open
-
నేడు, రేపు తెరిచే ఉండనున్న వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు
సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున జీఎస్టీ, వ్యాట్‌ను వచ్చే 2 రోజుల్లో చెల్లించాల్సిందిగా వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు శనివారం కోరారు. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలను మార్చి 30, 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కోసం తెరిచే ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో అయితే www.apct.gov.in వెబ్సైట్లో ఈ–పేమెంట్ గేట్ వే ద్వారా పన్ను చెల్లింపులు సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం కోసం అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
బ్యాంకులకు రంజాన్ సెలవు లేదా?
ముస్లింలకు పర్వదినమైన రంజాన్ మార్చి 31న వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అయితే బ్యాంకులకు మాత్రం ఆరోజు సెలవు లేదు. ఎందుకంటే ఆరోజు ఈ ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో మార్చి 31న బ్యాంకులు క్లియరింగ్ ఆపరేషన్‌లో పాల్గొనాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీల అకౌంటింగ్‌ను సులభతరం చేస్తుంది. పండుగలు, వారాంతపు సెలవులతో సంబంధం లేకుండా దేశం అంతటా ఆదాయపు పన్ను, సీజీఎస్టీ కార్యాలయాలు మార్చి 29 నుండి మార్చి 31 వరకు తెరిచి ఉంటాయి.భారతదేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాలని ఆర్బీఐ గతంలో పేర్కొంది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులను నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులు, శాఖలు మార్చి 31న సాధారణ పని గంటలు ముగిసే వరకు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఓవర్ ది కౌంటర్ లావాదేవీల కోసం తెరిచి ఉండాలని అపెక్స్ బ్యాంక్ కోరింది.చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద స్టాండర్డ్ క్లియరింగ్ టైమింగ్స్ మార్చి 31న వర్తిస్తాయని ఆర్బీఐ తాజాగా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను మార్చి 31 నాటికి లెక్కించడానికి వీలుగా మార్చి 31న ప్రభుత్వ చెక్కుల కోసం ప్రత్యేకంగా సీటీఎస్ కింద ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సర్క్యులర్‌లో పేర్కొంది. అన్ని బ్యాంకులు ఈ ప్రత్యేక క్లియరింగ్ ఆపరేషన్లలో పాల్గొనాలని సర్క్యులర్‌లో ఆదేశించింది. -
మే 2 నుంచి కేదార్నాథ్ దర్శనం.. శివరాత్రి వేళ ప్రకటన
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కొలువైన కేదారనాథుడు శివరాత్రి పర్వదినాన భక్తులపై అనుగ్రహ వర్షం కురిపించాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకునే తేదీని ప్రకటించారు. రాబోయే మే 2న ఉదయం ఏడు గంటలకు వృషభ లగ్నంలో కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.కేదార్నాథ్ ధామ్ తెరుచుకోవడంతోనే చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. కేదార్నాథ్ ధామ్ దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ 12 జ్యోతిర్లింగాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి గుజరాత్‌లోని సోమనాథ్- నాగేశ్వర్ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని మల్లికార్జున ఆలయం, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర, ఓంకారేశ్వర ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయం, మహారాష్ట్రలోని భీమశంకర, త్రయంబకేశ్వర ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం, జార్ఖండ్‌లోని వైద్యనాథ ఆలయం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఘుష్మేశ్వర్ ఆలయం.కేదార్నాథ్ ధామ్ ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో ఒకటి. కేదార్నాథ్ ఆలయం రుద్రప్రయాగ జిల్లాలోని గౌరికుండ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పురాతన ఆలయానికి సంబంధించిన ప్రస్తావన మహాభారత కాలంలోనే కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఆది గురు శంకరాచార్యులు 8-9 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించారని చెబుతారు. ఇది కూడా చదవండి: Mahashivratri: జ్యోతిర్లింగాలలో మార్మోగుతున్న శివనామస్మరణలు -
నిశేష్ జోరుకు మోన్ఫిల్స్ బ్రేక్
ఆక్లాండ్: ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి విజయ పరంపరకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ 6–7 (5/7), 4–6తో ప్రపంచ 52వ ర్యాంకర్, ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ చేతిలో ఓడిపోయాడు. మోన్ఫిల్స్తో 1 గంట 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల నిశేష్ మూడు ఏస్‌లు సంధించాడు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో మోన్ఫిల్స్ పైచేయి సాధించాడు. రెండో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు తొమ్మిదో గేమ్‌లో నిశేష్ సర్వీస్‌ను మోన్ఫిల్స్ బ్రేక్ చేసి 5–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న మోన్ఫిల్స్ విజయాన్ని ఖరారు చేసుకొని కెరీర్లో 35వసారి ఏటీపీ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు.సెమీస్‌లో ఓడిన నిశేష్‌కు 35,480 డాలర్ల (రూ. 30 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నిశేష్ 27 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 106వ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ఈనెల 12న మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో పదిసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌తో నిశేష్ తలపడతాడు. -
యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం
ఆక్లాండ్: ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ– 250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 3–6, 6–4, 12–10తో మూడో సీడ్ జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో 9–10తో యూకీ–ఒలివెట్టి ద్వయం ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదల కోల్పోకుండా ఆడిన యూకీ–ఒలివెట్టి జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో యూకీ–ఒలివెట్టి నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. నేడు జరిగే సెమీఫైనల్లో క్రిస్టియన్ హారిసన్–రాజీవ్ రామ్ (అమెరికా)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. -
ఎదురులేని నిశేష్
ఆక్లాండ్: మరో మ్యాచ్... మరో సంచలనం... ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 2–6, 6–2, 6–4తో ఎనిమిదో సీడ్, ప్రపంచ 41వ ర్యాంకర్ అలెక్స్ మికిల్సిన్ (అమెరికా)ను ఓడించాడు. 1 గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్లో ప్రపంచ 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై, రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)పై సంచలన విజయాలు సాధించాడు. -
డిఫెండింగ్ చాంపియన్‌పై నిశేష్ సంచలన విజయం
ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 6–4, 5–7, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. గత నెలలో ప్రొఫెషనల్‌గా మారిన నిశేష్ ఈ టోర్నీ తొలి రౌండ్లో 6–2, 6–2తో 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై గెలిచాడు. మరోవైపు అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–3, 3–6, 11–13తో నాలుగో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
జేవార్: ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. నవంబర్ 15న తొలిసారిగా ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కానుంది. రెండవ దశ ట్రయల్ ఆపరేషన్‌లో భాగంగా విమానం నవంబర్ 15న ఇక్కడ ల్యాండ్ కానుంది. డిసెంబర్ 15 వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ వీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ట్రయల్ రన్ రెండవ దశలో అకాసా, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు ప్రతిరోజూ ఇక్కడ రాకపోకలు సాగిస్తాయన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే ఈ ట్రయల్‌లో ప్రతిరోజూ ఇక్కడి నుంచే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరుగుతాయన్నారు.డిసెంబరు 20 నాటికి ట్రయల్ రన్ డేటాను డీజీఈసీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీని తర్వాత ఎయిర్డోమ్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేయనున్నారు. మార్చి 20 నాటికి లైసెన్స్ వస్తుందని ఎయిర్పోర్ట్ అథారిటీ భావిస్తోంది. 2025 ఏప్రిల్ 17 నుంచి జేవార్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలు రాకపోకలు కొనసాగనున్నాయి. మొదటి రోజు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఇందులో జ్యూరిచ్, సింగపూర్, దుబాయ్ నుండి మూడు అంతర్జాతీయ విమానాలు సహా రెండు కార్గో విమానాలు కూడా ఉన్నాయి.ముందుగా 30 విమానాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 25 దేశీయ, మూడు అంతర్జాతీయ, రెండు కార్గో విమానాలు ఉన్నాయని అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రన్‌వే, గాలి ప్రవాహం, మొదటి దశ ట్రయల్స్‌ను పరిశీలించిన తర్వాత దీనికి ఆమోదం తెలిపింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, డెహ్రాడూన్‌తో సహా పలు పెద్ద నగరాలకు తొలుత కనెక్ట్ కానుంది.ఇది కూడా చదవండి: మహాప్రాణులకు మళ్లీ జీవం! -
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
చెంగ్డూ (చైనా): భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. చెంగ్డూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (11/9)తో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో సాడియో డుంబియా–ఫాబియన్ రెబూల్ (ఫ్రాన్స్)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. ఈ ఏడాది యూకీ తన భాగస్వామి ఒలివెట్టితో కలిసి జిస్టాడ్ ఓపెన్, మ్యూనిక్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్స్ సాధించాడు. -
భారత షట్లర్లకు నిరాశ
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. బరిలోకి దిగిన యువ షట్లర్లు అష్మిత చాలిహా, మాళవిక, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 53వ ర్యాంకర్ అష్మిత 8–21, 13–21తో 17వ ర్యాంకర్ పోన్‌పావీ చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ మాళవిక 21–18, 15–21, 17–21తో 18వ ర్యాంకర్ లిన్ హోజ్మార్క్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 15–21, 15–21తో లిన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఆయుశ్ రాజ్ గుప్తా–శ్రుతి జంట 7–21, 12–21తో కో సంగ్ హ్యాన్–ఇయోమ్ హ్యూ వోన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. -
రిత్విక్ జోడీ ఓటమి
న్యూపోర్ట్ (అమెరికా): హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ రితి్వక్ చౌదరీ–నికీ కలియంద పునాచా (భారత్) ద్వయం 1–6, 4–6తో ల్యూక్ సవిల్లె–అలెగ్జాండర్ వుకిచ్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రితి్వక్ ద్వయం ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. -
Chardham Yatra: తెరుచుకున్న బద్రీనాథ్ .. భారీగా తరలివచ్చిన భక్తులు!
మంగళ వాయిద్యాల నడుమ మధ్య బద్రీనాథ్ తలుపులు ఈరోజు(ఆదివారం) తెరుచుకున్నాయి. ఇకపై భక్తులకు బద్రివిశాల్ స్వామి ఆరు నెలల పాటు దర్శనమివ్వనున్నాడు. బద్రీనాథ్ తలుపులు తెరిచే సమయానికి దాదాపు పది వేల మంది భక్తులు ధామ్ ముందు బారులు తీరారు. అఖండ జ్యోతి దర్శనం కోసం 20 వేల మంది యాత్రికులు నేటి సాయంత్రం నాటికి బద్రీనాథ్ చేరుకునే అవకాశం ఉంది.ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి ధామ్ నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మే 10న తెరుచుకున్నాయి. బద్రీనాథ్ పుష్ప సేవా సమితి ధామ్‌ను 15 క్వింటాళ్ల బంతి పూలతో అలంకరించింది. ధామ్‌లోని పురాతన మఠాలు, దేవాలయాలను కూడా అందంగా అలంకరించారు.బద్రీనాథ్ ధామ్‌లో పాలిథిన్ వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడి వ్యాపారులు పాలిథిన్ కవర్లను వినియోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయంలో పూజలు ప్రారంభమైనట్లు బీకేటీసీ మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ హరీశ్‌గౌడ్ తెలిపారు. ముందుగా లక్ష్మీ అమ్మవారిని గర్భగుడి నుండి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించాక, ధామ్‌లో ఆశీనురాలిని చేయించారు. బద్రివిశాల్ స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం.. చతుర్భుజుడైన స్వామివారికి నెయ్యితో అలంకారం చేశారు. ఆరు గంటలకు భక్తుల సందర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. #WATCH | Chamoli, Uttrakhand: The doors of Shri Badrinath Dham were opened for the devotees today at 6 am amidst the melodious tunes of the Army Band, with complete rituals, Vedic chanting and slogans of 'Badri Vishal Lal Ki Jai'. pic.twitter.com/lPSCXxKfvx— ANI (@ANI) May 12, 2024 -
టైటిల్ పోరుకు తరుణ్
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 190వ ర్యాంకర్ తరుణ్ 21–8, 21–7తో ప్రపంచ 78వ ర్యాంకర్ లె డక్ ఫాట్ (వియత్నాం)పై సంచలన విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 76వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా)తో తరుణ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ 22–20, 21–14తో దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 15–21, 15–21తో వోంగ్ తియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోగా... సెమీఫైనల్లో మనీషా–సంజయ్ (భారత్) ద్వయం 21–16, 10–21, 21–14తో కొసియెలా–తనీనా (అల్జీరియా) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ ఖరారైంది. ఫైనల్ పోరు ఇద్దరు భారత క్రీడాకారిణులు అనుపమా ఉపాధ్యాయ, ఇషారాణి బారువా మధ్య జరగనుంది. -
క్వార్టర్ ఫైనల్లో రుత్విక జోడీ
అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక–రోహన్ కపూర్ (భారత్) జోడీ 22–20, 21–17తో కెన్నెత్–గ్రోన్యా సోమర్విల్లె (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి 22–24, 21–18, 21–13తో భారత్‌కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ లో జాతీయ చాంపియన్ అన్మోల్ 21–11, 21–7తో నూరానీ అజారా (యూఏఈ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
మందుబాబులకు వీఐపీ ట్రీట్మెంట్.. హిమాచల్ సీఎం ఆదేశాలు!
హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతరాణిగా పేరొందిన సిమ్లాలో తొలిసారిగా సిమ్లా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు కొనసాగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్‌తో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సాంస్కృతిక కవాతును వీక్షించారు. కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రౌండ్, మాల్ రోడ్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్నివాల్లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా కనిపించారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్‌లో కాకుండా హోటల్‌కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి వీఐపీ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. సిమ్లా వింటర్ కార్నివాల్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్‌ను 24 గంటలూ తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తుంచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సిమ్లా, మనాలిలకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలో బస చేస్తున్నారు. కాగా మనాలిలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. కొందరు పర్యాటకులు మద్యం సేవించి లోయల్లో హల్చల్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
తిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయం తలుపులు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. గ్రహణం కారణంగా నిన్న రాత్రి ఆలయ ద్వారాలను మూసివేశారు. గ్రహణ కాలంలో కిరణాలు సోకడం కారణంగా చెడు ఫలితాలు ఉంటాయని ఆలయాలు మూసివేస్తారు. ఉదయం 3:15 నిముషాలకు ఆలయ ద్వారాలు తెరిచి పుణ్యాహవచనం చేసి, ఆలయ శుద్ధి నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న 47 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని, హుండీ ద్వారా 3.03 కోట్లు ఆదాయం వచ్చింది. #WATCH | Tirupati, Andhra Pradesh: After the lunar eclipse, the Tirumala Tirupati Devasthanam officials reopened the Sri Venkateswara Shrine doors on Sunday morning, cleaned the temple according to 'Shastras' and started the Suprabhata Seva. Temple Deputy EO Lokanadam, Peskar… pic.twitter.com/JpyirpnnyR — ANI (@ANI) October 29, 2023 -
పాక్‌లో 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే ఏం జరిగింది?
దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లోని హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాగే నాడు పాకిస్తాన్లో ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా కనిపించవు. కొన్ని దేవాలయాలను కూల్చివేయగా, మరికొన్నింటిని నిర్లక్ష్యం చేశారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదేవిధంగా పాకిస్తాన్లో కొన్ని దేవాలయాలు మూతపడ్డాయి. సియాల్కోట్లో 72 సంవత్సరాలుగా మూసివేసిన ఆలయం కొంతకాలం క్రితం తెరుచుకుంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ఎంత విశిష్టమైనదనేది దాని నిర్మాణశైలి తెలియజేస్తుంది. భారీ పరిమాణంలోని రాళ్లతో నిర్మితమైన ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇది చిన్నగా ఉన్న శివాలయమే అయినప్పటికీ, దీని నిర్మాణాన్ని ప్రముఖ దేవాలయాలతో పోలుస్తుంటారు. 75 ఏళ్లుగా ఆలయాన్ని మూసివేసినా, ఆలయ గోడలు చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. ఆలయాన్ని పరిశీలించి చూస్తే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించారో అంచనా వేయవచ్చు. ఈ ఆలయాన్ని 72 ఏళ్ల తర్వాత 2019లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెరిచారు. ఈ దేవాలయం పేరు శివాల తేజ సింగ్ టెంపుల్. ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం ఆలయాన్ని తెరిచినప్పుడు అక్కడున్న హిందువులు హర్ హర్ మహాదేవ్ అని నినాదాలు చేశారు. ఈ నినాదాలు చాలా దూరం వరకూ ప్రతిధ్వనించాయని చెబుతారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి? -
3,282 వర్సిటీ పోస్టులకు నోటిఫికేషన్
రాజానగరం: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితో పాటు డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ తదితర ప్రతి పోస్టునూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీకి సోమవారం వచ్చిన హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వారిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో బోధిస్తున్నరన్నారు. వీరిలో సుమారు వెయ్యి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ (విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజుల నుంచి జీతాలు పొందేవారు) కింద పని చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రారని, వారి విధులకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన వారు ఓపెన్ రిక్రూట్మెంట్లో ఇతరులతో పాటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఇచ్చే 10 శాతం వెయిటేజీ మార్కులను ఏడాదికి ఒకటి చొప్పున లెక్కిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారన్నారు. వారి నుంచి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేస్తారని చెప్పారు. వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీని కోసం ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రెహమాన్ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భర్తీ ప్రక్రియను ప్రకటిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసమే ఇంటర్న్‌షిప్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోందనే ఉద్దేశంతోనే చదువుకునే సమయంలోనే ఇంటర్న్‌షిప్ చేయాలనే నిబంధన పెట్టామని ఆచార్య హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలుంటాయన్నారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయనే సమాచారాన్ని ఐఐసీ పోర్టల్‌లో ఉంచుతున్నామని వివరించారు. ఇవి కాకుండా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నమని చెప్పారు. ఏడాదికి 3.50 లక్షల మంది ఇంటర్న్‌షిప్ చేయాల్సి వస్తుండగా సుమారు 5 లక్షల అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
వచ్చే ఏడాది 43% మిగులు విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: అవసరానికి మించి విద్యుత్ కొనుగోళ్ల కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు... వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, దీంతో అవసరం లేని విద్యుత్‌కు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్డ్ చార్జీలు) చెల్లించక తప్పదని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేశారు. 2024–25లో ఏకంగా 43.24 శాతం, 2025–26లో 41.97 శాతం, 2026–27లో 34.13 శాతం, 2027–28లో 26.29 శాతం, 2028–29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వినర్ ఎం.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2024–29, 2029–34 మధ్య కాలంలో రాష్ట్రంలో ఉండనున్న విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ విక్రయాల అంచనాలు, ఆ మేరకు సరఫరా చేసేందుకు విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి ప్రణాళికలతో కూడిన తమ వనరులు, వ్యాపార ప్రణాళికలను ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించగా ఎం.వేణుగోపాల్‌రావు రాతపూర్వకంగా అభ్యంతరం తెలియజేశారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నందున మిగులు విద్యుత్ సమస్యే ఉండదంటూ డిస్కంలు సమరి్థంచుకోవడాన్ని కొట్టిపడేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధర ఎంత? వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024–29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్లకు ప్రీపెయిడ్ మీటర్లకు రూ. 348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ. 305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని వేణుగోపాల్‌రావు డిస్కంలను ప్రశ్నించారు. కాగా, ఈఆర్సీ గత శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో పలువురు నిపుణులు చేసిన వి జ్ఞప్తి మేరకు ఈ నెల 22న విచారణ నిర్వహించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఆలోగా పూర్తి వివరణలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. -
వాస్తుదోషంతో సీఎం దర్వాజ.. 15 ఏళ్ల తర్వాత తెరిచిన సిద్ధరామయ్య..
కర్ణాటక: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. విధాన సభలోని సీఎం ఛాంబర్లో దురదృష్టంగా భావించే దక్షిణ ద్వారాన్ని మళ్లీ ఓపెన్ చేపించారు. గత 15 ఏళ్లుగా ఆరుగురు ముఖ్యమంత్రుల కాలంలో మూసి ఉన్న ఈ దర్వాజాను మరోసారి తెరిపించారు. ఆయన అధికారంలోకి వచ్చాక వాస్తు దోషాలకు, మూఢ నమ్మకాలకు తెరదించుతూ ఈ ద్వారాన్ని తెరిచారు. 1998లో ఎన్నికల్లో ఓటమి తర్వాత జే హెచ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన సభలోని దక్షిణ ద్వారం మూతపడింది. సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన 2013లో ఆ ద్వారాన్ని తెరిపించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆరుగురు సీఎంలు పదవి చేపట్టారు. కానీ ఎవరూ కూడా ఆ ద్వారాన్ని తెరిచే సాహసం చేయలేదు. ప్రస్తుతం అధికారంలోకి రాగా... సీఎం సిద్ధరామయ్య మళ్లీ ఆ దర్వాజాను ఓపెన్ చేపించారు. #WATCH | Karnataka CM Siddaramaiah today entered his chamber in Vidhana Soudha using the 'West Door' which was earlier closed reportedly due to 'Vastu defects'#Bengaluru pic.twitter.com/tH01p2APlj — ANI (@ANI) June 24, 2023 2018 తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత ముగ్గురు సీఎంలు పదవి మారారు. బీ ఎస్ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, హెచ్ డీ కుమార స్వామిలు పదవి చేపట్టారు. వీరెవరూ విధాన సభలోని వాస్తు దోషంగా భావించే దక్షిణ ద్వారాన్ని ఓపెన్ చేసే సాహసం చేయలేదు. విధాన సౌధలోని మూడో ఫ్లోర్లో సీఎం ఛాంబర్ ఉంటుంది. దానికి దక్షిణంలో ఓ ద్వారం ఉంటుంది. ఆ ద్వారం వాస్తు దోషంతో ఉందని అసెంబ్లీ సభ్యులందరూ భావిస్తుంటారు. అందుకే చాలా ఏళ్లుగా అది మూతపడి ఉంది. ఇదీ చదవండి: 'సీఎం కేసీఆర్ ఫొటో సెషన్ తర్వాత ఇదే..' ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి ఫైర్.. -
బ్రెజిల్ : గాల్లోనే తెరుచుకున్న విమానం డోర్లు
-
గుడివాడ బహిరంగ సభ నుంచి చంద్రబాబుకు కొడాలి నాని ఓపెన్ ఛాలెంజ్..!
