international airport
-
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కొండపై కొలువైన వెంకన్నతో ప్రపంచ ఖ్యాతినార్జించిన తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయమూ సిద్ధమైంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనువుగా రూ.153.16 కోట్లతో రన్ వేను విస్తరించి, అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ట్రాన్స్– ఇన్స్టాల్డ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్), కొత్త డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ (డీవీఓఆర్), డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ (డీఎంఈ) ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థల ద్వారా విమానాల నిర్వహణ సామర్థ్యం రోజుకు 100 విమానాల నుంచి 200 విమానాలకు పెరుగుతుందని విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నె చెప్పారు. అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా కనీస దృశ్యమానత (విజిబులిటీ) 1500 మీటర్ల నుండి 700 మీటర్లకు తగ్గుతుంది. గ్లైౖడ్ యాంగిల్ కూడా 3.2 డిగ్రీల నుండి 3 డిగ్రీలకు తగ్గింది. వీటి ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ విమానాలు సజావుగా రాకపోకలు సాగిస్తాయని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో ఏదైనా సమస్య తలెత్తినా అక్కడ దిగాల్సిన విమానాలు తిరుపతిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా విమానాశ్రయాన్ని అభివృద్ది చేశారు. ఇప్పటివరకు 2,285 మీటర్ల పొడవు ఉన్న రన్న్వేను బలోపేతం చేసి, 3,810 మీటర్లకు విస్తరించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహిస్తున్న విమానాశ్రయాలలోని రన్వేలలో ఇదే అతి పొడవైనది. తద్వారా బోయింగ్ 777, ఎయిర్‌బస్ 330 వంటి అతి పెద్ద, విశాలమైన విమానాలూ ఇక్కడ దిగే అవకాశం కలిగింది. ఆధునిక విమానాశ్రయం ఆధునిక నావిగేషన్ పరికరాల ఏర్పాటు ద్వారా విమానాశ్రయ సేవలు మరింత మెరుగవుతాయి. ముఖ్యంగా అధునాతన ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ వ్యవస్థ ద్వారా విమాన సర్వీసుల రాకపోకలు మరింత సులభంగా, సురక్షితంగా మారతాయి. పెద్ద విమానాల రాకపోకలకూ ఈ విమానాశ్రయం అనువుగా ఉంటుంది. రాయలసీమ జిల్లాల నుంచి గల్ఫ్‌లో పనిచేసే వారి సౌకర్యార్థం తిరుపతి నుంచి నేరుగా కువైట్ విమానం ప్రారంభించాలని ప్రయతి్నస్తున్నాం. విమానాశ్రయంలో నిర్వహణ, మరమ్మతు, సమగ్ర పరిశీలన కేంద్రం (ఎంఆర్ఓ) ఏర్పాటుకి గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచారు. ఆ దిశగా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరాం. – ఎం. గురుమూర్తి, తిరుపతి ఎంపీ వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవ తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించడానికి 2017లో శంకుస్థాపన చేశారు. అయితే, భూములు ఇచ్చిన రైతులు పలు సమస్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకపోవటంతో విస్తరణ పనులు ముందుకు సాగలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ సర్వీసులు నడపాలని నిర్ణయించారు. రైతుల సమస్యలపై దృష్టి సారించారు. నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పలుమార్లు రైతులతో సమావేశమై, వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. విమానాశ్రయం అభివృద్ధిపై అనేకమార్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ప్రధానికి విన్నవించారు. దీంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, సంబంధిత అధికారులను కలిసి పెండింగ్ పనులపై చర్చించారు. మూడు రోజుల్లోనే పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సిద్ధం చేశారు. -
ఎయిర్‌పోర్ట్స్.. మాలా‘మాల్’!
ప్రీమియం రిటైల్ స్టోర్స్.. లగ్జరీ బొటిక్స్.. డైనింగ్ ఏరియాలు.. వెల్నెస్ సెంటర్లు.. స్పాలు.. కాఫీ షాపులు.. రెస్టో బార్లు.. 24 గంటలూ కిటకిటలాడే జనాలు... ఇవన్నీ ఏదైనా భారీ షాపింగ్ మాల్లో ప్రత్యేకతలు అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టుల నయా అవతారం ఇది. విమానయాన కార్య కలాపాల నుంచి వచ్చేది అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ.. ఆదాయాలను దండిగా పెంచుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలన్నీ ఇప్పుడు షాపింగ్ మాల్స్(shopping mall) కు ఎక్కువ.. ఎయిర్‌పోర్టుల(airport)కు తక్కువ అనే రేంజ్లో నడుస్తున్నాయి!! – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీయంగా ఎయిర్‌పోర్టుల నిర్వహణలో దిగ్గజ సంస్థ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్. భారత్‌లో అతిపెద్ద విమానాశ్రయం ఢిల్లీతోపాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఈ కంపెనీ చేతిలోనే ఉంది. ప్రయాణికుల రాకపోకల్లో ఇవి రికార్డులు సృష్టిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు 2 కోట్ల మందికిపైగా ప్రయాణికుల ట్రాఫిక్‌తో దుమ్మురేపింది.తొలి తొమ్మిది నెలల్లో ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టు ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.3,775 కోట్లు. ఇందులో విశేషం ఏముందంటారా? తాజా లెక్కల్ని లోతుగా పరిశీలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే! ఆదాయంలో విమాన (ఏరో) కార్యకలాపాల వాటా 20 శాతమే. మరో 57 శాతం విమానయేతర కార్యకలాపాలు (నాన్–ఏరో) సమకూర్చిపెట్టాయి. అంటే రిటైల్, డ్యూటీ–ఫ్రీ సేల్స్, అద్దెలు, ప్రకటనలు, ఆహార–పానీయాల విక్రయం తదితర మార్గాల్లోనే లభించాయి. దీన్నిబట్టి చూస్తే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఇప్పుడో భారీ మాల్ కింద లెక్క!ఏరో ‘మాల్స్’ కిటకిట..: ఒకవైపు నగరాల్లోని భారీ మాల్స్‌లో రిటైల్ గిరాకీ తగ్గుముఖం పడుతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తాజా నివేదిక ప్రకారం... దేశంలోని 8 ప్రధాన నగరాల షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలాల లీజింగ్ గతేడాది 10శాతం తగ్గిపోవడం గమనార్హం. అదే ఎయిర్‌పోర్టుల్లోని మాల్స్ మాత్రం కిటకిటలాడి పోతున్నాయి. జీఎంఆర్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య అద్దెల రూపంలో ఏకంగా రూ.597 కోట్లు (2024 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో) లభించడం విశేషం. ప్రయాణికుల రద్దీ చూస్తే.. దేశీ ట్రాఫిక్‌లో 17 శాతం, అంతర్జాతీయ ట్రాఫిక్‌లో 28 శాతంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు టాప్‌లో ఉంది.ఎయిర్‌పోర్టు ఆదాయంలో 28 శాతం రిటైల్, డ్యూటీ–ఫ్రీ షాపుల ద్వారా, 18 శాతం అద్దెల ద్వారా లభించగా, మరో 10 శాతం ఆహార–పానీయాల అమ్మకం ద్వారా తోడైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు డ్యూటీ–ఫ్రీ షాపుల్లో ఒక్కో ప్రయాణికుడి సగటు ఖర్చు రూ.1,026 కావడం గమనార్హం.ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్..ఎయిర్‌పోర్టుల విమాన సంబంధ ఆదాయాల్లో.. ల్యాండింగ్ ఫీజులు, విమానాల పార్కింగ్ చార్జీలు, ప్రయాణికుల సెక్యూరిటీ ఫీజులు, విమానాల టెర్మినల్ స్పేస్ అద్దెలు, గేట్లు, సర్వీసులకు సంబంధించి వినియోగ ఫీజులు కీలకమైనవి. అయితే అంతపెద్ద ఏరియాలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ ఆదాయం ఏ మూలకూ సరిపోదు. అందులోనూ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులు భారీ పెట్టుబడులు, వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. అందుకే ఎయిర్‌పోర్టులను ఫైవ్‌స్టార్ మాల్స్‌గా మార్చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి కంపెనీలు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులన్నీ నాన్–ఏరో బిజినెస్‌లపైనే ఫోకస్ చేస్తున్నాయి.సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్టుకు కూడా 55 శాతం ఆదాయం నానో–ఏరో కార్యకలాపాల ద్వారానే వస్తోంది. రిటైల్, డ్యూటీ–ఫ్రీ, ఫుడ్–బేవరేజ్ షాపులకు అధిక స్పేస్ కేటాయిస్తుండటంతో ఎయిర్‌పోర్టులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. దీంతో షాపింగ్ స్పేస్ పెరిగిపోయి విమానాశ్రయాలు ఇరుకైపోయాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి.అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల నాన్–ఏరో ఆదాయం సగటున 40–50 శాతం కాగా.. మన దగ్గర దానికి మించి ఉండటం విశేషం. ఆదాయం కోసం మాల్ సదుపాయాలను విస్తరించినప్పటికీ.. ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం దుబాయ్, చాంగి ఎయిర్‌పోర్టులను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.భారత్‌లో అతిపెద్ద మాల్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో..28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం (బిల్టప్ ఏరియా)తో దేశంలోనే అతిపెద్ద మాల్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోసిటీలో ఏర్పాటవుతోంది. 2027 మార్చి కల్లా ఈ మెగా మాల్ అందుబాటులోకి వస్తుందని అంచనా. దీని అండర్ గ్రౌండ్లో 8,000కుపైగా కార్లు పార్క్ చేయొచ్చట! వరల్డ్ మార్క్ ఏరోసిటీ పేరుతో 2.5 బిలియన్ డాలర్లతో చేపట్టిన ఫేజ్–2 విస్తరణ ప్రాజెక్టులో భాగమిది.భారత్‌లో తొలి ‘ఏరోట్రోపోలిస్ (విమానాశ్రయం చుట్టూ నిర్మిస్తున్న మెట్రోపాలిటన్ ఏరియా)’గా కూడా ఇది రికార్డు సృష్టించనుంది. భారతీ రియల్టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఫేజ్–2లో మొత్తం 35 లక్షల చదరపు అడుగుల లీజింగ్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఏరోసిటీలోని 11 స్టార్ హోటళ్లలో 5,000 గదులు ఉండగా.. విస్తరణ తర్వాత 15 హోటళ్లు, 7,000 గదులకు పెరగనున్నాయి. కాగా ప్రస్తుతం కొచ్చిలో ఉన్న లులు ఇంటర్నేషనల్ మాల్ 25 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో అతిపెద్ద మాల్గా ఉంది.హైదరాబాద్‌లోనూ..హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్ ఏరోసిటీలో కూడా 20 ఎకరాల్లో భారీ మాల్ నిర్మాణంలో ఉంది. మొత్తం విస్తీర్ణం 8 లక్షల చదరపు అడుగులు. 100కు పైగా దేశ, విదేశీ దిగ్గజ బ్రాండ్ స్టోర్లు సహా అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ స్పేస్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ 2,000 సీట్ల సామర్థ్యంలో ఐనాక్స్ 11 స్క్రీన్ల థియేటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదే ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా.68.8 బిలియన్ డాలర్లు.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు రిటెయిలింగ్ మార్కెట్ అంచనా ఇది. ఏటా 6.9 శాతం వృద్ధి చెందుతుందని లెక్కలేస్తున్నారు. 2023లో ఇది 43.2 బిలియన్ డాలర్లుగా ఉంది.విమాన ప్రయాణికుల జోరు ఇది.. (కోట్లలో)ఎయిర్ ట్రాఫిక్ 2024 2023 వృద్ధి(%)దేశీయ 16.13 15.20 6.11అంతర్జాతీయ 6.45 5.79 11.4 -
భోగాపురం పనులు చకచకా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విభజిత ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు విజయనగరం జిల్లా భోగాపురం వద్ద శరవేగంగా జరుగుతున్నాయి. 2014–19 టీడీపీ హయాంలో అపరిష్కృతంగా వదిలేసిన సమస్యలను తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాకచక్యంగా పరిష్కరించిన సంగతి తెలిసిందే. భూసేకరణను పూర్తి చేయడమే గాక నిర్వాసితులకు పరిహారం, పునరావాసం విషయంలోనూ అడ్డంకులన్నీ తొలగించింది. కేంద్రం వద్ద పెండింగ్‌లోనున్న అనుమతులన్నీ తీసుకువచ్చింది. ఆ తర్వాతే 2023 మే 3న నాటి సీఎం వైఎస్ జగన్ ఈ విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరగా ఈ పనులన్నీ ఊపందుకున్నాయి.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే 30% పనులు పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్ నాటికి ప్రధాన నిర్మాణ పనులన్నీ 56 శాతానికి చేరాయి. మిగతావన్నీ పూర్తి చేసి 2026 డిసెంబర్ నాటికల్లా తొలి దశ పూర్తిచేయడమే లక్ష్యంగా నిర్మాణ సంస్థ జీఎంఆర్ నిర్మాణాల వేగాన్ని మరింతగా పెంచింది. ఉత్తరాంధ్ర ప్రగతికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌పోర్టు కంపెనీల్లో ఒకటైన జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో చేపట్టింది. వాస్తవానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ 2025 డిసెంబర్‌కి మొదటి దశ పూర్తి చేయాలని అభిలషించారు. ఇందుకు జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధిపతి గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్) కూడా సానుకూలంగా స్పందించారు. అందుకనుగుణంగానే ల్యాండ్ ఫిల్లింగ్, రన్‌వే, టెర్మినల్ నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. ఈ పనులన్నీ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. 56 శాతం పూర్తి అయ్యాయని అధికారులు చెబుతున్నారు. పూర్తి అయితే ప్రగతికి దోహదం...ఏటా 4 కోట్ల మంది విమాన ప్రయాణం చేసేలా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నారు. 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో తొలి దశ నిర్మాణ పనులు చేపట్టారు. ఇవి 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేసిన తర్వాత తదుపరి దశ పనులు చేపడతారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రగతికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఊతంగా నిలుస్తుంది. దేశీయ, విదేశీ విమానయానం మరింతగా ఊపందుకుంటుంది. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో ఫార్మా, ఆక్వా తదితర పరిశ్రమల విస్తరణకు, ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు ఆధారమవుతుంది. మరోవైపు ఈ ప్రాంతంలో వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.⇒ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ ప్రక్రియను రూ.835.48 కోట్లతో పూర్తి చేసింది. ⇒ 4 గ్రామాల్లోని 404 నిర్వాసిత కుటుంబాలకు రూ.67.04 కోట్లతో అన్ని మౌలిక వసతులతో ఈ పునరావాస కాలనీలను నిర్మించింది.⇒ ప్రతి కుటుంబానికి 240 చదరపు గజాల ఇంటిస్థలం, అక్కడ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి రూ.9.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది.⇒ విమానాశ్రయానికి ఏటా 5 ఎంఎల్డీ నీటి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. తక్షణమే 1.7 ఎంఎల్డీ నీటి సరఫరాకు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి రూ.5.30 కోట్లు మంజూరు చేసింది.⇒ 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా ఏర్పాట్లకు రూ.2.62 కోట్ల నిధులు విడుదల చేసింది.⇒ విమానాశ్రయానికి సేకరించిన భూమిలోనున్న విద్యుత్తు లైన్లు, స్తంభాల స్థలామార్పిడికి రూ.2.30 కోట్ల వ్యయం చేసింది.⇒ స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి భోగాపురం మండలం బసవపాలెం వద్ద 24.30 ఎకరాల భూమి కేటాయించింది.⇒132/133 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భోగాపురం మండలం కొంగవానిపాలెం వద్ద 5.47 ఎకరాల భూమి ఇచ్చింది. -
ఈఫిల్ టవర్‌పైకి విమానం!
