Web Portal
-
లేటెస్ట్ టెక్నాలజీతో.. అందుబాటులోకి ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ తన ప్రధాన పోర్టల్‌ను పునరుద్ధరించింది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ పేస్, మెనూలు మార్పులు చేస్తూ తీర్చిదిద్దింది. తాజాగా, ఈ పోర్టల్‌ను సీబీడీటీ ఛైర్మన్ నితిన్ గుప్తా ప్రారంభించారు. ఇక, తాము కొత్తగా ప్రారంభించిన ఈ వెబ్సైట్ పన్ను చెల్లింపు దారులకు సౌకర్యవంతంగా ఉంటుందని నితిన్ గుప్తా తెలిపారు. పోర్టల్‌లో (https://incometaxindia.gov.in/) ట్యాక్స్‌కు సంబంధించిన చట్టాలు, నిబంధనల్ని సులభంగా తెలుసుకునేలా నావిగేషన్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు అలెర్ట్‌లు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన అలెర్ట్‌లు ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని పన్ను చెల్లింపు దారులకు సూచించారు. -
ప్రతీ పార్టీ లెక్క చెప్పాల్సిందే.. ఎన్నికల సంఘం కొత్త ఆన్లైన్ పోర్టల్
న్యూఢిల్లీ: కొత్త ఆన్లైన్ పోర్టల్‌ను సోమవారం ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇకపై ఈ పోర్టల్‌లోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆర్థిక వివరాలతో పాటు ఎన్నికలకు సంబంధించి ఖర్చులు, పార్టీకి వచ్చిన విరాళాలు తదితర వివరాలను ఈ పోర్టల్ ద్వారా అందించవచ్చు. దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. . అక్రమ నిధులను అరికట్టడం, రాజకీయ పార్టీల నిధులు, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యం పోర్టల్‌ను తీసుకువచ్చినట్లు చెప్పింది. తమ ఆర్థిక నివేదికను ఆన్లైన్లో ఇవ్వకూడదని భావిస్తే.. అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని, ఆన్లైన్లో సమర్పించకపోతే నిర్దేశించిన ఫార్మాట్లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ కాపీ ఫార్మాట్లో నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. ఆన్లైన్లో ఆర్థిక నివేదికలను దాఖలు చేయనందుకు పార్టీ పంపిన సమర్థన లేఖతో పాటు అలాంటి అన్ని నివేదికలను ఆన్లైన్లో ప్రచురిస్తుందని ఈసీ పేర్కొంది. చదవండి: పాత మిత్రుల కౌంటర్ల ఎపిసోడ్‌కు శుభం కార్డు.. ‘ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టమంటూ.. -
ఇక పరిశ్రమలకు అనుమతులన్నీ ఒకేచోట
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలు ఇకపై అనుమతుల కోసం శ్రమించాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే యాప్, వెబ్‌పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులు పొందొచ్చు. ఈ మేరకు సరికొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వైఎస్సార్ ఏపీ వన్ యాప్ ద్వారా 23 రకాల అనుమతులకు ఒకేచోట దరఖాస్తు చేసుకునే వెసులుబాటుని పారిశ్రామికవేత్తలకు కల్పించింది. విశాఖపట్నంలో వైఎస్సార్ ఏపీ వన్ ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తారు. అలాగే అన్ని జిల్లాల్లో పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండేలా సబ్ సెంటర్లను నెలకొల్పుతారు. యాప్, పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు. 96 క్లియరెన్స్‌లన్నీ ఒక్కచోటే.. పారిశ్రామిక రంగంలో ఇప్పటికే విభిన్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతిని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు మంజూరు చేయనుంది. మూడు వారాల్లో పరిశ్రమలకు అవసరమైన భూములు కేటాయించనుంది. వైఎస్సార్ ఏపీ వన్ పోర్టల్ ద్వారా 23 విభాగాలకు సంబంధించిన 96 క్లియరెన్సులన్నీ ఒకే చోట పొందొచ్చు. దీని వల్ల వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం, వివిధ విభాగాల వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేకుండా పరిశ్రమలకు అనుమతులు లభించనున్నాయి. ఈ ప్రక్రియను కూడా 21 రోజుల్లోనే పూర్తి చేస్తారు. గతంలో ఇలా.. గతంలో రాష్ట్రంలో ఎవరైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 23 అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. వీటికోసం ఆయా విభాగాల వెబ్సైట్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఇది చాలా ప్రయాసతో కూడుకుని ఉండటం.. గత టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టిసారించకపోవడంతో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఇబ్బందుల్ని తొలగించేలా.. అనుమతులన్నీ సులువుగా పొందేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ప్రత్యేకంగా వైఎస్సార్ ఏపీ వన్ అనే వెబ్‌పోర్టల్‌తో పాటు యాప్‌ని కూడా రూపొందించారు. -
విదేశీ వర్సిటీల్లో చేరేలా... ‘ఉక్రెయిన్’ విద్యార్థులకు సాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇతర విదేశీ యూనివర్సిటీల్లో కోర్సు పూర్తి చేసేందుకు అన్ని విధాలా సాయపడండి. దేశాలవారీగా వర్సిటీల్లో ఖాళీలు, ఫీజులు తదితర పూర్తి వివరాలతో ఓ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయండి’’ అని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల వైద్య విద్యార్థుల పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు సూచనలపై కేంద్రం వైఖరి తెలపడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన సుమారు 20 వేల మంది విద్యార్థులను యుద్ధ బాధితులుగా పరిగణించాలని వారి తరఫున న్యాయవాది కోరగా విషయాన్ని అంత దూరం తీసుకెళ్లొద్దని ధర్మాసనం సూచించింది. ‘‘వాళ్లు స్వచ్ఛందంగానే ఉక్రెయిన్ వెళ్లారని గుర్తుంచుకోవాలి. పైగా వాళ్లు యుద్ధ రంగంలో లేరు కూడా’’ అని జస్టిస్ గుప్తా అన్నారు. విద్యార్థులకు సాయం చేయడానికి కేంద్రం పలు చర్యలు చేపట్టిందని మెహతా తెలిపారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండే కొన్ని దేశాలతో భారత్ సంబంధాలు పెట్టుకుందన్నారు. విద్యార్థులు అనుకూలమైన విదేశీ వర్సిటీని ఎలా ఎంచుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. లైజనింగ్ అధికారిని నియమించామని చెప్పగా ఒక్క అధికారి ఉంటే చాలదని పేర్కొంది. వైద్య విద్య పూర్తి చేయాలనుకుంటే విద్యార్థులు ఓ దారి వెతుక్కోవాల్సిందేనని అభిప్రాయపడింది. విదేశీ వర్సిటీలు ప్రవేశాలు కల్పించగలిగితే భారత వర్సిటీలకు ఎందుకు సాధ్యం కాదని విద్యార్థుల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. దేశీయ వర్సిటీలపై విద్యార్థులకు హక్కు లేదని ధర్మాసనం బదులిచ్చింది. విచారణను సెప్టెంబరు 23కు వాయిదా వేసింది. -
మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!
