సీపీ నుంచి ఒకరు మాత్రమే తిరుబాటు అభ్యర్థులు గెలిచినా.. వీరి కారణంగా ఎన్సీపీనే ఎక్కువ శాతం లాభపడింది. ఒకే కుటుంబంలో గెలుపోటములు.. రాజకీయాల్లో గెలుపు కోసం నాయకులు ఎంతటికైనా తెగిస్తారనేది జగమెరిగిన సత్యం. ఈ విషయం తాజా ఎన్నికల్లో మరోసారి రుజువైంది. అధికారం కోసం రెండు కుటుంబాల మధ్య కలహాలు సృష్టించడానికైనా నేతలు వెనకాడరు. ఒకే కుటుంబ సభ్యులకు వేర్వేరు పార్టీలు టికెటు ఇచ్చి బరిలో నిలిపాయి. నవీముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఏడు జంటలు (భార్యాభర్తలు) వేర్వేరు పార్టీల టికెట్లపై పోటీ చేసి కార్పొరేటర్లయ్యాయి. చౌగులే, మడ్వీ కుటుంబాలకు చెందిన తండ్రీకొడుకులు కార్పొరేటర్లు అయ్యారు. భగత్ అనే వ్యక్తి కుటుంబం నుంచి ముగ్గురు మహిళలు కార్పొరేటర్లుగా గెలిచారు. వార్డు నంబరు 75లో బరిలో దిగిన అభ్యర్థులందరినీ ఓటర్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎవరు కూడా నన్ ఆఫ్ అబౌ (నోటా) నొక్కలేదు. మిగత 100 వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు నోటా నొక్కిగా, 16వ వార్డులో 116 మంది నోటా వినియోగించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చిన తరువాత ఇక్కడ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. లెక్క ప్రకారం చూస్తే నవీముంబైలో 56 మంది మహిళ కార్పొరేటర్లు ఎన్నికవాలి. అయితే ఓపెన్ కేటగిరి నుంచి బరిలో దిగిన కొందరు మహిళల్లో నలుగురు గెలుపొందడంతో మహిళకార్పొరేటర్ల సంఖ్య 60కి చేరింది. పెరిగిన బలాబలాలు.. గతంలో నవీముంబై కార్పొరేషన్లో ఎన్సీపీకి-54, శివసేన-17, కాంగ్రెస్-13, బీజేపీ-1, స్వతంత్రులు-4 గెలిచారు. కాని ఈ ఎన్నికల్లో ఎన్సీపీకి రెండు స్థానాలు తగ్గగా, శివసేనకు ఏకంగా 21 స్థానాలు పెరిగాయి. కాంగ్రెస్‌కు మూడు స్థానాలు తగ్గగా, బీజేపీకి ఐదు స్థానాలు పెరిగాయి. -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రెండుగా ఏర్పడ్డ ఠాణే, పాల్ఘర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పట్టు సంపాదించాలనే లక్ష్యంతో పావులు కదుతుపుతోంది. ఈ నేపథ్యంలో నవీ ముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల బాధ్యతలను ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నవీముంబైపై నారాయణ రాణేకు, ఔరంగాబాద్పై అశోక్ చవాన్‌కు బాధ్యతలు అప్పగించారు. నవీముంబైలో మంచి పట్టున్న ఎన్సీపీ నాయకుడు గణేష్ నాయిక్ పార్టీ మారనున్నట్టు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే అక్కడ ఎన్సీపీ బలం తగ్గుతుందని, ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక మరాఠ్వాడాలో మంచి పట్టున్న అశోక్ చవాన్‌కు ఔరంగాబాద్ ఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ అప్పచెప్పింది. గత లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువును ఆయనే కాపాడారు. మరాఠ్వాడ నుంచి ఆయనతోపాటు మరో కాంగ్రెస్ ఎంపీ మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఔరంగాబాద్‌లో అశోక్ చవాన్ నేతృత్వంలో పార్టీ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఠాణే జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతను బాలాసాహెబ్ థోరాత్, హర్షవర్దన్ పాటిల్‌లకు, పాల్ఘర్ జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతలు రాధాకృష్ణ విఖేపాటిల్కు అప్పగించాలని నిర్ణయించినట్టు ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. కరువు ప్రాంతాల కోసం టోల్‌ఫ్రీ నెంబరు.. కరువు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ 040-71012200 అనే టోల్ ఫ్రీ ఫోన్ నెంబరును ప్రారంభించింది. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగివచ్చి జనవరి 9వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా ఆ రోజున గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మంత్రాలయలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ‘ప్రేరణ ర్యాలీ’ని నిర్వహించనున్నట్టు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. -
నైటీతో బయటికొస్తే.. 500 జరిమానా..!