ఈ ఫొటో చూస్తే ఏం గుర్తొస్తోంది? న్యూయార్క్ జంట టవర్లను విమానాలతో కూల్చేసిన 9/11 ఉగ్ర దాడే కదూ! కానీ నిజానికిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) రూపొందించిన ప్రకటన! భద్రతా ఆందోళనలతో పీఐఏపై విధించిన నిషేధాన్ని నాలుగేళ్ల అనంతరం ఇటీవలే యూరోపియన్ యూనియన్ తొలగించింది. దాంతో పాక్ నుంచి యూరప్‌కు విమాన సర్విసులు తిరిగి మొదలయ్యాయి. దీనికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పీఐఏ చేసిన ప్రయత్నమిది! కాకపోతే ప్రకటనలో పీఐఏ విమానం నేరుగా పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా, ‘పారిస్! ఈ రోజే మేమొచ్చేస్తున్నాం!’అంటూ క్యాప్షన్ కూడా జోడించారు!! అలా అచ్చం అమెరికాపై ఉగ్ర దాడిని గుర్తుకు తెస్తుండటంతో పీఏఐ ప్రకటన పూర్తిగా బెడిసికొట్టింది. యాడ్‌ను 9/11 ఉగ్ర దాడితో పోలుస్తూ నెటిజన్లంతా తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై పుట్టుకొచ్చిన మీమ్‌లు సోషల్ మీడియాలో రోజంతా వైరలయ్యాయి. సరదా కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పీఐఏకు కొత్త గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరమంటూ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమర్ చెణుకులు విసిరారు. పార్లమెంటులోనూ ప్రస్తావన! యాడ్ ఉదంతం అంతర్జాతీయంగా పరువు తీయడంతో తలపట్టుకోవడం పాక్ ప్రభుత్వం వంతయింది. ఇది మూర్ఖత్వానికి పరాకష్ట అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ అయితే ఈ అంశాన్ని ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. ‘ఫొటోయే చాలా అభ్యంతరకరం మొర్రో అంటే, క్యాప్షన్ మరింత దారుణంగా ఉంది’అంటూ వాపోయారు. ‘‘ప్రధాని కూడా దీనిపై చాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటనను ఎవరు అనుమతించారో విచారణలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తప్పవు’’అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001లో జరిగిన ఉగ్ర దాడిలో 3,000 మందికి పైగా మరణించడం తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు జంట టవర్లను వాటితో ఢీకొట్టారు. దాంతో టవర్లు నేలమట్టమయ్యాయి. తొలిసారేమీ కాదు అర్థంపర్థం లేని ప్రకటనతో అభాసుపాలు కావడం పీఐఏకు కొత్తేమీ కాదు. 2016లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే గ్రౌండ్ స్టాఫ్ మేకను బలివ్వడం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కింది. అంతకుముందు 1979లో ఏకంగా పాక్‌కు చెందిన బోయింగ్ 747 విమానం నేరుగా న్యూయార్క్ జంట టవర్లపైకి దూసుకెళ్తున్నట్టుగా పీఐఏ యాడ్ రూపొందించింది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ గతానుభవాల నుంచి పీఐఏ ఏమీ నేర్చుకోలేదని తాజాగా రుజువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పీఐఏ గ్రాఫిక్స్ హెడ్‌కు చరిత్రకు సంబంధించి క్రాష్ కోర్స్ చేయిస్తే మేలంటూ సలహాలిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Delhi: రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయ్యింది. నోయిడాలో రూపొందుతున్న విమానాశ్రయంలో.. సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్, టేకాఫ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. దీంతో.. వచ్చే ఏడాది నుంచి ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఇండిగోకు విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో మాత్రమే నోయిడా ఎయిర్‌పోర్టుకు బయలు దేరింది. అవసరమైన భద్రతా తనిఖీల తర్వాత రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ రీజియన్‌లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉండగా.. ఇప్పుడు నోయిడా ఎయిర్పోర్ట్ రెండవ ప్రధాన విమానాశ్రయంగా మారనుంది, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్‌లో ఉంది. అధునాతన హంగులు, సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. #WATCH | Uttar Pradesh: Noida International Airport Limited (NIAL) conducts the first flight validation test for Noida International Airport ahead of the airport’s commercial opening in April 2025. pic.twitter.com/C3axT4mZeH— ANI (@ANI) December 9, 2024 -
అన్ని తనిఖీలు దాటుకుని ఎంచక్కా పారిస్‌కు
న్యూయార్క్/పారిస్: అమెరికా. నిఘా నేత్రాలమయం. అక్కడ మన లాంటి భారతీయులు రోడ్లపై తిరుగుతున్నా అనుమానమొస్తే పోలీసులు మొత్తం ఆరాతీస్తారు. సంబంధిత గుర్తింపు కార్డులు చూపిస్తేనే వదిలేస్తారు. లేదంటే పోలీస్‌స్టేషన్‌కు పోవాల్సిందే. మరి అలాంటిది అంతర్జాతీయ విమానాశ్రయంలో నేరుగా విమానం ఎక్కనిస్తారా?. అస్సలు కుదరదు. పాస్‌పోర్ట్, వీసా, ఐడీ కార్డులు, లగేజీ తనిఖీలు, నిషేధిత వస్తువుల లేకుండా చూసుకోవడం.. వంటివన్నీ పూర్తిచేసుకుంటేనే బోర్డింగ్ పాస్ చేతికొస్తుంది. విమానంలోకి అడుగుపెట్టగలం. అలాంటిది ఒక మధ్యవయస్కురాలు ఇవేం లేకుండా నేరుగా విమానం ఎక్కేసింది. అదేదో మారుమూల విమానాశ్రయంలో అంతరాష్ట్ర విమానమో ఆమె ఎక్కలేదు. నేరుగా అంతర్జాతీయ విమానమే ఎక్కింది. న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకుంది. దీంతో అత్యంత కట్టుదిట్ట భద్రత అని చెప్పుకునే అమెరికా ఎయిర్‌పోర్ట్‌లోనూ డొల్ల వ్యవస్థ ఉందని ఆమె పరోక్షంగా నిరూపించింది. ఎక్కడా ఎవరికీ చిక్కుకుండా పారిస్‌లో దిగి ఎయిర్పోర్ట్ బయటకు వెళ్దామని ఆశించి భంగపడింది. ఫ్రాన్స్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దొరికిపోయింది. అమెరికా ఎయిర్పోర్ట్ వ్యవస్థ పరువుతీసిన ఈ మహిళ గురించే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వల్లే ఆమె ఖండాంతయానం చేయగలిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి. తప్పు ఎక్కడ జరిగిందని కూపీలాగుతున్నాయి. ఈమె ఊరు పేరు ఇతరత్రా వివరాలను అధికారులు బయటపెట్టలేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ట్రాన్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి న వివరాల ప్రకారం గత మంగళవారం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. 55–60 ఏళ్ల మహిళ టికెట్, ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అక్కడ రెండు చోట్ల ఐడెంటిటీని చెక్ చేసే గుర్తింపు కేంద్రాలను ఒడుపుగా దాటేసింది. తర్వాత అనుమానాస్పద వస్తువులను తనిఖీచేసే సెక్యూరిటీ చెక్పాయింట్లనూ దాటింది. తర్వాత బోర్డింగ్ పాస్ జారీచేసే చోటు నుంచి తెలివిగా ఆవలి వైపునకు వచ్చేసింది. రన్‌వే మీద నిలిచి ఉన్న విమానం దాకా ప్రయాణికులను తీసుకెళ్లే బస్సును ఎక్కేసింది. తర్వాత విమానం తలుపు దగ్గర ఎయిర్‌హోస్టెస్ స్వాగత పలకరింపులు, పరిచయాలను పూర్తిచేసుకుని లోపలికి ప్రవేశించింది. నిండుగా ఉన్న విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదుకాబట్టి బాత్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అంతా సవ్యంగా ఉండటంతో విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్రాన్స్‌లోని ఛార్లెస్ డి గాలే ఎయిర్పోర్ట్ పార్కింగ్ పాయింట్ వద్ద విమానం ఆగిన తర్వాత విమానంలోనే ఈమెను అధికారులు గుర్తించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాబ్ జాక్సన్ ఇంకొన్ని వివరాలను వెల్లడించారు. విమానంలో సీట్లో కూర్చోకుండా ఒక బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూమ్లోకి మారుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఈమె వాలకం చూసి విమానసిబ్బందికి అనుమానమొచ్చింది. ఈమెను ఆపి ప్రశ్నించేలోపు ఇంకో బాత్రూమ్లో దూరి గడియపెట్టుకుంది. దీంతో ఫ్రాన్స్‌లో దిగాక పైలట్ వెంటనే ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏ ఉగ్రవాది నక్కాడో అని ప్రయాణికులు భయపడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు ఏమీ చెప్పలేదు. ‘‘అందరూ మీమీ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. మన విమానంలో అదనపు అతిథి ఉన్నారు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు’’అని ప్యాసింజర్లను ప్రశాంతపరిచాడు. చివరకు పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. అమెరికా గ్రీన్‌కార్డ్.. విమానంలో చొరబడిన ఈమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, రష్యా పాస్‌పోర్ట్ ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికాలో ఉండే ఉద్దేశంలేక కావాలనే ఫ్రాన్స్ శరణుకోరు తూ శరణారి్థగా ఇక్కడికి అక్రమంగా వచ్చిం దని మరో కథనం వెలువడింది. ఆమె మానసిక స్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అనుమతిలేకుండా విమానం ఎక్కి సేవల దుర్వినియోగం, దేశం దాటి రావడం, ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు మోపి ఫ్రాన్స్ జైళ్లో పడేయొచ్చు. లేదంటే అమెరికాకే తిరిగి పంపొచ్చు. అప్పుడు అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పడే వీలుంది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించడంతో తమ వైపు సెక్యూరిటీ చెక్ విషయంలో ఏం లోపాలు జరిగాయో తెల్సుకునేందుకు విమానయాన సంస్థ ఈమెను ప్రశ్నించే వీలుంది. అమెరికాకు తిరిగొస్తే జేకేఎఫ్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను విచారించే అవకాశముంది. గత మంగళవారం థ్యాంక్స్‌గివింగ్ హాలిడే రోజు అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. అమెరికాలో ఆ ఒక్కరోజే 27 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఆ రద్దీని ఈమె తనకు అనువుగా మలుచుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
జేవార్: ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. నవంబర్ 15న తొలిసారిగా ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కానుంది. రెండవ దశ ట్రయల్ ఆపరేషన్‌లో భాగంగా విమానం నవంబర్ 15న ఇక్కడ ల్యాండ్ కానుంది. డిసెంబర్ 15 వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ వీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ట్రయల్ రన్ రెండవ దశలో అకాసా, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు ప్రతిరోజూ ఇక్కడ రాకపోకలు సాగిస్తాయన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే ఈ ట్రయల్‌లో ప్రతిరోజూ ఇక్కడి నుంచే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరుగుతాయన్నారు.డిసెంబరు 20 నాటికి ట్రయల్ రన్ డేటాను డీజీఈసీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీని తర్వాత ఎయిర్డోమ్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేయనున్నారు. మార్చి 20 నాటికి లైసెన్స్ వస్తుందని ఎయిర్పోర్ట్ అథారిటీ భావిస్తోంది. 2025 ఏప్రిల్ 17 నుంచి జేవార్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలు రాకపోకలు కొనసాగనున్నాయి. మొదటి రోజు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఇందులో జ్యూరిచ్, సింగపూర్, దుబాయ్ నుండి మూడు అంతర్జాతీయ విమానాలు సహా రెండు కార్గో విమానాలు కూడా ఉన్నాయి.ముందుగా 30 విమానాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 25 దేశీయ, మూడు అంతర్జాతీయ, రెండు కార్గో విమానాలు ఉన్నాయని అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రన్‌వే, గాలి ప్రవాహం, మొదటి దశ ట్రయల్స్‌ను పరిశీలించిన తర్వాత దీనికి ఆమోదం తెలిపింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, డెహ్రాడూన్‌తో సహా పలు పెద్ద నగరాలకు తొలుత కనెక్ట్ కానుంది.ఇది కూడా చదవండి: మహాప్రాణులకు మళ్లీ జీవం! -
విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ కనిపించడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ్ల చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. నంబర్ ఏఐ 916 ఎయిరిండియా విమానం అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వి మానాశ్రయంలో ల్యాండయ్యింది. ప్ర యాణికులంతా సురక్షితంగా కిందికి దిగి న తర్వాత ఒక సీటుపైనున్న బుల్లెట్ల కాట్రిడ్జ్‌ను సిబ్బంది గమనించారు. దీనిపై వెంటనే వారు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి వాటిని విమానంలోకి తీసుకురావడం పూర్తి నిషేధం ఉంది. ఇప్పటికే 400కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడం..అవన్నీ ఉత్తుత్తివేనని తేలడం తెలిసిందే. భద్రతా చర్యలను తనిఖీలను ముమ్మరం చేసినా పేలుడు సామగ్రి కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా, సోమవారం నేపాల్‌లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది. విమానాశ్రయం అధికారులు వెంటనే సిబ్బందిని కిందికి దించి పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో కొద్ది సేపటికి విమానం టేకాఫ్ తీసుకుంది. -
GMR: నాగ్‌పూర్ విమానాశ్రయం ఆధునీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్ట్స్ డెవలపర్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ తాజాగా నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రమాణాల పెంపు, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయాన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక విమానయాన హబ్‌గా మార్చనున్నట్టు జీఎంఆర్ తెలిపింది. ‘వ్యూహాత్మకంగా మధ్య భారత్‌లో ఉన్న నాగ్‌పూర్ ప్రయాణికులకు, సరుకు రవాణాకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. దశలవారీగా ఏటా 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి అభివృద్ధి చేస్తాం. కార్గో హ్యాండ్లింగ్ సామ ర్థ్యం 20,000 టన్నులకు చేరనుంది. తద్వారా నాగ్‌పూర్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతుంది. తొలి దశ లో ప్యాసింజర్ టెరి్మనల్ సామర్థ్యం 40 లక్షల మంది ప్రయాణికుల స్థాయి లో తీర్చిదిద్దుతాం. మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్పోర్ట్ ఎట్ నాగ్‌పూర్‌తో (మిహా న్) జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పో ర్ట్‌కు కన్సెషన్ ఒప్పందం కుదిరింది’ అని జీఎంఆర్ తెలిపింది. -
Russian President Vladimir Putin: అతని కోసం ఎందాకైనా...!
2024 ఆగస్టు 1. మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం. అప్పుడే లాండైన విమానం నుంచి 8 మంది ప్రత్యేక భద్రత మధ్య బయటికి వచ్చారు. వారిలో ఒకరిని రిసీవ్ చేసుకునేందుకు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే విమానాశ్రయం దాకా వచ్చారు. సదరు ‘వీఐపీ’కి షేక్‌హాండ్ ఇచ్చి మరీ సాదరంగా స్వాగతించారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం. 2019 ఆగస్టు. జర్మనీ రాజధాని బెర్లిన్. చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయానికి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఓ పార్కు. సైకిల్‌పై వస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. తన ముందు నడుస్తున్న మాజీ చెచెన్ రెబెల్ జెలీంఖాన్ ఖాన్గోష్విలిని టపీమని కాల్చేశాడు. చుట్టుపక్కల వాళ్లు షాక్ నుంచి తేరుకునే లోపే క్షణాల్లో మాయమైపోయాడు. సైకిల్‌ను పక్కనే ఉన్న నదిలో పారేశాడు. విగ్గు తీసి, నీట్‌గా షేవ్ చేసుకుని ఎవరూ గుర్తించలేనంతగా రూపం మార్చుకున్నాడు. విధి వక్రించి ప్రత్యక్ష సాక్షులు గుర్తించడంతో కాసేపటికే పట్టుబడి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. – నాడు జర్మనీలో జీవితఖైదుకు గురైందీ, నేడు మాస్కోలో పుతిన్ నుంచి ఘనస్వాగతం అందుకున్నదీ ఒక్కడే. అతనే... వదీం క్రషికోవ్. పేరుమోసిన రష్యా హిట్‌మ్యాన్. జెలీంఖాన్ ఒక్కడినే కాదు, రష్యాకు కంట్లో నలుసుగా మారిన వాళ్లెందరినో క్రషికోవ్ వెంటాడి వేటాడాడు. విదేశీ గడ్డపై ఇలాంటి అసైన్మెంట్లను సైలెంట్‌గా పూర్తి చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. రష్యా గూఢచర్య సంస్థ ఎఫ్ఎస్బీలో చేరిన కొన్నాళ్లకే టాప్ రేటెడ్ హిట్‌మ్యాన్‌గా పేరు సంపాదించాడు. ముఖ్యంగా పుతిన్‌కు అత్యంత ఇషు్టనిగా మారాడు. అందుకే అతన్ని విడిపించుకోవడాన్ని ఆయన సవాలుగా తీసుకున్నారు. జెలీంఖాన్ హత్యతో తనకు సంబంధమే లేదని విచారణ పొడవునా క్రషికోవ్ బుకాయించినా, అది అతని పనేనని పుతిన్ అధికారికంగానే అంగీకరించారు. క్రషికోవ్‌ను ‘గొప్ప దేశభక్తుని’గా అభివరి్ణంచారు. అతని కోసం సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికాతో చరిత్రలోనే అతి పెద్ద ఖైదీల మారి్పడికి కూడా అంగీకరించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, మాజీ మెరైన్ పౌల్ వీలన్, రష్యా అసమ్మతివాది వ్లాదిమిర్ కారా ముర్జా సహా 16 మందిని వదిలేశారు. బదులుగా అమెరికా, జర్మనీ, పశ్చిమ దేశాల నుంచి క్రషికోవ్తో పాటు 8 మంది రష్యన్లను విడిపించుకున్నారు. వారిలో మరో ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లున్నారు. తద్వారా, విదేశాల్లో ఇలాంటి ఆపరేషన్లు చేసే క్రమంలో దొరికిపోయినా అధ్యక్షుడు తమను కాపాడి తీరతారని నిఘా విభాగం ఏజెంట్లకు ధీమా ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆశించింది కూడా అదేనని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
ఢిల్లీలో బీభత్సం సృష్టించిన గాలి వాన
-
కుప్పకూలిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు
-
Kuwait Fire Incident: భారత్‌కు చేరుకున్న‘కువైట్’ బాధితుల మృతదేహాలు
కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా 23 మంది కేరళీయులు ఉన్నారు. మృతుల్లో కర్ణాటక సంబంధించి ఒకరు, తమిళనాడుకు చెందిన ఏడుగురి మృతదేహాలనూ తీసుకొచ్చారు. మృతదేహాలను తొలుత శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానా శ్రయానికి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వారికి నివాళులర్పించారు. ‘‘ జీవనోపాధి కోసం విదేశం వెళ్లి విగతజీవులైన బడుగుజీవుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవాలి. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం సరిపోదు’ అని సీఎం అన్నారు. కువైట్ నుంచి మృతదేహాల తరలింపు ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తోపాటు తమిళనాడు మైనారిటీ సంక్షేమ మంత్రి కేఎస్ మస్తాన్లు సైతం పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు.మృతుల్లో ముగ్గురు తెలుగువారుఅగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువ్యక్తులు సైతం చనిపోయారని ఆంధ్రప్రదేశ్ నాన్– రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఏపీఎన్ఆర్టీఎస్ పేర్కొంది. ‘‘ సొంత పనిమీద స్వదేశానికి వచ్చిన లోకనాథం తిరిగి కువైట్ బయల్దేరారు. స్వస్థలం నుంచి తొలుత జూన్ 5న హైదరాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత జూన్ 11న కువైట్ చేరుకున్నారు. ఆయన భవంతికి వచ్చి బసచేసిన అదే రోజున అగ్నిప్రమాదం జరిగి తుదిశ్వాస విడిచారు’’ అని లోకనాథం బంధువు శాంతారావు చెప్పారు. -
బెజవాడలో ‘లెజెండ్’
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) చరిత్రలోనే అతిపెద్ద విమానం సోమవారం రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. హజ్ యాత్రికుల కోసం స్పైస్ జెట్ సంస్థ ప్రత్యేకంగా నడుపుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ340–300 విమానం ఇక్కడ దిగింది. తొలిసారి విమానాశ్రయానికి వచి్చన ఈ భారీ విమానానికి ఎయిర్పోర్ట్ అధికారులు వాటర్ కానన్ స్వాగతం పలికారు. సుమారు 324 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానం ఏకధాటిగా 14,400 కిలో మీటర్లు ప్రయాణం చేయగలదు. అతి పొడవైన ఈ విమానాన్ని చూసేందుకు ఎయిర్ పోర్ట్ సిబ్బందితో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తి కనబరిచారు. గతంలో 7,500 అడుగుల ఉన్న రన్‌వేను నాలుగేళ్ల కిందట 11 వేల అడుగులు (3,360 మీటర్లు) పెంచడంతో పాటు బలోపేతం చేశారు.ప్రస్తుతం ఈ రన్‌వేపై బోయింగ్ 747, 777, 787, ఎయిర్‌బస్ ఎ330, ఎ340, ఎ350 వంటి వైడ్‌బాడీ ఎయిర్‌క్రాప్ట్ దిగేందుకు అనువుగా ఉంది. విస్తరించిన రన్‌వేపై తొలిసారిగా అతిపెద్ద ఎయిర్‌బస్ ఎ340 విమానం దిగడం సంతోషంగా ఉందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందుతుందనడానికి ఇది నిదర్శనమన్నారు. అనంతరం ఈ విమానం 322 మంది హజ్ యాత్రికులతో సౌదీ అరేబియా దేశంలోని జెడ్డాకు బయలుదేరి వెళ్లింది. -
పవిత్ర హజ్‌యాత్ర ప్రారంభం
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రం నుంచి పవిత్ర హజ్‌యాత్ర–2024 సోమవారం ప్రారంభమైంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ఉదయం 9.51గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ340 ప్రత్యేక విమానంలో 322మంది యాత్రికులు జెడ్డాకు బయలుదేరి వెళ్లారు. తొలుత హజ్ క్యాంపుగా వినియోగించిన గన్నవరం ఈద్గా జామా మసీదు వద్ద తెల్లవారుజామున 3గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)కు యాత్రికులను తీసుకువెళుతున్న బస్సులను జెండా ఊపి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ కె.హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి మొత్తం 692 మంది హజ్‌యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. తొలి విమానంలో 322మంది వెళుతున్నారని, మిగిలిన యాత్రికులు ఈ నెల 28, 29 తేదీల్లో రెండు ప్రత్యేక విమానాల్లో వెళతారని చెప్పారు. హజ్ యాత్రికులకు ప్రయాణ రాయితీ, సదుపాయాల కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో హజ్ యాత్రికులకు అన్ని సదుపాయాలను కలి్పంచినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి ఎల్.అబ్దుల్ ఖాదర్, హజ్ కమిటీ సభ్యుడు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీం బాషా, దూదేకుల కార్పొరేషన్ ఎండీ గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొని హజ్‌యాత్ర విజయవంతం కావాలని హాజీలకు అభినందనలు తెలిపారు. -
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లేజర్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు షాకింగ్ ఘటన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో.. అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికులు గాయపడ్డారు. వెనెజులా రాజధాని కారకాస్ శివారులోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు లేజర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెనెజులా నుంచి డొమినికన్ రిపబ్లికన్‌కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఉన్నట్టుండి విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కొందరు వెంటనే అత్యవసర స్లైడ్ ద్వారా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Following an APU failure aboard a <a href="https://twitter.com/laserairlines?ref_src=twsrc%5Etfw">@laserairlines</a> MD-80, passengers were evacuated due to smoke in the cabin. Regrettably, most passengers exited with their carry-on luggage, resulting in avoidable hazards. <a href="https://t.co/7FsfZ3Zkuk">pic.twitter.com/7FsfZ3Zkuk</a></p>&mdash; Enrique Perrella (@Enrique77W) <a href="https://twitter.com/Enrique77W/status/1784737773464735912?ref_src=twsrc%5Etfw">April 29, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్‌లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు.బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!)#Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw— Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మికి పేరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు–అయోధ్యధామ్’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో ‘సున్నా కర్బన ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహనా ఒప్పందానికి కూడా అంగీకరించింది. ‘పృథ్వీ విజ్ఞాన్’కు ఆమోదం ఎర్త్ సైన్సెస్ రంగంలో ఐదు వేర్వేరు పథకాల కింద పరిశోధనలకు, కేటాయించిన నిధుల వినియోగానికి ఉద్దేశించిన ‘పృథ్వీ విజ్ఞాన్’కు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని అమలుకు రూ.4,797 కోట్లు కేటాయించింది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్, సీస్మాలజీ, జియోసైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. పృథ్వీ విజ్ఞాన్ కింద రీసెర్చ్ ప్రాజెక్టులను విదేశీ సంస్థలకు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గయానా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు హైడ్రో కార్బన్ రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకునేందుకూ అంగీకరించింది. గయానాలో ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారతీయ కంపెనీలకు సైతం భాగస్వామ్యం కలి్పస్తారు. ప్రపంచ దేశాలతో అయోధ్య అనుసంధానం: మోదీ అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వాల్మికి మహర్షికి దేశ ప్రజల తరపున ఘనమైన నివాళిగా అభివరి్ణంచారు. అయోధ్యను ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. -
పైలట్ నోట జై శ్రీరాం
న్యూఢిల్లీ: అయోధ్యలో శనివారం మొదలైన ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరి వెళ్లింది. ఇండిగో విమానయాన సంస్థ తమ తొలి ఢిల్లీ–అయోధ్య విమానాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించింది. ఈ విమానంలోకి అడుగుపెడుతున్న ప్రయాణికులకు పైలట్ అశుతోష్ శేఖర్ .. ‘జై శ్రీరామ్’ అంటూ స్వాగతం పలికారు. ‘అయోధ్యకు బయల్దేరుతున్న తొలి విమానానికి సారథ్యం వహించే బాధ్యతలు నాకు అప్పగించడం నిజంగా నా అదృష్టం. మీ ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్’ అని ఆయన విమానంలో అనౌన్స్ చేశారు. తమ తమ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. -
జనవరి 22న... ఇంటింటా రామజ్యోతి
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టను దీపావళి పర్వదినంగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఆ సందర్భంగా జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ రోజు కోసం ప్రపంచమంతా ఏళ్ల తరబడి ఎదురుచూసిందన్నారు. ఏళ్ల తరబడి గుడారంలో గడిపిన రామునికి ఎట్టకేలకు ‘పక్కా ఇల్లు’ సాకారమైందన్నారు. అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. నూతన విమానాశ్రయంతోపాటు ఆధునీకరించిన రైల్వే జంక్షన్‌ను ప్రారంభించారు. రూ.15,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, వారసత్వం రెండు పట్టాలుగా దేశం ప్రగతి పథంలో పరుగులు తీయాలని ఆకాంక్షించారు. జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని, ఎక్కడివారక్కడే రామాలయ ప్రారంభ వేడుకలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఉజ్వల్ పథక 10 కోట్లవ లబి్ధదారు ఇంట్లో మోదీ చాయ్ ఆస్వాదించారు. అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జనవరి 22న దేశమంతటా ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. నిత్యం రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్న అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రోజంతా బిజీబిజీగా గడిపారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాక అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభాన్ని, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమంటే అందరికీ దీపావళి పండుగే. దీనికి గుర్తుగా ఆ రాత్రి ఇంటింటా శ్రీరామ జ్యోతిని వెలిగించండి. అయోధ్యలో రామ్‌లల్లా (బాల రాముడు) ఇంతకాలం తాత్కాలిక టెంట్ కింద గడపాల్సి వచ్చింది. ఇప్పుడు దేశంలోని నాలుగు కోట్ల మంది పేదలతో పాటు రామ్‌లల్లాకు కూడా పక్కా ఇల్లు వచ్చేసింది’’ అని అన్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని చరిత్రాత్మక ఘట్టంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఈ రోజు కోసం యావత్ ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. కనుక అయోధ్య వాసుల్లో ఇంతటి ఉత్సాహం సహజం. భరత గడ్డపై అణువణువునూ ప్రాణంగా ప్రేమిస్తా. ప్రతి భారతీయుడూ పుట్టిన నేలను ఆరాధిస్తాడు. నేనూ మీలో ఒకడినే’’ అన్నారు. వికాస్.. విరాసత్ అత్యంత స్వచ్ఛమైన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దుదామంటూ ప్రతిజ్ఞ చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ఇది అయోధ్యవాసుల బాధ్యత. జనవరి 14 నుంచి 22వ తేదీ దాక దేశంలోని అన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాల్లో స్వచ్ఛత కార్యాక్రమాలు చేపడదాం. దేశం కోసం కొత్త తీర్మానాలు, మనం కోసం కొత్త బాధ్యతలను తలకెతత్తుకుందాం. ఏ దేశమైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిందే. వికాస్ (అభివృద్ధి)తో పాటు విరాసత్ (వారసత్వం) కూడా ముఖ్యమే. అవి రెండూ పట్టాలుగా 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఆ రెండింటి ఉమ్మడి అభివృద్ధి బలమే భారత్‌ను ముందుకు నడుపుతుందన్నారు. సభలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న మెగా రోడ్ షో శనివారం ఉదయం 11 గంటలకు అయోధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక మోదీ అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ దాకా దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా రోడ్‌షో సాగింది. దారి పొడవునా ప్రధానికి అయోధ్యవాసులు, పలు రాష్ట్రాల నుంచి వచి్చన కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. రోడ్‌షో మధ్య మధ్యలో ఏర్పాటుచేసిన 40 కళావేదికల వద్ద పలు రాష్ట్రాల కళాకారులు నృత్య, కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి వచి్చన కళాకారులు రాముని జీవితంతో ముడిపడి ఉన్న ‘దేధియా’ నృత్యంతో ఆకట్టుకున్నారు. అనంతరం మోదీ మార్గమధ్యంలో అతిపెద్ద వీణతో అలంకృతమైన లతా మంగేష్కర్ చౌక్ వద్ద కాసేపు గడిపారు. ఆ రోజు రాకండి ఆహా్వనితులు మినహా మిగతా వారు 22న అయోధ్యకు రావద్దని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘‘రామాలయ ప్రాణప్రతిష్ఠ క్రతువును ప్రత్యక్షంగా తిలకించేందుకు జనవరి 22వ తేదీనే అయోధ్యకు పోటెత్తాలని అసంఖ్యాకులు భావిస్తున్నట్టు తెలిసింది. దయచేసి ఆ రోజున మాత్రం అయోధ్యకు రాకండి. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎందుకంటే అందరికీ అదే రోజున దర్శనభాగ్యం సాధ్యపడదు. ఆ రోజు చాలామంది విశిష్ట అతిథులు విచ్చేస్తున్నారు. కనుక యావత్ ప్రజానీకం జనవరి 23 నుంచి జీవితాంతం అయోధ్య రామున్ని దర్శించుకోవచ్చు’’ అని సూచించారు. వాలీ్మకి మహర్షి ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో ఆధునిక హంగులతో సిద్దమైన విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. రామాయణ కర్త పేరిట దీనికి మహర్షి వాలీ్మకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక సౌకర్యాలతో రూ.1,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని శనివారం ఉదయం మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వాలీ్మకి విరచిత రామాయణం మనకు గొప్ప జ్ఞానపథమని ఈ సందర్భంగా అన్నారు. ‘‘అది మనల్ని శ్రీరామ ప్రభువు చెంతకు చేరుస్తుంది. ఆధునిక భారత దేశంలో అయోధ్య ధామంలోని వాలీ్మకి విమానాశ్రయం మనల్ని దివ్య (మహోన్నత), భవ్య (అద్భుత), నవ్య (ఆధునిక) రామ మందిరానికి చేరుస్తుంది. అప్పట్లో ఇదే రోజున అండమాన్ దీవికి బ్రిటిష్ చెర నుంచి సుభాష్ చంద్రబోస్ విముక్తి కలి్పంచారు. అక్కడ జాతీయ జెండా ఎగరేశారు. మనలి్నది ఆజాదీ కీ అమృత్ కాల్లోకి తీసుకెళ్తుంది’’ అన్నారు. విమానాశ్రయ విశేషాలు.. ► అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాతి్మక వాతావరణం ప్రతిబింబించేలా విమానాశ్రయ నిర్మాణం సాగింది. టెర్మినల్ భవనానికి శ్రీరామ మందిరాన్ని తలపించేలా తుదిరూపునిచ్చారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ వేశారు. రాముడి జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలకు విమానాశ్రయంలో చోటు కలి్పంచారు. ► బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించారు. ► ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ► చుట్టూతా పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. ► విమానాశ్రయ నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ► ఈ ఎయిర్‌్రస్టిప్ గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీన్ని రూ.350 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. ఇందుకు యూపీ ప్రభుత్వం 821 ఎకరాలు కేటాయించింది. ► ఏటా 10,000 మంది ప్రయాణికుల రాకపోకలను వీలుగా విమానాశ్రయాన్ని విశాలంగా నిర్మించారు. టెరి్మనల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టారు. ► 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఉండటంతో ఎయిర్‌బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చాలా సులువు. రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకోవచ్చు. ► భవిష్యత్తులో విమానాశ్రయ రెండో దశ విస్తరణ మొదలవనుంది. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరిస్తారు. ► ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ► రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కలి్పంచాలని భావిస్తున్నారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు పచ్చజెండా అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.241 కోట్లతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి రెండు అమృత్ భారత్ రైళ్లను, ఆరు వందే భారత్ రైలు సేవలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘ మూడు కొత్త సేవలైన వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్‌ల ‘త్రిశక్తి’తో భారత రైల్వే నూతన అభివృద్ధి శకంలోకి దూసుకెళ్లగలదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. మూడంతస్తుల నూతన అయోధ్య రైల్వేస్టేషన్లో సరికొత్త సౌకర్యాలను కలి్పంచారు. లిఫ్ట్‌లు, కదిలే మెట్లు, ఫుడ్ ప్లాజాలు, వాణిజ్య, వ్యాపార సముదాయలు, పూజా సామగ్రి దుకాణాలు, చైల్డ్ కేర్, వెయిటింగ్ హాళ్లతో స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారి సరి్టఫికెట్‌నూ ఈ రైల్వేస్టేషన్ సాధించింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అమృత్ భారత్ రైలుకు తొలి రోజు విశేష స్పందన లభించింది. బుకింగ్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. -
అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితమిది
PM Narendra Modi In Ayodhya Updates ప్రపంచం యావత్తూ జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది : ప్రధాని మోదీ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నాం ఒకప్పుడు అయోధ్యలో రాముడు టెంట్లో కొలువుదీరాడు ఇప్పుడు రాముడికి గొప్ప మందిరం వచ్చింది ఇది అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితం అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలబెడతాం వారసత్వం మనకు సరైన మార్గం చూపిస్తుంది అభివృద్ధి చెందాలంటే వారసత్వాన్ని కాపాడుకోవాలి కొన్ని రోజుల్లో అయోధ్యలో వారసత్వం వెల్లివిరుస్తుంది ఇకపై అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య ఐదురెట్లు పెరుగుతుంది అయోధ్య ఎయిర్ పోర్ట్ చూసి ప్రతి ఒక్కరూ పులకించిపోతారు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ ప్రాంగణంలో జరిగిన జన్ సభలో భావోద్వేగంగా ప్రధాని మోదీ #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "Today the whole world is eagerly waiting for the 22nd January..." The consecration ceremony of the Ram temple will be held on January 22 in Ayodhya pic.twitter.com/MXTdAczYqn — ANI (@ANI) December 30, 2023 #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "I have a request to all. Everyone has a wish to come to Ayodhya to be a part of the event on 22 January. But you know it is not possible for everyone to come. Therefore, I request all Ram devotees that once the formal… pic.twitter.com/pbL81WrsbZ — ANI (@ANI) December 30, 2023 అయోధ్య బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి సంబంధించి రూ.15,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని #WATCH | Prime Minister Narendra Modi participates in a public programme in Ayodhya, Uttar Pradesh. The PM will inaugurate, dedicate to the nation and lay the foundation stone of multiple development projects worth more than Rs 15,700 crore in the state. pic.twitter.com/BxnVrZGNv3 — ANI (@ANI) December 30, 2023 అయోధ్యకు ఎగిరిన తొలి విమానం టేకాఫ్ అనౌన్స్ చేసిన ఇండిగో పైలట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్ కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్న తొలి విమానం #WATCH | IndiGo pilot captain Ashutosh Shekhar welcomes passengers as the first flight takes off from Delhi for the newly constructed Maharishi Valmiki International Airport, Ayodhya Dham, in Ayodhya, UP. pic.twitter.com/rWkLSUcPVF — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ #WATCH | PM Narendra Modi inaugurated Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/6phB4mRMY5 — ANI (@ANI) December 30, 2023 అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రారంభం జై శ్రీరామ్‌తో మారుమోగిపోతున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జై రామ్.. శ్రీరామ్ నినాదాలు అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను మరికాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రయాణికులతో అయోధ్య చేరుకోనున్న తొలి విమానం రామాయణం రచించిన మహర్షి వాల్మీకి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టిన కేంద్రం #WATCH | Delhi: People raise slogans of 'Jai Ram, Shri Ram'as they board the first flight for the newly built Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate Maharishi Valmiki International Airport Ayodhya Dham shortly. pic.twitter.com/4xrYPZeKK2 — ANI (@ANI) December 30, 2023 ఆ ఇద్దరికి సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్‌లు యూపీ అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన ఇద్దరు చిన్నారులు చిన్నారులకు సెల్ఫీ ఫోజులు ఇచ్చిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్‌లిచ్చి కాసేపు వాళ్లతో ముచ్చటించిన ప్రధాని Uttar Pradesh | Prime Minister Narendra Modi met two children in Ayodhya and took selfies with them and also gave them autographs. pic.twitter.com/N7PHVTRwr7 — ANI (@ANI) December 30, 2023 #WATCH | Ayodhya, Uttar Pradesh: Two children who met Prime Minister Narendra Modi and took selfies with him, express their happiness. PM Modi also gave them autographs. https://t.co/RCMlsNOxpp pic.twitter.com/mGryxiRhLP — ANI (@ANI) December 30, 2023 కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అయోధ్య ధామ్‌గా నామకరణం కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6వ తేదీ నుంచి విమానాల రాకపోకలు షురూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వాల్మీకి ఎయిర్‌పోర్ట్‌కి విమానాలు అయోధ్య లతా మంగేష్కర్ చౌక్‌లో సందడి చేసిన ప్రధాని మోదీ #WATCH | PM Narendra Modi at the Lata Mangeshkar Chowk in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/ZSkQVt41a3 — ANI (@ANI) December 30, 2023 ఆమె ఇంట్లో ఛాయ్ తాగిన ప్రధాని మోదీ అయోధ్య పర్యటనలో మోదీ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు ఉజ్వల యోజన లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లారు ఆమె ఇంట్లో టీ తాగి.. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు పీఎం ఉజ్వల యోజన కింద 10 కోట్ల మంది లబ్ధిదారులున్న సంగతి తెలిసిందే కాసేపట్లో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ అమృత్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని రెండు అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ అంతకు ముందు.. రైలులోని విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ అయోధ్య పర్యటనలో రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi flags off two new Amrit Bharat trains and six new Vande Bharat Trains. pic.twitter.com/Q1aDQc8wG7 — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ధామ్ జంక్షన్ ప్రారంభం అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ అయోధ్య ధామ్ జంక్షన్‌గా అయోధ్య రైల్వే స్టేషన్‌కు నామకరణం రూ.240 కోట్లతో పునరుద్ధరణ పనులు అయోధ్య మందిర చిత్రాలతో.. హైటెక్ హంగులతో స్టేషన్ మూడు అంతస్థులతో అయోధ్య జంక్షన్ పునర్నిర్మాణం #WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya, Uttar Pradesh Developed at a cost of more than Rs 240 crore, the three-storey modern railway station building is equipped with all modern features like lifts, escalators,… pic.twitter.com/oJMFLsjBnp — ANI (@ANI) December 30, 2023 #WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya. Uttar Pradesh Governor Anandiben Patel, CM Yogi Adityanath, Railways Minister Ashwini Vaishnaw are also present. pic.twitter.com/ls97j4eKkE — ANI (@ANI) December 30, 2023 भगवान रामलला की नगरी में #PMModi, उनके रोड शो में उमड़ा जनसैलाब, जय श्री राम की गुंज के बीच 'अयोध्या धाम जंक्शन' का किया उद्घाटन। #Ayodhya @BJP4India @narendramodi #RamMandir pic.twitter.com/gv8Ewzed39 — Aviral Singh (@aviralsingh15) December 30, 2023 దారిపొడవునా.. ప్రధానికి సాదర స్వాగతం ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో కొనసాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం మెగా రోడ్ షో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారుల ప్రదర్శన ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్‌ను కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ #WATCH | People shower flower petals on Prime Minister Narendra Modi as he holds a roadshow in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/b53mxsHFml — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం #WATCH | PM Narendra Modi greets people as he arrives in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/zqpaqjzzW4 — ANI (@ANI) December 30, 2023 అయోధ్యలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో అయోధ్య పర్యటనలో మెగా రోడ్‌షోలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ దారికి ఇరువైపులా బారులు తీరిన జనం అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రధాని మోదీ మోదీకి ఘనంగా స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా.. సాంస్కృతిక కళల ప్రదర్శన #WATCH | Prime Minister Narendra Modi arrives in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/c60Tzh4Xkb — ANI (@ANI) December 30, 2023 రాముడు అందరివాడు: ఫరూక్ అబ్దుల్లా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు రాముడు కేవలం హిందువులకే దైవం కాదు.. ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ దేవుడే.. అది పుస్తకాల్లోనూ రాసి ఉంది ప్రజలంతా మత, భాష బేధాలు లేకుండా సోదరభావంతో, ప్రేమతో, ఐక్యంగా ఉండాలని శ్రీరాముడు విశ్వ సందేశం ఇచ్చారు కాబట్టి ఆలయం ప్రారంభం అయ్యే సమయంలో అంతా సోదరభావంతో మెలగాలి #WATCH | Poonch, J&K: Former CM of Jammu and Kashmir and National Conference leader Farooq Abdullah says, "Ayodhya Ram Temple is about to be inaugurated. I would like to congratulate everyone who made the effort for the temple. It's ready now. I would like to tell everyone that… pic.twitter.com/V7Pb5Q8uN1 — ANI (@ANI) December 30, 2023 ►అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం ఎయిర్‌పోర్టు నుంచి 15 కిలోమీటర్లు సాగే రోడ్ షోలో పాల్గొననున్న మోదీ Prime Minister Narendra Modi arrives in Ayodhya; received by Uttar Pradesh Governor Anandiben Patel and CM Yogi Adityanath PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/yWqDDowRcm — ANI (@ANI) December 30, 2023 ►కాసేపట్లో అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కాసేపట్లో ప్రధాని అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఘనస్వాగతంతో ముందుకు సాగుతారు. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్‌ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్ సభ’లో మాట్లాడతారు. ఈ సభకు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశముంది. సభానంతరం ప్రధాని తిరుగు పయనమవుతారు ►అయోధ్యలో నాలుగు గంటలపాటు ఉండనున్న ప్రధాని #WATCH | Ayodhya: BJP MP Lallu Singh says, "Entire Ayodhya has been decorated. The people of Ayodhya are waiting eagerly for the most popular world leader, PM Modi...Devotees of Lord Ram in Ayodhya will welcome PM Modi with warmth." pic.twitter.com/h8Njr7Qinr — ANI (@ANI) December 30, 2023 ►అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11,100 కోట్ల ప్రాజెక్టులను, యూపీలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి రూ.4,600 కోట్ల పనులను ప్రారంభిస్తారు. అలాగే రామ మందిరానికి చేరుకునేలా కొత్తగా పునరుద్ధరించిన నాలుగు రహదారుల ప్రారంభం కూడా ప్రధాని షెడ్యూలులో ఉన్నట్లు పీఎంవో తెలిపింది. ►ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో నేడు అత్యాధునిక ఎయిర్పోర్ట్, ఆధునిక హంగులు సంతరించుకున్న రైల్వే స్టేషన్ ప్రారంభం ►రామమందిర శంకుస్థాపనకు ముందే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం కావడం గమనార్హం ► ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన ►మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రత పటిష్టం ►డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీలు.. డ్రోన్లతో నిఘా ►పూలతో అందంగా ముస్తాబైన అయోధ్య ►అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం Ayodhya Airport completed in record time of 20 months: Airport Authority Chairman Read @ANI Story | https://t.co/RSOVcfxEAc#AyodhyaAirport #Ayodhya #UttarPradesh #AAI pic.twitter.com/1v3OZwnS0Z — ANI Digital (@ani_digital) December 30, 2023 ►6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం ►ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు ►‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం’గా పేరు ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు సుందర నిర్మాణాలు శిఖరం, విల్లు బాణం వంటి గుర్తులు నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ విస్తరణ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్(రైట్స్) ఆధ్వర్యంలో అభివృద్ధి ►మరోవైపు.. అయోధ్యలో ఊపందుకున్న భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ►అయోధ్య నగరానికి 15 కి.మీ.ల దూరాన ఉన్న ఎయిర్‌పోర్టు నుంచి రైల్వేస్టేషనుకు వెళ్లే మార్గం పొడవునా ప్రధాని రోడ్‌షో ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో ఏర్పాటుచేసే 40 వేదికలపై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
నేడు అయోధ్యకు మోదీ.. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(శనివారం) ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో పర్యటించనున్నారు. రామమందిర శంకుస్థాపనకు ముందు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. నాలుగు గంటలపాటు అయోధ్యలో ఉండనున్నారు. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు. నగరాన్ని పూలతో అలంకరించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ పోస్టర్లు ఏర్పాటు చేశారు అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించారు.6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఈ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం’ అనే పేరు ఖరారు చేశారు. గతంలో ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’గా వ్యవహరించేవారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం చేశారు. శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సరీ్వస్ లిమిటెడ్(రైట్స్) అభివృద్ధి చేసింది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రంలో రూ.15,700 కోట్ల కంటే విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్లు ఖర్చు చేస్తుండగా..ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. -
రామ మందిర ప్రారంభానికి ముందే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందుగానే అంతర్జాతీయ విమానాశ్రయం తొలిదశ పూర్తి కానుంది. రామ మందిరం ప్రారంభోత్సవానికి నెల రోజుల ముందే, డిసెంబరు 15 నాటికి ఎయిర్పోర్ట్ తొలి దశ సిద్ధమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యూపీ సీఎం శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన విమానాశ్రయం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, డిసెంబర్ 15 నాటికి తొలి దశ పూర్తి చేస్తామని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌తో కలిసి విమానాశ్రయ స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 821 ఎకరాల భూమిని సమకూర్చిందని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అయోధ్య అభివృద్ధికి హామీ ఇవ్వడంతో పాటు, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ ప్రభుత్వం నిబద్ధతలో ఇది భాగమన్నారు. విమానాశ్రయంలో అయోధ్య సాంస్కృతిక నైతికతను ప్రతిబింబించేలా కృషి చేశామని సింధియా చెప్పారు. గంటకు 2-3 విమానాలను నిర్వహించగల సామర్థ్యంతో 65వేల చదరపు అడుగుల టెర్మినల్ మొదటి దశలో నిర్మాణంలో ఉంది. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 319 మరియు ఎయిర్‌బస్ 320 వంటి విమానాలను ల్యాండింగ్ చేయడానికి 2,200 మీటర్ల రన్‌వే పనులు కూడా జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణం జరుగుతోంది. జనవరి 22న జరగనుందని భావిస్తున్న ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. -
Disha Naik: ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్
గోవాకు చెందిన దిశా నాయక్ చరిత్ర సృష్టించింది. విమానాశ్రయాల్లో అగ్ని ప్రమాదాలను నివారించే భారీ వాహనం ‘క్రాష్ ఫైర్ టెండర్’ను నడిపే తొలి భారతీయ వనితగా గోవా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమోట్ అయ్యింది. గోవా వాసులు సరే, విమానయాన రంగం కూడా ఆమెను ప్రశంసగా చూస్తోంది. అగ్నిప్రమాదాలు ప్రాణాంతకం. ఎయిర్‌పోర్ట్‌లో జరిగే అగ్ని ప్రమాదాలు మరీ తీవ్రం. సెకన్ల వ్యవధిలో చావు బతుకులు నిర్ణయమవుతాయి సరిగ్గా స్పందించకపోతే. అందుకే ప్రత్యేకంగా ‘ఏరోడ్రోమ్ రెస్క్యూ అండ్ ఫైర్‌ఫైటింగ్’ (ఏ.ఆర్.ఎఫ్.ఎఫ్.) సర్వసమయాల్లోనూ సిద్ధంగా ఉంటుంది ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో. అయితే ఈ విభాగంలో స్త్రీల ప్రాతినిధ్యం చాలా తక్కువ. 2021 వరకు గోవాలో ఒక్క మహిళ కూడా ఈ విభాగంలో లేదు. దిశా నాయక్ ఈ ఉద్యోగంలో చేరి గోవాలో తొలి ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె ‘క్రాష్ ఫైర్ టెండర్’ నడిపే ఫైర్‌ఫైటర్‌గా ప్రమోట్ అయ్యింది. దాంతో మన దేశంలో క్రాష్ ఫైర్ టెండర్‌ను ఆపరేట్ చేసే తొలి సర్టిఫైడ్ ఉమన్ ఫైర్‌ఫైటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. క్రాష్ ఫైర్ టెండర్ (సి.ఎఫ్.టి.) అంటే? ఇది హైటెక్ ఫైర్ ఇంజిన్. అగ్నిమాపక దళంలో కనిపించే ఫైర్ ఇంజిన్‌కు, దీనికి చాలా తేడా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో, విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలార్పేలా ఈ ఫైర్ ఇంజిన్‌ను తయారు చేస్తారు. దీనిని నడపడానికి, మంటలు ఆర్పేలా ఆపరేట్ చేయడానికి తీవ్రశిక్షణ అవసరం. సాధారణంగా మగవారు రాణించడానికే కొంత శ్రమ పడతారు. అలాంటిది దిశా నాయక్ అన్ని పరీక్షలు పాసై సి.ఎఫ్.టి.ని ఆపరేట్ చేసే మహిళా ఫైర్‌ఫైటర్ అయ్యింది. యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని.. గోవాలోని పెర్నెమ్కు చెందిన దిశా నాయక్‌కు బాల్యం నుంచి యూనిఫామ్ ఉండే ఉద్యోగం చేయాలని కోరిక. అయితే చదువు పూర్తయ్యాక అలాంటి ఉద్యోగం ఏమీ దొరకలేదు. 2021లో గోవాలోని ‘మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’లో ఫైర్‌ఫైటర్ ఉద్యోగాలకు పోస్టులు పడ్డాయి. ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళం లో అప్పటికి ఎవరూ అమ్మాయిలు లేకపోయినా దిశా అప్లై చేసింది. ‘మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా చురుకు. మోటర్ సైకిల్ నడిపేది. రన్నింగ్ బాగా చేసేది. ఆమె ఫైర్‌ఫైటర్‌గా చేరతానంటే రాణిస్తుందనే నమ్మకంతోనే ప్రోత్సహించాం’ అంటారు తల్లిదండ్రులు. వారి ప్రోత్సాహంతో జూన్ నెలలో ఉద్యోగంలో చేరింది దిశా. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి దిశాలోని చురుకుదనం, అంకితభావం పై అధికారులు గమనించారు. కేవలం సహాయక సిబ్బందిగా ఉండటం కంటే క్రాష్ ఫైర్ టెండర్‌ను నడిపేందుకు ఆమె ఆసక్తి చూపడం గమనించి ఆమెను ట్రైనింగ్‌కి పంపారు. తమిళనాడులోని నమక్కల్‌లో ఆరునెలల పాటు శిక్షణ తీసుకుంది దిశ. ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదాలు సంభవించే తీరు, ఏ ప్రమాదంలో సి.ఎఫ్.టి.ని ఎలా ఉపయోగించాలి... అక్కడ ఆమెకు నేర్పించారు. తిరిగి వచ్చాక ఉన్నతాధికారులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఆమె ప్రావీణ్యాన్ని నిర్థారించి సి.ఎఫ్.టి ఆపరేటర్‌గా ప్రమోట్ చేశారు. ‘ఆమె అన్నిరకాల పరీక్షల్లో ఉత్తమంగా నిలిచింది’ అని తెలిపారు. అన్నివిధాలా సిద్ధంగా ‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే సంఘటనాస్థలికి చేరుకోవడం కంటే చేరుకున్నాక ఏం చేయాలన్నదే ఎక్కువ ముఖ్యం. ఎయిర్పోర్ట్ ఫైర్‌ఫైటర్‌గా పని చేసేవారికి ఎయిర్‌పోర్ట్‌లోని అన్ని ప్రవేశమార్గాలు, కీలకమైన ద్వారాలు, ముఖ్యస్థానాలు మైండ్‌లో ప్రింట్ అయి ఉండాలి. ప్రమాదం జరిగితే ఎక్కడికి చేరి ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఈ ఉద్యోగంలో క్షణాల్లో యూనిఫామ్‌లోకి మారి వెహికిల్‌లో కూచోవాలి. శారీరక బలంతో పాటు మానసిక బలం ప్రదర్శించాలి. సాంకేతిక జ్ఞానం కూడా తప్పనిసరి’ అని తెలిపింది దిశ. -
ఇంఫాల్ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం
ఇంఫాల్: గగనతలంలో డ్రోన్లు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కని్పంచినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. విమానాల రాకపోకలను కూడా నిలిపేశారు. రెండు విమానాలను దారి మళ్లించగా అక్కణ్నుంచి బయల్దేరాల్సిన మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. మూడు గంటల విరామం అనంతరం సేవలను పునరుద్ధరించారు. తూర్పున మయన్మార్‌తో మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. -
గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత
ఇంఫాల్: గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించడంతో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతంలలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతుండటం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. అదే విధంగా ఇంఫాల్‌కు రావాల్సిన విమానాలను సైతం ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ప్రభుత్వం మరో అయిదు రోజులు(నవంబర్ 23 వరకు) పొడిగించిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం. అల్లర్లు, హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 3నుంచి మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 50వేల మంది నిరాశ్రయులయ్యారు.మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. -
Shamshabad Airport: సారీ.. ఎయిర్‌పోర్టుకు రాలేం
హైదరాబాద్: క్యాబ్‌వాలాలు సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు క్యాబ్ సేవలను నిలిపివేస్తూ ‘లో ఫేర్..నో ఎయిర్’ ప్రచారం చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి నడిపే క్యాబ్‌డ్రైవర్లకు సరైన ఆదాయం లభించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సకాలంలో క్యాబ్‌లు లభించక.. ఒకవేళ సర్వీసులు బుక్ అయినప్పటికీ డ్రైవర్లు నిరాకరించడం వల్ల ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో క్యాబ్‌లు లభించక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ పుష్పక్ బస్సులు, ప్రీపెయిడ్ ట్యాక్సీలు, సొంత వాహనాలు మినహాయించి మరో 5 వేల క్యాబ్‌లు ఇటీవల వరకు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉండేవి. కానీ కొంతకాలంగా ఎయిర్‌పోర్టు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికి వెళ్లినా తమకు రూ.500 నుంచి రూ.700 వరకు మాత్రమే లభిస్తున్నాయని. దీంతో ఇంధన ఖర్చులు కూడా రావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నాయి. ఇది మరింత భారంగా మారిందని తెలంగాణ గ్రిగ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీపెయిడ్ ట్యాక్సీలకు ఒక ట్రిప్పుపైన రూ.980 నుంచి రూ.1150 వరకు లభిస్తుండగా తమకు మాత్రం అతి తక్కువ ఆదాయం లభిస్తుందన్నారు. దీంతో ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లు నడిపేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఎయిర్‌పోర్టుకు నడిచే క్యాబ్‌లకు ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున ఇవ్వాలని, అగ్రిగేటర్ సంస్థలకు ఇచ్చే కమిషన్‌ను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. -
గ్రీస్‌లో జీఎంఆర్ మరిన్ని పెట్టుబడులు
ముంబై: గ్రీస్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న దేశీ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్.. ఆ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. కెలమాటా ఎయిర్‌పోర్ట్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం జీఈకే టెర్నా సంస్థతో కలిసి గ్రీస్‌లోని క్రెటె ప్రాంతంలో హెరాక్లియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. హెరాక్లియోన్ విమానాశ్రయ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఇంధన, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా గ్రీస్ ప్రధాన మంత్రి నిర్వహించిన విందులో శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. భారత్, గ్రీస్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడితే ఇరు దేశాల స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి, వ్యాపార అవకాశాల కల్పనకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
రాత్రి వేళ విమానాలు బంద్!