విజయనగరం క్రైమ్: మొబైల్ మిస్సయిందా..? ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే విషయాలను వివరిస్తూ, వాటి ఐఎంఈఐ నంబర్లు, అడ్రస్, కాంటాక్టు నంబర్‌తో వెబ్‌పోర్టల్‌లో ఫిర్యాదుచేస్తే చాలు.. విజయనగరం జిల్లా సైబర్ పోలీసులు ట్రాక్చేస్తారు. ఆ మొబైల్స్‌ను ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకుని స్వాధీనం చేసుకుంటారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ సదుపాయం విజయనగరం జిల్లా ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. చదవండి: డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు ఎస్పీ దీపికాఎం.పాటిల్ సూచనల మేరకు ఫిర్యాదుదారులు సులభంగా ఫిర్యాదు చేసుకునేలా విశాఖపట్నం దువ్వాడ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి చెందిన విద్యార్థినులు రూపొందించిన ‘వీజెడ్‌ఎమ్‌మొబైల్‌ట్రాకర్ డాట్ ఇన్’ను ఎస్పీ గురువారం ఆవిష్కరించారు. రూ.16.54లక్షల విలువైన మొబైల్స్ స్వాధీనం.. జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను ట్రేస్ చేసేందుకు గత నెలలో ఎస్పీ దీపిక వాట్సాప్ నంబర్ 89779 45606ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనికి చాలామంది బాధితులు ఫిర్యాదు చేశారు. నెలల వ్యవధిలోనే రూ.16.54లక్షల విలువైన 103 ఫోన్లను సైబర్ పోలీసులు ట్రేస్ చేశారు. తెలంగాణ, ఛత్తీగఢ్, ఒడిశా, బీమార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో వినియోగిస్తున్న మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎస్పీ కార్యాలయంలో బాధితులకు గురువారం అందజేశారు. మొబైల్స్ రికవరీ చేయడంలో శ్రమించిన సైబర్‌సెల్ ఎస్ఐలు ఎం.ప్రశాంత్‌కుమార్, నీలావతి, బి.వాసుదేవరావు, ఎం.శ్రీనివాసరావు, ఎన్.రాజేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ టి.త్రినాథ్, ఎస్బీ సీఐ జి.రాంబాబు, సీహెచ్ రుద్రశేఖర్, వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు, టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు, రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు చేయడం ఇలా.. మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు వీజెడ్‌ఎమ్‌మొబైల్‌ట్రాకర్ డాట్ ఇన్ వెబ్‌పోర్టల్ ఓ వరం. వెబ్‌పోర్టల్‌ను ఓపెన్ చేశాక రిపోర్ట్ కంప్లైంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే, లోపల రిపోర్ట్ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, కాంటాక్టు నంబర్, ఐఎంఈఐ నంబర్లు, జిల్లా, గ్రామం, ఎక్కడ పోగొట్టుకున్నది, ఫోన్ మోడల్ తదితర వివరాలు నమోదుచేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు స్టేటస్‌ను చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. రికవరీ అయిన తర్వాత బాధితులిచ్చిన కాంటాక్టు నంబర్‌కు సమాచారం అందుతుంది. అందరికీ అందుబాటులో వెబ్‌పోర్టల్ వెబ్‌పోర్టల్ విజయనగరం వాసులందరికీ అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశాం. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో సెల్‌ఫోన్ బాధితులు నేరుగా ఫిర్యాదుచేసేందుకు వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఫిర్యాదు చేసుకోవచ్చు. – ప్రొఫెసర్ నేతాజీ, వెబ్‌పోర్టల్ ఇన్చార్జి, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల, దువ్వాడ చాలా ఆనందంగా ఉంది వెబ్‌పోర్టల్ రూపకల్పనలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. వెబ్ రూపకల్పనకు విజ్ఞాన్ యాజమాన్యం అహరి్నశలు శ్రమించింది. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో చాలా తొందరగా వెబ్‌ను రూపొందించి, విజయనగరవాసులకు అందించగలిగాం. – అడారి దీపిక, ఐటీ విభాగం, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల -
సదా ఈ–సేవలో.. విద్యుత్ ఫిర్యాదులూ ఆన్లైన్లోనే!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్లులు, మరమ్మతులు, ఇతర అంశాల్లో సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణ కోసం ‘కన్జ్యూమర్స్ గ్రివెన్సెస్ రిడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్ఎఫ్)’వెబ్‌పోర్టల్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ టి.శ్రీరంగారావు సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై ఎక్కడి నుంచైనా మొబైల్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామని శ్రీరంగారావు చెప్పారు. అయితే వినియోగదారులు తొలుత తమ సమస్యలపై స్థానిక కస్టమర్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)లో ఫిర్యాదు చేసి రశీదు తీసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్య పరిష్కారం కాకుంటే.. సీజీఆర్‌ఎఫ్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వాటిని పరిష్కరించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీజీఆర్‌ఎఫ్‌లో సైతం పరిష్కారం కాని అంశాలపై విద్యుత్ అంబుడ్స్‌మెన్‌కుగానీ, ఈఆర్సీకి గానీ ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. సమస్య ఏదైనా సరే.. మీటర్లు మొరాయించడం/కాలిపోవడం/సరిగ్గా పనిచేయకపోవడం, కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ/అదనపు లోడ్ అనుమతిలో జాప్యం, సర్వీస్ కనెక్షన్ యజమాని పేరు మార్పు, కేటగిరీ మార్పు, తప్పుడు మీటర్ రీడింగ్, అడ్డగోలుగా బిల్లులు, అసలు బిల్లులు జారీ కాకపోవడం, బిల్లుల చెల్లింపు తర్వాత కనెక్షన్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, తీగలు తెగిపడిపోవడం, వోల్టేజీలో హెచ్చుతగ్గులు వంటి అంశాలపై పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని శ్రీరంగారావు తెలిపారు. ఫిర్యాదులు, వాటిపై సీజీఆర్ఎఫ్ చైర్మన్, సభ్యులు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమస్త సమాచారం పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. వినియోగదారులు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) వెబ్సైట్లో ఉండే సీజీఆర్ఎఫ్ లింక్‌ను క్లిక్ చేస్తే ఫిర్యాదుల పోర్టల్ ఓపెన్ అవుతుందని తెలిపారు. లేకుంటే.. ఉత్తర తెలంగాణ జిల్లాల వినియోగదారులు 210.212.223.83:9070/CGRF/CgrfWebsite.jsp పోర్టల్‌లో.. దక్షిణ తెలంగాణ జిల్లాలవారు 117.239.151.73:9999/CGRF/ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా డిస్కంలు ఫిర్యాదులను పరిష్కరించడంలో విఫలమైతే.. వాటిపై జరిమానాలు విధించే అధికారం తమకు ఉందని తెలిపారు. సీజీఆర్ఎఫ్ ఫిర్యాదుల స్వీకరణకు త్వరలో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. -