-
నైటీతో బయటికి వస్తే రూ.500 జరిమానా
ముంబయి: మహిళలు వస్త్రధారణ బాగుంటే అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి అని మగవాళ్ల వాదన. అయితే ఇప్పుడు ఇదే వాదనను ఒక మహిళా మండలి తెస్తోంది. నవీ ముంబైలోని గోఠివలి గ్రామంలో మహిళలు బయటికి వెళ్లేటప్పుడు గౌన్లు (నైటీలు, మ్యాక్సీలు) వేసుకోవడంపై అక్కడి 'ఇంద్రాయణి' మహిళా మండలి నిషేధం విధించింది! అంతేకాదు, గోఠివలి గ్రామ మహిళలు ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో గౌన్లు ధరించి కనిపిస్తే వారి నుంచి రూ.500 జరిమానా వసూలు చేస్తామని కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్కడితో ఆగకుండా ఈ ఆదేశాలను గ్రామ కూడలిలో ఒక పెద్ద బోర్డుపై రాసిపెట్టింది. ఈ విచిత్ర ఆదేశాలతో ఒక్కసారిగా నవీముంబైలోని గోఠివలి గ్రామం వార్తల్లోకి వచ్చింది. అయితే ఇంద్రయాణి మహిళా మండలి సభ్యులు మాత్రం తాము చేసింది సబబేనని చెబుతుండగా మరోవైపు అనేకమంది ఈ ఏకపక్ష ధోరణిని తప్పుబడుతున్నారు. గ్రామంలో అత్యధికంగా 'ఆగ్రీ' సమాజ్ను చెందినవారే నివసిస్తున్నారు. ఈ సమాజ్ వారితో కలిసి గ్రామంలోని మహిళలందరు గతంలోనే 'ఇంద్రయాణి'ని స్థాపించుకున్నారు. తరచు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఈ మహిళా మండలి సభ్యులు తాజాగా నవీ ముంబైతో పాటు తమ రాష్ట్రంలో, ఇంకా దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాల సంఘటనలను అడ్డుకోవడం ఎలా అనే విషయంపై సమాలోచనలు జరిపారు. పర్యవసానమే గౌన్లు, నైటీల నిషేధం. -
నవీముంబైకి ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, ముంబై: నవీ ముంబై ప్రయాణికులకు ఇక మీదట ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం దక్కనుంది. నవీ ముంబై మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ (ఎన్‌ఎంఎంటీ)... జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) పథకంలో భాగంగా ఐదు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది. మరో రెండు నెలల్లో ఈ ఏసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. రవాణా విభాగం బస్సులను కొనుగోలు చేసి వీటి సామర్ధ్యాన్ని పరీక్షించేందుకు ప్రయోగాత్మకంగా నడపనున్నారు. ఈ బస్సులను ఫిన్లాండ్కు చెందిన ఉత్పత్తిదారుల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. హెచ్‌ఎంటీడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కోచ్‌లను ఉత్పత్తి చేయనుంది. అయితే ఈ బస్సులు డీజిల్ ద్వారా ఎలక్ట్రిక్ జనరేటర్‌పై నడవనున్నాయని అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంఎంటీ చైర్మన్ గణేష్ మాత్రే మాట్లాడుతూ.. రవాణా విభాగం కాలుష్య రహిత రవాణా వ్యవస్థపై ప్రయోగాలు నిర్వహిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా ఈ కోవకు చెందిన బస్సులను నగర రోడ్లపై ప్రయోగాత్మకంగా నడిపి వాటి సామర్థ్యం తెలుసుకోనున్నట్లు వివరించారు. తమ సంస్థ వద్ద ఇప్పటికే 50 వోల్వో బస్సులు ఉన్నాయన్నారు. సామర్థ్యంలో పోలిస్తే వోల్వో బస్సుల కంటే ఈ కొత్తబస్సులు సమర్థవంతమైన ఇంధన శక్తిని కలిగి ఉంటాయని చెప్పారు. ఇటీవల రవాణా విభాగం టాటా మోటర్స్ నుంచి హైబ్రిడ్ బస్సులను కొనుగోలు చేసేందుకు యోచించింది. హెచ్‌ఎంటీడీ బస్సుల కన్నా ఈ బస్సులకు నిర్వహణ ఖర్చులు అధికంగా అవుతాయని భావించింది. దీంతో ఎన్‌ఎంఎంటీ ఈ బస్సులను ఎంచుకుంది. కాగా, హెచ్‌ఎంటీడీ నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.16 లక్షలు కాగా, టాటా మోటార్స్‌కు ఇదే కాలానికి రూ.49 లక్షలు అవుతోందని మాత్రే తెలిపారు. వోల్వో బస్సులు లీటర్‌కు కేవలం రెండు కిలో మీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుండగా ఈ హైబ్రిడ్ ఎలక్రిక్ బస్సు లీటర్‌కు ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందన్నారు. ధర విషయానికి వస్తే.. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సు ధర సుమారు రూ.2 కోట్ల 41 లక్షలు కాగా టాటా మోటర్స్ బస్సు రూ.ఒక కోటి 67 లక్షల ధర ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎన్‌ఎంఎంటీ 370 బస్సులను నడుపుతోంది. ఇందులో 145 బస్సులు సీఎన్జీతో నడుస్తుండగా, 30 బస్సులు ఎయిర్ కండీషన్డ్ వోల్వో బస్సులు ఉన్నాయి. ఇటీవల మరో 40 కొత్త వోల్వో బస్సులను కొనుగోలు చేసింది. ఏడాదిలోగా మరో 115 బస్సులను కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించినట్లు మాత్రే వివరించారు. -
దక్షిణాఫ్రికా మహిళకు వేధింపులు
థానే: సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో పరిచయమైన దక్షిణాఫ్రికా మహిళను మోసం చేయడమే కాకుండా, ఆమెను లైంగికంగా వేధించిన కొరియోగ్రాఫర్ ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు(48) పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు కుష్ అగ్నిహోత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికాలో సొంతంగా పెట్రోల్ బంకు నడుపుతున్న బాధితురాలికి నవీ ముంబైకి చెందిన కుష్ సామాజిక మాధ్యమంలో పరిచయమయ్యాడు. వ్యాపారంలో సహాయం చేస్తానని చెప్పి ఆమెను ముంబైకి రప్పించాడు. ఆమె డెబిట్ కార్డు నుంచి రూ. 34 వేలు తీసుకున్నాడు. అంతేకాదు ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా, కొట్టాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
ఎమ్మార్ ఎంజీఎఫ్ సెజ్ రద్దు
న్యూఢిల్లీ: ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్‌కు ఇచ్చిన సెజ్ ఆమోదాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు సెయిల్ సెలెమ్ సెజ్, మరో 25 సెజ్ ఆమోదాలను కేంద్రం రద్దు చేసింది. ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్‌ల) ఏర్పాటుకు 18 సంస్థలకు మరింత గడువునిచ్చింది. ఈ నిర్ణయాలను గత నెల 24న వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ (బీఓఏ) తీసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెజ్ ఆమోదాల రద్దుకు సంబంధించి 43 కేసులను బీఓఏ పరిశీలించిందని పేర్కొంది. డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్‌కు సంబంధించిన 14కేసులు, ఏపీ మార్క్‌ఫెడ్, డీసీ వీసెజ్‌కు చెందిన ఒక కేసులో సెజ్‌ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన పరిస్థితుల కారణంగా ఈ 15 కేసులను బీఓఏ వాయిదావేసింది. మరింత గడువు పొందిన సెజ్‌ల్లో-డీఎల్ఎఫ్ ఇన్ఫోపార్క్(పుణే), నవీ ముంబై సెజ్, ఇండియాబుల్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కర్ణాటక సెజ్‌లు ఉన్నాయి. కాగా సెజ్‌లకు సంబంధించి పునర్వ్యస్థీకరణ కసరత్తును కేంద్రం ప్రారంభించింది. సెజ్‌లకు సంబంధించి విధి, విధానాలను ప్రామాణీకరించడం, నిబంధనలు, ఫీజుల సరీళీకరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై కసరత్తును మొదలు పెట్టింది. సెజ్ డెవలపర్లు వివిధ అంశాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. -
బాబా రాందేవ్‌ను అరెస్టు చెయ్యాలి
ఠాణే: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నవీముంబైలో కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రాందేవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నవీముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు దశరత్ భగత్ మాట్లాడుతూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం సభ్యులు కూడా పాల్గొన్నారు. ఠాణే జిల్లా ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడు రాహుల్ త్రైంబకే, ప్రధాన కార్యదర్శి మనోజ్ మహారాణలు మాట్లాడుతూ... బాబా రాందేవ్ బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, దళితులను అవమానపర్చేలా మాట్లాడుతున్నారని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
టీకేఎస్ ఎన్నికలు
దాదర్, న్యూస్‌లైన్ : నవీముంబైలోని వాషీలోగల తెలుగు కళాసమితి (టీకేఎస్) ఎన్నికల్లో బి నారాయణరెడ్డి, ఎం కొండారెడ్డి ప్యానల్ భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించింది. జి బి రామలింగయ్య, జి ప్రవీణ్ ప్యానల్‌పై సుమారు 80 శాతం ఓట్ల తేడాతో గెలుపొందింది. ఈ సమితి చరిత్రలోనే ఈసారి ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పోలయ్యాయి. ఇక అధ్యక్షుడిగా పోటీ చేసిన నారాయణరెడి ్డకి 727 ఓట్లురాగా, ప్రత్యర్ధి జి బి రామలింగయ్యకు కేవలం 202 ఓట్లు వచ్చాయి. మరోవైపు ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన కొండారెడ్డికి అత్యధిక ఓట్లులభించాయి. ఆయనకు ఏకంగా 735 ఓట్లు లభించగా ప్రవీణ్‌కు కేవలం 176 మాత్రమే పోలయ్యాయి. ఇలా నారాయణ రెడ్డి, కొండారెడ్డి ప్యానల్‌కు చెందిన సభ్యులంతా భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలుగు కళా సమితి 20014-2016 కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ అనంతరం సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినప్పటికీ అర్థరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఆదినుంచి లెక్కింపు పూర్తయ్యేదాకా నారాయణరెడ్డి, కొండారెడ్డి ప్యానల్ ఆధిక్యంలోనే కొనసాగింది. ఈ ప్యానల్ గెలుపు తథ్యమని తేలిపోయినా ఓట్ల తేడా తెలుసుకునేందుకు అర్ధరాత్రి దాకా అనేక మంది ఉత్యంఠతో ఎదురుచూశారు. దీంతో తెలుగు కళాసమితి ప్రాంగణంలో సందడి నెలకొంది. ఓట్ల లెక్కింపు పూర్తయిందని ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆర్.కె.రెడ్డి, ఒ.సుబ్రమణ్యంలు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం అంతా టపాసులు కాల్చడంతోపాటు మిఠాయిలు పంచుకున్నారు. కాగా రెండేళ్ల కిందట ఎన్నికైన నారాయణ రెడ్డి, కొండారెడ్డికి చెందిన పాత కార్యవర్గకమిటీ వరుసగా రెండోసారి కూడా విజయం సాధించింది. కొత్త కమిటీలో ఒకరిద్దరు మినహా అంతా పాతవారే. అందరినీ కలుపుకుని ముందుకెళతాం ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. కొండారెడ్డిలు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని ముందుకె ళతామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. అవసరమైన అనుమతులన్నీ తీసుకుని అత్యాధునికమైన భవనాన్ని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం తమది కాదని, అందరిదంటూ అభివర్ణించారు. తెలుగు కళాసమితి వికాసానికి, తెలుగు ప్రజల ఐక్యతతోపాటు సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతోపాటు భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. భవన నిర్మాణానికి అంతా సహకరించాలి తెలుగు కళా సమితికి నూతన భవనం నిర్మించేందుకు అంతా సహకరించాలని నారాయణ రెడ్డి,కొండారెడ్డి పిలుపునిచ్చారు. అందరి సహకారంతో ఈ కలను సాకారం చేస్తామన్నారు. విజేతల వివరాలివే అధ్యక్షుడు: బి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు: జి సుబ్రమణ్యం, కె వరలక్ష్మి. ప్రధాన కార్యదర్శి: ఎం కొండారెడ్డి. సంయుక్త కార్యదర్శి: వై వి నారాయణ రెడ్డి, టి మంజుల, కోశాధికారి: మీర్జలీ షేఖ్, సంయుక్త కార్యదర్శి: ఎల్ మీనాసుబ్రమణ్యం. కార్యవర్గ సభ్యులు: జి సుబ్బా రెడ్డి, గట్టు నర్సయ్య, జి వెంకటయ్య, కె. భాస్కర్ రెడ్డి, ఎం తిరుపతిరెడ్డి, మల్లేశ్వర్ కట్టెకోల, జీ కోటి రెడ్డి, ఆర్.వి.నారాయణ రెడ్డి, వేముల దశరథ్, వి రమణారెడ్డి, డి పద్మ, టి విజయ లక్ష్మి, వహీదా షేఖ్. -
‘నవీ’ ఎయిర్‌పోర్టుకు ఐదున టెండర్లు
సాక్షి, ముంబై: నవీ ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించేందుకు ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్లను ఆహ్వనించేందుకు రంగం సిద్ధమైంది. ఈ టెండర్లను కేవలం దేశానికి పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆహ్వానిస్తున్నామని సిడ్కో అధ్యక్షుడు ప్రమోద్ హిందురావు, ఎండీ సంజయ్ భాటియా తెలిపారు. ఈ మేరకు నగరంలోని నిర్మల్ సిడ్కో కార్యాలయంలో సిడ్కో డెరైక్టర్లతో జరిగిన సమావేశంలో ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్లు ఆహ్వానించాలని తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపాయని, టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ కోసం అనేక గ్రామాలు, రైతుల భూములు సేకరించాల్సి వచ్చింది. వీరికి పునరావాసం కల్పించడం, నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి, సిడ్కోకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఆరు గ్రామాలు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాయ’ని చెప్పారు. అయితే త్వరలోనే ఆ గ్రామస్తులను నేరుగా కలిసి వారి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. ఈ ఆరు గ్రామాలు ప్రాజెక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవని, శాంతియుతంగా చర్చలు జరిపి వారిని ఖాళీ చెయ్యించే ప్రయత్నం చేస్తామని భాటియా అన్నారు. రూ.9,500 కోట్లతో కూడిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ‘ఇదివరకే ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేక అడ్డంకులు ఎదుర య్యాయి. పర్యావరణ, అటవీ తదితర శాఖల నుంచి అనుమతులు పొందడానికి ఎంతో కసరత్తు చేశాం. చివరకు అన్ని శాఖల నుంచి అనుమతులు లభించడంతో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంద’న్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్లను ఆహ్వానించినా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం సంవత్సరంపైనే సమయం పడుతుందని భాటియా స్పష్టం చేశారు. ఆ తర్వాత విమానాశ్రయం నిర్మాణపనులు ప్రత్యక్షంగా ప్రారంభమవుతాయన్నారు. అంతకుముందు ఖాళీచేసిన ఈ గ్రామాలను పూర్తిగా నేలమట్టం చేయాలన్నారు. కాగా, ఈ విమానాశ్రయంపై నగరం, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో చేపడుతున్న అనేక ఫ్లైఓవర్లు, మెట్రో, మోనో రైలు లాంటి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలు, మోనో, మెట్రో మార్గాలు విస్తరించనున్నాయి. దీంతో విమానాశ్రయం పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు సిడ్కో ప్రయత్నాలు చేస్తోంది. -
సంక్రాంతి శోభ
దాదర్, న్యూస్‌లైన్: నవీముంబైలోని వాషి పట్టణంలో ఉన్న ‘తెలుగు కళా సమితి’ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగిన ‘సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో తెలుగు ప్రజలంతా విశేషంగా పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఏర్పాటుచేసిన ఈ సంబరాలలో మొదటిరోజు స్థానిక కళాకారులు, సమితి సభ్యులు, మహిళలు, బాల, బాలికలు పలు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. తొలుత గణేశుని వర్ణచిత్రాన్ని పూల మాలలతో అలంకరించి దీప ప్రజ్వలన చేశారు. సమితి అధ్యక్షుడు బండి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి ఆహూతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలకు ఆహ్వానం పలికారు. ఆలాగే, ‘చేబియం కౌశికి’ ప్రార్థనా గీతంతో సంబరాలు ప్రారంభించారు. మహిళా సభ్యులు సంక్రాంతి పాటలతో, వాణి శ్రీపాద తదితర గాయనీ గాయకులు భక్తి గీతాలను ఆలపించారు. సాంస్కృతిక కళా దర్శకురాలు కేతవరపు శోభారావు ఆధ్వర్యంలో రూపొందిన పలు నృత్యరూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మనదేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగే సంక్రాంతి పండుగ విశేషాలను తెలిపే విధంగా ఈ నృత్యాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. తమిళనాడు (పొంగల్), మహారాష్ట్ర (మకర సంక్రాంతి), అస్సాం (మాఘబిహు), గుజరాత్ (మకర సంక్రాం త్-ఉత్తరాయణ్), పంజాబ్ (లోధీ) రాష్ట్రాల్లో ఆచరిస్తున్న సంక్రాంతి పండుగ సంబరాలను ప్రతిబిం బించిన ఈ నృత్యరూపకాలపై తెలుగులో సరళారావు వ్యాఖ్యానం సభికులను ఆకట్టుకుంది. కూచిపూడి నాట్యకళాకారిణి సత్యా శ్రీనివాస్ (కొరియోగ్రాఫర్), వాణిశ్రీపాద, లక్ష్మీ రావు, పద్మా ప్రసాద్, మీనా, కాత్యాయని, డి.పద్మ, వైశాలి, విపు ల మహాజన్, పద్మాశేఖర్, విజయా మూర్తి, రేవతి, చంద్రకళారెడ్డి, శాంతిరెడ్డి, హరి ప్రియ, నిఖిత, నగపృథ్వి తదితరులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు కళా సమితి తరఫున కేతవరపు శోభా రావు, కూచిపూడి నాట్యగురు శ్రీరామచంద్ర మూర్తి ముఖ్య అతిథులను, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను, గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను సత్కరించారు. టి.మంజులారెడ్డి వ్యాఖ్యానంతో తొలినాటి సంబరాలు ఘనంగా జరిగాయి. పద్మశాలీల ‘పసుపు-కుంకుమ’ సాక్షి, ముంబై: నాయిగావ్‌లోని పద్మశాలి యువక సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మంగళవారం సాయంత్రం పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణల్లో సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు చేశారు. కాగా, ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన ముగ్గులు, ఇతర ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులు తరిగొప్పు రాధిక ( శివసేన శాఖ ప్రముఖ్), గద్దె లలిత (ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాథమిక విభాగం ప్రధానోపాధ్యాయురాలు), గిరిజ (స్వరమాధురి అధ్యక్షురాలు) పసుపు-కుంకుమ గురించి వివరించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలందరినీ మహిళా మండలి తరఫున పసుపు-కుంకుమతోపాటు చిరు కానుకలను అందజేశారు. దాదాపు 720 మంది మహిళలు, 160 మంది చిన్నారులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. నూతన సంఘ ధర్మకర్తలు, కార్యవర్గం, మహిళా మండలి సమితి సభ్యులను సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు భోగ కళావతి, కార్యదర్శి రాధ, కోశాధికారి సంగిశెట్టి భాగ్యలక్ష్మి, ట్రస్ట్ చైర్మన్ పావని సుదర్శన్, కార్యవర్గ అధ్యక్షుడు కోడి చంద్రమౌళి, సంఘం ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, మేనేజింగ్ ట్రస్టీ గాడిపెల్లి గణేష్, ట్రస్టీ సభ్యులు బుధారపు రాజారాం, ముశం నారాయణ, కార్యవర్గ సభ్యులు పొన్న శ్రీనివాస్, బోడ శ్రీనివాస్ పాల్గొన్నారు. సూరత్‌లో.. సాక్షి, ముంబై: సూరత్‌లో సంక్రాంతి వేడుకలు పల్లెటూరి వాతావరణాన్ని తలపించాయి. ప్రతాప్‌నగర్‌లోని శ్రీమార్కండేయ మందిరంలో మంగళవారం సాయంత్రం సంబరాలను నిర్వహించారు. ఎం.