-
ప్రయాణికుడి దెబ్బకు 200 మందికి టెన్షన్.. ఏం జరిగిదంటే?
సియోల్: ఇటీవలి కాలంలో కొందరు విమాన ప్రయాణికులు అతిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు విమానంలో గాల్లో ఉన్న సమయంలో డోర్ ఓపెన్ చేయడం, మరికొందరు ఎదుటి వారితో వాగ్వాదానికి దిగడం వంటివి తరచుగా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఏషియానా విమానంలో చోటుచేసుకుంది. విమానం ఆకాశంలో ఉన్న సమయంలో ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేశాడు. దీంతో, కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. ఏ321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఆ విమాన్ డోర్‌ను తీశాడు. దక్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో, అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని డేగు విమానాశ్రయంలో దించారు. కాగా, సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేస్తున్న సమయంలో ప్రయాణికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ డోర్ ఓపెన్ అయ్యింది. ఇక, విమానం గాలిలో ఉన్న సమయంలో డోర్ ఓపెన్ కావడంతో అందులో ఉన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సదరు వ్యక్తి డోర్ ఎందుకు ఓపెన్ చేశాడన్నది తెలియరాలేదు. మరోవైపు.. ఉల్సన్‌లో జరుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు చాలా మంది అథ్లెట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. శ్వాస కోస ఇబ్బందులు తలెత్తిన్న ప్రయాణికులను హాస్పిటల్‌కు తరలించినట్లు రవాణాశాఖ తెలిపింది. కాగా, విమానంలో డేగు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 🚨 Un pasajero ha abierto una salida de emergencia del #A321 HL8256 de #AsianaAirlines en pleno vuelo. El vuelo #OZ8124 entre Jeju y Daegu del 26 de mayo se encontraba en aproximación cuando una de las salidas de emergencia sobre el ala fue abierta por un pasajero. El avión… pic.twitter.com/G0rlxPNQuW — On The Wings of Aviation (@OnAviation) May 26, 2023 ఇది కూడా చదవండి: బ్రిటన్ ప్రధాని నివాసంపైకి కారుతో దాడికి యత్నం?.. రిషి సునాక్ సేఫ్! -
నూతన పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించాలి...
-
హాట్‌టాపిక్‌గా ప్రధాని మోదీ బహిరంగ లేఖ! ఆ లేఖలో ఏముందంటే..
కర్ణాటకలో మే10న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కర్ణాటక ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ విడుదలన చేసిన లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. ఆ లేఖలో మోదీ.. కర్ణాటకలో 38 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని బ్రేక్ చేసి.. వరుసగా రెండోసారి విజయఢంకా మోగించాలనే లక్ష్యంతోనే బీజేపీ ఈ ఎన్నికల బరిలోకి దిగుతోందన్నారు. నిజానికి కన్నడ నాట ఏ అధికార పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ మేరకు మోదీ ఆ లేఖలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు ఎల్లప్పుడూ నన్ను ప్రేమ ఆప్యాయతలతో ముంచెత్తారు. ఇది నాకు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భారతీయులమైన మనం మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. కర్ణాటక కూడా తన దార్శనికతను సాకారం చేసుకునేలా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఆసక్తి కనబర్చింది. భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, ముందుగా మొదటి మూడుస్థానాలకు చేరుకోవడమే తన తదుపరి లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. అదీకూడా కర్ణాటక వేగంగా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అలాగే కర్ణాటకలోని ప్రజల పట్ల తమ పార్టీ నిబద్ధతను గురించి కూడా లేఖలో ప్రస్తావించారు. ఇంకా ఆ లేఖలో.. కరోనా మహమ్మారి సమయంలో తమ ఏలుబడిలోని కర్ణాటక ఏడాదికి సుమారు రూ. 90 వేల కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు పొందింది. ఇది గత ప్రభుత్వంలో కేవలం రూ. 30 వేల కోట్లు మాత్రమే. పెట్టుబడులు, పరిశ్రమల ఆవిష్కరణలతో సహా, విద్య, ఉపాధి, వ్యవస్థాపకత తదితరాల్లో కర్ణాటకాని నెం1 గా మార్చాలని అనుకుంటున్నాం. ఇది ఈ రాష్ట్ర ప్రతి పౌరుడి కలే. ఇదే తన కల.. అని లేఖలో వెల్లడించారు మోదీ. ఈనేపథ్యంలోనే మోదీ శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సుమారు 26 కి.మీ రోడ్డు షో నిర్వహిచారు. ఇదిలా ఉండగా, కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 224. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. (చదవండి: ఓవైపు కన్నడనాట హోరాహోరీ.. మరోవైపు కాంగ్రెస్‌లో ఇంటి పంచాయితీ! పైలట్ వ్యాఖ్యల్లో అంతరార్థం?) -
కాసేపట్లో తెరుచుకోనున్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్
-
తెలంగాణలో ఇక 24 గంటలు అన్ని షాపులు ఓపెన్
-
Telangana: వ్యాపారులకు శుభవార్త.. ఇక 24 గంటలూ షాపులు తెరవొచ్చు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలపాటు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని జీవో జారీ చేశారు. తదనుగుణంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988కు సవరణలు చేసినట్టు తెలిపారు. 24 గంటలపాటు దుకాణం తెరిచి ఉంచేందుకు గాను ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.10,000 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అయితే ఈ జీవో అమలులో ఈ కింది పది నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఐడీ కార్డులు జారీ చేయాలి వారాంతపు సెలవు ఇవ్వాలి వారంలో కచ్చితమైన పనిగంటలు ఉండాలి ఓవర్ టైమ్‌కు వేతనం చెల్లించాలి పండుగలు, సెలవు దినాల్లో పని చేసినవారికి కాంపెన్సేటరీ సెలవు ఇవ్వాలి మహిళా ఉద్యోగులకు తగిన వేతనం ఇవ్వాలి రాత్రి షిఫ్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల అంగీకారం తీసుకోవాలి.. రవాణా సదుపాయం కల్పించాలి రికార్డులను సరిగా మెయింటైన్ చేయాలి పోలీస్‌యాక్ట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి చదవండి: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్‌ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్‌పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
Viral Video: ఉన్నపలంగా లారీ డోర్ తీసాడు.. తర్వాత ఏమైందంటే..!
-
పారాగ్లైడింగ్ చేస్తుండగా.. సరిగా ఓపెన్ కాకపోవడంతో విషాదం
ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తుండగా సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో విసత్‌పురా గ్రామంలోని పాఠశాలలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల షిన్ బైయాంగ్ మూన్ గుజరాత్‌లోని కడి పట్టణంలో పారాగ్లైడింగ్ చేస్తుండగా.. పారాగ్లైడర్ కనోపి సరిగా తెరుచుకోవడంలో విఫలమైంది. అంతే అతను ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అతను దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటినా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి పడిపోతున్నానన్న షాక్‌లో గుండెపోటుకి గురవ్వడంతో మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఆ కోరియన్ గుజరాత్‌లోని వదోదర పర్యటనలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం సదరు కొరియన్ షిన్, అతని స్నేహితుడితో కలిసి పారాగ్లైడింగ్‌కి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి కొరియన్ ఎంబసీకి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని అతడి స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. (చదవండి: క్రిస్మస్ చెట్టుకు బైడెన్ దంపతుల అలంకరణ.. ఫోటో వైరల్) -
త్వరలో తెరుచుకోనున్న రియల్ KGF గేట్లు
-
రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2024 చివరి నాటికి 10,000 సినిమా హాళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. ఇందుకోసం అక్టోబర్ సినిమాస్‌తో చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష చిన్న థియేటర్లను నెల కొల్పాలన్నది లక్ష్యం. ఒక్కో కేంద్రం 100-200 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానుంది. సీఎస్‌సీని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ప్రమోట్ చేస్తోంది. 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ ఉన్న 1 లక్ష చిన్న సినిమా థియేటర్లను తెరవాలనే లక్ష్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేష్ వెల్లడించారు. (ప్రావిడెంట్ ఫండ్:నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే కోటి రూపాయలు) 2024 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10,000 సినిమా హాళ్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామని అక్టోబర్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ దేశాయ్ తెలిపారు. వీడియో పార్లర్ సినిమా లైసెన్సు ఉన్న ఈ సినిమా హాళ్లను నడపాలంటే దాదాపు రూ.15 లక్షల పెట్టుబడి అవసరమన్నారు. గ్రామీణ స్థాయి వ్యాపారులకు కొత్త అవకాశాలను ఈ థియేటర్లు కల్పిస్తాయని సీఎస్సీ భావిస్తోంది. సీఎస్సీ కార్యకలాపాలకు ఇవి కేంద్రాలుగా మారతాయని ఆశిస్తోంది. (కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!) -
టయోటా నుంచి సీఎన్జీ వేరియంట్లు, బుకింగ్స్ షురూ
హైదరాబాద్: వాహన తయా రీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజా గా సీఎన్జీ విభాగంలోకి ప్రవేశించింది. గ్లాంజా, అర్బన్ క్రూజర్ హైరైడర్ మోడళ్లలో సీఎన్ జీ వేరియంట్లను పరిచయం చేసింది. గ్లాంజా ధర రూ.8.43 లక్షల నుంచి ప్రారంభం. అర్బన్ క్రూజర్ హైరైడర్ ధరను ప్రకటించాల్సి ఉంది. బ్రాండ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ఆన్లైన్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. రూ. 11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. గ్లాంజా ఎస్ ట్రిమ్‌కు రూ. 8.43 లక్షలు, జీ ట్రిమ్‌కి రూ. 9.46 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది.పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే, గ్లాంజా సీఎన్జీ ధర రూ. 95,000 ఎక్కువ. ఇంజీన్, ఫీచర్లు 55 లీటర్ సీఎన్జీ ట్యాంక్‌ను అమర్చింది. ఇంటీరియర్ ఎలాంటి మార్పులు లేవు. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్డేట్లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్, స్టార్ట్/స్టాప్ బటన్ , ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన బాలెనో సీఎన్జీతో ఇది పోటీ పడనుందని అంచనా. -
ఆకాశ ఎయిర్: రడీ టూ టేకాఫ్, టికెట్ ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన రంగంలో సేవలందించేందుకు ఆకాశ ఎయిర్ సర్వం సిద్ధం చేసుకుంది. బిలియనీర్, ప్రముఖ పెట్టుబడి దారుడు రాకేష్ ఝున్‌ఝన్‌వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్ తొలి వాణిజ్య బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఆగస్టు 7న ముంబై-అహ్మదాబాద్ మార్గంలో గాల్లోకి ఎగరనుంది. దీనికి టికెట్ల విక్రయాలను నేటి(జులై 22) నుంచే ప్రారంభించింది. తొలిదశలో అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి నెట్‌వర్క్‌లకు కంపెనీ టిక్కెట్ల విక్రయిస్తోంది. ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తొలి బోయింగ్ విమానం డెలివరీ అయిందని, రెండో విమానం ఈ నెలాఖరులోపు అందే అవకాశం ఉందన్నారు. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు. దీంతో ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాల బుకింగ్‌లు మొబైల్ యాప్, మొబైల్ వెబ్, డెస్క్‌టాప్ వెబ్సైట్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఆకాశ ఎయిర్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రోజువారీ విమానాన్ని కూడా నడుపుతుంది. ముంబై విమాన టిక్కెట్లు రూ. 4,314 నుండి ప్రారంభం. కాగా, అహ్మదాబాద్ నుండి ప్రారంభ ధర రూ. 3,906గా ఉంటాయి. బెంగళూరు నుండి కొచ్చికి రెండు రోజువారీ విమానాలను నడుపుతుంది. టికెట్ల ధర రూ. 3,483 నుండి ప్రారంభం.కొచ్చి నుండి తిరిగి వచ్చే విమానం టిక్కెట్ ధరలు రూ. 3,282 నుండి ప్రారంభం. కేఫ్ ఆకాశ అకాశ ఎయిర్ విమానాల్లో ‘కేఫ్ అకాశ’ బై-ఆన్-బోర్డ్ మీల్ సర్వీస్‌ను అందిస్తుంది. ఇందులో పాస్తా, వియత్నామీ రైస్ రోల్స్, హాట్ చాక్లెట్ అందిస్తుంది. అలాగే సంవత్సరం పొడవునా భారతీయ వంటకాలతో కూడిన పండుగ మెనూ కూడా ఉంటుందని తెలిపింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేత యాష్లే బార్టీ
-
ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలంటూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం (పిల్) దాఖలైంది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అధ్యాపకుడు ఎం.బాలకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇటీవల కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం కరోనా మూడో దశలో చిన్నారులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. విద్యార్థులకు టీకాలు ఇవ్వలేదు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తుండటం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే.ప్రత్యక్షబోధనను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయం డి. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేయండి’’అని పిటిషన్లో కోరారు. చదవండి: ‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా ఈ పిల్లో విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాలవిద్య, ప్రజారోగ్యవిభాగం డైరెక్టర్లతోపాటు కరోనా అంశాలకు సంబం«ధించి సలహాలిచ్చిన నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యు లతో కూడిన నిపుణుల కమిటీ ప్రతినిధి బృందాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం ముందు విచారణకు రానుంది. చదవండి: ‘దళితబంధు’ సర్వే చకచకా.. -
Telangana: విద్యాసంస్థల పునఃప్రారంభం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
-
విద్యార్థులకు ఇది నిజంగా స్వాతంత్య్ర దినోత్సవం : సీఎం బొమ్మై
-
ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి (సోమవారం) నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని పేర్కొంది. నాడు- నేడు కార్యక్రమంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా రుపుదిద్దుకున్న పాఠశాలలు సోమవారం విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. కాగా, రేపు (సోమవారం) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్న విద్యాకానుక’ను తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యా కానుక అందించనున్నారు. మొత్తం 47.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, వర్క్ బుక్కులు, 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బాగ్ ఇవ్వనున్నారు. ఈసారి అదనంగా ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందించనున్నారు. గత ఏడాది విద్యాకానుక కింద 42.34 లక్షల మంది విద్యార్థులకు కిట్స్ అందించారు. విద్యారంగంలో సమూల మార్పుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు నేడు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్విమ్స్‌లో అక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన టీటీడీ
-
తెలంగాణలో 23 నుంచి వందశాతం ఆకుపెన్సీతో థియేటర్లు ఓపెన్
-
తెరుచుకున్న ‘తనిష్క్’
ముంబై: లాక్డౌన్ ఎత్తివేత నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా స్టోర్లను తెరిచినట్లు బంగారు ఆభరణాల తయారీ సంస్థ తనిష్క్ తెలిపింది. స్టోర్లలోకి పరిమిత సంఖ్యలోనే కస్టమర్లను అనుమతిస్తామని పేర్కొంది. వైరస్, బ్యాక్టీరియాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికత కలిగిన ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను స్టోర్లలో ఏర్పాటు చేసినట్లు వివరించింది. సిబ్బందికి టీకా సిబ్బంది మొత్తానికి ఉచితంగా టీకాను అందించామని, స్టోర్లలో డబుల్ మాస్క్ లేదా ఎన్95 మాస్కుల ధారణ తప్పనిసరి చేశామని తెలిపింది. టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ అన్‌లాక్ ప్రక్రియ తర్వాత దేశవ్యాప్తంగా ఉండే తన 356 స్టోర్లలో 294 రిటైల్ స్టోర్లను పునఃప్రారంభించింది. చదవండి : SBI: హెల్త్‌కేర్ బిజినెస్ లోన్ ద్వారా ఎంత రుణం పొందవచ్చు ? -
నవంబర్ 2 నుంచి స్కూల్స్, కాలేజీలు ఓపెన్
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు. నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. నవంబర్ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. -
రెడ్ జోన్లలో ఆటో, ఏసీ షాపులకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీతో పాటు రెడ్జోన్ల పరిధిలో ఉన్న ఇతర అన్ని మున్సిపాలిటీల్లో ఆటోమొబైల్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, వాహనాల రిపేర్ గ్యారేజీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లకు సంబంధించిన అన్ని రకాల షోరూమ్స్, షాపులను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం రెడ్జోన్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో నిత్యావసర వస్తువుల దుకాణాలు, అత్యవసర సేవలతో పాటు నిర్మాణ రంగానికి సంబంధించిన హార్డ్‌వేర్ తదితర షాపులు, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన పంపుసెట్ల దుకాణాలకు మాత్రమే అనుమతి ఉండగా, ఇకపై పైన పేర్కొన్న దుకాణాలు, షోరూమ్స్‌ను అనుమతించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
అందుబాటులోకి మరిన్ని పోస్టాఫీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసులు తెరుచుకుంటున్నాయి. మంగళవారం 633 డెలివరీ పోస్టాఫీసులు తెరుచుకోగా, బుధవారం నుంచి 4,967 బ్రాంచి తపాలా కార్యాలయాలు సేవలు ప్రారంభించబోతున్నాయి. డిపాజిట్స్, విత్‌డ్రాయల్స్ లాంటి సేవింగ్స్ బ్యాంక్ ఆపరేషన్స్ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు స్పీడ్‌పోస్టు, పార్శిల్ సర్వీసులు కూడా ప్రారంభమవుతాయి. లాక్డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు లేనందున స్పీడ్ పోస్టులాంటి సేవల్లో జాప్యం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలని తపాలా శాఖ పేర్కొంది. ఇప్పటికే లాక్డౌన్ సమయంలో 4,400 బ్యాగ్స్ పరిమాణంలో పోస్టల్ డెలివరీలు నిర్వహించగా, పదోతరగతి, ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 5,525 పరీక్ష పత్రాల పార్శిళ్లను తరలించినట్టు పేర్కొంది. 22 లక్షల మంది ఆసరా లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపునకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. 33 జిల్లాలకు 20 మెయిల్ మోటారు వాహనాల ద్వారా అత్యవసర మందులు, వైద్య పరికరాలను పంపిణీ చేస్తున్నట్టు పేర్కొంది. వలస కార్మికులు వంటి వారికి అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేసేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచామని పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. కూరగాయలకు సంబంధించి మొబైల్ మార్కెట్లుగా వాటిని వాడేందుకు కూడా వ్యవసాయ శాఖతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. -
ఎంఐఎం టిక్ టాక్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’లో అధికారిక ఖాతా ఉన్న తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం రికార్డుకెక్కింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. దేశంలోని యువ ఇంటర్నెట్ వినియోగదారులను టిక్‌టాక్ ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. పార్టీ అధికారిక ‘టిక్‌టాక్’ఖాతాను సుమారు 7000 మంది అనుసరిస్తుండగా, 60 వేల మంది లైక్‌లు, 75 వీడియోలు వచ్చాయన్నారు. యువత తమ భావ స్వేచ్ఛను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా పనిచేస్తోందని పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న ‘శబరిమల’
శబరిమల: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో గత నెలలో పూజల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమ యింది. భారీగా పోలీసులను మోహరిం చడంతోపాటు ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించింది. మొత్తం 2,300 మంది పోలీసులను మోహరించింది. ఈ చర్యలపై పండాలం రాచ కుటుంబం, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆలయం వద్ద విధి నిర్వహణ నిమిత్తం యువ మహిళా జర్నలిస్టులను పంపవద్దని ‘శబరిమల కర్మ సమితి’ మీడియా సంస్థలను కోరింది. నేటి సాయంత్రం 5 గంటలకు.. ట్రావెన్కోర్ చిట్టచివరి రాజు తిరునాళ్ బలరామ వర్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే శ్రీ చిత్ర అట్ట తిరునాళ్ పూజల కోసం నేటి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. తాంత్రి కందారు రాజీవరు, ప్రధాన పూజారి ఉన్ని కృష్ణన్ నంబూద్రిలు ఆలయ ద్వారాలను తెరిచి, శ్రీకోవిల్‌లో దీపాలు వెలిగిస్తారు. మంగళవారం తిరునాళ్ పూజల అనంతరం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు. మండల పూజల కోసం తిరిగి ఈ నెల 17న ఆలయాన్ని తెరిచి మూడు నెలలపాటు దర్శనం కోసం అనుమతిస్తారు. విధి నిర్వహణలో భాగంగా ఆలయం వద్దకు రుతుక్రమం వయసున్న మహిళా జర్నలిస్టుల ను పంపొద్దని వీహెచ్‌పీ, హిందూ ఐక్యవేదిక తదితర సంస్థలతో కూడిన ‘శబరిమల కర్మ సమితి’ మీడియా నిర్వాహకులను కోరింది. 50 ఏళ్ల లోపు మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి ప్రవేశించిన పక్షంలో పరిస్థితి చేయిదా టిపోతుందని హెచ్చరించింది. ఈ మేరకు మీడియా సంస్థల ఎడిటర్లకు లేఖలు పంపింది. పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. -
పీఎస్‌యూల్లో ఓపెన్, దూరవిద్య డిగ్రీలకు ఓకే
న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీలో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీచేసే ఓపెన్, దూరవిద్య డిగ్రీలు, డిప్లొమాలను అంగీకరించాలని కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ)ను ఆదేశించింది. ఓపెన్, దూరవిద్య విధానంలో పొందిన డిగ్రీలు, డిప్లొమాలను పీఎస్‌యూలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి సుబ్రమణ్యం ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల విభాగం కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖపై సదరు విభాగం స్పందిస్తూ... పీఎస్‌యూల్లో బోర్డు కంటే తక్కువస్థాయి ఉద్యోగాల భర్తీని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంట్రప్రైజెస్(సీపీఎస్ఈ) చేపడతాయని పేర్కొంది. -
'వర్షిం'చిన ముడుపులు !
అనంతపురం న్యూసిటీ: నగరంలోని వర్ష ఆస్పత్రి తిరిగి తెరుచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత నెల 21న నగరంలోని వర్ష ఆస్పత్రిలో రక్తమార్పిడి, వివిధ కారణాలను చూపుతూ డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్ పంచనామా చేసి ఆస్పత్రిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వైద్యాధికారులే తిరిగి ఆస్పత్రి తెరిచేందుకు అనుమతులివ్వడం విమర్శలకు దారితీస్తోంది. దీని వెనుక భారీగా ముడుపుల బాగోతం నడిచాయన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. రాత్రికి రాత్రే కమిటీలు వర్ష ఆస్పత్రి సీజ్ జిల్లాలోనే ఇది పెద్ద సంచలనమైంది.డీఎంహెచ్ఓ తీసుకున్న నిర్ణయంతో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆస్పత్రి నిర్వహణలో చాలా లోపాలున్నాయి, ఎటువంటి సురక్షిత ప్రమాణాలు లేవని డీఎంహెచ్ఓ తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ సుప్రజాచౌదరి, ఇద్దరు వ్యక్తులు డీఎంహెచ్ఓ కార్యాలయంలోని డెమో ముందు కూర్చుని వివరణ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఈ నెల 13న డీఎంహెచ్ఓ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు ఐదు మంది సభ్యులతో వెళ్లారు. ఈ విషయాలను బయటకు పొక్కనీయకుండా డీఎంహెచ్ఓ, డెమో జాగ్రత్త పడ్డారు. వాస్తవంగా ఈ నెల 11న కమిటీ వేశామని వైద్య ఆరోగ్యశాఖాధికారి చెబుతున్నా.. కమిటీ లిస్టులో మాత్రం తేదీని ఈ నెల 7 అని పెన్‌తో రాశారు. దీన్ని బట్టి పక్కా ప్లాన్‌తోనే వర్ష ఆస్పత్రిని ఓపెన్ చేసేందుకునే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. నిర్వాహకులకే తాళాలు ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు వారి సమక్షంలోనే తిరిగి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఓపెన్ చేసుకునేందుకు నిర్వాహకుల చేతికే తాళాలివ్వడం పలు విమర్శలు తావిస్తోంది. ఇదే విషయాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్‌ను సాక్షి ఆరా తీస్తే డెమో వెళ్లారని సమాధానం ఇచ్చారు. డెమో ఉమాపతిని ఆరా తీస్తే ఆర్డర్ ఇచ్చాం వారే ఓపెన్ చేసుకోవాలని చెప్పామన్నారు. ప్రాక్టీస్‌కు అనుమతివ్వలేదు వర్ష ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేసుకునేందుకు ఇంకా అనుమతివ్వలేదు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశాం. వారి నుంచి రిపోర్టు వచ్చాకే ప్రాక్టీస్‌కు అనుమతిస్తాం. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్,డీఎంహెచ్ఓ -
ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరపాలి
- వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు పిఠాపురం: కొత్తపల్లి మండలం నాగులాపల్లి పంచాయతీలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతంగా ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పోరాటంచేస్తామని వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఆయన శుక్రవారం నాగులాపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన విచారణ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ పాలక వర్గాన్ని పట్టించుకోకుండా నిధులు పక్కదోవపట్టించారని ఆరోపించారు. రికార్డులు చూపించాలని అడిగితే తప్పుడు కేసులు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని, పోలీసు కేసులకు భయపడేది లేదన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే అధికారులు ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ బండారం బయటపడుతుందనే రికార్డులు మాయం చేశారని, పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకున్న రికార్డులు విచారణకు ఎందుకు తీసుకురాలేదో అధికారులు చెప్పాలన్నారు. అన్ని రికార్డులు బహిర్గతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత వడిశెట్టి నారాయణరెడ్డి, అబ్బిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. . -
మరో అవకాశం కల్పించిన కేంద్రం
న్యూఢిల్లీ: పాత పన్ను వివాదాల పరిష్కార పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కారం పథకాన్ని పొడిగిస్తున్నట్టు ఆదాయ పన్ను శాఖ శుక్రవారం ప్రకటించింది. గతంలో డిసెంబరు 31 వరకు విధించిన గడువును జనవరి 31,2017 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాత లావాదేవీలకు సంబంధించి, ప్రత్యక్ష పన్ను వివాదాలను జనవరి 31లోపు పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఈ ప్రత్యేక పథకం 2016 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. జూన్ 1 న పరిచయం చేయగా ఒక్క కంపెనీ కూడా పన్ను వివాద లావాదేవీని పరిష్కరించుకోలేక పోవడంతో ప్రభుత్వం ఈ పథకానికి గడువు పెంచింది. మరో అవకాశాన్ని కల్పిస్తూ డిసెంబర్ 31 వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. -
భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మడకశిర రూరల్ : మండల పరిధిలోని భక్తరపల్లి లక్ష్మినరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమద్వత్రం, హోమం, ధ్వజారోహణ, అంకురార్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పురోహితుల వేదమంత్రోచ్ఛారణలతో ధ్వజారోహణ నిర్వహించారు. అదేవిధంగా భక్తరపల్లి లక్ష్మినరసింహస్వామిని ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు. -
ఎక్సైజ్ క్రీడలు ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎక్సైజ్ శాఖ జిల్లా స్థాయి క్రీడలు శనివారం ఎస్కేయూ క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న వారికి షార్ట్‌పుట్, వాలీబాల్, 100, 200, 400, 800 రిలే, కబడ్డీ, త్రోబాల్, చెస్ క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్, హైజంప్, లాంగ్ జంప్ పోటీలను మహిళలకు, పురుషులకు నిర్వహించారు. వీటితోపాటు 5 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలు రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. = అనంతపురం ఎక్సైజ్, పెనుకొండ ఎక్సైజ్ డివిజన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పెనుకొండ జట్టు 10 ఓవర్లలో 77 పరుగులు సాధించింది. అనంతరం అనంతపురం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 49 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. క్రీడలు స్ఫూర్తి నింపుతాయి ఉద్యోగులలో స్ఫూర్తిని నింపేందుకు క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని డిప్యూటి కమిషనర్ అనసూయదేవి అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉన్న తమ శాఖ ఉద్యోగులకు ఈ క్రీడలు ఆరోగ్యదాయకమన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇలా క్రీడలు నిర్వహించడం మొదటిసారన్నారు. తమ ఉద్యోగులు రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరచి పతకాలు సా«ధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మల్లారెడ్డి, మునిస్వామి, రాష్ట్ర ఎక్సైజ్ ఉద్యోగుల అసోసియేష¯ŒS అధ్యక్షుడు నరసింహులు, రాముడు, బాలాజినాయక్ తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు విజేతలు 100 మీటర్లలో పురుషుల్లో నాగరాజు, చరణ్‌కుమార్.., మహిâýæల్లో ప్రభావతి, శాంతకుమారి వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. 200 మీటర్లలో మహిâýæలు శివకుమారి, శాంతకుమారి.., 400 మీటర్లలో మహిళలు ప్రభావతి, శివకుమారి మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. 400 మీటర్లలో పురుషులు చరణ్‌కుమార్, భరత్‌కుమార్.., 800 మీటర్ల పురుషులు మోహ¯ŒS, అనిల్‌కుమార్ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. = లాంగ్ జంప్‌లో పురుషులు మోహ¯ŒS, చరణ్‌కుమార్.., మహిâýæలు నాగవేణి, ప్రభావతి.., హై జంప్‌లో పురుషులు మోహ¯ŒS, భరత్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. = షార్ట్పుట్లో మహిâýæలు శివకుమారి, రాధమ్మ, పోలక్క, జ్యోతి, ప్రభావతి.., పురుషులు నాగరాజు, మోహన్, సుధాకర్‌రెడ్డి, శివానందరెడ్డి, క్రిష్ణయ్య వరుస స్థానాలు సాధించారు. = కబడ్డీలో నరసనాయుడు, మధుసూదన నాయుడు, అబ్దుల్ జిలాన్, భీమేష్, కిరణ్‌కుమార్, పురుషోత్తం, లక్ష్మీనారాయణ, మోహ¯ŒS, నాగరాజు.., వాలీబాల్‌లో మధుసూదన నాయుడు, రాముడు, నరసనాయుడు, గురునాథరెడ్డి, శ్రీనివాసులు, నరసింహరాజు, గౌస్‌ఖాన్, అబ్దుల్ జిలాన్, జాన్ పాల్ మోహన్, నాగరాజు విజయం సాధించారు. -
డీమానిటైజేషన్: ఉప్పు పరిశ్రమ
అహ్మదాబాద్: డీమానిటైజేషన్ ప్రభావంతో ఉప్పు ఉత్పత్తిదారులు కూడా తగిన చర్యలకు ఉపక్రమించారు. నగదు రహిత లావాదేవీలు కోసం ముందుకొచ్చిన ఉప్పు తయారీదారులు కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. జీతాలు చెల్లింపులో ఆలస్యం ఉత్పత్తిని ప్రభావితం చేయొచ్చనే ఆందోళన, రుతుపవనాలు అనంతరం ఉప్పు ఉత్పత్తికి సీజన్ ప్రారంభం కావడంతో తయారీదారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పు పరిశ్రమలో సుమారు 400,000 పనివారు ఉన్నారని ఉప్పు తయారీదారులు చెపుతున్నారు. దాదాపు 75-80 శాతం వలస కార్మికులు ఉన్నారనీ, నగదుకొరతతో వీరికి వేతనాలు చెల్లింపు ఇబ్బంది మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సకాలంలో వారికి జీతాలు చెల్లించలేకపోతే, దాని ప్రభావం ఉప్పు తయారీపై పడుతుందని, తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితి దారితీయవచ్చన్నారు. అందుకే కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామని ఉప్పు తయారీదారుల అసోసియేషన్ అధ్యక్షుడు భరత రావల్ తెలిపారు. ఇందుకు జిల్లా కలెక్టర్, బ్యాంకు అధికారులతో చర్చించడంతోపాటు,సంబంధిత పత్రాల సమర్పణ కోసం కార్మికులకు సహకరిస్తున్నామని చెప్పారు. డీమానిటైజేషన్ మంచి ఎత్తుగడ అనీ , మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ జలాన్ తెలిపారు. ఇది దీర్ఘకాలంలో తమతో సహా అన్ని వర్గాల కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతానికి సరిపడా ఉప్పు నిల్వలు న్నాయని పేర్కొన్నారు. వలస కార్మికుల డాక్యుమెంటేషన్ పెద్ద సమస్యగా పరిణమించిందని కాంట్రాక్టర్లు చెప్పారు. వారివారి సొంత గ్రామాలనుంచి సంబంధిత గుర్తింపు పత్రాలను సేకరిస్తున్నట్టు కచ్ ప్రాంతంలోని కాంట్రాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. తాము ఇప్పటికే నగదు రహిత లావాదేవీలను ప్రక్రియ మొదలుపెట్టామని దేవ్ ఉప్పు ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ జీఎస్ ఝాలా తెలిపారు. కార్మికులం సంక్షేమం, తద్వారా ఉప్పు సరఫరాలో ఎటువంటి సమస్య రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మరోవైపు డీమానిటైజేషన్ ప్రభావం మిగిలిన అన్ని పరిశ్రమలతో పాటు ఉప్పు పరిశ్రమపై కూడా పడింది. కాస్టిక్ సోడా తదితర సోడా ఉత్పత్తులపై ఇప్పటివరకు కొద్దిమేర ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలుచెబుతున్నాయి. కాగా దేశంలో సంవత్సరం ఉప్పు 27.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతుంది. ఇందులో1.4 మిలియన్ టన్నులు పారిశ్రామిక అవసరాల కోసం 6.6 మిలియన్ టన్నులు ఆహారంలో వినియోగం కో్సంకేటాయిస్తారు. ఆరు మిలియన్ టన్నుల ఎగుమతి చేస్తుంటారు. కాగా గుజరాత్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. గుజరాత్ లో 22.7 మిలియన్ టన్నులు, రాజస్థాన్‌లో 2.4 మిలియన్లు, తమిళనాడు లో దాదాపు రెండు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి జరుగుతుంది. -
బ్యాంకు ఖాతాల స్పెషల్ డ్రైవ్ నేటి నుంచే..
-
బ్యాంకు ఖాతాల స్పెషల్ డ్రైవ్ నేటి నుంచే..
న్యూఢిల్లీ: సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం కార్మిక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికమంత్రిత్వ శాఖతో కలిసి కార్మికులకు బ్యాంకు ఖాతాల కోసం స్పెషల్ డ్రైవ్ ఈ (శనివారం) నుంచే మొదలు కానుంది. నవంబర్ 26, 2016 నుంచి ప్రత్యేక శిబిరాలద్వారా బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి జిల్లాలో నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ డ్రైవ్ ను నిర్వహించనుంచనుంది. డిజిటల్ లావాదేవీలను మరింత తీవ్రం చేసే యోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఫైనాన్షియల్ శాఖ సేవల సహకారంతో ఈ ప్రచారం ప్రారంభించనున్నట్టు దత్తాత్రేయ వెల్లడించారు. ఇకపై యజమానులు నేరుగా కాకుండా బ్యాంకుల ద్వారానే కార్మిక వేతనాలు చెల్లించేలా ఖాతాలు లేని కార్మికులందరికీ తక్షణమే సమీప బ్యాంకుల్లో కొత్త ఖాతాలు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో చాలా చురుకుగా ఉన్నామని, ఈ విషయంలో సహరాన్ని అభ్యర్థిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం జనధన్ యోజన ద్వారా 2014 తరువాత 25 కోట్లపై పైగా బ్యాంకు ఖాతాలను తెరిచినట్టు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకంతో కోట్లాదిమంది పేదవారికి లబ్ధి చేకూరినట్టు చెప్పారు. ఆర్ధికపరమైన ప్రతి లావాదేవీ డిజిటలైజేషన్ తోపాటుపారదర్శకంగా జరగాలన్నదే తమ అభిమతమని కేంద్ర మంత్రి వివరించారు. -
విజయవాడలో మొదటి ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం
-
షేర్ ఇట్ యూజర్లకు గుడ్ న్యూస్
బెంగళూరు: స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికీ ఫెవరేట్ మెసేజింగ్ యాప్ 'షేర్ ఇట్' ఢిల్లీలో పాగా వేయనుంది. చైనా ఆధారిత ఈ కంటెంట్ షేరింగ్ ప్లాట్ ఫాంభారతదేశంలో మొట్టమొదటి కార్యాలయం తెరవడానికి సన్నాహాలు చేస్తోంది. గ్లోబల్ విస్తరణ ప్రణాళికలో భాగంగా గుర్గావ్లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు షేర్ ఇట్ వెల్లడించింది. భారత్ నుంచి తమకు యూజర్ల డిమాండ్ భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బెంగళూరులో షేర్ ఇట్ నిర్వహించిన తొలి క్యాంపస్ మీట్ లో తెలిపింది. ఈ కేంద్రం ద్వారా త్వరలో తమ కార్యాకలాపాలను నిర్వహిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఉపఖండం నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా ప్రపంచ విస్తరణలో భాగంగా భారత మార్కెట్ ముఖ్యమైనదిగా భావించామని షేర్ ఇట్ మార్కెటింగ్ డైరెక్టర్ జియో లీ డ్యూ ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా తమ యూజర్లకు మరిన్న మెరుగైన సేవలను అందించనున్నట్టు చెప్పారు. కాగా ఫోటోలు, మూవీ వీడియోలు, మ్యూజిక్, కాంటాక్ట్స్ సహా ఇతర ఫైల్స్ , కొన్ని యాప్స్ ను ట్రాన్స్ఫర్ చేసుకోడానికి ఉపయోగించే ముఖ్యమైన ఫైల్ ట్రాన్స్ఫర్ యాప్ షేర్ ఇట్. రోజుకు సుమారు 150 మిలియన్లకు పైగా ఫైళ్లు దీని ద్వారా షేర్ అవుతాయి. -
రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: ఆయిల్ ధరలు, ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. అటు ఎఫ్ఐఐల అమ్మకాలు, ఇటు డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టంతో 27,736 వద్ద, నిఫ్టీ కూడా41 పాయింట్లు క్షీణించి 8,573 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ బలహీనత,టాటా గ్రూప్ షేర్లలో అమ్మకాలు ఈ రోజుకూడా కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఐటీ, ఆటో, మెటల్స్ రంగాలు బలహీనంగా ఉన్నాయి. టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టాటా హోటల్స్ , టాటా కమ్యూనికేషన్స్, షేర్లలో భారీఅమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, లుపిన్ నష్టపోతుండగా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, మారుతీ, టెక్ మహీంద్రా స్వల్పంగా లాభపడుతున్నాయి. అటు దేశీయమారకపు రేటుతో రూపాయి 0.04పైసల నష్టంతో రూ.66.87వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి పది గ్రా. రూ. 32నష్టంతో రూ. 29,866 వద్ద ఉంది. -
25 నాటికి కొత్త కార్యాలయాల బోర్డులు
జిల్లా పునర్విభజన సమీక్ష సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్తగూడెం జిల్లాలోని నూతన కార్యాలయాల ఫోటోలను కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. కార్యాలయాల బోర్డులను కూడా ఈ నెల 25వ తేదీ సిద్ధం చేసుకోవాలన్నారు.జిల్లా పునర్విభజనపై ఆయన బుధవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన కార్యాలయాల ఏర్పాటు, వాటి వైశాల్యం, సిబ్బంది వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఏవేని మరమ్మతులు అవసరమనుకుంటే సంబంధిత శాఖ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలన్నారు. ఏదైనా శాఖకు కార్యాలయ భవనం కేటాయించనట్టయితే ఆ ప్రక్రియను సంబంధిత అధికారులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయాల్లోని ప్రభుత్వ వాహనాలను మాత్రమే అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటికే ప్రైవేట్ వాహనాల వివరాలను నివేదికల్లో పేర్కొన్నట్టయితే వెంటనే తొలగించాలన్నారు. కొత్త మండలాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించినందున సంబంధిత మండలాలకు సిబ్బందిని సర్దుబాటు చేయాల్సుంటుందన్నారు. ఆవివరాలను అప్లోడ్ చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా ప్రధానాధికారి కార్యాలయంలోగల ఫర్నిచర్‌ను, ఫైళ్ళను కూడా విభజించాల్సుందని అన్నారు. కంప్యూటర్లో అప్లోడ్ విధానంపై వివిధ శాఖల అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా పునర్విభజన నివేదికల ప్రక్రియను ఈ నెల15వ తేదీలోగా పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్, జిల్లాపరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు -
25 నాటికి కొత్త కార్యాలయాల బోర్డులు
జిల్లా పునర్విభజన సమీక్ష సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్తగూడెం జిల్లాలోని నూతన కార్యాలయాల ఫోటోలను కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. కార్యాలయాల బోర్డులను కూడా ఈ నెల 25వ తేదీ సిద్ధం చేసుకోవాలన్నారు.జిల్లా పునర్విభజనపై ఆయన బుధవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన కార్యాలయాల ఏర్పాటు, వాటి వైశాల్యం, సిబ్బంది వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఏవేని మరమ్మతులు అవసరమనుకుంటే సంబంధిత శాఖ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలన్నారు. ఏదైనా శాఖకు కార్యాలయ భవనం కేటాయించనట్టయితే ఆ ప్రక్రియను సంబంధిత అధికారులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయాల్లోని ప్రభుత్వ వాహనాలను మాత్రమే అప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటికే ప్రైవేట్ వాహనాల వివరాలను నివేదికల్లో పేర్కొన్నట్టయితే వెంటనే తొలగించాలన్నారు. కొత్త మండలాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించినందున సంబంధిత మండలాలకు సిబ్బందిని సర్దుబాటు చేయాల్సుంటుందన్నారు. ఆవివరాలను అప్లోడ్ చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా ప్రధానాధికారి కార్యాలయంలోగల ఫర్నిచర్‌ను, ఫైళ్ళను కూడా విభజించాల్సుందని అన్నారు. కంప్యూటర్లో అప్లోడ్ విధానంపై వివిధ శాఖల అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా పునర్విభజన నివేదికల ప్రక్రియను ఈ నెల15వ తేదీలోగా పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్, జిల్లాపరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు -
4న బాలోత్సవ్–2016 బ్రోచర్ ఆవిష్కరణ
కొత్తగూడెం అర్బన్: ఈ నెల 4వ తేదిన బాలోత్సవ్–2016 బ్రోచర్ ఆవిష్కరించనున్నట్లు బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 సంవత్సరాల పండుగ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, పద్మశ్రీ కొలకలూరి ఎనాక్ హాజరవుతారని చెప్పారురు. 10, 11వ తేదీల్లో 200 మంది విద్యార్థులతో కథలు, కవితలపై వర్క్‌షాపు ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రల కవులు హాజరవుతారన్నారు. ఈ సంవత్సరం బాలోత్సవ్ నాలుగు రోజుల పాటు జరుగనుందని తెలిపారు. మల్సూర్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లోనే దుర్గమ్మ ప్రసాదం