సచివాలయాల్లోనూ ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: ఇసుక రవాణాను మరింత సులభతరం చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇసుక డోర్ డెలివరీకి ఇది బాగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు ఈ బుకింగ్ బాధ్యతను అప్పగించారు. వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో డబ్బు కడితే అక్కడి నుంచే చలానా వస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన అడ్రస్‌కు ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అమ్మకాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఆంధ్రా శ్యాండ్ పేరుతో వెబ్ పోర్టల్ www. andhrasand.com మొబైల్ యాప్ andhrasand app ద్వారా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆఫ్‌లైన్ విధానంలో రవాణా చేసే వ్యక్తులు మధ్యవర్తులుగా మారి ఎక్కువ రేటుకు ఇసుక విక్రయిస్తుండడంతో ఆన్లైన్ డోర్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు (ఆదివారం, సెలవులు మినహా) మ.12 గంటల నుండి సా.6 గంటల వరకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. రీచ్, డిపో నుండి 20 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ఉన్న బుకింగ్‌కు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడి ఇసుకనైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. బుకింగ్ ఇలా.. ► సాధారణ వినియోగదారుడు మొబైల్ నెంబర్‌తో, బల్క్ వినియోగదారుడు మొబైల్, ఈ–మెయిల్, పాన్, జీఎస్టీ నెంబర్‌తో ఇసుకను బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ► డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో ఆన్లైన్లోనే డబ్బు చెల్లించే ఏర్పాటుచేశారు. ► డిపోలో ఇసుక లోడ్ చేసిన తర్వాత వినియోగదారునికి జీపీఎస్ నావిగేషన్ ప్రారంభమవుతుంది. బుక్ చేసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు రవాణా చేసే వాహనాన్ని ట్రాక్ చేస్తారు. వెబ్ పోర్టల్, యాప్, కస్టమర్ కేర్ కాల్ సెంటర్ ద్వారా కూడా వినియోగదారులు బుకింగ్ ఆర్డర్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. ► ఏమైనా ఇబ్బందులు వస్తే కస్టమర్ కేర్ కాల్ సెంటర్ 9700009944కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. బుక్ చేసుకున్న రోజే డెలివరీ ప్రస్తుతం 147 డిపోలు, 215 రీచ్‌లలో ఇసుక విక్రయాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరుగుతాయి. పీక్ స్టేజ్‌లో ఇది కోటిన్నర క్యూబిక్ మీటర్లు ఉంటుంది. గతంలో బుక్ చేసుకున్న రెండు, మూడు రోజులకు ఇసుక వచ్చేది. కానీ, ఇప్పుడు బుక్ చేసుకున్న రోజే డెలివరీ చేస్తున్నారు. అలాగే, నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లను ఇప్పటికే ప్రకటించారు. రీచ్‌లు, డిపోల వద్ద ధరల పట్టిక, హోర్డింగ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. మధ్యవర్తులు ఎక్కువ రేటుకి అమ్మకుండా ఈ చర్యలు చేపట్టారు. బ్లాక్ మార్కెటింగ్‌ను సహించం వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరసమైన రేటుకు, నాణ్యమైన ఇసుకను సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండూ విధానాలు పెట్టాం. మధ్యవర్తులు ఎక్కువ రేటుకు అమ్మకుండా చూసేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను సహించం. ఫలానా రీచ్‌లోనే బుక్ చేసుకోవాలనేది లేదు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎటువంటి ఆంక్షల్లేవు. వినియోగారులకు ఇంకా సులభంగా ఇసుకను అందించేందుకు ప్రయత్నిస్తాం. – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్ -
అంగన్వాడీ.. ఇక డిజిటల్లీ రెడీ
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య స్థితిని అంచనా వేసే పద్ధతిని ప్రభుత్వం మరింత పకడ్బందీ చేస్తోంది. ప్రస్తుతం నెల వారీగా పిల్లల ఎత్తు, బరువు కొలిచే ప్రక్రియ ఉన్నా అంతంతగానే జరుగుతుండటం, సర్కారుకు నివేదికలు సమర్పించే నాటికి ఆలస్యమవుతుండటంతో సాంకేతికతను వాడి ఈ జాప్యానికి చెక్ పెట్టాలనుకుంటోంది. ఇకపై ప్రతి చిన్నారి ఎత్తు, బరువును నెలవారీగా తూచి వివరాలను వెబ్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీని వల్ల పిల్లల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు పౌష్టికాహార లోపాలున్న పిల్లలకు అదనపు పోషకాలు అందించే వీలుంటుందని భావిస్తోంది. 80 శాతం లక్ష్యం సాధించిన అంగన్వాడీ టీచర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనుకుంటోంది. వెబ్ పోర్టల్, యాప్ ద్వారా.. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో 31,711 ప్రధాన, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో మూడేళ్లలోపు చిన్నారులు 10.34 లక్షల మంది, 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 6.67 లక్షల మంది ఉన్నారు. ప్రతి నెలా వీరి ఎత్తు, బరువును కొలిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వాడబోతోంది. రాష్ట్ర స్థాయిలో వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీనికి అనుబంధంగా ఓ యాప్‌నూ రూపొందించనుంది. దీని ఆధారంగా వివరాలను నమోదు చేసే వీలుంటుంది. ఇందుకోసంప్రతి అంగన్వాడీ టీచర్‌కు అత్యాధునిక స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యాప్‌లో ఏమేముంటాయ్? ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి పిల్లల ఎత్తు, బరువు, వయసు వివరాలను నమోదు చేసిన వెంటనే ప్రధాన సర్వర్‌లో గణాంకాలు నిక్షిప్తమవుతాయి. పిల్లల వయసు, ఎత్తు, బరువులో తేడాలుంటే వెంటనే సూచనలు ఇస్తుంది. దీంతో సదరు అంగన్వాడీ టీచర్ అప్రమత్తమై ఆయా చిన్నారులకు అదనపు పోషకాహారం అందించడం, వైద్యుల దృష్టికి తీసుకెళ్లే ఏర్పాటు చేసుకోవడం లాంటి అవకాశం ఉంటుంది. వచ్చే నెల నుంచి ఎత్తు, బరువు తూచే ప్రక్రియను క్రమం తప్పకుండా కొనసాగించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే శిక్షణ, అవగాహన పూర్తయింది. -
Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు 12 గంటల అంతరాయం
ఆదాయ పన్నుల కొత్త వెబ్ పోర్టల్‌కు అంతరాయం కలగనుంది. నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా సైట్ దాదాపు 12 గంటలపాటు నిలిచిపోనుందని . శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం తన వెబ్సైటు https:///www.incometax.gov.in ద్వారా తెలియజేసింది. ఈ పన్నెండు గంటలపాటు ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదు. అలాగే ఇతర సేవలూ అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఇక వెబ్సైటులో తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగించిన విషయం విదితమే. కొత్త పోర్టల్‌ను ఈ ఏడాది జూన్‌లో పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సంస్థ సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించి, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు 2021-22 మదింపు సంవత్సరానికి (2020-21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి ఇప్పటి వరకు 2 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విటర్లో పేర్కొంది. -
ఇదేం బాధ్యతారాహిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి జవాబుదారీతనం లేకుండా కొన్ని సామాజిక మాధ్యమాలు, వెబ్ పోర్టళ్లలో నకిలీ వార్తల ప్రచారంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గతేడాది కోవిడ్ వ్యాప్తికి నిజాముద్దీన్ మర్కజ్ కారణమంటూ కొన్ని ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో వచి్చన వార్తలకు వ్యతిరేకంగా జమియత్ ఉలేమా ఇ హింద్, పీస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ దాఖలు చేసిన సవరణ విజ్ఞప్తి పిటిషన్‌ను అనుమతించిన ధర్మాసనం ప్రతులను సొలిసిటర్ జనరల్‌కు అందజేయాలని పిటిషనర్ న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలపై సీజేఐ పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఫేస్బుక్, యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాలు మాకు కూడా స్పందించడం లేదు. వ్యక్తులనే కాదు సంస్థలపైనా ప్రచురణ విషయంలో బాధ్యతగా వ్యవహరించడం లేదు. వారు న్యాయమూర్తులు, సంస్థలు, వ్యక్తుల గురించి చింతించరు.. కానీ శక్తిమంతులైన వారు చెబితే వింటారు’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది అందులో ఎన్ని నకిలీ వార్తలు ఉంటాయో. వెబ్ పోర్టళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. దేశంలో ఓ వర్గం మీడియా ప్రతీదీ మతపరమైన కోణంలో చూపుతోంది. వార్తలకు మత రంగు పులమడం పెద్ద సమస్యగా మారింది. చివరికి ఇది దేశానికి చెడ్డపేరు తెస్తుంది. ఈ ప్రైవేట్ చానళ్లను నియంత్రించే చర్యలు ఎప్పుడూ కేంద్రం చేపట్టలేదా?’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లను నియంత్రించే యంత్రాంగం ఉంది. వెబ్‌పోర్టళ్లను నియంత్రించే యంత్రాంగం ఉండాలని కేంద్రానికి సూచించలేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మతపరంగానే కాదని వార్తలు కూడా సృష్టిస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. సోషల్, డిజిటల్ మీడియాను నూతన ఐటీ రూల్స్, 2021 నియంత్రిస్తాయని మెహతా తెలిపారు. ముస్లిం సంస్థల తరఫున హాజరైన న్యాయవాది సంజయ్ హెగ్డే సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలను సమర్థించారు. ఐటీ రూల్స్‌ను సవాల్ చేస్తూ వేర్వేరు హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని తుషార్ మెహతా కోరారు. వేర్వేరు హైకోర్టులు వేర్వేరుగా ఆదేశాలు ఇస్తున్నాయని, దేశం మొత్తానికి సంబంధించిన నేపథ్యంలో సమగ్రత కోసం పిటిషన్లు బదిలీ చేయాలన్నారు. కేంద్రం దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను ప్రస్తుత పిటిషన్‌తో కలిపి జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం ఆరు వారాలపాటు విచారణ వాయిదా వేసింది. -
సోషల్ మీడియా వెబ్ పోర్టల్ లలో నకిలీ వార్తలపై సుప్రీంకోర్టు అసహనం
-
ఇ గోపాలా.. డెయిరీలకు తోడు నీడ
పాల ఉత్పత్తిలో నిరంతరం శ్రమిస్తున్న వారికి అండగా ఉండేందుకు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్డీడీసీ) ఇ గోపాలా వెబ్‌పోర్టల్‌ని అందుబాటులోకి తెచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమికి రెండు రోజుల ముందు ఈ వెబ్‌పోర్టల్‌ని కేంద్ర మంత్రి రూపాల ప్రారంభించారు. ప్రధాని మోదీ నిర్ధేశించిన డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఈ వెబ్‌పోర్టల్‌ని రూపొందించినట్టు తెలిపారు. డెయిరీలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెటింగ్ విధానాలు, నూతన యాజమాన్య పద్దతులు ఎప్పటికప్పుడు డెయిరీ రంగంలో ఉన్నవారికి తెలియ జేసేందుకు ఇ గోపాలా పేరుతో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇ గోపాల అప్లికేషన్ ద్వారా డెయిరీకి సంబంధించి సమాచారంతో పాటు లైవ్ స్టాక్ కొనుగోలు అమ్మకాలు, బ్రీడింగ్ , రోగనిర్థారణ, నివారణ పద్దతులకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది. చదవండి: PMJDY: పీఎంజేడీవై ఖాతాదారులకు రూ.10 వేల ఓవర్ డ్రాఫ్ట్ -
e-Shram: కార్మికులకు అండగా ఇ-శ్రమ్
అసంఘటిత రంగంలో అనామకంగా ఉండిపోయిన కార్మికలకు అండగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. సంక్షేమం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు తదితర అంశాల్లో కార్మికులకు సహాయకారిగా ఉండేందుకు ఇ శ్రమ్ పేరుతో పోర్టల్‌ని ప్రారంభించనుంది. ఎంతమంది కార్మికులు భారత దేశంలో అసంఘటిత రంగంలో దాదాపు 38 కోట్ల మంది కార్మికులు ఉన్నట్టు అంచనా. కోవిడ్ సంక్షోభం సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊరుకాని ఊరిలో ఇటు యజమానులు, అటు ప్రభుత్వ మద్దుతు సరైన సమయంలో అందక ఇక్కట్ల పాలయ్యారు. దీంతో ఇటు పౌర సమాజం, అటు న్యాయస్థానాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అసంఘటిత కార్మికులు ఎంత మంది ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే అంశంపై నిర్థిష్ట కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఇ-శ్రమ్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కేంద్రం ఆగస్టు 26న ఇ శ్రమ్ వెబ్ పోర్టల్‌ని అందుబాటులోకి తేనుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అసంఘటిత రంగంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు. వీరిలో నిర్మాణ రంగం, వలస కార్మికులు, వీధి వ్యాపారులు ఇలా కేటగిరిల వారీగా ఎంత మంది ఉన్నారనే సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. అదే విధంగా ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది. ఒకే గొడుకు కిందికి ఇ శ్రమ్ పోర్టల్ అందుబాటులోకి రావడం వల్ల ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక సంఘాలు కూడా ఒకే గొడుకు కిందకు వచ్చే అవకావం ఉంది. దీని వల్ల కార్మికుల సమస్యల వెలుగులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం సైతం త్వరగా జరిగేందుకు వీలు ఏర్పడనుంది. ఆగస్టు 26న పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మికుల కోసం హెల్ప్‌లైన్ ఇ శ్రమ్ వెబ్ పోర్టల్‌తో పాటు అసంఘటిత కార్మికుల కోసం కార్మిక శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా 14434 నంబరును దేశవ్యాప్తంగా కార్మికులకు అందుబాటులోకి తేనుంది. చదవండి: JioMeet : ఆన్లైన్ క్లాసుల కోసం జియోమీట్.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో -
ఐటీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. కేంద్రం సీరియస్
Glitches in New I-T Portal: న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌ను సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా పోర్టల్ పూర్తిగా అందుబాటులోనే లేకుండా పోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా ఇలా సమస్యలు కొనసాగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం వచ్చి వివరణ ఇవ్వాలంటూ పోర్టల్‌ను రూపొందించిన టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. చదవండి: లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష ‘కొత్త ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించి 2.5 నెలలు అయిపోతున్నప్పటికీ పోర్టల్‌లో సమస్యలను ఇంకా ఎందుకు పరిష్కరించలేదనే అంశంపై ఆగస్టు 23న (సోమవారం) కేంద్ర ఆర్థిక మంత్రికి వివరణ ఇవ్వాలని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఆగస్టు 21 నుంచి ఏకంగా పోర్టల్ అందుబాటులోనే లేదు‘ అని ఆదాయ పన్ను శాఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేసింది. మరోవైపు, నిర్వహణ పనుల కోసం ట్యాక్స్ పోర్టల్ అందుబాటులో ఉండదని ట్విటర్లో శనివారం ఇన్ఫోసిస్ ట్వీట్ చేసింది. అత్యవసర మెయింటెనెన్స్ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తయ్యాక అప్డేట్ చేస్తామంటూ ఆదివారం మరో ట్వీట్ చేసింది. అప్పుడు జీఎస్టీ, ఇప్పుడు ఐటీ.. అటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐఅండ్‌బీ) కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ‘ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫోసిస్ గందరగోళం చేసిన రెండో ప్రాజెక్టు ఇది. మొదటిది జీఎస్టీ పోర్టల్ కాగా ఇప్పుడు ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్. రెండు వరుస వైఫల్యాలనేవి కాకతాళీయంగా అనుకోవడానికి లేదు. దీనితో కంపెనీకి సామర్థ్యాలైనా లేకపోవచ్చు లేదా పనిని సజావుగా పూర్తి చేసి ఇచ్చే ఉద్దేశమైనా లేకపోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది‘ అని ఐటీ శాఖ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఐఅండ్‌బీ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ట్విటర్లో వ్యాఖ్యానించారు. చదవండి: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వివరాలు ఇలా.. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకు తగ్గించడం, రిఫండ్ల వేగవంతం లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్ అభివృద్ధికి రూ.4,242 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. జూన్ వరకూ రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ప్రా జెక్టు నిధుల మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభు త్వం ప్రారంభించింది. అయితే, అప్పట్నుంచీ వెబ్సైటును సాంకేతిక లోపాలు వెన్నాడుతూనే ఉన్నాయి. -
రాష్ట్రంపై ప్రేమాభిమానాలు చాటండి..
సాక్షి, అమరావతి: ‘కనెక్ట్ టు ఆంధ్రా’ కింద రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ప్రత్యేకించి ఈ వెబ్ పోర్టల్‌ను రూపొందించారు. కనెక్ట్ టు ఆంధ్రాకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, సీఎస్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా.. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సాయం చేయొచ్చని.. రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. ‘మీరు ఎంత సాయం చేస్తారన్నది ముఖ్యం కాదు.. మీ గ్రామంలో.. లేదా మీ నియోజకవర్గంలో.. లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమమైనా చేపట్టొచ్చు.. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సాయం చేయొచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతోకొంత మంచి చేయడానికి ఖండాంతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన కమిషనర్ విజయ్‌కుమార్, ప్రణాళిక శాఖ డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్ పాల్గొన్నారు. -
సంక్షేమ సారధి
-
ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ప్రతి సోమవారం స్పందనలో వచ్చే ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే. అర్జీ ఇచ్చినప్పుడే అర్జీదారునికి రశీదు ఇవ్వాలి. ఆ సమస్యను ఎన్ని రోజుల్లోగా పరిష్కరిస్తారన్నది కూడా రశీదులో నిర్దిష్టంగా పేర్కొనాలి. ఆలోగా సమస్యను కచ్చితంగా పరిష్కరించాల్సిందే’ అని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం సచివాలయం నుంచి ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందే.. అప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలం.. మాపై ప్రజలు అచంచలమైన విశ్వాసం ఉంచి అఖండ విజయాన్ని అందించారు. వారి ఆశలు నెరవేర్చి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని చెప్పారు. ‘రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అర్జీల ద్వారా వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే కాకుండా.. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయో విశ్లేషించి, వాటికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. శాశ్వతంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కార్యాచారణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అర్జీల్లో చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రహదారులు, తాగునీటి సమస్య వంటి సామాజిక సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక అధికారిని నియమిస్తాం. ఆ అధికారిని మీరు సంప్రదించి త్వరితగతిన పనులు జరిగేలా చూడండి’ అని సీఎం ఆదేశించారు. ఆన్లైన్లో పరిశీలన మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి అర్జీని కంప్యూటరీకరించి, ఆన్లైన్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. మండల స్థాయి మొదలు తాను నిర్వహించే ప్రజాదర్బార్‌లో వచ్చే అర్జీల వరకు అన్నింటినీ ఆన్లైన్ వెబ్ పోర్టల్‌లో పొందుపరచాలని, నిర్దిష్ట గడువులోగా ఆ సమస్యలు పరిష్కరించారో లేదో తనిఖీ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఆన్లైన్లో వీటిని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి పర్యటనలకు, పల్లె నిద్రకు వెళ్లినప్పుడు ‘స్పందన’లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. రచ్చబండ, ఇతర అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు తానూ తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు. దీని వల్ల కింది స్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పని చేస్తారని, సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తారని చెప్పారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రతి మంగళశారం ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తానన్నారు. చిన్న చిన్న సమస్యలను 72 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇంట్లో నుంచే సమస్య నమోదు భవిష్యత్‌లో ప్రజలు ఇంట్లో నుంచే తమ సమస్యను వెబ్ పోర్టల్‌లో నమోదు చేసేలా ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆ మేరకు వెబ్ పోర్టల్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు తెలిసింది. -
కొత్త పనులు చేపట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియ మావళిని కచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పేర్కొన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమ లు నేపథ్యంలో జిల్లాలో పాలన తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం పాలన సాగించాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పనులు కొనసాగించాలని సూచించారు. కోడ్ నేపథ్యం లో కొత్త కార్యక్రమాలు చేపట్టొద్దని తెలిపారు. కొత్తగా వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకోసం తీసుకోవాల్సిన చర్యలను ఈనెల 31 లోగా పూర్తి చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను గత ఏడాది వచ్చిన రాష్ట్రపతి గెజిట్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రొఫార్మా–1 పూర్తిచేశాయని, తమ శాఖలో ఉన్న పోస్టుల వివరాలను నిక్షి ప్తం చేయాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిం చని ప్రత్యేకాధికారులు, రాష్ట్రస్థాయి అధికారుల ను ప్రొఫార్మా–5లోకి తీసుకురావాలన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ అనుమతితో ఉత్తర్వుల జారీకి చర్య లు తీసుకోవాలని, ప్రతి శాఖకు సంబంధించిన పోస్టులను ఆర్థిక శాఖ రీకౌన్సిల్ చేస్తుందన్నారు. టీవెబ్ పోర్టల్‌కు నోడల్ అధికారి తెలంగాణ వెబ్ పోర్టల్‌కు ప్రతి శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించాలని సీఎస్ సూచించారు. జిల్లాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్, హరితహారం, ఎన్నికల కోడ్, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ, రెవెన్యూ, అటవీ భూముల సర్వే తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ కమిటి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జస్టిస్ సీవీ రాములు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లు సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను జిల్లా కలెక్టర్లు సమర్పించాలన్నారు. కొత్తగా ఎన్నికైన∙గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణా కార్యక్రమాన్ని ఈనెల 29లోగా పూర్తి చేయాలని సీఎస్ చెప్పారు. శిక్షణ పొందిన సర్పంచుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించాలని తెలిపారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, చిత్రా రామచంద్రన్, ముఖ్య కార్యదర్శులు శాంతికుమారి, రామకృష్ణారావు, సునీల్ శర్మ, వికాస్‌రాజ్, సోమేశ్‌కుమార్, శాలినీ మిశ్రా, పార్థసారథి, జగదీశ్వర్, శశాంక్ గోయల్, శివశంకర్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, బి.వెంకటేశం, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘లైఫ్ సైన్సెస్’ పోర్టల్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంతో ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధక సంస్థలు, స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు వెబ్‌పోర్టల్ (http:// www.lsprofiling.telangana.gov.in) ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఇప్పటికే దేశ ఔషధ రంగ రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో రానున్న 10 ఏళ్లలో 4లక్షల కొత్త ఉద్యోగాలతో పాటు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి లక్ష్యంగా నిరుద్యోగులకు శిక్షణ
సాక్షి, మేడ్చల్ జిల్లా : ఉపాధి లక్ష్యంగా జిల్లా గ్రా మీణ అభివృద్ధి సంస్థ (డీ ఆర్డీఏ) నిరుద్యోగ యువ త వృత్తి నైపుణ్య శిక్ష ణ కా ర్యక్రమాలకు శ్రీకారం చు ట్టింది. ఎంప్లాయిమెంట్ జ నరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా మేడ్చ ల్– మల్కాజిగిరి జిల్లాలో 18 నెలల కాలంలో 129 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించిన డీఆర్డీఏ యువతకు ఉపాధి శిక్షణ లక్ష్యంగా త్వరలో కొత్తగా‘ వెబ్ పోర్టర్’ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిరుద్యోగులు 10 లక్షల వరకు ఉంటారని అధికారుల అంచనా. పారిశ్రామిక కేంద్రానికి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కావటంతో పరిశ్రమలు, సంస్థలు వేలల్లో ఉన్నాయి. దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా వృత్తి నైపుణ్య త శిక్షణపై కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాతోపాటు హైదరాబాద్ నగర చుట్టు పక్కల ఉన్న 22 శిక్షణ కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇప్పించటంతోపాటు వివిధ కంపెనీలు, సంస్థల్లో ఉపాధి (ప్లేస్మెంట్) అవకాశాలు కల్పించేందుకు డీఆర్డీఏ పీడీ కౌటిల్య నేతృత్వంలో జేడీఎం దివాకర్ చర్యలు తీసుకుంటున్నారు. పదోతరగతి, తత్సమాన పరీక్షల్లో పాస్ లేదా ఫెయిలైన 18– 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా ఉపా ధి శిక్షణ ఇస్తారు. ఐదు మండలాల్లో ఎనిమిది చోట్ల జాబ్‌మేళా నిర్వహించారు. 233 మందిని ఎంపిక చేసిన యంత్రాంగం మూడు నెలల పాటు ఉచిత భోజనం, యూనిఫాం, వసతి వంటి సదుపాయాలు కల్పించి ఉపాధి శిక్షణ ఇచ్చారు. 129 మందికి వివిధ సంస్థలు, పరిశ్రమల్లో ఉపాధి (ప్లేస్మెంట్)అవకాశాలు లభించాయి. ఇందులో ఘట్కేసర్ ఈజీఎంఎం సెంటర్లో 33 మంది మ హిళా నిరుద్యోగులకు మూడు నెలల పాటు ఉపా ధి శిక్షణ ఇవ్వగా, 29 మంది వివిధ సంస్థల్లో ఉద్యో గాలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం లభిస్తోందని డీఆర్డీఓ జిల్లా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేడు ‘పెన్సిల్’ పోర్టల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: జాతీయ బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పెన్సిల్ (ప్లాట్‌ఫాం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్) వెబ్ పోర్టల్‌ను హోం మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం ఆవిష్కరిస్తారు. -
ఫీజుల వివరాలు ఆన్లైన్లో స్వీకరణ
వెబ్ పోర్టల్ రూపొందించిన తిరుపతిరావు కమిటీ - వెబ్సైట్ ద్వారా ప్రైవేటు స్కూళ్ల ఆదాయ వ్యయాల వివరాలు సేకరణ - త్వరలో అందుబాటులోకి వెబ్సైట్.. - ఆ తర్వాతే నియంత్రణ చర్యలపై పరిశీలన - ఫీజుల నియంత్రణపై ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ఆన్లైన్లో స్వీకరించాలని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నిర్ణయించింది. యాజమాన్యాల నుంచి తీసుకోవాల్సిన వివరాలతో కూడిన వెబ్ పోర్టల్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించింది. లింకును పాఠశాల విద్యా డైరెక్టర్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. యాజమాన్యాలు సీడీఎస్ఈ వెబ్సైట్లోకి వెళ్లి పాఠశాలలకు సంబంధించిన వివరాలు, ఫీజుల వివరాలు, ఆదాయ వ్యయాలను ఆన్లైన్లోనే పొందుపరిచేలా రూపొందించింది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు పొందుపరిచేందుకు యాజమాన్యాలకు 15 నుంచి 20 రోజుల సమయం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత వాటిని పరిశీలించి ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఓ అంచనాకు రానుంది. మరోవైపు గుజరాత్, కేరళ, తమిళనాడు తదిరత రాష్ట్రాల్లోనూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేపట్టిన చర్యలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. యాజమాన్యాల నుంచి లభించని స్పందన రాష్ట్రంలో 11 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను ఖరారు చేసేందుకు ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ పలు దఫాలుగా తల్లిదండ్రులతో, యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించి చర్చించింది. ఇటు యాజమాన్యాలు, అటు తల్లిదండ్రుల కమిటీలు తమ వాదనలు వినిపించాయి. ఏఎఫ్ఆర్సీ తరహా విధానం ఉండాలని తల్లిదండ్రులు, కనీస, గరిష్ట ఫీజుల విధానం ఉండాలని యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి. ఆ సమావేశాల వల్ల తల్లిదండ్రుల వైఖరి, యాజమాన్యాల తీరు తెలిసిందే తప్ప నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ ఓ అంచనాకు రాలేకపోయింది. పైగా ప్రస్తుతం పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల విధానం ఎలా ఉందో తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో మూడేళ్లకు సంబంధించి స్కూళ్ల ఆదాయ వ్యయాల స్వీకరణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. అయితే యాజమాన్యాల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. అయినా విద్యా శాఖ ఫీజుల నియంత్రణ కోసం కాకపోయినా నిబంధనల ప్రకారం పాఠశాలల వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ఇవ్వాల్సిందేనని యాజమాన్యాలకు స్పష్టం చేసింది. స్పష్టత కోసం.. మరోవైపు తాజాగా ఆన్లైన్లో వివరాల సేకరణకు చర్యలు చేపట్టిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ.. అవి వస్తేనే ఫీజుల విధానం ఎలా ఉంది, పాఠశాలల ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, నియంత్రణకు ఎలాంటి సిఫారసులు చేయాలి, అన్న అంశంపై ఓ స్పష్టతకు రావచ్చని భావిస్తోంది. హడావుడిగా నివేదికలు ఇచ్చి, ఆ తర్వాత కోర్టు కేసులతో ఆగిపోయే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో కొంత సమయం పట్టినా పక్కాగా చర్యలు చేపట్టేందుకు వీలుగా సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని భావిస్తోంది. అయితే ఆన్లైన్లో వివరాల సమర్పణకు ఎన్ని పాఠశాలలు ముందుకు వస్తాయో వేచి చూడాల్సిందే. -
ఎన్ఆర్ఐ భర్తల బాధితులకు అండ!
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐ భర్తలు వదిలేసిన మహిళలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం త్వరలో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఇందులో లాయర్లు, ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు తదితరాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. గత వారం జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో వెబ్‌పోర్టల్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. కమిటీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల నుంచి ఒక్కరేసి చొప్పున అధికారులున్నారు. విదేశాల్లో భర్త వదిలేసినా, స్వదేశంలో విడాకులు పొందడానికి సమస్యలు ఎదుర్కొంటున్న, మనోవర్తి పొందగోరే మహిళలకు ఈ పోర్టల్ సహాయకారిగా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గతేడాది ఏర్పడిన కమిటీ.. బాధితులకు అభివృద్ధి చెందిన దేశాల్లో 3 వేల డాలర్లు, వర్థమాన దేశాల్లో 2 వేల డాలర్లు ఆర్థిక సాయం చేయాలని ఇంతకు ముందే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత పోర్టల్‌ను విదేశాంగ శాఖ నిర్వహిస్తుంది. -
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
నిడమర్రు : ప్రభుత్వ గుర్తింపు పొందిన/ ప్రైవేట్/ కార్పొరేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు భవిష్య నిధి సౌకర్యంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. ఈ ఖాతాలో ఆ ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తంలో మినహాయింపుతోపాటు పనిచేస్తున్న కంపెనీ కూడా కొంత మొత్తంలో నగదు జమ చేస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా ఎంత మొత్తంలో పొదుపు చేస్తామన్నది సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను వివిధ రకాలుగా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కల్పించింది. ఎస్ఎంఎస్ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ఈపీఎఫ్ ఉన్న ఉద్యోగులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను సంస్థ కేటాయించింది. ఉద్యోగం మారినప్పుడు ఈ నెంబర్‌ను ఉపయోగించి మీ పీఎఫ్ ఖాతాలోని సొమ్మును బదిలీ చేసుకోవచ్చు. ఈ యూఏఎన్‌ను ప్రతి సంస్థ తమ ఉద్యోగులకు కేటాయించాలి. ఉద్యోగి ఉద్యోగం మారినా ఈ సంఖ్య మారదు. యూఏఎన్ ఆధారంగా ఈపీఎఫ్ ఖాతా పాస్‌బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూఏఎన్‌కు నమోదు చేసుకుని ఉంటే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ బ్యాలెన్స్ సమాచారం సంక్షిప్త సందేశాల్లో వస్తుంది. దీని కోసం ఈ విధంగా చేయాలి. -
త్వరలో ‘ఎస్సార్డీపీ’ వెబ్‌పోర్టల్
కేబీఆర్ పార్కు వద్ద పనులపై అవగాహన సాక్షి, హైదరాబాద్: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్(ఎస్సార్ డీపీ) వెబ్‌పోర్టల్ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేబీఆర్ జాతీయ పార్కు వద్ద ఈ ప్రాజెక్టు కోసం చెట్లను తొలగించడంపై అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ దానిని ఏర్పాటు చేస్తోంది. పలువురు పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పార్కును పరిరక్షించాలని, పార్కులోని వృక్ష, జీవజాతులకు హాని కలిగించవద్దని ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో వాటికి ఎలాంటి ముప్పు ఉండదని, పార్కులోని చెట్లను తొలగించడం లేదని జీహెచ్ఎంసీ చెబుతోంది. అయినా, తమ వాదనను ఎవరూ వినడం లేదని, దీంతో ప్రజల్లో గందరగోళం నెల కొందని జీహెచ్ఎంసీ గుర్తించింది. అన్ని వివరాలూ సమగ్రంగా వెబ్సైట్లో పొందుపరచడమే కాక, ప్రజాభిప్రాయాలను కూడా దాని ద్వారా స్వీకరించాలని, ప్రజల సందేహాలకు కూడా వెబ్సైట్లో సమాధానాలివ్వాలని భావి స్తోంది. కేబీఆర్ పార్కు వద్ద చేసే పనులు, అందుకుగాను తొలగించాల్సిన చెట్లు, ప్రత్యామ్నాయంగా చేపట్టే చర్యలు, ప్రస్తుతం, భవిష్యత్‌లో కాలుష్యం పరిస్థితి, ఎస్సార్డీపీ ఫ్లైఓవర్ల వల్ల కలిగే ప్రయోజనాలు, మంచి- చెడులు, రెండు వైపులా అన్ని అంశాలను వెబ్సైట్లో పొందుపరచాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని వివరాలతో ‘ఎస్సార్డీపీ’ వెబ్సైట్ రూపక ల్పనకు దాదాపు 3, 4 వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లవద్దని నిర్ణయం: ఎస్సార్డీపీ పనులపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జులై 1 వరకు స్టే ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లాలని అధికారులు భావించారు. అయితే జులై 1 వరకు వేచి చూడాలని, తొందరపడి హైకోర్టుకు వెళ్లనవసరం లేదని ఉన్నతస్థాయిభేటీలో భావించినట్లు తెలిసింది. తమ నుంచి ఎలాంటి పొరపాట్లు లేనందున తదుపరి విచారణ వరకు వేచి చూడాలని అభిప్రాయపడినట్లు సమాచారం.