ముంబై: దేశ వాణిజ్యం నగరం ముంబై అరుదైన ఘనతకు సిద్ధం కాబోతోంది. దేశంలో ఏదేని నగరంలో రెండు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు ఇప్పటిదాకా లేవు. కానీ, ముంబై ఆ ఘనతను దక్కించుకోనుంది.
నవీ ముంబై(NIMA)లో నిర్మించబోయే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 చివరికల్లా సిద్ధం కానుంది. ముంబైలో ఇప్పటికే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(CSMIA) ఉంది. అయితే విమానాల తాకిడి అత్యధికంగా ఉండడంతోనే ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణం తెరపైకి వచ్చింది.
ఎన్‌ఎంఐఏను నిర్మించబోయేది అదానీ గ్రూప్. ఇందుకు చేయబోయే ఖర్చు 16 వేల కోట్ల రూపాయలు. ఈ ఎయిర్‌పోర్టు ద్వారా పదివేల ఉద్యోగాలను కల్పించనున్నారు.
Design of Iconic Navi Mumbai Airport has been revealed, the design of airport is inspired by National flower Lotus. Once completed it'll become second international airport in Mumbai Metropolitan Region
— Soham (@TheSohamPuranik) June 8, 2021
Architect - Zaha Hadid pic.twitter.com/qU9uWCE4kG
ఎన్‌ఎంఐఏ ప్రత్యేకతలు
- దాదాపు మూడు వేల ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించబోతున్నారు.
- నవీ ముంబై ఉల్వే తాలుకాలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు
- నాలుగు టెర్మినల్స్, రెండు రన్‌వేలు
- 29 కిలోమీటర్ల ముంబై ఎలివేటెడ్ రోడ్.. ఈ ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానం కానుంది
- డిసెంబర్ 2024 కల్లా ఈ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను ప్రారంభించనుంది.
ఇప్పటిదాకా దేశంలో 35 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉండగా.. 30 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు వాడుకలో ఉన్నాయి. నేవీ ముంబై ఎయిర్‌పోర్టుతో కలిసి కొత్తగా మరో 14 అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి.
ఇదీ చదవండి: గాడ్సే భరతమాత ముద్దు బిడ్డ!
Comments
Please login to add a commentAdd a comment