
సాక్షి, అమరావతి: 2024–25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున జీఎస్టీ, వ్యాట్‌ను వచ్చే 2 రోజుల్లో చెల్లించాల్సిందిగా వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు శనివారం కోరారు. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలను మార్చి 30, 31 తేదీల్లో పన్ను చెల్లింపుల కోసం తెరిచే ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో అయితే www.apct.gov.in వెబ్‌సైట్‌లో ఈ–పేమెంట్ గేట్ వే ద్వారా పన్ను చెల్లింపులు సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. పన్ను చెల్లింపుదారులకు అవసరమైన సహాయం కోసం అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.