జేవార్: ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. నవంబర్ 15న తొలిసారిగా ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కానుంది. రెండవ దశ ట్రయల్ ఆపరేషన్‌లో భాగంగా విమానం నవంబర్ 15న ఇక్కడ ల్యాండ్ కానుంది. డిసెంబర్ 15 వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ వీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ట్రయల్ రన్ రెండవ దశలో అకాసా, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు ప్రతిరోజూ ఇక్కడ రాకపోకలు సాగిస్తాయన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే ఈ ట్రయల్‌లో ప్రతిరోజూ ఇక్కడి నుంచే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరుగుతాయన్నారు.
డిసెంబరు 20 నాటికి ట్రయల్ రన్ డేటాను డీజీఈసీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీని తర్వాత ఎయిర్‌డోమ్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేయనున్నారు. మార్చి 20 నాటికి లైసెన్స్ వస్తుందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ భావిస్తోంది. 2025 ఏప్రిల్ 17 నుంచి జేవార్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలు రాకపోకలు కొనసాగనున్నాయి. మొదటి రోజు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఇందులో జ్యూరిచ్, సింగపూర్, దుబాయ్ నుండి మూడు అంతర్జాతీయ విమానాలు సహా రెండు కార్గో విమానాలు కూడా ఉన్నాయి.
ముందుగా 30 విమానాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 25 దేశీయ, మూడు అంతర్జాతీయ, రెండు కార్గో విమానాలు ఉన్నాయని అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రన్‌వే, గాలి ప్రవాహం, మొదటి దశ ట్రయల్స్‌ను పరిశీలించిన తర్వాత దీనికి ఆమోదం తెలిపింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, డెహ్రాడూన్‌తో సహా పలు పెద్ద నగరాలకు తొలుత కనెక్ట్ కానుంది.
ఇది కూడా చదవండి: మహాప్రాణులకు మళ్లీ జీవం!
Comments
Please login to add a commentAdd a comment