రైల్వే స్టేషన్: కృష్ణా పుష్కరాల సందర్భంగా రైల్వే స్టేషన్లో దుర్గమ్మ వారి ప్రసాదాల విక్రయాలకు దుర్గామలేశ్వర స్వామి దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో దేవస్థానం వరకు వెళ్లలేని పలువురు యాత్రికులు అమ్మ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రసాద విక్రయాలు పుష్కరాల జరిగే 12 రోజులూ 24 గంటలు జరుపుతామని దేవస్థాన సిబ్బంది తెలిపారు. దుర్గమ్మ ప్రసాదం అయిన లడ్డు, పులిహోరలు విక్రయాలు 24 గంటలు జరుపుతామని తెలిపారు. అమ్మ ప్రసాదం రైల్వే స్టేషన్ లోనే లభ్య మవుతుండటంతో పలువురు యాత్రికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మక్కా ఎడారిలో అద్బుత భవంతి
-
టీటీడీ నమూనా ఆలయం ప్రారంభం
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు విచ్చేసే భక్తుల కోసం విజయవాడ స్వరాజ్ మైదానంలో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం ఈ ఆలయాన్ని ప్రారంభించి పవిత్ర కృష్ణా జలాలతో సంప్రోక్షణ జరిపి అనంతరం శాస్త్రాక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. పుష్కరాలు ముగిసేవరకు స్వరాజ్ మైదానంలో నమూనా ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. రోజు లక్షమంది దర్శనం చేసుకుంనేందుకు వీలుగా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నమూనా ఆలయంలో స్వామివారిని తొలుత కంచి పీఠాధిపతి జయేంద్రసరస్వతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోకి జర్నలీస్టులను అనుమతించకపోవడంతో జర్నలీస్టులు ధర్నాకు దిగారు. -
నాన్ ఆపరేటివ్ ఖాతా నంబర్లు వెంటనే ఇవ్వాలి
ఏటూరునాగారం : జిల్లాలోని 54 మండలాల్లోని ఈఎస్ఎస్ లబ్ధిదారుల నాన్ ఆపరేటివ్, లోన్ అకౌంట్ నంబర్లను ఐటీడీఏకు వెంటనే ఇవ్వాలని పీఓ అమయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 2015– 16 ఆర్థిక సంవత్సరంలో 1,789 యూనిట్లను గిరిజన సంక్షేమశాఖ మంజూరు చేసిందన్నారు. ఇందుకుగాను రూ. 13.39 కోట్ల నిధులను ఆయా యూనిట్లకు కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు 122 యూనిట్లకు రూ. 1.47 కోట్ల రుణాలను లబ్ధిదారులకు అందాయన్నా రు. మిగతా లబ్ధిదారులకు అకౌంట్ నంబర్లను ఎంపీడీఓల ద్వారా ఐటీడీఏకు రాకపోవడంతో యూనిట్లు గ్రౌండ్ కావడం లేదని తెలిపారు. ఎంపీడీఓలు ఎంపికయినా లబ్ధిదారుల ఖాతా నంబర్లను త్వరగా ఇవ్వాలని సూచించారు. గ్రౌండ్ మేళాకు సిద్ధం కావాలి జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో లబ్ధిదారులకు యూనిట్లను నేరుగా ఇచ్చేందుకు గ్రౌండ్ మేళా కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధం గా ఉండాలన్నారు. ఈఎస్‌ఎస్‌లో మంజూరైన లబ్ధిదారుల జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో అతికించాలన్నారు. ఆ తర్వాత మేళా లో లబ్ధిదారుడికి నేరుగా యూనిట్‌ను ఇవ్వాలని అన్నారు.. కమిటీ ఏర్పాటు ఎంపీడీఓ, బ్యాంక్ మేనేజర్, వెంటర్నరీ అసిస్టెంట్, సర్జన్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ, ఏఈ, మండల సమాఖ్య అధ్యక్షురాలు, స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో లబ్ధిదారులకు ఈఎస్ఎస్ యూనిట్లను నేరుగా అందజేయాలన్నారు. ఇలా చేయడం వల్ల లబ్ధిదారుడిని సరైన న్యాయం జరుగుతుందని వివరించారు. ఆయా ఎంపీడీఓలకు ఇప్పటికే సర్క్యూలర్‌ను జారీ చేశామన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. -
బ్లడ్‌బ్యాంక్‌లో ఎస్డీపీ ప్రారంభం
నెల్లూరు(అర్బన్): నెల్లూరు బ్లడ్‌బ్యాంక్‌లో శనివారం అత్యంత ఆధునికమైన సింగిల్ డోనార్ ప్లేట్ మిషన్‌ను(ఎస్డీపీ) ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో బ్లడ్‌బ్యాంక్ చైర్మన్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ తాము బేథస్థా హోమ్స్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ బ్యాంక్‌ను ప్రారంభించామన్నారు. ఇది ప్రైవేటు బ్లడ్ బ్యాంకు కాదన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు, ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరల్లోనే రోగులకు రక్తం అందిస్తున్నామన్నారు. సాధారణంగా రోగులకు ప్లేట్లెట్స్ ఎక్కిస్తే 2వేల నుంచి 4వేల వరకు రక్తకణాలు పెరుగుతాయని తెలిపారు. తాము ప్రవేశ పెట్టిన ఎస్డీపీ యంత్రంతో ఒకే సారి 50వేలకు పైగా రోగికి రక్తకణాలు పెరుగుతాయన్నారు. రోగికి శ్రమ, ఒత్తిడి తగ్గిపోతుందన్నారు. పేదలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా తక్కువకు కూడా రక్తాన్ని అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రక్తం కొరత తీర్చేందుకు మాత్రమే బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేశామన్నారు. బ్లడ్ బ్యాంక్ జిల్లా కో–ఆర్డినేటర్ మోపూరు భాస్కర్‌నాయుడు, డాక్టర్లు పెంచలప్రసాద్, సాయినాథ్, భార్గవహెల్త్ ప్లస్ సీఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, స్వచ్ఛందసంస్థల అధ్యక్షుడు ఈవీఎస్ నాయుడు, మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ జలదంకి సుధాకర్ పాల్గొన్నారు. -
స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: బ్రెగ్జిట్ ప్రకంపనల అనంతరం సోమవారం నాటి దేశీయ మార్కెట్లు స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. 30 స్క్రిప్టుల సెన్సిటివ్ ఇండెక్స్ ( సెన్సెక్స్ ), 53 పాయింట్ల నష్టంతో 26,347 దగ్గర ప్రారంభం కాగా, నిఫ్టీ 17 పాయింట్లనష్టంతో 8.071 పాయింట్ల దగ్గర ప్రారంమైంది,గ్లోబల్ మార్కెట్ల అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో భారత ఈక్విటీ సూచీలు స్వల్పం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మదుపర్లు వేచి చూసే ధోరణిని కొనసాగించే అవకాశం ఉందిన విశ్లేషకుల అంచనా. అటొ రంగం నష్టాల్లో ఉండగా, ఆయిల్ రంగంపాజిటివ్ ట్రెండ్ లో ఉంది. ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్ , ఇన్ ఫ్రా సెక్టార్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. వాతావరణ సూచనలతో కొనుగోళ్ల మద్దతులభించే అవకావం ఉందని భావిస్తున్నారు. మరోవైపు దేశీయ కరెన్సీ, పుత్తడి పాజిటివ్ గా ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి 12 పైసలు లాభపడి 67.84 దగ్గర ఉంది. మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం రూపాయి కోలుకుందని ఎనలిస్టులు అంటున్నారు. అటు ఈరోజుకూడా పసిడి మెరుపులు కొనసాగుతున్నాయి. 200 రూ. లాభంతో పది గ్రా. 31,605 దగ్గర ఉంది. దీంతో జ్యువెల్లరీ షేర్ల లాభాలుకొనసాగుతున్నాయి. -
ఎలక్ట్రిక్ రోడ్డు వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ రోడ్డును స్వీడన్ పరీక్షిస్తోంది. గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించిన స్వీడన్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం, ఎలక్ట్రిక్ సదుపాయాలు తదితరాలను పూర్తిచేసింది. మధ్య స్వీడన్ లోని జ్వీల్ నగరానికి సమీపంలో నిర్మిస్తున్న ఈ రోడ్డును ప్రస్తుతం రీయల్ ట్రాఫిక్ లో ట్రక్కులను నడపడం ద్వారా పరీక్షిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ వాహనతయారీ సంస్థ స్కానియా తయారుచేసిన ఎలక్ట్రిక్ ట్రక్కులను ఇందుకు వినియోగిస్తున్నారు. సిమన్స్ కంపెనీ రెండు కిలోమీటర్లపాటు ప్రత్యేకంగా తయారుచేసిన ఈ-16 మోటార్ వే మీద వీటిని పరీక్షిస్తున్నారు. బయో డీజిల్ తో నడిచే స్కానియా ట్రక్కులకు బస్సు పైభాగంలోని పాంటోగ్రాఫ్ పవర్ కలెక్టర్ ద్వారా విద్యుచ్చక్తిని అందిస్తున్నారు. కదులుతున్నప్పుడు ఎలక్ట్రిక్ వైర్ల నుంచి విద్యుత్తును అవసరమైనప్పుడు వినియోగిచేందుకు లేనప్పుడు ఆపివేసేందుకు వీలును కల్పించారు. దీంతో విద్యుచ్చక్తిని వినియోగించుకోనపుడు సాధారణ ఇంజన్ మీద ట్రక్కు నడిచే అవకాశం కలుగుతుంది. డ్రైవర్ ముందు వెళుతున్న వాహనాన్ని దాటాలని భావించినా.. ఇది ఉపయోగపడుతుంది. దేశాన్ని శిలాజ ఇంధన వనరుల మీద ఆధారపడకుండా 2030లోగా సొంతంగా ఎనర్జీ తయారుచేసుకుని వినియోగించాలని స్వీడన్ నిర్ణయించుకున్న తర్వాత ప్రవేశపెట్టిన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. -
మసీదులోకి మహిళల ఎంట్రీకీ ఓకే!
తిరువనంతపురం: కేరళలోని ఓ ప్రసిద్ధ మసీదు ఓ చారిత్రక పరిణామానికి నాందిగా నిలిచింది. మసీదులోకి ప్రవేశానికి ముస్లిం మహిళలకు మొదటిసారి అనుమతి లభించింది. ప్రసిద్ధ తజతంగడి జుమ్మా మసీదు లో మొట్టమొదటిసారిగా కమిటీ తీసుకున్న నిర్ణయంతో ముస్లిం మహిళలు కూడా ప్రార్థనలు చేసుకునే అవకాశం కలిగింది. ఈ మేరకు ముస్లిం పెద్దలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. "తాజ్ జుమ మసీద్ " గా ప్రసిద్ధి చెందిన ఈ మసీదులోకి మహిళల ప్రవేశానికి ద్వారాలు తెరుస్తూ మసీదు కమిటీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల సాంప్రదాయానికి చరమ గీతం పాడుతూ మసీదు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. స్థానిక ముస్లిం కార్యకర్తలు నిరంతర ప్రచారం , ఉద్యమం తర్వాత ఈ ఘన విజయాన్ని సాధించారు కాగా మీనచిల్ నది ఒడ్డున కొట్టాయం కు సమీపంలో ఉన్న ఈ మసీదు భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి.1000 సంవత్సరాల కంటే ప్రాచీనమైన ఇది నిర్మాణ శోభకు,కొయ్య చెక్కడాలలో అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి ప్రయాణాల సందర్భంగా నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. -
కల్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే తెల్లం బాలరాజు, వైఆర్ సీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే విధంగా అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం లో వైఆర్ సీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు , జిల్లా నేతలు పాల్గొన్నారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీయై ప్రకటనతో జోరుమీదున్న మార్కెట్లు గురువారం కూడా తమ జోరును కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 228 పాయింట్ల లాభంతో 26,383 దగ్గర, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 7,997 దగ్గర ట్రేడవుతున్నాయి. ఒకవైపు గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, మరోవైపు ఐటి షేర్లలోలాభాలు మార్కెట్ లీడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఎనిమిది వేల మార్కు ను టచ్ చేయడం సెంటిమెంట్‌ను బలపరుస్తోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయ లాభాల్లో కొనసాగుతోంది. 9 పైసలు లాభపడి 65.49 దగ్గర ట్రేడవుతోంది. -
చారిత్రక మొగల్ రోడ్డు ప్రారంభం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని చారిత్రక మొఘల్ రోడ్డు ఆదివారం ప్రారంభంకానుంది. దీనిపై వన్ వే ట్రాఫిక్‌ను మాత్రమే అనుమతించనున్నారు. గత కొద్ది ఐదు నెలలుగా ఈ రోడ్డు మూసివేసి ఉంచారు. ఈ రోడ్డు కాశ్మీర్ లోయకు జమ్మూకు మధ్య అనుసంధానంగా ఉంటుంది. దీనిని ఆదివారంతోపాటు, సోమవారం, మంగళవారం కూడా తెరిచే ఉంచనున్నారు. ఈ రోడ్డును మొగలాయి చక్రవర్తులు నిర్మించారు. దీనిగుండానే అక్బర్ చక్రవర్తి 1586లో శ్రీనగర్‌పై దండెత్తి దానిని ఆక్రమించుకున్నాడని చెప్తారు. -
ప్రకాశంలో ’ఆదాశర్మ’ సందడి
-
సులువుగా బంగారం కొనొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో సులువుగా వెండి, బంగారం కొనే విధంగా రిద్ధిసిద్ధి బులియన్స్ లిమిటెడ్ పలు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం బులియన్ ఇండియా పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసి, నెలనెలా కొంత మొత్తం కొనే విధంగా సిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పాటు త్వరలో మరో మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఫిన్‌కర్వ్ బులియన్ ఇండియా డెరైక్టర్ సచిన్ కొఠారి తెలిపారు. ప్రతీ నెలా కనీసం రూ.1,000 మొత్తంతో బంగారం లేదా వెండిని కొనే విధంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని అందిస్తున్నామని, బ్యాంకులు, ఇతర ఆన్లైన్ బంగారంతో పోలిస్తే 5-8 శాతం తక్కువ ధరకే బంగారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం వివరాలు తెలియచేయడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొఠారి మాట్లాడుతూ ఎటువంటి అదనపు రుసుములు లేకుండా, పూర్తి రక్షణతో ఉచితంగా భద్రపర్చుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని ఐడీబీఐ బ్యాంక్ ట్రస్టీకి చెందిన వాల్ట్‌లో భద్రపరుస్తామని, ఇన్వెస్టర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారాన్ని కొని అమ్ముకోవచ్చన్నారు. ఒక గ్రాముకంటే ఎక్కువగా వున్నపుడు, వినియోగదారులు కోరుకుంటే ఫిజికల్ గోల్డ్‌ను ఇంటికి డెలివరీ చేస్తారు. దీంతో పాటు ప్రతీ నెలా స్థిరమైన పరిమాణంతో బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా గోల్డ్ ఎక్యూమలేట్ పథకాన్ని, అలాగే ప్రస్తుత ధరలో బంగారాన్ని కొని దాన్ని వాయిదా పద్థతుల్లో చెల్లించే విధంగా గోల్డ్ ఇన్స్టాల్మెంట్, అలాగే కొన్న బంగారాన్ని జ్యూవెలరీ సంస్థలకు బదలాయించి ఆభరణాలను కొనుగోలు చేసుకునే విధంగా గోల్డ్ యూనిట్ ట్రాన్సఫర్ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. స్నాప్‌డీల్ ద్వారా సత్యుగ్ గోల్డ్ ఆభరణాలు ప్రముఖ సినిమా నటి, శిల్పాశెట్టికు చెందిన సత్యుగ్ గోల్డ్ సంస్థ ఆభరణాలను స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు సత్యుగ్ గోల్డ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని స్నాప్‌డీల్ తెలిపింది. -
ఐసీఐసీఐ విదేశీ విస్తరణ
వడోదర: విదేశాల్లో విస్తరణ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మారిషస్ల్లో బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయనున్నామని బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ చెప్పారు. అంతేకాకుండా చైనాలో ఉన్న రిప్రజంటేటివ్ ఆఫీస్‌ను పూర్తి స్థాయి బ్యాంక్ శాఖగా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. వీటన్నింటికి తగిన ఆమోదాలు ఆర్బీఐ నుంచి పొందామని వివరించారు. బ్యాంక్ 20వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే విదేశీ నెట్‌వర్క్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ అతి పెద్ద బ్యాంక్ అని పేర్కొన్నారు. మూడు అనుబంధ బ్యాంకులతో, ఎనిమిది రిప్రజంటేటివ్ ఆఫీస్లతో విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 653 బ్యాంక్ శాఖలను, 834 ఏటీఎంలను ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 3,753కు, ఏటీఎంలు 11,315కు పెరిగాయని చందా కొచ్చర్ తెలిపారు. వృద్ధి సాధనపై దృష్టి సారించే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ యంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, మంచి పనితీరు సాధించామని తెలిపారు. ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలను నమోదుచేయగలమన్న విశ్వాసాన్ని కొచర్ వ్యక్తం చేశారు. -
ఏఐ ప్రైవేటీకరణకు తొందరపడం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (ఏఐ) ప్రైవేటీకరణపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఏఐ ప్రైవేటీకరణపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికీ రాలేదనీ, దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తామనీ చెప్పారు. ‘వివిధ దేశాల్లోని అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు సమర్థంగా పనిచేస్తున్నాయి. కారణం ఏదైనా మనదగ్గర అలా జరగలేదు. కానీ, ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించాల్సి ఉంది. ఎయిర్ ఇండియా ప్రభుత్వ అధీనంలో ఉంది. ఆ సంస్థకు కొన్ని సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలున్నాయి. ఎయిర్ ఇండియాను ఎలా అభివృద్ధి చేయగలమో ఆలోచించాలి..’ అని ఆయన తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ పునఃసమీక్షిస్తారా అని ప్రశ్నించగా, పోస్ట్‌మార్టమ్ వల్ల లాభం ఉండదని బదులిచ్చారు. మునుపటి ప్రభుత్వం అనేక రంగాలకు పలు హామీలిచ్చింది... వాటన్నిటినీ అమలు చేయాలంటే ప్రభుత్వంలో మార్పు ఉండకూడదని వ్యాఖ్యానించారు. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు చేపడతామని తెలిపారు. -
మారుతీ నిర్ణయాన్ని వ్యతిరేకించమంటాం
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రాజెక్ట్‌ను మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించమంటూ మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు అడ్వయిజరీ సంస్థలు తెలిపాయి. గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ తయారీ ప్రాజె క్ట్ను మొత్తంగా జపనీస్ మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సుజుకీ పూర్తి అనుబంధ కంపెనీ ద్వారా గుజరాత్ ప్లాంట్‌పై 100% పెట్టుబడులను వెచ్చించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా తదుపరి దశలో మారుతీ కేవలం పంపిణీ సంస్థగా మిగిలే అవకాశముండటంతో కంపెనీలో వాటాలున్న 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో మారుతీ ప్రతిపాదనపై వ్యతిరేకంగా ఓటు చేయాల్సిందిగా మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యవ స్థాపకుడు శ్రీరాం సుబ్రమణ్యన్ చెప్పారు. ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడంకాకుండా మారుతీలో పెట్టుబడుల ద్వారా సుజుకీ తన వాటాను పెంచుకోవాలని సూచించారు. ఈ అంశంపై మరో అడ్వైయిజరీ సంస్థ ఐఐఏఎస్ స్పందిస్తూ గుజరాత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను మారుతీ కలిగి ఉన్నదని, వెరసి ప్రాజెక్ట్‌ను సుజుకీకి అప్పగించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించింది. మారుతీ ఆర్‌వోసీఈ 15%గా ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఈల్డ్ మాత్రం 7-8% ఉన్నదని, కనుక మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్‌పై పెట్టుబడులను వెచ్చించడమే మేలని వివరించింది. అయితే ఎస్ఈఎస్ సంస్థ మాత్రం మారుతీ కొత్త ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించమంటూ వాటాదారులకు సూచించనున్నట్లు తెలిపింది. ఎఫ్ఐఐల దారెటు?: ప్రయివేట్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు, సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మారుతీ సుజుకీ నిర్ణయాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. మారుతీలో దాదాపు 7% వాటా కలిగిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సైతం గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీపై ఇప్పటికే మారుతీ వివరణ కోరింది కూడా. అయితే ఈ విషయంలో కీలక పాత్ర పోషించగల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆలోచన ఏమిటన్నది ఇంతవరకూ వెల్లడికాకపోవడం గమనార్హం. మారుతీలో ఎఫ్ఐఐలకు 21.5% వాటా ఉంది. కాగా, కంపెనీలో వాటాలు కలిగిన మొత్తం 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ అంశంపై సెబీకి ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో గుజరాత్ ప్రాజెక్ట్ నిర్ణయంపై మైనారిటీ వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు మారుతీ ప్రకటించింది. దీంతో 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కంపెనీ తాజా నిర్ణయాన్ని స్వాగతించాయి. అంతేకాకుండా సవరణలతో కంపెనీ తీసుకురానున్న తాజా ప్రతిపాదనను చూశాక తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాయి. వాటాదారుల వివరాలివీ... మారుతీలో సుజుకీ కార్పొరేషన్‌కు 56% వాటా ఉంది. మిగిలిన 44% వాటాలో ఎల్ఐసీకి 7%, దేశీయ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు మరో 7% చొప్పున వాటా ఉంది. హెచ్ఎస్బీసీ, క్రెడిట్ సూసీ, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ తదితర ఎఫ్ఐఐ సంస్థలు 21.5% వాటా కలిగి ఉన్నాయి. ఇక కార్పొరేట్ బాడీస్, రిటైల్ ఇన్వెస్టర్లకు 8%పైగా వాటా ఉంది. -
మహిళలకు టాటా ప్రత్యేక హోమ్‌లోన్
ముంబై: టాటా క్యాపిటల్ సంస్థ మహిళల కోసం తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థల మాదిరి టాటా క్యాపిటల్ కూడా ఈ తరహా రుణాలను అందిస్తోంది. మహిళలకు రూ.40 లక్షల లోపు రుణాలను 10.15 శాతానికే అందిస్తామని కంపెనీ పేర్కొంది. గతంలో ఈ వడ్డీరేటు 10.50 శాతంగా ఉండేదని పేర్కొంది. ఈ పథకం అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన వచ్చే నెల 8 వరకూ అందుబాటులో ఉంటుందని వివరించింది. మహిళలు తాము కలలు గన్న ఇంటిని సొంతం చేసుకోవడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారితకు తోడ్పడం తమ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలు 10.10% వడ్డీకే అందిస్తోంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మహిళల కోసం ప్రత్యేక గృహరుణ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.