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఐదున్నర నెలలపాటు రాత్రి వేళ విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆ సమయంలో పదకొండు గంటల పాటు విమానాల రాకపోకలు రద్దు కానున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నావికాదళం ఆధీనంలో ఉంది. నేవీ యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఐఎన్ఎస్ డేగా రన్‌వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాలు కూడా ఐఎన్ఎస్ డేగా నియంత్రణలో ఉన్న ఈ రన్‌వే మీదుగానే ల్యాండింగ్, టేకాఫ్‌లు జరుగుతాయి. నావికాదళం ప్రతి పదేళ్లకోసారి తమ రన్‌వేలకు రీ–సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది. ఈ ప్రక్రియలో రన్‌వేపై మూడు పొరలను తొలగించి మళ్లీ కొత్తగా వేస్తారు. ఇంకా అవసరమైన ఇతర పనులు చేపడతారు. ఐఎన్ఎస్ డేగాలో 2009లో రీ–సర్ఫేసింగ్ నిర్వహించారు. పదేళ్ల తర్వాత అంటే.. 2019లో మరోసారి నిర్వహించాల్సి ఉన్నా ఇప్పటివరకు జరగలేదు. ఈ ఏడాది ఈ రీ–సర్ఫేసింగ్‌ను నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పనులను రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 8 గంటల వరకు చేపడతారు. అందువల్ల ఆ సమయంలో ఈ రన్‌వేను మూసివేస్తారు. దీంతో ఈ 11 గంటల్లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలను నిలిపివేస్తారు. ఫలితంగా దాదాపు 12 విమాన సర్వీసులకు అంతరాయం కలగనుంది. వీటిలో సింగపూర్ వెళ్లే ఏకై క అంతర్జాతీయ సర్వీసుతో పాటు ఢిల్లీ, హైదరాబాద్, పూణే, బెంగళూరు, కోల్‌కతా విమానాలున్నాయి. ఈ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 30 టేకాఫ్‌లు, 30 ల్యాండింగులు జరుగుతున్నాయి. పర్యాటక సీజను వేళ ఏటా అక్టోబర్ నుంచి పర్యాటక సీజను ప్రారంభమవుతుంది. ఈ సీజనులో వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇలా ఐదారు నెలల పాటు విమానాలకు పర్యాటకుల రద్దీ కొనసాగుతుంది. సాధారణంగా వింటర్ సీజనులో పర్యాటకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను పెంచుతుంటాయి. కానీ ఈ ఏడాది వింటర్ పీక్ సీజనులో రీ–సర్ఫేసింగ్ మొదలవుతుండడంతో రాత్రి పూట విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. అదనపు షెడ్యూళ్లు పెంచడానికి బదులు తగ్గే అవకాశాలున్నాయి. నేవీ రీ–సర్ఫేసింగ్ దృష్ట్యా తమ సర్వీసుల షెడ్యూల్ వేళల్లో తగిన మార్పులు చేసుకోవాలని ఇప్పటికే సంబంధిత విమానయాన సంస్థలకు సూచిస్తున్నారు. మూసివేత సమయం తగ్గించాలని కోరాం.. రీ–సర్ఫేసింగ్‌లో భాగంగా ఐఎన్ఎస్ డేగా రన్‌వేను నవంబరు 15 నుంచి మార్చి ఆఖరు వరకు రాత్రి వేళ 11 గంటల సేపు మూసివేయనున్నట్టు నేవీ నుంచి సమాచారం అందింది. దీనివల్ల రాత్రి 9 నుంచి మర్నాడు ఉదయం 8 గంటల మధ్య విమానాల రాకపోకలు సాగించే వీలుండదు. ఆ సమయంలో 12 ముఖ్య విమాన సర్వీసులు రద్దవుతాయి. అందువల్ల రాత్రి 10.30 నుంచి మర్నాడు 6.30 గంటల వరకు (8 గంటలు) రన్‌వే మూసివేత సడలించాలని నేవీ ఉన్నతాధికారులను కోరాం. దానిపై ఇంకా ఏ సమాచారం లేదు. నేవీ రీ–సర్ఫేసింగ్ విషయాన్ని మా ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రధాన కార్యాలయానికి నివేదించాం. అలాగే రీ–సర్ఫేసింగ్ నేపథ్యంలో షెడ్యూళ్లను సర్దుబాటు చేసుకోవాలని విమానయాన సంస్థలకు సూచించాం. – ఎస్.రాజారెడ్డి, డైరెక్టర్, -
గవ్వలు కావు.. లోహ విహంగాలు ఆగే చోటిది (ఫొటోలు)
-
ఎయిర్‌పోర్టులో వీరంగం.. కంప్యూటర్లను నేలకేసి కొట్టి..
మెక్సికో: మెక్సికో సిటీ ఎయిర్‌పోర్టులో ఒక మహిళ ప్రయాణానికి సంబంధించి తాను రిజర్వేషన్ చేసుకున్న టికెట్ వివరాలు కంప్యూటర్లో కనిపించకపోయే సరికి కోపంతో అక్కడి సిబ్బందిపై వీరంగం చేసి ఆఫీసులోని పరికరాలను ధ్వంసం చేసింది. వివరాల్లోకి వెళ్తే మరియ గువాడులూపే(56) అనే మహిళ , మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణానికి ముందుగానే ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేసుకుంది. యధాలాపంగా చెకిన్ అవడానికి బోర్డింగ్ పాస్ కోసం కౌంటర్ వద్దకు వెళ్లగా ఆమె వివరాలు కంప్యూటర్లో ఎంత వెతికినా కనిపించక ఆమె ప్రయాణం చేయడానికి కుదరదని చెప్పారు వోలారిస్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి. దీంతో ఆమె.. నా టికెట్ డబ్బులు నాకు తిరిగి వాపసు ఇవ్వమని అడిగింది. అందుకు వోలారిస్ ప్రతినిధి స్పందిస్తూ.. డబ్బులు కావాలంటే మీరు బుక్ చేసిన ఏజెన్సీకి వెళ్లి అడగాలని కోరారు. అంతే కోపంతో ఊగిపోయిన ఆ మహిళ ఆఫీసులోకి చొరబడి అక్కడి ఉద్యోగులను నానా మాటలంటూ.. నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మీరంతా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అరుస్తూ అక్కడి పరికరాలను ఇష్టమొచ్చినట్టు విసిరేస్తూ విధ్వంసం చేసింది. ఆమె కోపానికి నాలుగు కంప్యూటర్ మానిటర్లు నాలుగు బార్ కోడ్ స్కానర్లు ధ్వంసమయ్యాయి. చేసిందంతా చేసి గువాడులూపే తనదారిన తాను వెళ్లిపోయే ప్రయత్నం చేయగా అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. Pierde vuelo y el autocontrol: Es María Guadalupe (56). Exigió reembolso a @viajaVolaris, se lo negaron y arremetió contra empleados en @AICM_mx. Destrozó 4 monitores y escaners, por lo cual fue detenida. pic.twitter.com/hZHa5NDd1n — Antonio Nieto (@siete_letras) July 5, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య -
విమానం ఇంజిన్ లోపలికి లాగేసింది!
హూస్టన్: ఊహించని ఘటన ఇది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్ ఏంజెలెస్ నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజిన్ పనిచేస్తోంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్టీఎస్బీ)తెలిపింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులను విచారిస్తున్నట్లు పేర్కొంది. మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్టు సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్లు సమాచారం. కాగా, గత ఏడాది అలబామా ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవలే సదరు విమాన సంస్థకు రూ.12.80 లక్షల జరిమానా విధించారు. -
దేశంలో తొలిసారి.. ముంబై అరుదైన ఘనత
ముంబై: దేశ వాణిజ్యం నగరం ముంబై అరుదైన ఘనతకు సిద్ధం కాబోతోంది. దేశంలో ఏదేని నగరంలో రెండు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు ఇప్పటిదాకా లేవు. కానీ, ముంబై ఆ ఘనతను దక్కించుకోనుంది. నవీ ముంబై(NIMA)లో నిర్మించబోయే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 చివరికల్లా సిద్ధం కానుంది. ముంబైలో ఇప్పటికే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(CSMIA) ఉంది. అయితే విమానాల తాకిడి అత్యధికంగా ఉండడంతోనే ఈ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఎన్ఎంఐఏను నిర్మించబోయేది అదానీ గ్రూప్. ఇందుకు చేయబోయే ఖర్చు 16 వేల కోట్ల రూపాయలు. ఈ ఎయిర్‌పోర్టు ద్వారా పదివేల ఉద్యోగాలను కల్పించనున్నారు. Design of Iconic Navi Mumbai Airport has been revealed, the design of airport is inspired by National flower Lotus. Once completed it'll become second international airport in Mumbai Metropolitan RegionArchitect - Zaha Hadid pic.twitter.com/qU9uWCE4kG— Soham (@TheSohamPuranik) June 8, 2021 ఎన్ఎంఐఏ ప్రత్యేకతలు దాదాపు మూడు వేల ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించబోతున్నారు. నవీ ముంబై ఉల్వే తాలుకాలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు నాలుగు టెర్మినల్స్, రెండు రన్వేలు 29 కిలోమీటర్ల ముంబై ఎలివేటెడ్ రోడ్.. ఈ ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానం కానుంది డిసెంబర్ 2024 కల్లా ఈ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటిదాకా దేశంలో 35 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉండగా.. 30 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు వాడుకలో ఉన్నాయి. నేవీ ముంబై ఎయిర్‌పోర్టుతో కలిసి కొత్తగా మరో 14 అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇదీ చదవండి: గాడ్సే భరతమాత ముద్దు బిడ్డ! -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌పోర్టులు, ఇవే (ఫోటోలు)
-
కుప్పం నియోజకవర్గ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన చంద్రబాబు
-
మార్చి 26 నుంచి విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ముందుకురా వడంతోపాటు ప్రయాణ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్ 72–600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలుదేరి మూడు గంటలకు షిర్డీ చేరుకుంటుంది. అలాగే షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుతుందని ఇండిగో ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్ ధర రూ.4,246గా, షిర్డీ నుంచి ఇక్కడికి రూ.4,639గా నిర్ణయించారు. ఇప్పటివరకు షిర్డీ వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ సర్వీస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విజయవాడ నుంచి షిర్డీకి సుమారు 2.50 గంటల్లోనే చేరుకోవచ్చని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో యురేనియం కలకలం
లండన్: లండన్‌లోని అత్యంత రద్దీగా ఉండే హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయంలో యురేనియం ఉన్న పార్సిల్ కలకలం సృష్టించింది. రెండు వారాల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగుచూసింది. పాకిస్తాన్‌లోని కరాచీ నగరం నుంచి ఈ పార్సిల్ బ్రిటన్‌కు చేరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. తుక్కు ఖనిజాలకు సంబంధించిన కార్గో పార్సిళ్ల మధ్యలో ఈ యురేనియం నింపిన పార్సిల్ ఒకదానిని ఎయిర్పోర్ట్ కార్గో సిబ్బంది స్కానింగ్ తనిఖీల సమయంలో గుర్తించారు. ఒక ఖనిజం కడ్డీల అడుగున దీనిని దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. వెంటనే దీనిని బోర్డర్ ఆఫీసర్లకు అప్పగించగా దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దేశ ఉగ్రవ్యతిరేక దళాలకు ఇచ్చేశారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కరాచీ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు అక్కడి నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్ ద్వారా లండన్‌కు వచ్చినట్లు తేల్చారు. ఇరాన్ జాతీయులకు అందజేసేందుకే దానిని బ్రిటన్‌కు తరలించారని బ్రిటిష్ మీడియాలో వార్తలొచ్చాయి. పాక్, ఒమన్లలో తనిఖీలను దాటించేసి బ్రిటన్‌కు యురేనియంను తరలించడం ఆందోళనకర విషయమని బ్రిటన్ సైన్యంలో రసాయనిక ఆయుధాల విభాగం మాజీ అధిపతి హ్యామిస్ బ్రెటన్ గార్డన్ వ్యాఖ్యానించారు. శిలల నుంచి సేకరించే రేడియోధార్మిక యురేనియంను అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, రియాక్టర్లలో ఇంధనంగా వినియోగిస్తారు. జలాంతర్గామి, అణ్వాయుధాల్లోనూ వాడతారు. లండన్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన పార్సిల్‌తో మాకు ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పింది. మీడియాలో వచ్చే వార్తలన్నీ ఊహాత్మకమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. -
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్: ఇజ్రాయెల్ ప్రభుత్వం మరోమారు సిరియాపై దాడులకు తెగబడింది. సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు సిరియా సైనికులు, ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది మరణించారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒకవైపు రన్‌వే దెబ్బతింది. రెండు టర్మినళ్లలో నిర్వహణ వ్యవస్థ ధ్వంసమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ దాడి ఘటన జరిగింది. గత ఏడు నెలల్లో డమాస్కస్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించడం ఇది రెండోసారి. బషర్ అల్ అసద్‌కు మద్దతు పలుకుతున్న స్థానిక ఉగ్రవాదులకు ఇరాన్, లెబనాన్ హిజ్బుల్లాల నుంచి ఆయుధాల సరఫరాను అడ్డుకునేందుకే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌తోపాటు డమాస్కస్ దక్షిణాన ఉన్న సిరియా ఆయుధాగారంపైనా ఇజ్రాయెల్ క్షిపణులను ఎక్కుపెట్టింది. వెస్ట్‌బ్యాంక్‌లో కాల్పులు రమల్లా: ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యంతో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పాలస్తీనియన్లు చనిపోయారు. జెనిన్‌లోని కాఫిర్దాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ఆర్మీని పాలస్తీనియన్లు అడ్డుకున్నారు. దీంతో ఆర్మీ వారిపైకి కాల్పులకు దిగింది. కాల్పుల్లో సమెర్ హౌషియెహ్(21), ఫవాద్ అబెద్(25) అనే వారు మృతి చెందారు. -
18 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే.. అక్కడే తుదిశ్వాస
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ ‘ది టర్మినల్’ హిట్ సినిమాకు స్ఫూర్తి అయిన ఇతని పేరు మెహ్రాన్ కరిమి నసీరి. ఇరాన్‌లోని మస్జీద్ సులేమాన్ సిటీలో పుట్టాడు. బ్రిటన్‌లో స్థిరపడాలనుకున్నాడు. అందుకు బ్రిటన్ నిరాకరించింది. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్ తన తల్లి స్వస్థలం గనుక తనకు బ్రిటన్‌లో నివసించే హక్కుందని వాదించినా లాభంలేకపోయింది. ఆ సమయానికి పారిస్‌లోని చార్లెస్ డిగాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మెహ్రాన్ అక్కడే ఆగిపోయాడు. ఇక దాన్నే తన స్థిరనివాసంగా మార్చుకున్నాడు. ఏకంగా 18 ఏళ్లు అక్కడే గడిపాడు! అనారోగ్యంతో కొన్నేళ్లు బయటికెళ్లినా ఇటీవల మళ్లీ తిరిగొచ్చి ఎయిర్‌పోర్ట్‌లోనే నివసిస్తున్నాడు. శనివారం తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు. అలా... ఎన్నో ఏళ్లుగా గడపిన విమానాశ్రయంలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు!! -
ఎయిర్‌పోర్టులో విమానాలకు పక్షుల బెడద
కృష్ణా (గన్నవరం): అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాశ్రయ పరిసరాల్లో డంప్ చేస్తున్న జంతు కళేబరాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా పక్షుల సంచారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరచూ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో పక్షుల వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ పలుమార్లు విమానాలను పక్షులు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయాల్లో విమానాలకు తృటిలో ప్రమాదాలు తప్పినా అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదు. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు విమానాశ్రయ పరిసరాల్లో ఆక్రమ చెత్త డంపింగ్ నివారణపై సమావేశాలు నిర్వహించి హడావుడి చేస్తున్న అధికారులు ఆచరణలో మాత్రం విస్మరిస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయ రన్‌వేకు అతిసమీపంలో ఉన్న కొత్తపేట వద్ద పాటిగోతుల్లో మాంసం దుకాణదారులు వ్యర్థాలను మూటలు కట్టి తీసుకువచ్చి పడవేస్తున్నారు. దీనికితోడు జంతు కళేబరాలు, చెత్తా చెదారం యథేచ్ఛగా ఇక్కడ డంప్ చేస్తున్నారు. దీంతో వీటి కోసం వచ్చే గద్దలు పక్కనే ఉన్న రన్‌వేపైకి చేరుతున్నాయి. రాజీవ్‌నగర్‌తో పాటు ఎయిర్‌పోర్టు తూర్పు వైపు ఉన్న వాగు కూడా పక్షుల సంచారానికి కారణమైంది. ఇంకా రాజీవ్‌నగర్ కాలనీ, బుద్ధవరం వైపు విమానాశ్రయ పరిసరాల్లో పారిశుద్ధ్యం మరీ అధ్వానంగా ఉంది. దీనికితోడు విజయవాడ హోటళ్లలోని వ్యర్థాలను రాత్రి వేళల్లో ఆటోల్లో తీసుకువచ్చి కేసరపల్లి, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. వీటివల్ల పక్షుల సంచారం పెరిగి విమానాల రాకపోకల సమయంలో ఆటంకం ఏర్పడుతోంది. దీనితో పక్షులను బెదరకొట్టేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణసంచా ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. గుణపాఠం నేర్వని అధికారులు గత పదేళ్ల వ్యవధిలో ఇక్కడ విమానాలను ఏడుసార్లకు పైగా పక్షులు ఢీకొన్నాయి. తరచూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల వల్ల విమాన పైలెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్కొస్తా, జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానాలు సర్వీస్‌లు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. పక్షులు ఢీకొన్నప్పుడు విమాన రెక్కలు, ఇంజన్ భాగాలు దెబ్బతిని సదరు విమాన సంస్థలకు రూ.కోట్లలో నష్టం కూడా వాటిల్లింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారులు సమావేశాలు నిర్వహించి పక్షుల నివారణ, అక్రమ డంపింగ్ అరికట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పంచాయతీ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అనధికార డంపింగ్ యథావిధిగా కొనసాగుతోంది. దీనితో విమానాలకు పక్షుల బెడద తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు, చెత్తాచెదారం డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు. కొరవడిన ఎయిర్‌పోర్టు సహకారం విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు నుంచి సహకారం కొరవడింది. సామాజిక బాధ్యత పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సామగ్రిని అందించే వెసులుబాటు ఉంది. దీనికోసం ఏటా జరిగే పర్యావరణ సమావేశంలో ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న బుద్ధవరం, కేసరపల్లి, అల్లాపురం, గన్నవరం గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో చెత్త నిర్వహణకు రిక్షాలు, డస్ట్బిన్లు, ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలకు ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహకారం అందించలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీలకు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. -
‘సెబు’ ప్రాజెక్టును విక్రయిస్తున్న జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిలిప్పైన్స్‌లోని సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తనకున్న 40 శాతం వాటాను జీఎంఆర్ గ్రూప్ విక్రయిస్తోంది. అమ్మకం కారణంగా కంపెనీ రూ.1,330 కోట్లు అందుకోవడంతోపాటు రాబోయే కాలంలో నాలుగేళ్లకుపైగా ఆదాయం స్వీకరించనుంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇంటర్నేషనల్ బీవీ, అబూటిజ్ ఇన్ఫ్రా క్యాపిటల్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ రుణ భారం తగ్గించడం, అధిక రాబడి కోసం ఆస్తులను మళ్లించడంపై దృష్టి సారించడంలో భాగంగా ఈ వాటాను ఉపసంహరించుకుంటున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 2026 డిసెంబర్ వరకు సాంకేతిక సేవలను జీఎంఆర్ అందించనుంది. సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును 2014లో జీఎంఆర్ దక్కించుకుంది. -
టాటా ప్రాజెక్ట్స్ చేతికి నోయిడా ఎయిర్పోర్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న రంగాల్లో ఉన్న టాటా గ్రూప్ కంపెనీ, మౌలిక రంగ నిర్మాణ సంస్థ టాటా ప్రాజెక్ట్స్ తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా టెర్మినల్, రన్‌వే, ట్యాక్సీవే, రోడ్లు, విద్యుత్, మంచినీటి ఏర్పాట్లు, అనుబంధ భవనాలను టాటా ప్రాజెక్ట్స్ నిర్మించాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టును 2019లో స్విస్ డెవలపర్ జ్యూరిక్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ దక్కించుకుంది. విమానాశ్రయ అభివృద్ధికై యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఏపీఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను ఏర్పాటు చేసింది. 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. తొలి దశలో ఒకే రన్‌వేతో ఏటా 1.2 కోట్ల మందికి సేవలు అందించే సామర్థ్యంతో రూ.5,700 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. 2024లో విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. -
ఆ వ్యక్తి విమానాశ్రయంలోనే 14 ఏళ్లుగా నివాసం....
Lives in airport for 14 years Says family interferes: ఏవోవే చిన్న చిన్న కారణాలతో కుటుంబంతో గొడవపడి ఇంటి నుంచి బయటకి వచ్చేసి నానాపాట్లు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా మాటమాట పెరిగి కోపంతో బయటకు వచ్చి అనాధలుగా బతుకు వెళ్లదీసేవాళ్లు కోకొల్లలు. మరికొంతమంది చెడుమార్గంలో పయనించి తమ జీవితాలను నాశనం చేసకున్నావాళ్లు ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి ఇంటి నుంచి వచ్చేసి 14 ఏళ్లు అయ్యింది. అతను ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడో? ఎందుకు వచ్చేశాడో తెలుసా? వివరాల్లోకెళ్తే...వీ జియాంగువో అనే చైనీస్ వ్యక్తి బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్‌లోనే 14 ఏళ్లుగా నివసిస్తున్నాడు. అయితే అతనికి డ్రింక్ చేయడం, సిగరెట్ కాల్చడం వంటి చెడు అలవాట్లు ఉన్నాయి. అంతేగాదు అతను ఆ చెడు అలవాట్లకు బానిసై పోవడంతో అతని కుటుంబం అతన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కాస్త కఠినంగా వ్యవహరించింది. ఈ మేరకు అతని కుటుంబం అతనికి ఒక షరతు కూడా పెట్టింది. అతను కుటుంబంలో ఉండాలనుకుంటే చెడు అలవాట్లను వదిలేయాలని ఒకవేళ అలా చేయలేకపోతే తన నెలవారి జీతం రూ.12 వేలు ఇచ్చేయాలని ఒక షరతు విధించారు. అలా ఇచ్చేస్తే తాను సిగరెట్, మందు కొనుక్కోవడం కష్టం అవుతుందని ఇంటి నుంచి వచ్చేశానని చెప్పాడు. 40 ఏళ వయసులో తనను ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పుకొచ్చాడు. వృద్ధాప్యం కారణంగా తనకు మళ్లీ ఉపాధి లభించలేదని వీ చెప్పుకొచ్చాడు. అయితే అతను లాంటి మరో ఆరుగురు వ్యక్తులు ఆ టెర్మినల్‌లోనే నివశిస్తున్నారు. (చదవండి: మొసలితో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి... వీడియో వైరల్) -
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ల దాడి
-
అబుదాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి, ఇద్దరు భారతీయుల దుర్మరణం!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అబుదాబి విమానాశ్రయంలోని ఓ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, ఏడీఎన్ఓసీ సంస్థకు చెందిన చమురు నిల్వలు ఉన్న పారిశ్రామిక ప్రాంతం ముసఫాలో మూడు ఇంధన ట్యాంకర్ ట్రక్కులు పేలిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్ దాడుల్లో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్తాన్ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో చిన్న విమానానికి సంబంధించిన భాగాలు కనిపించాయని, రెండు ప్రదేశాల్లో చోటు చేసుకున్న పేలుడు, అగ్ని ప్రమాదానికి డ్రోన్ దాడులు కారణమని పోలీసులు పేర్కొన్నారు. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: Viral Video: హార్ట్ రైజింగ్ వీడియో: ఎదురుగా వస్తున్న రైలు ముందుకి తోసేసి.. -
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని శంకుస్థాపన
లక్నో: గ్రేటర్ నోయిడాలోని జేవార్‌లో ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జేవార్ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. విమానాశ్రయ నిర్మాణం 1,330 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది. దీన్ని 2024 నాటికి పూర్తి చేయనున్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయితే, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరించనుంది. వీటిలో రెండు అంతర్జాతీయంగా ఉంటాయి. కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో విమానాశ్రయం ఒకటి. -
"నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!"
న్యూఢిల్లీ: చిన్నపిల్లలు వారి ముద్దు ముద్దు మాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల ముద్దులొలికే మాటలకు అప్పటి వరకు మనకు ఉన్న టెన్షన్లు, తనొప్పిలు ఎక్కడివక్కడికే ఎగిరిపోతాయి. పైగా వారి వచ్చిరాని మాటలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడమే కాక విస్మయానికి గురిచేస్తాయి. అచ్చం అలాంటి ఘటనే ఖతార్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) వివరాల్లోకెళ్లితే.....ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరాధ్య అనే చిన్నపాప తన అత్తకు వీడ్కోలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ గార్డ్ని కోరుతోంది. ఆ తర్వాత ఆ సెక్యరిటీ గార్డు ఆ చిన్నారి మాటలకు నవ్వుతూ అంగీకారం తెలిపిన వెంటనే తన అత్త దగ్గరకు ఆనందంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ సన్నివేశం చూపురులను తల తిప్పుకోనివ్వకుండా ఒక్క క్షణం కట్టిపడేసినట్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ అందమైన వీడియోను కప్తాన్ హిందుస్థాన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ) -
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద రాకెట్ దాడులు
కాబూల్: అఫ్గాన్ రాజధానిలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా సోమవారం రాకెట్ దాడులు జరిగాయి. అయితే ఆధునిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను తిప్పికొట్టడంతో రాకెట్లు సమీపంలోని సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయినట్లు తెలిసింది. దాడుల్లో ఎవరూ గాయపడినట్లు తెలియరాలేదు. తొలుత దాడులకు ఎవరు కారణమన్నది తెలియరాలేదు, కానీ తామే దాదాపు ఆరు కత్యూషా రాకెట్లు పేల్చామని ఐసిస్ గ్రూప్ ప్రకటించుకుంది. ఒకపక్క రాకెట్ దాడులు జరుగుతున్నా అమెరికా దళాల ఉపసంహరణ కొనసాగింది. అమెరికన్లను తీసుకుపోయేందుకు వచ్చిన సీ–17 కార్గో జెట్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు కొనసాగాయి. ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థలు ఎయిర్‌పోర్ట్‌పై దాడులకు యత్నిస్తూనే ఉన్నాయి. రాజధానిలోని చహరె షహీద్ ప్రాంతం నుంచి తాజా రాకెట్ దాడి జరిగినట్లు అనుమానాలున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు ఉపయోగించి వదిలివెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఇందులో రాకెట్ ట్యూబులను కనుగొన్నారు. రాకెట్ల రవాణాకు ఈ ట్యూబులను టెర్రరిస్టులు ఉపయోగిస్తుంటారు. దాడులకు గురైన సలీం కార్వాన్ ప్రాంతం ఎయిర్‌పోర్టుకు 3 కి.మీ.ల దూరంలో ఉంది. ఇతర గ్రూపులతో భయాలు సరైన పత్రాలున్నవారు అఫ్గాన్ వీడేందుకు అనుమతిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు యూఎస్ ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా సాధారణ ప్రయాణాలకు విమానాశ్రయాన్ని అనుమతిస్తామని తాలిబన్లు తెలిపారు. పాశ్చాత్య దళాలు తమ దేశం విడిచి సురక్షితంగా వెళ్లేందుకు తాము సహకరిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినా, ఇతర టెర్రరిస్టు గ్రూపులతో యూఎస్ దళాలకు ప్రమాదం పొంచిఉంది. తాలిబన్లు పాలన చేపట్టాక పలువురు ఖైదీలను విడుదల చేశారు. వీరిలో ఐసిస్–కె టెర్రరిస్టులు ఉన్నారు. వీరంతా యూఎస్ దళాలపై దాడులకు ప్రస్తుతం యత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సైతం ఐసిస్ తీవ్రవాదులు కాబూల్ విమానాశ్రయంపై దాడికి యత్నించగా, అమెరికా దళాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మంగళవారం నాటికి పూర్తిగా అఫ్గాన్ నుంచి బయటపడాలని అమెరికా యత్నిస్తోంది. సోమవారం రాకెట్ దాడులను తమ సీర్యామ్ వ్యవస్థ తిప్పికొట్టిందని అమెరికా ప్రతినిధి బిల్ అర్బన్ తెలిపారు. దారిలోనే ఐదు రాకెట్లను తమ వ్యవస్థ ధ్వంసం చేసిందన్నారు. అమెరికా డ్రోన్ దాడుల్లో ఏడుగురు మరణించారు కాబూల్‌లో ఆత్మాహుతి బాంబర్పై ఆదివారం అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు సాధారణ పౌరులు మరణించారని తాలిబన్లు వెల్లడించారు. ఏదైనా దాడి చేపట్టే ముందు తమకు సమాచారమిస్తే బాగుండేదని, విదేశీగడ్డపై అమెరికా ఇలాంటి చర్యలకు దిగడం చట్ట విరుద్ధమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా చైనా అధికార టీవీ ఛానల్ ‘సీజీటీఎన్’తో అన్నారు. అఫ్గాన్ గడ్డపై ఏదైనా ముప్పు పొంచివుంటే అమెరికా మాకు చెప్పాల్సింది. ఇలా ఏకపక్షదాడులకు దిగడం సరికాదు’ అని జబీహుల్లా పేర్కొన్నారు. పౌరులు మృతి చెందారనే వార్తలపై దర్యాప్తు చేస్తున్నామని పెంటగాన్ తెలిపింది. మతాధికారి జద్రాన్ అరెస్ట్ అఫ్గాన్‌లో తమను వ్యతిరేకించే ప్రముఖుల అరెస్ట్‌ల పర్వాన్ని తాలిబన్లు కొనసాగిస్తున్నారు. అఫ్గాన్‌లో ప్రముఖ మతాధికారి (మౌల్వీ) మొహమ్మద్ సర్దార్ జద్రాన్‌ను అరెస్ట్ చేసినట్ల తాలిబన్లు తాజాగా ధ్రువీకరించారు. అఫ్గాన్‌లో మతాధికారుల జాతీయ మండలికి ఆయన గతంలో అధ్యక్షునిగా సేవలందించారు. ఆయనను బంధించి, కళ్లకు గంతలు కట్టిన ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. -
కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట, కాల్పులు
Chaotic Scenes At Kabul Airport అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో దేశంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీవనం సాగించిన జనం ఇక రాబోయే గడ్డు రోజులను తలచుకొని బెంబేలెత్తిపోతున్నారు. తాలిబన్ల రాక్షస పాలనలో బతకలేమంటూ త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. అఫ్గాన్‌లో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా స్వదేశాలకు పయనమవుతున్నారు. దేశ సరిహద్దులను, భూమార్గాలను తాలిబన్లు దిగ్బంధించడంతో ఆకాశయానమే దిక్కయింది. రన్‌వేపై విమానాల కోసం వేచిచూస్తున్న వందలాది మంది పౌరులు దేశవిదేశీ పౌరులతో కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. ఎయిర్‌పోర్టుకు దారితీసే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. కాబూల్ నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ప్రయాణికుల విమాన సేవలే కొనసాగుతున్నాయి. ఎయిర్‌పోర్టులో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. జనం గోడలు దూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. విమానాల రాకకోసం వేలాది మంది పిల్లా పాపలతో కలిసి ఆకలి దప్పులు మరిచి చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఏకంగా రన్‌వే పైకి చేరుకొని నిరీక్షిస్తున్నారు. ఏదైనా విమానం రావడమే ఆలస్యం ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్నారు. టేకాఫ్ అవుతున్న విమానాల వెంట ప్రాణాలను పణంగా పెట్టి పరుగులు తీస్తున్నారు. ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆకాంక్షే అందరిలోనూ కనిపిస్తోంది. కొందరు విమానం రెక్కలపైకి ఎక్కి కూర్చుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా పోలీసులు గానీ, భద్రతా సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. ఇక్కడ నిలబడడానికి స్థలం లేదని వాపోయారు. పిల్లల ఏడుపులు, పెద్దల అరుపులు, యువకుల ఆగ్రహావేశాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మార్మోగిపోతోంది. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పది మంది మృతి దేశం విడిచి వెళ్లడానికి కాబూల్ ఎయిర్‌పోర్టులో విమానం పైకి ఎక్కి కూర్చున్న జనం తాజాగా కాబూల్ గగనతలంలో ఎగురుతున్న ఓ ఎయిర్‌క్రాఫ్ట్ చక్రాలను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టుతప్పి కిందికి జారిపడి మరణించారు. ఈ దృశ్యాలను టెహ్రాన్ టైమ్స్ పత్రిక ట్విట్టర్లో ఉంచింది. గాల్లో విమానం చక్రాల నుంచి జారిపడి ముగ్గురు మరణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్లను కలచివేస్తున్నాయి. సోమవారం కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను అదుపు చేయడానికి అమెరికా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్‌నకు సిద్ధమవుతున్న అమెరికా జెట్ విమానంపైకి ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. విమానం కదులుతుండగా పెద్ద సంఖ్యలో జనం దాని వెనుక పరుగులు తీయడం వారి ఆత్రుతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతోపాటు కొందరు జారిపడ్డారని, ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. అలాగే విమానాశ్రయంలో అమెరికా సైనికుల కాల్పుల్లో ఇద్దరు సాయుధులు చనిపోయారు. బయటకు రావాలంటే భయం భయం ప్రాణం కోసం పరుగులు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకొనే క్రమంలో తాలిబన్లు కేవలం సైనికులు, పోలీసులతో తలపడ్డారు తప్ప సామాన్య ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదు. అయినప్పటికీ జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో బయటకు రావడానికి జంకుతున్నారు. తాలిబన్లు జైళ్లలోని ఖైదీలను విడిచిపెట్టారు. జైళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆయుధాగారాలను లూటీ చేశారు. కాబూల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం నుంచి సిబ్బంది మొత్తం వెళ్లిపోయారు. ఇతర దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశాలకు తరలిస్తున్నాయి. నిలాన్ అనే 27 ఏళ్ల యువతి మాట్లాడుతూ.. తాను కాబూల్ వీధుల్లో 15 నిమిషాల పాటు ప్రయాణించానని, పురుషులు తప్ప మహిళలెవరూ కనిపించలేదని చెప్పారు. వంట సరుకులు తెచ్చుకోవడం లాంటి చిన్నచిన్న పనుల కోసం కూడా మహిళలు బయటకు వెళ్లలేకపోతున్నారని వివరించారు. ‘ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. మా ఉద్యోగాలు ఉన్నాయో ఊడాయో తెలియదు. మా జీవితం ముగిసిపోయినట్లే, భవిష్యత్తు లేనట్లే అనిపిస్తోంది’ అని నిలాన్ వ్యాఖ్యానించారు. మరో వేయి మంది అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కి మళ్లుతున్న అమెరికా, దాని మిత్రదేశాల ఉద్యోగుల రక్షణ కోసం కాబూల్ ఎయిర్‌పోర్టుకు రాబోయే 48 గంటల్లో వేయి మంది సైనికులను తరలిస్తామని అమెరికా ప్రకటించింది. కాబూల్ ఎయిర్పోర్ట్ భద్రత కోసం ఇప్పటికే అమెరికా అక్కడ 5వేల మంది సైనికులను మోహరించింది. ఎయిర్‌పోర్టు జోలికి రావొద్దు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు ఖతార్ రాజధాని దోహాలో సీనియర్ తాలిబన్ నాయకులతో తాజాగా చర్చలు జరిపారు. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి తమ ఉద్యోగులు, పౌరులను స్వదేశానికి తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఎయిర్‌పోర్టు తమ నియంత్రణలోనే ఉంటుందని, దాని జోలికి రావొద్దని సూచించారు. దీనికి తాలిబన్లు అంగీకరించారని సమాచారం. ‘ఉగ్ర’నిలయంగా మారనివ్వద్దు: ఐరాస తాలిబన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్ ఉగ్ర మూకలకు నిలయంగా మారకుండా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా వ్యవహరించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ సోమవారం పిలుపునిచ్చారు. అఫ్గాన్ ప్రజలను వారి ఖర్మానికి వారిని వదిలివేయకూడదని భద్రతా మండలికి గుటెరస్ విజ్ఞప్తి చేశారు. అఫ్గాన్ పరిణామాలపై చర్చించేందుకు భద్రతా మండలి ప్రత్యేక అత్యవవసర సమావేశం భారత్ నేతృత్వంలో జరిగింది. అఫ్గాన్‌పై భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కావడం వారంలో ఇది రెండోసారి. అఫ్గానిస్తాన్‌కు ఇది కీలక కఠోర సమయమని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాలిబన్లు యత్నించాలని ఈ సందర్భంగా అంటోనియో హితవు పలికారు. తక్షణమే ఈ ప్రాంతంలో హింసను నివారించాలని, మానవ హక్కుల పరిరక్షణ చేయాలని అన్ని పక్షాలను గుటెరస్ కోరారు. -
Vijayawada Airport: 15న నూతన రన్‌వే ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించిన రన్‌వే ను ఈనెల 15న ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. బుధవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ గిరి మధుసూదనరావు జిల్లా కలెక్టర్‌ను కలిసి విమానాశ్రయ విస్తరణ పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం 700 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీకి జిల్లా యంత్రాంగం అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రహదారుల విస్తరణకు సంబంధించి రెవెన్యూ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విమానాశ్రయంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్లై ఓవర్‌కు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో జీఎం మహ్మద్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. చదవండి: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు -
విజయవాడ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు
-
రన్ వేకు దూరంగా ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
సాక్షి, ముంబై: నిసర్గ తుఫాను నేపథ్యంలో కురిసిన వర్షం కారణంగా ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో రన్ వై మీద వరద నీరు చేరుకుంది. గురువారం బెంగుళురు నుంచి వచ్చిన ఫెడెక్స్ కార్గో విమానం రన్ వే నుంచి దూరంగా ల్యాండ్ అయింది. ఈ విమానానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, విమాన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. తుపాన్ కారణంగా ముంబైకి ఎయిర్ పోర్టుకు వచ్చే మొత్తం 19 విమానాల రాక పోకలను నిలిపి వేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. నిసర్గ తుపాన్ ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్‌పోర్టును రాత్రి 7గంటల వరకు మూసివేశారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. -
విమానాలకు కొత్తదారి