పి. సి.ఆర్.పాటిల్ ముగ్గుల పోటీలను ప్రారంభించా రు. పోటీల్లో 60 మంది మహిళలు పాల్గొన్నారు. సూరత్ తెలుగు వలస ప్రజల ఐక్య సమితి క్రీడాసాంస్కృతిక కమిటీ ఈ పోటీలను నిర్వహించింది. తెలంగాణ అంశం, ఆడశిశువులను కాపాడటం వంటి సందేశాత్మక ముగ్గులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు పవిత్ర శారీ హౌస్ అధిపతి గంగుల వెంకటేష్ బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సంగీతాపాటిల్, సాంఘిక సంక్షేమ శాఖ సూరత్ ఎస్సీ, బీసీ డిప్యూటీ డెరైక్టర్ ఆర్.బి.గోయిల్, తెలుగు కార్పొరేటర్లు రాపోలు లక్ష్మి, పీవీఎస్ శర్మ, అన్నపూర్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపెల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో వైభవంగా.. స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల బాలిక మనస్విని వేసిన ముగ్గు ప్రత్యేక బహుమతి పొందింది. జయ, లావణ్య ఆలపించిన కీర్తనలు అలరించాయి. పీవీపీసీ ప్రసాద్ సమన్వయంతో కొనసాగిన ఈ ఉత్సవాల్లో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ద్వారకనాథ్ గుప్తా, కార్యదర్శి కె.సుబ్బారాయుడు, సహ కార్యదర్శి పున్నా రావు, గాంధీనగర్ తెలుగు సంఘం అధ్యక్షుడు మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎంవీఎస్ రవికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
సంక్రాంతికి సన్నాహాలు
దాదర్, న్యూస్‌లైన్: నవీముంబైలోని వాషి ప్రాంతంలో 14, 15వ తేదీలలో నిర్వహించే సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెక్టర్-9(ఏ) ప్రాంగణంలో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక కళాకారులతో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ కళా దర్శకురాలు కేతవరపు శోభారావు ఆధ్వర్యంలో ‘దశ దిశలా కాంతి-మన తెలుగు సంక్రాంతి’ పేరిట దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల విశేషాలతో ‘డ్యాన్స్ బ్యాలే’ ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా ఆటపాటలతో చిన్నారులు, మహిళలు అలరించనున్నారని నిర్వాహకులు తెలిపారు. 15వ తేదీన.. సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌కు చెందిన మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్‌కు చెందిన సంగీత దర్శకుడు మధు బాపుశాస్త్రి ఆధ్వర్యంలో ‘గ్రాండ్ మ్యూజికల్ మస్తీ’ కార్యక్రమంలో సుమధుర బాల గాయకురాలు, జీ టీవీ లిటిల్ చాంప్ ప్రవస్తీ తదితరులు పాల్గొననున్నారు. అంతేకాకుండా ఈ రెండు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలలో ఆహూతులకు కమ్మటి భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు సమితి అధ్యక్షుడు బండి నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాది రెడ్డి కొండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
అట్టహాసంగా ఆంధ్ర కళాసమితి వార్షికోత్సవం
దాదర్, న్యూస్‌లైన్: నవీముంబై ప్రాంతంలోని పన్వెల్లోగల ఆంధ్ర కళాసమితి 23వ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం సమితి ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు సమితి సభ్యులతోపాటు పట్టణంలోని ప్రముఖులు, అభిమానులు పెద్దపెట్టున తరలివచ్చారు. ఆహూతులకు సంయుక్త కార్యదర్శి సుజాత రావు, కార్య నిర్వాహక సభ్యుడు పి.అశ్విన్‌కుమార్ స్వాగతం పలికారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యులు సామంచి రామ్మూర్తి కవితలు అలరించగా జోక్స్ కితకితలు పెట్టాయి. కీ బోర్డ్‌పై మల్హర్ ఆలపించిన దేశభక్తి గీతం, అశ్విన్‌కుమార్, పద్మ దంపతులు ఆపించిన యుగళగీతం, ప్రతి భరణి, శ్రావ్యలు ఆలపించిన సినీ గీతాలు ఎంతగానో అలరించాయి. మహిళా సభ్యులు ఆలపించిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ ప్రార్థనాగీతం అనంతరం వేదికపై అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్, తనూజ దంపతులు, గౌరవ అతిథులుగా డాక్టర్.ఎస్.గుణహరి (అసిస్టెంట్ లేబర్ కమిషనర్), సుధా గుణహరి, కె.వెంకటరమణ (సమితి అధ్యక్షులు), పి.సతీష్ రాజు (ప్రధాన కార్యదర్శి), ఈ.శంకర్ (కోశాధికారి) తదితరులు ఆశీనులయ్యారు. సమితి చేపట్టిన పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాల గురించి ఉపాధ్యక్షుడు కే.ఎస్.ఆర్.కృష్ణ వివరించారు. జమాఖర్చుల వివరాలను ఈ.శంకర్ సభికులకు తెలిపారు. అతిథులను, సమితి ఉన్నతికి పాటుపడిన సంస్థాపక సభ్యులను, స్థానిక బాలాజీ మందిర్ పురోహితులను, పట్టణంలో ఇటీవలే జరిగిన ‘పన్వెల్ ఫెస్టివ్-ఆంధ్రప్రదేశ్ డే’లో పాల్గొన్న కళాకారులను శాలువా, మెమెంటో, పుష్పగుచ్చాలతో నిర్వాహకులు సత్కరించారు. పట్టణంలో నిర్వహించే సేవాకార్యక్రమాలకు తమవంతు సహాయ సహకారాలను అందిస్తున్న వెంకట్రామన్ దంపతులను సత్కరించారు. ప్రముఖ కవి, ముంబై ఆంధ్రసహాసభ మాజీ ప్రధాన కార్యదర్శి ఎ.మల్లికార్జునరెడ్డి, కె.నాగేశ్వర రావు తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమం సంధ్య, శ్రావ్య బృందం భరత నాట్యం, బేబీ నేహా సినీ నృత్యం, చివరకు విందు భోజనాలతో ముగిసింది. -
‘నవీ’కి త్వరలో టెండర్లు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. త్వరలో ఈ విమానాశ్రయం పనుల కోసం టెండర్లను ఆహ్వానించేందుకు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ నుంచి అవసరమైన అనుమతి లభించడంతో ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ముంబైలో డొమెస్టిక్ (శాంతాక్రజ్), అంతర్జాతీయ (సహార్) విమానాశ్రాయాలున్నాయి. ఇందులో సహర్ విమానాశ్రయంపై విమానాల రాకపోకల భారం విపరీతంగా పెరిగింది. దీంతో నగరంలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నవీముం బైలోని పన్వేల్ సమీపంలో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ప్రత్యక్షంగా అమలులోకి తెచ్చేందుకు సిడ్కో ద్వారా అనేక ప్రయత్నాలు చేసింది. స్థల సేకరణ, ఇతర సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో ఈ విమానాశ్రయం పనులు అనుకున్నట్టుగా ముందుకు సాగలేదు. అయితే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రత్యేక చొరవ తీసుకుని గత నెలలో ఇక్కడి నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. అయినా కొన్ని గ్రామాలవాసులు ఈ ప్యాకేజీలను స్వీకరించేందుకు నిరాకరించాయి. దీంతో ప్రభుత్వం ఖాడీ, ఉప్పు భూముల్లోనే విమానాశ్రయాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం కేంద్ర విమానయాన శాఖ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతివ్వాలని కోరుతూ సిడ్కో గత నెలలో ఈ కమిటీకి సిపా ర్సు చేసింది. దీనికి సానుకూల స్పందన రావడంతో టెండర్ల ప్రక్రియ ఊపందుకుంది. కాగా, టెండర్లను ఆహ్వానించే ముందు టెండరు వేసేం దుకు ఆసక్తి కనబరుస్తున్న కంపెనీలు అర్హతను పరిశీలించనున్నారు. దీనికి ముందుగా ఈ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఎన్ని కంపెనీలు అర్హతసాధిస్తాయనేది స్పష్టం కానుంది. ఏటా 10 లక్షల మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
జనవరి నుంచి సినిమాల పండుగ
అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈసారి నవీముంబై వేదిక కానుంది. వచ్చే జనవరి 31 నుంచి ఫిబ్రవరి రెండో వరకు నెరూల్‌లోని డి.వై.పాటిల్ ఆడిటోరియంలో దీనిని నిర్వహిస్తారు. పలు లఘుచిత్రాలు, సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. భారత్‌తోపాటు ఫ్రాన్స్, అర్జెంటీనా, రొమేనియా, బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, తుర్క్మిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, సింగపూర్, ఇజ్రాయెల్, స్పెయిన్ తదితర దేశాల సినిమాలను చూడవచ్చు. ఇదివరకు జరిగిన అంతర్జాతీయ సినిమాల ఉత్సవాల్లో మన దేశానికి చెందిన 170 చిత్రాలకు ప్రవేశం లభించింది. నెరూల్‌లో మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి మహేశ్ మాంజ్రేకర్, డింపుల్ కపాడియా, నగేశ్ కుక్నూర్ తదితర దిగ్గజాలతోపాటు, ప్రముఖ నటీనటులు హాజరుకానున్నారు. నవీముంబైలో పలువురు సినీతారలు, కళాకారులు ఉన్నా, ఇంతవరకు ఇక్కడ సినీ ఉత్సవాలు జరగలేదు. నమీముంబై సినీ ప్రేమికులు సినిమా, కాలాఘోడా ఉత్సవాలను వీక్షించేందుకు ముంబైకి రావాల్సి వస్తోంది. అందుకే 2014లో ఇక్కడ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సచిన్ ఖన్నా, అశోక్ పురంగ్, సమీర్ వాలవ్కర్, బిశారద్, డాక్టర్ విక్రం పర్లీకర్ తదితర ప్రముఖులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నవీముంబై అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది. ఇక్కడ భారీ భవనాలు,అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఊపందుకుంటున్నాయి. అయినప్పటికీ ఇంతవరకు అంతర్జాతీయస్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగలేదని సచిన్ ఖన్నా అన్నారు. వాషిలో విష్ణుదాస్భావే హాలు మినహా సినిమా థియేటర్లుగాని నృత్యశాలలుగాని లేవు. నవీముంబైలో శంకర్ మహదేవన్ వంటి గాయకులు, సినీకళాకారులు ఉంటున్నారు. ఇక్కడ కూడా సాంస్కృతిక వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నమని ఖన్నా వివరించారు. -
లాల్బాగ్ పరిసరాలు ప్రశాంతం
సాక్షి, ముంబై: లాల్బాగ్ పరిసర ప్రాంతవాసులకు ఎట్టకేలకు ప్రశాంతత లభించింది. గణేశ్ ఉత్సవాల కారణంగా వివిధ రకాల శబ్దాలు తదితరాల కారణంగా పది రోజులపాటు నరకయాతన అనుభవించిన వీరికి గురువారం రాత్రి తుపాను వెలిసిన భావన కలిగింది. గణేశ్ మండళ్లవద్ద విరామం లేకుండా భారీగా లౌడ్ స్పీకర్లు, డీజేల సౌండ్లతో వారి చెవులు అదిరిపోయాయి. దీంతో వారికి పది రోజులుగా కంటిమీద కునుకు లేకుండాపోయింది. కనీసం మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొన్నామంటూ వారు వాపోయారు. అత్యధిక శాతం మండళ్లు తమ విగ్రహాలను బుధవారం సాయంత్రమే నిమజ్జనం చేయగా కొన్ని మండళ్లు గురువారం రాత్రి ఆ ప్రక్రియను పూర్తిచేశాయి. లాల్బాగ్ ప్రాంతంలో ‘లాల్బాగ్ చా రాజా’ తోపాటు అనేక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయి. దీంతో స్థానిక, శివారు ప్రాంత ప్రజలుసహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు గణేశ్ ఉత్సవాల సమయంలో లాల్బాగ్ ప్రాం తాన్ని తప్పకుండా సందర్శిస్తారు. ఈ కారణంగా ఈ ఉత్సవాల సమయంలో ఈ ప్రాంతం జనసంద్ర మవుతుంది. గణేశ్ ఉత్సవాలు భక్తులకు ఆనందం కలిగించినప్పటికీ స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ జనం రాకపోకల కారణంగా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసేదాకా కనీసం ద్విచక్ర వాహనం తమ ఇంటి ఛాయలకు తీసుకెళ్లలేని పరిస్థితి ఎదురైంది. ఇక కార్లు, ఇతర వాహన యజమానుల పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. ఎక్కడోదూరంగా ఖాళీ ప్రాంతంలో తమ వాహనాలను నిలిపి, నడుచుకుంటూ ఇంటికి చేరుకోక తప్పలేదు. ఎవరైనా బంధువులు ఇంటికి రావాలన్నా లేదా వీరు బయటకు వెళ్లాలన్నా కూడా ఇదే పరిస్థితి. కిరాణా, కూరగాయల లగేజీతో ఇంటికి రావాలంటే ఎక్కడో ట్యాక్సీ దిగి నడచుకుంటూ రావాల్సి వచ్చింది. ముఖ్యంగా లాల్బాగ్ చా రాజా మండపానికి ఆనుకున్న చాల్స్, భవనాల నివాసులకు గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా బంధులొస్తే ముందుగా ఫోన్ చేయాలి. ఫలానాచోట నిలబడ్డానని చెప్పాలి. ఆ తరువాత వీరు వచ్చి తీసుకెళితే తప్ప మండలి కార్యకర్తలు వారిని పంపించేవారు కాదు. ఇలా ఉత్సవాలు జరిగినన్ని రోజులు స్థానికులు అనేక సమస్యలతో సతమతమయ్యారు. -
నవీముంబైలో రూ.10 లక్షల చోరీ
నవీముంబై ఖార్ఘర్లో బ్యాంకు సొమ్ము తరలిస్తుండగా సాయుధ దుండగులు దాడిచేసి రూ.10 లక్షల నగదు తీసుకుని పారిపోయిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన నగదు తీసుకుని వెళ్లే ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీ కార్యాలయం ఎదుటే చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల కాలంలో నవీముంబైలో ఇలాంటి సంఘటన జరగడం ఇది నాలుగోసారి కావడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఖార్ఘర్ సెక్టార్ నంబరు-7లో రెడియంట్ క్యాష్ సర్వీసెస్ మేనేజ్మెంట్ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి వేర్వేరు బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు సిబ్బంది బయలుదేరుతారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో క్యాష్ వ్యాన్లలో డబ్బులు అమరుస్తుండగా అకస్మాత్తుగా ఒక తెల్లరంగు స్కార్పియో వాహనం వచ్చింది. అందులో ఉన్న కొందరు క్యాష్ నింపే సిబ్బంది కళ్లలో కారంపొడి చల్లారు. తమవెంట తెచ్చుకున్న ఆయుధాలతో వారిపై దాడిచేసి గాయపరిచి రూ.10 లక్ష లు తీసుకుని ఉడాయించారు. ఈ దొంగలు సైన్-పన్వేల్ రహదారి మీదుగా పన్వేల్ దిశగా వెళుతుండగా ఓ చోట ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. పక్కనే ఆగి ఉన్న ఆటో డ్రైవర్‌ను కొట్టి ఆటో తీసుకుని పారిపోయారు. కేసు నమోదుచేసిన పోలీసులకు ఇంతవరకు వారి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. సెక్యూరిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల సాయం తీసుకుంటామని డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ ఏనాపురే చెప్పారు. ఇటీవల కాలంలో జుయినగర్, విచంబేగావ్, వాషి కంపెనీల కార్యాలయంలో దోపిడీలు జరిగాయి. ఇందులో జుయినగర్ దోపిడీ ఘటన మినహా మిగతా రెండు కేసులు ఇంతవరకు పోలీసులు పరిష్కరించలేకపోయారు. నవీముంబై పోలీసులు చేపడుతున్న నాకాబందీలు, బీట్ మార్షల్స్ పెట్రోలింగ్ ఫలితాలివ్వడం లేదని ఈ సంఘటనలతో తేలిపోయింది.