రైల్వేస్టేషన్‌లోనే దుర్గమ్మ ప్రసాదం
రైల్వే స్టేషన్:
కృష్ణా పుష్కరాల సందర్భంగా రైల్వే స్టేషన్లో దుర్గమ్మ వారి ప్రసాదాల విక్రయాలకు దుర్గామలేశ్వర స్వామి దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో దేవస్థానం వరకు వెళ్లలేని పలువురు యాత్రికులు అమ్మ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రసాద విక్రయాలు పుష్కరాల జరిగే 12 రోజులూ 24 గంటలు జరుపుతామని దేవస్థాన సిబ్బంది తెలిపారు. దుర్గమ్మ ప్రసాదం అయిన లడ్డు, పులిహోరలు విక్రయాలు 24 గంటలు జరుపుతామని తెలిపారు. అమ్మ ప్రసాదం రైల్వే స్టేషన్ లోనే లభ్య మవుతుండటంతో పలువురు యాత్రికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.