విమానం సాఫీగా పైకి లేవాలన్నా, సురక్షితంగా కిందికి దిగాలన్నా రన్‌వే బాగుండాలి. కొచ్చి, అంతర్జాతీయ విమానాశ్రయంలో.. మరమ్మతులు అవసరమైన స్థితిలో ఉన్న రన్‌వే పైనే గత నవంబర్ ముందు వరకు విమానాల రాకపోకలు జరుగుతుండేవి. రీ–కార్పెటింగ్కి (మరమ్మతులకు) నిపుణులైన ఇంజినీర్ల కోసం సి.ఐ.ఎ.ఎల్ (కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్) తన ఇంజినీరింగ్ విభాగంలోని సిబ్బందిలోంచి పెద్ద వడపోతనే పోయవలసి వచ్చింది. చివరికి ఎనిమిది మంది ఇంజినీర్లను, వాళ్లకు సహాయంగా 20 మంది అప్రెంటీస్లను ఎంపిక చేసుకుంది. విశేషం ఏంటంటే.. వాళ్లంతా కూడా మహిళలే! విమానం టేకాఫ్‌కి, ల్యాండింగ్కీ ఎలాగైతే మంచి రన్‌వే ఉండాలో, రన్‌వే రీ–కార్పెటింగ్ పనిని పరుగులు తీయించే బృందం అవసరమని భావించిన సి.ఐ.ఎ.ఎల్. మహిళా ఇంజినీర్ల వైపే మొగ్గు చూపింది. సి.ఐ.ఎ.ఎల్. సివిల్ ఇంజినీరింగ్ విభాగం జనరల్ మేనేజర్ బినీ టి.ఐ., అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు టి.పి.ఉషాదేవి, మినీ జాకబ్, జూనియర్ మేనేజర్లు పూజా టి.ఎస్., త్రీసా వర్ఘీస్, సీనియర్ సూపరింటెండెంట్లు పి.పి.శ్రీకళ, ఇ.వి. జెస్సీ, జిన్సీ ఎం పాల్.. ఈ ఎనిమిది మంది పర్యవేణలో, వారికి సహాయంగా ఉన్న ఇరవై మంది ట్రెయినీ ఇంజనీర్లతో గత ఏడాది నవంబర్ 20 న ప్రారంభమైన రీ–కార్పెటింగ్ పనులు తొలి రోజు నుంచే వేగంగా జరుగుతున్నాయి! ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 29 కి రన్‌వే సిద్ధం అవాలి. అయితే ఈ మహిళా ఇంజనీర్ల అంకితభావం, దీక్ష చూస్తుంటే ఆలోపే రన్‌వే మా చేతికి వచ్చేలా ఉందని సి.ఐ.ఎ.ఎల్. అధికారులు ప్రశంసాపూర్వకంగా అంటున్నారు. ‘మిక్స్’ ప్లాంట్‌కూ వెళతారు రన్‌వే కార్పెటింగ్ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతోంది. ఆ సమయంలో విమానాశ్రయాన్ని మూసి ఉంచుతున్నారు. 200 మంది పనివాళ్లు ఉంటారు. పనిని కాంట్రాక్టుకు తీసుకున్న సంస్థల వాహనాలు ఓ 50 వరకు వచ్చిపోతుంటాయి. 60 మీటర్ల వెడల్పు, 3,400 మీటర్ల పొడవున రీకార్పెటింగ్ పని జరుగుతూ ఉంటుంది. రన్‌వేపై దిగాక విమానాల కదలికలకు వీలు కల్పించే ఐదు ‘టాక్సీవే’ల పునఃనిర్మాణం కూడా ఏకకాలంలో అవుతోంది. వీటన్నిటికీ కావలసిన కంకర కోసం ఈ మహిళా ఇంజినీరింగ్ టీమ్ ఎప్పటికప్పుడు క్వారీలకు వెళ్లి నాణ్యతను పరీక్షిస్తోంది. తారును మిక్స్ చేసే ప్లాంట్‌కూ వెళుతుంది. మెటీరియల్ ఎంత వస్తున్నదీ, ఎంత మిగిలి ఉన్నదీ, అవసరానికి తగ్గట్టుగా కొనుగోలు చేసిన మెటీరియల్ పూర్తిగా వినియోగం అవుతున్నదీ లేనిదీ వీరు పరిశీలిస్తారు. అంటే పని మొత్తం పూర్తిగా వీరి కనుసన్నల్లోనే నడుస్తుంది. రోజుకు 1500 టన్నుల తారు–కంకర కలుపు (మిక్సింగ్) విమానాశ్రయానికి చేరుకుంటుంది. అయితే అది సమయానికి చేరడం ముఖ్యం. సాయంత్రం 6 తర్వాత వస్తే ఇక ఆ రోజు పనికి వీలు పడనట్లే్ల. అందుకే ప్రతిదీ ఒక పద్ధతితో, ప్రణాళిక ప్రకారం అయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నారు బినీ, ఆమె బృందం. చిన్న తేడా రానివ్వరు మిక్సింగ్ ప్లాంట్ పని రోజూ తెల్లవారుజామునే 3 గంటలకు మొదలౌతుంది. ఉదయం 10 కల్లా విమానాశ్రయానికి ‘మిక్స్’ను మోసుకొచ్చేస్తాయి బండ్లు. సాయంత్రం 6 గంటలకు తొలి విమానం దిగేలోపే ఆవేళ్టి పని పూర్తి చేసేస్తారు. రీకార్పెటింగ్ ఒకసారి అయిపోయే పని కాదు. మిక్స్‌ని రెండు పూతలుగా (లేయర్లు) వేస్తారు. మొదటి పూత ఏడు సెంటీమీటర్ల మందంలో, దాని పైన వేసే రెండో పూత ఐదు సెంటీమీటర్ల మందంలో ఉంటుంది. పాత లెక్కలకు, కొత్త లెక్కలకు తేడాలు వచ్చాయంటే విమానం ల్యాండింగ్ ప్రమాదంలో పడినట్లే. ఇంత సూక్ష్మంగా, జాగ్రత్తగా అన్నీ సరి పోల్చుకుంటూ రోజుకు 150 మీటర్లు చొప్పున రన్‌వే రీ–కార్పెటింగ్ చేయిస్తున్నారు ఈ మహిళా ఇంజినీర్లు. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 29 కి రన్‌వే సిద్ధం అవాలి. అయితే ఈ మహిళా ఇంజనీర్ల అంకితభావం, దీక్ష చూస్తుంటే ఆలోపే రన్‌వే మా చేతికి వచ్చేలా ఉందని సి.ఐ.ఎ.ఎల్. అధికారులు ప్రశంసాపూర్వకంగా అంటున్నారు. -
పరిమితికి మించి లగేజీ ఉందని..
వారణాసి: రూలంటే రూలే. దేశానికి అధ్యక్షుడైనా కట్టుబడి ఉండాల్సిందే. అదే అమలు చేయాలనుకున్నారు అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి వచ్చిన మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపున్ వెంట పరిమితికి మించి లగేజీ ఉండటంతో అందుకు గాను అదనంగా ఫీజు చెల్లించాలని ఎయిరిండియా అధికారులు అడ్డుకున్నారు. ఆరుగురు సభ్యుల అధికార బృందంతోపాటు రెండు రోజుల పర్యటనకు కాశీకి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. వెంట పరిమితికి మించి లగేజీ ఉండటంతో లాల్‌బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆకాశ్‌దీప్ మాథుర్, జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ వరకు వెళ్లింది. విదేశీ గౌరవ ప్రతినిధి అయినందున ఆయనకు మినహాయింపు ఇవ్వాలని తెలపడంతో కథ సుఖాంతమయింది. సాధారణంగా ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులు 23 కేజీల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అంతకుమించి ప్రతి కేజీకి రూ.500, అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. -
'షర్ట్ విప్పితేనే విమానం ఎక్కనిస్తాం'
జోహన్నెస్‌బర్గ్ : జోహన్నెస్‌బర్గ్‌లోని ఓఆర్ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 ఏళ్ల బాలుడికి వింత అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్ వెళ్లే విమానం ఎక్కేందుకు వచ్చిన బాలుడిని బోర్డింగ్ వద్ద విమాన సిబ్బంది అడ్డుకొని నువ్వు వేసుకున్న షర్ట్‌ను విప్పితేనే విమానంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇంతకీ షర్ట్ ఎందుకు విప్పమన్నారనేగా మీ డౌటు.. అక్కడికే వసున్నాం ! న్యూజిలాండ్‌లో ఉండే తమ బంధువులను కలిసేందుకు దంపతులు తమ 10 ఏళ్ల స్టీవ్‌తో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే విమానం ఎక్కడానికి బోర్డింగ్ దగ్గరకు వచ్చారు. విమాన సిబ్బంది స్టీవ్‌ను అడ్డుకొని షర్ట్ మార్చుకోవాలని సూచించారు. కాగా స్టీవ్ వేసుకున్న షర్ట్‌పై కింగ్ కోబ్రా పాము బొమ్మ ముద్రించబడి ఉంది. ఆ బొమ్మ చూడడానికి కాస్త భయంకరంగా ఉండడంతో తోటి ప్రయాణికులు బొమ్మను చూసి భయానికి లోనవుతారంటూ అందుకే సిబ్బంది షర్ట్‌ను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. కానీ మొదట ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినా చేసేదేం లేక స్టీవ్ వేరే షర్ట్‌ను తొడిగి విమానం ఎక్కారు. అయితే అధికారులు తాము చేసిన పని సరైందేనంటూ సమర్థించుకున్నారు. ఆ అబ్బాయి వేసుకున్న షర్టువల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే, అయినా అలాంటి దుస్తులను మేం అంగీకరించబోమని వెల్లడించారు. దీనిపై ఒక సంస్థ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ' ఆ బాలుడిని అడ్డగించి బలవంతంగా షర్టు మార్చుకోమని ఒత్తిడి తెచ్చారు. అతను వేసుకున్న షర్టుపై ఒక పాము బొమ్మ ఉండడమే దీనికి కారణం' అంటూ ట్వీట్ చేశారు. ట్విటర్లో షేర్ చేసిన ఫోటోలను చూసి ' ఇవేం రూల్స్‌రా బాబు...దుస్తులపై బొమ్మలు ఉంటే విమానం ఎక్కనివ్వరా అంటూ' నెటిజన్లు మండిపడుతున్నారు. A Boy, 10, is forced to take his shirt off before boarding a flight from #NewZealand to #SouthAfrica because it had a picture of a reptile on it ✈️😬 pic.twitter.com/T0O6DqfBDo — aviation-fails (@aviation07fails) 26 December 2019 -
'మీ ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిది'
న్యూఢిల్లీ : వేలమంది ప్రొ-డెమోక్రసీ నిరసనకారులు సోమవారం ఒక్కసారిగా హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొచ్చుకుపోయి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హాంకాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన అన్ని విమానాలను ఒకరోజు పాటు రద్దు చేస్తున్నట్లు అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ భారత ప్రయాణికులకు పలు కీలక సూచనలు చేసింది. హాంకాంగ్ విమానాశ్రయంలో మంగళవారం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మరిన్ని నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో విమానాల రాకపోకలు ఆలస్యం కావడం లేదా రద్దయ్యే అవకాశం ఉందని తమ ప్రకటనలో తెలిపింది. హాంకాంగ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకూ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇప్పటికే హాంకాంగ్‌లో ఉండిపోయిన భారత ప్రయాణికులు తిరిగి సేవలు పున: ప్రారంభం అయ్యేవరకు అక్కడి అధికారులతో టచ్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి +852 90771083 హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ వెల్లడించింది. -
చెప్పుల్లో దాచాడు.. చిక్కుల్లో పడ్డాడు
తిరువనంతపురం : సుమారు ఏడు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కన్నూరు అంతర్జాతీయ విమాన్రాశయ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కన్నూరు జిల్లా థాయథేరు ప్రాంతానికి చెందిన అజయ్ వలియబల్లథ్ అనే వ్యక్తి దోహా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన చెప్పుల్లో గంజాయి దాచి రహస్యంగా తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేయడంతో రూ. 7 లక్షల విలువ చేసే గంజాయి బయటపడింది. అజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యల కోసం అతన్ని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగించారు. -
చైనాలో ‘స్టార్ఫిష్’ విమానాశ్రయం
బీజింగ్: భారీ స్టార్ఫిష్ ఆకారంలో చైనా ప్రభుత్వం నిర్మిస్తున్న బీజింగ్‌లోని డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ల వేడుకల సందర్భంగా ప్రారంభించనున్నారు. పది ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన స్థలంలో కళ్లు చెదిరేలా రూ. 1.20 లక్షల కోట్ల (17.5 బిలియన్ డాలర్ల)తో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. 1949 అక్టోబర్ 1న మావో జెడాంగ్ పీపుల్స్ రిపబ్లిక్‌ను స్థాపించారు. దాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 30న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. 2025 కల్లా నాలుగు రన్‌వేలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ విమానాశ్రయం ఏడాదికి 7.2 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరవేయగలదు. 2040 కల్లా మిలిటరీకి ప్రత్యేక రన్‌వే సహా మొత్తం ఎనిమిది రన్‌వేలతో సిద్ధం కానుందని అధికారులు తెలిపారు. అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయం, రెండు టెర్మినల్స్తో కలిపి 10కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తోంది. -
రన్‌వేపై జారి పడిన ఇంధన ట్యాంకు
పనాజి: గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలోభారీ ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి యుద్ధవిమానానికి సంబంధించిన ఆయిల్ ట్యాంకు రన్‌వే పై జారిపడింది. దీంతో ఇంధనం రన్‌వేపై పడి, మంటలంటుకున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఈ అనుకోని ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా రెండు గంటలపాటు కార్యకలాపాలను నిలిపి వేశారు. గోవా విమానాశ్రయంలో అన్ని రకాల సేవలను రెండు గంటల పాటు సస్పెండ్ చేశామని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు శనివారం మధ్యాహ్నం ట్విటర్ ద్వారా ప్రకటించారు. డబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నావీకి చెందిన మిగ్ 29 కె విమానంలోని డిటాచ్బుల్ ఫ్యూయల్ ట్యాంకు రన్‌వేపై జారిపడిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. భారతీయ నౌకా దళానికి చెందిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రన్ వేను శుభ్రపరిచి, మరమ్మతు పనులు చేపట్టారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు యథావిధిగా కార్యక్రమాలు తిరిగి మొదలవుతాయని తెలిపారు. యుద్ధ విమానం కూడా సురక్షితంగానే ఉన్నట్లు వారు తెలిపారు. Due to jettisoned fuel tank on runway during MIG sortie the operations are closed for two hrs at Goa airport. Pl bear with us. — Goa Airport (@aaigoaairport) June 8, 2019 -
టేకాఫ్ అవుతూ గోడను ఢీకొట్టింది
సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ విమానానికి భారీ ముప్పు తప్పింది. తిరుచ్చి నుంచి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలప్పుడు దుబాయ్ వెళ్లేందుకు ఎయిరిండియాకు చెందిన ఐఎక్స్–611 విమానం బయలుదేరింది. టేకాఫ్ అవుతుండగా.. పైలట్లకు ల్యాండింగ్ సమయంలో సూచనలు ఇచ్చేందుకు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద పరికరాన్ని విమానం ఢీకొంది. ఆ తర్వాత విమానం ప్రహరీ గోడను కూడా స్వల్పంగా తాకింది. ఈ ఘటనలతో విమానం కుదుపులకులోనై ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటు విమానం చక్రం, ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 50 అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడ, దానిపై ఉన్న కంచె కూడా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఎవ్వరికీ ఏమీ కాలేదు. విమానంలో కూడా అన్ని పరికరాలూ సవ్యంగానే పనిచేస్తున్నాయనీ, ఇబ్బందేమీ లేదని పైలట్లు చెప్పడంతో విమానం అలాగే దుబాయ్ వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని దుబాయ్ విమానాశ్రయానికి చేరవేయడంతో విమానం దెబ్బతిన్నందున తాము ల్యాండింగ్‌కు అనుమతించబోమని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విమానాన్ని తెల్లవారుజామున 5.45 ప్రాంతంలో ముంబైకి తరలించి, అక్కడ ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి 10.40 గంటలకు దుబాయ్‌కి పంపారు. ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యనా లేక పైలట్ల నిర్లక్ష్యమా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించిందనీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు పైలట్లను ఎయిరిండియా విధుల నుంచి తప్పించిందని తిరుచిరాపల్లి విమానాశ్రయ డైరెక్టర్ గుణశేఖరన్ చెప్పారు. -
3రోజులు ఆలస్యంగా కొచ్చి ఎయిర్పోర్ట్ సేవలు
సాక్షి, కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో నీటమునిగిన కొచ్చి విమాశ్రయం మూడు రోజులు ఆలస్యంగా తన సేవలను ప్రారంభించనుంది. ముందు ప్రకటించినట్టుగా ఆగస్టు 26నుంచి కాకుండా 29వ తేదీ నుంచి పూర్తి స్ధాయిలో సేవలు అందించేందుకు సిద్ధమైంది. విమానాశ్రయంలో జరిగిన సమీక్షా సమావేశంలో విమానాల నియంత్రణ వ్యవస్ధకు జరిగిన నష్టంపై చర్చించారు. కేరళలోవరద పరిస్థితి మెరుగవుతున్నప్పటికీ విమాన సేవలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తాజా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొచ్చి విమానాశ్రయం సోలార్ పవర్ మీద నడుస్తుంది. అధికారులు విమానాశ్రయం నుంచి వరద నీటిని తొలగించినప్పటికీ, విమానాశ్రయం లోపల భారీ వరదలకారణంగా సౌర ఫలకాలు బాగా దెబ్బతిన్నాయి. సుమారు 800 రన్‌వే లైట్లు మరమ్మతు చేయాలి, 2,600 మీటర్ల పొడవు గోడల పునర్నిర్మించటం అవసరం. దాదాపు 90శాతం మంది విమానాశ్రయ ఉద్యోగులే వరద బాధితులు, వారందరూ వాళ్ల ఇళ్లలో చిక్కుకుపోయారు. మధ్య కేరళ ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోవాల్సి ఉన్నందున.. ఉద్యోగులకు సమాచారం అందించలేకపోతున్నామని అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29 మధ్యాహ్నం 2 గంటలనుంచి తిరిగి తమ సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే ఇతర సదుపాయాలు, కేటరింగ్ అంశాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన కొచ్చి ఎయిర్ పోర్టు కేరళ వరదలతో రూ.220 కోట్లు నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేశారు. కొచ్చి విమానాశ్రయం ప్రపంచంలోనే మొట్టమొదటి సౌరశక్తి విద్యుత్ వ్యవస్థకు కలిగిన ఎయిర్ పోర్టు. వరదలతో దీనికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పెరియార్ నదికి వరదల కారణంగా రన్‌వే, టాక్సీ బే, కస్టమ్స్ పన్నుల్లేని వస్తువులు, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ టెర్మినల్స్ నీట మునిగాయి. రన్‌వేపై లైట్లు కూడా పూర్తిగా పాడయ్యాయి. 2.26 కిలోమీటర్ల మేర విమానశ్రయం గోడలు నాశనమయ్యాయి. -
కొచ్చి విమానాశ్రయానికి భారీ నష్టం
కొచ్చి : ప్రకృతి బీభత్సానికి విలవిల్లాడిన కేరళ ఇపుడిపుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఎడతెగని వర్షాలు, వరదలతో రాష్ట్రానికి తీరిని నష్టం వాటిల్లింది. ప్రాణనష్టంతోపాటు, ఆస్తినష్టం భారీగా నమోదైంది. రోడ్డు, రైలు తదితర రవాణా వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారిపోయాయి. జిల్లాలోని అనేక రోడ్డుమార్గాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా వరదల్లో చిక్కుకున్న కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం భారీగా నష్టపోయింది. ఆగస్టు 15నుంచి విమాన సర్వీసులు నిలిపివేసిన ఈ విమానాశ్రయ నష్టం 200 నుంచి 250 కోట్ల రూపాయల దాకా వుండవచ్చని అధికారులు అంచనా వేశారు. కేరళలో అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం కొచ్చి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులద్వారా అత్యధిక ఆదాయాన్ని సాధిస్తుంది. అయితే వరదల కారణంగా రన్‌వే మొత్తం నీటితో నిండిపోవడంతో విమానాశ్రయాన్ని ఆగస్టు 26వ తేదీవరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వరద పరిస్థితి శాంతించడంతో తమ సేవల్ని పునరుద్ధరించడానికి 24 గంటలూ శ్రమిస్తున్నామనీ, ప్రస్తుతం, రన్‌వేను బాగు చేస్తున్నామని కొచ్చి విమానాశ్రయాధికారి అధికారి ఒకరు చెప్పారు. 250 కి పైగా ప్రజలు ఈ పునరుద్ధరణ ప్రయత్నాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జయనా తెలిపారు. ఆగస్టు 26 నుంచి తమ విమాన సేవలు పునఃప్రారంభయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తిగా సోలార్ ప్యానెల్స్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ కార్యాలయంలో ఎనిమిది విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్లలో నాలుగు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సోలార్ పానళ్ళలో 20 శాతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాం . ఒక నెలలోనే సాధారణ పరిస్థితికి చేరుకుంటామని పీఆర్వో చెప్పారు. వీటి మరమ్మతులకు దాదాపు 10కోట్ల రూపాయలదాకా ఖర్చవుతుందని అంచనావేశామని తెలిపారు. అయితే విమానాశ్రయానికి మొత్తానికి బీమా ఉన్నకారణంగా రూ. 250 కోట్ల అంచనా నష్టం తమకు బీమా సంస్థ నుంచి పరిహారం లభించే అవకాశడం ఉండటం ఊరటనిచ్చే అంశం. -
‘భోగాపురం’లో గ్లోబల్ స్కాం!
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ టెండర్లలో గ్లోబల్ స్కాంకు తెరలేచింది! భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను బిడ్‌లో దక్కించుకుని అత్యధిక రెవెన్యూ వాటా ఇచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చినా ఆ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ముడుపులు, కమీషన్లు రావనే ‘ముఖ్య’నేత ఈ టెండర్లను రద్దు చేసినట్లు అధికార వర్గాలు బహిరంగంగానే పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నెల 17వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఎక్కువ మంది పాల్గొనకుండా...! ప్రైవేట్ సంస్థకు అది కూడా ‘ముఖ్య’నేతకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూర్చేవారికే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలనే రాష్ట్ర సర్కారు ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా నిర్ణయించుకున్న ప్రైవేట్ సంస్థకు పనులు అప్పగించేందుకు వీలుగా గ్లోబల్ టెండర్ల నిబంధనలకు పాతర వేశారని పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల దాఖలుకు కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ఈ నిబంధనను పట్టించుకోకుండా ఆసక్తి వ్యక్తీకరణకు 10 రోజులు, బిడ్ల దాఖలుకు 8 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం గమనార్హం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనకుండా కావాల్సిన వారికి మాత్రమే అవకాశం కల్పించేందుకే హడావుడిగా ముగిస్తున్నారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఏఏఐ అత్యధికంగా రెవెన్యూ వాటా ఇస్తామన్నా... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల దగ్గర నుంచి బిడ్ల దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏకంగా 13 నెలలు సమయాన్ని ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాతో పాటు, జీఎంఆర్ అప్పుడు బిడ్లు దాఖలు చేశాయి. 2016 జూన్‌లో ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించి 2017 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ వచ్చారు. అనంతరం జీఎంఆర్, ఏఏఐ బిడ్లు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. ఏఏఐ అత్యధికంగా 30.2 శాతం రెవెన్యూ వాటాతో పాటు 26 శాతం ఈక్విటీ ఇస్తానందని, ఎకరానికి ఏటా రూ.20 వేల లీజు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. జీఎంఆర్ కేవలం 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తానందని, ఈ నేపథ్యంలో ఏఏఐకి పనులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే ఏఏఐకి ఎయిర్‌పోర్టు పనులు అప్పగించేందుకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏరో సిటీ, ఏవియేషన్ అకాడమీ లాంటి అదనపు పనులు చేపట్టాలనే సాకుతో గత డిసెంబర్ 20వ తేదీన టెండర్ల రద్దుకు ఆదేశించింది. అనంతరం ఈ ఏడాది జనవరి 20వ తేదీన భోగాపురం విమానాశ్రయం టెండర్లను రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పునరాలోచనకు నిరాకరణ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆ అదనపు పనులు కూడా తామే చేపడతామని, బిడ్ల దాఖలు గడువును పొడిగించాలని ఏఏఐ కోరినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా టెండర్లను రద్దు చేస్తూ మళ్లీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా కొత్త టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొంది. -
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం!
హవానా: క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉండగా ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలియరాలేదు. బోయింగ్ 737 రకం విమానం హవానా నుంచి హోల్గ్యిన్ పట్టణానికి వెళ్తుండగా హవానాకు దగ్గర్లోనే పంట పొలాల్లో కూలి కాలిపోయింది. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకున్న ఆ ప్రాంతానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్–కేనెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మరణించిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెప్పారు. -
దుబాయ్‌లో భారతీయుడికి రూ.21కోట్ల లాటరీ
దుబాయ్: భారత్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో జాక్ పాట్ కొట్టాడు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో మంగళ వారం జరిగిన బిగ్ టికెట్ లాటరీలో ఏకంగా రూ.21.2 కోట్లు(12 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకున్నాడు. కేర ళకు చెందిన జాన్ వర్గీస్ ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాటరీ గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చిందని, ఎవరైనా తనని ఏప్రిల్ ఫూల్ చేయడానికి కాల్చేసి ఉంటారని భావించా నని జాన్ చెప్పారు. డబ్బుతో తొలుత స్మార్ట్‌ఫోన్ కొనుక్కుంటానని తెలిపాడు. తర్వాత కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మిగతా మొత్తాన్ని పేదవారికి కేటాయిస్తానని చెప్పాడు. -
రన్ వే పై పేలిపోయిన విమానం .. వీడియో వైరల్
టెక్సాస్: ఓ మినీ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. టెక్సాస్‌లోని లారెడో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పైపర్ పీఏ-31 పీ మినీ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో మంటలు వ్యాపించడంతో పైలెట్ తిరిగి ఎయిర్ పోర్టులో విమానాన్ని దించాలనుకున్నారు. అయితే విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మిని విమానంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. విమానం ఇంజిన్ పేలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అధికారికంగా వీడియో ఫుటేజీని విడుదల చేయకపోయినా, ఈ ఘటనకు సంబంధించి వీడియో స్థానిక మీడియాలో రావడంతో విమానం ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
రన్ వే పై పేలిపోయిన విమానం ..
-
6 నెలల్లో.. 1.23 కోట్ల మంది
రోజుకు 68 వేల మంది పైమాటే.. ఇది బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య. దక్షిణాదిలోనే ముఖ్యమైన ఈ ఎయిర్‌పోర్టు ఇప్పుడు కిటకిటలాడిపోతోంది. ప్రతి నెలా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. దీంతో విమానాశ్రయ విస్తరణ ఆవశ్యకంగా మారింది. సాక్షి, బెంగళూరు: దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టులో మూడవదిగా పేరు గాంచిన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సరుకు రవాణాలోనూ జోరు చూపుతోంది. 2017 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సుమారు 1.23 కోట్ల మందికిపైగా కెంపేగౌడ విమానాశ్రయం నుంచి దేశవిదేశాలకు రాకపోకలు సాగించారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ విమానా శ్ర యం నుంచి 1.14 కోట్ల మంది ప్రయాణించారు. దీంతో పాటు 1.73 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా మిగతా అంతర్జాతీయ విమానాశ్రయాలకు ధీటుగా నిలిచింది. గత ఏడాది నవంబర్ నెలలో నోట్ల రద్దు అనంతరం ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో కూ డా విమానాశ్రయం వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. మొత్తం 32 విమానయాన సంస్థలు దేశ విదేశాల్లోని 60 ప్రముఖ నగరాలకు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి సర్వీసుల్ని నడుపుతున్నాయి. రెండవ టెర్మినల్‌కు సన్నాహాలు ప్రయాణికుల రద్దీ పెరుగుతూనే ఉండడంతో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వేతో పాటు రెండవ టెర్మినల్ నిర్మాణానికి ఎయిర్పోర్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులపై అధ్యయనం చేయడానికి నిర్ణయించుకున్న విమానాశ్రయం అధ్యయనం నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానించింది. విమాన రాకపోకల సమయంలో పక్షులు ఢీకొట్టడంతో భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతోనే విమానాశ్రయం అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా నిర్మిస్తున్న రన్‌వే, రెండవ టెర్మినల్ నిర్మాణాల్లో పక్షుల సమస్యపై అధ్యయనం చేయిస్తున్నారు. దీంతో పాటు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కనున్న గ్రామాల్లో అశాస్త్రీయ పద్ధతుల్లో చెత్తను పారేస్తుండడంపై స్థానిక పంచాయితీ, పాలికె అధికారులు,ప్రజలతో చర్చించి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. -
కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ల దాడి
సాక్షి : అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ బుధవారం ఉదయం రాకెట్ల పేలుళ్లతో దద్దరిల్లింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఈ దాడి చోటు చేసుకున్నట్లు సమాచారం. ఉదయం 11.15 గంటలకు మొదలైన ఈ దాడి సుమారు గంటన్నర పాటు కొనసాగినట్లు చెబుతున్నారు. 20 నుంచి 30 రాకెట్లు విమానాశ్రయంపై వచ్చి పడ్డాయని స్థానిక మీడియా టోలో న్యూస్ వెల్లడించింది. అయితే దాడి చేసిన వారి లక్ష్యం ఎయిర్ పోర్ట్ అయి ఉండదని.. నాటో దళాలనే లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అమెరికా రక్షణ కార్యదర్వి జేమ్స్ మాటిస్ కాబూల్ పర్యటన నేపథ్యంలోనే ఈ దాడి చోటుచేసుకోవటం గమనార్హం. దాడిలో ఎవరైనా మరణించారా, ఎంత మంది గాయపడ్డారన్న వివరాలు వెంటనే వెల్లడికాలేదు. దాడికి తామే బాధ్యులమని ఇంత వరకు ఎవరూ ప్రకటించుకోలేదు. భారత పర్యటనలో భాగంగా జేమ్స్ మాటిస్ మంగళవారం భారత ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అటునుంచి అటు అఫ్ఘాన్ పర్యటనకు వెళ్లిన మాటిస్ నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్‌బర్గ్‌తోపాటు అధ్యక్షుడు అష్రఫ్ గనితో కూడా సమావేశం అయ్యారు. -
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
న్యూఢిల్లీ: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఇక విదేశీ విమానాలు రాక, పోకలు సాగించటానికి అనువైనదిగా మారనున్నది. గన్నవరం విమానాశ్రాయనికి అంతర్జాతీయ హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి అంతర్జాతీయ హోదా ఉపకరిస్తోందని ఆయన ట్విట్ చేశారు. As per the decision of the Cabinet, Vijayawada, the land of victory, joins the club of international airports in India. — PMO India (@PMOIndia) 3 May 2017 Vijayawada International Airport will welcome people from all over & provide an opportunity to discover Andhra Pradesh. @ncbn — PMO India (@PMOIndia) 3 May 2017 -
చెన్నైఎయిర్ పోర్ట్ మూసివేత
-
‘మాలె ’ వివాదంలో జీఎంఆర్‌కు ఊరట
• ఎయిర్‌పోర్టుపై ఆర్బిట్రేషన్‌లో మాల్దీవుల ప్రభుత్వానికి చుక్కెదురు • జీఎంఆర్‌కు 270 మిలియన్ డాలర్లు • చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలె అంతర్జాతీయ విమానాశ్రయ వివాదంలో ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ మాలె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (జీఎంఐఏఎల్)కు ఊరట లభించింది. ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ జీఎంఐఏఎల్‌కు 270 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,800 కోట్లు) పరిహారం చెల్లించాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. రుణ మొత్తం, ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడి, లీగల్ ఖర్చులు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయని జీఎంఆర్ వెల్లడించింది. మాల్దీవుల ప్రభుత్వం .. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం సరికాదన్న తమ వాదనలే గెలిచాయని జీఎంఆర్ ప్రతినిధి పేర్కొన్నారు. ‘ట్రిబ్యునల్ ఆదేశాలు.. మా కార్పొరేట్ గవర్నెన్స్, అత్యున్నత స్థాయి ప్రమాణాలు, వ్యాపార విలువల పట్ల జీఎంఆర్ గ్రూప్ నిబద్ధతను నిరూపించేవిగా ఉన్నాయి’అని వ్యాఖ్యానించారు. ఇబ్రహీం నాసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆధునీకరణ, పాతికేళ్ల పాటు నిర్వహణకు సంబంధించి మాల్దీవుల ప్రభుత్వం (జీవోఎం) మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ కంపెనీ (ఎంఏసీఎల్)తో జీఎంఐఏఎల్ 2010లో ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఆర్ ప్రణాళికల ప్రకారం ఈ ప్రాజెక్టులో సుమారు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఈ నిధుల్లో సింహభాగం 358 మిలియన్ డాలర్లు యాక్సిస్ బ్యాంకు రుణంగా అందించేలా జీఎంఆర్ ఏర్పాట్లు చేసుకుంది. అయితే, ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఫీజు కింద 25 డాలర్ల వసూలుపై వివాదం తలెత్తడం, ప్రాజెక్టు కేటాయింపు ప్రక్రియలో గత ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదంటూ ఆరోపణలు రావడం తదితర పరిణామాల మధ్య 2012లో జీఎంఐఏఎల్ ప్రాజెక్టును మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఏకపక్షంగా జరిగిందని, దీన్ని సవాల్ చేస్తూ జీఎంఆర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. నష్టపరిహారం ఇప్పించాలంటూ కోరింది. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య అంతర్జాతీయ ట్రిబ్యునల్ తాజాగా తుది ఆదేశాలు ఇచ్చింది. -
శంషాబాద్‌లో రియాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రియాద్ బయలుదేరిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి గురువారం రియాద్ బయలుదేరిన ఏవీ 753 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే తిరిగి ఎమెర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిసింది. -
ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. లక్నో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
టూరిస్టు వీసాలు తీసుకున్న 56 మంది ప్రయాణికులను అధికారులు విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంగళవారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. వివారాల్లోకి వెళితే.. కొంత మంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ లైన్స్ అధికారులు ప్రయాణికులకు అనుమతి నిరాకరించారు. వీరంతా కలర్‌ఫుల్ ట్రావెల్స్ ద్వారా దుబాయ్ వెళ్లేందుకు టూరిస్టు వీసాలు తీసుకున్నారు. అయితే.. అధికారులు ప్రయాణికులను ఎందుకు అడ్డుకున్నారో తెలియ రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణీకులు విమానాశ్రయంలోనే నిరసనకు దిగారు. విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులతో చర్చలు జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'కాల్పులు కాదు.. అలాంటి పెద్ద శబ్దం మాత్రమే'
లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. తొలుత కాల్పుల శబ్దం విన్న సిబ్బంది ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంతో వారు వేగంగా స్పందించారు. స్వాట్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. కీలక సాయుధ బలగాలను మోహరించాయి. విమానాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. చాలామంది ప్రయాణికులు కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో పరుగులు పెట్టారు. మరికొందరిని ప్రయాణీకులను సురక్షితంగా సమీపంలోని రెస్టారెంట్లకు తరలించారు. అయితే, తీవ్ర స్థాయిలో గాలింపులు చేపట్టిన పోలీసులు చివరకు కాల్పులు జరగలేదని, ఉగ్రవాదులు లేరని స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
లాస్ ఎంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు
-
లాస్ ఎంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు
లాస్ ఎంజెల్స్: అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతార్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం ఎయిర్ పోర్ట్ ను భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తొలుత కాల్పుల శబ్దం విన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంతో వారు వేగంగా స్పందించారు. అమెరికాలోని స్వాట్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. కీలక సాయుధ బలగాలను మోహరించాయి. విమానాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో టర్మినల్స్ లోని కొంతమంది ప్రయాణీకులు పరుగులు పెడుతుండగా మరికొందరు ప్రయాణీకులను సురక్షితంగా సమీపంలోని రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. ఇంకొందరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రాణనష్టం లక్ష్యంగా ఈ దాడులు జరిపారా లేక కేవలం ఆందోళన సృష్టించేందుకు ఈ పనిచేశారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒక టర్మినల్ మొత్తం బలగాలు నిండిపోయాయి. ఒక యువకుడు మాత్రం తుపాకీ పట్టుకుని హల్ చల్ చేస్తూ ఇష్టమొచ్చినట్లుగా కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
శంషాబాద్‌లో వ్యక్తి అరెస్ట్: విదేశీ కరెన్సీ స్వాధీనం
అనుమతులు లేకుండా విదేశి కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ డీఆర్ఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 1.25 లక్షల సౌదీ రియాద్‌లను స్వాధీనం చేసకున్నారు. దుబాయి నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీగా సౌదీ రియాద్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.