పదేళ్లలో కోటికిపైగా ఆదాయం గల వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదల ఇలా..
దేశంలో పదేళ్ల క్రితం కేవలం 40వేల
మందే 2024లో ఆ సంఖ్య 2.2 లక్షలకు పెరుగుదల
సాక్షి, అమరావతి: గడచిన దశాబ్దకాలంలో దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2024 వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. 2014లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించిన వారి సంఖ్య కేవలం 40వేలు ఉండగా, 2024లో ఐదు రెట్లు.. అంటే 2.2 లక్షలకు పెరిగిందని నివేదిక వెల్లడించింది.
అలాగే దేశంలో 2014లో మధ్యతరగతి ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.5.0 లక్షల వరకు ఉండగా 2024లో మధ్యతరగతి ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.10.0 లక్షల వరకు పెరిగిందని పేర్కొంది. దేశంలో గత పదేళ్లలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 4.8 కోట్లు పెరిగిందని నివేదిక వివరించింది. 2014లో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 3.79 కోట్ల మంది ఉండగా 2014లో 8.62 కోట్ల పెరిగిందని ఎస్‌బీఐ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment