కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ తన ప్రధాన పోర్టల్‌ను పునరుద్ధరించింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ పేస్, మెనూలు మార్పులు చేస్తూ తీర్చిదిద్దింది. తాజాగా, ఈ పోర్టల్‌ను సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా ప్రారంభించారు.
ఇక, తాము కొత్తగా ప్రారంభించిన ఈ వెబ్‌సైట్ పన్ను చెల్లింపు దారులకు సౌకర్యవంతంగా ఉంటుందని నితిన్ గుప్తా తెలిపారు. పోర్టల్‌లో (https://incometaxindia.gov.in/) ట్యాక్స్‌కు సంబంధించిన చట్టాలు, నిబంధనల్ని సులభంగా తెలుసుకునేలా నావిగేషన్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు అలెర్ట్‌లు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన అలెర్ట్‌లు ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని పన్ను చెల్లింపు దారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment