90% మంది చేరతారని అంచనా
సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్)లో ఆటోమాటిక్ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్‌ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment